Skoda Kodiaq 2023 4x4 Launched In India With New Features; Check Price Here - Sakshi
Sakshi News home page

2023 Skoda Kodiaq: కొత్త రూల్స్‌తో విడుదలైన లేటెస్ట్ కారు - పూర్తి వివరాలు

Published Sat, May 6 2023 10:08 AM | Last Updated on Sat, May 6 2023 10:37 AM

Bs6 phase2 skoda kushaq india launched price features and details - Sakshi

ఇప్పటికే భారతదేశంలో కొత్త బిఎస్6 ఫేస్-2 నిబంధనలు అమలులోకి వచ్చేసాయి. వాహన తయారీ సంస్థలన్నీ కూడా తప్పకుండా ఈ నియమాలను పాటించాలి. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలతో స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో ఓ కొత్త కారుని లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు ధర, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర & బుకింగ్స్:
బిఎస్6 కొత్త నిబంధనల ప్రకారం, విడుదలైన స్కోడా కారు 'కొడియాక్' 7 సీటర్ SUV. ఈ కొత్త కారు ధర రూ. 37.99 లక్షలు. అంటే ఇది  దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 50,000 ఎక్కువ. అదే సమయంలో ఇందులోని స్పోర్ట్స్ లైన్ వేరియంట్ ధర రూ. 39.39 లక్షలు. ఇది కూడా దాని మునుపటి మోడల్ కంటే రూ. 90,000 ఎక్కువ కావడం గమనార్హం.

బుకింగ్స్ విషయానికి వస్తే.. ఈ ఎస్‌యువి కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించిన కేవలం 24 గంటల్లో 1200 యూనిట్లు బుక్ అయ్యాయి. అయితే కంపెనీ ఈ కొత్త కారుని కేవలం 3000 యూనిట్లకు (ఇండియా) మాత్రమే పరిమితం చేసింది. డెలివరీల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇది భారతదేశానికి సికెడి మార్గం ద్వారా దిగుమతై ఔరంగాబాద్ ప్లాంట్ వద్ద అసెంబుల్ అవుతాయి.

డిజైన్ & ఫీచర్స్:
2023 స్కోడా కొడియాక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా అనిపిస్తుంది, కానీ ఇందులో కొన్ని మార్పులు కూడా గమనించవచ్చు. ఈ ఎస్‌యువిలో రియర్ స్పాయిలర్ ఏరో డైనమిక్ పర్ఫామెన్స్ అనుమతించే రీవర్క్డ్ వెంట్స్ కలిగి ఉంది. అంతే కాకుండా ఆటోమాటిక్ డోర్ ఎడ్జ్ ప్రొటక్షన్ కూడా ఇందులో ఉంటుంది.

(ఇదీ చదవండి: ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి)

ఫీచర్స్ విషయానికి వస్తే, 8.0 ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగి ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇన్-బిల్ట్ నావిగేషన్, పనోరమిక్ సన్‌రూఫ్‌, మంచి సౌండ్ సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఏసీ వెంట్స్ మొదలైనవన్నీ ఉంటాయి.

ఇంజిన్ & పర్ఫామెన్స్:
లేటెస్ట్ స్కోడా కొడియాక్ అదే 2 లీటర్ టర్బో పెట్రోల్ కలిగి ఉంటుంది. కావున పనితీరులో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ 190 hp పవర్, 320 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే ఈ కారు కొత్త నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ పొందటం వల్ల మెరుగైన ఇంధన సామర్థ్యం అందిస్తుంది.

(ఇదీ చదవండి: వాట్సాప్ ద్వారా రూ. 10 లక్షలు లోన్? ఒక్క హాయ్ మెసేజ్‌తో..)

సేఫ్టీ ఫీచర్స్:
స్కోడా కంపెనీ తన కొడియాక్ కారులో 9 ఎయిర్ బ్యాగులను అందించింది. ఇందులో బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, మల్టి కొలిజన్ బ్రేకింగ్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement