ప్రతీకాత్మక చిత్రం
ఆంగ్లంలో ఒక మాట చెబుతుంటారు... ‘ఛేంజ్ యువర్ లాంగ్వేజ్ అండ్ యూ ఛేంజ్ యువర్ థాట్స్’ ఇప్పుడు యూత్ తన లాంగ్వేజ్‌ను మార్చుకుంది. అయితే అది ఆలోచనలో మార్పు కోసం అనేకంటే అవసరం కోసమే అనడం బెటర్. కమ్యూనికేషన్ కోసం పొట్టి పదాలు, ఎమోజీలు, సాంకేతిక సంకేతాలు... మొదలైనవి ఉపయోగించడం ద్వారా తమదైన డిజిటల్ భాషను సృష్టించుకుంటున్నారు. తమ భావాలను తక్కువ సమయంలో ఎదుటివ్యక్తికి చేరవేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
పనిగట్టుకొని ఎవరూ ఈ డిజిటల్ భాషను సృష్టించకపోయినా, అవసరాలలో నుంచి ప్రయోగించిన పదాలు, సంకేతాలు అప్పటికప్పుడు అన్నట్లుగా కాకుండా అలా స్థిరపడిపోతున్నాయి. కొత్త పదాలకు దారి చూపుతున్నాయి.
స్నేహితులు సృజన్‌కు పదేపదే ఫోన్ చేస్తున్నారు. ఎందుకో ఆరోజు అతడి మనసు బాగలేదు. తన స్నేహితులకు ‘కిచెన్‌నైఫ్’ ఎమోజీ పంపాడు. అంతే...అటు నుంచి ఫోన్లు ఆగిపోయాయి! కిచెన్‌నైఫ్....బెదిరింపు సూచిక కాదు....‘బ్యాడ్‌మూడ్‌లో ఉన్నాను’ అని చెప్పడం. నీరజకు తన స్నేహితురాలు రమ్య ఫోన్ చేసి ‘నీ గురించి ఇలా అనుకుంటున్నారు’ అంటూ ఏదో చెప్పింది.
నీరజ వెంటనే ‘నెయిల్ పాలిష్’ ఎమోజీని పంపింది. వేరేవాళ్లు అయితే ఈ బొమ్మ ఎందుకు పంపినట్లు అని బుర్ర గోక్కునేవాళ్లు. అయితే రమ్య కూడా ‘యూత్‌లాంగ్వేజ్’ తెలిసిన టెక్ట్సర్ కావడం వలన ఆ అమ్మాయికి విషయం అర్థమైంది. ఇంతకీ ఆ ఎమోజీ అర్థం ఏమిటంటే...‘నా గురించి నాకు తెలుసు. అలాంటి వాటిని నేను పట్టించుకోను’
ఫోన్‌కాల్ కంటే ‘టెక్ట్స్ మెసేజ్’లోనే రెస్పాండ్ అయ్యే ధోరణి యూత్‌లో పెరిగింది.
ముఖాముఖీ (ఫేస్ టూ ఫేస్) సంభాషణల్లో కంటే ఆన్‌లైన్ కమ్యూనికేటింగ్‌లోనే పారదర్శకత ఎక్కువ అనే అభిప్రాయం ఏర్పడింది. లింగో2వర్డ్.కామ్...మొదలైన వెబ్‌సైట్‌లు వెబ్‌లింగోను అర్థమయ్యే ఇంగ్లీష్‌లోకి తీసుకువస్తున్నాయి. ఇవి పేరెంట్స్‌కు బాగా ఉపయోగపడుతున్నాయి.
మొదట్లో ఇ–మెయిల్స్, ఇన్‌స్టంట్ మెసేజ్, టెక్ట్స్ మెసేజ్‌లకు పరిమితమైన ‘వెబ్ లింగో’ ఇప్పుడు నిత్యజీవిత సంభాషణల్లోకి కూడా దూసుకువస్తుంది. మున్ముందు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సిందే.
కొన్ని ఇమోజీల అర్థాలు
ఫేస్ విత్ ఓపెన్ మౌత్.....స్మోకింగ్
పుర్రె......సమ్‌థింగ్ ఈజ్ ఫన్నీ
బేస్‌బాల్‌క్యాప్......అబద్ధం
పిజ్జా...... ఐ లవ్ యూ
హార్ట్ ఇన్ ఫైర్... విరహం
సంక్షిప్త పదాల విషయాకి వస్తే....
time .....టీయర్ ఇన్ మై ఐస్
f2f......ఫేస్ టు ఫేస్
swyp......సో వాట్స్ యువర్ ప్రాబ్లమ్?
ruok......ఆర్ యూ ఓకే?
nagi.......నాట్ ఏ గుడ్‌ఐడియా
idk ........ఐ డోన్ట్ నో
hand...హ్యావ్ ఏ నైస్‌డే
gr8...గ్రేట్
sys......సీ యూ సూన్
చదవండి: Sweet Potato Day- Health Benefits: చిలగడ దుంప తినడం ఇష్టమా.. ఈ విషయాలు తెలిస్తే!
Comments
Please login to add a commentAdd a comment