Bharat NCAP New Rules: ఆధునిక కాలంలో కార్లను కొనే చాలామంది వినియోగదారులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వాహనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను మరింత పటిష్టంగా రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 2023 అక్టోబర్ 01 నుంచి మన దేశంలో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'భారత్ ఎన్సీఏపీ' (Bharat NCAP) అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానుంది. మన దేశంలో తయారైన వాహనాలు మరింత భద్రతను కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ క్రాష్ టెస్ట్ నిర్వహించనున్నారు. దీనికి ఇప్పటికే దిగ్గజ ఆటోమొబైల్స్ సంస్థలు కూడా తమ అంగీకారం తెలిపాయి.
భారత్ ఎన్సీఏపీ..
నిజానికి భారత్ ఎన్సీఏపీ అంటే 'న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్'. ఇది భారతదేశంలోని వాహనాలను మరింత పటిష్టం చేయడానికి దోహదపడుతుంది. మన దేశంలో తయారైన వాహనాలు మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతైన వాహనాలకు కూడా తప్పనిసరిగా భారత్ ఎన్సీఏపీ సర్టిఫికెట్ ఉండాలి.
(ఇదీ చదవండి: వందల కోట్లు వదిలి.. సన్యాసిగా మారిన బిలియనీర్!)
భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ నిబంధనలను ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ చేసింది. దీని ప్రకారం వాహనం డిజైన్, అడల్ట్ చైల్డ్ సేఫ్టీ, సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీ వంటివి తప్పకుండా కలిగి ఉండాలి. ఇప్పటికే అమలులో ఉన్న గ్లోబల్ ఎన్సీఏపీ అండ్ యూరో ఎన్సీఏపీ రెండు కూడా ఈ నియమాలనే పాటిస్తున్నాయి.
(ఇదీ చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, రూ.20కే కడుపు నిండా భోజనం!)
ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ఎన్సీఏపీ వాహనాలకు క్రాష్ టెస్ట్ నిర్వహించి 1 నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది అందిస్తుంది. భారత్ ఎన్సీఏపీ కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో నిర్వహణ సంస్థ ఏదైనా షోరూమ్ నుంచి తమకు నచ్చిన కారుని సెలెక్ట్ చేసుకుని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. మొత్తం మీద రానున్న రోజుల్లో భరతదేశంలో తయారయ్యే అన్ని కార్లు ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment