Year End 2021
-
2021లో భారతీయులు తెగ వెతికిన కారు బ్రాండ్ ఇదే..! ప్రపంచంలో టాప్ బ్రాండ్ అదే..!
2021 ముగిసింది. గత ఏడాది ఆటోమొబైల్ కంపెనీలకు కొంచెం ఇష్టం..కొంచెం కష్టంగా వ్యాపారాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చిప్స్ కొరత ఆయా ఆటోమొబైల్ కంపెనీలను కుదేలయ్యేలా చేసింది. చిప్స్ కొరతతో ఉత్పత్తి తగ్గిపోయి అమ్మకాలపై ప్రభావాన్ని చూపింది. భారత్‌లో కూడా ఆయా కంపెనీలపై తీవ్రమైన ప్రభావం పడింది. ఇదిలా ఉంటే వాహనదారులు 2021లో ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో తెగ వెతికిన ఆటోమొబైల్ బ్రాండ్స్ వివరాలను గూగుల్ ప్రకటించింది. భారత్‌లో అదే టాప్..! 2021గాను భారత్‌లో తెగ వెతికిన కార్ బ్రాండ్‌గా దక్షిణకొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ నిలిచింది. హ్యుందాయ్ భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా నిలిచింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం...దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన బ్రాండ్‌గా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. వరల్డ్ టాప్ టయోటా..! ప్రపంచవ్యాప్తంగా అత్యంత శోధించిన బ్రాండ్‌గా టయోటా నిలిచింది. 154 దేశాలలో 47 సెర్చ్ వాల్యూమ్‌లో టయోటా అగ్రస్థానంలో ఉంది. 2021లో 31 శాతం మేర వాహనదారులు వెతకగా...2020లో 34.8 శాతం మంది వెతికారు. 2020తో పోల్చితే సెర్చింగ్ రేట్ తగ్గిన 2021గాను టయోటా టాప్ సెర్చ్డ్ బ్రాండ్‌గా నిలిచింది. ఇక అమెరికాలో 90 ఏళ్ల తరువాత అత్యధిక అమ్ముడైన బ్రాండ్‌గా టయోటాకు దక్కింది. బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బ్రాండ్స్-2021లో గ్లోబల్ గూగుల్ సెర్చ్‌లలో ఆధిపత్యం కొనసాగిస్తూ వరుసగా రెండో ఏడాది తమ మొదటి మూడు స్థానాలను నిలుపుకున్నాయి. 2021లో, హాంకాంగ్, ఇజ్రాయెల్, మకావు, సింగపూర్, చైనాలలో అత్యధికంగా శోధించబడిన కార్ బ్రాండ్ టెస్లా నిలిచింది. చదవండి: ఎలక్ట్రిక్ కారు అవతారంలో పాత టాటా కారు.. రేంజ్ @500 కిమీ! -
Anand Mahindra: ‘మనం ఎందుకు జీవిస్తున్నామో ఈ ఒక్క దృశ్యం చూస్తే సరిపోతుంది.’
సోషల్ మీడియాలో తరచూ సమకాలిన అంశాలపై స్పందించే బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా కొత్త ఏడాది విషెస్‌ను తనదైన స్టైల్లో చెప్పారు. దాంతో పాటుగా తనకు 2021లో నచ్చిన ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. విత్ పవర్ఫుల్ మెసేజ్..! ఓ తండ్రి తన కుమారుడిని తోపుడు బండిపై తీసుకెళ్తున్న ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఈ ఫోటోలో తోపుడు బండిపై సదరు వ్యక్తి కుమారుడు పుస్తకంలో రాస్తూ కన్పించాడు. ఈ ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ... ‘ఈ ఏడాది నాకు నచ్చిన ఫొటో ఇది. క్షమించండి... దీన్ని ఎవరు తీశారో నాకు తెలీదు. ఇది నా ఇన్‌బాక్స్‌లో కనిపించింది. ఆశ, కృషి, ఆశావాదానికి ఈ చిత్రం నిలువెత్తు నిదర్శనం. మనం ఎందుకు జీవిస్తున్నామో ఈ ఒక్క దృశ్యం చూస్తే సరిపోతుంది' అంటూ షేర్ చేశారు. ఈ ఫోటో మనకు పవర్ఫుల్ మెసేజ్‌ను మనందరికీ ఇస్తోందని తెలిపారు. ఈ పోస్ట్ సుమారు 90 వేల లైక్స్‌ను సంపాదించి వైరల్‌గా మారింది. And here’s my favourite photo of the year. Apologies, I don’t know who took it so cannot acknowledge the photographer. It showed up in my inbox. Hope, Hard Work, Optimism. The essence of why we live…Once again, have a fulfilling New Year. pic.twitter.com/TwucYZruQA — anand mahindra (@anandmahindra) December 31, 2021 చదవండి: రెక్కలు కట్టుకుని ఎగిరిపోదాం.. ఆనంద్ మహీంద్రా వెరైటీ విషెస్ -
2021లోఎక్కువ మంది ఆసక్తిని చూపిన అంశాలివే..
ప్రతి భారతీయుడు తమకు నచ్చిన భాషలో తమను తాము ఆన్లైన్లో స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వీలు కల్పించే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ యాప్ ప్రప్రధమంగా ’వాయిసెస్ ఆఫ్ ఇండియా’ నివేదికను విడుదల చేసింది. దీని ద్వారా తమ ప్లాట్ఫార్మ్పై అత్యధికంగా దేశవాసుల చర్చల్లో చోటు చేసుకున్న అంశాలను వెల్లడించింది. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అందించిన ప్రజల వంచనపై కవితా పదాలు అత్యధికులు ఇష్టపడ్డారు. కోవిడ్19 సెకండ్‌వేవ్ సమయంలో ప్రజలు ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాస్మా దాతల్ని కనుగొనడానికి ఆరాటం చూపారు. టోక్యో2020 సమ్మర్ ఒలింపిక్స్, టీ20 ప్రపంచ కప్ 2021, పారాలింపిక్స్, భారతదేశంతో పాకిస్థాన్ పోటీపడిన ప్రపంచకప్ పోటీలు అత్యంత చర్చనీయాంశమైనవిగా గణనీయమైన ఎట్రాక్షన్‌ను అందుకున్నాయి. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, విరాట్ కోహ్లిలు అన్ని భాషలలో ఎక్కువగా ప్రస్తావించబడిన ప్రముఖులుగా అగ్రభాగంలో నిలిచారు. పొట్టి ఫార్మాట్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న విరాట్ కోహ్లీ నిర్ణయానికి అభిమానుల నుంచి గట్టి మద్దతు లభించింది. ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను విజయానికి అభిమానులు అధిక సంఖ్యలో మద్దతు ఇవ్వడంతో ఆమె ట్రెండ్ అయ్యింది. లెజెండరీ బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ మృతి పట్ల పెద్ద సంఖ్యలో ప్రజలు సంతాపం తెలిపారు. కోవిడ్19 సెకండ్ వేవ్ సమయంలో మ్యూకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ గురించిన ఆందోళన, సూచనలు ట్రెండీగా మారాయి. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ కూడా బాగా ట్రెండ్ అయింది. దివంగత కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ విషాద మరణంపై పెద్ద యెత్తున వెల్లువెత్తిన సానుభూతి పునీత్‌పై ప్రేమకు అద్దం పట్టింది. -
కేకలు, అరుపులు.. జూబ్లీహిల్స్‌లో యువతి హల్చల్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరానికి నగరం సంబరంగా స్వాగతం పలికింది. అయితే మరోవైపు పోలీసులు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ 50 మంది పట్టుబడ్డారు.40 బైక్‌లు, ఏడు కార్లు, ఆటోను సీజ్ చేశారు. 92 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. చాలా చోట్ల మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర ఓ యువతి హల్చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సహకరించకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీరంగం సృష్టించింది. పోలీసులను, ప్రయాణికులను దుర్భాషలాడుతూ గొడవకు దిగింది. యువతితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చదవండి: (Omicron: కఠిన ఆంక్షలకు సీఎం ఆదేశం..థియేటర్లలో 50 శాతం మందికే) -
2021లో విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు
సాక్షి, అమరావతి: కొద్దిసేపు కరెంట్ లేకపోతే లోకమంతా చీకటైపోయినట్టుగా ఉంటుంది. కరెంట్ రాగానే హమ్మయ్య అనుకుంటాం. మన దైనందిక జీవితంలో చీకటి వెలుగులు నింపే విద్యుత్ రంగంలో కూడా ఈ ఏడాది అలాంటి పరిస్థితులే ఉన్నాయి. బొగ్గు సంక్షోభంలో అధిక ధరలకు బయట మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడటం దగ్గర్నుంచి, డిస్కంల చరిత్రలోనే తొలిసారి ట్రూడౌన్ చార్జీల పేరుతో వినియోగదారులకు తిరిగి డబ్బులివ్వడం వరకు ప్రజల సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు ‘సెకి’తో ఒప్పందానికి ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో రూ.కోట్లలో విద్యుత్ ఆదా అయింది. ఇలా విద్యుత్ రంగంలో ఈ ఏడాది చోటుచేసుకున్న అనేక పరిణామాల్లో ముఖ్యమైనవి కొన్ని.. అంతర్జాతీయ పరిస్థితులు, వర్షాలు, కోవిడ్ సెకండ్‌వేవ్ తదనంతర పరిణామాల కారణంగా దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా మన రాష్ట్రంలో మాత్రం బొగ్గు సంక్షోభం ఏర్పడ లేదు. అయితే బొగ్గు కొరత కారణంగా మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు పెరిగాయి. సాధారణంగా రూ.4 నుంచి రూ.5కు వచ్చే యూనిట్‌కు దాదాపు రూ.6 నుంచి పీక్ అవర్స్‌లో రూ.20 వరకు వెచ్చించాల్సి వచ్చింది. బొగ్గు కొరత తీర్చే విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని, విద్యుత్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని దేశంలో అందరికంటే ముందు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఫలితంగా రాష్ట్రానికి బొగ్గు సరఫరా మెరుగైంది. బొగ్గు కొనుగోలు కోసం ఏపీ జెన్కోకు రూ.250 కోట్ల అత్యవసర నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఉచిత విద్యుత్ పథకంతో రానున్న 30 ఏళ్ల పాటు రైతులకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అవసరమైన సోలార్ విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ–సెకి) ప్రతిపాదించింది. 25 ఏళ్లపాటు యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడువేల మెగావాట్ల సౌర విద్యుత్తును కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బహిరంగ మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలు, ఇతర ఉత్తమ ప్రమాణాల అమలు ద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాదాపు రూ.2,500 కోట్లు ఆదా చేయగలిగాయి. పరిశ్రమలు, స్థానిక సంస్థలు, వ్యవసాయం, భవనాల్లో విద్యుత్ పొదుపు చర్యల కారణంగా గడిచిన ఏడాదిలో రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల ఇంధనం ఆదా అయింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 2019తో పోలిస్తే 2021లో 20 శాతం పెరిగింది. కేంద్రప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ప్రారంభించిన ఎనర్జీ ఎఫిషియెన్సీ (ఈఈ) ప్రాజెక్టుల గ్రేడింగ్‌లో టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీకి స్థానం దక్కింది. భారీ వరదల కారణంగా చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో విద్యుత్ శాఖకు సుమారు రూ.19.13 కోట్ల నష్టం వాటిల్లింది. గులాబ్ తుఫాన్ వల్ల తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ.7.87 కోట్ల నష్టం సంభవించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల 21 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా నెగెటివ్ ఫ్యూయెల్, పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్‌పీపీసీఏ)కు దరఖాస్తు చేశాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకుంటున్న ఇంధన పొదుపు చర్యలు, సంస్కరణల కారణంగా డిస్కంలు తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసి ఖర్చులు మిగుల్చుతున్నాయి. అలా మిగిలిన మొత్తాన్నీ వినియోగదారులకే ఇవ్వాలని భావిస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు దాదాపు రూ.126.16 కోట్లు తిరిగి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో వైఎస్సార్ జగనన్న కాలనీల పేరిట నిర్మిస్తున్న 28.30 లక్షల ఇళ్లకు అత్యంత నాణ్యమైన విద్యుత్తును అందించడానికి రూ.7,080 కోట్లు వెచ్చించేందుకు విద్యుత్తు సంస్థలు సిద్ధమయ్యాయి. కాలనీల్లో ఓవర్ హెడ్, అండర్ గ్రౌండ్ విద్యుదీకరణ పనులు చేపట్టాయి. 2014–15 నుంచి 2018–19 మధ్య కాలానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూ అప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) రూ.3,669 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతి ఇచ్చింది. ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.609 కోట్లు ట్రూఅప్ చార్జీలను ఎనిమిది నెలల్లో వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసి సెప్టెంబర్, అక్టోబర్ నెల బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు విధించాయి. కానీ న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్సీ తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీంతో ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.70 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) రూ.28 లక్షలను (మొత్తం రూ.196.28 కోట్లను) వినియోగదారులకు వెనక్కి ఇస్తూ, విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేశాయి. -
AP: రాజకీయాల్లో నవశకం
సాక్షి, అమరావతి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో నవ శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారు. చట్టప్రకారం వచ్చే పదవులే తప్ప, ప్రాధాన్యత లేకుండా అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని, మహిళలను అందలమెక్కించి, ప్రాధాన్యత కలిగిన పదవులను కట్టబెట్టారు. సామాజిక న్యాయమంటే ఇదీ అని చేతల్లో చూపించారు. ఆ వర్గాలను చైతన్యవంతం చేస్తున్నారు. వారి అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు. రాజకీయాల్లో నవ చరిత్ర లిఖిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 60 శాతం అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారిని బరిలోకి దించారు వైఎస్ జగన్. చట్ట సభల్లో వారికే అగ్రస్థానమని చాటి చెప్పారు. 2021లోనూ చట్ట సభలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి పైగా ఈ వర్గాలకే ఇచ్చారు. నామినేటెడ్ పనుల్లోనూ 50 శాతం ఆ వర్గాలకు ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసన మండలి చైర్మన్ పీఠంపై ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజును కూర్చోబెట్టారు. అంతేకాదు.. మండలి వైస్ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంను ఎంపిక చేశారు. శాసనమండలి చరిత్రలో మైనార్టీ మహిళ వైస్ చైర్మన్ కావడం ఇదే ప్రథమం. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు బాటలు వేసిన సీఎం వైఎస్ జగన్. ఇది రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారడానికి దోహదం చేస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మండల, జిల్లా పరిషత్‌లలో కోటాకు మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన పదవులకంటే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చారు. ఈ ఏడాది 648 మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహిస్తే.. అందులో 635 మండల పరిషత్‌లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. ఇందులో బీసీల వర్గాలకు చెందిన వారికి 239 ఎంపీపీ(మండల పరిషత్ అధ్యక్షులు) పదవులు ఇచ్చారు. అంటే.. 38 శాతం బీసీలకు ఇచ్చినట్లు. 29 శాతం ఎంపీపీ పదవులను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు 67 శాతం ఎంపీపీ పదవులు ఇచ్చారు. ఎన్నికలు జరిగిన 13 జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులను వైఎస్సార్సీపీ గెల్చుకోగా, 69 శాతం జెడ్పీ చైర్పర్సన్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కట్టబెట్టారు. సార్వత్రిక ఎన్నికల నుంచే సామాజిక న్యాయం సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ తరఫున 60 శాతం టికెట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే సీఎం వైఎస్ జగన్ కేటాయించారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించాక.. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించాక ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 60 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. నలుగురు ఉప ముఖ్యమంత్రులను ఆ వర్గాల నుంచే నియమించారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరితను నియమించారు. ఎస్సీ వర్గానికి చెందిన మహిళలను హోంశాఖ మంత్రిగా నియమించడం చరిత్రలో ఇదే తొలిసారి. రాజ్యసభలో రాష్ట్రం తరఫున ఖాళీ అయిన నాలుగు స్థానాల్లో.. రెండింటిని బీసీ వర్గాల నుంచే భర్తీ చేశారు. శాశ్వత ఉద్యోగాలలోనూ.. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల శాశ్వత ఉద్యోగులను నియమించారు. ఇందులో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే వచ్చాయి. రెండున్నరేళ్లలో మరో 2.70 లక్షల వలంటీర్ ఉద్యోగాలు, మిగిలినవి కలుపుకుని మొత్తం 6.03 లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. వీరిలోనూ 75 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. మున్సిపల్, కార్పొరేషన్ పదవుల్లోనూ.. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 13 కార్పొరేషన్లనూ వైఎస్సార్సీపీ దక్కించుకుంది. మేయర్ పదవుల్లో ఏడింటిని సీఎం వైఎస్ జగన్ బీసీలకే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి 92 శాతం మేయర్ పదవులను ఇచ్చారు. ఎన్నికలు జరిగిన 87 మున్సిపాల్టీలలో 84 వైఎస్సార్సీపీ గెల్చుకుంది. ఇందులో 73 శాతం మున్సిపల్ చైర్పర్సన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. చట్టం చేసి మరీ పదవులు, పనులు.. నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు ఇచ్చేలా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చట్టమే చేశారు. ఆ చట్టం ప్రకారం నామినేటెడ్ పదవులు, పనులను వారికి పంపిణీ చేశారు. రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 58 శాతం ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 నామినేటెడ్ డైరెక్టర్ల పదవుల్లో 58 శాతం ఈ వర్గాలకే ఇచ్చారు. ఇవి కాక బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మరో 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు మరో కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వాటి చైర్మన్ పదవులను ఆ వర్గాలకే కేటాయించారు. వీటిలోని 684 డైరెక్టర్ పోస్టులను వారికే ఇచ్చారు. శాసన మండలిలోనూ.. శాసన మండలిలో ఖాళీ అయిన 14 స్థానాల్లో (మూడు ఎమ్మెల్యే కోటా.. 11 స్థానిక సంస్థల కోటా) ఏడింటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించి, గెలిపించారు. మండలిలో 58 మంది సభ్యులు ఉంటే.. అందులో వైఎస్సార్సీపీ సభ్యులు 32 మంది ఉన్నారు. ఇందులో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. -
అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ ‘హిట్’... అశూ, అక్షర్ కూడా అద్భుతం!
గతేడాది కరోనా కారణంగా క్రికెట్ అభిమానులు కోల్పోయిన వినోదాన్ని మెగా ఈవెంట్ల రూపంలో 2021 భర్తీ చేసింది. మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలిచిన జట్టుగా న్యూజిలాండ్‌కు చారిత్రాత్మక విజయం అందిస్తే... తొలిసారిగా టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆనందాన్ని ఆస్ట్రేలియాకు పంచింది. అయితే టీమిండియాకు కొన్ని మధురజ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాల్నీ మిగిల్చింది. ముఖ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి, టీ20 వరల్డ్‌కప్-2021లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించడం అభిమానులను నిరాశకు గురిచేశాయి. కాసేపు వీటిని పక్కనపెడితే... మూడు ఫార్మాట్లలో భారత జట్టు, క్రికెటర్లు సాధించిన 5 రికార్డులపై ఓ లుక్కేద్దాం. 1.ఆసీస్ గడ్డ మీద రెండుసార్లు.. సెంచూరియన్‌లోనూ గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించి చారిత్రక టెస్టు విజయం నమోదు చేసింది టీమిండియా. సొంతగడ్డ మీద వారిని ఓటమి రుచి చూపించి సత్తా చాటింది. అదే జోష్‌లో సిరీస్‌ను కైవసం చేసుకుని... ఆసీస్ నేలమీద రెండు సార్లు ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి టెస్టులో విజయం సాధించి సెంచూరియన్ కోట బద్దలు కొట్టింది. తద్వారా అక్కడ ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. 2.రెండో బ్యాటర్‌గా హిట్‌మ్యాన్.. మూడు ఫార్మాట్లలో 3 వేలకు పైగా పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రస్తుత సారథి రోహిత్ శర్మ నిలిచాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్టుల్లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న హిట్‌మ్యాన్... టీ20 ప్రపంచకప్-2021లో నమీబియాతో మ్యాచ్ సందర్భంగా పొట్టి ఫార్మాట్లోనూ ఈ ఘనత అందుకున్నాడు. కాగా రోహిత్ శర్మ ఇప్పటి వరకు వన్డేల్లో 9205, టెస్టుల్లో 3047, అంతర్జాతీయ టీ20లలో3197 పరుగులు సాధించాడు. 3. కోహ్లిని అధిగమించిన రోహిత్! యూఏఈ వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఓపెనర్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లి ఘనతను అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక సార్లు 50కి పైగా పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లి(29 సార్లు), పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(25 సార్లు) రోహిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సెంచరీలు(4) సాధించిన ఆటగాడిగా కూడా హిట్‌మ్యాన్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు(150) బాదిన హిట్టర్ల జాబితాలో మార్టిన్ గఫ్టిల్(165) తర్వాత స్థానంలో ఉన్నాడు. 4.అశూకు నిజంగా ఈ ఏడాది మధుర జ్ఞాపకమే! సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేశాడు రవిచంద్రన్ అశ్విన్. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకుని మెరుగ్గా రాణించాడు. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు అశూ. 417 వికెట్లు పడగొట్టడం ద్వారా హర్భజన్ సింగ్ రికార్డును అధిగమించడంతో పాటుగా... భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. 5. అక్షర్ పటేల్ అద్భుతం చేశాడు! స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కివీస్‌తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి.. కెరీర్లో ఐదో సారి ఈ ఘనత సాధించాడు. తద్వారా తొలి నాలుగు టెస్టుల్లో ఎక్కువసార్లు ఐదు వికెట్లు తీసిన జాబితాలో టామ్ రిచర్డ్సన్, రోడ్ని హగ్‌తో కలిసి అక్షర్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అరంగేట్ర టెస్టు నుంచి ఆడిన 4 టెస్టుల్లో అక్షర్ ప్రతీ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. చార్లీ టర్నర్ (1887లో డెబ్యూ నుంచి తొలి నాలుగు టెస్టులు), టామ్ రిచర్డ్సన్(1893 డెబ్యూ నుంచి తొలి నాలుగు టెస్టులు) వంటి ఆటగాళ్ల సరసన నిలిచాడు. చదవండి: 55 నిమిషాల పాటు నరకం అనుభవించా: స్టీవ్ స్మిత్ -
వైద్య, ఆరోగ్యానికి ‘సూపర్’ ట్రీట్మెంట్
కంటికి కనిపించని కరోనా వైరస్ 2020లో మిగిల్చిన చేదు అనుభవాలు.. వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ తాలుకు చేదు జ్ఞాపకాలతో రాష్ట్ర ప్రజలు 2021లోకి అడుగుపెట్టారు. కానీ, కోవిడ్ ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఏప్రిల్, మే నెలల్లో ఊహించని రీతిలో వైరస్ రెండో విడతలో ఒక్కసారిగా విజృంభించింది. దీంతో 2021లో కూడా వైరస్ భయంతోనే బిక్కుబిక్కుమంటు గడిపారు. తాజాగా.. ఒమిక్రాన్ రూపంలో వైరస్ వ్యాప్తి మరోసారి మొదలైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 11.94 లక్షల మంది వైరస్ బారినడ్డారు. వీరిలో 11.86 లక్షల మంది కోలుకోగా 7,384 మంది మృత్యువాత పడ్డారు. ఊహించని రీతిలో వైరస్ విజృంభించినా సమర్థవంతంగా కట్టడి చర్య చేపట్టి జాతీయ స్థాయిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు పొందింది. – సాక్షి, అమరావతి వేగంగా టీకా పంపిణీ 2021 జనవరి 16న రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి శ్రీకారం చుట్టారు. విజయవాడ జీజీహెచ్‌లో పారిశుధ్య ఉద్యోగిని పుష్పకుమారి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తొలిడోసు టీకా వేసుకుంది. ఆ రోజు నుంచి దశల వారీగా ఎంపిక చేసిన వర్గాలకు టీకా పంపిణీలో ప్రభుత్వం వేగం పెంచింది. ఇలా సంవత్సరాంతానికి రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో తొలిడోసు టీకాను 100 శాతాన్ని అధిగమించగా.. 74.08 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తిచేసింది. కరోనా కట్టడికి రూ.3,683 కోట్లు ఇక ఈ ఏడాది నవంబర్ 24 నాటికి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,683.05 కోట్లు ఖర్చుచేసింది. కరోనా విజృంభణ అధికంగా ఉన్న సమయంలో మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగింది. ప్రణాళికాబద్ధంగా ఆక్సిజన్, మందులు సరఫరా చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. ఈ అనుభవాలతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన 175 ప్రెజర్ స్వింగ్ అబ్జార్షన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ఏర్పాటుచేసింది. తద్వారా 24,419 పడకలకు ఆక్సిజన్ సరఫరా సమకూరుతోంది. ఆసుపత్రుల్లో విప్లవాత్మక మార్పులు మరోవైపు.. మొత్తం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్ ప్రభుత్వం నాడు–నేడు కింద శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కోసం ఆసుపత్రుల్లో వసతుల కల్పన, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం రూ.16,255 కోట్లు ఖర్చుచేస్తోంది. ఇందులో భాగంగా 2021లో 14 మెడికల్ కళాశాలల నిర్మాణానికి ఈ ఏడాది మే 31న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. నిజానికి రూ.7,880 కోట్లతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. అలాగే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా భారీగా నియామకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు, కొత్తగా పోస్టులను సృష్టించి అక్టోబర్, నవంబర్ నెలల్లో 14,818 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీచేసింది. వీటిలో ఇప్పటికే కొన్ని పూర్తి అయ్యాయి. మరికొన్నింటి ప్రక్రియ కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరిలో ఇది మొత్తం పూర్తికానుంది. నీతి ఆయోగ్ ప్రశంసలు దేశంలో మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్న అత్యంత తక్కువ రాష్ట్రాల్లో ఏపీ ఒకటని నీతి ఆయోగ్ ప్రశంసించింది. అంతేకాక.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసానిస్తోందని పేర్కొంది. నీతి ఆయోగ్ వెల్లడించిన 2019–20 ఆరోగ్య సూచీల్లో దేశంలో రాష్ట్రానికి నాలుగో ర్యాంకు దక్కింది. మాత, శిశు మరణాల కట్టడిలో ప్రభుత్వం సుస్థిర లక్ష్యాలను సాధించినట్లు ప్రశంసించింది. అలాగే, గతంతో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ స్పెషలిస్ట్ వైద్యుల కొరత, ఆసుపత్రుల్లో వసతుల కల్పన మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించింది. ఇక రాష్ట్రంలో ప్రజారోగ్యం మెరుగుపడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గుడ్ గవర్నెన్స్ 2020–21 నివేదికలో పేర్కొంది. గతంతో పోలిస్తే పీహెచ్‌సీల్లో వైద్యుల అందుబాటు 6 శాతం పెరిగినట్లు తెలిపింది. కోవిడ్ కట్టడికి గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్ఎంల ద్వారా ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్ మెచ్చుకుంది. రోగుల హోమ్ ఐసోలేషన్, వారి ఆరోగ్య పరిస్థితి నిత్య పర్యవేక్షణ, ఇతర చర్యలు భేషుగ్గా ఉన్నాయని తన అధ్యయనంలో పేర్కొంది. -
2021 నిజంగానే అపురూపం.. ఆటల్లో ఎన్నో అద్భుతాలు, మరెన్నో..
2021 సంవత్సరం ఈరోజుతో ముగుస్తుంది. కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న 2021 సంవత్సరం.. క్రీడల్లో ఎన్నో మధురానుభూతులు.. మరిచిపోలేని విషయాలు.. జ్ఞాపకాలు.. నిరాశ.. ఆధిపత్యం.. వివాదాలు అందించింది. టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ విజయం మొదలుకొని.. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకంతో భారతావని పులకించడం.. ఇంకా మరెన్నో అద్భుతాలు చోటు చేసుకున్న 2021 సంవత్సరం గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం తయారవుతోంది. మరి కాలగమనంలో కలిసి పోనున్న 2021 సంవత్సరంలో క్రీడల్లో జరిగిన ముఖ్య పరిణామాలను మరోసారి గుర్తుచేసుకుందాం. మనం దేశంలో ఎక్కువగా అభిమానించే క్రీడ.. క్రికెట్. మరి అలాంటి క్రికెట్‌తోనే 2021 ఏడాది జ్ఞాపకాలను ప్రారంభిద్దాం. -సాక్షి, వెబ్‌డెస్క్ ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి.. 2021 ఏడాదిని టీమిండియా ఘనంగా ఆరంభించింది. అప్పటికే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బిజీగా గడుపుతోంది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులో టీమిండియా ఘోరమైన ఓటమి చవిచూసింది. 36 పరుగులకే ఆలౌటై దారుణ పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఎన్నో అవమానాలు.. విమర్శలు మొదలయ్యాయి. దీనికి తోడూ తొలి టెస్టు తర్వాత వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి రావడం.. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం కావడం టీమిండియాను మరింత ఇబ్బందుల్లో పడేసింది. కోహ్లి గైర్హాజరీలో రహానే నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. మెల్బోర్న్ టెస్టులో టీమిండియా పడిలేచిన కెరటంలా సంచలన విజయం సాధించింది. రహానే జట్టును ముందుండి నడిపించాడు. ఆ తర్వాత సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమికి దగ్గరైంది. ఈ దశలో హనుమ విహారి.. రవిచంద్రన్ అశ్విన్‌లు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పోరాడడం ప్రతీ ఒక్కరిలో స్పూర్తిని కలిగించింది. ఆసీస్ బౌలర్ల దెబ్బలు బాధిస్తున్నా.. వాటిని తట్టుకొని టీమిండియాను ఓటమి నుంచి తప్పించి డ్రాగా ముగించారు. ఇక ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ గాబా మైదానానికి రండి మీ పని పడతాం అంటూ సవాల్ విసిరాడు. అసలే గాబా మైదానం ఆస్ట్రేలియాకు స్వర్గధామం. 32 ఏళ్లుగా ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు అక్కడ ఓటమనేదే లేదు. బుమ్రా, షమీ లాంటి సీనియర్ పేసర్ల గైర్హాజరీలో సిరాజ్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాలి. ఇన్ని సవాళ్ల మధ్య బరిలోకి దిగిన టీమిండియా అద్భుతమే చేసి చూపెట్టింది. ఆ మ్యాచ్‌లో సిరాజ్, శార్దూల్, పంత్, సుందర్‌ల అసమాన పోరాట పటిమతో టీమిండియా అధ్బుత విజయాన్ని నమోదు చేసింది. అలా రహానే సారధ్యంలో టీమిండియా బోర్డ్ర్ గావస్క్ ట్రోఫీని 2-1 తేడాతో సొంతం చేసుకొని చారిత్రక విజయాన్ని అందుకుంది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై వరుసగా రెండోసారి మట్టికరిపించడం అభిమానులను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ సిరీస్ విజయం చరిత్రలో నిలిచిపోయింది. అలా 2021 ఏడాదిని టీమిండియా ఘనంగా ఆరంభించింది. స్వదేశంలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి.. ఇక ఫిబ్రవరిలో ఇంగ్లండ్ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత్ గడ్డపై అడుగుపెట్టింది. చెన్నై వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర ఓటమి. రూట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు తొలి టెస్టులో 227 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. దీంతో మళ్లీ విమర్శల పర్వం మొదలైంది. అయితే టీమిండియా మళ్లీ అదే చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో బెబ్బులిలా గర్జించింది. 317 పరుగులు భారీ తేడాతో ఇంగ్లండ్‌ను దెబ్బకు దెబ్బ తీసింది. ఇక అక్కడి నుంచి టీమిండియా ఇంగ్లండ్‌కు అవకాశం ఇవ్వలేదు మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో.. నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలిచి 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ అశ్విన్‌తో పాటు అక్షర్ పటేల్‌కు మధురానుభూతిగా నిలిచిపోయింది. ఈ ఇద్దరు స్పిన్నర్లు ఒకరితో ఒకరు పోటీ పడుతూ వికెట్లు తీశారు. ఇక ఆ తర్వాత జరిగిన ఐదు టి20ల సిరీస్‌ను 3-2 తేడాతో.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ముగించింది. భారీ అంచనాలతో బరిలోకి.. ఓటములు స్వాగతం పలికాయి వరుస టెస్టు సిరీస్ విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021 ఏడాదిలో ఒక చేదు అనుభవం. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలిసారి నిర్వహించిన డబ్ల్యూటీసీ చాంపిన్‌షిప్ టైటిల్‌ను కివీస్ సొంతం చేసుకుంటే.. దానిని అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓటమి చవిచూసి అభిమానులను తీవ్ర నిరాశకు గురయ్యేలా చేసింది. ఇక టి20 ప్రపంచకప్ 2021 టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఊసురుమనిపించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూడడంతో అభిమానుల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. కనీసం సెమీస్‌కు చేరకుండానే లీగ్ దశలోనే ఇంటిబాట పట్టడంతో టీమిండియా ఆటతీరును.. ఆటగాళ్లను దుమ్మెత్తిపోశారు. టీమిండియా క్రికెట్లో ఈ ప్రపంచకప్ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో ఆధిక్యం.. మళ్లీ ఫామ్‌లోకి డబ్య్లూటీసీ చాంపియన్‌షిప్ చేదు అనుభవాన్ని మైమరిపిస్తూ ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా విజృంభించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లో ఒక డ్రా, రెండు గెలిచిన టీమిండియా 2-1తో స్పష్టమైన ఆధిక్యంలోకి వచ్చింది. చివరి టెస్టును డ్రా చేసుకున్నా చాలు టీమిండియా మరో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించడానికి. అయితే కరోనా కారణంగా ఐదో టెస్టు మ్యాచ్‌ను ఈసీబీ వాయిదా వేసింది. అయితే ఈ టెస్టు వాయిదాపై విభిన్న వాదనలు వినిపించాయి. ఇంగ్లండ్ సిరీస్ ఓటమి నుంచి తప్పించుకునేందుకే ఇలా చేసిందంటూ టీమిండియా ఫ్యాన్స్ గోల చేశారు. అయితే వచ్చే ఏడాది జూన్‌లో ఈ టెస్టు మ్యాచ్‌ను నిర్వహిస్తామని ఈసీబీ తెలపడంతో వివాదం సద్దుమణిగింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో గెలుచుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమికి కివీస్‌పై ప్రతీకారం తీర్చుకొని అభిమానులకు కాస్త ఊరట కలిగించింది. సౌతాఫ్రికా గడ్డపై అపరూప విజయం ఈసారి ఎలాగైనా సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలవాలనే పట్టుదలతో అడుగుపెట్టిన టీమిండియా సెంచూరియన్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బాక్సింగ్ డే టెస్టుగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సౌతాఫ్రికాపై 113 పరుగుల తేడాతో గెలిచి ప్రొటీస్ గడ్డపై నాలుగో విజయాన్ని అందుకుంది. సెంచూరియన్‌లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికాను మట్టికరిపించిన టీమిండియా విజయంతోనే ఏడాదిని ముగించడం విశేషం. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి గెలిచినా.. టీమిండియా కల సాకారమైనట్లే. కోహ్లి కెప్టెన్సీ వివాదం: ప్రశాంతంగా సాగిపోతున్న భారత్ క్రికెట్లో బీసీసీఐ, విరాట్ కోహ్లి మధ్య వివాదం 2021లో పెద్ద సంచలనం. టి20 ప్రపంచకప్ తర్వాత ఆ ఫార్మాట్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో రోహిత్ శర్మకు టి20 బాధ్యతలు అప్పగించింది. అయితే కొన్ని రోజుల తర్వాత వన్డే, టి20లకు వేర్వేరు కెప్టెన్లు ఉండడం మంచిది కాదని బీసీసీఐ అభిప్రాయపడింది. ఈ అంశంమే ఆ తర్వాత వివాదానికి దారి తీసింది. అందుకు అనుగుణంగా కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి రోహిత్‌ను వన్డే సారధిగా నియమించింది. ఈ విషయంలో కోహ్లికి ముందే సమాచారం ఇచ్చామని బీసీసీఐ తెలిపింది. సౌతాఫ్రికా టూర్‌కు బయలుదేరే ఒక్కరోజు ముందు కోహ్లి మీడియా ముందుకు బాంబు పేల్చాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయమై.. బీసీసీఐ తనకు గంటన్నర ముందు చెప్పిందని.. టి20 కెప్టెన్సీ నుంచి దిగిపోవద్దంటూ తననెవరు ఆపలేదని.. గంగూలీ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదంటూ కుండబద్దలు కొట్టాడు. దీంతో కోహ్లి-బీసీసీఐ వివాదం రచ్చగా మారింది. కోహ్లి వివాదంపై గంగూలీ కూడా మాట దాటవేస్తూ.. ఈ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుందని తెలపడం గమనార్హం. ఇంతలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు బయలుదేరడంతో వివాదానికి తాత్కాలిక తెర పడింది. క్రికెట్లో సంచలనాలు, ఆధిపత్యం: ►2021 ఏడాదిలో క్రికెట్లో మరెన్నో సంచలనాలు నమోదయ్యాయి. టి20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా లాంటి చిన్న దేశాలు అద్బుతాలు చేశాయి. ఇక ఆస్ట్రేలియా తొలిసారి పొట్టి ఫార్మాట్లో చాంపియన్‌గా అవతరించగా.. కివీస్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చూపించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో వరుసగా మూడు టెస్టుల్లోనూ విజయాలు అందుకొని 3-0 తేడాతో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ►ఈ ఏడాది టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ సంచలనం సృష్టించాడు. టీమిండియాతో జరిగిన ఒక టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఈ ఘనత ఇంతకముందు ఇద్దరి పేరిట మాత్రమే ఉంది. టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జిమ్ లేఖర్లు మాత్రమే టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పదికి 10 వికెట్లు తీశారు. తాజాగా ఎజాజ్ పటేల్ ఆ ఫీట్‌ను అందుకొని దిగ్గజాల సరసన నిలిచాడు. ఇక క్రికెట్ బతికున్నంతవరకు ఎజాజ్ పటేల్ పేరు చరిత్ర పుటల్లో నిలవడం ఖాయం. ►ఇక ఐపీఎల్ 2020లో చెత్త ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 2021 ఐపీఎల్ సీజన్లో మాత్రం దుమ్మురేపింది. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్లో ధోని సేన 27 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగోసారి ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకుంది. ఓవరాల్‌గా అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టుగా( ముంబై ఇండియన్స్ ఐదుసార్లు తొలిస్థానం) సీఎస్కే రెండో స్థానంలో ఉంది. టోక్యో ఒలింపిక్స్.. ''బంగారు'' నీరజ్ చోప్రా.. భారతావని పులకించినవేళ కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగాయి. కోటి ఆశలతో బరిలోకి దిగిన భారత్.. ఈసారైనా మంచి ప్రదర్శనతో ఎక్కువ పతకాలు కొల్లగొడుతుందా లేక మన పద్దతిలో రెండు లేదా మూడు పతకాలు వస్తాయా అనే భావించారు. దీనికి తగ్గట్టుగానే రోజులు గడుస్తున్నాయి.. భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేసినప్పటికి పసిడి పతకం మాత్రం రాలేదు. ఈసారి కూడా మనవాళ్లు స్వర్ణం లేకుండానే వెనుదిరుగుతారా అని అంతా అనుకున్నారు. కానీ అప్పుడే ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఏ మాత్రం అంచనాలు లేని అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో తొలిసారే ఈటెను ఏకంగా 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణం ఖరారు చేసుకున్నాడు. అతని దరిదాపుల్లోకి కనీసం ఒక్కరు కూడా రాలేకపోవడంతో బంగారు పతకం నీరజ్ చోప్రా వశమైంది. స్వతంత్ర భారతావనికి అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం అందించడే గాకుండా వ్యక్తిగత విభాగంలో రెండో బంగారు పతకం.. అథ్లెటిక్స్‌లో తొలి పతకం సాధించిన నీరజ్ చోప్రా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. అతని విజయంతో 130 కోట్ల భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోయాయి. ఇక ఈసారి ఒలింపిక్స్‌లో ఎలాగైనా స్వర్ణం సాధిస్తాననే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన భారత మహిళ షట్లర్ పీవీ సింధు నిరాశపరిచినప్పటికి.. కాంస్యంతో మురిపించింది. భారత ఒలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు(2016లో రజతం) సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్‌గా సింధు చరిత్ర సృష్టించింది. ఇక వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాభాయి చాను 49 కేజీల విభాగంలో రజతం సాధించి.. కరణం మళ్లీశ్వరీ తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించిన మహిళగా మీరాభాయి చరిత్ర లిఖించింది. మహిళల బాక్సింగ్ 49 కేజీల విభాగంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి కాంస్యం గెలిచిన లవ్లీనా బొర్హంగైన్ అందరికి ఆదర్శంగా నిలిచింది. ఇక రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా రజతం.. భజరంగ్ పూనియా కాంస్యం గెలిచి రెజ్లింగ్‌లో మనకున్న పట్టను రెట్టింపు చేశారు. హాకీలో పూర్వ వైభవం.. ఒకప్పుడు ఒలింపిక్స్‌లో స్వర్ణయుగం చూసిన భారత హాకీ జట్టు ఆట క్రమంగా మసకబారుతూ వచ్చింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం అంచనాలుకు భిన్నంగా టీమిండియా హాకీ పరుషుల జట్టు రాణించింది. ఫైనల్‌కు చేరడంలో విఫలమైనప్పటికి 41 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలిచి హాకికి పునర్వైభవం తెచ్చింది. ఈ విజయంతో భారతీయ అభిమానుల గుండెలు ఉప్పొంగిపోయాయి. ఇక భారత మహిళల హాకీ జట్టు పోరాటం కూడా మరువలేనిది. ఒలింపిక్స్‌లో మహిళల హాకీ విభాగంలో నాలుగోస్థానంలో నిలిచినప్పటికి మన మహిళల పోరాటం అందరికి స్పూర్తిదాయకం. ఇక మొత్తంగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అద్వితీయ ప్రదర్శనతో మెప్పించింది. మొత్తం ఏడు పతకాలతో ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో పోటీలను ముగించడం విశేషం. ఇక టోక్యో వేదికగా జరిగిన పారా ఒలింపిక్స్‌లోనూ భారత పారాఅథ్లెట్లు దుమ్మురేపారు. ఐదు స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఇతర క్రీడల్లో వివాదాలు.. ►క్రికెట్‌లాగే ఇతర క్రీడల్లోనూ వివాదాలు చెలరేగాయి. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో(2008లో కాంస్యం, 2012లో రజతం) పతకాలతో మురిపించిన రెజ్లర్ సుశీల్ కుమార్ హత్యకేసులో ఇరుక్కోవడం సంచలనం రేపింది. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో సుశీల్ నేతృత్వంలో జరిగిన దాడిలో యువ రెజ్లర్ సాగర్ మృతి చెందడం కలకలం రేపింది. హత్య ఆరోపణలతో ప్రస్తుతం సుశీల్ కుమార్ తీహర్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. ►చైనా ప్రభుత్వ మాజీ అధికారి తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి ఆచూకీ కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. ఆమె జాడ కనిపెట్టాలంటూ క్రీడాలోకం గొంతెత్తింది. అయితే కొన్ని రోజులకు తాను సురక్షితంగానే ఉన్నానని.. పెంగ్ షువాయి మాట్లాడిని మాటలను వీడియో రూపంలో చైనా ప్రభుత్వం విడుదల చేయడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దీనిలో నిజమెంత అనేది ఇప్పటికి తెలియరాలేదు. మరోవైపు పెంగ్ షువాయి ఆచూకీ కనిపెట్టాలని.. ఆమె చేసిన ఆరోపణల్లో నిజాలను తేల్చాలంటూ చైనా ప్రభుత్వాన్ని క్రీడాసంఘాలు డిమాండ్ చేశాయి. దీనికి తూడు పెంగ్ షువాయి కేసు విచారణను పారదర్శకంగా నిర్వహించాలఇ డిమాండ్ చేస్తు.. ఆ దేశంతో పాటు హాంకాంగ్‌లో డబ్ల్యూటీఏ(అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య) టోర్నీలను నిలిపివేసింది. విషాదాలు.. ►ప్రతీ ఏడాదిలాగే 2021లోనూ క్రీడల్లో విషాదాలు నెలకొన్నాయి. భారత అథ్లెటిక్స్‌లో చెరగని ముద్ర వేసిన ''ఫ్లయింగ్ సిఖ్'' మిల్కా సింగ్ ఈ ఏడాది జూన్‌లో కన్నుమూశారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో తృటిలో పతకం చేజార్చుకున్న మిల్కా సింగ్ మృతి పట్ల యావత్ దేశం విచారం వ్యక్తం చేసింది. ►1983 వన్డే ప్రపంచకప్ సాధించిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న యశ్పాల్ శర్మ ఈ ఏడాదే కన్నుమూశారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన కాసేపటికే గుండెపోటుకు గురై మరణించారు. టీమిండియా తరపున యశ్పాల్ శర్మ 37 టెస్టులు, 42 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించారు. ►ఇక భారత హాకీ దిగ్గజాలు ఎంకే కౌషిక్, రవీందర్‌పాల్ సింగ్‌లు ఒకేరోజు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆసియా క్రీడల బాక్సింగ్ చాంపియన్ డింకూ సింగ్ కూడా ఈ ఏడాదిలోనే కన్నుమూశారు. 2021లో చోటుచేసుకున్న మరిన్ని ముఖ్య విషయాలు: ►భారత్ మహిళల క్రికెట్‌కు గర్వంగా నిలిచిన మిథాలీ రాజ్ ఈ ఏడాది ఒక గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్ నిలిచింది. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లు కలిపి మిథాలీ రాజ్ 321 మ్యాచ్‌ల్లో 10,454 పరుగులు సాధించింది. ►పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ ఏడాదిలో ఒక సంచలనం నమోదు చేశాడు. ఫుట్‌బాల్ చరిత్రలో అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్ చేసిన జాబితాలో రొనాల్డో తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రొనాల్డో పోర్చుల్ తరపున 184 మ్యాచ్‌ల్లో 115 గోల్స్ చేశాడు. ఇక భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి.. అర్జెంటీనా స్టార్ మెస్సీతో కలిసి 80 అంతర్జాతీయ గోల్స్‌తో ఐదో స్థానంలో నిలవడం విశేషం. ►ఇక బ్యాడ్మింటన్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ అద్భుతం సృష్టించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత షెట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇదే టోర్నీలో లక్ష్యసేన్ కాంస్యం గెలవడం మరో విశేషం. ►జిమ్నాస్టిక్స్‌లో తనదైన ముద్ర వేసిన సిమోన్ బైల్స్ ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మానసిక, ఆరోగ్య సమస్యలతో తప్పుకోవడం సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాత బ్యాలెన్స్ బీమ్‌లో బరిలోకి దిగి కాంస్యం గెలిచింది.. ఇక క్రికెటర్లు బెన్ స్టోక్స్, క్రిస్‌గేల్.. మహిళల టెన్నిస్ స్టార్ నయామి ఓసాకా మానసిక ఒత్తిడితో కొంతకాలం ఆటకు బ్రేక్ తీసుకున్నారు. ►టెన్నిస్‌లో ఈ ఏడాది జకోవిచ్‌కు బాగా కలిసి వచ్చింది. ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లో జకోవిచ్ మూడు టైటిళ్లు సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్,ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌ను సొంతం చేసుకున్న జకోవిచ్ ఆఖరిదైన యూఎస్ ఓపెన్‌లో మాత్రం మెద్వదేవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. -
కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగింది. ఈ పిటిషన్లో తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని పిటిషనర్స్ కోర్టుకు తెలిపారు. ఒమిక్రాన్ కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదన్న పిటిషనర్స్ కోర్టుకు తెలియజేశారు. హైకోర్టు కీలక ఆదేశాలు శుక్రవారం పిటిషన్లను విచారించిన హైకోర్టు ఒమిక్రాన్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21, 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లెన్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ టెస్టులను పెంచడంతో పాటు సరిపడా బెడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో ఒమిట్రాన్ పరిస్థితులపై జనవరి 3 లోపు హైకోర్టుకు సబ్మిట్ చేయాలని కోరింది. తదుపరి విచారణను హైకోర్టు జనవరి 4కి వాయిదా వేసింది. చదవండి: (రెండో ప్రమాద హెచ్చరిక.. మూడో వేవ్ వచ్చేసింది.. ఆ 4 వారాలే కీలకం) -
జస్ట్ ఆ పది మంది సంపాదనే 400 బిలియన్ డాలర్లు!
సంపాదించడం ఎంత కష్టమో.. ఖర్చు పెట్టడం అంత సులువు. ఈ సూత్రం అందిరికీ వర్తించదు. అలాగే క్షణాల్లో కోట్లు సంపాదించి.. అంతే వేగంగా కోటాను కోట్లు పొగొట్టుకున్న వ్యాపార దిగ్గజాలను మన కళ్ల ముందే చూస్తున్నాం. 2021 ముగింపు సందర్భంగా ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన అపర కుబేరుల జాబితాను ఓసారి పరిశీలిద్దాం. ర్యాంకింగ్‌లను పక్కనపెట్టి.. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే వాళ్ల సంపాదనను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈ సంపాదనలో సింహభాగం ఒక్కడిదే కావడం.. ఆ ఒక్కడు ఎలన్ మస్క్ కావడం మరో విశేషం. ఎలన్ మస్క్.. ఆయన సంపాదన 277 బిలియన్ డాలర్లు. ఇందులో ఈ ఏడాది సంపాదించింది అక్షరాల 121 బిలియన్ డాలర్లు. 60 శాతం పెరిగిన టెస్లా షేర్లు, సొంత కంపెనీ స్పేస్ఎక్స్ ఒప్పందాలతో ఈ ఏడాది విపరీతంగా సంపాదించాడీయన. తద్వారా కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. బెర్నార్డ్ ఆర్నాల్ట్.. ఫ్రెంచ్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం సంపద 176 బిలియన్ డాలర్లు. ఇందులో ఈ ఏడాది సంపాదన 61 బిలియన్ డాలర్లు. యూరప్ దేశాల అత్యంత ధనికుడిగా పేరున్న ఈ 72 ఏళ్ల వ్యాపార దిగ్గజం.. ప్రపంచంలోనే లగ్జరీ గూడ్స్ కంపెనీ పేరున్న ఎల్వీఎంహెచ్కు చైర్మన్‌గా, సీఈవోగా కొనసాగుతున్నారు. లారీ పేజ్.. ఈయన కంప్యూటర్ సైంటిస్ట్, గూగుల్ కో-ఫౌండర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్ఫాబెట్ కంపెనీ(గూగుల్ మాతృక సంస్థ)ను ఈ ఏడాది కూడా విజయవంతంగా నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు లారీ పేజ్. ఈ గూగుల్ మాజీ సీఈవో మొత్తం సంపద 130 బిలియన్ డాలర్లు కాగా, కేవలం ఈ ఏడాదిలో 47 బిలియన్ డాలర్ల ఆదాయం(షేర్ల రూపేనా) వెనకేసుకున్నాడు. సెర్గె బ్రిన్.. గూగుల్ మరో సహ వ్యవస్థాపకుడు. ఈ ఏడాది 45 బిలియన్ డాలర్ల సంపాదనతో ఏకంగా 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేశాడు. సెర్గె బ్రిన్(48) మొత్తం సంపాదన 125 బిలియన్ డాలర్లు. ఈయనకు ఆల్ఫాబెట్ కంపెనీలో 38 మిలియన్ షేర్లు ఉన్నాయి. స్టీవ్ బాల్మర్ మైక్రోసాఫ్ట్ కంపెనీ మాజీ సీఈవో. ఎన్బీఏ లాస్ ఏంజెల్స్ క్లిపర్స్ టీం యాజమాని కూడా. తన వ్యాపారంతో పాటు మైక్రో సాప్ట్ కంపెనీ(కంపెనీ లాభాల వల్ల)లో ఉన్న షేర్ల ద్వారా ఈ ఏడాది 41 బిలియన్ డాలర్లు సంపాదించాడు స్టీవ్ బాల్మర్(65). ల్యారీ ఎల్లిసన్ ఒరాకిల్ చైర్మన్, వ్యవస్థాపకుడు ఈయన. సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ఈ నెలలో భారీ ఆదాయం వెనకేసుకుంది ఒరాకిల్ కంపెనీ. దీంతో ఈ 77 ఏళ్ల వ్యాపార దిగ్గజం 29 బిలియన్ డాలర్లు సంపాదించడంతో పాటు 109 బిలియన్ డాలర్ల మొత్తం సంపదతో సెంచరీ బిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మార్క్ జుకర్‌బర్గ్ మెటా కంపెనీ(ఫేస్బుక్) సీఈవోగా ఈ ఏడాది 24 బిలియన్ డాలర్ల సంపాదన వెనకేసుకున్నాడు మార్క్ జుకర్‌బర్గ్. కంపెనీ పేరు మారినా, వివాదాలు వెంటాడినా.. లాభాల పంట మాత్రం ఆగలేదు. మెటాలో ఇతనికి 13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది 20 శాతం పెరిగింది జుకర్‌బర్గ్ సంపద. ఇదిలా ఉంటే ఈ టాప్ 10 లిస్ట్‌లో అత్యంత చిన్నవయస్కుడిగా నిలిచాడు మార్క్ జుకర్‌బర్గ్(37). వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే సీఈవో. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తన సంపదలో సగం సేవా కార్యక్రమాలకు ఇస్తానని ప్రకటించాడు. కానీ, ఈసారి ఈ ప్రకటన వర్కవుట్ కాలేదు. కంపెనీ షేర్ల తీరు ఆశాజనకంగా సాగలేదు. దీంతో కేవలం 21 బిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే వెనకేసుకున్నాడు. 91 ఏళ్ల ఈ వ్యాపార దిగ్గజం మొత్తం సంపద విలువ 109 బిలియన్ డాలర్లుగా ఉంది. బిల్‌గేట్స్ దానాలు చేసుకుంటూ పోతున్నా.. బిల్‌గేట్స్ ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడడం లేదు. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ల రూపంలో బాగానే గిట్టుబాటు అయ్యింది. ఏడు బిలియన్ల డాలర్లు సంపాదనతో.. సంపదను 139 బిలియన్ డాలర్లకు పెంచుకున్నాడు 66 ఏళ్ల గేట్స్. జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్. ఎలన్ మస్క్‌తో పోటాపోటీగా వార్తల్లో నిలిచిన పర్సనాలిటీ. ప్రపంచంలోనే రెండో అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది ఆయన మొత్తం వెనకేసుకుంది కేవలం 5 బిలియన్ డాలర్లు మాత్రమే. 57 ఏళ్ల బెజోస్.. ఈ ఏడాది అమెజాన్ సీఈవో పగ్గాల నుంచి దిగిపోవడంతో పాటు స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ గడిపాడు. ఈ ఏడాది అపర కుబేరుల్లో గట్టి దెబ్బ పడింది ఎవరికంటే.. ఈయనకే!. -సాక్షి, వెబ్ స్పెషల్ -
హ్యాపీ న్యూ ఇయర్: ఇదే మా న్యూ ఇయర్ రిజల్యూషన్..
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు.. ప్రతి ఒక్కరిలో ఏదో నూతన ఉత్సాహం. పాత సంవత్సరంలోని అనుభవాలకు వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాది మరిన్ని ఆనందాలకు వేదికవ్వాలని న్యూ ఇయర్ వేడుకలతో ఆహ్వానిస్తుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. చాపకింద నీరులా వ్యాప్తిస్తున్న ఒమిక్రాన్ ఓ వైపు.. నిర్లక్ష్యం కారణంగా గడిచిన రెండు సంవత్సరాల కాలంలో పెనవేసుకున్న విషాద అనుభవాలు మరో వైపు.. ఈ తరుణంలో ఓపెన్ పార్టీలకు అధికారికంగా వెసులుబాటు లభించినప్పటికీ., పార్టీ అంటే పబ్లేనా? అంటున్నారు కొందరు యువకులు. పాశ్చాత్య పార్టీలకు భిన్నంగా సరి‘కొత్త’గా స్వాగతిస్తామంటున్నారు. ఇదే మా న్యూ ఇయర్ రిజల్యూషన్.. ► ఈ రెండేళ్ల కాలంలో మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కాదు. కరోనాకు ముందు ఆ తర్వాత అనేలా అనడంలో అతిశయోక్తి లేదేమో. విద్య, ఉద్యోగం, వైద్యం, ఆహారం, అలవాట్లు ఇలా అన్నింటిలో మార్పులు ఆమోదించినప్పుడు ఈ పార్టీలకెందుకు మినహాయింపు అంటోంది ఈతరం యువత. ► మంచో చెడో కోవిడ్ వల్ల కుటుంబానికి కాççస్త సమయాన్ని కేటాయించడం అలవాటైంది. ఈసారి 31 వేడుకలు ఫ్యామిలీతోనే అంటున్నారు. జనసంద్రంలా నిండే గోవా బీచ్‌లు, రిసార్ట్లు కాదు పరిమిత మిత్రులతో ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటున్నామని మరికొందరు చెబుతున్నారు. ► ఒమిక్రాన్ ఒక్కటే కారణం కాదు, గత రెండు, మూడు నెలలుగా జరిగిన ప్రమాదాల్లో అధిక శాతం డ్రంకన్ డ్రైవ్వే కావడం విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో సరికొత్త ట్రెండ్‌తో న్యూ ఇయర్ వేడుకలు జరపడమే మా రిజల్యూషన్ అంటోంది ఈతరం. (చదవండి: Happy New Year 2022 Wishes) ఓడితేనే గెలుస్తాం.. కొత్త సంవత్సరం అంటేనే కొత్తగా ఉండాలి. పాత పద్ధతులెందుకు? పార్టీ కల్చర్ అంటే నాకు ఇష్టమే, కానీ అది సామాజికంగా నష్టం కలిగించేదిగా ఉండకూడదు. ఇప్పుడున్న పరిస్థితులు మనకు పరీక్షలాంటివే. కొన్ని సంతోషాలను వద్దనుకుని ఓడిపోతేనే మనం గెలుస్తాం. ఈ సిటీ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికీ వెళ్లదు. మంచి రోజులు వచ్చాక మరింత గ్రాండ్‌గా పార్టీ చేసుకుందాం. ఈసారి కొద్ది మంది మి త్రులతో ఇంటి దగ్గరే కేక్ పార్టీ ప్లాన్ చేసుకున్నాం. – సంతోష్, ఫ్యాషన్ ఔత్సాహికుడు స్టే హోం.. స్టే సేఫ్.. సంతోషాన్ని పంచుకోవడానికి జరుపుకొనేవే పార్టీలైనా, పండగలైనా. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీల పేరుతో జనసమూహాలుగా చేరడం శ్రేయస్కరం కాదు. గత కొంత కాలంగా జన సంచారం పెరిగింది, వేడుకలూ జరుపుకొంటున్నారు. అన్నీ సర్దుకుంటున్న సమయంలో ఎంటర్టైన్మెంట్ పేరుతో విపత్కర పరిస్థితులను కోరుకోవద్దు. కుటుంబంతో జరుపుకొంటే సంబరం కూడా సంతోషపడుతుంది. – అను, సినీనటి సొంతూరుకు పోతాం.. స్నేహితులతో కలిసి డిసెంబర్ 31ని గోవాలాంటి ఇతర ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఒమిక్రాన్ రూపంలో పెను ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈసారి సొంతూరి వెళుతున్నాం. ప్రకృతి ఒడిలో, ఊరి అందాల చెంతన గడిపే ప్రతి క్షణమూ తీయని వేడుకే కదా. – రామ్, క్యూఏ -
New Year: ఈ అర్ధరాత్రి ఈ పాట పాడి చూడండి! ఎంత మజా వస్తుందో!!
ఇంగ్లీష్ మాట్లాడే దేశాలతో సహా అనేక దేశాల్లో ఈ పాటను అర్ధరాత్రివేళ, పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పాడతారు. రాబర్ట్స్ బర్న్స్ అనే కవి 1788లో స్కాట్స్ లాంగ్వేజ్‌లో ఈ పాట రాశాడు. దీనికి ఒక స్కాటీష్ జానపద పాట స్ఫూర్తి. ఈ పాట ఇంగ్లిష్ వెర్షన్ రకరకాల మ్యూజిక్ వెర్షన్లలో డిసెంబర్ మాసం చివరిరోజు అర్ధరాత్రి ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. అందుకే దీనికి ‘కొత్త సంవత్సర జాతీయగీతం’ అని పేరు. దీనిలో కొన్ని చరణాలు... షుడ్ వోల్డ్ అక్వైన్టెన్స్ బి ఫర్గెట్ అండ్ నెవర్ బ్రాట్ టు మైండ్ ఫర్ వోల్డ్ లాంగ్ సైన్ ఫర్ వోల్డ్ లాంగ్ సైన్....మై డీయర్ వి విల్ టేక్ ఏ కప్ ఆఫ్ కైండ్‌నెస్ యెట్ అండ్ ష్యూర్లీ యూ విల్ బై యువర్ కప్ అండ్ ష్యూర్లీ ఐ విల్ బై మైన్ వి టూ హ్యావ్ రన్ ఎరౌండ్ ది స్లోప్స్ అండ్ పిక్డ్ ది డైజీ ఫైన్.... గమనిక స్లోగా, డల్‌గా అనిపించే వెర్షన్లతో పాటు వాద్యాల హోరుతో హుషారెత్తించే వెర్షన్లు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి: చదవండి: ఒళ్లంతా కనిపించేలా ఏంటా పచ్చబొట్లు ! ఇది కరెక్టేనా? -
న్యూ ఇయర్ 2022: క్యాబ్ బుకింగ్ రద్దు చేస్తే జరిమానా..
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో పోలీసులు పరిమితులు, మార్గదర్శకాలను విడుదల చేశారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటో రిక్షా ఆపరేటర్లు యూనిఫాం ధరించి ఉండాలి. అన్ని రకాల వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలి. వాహన డ్రైవర్లు ప్రయాణికుల బుకింగ్‌లను రద్దు చేస్తే . ఈ– చలాన్ రూపంలో రూ.500 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా క్యాబ్, ఆటో బుకింగ్స్‌ను రద్దు చేస్తే సైబరాబాద్ పరిధిలో అయితే 94906 17346, రాచకొండ పరిధిలో అయితే 94906 17111కు వాహనం, సమయం, ప్రాంతం వంటి వివరాలను వాట్సాప్ చేయాలని సూచించారు. ఓఆర్ఆర్పై విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు (విమాన టికెట్‌ను చూపించాలి) మినహా ప్యాసింజర్, తేలికపాటి వాహనాలకు అనుమతి లేదు. మీడియం, గూడ్స్ వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలకు మినహా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ మీదకి ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. చదవండి: (Hyderabad: రాత్రి పది తర్వాత అడుగడుగునా తనిఖీలు) క్లబ్, పబ్ నిర్వాహకులూ బాధ్యులే.. బార్, క్లబ్, పబ్‌లలో మద్యం తాగి వాహనం నడిపి ఏదైనా ప్రమాదాలకు కారణమైతే వాహనదారులతో పాటూ సంబంధిత బార్, క్లబ్, పబ్ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తాగి వాహనం నడిపే బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగం, హారన్, ట్రిపుల్, మల్టీఫుల్ రైడింగ్ వంటి వాటిపై కేసులు నమోదు చేస్తారు. -
Rewind 2021: పడిలేచిన కెరటంలా..
కాలచక్రం గిర్రున తిరిగింది. పాత స్మృతులను చెరిపేసింది. నేటితో క్యాలెండర్లో ఈ ఏడాది మాయమైపోనుంది. ఇప్పటికీ కంటికి కనిపించని మహమ్మారి భయం వెంటాడుతూనే ఉంది. 2020తో పోలిస్తే 2021లో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. అనేక వర్గాలు ఇప్పటికీ క్షామంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ ఆదాయం క్షీణించింది. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. కోవిడ్ కట్టడికి చర్యలు చేపడుతూనే.. మరోవైపు విశాఖ ప్రగతికి బాటలు వేసింది. విశాఖను పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దేందుకు సంకల్పించి 2021లో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పనకు అనేక ప్రణాళికలు రూపొందించింది. గడిచిన ఏడాది కాలంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు సుస్థిర, ప్రశాంత విశాఖ కోసం చేపట్టిన చర్యలు సత్ఫలితానిచ్చాయి. ఈ ఏడాది జిల్లాలో జరిగిన సంక్షేమం.. అభివృద్ధి.. వివిధ సంఘటనలు ఓసారి పరికిస్తే.. – దొండపర్తి(విశాఖ దక్షిణ) జగనన్న అమ్మ ఒడి చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి, ఎంపీ ఎంవీవీ జనవరి ►11వ తేదీన అమ్మ ఒడి పథకం ద్వారా జిల్లాలో 4.1 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున నగదును జమ చేసిన ప్రభుత్వం. ►16వ తేదీన జిల్లాలో ప్రారంభమైన కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం ►20వ తేదీన విశాఖ–భోగాపురం ఆరులైన్ల రహదారి నిర్మాణంలో భాగంగా గోస్తనీ సంగమం వద్ద వంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►21వ తేదీన ఇంటి ముంగిటకే రేషన్ సరకులు అందించేందుకు జిల్లాలో 828 మినీ ట్రక్కులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ►22వ తేదీన స్వచ్ఛ సర్వేక్షణ్–2021లో భాగంగా సిటిజన్ ఫీడ్ బ్యాక్ అంశంలో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకిన విశాఖ ►28వ తేదీన ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు కింద పర్యావరణహితంగా, ప్రజా ప్రయోజనకరంగా బీచ్‌ను తీర్చిదిద్దేందుకు తొలి విడతలో రూ.45.09 కోట్ల నిధులు మంజూరుకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కార్యాలయం నుంచి కూర్మన్నపాలెం వరకు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఫిబ్రవరి ►4వ తేదీన మధురవాడలో అదానికి 130 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ►12వ తేదీన హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వచ్చి తిరిగి ఇంటికి వెళుతున్న తరుణంలో అనంతగిరి ఘాట్ రోడ్డు లోయలో ప్రమాదవశాత్తూ టూరిస్టు బస్సు పడిన ఘటనలో నలుగురు మృతి. ►17వ తేదీన శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విమానాశ్రయంలో స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘ నాయకులతో సుదీర్ఘ భేటీ. ►20వ తేదీన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కార్యాలయం నుంచి కూర్మన్నపాలెం వరకు 25 కిలోమీటర్ల మేర వెల్లువలా తరలివచ్చిన ప్రజానీకంతో కలిసి ఉక్కు పరిశ్రమ పోరాట యాత్ర చేసిన ఎంపీ వి.విజయసాయిరెడ్డి కర్నూలు– విశాఖ విమాన సర్వీస్ ప్రారంభం మార్చి ►14వ తేదీన జీవీఎంసీ ఎన్నికల్లో 58 స్థానాల్లో గెలుపొంది మేయర్ పీఠాన్ని దక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ ►18వ తేదీన నగర మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గొలగాని హరివెంకటకుమారి ►20వ తేదీన జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జి.సృజన ►28వ తేదీన కర్నూలు–విశాఖ విమాన సర్వీసులు ప్రారంభం. ►29వ తేదీన దళిత గిరిజనులకు తిరమలేశుని దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేసిన బస్సులను జెండా ఊపి ప్రారంభించిన శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ ఎంవీవీ, ఎమ్మెల్యేలు ఏప్రిల్ ►3వ తేదీన ప్రత్యేక అధికారుల పాలనకు ముగింపు పలుకుతూ గ్రామాల వారీగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నిరాడంబరంగా పదవీ బాధ్యతల స్వీకరణ ►8వ తేదీన ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్ ►9వ తేదీన తొమ్మిదేళ్ల తర్వాత ఏర్పాటైన జీవీఎంసీ పాలకవర్గం. తొలి సమావేశంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కౌన్సిల్. ►15వ తేదీన మిథిలాపురి వుడా కాలనీలో ఆదిత్య ఫార్చ్యూన్ అపార్టుమెంట్లో అగ్ని ప్రమాదంలో ఎన్ఆర్ఐ కుటుంబంలో భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమారులు అనుమానాస్పద మృతి. ►15వ తేదీన పెందుర్తి మండలం వి.జుత్తాడలో పాత కక్షలతో ఒకే కుటుంబంలోని ఆరుగురిని అత్యంత పాశవికంగా నరికి చంపిన మానవమృగం అప్పలరాజు ►19వ తేదీన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా జిల్లాలో 93,189 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.56.46 కోట్లు తొలి త్రైమాసిక ఫీజు కింద జమ చేసిన ప్రభుత్వం ►20వ తేదీన వీఎంఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు అథారిటీని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ►20వ తేదీన వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద జిల్లాలో 31,187 మంది రైతుల ఖాతాల్లోకి రూ.4.86 కోట్లు వడ్డీ రాయితీ నిధులను జమ చేసిన ప్రభుత్వం ►23వ తేదీన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద జిల్లాలో 72,577 డ్వాక్రా సంఘాల ఖాతాల్లో రూ.66.42 కోట్లు జమ చేసిన ప్రభుత్వం ►28వ తేదీన జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా జిల్లాలో 90,488 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.85.07 కోట్లు జమ చేసిన ప్రభుత్వం హెచ్పీసీఎల్లో జరిగిన ప్రమాదంలో ఎగిసిపడుతున్న మంటలు మే ►13న వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద 3.86 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.289.88 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►14వ తేదీన కోవిడ్ బాధితుల కోసం ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షీలానగర్ ప్రాంతంలో వికాస్ కళాశాలలో ఏర్పాటు చేసిన 300 ఆక్సిజన్ బెడ్ల కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. ►18వ తేదీన వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకంలో భాగంగా జిల్లాలో 22,366 మంది మత్స్యకారుల ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున జమ చేసిన ప్రభుత్వం. ►20వ తేదీన విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం. ►25వ తేదీన మల్కాపురంలోని హెచ్పీసీఎల్లో సీడీ–3 ప్లాంట్‌లో అగ్ని ప్రమాదంతో ఎగసిన మంటలను 8 ఫైర్ ఇంజిన్లతో గంటలో అదుపులోకి తీసుకువచ్చిన యంత్రాంగం. ►25వ తేదీన సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మృతి, ఎనిమిది మంది గల్లంతు. ►25వ తేదీన వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద జిల్లాలో రూ.8.54 కోట్లు పరిహారంగా 14,652 మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం. ►30వ తేదీన హుకుంపేట మండలం తీగలవలస సమీపంలో ఉన్న గుడ్డిగుమ్మి జలపాతంలో ఈతకు వెళ్లి మృతి చెందిన ముగ్గురు యువకులు. ►31వ తేదీన అనకాపల్లిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్నన కాలనీకి శంకుస్థాపన జూన్ ►1న అచ్యుతాపురం సెజ్‌లో అంతర్జాతీయ పరిశ్రమలు సెయింట్ గోబిన్, గోల్డ్‌ప్లస్ ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రణాళికల కమిటీ ఆమోదం. ►3వ తేదీన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలి దశ గృహ నిర్మాణాలు ప్రారంభం. ►4వ తేదీన కథా దిగ్గజం కాళీపట్నం రామారావు(కారా మాస్టారు) మృతి ►8వ తేదీన జగనన్న తోడు రెండో దఫాలో జిల్లాలో 35,186 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.35.19 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►15వ తేదీన వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా జిల్లాలో 33,494 మంది ఆటోడ్రైవర్ల ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున రూ.33.49 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►16వ తేదీన కొయ్యూరు మండలంలో తీగలమెట్ట గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టుల మృతి. ►22వ తేదీన వైఎస్సార్ చేయూత పథకం కింద రెండో దఫాలో జిల్లాలో 1,99,695 మంది మహిళల ఖాతాల్లో రూ.374.42 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►26వ తేదీన నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సతీసమేతంగా విశాఖకు వచ్చిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. ►26వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సంయుక్తంగా 2019–20కు సంబంధించి ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్ అండ్ బయోడైవర్సిటీ విభాగంలో విశాఖ 5 స్టార్ రేటింగ్‌ను చేజిక్కించుకుంది. అనకాపల్లి వద్ద ఫ్లైవోవర్ కూలి ధ్వంసమైన లారీ జూలై ►6వ తేదీన అనకాపల్లి జలగలమదుం వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి కారు, ట్యాంకర్‌పై పడిన ఘటనలో ఇద్దరు దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు. ►17వ తేదీన నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు ప్రాధాన్యం కల్పిస్తూ 11 మందికి పోస్టుల కేటాయింపు. ►22వ తేదీన వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా జిల్లాలో 21,177 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.31.76 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►26వ తేదీన బీచ్ రోడ్డులో విక్టరీ ఎట్ సీ వద్ద కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు నివాళులు అర్పించిన నేవీ అధికారులు, సిబ్బంది. ►27వ తేదీన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ సీపీ ►28వ తేదీన జిల్లా 124వ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున. ►29వ తేదీన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ఫీజురీయింబర్స్‌మెంట్ రెండో విడత కింద ప్రభుత్వం రూ.59.96 కోట్లను 96,403 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ. ►29వ తేదీన వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల పరిశీలనకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ►29వ తేదీన జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో ఐటీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇక్కడి విద్యార్థులు, యువతకు శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో ‘ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్. ►30వ తేదీన జీవీఎంసీ ఎన్నికలో రెండో డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కటుమూరి సతీష్‌కుమార్. ఉక్కు ఉద్యమంలో మేము సైతం అంటున్న చిన్నారులు ఆగస్ట్ ►10వ తేదీన వైఎస్సార్ నేతన్న హస్తం మూడో విడత కింద జిల్లాలో 246 మంది చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.60.96 లక్షలు జమ చేసిన ప్రభుత్వం. ►19వ తేదీన వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అక్కరమాని విజయనిర్మల, నెడ్‌క్యాప్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కె.కె.రాజు ► 24వ తేదీన 20 వేలలోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులు 94,560 ఖాతాల్లోకి రూ.88.29 కోట్లు నగదును జమ చేసిన ప్రభుత్వం. ►29వ తేదీన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 10 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించిన అఖిలపక్షాలు ►30వ తేదీన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న రిలే దీక్షలకు 200 రోజులు పూర్తి. గులాబ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు మునిగిన ఎయిర్‌పోర్టు సెప్టెంబర్ ►3వ తేదీన జిల్లాలో 487 ఎంఎస్ఎంఈల ఖాతాల్లోకి రూ.21.70 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►19వ తేదీన జిల్లా పరిషత్ ఎన్నికల్లో 37 స్థానాలకు గానూ 36 చోట్ల విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు. ►23వ తేదీన యూఎస్‌లో విద్యనభ్యసించాలనే విద్యార్థులకు దిశానిర్ధేశం చేయడంతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్‌ను ప్రారంభించిన అమెరికన్ కాన్సులేట్ జనరల్ రీఫ్‌మన్, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి ►24వ తేదీన విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ఠాకూర్ ►25వ తేదీన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జల్లిపల్లి సుభద్ర. ►27వ తేదీన జిల్లాలో 34.07 సెం.మీ.వర్షపాతంతో బీభత్సం సృష్టించిన గులాబ్ తుపాను ►27వ తేదీన కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనను నిరసిస్తూ రైతు, ప్రజా సంఘాల పిలుపుమేరకు చేపట్టిన భారత్ బంద్ విశాఖలో ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. స్వచ్ఛ వాహనాలు ప్రారంభిస్తున్న ఎంపీ, మంత్రి, నగర మేయర్, తదితరులు అక్టోబర్ ►7వ తేదీన వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండో విడతలో జిల్లాలో 63,991 సంఘాల ఖాతాల్లో రూ.470 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►12వ తేదీన రూ.10.11 కోట్లతో 303 ఖాళీ స్థలాల అభివృద్ధి, పరిరక్షణ పనులకు శంకుస్థాపన చేసిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. ►12వ తేదీన స్వచ్ఛ విశాఖ లక్ష్యంగా నగరంలో చెత్త సేకరణకు 290 వాహనాలను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. ►14వ తేదీన జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ). ►20వ తేదీన ‘జగనన్న తోడు’ పథకంలో భాగంగా జిల్లాలో 31,465 మంది చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ వృత్తుల వారి ఖాతాల్లో రూ.1.09 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►21వ తేదీన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్డులో పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన సీపీ మనీష్‌కుమార్ సిన్హా, డీఐజీ ఎల్.కె.వి.రంగారావు, ఎస్పీ బి.కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు. ►26వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా కింద 3.74 లక్షల మందికి రూ.88.39 కోట్లు, పీఎం కిసాన్ కింద 3.29 లక్షల మందికి రూ.68.85 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి రూ.138.97 లక్షలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం. ►28వ తేదీన విశాఖలో వేద, సంస్కృతి పాఠశాలకు, భీమిలి మండలం అన్నవరంలో 7 స్టార్ లగ్జరీ రిసార్ట్, అదానీ డేటా సెంటర్‌కు 130 ఎకరాల భూములను కేటాయిస్తూ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఆమోదముద్ర. ►30వ తేదీన జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జి.లక్ష్మీ శ. విశాఖ–కిరండూల్ మధ్య విస్టాడోమ్ కోచ్‌తో కూడిన రైలును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నవంబర్ ►8వ తేదీన వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్–2041కు ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వం. ►9వ తేదీన పాతపట్నం ఎమ్మెల్యే కుమార్తె వివాహ రిసెప్షన్ కోసం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ►16వ తేదీన గులాబ్ తుపానుతో పంట నష్టపోయిన 7,684 మంది రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.2.93 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►20వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2021లో తొమ్మిదో ర్యాంక్ సాధించిన విశాఖ. ►21వ తేదీన నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వచ్చిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. ►22వ తేదీన విశాఖపట్నం–కిరండూల్ విస్టాడోమ్ ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. ►25వ తేదీన నీతి ఆయోగ్ వెల్లడించిన పట్టణ సుస్థిరాభివృద్ధి సూచించిన ర్యాంకుల్లో దేశంలో ఉన్న నగరాల్లో 18వ స్థానంలో నిలిచిన విశాఖ. ►25వ తేదీన ఎండాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన త్రీ టౌన్ సీఐ ఈశ్వరరావు ►26వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి. ►29వ తేదీన కార్తీక మాసం సందర్భంగా ఆర్కే బీచ్‌లో కార్తీకమాస దిపోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను సత్కరిస్తున్న శంకరమఠం నిర్వాహకులు డిసెంబర్ ►16వ తేదీన తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులైన సంజయ్ వాత్సాయన్. ►16వ తేదీన విశాఖ పర్యటనకు వచ్చిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ►17వ తేదీన నగరంలో రూ.247.32 కోట్లతో నిర్మించిన 12 ప్రాజెక్టులను ప్రారంభించిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. ►21వ తేదీన పోర్టు స్టేడియంలో వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. ►21వ తేదీన జిల్లాలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ►25వ తేదీన అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దిన వీఎంఆర్డీఏ పార్కులోకి సందర్శకులకు అనుమతించిన వీఎంఆర్డీఏ అధికారులు -
Hyderabad: రాత్రి పది తర్వాత అడుగడుగునా తనిఖీలు
సాక్షి, బంజారాహిల్స్: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పబ్‌లు, క్లబ్‌లు, హోటళ్లలో మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తథ్యమని నగర పోలీస్ కమిషనర్ మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. పబ్‌లు, క్లబ్‌లకు పేరెన్నికగన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లతో పాటు ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌పరిధిలో కూడా శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత అడుగడుగునా వాహనాల తనిఖీలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్క జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే తొమ్మిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. బంజారాహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు వేర్వేరు చోట్ల తనిఖీలు జరగనున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే ఆరు నెలల జైలుతో పాటు రూ. 10 వేల జరిమానా విధించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నారు. చదవండి: (New Year Celebrations: ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు) -
New Year Celebrations: ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యామ్నాయం లేని బేగంపేట ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్నింటిని శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూసేస్తున్నారు. ►ట్యాంక్ బండ్‌పై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శుక్రవారం రాత్రి 10 నుంచి శనివారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ►సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. వీవీ స్టాచ్యూ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజ్ భవన్ మీదుగా మళ్లిస్తారు. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ట్రాఫిక్ని ఇక్బాల్ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ వైపు పంపుతారు. ►లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ని జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. ►ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్ లైన్ మీదుగా పంపుతారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్ పైకి పంపరు. వీటిని కర్బాలా మైదాన్, మినిస్టర్స్ రోడ్ మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు. -
ఈ సంవత్సరం ఏం చేసింది?.. వీరిని స్ఫూర్తిదాతలుగా నిలిపింది..
2021 సంవత్సరం ఏం చేసింది? చెప్పులు లేని ఒక మహిళను పార్లమెంటులో సగౌరవంగా నడిపించింది. భుజానికి మందుల సంచి తగిలించుకుని తిరిగే సామాన్య ఆరోగ్య కార్యకర్తను ‘ఫోర్బ్స్’ పత్రిక ఎంచేలా చేసింది. ఈ సంవత్సరం ఒక తెలుగు అమ్మాయిని అంతరిక్షాన్ని చుంబించేలా చేసింది. ఈ సంవత్సరం ఒక దివ్యాంగురాలికి ఒలింపిక్స్ పతకాలను మెడ హారాలుగా మలిచింది. ఈ సంవత్సరం భారత సౌందర్యానికి విశ్వకిరీటపు మెరుపులు అద్దింది. ఈ సంవత్సరం దేశ మహిళ జాతీయంగా అంతర్జాతీయంగా తానొక చెదరని శక్తినని మరోమారు నిరూపించుకునే అవకాశం ఇచ్చింది. 2021 మెరుపులు ఎన్నో. కాని 2022లో ఈ శక్తి మరింత ప్రచండమై స్ఫూర్తిని ఇవ్వాలని.. కీర్తిని పెంచాలని కోరుకుందాం. కరోనా వారియర్! మెటిల్డా కుల్లు (45) ► అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కోవిడ్‌పైనా, ఆరోగ్య విషయాలపైన విస్తృతంగా అవగాహన కల్పించింది మెటిల్డా కుల్లు. దానికిగాను ఆమెకు ‘‘ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్–2021’’ గుర్తింపు లభించింది. ► భుజానికో చిన్న చేతి సంచి, కాలి కింద సైకిల్ పెడల్, గుండెనిండా సంకల్పం, సంచి నిండా ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రింటింగ్ మెటీరియల్‌తో బయలుదేరింది ఒడిశా సుందర్ఘర్ జిల్లాలోని గర్గద్బహాల్ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ మెటిల్డా కుల్లు. కరోనా మహమ్మారి అంటేనే ప్రపంచమంతా గడగడలాడుతున్న సమయమిది. ఇంతటి క్లిష్టమైన తరుణంలోనూ ఎంతో భరోసా ఇస్తూ కోవిడ్ కిట్లూ, ఇతర సామగ్రితో కొండాకోనల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైకిల్‌పై ఇంటింటికీ తిరిగింది. అసలే వెనకబడిన ఖారియా అనే ఓ గిరిజన తెగకు చెందిన మహిళ. చుట్టూ ఆమె మాటలు లెక్కచేయని కులతత్వాలూ, ఆధునిక వైద్యాన్ని నమ్మని చేతబడులూ, మంత్రతంత్రాలను నమ్మే ప్రజలు. ఈ నేపథ్యంలో పడరానిపాట్లు పడుతూ, మూఢనమ్మకాలను నమ్మవద్దంటూ నచ్చజెప్పింది. ► కేవలం కోవిడ్పైనేగాక... మలేరియా గురించి, గిరిజన తండాల్లోని మహిళలకు పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత గురించి చెప్పింది. అంగన్వాడీ మహిళలతో కలిసి కుటుంబనియంత్రణ అవసరాల గురించి బోధించి, ఎరుకపరచింది. అత్యంత దుర్గమ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ కనీసం తినడానికి తిండి లేక మలమలమాడిపోయినా తన లక్ష్యాన్ని విడువలేదు. తాను చికిత్స అందించాల్సిన 250 ఇళ్లలోని 964 మందిలో ప్రతి ఒక్కరికీ వైద్య సహాయాన్ని అందించింది. ఇలా అత్యంత వెనకబడిన ప్రాంతాల్లోని సమూహాలను ప్రభావితం చేసినందుకు భారత్‌లోని అత్యంత శక్తిమంతమైన, ప్రభావపూర్వకమైన 21 మంది మహిళల్లో తానూ ఒకరంటూ ‘‘ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్–2021’’ గుర్తించేలా పేరుతెచ్చుకుంది. మరెందరికో స్ఫూర్తిమంతంగా నిలిచింది. ఫైటర్ అండ్ షూటర్! అవనీ లేఖరా (20 ) ► పారా ఒలింపిక్ క్రీడల్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా ప్రతిష్ఠ సాధించింది. అంతేకాదు మహిళల పది మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో ప్రపంచ నంబర్ 2 క్రీడాకారిణిగా నిలిచింది. ► అవని లేఖరా తన పదకొండవ ఏట ఓ కారు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో ‘పారాప్లీజియా’ అనే మెడికల్ కండిషన్‌కు లోనైంది. ఫలితంగా ఓ వైపు దేహమంతా చచ్చుబడిపోయింది. అయినా ఏమాత్రం నిరాశ పడలేదు. ఏదైనా క్రీడను ఎంచుకుని రాణించాలంటూ తండ్రి ప్రోత్సహించారు. దాంతో అభినవ్ భింద్రా నుంచి స్ఫూర్తి పొంది తానూ ఓ షూటర్‌గా రాణించాలనుకుంది. సుమా శిశిర్ అనే కోచ్ నేతృత్వంలో తన 15వ ఏట ఎయిర్ రైఫిల్ షూటింగ్లో శిక్షణ పొందడం ప్రారంభించింది. ఈ ఏడాది జరిగిన పారా ఒలింపిక్ క్రీడల్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు... ఒకే పారా ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు పొందిన తొలి మహిళగానూ రికార్డులకెక్కింది. పది మీటర్ల రైఫిల్ విభాగంలో బంగారు పతకంతో పాటు 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. దేశ కీర్తిపతాకను సగర్వంగా నిలిపిన అవని ప్రస్తుతం అసిస్టెంట్ ఫారెస్ట్ కన్సర్వేటర్ (ఏసీఎఫ్)గా పనిచేస్తోంది. ‘బ్యూటీ’ఫుల్ విజయం ఫాల్గుణి నాయర్ (58) ► మల్టీ–బ్రాండ్ బ్యూటీ రిటైలర్ ‘నైకా’ వ్యవస్థాపకురాలు. ► సరైన శిక్షణ, చదువు, మద్దతు ఉంటే మహిళలు ఎంత ఎత్తుకైనా చేరుకోగలరు, దేనినైనా సాధించగలరు అనడానికి నిలువెత్తు నిదర్శనం. అత్యంత తక్కువ మొత్తంతో ప్రారంభించిన సౌందర్య ఉత్పత్తుల సామ్రాజ్యం నైకా ఆమెను దేశంలోని తొలి 20 మంది సంపన్నుల జాబితాలో నిలిపింది. ► తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకొని ఎదిగిన మహిళగా పేరున్న ఫాల్గుణి నాయర్ గుజరాతీ కుటుంబంలో పుట్టి పెరిగిన ముంబయ్వాసి. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కోటక్ మహింద్ర గ్రూప్‌లో 20 ఏళ్లు పనిచేసిన అనుభవం ఆమెది. ఆ తర్వాత సేవింగ్ మనీ బిజినెస్‌కు సంబంధించిన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2012లో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ‘నైకా’ పేరుతో సౌందర్య ఉత్పత్తుల కంపెనీని ప్రారంభించింది. మేకప్ పట్ల ఉన్న ప్రేమతో ఆమె ఎంచుకున్న ఈ వ్యాపార మార్గం భారతదేశంలో ఆన్లైన్ మార్కెట్‌కు కొత్త ఒరవడిని సృష్టించింది. ► ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన ఫాల్గుణి నాయర్ వారు ఎదిగి, పైచదువుల కోసం అమెరికా వెళ్లాక ఉన్న ఖాళీ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నారు. ‘నేను మంచి స్విమ్మర్‌ను కాదు. కానీ, ముందు దూకేస్తాను. ఆ సమయంలో కాలో చెయ్యో విరిగితే ఎలా? అనే ఆలోచనే నాకు రాదు’ అంటూ చిరునవ్వులు చిందిస్తారు. ఆమె విజయంతో పోల్చుతూ ఇతర మహిళల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే – ‘మహిళలు సాఫ్ట్ స్కిల్స్‌తో పాటు అవసరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, అవసరమైన సమాచారాన్ని పొందడంతో పాటు, రిస్క్ తీసుకునే సామర్థ్యం కూడా పెంచుకోవాలి. అప్పుడు ఎంతటి ఎల్తైన శిఖరాలైనా అవలీలగా అధిరోహిస్తారు’ అంటారు ఫాల్గుణి. కేవలం ఎనిమిదేళ్లలో సాధించిన ఆమె వ్యాపార ఘనత గురించి అంతర్జాతీయంగానూ అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తింపు పొందారు. ‘మిస్’ కిరీటం మానసా వారణాసి (24) ► ఫెమినా నిర్వహించిన అందాల పోటీల్లో గెలిచిన ‘మిస్ ఇండియా (వరల్డ్) 2020 పెజంట్’ కిరీటధారి. రాబోయే ఏడాది ప్యూయెర్టో దీవిలోని సాన్ జాన్ నగరంలో జరిగే ‘మిస్ వరల్డ్ 2021 పెజెంట్’లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. (కరోనా కారణంగా ఈ పోటీల నిర్వహణ ఆలస్యమైంది). ► ఈ తెలుగమ్మాయి హైదరాబాద్‌లో పుట్టింది, మలేసియాలో పెరిగింది. కాలేజ్ చదువుకి తిరిగి హైదరాబాద్ వచ్చిన మానస కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేసి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్సే్ఛంజ్ ఎనలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. సంగీతం, డాన్స్, యోగా సాధన, మోడలింగ్ ఆమె హాబీలు. అందాల పోటీల మీద ఆమెకు కాలేజ్ రోజుల్లోనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో ‘మిస్ ఫ్రెషర్’ టైటిల్ కైవసం చేసుకుంది. ఫెమినా ‘మిస్ ఇండియా’ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబయిలో జరిగిన పోటీల్లో మానసా వారణాసి విజయం సాధించి ‘మిస్ ఇండియా వరల్డ్ 2020’ అందాల కిరీటానికి తలవంచింది. ఈ పోటీల్లో జరిగిన అనేక ఈవెంట్లలో ఆమె ‘మిస్ ర్యాంప్‌వాక్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ► అందాల పోటీ విజేతలు నిర్వర్తించాల్సిన సామాజిక బాధ్యతల్లో భాగంగా మానసా వారణాసి పిల్లల రక్షణ చట్టాల పటిష్టత కోసం పని చేయనుంది. ఇందులో భాగంగా ‘వియ్ కెన్’ పేరుతో పిల్లల మీద లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేసే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలి తెలుగు వాణిజ్య వ్యోమగామి బండ్ల శిరీష (34) ► ఇండియన్ అమెరికన్ ఏరోనాటికల్ ఇంజినీర్. వాణిజ్య వ్యోమగామి. వర్జిన్ గెలాక్టిక్ అధినేతతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లిన తెలుగు సంతతి అమ్మాయి. అంతరిక్ష రేఖ దాటిన రాకేష్‌శర్మ, కల్పనా చావ్లా, సునితా విలియమ్స్ తర్వాత నాల్గవ భారతీయురాలుగా బండ్ల శిరీష గుర్తింపు పొందారు. ► గుంటూరు జిల్లాలో పుట్టిన శిరీష ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని హ్యూస్టన్ వెళ్లి, అక్కడే చదువు పూర్తి చేశారు. అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. నాసా వ్యోమగామి కావాలనుకున్నా, కంటిచూపులో వైద్యపరమైన కారణాలతో తన ఆశకు దూరమైంది. 2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో చేరి, అందులో ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. జూలై 2021 ఆదివారం నాడు బండ్ల శీరిష వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ 22 టెస్ట్ ఫై్టట్లో ఆరుగురు సభ్యుల బృందంతో కలిసి అంతరిక్షయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు. దీనితో శిరీష ‘ఫెడరల్ ఏవిషయన్ అథారిటీ’ స్పేస్ టూరిస్ట్ జాబితాలో నిలిచారు. అంతరిక్షంలో విజయ కేతనం స్వాతి మోహన్ (38) ► భారత సంతతికి చెందిన అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్ స్వాతి మోహన్. నాసా ప్రయోగించిన రోవర్‌ని మార్స్పైన విజయవంతంగా ల్యాండ్ చేయడంలో మిషన్ గైడెన్స్, కంట్రోల్స్ ఆపరేషన్స్ లీడర్‌గా సమర్థంగా నిర్వహించారు. ► బెంగుళూరులో పుట్టిన స్వాతి ఏడాది వయసులోనే ఆమె తల్లిదండ్రులతో అమెరికా వెళ్లారు. స్వాతి 9వ యేట టీవీలో స్టార్ ట్రెక్ చూసి, అంతరిక్షంపై ఎనలేని ఆసక్తి చూపించారు. పిల్లల డాక్టర్ కావాలనుకుని 16 ఏళ్ల వయసులో ఫిజిక్స్‌ను ఎంచుకున్నా, ఆ తర్వాత అంతరిక్ష పరిశోధనే వృత్తిగా కొనసాగించడానికి మార్గమైన ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నారు. మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి పూర్తి చేయడానికి ముందు కార్నెల్ విశ్వవిద్యాలయంలో మెకానికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ► ప్రొఫెసర్ డేవ్ మిల్లర్‌తో కలిసి స్పేస్ సిస్టమ్స్ లాబొరేటరీలో ఆన్–ఆర్బిట్ కార్యకలాపాలపై విస్తృత పరిశోధనలు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అనేక పరీక్షలను నిర్వహించారు. పూర్వ విద్యార్థుల వ్యోమగాములతోనూ, ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం స్పేర్స్ జీరో రోబోటిక్స్ పోటీలో కూడా పనిచేశారు. కాలిఫోర్నియాలోని పసాదేనాలో నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో పనిచేస్తున్నారు స్వాతిమోహన్. 2013లో రోవర్‌ను మోసుకెళ్లే అంతరిక్ష నౌక అంగారక గ్రహానికి ప్రయాణించేటప్పుడు, గ్రహం ఉపరితలంపై ల్యాండింగ్ చేసేటప్పుడు సరైన దిశలో ఉండేలా చూసుకునే బాధ్యతను పోషించారు. ఫిబ్రవరి 18, 2021న అంగారకుడిపై పెర్సెవెరెన్స్ రోవర్ ల్యాండ్ అయినప్పుడు మిషన్‌ను కంట్రోల్ నుంచి ల్యాండింగ్ ఈవెంట్లను వివరించారు. ఆమె ‘టచ్ డౌన్ కన్ఫర్మ్’ అని ప్రకటించగానే జెపిఎల్ మిషన్ కంట్రోల్ సెంటర్లో సంబరాలు మిన్నంటాయి. చప్పట్ల హోరుతో ఆమెకు అభినందనలు తెలిపారు. గతంలో, స్వాతి మోహన్ శని గ్రహానికి సంబంధించిన కాస్సిని మిషన్‌లో పనిచేశారు. అలాగే చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రాన్ని మ్యాప్ చేయడంలో అంతరిక్ష నౌక గ్రెయిల్కు బాధ్యత వహించారు. నడిచే వన దేవత తులసీ గౌడ (72) ► కర్ణాటకలోని హలక్కీ తెగకు చెందిన గిరిజన మహిళ తులసీ గౌడను దేశంలో నాలుగో అత్యున్నత పురస్కారమైన ‘పద్మశీ’ వరించింది. తులసీ గౌడ పెద్ద చదువులు చదువుకోలేదు. ఆ మాటకొస్తే బడి చదువు కూడా పూర్తి చేయలేదు. అయితేనేం, నడిచే వనదేవతగా, ఔషధ మొక్కలు, భిన్నమైన జాతుల గురించి విశేషమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా పేరు పొందారు. ► పేదవాళ్లయిన ఆమె తల్లిదండ్రులు కనీసం పెళ్లి చేసి ఓ అయ్య చే తిలో పెడితే అయినా కడుపునిండా అన్నం తినగలదనే ఉద్దేశంతో పదకొండేళ్ల్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. పెళ్లయిన కొద్దికాలానికే ఆమె భర్త మరణించాడు. తన జీవితంలో చీకట్లు కమ్మినందుకు కుంగిపోకుండా ఆమె 12 ఏళ్ల వయస్సున్నప్పటి నుంచే మొక్కలు నాటడం ప్రారంభించారు. అటవీశాఖలో టెంపరరీ వాలంటీర్‌గా చేరింది. ప్రకృతిపై ఆమెకున్న అంకితభావమే ఆ తర్వాత అదే డిపార్ట్మెంట్లో ఆమె ఉద్యోగాన్ని సుస్థిరం చేసింది. ఏకంగా 40 వేల వృక్షాలతో వనసామ్రాజ్యాన్నే నెలకొల్పిందామె. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన ఈ సేవే.. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకునేందుకు తోడ్పడింది. ► ఈ వయసులోనూ తులసి ఏ మాత్రం అలసట చెందకుండా మొక్కలు నాటుతారు. నీళ్లు పోసి కన్నబిడ్డలా వాటిని పెంచుతారు. తనకొచ్చే పింఛను మొత్తాన్ని కూడా ఇందుకే ఖర్చు చేస్తున్నారామె. టేకు మొక్కల పెంపకంతో మొదలైన ఆమె ప్రస్థానం పనస, నంది, ఇంకా పెద్ద వృక్షాలు పెంచే వరకూ వెళ్లింది. కేవలం మొక్క నాటితేనే సంతృప్తి రాదు.. అది కొత్త చివుళ్లు పెట్టి శాఖోపశాఖలుగా విస్తరించి మానుగా మారితేనే ఆనందం అని చెప్పే తులసి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం. ‘యూపీఎస్సీ’లో రెండో స్థానం జాగృతి అవస్థి (24) ► యూపీఎస్సీ పరీక్షల్లో దేశంలోనే రెండో ర్యాంకర్‌గా నిలిచింది. ఇక మహిళల్లోనైతే ఆమెదే ఫస్ట్ ర్యాంక్. ► భోపాల్‌కు చెందిన 24 ఏళ్ల జాగృతి అవస్థి ఓ సాధారణ మధ్యతరగతి మహిళ. తండ్రి ప్రభుత్వ హోమియో మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్. తల్లి మధులత సాధారణ గృహిణి. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మానిట్) నుంచి 2017లో ఇంజనీరింగ్ పూర్తిచేసింది జాగృతి. ప్రతిష్ఠాత్మకమైన ‘గేట్’ పరీక్షలోనూ మంచి ర్యాంక్ సాధించింది. తొలుత బీహెచ్ఈఎల్ (భోపాల్)లో ఇంజనీర్‌గా చేరింది. రెండేళ్లపాటు పనిచేశాక యూపీఎస్ఈ పరీక్షల కోసం పూర్తికాలం కేటాయించాలకుంది. మొదట్లో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుందామని అనుకుంది. కానీ కరోనా కారణంగా ఇంటి దగ్గరే శ్రద్ధగా చదివింది. తల్లిదండ్రులూ ఎంతగానో ప్రోత్సహించారు. దేశానికి ఎలాంటి సేవలందిస్తావంటూ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ... ‘మన దేశం పల్లెపట్టులకు నెలవైన ప్రదేశం. అందుకే గ్రామీణాభివృద్ధే తన లక్ష్యం’ అంటూ వినమ్రంగా చెప్పింది జాగృతి. గర్జించిన కంఠం స్నేహా దూబే (28) ► ఘనత: ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శి. ‘ఐరాస’ వేదికపై ‘పాక్’పై నిప్పులు కురిపించి దీటైన జవాబు చెప్పడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ► కొన్నిసార్లు ‘మాటలు’ కూడా తూటాల కంటే శక్తిమంతంగా పేలుతాయని అంతర్జాతీయ వేదికగా నిరూపించింది స్నేహా దూబే. ► ‘ఉగ్రవాద బాధిత దేశం మాది అని చెప్పుకుంటున్న పాకిస్థాన్ మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది. తన ఇంటికి తానే నిప్పు పెట్టుకొని ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తోంది’ అంటూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ)లో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ► ‘పాక్’ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన ఆమె మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ‘ఎవరీ స్నేహ?’ అని ఆరా తీసేలా చేశాయి. ► గోవాలో పుట్టిన స్నేహ అక్కడ పాఠశాల విద్య, పుణేలో కాలేజి విద్య పూర్తి చేసింది. దిల్లీ జేఎన్‌యూ, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీ నుంచి ఎంఫిల్ పట్టా తీసుకుంది. 2012 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఆఫీసర్ అయిన స్నేహా దూబే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి (యూఎన్)లో భారతదేశం మొదటి కార్యదర్శి. ► పన్నెండు సంవత్సరాల వయసులో సివిల్ సర్వీస్ గురించి గొప్పగా విన్నది స్నేహ. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, ప్రపంచంలోని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే తనకు మొదటి నుంచి ఆసక్తి. ఈ ఆసక్తే తనను ‘ఐఎఫ్ఎస్’ను ఎంచుకునేలా చేసింది. ఏ సివిల్స్ పరీక్షలు పూరై్త, ఇంటర్వ్యూకు వెళ్లే ముందు, ఇంట్లోని అద్దం ముందు నిల్చొని గట్టిగా మాట్లాడుతూ బాడీలాంగ్వేజ్‌ను పరిశీలించుకుంటూ తనలోని బెరుకును పోగొట్టుకున్నది స్నేహ. విశ్వ సౌందర్యం హర్నాజ్ కౌర్ సంధూ (21) ► రెండు దశాబ్దాల తర్వాత మన దేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించిన అందాల యువతి. ► ఇజ్రాయెల్‌లోని ఇల్లియాట్‌లో డిసెంబర్ 14న జరిగిన 70వ అందాల పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధూ మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె కంటే ముందు లారా దత్తా 2000వ సంవత్సరంలో ఈ టైటిల్‌ను అందుకోగా, తిరిగి 21 ఏళ్ల తర్వాత çహర్నాజ్ కౌర్ సంధూను వరించింది. ► పంజాబ్ ప్రాంతానికి చెందిన హర్నాజ్ కౌర్ సంధూ తనకెంతో ఇష్టమైన మోడలింగ్‌లో రాణించడంతోపాటు పలు పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. మిస్ యూనివర్స్ టైటిల్ కన్నా ముందు ఆమె మిస్ దివా 2021 కిరీటాన్ని గెలుచుకుంది. గతంలో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఫెమినా మిస్ ఇండియా 2019లో సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ► మార్చి 3, 2000 చంఢీగఢ్‌లో జన్మించిన సంధూ శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. ► ఐదడుగుల తొమ్మిందంగుళాల పొడవున్న సంధూ, మానసిక సౌందర్యంలోనూ మిన్న అని నిరూపించుకుని ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన విశ్వసుందరి పోటీలో విజయం సాధించింది. View this post on Instagram A post shared by Miss Universe (@missuniverse) -
డిసెంబర్ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో..
You can enjoy your New Year's eve in these best possible ways కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు చివరి రోజు కూడా వచ్చేసింది. ఐతే న్యూ ఇయర్ రోజును ఎలా జరుపుకోవాలబ్బా? అని ప్రతి ఒక్కరూ బుర్రలు గోక్కుంటున్నారు కదా! మీ కోసం మా దగ్గర కొన్ని ఐడియాలున్నాయి. అవేంటంటే.. హౌస్ పార్టీ మీ ఇంటి టెర్రస్ పై కానీ, ఇంట్లోనైనా సరే స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదా సరదాగా చేసుకోవచ్చు. టెర్రస్ పై ప్లాన్ చేస్తే చలి కాలం కాబట్టి చలిమంట వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఇష్టమొచ్చినంత సమయం ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేస్తారా మరి? టాప్ రేటెడ్ హోటల్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పార్టీ ఇది. ఐతే స్పెషల్ అకేషన్‌ను ఇంకా స్పెషల్‌గా జరుగుకోవాలనే వారికోసం న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. లగ్జరియస్ డ్రింక్స్, ఫుడ్స్‌తోపాటు డీజే మ్యూజిక్ కూడా ఉంటుంది. మీ నూతన సంవత్సరాన్ని రాయల్‌గా ప్రారంభించాలనుకునే వారు ముందుగా ఇటువంటి హోటల్స్‌లో టేబుల్‌ను బుక్ చేసుకుంటే సరి. పార్టీ ప్లాన్ రెడీ అయిపోయినట్టే! రెస్టారెంట్ ట్రీట్ భోజన ప్రియులకు ఇది బెస్ట్ ఐడియా. న్యూ ఇయర్ సందర్భంగా చాలా రెస్టారెంట్లు బఫే డిన్నర్లు ఏర్పాటు చేస్తున్నాయి. బఫెట్ డిన్నర్లో రకరకాల డిసర్ట్ను మీ ప్లేట్ సర్దేసుకుని మీ నోటిని తీపి చేసుకోవడం ద్వారా నూతన సంవత్సరంలోకి తియ్యతియ్యగా అడుగుపెట్టవచ్చు. ఐతే టేబుల్ ముందే బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండే! లాంగ్ డ్రైవ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఇది కూడా మంచి ఐడియానే. సొంత వెహికల్లో, ఆహ్లాదకరమైన మ్యూజిక్ వింటూ, మీకిష్టమైన వారితో అలా.. లాంగ్ డ్రైవ్ కెళ్లారంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా! ఐతే ఇద్దరు, ముగ్గురు సన్నిహితులతోనే ఇలా ప్లాన్ చేస్తేనే బాగుంటుంది సుమా! బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు స్నేహితులు లేదా బంధువులతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలనుకునే వారు ఓపెన్ ప్లేస్ (బహిరంగ ప్రదేశాలకు)లకు వెళ్లడం ఉత్తమం. మ్యూజిక్ ఎంత సౌండ్‌తో విన్నా మిమ్మల్ని వారించేవారెవ్వరూ ఉండరు. లగ్జరీ డెకరేషన్, లైట్ల వెలుగులో సన్నిహితులతో నూతన సంవత్సర వేడుకలను ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఐడియా. బార్బెక్యూ డిన్నర్ కూడా మంచి ఎంపికే. పై మార్గాల్లో మీకు నచ్చిన ఐడియాని ఫాలో అవ్వండి. చెప్పనలవి కానంత ఆనందాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టండి. ఐతే గత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు! చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
2021లో వచ్చిన సేఫెస్ట్ కార్స్ ఇవేనండోయ్..!
2021లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పదుల సంఖ్యలో కొత్త కార్లను రిలీజ్ చేశాయి. వాటిలో కొన్ని మాత్రమే అత్యంత భద్రత కల్గిన కార్లుగా నిలిచాయి. ఒక కారు ఆయా వాహనదారుడుకి ఇచ్చే భద్రతను గ్లోబల్ ఎన్సీఏపీ (న్యూకార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్) నిర్ణయిస్తోంది. పలు కార్లను రకరకాల పరీక్షలను నిర్వహించి, ప్రమాద సమయంలో ఆయా కారులో ప్రయాణించే వ్యక్తుల భద్రతను గురించి ఎన్‌సీఎపీ రేటింగ్స్‌ను ఇస్తోంది. 2014 నుంచి ఫోక్స్‌వ్యాగన్ పోలో, మారుతి సుజుకీ బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ300, టయోటా ఎటియోస్, టాటా నెక్సాన్ వంటి కార్లు ఎన్‌సీఎపీ రేటింగ్‌లో 4-5 రేటింగ్ స్టార్లను పొందాయి. ఈ ఏడాదిలో వచ్చిన కార్లలో కొన్ని మాత్రమే ఎక్కువ ఎన్సీఏపీ రేటింగ్‌ను పొందాయి. 1. టాటా పంచ్-మైక్రో ఎస్యూవీ భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ లాంచ్ చేసిన ‘టాటా పంచ్-మైక్రో ఎస్యూవీ’ ఎన్‌సీఎపీ టెస్ట్‌లో ఎక్కువ రేటింగ్‌ను సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో టాటా పంచ్ 17.00గాను 16.45 స్కోర్‌ను; చిల్డ్రన్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49.00 గాను 40.89 స్కోర్‌ను సాధించింది. ఈ ఎస్యూవీను సుమారు 64km/hr వేగంతో పరీక్షించారు. ఓవరాల్ చూసుకుంటే 5 స్టార్స్ అడల్ట్ ప్రోటెక్షన్లో, 4 స్టార్ చిల్డ్రన్ ప్రొటెక్షన్‌లో రేటింగ్‌ను సాధించింది. 2. మహీంద్రా ఎక్స్‌యూవీ700 స్వల్ప తేడాతో టాటా పంచ్ తరువాత మహీంద్రా ఎక్స్‌యూవీ 700 సేఫెస్ట్ కారుగా నిలిచింది. చిల్డ్రన్ అక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49.00గాను 41.66 స్కోర్‌ను, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 17.00 గాను 16.03 సాధించింది. ఓవరాల్ చూసుకుంటే 5 స్టార్స్‌కు సుమారుగా 5 స్టార్ రేటింగ్‌ను ఇది సాధించింది. 3. టాటా టిగోర్ ఈవీ ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే, టాటా టిగోర్ ఈవీ గ్లోబల్ ఎన్‌సీఎపీ ఎక్కువ స్కోర్‌ను సాధించింది. అడల్ట్ అక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో17.00 గాను 12.00 స్కోర్‌ను పొందగా, పిల్లల భద్రత విషయంలో 49.00 గాను 37.24 సాధించింది. ఓవరాల్ చూసుకుంటే 5 స్టార్స్‌కు 4 స్టార్ రేటింగ్‌ను ఇది సాధించింది. ఇక్కడ హై ఎండ్ లగ్జరీ కార్ల గురించి చర్చించలేదు. ఎందుకంటే #SaferCarsForIndia ప్రచారంలో భాగంగా గ్లోబల్ ఎన్సీఏపీ ఆయా లగ్జరీ కార్లను పరీక్షించలేదు. చదవండి: పేరుకు సెకండ్ హ్యాండ్ కార్లే..! హాట్‌కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్ ఇవే..! -
Year End 2021: గ్రేటర్లో హై.. ఫ్లై!
సాక్షి, హైదరాబాద్: ఎవరేమనుకున్నా.. ఎవరేం చెప్పినా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్లు నగర రూపురేఖల్నే మార్చివేశాయి. ముఖ్యంగా ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) కింద చేపట్టిన పనులు ఎలాంటి నిధుల కొరత లేకుండా జరగడమే అందుకు కారణం. నిధుల లేమితో పనులు కుంటుపడవద్దనే తలంపుతో ప్రభుత్వం ఎస్సార్డీపీని ఏర్పాటుచేసి.. బాండ్లతో నిధులు సమకూరేలా చేయడమే కాక బ్యాంకు లోన్లకు అనుమతిచ్చింది. దీంతో జరిగే పనుల కనుగుణంగా బిల్లుల చెల్లింపులు జరుగుతుండటంతో పనులు వడివడిగా సాగుతున్నాయి. దీనివల్ల జీహెచ్ఎంసీకి ఎంతో ఆర్థిక భారం పెరిగినా.. కళ్లముందరి ఫ్లై ఓవర్ల వల్ల ప్రజల ట్రాఫిక్ చిక్కులు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో అవసరం లేకున్నా నిర్మించారనే ఆరోపణలున్నా రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీతో మున్ముందు వాటి ఉపయోగం తెలుస్తుదంటున్న వారూ ఉన్నారు. దశల వారీగా చేపట్టిన పనుల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని రూ. 4500 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇతర విభాగాలవి కూడా కలిపితే వాటి విలువ రూ.6 వేల కోట్లు. అన్ని విభాగాలవీ వెరసి దాదాపు రూ. 2 వేల కోట్ల పనులు పూర్తయ్యాయి. పురోగతిలో ఉన్నవి.. ► బొటానికల్ గార్డెన్,కొత్తగూడ– కొండాపూర్ జంక్షన్ వద్ద: సెప్టెంబర్ 2022 ► శిల్పా లేఔట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్‌తో సహ 120 అడుగుల వెడల్పుతో రోడ్డు: సెప్టెంబర్ 2022, ఫేజ్ 1 పూర్తవుతుందని అంచనా. ► ఖైతలాపూర్ ఆర్ఓబీ(హైటెక్‌సిటీ– బోరబండ రైల్వేస్టేషన్ల మధ్య): కోర్టు వివాదం పరిష్కారమైతే మార్చి 2022లో పూర్తి. ► ఎల్బీనగర్ కుడివైపు ఫ్లై ఓవర్: మార్చి 2022 ► బైరామల్ గూడ ఎడమవైపు ఫ్లై ఓవర్: డిసెంబర్ 2022 ► బైరామల్‌గూడ కుడి, ఎడమ వైపులా రెండు లూప్‌లు, రెండో వరుసలో ఫ్లై ఓవర్: డిసెంబర్ 2022. ► నాగోల్ ఫ్లై ఓవర్ : జూన్ 2022 ► ఎల్బీనగర్ కుడివైపు అండర్‌పాస్: ఫిబ్రవరి 2022 ► పంజగుట్ట శ్మశానవాటిక వద్ద స్టీల్‌బ్రిడ్జి: జనవరి 2022 ► తుకారాంగేట్ వద్ద ఆర్యూబీ: ఫిబ్రవరి 2022 ► ఇందిరాపార్కు–వీఎస్టీ, రామ్‌నగర్–బాగ్‌లింగంపల్లి ఫ్లై ఓవర్లు: డిసెంబర్ 2022, 1వ ఫేజ్ ► ఉప్పల్ జంక్షన్ ఫ్లై ఓవర్: డిసెంబర్ 2023 ► బహదూర్‌పురా జంక్షన్ ఫ్లైఓవర్: మార్చి 2022 ► చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ పొడిగింపు: జూన్ 2022 ► నల్గొండ క్రాస్‌రోడ్స్– ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ ఫ్లైఓవర్: అక్టోబర్ 2022 ► ఫలక్‌నుమా ఫ్లైఓవర్‌కు సమాంతర ఫ్లైఓవర్: సెప్టెంబర్ 2022 ► శాస్త్రిపురం వద్ద ఆర్ఓబీ: జూలై 2023 ► ఆరాంఘర్నుంచి జూపార్క్ వరకు ఫ్లైఓవర్ మార్చి 2023లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ► ఇవి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని పనులు కాగా, గ్రేటర్ పరిధిలో ఇతర విభాగాల ఆధ్వర్యంలో పూర్తయిన, జరగుతున్న పనులిలా ఉన్నాయి. ► పూర్తయిన పనులు: ఓఆర్ఆర్–మెదక్ సెక్షన్ వరకు రహదారుల విస్తరణ.. అప్‌గ్రేడేషన్ పనులు, బాలానగర్ క్రాస్‌రోడ్స్ ఫ్లైఓవర్, ఆనంద్‌బాగ్ ఆర్యూబీ. పూర్తి కావాల్సిన పనులు: అంబర్‌పేట చేనెంబర్ క్రాస్‌రోడ్స్ ఫ్లైఓవర్(రూ.369.19 కోట్లు),ఆరాంఘర్– శంషాబాద్ సెక్షన్ ఫ్లైఓవర్(రూ.488 కోట్లు), ఉప్పల్– సీపీఆర్ఐ (రూ.821కోట్లు). ► అన్ని విభాగాల్లో వెరసి పురోగతిలో ఉన్న పనుల అంచనా వ్యయం దాదాపు రూ. 6 వేల కోట్లు. పూర్తయిన పనులివీ.. ఫ్లైఓవర్లు మైండ్‌స్పేస్, రాజీవ్‌గాంధీ విగ్రహం(కూకట్పల్లి), బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద రెండు, రోడ్‌నెంబర్ 45–దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జిని కలుపుతూ, కామినేని హాస్పిటల్ వద్ద రెండు వైపులా రెండు, ఎల్బీనగర్ వద్ద ఎడమవైపు, బైరామల్‌గూడ వద్ద కుడివైపు, పంజగుట్ట శ్మశానవాటిక వద్ద స్టీల్‌బ్రిడ్జితో, ఒవైసీ జంక్షన్లో అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్ పూర్తయ్యాయి. ఇక షేక్పేటఫ్లై ఓవర్ నిర్మాణం కూడా పూర్తయింది. కొత్త సంవత్సర కానుకగా అందుబాటులోకి రానుంది. ► దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికే తలమానికంగా నిలుస్తోంది. అండర్‌పాస్‌లు.. అయ్యప్పసొసైటీ జంక్షన్, మైండ్‌స్పేస్,చింతల్‌కుంట చెక్‌పోస్ట్ జంక్షన్,ఎల్బీనగర్ జంక్షన్ వద్ద ఎడమవైపు. ఆర్యూబీ/ఆర్ఓబీలు.. హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్, ఉత్తమ్‌నగర్, ఉప్పుగూడల వద్ద ఆర్‌యూబీలు, లాలాపేట ఆర్ఓబీ పునరుద్ధరణ. -
వెరైటీ క్రైమ్: అనేక చిత్రాలు వెలుగులోకి తెచ్చిన ‘21’
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, భారీ చోరీలు వంటి సంచలనాత్మక నేరాలు నమోదవుతూనే ఉంటాయి. వీటిని నిత్యం చూస్తూనే ఉంటాం. వీటితో పాటు అంతగా ప్రాచుర్యానికి నోచుకోని వెరైటీ నేరాలు కూడా నమోదవుతూ ఉంటాయి. కొన్ని కేసులను తమ విధుల్లో భాగమనుకుంటూ పోలీసులు ఇష్టంతో చేసినా.. ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటూ కష్టంగా భావించినా ఈ తరహా కేసుల్నీ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. వీటిలో అత్యధికం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఠాణాల పరిధిలో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది చోటు చేసుకున్న వాటిలో ఈ కోవలోకి వచ్చే కేసుల్లో కొన్ని... తనది పోయిందని మరొకరిది.. సాధారణంగా ఎవరైనా తమ వస్తువు పోతే వీలున్నంత వరకు వెతికి విలువైనది అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లేని పక్షంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని వదిలేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మూల సునీల్ కుమార్ తన బ్యాగ్ పోయినందుకు మరోటి చోరీ చేసి చిక్కాడు. ఇతగాడు రైల్లో వస్తూ తన బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఈ నష్టం పూడ్చుకునేందుకు విజయనగరం నుంచి వచ్చిన శివశంకర్ అనే వ్యక్తిది చోరీ చేశాడు. బాధితుడు రైల్వే పోలీసులను ఆశ్రయించడంతో సీసీ కెమెరాల ఆధారంగా చిక్కి జైలుకు వెళ్లాడు. నేరం చేస్తుండగా నిద్రొచ్చేసింది.. ఓ టార్గెట్‌ను ఎంచుకుని అక్కడ చోరీ చేయాలని భావించిన దొంగలు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తారు. రెక్కీ తర్వాత ‘పని’లోకి దిగి చడీచప్పుడు కాకుండా పూర్తి చేస్తారు. ఆపై ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఉడాయించేస్తారు. అయితే చాంద్రాయణగుట్ట పరిధిలోని ఆలయంలో చోరీ చేసిన బాలుడు మాత్రం అందులోనే బజ్జుని చిక్కాడు. ఓ బాలుడు శ్రీశైలం రహదారిపై ఉన్న శ్రీరామాలయంలో చోరీకి వచ్చాడు. అర్థరాత్రి శ్లాబ్ నుంచి మెట్ల మార్గంలో లోపలకు ప్రవేశించాడు. అక్కడి హుండీ, అల్మారా తాళాలు పగులకొట్టి సొత్తును సంచిలో వేసుకున్నాడు. ఇంత వరకు అంతా అతడు అనుకు న్నట్లే జరిగినా... ఈ పనితో అలసిపోయాడో ఏమో అక్కడే నిద్రపోయాడు. ఉదయం వచ్చిన పూజారి బాలుడిని, అతడితో ఉన్న సంచిలో సొత్తును చూసి పోలీసులకు అప్పగించాడు. మూత్రం తెచ్చిన తంటా.. దేవరకొండ బస్తీలో మూత్ర విసర్జన రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ బస్తీకి చెందిన ఓ యువకుడు ఓ రోజు రాత్రి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేస్తున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఇతడిని మందలించాడు. ఇరువురి మధ్యా మాటామాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. కొద్దిసేపటికే ఇద్దరి స్నేహితులూ అక్కడకు చేరుకుని రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఇది పరస్పర దాడుల వరకు వెళ్లింది. విషయం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరడంతో రెండు వర్గాలకు చెందిన 17 మందిపై కేసు నమోదైంది. కాస్త అడ్వాన్స్ అయ్యాడు.. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత నుంచో భార్యలకు భర్తలు, అత్తింటి వారి నుంచి వరకట్న వే«ధింపులు ఎదురైన కేసులు ఎన్నో చూస్తుంటాం. అయితే కర్నూలు జిల్లాకు చెందిన మనోజ్‌కుమార్‌రెడ్డి మాత్రం ‘అడ్వాన్స్’ అయిపోయాడు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా కేపీహెచ్‌బీ రెండో ఫేజ్‌కు చెందిన యువతితో వివాహం కుదిరింది. ఐదెకరాల భూమి, మరో రూ.25 లక్షల విలువైన స్థలం కట్నంగా ఇచ్చేలా ఒప్పందం తర్వాత నిశ్చితార్థం కూడా జరిగింది. కర్ణాటకలోని బేలూరులో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఇతడి మనస్సు పెళ్లికి ముందే మారిపోయింది. అదనంగా ఐదెకరాలు ఇస్తేనే తాళి కడతానంటూ యువతితో పాటు ఆమె తల్లిదండ్రులనూ ఫోన్ ద్వారా వేధిస్తూ బెదిరింపులకు దిగాడు. ఫిర్యాదుతో చివరకు జైలు గడప తొక్కాడు. భయపడి బాత్రూమ్లో పడేశాడు.. నగదు, సొత్తు చోరీ చేసిన దొంగలు దాన్ని తమతో పట్టుకుపోతారు. ఆనక జల్సాలు, అవసరాలకు ఖర్చు చేసుకుంటారు. అయితే జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రకాష్ ఇంట్లో చోరీ చేసిన క్యాటరింగ్ బాయ్ మాత్రం ఆ మొత్తాన్ని కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు. దీపావళి సందర్భంగా ప్రకాష్ రూ.3.5 లక్షలు అమ్మవారి ఎదుట ఉంచి పూజించాడు. ఆ ఫంక్షన్‌కు క్యాటరింగ్ బాయ్‌గా వచ్చిన షేక్ చాంద్ రజాక్ ఆ మొత్తాన్ని జేబులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటికి డబ్బు పోయిన విషయం గుర్తించిన యజమాని తనిఖీలు మొదలెట్టారు. దీంతో తాను చిక్కుతానని భయపడిన రజాక్ బాత్రూమ్లోకి వెళ్లాడు. రూ.75 వేలు జేబులో ఉంచుకుని మిగతా మొత్తం కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు. జేబులో ఉన్న డబ్బుతోనే చిక్కిన అత గాడు ఆరా తీస్తే అసలు విషయం చెప్పాడు. అదృశ్యాలు తట్టుకోలేక ‘ఆమె’గా మార్చారు.. యువతిగా మారాలన్న తన కోరికను కుటుంబీకులు అంగీకరించట్లేదనే ఉద్దేశంలో షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదేపదే ‘అదృశ్యం’ అవుతున్నాడు. ఎట్టకేలకు ఈ అంశం సైబరాబాద్ ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్‌డెస్క్ వద్దకు వచ్చింది. అతడి ఆచూకీ కనిపెట్టిన అధికారులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అంతటితో ఆగకుండా కుటుంబీకులకు కౌన్సెలింగ్ చేసి అతడి కోరిక తీరేలా చేశారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదో తరగతిలో ఉండగానే యువతిగా మారాలని భావించాడు. తన కోరికను తల్లిదండ్రులకు చెప్పగా వాళ్లు ససేమిరా అన్నారు. దీంతో రెండుమూడుసార్లు ఇల్లు విడిచి పారిపోయిన అతగాడు ట్రాన్స్‌జెండర్స్ గ్రూపుల్లో చేరుతున్నాడు. విషయం గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్ డెస్క్‌కు చేరింది. సిద్ధిపేటలో అతడిని గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. యువతిగా మారాలన్న కోరిక తీరకపోతే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని పరిణామాలకు దారితీసే ఆస్కారం ఉందని గుర్తించారు. తల్లిదండ్రులకు హెల్ప్ డెస్క్ కౌన్సెలింగ్ చేసి వారి కుమారుడి కోరికను మన్నించేలా చేశారు. రాజీ కోసం చోరీ.. గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకున్న కొన్ని నేరాలు పోలీసుల వరకు రావు. పెద్దల సమక్షంలో జరిగే పంచాయితీల్లోనే సెటిల్ అవుతుంటాయి. చోరీ కేసులో ఇలాంటి ఓ సెటిల్మెంట్కు సంబంధించిన సొమ్ము చెల్లించడానికి నగరానికి వచ్చి చోరీ చేసి చిక్కాడో ప్రబుద్ధుడు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలం, సత్యగామకు చెందిన నాగరాజు ఆ గ్రామంలో ఓ చోరీ చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తానంటూ అంగీకరించాడు. ఆ డబ్బుతో పాటు తనకూ కొంత మిగలాలనే ఉద్దేశంతో సిటీకి వచ్చి చోరీ చేయాలని భావించాడు. నగరానికి వచ్చి బంజారాహిల్స్‌లోని ఓ దేవాలయంలో పూజారిగా చేరాడు. అక్కడికి వచ్చిన ఓ బాధితురాలి ఇబ్బందులు తొలగిస్తానని నమ్మబలికాడు. అందుకు అవసరమైన పూజ కోసం బంగారం ఇస్తే పూర్తయిన తర్వాత మరో తు లం కలిపి ఇస్తానంటూ నమ్మించాడు. ఇలా ఆమె నుంచి బంగారం, వెండి తీసుకుని పారి పోయాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
TSRTC: కథ ముగిసిపోయిందన్నారు.. కానీ పడిలేచిన కెరటంలా..
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా నాలుగు నెలల క్రితం.. ఆర్టీసీ ఉద్యోగులకు 23 రోజులు ఆలస్యంగా జీతాలు అందాయి. ఆర్టీసీ చరిత్రలో ఇంత ఆలస్యంగా జీతాలు చెల్లించటం అదే తొలిసారి. ఇది ఆర్టీసీ పతనావస్థలో ఉందని చెప్పే ఉదంతం. అప్పటి వరకు ప్రభుత్వం ప్రతినెలా నిధులు కేటాయిస్తే తప్ప జీతాలు చెల్లించలేని దుస్థితి. కానీ ఇప్పుడు ఠంఛన్‌గా ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నారు. గతంలో మాదిరి ప్రతినెలా జీతాలపై ప్రభుత్వంపై ఆధారపడటం లేదు. ఇప్పుడు రోజువారీ టికెట్ ఆదాయం రూ.13 కోట్లకు చేరింది. ఇది రెండున్నర ఏళ్ల తర్వాత నమోదవుతున్న గరిష్ట మొత్తం. దశాబ్దాలపాటు ప్రజలకు సేవలందించి.. ‘ఎర్రబస్సు’గా ఆప్యాయతను చూరగొన్న ఆర్టీసీ కథ దాదాపు ముగిసిపోయిందని, దాన్ని నడిపే పరిస్థితి లేక ప్రభుత్వం మూసేయబోతోందన్న వ్యాఖ్యలు సైతం వినిపించాయి. అలాంటి స్థితి నుంచి ఆర్టీసీ పడిలేచిన కెరటం మాదిరి శక్తిని కూడగట్టుకుంటోంది. ప్రగతి రథ చక్రాలు మళ్లీ సొంత శక్తితో పరుగు మొదలుపెట్టాయి. ఈ సంవత్సరం ముగింపులో ప్రజారవాణా సంస్థకు ప్రాణం పోస్తూ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. చదవండి: ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ ఏంటో తెలుసా? బకాయిలు.. నష్టాలు.. రూ.మూడు వేల కోట్ల అప్పులు.. రూ.రెండు వేల కోట్ల నష్టాలు.. చమురు సంస్థలకు బకాయిలు.. గత వేతన సవరణ తాలూకు బకాయిలు.. ఇలాంటి తరుణంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ను ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా నియమించింది. ఆర్టీసీ తిరిగి పుంజుకునేందుకు ఈ నియామకం దోహదపడుతుందన్న అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ► తొలుత సిబ్బందికి ఒకటో తేదీనే జీతాలు ఇస్తామన్న నిర్ణయాన్ని వెల్లడించి దానికి కట్టుబడటం ద్వారా వారిలో సంస్థ పట్ల విశ్వాశాన్ని పాదుగొల్పే ప్రయత్నం చేశారు. ► ఈ ఉద్యోగం చేయలేం వీఆర్ఎస్ ఇవ్వండి అంటూ కొంతకాలంగా వేడుకుంటూ వస్తున్న సిబ్బందిలో ఇప్పుడు ఆ ఆవేదన కొంతమేర తగ్గింది. సంక్షోభానికి ముందులాగా ఉత్సాహంగానే డ్యూటీలకు వస్తున్నారు. పాత బకాయిల విషయంలో మాత్రం ఆగ్రహం అలాగే ఉంది. చదవండి: TS: పబ్స్, హోటళ్లు, క్లబ్‌లు న్యూఇయర్ గైడ్ లైన్స్ పాటించాలి ► ఒకప్పుడు ఆసియాలోనే మంచి సహకార సంఘాల్లో ఒకటిగా వెలుగొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం నాలుగేళ్లుగా చిక్కుల్లో పడింది. దాదాపు రెండేళ్లుగా సరిగా రుణాలు రావటం లేదు. ఏడాది కాలంగా పూర్తిగా కుంటుపడింది. 10 వేలకుపైగా దరఖాస్తులు పేరుకుపోయి ఉన్న తరుణంలో ఇప్పుడిప్పుడు మళ్లీ రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ► ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 66 శాతానికి చేరుకుంది. ఇది రెండేళ్లలో గరిష్టం. ఇక రోజుకు 35 లక్షల కి.మీ. గరిష్ట స్థాయిలో బస్సులు తిరుగుతున్నాయి. గతంతో పోలిస్తే వేయి బస్సులు తగ్గినా దాన్ని అందుకోవడం విశేషం. ► కొత్త బస్సులు కొనే ప్రసక్తే లేదని కొంతకాలం క్రితం తేల్చి చెప్పిన ఆర్టీసీ.. ఇప్పుడు తీరు మార్చుకుంటోంది. కొత్త బస్సుల అవసరాన్ని గుర్తించి కొనేందుకు సిద్ధమైంది. ► ఆదాయం కోసం బస్సులపై అడ్డదిడ్డంగా ప్రకటనలు వేయించుకుని అందవిహీనంగా మారిన బస్సులు ఇప్పుడు మళ్లీ ఆర్టీసీ బస్సుల్లాగా మారాయి. ఆదాయం కూడా వదులుకుని ప్రకటనలను నిషేధించి బస్సులకు కొత్తగా రంగులద్దడం విశేషం. ► మందులకు, సాధారణ వైద్యానికి కూడా కొరగాకుండా పోయిన హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీస్థాయికి చేరుకుంటోంది. ఇప్పుడు అక్కడ డయాలసిస్‌తోపాటు చాలా రకాల వైద్యం అందుతోంది. -
ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ ఏంటో తెలుసా?
►నిన్న మొన్నటివరకూ ఇంటర్నెట్ సామ్రాజ్యంలో యూట్యూబ్ అంటే కేవలం కాలక్షేపం కోసం నెటిజన్లు వీక్షించే ఓ వినోద సాధనమే. ► మరి నేడు... వీక్షకులకు వినోదం, విజ్ఞానాన్ని అందిస్తూనే యూట్యూబర్లకు కోట్లాది మంది సబ్స్క్రైబర్లను, అంతకన్నా మించి భారీగా ఆదాయాన్ని సంపాదించిపెట్టే కల్పతరువు! ప్రతి నిమిషం ఈ ప్రసార మాధ్యమంలో ఏకంగా 30 లక్షల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయంటే యూట్యూబ్ స్థాయి ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరి... ►ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ ఏమిటి? ►భారత్‌లో నాలుగు రాళ్లు వెనకేసుకున్నదెవరు? చార్ట్‌లు బద్దలు కొట్టిన పాటలేమిటి? ►వినోదం పంచిన వెబ్‌సిరీస్, గేమ్‌లు ఏవి? ఓసారి పరిశీలిద్దాం.. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది యూట్యూబ్‌లో వినూత్నమైన ఆలోచనలతో సృష్టించిన వీడియోలు మంచి ఆదరణ పొందాయి. ‘ఏ2మోటివేషన్స్’, ‘మిస్టర్ గ్యానీ ఫ్యాక్ట్స్’ వంటి చానళ్లు.. అద్భుతం, వినూత్నం, విచిత్రం అనిపించే విషయాలను నిమిషం, రెండు నిమిషాల వీడియోలైన ‘షార్ట్స్’లో బంధించాయి. అలాగే ‘క్రేజీ ఎక్స్‌వైజెడ్’, ‘మిస్టర్ ఇండియన్హ్యాకర్’ వంటి చానళ్ల నిర్వాహకులు విచిత్రమైన పనులు చేసి పాపులారిటీ, సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు. తెలుగు యూట్యూబ్ చానళ్లు ఫిల్మీమోజీ, ఫన్మోజీలు అనిమోజీ పేరుతో అవతార్ ఆధారిత కంటెంట్ సృష్టించి ట్రెండింగ్ చార్టుల్లో పైకి చేరితే.. భువన్ బామ్ (బీబీ కి వైన్స్) తన కామెడీ వీడియోలను ‘ధిండోరా’ పేరుతో వెబ్ సిరీస్‌గా మార్చి 2.49 కోట్ల అభిమానులను సంపాదించుకున్నాడు. గేమింగ్ విషయానికొస్తే ఇందులోనూ మూసపోకడలకు స్వస్తిపలికి కామెడీ, ప్రాంక్స్, సవాళ్లు వంటి అనేక అంశాల ఆధారంగా కొత్త గేమ్‌లు సిద్ధమయ్యాయి. గేమింగ్ అంటే ఇష్టపడే వాళ్లు ఇప్పుడు నగర ప్రాంతాలను దాటిపోవడం ఇంకో విశేషం. కోవిడ్ కారణంగా సినిమాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది వీడియో పాటలు కొంచెం ఎక్కువ సంఖ్యలోనే విడుదలయ్యాయి. అంకుశ్ రజా, శిల్పి రాజ్ వంటివారు తమ భోజ్‌పురి సంగీతంతో ఈ ఏడాది టాప్ స్థానాల్లో నిలిచారు. మహిళల మ్యూజిక్ వీడియోల్లో తమిళ సింగర్లు అరివు, ఢీల వీడియో ‘ఎంజాయ్ ఎంజామీ’ చార్ట్‌లలో టాప్‌గా నిలిచింది. చదవండి: Top Apps In 2021: ఈ ఏడాది క్రేజీ యాప్స్ ఇవే.. ‘ఈ తరం’ వెబ్ సిరీస్‌లు.. తెలుగు విషయానికి వస్తే... షణ్ముక్ జశ్వంత్ హీరోగా నటిస్తున్న యూట్యూబ్ సిరీస్ ‘సూర్యా’తోపాటు ‘గర్ల్ ఫార్ములా’ రూపొందించిన ‘30 వెడ్స్ 21’ ఆకట్టుకోగా.. దేశంలో యువతరం సమస్యలను, అనుభవాలను వినూత్నమైన పద్ధతుల్లో అందుబాటులోకి తెచ్చిన కొన్ని వెబ్ సిరీస్‌లు ఈ ఏడాది బాగా ప్రేక్షకాదరణ పొందాయి. ‘ద వైరల్ ఫీవర్’ నిర్మించిన కొత్త సిరీస్ ఆస్పిరెంట్స్.... యూపీఎస్సీకి సిద్ధమవుతున్న విద్యార్థుల కష్టాలు, సమస్యలు ఆశనిరాశలను ప్రతిబంబించింది. అలాగే డైస్ మీడియా వైద్యవిద్యార్థుల జీవితానుభవాల ఆధారంగా నిర్మించిన ‘ఆపరేషన్ ఎంబీబీఎస్’, గేమింగ్‌నే వృత్తిగా ఎంచుకున్న వారిపై రూపొందించిన ‘క్లచ్’ ప్రేక్షకుల మన్ననలు పొందాయి. బుల్లి వీడియోలు భలేభలే... యూట్యూబ్ ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన చిన్న వీడియో విభాగం ‘షార్ట్స్’కూ దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. నిమిషం కంటే తక్కువ నిడివి ఉండే ‘షార్ట్స్’ వీడియోలను ఇప్పుడు చాలా మాంది వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. 2021లో సృష్టించిన కొత్త, వినూత్న వీడియోల్లో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులు మొదలుకొని కుటుంబ సంబంధాలు, స్ఫూర్తిదాయకమైనవి, పురుషుల సౌందర్య పరిరక్షణకు ఉపయోగపడేవి కూడా బోలెడు ఉన్నాయి. ‘ఏ2మోటివేషన్’ తొలిస్థానంలో నిలివగా ‘మిస్టర్ గ్యానీ ఫ్యాక్ట్స్’, ‘శివమ్ మాలిక్’, ‘లిటిల్గ్లవ్’, ‘ఇంగ్లిష్ కనెక్షన్’, ‘బసీర్ గేమింగ్’, ‘అజయ్ శర్మ’, ‘దుష్యంత్ కుక్రేజా’ వంటివి టాప్–10లో ఉన్నాయి. -
Rewind 2021: వాళ్లను కలిపింది.. వీళ్లను దూరం చేసింది
2021 కొందరిని ఒక ఇంటివారిని చేసింది. కొందరిని ఈ లోకానికి దూరం చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటలు, హఠాన్మరణంతో షాక్‌కి గురి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. పెళ్లి సందడి 2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరోలు కార్తికేయ, సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రణీత, సింగర్ సునీత వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ♦ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్ నిట్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు తొలిసారి (2010) లోహితను కలిశారు కార్తికేయ. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ♦ ప్రముఖ దర్శక–నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13న దీపిక మెడలో మూడు ముడులు వేశారు. అమెరికాలోని డల్లాలో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు దీపిక. సుమంత్, దీపికలది పెద్దలు కుదిర్చిన వివాహం. ♦ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత కూడా ఈ ఏడాది అత్తారింటిలోకి అడుగుపెట్టారు. మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. బెంగళూరులో నితిన్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ‘మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్’ అన్నారు ప్రణీత. ♦ ప్రముఖ గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనితో ఏడడుగులు వేశారు. జనవరి 9న వీరి పెళ్లి శంషాబాద్ సమీపంలోని రామాలయంలో జరిగింది. ♦ హాస్య నటి విద్యాల్లేఖా రామన్ పెళ్లి సెప్టెంబర్ 9న సంజయ్‌తో జరిగింది. ఫిట్నెస్, న్యూట్రషనిస్ట్ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్నారు సంజయ్. వీరిది ప్రేమ వివాహం. కాగా, పెళ్లి జరిగిన విషయాన్ని కొన్ని రోజులకు ‘మా పెళ్లయింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేశారు విద్యుల్లేఖా రామన్. ఇక సెలవు తెలుగు పరిశ్రమలో ఈ ఏడాది బోలెడు విషాదాలు నెలకొన్నాయి. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి ‘ఇక సెలవు’ అంటూ షాకిచ్చారు. ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నవంబర్ 30న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్యదర్శకులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్ 28న మృతి చెందారు. అదే విధంగా గాయకుడు జి. ఆనంద్ మే 7న, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్ మే 7న, రచయిత నంద్యాల రవి మే 14న, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ మే 10న, డైరెక్టర్ అక్కినేని వినయ్ కుమార్ మే 12న, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు వి. కాంచన్ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ మే 12న, నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు మే 21న, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ మే 26న, యువ నిర్మాత మహేశ్ కోనేరు అక్టోబర్ 12న గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. అదే విధంగా డైరెక్టర్ గిరిధర్ (శుభ ముహూర్తం) ఆగస్టు 2న, నటుడు రాజాబాబు అక్టోబర్ 25న అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. -
2021 రివైండ్: టీడీపీకి పరాభవ ‘నామం’
సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికల్లో అత్యంత అవమానకరమైన ఓటమితో కుదేలైన తెలుగుదేశం పార్టీకి 2021 పరాభవ నామ సంవత్సరంగా మిగిలింది. సాధారణ ఎన్నికల్లో అత్యంత అవమానకరమైన ఓటమితో కుదేలైన ఆ పార్టీ ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలతో పాతాళంలో కూరుకుపోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది ఘోరమైన ఛీత్కారాలు ఎదురయ్యాయి. ప్రతిపక్ష పాత్ర పోషించలేని స్థితిలో ఎన్నికల్ని బహిష్కరించడం దగ్గర నుంచి తమకు ఓటు వేయలేదనే అక్కసుతో ప్రజలనే నిందించడం, శాపనార్థాలు పెట్టడం ఈ ఏడాది ఆ పార్టీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఏ దశలోను పోటీపడలేక బురద జల్లడమే పనిగా పెట్టుకున్నా ప్రజల నుంచి ఎటువంటి సానుకూలత టీడీపీకి రాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: వంగవీటి రాధాకు ప్రభుత్వ భద్రత స్థానిక ఎన్నికల ఫలితాలతో కుంగుబాటు ఈ ఏడాది స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడాన్ని బట్టి ప్రజల్లో ఆ పార్టీకి ఉన్న స్థానం ఏమిటో మరోసారి తేటతెల్లమైంది. స్థానిక ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా టీడీపీ చతికిలపడడం చూసి రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. జనవరిలో పార్టీ గుర్తులేకుండా జరిగిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో తమకు 35 శాతానికి పైగా పంచాయతీలు వచ్చినట్లు చంద్రబాబు అదేపనిగా బుకాయించి ప్రజల తీర్పును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం పంచాయతీలు కూడా దక్కలేదు. కానీ, పార్టీ గుర్తుల్లేకుండా జరిగిన ఎన్నికలు కావడంతో ఆ ఎన్నికల్ని వివాదం చేసి తమ ఓటమిని కప్పిపుచ్చుకోవాలని చూశారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీల్లో టీడీపీ 14 మాత్రమే గెలవడంతో చంద్రబాబు బుకాయింపు గాలి బుడగలా పేలిపోయింది. 30 ఏళ్లు చంద్రబాబుకు అండగా నిలిచిన కుప్పం ప్రజలు తొలిసారి ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో టీడీపీకి శరాఘాతంగా మారింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పాతాళానికి.. మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే ఒకే ఒక మున్సిపాల్టీని ఆ పార్టీ గెలుచుకోగలిగింది. 11 మున్సిపాల్టీల్లో అసలు టీడీపీ అడుగే పెట్టలేకపోయింది. ప్రజల్లో టీడీపీకి ఉన్న ఆదరణను మున్సిపల్ ఎన్నికల ఓటమి స్పష్టంచేసింది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలోను చిత్తుగా ఓడిపోయింది. ఇక పోటీ ఇవ్వలేక పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు. ఆ తర్వాత బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలోను అభ్యర్థిని ప్రకటించి తర్వాత తప్పుకున్నారు. మలి విడత జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీచేసినా ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఇందులో ఏకంగా కుప్పం మున్సిపాల్టీనే చంద్రబాబు చేజార్చుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలుచుకోలేకపోయింది. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు సాధారణ ఎన్నికల కంటే ఇంకా దిగజారినట్లు ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైంది. ఓటములతో నేతల అసహన పర్వం ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ప్రజలపైనే విరుచుకుపడుతూ తమ అసహనాన్ని పదేపదే బహిర్గతం చేసుకున్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో ప్రజలకు సిగ్గులేదని, ఎవరికి ఓటేయాలో కూడా తెలీదంటూ చంద్రబాబు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. రాజకీయంగా కునారిల్లిన దశలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పట్టాభిరామ్ తదితర నేతలు సీఎం వైఎస్ జగన్, మంత్రులను పరుష పదజాలంతో రాయలేని భాషలో దూషించి ప్రజల దృష్టిలో ఇంకా చులకనయ్యారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. సీఎంను బోషడీకే అంటూ టీడీపీ నాయకుడు పట్టాభి దూషించడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించగా.. తదనంతరం ప్రజల్లో టీడీపీపై ఆగ్రహం పెల్లుబికింది. పూర్తిగా ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై బురద జల్లడమే పనిగా ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా అభూత కల్పనలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకున్నారనే అభిప్రాయం నెలకొంది. అన్ని రకాలుగా కుంగిపోయిన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పరిమితమయ్యారు. చంద్రబాబు పిలుపు ఇచ్చినా ఆందోళనలు, నిరసనల్లో ఆ పార్టీ కేడర్ పాల్గొనే పరిస్థితి లేకుండాపోయింది. రాజకీయ పతనంలో 2021 సంవత్సరం టీడీపీకి కొత్త కోణాన్ని పరిచయం చేసింది. -
2021లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవంటే..?
మరికొద్ది రోజల్లో 2021కు ఎండ్ కార్డు పడనుంది. కొత్త ఏడాది 2022 రాబోతుంది. ఈ ఏడాదిలో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల వ్యాపారం కొంచెం ఇష్టం..కొంచెం కష్టంగా మారింది. సప్లై చైయిన్ రంగంలో అవాంతరాలు, చిప్స్ కొరత వంటివి ఆయా కంపెనీలకు ఉత్పత్తికి అడ్డుగా మారాయి. ముడి సరకుల ధరలు పెరగడంతో కంపెనీలు మార్జిన్లను దృష్టిలో ఉంచుకొని ఆయా కంపెనీలు వాహనాల ధరలను పెంచాయి. ఇదిలా ఉండగా 2021గాను భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల కంపెనీల్లో మారుతి సుజుకీ మొదటిస్ధానంలో నిలిచింది. ఈ ఏడాదిలో ఆయా కంపెనీలు అత్యధికంగా విక్రయించిన కార్ల లిస్ట్‌ను ప్రముఖ ఆటోమొబైల్ వెబ్సైట్ కార్దేఖో వెల్లడించింది. 2021లో ఆయా కంపెనీల్లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..! 1. మారుతి సుజుకీ- వ్యాగనర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఓ బ్రాండ్ నేమ్. దేశీయంగా అత్యధిక సంఖ్యలో కార్లను తయారు చేసే కంపెనీ ఇది. ప్రతినెలా అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల జాబితాలో మారుతి సుజుకి టాప్ ప్లేస్‌లో ఉంటుంది. మారుతి సుజుకికి చెందిన వ్యాగనార్.. అగ్రస్థానంలో నిలిచింది. సుమారు 1.64 లక్షల యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తోంది. 2. హ్యుందాయ్- క్రెటా మారుతి సుజుకీ తరువాత భారత్‌లో హ్యుందాయ్ కార్లకు భారీ ఆదరణ ఉంది. హ్యుందాయ్‌లో క్రెటా కార్లు అత్యధికంగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. సుమారు 1,17,828 యూనిట్లను హ్యుందాయ్ విక్రయించింది. వచ్చే ఏడాది క్రెటాకు చెందిన అప్డేట్డ్ వెర్షన్‌ను హ్యుందాయ్ తీసుకురానున్నట్లు సమాచారం. 3. టాటా-నెక్సాన్ టాటా మోటార్స్‌లో నెక్సాన్ కార్లు భారీగా అమ్ముడైనాయి. పెట్రోల్, డిజీల్, ఎలక్ట్రిక్ వేరియంట్స్ నెక్సాన్‌లో అందుబాటులో ఉన్నాయి. అమ్ముడైన కార్ల సంఖ్య: 95,678 4. కియా-సెల్టోస్ దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత్‌లో భారీ ఆదరణను పొందింది. కియా మోటార్స్‌లో సెల్టోస్ ఎస్యూవీ కార్లు ఎక్కువగా అమ్ముడైనాయి. అమ్ముడైన కార్ల సంఖ్య: 94,175 5. మహీంద్రా-బొలెరో మహీంద్రా కంపెనీ న్యూ జనరేషన్ ఎస్‌యూవీలో ఈ ఏడాది ముందుకొచ్చింది. కాగా మహీంద్రాలో టాప్ సెల్లింగ్ కారుగా బొలెరో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 60,009 6. టయోటా-ఇన్నోవా క్రిస్టా ప్రముఖ జపనీస్ మోటార్స్ టయోటాకు భారత్‌లో ఎస్యూవీ వాహనాలకు మంచి పేరు ఉంది. ఫార్చూనర్, ఇన్నోవా క్రిస్టా మోడల్ కార్లను భారతీయులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. 2021లో భారత్‌లో టయోటా టాప్ సెల్లింగ్ కారుగా ఇన్నోవా క్రిస్టా నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 51,261 7. హోండా-అమేజ్ 2021గాను భారత్‌లో హోండా అమ్మకాల్లో అమేజ్ కారు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 36,398 8. రెనాల్ట్-క్విడ్ 2021గాను భారత్‌లో రెనాల్ట్ అమ్మకాల్లో క్విడ్ కారు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 30,600 9. స్కోడా- కుషాక్ 2021గాను భారత్‌లో స్కోడా అమ్మకాల్లో కుషాక్ కారు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 11,173 చదవండి: అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతీ సుజుకీ బాలెనో కారు! -
ఈ ఏడాది చివరి వారంలో వచ్చే సినిమాలు ఇవే..
Upcoming Movies In December Last Week Of 2021: కరోనా కారణంగా అన్ని రంగాలతోపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది కొంచెం ఊరట లభించింది. థియేటర్లన్నీ తెరచుకోవడంతో సినిమాలకు పూర్వ వైభవం వచ్చింది. నందమూరి బాలకృష్ణ 'అఖండ' సినిమాతో మొదలైన వసూళ్ల పండుగ అల్లు అర్జున్ 'పుష్ప', నాని 'శ్యామ్ సింగరాయ్' చిత్రాలతో కొనసాగుతోంది. అయితే అనేక సవాళ్లను దాటుకొని ఎండింగ్‌కు వచ్చింది 2021 సంవత్సరం. ఇక ఈ ఏడాదిలో చివరి రోజైన శుక్రవారం, కొత్త సంవత్సరంలోని మొదటి రోజైన శనివారం ప్రేక్షకులను పలకరించడానికి చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలేంటో చూద్దాం. 1. అర్జున ఫల్గుణ నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది శ్రీ విష్ణు హీరోగా నటించిన 'అర్జున ఫల్గుణ'. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తేజ మర్ని దర్శకత్వం వహించారు. శ్రీ విష్ణు స్టైల్‌కు తగినట్లుగా వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర యూనిట్ తెలిపింది. 2. జెర్సీ బాలీవుడ్ కబీర్ సింగ్ షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న చిత్రం జెర్సీ. తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమాకు రీమేక్‌గా హిందీలో తెరకెక్కించారు. ఇందులో షాహిద్‌కు సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా డిసెంబర్ 31కు థియేటర్లలో విడుదల కానుంది. 3. 1945 దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ డ్రామా చిత్రం '1945'. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు సత్యశివ డైరెక్షన్ చేశాడు. రేజీనా హీరోయిన్గా నటించగా సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. రానా స్వాతంత్ర్య సమరయోధుడిగా నటిస్తున్న ఈ సినిమాను ఎట్టకేలకు డిసెంబర్ 31న విడుదల చేయనున్నారు. 4. విక్రమ్, డిసెంబర్ 31న విడుదల 5. సత్యభామ, డిసెంబర్ 31న విడుదల 6. అంతఃపురం, డిసెంబర్ 31న విడుదల 7. ఇందువదన, జనవరి 1, 2022న విడుదల 8. ఆశ ఎన్కౌంటర్, జనవరి 1, 2022న విడుదల ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు: ఆహా 1. సేనాపతి, డిసెంబర్ 31 నెట్‌ఫ్లిక్స్ 1. ది పొస్సెసన్ ఆఫ్ హన్నా గ్రేస్- డిసెంబరు 27 2. చోటా బీమ్: ఎస్14 -డిసెంబరు 28 3. క్రైమ్ సీన్: ది టైమ్స్ స్వ్కేర్ కిల్లర్ - డిసెంబరు 29 4. క్యూర్ ఐ: సీజన్-6- డిసెంబరు 31 5. కోబ్రా కాయ్(సీజన్-4) -డిసెంబరు 31 6. ది లాస్ట్ డాటర్- డిసెంబరు 31 అమెజాన్ ప్రైమ్ వీడియో 1. లేడీ ఆఫ్ మేనర్- డిసెంబరు 31 2. టైమ్ ఈజ్ అప్ -డిసెంబరు 31 -
డిసెంబర్ 31 డెడ్‌లైన్...! వీటిని పూర్తి చేశారో లేదో చెక్ చేసుకోండి..? లేకపోతే మీకే నష్టం..!
2021 ఎండ్ కాబోతుంది. కొత్త ఏడాది 2022 మరో నాలుగు రోజుల్లో రానుంది. పలు ఆర్థిక కార్యకలాపాలకు, ద్రువీకరణలకు, ఆధార్ లింక్‌కు, పలు ఖాతాల కేవైసీ అప్డేట్కు డిసెంబర్ 31తో డెడ్‌లైన్ ముగియనుంది. వీటిని పూర్తి చేయకపోతే ఆయా సంస్థలు అందించే ఫలాలు నష్టపోయే అవకాశం ఉంది. ► జీవన ద్రువీకరణ: పెన్షనర్లు జీవన ధ్రువీకరణ (లైఫ్ సర్టిఫికెట్)ను సమర్పించాల్సిన గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. ప్రతి ఏడాది నవంబర్ 30లోపు ప్రభుత్వ ఫించనుదారులు వారి జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉండేది. అప్పుడే పెన్షన్‌దారులు ఎలాంటి అవాంతరాలూ లేకుండా పెన్షన్ పొందవచ్చును. బ్యాంకు, పోస్టాఫీసు, డోర్ స్టెప్, ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో ఆన్లైన్ ద్వారా గానీ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించవచ్చును. ► ఆధార్, పీఎఫ్ లింక్: ఈపీఫ్ ఖాతాకు, ఆధార్‌ను అనుసంధానించడాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తప్పనిసరి చేసింది. ఆధార్ అనుసంధానం కోసం డిసెంబరు 31, 2021 వరకు గడువు ఇచ్చింది. ఆధార్‌తో అనుసంధానించని ఖాతాలకు ఈసీఆర్ దాఖలు చేయలేరు. దీంతో ఆయా సంస్థలు అందించే కాంట్రీబ్యూషన్ నిలిచిపోతుంది. ► ఈపీఎఎఫ్ఓ ఈ-నామినేషన్ దాఖలు: ఈపీఎఫ్‌వో చందాదారులు డిసెంబరు 31లోపు ‘ఈ-నామినేషన్’ ప్రక్రియను పూర్తిచేయాలి. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యుల కుటుంబాలకు గరిష్ఠంగా రూ.7 లక్షల బీమా హామీ లభిస్తోంది. ఈపీఎఫ్ సభ్యుడు ఉద్యోగంలో ఉండగా మృతిచెందినట్లైతే, కుటుంబ సభ్యులకు ఈ పథకం కింద బీమా ప్రయోజనం అందుతుంది. ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి. యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. ► ఐటీఆర్ ఫైలింగ్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసేందుకు గడువు డిసెంబరు 31తో ముగియనుంది. కోవిడ్-19, ఆదాయపు పోర్టల్‌లో వచ్చిన కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఐటీఆర్ దాఖలు గడువును కేంద్రం పొడిగించింది. ఈ గడువు ముగిసేలోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే..టాక్స్ చెల్లింపుదారులుపై రూ.5 వేలు పెనాల్టీ కట్టాల్సి వస్తోంది. ► డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కేవైసీ: స్టాక్చేంజ్లో ట్రేడింగ్ చేసే వారు తమ డీమ్యాట్ ఖాతాల కెవైసీ పూర్తి చేయాలని సెక్యురిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సూచించింది. కేవైసీ పూర్తి చేసేందుకు డిసెంబరు 31 వరకు గడువు పొడిగించింది. చదవండి: అలర్ట్: జనవరిలో నెలలో బ్యాంక్ హాలిడేస్..! ఎన్ని రోజులంటే..! -
2021: ఏడాదంతా రంజుగా రాజకీయం!
రాష్ట్ర రాజకీయాలు ఈ ఏడాది (2021) మరింత రంజుగా సాగాయి. ఒకట్రెండు ఎదురుదెబ్బలు తగిలినా అధికార టీఆర్ఎస్ హవా కొనసాగడం ఓవైపు.. కొత్త పీసీసీ చీఫ్ రాకతో కాంగ్రెస్‌లో ఉత్సాహం, అధిష్టానం అండతో రాష్ట్ర బీజేపీ దూకుడు మరోవైపు వేడి పుట్టించాయి. నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, మినీ మున్సిపోల్, ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇలా ఏడాదంతా జరిగిన ఎన్నికల ప్రక్రియ ఈ వేడిని ఎక్కడా తగ్గనివ్వలేదు. దాదాపు అన్ని ఎన్నికల్లో గులాబీ పార్టీ హవానే కొనసాగినా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రం షాకిచ్చింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో కొత్త అధ్యక్షుడి రాకతో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ అడపాదడపా వివిధ కార్యక్రమాలు, పోరాటాలతో తామూ ఆప్షన్‌గా ఉన్నామని చెప్పుకొనే ప్రయత్నం చేసింది. కానీ ప్రతి ఎన్నికలోనూ ఓటమి ఆ పార్టీని ఎదురుదెబ్బ తీసింది. గత ఏడాది చివరలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయాలతో బీజేపీలో వచ్చిన జోష్ ఈ ఏడాదీ కనిపించింది. పాదయాత్రలు, బహిరంగ సభలు, ఆందోళనలు, ఇతర కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో ఈ మూడు ప్రధానపక్షాలు పోగా.. మిగతా పార్టీల ప్రభావం నామమాత్రంగానే మారిపోయింది. టీటీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితికి చేరగా.. తెలంగాణ జన సమితి, సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాల కార్యకలాపాలేమీ పెద్దగా కనిపించలేదు. అయితే 2021లో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల నేతృత్వంలో వైఎస్సార్టీపీ ఏర్పాటైంది. – సాక్షి, హైదరాబాద్ టీఆర్ఎస్ అన్నింటా కారే.. గత ఏడాది చివర్లో దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు చవిచూసిన టీఆర్ఎస్.. 2021లో ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక మినహా ఏడాదంతా హవా చూపింది. పార్టీని గాడినపెట్టి, మరింత బలోపేతం చేయడంపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, ప్లీనరీ వంటి కార్యాచరణ అమలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం, ముఖ్య నేతలతో అడపాదడపా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పార్టీకోసం కృషి చేస్తున్న నేతలకు వరుసగా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. పలు అంశాల్లో స్వయంగా తానే ముందుండి పార్టీని నడిపించారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం ‘తెలంగాణ భవన్’కు శంకుస్థాపన చేశారు. ఊరూరా పార్టీ జెండా పండుగ నిర్వహించి సంస్థాగత కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లపాటు ఆవిర్భావ వేడుకలు, ప్లీనరీకి దూరంగా ఉన్న టీఆర్ఎస్.. అక్టోబర్ 25న హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఘనంగా ప్లీనరీ నిర్వహించుకుంది. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా 9వసారి ఎన్నికయ్యారు. గత ఏడాది చివర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు సాధించినా.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 11న జరిగిన ఎన్నికలో మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత ఎంపికయ్యారు. ఇక ఏప్రిల్‌లో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు మరో ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం మేయర్, చైర్మన్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వరంగల్ మేయర్‌గా మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఖమ్మం మేయర్‌గా పునుకొల్లు నీరజ ఎన్నికయ్యారు. ‘సాగర్’లో నిలబడి.. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మరణించడంతో.. ఆ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జరిగింది. నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. తాను స్వయంగా ఒక సభలో పాల్గొని ప్రచారం చేశారు. అక్కడ కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి పోటీలో ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ పక్కా వ్యూహంతో వ్యవహరించిన కేసీఆర్.. నోముల భగత్‌ను 18,872 ఓట్ల తేడాతో గెలిపించుకున్నారు. ‘ఎమ్మెల్సీ’లన్నీ క్లీన్‌స్వీప్ చేసి.. ఈ ఏడాది ఫిబ్రవరి మొదలుకుని డిసెంబర్ దాకా వేర్వేరు సందర్భాల్లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఎన్నిక జరిగిన 21 సీట్లనూ కైవసం చేసుకుంది. రెండు పట్టభద్రుల కోటా సీట్లకు మార్చిలో ఎన్నిక నిర్వహించగా.. ‘నల్లగొండ– వరంగల్– ఖమ్మం’స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’స్థానంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. తర్వాత నవంబర్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. మరోవైపు స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీల్లో 12 మంది సభ్యులు 2022 జనవరి 4న పదవీ విరమణ చేయనుండటంతో.. ఎన్నికల సంఘం డిసెంబర్లో ఎన్నిక నిర్వహించింది. టీఆర్ఎస్ ఇందులో ఆరు సీట్లను ఏకగ్రీవంగా.. మరో ఆరు సీట్లను పోలింగ్‌లో గెలుచుకుని.. మరోసారి క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీని ఖాళీ చేసి.. తెలంగాణ అసెంబ్లీకి టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికవగా.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గతంలోనే టీఆర్ఎస్లో చేరారు. టీటీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట) ఏప్రిల్ 7న టీఆర్ఎస్లో చేరారు. సండ్ర, మెచ్చా లేఖ ఇవ్వడంతో టీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనమైంది. ఇక టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా టీఆర్ఎస్లో చేరారు. సీనియర్ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కాంగ్రెస్ నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, చల్మెడ లక్ష్మీనర్సింహారావు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు వివిధ సందర్భాల్లో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ, గట్టు రామచందర్‌రావు తదితరులు టీఆర్ఎస్ను వీడారు. ‘మరో పదేళ్లూ నేనే సీఎం’ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారంటూ వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 7న తెలంగాణభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక ప్రజాప్రతినిధులు, నేతలతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆ ప్రచారానికి స్వయంగా చెక్ పెట్టారు. ‘‘శారీరకంగా, ఆలోచనాపరంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మరో పదేళ్లూ నేనే సీఎంగా ఉంటా.. ఏదైనా ఉంటే అందరితో చెప్పి నిర్ణయం తీసుకుంటా. పార్టీలో ఎవరైనా సీఎం మారుతారంటూ కామెంట్లు చేస్తే తోలుతీస్తా. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే బయటికి పంపిస్తా’’అని స్పష్టం చేశారు. ‘ఈటల’ఎపిసోడ్‌తో కుదుపు ఆవిర్భావం నాటి నుంచీ టీఆర్ఎస్లో కొనసాగి కీలక నేతగా ఎదిగిన ఈటల రాజేందర్ ఎపిసోడ్ టీఆర్ఎస్లో భారీ కుదుపునకు కారణమైంది. ‘గులాబీ జెండాకు మేమే ఓనర్లం’ అంటూ ఈటల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదమయ్యాయి. తర్వాత ఈటల, ఆయన కుటుంబ సభ్యులు భూఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసీఆర్ మే 1న ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించారు. జూన్‌లో ఈటల టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో అప్రమత్తమైన కేసీఆర్ హుజూరాబాద్‌లో పార్టీ కేడర్ చేజారకుండా చర్యలు చేపట్టారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఢీ ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీతో టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించింది. నవంబర్ 1న మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాలు చేశారు. తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ నవంబర్ 18న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. భారత రైతాంగ సమస్యలపై పోరాటానికి టీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుందని ప్రకటించారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 20న ఊరూరా చావుడప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఊపొచ్చినా రూపురాలే..! కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉండిపోయిన కాంగ్రెస్ పార్టీలో 2021 కొంత కదలిక తెచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఏడాది జూలై 7న రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ పక్షాన విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టి.. కేడర్‌లో కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే సీనియర్ల సహాయ నిరాకరణ, అంతర్గత కలహాలు, సర్దుబాట్లతో కాంగ్రెస్ నావ ఎటూ కదలకుండా చిక్కుబడిపోయిందన్న అభిప్రాయాలు ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గత ఏడేళ్లుగా ఎదురవుతున్న ఎన్నికల ఫలితాలే 2021లోనూ పునరావృతం అయ్యాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి ఓడిపోగా.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిర్లక్ష్యం గట్టిదెబ్బ తీసింది. ఇక్కడ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 3 వేల ఓట్లు మాత్రమే రావడంతో కేడర్ నిరాశలో పడింది. అంతకుముందు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పరాజయం పాలైంది. అయితే ఇటీవలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం.. తాము పోటీచేసిన రెండు చోట్లా తమకు ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించి ఊరట పొందింది. ధర్నాలు, నిరసనలతో జనంలోకి.. 2021లో కాంగ్రెస్ పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, గిరిజనులకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 9న ఇంద్రవెల్లి వేదికగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా మోగించింది. ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ వేదికగా భారీ సభ నిర్వహించింది. పోడు భూములపై అక్టోబర్ 5న భారీ రాస్తారోకో, 20 నియోజకవర్గాల్లోని పోడు రైతులతో ఆందోళన చేసింది. అంతకుముందు సెప్టెంబర్ 22న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సీపీఎం, సీపీఐ, టీజేఎస్, ఇంటిపార్టీ, న్యూడెమొక్రసీ పార్టీలతోపాటు పలు ప్రజా, కుల సంఘాలు కూడా ఆ ఆందోళనలో పాల్గొన్నాయి. ఇక నిరుద్యోగ, విద్యార్థి జంగ్ సైరన్ పేరుతో ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌ల కోసం అక్టోబర్ 2న ఎల్బీనగర్లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. తర్వాత ఒకట్రెండు యూనివర్సిటీల్లో ఇదే అంశంపై సదస్సులు నిర్వహించారు. అయితే డిసెంబర్ 9న రాహుల్‌గాంధీతో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలనుకున్న సభ సాధ్యం కాలేదు. ఏడాది చివరిలో రాష్ట్ర రాజకీయాల్లో రచ్చరేపిన ధాన్యం కొనుగోళ్ల అంశంలోనూ కాంగ్రెస్ క్రియాశీలకంగానే వ్యవహరించింది. ఇందిరాపార్కు వేదికగా రెండ్రోజుల పాటు దీక్ష చేసిన ఆ పార్టీ నేతలు.. అటు బీజేపీకి, ఇటు టీఆర్ఎస్కు దీటుగానే కౌంటర్ ఇచ్చారు. తప్పని అసమ్మతి, అలకలు కాంగ్రెస్ పార్టీలో తరచూ కనిపించే అసమ్మతి, అలకలు 2021లోనూ ఎదురయ్యాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకాన్ని ఇష్టపడని పలువురు నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఆయా నేతలను రేవంత్ బుజ్జగించినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీనిపై చర్చించేందుకు టీపీసీసీ ముఖ్య నేతలను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించాల్సి వచ్చింది. పార్టీ కోర్ కమిటీ స్థానంలో ఈ ఏడాది సెప్టెంబర్ 12న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసి.. షబ్బీర్ అలీని కన్వీనర్‌గా నియమించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరికీ అందులో స్థానం కల్పించింది. ఇక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచారు. పీసీసీ అధ్యక్ష పదవి అడిగి వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సరిపెట్టుకున్న ఆయన.. తనదైన శైలిలో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. రేవంత్ పట్ల తన అభిప్రాయాన్ని బాహాటంగా చెప్తూ వచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సభ్యత్వ నమోదులో బిజీగా ఉంది. బీజేపీ మరింత జోష్ 2020 చివరిలో వచ్చిన గెలుపుతో 2021లోకి ప్రవేశించిన బీజేపీ.. అదే ఊపును కొనసాగించింది. జాతీయ నాయకత్వం మద్దతు ఓవైపు.. రాష్ట్రంలో సమకూరుతున్న బలం మరోవైపు ఆ పార్టీకి మరింత జోష్‌ను ఇచ్చాయి. అదే క్రమంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏడాది పొడవునా ఆందోళనలు, ఉద్యమాలు, వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుంది. సై అంటే సై అంటూ పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ జనంలోకి వెళ్లింది. ఆయా కార్యక్రమాలకు జాతీయ నేతలను రప్పించింది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ సర్కార్‌పై ఒత్తిడి పెంచేందుకు, రాష్ట్రంలో మెజారిటీ వర్గం ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో నిర్మల్‌లో సభ నిర్వహించింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. బీజేపీ ఈ ఏడాది రాజకీయంగా పలు ఎత్తుపల్లాలు చవిచూసింది. మొదట్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓటమి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడం వంటి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఆగస్టు చివరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సీఎం కేసీఆర్, మంత్రులపై బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు నేరుగా విమర్శలు, ఆరోపణలు సంధిస్తూ, సవాళ్లు విసురుతూ.. టీఆర్ఎస్ నాయకత్వం తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితులు కల్పించారు. తద్వారా జనంలో బీజేపీ వైపు దృష్టి మరలేలా చేయగలిగారు. ఇకముందు కూడా ఇదే ఊపు కొనసాగించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంది. 2022 ఏడాది మొదట్లోనే రెండో విడత పాదయాత్ర చేపట్టి.. పెట్రోల్‌పై రాష్ట్ర వ్యాట్ తగ్గింపు, దళితబంధు అమలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి అంశాలపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. హుజూరాబాద్ గెలుపు నుంచి.. టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఈటల రాజేందర్.. బీజేపీ తరఫున బరిలోకి దిగి హుజూరాబాద్‌లో విజయం సాధించడంతో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. టీఆర్ఎస్ పెద్దలు సర్వశక్తులూ ఒడ్డినా, భారీగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసినా ఈటల విజయం సాధించడాన్ని అనుకూలంగా మల్చుకోవడంపై దృష్టిపెట్టింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే ప్రచారం మొదలుపెట్టింది. ఇందుకు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అండదండలు అందించడంతో.. కొత్త కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించింది. కిషన్‌రెడ్డికి కేబినెట్ హోదాతో.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న జి.కిషన్‌రెడ్డికి ఈ ఏడాది కేంద్ర కేబినెట్ మంత్రి హోదా లభించింది. పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను ఆయనకు అప్పగించారు. తెలంగాణ ఏర్పడ్డాక, అంతకు ముందు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలెవరికీ ఇలా కేంద్ర కేబినెట్ హోదా లభించలేదు. దీనిని బట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయజెండా ఎగరవేయాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం ముందుకు వెళుతోంది. వైఎస్సార్టీపీ కొత్త ఆశలతో.. తెలంగాణలో ఈ ఏడాది మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తానూ రంగంలో ఉన్నానంటూ ‘వైఎస్సార్టీపీ’పార్టీని స్థాపించారు. పార్టీని ప్రారంభించినప్పటి నుంచీ ఆమె ప్రజల్లోనే ఉంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరుద్యోగ దీక్షలు, పాదయాత్రలు, రైతు ఆవేదన దీక్షలు నిర్వహిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, ఇతర బాధితుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చుతున్నారు. తాను అండగా నిలుస్తానంటూ భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ పెద్దల తీరుపై గట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ఆశించినమేర చేరికలు లేకపోయినా.. మెల్లగా ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. -
2021లో ఎగబడి సందర్శించిన వెబ్సైట్ ఇదే..! గూగుల్ మాత్రం కాదండోయ్..!
Top 10 Most Visited Websites In The World 2021: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సందర్శించిన వెబ్సైట్ ఏదంటే ఠక్కున ఏది చెప్తాం..సింపుల్ గూగుల్ అనేస్తాం. ఎందుకంటే మనకు ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసం సింపుల్‌గా ఒకే గూగుల్...! అంటూ గూగుల్.కామ్‌ను తలుపుతడతాం. ఇలా మనలో అందరూ చేసే వాళ్లమే. అయితే 2021 ఏడాదిగాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సందర్శించిన వెబ్సైట్ మాత్రం గూగుల్ కాదండోయ్..అవును మీరు విన్నది నిజమే. 2021లో అత్యధికంగా సందర్శించిన వెబ్సైట్ల మొదటి స్ధానంలో టిక్‌టాక్ నిలిచింది. తరువాతి స్థానంలో గూగుల్ నిలవడం గమనర్హం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించిన టాప్ 10 వెబ్సైట్ లిస్ట్ మీకోసం...! 1. టిక్‌టాక్. కామ్ ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ ప్రపంచంలోనే ఎక్కువ మంది సందర్శించిన వెబ్‌సైట్‌గా నిలిచింది. భారత్‌లో నిషేధం ఉన్నప్పటికీ టిక్‌టాక్ అదరగొట్టింది. సుమారు 1 బిలియన్ వరకు క్రియాశీల వినియోగదారులను టిక్‌టాక్ కలిగి ఉంది. బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక మొత్తంలో ట్రాఫిక్‌ను సొంతం చేసుకున్నది 2.గూగుల్.కామ్ మనకు ఏదైనా చిన్న సమస్య వచ్చిదంటే చాలు వెంటనే చేసేది గూగుల్ సెర్చ్. కాగా 2021లో రెండవ స్థానంలో ఉండడం. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే రెండవ వెబ్‌సైట్‌గా తన స్థానాన్ని దక్కించుకున్నది. 3. ఫేస్బుక్.కామ్ టిక్‌టాక్, గూగుల్ తరువాత మూడోస్థానంలో ఫేస్బుక్ నిలిచింది. 2021లో ఫేస్బుక్ తన పేరును మెటాగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫేస్‌బుక్‌కు అంతగా కలిసి రాలేదు. వీపరితమైన ఆరోపణలు మార్క్ జుకమ్‌బర్గ్ వెన్నులో వణుకు తెచ్చేలా చేశాయి. ఫేస్బుక్ 0.8 బిలియన్ క్రియాశీల యూజర్లు ఉన్నారు. 4. మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ నాలుగో స్ధానంలో నిలిచింది. మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన వన్‌డ్రైవ్, ఎక్స్బాక్స్లన భారీగా సందర్శించారు. 5. యాపిల్ యాపిల్ సంస్థ 5వ స్థానంలో కొనసాగడం అనేది కూడా కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఐక్లౌడ్, యాప్‌స్టోర్ వంటి ఇతర సేవలను సందర్శించే వ్యక్తులు అధికంగా ఉన్నప్పటికీ ఈ స్థానాన్ని కలిగి ఉంది. 6. అమెజాన్ కరోనా సమయంలో చాలా మంది వ్యక్తులు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎక్కువగా సందర్శించారు. ఆన్లైన్ షాపింగ్ మార్కెట్ గణనీయంగా పెరిగింది. 2021లో అత్యధికంగా సందర్శించిన వెబ్సైట్ ల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. 7. నెట్‌ఫ్లిక్స్ కరోనా-19 రాక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కాసుల వర్షాని కురిపించింది. థియేటర్లు మూతపడటంతో సినీ లవర్స్ ఓటీటీలకు ఎగబడ్డారు. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏడవ స్థానంలో నిలిచింది. 8. యూట్యూబ్ ప్రముఖ ఓటీటీ సంస్థలు, అమెజాన్, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ రాకతో యూట్యూబ్‌కు భారీ పోటీనిచ్చాయి. 2021లో అధిక మంది సందర్శించిన ప్లాట్‌ఫారమ్స్‌లో యూట్యూబ్ 8వ స్థానంలో ఉంది. 9. ట్విటర్ 2021లో ఫేస్బుక్ ఒక్కసారిగా డౌన్ అవ్వడంతో ఠక్కున యూజర్లు ట్విటర్ తలుపులను తట్టారు. ఈ ఏడాదిలో అత్యధిక సందర్శించిన వెబ్సైట్లో ట్విటర్ 9 స్ధానంలో నిలిచింది. 10. వాట్సాప్ చివరగా పదో స్థానంలో మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ నిలిచింది. టాప్ 10 జాబితాలో మెటా యాజమాన్యంలోని రెండు యాప్ లు ఉండడం విశేషం. చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..! -
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న లవ్ బర్డ్స్ వీళ్లే..
Top Celebrities Weddings In 2021: See Which Stars Tied The Knot: అప్పటి వరకు సోలో లైఫే సో బెటర్ అన్నవాళ్లు సైతం ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కారు. కొంతమంది డెస్టినేషన్ వివాహం చేసుకుంటే, మరికొందరేమో ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది 2021లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలపై మీరూ ఓ లుక్కేయండి. ప్రముఖ గాయని, డబ్బింగ్ అర్టిస్ట్ సునీత ఈ ఏడాది జనవరి9న వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడింది. అప్పట్లో వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. హీరోయిన్ ప్రణీత సుభాష్ వివాహం మే31న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో జరిగింది. . ‘అత్తారింటికి దారేదీ’సినిమాతో గుర్తింపు పొందిన ప్రణీత అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ ఈ ఏడాది జూన్4న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్‌తో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఈ ఏడాది జనవరి14న ఓ ఇంటి వాడయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌తో ముంబైలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరిగింది. దాదాపు 11సంవత్సరాల రిలేషన్ అనంతరం బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ తన ప్రియురాలు పత్రలేఖను నవంబర్15న పెళ్లాడాడు. తెలుగమ్మాయి ఆనంది కోలీవుడ్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌ను పెళ్లాడింది. ‘బస్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, గ్రీన్ సిగ్నల్’ వంటి చిత్రాలలో టాలీవుడ్లో గుర్తింపు పొందిన ఈ భామ తమిళంలో బిజీ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ ఏడాది తెలుగులో ‘జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా వివాహం వివాహం ఫిబ్రవరి 15న వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో జరిగింది. ‘చెలి’ హిందీ రీమేక్ ‘రెహనా హై తేరే దిల్ మే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దియా మీర్జా గతంలో సహిల్ సంఘా ను వివాహం చేసుకుంది. 11 సంవత్సరాల తర్వాత వారు 2019లో విడాకులు తీసుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ను హైదరాబాద్‌లో ఏప్రిల్ 22న వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటి వాడయ్యాడు. ప్రియురాలు లోహిత రెడ్డితో నవంబర్ 21న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. బాలీవుడ్ కత్రినా కైఫ్, వీక్కీ కౌశల్ ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 9న మూడుమూళ్ల సాక్షిగా ఏడడుగులు వేసి అధికారికంగా భార్యభర్తలు అయిపోయారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. -
నిమిషానికి 115 ఆర్డర్స్..! 2021లో భారతీయులు ఎగబడి లాగించేసిన ఫుడ్ ఇదే...!
2021గాను ఆన్లైన్లో అత్యధికంగా ఆర్డర్స్ చేసిన ఫుడ్ డిషెస్ వివరాలను ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రిలీజ్ చేసింది. నిమిషానికి 115 ప్లేట్ల ఆర్డర్స్‌తో బిర్యానీ టాప్ పొజిషన్లో నిలిచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఆరో వార్షిక నివేదిక StatEATstics రిపోర్ట్‌లో పలు విషయాలను కంపెనీ పేర్కొంది. అగ్రస్థానం బిర్యానీదే..! భోజన ప్రియులు 2021లో స్విగ్గీ ప్లాట్‌ఫాంను భారీగానే తలుపుతట్టారు. ఈ ఏడాదిలో సుమారు 4.25 లక్షల మంది కొత్త యూజర్లు స్విగ్గీలో చేరినట్లు కంపెనీ ప్రకటించింది. వీరు మొదటి ఆర్డర్‌గా చికెన్ బిర్యానీనే పెట్టినట్లు స్విగ్గీ వెల్లడించింది. అదే సమయంలో ఈ ఏడాదిలో ఎక్కువగా ఆర్డర్ చేసిన స్నాక్ ఐటమ్‌గా సమోసా నిలిచింది. 2021లో సుమారు 50 లక్షల సమోసా ఆర్డర్స్ వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఆర్డర్స్ దాదాపు న్యూజిలాండ్ దేశ జనాభాతో సమానం. గత ఏడాది 2020లో, నిమిషానికి 90పైగా బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఏడాదిలో ఫుడ్ లవర్స్ ఒక సెకనులో సుమారు రెండు బిర్యానీలను ఆర్డర్స్ చేసినట్లు పేర్కొంది. చికెన్ బిర్యానీ, సమోసాల తరువాత చికెన్ వింగ్స్, పావ్ భాజీ నిలిచాయి. 21 లక్షల ఆర్డర్స్‌తో ఇండియా సెకండ్ ఫేవరెట్ స్నాక్ పావ్‌బాజీ నిలిచింది. స్విట్స్లో 21 లక్షల ఆర్డర్స్‌తో గులాబ్ జామూన్ నిలవగా, తరువాతి స్థానంలో రస్మలై సుమారు 12 లక్షల ఆర్డర్స్‌ను డెలివరీ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. హెల్త్‌పై ఎక్కువ.. కరోనా రాకతో చాలా మంది హెల్తీ డైట్‌పై అవగాహన పెంచుకున్నారు. స్విగ్గీలో హెల్తీ డైట్‌ను వెతికిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత పెడాదితో పోలీస్తే 200 శాతం మేర ఆర్డర్స్ పెరిగాయని స్విగ్గీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అత్యంత ఆరోగ్య స్పృహ కలిగిన నగరంగా తొలిస్థానంలో బెంగుళూరు నిలవగా, తరువాతి స్థానంలో హైదరాబాద్, ముంబై నగరాలు నిలిచాయి. గ్రాసరీ బిజినెస్ విషయానికి వస్తే..! స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలతోపాటుగా ఇన్‌స్టామార్ట్ పేరుతో గ్రాసరీ డెలివరీ సేవలను మొదలుపెట్టింది. ఈ ఏడాదిలో 28 మిలియన్ ప్యాక్‌ల పండ్లు , కూరగాయలను డెలివరీ చేసింది. ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేసిన మొత్తం అరటిపండ్ల పరిమాణం అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే 2.6 రెట్లు అధికం. చదవండి: జనవరి 1 నుంచి స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ధరలు పెరగనున్నాయి? -
2021 రౌండప్: అత్యంత చెత్త కంపెనీ ఏదంటే..
2021 Best And Worst Companies Of The Year: ఎప్పటిలాగే ఈ ఏడాది వ్యాపార రంగంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అదే టైంలో ఘోరమైన పతనాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ ట్రేడింగ్‌లో ఊహించని పరిణామాలే ఎదురయ్యాయి.. ఒమిక్రాన్ ప్రభావంతో ఇంకా ఎదురవుతున్నాయి కూడా. చైనా లాంటి అతిపెద్ద(రెండో) ఆర్థిక వ్యవస్థను.. గ్లోబల్ రియల్టి రంగాన్ని కుదిపేసిన ‘ఎవర్‌గ్రాండ్’ డిఫాల్ట్ పరిణామం ఇదే ఏడాదిలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో కంపెనీల పని తీరును, ఇతరత్ర కారణాలను బట్టి జనాల వోటింగ్ ద్వారా బెస్ట్, వరెస్ట్ కంపెనీల లిస్ట్‌ను ప్రకటించింది యాహూ ఫైనాన్స్ వెబ్సైట్. 2021 ఏడాదిగానూ ప్రపంచంలోకెల్లా చెత్త కంపెనీగా నిలిచింది మెటా (ఇంతకు ముందు ఫేస్బుక్). ఒపీనియన్ పోల్‌లో ఎక్కువ మంద పట్టం కట్టడం ద్వారా ‘వరెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్’ గా నిలిచింది. ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా నిలిచింది. అలీబాబా కంటే 50 శాతం అత్యధిక ఓట్లు మెటా దక్కించుకోవడం విశేషం. ఇక ఇలా ప్రతీ ఏడాది బెస్ట్-వరెస్ట్ కంపెనీల జాబితాను యాహూ ఫైనాన్స్ వెబ్సైట్ విడుదల చేయడం సహజం. యాహూ ఫైనాన్స్ హోం పేజీ నుంచి సర్వే మంకీ ద్వారా డిసెంబర్ 4, 5 తేదీల్లో ఈ సర్వేను నిర్వహించారు. వివాదాలు, విమర్శల నేపథ్యంలో.. మెటా కంపెనీకి వరెస్ట్ కంపెనీ హోదాను కట్ట బెట్టడం విశేషం. ఇక యూజర్ల అభిప్రాయంలో ఎక్కువగా ఫేస్బుక్ మాజీ ఉద్యోగిణి ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణల గురించి కనిపించింది. ఫేస్బుక్ తీరు, ఇన్స్టాగ్రామ్ యువత మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపడం, పిల్లల మీదా చెడు ప్రభావం కారణాలు.. ఫేస్బుక్ Meta గా మారినా కూడా వరెస్ట్ హోదాను కట్టబెట్టాయి. ఇక ఈ సర్వేలో పాల్గొన్న పదిలో ముగ్గురు మాత్రమే ఫేస్బుక్ తన తప్పులు సరిదిద్దుకోగలదన్న అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. ఇక యాహూ ఫైనాన్స్ లిస్ట్‌లో బెస్ట్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. కిందటి ఏడాదితో పోలిస్తే.. వాటా 53 శాతానికి పెంచుకోవడంతో పాటు 2 ట్రిలియన్ మైలురాయి దాటడం, మైక్రోసాఫ్ట్‌కి కలిసొచ్చాయి. చదవండి: చైనీస్ ఆపరేషన్.. మెటా దర్యాప్తులో సంచలన విషయాలు -
2021లో నాకు సాయం చేసినవి ఇవే!: ముకేష్ అంబానీ
Mukesh Ambani.. Most Helped Five Books In 2021: ఒక చిన్నటేబుల్, ఒక కుర్చీ సెటప్‌తో చిన్న స్టార్టప్‌గా మొదలైంది రిలయన్స్. మైక్రో-ఎంటర్‌ప్రైజ్‌గా ఎదిగి.. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎంటర్ప్రైజ్లలో ఒకటిగా పేరు దక్కించుకుంది. గ్లోబల్ ట్రేడ్‌లో ఏదో ఒక మైలు రాయిని అధిగమించినప్పుడల్లా తన తండ్రి ధీరుభాయ్ అంబానీ పడ్డ కష్టమే తనకు స్ఫూర్తి అంటూ రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ చెప్తుండడం చూస్తున్నాం. అయితే కరోనా కాలంలో తనలో కొత్త ఉత్సహాన్ని నింపింది తద్వారా రిలయన్స్ ఎదుగుదలకు సాయం చేసింది కొందరి రచనలే అని ఆయన అంటున్నాడాయన. బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ డిగ్రీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ చేసిన ముకేష్.. వ్యాపార దిగ్గజాలు, మేధావులు రాసే పుస్తకాలను క్రమం తప్పకుండా చదువుతుంటారు. అంతేకాదు వాటి రివ్యూలను సైతం ఇస్తూ.. వర్తమాన వ్యాపారులకు చదవమని సూచిస్తుంటారు కూడా. 2021 బిజినెస్ ఇయర్‌ని అర్థం చేసుకోవడానికి.. 2022కి సన్నద్ధం కావడానికి ముకేష్ అంబానీకి ఐదు పుస్తకాలు సాయపడ్డాయట. అవేంటో చూద్దాం ఇప్పుడు.. టెన్ లెస్సన్స్ ఫర్ ఏ పోస్ట్-ప్యాండెమిక్ వరల్డ్ ఇండో-అమెరికన్ జర్నలిస్ట్ ఫరీద్ జకారియా రాసిన పుస్తకం ఇది. కోవిడ్-19 మహమ్మారి, ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని అత్యంత వినాశకరమైన సంఘటనల మధ్య కొన్ని స్పష్టమైన సారూప్యతలను సంగ్రహించి ఫరీద్ ఈ పుస్తకం రాశారు. ప్రపంచ సంక్షోభాలనేవి తరచుగా నిలకడలేని జీవనశైలి పద్ధతులు.. బలహీనమైన పాలనా నిర్మాణాల నుండి ఉద్భవించాయని చెప్తుంది ఈ పుస్తకం. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని, సమర్థవంతమైన నాయకత్వం, జీవనశైలి మార్పు, సమర్థవంతమైన అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుందని ఈ పుస్తకం చెబుతుంది. ‘‘వ్యాప్తి అనివార్యం, కానీ మహమ్మారి ఐచ్ఛికం’’ పుస్తకంలో ముకేష్కి బాగా నచ్చిన కొటేషన్ అంట!. ప్రిన్సిపుల్స్ ఫర్ డీలింగ్ విత్ ది ఛేంజింగ్ వరల్డ్ ఆర్డర్: వై నేషన్స్ సక్సీడ్ అండ్ ఫెయిల్ అమెరికన్ బిలియనీర్ ఇన్వెస్టర్ రే దాలియో రాసిన పుస్తకం ఇది. ప్రధాన దేశాలకు సంబంధించిన చరిత్రలో ఐదు వందల ఏళ్ల విజయాలను, వైఫల్యాలను స్థిరంగా పరిశీలించి.. అన్ని కోణాల్లోనూ అంశాలను స్పృశించిన ఆసక్తికరమైన పుస్తకం. ప్రస్తుతం, రాబోయే కాలాల మార్పుల మీద సమగ్రంగా చర్చ జరిపిన పుస్తకం ఇది. పాలసీ మేకర్లు, వ్యవస్థాపకులు(ఎంట్రప్రెన్యూర్లు), కార్యనిర్వాహకులు(ఎగ్జిక్యూటివ్స్) మరీముఖ్యంగా యువత తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. ది రాగింగ్ 2020s: కంపెనీస్, కంట్రీస్, పీపుల్ అండ్ ది ఫైట్ ఫర్ అవర్ ఫ్యూఛర్ అమెరికన్ ఆథర్ అలెక్ రాస్ రాసిన పుస్తకం ఇది. ఆధునిక నాగరికతలో అనేక దశాబ్దాలు కొనసాగిన సామాజిక ఒప్పందం, ప్రభుత్వాలు, వ్యాపారాలు, ప్రజల మధ్య అనధికార ఒప్పందాలనేవి.. డిజిటల్ యుగపు ప్రాథమిక మార్పునకు ఎలా లోనయ్యాయో ఇది లోతుగా పరిశోధించింది. ఈ మార్పునకు దోహదపడ్డ రాజకీయ- ఆర్థిక శక్తులపై, నాగరికతకు ముందున్న విషయాలపై ఈ కాలపు మేధావుల అభిప్రాయాలతో ఇంటర్వ్యూలు ఉన్నాయి ఈ పుస్తకంలో. 2030: హౌ టుడేస్ బిగ్గెస్ట్ ట్రెండ్స్ విల్ కొలిడే అండ్ రీషేప్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ స్పానిష్ సోషియాలజిస్ట్ మౌరో గుయిల్లెన్ రాసిన పుస్తకం ఇది. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ బుక్. 2030లో ప్రపంచ స్థితి గురించి, ముఖ్యంగా జనాభాలో సంభావ్య మార్పులు, దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక అవకాశాలపై ఎలా ఉంటుంది అనే విషయాలతో నిండి ఉంటుంది. కోవిడ్ అనంతర ప్రపంచాన్ని రూపొందించడానికి కట్టుబడి ఉన్న పట్టణీకరణ, సాంకేతికత, గిగ్ ఎకానమీ, ఆటోమేషన్లోని పోకడలను కూడా అన్వేషించింది. బిగ్ లిటిల్ బ్రేక్త్రోస్: హౌ స్మాల్, ఎవ్రీడే ఇన్నొవేషన్స్ డ్రైవ్ ఓవర్సైజ్డ్ రిజల్ట్స్ అమెరికన్ ఎంట్రెప్రెన్యూర్ జోష్ లింక్నర్ రాసిన బుక్ ఇది. వ్యాపారవేత్తలంతా తప్పక చదవాల్సిన బుక్ ఇది. వ్యాపారంలో భారీ లాభాలకు మూలకారణం.. సృజనాత్మకంగా చేపట్టే చిన్న చిన్న చర్యలు, నిర్ణయాలే అని ఈ బుక్ సారాంశం. రోజువారీ సూక్ష్మ-ఆవిష్కరణలను పెంపొందించడం ద్వారా, వ్యక్తులు మరియు సంస్థలు కఠినమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. తద్వారా కోవిడ్ అనంతర ప్రపంచంలో పరివర్తన అవకాశాలను స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు. చదవండి: క్రిప్టో కరెన్సీ బిల్లుపై ముఖేష్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఇయర్ ఎండ్ సేల్: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..!
ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ తయారీదారు సోనీ ఇయర్ ఎండ్ సేల్‌ను గురువారం (డిసెంబర్ 16) నుంచి ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, టీవీలపై భారీ ఆఫర్లను సోనీ ప్రకటించింది. సోనీ ఇయర్ ఎండ్ సేల్ 2022 జనవరి 3 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ఆఫ్‌లైన్, పలు ఎలక్ట్రానిక్ స్టోర్స్, సోనీ ఆన్లైన్ స్టోర్స్‌తో పాటుగా ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సోనీ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా పలు బ్రావియా టీవీలపై 30 శాతం మేర తగ్గింపు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను , రెండేళ్ల వారంటీని కొనుగోలుదారులకు సోనీ అందిస్తోంది. వీటితో పాటుగా వైర్లెస్ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్‌పై 60 శాతం మేర తగ్గింపును ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా సోనీ అందిస్తోన్న పలు ఆఫర్లు..! ►Sony Bravia XR-65A8OJ టీవీ కొనుగోలుదారులకు రూ. 2,65,990 కే రానుంది. దీని రిటైల్ ధర రూ. 3,39,900. Sony Bravia KD-55X8OJ మోడల్ టీవీ ధర రూ. 87,390కు రానుంది. దీని అసలు ధర రూ. 1,09,900 గా ఉంది. ►సోనీ WH-1000XM4 హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలుదారులు రూ. 24,990 కే సొంతం చేసుకోవచ్చును. దీని అసలు ధర రూ. 29,990. సోనీ WH-H910N హెడ్‌ఫోన్స్‌పై ఏకంగా 60 శాతం తగ్గింపుతో రూ. 9,990కు రానుంది. దీని అసలు ధర రూ. 24,990 ►సోనీ WH-CH710N హెడ్‌ఫోన్స్ ధర రూ. 7,990కు, సోనీ WH-XB900N ధర రూ. 9,990 కే కొనుగోలుదారులకు లభ్యమవుతోంది. ►సోనీ వైర్లెస్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌పై కూడా భారీ తగ్గింపులను అందిస్తోంది, సోనీ WF-1000XM3 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ రూ. 9,990 ధరకు, సోనీ WF-SP800N TWS ఇయర్‌బడ్స్ ధర రూ. 10,990కు, సోనీ WF-XB700 ధర రూ. 6,990 కు రానున్నాయి. ►సోనీ SRS-XB13 వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్‌పై రూ. 3,590 కు రానుంది. కంపెనీ వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్లపై కూడా తగ్గింపులను అందిస్తోంది, సోనీ WH-CH510 , WI-XB400 మోడల్స్ వరుసగా రూ. 2,990, రూ. 2,790 కే రానుంది. చదవండి: ఏసర్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..! -
ఇయర్ ఎండ్ సేల్: పలు కార్ల కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!
Year End Offers On Cars 2021: మీరు కారు కొనాలనుకుంటున్నారా..! అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పలు వాహనాల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆయా కార్ల ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇయర్ ఎండ్ కావడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. నిస్సాన్, మహీంద్రా, హోండా, హ్యుందాయ్ వంటి వాహన తయారీదారులు ఇయర్ ఎండ్సేల్ను ప్రకటించాయి. ఈ ఆఫర్లు డిసెంబర్ 31, 2021 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు చెల్లుబాటుకానున్నాయి. ఇయర్ ఎండ్ సేల్ భాగంగా పలు కార్లపై ఆయా కంపెనీలు అందిస్తోన్న ఆఫర్లు..! రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ ఇండియా ఈ నెలలో డస్టర్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ. 1.3 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ. 50 000 ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, రూ. 50వేల వరకు నగదు తగ్గింపు, రూ. 30 వేల వరకు కార్పొరేట్ తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. కంపెనీ reli.ve స్క్రాప్‌పేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చును. నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. నిస్సాన్ మిడ్-సైజ్ ఎస్యూవీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. 1.3 లీటర్ టర్భో పెట్రోల్ వెర్షన్‌పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 70 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ , రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ రెండు వెర్షన్లపై కొనుగోలుదారులకు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 ఆన్లైన్ బుకింగ్ బోనస్‌ను కూడా పొందవచ్చును. మహీంద్రా అల్టురాస్ G4 మహీంద్రా అల్టురాస్ G4 ఎస్యూవీ కొనుగోలుపై మహీంద్రా రూ. 81, 500 వరకు తగ్గింపులను ప్రకటించింది. ఇందులో రూ. 50 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 11,500 వరకు కార్పొరేట్ ఆఫర్, రూ. 20,000 వరకు ఇతర ఆఫర్లను కొనుగోలుదారులకు మహీంద్రా ప్రకటించింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్ కొనుగోలుపై గరిష్టంగా రూ. 50వేల వరకు తగ్గింపును పొందవచ్చును. ఈ ఆఫర్స్ టర్బో వేరియంట్‌పై మాత్రమే వర్తిస్తాయి. ఇతర పెట్రోల్, డీజిల్ వేరియంట్లు రూ.25,000 వరకు తగ్గింపులను పొందవచ్చును. స్పోర్ట్జ్ పెట్రోల్ DT వేరియంట్‌పై ఏలాంటి ప్రత్యేక ఆఫర్లు లేవు. సీఎన్జీ మోడల్స్‌పై రూ.17,300 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. హోండా సిటీ హోండా సిటీ కారుపై హోండా ఇండియా పలు ఆఫర్లను ప్రకటించింది. ఐదోవ తరం హోండా సిటీ సెడాన్‌పై గరిష్టంగా రూ. 45,108 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్స్ అన్ని వేరియంట్లకు వర్తిస్తాయి. ఇందులో రూ. 7,500 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 8,108 వరకు ఎఫ్ఓసీ ఉపకరణాలు ఉన్నాయి. వీటితో పాటుగా రూ. 15,000 ఎక్సేచేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్‌లో భాగంగా రూ. 5,000 లాయల్టీ బోనస్, రూ. 9,000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.8,000 కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. చదవండి: 20 కోట్ల సార్లు కాల్స్..! 6 లక్షల 64 వేల మందికి నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్..! -
2021 రౌండప్: అస్తమించిన టెక్ మేధావులు వీళ్లే..
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొత్త సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటిలో వాడుకలోకి వచ్చినవి కొన్నైతే.. మెటావర్స్ లాంటి సంచలనానికి బీజం పడింది కూడా 2021లోనే!. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో టెక్ రంగానికి విశిష్ట సేవలు అందించిన దిగ్గజాలు కొందరు తనువు చాలించారు. ఏడాది ముగింపు సందర్భంగా వాళ్లను, వాళ్ల సేవలను ఓసారి గుర్తు చేసుకుంటూ.. పర్సనల్ కంప్యూటర్ సృష్టికర్త బ్రిటిష్ ఇన్వెంటర్ సర్ క్లయివ్ సిన్‌క్లెయిర్. జీఎక్స్(ZX) స్పెక్ట్రమ్ కంప్యూటర్ సృష్టికర్త. ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్‌గా దీనికంటూ ఓ పేరుంది. అంతేకాదు కంప్యూటర్ వీడియో గేమ్‌లు, కోడింగ్ లాంటి విషయాల్ని జనాలకు దగ్గర చేసింది కూడా ఇదే. ఒకరకంగా ఇళ్లలో కంప్యూటర్ల వాడకానికి మూలకారకుడు ఈయనే. 1983లో సిన్క్లెయిర్కు నైట్‌హుడ్ గౌరవం దక్కింది. 1985లోనే బ్యాటరీతో నడిచే సింగిల్ సీటర్ వెహికిల్ C5ను ఈయన రూపొందించినప్పటికీ.. సేఫ్టీ కోణంలో ఆ వెహికిల్ ఆటోమొబైల్ మార్కెట్ దృష్టిని ఆకర్షించలేకపోయింది. 2021 సెప్టెంబర్‌లో 81 ఏళ్ల వయసులో సుదీర్ఘ అనారోగ్యంతో సర్ క్లైవ్ సింక్లెయిర్ కన్నుమూశారు. వీడియో గేమ్ రారాజు మసయుకి యుయిమురా.. ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్‌లకు ఊపు తెచ్చిన మేధావి. జపాన్‌కు చెందిన ఈ గేమింగ్ ఇంజినీర్.. ప్రఖ్యాత గేమింగ్ కంపెనీలైన నిన్టెండో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, సూపర్ నిన్టెండో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్‌లో పాపులర్ గేమ్స్ రూపకర్తగా పేరుగాంచాడు. విశేషం ఏంటంటే.. 1981లో అప్పటి నిన్టెండో అధ్యక్షుడు యమౌచీ కోరిక మేరకు క్యాట్రిడ్జ్‌లలో సైతం గేమ్‌లు ఆడేలా వీడియో గేమింగ్ వ్యవస్థను డిజైన్ చేశాడు మసయుకి. అంతేకాదు 80వ దశకంలో నిన్టెండ్ను అమెరికాలో టాప్ గేమింగ్ కంపెనీల్లో ఒకటిగా నిలిపాడు. మూడు దశాబ్దాలపాటు నిన్టెండ్తో సాగిన ఆయన అనుబంధం.. 2004తో ముగిసింది. అప్పటి నుంచి ఆయన రిట్సుమెయికన్ యూనివర్సిటీలో గేమ్ స్టడీస్ పాఠాలు చెప్తూ వచ్చారు. చివరికి.. ఈ డిసెంబర్లోనే 78 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. అడోబ్, పీడీఎఎఫ్ రూపకర్త ప్రపంచంలో అతిపెద్ద సాప్ట్వేర్ కంపెనీల లిస్ట్‌లో(300 బిలియన్ డాలర్ల) ఉంది అడోబ్. టెక్ దిగ్గజం జాన్ వార్నోక్‌తో కలిసి అడోబ్‌ను స్థాపించాడు ఛార్లెస్ మాథ్యూ గెస్చ్‌క్లె. అంతేకాదు ఈయన పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైండర్ (PDF) సహ రూపకర్త కూడా. చక్ అని ముద్దుగా పిల్చుకునే ఈ అమెరికన్ టెక్ దిగ్గజం.. వార్నోక్‌తో కలిసి 1982లో అడోబ్ PostScript(ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్) ఉత్పత్తి ద్వారా డెస్క్‌టాప్ పబ్లిషింగ్ పరిశ్రమలో సంచలనానికి తెరలేపారు. ఆ తర్వాత అడోబ్ ప్రొడక్టులు సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. 1992లో ఇద్దరు దుండగులు ఆయన్ని కిడ్నాప్ చేయగా.. ఆయన సురక్షితంగా బయటపడి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో 81 ఏళ్ల వయసులో చక్ అనారోగ్యంతో కన్నుమూశారు. టేప్ రికార్డ్.. ఆడియో క్యాసెట్ లొయు ఒటెన్స్.. డచ్ ఇంజినీర్. కానీ, పుట్టింది బెర్లిన్‌లో. క్యాసెట్ టేప్ తయారు చేసిన మహా మేధావి. అంతేకాదు సుదీర్ఘ కాలం పిలిప్స్ కంపెనీలో పని చేసిన ప్రొడక్ట్ ఇంజినీర్‌గా కూడా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఈ కాలంలోనే ఆయన ఎన్నో సంచలన ఆవిష్కరణలకు మూలం అయ్యాడు. పిలిప్స్ కంపెనీ నుంచి పోర్టబుల్ టేప్ రికార్డ్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది ఈయన హయాంలోనే. అయితే ఒట్టెన్ కెరీర్లో సంచలనం మాత్రం.. 1963(ఆగష్టు) బెర్లిన్ ఎలక్ట్రానిక్ ఫెయిర్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆడియో క్యాసెట్ రిలీజ్ కావడం. ఆ తర్వాతే ఈ ఐడియాను జపాన్ కంపెనీలు కాపీ కొట్టాయి. అయితే ఒట్టెన్ చొరవతో ప్రపంచ మార్కెట్లో సోనీ, పిలిప్స్ క్యాసెట్లు స్టాండర్డ్ మోడల్స్‌గా నిలవగలిగాయి. డెబ్భై దశకంలో కాంపాక్ట్ డిస్క్(CD) టెక్నాలజీ డెవలప్ చేయించింది ఈయనే. ఈ ఏడాది మార్చ్‌లో ఆయన నెదర్లాండ్స్‌లోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. విలాసం టు విషాదం మెక్అఫీ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ సృష్టికర్తగా జాన్ మెక్అఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్‌లో పుట్టి, అమెరికాలో పెరిగిన మెక్అఫీ.. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ యాంటీ వైరస్‌ను(1987)లో రూపొందించాడు. తద్వారా సాఫ్ట్వేర్ ప్రపంచంలోనే ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. అయితే ఈ లెగసీని ఆయన ఎంతో కాలం కొనసాగించలేకపోయాడు. 2011లో ఇంటెల్ కంపెనీ ఏకంగా 7.68 బిలియన్ డాలర్లు చెల్లించి.. మెక్అఫీ యాంటీ వైరస్ హక్కుల్ని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఆయన పతనం మొదలైంది. రాసలీలలు, డ్రగ్స్, తుపాకులు.. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్‌గా పేరున్న మెక్అఫీ.. టెన్నెస్సెలో పన్నుల ఎగవేత, న్యూయార్క్‌లో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు(అదనంగా ఓ హత్య కేసు విచారణ తప్పించుకునే క్రమంలో అరెస్టయ్యి).. బార్సిలోనా(స్పెయిన్) జైల్లో శిక్ష అనుభవించాడు. అయితే పన్నుల ఎగవేత నేరంపై ఆయన్ని తిరిగి అమెరికాకు అప్పగించాలని ఈ ఏడాది జూన్‌లో స్పెయిన్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జైల్లో మగ్గిపోవడం ఇష్టం లేక అదేరోజు మెక్అఫీ (75) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
2021 ఈ హీరోలకు చాలా స్పెషల్.. అద్భుతాలు జరిగాయి!
2021లో బాక్సాఫీస్ రన్ చాలా తక్కువ. కాని ఎక్కువగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న టాప్ యాక్టర్స్, యంగ్ హీరోస్ హిట్ ట్రాక్ అందుకోవడం ఈ ఇయర్ స్పెషాలిటీ. క్రాక్ టు అఖండ వరకు చూసుకుంటే 2021 కమ్ బ్యాక్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ‘క్రాక్’తొ కమ్ బ్యాక్ సంక్రాంతి సీజన్ లో రిలీజైన క్రాక్ మూవీతో మాస్ రాజా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. 2017 లో విడుదలైన రాజా ది గ్రేట్ మూవీ తర్వాత రవితేజ వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఏడాది ప్రారంభంలో విడుదలైన క్రాక్ అనూహ్య రీతిలో విజయాన్ని అందుకున్నాడు. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీలోనూ ,ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. మాస్ రాజా కు బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. నరేశ్ విజయానికి ‘నాంది’ 2012లో వచ్చిన బ్లాక్ బస్టర్ సుడిగాడు తర్వాత మళ్లీ ఆ స్తాయిలో విజయాన్ని అందుకోవడానికి అల్లరి నరేష్ 2021 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో విడుదలైన ‘నాంది’ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పైగా అల్లరి నరేష్ తన అల్లరిని పక్కన పెట్టి పూర్తిగా సీరియల్ సబ్జెక్ట్ లో నటించి మెప్పించాడు. సీటీ కొట్టించిన ‘సీటిమార్’ 2014లో లౌక్యంతో సూపర్ హిట్ కొట్టాడు గోపీచంద్. మధ్యలో చాలా చిత్రాలు చేసాడు కాని కావాల్సిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. 2021లో సీటీమార్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నాడు. అఖిల్ ఖాతాలో భారీ విజయం 2015లో హీరోగా కెరీర్ ప్రారంభించాడు అఖిల్. హెలో, మిస్టర్ మజ్ను లాంటి మూవీస్ చేసినప్పటికీ ఫస్ట్ హిట్ మాత్రం దక్కలేదు. కాని ఈ ఇయర్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఈ అక్కినేని హీరోగా మెమొరబుల్ హిట్ గా నిలిచింది. ‘అఖండ’తో నటసింహం బాక్సాఫీస్ వేట రవితేజ, అల్లరి నరేష్, గోపీచంద్, అఖిల్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఈ ఏడాదే బాక్సాఫీస్ వేట మొదలు పెట్టాడు. అఖండతో సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ కు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందించాడు బాలయ్య. 2017లో విడుదలైన గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత మళ్లీ హిట్ కొట్టలేదు బాలయ్య. దాదాపు నాలుగేళ్ల తర్వాత అఖండతో బంపర్ హిట్ కొట్టాడు. -
2021లో వచ్చిన బెస్ట్ సూపర్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
2021 పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు బిజినెస్ ‘కొంచెం ఇష్టం..కొంచెం కష్టం’గా గడిచింది. మరికొన్ని కంపెనీలకేమో మూడు పువ్వులు ఆరుకాయలుగా గణనీయమైన వృద్ధిని సాధించాయి. దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలను చిప్స్ కొరత, సప్లై చైన్ వంటి సమస్యలు వెంటడాయి. అయినప్పటికీ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారత్ కాసుల వర్షాలను కురిపించాయి. 2021 స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు గొప్ప సంవత్సరంగా నిలిచింది. 2021లో వచ్చిన సూపర్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాను ప్రముఖ టెక్ వెబ్సైట్ గాడ్జెట్స్ 360 ఎంపిక చేసింది. ఆయా స్మార్ట్ఫోన్ల పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ధరలు ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని గాడ్జెట్స్ 360 ఈ ఏడాది వచ్చిన సూపర్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. కాగా గాడ్జెట్స్ 360 ఎంచుకున్న స్మార్ట్ఫోన్లలో ఏ మోడల్స్ కూడా 10/10 స్కోర్‌ను సాధించలేకపోయాయి. గాడ్జెట్స్ 360 ఎంపిక స్మార్ట్ ఫోన్లలో యాపిల్, వివో, రియల్ మీ, ఎంఐ, శాంసంగ్, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ నిలిచాయి ఈ ఏడాది వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..! ►యాపిల్‌కు చెందిన ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐపోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్స్ తొలి నాలుగుస్థానాల్లో నిలిచాయి. పర్ఫారెమెన్స్, డిజైన్, డిస్ప్లే పరంగా మిగతా స్మార్ట్ఫోన్ల కంటే ముందు స్థానంలో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు అధికంగా ఉండడంతో కొంతమంది వ్యక్తులకే మాత్రమే పరిమితమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు అధికంగా ఉండడంతో 10/10 స్కోర్‌ను సాధించలేకపోయింది. ►రియల్మీ స్మార్ట్‌ఫోన్ రియల్ మీ జీటీ నిలిచింది. పర్ఫారెమెన్స్, డిజైన్, డిస్ప్లే, కెమెరా, విషయంలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. యాపిల్ స్మార్ట్ఫోన్లతో పోల్చితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర తక్కువగా ఉండడంతో రియల్మీ జీటీ అమ్మకాలు భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. ►ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ ఈ ఏడాది రిలీజ్ చేసిన స్మార్ట్ఫోన్లలో Mi 11 అల్ట్రా అత్యంత శక్తివంతమైన ఫోన్‌గా నిలిచింది. శామ్సంగ్ గెలాక్సీ S21 కు గట్టిపోటీనే ఇచ్చింది. ►భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌గా Samsung S21 అల్ట్రా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫీచర్స్ అదరగొట్టాయి. ►కెమెరాస్ విత్ గింబల్ తో వచ్చిన స్మార్ట్ఫోన్లలో Vivo X70 Pro+ అద్బుతంగా ఉంది. సొగసైన డిజైన్, IP68 రేటింగ్, పదునైన 120Hz డిస్ప్లే, అద్భుతమైన వీడియో స్థిరీకరణ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. ►వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌లో OnePlus 9 ప్రో అద్బుతమైన పనితీరును కనబర్చింది.50W వైర్లెస్ ఛార్జింగ్ , క్లాస్-లీడింగ్ అల్ట్రా-వైడ్ కెమెరా వంటి కొన్ని కొత్త గుర్తించదగిన ఫీచర్లు వన్‌ప్లస్ 9 ప్రొలో ఉన్నాయి. చదవండి: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ లిస్ట్‌లో ఒకేఒక్కడు! అంతలా ఎందుకు వెతికారంటే.. -
అరెవ్వా..30 వెడ్స్ 21, సూర్య వెబ్‌సిరీస్‌లు అదరగొట్టాయే...! భారత్‌లోనే..
కరోనా రాకతో దేశవ్యాప్తంగా ఓటీటీ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందరు ఇంటికే పరిమితమవ్వడంతో ఓటీటీ యూజర్ల బేస్ అమాంతం అధికమైంది. ఓటీటీ సంస్థలకు కాసుల వర్షం కురిశాయి. ఇకపోతే యూట్యూబ్‌లో కూడా కంటెంట్ క్రియేటర్లకు భారీగానే డబ్బులు వచ్చాయి. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా యూట్యూబ్ ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగినట్లు యూట్యూబ్ డైరెక్టర్ సత్య రాఘవన్ వెల్లడించారు. 2021లో యూట్యూబ్‌లో వీపరితంగా ట్రెండింగ్ ఐనా అంశాలను యూట్యూబ్ ఇండియా విడుదల చేసింది. భారత్‌లో ట్రెండ్ ఐనవి..! 2021 యూట్యూబ్ ట్రెండింగ్ చాట్‌లో గేమింగ్ తొలిస్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో కామెడీ వీడియోలు అత్యంత ప్రజాదరణను పొందాయని యూట్యూబ్ వెల్లడించింది. గేమింగ్, కామెడీ వీడియోలను యూజర్లు అధికంగా చూసారని సత్యరాఘవన్ వెల్లడించారు. మ్యూజిక్, యూట్యూబ్ షార్ట్స్, వెబ్ సిరీస్‌లు కూడా ఎక్కువ మేర ట్రెండ్ అయ్యాయి. వీటితో పాటుగా ప్రాంక్ వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. యూట్యూబ్ షార్ట్ వీడియోలో... 2021లో యూట్యూబ్ షార్ట్ వీడియోలో A2 మోటివేషన్ (అరవింద్ అరోరా), మిస్టర్ జ్ఞాని ఫాక్ట్స్ అగ్రస్థానంలో నిలిచారు. టెక్నాలజీ విషయంలో Crazy XYZ , MR. INDIAN HACKER అగ్ర కంటెంట్ క్రియేటర్లుగా ఉన్నారు. కామెడీ విషయంలో 40 నిమిషాల నిడివి గల ‘Round2Hell’ హారర్-కామెడీ జోంబీ అపోకలిప్స్ షార్ట్ ఫిల్మ్ ట్రెండింగ్ వీడియోలో నంబర్ 1గా నిలిచింది. షార్ట్-ఫామ్ వీడియోలో కూడా నంబర్ 1గా భారత్‌లో నిలిచింది. యూట్యూబ్‌లో క్యారీమినాటి, బీబీ కీ వైన్స్, ప్రముఖ టీవీ షో తారక్ మెహతా కా ఊల్తా చష్మా నుంచి ఒక సన్నివేశం మొదటి పది స్థానాల్లోకి వచ్చిన ప్రసిద్ధ కామెడీ వీడియోలుగా నిలిచాయి. వెబ్‌సిరీస్ ట్రెండింగ్‌లో...30 వెడ్స్ 21, సూర్య.. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్, స్క్రిప్ట్ కంటెంట్‌ను యూజర్లు ఎగబడి చూశారు. ది వైరల్ ఫీవర్(టీవీఎఫ్)రూపొందించిన ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్, డైస్ మీడియా ఆపరేషన్ MBBS, క్లచ్ అత్యంత ఆదరణను పొందాయి. తెలుగులో వచ్చిన వెబ్‌సిరీస్‌లు కూడా తమ సత్తాను చాటాయి. ఈ ఏడాది ట్రెండ్ ఐనా వాటిలో గర్ల్ ఫార్ములా రూపొందించిన 30 వెడ్స్ 21, షణ్ముఖ్ జస్వంత్ నటించిన సూర్య వెబ్‌సిరీస్ కూడా నిలిచాయి. జెన్ జెడ్ వారే ఎక్కువ..! ఈ ఏడాది భారత్‌లో జెన్ జెడ్(1997 నుంచి పుట్టిన వారు) జనరేషన్ యూట్యూబ్‌లో ఎక్కువ మేర వీక్షించినట్లు తెలుస్తోంది. గేమింగ్ చానల్స్‌కు వీరు కాసుల వర్షాన్ని కురిపించారని సత్య రాఘవన్ వెల్లడించారు చదవండి: 2021లో తెగ వాడేసిన ఎమోజీ ఇదేనండోయ్..! -
2021లో తెగ వాడేసిన ఎమోజీ ఇదేనండోయ్..!
స్మార్ట్‌ఫోన్స్ రాకతో రకరకాల సోషల్ మెసేజింగ్ యాప్స్ మన ముందుకు వచ్చాయి. ఆయా మెసేజింగ్ యాప్స్‌ను వాడుతూ..మన స్నేహితులతోనే, బంధువులతోనే చాట్ చేస్తూ ఉంటాం. మెసేజ్ రూపంలోనే కాకుండా ఇతరులకు చెప్పదల్చుకున్న విషయాలను ఎమోజీలతో చెప్తుంటాం. రకరకాల ఎమోజీలను వాడుతూ మన అభిప్రాయాలను ఇతరులతో పంచుకుంటాం. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్స్ యూజర్లు ఎక్కువ మేర వాడిన ఎమోజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 2021లో తెగ వాడేసిన ఎమోజీ ఏదంటే..! 2021లో అత్యంత తరచుగా ఉపయోగించే ఎమోజీల డేటాను యూనికోడ్ కన్సార్టియం అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ విడుదల చేసింది. 'ఫేస్ విత్ టియర్స్ ఆఫ్ జాయ్(😂)' ఎమోజీ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత 'రెడ్ హార్ట్ (❤️) ఉంది. మూడోస్థానంలో 'నవ్వుతూ నేలపై దొర్లడం (🤣)', తర్వాత 'థమ్స్ ఆప్ (👍)' నిలవగా ఐదో స్థానంలో 'లౌడ్ క్రయింగ్ ఫేస్(😭)' నిలిచింది. యూనికోడ్ కన్సార్టియం 2020కు సంబంధించిన ఎమోజీ డేటాను విడుదల చేయలేదు. 2019లో రిలీజ్ చేసిన ఎమోజీ డేటాలో చాలా మేరకు 2021లో కూడా నిలిచాయి. 2021లో ఎక్కువగా వాడిన ఎమోజీలు ఇవే..! చదవండి: ఆండ్రాయిడ్‌లో అదిరిపోయే ఫీచర్స్..! పిల్లలను, కార్లను కంట్రోల్ చేయొచ్చు....!