emojis
-
వాట్సాప్ చాటింగ్ ఇకపై మరింత సరదాగా
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ త్వరలో ఆండ్రాయిడ్ కోసం కొన్ని బీటా టెస్టర్లకు 21 కొత్త ఎమోజీలను విడుదల చేయనుంది. WABetaInfo నివేదిక ప్రకారం, వాట్సాప్ వినియోగదారులు కొత్తగా రానున్న 21 ఎమోజీలను తాజా యూనికోడ్ 15.0 నుండి పంపడానికి వేరే కీబోర్డ్‌ని డౌన్లోడ్ చేసి ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటిని వాట్సాప్ కీబోర్డ్ నుండి నేరుగా ఉపయోగించవచ్చు. గతంలో ఈ 21 కొత్త ఎమోజీలు డెవలప్మెంట్లో ఉండటం వల్ల, వాట్సాప్ కీబోర్డ్‌లో కనిపించలేదు. అయితే ప్రత్యామ్నాయంగా కీబోర్డ్‌ని ఉపయోగించడం ద్వారా వాటిని పంపించుకోవడం సాధ్యమయ్యేది. బీటా టెస్టింగ్ వినియోగదారులు ఇప్పుడు అధికారిక వాట్సాప్ కీబోర్డ్ నుండి కొత్త ఎమోజీలను యాక్సెస్ చేయవచ్చు. వాట్సాప్ అకౌంట్‌కి కూడా ఈ బీటా ఫీచర్లు వచ్చే అవకాశాలను పెంచుకోవడానికి, లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను కూడా డెవెలప్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బీటాలో అభివృద్ధి దశలో ఉంది. (ఇదీ చదవండి: కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మారుతి కార్లపై అదిరిపోయే ఆఫర్స్) ఇంకో వైపు వాట్సాప్ "సైలెన్స్ అన్నోన్ కాలర్స్" అనే కొత్త ఫీచర్ మీద కూడా పని చేస్తోందని డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ మీ కాల్ లిస్ట్‌లో లేని కొత్త నంబర్స్ నుంచి వచ్చే కాల్స్‌ని సైలెంట్ మోడ్‌లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా త్వరలోనే అందుబాటులో రానుంది. -
యూజర్లు పండగ చేస్కోండి! న్యూ ఇమోజీ బోనాంజా
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్లో ఇమోజీలు ఇప్పుడు నిత్యావసరం అయ్యాయి. కొత్త ఇమోజీలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. తాజా వార్త ఏమిటంటే గూగుల్ యానిమేటెడ్ ఇమోజీలు త్వరలో ఆండ్రాయిడ్ డివైజ్, గెలాక్సీలలోకి రానున్నాయి. షేకింగ్ ఫేస్, జెల్లీఫిష్, అల్లం, దుప్పి, బాతు, గాడిద, పిల్లనగ్రోవి, హేయిర్ పిక్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, పింక్, ఎల్లో, గ్రే కలర్ హార్ట్...మొదలైన 31 ఇమోజీలు ఉన్నాయి. జీ–బోర్డ్ బేస్డ్ ఇమోజీ కిచెన్ ద్వారా ఇమోజీ కలర్స్‌ను తమకు ఇష్టం వచ్చిన రంగులో మార్చుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ‘గిఫ్ట్స్’ కొన్నిసార్లు మన ఫెవరెట్ కంటెంట్ క్రియేటర్‌ను అభినందించడానికి ‘లైక్’లు మాత్రమే చాలవు అనిపిస్తుంది. ‘గిఫ్ట్’ ఇవ్వాలనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్లాట్‌ఫామ్స్ టిప్ లేదా డొనేట్ సిస్టంను ప్రవేశ పెట్టాయి. ఫోటో అండ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. ఈ టెస్ట్ ఫీచర్ పేరు గిఫ్ట్స్. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్స్ అభిమానుల నుంచి ‘గిఫ్ట్స్’ అందుకోవచ్చు. -
World Emoji Day: సరదా నుంచి సందేశం వరకు...
అమెరికన్ రచయిత్రి, జర్నలిస్ట్ నాన్సీ గిబ్స్ ఇమోజీలపై తన ఇష్టాన్ని ఇలా ప్రకటించుకుంది... ‘నిఘంటువులలో పదాలు వ్యక్తీకరించలేని భావాలు, ఇమోజీలు అవలీలగా వ్యక్తీకరిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. బలం’ ఇమోజీ...అంటే ‘సరదా’ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం అవి సందేశ సారథులుగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. మహిళలకు సంబంధించిన సమస్యల నుంచి సాధికారత వరకు...భావ వ్యక్తీకరణకు ప్రపంచంలోని ఎన్నో సంస్థలు ఇమోజీలను వాడుకుంటున్నాయి... కోవిడ్ సమయంలో... మహిళలపై గృహహింస పెరిగిందని గణాంకాలు చెప్పాయి. మరొకరి నీడను కూడా చూసి భయపడుతున్న కాలంలో తమ గురించి ఆలోచించకుండా, భయపడకుండా మహిళలు సేవాపథంలో అగ్రగామిగా ఉన్నారు. పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్స్ మూడు రెట్లు ఎక్కువ రిస్క్‌ను ఎదుర్కొన్నారు... ఇట్టి విషయాలను చెప్పుకునేందుకు పెద్ద వ్యాసాలు అక్కర్లేదని చెప్పడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నించింది. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు రకాల ఇమోజీలను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ‘గర్ల్ పవర్’ ‘జెండర్ ఈక్వాలిటీ’లపై ఇమోజీలు తీసుకువచ్చింది. యూనికోడ్ ఇమోజీ సబ్‌కమిటీ స్త్రీ సాధికారతను ప్రతిఫలించే, సాంకేతికరంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని సూచించే ఇమోజీలకు ప్రాధాన్యత ఇచ్చింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ‘ఎవ్రీ ఉమెన్’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రత్యేకమైన ఇమోజీని తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను వ్యతిరేకిస్తూ ‘జెనరేషన్ ఈక్వాలిటీ’ ‘16 డేస్’ ‘ఆరేంజ్ ది వరల్డ్’ ‘హ్యూమన్ రైట్స్ డే’ హ్యాష్‌ట్యాగ్‌లతో ఇమోజీలు తీసుకువచ్చింది. చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాంకేతిక సంస్థలు, సామాజిక సంస్థలు ఇమోజీలను బలమైన సందేశ వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ‘ఇమోజీ’ అనేది మేజర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్‌గా మారిన నేపథ్యంలో... గతంలోలాగా... ‘చక్కగా చెప్పారు’ ‘చక్కగా నవ్వించారు’ ‘ఏడుపొచ్చింది’... ఇలాంటి వాటికే ఇమోజీ పరిమితం కాదు. కాలంతో పాటు ఇమోజీ పరిధి విస్తృతమవుతూ వస్తోంది. అందులో భాగంగా సామాజిక కోణం వచ్చి చేరింది. -
‘నీ గురించి ఏదో అనుకుంటున్నారే’.. వెంటనే ‘నెయిల్ పాలిష్’ ఎమోజీ.. అర్థం ఏమిటంటే!
ఆంగ్లంలో ఒక మాట చెబుతుంటారు... ‘ఛేంజ్ యువర్ లాంగ్వేజ్ అండ్ యూ ఛేంజ్ యువర్ థాట్స్’ ఇప్పుడు యూత్ తన లాంగ్వేజ్‌ను మార్చుకుంది. అయితే అది ఆలోచనలో మార్పు కోసం అనేకంటే అవసరం కోసమే అనడం బెటర్. కమ్యూనికేషన్ కోసం పొట్టి పదాలు, ఎమోజీలు, సాంకేతిక సంకేతాలు... మొదలైనవి ఉపయోగించడం ద్వారా తమదైన డిజిటల్ భాషను సృష్టించుకుంటున్నారు. తమ భావాలను తక్కువ సమయంలో ఎదుటివ్యక్తికి చేరవేయడానికి ఇది ఉపయోగపడుతుంది. పనిగట్టుకొని ఎవరూ ఈ డిజిటల్ భాషను సృష్టించకపోయినా, అవసరాలలో నుంచి ప్రయోగించిన పదాలు, సంకేతాలు అప్పటికప్పుడు అన్నట్లుగా కాకుండా అలా స్థిరపడిపోతున్నాయి. కొత్త పదాలకు దారి చూపుతున్నాయి. స్నేహితులు సృజన్‌కు పదేపదే ఫోన్ చేస్తున్నారు. ఎందుకో ఆరోజు అతడి మనసు బాగలేదు. తన స్నేహితులకు ‘కిచెన్నైఫ్’ ఎమోజీ పంపాడు. అంతే...అటు నుంచి ఫోన్లు ఆగిపోయాయి! కిచెన్నైఫ్....బెదిరింపు సూచిక కాదు....‘బ్యాడ్మూడ్లో ఉన్నాను’ అని చెప్పడం. నీరజకు తన స్నేహితురాలు రమ్య ఫోన్ చేసి ‘నీ గురించి ఇలా అనుకుంటున్నారు’ అంటూ ఏదో చెప్పింది. నీరజ వెంటనే ‘నెయిల్ పాలిష్’ ఎమోజీని పంపింది. వేరేవాళ్లు అయితే ఈ బొమ్మ ఎందుకు పంపినట్లు అని బుర్ర గోక్కునేవాళ్లు. అయితే రమ్య కూడా ‘యూత్లాంగ్వేజ్’ తెలిసిన టెక్ట్సర్ కావడం వలన ఆ అమ్మాయికి విషయం అర్థమైంది. ఇంతకీ ఆ ఎమోజీ అర్థం ఏమిటంటే...‘నా గురించి నాకు తెలుసు. అలాంటి వాటిని నేను పట్టించుకోను’ ఫోన్‌కాల్ కంటే ‘టెక్ట్స్ మెసేజ్’లోనే రెస్పాండ్ అయ్యే ధోరణి యూత్‌లో పెరిగింది. ముఖాముఖీ (ఫేస్ టూ ఫేస్) సంభాషణల్లో కంటే ఆన్లైన్ కమ్యూనికేటింగ్లోనే పారదర్శకత ఎక్కువ అనే అభిప్రాయం ఏర్పడింది. లింగో2వర్డ్.కామ్...మొదలైన వెబ్సైట్లు వెబ్లింగోను అర్థమయ్యే ఇంగ్లీష్‌లోకి తీసుకువస్తున్నాయి. ఇవి పేరెంట్స్‌కు బాగా ఉపయోగపడుతున్నాయి. మొదట్లో ఇ–మెయిల్స్, ఇన్స్టంట్ మెసేజ్, టెక్ట్స్ మెసేజ్‌లకు పరిమితమైన ‘వెబ్ లింగో’ ఇప్పుడు నిత్యజీవిత సంభాషణల్లోకి కూడా దూసుకువస్తుంది. మున్ముందు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సిందే. కొన్ని ఇమోజీల అర్థాలు ఫేస్ విత్ ఓపెన్ మౌత్.....స్మోకింగ్ పుర్రె......సమ్‌థింగ్ ఈజ్ ఫన్నీ బేస్బాల్క్యాప్......అబద్ధం పిజ్జా...... ఐ లవ్ యూ హార్ట్ ఇన్ ఫైర్... విరహం సంక్షిప్త పదాల విషయాకి వస్తే.... time .....టీయర్ ఇన్ మై ఐస్ f2f......ఫేస్ టు ఫేస్ swyp......సో వాట్స్ యువర్ ప్రాబ్లమ్? ruok......ఆర్ యూ ఓకే? nagi.......నాట్ ఏ గుడ్ఐడియా idk ........ఐ డోన్ట్ నో hand...హ్యావ్ ఏ నైస్డే gr8...గ్రేట్ sys......సీ యూ సూన్ చదవండి: Sweet Potato Day- Health Benefits: చిలగడ దుంప తినడం ఇష్టమా.. ఈ విషయాలు తెలిస్తే! -
176తో ప్రారంభమై.. 3,663కు చేరిక
సోషల్ మీడియా నుంచి ఎస్ఎంఎస్ల వరకూ దేనిలోనైనా మన భావోద్వేగాలను ఎదుటివారికి తెలియజేయాలంటే వెంటనే గుర్తొచ్చేది ఎమోజీలు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో వీటి వినియోగం ఎక్కువైపోయింది. ముఖ్యంగా వాట్సాప్‌లో చాటింగ్ చేసేటప్పుడు చాలామంది వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. సంతోషం, ప్రేమ, అసూయ.. బాధఇలా రకరకాల ఎన్నో భావాలను ఒక్క ఎమోజీతో వ్యక్తపరచవచ్చు. మాట్లాడే అవసరంలేకుండా భావోద్వేగాల్ని ఎమోజీల రూపంలో వ్యక్తపరుస్తుంటారు. సాక్షి, అమరావతి: ఎమోజీలు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. స్మార్ట్ ఫోన్ల్లో ఎన్ని అప్డేట్లు వస్తున్నా, మెసేజింగ్ యాప్‌లు ఎన్ని ఉన్నా.. ఎమోజీలు మాత్రం కామన్‌గా ఉంటున్నాయి. అవతలి వాళ్లు ఎంత పెద్ద మెసేజ్ రాసినా.. సింపుల్‌గా ఒక్క సింబల్‌తో వ్యవహారాన్ని తేల్చేయడంలోనే ఎమోజీల సత్తా దాగి ఉంది. స్పష్టమైన భావోద్వేగాలను వ్యక్తీకరించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్స్ యూజర్లు ఎక్కువ మేర వాడిన ఎమోజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. స్వచ్ఛంద సంస్థ ‘యూనికోడ్ కన్సార్టియం’ 2021లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎమోజీల సమాచారాన్ని విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 92 శాతం మంది ఆన్లైన్ యూజర్లు ఎమోజీలు వినియోగిస్తున్నట్లు యూనికోడ్ కన్సార్టియం నివేదిక తెలిపింది. ఎక్కువగా వాడే ఎమోజీలు ఇవే... యూనికోడ్ కన్సార్టియం నివేదిక ప్రకారం.. ‘ఆనంద బాష్పాలు’ (‘టియర్స్ ఆఫ్ జాయ్) మొదటి స్థానంలో నిలిచింది. మిగిలిన ఎమోజీల కంటే దీనిని 5 శాతం కంటే ఎక్కువగా వాడుతున్నారు. ఇక రెండో స్థానంలో హార్ట్ (హృదయం), మూడో స్థానంలో ‘రోలింగ్ ఆన్ ది ఫ్లోర్ లాఫ్’ (నేలపై పడిపడి నవ్వుతూ), నాలుగులో థంబ్సప్ (బొటన వేలు పైకి చూపుతూ), ఐదులో లౌడ్లీ క్రయింగ్ (బిగ్గరగా ఏడుస్తూ) ఎమోజీలున్నాయి. తొలి 10 ఎమోజీల్లో మిగిలినవి వరుసగా ఫోల్డెడ్ హ్యాండ్స్ (ప్రార్థిస్తున్న చేతులు), ఫేస్ బ్లోయింగ్ ఏ కిస్ (గాలిలో ముద్దిస్తూ), స్మయిలింగ్ ఫేస్ విత్ హార్ట్స్ (ప్రేమను కురిపించే చిరునవ్వు), స్మయిలింగ్ ఫేస్ విత్ హార్ట్స్ ఐస్ (కళ్లలో ప్రేమ), పార్టీ పాపర్(రంగుల కాగితాలు విరజిమ్మే టపాసు) ఎక్కువ ఉందిని ఆకట్టుకున్నాయి. 200 స్థానాల్లో భారీ మార్పులు ఇక వర్గాల వారీగా చూస్తే ఫ్లాగ్ (జెండాలు) 258 రకాలతో పెద్ద సమూహంగా ఉన్నప్పటికీ చాలా తక్కువగా వినియోగించారు. రాకెట్, షిప్ ఎమోజీ ట్రాన్స్పోర్ట్–ఎయిర్ సబ్సెట్లో అగ్రస్థానంలో నిలిచాయి. శరీర భాగాల్లో కండలు చూపించే ఎమోజీ తొలి స్థానం దక్కించుకుంది. చిరునవ్వు, చేతులు, మొక్కలు, పువ్వుల ఎమోజీలను తరచుగా ఉపయోగిస్తున్నారు. జంతువులు–ప్రకృతి వర్గం 53 ఎమోజీలతో రెండో అతిపెద్ద సమూహంగా ఉండగా వీటిల్లో బొకే, సీతాకోకచిలుకకు మంచి ఆదరణ లభిస్తోందని నివేదిక పేర్కొంది. 2019 నివేదికతో పోలిస్తే 200 స్థానాల్లో భారీ మార్పులు వచ్చాయని తెలిపింది. గతంలో 113 స్థానంలో ఉన్న బర్త్‌డే కేక్ 25వ స్థానానికి, 139వ స్థానంలో ఉన్న బెలూన్ 48కి, ప్లీడింగ్ ఫేస్ (వేడుకునే ముఖం) ఎమోజీ 97 నుంచి 14వ స్థానానికి ఎగబాకింది. ఆరోగ్యానికి సంబంధించి హాట్, వాజీ ఫేస్ ఎమోజీలు మాత్రమే టాప్ 100లో ఉన్నాయి. ఇక మాస్ వేర్ మాస్క్ ఎమోజీ 186 నుంచి 156వ స్థానానికి వచ్చింది. 176తో ప్రారంభమై.. 3,663కు చేరిక ఈ సంస్థ భాషకు సాంకేతిక లిపిని అందించేందుకు ఇంటర్నేషనల్ బై డైరెక్షనల్ అల్గారిథమ్ అభివృద్ధి, నిర్వహణను ప్రోత్సహిస్తోంది. కంప్యూటర్, సమాచార ఆధారిత పరిశ్రమకు చెందిన విభిన్న వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నాయి. ఆర్థికపరంగా పూర్తిగా సభ్యత్వ రుసుము మీదే ఆధారపడి నడుస్తుంది. ఇందులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి శాశ్వత సభ్యత్వం కూడా ఉంది. యూనికోడ్ కన్సార్టియం ఆమోదం లభించిన తర్వాతే ఎమోజీలను విడుదల చేస్తారు. ఎమోజీలను మొదటగా జపాన్‌కు చెందిన ఇంటర్ఫేస్ డిజైనర్ షిగేటకా కురిటా 1999లో అభివృద్ధి చేశారు. 176 చిహ్నాలతో ప్రారంభమైన ఈ భాష..నేడు 3,663 ఎమోజీలకు చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో 44 కోట్ల మందికిపైగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. ఏపీ జనాభాలో 31% మందికి పైగా ఆన్లైన్ యూజర్లు ఉన్నారు. -
క్రేజీ.. ఎమోజీ!
ఎమోజీ... అక్షర సందేశాల స్థానంలో నేడు ఎక్కువగా ఉపయోగిస్తున్నది ఇదే. వాట్సాప్ చాట్‌లో ఏదైనా సందేశానికి జవాబు ఇవ్వాలంటే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సాధనమిదే. చాంతాడంత వాక్యాలతో పనిలేకుండా మన భావాన్ని సింపుల్‌గా, సూటిగా, స్పష్టంగా ఒక గుర్తుతో చెప్పే సౌలభ్యం వీటి సొంతం. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎమోజీల వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో 2021లో క్రేజీ ఎమోజీ ఏంటి, ఏఏ ఎమోజీలను ఎక్కువగా వాడారన్న దానిపై యూనికోడ్ కన్సార్టియం ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో తెలుసుకుందాం. →ఎమోజీ ర్యాంకింగ్ జాబితాలో ఆనందబాష్పాలతో ఉన్న ఎమోజీనే టాప్ పొజిషన్లో నిలబడింది. దీనితర్వాత ఎరుపు రంగు హృదయం రెండో స్థానంలో ఉండగా, పగలబడి నవ్వుతూ ఉన్న ఎమోజీకి మూడో స్థానం దక్కింది. నాలుగోస్థానంలో థమ్సప్, బిగ్గరగా ఏడుస్తున్నట్లున్న ఎమోజీకి ఐదో స్థానం దక్కాయి. →ఎమోజీల్లో వివిధ కేటగిరీలుండగా, ఫ్లాగ్స్ విభాగంలో ఉన్న ఎమోజీలను చాలా తక్కువ మంది వినియోగించినట్లు వెల్లడైంది. అలాగే రవాణా విభాగంలో ‘దూసుకుపోతున్న రాకెట్’ బొమ్మ టాప్‌లో నిలవగా, శరీర భాగాల కేటగిరీలో అయితే చేతికండరాలను చూపుతున్న ఎమోజీని ఎక్కువగా వాడారు. →తరచుగా వాడిన ఎమోజీల్లో ‘నవ్వుతున్నట్లు ఉన్నవి’, చేతులు’ వంటివి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. జంతువుల ఎమోజీల కన్నా మొక్కలు, పూల ఎమోజీలను ఎక్కువగా వాడారు. పూలు–మొక్కల విభాగాల్లో పుష్పగుచ్ఛం, జంతువుల–పక్షుల విభాగాల్లో సీతాకోకచిలుక టాప్‌లో ఉన్నాయి. →గత అధ్యయనంలో టాప్–200 జాబితాలో ఉన్న కొన్ని ఎమోజీలు టాప్–50లోకి రావడం విశేషం. గతంలో నిర్వహించిన సర్వేలో ‘బర్త్‌డే కేక్’ 113వ స్థానంలో ఉండగా.. ఈసారి అది 25వ స్థానానికి వచ్చింది. అలాగే గతంలో 139వ స్థానంలో ఉన్న ‘బెలూన్’ ఈసారి మరింత పైకి ఎగిరి 48వ స్థానాన్ని దక్కించుకుంది. దిగాలుగా ఉన్న ఎమోజీ 97వ స్థానం నుంచి 14వ స్థానానికి వచ్చి చేరింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఆరోగ్య విభాగానికి చెందిన రెండు ఎమోజీలే టాప్–100 ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. →మొత్తం ఎమోజీల వాడకం విషయానికొస్తే టాప్–100లో ఉన్నవే 82 శాతాన్ని ఆక్రమిం చాయి. ఈ అధ్యయనం వల్ల ఎక్కువగా వాడే ఎమోజీలేంటే తెలియడంతోపాటు తదుపరి ఎలాంటి వాటిని తీసుకురావొచన్న విషయం కూడా తెలుస్తుందని అంటున్నారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
2021లో తెగ వాడేసిన ఎమోజీ ఇదేనండోయ్..!
స్మార్ట్‌ఫోన్స్ రాకతో రకరకాల సోషల్ మెసేజింగ్ యాప్స్ మన ముందుకు వచ్చాయి. ఆయా మెసేజింగ్ యాప్స్‌ను వాడుతూ..మన స్నేహితులతోనే, బంధువులతోనే చాట్ చేస్తూ ఉంటాం. మెసేజ్ రూపంలోనే కాకుండా ఇతరులకు చెప్పదల్చుకున్న విషయాలను ఎమోజీలతో చెప్తుంటాం. రకరకాల ఎమోజీలను వాడుతూ మన అభిప్రాయాలను ఇతరులతో పంచుకుంటాం. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్స్ యూజర్లు ఎక్కువ మేర వాడిన ఎమోజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 2021లో తెగ వాడేసిన ఎమోజీ ఏదంటే..! 2021లో అత్యంత తరచుగా ఉపయోగించే ఎమోజీల డేటాను యూనికోడ్ కన్సార్టియం అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ విడుదల చేసింది. 'ఫేస్ విత్ టియర్స్ ఆఫ్ జాయ్(😂)' ఎమోజీ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత 'రెడ్ హార్ట్ (❤️) ఉంది. మూడోస్థానంలో 'నవ్వుతూ నేలపై దొర్లడం (🤣)', తర్వాత 'థమ్స్ ఆప్ (👍)' నిలవగా ఐదో స్థానంలో 'లౌడ్ క్రయింగ్ ఫేస్(😭)' నిలిచింది. యూనికోడ్ కన్సార్టియం 2020కు సంబంధించిన ఎమోజీ డేటాను విడుదల చేయలేదు. 2019లో రిలీజ్ చేసిన ఎమోజీ డేటాలో చాలా మేరకు 2021లో కూడా నిలిచాయి. 2021లో ఎక్కువగా వాడిన ఎమోజీలు ఇవే..! చదవండి: ఆండ్రాయిడ్‌లో అదిరిపోయే ఫీచర్స్..! పిల్లలను, కార్లను కంట్రోల్ చేయొచ్చు....! -
అమ్మాయిలూ.. అది ఉత్సాహం కాదు సెక్స్ అప్పీల్!
కొంచెం బాధ, మరికొంచెం జాలి, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, అమితమైన ప్రేమ..ఇలా ఏ భావాన్ని అయినా, ఎంత భారీ భావోద్వేగాన్ని అయినా సింపుల్‌గా వ్యక్తపరచడానికి ఎమోజీలును ఉపయోగిస్తుంటాం. అలాంటి ఎమోజీలకు గుర్తింపు దక్కిన రోజు ఇది. ఇవాళ (జులై 17)న వరల్డ్ ఎమోజీ డే. స్మార్ట్ ఫోన్లలో ఎన్ని అప్డేట్లు వస్తున్నా, మెసేజింగ్ యాప్‌లు ఎన్ని ఉన్నా.. ఎమోజీలు మాత్రం కామన్‌గా ఉంటాయి. అవతలి వాళ్లు చాంతాడంత మెసేజ్ రాసినా.. సింపుల్‌గా ఒక్క సింబల్‌తో వ్యవహారాన్ని తేల్చేయడంలోనే ఎమోజీల సత్తా ఏంటో తెలుస్తుంది. చాలామందికి ఇవి పనుల్ని తేలిక చేస్తుంటాయి, కొందరికి సరదా పంచుతుంటాయి. ఇక మంచం మీద నుంచి లేవడం దగ్గరి నుంచి రాత్రి పడుకునేదాకా, కాలకృత్యాల నుంచి ప్రతీ పనికి ఏదో సింబల్‌తో ఎమోజీలు కనిపిస్తూనే ఉంటాయి. కొత్తగా అప్డేట్స్లతో వస్తుంటాయి. అయితే పసుపు రంగులో ఉండే ఈ గుర్తుల్లో కొన్నింటిని కొందరు పొరపాటుగా అర్థం చేసుకుంటుంటారు. ఉదాహరణకు.. క్లాప్స్ సింబల్‌ను కొందరు దణ్ణం సింబల్‌గా పొరబడుతుంటారు. అలాగే కొన్ని ఎమోజీలకు అర్థాలు వేరుగా కూడా ఉన్నాయి. స్మైలింగ్ ఫేస్ విత్ హార్ట్స్ ముఖంలో సిగ్గు.. సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్లు.. చుట్టూ హార్ట్ సింబల్స్. చాలామంది దీనిని సిగ్గుకి, సంతోషానికి, అవతలివాళ్లపై ఆప్యాయతను వ్యక్తపర్చడానికి ఉపయోగిస్తుంటారు. ఎవరికి పడితే వాళ్లకు పంపిస్తుంటారు. కానీ, ఆ ఎమోజీ అసలు ఉద్దేశం తాను పీకలలోతులో ప్రేమలో మునిగిపోయానని అవతలి వాళ్లకు తెలియజెప్పడం. డ్యాన్సింగ్ ట్విన్స్ విత్ హార్న్స్ ఇద్దరు అమ్మాయిలు నెత్తిన కొమ్ముల మాదిరి(కుందేలు చెవులు) వాటితో డ్యాన్స్ చేసే ఎమోజీ. చాలామంది అమ్మాయిలు గ్రూపులలో ఈ ఎమోజీలను ఎక్కువగా వాడుతుంటారు. ఎగ్జయిట్‌మెంట్‌కు దీన్నొక ప్రతీకగా దానిని భావిస్తుంటారు. కానీ, దాని అసలు అర్థం అది కాదు. నెత్తి మీద అలా కుందేలు చెవులు, కొమ్ములు ఉండే ఆ ఎమోజీని ‘సెక్స్ అప్పీల్’ కోసం పెట్టారు. అంతేకాదు అడల్ట్ సినిమాల్లోనూ ఇలాంటి గెటప్‌లను అవతలివాళ్లను రెచ్చగొట్టే చేష్టల కోసం ఉపయోగిస్తుంటారు. ఇక జపాన్ కాన్సెప్ట్‌లో ఫిక్షన్ క్యారెక్టర్లకు సంబంధించి గెటప్‌లను వేసినప్పుడు ‘కాస్ప్లే’ పేరిట ఈ సింబల్‌ను ఉపయోగిస్తారు. ప్లీడింగ్ ఫేస్ ఈ ఎమోజీకి ఏడుపుగొట్టు ఎమోజీ అనే పేరుంది. కానీ, దీన్ని పప్పీ డాగ్ ఐస్ అంటారు. ‘వేడుకోలు’ కిందకు వస్తుంది ఇది. అయితే ‘టచ్ చేశావ్’ అనే భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేసేందుకు ఈ ఎమోజీని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. షూటింగ్స్టార్ మ్యాజిక్ ఎమోజీ అని కూడా పిలుచుకుంటారు. ఎక్కువ ఉత్సాహంలో, ఉద్రేకంలో ఉన్నప్పుడు ఈ ఎమోజీని ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇది మైకాన్ని ఉద్దేశించి రూపొందించిన ఎమోజీ. ది పూప్ ఎమోజీ సింబల్ చూస్తేనే ఇదేంటో అందరికీ తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ మధ్య సరదా సంభాషణల్లో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. కానీ, దీని అర్థం ‘అదృష్టం’ అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కావాలంటే ఎమోజీ డిక్షనరీ ఓపెన్ చేసి చూడడండి. ఎమోజీలు ఎప్పటికీ ఫేడ్ అవుట్ కావు. ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి, పైన చెప్పిన ఎమోజీలను నెక్స్ట్ ఎప్పుడైనా ఉపయోగించేటప్పుడు జాగ్రత్త. అన్నట్లు లండన్‌కు చెందిన ఎమోజీపీడియా ఫౌండర్ జెర్మీ బర్గ్(37).. 2014 జులై 17న వరల్డ్ ఎమోజీ డేను మొదలుపెట్టాడు. అంతేకాదు ఈరోజున ఎమోజీలను ఎక్కువగా ఉపయోగించడంటూ ఓ పిలుపు కూడా ఇచ్చాడు. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన కొత్త ఎమోజీలలో.. గర్భంతో ఉన్న మగవాళ్ల ఎమోజీ విమర్శలతో పాటు విపరీతమైన చర్చకూ దారితీస్తోంది. -
మాటలన్నీ ఎమోజీలుగా మారిపోతాయా?
ప్రేమ..సంతోషం, అసూయ..బాధ ఇలా ఎన్నో భావాల్ని ఒక్క ఎమోజీతో చెప్పొచ్చు. మాట్లాడే అవసరం లేకుండా భావోద్వేగాల్ని వ్యక్తం చేయడంలో బాగా పాపులర్ అయ్యింది. అందుకే ప్రతి ఏడాది జులై 17న వరల్డ్ ఎమోజీడేని జరుపుకుంటాము.ఈ సందర్భంగా ఎమోజీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా సంస్థ 'బంబుల్' వరల్డ్ ఎమోజీ సందర్భంగా ఏ ఎమోజీని ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కరోనా కారణంగా ఎమోజీల వినియోగం 2020 నుంచి 2021 మధ్యకాలంలో 86శాతానికి పెరగడంతో పాటు సోషల్ మీడియా, డేటింగ్ సైట్లలో యాక్టీవ్ గా ఉన్నట్లు నిర్ధారించింది. ఇక ఇండియన్స్‌కు చెందిన మిలీనియల్స్!! (దాదాపు 22–37 సంవత్సరాల మధ్య ఉన్నయువత) క్లాసిక్ రెడ్ హార్ట్ ఎమోజీని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ ఎమోజీల్లో టాప్ 5లో ఉంది. రెడ్ హార్ట్, కన్నుగీటేది, కన్నీళ్లతో ఉన్న ఎమోజీ, సన్ గ్లాసెస్ ఎమోజీ, కళ్లతో నవ్వే స్మైల్‌ని వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా ప్రొఫైళ్లలో నెటిజన్లు రెడ్ హార్ట్ ఎమోజీని వినియోగిస్తున్నారని బంబుల్ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సమర్పిత సమద్దర్ తెలిపారు. ఎమోజీ ఎలా పుట్టుకొచ్చింది. తొలిసారి ఎమోజీని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రసంగంతో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 1862లో లింకన్ తన ప్రసంగంలో పెట్టిన వివిధ రకాల ఆహభావాలు అభిమానుల్ని అలరించాయి. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌లో కన్నుగీటేది బాగా పాపులర్ అయ్యింది. నాడు పలుమీడియా సంస్థలు పేపర్లలో ఆయన ప్రసంగం పక్కనే కన్ను గీటే ఎమోజీల్ని పెట్టారు. అలా ఎమోజీలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఎమోజీలు ఇలా ఉంటాయా? బంబుల్ నివేదిక ప్రకారం ఎమోజీల వినియోగం ఎక్కువగా ఉండడంతో.. ఆయా కంపెనీలు యూజర్లను అట్రాక్ట్ చేసేలా వాయిస్‌ను సెండ్ చేస్తే దానికి తగ్గట్లు డీఫాల్ట్‌గా ఎమోజీ రెడీ అయ్యేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: పిల్లల కోసం నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్లు, ఖర్చు లేకుండా చూడొచ్చు! -
ఫేస్బుక్లో సౌండ్ మోత.. ఇక పండుగే!
రెగ్యులర్ ఛాటింగ్ ఫ్లాట్‌ఫామ్‌లలో భావప్రకటన చేసేందుకు సులువైన మార్గాలే ఎమోజీలు. అవసరం ఉన్నా లేకున్నా వాటిని ఒకప్పుడు తెగ ఉపయోగించేవాళ్లు. అయితే జిఫ్ ఫైల్స్, స్టికర్ల రాకతో వీటి వాడకం కొంచెం తగ్గింది. ఈ తరుణంలో ఎమోజీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఫేస్బుక్ ఓ అడుగు ముందుకు వేసింది. యూజర్లకు మరింత వినోదం అందించేందుకు సౌండ్ ఎమోజీలను తీసుకొచ్చింది. ఇందుకోసం ఫేస్బుక్ మెసేంజర్‌కు కొత్త ఫీచర్‌ను జోడించింది. గురువారం రాత్రి నుంచే సౌండ్ ఎమోజీలను పంపే వీలు కల్పించింది. శనివారం(జులై17న) వరల్డ్ ఎమోజీ డే. సో.. అంతకంటే ముందే ‘సౌండ్మోజీ’ పేరుతో ఫీచర్‌ను యూజర్లకు అందిస్తోంది ఫేస్బుక్. ఇంతకు ముందు ఒకటి రెండు ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఎక్కువ ఎమోజీలకు సౌండ్ ఎఫెక్ట్ యాక్సెస్ కల్పించింది మెసేంజర్. మెసేంజర్‌లో ఎమోజీ లైబ్రరీ నుంచి కావాల్సిన ఎమోజీని పంపుకోవచ్చు. అయితే ఆ పక్కనే ఉన్న సౌండ్ బటన్‌ను క్లిక్ చేయాలి. ఒకవేళ బటన్ గనుక కనిపించకుంటే.. యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకేం ఫుల్ వాల్యూమ్‌తో ఎమోజీలు పంపిస్తూ పండుగ చేసుకుంటున్నారు కొందరు యూజర్లు. ఇక ఈ విషయాన్ని అధినేత జుకర్‌బర్గ్ కూడా కన్ఫర్మ్ చేశాడు. -
పాము నవ్వింది.. ఈ వింత ఏంటో
ఇదేందయ్యా ఇది.. పాములు కూడా నవ్వుతాయా అనుకోకండి. ఫొటోలో చూశారు కదా.. తెల్లటి పాముపై బంగారు వర్ణంలో ఉన్న బొమ్మలు. అదేనండీ నవ్వుతో కూడిన ఎమోజీలు.. ఈ పాముపై ఇలాంటి ఎమోజీలు మూడు ఉన్నాయి. అంతే ఈ పాముకు భలే డిమాండ్ వచ్చింది. ఏకంగా ఇది రూ.4.3 లక్షలకు అమ్ముడుపోయింది. అమెరికాకు చెందిన జస్టిన్ కోబిల్కా పాములను పెంచడంలో సిద్ధహస్తుడు. తెల్లరంగు కొండచిలువలపై (బాల్ పైథాన్) బంగారురంగు వచ్చేలా ప్రయోగాలు చేయడం ఇతడికి చాలా ఇష్టమట. అందుకే 20 ఏళ్లుగా ఇలాంటి కొండ చిలువలను పెంచుతున్నాడు. అయితే ఈ కొండచిలువపై ఇలా నవ్వుతున్న మూడు ఎమోజీలు మాత్రం అనుకోకుండా ఏర్పడ్డాయని, కాకతాళీయంగా వచ్చాయని, తనకు కూడా చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. సాధారణంగా తాను పెంచిన ప్రతి 20 పాములపై ఒక ఎమోజీ ఉండటం సాధారణమని, కాకపోతే మూడు ఎమోజీలు ఉండటం మాత్రం ఇదే తొలిసారని పేర్కొన్నాడు. జన్యు మార్పులు జరిగి, ఇలా పాము ఒంటిపై బంతుల ఆకారం వచ్చేలా చేస్తున్నాడు కోబిల్కా. ఈ బాల్ పైథాన్లు చాలా స్నేహంగా ఉంటాయని, మచ్చిక చేసుకోవడానికి సరైన పాములని చెబుతున్నాడు. వీటిని సులువుగా పెంచుకోవచ్చని పేర్కొంటున్నాడు. చదవండి: ఒక గుడిసె.. 21 పాము పిల్లలు! -
అవునా! నాకు ఇంతుందా!!
‘నీ మోము జాబిల్లి మోది తేనియలు.. నా నయనమ్ములు చకోరమ్ములు..’ ‘‘ఇంత అర్థం చేసుకుంటుందా ఆ అమ్మాయి?! ఏం చెబుదామని తనకి! ‘నిన్ను ప్రేమిస్తున్నా..’ అనేగా. ఆ ఎక్స్‌ప్రెషనే ఇంకాస్త సరళంగా, తేలిగ్గా ఉండాలేమో. అసలే లవ్ వ్యవహారం. అర్థం కాకముందే అపార్థమైపోతే!’’ ‘‘నిజమే గురూ, పోనీ ఇదెలా ఉందో చూడు?’’ ‘ఎపుడు నీ అడుగు వినబడదో.. అపుడు నా అడుగు పడదు..’! ‘‘కొంచెం నయం. రెండూ కృష్ణశాస్త్రి గారి భావకవిత్వంలోంచి తెంపుకుని వచ్చినవేగా. తలలో తరుముతానంటే, ఉరిమి చూడకుండా ఉంటుందా! ఎందుకు తెంచుకొచ్చావో, ఎందుకు తురమదలిచావో ఆ పిల్లకు తెలియొద్దా?’’ ‘‘ఇంకెలా చెప్పాలి బ్రో? సింపుల్‌గా I Love You అని పెట్టేసేదా?’’ ‘‘అన్ని అక్షరాలా!!’’ ‘‘ఈ మూడు పదాల్లో ఉన్నవే ఎనిమిది అక్షరాలు. ఇంకేం తగ్గిస్తాం?’’ ‘‘ప్రేమకు అక్షరాలతో, పదాలతో, వాక్యాలతో, పేరాలతో, పేజీలో పనేముంది తమ్ముడూ. చూపుల్లేవా? మీరింకా చూసుకోలేదా? కళ్లు కళ్లు కలిశాయంటే.. ఏమిటని అర్థం?!’’ ‘‘కలపలేకనే కదా బ్రో..’’ ‘‘అయితే నీ ఐలవ్యూను ఎమోజీగా సెండ్ చెయ్’’. ‘‘హార్ట్ సింబలా! నా వల్ల కాదు’’ ‘‘హార్ట్ సింబలూ కాదు.. ముద్దు సింబలూ కాదు. ‘బాబా’ సినిమాలో రజనీకాంత్‌లా అరిచేయి తెరువు. వేళ్లన్నీ చాపు. చిటికెన వేలు, చూపుడు వేలు పైకెత్తు. మధ్యలోని రెండువేళ్లు కిందకు దింపు’’ ‘‘దింపితే?’’ ‘‘దింపితే అదే.. ఐ లవ్యూ! హార్ట్ సింబల్ లేకుండా ఐలవ్యూ చెప్పే ఎమోజీ’’ ‘‘హృదయం, కుసుమం లేని ఆ చేతివేళ్ల గుర్తును ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుందా?’’ ‘‘సెండ్ చెయ్. నీకొచ్చే తిరుగు సింబల్‌ని బట్టి ఆమెకు ఏమి అర్థమైందో నీకు అర్థమౌతుంది’’ ∙∙ ప్రేమనే ఏమిటి..? ప్రతి ఎక్స్ప్రెషన్కూ ఎమోజీలు ఉన్నాయి. కోపం, ద్వేషం, ఆవేశం, ఆవేదన, ఆశ్చర్యం, ఇష్టం, ప్రశంస, విమర్శ, తృణీకారం, హెచ్చరిక.. ప్రతి భావానికీ! మెదడుకు, మనసుకు ఎన్ని ఆలోచనలు వస్తాయో అన్నింటికీ ఒక ఎమోజీ ఉంది. పాతవి ‘ఫ్లో’లో ఉండగనే, కొత్తవి వచ్చేస్తున్నాయి. ఎమోజీలు రాక ముందు కోలన్ పక్కన రైట్ బ్రాకెట్ పెడితే సంతోషం. లెఫ్ట్ బ్రాకెట్ పెడితే విచారం. అలాంటివి మరికొన్ని ఉండేవి.. ప్రధానంగా వాడుకలోకి వచ్చే భావాలు. స్మార్ట్ ఫోన్లు వచ్చాక, మనుషులంతా సోషల్ మీడియాలోనే జీవించడం మొదలయ్యాక ఈ చుక్కలు, గీతలు వెనక్కి వెళ్లి నిండైన పసుపు పచ్చని గుండ్రటి ముఖాకృతుల ఎమోజీలు వాటి స్థానంలోకి వచ్చేశాయి. అసలివి ఎలా మొదలయ్యాయి? ఎన్ని ఉన్నాయి? వందలా వేలా? వీటిని ఎవరు సృష్టిస్తారు? చెలామణిలోకి ఎవరు తెస్తారు? సింపుల్‌గా రెండు ముక్కల్లో చదివేద్దాం. రానున్న ఎమోజీలు ఫ్లేమింగ్ హార్ట్ : హృదయజ్వాల (అర్థం తెలిసిందే) బియర్డ్ ఉమన్ : గడ్డంతో ఉన్న మహిళ (హీ–గర్ల్ అని) ఇంటర్రేసియల్ కపుల్ : విజాతి జోడీ రోజుకు 500 కోట్లు! – ఫేజ్‌బుక్‌లో, ఫేస్బుక్ మెసెంజర్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 500 కోట్ల ఎమోజీలు బట్వాడా అవుతున్నాయి! ఫేస్బుక్, ట్విట్టర్ లో రాజ్యమేలుతున్న ఎమోజీ ‘లాఫింగ్ ఫేస్ విత్ టియర్స్ ఆఫ్ జాయ్’. ఇన్స్టాగ్రామ్ లో మాత్రం హృదయమే (హార్ట్ ఎమోజీ) సుప్రీమ్. మాటగా గుర్తింపు ‘ఎమోజీ’ అనే మాట తొలిసారిగా 2013లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చోటు చేసుకుంది. 2015లో ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ‘ఫేస్ విత్ టియర్స్ ఆఫ్ జాయ్’ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రచురణ సంస్థ ఎంపిక చేసింది. ఎమోజీ క్రాస్‌వర్డ్ 2020లో తొలిసారి న్యూయార్క్ టైమ్స్ పత్రిక క్రాస్‌వర్డ్ పజిల్లో ఎమోజీని ఒక క్లూగా ప్రవేశపెట్టింది! 1996లో సంఖ్యలో 76గా ఉన్న ఎమోజీలు 2020 నాటికి 3,136 అయ్యాయి. 2021లో మరో 17 (ఫ్లేమింగ్ హార్ట్, బియర్డ్ ఉమన్, ఇంటర్రేసియల్ కపుల్ సింబళ్లతో కలిపి) ఎమోజీలు రాబోతున్నాయి. ఎమోజీ మైలురాళ్లు 2010 : స్వజాతి దంపతులు, కుటుంబాలు 2014 : యాంటీ–బుల్లీయింగ్ ఎమోజీ 2015 : స్కిన్‌టోన్ మాడిఫయర్లు 2020 : ట్రాన్స్‌జెండర్ జెండా ఎమోజీల అనుమతి యూనికోడ్ కన్సార్టియం అని అమెరికాలో ఒక నాన్–ప్రాఫిట్ సంస్థ ఉంది. ఎమోజీ అనే ఈ ఎలక్ట్రానిక్ టెక్స్ట్ ప్రాసెసింగ్నంతా.. ఆ సింబల్స్, క్యారెక్టర్లు, స్క్రిప్టులు అన్నిటినీ 1991 నుంచీ ఆ సంస్థే పర్యవేక్షిస్తోంది. చెలామణి అధికారం కూడా కన్సార్టియందే. -
వాట్సాప్‌లో లేటెస్ట్ ఫీచర్స్.. వారెవ్వా!
ముంబై: వాట్సాప్.. వెరీ వెరీ స్పెషల్! ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకునే ఈ మోస్ట్ పాపులర్ మెసేజింగ్ యాప్ లెటెస్ట్‌గా మరిన్ని అప్డేట్స్ అందిస్తోంది. మ్యూట్ బటన్, న్యూ ఐకాన్స్, కేటలాగ్ షార్ట్‌కట్, లెక్కలేనన్ని ఎమోజీలు.. ఇలా యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను అప్డేటెడ్ వెర్షన్లో పొందుపరిచింది. వీటిలో కొన్ని బీటా వెర్షన్లకే పరిమితమవగా మిగిలినివి నార్మల్ యూజర్లకూ అందిస్తోంది. ఆ సరికొత్త ఫీచర్లలోని కొన్ని ఇవే.. ఆల్వేస్ మ్యూట్ బటన్ కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మనల్ని వాట్సాప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తుంటారు. మొహమాటం కొద్దీ గ్రూప్ నుంచి లెప్ట్ అవలేం. అలాంటప్పుడే మ్యూట్ ఆప్షన్ ఎంపిక చేసుకుని నోటిఫికేషన్ల బాధ తప్పించుకుంటాం. ఈ మ్యూట్ బటన్‌లో ఇప్పటి వరకు 8 గంటలు, వారం, సంవ్సతరం ఆప్షన్లుండేవి. ఇప్పుడు ‘ఫరెవర్’ అనే కొత్త ఆప్షన్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. అంటే.. ఈ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకెప్పుడూ ఆ గ్రూప్ నోటిఫికేషన్లు మనకు చికాకు తెప్పించవు. లెటెస్ట్‌గా 138 ఎమోజీలు.. చాట్ చేసే సమయంలో ఎమోజీలు యాడ్ చేస్తే ఆ మజాయే వేరు. ముఖ్యంగా మన మూడ్‌ను తెలియపరిచేందుకు ఎక్కువగా ఈ ఎమోజీలను యూజ్ చేస్తుంటాం. అందుకే ఒకేసారి ఏకంగా 138 ఎమోజీలను వాట్సాప్ యాడ్ చేస్తోంది. చెఫ్, ఫార్మర్, పెయింటర్, వీల్ చెయిర్ వంటి ఎమోజీలతోపాటు మరిన్ని అట్రాక్టివ్ ఆబ్జెక్ట్స్‌ను ప్రవేశపెడుతోంది వాట్సాప్. న్యూ అటాచ్మెంట్ ఐకాన్స్ మనం వాట్సాప్‌లో చాట్ చేస్తున్నప్పుడు కొన్ని ఫొటోలు, వీడియోలు, ఆడియోలు పంపిస్తుంటాం. ఇందుకోసం అటాచ్మెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మనకు నచ్చిన ఫైల్స్‌ను సెండ్ చేస్తాం. ఈ అటాచ్మెంట్ ఐకాన్‌లో ఇప్పటి వరకు డాక్యుమెంట్, కెమెరా, గ్యాలరీ, ఆడియో, లొకేషన్, కాంటాక్స్ ఆప్షన్స్ ఉండగా.. ఇప్పుడు అదనంగా ‘పేమెంట్’, ‘రూమ్’లను యాడ్ చేశారు. ఈ పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి యూపీఐ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ‘రూమ్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే నేరుగా ఫేస్బుక్ మెసెంజర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్‌ను అనేబుల్ చేసుకోవచ్చు. కేటలాగ్ షార్ట్‌కట్ ప్రత్యేకంగా బిజినెస్ వాట్సాప్ యూజర్లకు ఈ కేటలాగ్ షార్ట్‌కట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. హోం మెనూలో ఉండే ఆడియో, వీడియో కాల్స్ ఐకాన్స్‌ను మెర్జ్ చేసి దాని పక్కనే కొత్తగా కేటలాగ్ ఐకాన్ షార్ట్‌కట్‌ను యాడ్ చేశారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ వాట్సాప్, డెస్క్‌టాప్ యాప్‌లకు ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. వీడియోలు, ఫొటోలు సరికొత్తగా.. ఫొటోలు, జిఫ్ ఇమేజ్‌లను సెండ్ చేసే సమయంలోనే ఎడిట్ చేసుకునే ఆప్షన్‌తో ‘మీడియా గైడ్‌లైన్స్’ అనే ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఇకపై మనం పంపించే వీడియోలు, ఫొటోలపై టెక్స్ రాసుకోవడంతోపాటు స్టిక్కర్లను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్లలో కొన్ని ప్రస్తుతానికి బీటా అకౌంట్లకు పరిమితం చేసిన వాట్సాప్.. మరికొద్ది రోజుల్లో యూజర్లందరికీ అందించనుంది. మరింకెందుకు ఆలస్యం.. ఓసారి వాట్సాప్‌ను ప్లేస్టోర్‌లో అప్డేట్ చేసుకుఉని లేటెస్ట్ ఫీచర్లను సద్వినియోగం చేసుకోండి. -
ఐపీఎల్ జట్ల ఎమోజీలు, హ్యాష్‌టాగ్స్ విడుదల
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 కోసం ఉత్కంఠగా ఎదురుచేస్తున్న క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 2020 టోర్నీలోని ఎనిమిది టీమ్స్‌కు ఎమోజీలు, హ్యాష్‌టాగ్స్‌ను ట్విట్టర్ విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ 2020 సీజన్ గురించి ట్విట్టర్లో చర్చ మొదలవగా.. ట్విటర్ ప్రకటనతో అభిమానులకి కొత్త అనుభూతి లభించనుంది . అయితే ఇంగ్లీష్‌తో పాట వివిధ ప్రాంతీయ భాషల్లో క్యాప్షన్లున్న ఎమోజీలు, హ్యాష్టాగ్స్లను ట్విటర్ విడుదల చేసింది. -
ఎమోజీ డే: భావాలెన్నో పలికించొచ్చు!
సాక్షి, హైదరాబాద్: ఎమోజీలు అంటే మనం చెప్పకుండానే ఎన్నో భావాలను చిన్న చిన్న బొమ్మల ద్వారా చూపించోచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం బాగా పెరుగుతుండటంతో ఎమోజీల వాడకం విపరీతంగా పెరిగింది. కరోనా నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటించాల్సి రావడంతో ఎన్నో చెప్పలేని భావాలను ఎమోజీల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఈ ఎమోజీలలో చాలా రకాలు ఉన్నాయి. నవ్వుతున్న ఎమోజీలు, ఏడుస్తున్న ఎమోజీలు, ఎక్కిరించే ఎమోజీలు, ఆశ్చర్యం, ఆనందం, అలక, కోపం, సిగ్గు, బాధ ఇలా రకరకాల ఎమోజీలు ఉన్నాయి. వీటన్నింటిని సందర్భానుసారంగా వాడుతుంటారు. సోషల్ మీడియా సంస్థలు కూడా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు రకరకాల ఎమోజీలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తున్నాయి. కరోనా సమయంలోనూ దూరంగా ఉన్న తమ వారికి జాగ్రత్తగా ఉండమని సూచించే కేర్ ఎమోజీతోపాటు మరికొన్నింటిని ఫేస్బుక్ తీసుకువచ్చింది. చదవండి: ఫేస్బుక్లో కొత్త ఎమోజీ... వివరాలు మీకోసం! Caption this emoji from Emoji Kitchen. We’ll go first 🤭😷🤗 “When you need to send a safe air hug.”#WorldEmojiDay pic.twitter.com/C18CAe6bWS — Google India (@GoogleIndia) July 17, 2020 ఈరోజు (జూలై 17) వరల్డ్ ఎమోజీ డే సందర్భంగా పలు సంస్థలు రకరకాల ఎమోజీలతో కూడిన పోస్ట్‌లతో తమ ట్విటర్ అకౌంట్స్‌ను నింపేశాయి. గూగుల్ ఇండియా, అమూల్, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు కొన్ని ఎమోజీలను తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎయిర్ హగ్ ఎమోజీని గూగుల్ ఇండియా పోస్ట్ చేయగా, మహిళల పట్ల చూపుతున్న వివక్షను ఐక్యరాజ్యసమితి మహిళ విభాగం ఎమోజీల రూపంలో చూపింది. అమూల్ ఎమోజీని ఈట్మోర్జీగా మార్చి పోస్ట్ చేసింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొలా ఎమోజీ డేని సెలబ్రెట్ చేసుకుంటున్నారు. చదవండి: ఈ ఎమోజీలను వాడొద్దు.. ఎందుకంటే..? What does this emoji remind you of? Our answer: When bartan duty comes back to haunt you, every morning 👻#WorldEmojiDay pic.twitter.com/4j4FcKtWn4 — Google India (@GoogleIndia) July 17, 2020 #Amul Topical: Today is #WorldEmojiDay pic.twitter.com/z2eDUQDuDq — Amul.coop (@Amul_Coop) July 17, 2020 Happy #WorldEmojiDay! Here are 6 women's issues that you should know about explained in emojis.https://t.co/5HYxBSCq3L — UN Women (@UN_Women) July 17, 2020 -
ఫేస్బుక్లో కొత్త ఎమోజీ... వివరాలు మీకోసం!
కరోనా మహమ్మారి విజృంభించకుండా కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలతో పాటు భారత ప్రభుత్వం కూడా లాక్డౌన్ విధించి దీంతో చాలా వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు.ఇలాంటి సమయంలో తమ బంధువులతో, స్నేహితులతో అన్ని విషయాలు పంచుకోవడానికి చాలా మంది ఫేస్‌బుక్‌నే వేదికగా చేసుకుంటున్నారు. తమ భావాలు పంచుకోవడానికి ఎమోజీలను ఎక్కువ మంది ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు ఫేస్బుక్లో లైక్ కోసం ఉపయోగించే ధమ్స్అప్ ఎమోజీ, హార్ట్, లాఫింగ్, షాక్, శాడ్‌నెస్, యాంగర్ ఎమోజీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగానే తమ భావాలను పంచుకోవడానికి వీలుగా ప్రస్తుతమున్న ఆరు ఎమోజీలకు తోడు మరో ఎమోజీని ఫేస్బుక్ మనకోసం తీసుకువచ్చింది. అదే కేర్ ఎమోజీ. కరోనా విపత్కర పరిస్థితుల్లో మన వారికి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ కేర్ ఎమోజీని ఉపయోగిస్తారు. నవ్వుతున్న ఒక ఎమోజీ హార్ట్ సింబల్‌ని హత్తుకున్నట్లుగా ఈ కేర్ ఎమోజీని రూపొందించారు. ఫేస్‌బుక్‌తో పాటు మెసేంజర్‌లో కూడా పర్పుల్ కలర్లో ఉండే పల్స్ హార్ట్ ఎమోజీని కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చారు. కేర్ ఎమోజీ ఈ రోజు నుంచి ఫేస్బుక్లో ప్రత్యక్షం కానుంది. బీటా టెస్టర్ ప్రోగ్రామ్ ఇప్పటికే ఎనేబుల్ చేసుకున్న వారికి ఆటోమెటిక్‌గా ఈ ఎమోజీ వస్తుంది. అయితే బీటా టెస్టర్ ప్రోగ్రామ్ ఎనేబుల్ చేసుకొని యూజర్స్లు మాత్రం ఫేస్బుక్ తరువాతి అప్డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే. కొత్తగా వచ్చిన ఈ ఎమోజీ యూజర్లను ఆకట్టుకోవడంతో పాటు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఫేస్బుక్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.అయితే కొందరు మాత్రం ఈ కేర్ ఎమోజీ వాలెంటైన్స్ డే రోజు గిఫ్ట్ ఇచ్చేటట్లు ఉందని అంటున్నారు. సాధారణంగా ప్రేమికుల రోజున ఒక టెడ్డీబేర్ హార్ట్‌ని పట్టుకున్న టాయ్నే ఎక్కువగా గిఫ్ట్‌గా ఇస్తుంటారు. We’re launching new Care reactions on @facebookapp and @Messenger as a way for people to share their support with one another during this unprecedented time. We hope these reactions give people additional ways to show their support during the #COVID19 crisis. pic.twitter.com/HunGyK8KQw — Alexandru Voica (@alexvoica) April 17, 2020 -
ఈ ఎమోజీలను వాడొద్దు.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ : లైంగిక వాంఛను తెలిపే లేదా సూచించే ఎమోజీలపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నిషేధం విధించింది. వంకాయ, పిక్క ఉండే పీచ్ పండు, కింద పడుతున్న నీటి బిందువుల ఎమోజీలు సహా లైంగిక కోరికలను తెలియజేసే ఇతర ఏ ఎమోజీని వాడరాదంటూ యూజర్లకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే నగ్న ఫొటోల పోస్టింగ్‌ను కూడా నిషేధిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అయితే ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలియజేయలేదు. ఈ రెండు సామాజిక వేదికలను వేశ్యలు తమ లైంగిక వ్యాపారం కోసం వాడుకోకుండా నివారించేందుకే ఈ నిషేధం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వేశ్యల కోసమంటూ.. సరదాగా లైంగిక కోరికలపై జోకులు వేసుకోకుండా, కబుర్లు చెప్పుకోకుండా ఇదేమీ నిషేధమంటూ పలువురు యూజర్లు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత ప్రచారం కోసం, వ్యాపారం కోసమే కాకుండా విద్వేష భావాల కోసం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వినియోగించుకుంటున్నప్పటికీ పట్టించుకోని యాజమాన్యం ఈ ఎమోజీలను పట్టించుకోవడం ఏమిటని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. పరస్పర లైంగిక వాంఛలను తెలియజేసే ఇలాంటి ఎమోజీల వల్ల ముఖ్యంగా తన లాంటి పెళ్లయిన మగవాళ్లు అంతులేని బాధను అనుభవించాల్సి వస్తోందని ఇటీవల సోషల్ మీడియాలో వాపోయిన 42 ఏళ్ల ర్యాప్ సింగర్ కన్యే వెస్ట్‌కు ఇది శుభవార్త కావచ్చని ఒకరు వ్యాఖ్యానించగా, ఆయన భార్య కిమ్ కర్దాషియిని ‘ఎక్స్పోజింగ్’ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటే బాధ పడని వ్యక్తి, వీటికి ఎందుకు బాధ పడుతున్నారో అర్థం కావడం లేదని మరొకరు వ్యాఖ్యానించారు. -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కొత్త న్యూస్
సాక్షి, టెక్నాలజీ : పలుకే బంగారామాయేనా... అన్నట్లు వాట్సప్, మెసేంజర్లలో ఎందులోనైనా సరే చాటింగ్ చేస్తున్నప్పుడు మన ఫీలింగ్స్‌ను రాసి పంపే కంటే బొమ్మల(ఎమోజీ)తో తెలుపుతాం. కోపంగా ఉన్నామనీ, సిగ్గుపడుతున్నామనీ, ఏడుస్తూ ఉన్నామనీ ఇలా ప్రతీ ఫీలింగ్‌ను నేస్తాలకు తెలియజేస్తాం. రాతల్లో చెప్పలేని మాటలను బొమ్మలతో చెప్పుకుంటాం. ఇలా ఎమోజీలకు అలవాటు పడిన చాటింగ్ ప్రియులకు కొత్తగా మరికొన్ని ఎమోజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కొత్తగా తయారుచేసిన 157 ఎమోజీలన్నీ స్మార్ట్‌ఫోన్‌లోకి అందుబాటులోకి రానున్నాయని యూనికోడ్ కన్సార్టియం తెలిపింది. మహిళా సూపర్ హీరో, లైట్ స్కిన్ రెడ్ హెయిర్ ఉన్న అమ్మాయి, డార్క్ స్కిన్ కర్లీ హెయిర్ ఉన్న అబ్బాయి, దోమ, పైరెట్ ఫ్లాగ్(డేంజర్ జోన్లో ఉండే బొమ్మ) ఇలా అనేక రకాల కొత్త ఎమోజీలు ఉన్నట్లు సమాచారం. -
కొత్త కొత్త ఎమోజీలు వచ్చేస్తున్నాయ్
ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్లలోకి కొత్త కొత్త ఎమోజీలు వచ్చేస్తున్నాయి. వచ్చే ఐఓఎస్ అప్డేట్లో తీసుకురాబోతున్న వందల కొద్దీ ఎమోజీలను ఆపిల్ శుక్రవారం టీజ్ చేసింది. దీనిలో నవ్వును ఎక్కువగా వ్యక్తీకరించే ముఖాలు, లింగ-తటస్థను తెలిపేవి, ఫుడ్ టైప్స్, యానిమల్స్ వంటి పలు ఎమోజీలు కొత్తగా ఐఫోన్, ఐప్యాడ్‌లోకి ప్రవేశపెడుతోంది. ప్రేమను వ్యక్తీకరించే 'ఐ లవ్ యూ'ను తెలుపడానికి చేతితో వ్యక్తీకరించడం వంటి సింబల్‌ను తీసుకొస్తోంది. ఐఓఎస్ 11.1 పబ్లిక్ బీటా ప్రీవ్యూస్, డెవలపర్లో కొత్త ఎమోజీలు ఇప్పటికే వచ్చేశాయి. త్వరలో రాబోతున్న ఐఓఎస్, మ్యాక్ఓఎస్, వాచ్ఓఎస్ సాఫ్ట్వేర్ అప్డేట్లకు ఇవి ఎక్కువగా అందుబాటులోకి వస్తాయని ఆపిల్ తెలిపింది. తాజా అప్డేట్లలో ఎక్కువ స్కిన్ రంగులను, దేశాల జెండాలను ఆపిల్ తీసుకొస్తోంది. కేవలం ఆపిల్ మాత్రమే కాక, ఫేస్బుక్ కూడా కొత్త ఫ్యామిలీ ఎమోజీని విడుదల చేసింది. ఎక్కువ స్కిన్ రంగులు, ఫ్యామిలీ మేకప్‌లతో వీటిని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ కూడా తన ఎమోజీలను రీ-డిజైన్ చేసింది. టీ-రెక్స్, ఆరెంజ్ హార్ట్, వాంటింగ్ ఫేస్ వంటి కొత్త ఆప్షన్లను తీసుకొచ్చింది. -
సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కొత్త ట్రెండ్..!
జై లవ కుశ సినిమాను ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్, ప్రమోషన్ పద్ధతుల్లోనూ సరికొత్త పంథాను అనుసరిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా రానా ఓ కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ కొత్త పంథాను పరిచయం చేస్తున్నాడు. ఇటీవల ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఫోటోనే ఎమోజీగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి సరికొత్త ట్రెండ్ కు నాంది పలికాడు. తాజాగా సౌత్ స్టార్ విజయ్ తన కొత్త మెర్సల్ (తెలుగులో అదిరింది) స్టిల్ ను కూడా ఎమోజీగా రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు. జై లవ కుశ సినిమాలోని మూడు క్యారెక్టర్లకు సంబంధించిన మూడు ఎమోజీ ఐకాన్స్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం సుమారు 50 లక్షల దాకా ఖర్చు అయ్యిందనే సమాచారం. ఏది ఏమైనా టాలీవుడ్ లో ఈ తరహా ప్రమోషన్ ఏ మేర వర్కవుట్ అవుతుందో చూడాలి. -
వివిధ హావభావాల్లో సన్నీ లియోన్ ఎమోజీలు
ముంబై : బాలీవుడ్ శృంగార భామ సన్నీ లియోన్ తెగ సంబరపడుతోంది. లైలా మై లైలా అంటూ తొలిసారి 'రాయిస్'లో షారుఖ్‌తో కలిసి ఆడిపాడిన ఈ అమ్మడు తన అభిమానులకు మరోసారి కిక్కెకించడానికి రెడీ అయింది. అయితే ఈసారి సినిమాల్లో కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువతకు మరింత చేరవ అయ్యేలా, సన్నీ తన ఎమోజీలను విడుదల చేసింది. చాటింగ్ చేసే సమయంలో వివిధ హావభావాలను వ్యక్తపరచడానికి తరచుగా సోషల్ మీడియాలో ఎమోజీలను వాడుతారు. ఎమోజీఫై యాప్‌లో సన్నీలియోన్ స్టిక్కర్స్ అందుబాటులోకి వచ్చాయి. తన ఎమోజీలు యాప్‌లో వచ్చాయని సన్నీ ఆనందం వ్యక్తం చేసింది. వెంటనే తన ఎమోజీలను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోని వాడుకునే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాకుండా లింక్‌ను కూడా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. కొన్ని ఎమోజీలను తన అకౌంట్లో పోస్ట్ చేయడమే కాకుండా తన ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా ఓ ఎమోజీని పెట్టేసింది. Download now! Here is the link https://t.co/Z6x72OnH34 pic.twitter.com/FCcfmThb6r — Sunny Leone (@SunnyLeone) March 3, 2017