2021లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పదుల సంఖ్యలో కొత్త కార్లను రిలీజ్ చేశాయి. వాటిలో కొన్ని మాత్రమే అత్యంత భద్రత కల్గిన కార్లుగా నిలిచాయి. ఒక కారు ఆయా వాహనదారుడుకి ఇచ్చే భద్రతను గ్లోబల్ ఎన్‌సీఏపీ (న్యూకార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) నిర్ణయిస్తోంది. పలు కార్లను రకరకాల పరీక్షలను నిర్వహించి, ప్రమాద సమయంలో ఆయా కారులో ప్రయాణించే వ్యక్తుల భద్రతను గురించి ఎన్‌సీఎపీ రేటింగ్స్‌ను ఇస్తోంది. 2014 నుంచి ఫోక్స్‌వ్యాగన్ పోలో, మారుతి సుజుకీ బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ300, టయోటా ఎటియోస్, టాటా నెక్సాన్ వంటి కార్లు ఎన్‌సీఎపీ రేటింగ్‌లో 4-5 రేటింగ్ స్టార్లను పొందాయి. ఈ ఏడాదిలో వచ్చిన కార్లలో కొన్ని మాత్రమే ఎక్కువ ఎన్‌సీఏపీ రేటింగ్‌ను పొందాయి.
1. టాటా పంచ్-మైక్రో ఎస్‌యూవీ
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ లాంచ్ చేసిన ‘టాటా పంచ్-మైక్రో ఎస్‌యూవీ’ ఎన్‌సీఎపీ టెస్ట్‌లో ఎక్కువ రేటింగ్‌ను సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో టాటా పంచ్ 17.00గాను 16.45 స్కోర్‌ను; చిల్డ్రన్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49.00 గాను 40.89 స్కోర్‌ను సాధించింది. ఈ ఎస్‌యూవీను సుమారు 64km/hr వేగంతో పరీక్షించారు. ఓవరాల్ చూసుకుంటే 5 స్టార్స్ అడల్ట్ ప్రోటెక్షన్‌లో, 4 స్టార్ చిల్డ్రన్ ప్రొటెక్షన్‌లో రేటింగ్‌ను సాధించింది.
2. మహీంద్రా ఎక్స్‌యూవీ700
స్వల్ప తేడాతో టాటా పంచ్ తరువాత మహీంద్రా ఎక్స్‌యూవీ 700 సేఫెస్ట్ కారుగా నిలిచింది. చిల్డ్రన్ అక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49.00గాను 41.66 స్కోర్‌ను, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 17.00 గాను 16.03 సాధించింది. ఓవరాల్ చూసుకుంటే 5 స్టార్స్‌కు సుమారుగా 5 స్టార్ రేటింగ్‌ను ఇది సాధించింది.
3. టాటా టిగోర్ ఈవీ
ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే, టాటా టిగోర్ ఈవీ గ్లోబల్ ఎన్‌సీఎపీ ఎక్కువ స్కోర్‌ను సాధించింది. అడల్ట్ అక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో17.00 గాను 12.00 స్కోర్‌ను పొందగా, పిల్లల భద్రత విషయంలో 49.00 గాను 37.24 సాధించింది. ఓవరాల్ చూసుకుంటే 5 స్టార్స్‌కు 4 స్టార్ రేటింగ్‌ను ఇది సాధించింది.
ఇక్కడ హై ఎండ్ లగ్జరీ కార్ల గురించి చర్చించలేదు. ఎందుకంటే #SaferCarsForIndia ప్రచారంలో భాగంగా గ్లోబల్ ఎన్‌సీఏపీ ఆయా లగ్జరీ కార్లను పరీక్షించలేదు.
చదవండి: పేరుకు సెకండ్ హ్యాండ్ కార్లే..! హాట్‌కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్ ఇవే..!
Comments
Please login to add a commentAdd a comment