
కారులో సమస్య వచ్చినప్పుడు రిపేర్ చేసుకోవాలంటే ఖర్చు వేలల్లో ఉంటుంది, అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనలో గేర్‌బాక్స్‌లో సమస్యను పరిష్కరించుకోవడానికి ఏకంగా ఐదు లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సాధారణంగా కారు ఇంజిన్‌లో అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే.. ఇలాంటి సమస్యలే తలెత్తుతూ ఉంటాయి. ఇటీవల ఫోక్స్‌వ్యాగన్ అమియో కారులోని DSG గేర్‌బాక్స్ ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో దానిని రిపేర్ చేసుకోవడానికి రూ. 5.8 లక్షలు ఖర్చు అయినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన బిల్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. గేర్‌బాక్స్‌లో సమస్యను పరిష్కరించుకోవడానికే.. ఇంత బిల్ వచ్చిందా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఫోక్స్‌వ్యాగన్ అమియో యజమాని 2వ, 3వ గేర్ మధ్య అప్‌షిఫ్ట్ చేసేటప్పుడు, డౌన్‌షిఫ్ట్ చేసేటప్పుడు ఎక్కువ శబ్దం వస్తున్నట్లు గ్రహించి సర్వీస్ సెంటర్‌కు వెళ్లి తన సమస్యను తెలియజేశాడు. డీఎస్‌జీ గేర్‌బాక్స్‌లో పెద్ద సమస్య ఉన్నట్లు గుర్తించి, దానిని రిపేర్ చేయడానికి రూ. 5.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ గేర్‌బాక్స్‌లో ఎక్కడ సమస్య ఉందనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment