Skoda
-
భారత్ ఎకానమీ వృద్ధి కోత
భారత్ ఎకానమీ 2024–25 ఆర్థిక సంవత్సరం అంచనాలకు పారిశ్రామిక మండలి–ఫిక్కీ(FICCI) 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. దీనితో ఈ అంచనా వృద్ధి రేటు 7 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గింది. ఈ మేరకు ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే విడుదలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని జాతీయ గణాంకాల విభాగం ఇటీవలే అంచనాలను వెలువరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ పాలనా కాలంలో భారత్‌కు సంబంధించి స్వల్ప కాలిక ఇబ్బందులు తప్పవని సర్వే అభిప్రాయపడింది.ఎగుమతులు(Exports), విదేశీ మూలధన పెట్టుబడులు, ముడి పదార్థాల వ్యయాల వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా సరఫరాల చైన్‌కు సమస్యలు తెచ్చే వీలుందని అవుట్‌లుక్ పేర్కొంది. భారత్ ఎకానమీలో ప్రైవేటు వినియోగం కీలక అంశమని తెలిపింది. అగ్రి ఉత్పాదకత, గ్రామీణ మౌలిక పరిస్థితులు, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు పెంపుపై దృష్టి పెట్టాలని సర్వే సూచించింది. దేశంలో ద్రవ్యోల్బణం దిగిరావచ్చని, ఇది వడ్డీరేట్లు దిగిరావడానికి దోహదపడుతుందని విశ్లేషించింది.కైలాక్‌కు భారత్ ఎన్సీఏపీ రేటింగ్వాహన రంగంలో ఉన్న స్కోడా(Skoda) ఆటో ఇండియా తయారీ కైలాక్ ఎస్యూవీ తాజాగా భారత్ ఎన్సీఏపీ 5–స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది. స్కోడా నుంచి ఈ రేటింగ్ పొందిన తొలి మోడల్ ఇదే. స్కోడా కుషాక్, స్లావియా ఇప్పటికే గ్లోబల్ ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ పొందాయి. ‘స్కోడా డిజైన్‌లో భద్రత ఒక భాగం. 2008 నుండి ప్రతి స్కోడా కారు ప్రపంచవ్యాప్తంగా, అలాగే భారత్‌లో 5–స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో క్రాష్–టెస్ట్ జరిగింది. భారత్‌లో 5–స్టార్ సేఫ్టీ–రేటెడ్ కార్ల సముదాయంతో భద్రతపై కంపెనీ ప్రచారంలో ముందుంది’ అని స్కోడా తెలిపింది.ఇదీ చదవండి: పాత పన్ను విధానం తొలగింపు..?భారత్‌లో జేవీసీ రీ–ఎంట్రీకంజ్యూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న జపాన్ బ్రాండ్ జేవీసీ భారత టీవీ విపణిలో రీఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం నోయిడాకు చెందిన సూపర్ ప్లాస్ట్రానిక్స్తో బ్రాండ్ లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రీమియం స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీలను తాజాగా ప్రవేశపెట్టింది. ధర రూ.11,999 నుంచి ప్రారంభం. ఇవి అమెజాన్‌తో ప్రత్యేకంగా లభిస్తాయి. థామ్సన్, కొడాక్, బ్లావ్‌పంక్ట్, వైట్–వెస్టింగ్‌హౌజ్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ల ఉత్పత్తులను సూపర్ ప్లాస్ట్రానిక్స్ ఇప్పటికే తయారు చేస్తోంది. ఫిలిప్స్ బ్రాండ్ కోసం షెంజెన్ స్కైవర్త్ డిజిటల్‌తో కంపెనీ ఒప్పందం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. 2019లో వీరా గ్రూప్‌తో చేతులు కలిపిన జేవీసీ కంజ్యూమర్ డ్యూరబుల్స్ మార్కెట్లోకి ప్రవేశించింది. -
10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..
చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) ఇటీవలే మార్కెట్లో 'కైలాక్' పేరుతో ఓ కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్ చేసింది. అయితే 10 రోజుల ముందే దీని కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పటికి ఈ ఎస్యూవీ బుకింగ్స్ 10,000 దాటినట్లు సమాచారం. కాగా బుక్ చేసుకున్న కస్టమర్లకు 2025 జనవరి 27న డెలివరీలు ప్రారంభమవుతాయి.స్కోడా కైలాక్ అనేది MQB A0-IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైన మొదటి కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న కుషాక్ కింద ఉంటుంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ అనే నాలుగు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 7.89 లక్షలు (ఎక్స్ షోరూమ్).మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ , మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 113 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ 5 డీజిల్ కారు ఇవే!.. పూర్తి వివరాలుఫీచర్స్ విషయానికి వస్తే.. కైలాక్ 8 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, కాంటన్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. -
స్కోడా కొత్త కారు 'కైలాక్' వచ్చేసింది: రూ.7.89 లక్షలు మాత్రమే
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా మరో కాంపాక్ట్ ఎస్‌యూవీని 'కైలాక్' (Kylaq) పేరుతో లాంచ్ చేసింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 7.89 లక్షలతో ప్రారంభమవుతుంది. ఈ కారు కోసం 2024 డిసెంబర్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభమవుతుంది.ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఇతర స్కోడా కార్ల కంటే కైలాక్ కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన ఈ ఎస్యూవీ డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, లెథెరెట్ అప్హోల్స్టరీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, సిక్స్-స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు, హెడ్‌రెస్ట్‌లు, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా కైలాక్ కారులో అందుబాటులో ఉన్నాయి. 189 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు బూట్ స్పేస్ 1265 లీటర్ల వరకు ఉంటుంది.స్కోడా కైలాక్ 1.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 114 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ కొత్త కారు మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, మారుతి ఫ్రాంక్స్, బ్రెజ్జా, టయోటా టైసర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా!
మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, స్కోడా & నిస్సాన్ వంటి ప్రధాన వాహన తయారీదారులు భారతీయ మార్కెట్లో కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో స్కోడా కైలాక్, అప్డేటెడ్ హ్యుందాయ్ వెన్యూ, కియా సిరోస్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ వంటివి ఉన్నాయి.స్కోడా కైలాక్స్కోడా కంపెనీ 2025 మార్చిలో కైలాక్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఇది MQB A0 IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారువుతోంది. కాబట్టి కుషాక్లోని చాలా ఫీచర్స్ ఇందులో ఉండనున్నాయి. ఇందులో 1.0 లీ త్రీ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 115 పీఎస్ పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.అప్డేటెడ్ హ్యుందాయ్ వెన్యూహ్యుందాయ్ వెన్యూ అప్డేటెడ్ మోడల్ 2025 మధ్య నాటికి మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది చూడటానికి సాధారణ వెన్యూ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్, లేటెస్ట్ ఫీచర్స్ ఉండనున్నట్లు సమాచారం. అయితే మెకానికల్ అప్డేట్స్ ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.కియా సిరోస్కియా కంపెనీ సిరోస్ కారును 2025 మొదటి అర్ధభాగంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది సోనెట్, సెల్టోస్ మధ్యలో ఉంటూ.. సోనెట్ ఇంజిన్, ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. ఇది పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, సన్‌రూఫ్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉండనున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా: ఎందుకంటే..మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్లిఫ్ట్ఇప్పటికే రెండు లక్షల అమ్మకాలను సాధించిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. 2025 మధ్య నాటికి ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ పొందనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పనితీరు దాని స్టాండర్డ్ మోడల్ కంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ధర, లాంచ్ డేట్ వంటి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. -
దూసుకెళ్తున్న ఆటో రంగం.. మహారాష్ట్రలో వేలకోట్ల పెట్టుబడులు
స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చకాన్‌లో తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఏకంగా రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని క్యాబినెట్ మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా చకాన్ తయారీ కేంద్రంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను తయారు చేయనుంది. కంపెనీలో వెయ్యి కంటే ఎక్కువ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో టయోటా కిర్లోస్కర్ కూడా రాష్ట్రంలో రూ. 21273 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీ 8800 ఉద్యోగాలను కల్పించనుంది.మహారాష్ట్రలో తన కొత్త ఉత్పత్తి యూనిట్ ద్వారా తమ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తామని, మెరుగైన హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తామని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అధికారులు వెల్లడించారు.టయోటా కంపెనీ తమ ఛత్రపతి శంభాజీనగర్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక్కడ కంపెనీ హైబ్రిడ్ వెహికల్స్, ప్లగ్ఇన్ హైబ్రిడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.One more BIG news for Maharashtra !Huge investments of total₹ 1,20,220 crore approved in today’s Cabinet Sub-Committee Meeting, with CM Eknath Shinde ji !The detailed list of approved investments is as follows:✅Tower Semiconductor with Adani Group at Taloja MIDC, Panvel… pic.twitter.com/DVI9z94WyU— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 5, 2024 -
స్కోడా కొత్త కారు.. వివరాలు
గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కోడా సూపర్బ్ కారును కంపెనీ సరికొత్త 'స్పోర్ట్‌లైన్' రూపంలో పరిచయం చేసింది. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న కారు కంటే కూడా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ కారు స్పోర్టియర్ డిజైన్ పొందుతుంది.స్కోడా సూపర్బ్ స్పోర్ట్‌లైన్ మోడల్ రేడియేటర్ గ్రిల్ ఫ్రేమ్, విండో ఫ్రేమ్‌లు, వెనుకవైపు స్కోడా బ్యాడ్జింగ్‌తో సహా అన్ని క్రోమ్ ఎలిమెంట్లు బ్లాక్ కలర్ పొందుతుంటాయి. ఇందులో 18 ఇంచెస్ లేదా 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్లు, ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్లైట్లపై స్పోర్ట్‌లైన్ బ్యాడ్జింగ్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.స్కోడా సూపర్బ్ స్పోర్ట్‌లైన్ మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పర్ఫామెన్స్ ఎలా ఉంటుందనేది లాంచ్ తరువాత తెలుస్తుంది. అయితే ఈ కారు దాని మునుపటి మోడల్ మాదిరిగా అదే పర్ఫామెన్స్ అందిస్తుందని భావిస్తున్నాము. ఈ కారు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. -
భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SAVWIPL) పూణేలోని చకన్లోని తన తయారీ కేంద్రంలో 15 లక్షల మేడ్-ఇన్-ఇండియా వాహనాలను తయారు చేసి.. ఉత్పత్తిలో ఓ సరికొత్త మైలురాయిని దాటేసింది.స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో స్థానికంగా తన కార్యకలాపాలను 2007లో ప్రారంభించి.. తమ మొదటి ఉత్పత్తిగా 'స్కోడా ఫాబియా' లాంచ్ చేశారు. ఆ తరువాత స్కోడా రాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో, అమియో వంటి కార్లను లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈ కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.ప్రస్తుతం సంస్థ కుషాక్, టైగన్, స్లావియా, వర్టస్ కార్లను మాత్రమే చకాన్ ఫెసిలిటీలో ఇండియా 2.0 ఉత్పత్తులుగా ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఉత్పత్తిలో సుమారు 30 శాతానికి పైగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు బ్రాండ్ ప్రకటించింది.స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ స్థానికంగా కార్లను మాత్రమే కాకుండా.. ఇంజిన్లను కూడా తయారు చేస్తోంది. అప్పట్లో పోలో హ్యాచ్‌బ్యాక్ కారులో అందించే 1.5 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజిన్‌ను కంపెనీ తయారు చేసిందే. ఆ తరువాత 2.0 లీటర్ టీడీఐ డీజిల్, 1.0 లీటర్, 1.2 ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్లను చేసింది. ఇప్పటికి స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ ఏకంగా 3.80 లక్షల ఇంజిన్లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. -
స్కోడా కాంపాక్ట్ ఎస్యూవీ వస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. 2025 తొలి అర్ద భాగంలో ఈ కారు రోడ్లపై పరుగు తీయనుందని వెల్లడించింది. కంపెనీ నుంచి భారత మార్కెట్ కోసం ప్రత్యేకించి తయారైన మూడవ మోడల్‌గా ఇది నిలవనుంది. కుషాక్, స్లావియా మాదిరిగా ఎంక్యూబీ–ఏ0–ఇన్ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకోనుంది. పొడవు నాలుగు మీటర్ల లోపు ఉంటుంది. సంస్థకు ఇది ఎంట్రీ లెవెల్ మోడల్‌గా ఉండనుంది. 2022, 2023లో మొత్తం 1,00,000 పైచిలుకు కార్లను స్కోడా ఆటో ఇండియా విక్రయించింది. అన్ని మోడళ్లతో కలిపి 2026 నాటికి ఏటా 1,00,000 యూనిట్ల అమ్మకం లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ వెల్లడించింది. ప్రతి పాదిత కొత్త మోడల్‌కు పేరును సూచించేందుకు కంటెస్ట్‌లో పాల్గొనవచ్చని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాదే భారత్‌కు స్కోడా ఎన్యాక్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన స్కోడా ఎన్యాక్ ఈ ఏడాదే భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ పనితీరుపై దేశీయంగా టెస్టింగ్ జరుగుతోంది. ‘ఈ–మొబిలిటీ విషయంలో కంపెనీకి లోతైన అనుభవం ఉంది. వచ్చే మూడేళ్లలో ఆరు మోడళ్లకు విస్తరిస్తాం. ఇందులో ఒక మోడల్ ప్రత్యేకంగా భారత్‌కు తీసుకువస్తాం’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జనీబా తెలిపారు. 2027 నుంచి దేశీయంగా ఈవీలను అసెంబుల్ చేస్తామని వెల్లడించారు. -
24 పరుగులకు ఐఫోన్ 15.. 36 పరుగులకు స్కోడా కారు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ ‘మ్యాచ్ డే మానియా’ ద్వారా క్యాష్‌ప్రైజ్‌ను ఆఫర్ చేయనుంది. క్రికెట్ వరల్డ్‌కప్ 2023 సందర్భంగా తన కష్టమర్లలో జోష్ నింపేందుకు వివిధ ప్రైజ్‌మనీతో అలరించనుంది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది. మ్యాచ్ డే మానియా ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ధర ఆధారంగా వారి వాలెట్లో రన్స్ జమ అవుతాయి. 2 పరుగులకు స్విగ్గీ లేదా ఇన్‌స్టామార్ట్‌లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. 4 పరుగులకు డైనింగ్‌లో రాయితీపై డైన్అవుట్ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 6 పరుగులు సాధిస్తే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించవచ్చు. లేదంటే రూ.10000 స్విగ్గీమనీ సొంతం చేసుకోవచ్చు. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్దీ తాజ్హోటల్లో బస, తనిష్క్ వోచర్ గెలుచుకోవచ్చు. 24 పరుగులకు ఐఫోన్ 15, 36 పరుగులకు స్కోడా కారు గెలుపొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
భద్రతా ఫీచర్లకే అధిక ప్రాధాన్యత
ముంబై: కార్ల కొనుగోలు విషయంలో కస్టమర్లు భద్రతా ఫీచర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్కోడా ఆటో ఇండియా, ఎన్ఐక్యూ బేసెస్ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా క్రాష్ రేటింగ్‌లు, ఎయిర్ బ్యాగుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారని తెలిపింది. జనాదరణ పొందిన ఫీచర్లలో ఇంధన సామర్థ్యం మూడో స్థానంలో ఉంది. భారత్‌లో కార్లకు భద్రతా రేటింగ్ తప్పనిసరిగా ఉండాలని 10 మందిలో 9 మంది కస్టమర్లు అభిప్రాయపడ్డారు. ‘అధిక రేటింగ్ మోడళ్లు కలిగిన తొలి 3 బ్రాండ్లలో స్కోడా ఒకటి. గ్లోబల్ ఎన్సీఏపీ పరీక్షలో స్లావియా, కుషాక్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. భద్రత మాకు తొలి ప్రాధాన్యత’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ సోలాక్ తెలిపారు. -
500 మందికి మాత్రమే.. ఈ కారు - ధర ఎంతో తెలుసా?
Skoda Kushaq Matte Edition: చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో 'కుషాక్' (Kushaq) కారుని విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కంపెనీ ఇందులో ఓ కొత్త ఎడిషన్ విడుదల చేసింది. కుషాక్ కొత్త ఎడిషన్ ధర, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ధర & వేరియంట్స్ స్కోడా ఇండియా విడుదల చేసిన కొత్త కారు పేరు 'కుషాక్ మ్యాట్ ఎడిషన్' (Kushaq Matte Edition). ధరల విషయానికి వస్తే, 1.0 టీఎస్ఐ మాన్యువల్ రూ. 16.19 లక్షలు, 1.0 టీఎస్ఐ ఆటోమేటిక్ రూ. 17.79 లక్షలు, 1.5 టీఎస్ఐ మాన్యువల్ రూ. 18.19 లక్షలు, టాప్ స్పెక్ 1.5 టీఎస్ఐ ఆటోమేటిక్ ధర రూ. 19.39 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ ధర స్టాండర్డ్ కుషాక్ స్టైల్ వేరియంట్ కంటే రూ. 40,000 ఎక్కువ కావడం గమనార్హం. లిమిటెడ్ ఎడిషన్ స్కోడా కుషాక్ మ్యాట్ ఎడిషన్ దాని లైనప్‌లో స్టైల్ అండ్ మోంటే కార్లో వేరియంట్ల మధ్య ఉంటుంది. ఇది కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అంటే ఈ కొత్త కారుని కేవలం 500 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) మ్యాట్ ఎడిషన్ ప్యాకేజీలో భాగంగా, కంపెనీ కార్బన్ స్టీల్ ఎక్స్టీరియర్ పెయింట్ షేడ్ పొందుతుంది. డోర్ హ్యాండిల్స్‌పై గ్లోస్ బ్లాక్ ట్రిమ్, వింగ్ మిర్రర్స్, గ్రిల్‌పై క్రోమ్ బిట్లు చూడవచ్చు. కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ విజయం పొందిన తరువాత కంపెనీ తన ఉనికిని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే మ్యాట్ ఎడిషన్ లాంచ్ చేసింది. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) ప్రత్యర్థులు కుషాక్ మ్యాట్ ఎడిషన్ దాని విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున ఈ ఎడిషన్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది. -
అధికారిక వెబ్సైట్లో మాయమైన స్కోడా సూపర్బ్.. కారణం ఏంటంటే?
Skoda Superb Discontinued: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) తన సూపర్బ్ (Superb) కారుని నిలిపివేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇది స్కోడా ఇండియా అధికారిక వెబ్సైట్లో మాయమైపోయింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఈ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్కోడా కంపెనీ ఈ కారుని నిలిపివేయడానికి గల కారణాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో మొదలైన బిఎస్ 6 ఫేజ్ 2 నిబంధనల కారణంగా ఈ సెడాన్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఉన్న కార్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరింత కొత్త డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లతో మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. భారతీయ మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి స్కోడా సూపర్బ్ అతి తక్కువ కాలంలోనే అత్యంత విజయవంతమైన మోడల్‌గా గుర్తింపు పొందింది. దాని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్శించాయి. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో మంచి అమ్మకాలతో సాగుతున్న ఈ మోడల్ బోల్డ్ గ్రిల్, సొగసైన హెడ్‌లైట్స్, షార్ప్ బాడీ లైన్స్, సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్ ప్రీమియం ఇంటీరియర్ మెటీరియల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది అత్యాధునిక డ్రైవింగ్ అనుభూతిని కూడా కల్పిస్తుంది. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. ఎలా అంటే?) ఇప్పటికే భారతీయ మార్కెట్లో స్కోడా స్లావియా, కుషాక్ వంటి కొత్త మోడల్స్ విడుదలయ్యాయి. ఇవి మార్కెట్లో ఉత్తమ అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. ఈ కార్లు ఆధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మంచి ఆదరణ పొందగలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్లు కంపెనీ అమ్మకాలను పెంచడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
భారత్‌లో విడుదలైన 2023 స్కోడా కొడియాక్ - ధర & వివరాలు
ఇప్పటికే భారతదేశంలో కొత్త బిఎస్6 ఫేస్-2 నిబంధనలు అమలులోకి వచ్చేసాయి. వాహన తయారీ సంస్థలన్నీ కూడా తప్పకుండా ఈ నియమాలను పాటించాలి. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలతో స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో ఓ కొత్త కారుని లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు ధర, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్: బిఎస్6 కొత్త నిబంధనల ప్రకారం, విడుదలైన స్కోడా కారు 'కొడియాక్' 7 సీటర్ SUV. ఈ కొత్త కారు ధర రూ. 37.99 లక్షలు. అంటే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 50,000 ఎక్కువ. అదే సమయంలో ఇందులోని స్పోర్ట్స్ లైన్ వేరియంట్ ధర రూ. 39.39 లక్షలు. ఇది కూడా దాని మునుపటి మోడల్ కంటే రూ. 90,000 ఎక్కువ కావడం గమనార్హం. బుకింగ్స్ విషయానికి వస్తే.. ఈ ఎస్యువి కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించిన కేవలం 24 గంటల్లో 1200 యూనిట్లు బుక్ అయ్యాయి. అయితే కంపెనీ ఈ కొత్త కారుని కేవలం 3000 యూనిట్లకు (ఇండియా) మాత్రమే పరిమితం చేసింది. డెలివరీల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇది భారతదేశానికి సికెడి మార్గం ద్వారా దిగుమతై ఔరంగాబాద్ ప్లాంట్ వద్ద అసెంబుల్ అవుతాయి. డిజైన్ & ఫీచర్స్: 2023 స్కోడా కొడియాక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా అనిపిస్తుంది, కానీ ఇందులో కొన్ని మార్పులు కూడా గమనించవచ్చు. ఈ ఎస్‌యువిలో రియర్ స్పాయిలర్ ఏరో డైనమిక్ పర్ఫామెన్స్ అనుమతించే రీవర్క్డ్ వెంట్స్ కలిగి ఉంది. అంతే కాకుండా ఆటోమాటిక్ డోర్ ఎడ్జ్ ప్రొటక్షన్ కూడా ఇందులో ఉంటుంది. (ఇదీ చదవండి: ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి) ఫీచర్స్ విషయానికి వస్తే, 8.0 ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగి ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇన్-బిల్ట్ నావిగేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, మంచి సౌండ్ సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఏసీ వెంట్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ స్కోడా కొడియాక్ అదే 2 లీటర్ టర్బో పెట్రోల్ కలిగి ఉంటుంది. కావున పనితీరులో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ 190 hp పవర్, 320 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే ఈ కారు కొత్త నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ పొందటం వల్ల మెరుగైన ఇంధన సామర్థ్యం అందిస్తుంది. (ఇదీ చదవండి: వాట్సాప్ ద్వారా రూ. 10 లక్షలు లోన్? ఒక్క హాయ్ మెసేజ్‌తో..) సేఫ్టీ ఫీచర్స్: స్కోడా కంపెనీ తన కొడియాక్ కారులో 9 ఎయిర్ బ్యాగులను అందించింది. ఇందులో బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, మల్టి కొలిజన్ బ్రేకింగ్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. -
భారత్‌లో స్కోడా కుషాక్ కొత్త ఎడిషన్ లాంచ్ - పూర్తి వివరాలు
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. స్లావియా, ఆక్టావియా అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న సంస్థ ఇప్పుడు కుషాక్ న్యూ ఎడిషన్ 'ఒనిక్స్' (Onyx) విడుదల చేసింది. దీని గురించి మరిన్ని ఈ కథనంలో చూసేద్దాం.. ధర: భారతీయ విఫణిలో విడుదలైన కుషాక్ ఒనిక్స్ ఎడిషన్ ధర రూ. 12.39 లక్షలు. ఇది దాని స్టాండర్డ్ బేస్ మోడల్ కంటే రూ. 80,000 ఎక్కువ. ఈ కొత్త వెర్షన్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న కుషాక్ యాక్టివ్, యాంబిషన్ ట్రిమ్‌ల మధ్యలో ఉంటుంది. ఎక్ట్సీరియర్ ఫీచర్స్: ఒనిక్స్ ఎడిషన్ చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. డోర్లపై స్టైలైజ్డ్ గ్రే గ్రాఫిక్స్, B-పిల్లర్‌పై 'ఓనిక్స్' బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఫ్రంట్ బంపర్‌పై ఫాక్స్ డిఫ్యూజర్, ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ సరౌండ్, సైడ్ ప్రొఫైల్‌లో 16 ఇంచెస్ స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్స్: లోపలి భాగంలో 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్, 6 స్పీకర్ ఆడియో సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, హెడ్రెస్ట్లపై ఒనిక్స్ బ్యాడ్జింగ్, బ్లాక్ అండ్ వైట్ ఇంటీరియర్ కలర్ థీమ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఎయిర్ ప్యూరిఫైయర్తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: ఇంజిన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ కుషాక్ మల్టిపుల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందినప్పటికీ ఒనిక్స్ ఎడిషన్ మాత్రం 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ మాత్రమే పొందుతుంది. ఇది 114 బీహెచ్‌పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జతచేయబడుతుంది. సేఫ్టీ ఫీచర్స్: భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన వాహనాల జాబితాలో ఒకటి కుషాక్. కావున ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, త్రీ పాయింట్ పాయింట్ సీట్‌బెల్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX ఎంకరేజ్ వంటివి ఉంటాయి. ప్రత్యర్థులు: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త ఒనిక్స్ ఎడిషన్ మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
భారత్‌కు స్కోడా ఎన్యాక్ ఐవీ
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న చెక్ కంపెనీ స్కోడా.. భారత మార్కెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎన్యాక్ ఐవీ మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. పూర్తిగా తయారైన కారును దిగుమతి చేసుకుంటామని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెటర్ సాక్ తెలిపారు. అమ్మకాలు పెరిగిన తర్వాత దేశీయంగా తయారీ చేపడతామన్నారు. ‘కంపెనీకి టాప్–3 మార్కెట్లలో భారత్ ఒకటి. యూరప్ వెలుపల అతిపెద్ద మార్కెట్ కూడాను. మరిన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాలతోపాటు ఈవీలను సైతం భారత్‌కు పరిచ యం చేస్తాం. గతేడాది దేశంలో 57,721 యూ నిట్లు విక్రయించాం. 2021తో పోలిస్తే రెండింతలకుపైగా వృద్ధి సాధించాం. 2023లో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం’ అని వివరించారు. -
స్కోడా ఎలక్ట్రిక్ కార్... ఒక్కసారి ఛార్జ్ చేస్తే వందల కిలోమీటర్స్ రయ్ రయ్
-
స్కోడా ఎస్యూవీ బుకింగ్స్ షురూ..ప్రైస్ ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా ఎస్యూవీ కొడియాక్ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించింది. జనవరి–మార్చిలో డెలివరీలు ఉంటాయని కంపెనీ బుధవారం ప్రకటించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.37.49 లక్షల నుంచి రూ.39.99 లక్షల వరకు ఉంది. రూ.50,000 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కొడియాక్ బుకింగ్స్‌ను కంపెనీ జనవరిలో ప్రారంభించింది. -
2023 స్కోడా కొడియాక్ లాంచ్: ఆ లగ్జరీ కార్లకు షాక్!
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా తన ఫ్టాగ్‌షిప్ కొడియాక్ 2023 వెర్షన్ కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 37,49,000 (ఎక్స్-షోరూమ్). ఎంట్రీ-లెవల్ లగ్జరీ 4×4 SUV స్టైల్, స్పోర్ట్‌లైన్ , ఎల్ అండ్ కే మూడు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే 2023 స్కోడా కొడియాక్ ధర రూ. టాప్-ఎండ్ ఎల్ అండ్ కే వేరియంట్ ధర 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ప్రకటించింది. అయితే ఇవి ఆఫర్ ధరలు మాత్రమే. 2023, మార్చి వరకు మాత్రమే ఈ ఆఫర్ ధరలు అందుబాటులో ఉంటాయి స్కోడా వెల్లడించింది. ప్రస్తుతం బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. 50వేలు చెల్లించి అన్ని స్కోడా డీలర్‌షిప్‌లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య డెలివరీలు అవుతాయి. గత జనవరిలో లాంచ్ చేసిన స్కోడా మోడల్ 2022 ఎస్యూవీ 48 గంటల్లో మొత్తం 1,200 యూనిట్లు రికార్డ్ స్థాయి సేల్స్‌ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మోడల్‌తో పోలిస్తే దాదాపు లక్షన్నన్నర రూపాయల రేటు పెంచింది. 2023 స్కోడా కొడియాక్ ఇంజన్, ఫీచర్లు వోక్స్వ్యాగన్ గ్రూప్ 2-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 187.7 HP , 320 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రామాణిక 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించింది. ఇది 7.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం పుంజుకుంటుంది. 6 డ్రైవింగ్ మోడ్లలో ఇది లభ్యం. డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (డీసీసీ) CANTON 12-స్పీకర్ 625W సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి కొన్ని కూల్ సెగ్మెంట్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లైండ్లు, బ్లాంకెట్స్,అంబరిల్లా, హోల్డర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 2023 స్కోడా కొడియాక్ జీప్ కంపాస్, మెరిడియన్, సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్, వోక్స్వ్యాగన్ టిగువాన్,2023 హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
షాకిచ్చిన స్కోడా.. ఆ మోడల్ ధరలు పెంపు
ఇండియన్ రోడ్లపై తనదైన ముద్ర వేసిన స్కోడా సైతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎటువండి హడావుడి లేకుండా కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో స్కోడా కుషాక్ ధర పెంచింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కి పోటీగా కుషాక్‌కు గతేడాది మార్కెట్లోకి తెచ్చింది. కుషాక్ ఎంట్రీ లెవల్ యాక్టివ్ వేరియంట్ ధర రూ. 10.49 లక్షలు ఉండగా ఈ మోడల్‌పై రూ.30,000ల వరకు ధర పెరిగింది. ఇక కుషాక్‌లో హై ఎండ్ వేరియంట్ స్టైల్ ధర రూ.17.19 లక్షలు ఉండగా కొత్తగా మరో రూ.70,000 ధర పెంచింది స్కోడా. ఈ మేరకు పెరిగిన రేట్లను స్కోడా వెబ్సైట్లో అప్డేట్ చేసింది. -
త్వరలో భారత మార్కెట్లోకి స్కోడా ఎలక్ట్రిక్ కార్లు
న్యూఢిల్లీ: స్కోడా తాజాగా భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 2030 నాటికి దేశీ మార్కెట్లో 25–30%వాటా ఎలక్ట్రిక్ కార్లది ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా విద్యుత్ కార్లను ప్రవేశపెట్టడంపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. అయితే, ఎప్పట్లోగా వీటిని అందుబాటులోకి తెచ్చేదీ ఇప్పుడే చెప్పలేమన్నారు. మరోవైపు, స్వల్పకాలికంగా చూస్తే.. సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) కార్ల విభాగంలోకి ప్రవేశించే ప్రణాళికలేవీ లేవని ఆయన వివరించారు. తమ ప్లాట్‌ఫాం, టెక్నాలజీ, ఇంజిన్లు ఇందుకు అనుగుణమైనవి కావని పేర్కొన్నారు. స్కోడా దేశీ మార్కెట్లో కుషాక్, స్లావియా, ఆక్టావియా, సూపర్బ్, కోడియాక్ వంటి మోడల్స్‌ను విక్రయిస్తోంది. ప్రముఖ జర్మనీ కార్ మేకర్ కంపెనీ అయిన ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ కంపెనీగా స్కోడాకి ఇండియాలో మంచి గుర్తింపు ఉంది. -
పుంజుకున్న వాహన విక్రయాలు
ముంబై: సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం వెంటాడినా.., దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరిలో వృద్ధి బాటపట్టాయి. మూడో దశ లాక్డౌన్ ఆంక్షల సడలింపు ప్యాసింజర్ వాహన విక్రయాలకు కలిసొచ్చింది. గత నెలలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఎంజీ మోటార్స్ విక్రయాలు పెరిగాయి. అయితే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, టయోటా, హోండా కార్ల అమ్మకాల్లో స్వల్ప క్షీణత కన్పించింది. మరోవైపు ద్విచక్ర వాహనాలు విక్రయాలు డీలాపడ్డాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సంపద్రాయ టూ వీలర్స్ అమ్మకాలపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు వరుసగా 29% 6%, 15% చొప్పున క్షీణించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. బేస్ ఎఫెక్ట్ కారణంగా ట్రాకర్ల అమ్మకాల్లో క్షీణత నమోదైంది. ‘‘దేశంలో గత మూడు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత లీటరు ఇంధన ధరలు రూ.8 నుంచి రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం మార్చి వాహన విక్రయాలపై ప్రతికూలతను చూపొచ్చు’’ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. -
స్కోడా నుంచి సరికొత్త స్లావియా
న్యూఢిల్లీ: ప్రీమియం మిడ్–సైజ్ సెడాన్ సెగ్మెంట్లో మరింత పోటీకి తెరతీస్తూ స్కోడా ఆటో ఇండియా తాజాగా సరికొత్త స్లావియా కారును ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 10.69 లక్షల నుంచి రూ. 15.39 లక్షల (ఎక్స్ షోరూం) శ్రేణిలో ఉంటుంది. నెలకు 2,500–3,000 యూనిట్ల విక్రయాన్ని లక్ష్యం గా పెట్టుకున్నట్లు కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హాలిస్ తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో సెగ్మెంట్ లీడరుగా ఎదగాలన్నది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 179 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ బ్రేక్ డిస్క్ క్లీనింగ్, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్, హిల్–హోల్డ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు కొత్త స్లావియాలో ఉంటాయి. -
సీన్ రివర్స్.. దిగుమతి రోజులు పోయాయ్..
ఆటోమోబైల్ ఇండస్ట్రీలో గుణాత్మక మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు విదేశాల్లో తయారైన కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇండియాలో తయారైన కార్లను విదేశాలకు ఎగుమతి చేసే స్టేజ్‌కి చేరుకుంది. జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్లాంటులో తయారు చేసిన కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ‘ఇంజనీరిడ్ ఇన్ ఇండియా డ్రివెన్ బై ది వరల్డ్’ కాన్సెప్టుతో ఈ పని చేపట్టింది. పూనేలో ఉన్న కార్ల తయారీ యూనిట్లో రూపొందిన టీ క్రాస్ మోడల్ కారును మెక్సికోకు ఎగుమతి చేస్తున్నట్టు స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా చైర్మన్ కాన్వాన్ సిలీన్ ప్రకటించారు. ఇక్కడ తయారైన కార్లకు మెక్సికో, సౌతాఫ్రికా, కొలంబియా, ఈక్వెడార్, అర్జెంటీనా దేశాల్లో చాలా డిమాండ్ ఉందని ఫోక్స్‌వ్యాగన్ ప్రతినిధులు తెలిపారు. గతంలో వెంటో కారుని ఎగుమతి చేయగా మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఇండియాలో టైగూన్ మోడల్‌లతో అమ్ముడవుతున్న కారుకి విదేశాల కోసం టీ క్రాస్ పేరుతో ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు. ఇండియలోని ప్లాంట్‌లో తయారైన కార్లు 61 దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. జర్మనీ ప్లాంట్లకు ఏమాత్రం తగ్గని క్వాలిటీతో ఇండియాలో కార్లు తయారు చేస్తున్నామన్నారు. చదవండి:కారు తయారీ దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్..! -
హల్చల్ చేస్తోన్న స్కోడా ఎలక్ట్రిక్ కారు..! రేంజ్ ఎంతంటే...?
ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రముఖ చెక్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా స్పీడ్ పెంచింది. గ్లోబల్ మార్కెట్లలోకి ఎలక్ట్రిక్ వాహనాలను మరింత వేగంగా లాంచ్ చేసేందుకు సిద్దమైంది. కళ్లు చెదిరే లుక్స్‌తో స్కోడా పోర్ట్ఫోలియోనుంచి రానున్న ఎలక్ట్రిక్ కారు ఎన్యాక్ కూపే iV (Enyaq Coupe iV) గ్లిప్స్‌ను తాజాగా కంపెనీ విడుదల చేసింది. స్కోడా ఎన్యాక్ కూపే iV లాంచ్ ఎప్పుడంటే..? ఎలక్ట్రిక్ కార్లలో భాగంగా స్కోడా ఎన్యాక్ కూపే iV ఎస్యూవీను జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. ఈ కారుకు సంబంధించిన డిజైన్ చిత్రాలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. భారత మార్కెట్లలోకి స్కోడా Enyaq Coupe iV ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఎన్యాక్ iVకు ఎస్‌యూవీగా రానుంది. క్రేజీ లుక్స్‌తో...! వోక్స్వ్యాగన్ ID.5 స్ఫూర్తితో స్కోడా Enyaq Coupe iV ఎలక్ట్రిక్ ఎస్యూవీ డిజైన్ చేసినట్లు కన్పిస్తోంది. దూకుడుగా ఉండే ఫ్రంట్ ఫేస్‌తో పాటు వాలుగా ఉండే రూఫ్‌లైన్, పెద్ద వీల్ ఆర్చ్‌లు ఎన్యాక్ కూపే iVకి బోల్డ్ రోడ్ లుక్‌ను అందించనున్నాయి. సైడ్ స్కర్ట్లు బాడీ కలర్లో పెయింట్ చేశారు. వెనుకవైపు స్కోడా సిగ్నేచర్ సి-ఆకారపు బ్యాక్ లైట్లు రానుంది. విలక్షణమైన ఫ్రంట్ గ్రిల్‌తో పాటుగా 131 ఎల్ఈడీ లైట్స్‌ను అమర్చారు. రేంజ్ విషయానికి వస్తే..! స్కోడా ఎన్యాక్ కూపే iV ఎస్యూవీ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 510 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ఈ కారు సున్నా నుంచి 100 kmph వేగాన్ని కేవలం 6.2 సెకన్లలోనే చేరుకోనుంది. కాగా స్కోడా ఎలక్ట్రిక్ కార్లలో భాగంగా మరో ఐదు వేరియంట్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ కార్ల సామర్థ్యం 148 hp నుంచి 306 hp వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. టాప్ వెర్షన్ గరిష్టంగా 180 kmph వేగాన్ని కలిగి ఉంది. చదవండి: మహీంద్రా సంచలన నిర్ణయం..! ఆ కంపెనీని పూర్తిగా అమ్మేసింది..! -
మూడు వేరియంట్లలో స్కోడా కొత్త కొడియాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న చెక్ కంపెనీ స్కోడా తాజాగా భారత్‌లో కొత్త కొడియాక్ ప్రీమియం ఎస్‌యూవీని ఆవిష్కరించింది. స్పోర్ట్‌లైన్, లారిన్, క్లెమెంట్ వేరియంట్లలో రూపొందించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.34.99– 37.49 లక్షలు ఉంది. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, సెవెన్ స్పీడ్ ట్రాన్స్మిషన్, ఏడు సీట్లు, తొమ్మిది ఎయిర్‌బ్యాగ్స్, అడాప్టివ్ ఫ్రంట్ హెడ్‌లైట్స్, ఎలక్ట్రానిక్, మెకానికల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ కొలిషన్ బ్రేకింగ్, హ్యాండ్స్‌ఫ్రీ పార్కింగ్తో పార్క్ అసిస్ట్ వంటి హంగులు ఉన్నాయి