స్మార్ట్‌ఫోన్స్ రాకతో రకరకాల సోషల్ మెసేజింగ్ యాప్స్ మన ముందుకు వచ్చాయి. ఆయా మెసేజింగ్ యాప్స్‌ను వాడుతూ..మన స్నేహితులతోనే, బంధువులతోనే చాట్ చేస్తూ ఉంటాం. మెసేజ్ రూపంలోనే కాకుండా ఇతరులకు చెప్పదల్చుకున్న విషయాలను ఎమోజీలతో చెప్తుంటాం. రకరకాల ఎమోజీలను వాడుతూ మన అభిప్రాయాలను ఇతరులతో పంచుకుంటాం. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్స్ యూజర్లు ఎక్కువ మేర వాడిన ఎమోజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
2021లో తెగ వాడేసిన ఎమోజీ ఏదంటే..!
2021లో అత్యంత తరచుగా ఉపయోగించే ఎమోజీల డేటాను యూనికోడ్ కన్సార్టియం అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ విడుదల చేసింది. 'ఫేస్ విత్ టియర్స్ ఆఫ్ జాయ్(😂)' ఎమోజీ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత 'రెడ్ హార్ట్ (❤️) ఉంది. మూడోస్థానంలో 'నవ్వుతూ నేలపై దొర్లడం (🤣)', తర్వాత 'థమ్స్ ఆప్ (👍)' నిలవగా ఐదో స్థానంలో 'లౌడ్ క్రయింగ్ ఫేస్(😭)' నిలిచింది. యూనికోడ్ కన్సార్టియం 2020కు సంబంధించిన ఎమోజీ డేటాను విడుదల చేయలేదు. 2019లో రిలీజ్ చేసిన ఎమోజీ డేటాలో చాలా మేరకు 2021లో కూడా నిలిచాయి.
2021లో ఎక్కువగా వాడిన ఎమోజీలు ఇవే..!
చదవండి: ఆండ్రాయిడ్‌లో అదిరిపోయే ఫీచర్స్..! పిల్లలను, కార్లను కంట్రోల్ చేయొచ్చు....!
Comments
Please login to add a commentAdd a comment