స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SAVWIPL) పూణేలోని చకన్‌లోని తన తయారీ కేంద్రంలో 15 లక్షల మేడ్-ఇన్-ఇండియా వాహనాలను తయారు చేసి.. ఉత్పత్తిలో ఓ సరికొత్త మైలురాయిని దాటేసింది.
స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో స్థానికంగా తన కార్యకలాపాలను 2007లో ప్రారంభించి.. తమ మొదటి ఉత్పత్తిగా 'స్కోడా ఫాబియా' లాంచ్ చేశారు. ఆ తరువాత స్కోడా రాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో, అమియో వంటి కార్లను లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈ కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
ప్రస్తుతం సంస్థ కుషాక్, టైగన్, స్లావియా, వర్టస్ కార్లను మాత్రమే చకాన్ ఫెసిలిటీలో ఇండియా 2.0 ఉత్పత్తులుగా ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఉత్పత్తిలో సుమారు 30 శాతానికి పైగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు బ్రాండ్ ప్రకటించింది.
స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ స్థానికంగా కార్లను మాత్రమే కాకుండా.. ఇంజిన్లను కూడా తయారు చేస్తోంది. అప్పట్లో పోలో హ్యాచ్‌బ్యాక్ కారులో అందించే 1.5 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజిన్ను కంపెనీ తయారు చేసిందే. ఆ తరువాత 2.0 లీటర్ టీడీఐ డీజిల్, 1.0 లీటర్, 1.2 ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్లను చేసింది. ఇప్పటికి స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ ఏకంగా 3.80 లక్షల ఇంజిన్‌లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment