Volkswagen
-
ఖరీదైన కారు కొనుగోలు చేసిన అమరన్ నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ మలయాళ నటుడు శ్యామ్ మోహన్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కంపెనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కారును సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన భార్య గోపికతో కలిసి కారు ముందు ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. ప్రేమలు, అమరన్ చిత్రాలతో మెప్పించిన మలయాళ నటుడు శ్యామ్ మోహన్. ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలో శ్యామ్ మోహన్ నటించాడు. ఈ సినిమా తర్వాత మలయాళంలోనే నునాకుజి అనే చిత్రంలోనూ కనిపించారు. ఇటీవల విడుదలైన అమరన్ మూవీలో కీలక పాత్ర పోషించాడు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. View this post on Instagram A post shared by ShyaM Mohan M (@shyammeyyy) -
మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!
జర్మనీకి చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తన ప్లాంట్లను మూసివేయాలని యోచిస్తోంది. దాంతోపాటు కాస్ట్ కటింగ్ ప్రణాళికలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని తొలగించనున్నట్లు కంపెనీ వర్క్స్ కౌన్సిల్ హెడ్ డానియెలా కావల్లో తెలిపారు. అంతర్జాతీయంగా కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు.ఈ సందర్భంగా డానియెలా కావల్లో మాట్లాడుతూ..‘యూరప్‌లో వోక్స్వ్యాగన్ సంస్థ తన తయారీ యూనిట్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిపోతోంది. దాంతో యూరప్‌లో మూడు ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించాం. అయితే ఏ ప్లాంట్లను నిలిపేయాలో ఇంకా స్పష్టత రాలేదు. కంపెనీలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని కొలువుల నుంచి తొలగించనున్నాం. జర్మనీలోని వోక్స్వ్యాగన్ గ్రూప్‌లో దాదాపు 3,00,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!వోక్స్వ్యాగన్ కంపెనీ ఉత్పత్తులకు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్న చైనా, యూరప్ నుంచి డిమాండ్ తీవ్రంగా పడిపోయింది. దానికితోడు నిర్వహణ ఖర్చులు పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ కంపెనీ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి ఆదరణ కరవైంది. దాంతో చేసేదేమిలేక చివరకు ఉద్యోగుల తగ్గింపునకు పూనుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
దిగ్గజ ఆటో కంపెనీల మధ్య ఒప్పందం?
మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) త్వరలో కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. త్వరలో ముంబయిలో ఈ రెండు సంస్థలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సమావేశం కాబోతున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కంపెనీల ఉత్పత్తులు, తయారీ యూనిట్ల వినియోగం, టెక్నాలజీ, వంటి అంశాలపై ఇరుపక్షాలు దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ భారత్‌లో పుణె, ఔరంగబాద్‌లోని తయారీ యూనిట్లను కలిగి ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా మహారాష్ట్రలోని చకన్లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేయబోతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..? -
అమ్మకాల్లో అదరగొట్టిన టైగన్.. మూడేళ్ళలో లక్ష!
టైగన్ అమ్మకాల్లో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అరుదైన మైలురాయిని చేరుకుంది. మూడేళ్ళ క్రితం భారతీయ విఫణిలో అడుగెట్టిన ఈ కారు ఏకంగా 100000 యూనిట్ల సేల్స్ పొందగలిగింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్ (SIAM) గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్లో మాత్రమే 67140 మంది ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 32742 కార్లను కంపెనీ ఎగుమతి చేసింది.ఆగష్టు చివరి నాటికి టైగన్ అమ్మకాలు మొత్తం 99882 యూనిట్లు మాత్రమే. అయితే సెప్టెంబర్ నెల ప్రారంభంలో అమ్ముడైన కార్లను కలుపుకుంటే లక్ష యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ వెల్లడించింది.2023 ఆర్ధిక సంవత్సరంలో టైగన్ కారు ఎక్కువగా అమ్ముడైనట్లు (21,736 యూనిట్లు) తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 20,485 యూనిట్ల టైగన్ కార్లను కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. ఎగుమతుల విషయానికి వస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో 12,621యూనిట్లు ఎగుమతయ్యాయి.ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..టాటా కర్వ్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న.. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ధరలు రూ. 10.90 లక్షల నుంచి రూ. 18.70 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి. ఇది 1.0 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఈ కారు జఫ్రీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. -
పట్టాలపై నడుస్తుంది.. ట్రైన్ కాదు (ఫోటోలు)
-
కారు ఇళ్లు.. అదిరిపోయే ఫొటోలు
-
భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SAVWIPL) పూణేలోని చకన్లోని తన తయారీ కేంద్రంలో 15 లక్షల మేడ్-ఇన్-ఇండియా వాహనాలను తయారు చేసి.. ఉత్పత్తిలో ఓ సరికొత్త మైలురాయిని దాటేసింది.స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో స్థానికంగా తన కార్యకలాపాలను 2007లో ప్రారంభించి.. తమ మొదటి ఉత్పత్తిగా 'స్కోడా ఫాబియా' లాంచ్ చేశారు. ఆ తరువాత స్కోడా రాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో, అమియో వంటి కార్లను లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈ కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.ప్రస్తుతం సంస్థ కుషాక్, టైగన్, స్లావియా, వర్టస్ కార్లను మాత్రమే చకాన్ ఫెసిలిటీలో ఇండియా 2.0 ఉత్పత్తులుగా ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఉత్పత్తిలో సుమారు 30 శాతానికి పైగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు బ్రాండ్ ప్రకటించింది.స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ స్థానికంగా కార్లను మాత్రమే కాకుండా.. ఇంజిన్లను కూడా తయారు చేస్తోంది. అప్పట్లో పోలో హ్యాచ్‌బ్యాక్ కారులో అందించే 1.5 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజిన్‌ను కంపెనీ తయారు చేసిందే. ఆ తరువాత 2.0 లీటర్ టీడీఐ డీజిల్, 1.0 లీటర్, 1.2 ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్లను చేసింది. ఇప్పటికి స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ ఏకంగా 3.80 లక్షల ఇంజిన్లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. -
బీజింగ్ మోటార్ షోలో అడుగుపెట్టిన ఫోక్స్‌వ్యాగన్ కారు ఇదే..
బీజింగ్ మోటార్ షో 2024లో సరికొత్త 'ఫోక్స్‌వ్యాగన్ టైరాన్' అధికారికంగా వెల్లడైంది. చైనా మార్కెట్లో విక్రయానికి రానున్న ఈ కొత్త కారు 5 సీటర్ టైగన్ ఎల్ ప్రో పేరుతో విక్రయానికి రానుంది. ఇది 2025 నాటికి దేశీయ మార్కెట్లో 7 సీటర్ రూపంలో అడుగుపెట్టనుంది.ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ చూడటానికి చాలా వరకు టైగన్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, పెద్ద గ్లాస్‌హౌస్ వంటి వాటిని పొందుతుంది. ఇది దాని ఇతర మోడల్స్ కంటే కూడా కొంత పొడవుగా ఉంటుంది. ఇది సెంటర్ కన్సోల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్రైవ్ సెలెక్టర్ కోసం రోటరీ డయల్, రెండు కప్హోల్డర్లతో మంచి లేఅవుట్‌ను పొందుతుంది. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది. బేస్ మోడల్ 184 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ వేరియంట్ 217 హార్స్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ గ్లోబల్ మోడల్ అని సీఈఓ థామస్ షాఫర్ వెల్లడించారు. చైనా తరువాత జపాన్, ఆ తరువాత మెక్సికోలో తయారవుతుంది. 2025లో భారతీయ తీరాలను చేరే అవకాశం ఉందని సమాచారం. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
మొదటి విద్యుత్‌కారును ఆవిష్కరించిన ఫేమస్ కంపెనీ
ప్రపంచవ్యాప్తంగా ఇకపై పూర్తిగా విద్యుత్ కార్లనే తయారు చేసి విక్రయించాలని జర్మనీ వాహన సంస్థ ఫోక్స్‌వ్యాగన్ నిర్ణయించుకుంది. తాజాగా భారత్‌లో తన మొదటి విద్యుత్ కారు ‘ఐడీ.4’ను ఆవిష్కరించింది. గ్లోబల్‌గా ఉన్న ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. క్రమంగా దాదాపు అన్ని కంపెనీలు ఈవీవైపు మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఫోక్స్‌వ్యాగన్ భారత్‌లో విద్యుత్ వాహన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ఏడాదిలోనే ఈ కారును విపణిలోకి విడుదల చేయనున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) మైఖేల్ మేయర్ తెలిపారు. ఐడీ.4ను రెండు వేరియంట్లతో తీసుకోస్తున్నారు. 62 కిలోవాట్అవర్ సామర్థ్యం ఉన్న వేరియంట్ ఒక్కఛార్జ్‌లో 336 కిమీ వరకు వెళ్లగలదు. సింగిల్-మోటార్, రియర్-వీల్-డ్రైవ్‌తో అందుబాటులో ఉంటుంది. రెండోది 82 కిలోవాట్అవర్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక్కఛార్జ్‌తో 443 కిమీలు వెళ్లగలదు. సింగిల్-మోటార్, డ్యూయల్-మోటార్, ఆల్-వీల్-డ్రైవ్‌తో మార్కెట్లో రానుంది. ధరకు సంబంధించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే రూ.50లక్షలు-రూ.60లక్షల మధ్య ధర ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఈ కారును మార్కెట్లోని తీసుకురానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు ఈ ఏడాది భారత ప్రయాణికుల వాహన విపణి 5-7 శాతం మేర పెరిగే అవకాశం ఉందని.. తాము 10-15 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. క్రమంగా విద్యుత్‌కార్లను ఆవిష్కరణను పెంచుతూ సమీప భవిష్యత్తులో పూర్తిగా ఈవీలను తయారుచేస్తామని మేయర్ తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్ ముందు వరుసలో ఉందని చెప్పారు. -
ఆటోమొబైల్ రంగంలో మరో కీలక పరిణామం
వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్, భారత్‌కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా భవిష్యత్తులో తేబోయే ఎలక్ట్రిక్ కార్లకు కావాల్సిన విడిభాగాలను ఫోక్స్‌వ్యాగన్ సరఫరా చేయనుంది. ఫోక్స్‌వ్యాగన్ అభివృద్ధి చేసిన యూనిఫైడ్ సెల్ కాన్సెప్ట్‌ను మహీంద్రా తన ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ అయిన ఇంగ్లో కోసం వినియోగించనుంది. ఇంగ్లో ప్లాట్‌ఫామ్‌పై అయిదు పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మహీంద్రా అభివృద్ధి చేస్తోంది. తొలి మోడల్ 2024 డిసెంబర్లో అడుగు పెట్టనుంది. -
వోక్స్వ్యాగన్ కార్లలో చాట్‌జీపీటీ.. అదెలా పనిచేస్తుంది? దాని ఉపయోగాలు?
మీరు ఓ కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో కారు లోపల టెంపరేచర్ విపరీతంగా ఉంది. వెంటనే మీకు ‘ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్’ అనే సౌండ్ వినబడుతుంది. మీరు అదే కారులో ప్రయాణిస్తున్నారు. అప్పుడే మీకు నోరూరించే బటర్ చికెన్ తినాలనిపిస్తుంది. వెంటనే సమీపంలో ఉన్న రెస్టారెంట్ ఎక్కుడ ఉంది? అని వెతికే పనిలేకుండా సంబంధిత రెస్టారెంట్ పిన్ కోడ్, అడ్రస్‌తో సహా అన్నీ వివరాలు మీకు వాయిస్ రూపంలో అందుతాయి. అలెక్సా తరహాలో రానున్న రోజుల్లో వోక్స్వ్యాగన్ కార్ల యజమానులకు పై తరహా ఏఐ టెక్నాలజీ ఫీచర్లను అందించేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. వోక్స్వ్యాగన్ కార్లలో చాట్‌జీపీటీని ఇంటిగ్రేట్ చేస్తూ (అలెక్సా తరహా) వాయిస్ అసిస్టెంట్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. అమెరికా లాస్ వేగాస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో చాట్‌జీపీటీ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌పై ప్రకటించింది. ఈ ఏడాది క్యూ2 నాటికి కార్లలో వోక్స్వ్యాగన్ కార్లలో చాట్‌జీపీటీ వాయిస్ ఓవర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తామని, తొలుత నార్త్ అమెరికా, యూరప్ కస్టమర్లు ఈ ఫీచర్‌ను వినియోగించుకునే సౌకర్యం కలగనుంది. టచ్ స్క్రీన్‌ను తాకే పనిలేకుండా సాధారణంగా ఏదైనా ఫీచర్‌ను వినియోగించాలంటే కార్లలో టచ్ స్క్రీన్‌ను తాకాల్సి ఉంటుంది. వోక్స్వ్యాగన్ అందించనున్న ఫీచర్‌తో ఆ అవసరం ఉండదని ఆ సంస్థ టెక్నికల్ డెవలప్మెంట్ బ్రాండ్ బోర్డ్ మెంబర్ కై గ్రునిట్జ్ తెలిపారు. వోక్స్వ్యాగన్ తన కాంపాక్ట్ సెగ్మెంట్ కార్లలో టెక్నాలజీని స్టాండర్డ్ ఫీచర్‌గా మార్చిన మొదటి తయారీ సంస్థ తమదేనని తెలిపింది. అయితే, ఇప్పటికే జనరల్ మోటార్స్ గత మార్చిలో చాట్‌జీపీటీ ఏఐ మోడల్లను ఉపయోగించి వర్చువల్ పర్సనల్ అసిస్టెంట్‌పై పనిచేస్తున్నట్లు తెలిపింది మెర్సిడెజ్ బెంజ్ కార్లతో పాటు మెర్సిడెజ్ బెంజ్ గత జూన్‌లో ఒక టెస్ట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించి, ఆటోమేకర్ యొక్క ‘ఎంబీయూఎక్స్’ సిస్టమ్‌ను కలిగి ఉన్న సుమారు 900,000 కార్లలో చాట్‌జీపీటీని డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పిచ్చింది. వినియోగదారులు దృష్టిలో ఉంచుకుని సినిమాలు చూడడం, రెస్టారెంట్లలలో సీట్లను బుక్ చేసుకోవడం, డ్రైవింగ్ సమయంలో అలెర్ట్లను ఇస్తుంది. -
గేర్‌బాక్స్ రిపేర్‌కు రూ.5.8 లక్షలు - బిల్ చూసి అవాక్కయిన కారు ఓనర్..
కారులో సమస్య వచ్చినప్పుడు రిపేర్ చేసుకోవాలంటే ఖర్చు వేలల్లో ఉంటుంది, అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనలో గేర్‌బాక్స్‌లో సమస్యను పరిష్కరించుకోవడానికి ఏకంగా ఐదు లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా కారు ఇంజిన్‌లో అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే.. ఇలాంటి సమస్యలే తలెత్తుతూ ఉంటాయి. ఇటీవల ఫోక్స్‌వ్యాగన్ అమియో కారులోని DSG గేర్‌బాక్స్ ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో దానిని రిపేర్ చేసుకోవడానికి రూ. 5.8 లక్షలు ఖర్చు అయినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన బిల్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. గేర్‌బాక్స్‌లో సమస్యను పరిష్కరించుకోవడానికే.. ఇంత బిల్ వచ్చిందా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫోక్స్‌వ్యాగన్ అమియో యజమాని 2వ, 3వ గేర్ మధ్య అప్‌షిఫ్ట్ చేసేటప్పుడు, డౌన్‌షిఫ్ట్ చేసేటప్పుడు ఎక్కువ శబ్దం వస్తున్నట్లు గ్రహించి సర్వీస్ సెంటర్‌కు వెళ్లి తన సమస్యను తెలియజేశాడు. డీఎస్జీ గేర్‌బాక్స్‌లో పెద్ద సమస్య ఉన్నట్లు గుర్తించి, దానిని రిపేర్ చేయడానికి రూ. 5.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ గేర్‌బాక్స్‌లో ఎక్కడ సమస్య ఉందనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోయారు. -
కారు కొంటే ఉచితంగా శ్రీలంక టూర్.. ఆసియా కప్ మ్యాచ్‌లు చూసే అవకాశం!
ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తమ కార్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కంపెనీకి చెందిన కార్లపై భారీ డిస్కౌంట్లతో పాటు ఉచితంగా శ్రీలంక వెళ్లి ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లు చూసే అవకాశాన్ని కూడా పొందవచ్చని వోక్స్వ్యాగన్ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. భారీ డిస్కౌంట్లు వోక్స్వ్యాగన్ తైగూన్ మోడల్ కారు కొనాలనుకునేవారికి ఏకంగా రూ.1.60 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ వెబ్ సైట్ లో వెల్లడించింది. ఇందులో రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.60,000 ఎక్స్చేంజ్ బోనస్. అయితే ఈ ఆఫర్ 1.5 లీటర్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే వోక్స్వ్యాగన్ వర్చుస్ మోడల్ కార్లపై కూడా తగ్గింపును అందుబాటులో ఉంచింది. ఈ మోడల్ కార్లకు గరిష్ఠంగా రూ.1.40 లక్షల తగ్గింపును పొందవచ్చని స్పష్టం చేసింది. ఇందులోనూ రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.40,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుందని పేర్కొంది. తైగూన్ లాగే ఇది కూడా 1.5 లీటర్ వేరియంట్‌కే వర్తిస్తుంది. శ్రీలంక టూర్ వోక్స్వ్యాగన్ తమ తైగూన్, వర్చుస్ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లతోపాటు ఉచితంగా శ్రీలంక వెళ్లే అవకాశాన్ని కూడా గెలుచుకోవచ్చని ప్రకటించింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి అఫీషియల్ పార్ట్నర్గా ఉన్న వోక్స్వ్యాగన్ ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ మధ్య తమ కార్లు కొలుగోలు చేసిన కస్టమర్లు ఉచితంగా శ్రీలంక వెళ్లి అక్కడ జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించే అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది. డిస్కౌంట్లు, ఇతర ఆఫర్ల గురించి పూర్తి వివరాల కోసం దగ్గరలోని డీలర్‌ను సంప్రదించవచ్చు. -
ఫోక్స్‌వ్యాగన్ ఆఫర్ల జాతర.. టైగన్, వర్టస్ కొనుగోలుకు ఇదే మంచి సమయం!
ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) కంపెనీ ఎట్టకేలకు తన టైగన్ అండ్ వర్టస్ కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం 2022 - 2023 మోడల్ కార్లకు, BS6 ఫేజ్-2 కంప్లైంట్ ఇంజన్లతో నడిచే కార్లకు మాత్రమే లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 2022 మోడల్ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మీద రూ. 1.40 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో కూడా వేరియంట్‌ను బట్టి రూ. 65,000 నుంచి తగ్గింపులు ప్రారంభమవుతాయి. టాప్‌లైన్ మాన్యువల్ వేరియంట్ మీద అత్యధిక తగ్గింపు, కంఫర్ట్‌లైన్ మాన్యువల్ వేరియంట్ మీద అత్యల్ప తగ్గింపు లభిస్తుంది. అయితే 2023 మోడల్ మీద రూ. 85,000 వరకు లభిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఇక ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ విషయానికి వస్తే.. కంపెనీ 2022 మోడల్ ఇయర్ మోడల్ మీద రూ. 1.20 లక్షల తగ్గింపుని ప్రకటించింది. ఇది కూడా కంఫర్ట్‌లైన్ మాన్యువల్, టాప్‌లైన్ మాన్యువల్ వేరియంట్లకు అత్యధికంగా లభిస్తుంది. మరో వైపు జీటీ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ. 20000 తగ్గింపు మాత్రమే లభిస్తుంది. అదే సమయంలో 2023 మోడల్ ఇయర్ వర్టస్ కంఫర్ట్‌లైన్ మాన్యువల్, టాప్‌లైన్ మాన్యువల్, ఆటోమేటిక్ అనే మూడు వేరియంట్లపై రూ. 85,000 వరకు తగ్గింపు లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్ - ఫస్ట్ యూనిట్ చూసారా!) ఆఫర్స్ అనేవి నగరం నుంచి మరో నగరానికి లేదా డీలర్ నుంచి మరో డీలర్‌కి మారే అవకాశం ఉంటుంది. కావున టైగన్, వర్టస్ వేరియంట్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్‌ను సంప్రదించడం మంచిది. -
ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్, టైగున్ కొత్త ట్రిమ్స్ - ధర & వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా మధ్యస్థాయి సెడా న్ అయిన వర్టూస్, ఎస్యూవీ టైగున్ కొత్త ట్రిమ్స్‌ను విడుదల చేసింది. వర్టూస్ జీటీ ప్లస్ వేరియంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్రిమ్‌ను రూ.16.89 లక్షల ధరలో ప్రవేశపెట్టింది. జీటీ డీఎస్జీ, జీటీ ప్లస్ వేరియంట్లలో టైగున్‌ను పరిచయం చేసింది. ఎక్స్‌షోరూంలో వీటి ప్రారంభ ధర రూ.16.79 లక్షలు. దేశవ్యాప్తంగా 121 నగరాలు, పట్టణాల్లోని 161 విక్రయ శాలల్లో ఇవి లభిస్తాయని కంపెనీ తెలిపింది. -
ఇవి కదా డిస్కౌంట్స్ అంటే.. కొత్త కారు కొనాలనుకునే వారికి పండగే..!
భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందుతున్న కార్ల తయారీ సంస్థల్లో ఒకటి 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen). ఈ జర్మన్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఇప్పటికే టైగన్, వర్టస్ వంటి కార్లను మంచి సంఖ్యలో విక్రయిస్తోంది. ఈ తరుణంలో కంపెనీ ఈ మోడల్స్ మీద అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. 2022 - 2023 మధ్యలో తయారైన బిఎస్-6 ఫేజ్ 2 ప్రమాణాలకు అనుకూలంగా ఉన్న మోడల్లకు కూడా ఈ అఫర్ వర్తిస్తుంది. దీని కింద ఫోక్స్‌వ్యాగన్ కార్లను కొనాలనుకునే వారు టైగన్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ. 1.41 లక్షలు, వర్టస్ సెడాన్‌పై రూ. 1.03 లక్షల తగ్గింపు పొందవచ్చు. 2022 మోడల్ టైగన్‌లో మీరు ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి రూ. 65,000 నుంచి రూ. 1.41 లక్షల వరకు తగ్గింపులు లభిస్తాయి. ఇందులో టైగన్ టాప్‌లైన్ మాన్యువల్ వేరియంట్‌పై ఎక్కువ, కంఫర్ట్‌లైన్ మాన్యువల్ వేరియంట్ మీద తక్కువ తగ్గింపు లభిస్తుంది. ఇక 2023 టైగన్ కొనుగోలుపై రూ. 91,000 బిఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉన్న 2023 మోడల్ టైగన్ మీద గరిష్టంగా రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. (ఇదీ చదవండి: సత్య నాదెళ్ల లగ్జరీ హౌస్ చూసారా - రెండంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్ మరెన్నో..) ఇప్పుడు వర్టస్ విషయానికి వస్తే, మాన్యువల్ వేరియంట్‌పై రూ. 1.03 లక్షలు, 2022 ఆటోమేటిక్ వేరియంట్ మీద రూ. 20,000 తగ్గింపు పొందవచ్చు. 2023 మోడల్ వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్లు రూ. 20,000 నుంచి రూ. 65,000 వరకు తగ్గింపు, అదే సమయంలో రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) నిబంధనలకు అనుగుణంగా ఉండే మోడళ్లపై ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి రూ. 20,000 నుంచి రూ. 40,000 తగ్గింపు లభిస్తుంది. కంపెనీ అందించే ఈ ఆఫర్ ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక డీలర్ నుంచి డీలర్‌కు మారే అవకాశాలు ఉన్నాయి. కావున కొనుగోలుదారుడు ఫోక్స్‌వ్యాగన్ కొనేటప్పుడు ఖచ్చితమైన వివరాలను పొందటానికి సమీపంలో ఉన్న డీలర్‌ను సంప్రదించడం మంచిదని భావిస్తున్నాము. -
టైగన్ ప్రియులకు షాక్.. భారీగా ధరలు పెంచిన ఫోక్స్‌వ్యాగన్
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గత నెలలోనే టైగన్ ధరల పెరుగుదలను గురించి ప్రకటించింది. అయితే ఇప్పుడు కొత్త ధరలను కూడా వెల్లడించింది. రియల్ డ్రైవ్స్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా అప్డేట్ చేయడం వల్లే ఈ ధరల పెరుగుదల జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ ధరల పెరుగుదలకు గల కారణాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రస్తుతం కంఫర్ట్‌లైన్, హైలైన్, ఫస్ట్ యానివర్సరీ, టాప్‌లైన్, జిటి, జిటి ప్లస్ అనే ఆరు వేరియంట్లలో లభిస్తోంది. టైగన్ యానివర్సరీ ఎడిషన్ ధర రూ. 45,000 పెరిగింది. అదే సమయంలో జిటి & జిటి ప్లస్ ధరలు వరుసగా రూ. 30,000, రూ. 10,000 పెరిగాయి. ఇక హైలైన్ వేరియంట్ ధర రూ. 24,000 పెరిగింది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్: భారీగా తగ్గిన సీఎన్జీ, పీఎన్జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా ఉన్నాయి) ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్పి పవర్, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది. ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్పి పవర్, 1500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. పనితీరు పరంగా ఈ రెండు ఇంజిన్లు ఉత్తమంగా ఉంటాయి. -
Volkswagen ID.2all EV: ఫోక్స్‌వ్యాగన్ నుంచి రానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు, ఇదే
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది, ఈ తరుణంలో దాదాపు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీలో మేము సైతం అంటూ ముందుకు దూసుకొస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మిన్నకుండిన 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) ఐడీ 2 ఆల్ కాన్సెప్ట్ రూపంలో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ ఐడీ 2 ఆల్ 2025 నాటికి దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కేవలం రూ. 22 లక్షల (అంచనా ధర) ధరతో విడుదల కానున్న ఈ సెడాన్ మధ్యతరగతి ప్రజలను ఆకర్శించడానికి సిద్దమవుతున్న నివేదికలు చెబుతున్నాయి. డిజైన్: భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక కాలంలో వినియోగించడానికి అనుకూలంగా ఉండే ఫీచర్స్ పొందుతుంది. ఇందులో మ్యాట్రిక్స్ హెడ్లైట్లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, త్రీడీ ఎల్ఈడీ టెయిల్ లైట్ క్లస్టర్ల మధ్య సమాంతర ఎల్ఈడీ స్ట్రిప్ వంటి ఫీచర్లు ఉంటాయి. (ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ వంటమనిషి జీతం ఎంతంటే?) ఫీచర్స్: ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో 12.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 10.9 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్ప్లే, ట్రావెల్ అసిస్ట్, మెమరీ ఫంక్షన్‌తో పార్క్ అసిస్ట్ ప్లస్, అలాగే మసాజ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ సీట్లు ఉన్నాయి. బ్యాటరీ ప్యాక్ & రేంజ్: ఫోక్స్‌వ్యాగన్ ఐడీ 2 ఆల్ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 450 కిమీ రేంజ్ అందించేలా రూపొందించబడుతోంది. అంతే కాకుండా 2026 నాటికి కంపెనీ దాదాపు పది ఎలక్ట్రిక్ కార్లను విడుదలచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఐడీ 2 ఆల్ ఎలక్ట్రిక్ ఫ్రంట్ యాక్సిల్ మోటార్ 222 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో 20 నిముషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. 11Kw హోమ్ ఛార్జర్ కూడా అనుకూలంగా ఉంటుంది. -
అయ్యయ్యో కొత్త కారు, రోడ్డు మీదకి రాకముందే ఇలా! వైరల్ వీడియో
సాధారణంగా చాలా మందికి కారు కొనటం ఒక కల, ఆ కల నిజమయ్యే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ నష్టాలను కలిగిస్తాయి. ఇటీవల ఒక వ్యక్తి కారు కొనుగోలు చేసిన కొన్ని నిముషాల్లోనే ప్రమాదానికి గురైంది, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి డీలర్షిప్ ముందు ఉన్న రోడ్డుపై ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రమాదానికి గురైంది. డెలివరీ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ఎక్కువగా దెబ్బతినింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇందులో కస్టమర్ల తొందర, అత్యుత్సాహం వల్ల జరిగిన పొరపాట్లు స్పష్టంగా తెలుస్తుంది. డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకోకుండా కారు నడిపితే ఇలాంగే ఉంటుందనటానికి ఇది మంచి ఉదాహరణ. నిజానికి భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రూ. 11,21,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైంది. ఈ సెడాన్ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇది రెండు వేరియంట్స్, రెండు ఇంజిన్ ఆప్సన్షతో అందుబాటులో ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 115 హెచ్‌పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తే, 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 హెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఈ సెడాన్ లాటిన్ NCAP క్రాస్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొంది దేశీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. -
ఇండియన్ కస్టమర్లకు ఫోక్స్‌వ్యాగన్ భారీ షాక్
సాక్షి, ముంబై: జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ భారతీయ వినియోగదారులకు షాకిచ్చింది. భారత మార్కెట్లో తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. అన్ని రకాల మోడళ్లపై దాదాపు 2శాతం వరకు ధరలు పెంచు తున్నట్టు ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది. అధిక ఇన్పుట్ ఖర్చుల కారణంగాధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. సవరించిన కొత్త ధరలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. వర్టస్, టైగన్ ,కొత్త టిగువాన్ మొదలు భారతదేశంలోని ఫోక్స్‌వ్యాగన్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో అంతటా ధరల పెంపు అమల్లో ఉంటుందని పేర్కొంది. కొత్త ధరల జాబితాను వెల్లడించనప్పటికీ, కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో 2శాతం వరకు వరకు పెంపు ఉంటుందని తెలిపింది. దీంతో ప్రస్తుతం రెండు ట్రిమ్స్‌లో అందుబాటులో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ధర రూ. 11.22 లక్షల నుండి ప్రారంభమై రూ. 17.92 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. ఇక టైగన్ ఎస్యూవీ ప్రస్తుతం రూ. 11.39 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉన్న ధర పెంపు తర్వాత రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. -
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యానివర్సరీ ఎడిషన్: అదరిపోయే ఫీచర్స్, కలర్స్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్యూవీ తొలి వార్షికోత్సవ ఎడిషన్ లాంచ్ చేసింది. టైగన్ ఎస్‌యూవీని లాంచ్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా కొన్ని స్పెషల్ ఫీచర్లతో ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్‌గా సరికొత్తగా లాంచ్ చేసింది. రైజింగ్ బ్లూ కలర్, ఎల్లో, వైల్డ్ చెర్రీ రెడ్‌లో ఇది అందుబాటులో ఉంది. స్టాండర్డ్ టైగన్‌తో పోలిస్తే ఇందులో ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్ , ఇతర ఫీచర్లతో తీసుకొచ్చింది. డైనమిక్ లైన్లో తీసుకొచ్చిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ స్పెషల్ ఎడిషన్ రెండు ఇంజీన్లతోరానుంది. 1.0 TSI MT & ATలో అందుబాటులో ఉన్న టాప్‌లైన్ వేరియంట్. "1" వార్షికోత్సవ బ్యాడ్జింగ్‌తో స్పోర్టియర్ లుక్స్‌తో అదరగొడుతోంది. ఇందులో హై లగ్జరీ ఫాగ్ ల్యాంప్స్, బాడీ-కలర్ డోర్ గార్నిష్, బ్లాక్ సి-పిల్లర్ గ్రాఫిక్స్, బ్లాక్ రూఫ్ ఫాయిల్, డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్, బ్లాక్ ORVM క్యాప్స్, విండో వైజర్లతో సహా ప్రత్యేకంగా డిజైన్చేసిన 11 అంశాలు ఉన్నాయి. సెఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే టైగన్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 వరకు ఎయిర్ బ్యాగ్‌లు, మల్టీ-కొలిజన్ బ్రేక్‌లు, రివర్స్ కెమెరా, ISOFIX, టైర్ ప్రెజర్ డిఫ్లేషన్ వార్నింగ్ సిస్టమ్ లాంటి పూర్తి స్థాయి 40+ భద్రతా ఫీచర్లను జోడించింది. అదనంగా 3 పాయింట్ సీట్ బెల్ట్‌లతో పాటు వెనుకవైపు 3 ఎడ్జస్టబుల్ హెడ్రెస్ట్ కూడా ఉంది. టైగన్ యానివర్సరీ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్‌తో కూడిన 1.0L TSI ఇంజన్, 5000 నుండి 115PS (85 kW) గరిష్ట శక్తిని, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక. 5500 ఆప్పిఎం వద్ద గరిష్ట టార్క్ 178 టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5L TSI EVO ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ , 7-స్పీడ్ DSG ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో అమర్చబడి ఉంటుంది, ఇది 150PS (110 kW) గరిష్ట శక్తిని 5000, 6000 rpm వద్ద, 5000 టార్క్ అందిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన ధరలు రూ. 15.40 లక్షలు- రూ. 16.90 లక్షల వరకు ఉంటాయి. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్లో టాప్ 3 ఫైనలిస్ట్గి నిలిచి ప్రపంచస్థాయిలో టైగన్ ఖ్యాతిగడించిందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. ఈ సందర్బంగా టైగన్ కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. టైగన్ ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే 40 వేల కంటే ఎక్కువ ఆర్డర్లను సాధించగా , 22వేల టైగన్లను డెలివరీ చేసింది. -
ఫోక్స్‌వ్యాగన్ సెడాన్ వర్టస్ సంచలనం
హైదరాబాద్: జర్మనీకి చెందిన వాహన తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ మధ్యస్థాయిసెడాన్ వర్టస్ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే 2,000లకుపైగా యూనిట్లు డెలివరీ చేసినట్టు కంపెనీ ప్రకటించింది. లాంచ్ చేసిన దగ్గర్నుంచి ఈ కారు అద్భుతమైన స్పందనతో కస్టమర్ డిమాండ్‌ను సాధించిందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దీని కారణంగా కంపెనీ తన 'బిగ్ బై డెలివరీ', మెగా డెలివరీ ప్రోగ్రామ్‌ను ఇండియా వ్యాప్తంగా ప్రారంభించామని చెప్పింది. ప్రారంభ ఆఫర్లో వర్టస్ ధర ఎక్స్‌షోరూంలో రూ.11.21 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.0 లీటర్, 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ పవర్‌ట్రైన్స్ పొందుపరిచారు. 1.0 లీటర్ ట్రిమ్‌లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటరుకు 19.4 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 18.12 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 1.5 లీటర్ 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ 18.67 కిలోమీటర్ల మైలేజీ ఉంటుందని తెలిపింది. హోండా సిటీ, మారుతీ సియాజ్, హ్యుండై వెర్నా, స్కోడా స్లావియాలకు ఇది పోటీనిస్తుంది. ఎంక్యూబీ ఏ0 ఇండియా ప్లాట్‌ఫామ్‌పై పూణే సమీపంలోని చకన్ ప్లాంటులో ఇది తయారైంది. కాగా ఫోక్స్‌వ్యాగన్ ఇటీవల రిలీజ్ చేసిన వర్టస్ ఇండియాలో ఏ సెడాన్ కారుకు సాధ్యం కాని అరుదైన ఫీట్‌ను సాధించింది. కేరళలోని కొచ్చిలో ఉన్న ఒక షోరూం ఒకేరోజు 150 కార్లను డెలివరీ చేసింది. తద్వారా ఇండియా బుక్ రికార్డ్స్‌లో వర్టస్ చోటు సంపాదించినట్టు కంపెనీ వెల్లడించింది. -
ఈ విషయంలో ఈ కారు రికార్డు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ఫోక్స్‌వ్యాగన్ తాజాగా రిలీజ్ చేసిన వర్చు కారు రికార్డు సృష్టించింది. ఇంత వరకు ఇండియాలో ఏ సెడాన్ కారుకు సాధ్యం అరుదైన ఫీట్‌ను అవలీలాగా సాధించింది. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించింది. జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ ఇటీవల వర్చుస్ పేరుతో సరికొత్త సెడాన్‌ను మార్కెట్లో రిలీజ్ చేసింది. మార్కెటింగ్ స్ట్రాటెజీగా రికార్డ్ మెగా డెలివరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం దేశ వ్యాప్తంగా డీలర్లకు పిలుపునిచ్చింది. ఫోక్స్ వ్యాగన్ మెగా డెలివరీ ప్రోగ్రామ్‌లో భాగంగా కేరళాకు చెందిన ఈవీఎం మోటార్స్ అండ్ వెహికల్స్ అనే డీలర్లు రికార్డు సృష్టించారు. జూన్ 9న కారు మార్కెట్లో రిలీజ్ అవగా అదే రోజు రికార్డు స్థాయిలో ఒకే డీలర్ నుంచి 150 సెడాన్ కార్లు డెలివరీ చేశారు. ఇప్పటి వరకు ఇండియాకు సంబంధించి ఒక సెడాన్ కారు ఒకే డీలర్ నుంచి ఒకే రోజు ఈ స్థాయిలో డెలివరీలు జరగలేదు. దీంతో ఈ ఆరుదైన ఫీట్‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇప్పటి వరకు ఈవీఎం డీలర్లు 200ల వరకు వర్చుస్ కార్లను డెలివరీ చేయగలిగారు. ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్ కారు ప్రారంభం ధర రూ.11.21 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. చదవండి: ఆటో విడిభాగాల సంస్థలకు డిమాండ్ ఊతం -
ఫోక్స్ వ్యాగన్ నుంచి సరికొత్త వర్చ్యూ
ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ జర్మన్ కార్‌మేకర్ ఫోక్స్ వ్యాగన్ ఇండియాలో మరో కొత్త కారును ప్రవేశపెట్టింది. సెడాన్ విభాగంలో ఈ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ కారు కనీస ధర రూ. 11.21 లక్షలు ఉండగా హై ఎండ్ మోడల్ ధర రూ.17.92 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఆరు వేరియంట్లలో, ఆరు రంగుల్లో ఈ కారు లభించనుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన 152 షోరూమ్‌లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఫీచర్లు - క్యాబిన్ మరియు బూట్ స్పేస్ 526 లీటర్లు - 20 సెంటీమీటర్ల డిజిటల్ కాక్‌పిట్ - 25.65 స్క్రీన్ ఇన్ఫోంటైన్మెంట్ సిస్టమ్ - యాప్ కనెక్టివిటీ ఫీచర్లు - కీ లెస్ ఇంజన్ స్టార్ట్ , ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ - 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు , 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ మాన్యువల్/ఆటో టార్క్ - వైల్డ్ చెర్రీ రెడ్, కార్బన్ స్టీల్ గ్రే, రిఫ్టెక్స్ సిల్వర్, కుర్కుమా ఎల్లో, క్యాండీ వైట్, రైజింగ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. The New Volkswagen Virtus launched at a starting price of ₹ 11.21 Lakh. The striking, exhilarating, German-engineered marvel will be available in Dynamic and Performance variants.#TheNewVolkswagenVirtus #Sedan2022 #VolkswagenSedan #SedanIndia #VolkswagenIndia #Volkswagen pic.twitter.com/TiUPdEELCD — Volkswagen India (@volkswagenindia) June 9, 2022 లోటు తీరేనా ప్రస్తుతం ఇండియాలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్‌కి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎస్యూవీ, సబ్ ఎస్యూవీ, కాంపాక్ట్ ఎస్యూవీ ఇలా రకరకాలుగా మార్కెట్లోకి ఎస్‌యూవీలు వస్తున్నాయి. ఎస్‌యూవీల తర్వాత మల్టీ పర్పస్ వెహికల్స్ కూడా డిమాండ్ బాగానే ఉంది. దీంతో సెడాన్ విభాగంలో కొత్త మోడళ్ల రాక బాగా తగ్గిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎంట్రీ, మిడ్లెవల్లో ఈ కొరత ఎక్కువగా ఉంది. దీంతో ఫోక్స్‌వ్యాగన్ వర్చ్యూ పేరుతో కొత్త సెడాన్‌ను తెస్తోంది. చదవండి: టాటా మోటార్స్ ‘ఈవీ’ రైడ్ -
‘ఈవీ’ విషయంలో జట్టు కట్టిన మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్‌లు
ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. దేశీ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ఫోక్స్ వ్యాగన్ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. భవిష్యత్తులో మహీంద్రా గ్రూపు తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలను ఫోక్స్ వ్యాగన్ సమకూరుస్తుంది. మోటార్, ఇతర ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్‌ను ఎంఈబీ సంస్థ అందిస్తుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. -
ఫోక్స్‌వ్యాగన్‌కి సవాల్ విసిరిన ఎలన్‌మస్క్
ఎప్పటి నుంచో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే జర్మనీ పెట్టింది పేరు. అలాంటి జర్మనీలో మళ్లీ ఫోక్స్వ్యాగన్దే ఆధిపత్యం. ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్‌కి తోడు పోర్షే, స్కోడా, లంబోర్గిని, ఆడి వంటి అనేక బ్రాండ్లు ఈ కంపెనీ సొంతం. అలాంటి దిగ్గజ కంపెనీకి జర్మనీ గడ్డ మీదనే సవాల్ విసిరారు బిజినెస్ ఫైర్‌బ్రాండ్ ఎలన్‌మస్క్. గిగా ఫ్యాక్టరీ కాన్సెప్టుతో మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్‌కి కొత్త రూపు తీసుకొచ్చారు ఎలన్ మస్క్. భారీ పెట్టుబడితో అతి భారీగా తయారీ పరిశ్రమను నెలకొల్పి ప్రొడక్షన్ వ్యయం తగ్గించేయడం ఈ గిగా ఫ్యాక్టరీల లక్ష్యం. అలాంటి ఫ్యాక్టరీ తాజాగా జర్మనీలో ప్రారంభించారు ఎలన్ మస్క్. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షూల్జ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు 12 వేల మంది కార్మికులు పని చేస్తున్న ఈ ఫ్యాక్టరీ జర్మనీలోనే పెద్దదిగా రికార్డు సృష్టించింది. ఈ ఫ్యాక్టరీ మీద 5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు ఎలన్ మస్క్. రాబోయే రోజుల్లో ఏడాదికి ఐదు లక్షల కార్లు తయారు చేయడం ఈ గిగా ఫ్యాక్టరీ లక్ష్యం. ప్రస్తుతం యూరప్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఫోక్స్ వ్యాగన్దే ఆధిపత్యం. యూరప్‌లో 25 శాతం మార్కెట్‌తో ఏడాదికి 4.50 లక్షల ఈవీ కార్లను విక్రయిస్తోంది ఫోక్స్ వ్యాగన్. ఇప్పటికిప్పుడు ఆ కంపెనీ చేతిలో 95 వేల ఈవీ కార్ల ఆర్డర్లు రెడీగా ఉన్నాయి. ఎలన్ మస్క్ ప్రారంభించి టెస్లా గిగా ఫ్యాక్టరీతో రాబోయే రెండుమూడేళ్లలో ఫోక్స్‌వ్యాగన్‌కి తీవ్రమైన పోటీ ఎదురు కానుంది. యూరప్ మార్కెట్లో టెస్లాకి 13 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇక కొత్తగా గిగా ఫ్యాక్టరీ కూడా అందుబాటులోకి వస్తే మార్కెట్లో టెస్లా మరింత దూకుడు ప్రదర్శిస్తుంది. దీంతో జర్మన్ పీపుల్స్ కార్ల కంపెనీకి ఇబ్బందులు తప్పేలా లేవు. గిగా ఫ్యాక్టరీ ప్రారంభమైనప్పటికీ 2022 ఏడాదికి సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం 54 వేల కార్లుగానే ఉండనుంది. 2023లో 2.80 లక్షల ఉత్పత్తి చేసి 2025 కల్లా ఏడాదికి 5 లక్షల కార్ల ఉత్పత్తి సామర్యం చేరుకోవాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లా దూకుడుకి చెక్ పెట్టే పనిలో భాగంగా ఫోక్స్‌వ్యాగన్ సైతం తన ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
ఎలక్ట్రిక్ మైక్రోబస్‌ను లాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్..!
ఎట్టకేలకు ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ మైక్రోబస్ లేదా మల్టీ పర్పస్ వెహికిల్ VW ID. BUZZను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ ఐకానిక్ VW బస్ సరికొత్తగా ఎలక్ట్రిక్ అవతార్‌లో కన్పించనుంది. ఈ ఏడాది చివర్లో యూరప్ మార్కెట్లలోకి వీడబ్య్లూ ఐడీ.బజ్ అందుబాటులోకి రానుంది. సరికొత్త హాంగులతో..! మల్టీ పర్పస్ వెహికిల్ విభాగంలో ఫోక్స్ వ్యాగన్ VW ID. BUZZ భారీ ఆదరణను పొందింది. పలు కారణాలతో ఫోక్స్‌వ్యాగన్ దీని ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రసుత్తం VW ID. BUZZ వ్యాన్ సరికొత్తగా ఎలక్ట్రిక్ రూపంలో రానుంది. ఈ వాహనం బజ్ గ్రూప్‌కు చెందిన మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ కిట్ (MEB) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడనుంది. ఇది యూరప్‌లోని మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ బస్, ట్రాన్స్పోర్టర్. ఈ కారు కార్గో, ప్యాసింజర్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఇంజన్ విషయానికి వస్తే..! ఫోక్స్‌వ్యాగన్ ID. Buzz 150 kW లేదా 201 bhp ఎలక్ట్రిక్ మోటారుతో రానుంది. 1 kW ఏసీ వాల్ ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు, అయితే, ఇది 170 kW వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతును ఇవ్వనుంది. ఈ వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ రేంజ్‌ను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రెట్రో లుక్స్‌తో, మరింత స్టైలిష్‌గా..! సరికొత్త ID. Buzz 1950 VW బస్ T1 మోడల్ నుంచి ప్రేరణ పొందింది. ఈ ఈవీ షార్ట్ ఫ్రంట్ ఓవర్‌హాంగ్‌లతో రానుంది. ఐకానిక్ ఫ్రంట్ దాని మధ్య V-ఆకారపు ఫ్రంట్ ప్యానెల్‌తో పాటు ఆధునిక ఎల్ఈడీ హెడ్లైట్లతో వస్తుంది. బంపర్ ప్రత్యేకమైన డైమండ్ ప్యాటర్న్ గ్రిల్ వచ్చేలా డిజైన్ చేశారు. ఈ వాహనంలో సెంట్రల్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ , అన్ని ఇతర ఆధునిక అంశాలతో రానుంది. చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్..! ఆ సెగ్మెంట్లో చవకైన బైక్‌గా..! -
భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది మే నెలలో భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 115 పీఎస్ పవర్‌తో 1.0 లీటర్, 150 పీఎస్ పవర్‌తో 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ పవర్‌ట్రైయిన్స్, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో రూపుదిద్దుకుంది. హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా, మారుతి సుజుకీ సియాజ్, స్కోడా స్లేవియా వంటి మోడళ్లకు ఇది పోటీ ఇవ్వనుంది. మధ్య స్థాయి ప్రీమియం సెడాన్స్ విభాగంలో 12–15 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా వెల్లడించారు. ‘కొత్త ఉత్పాదన రాగానే విభాగం వృద్ధి చెందుతుంది. 2022 డిసెంబర్ నాటికి ఈ విభాగం 1.5 లక్షల యూనిట్లకు చేరుతుందన్న అంచనా ఉంది. కారు నిర్మాణ శైలికి ఇప్పటికీ దేశంలో ఆదరణ ఉంది. మొత్తం ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో ఈ శైలి కార్ల వాటా 12–14 శాతం కైవసం చేసుకుంది. ఏటా 4 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. మధ్యస్థాయి సెడాన్ విభాగం గతేడాది 28 శాతం వృద్ధి చెందింది’ అని వివరించారు. -
సీన్ రివర్స్.. దిగుమతి రోజులు పోయాయ్..
ఆటోమోబైల్ ఇండస్ట్రీలో గుణాత్మక మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు విదేశాల్లో తయారైన కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇండియాలో తయారైన కార్లను విదేశాలకు ఎగుమతి చేసే స్టేజ్‌కి చేరుకుంది. జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్లాంటులో తయారు చేసిన కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ‘ఇంజనీరిడ్ ఇన్ ఇండియా డ్రివెన్ బై ది వరల్డ్’ కాన్సెప్టుతో ఈ పని చేపట్టింది. పూనేలో ఉన్న కార్ల తయారీ యూనిట్లో రూపొందిన టీ క్రాస్ మోడల్ కారును మెక్సికోకు ఎగుమతి చేస్తున్నట్టు స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా చైర్మన్ కాన్వాన్ సిలీన్ ప్రకటించారు. ఇక్కడ తయారైన కార్లకు మెక్సికో, సౌతాఫ్రికా, కొలంబియా, ఈక్వెడార్, అర్జెంటీనా దేశాల్లో చాలా డిమాండ్ ఉందని ఫోక్స్‌వ్యాగన్ ప్రతినిధులు తెలిపారు. గతంలో వెంటో కారుని ఎగుమతి చేయగా మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఇండియాలో టైగూన్ మోడల్‌లతో అమ్ముడవుతున్న కారుకి విదేశాల కోసం టీ క్రాస్ పేరుతో ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు. ఇండియలోని ప్లాంట్‌లో తయారైన కార్లు 61 దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. జర్మనీ ప్లాంట్లకు ఏమాత్రం తగ్గని క్వాలిటీతో ఇండియాలో కార్లు తయారు చేస్తున్నామన్నారు. చదవండి:కారు తయారీ దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్..! -
వామ్మో ఒమిక్రాన్ ! కరోనాతో చైనాలో పరిస్థితి చేజారుతోందా ?
కరోనా విషయంలో బయటి ప్రపంచానికి చైనా చెప్పేదొకటి.. క్షేత్రస్థాయిలో జరిగేదొకటి. కరోనా వ్యాప్తి ఇప్పటికీ కంట్రోల్లోనే ఉందంటూ చైనా చెబుతున్నా వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చైనాలో కరోనా తీవ్రతను తెలిపే సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఫోక్స్ వ్యాగన్ తీసుకున్న నిర్ణయం కూడా వాటి సరసన చేరింది. చైనా యూనిట్లు ప్రపంచలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీగా పేరుంది జర్మన్ కార మేకర్ ఫోక్స్ వ్యాగన్కి. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కార్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. చైనాలోని టియాన్జిన్ నగరంలో ఫోక్స్ వ్యాగన్ కంపెనీకి కార్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో పాటు కార్ల తయారీలో వినియోగించే విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ప్రమాదకరంగా ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి ఫ్యాక్టరీలో ఫోక్స్ వ్యాగన్ కంపెనీ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఒక్కసారిగా చైనాలో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడంతో ఫోక్స్ వ్యాగన్ యాజమాన్యం ఆందోళన చెందింది. దానికి తగ్గట్టే ఫోక్స్‌వ్యాగన్ యూనిట్లలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు కోవిడ్ బారిన పడ్డారు. బుధవారం నాటికి 30 మందికి కరోనా నిర్థారణ కాగా గురువారం మరో 41 మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. కఠిన నిర్ణయం ఊహించని వేగంతో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో టియాన్జిన్ నగరంలో ఉన్న కార్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, కాంపోనెంట్ ఫ్యాక్టరీ రెండింటిని మూసేస్తున్నట్టు గురువారం ఫోక్స్‌వ్యాగన్ ప్రకటించింది. చైనాలోని తమ యూనిట్లలో కోవిడ్ ప్రవేశించింది. ఇప్పటికే కోవిడ్ లక్షణాలు ఉన్న యాభై మందికి పైగా శాంపిల్స్ ల్యాబ్‌కి పంపించాం. ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడి ప్లాంట్లలో కార్యకలాపాలు నిలిస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్, చైనా ప్రతినిధి తెలిపారు. ఔ చదవండి: ఎక్కడ నుంచైనా పనిచేయండి..! తిరిగేందుకు రూ. లక్ష మేమిస్తాం..! -
ఫోక్స్‌వ్యాగన్ కొత్త టిగువన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ కొత్త టిగువన్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.31.99 లక్షలు. 2.0 లీటర్ టీఎస్ఐ ఇంజన్, 7 స్పీడ్ డీఎస్జీ 4మోషన్ ట్రాన్స్మిషన్, ఐక్యూ లైట్‌తో ఇంటెలిజెంట్, అడాప్టివ్ ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్, గెశ్చర్ కంట్రోల్‌తో 20.32 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇల్యుమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్, యూఎస్బీ సి–పోర్ట్స్, వియెన్నా లెదర్ సీట్స్, సాఫ్ట్ టచ్ డ్యాష్‌బోర్డ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్సీ, యాంటీ స్లిప్ రెగ్యులేషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఏర్పాటు ఉంది. ఫ్లాట్ బాటమ్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 3 జోన్ క్లైమెట్రానిక్ ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హంగులు ఉన్నాయి. జనవరిలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. -
షాకిచ్చిన ఫోక్స్‌వ్యాగన్! సైలెంట్‌గా ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత?
జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ ఫోక్స్ వ్యాగన్ షాకిచ్చింది. ఇండియాలో ఆ కంపెనీ అందిస్తున్న కార్ల ధరలను సైలెంట్‌గా పెంచేసింది. ఇన్పుట్ కాంపోనెంట్స్ పేరుతో ఫోక్స్ వ్యాగన్ ఈ భారం మోపింది. ఫోక్స్ వ్యాగన్ కార్లకు దేశవ్యాప్తంగా సెపరేట్ కస్టమర్ బేస్ ఉంది. మార్కెట్ లీడర్‌గా ఇక్కడ ఎదగపోయినా మంచి అమ్మకాలే సాధిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ నుంచి ఇండియాలో పోలో, వెంటో మోడల్స్ ఇప్పటికే రోడ్లపై పరుగులు తీస్తుండగా ఇటీవల కాంపాక్ట్ ఎస్‌యూవీగా మార్కెట్లోకి టైగన్ మోడల్ని తీసుకువచ్చింది. కాగా ఎటువంటి హడావుడి లేకుండా ఈ మూడు మోడళ్లపై ధరలను పెంచేసింది. ఫోక్స్‌వ్యాగన్ తాజాగా పెంచిన ధరలు నవంబరు 15 నుంచి అమల్లోకి వచ్చాయి. టైగన్ మోడల్లో ఉన్న అన్ని వేరియంట్లపై రూ. 4200ల వరకు ధరను పెంచేసింది. ప్రస్తుతం టైగన్ ధర రూ.10.54 లక్షల నుంచి రూ. 17.54 లక్షల వరకు ఉంది. ఇక వెంటో, పోలో మోడల్స్‌పై అయితే ఏకంగా రూ. 5000 ధరను పెంచింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో పోలో ధర రూ.6.32 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండగా వెంటో ధర రూ. 10 లక్షల నుంచి 14.15 లక్షల దగ్గర ఉంది. ఫోక్స్‌వ్యాగన్‌కే చెందిన సబ్సిడరీ కంపెనీ స్కోడా కంపెనీ సైతం కుషాక్ ధరని గుట్టు చప్పుడు కాకుండా పెంచేసింది. ఎక్స్‌షోరూంలో కుషాక్ ప్రారంభ ధర రూ.10.79 లక్షల నుంచి రూ.17.79 లక్షలుగా ఉంది. కుషాక్‌పై రూ.30వేల వరకు ధర పెరిగింది. చదవండి:ప్రపంచంలో అత్యంత పొడవైన కారును చూశారా..! -
నేను కూడా తగ్గేదే లే అంటున్న స్కోడా కంపెనీ
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు జోరందుకోవడంతో దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు ఈవీ మార్కెట్లు పోటీ పడుతున్నాయి. తాజాగా మరో కంపెనీ ఈ రేసులోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ స్కోడా రూ.8,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ ఇండియా దేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. స్కోడా ఆటో గ్లోబల్ చైర్మన్ థామస్ షాఫెర్ మాట్లాడుతూ.. భారత్, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ప్రకటించారు. దేశం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల భారత్ ఎలక్ట్రిక్ వాహనాలకు కీలక మార్కెట్ గా ఉంటుందని తెలిపారు. స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ ఇండియా ఈ దశాబ్దం చివరి నాటికి మొత్తం ఉత్పత్తిలో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనలను తయారు చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీయ అవసరాలకు తగ్గట్టు కార్లను తయారు చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. సరసమైన ధరలకు కార్లను తీసుకొనిరావాడానికి స్థానికీకరణ చాలా కీలకమని ఆయన అన్నారు. వోక్స్ వ్యాగన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్లను టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా, హ్యుందాయ్, కియా కంపెనీలకు పోటీగా తీసుకొని రానున్నట్లు తెలిపారు. అవసరం అయితే, పెట్టుబడులను భారీగా పెంచాలని చూస్తున్నట్లు వివరించారు. (చదవండి: మార్క్ జుకర్‌బర్గ్ నువ్వు ఏం చేస్తున్నావ్? ఫేస్‌బుక్‌పై ఫైర్!) -
మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!
ప్రజలు ఎంతో కాలంగా ఆశగా ఎదురు చూస్తున్న ఐడీ.5ను వోక్స్ వ్యాగన్ ఆవిష్కరించింది. ప్రముఖ జర్మన్ కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్ కారు ఇది. ఈ కారును ఐడీ.4ని ప్రేరణ తీసుకొని రూపొందించినట్లు తెలుస్తుంది. జర్మన్ కార్ ఆటో దిగ్గజం పేర్కొన్నట్లుగా వోక్స్ వ్యాగన్ ఐడీ 5 ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్, జీటిఎక్స్ వేరియెంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ మూడు విభిన్న పవర్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. డిజైన్ పరంగా కొత్త వోక్స్ వ్యాగన్ ఐడీ 5 ఐడి మోడల్స్ సిగ్నేచర్ స్టైలింగ్ కలిగి ఉంది. ఈ కారు 77 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో వస్తుంది. ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్ వేరియెంట్లు రియర్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తాయి. ఐడీ 5 ప్రో 171 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 10.4 సెకండ్లలో 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ప్రో పెర్ఫార్మెన్స్ పవర్ అవుట్ పుట్ 201 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. ఇది 8.4 సెకన్లలో గంటకు 0-96 కిలోమీటర్లవేగాన్ని వేగవంతం చేయగలదు. ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్ రెండూ గంటకు 160 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కలిగి ఉంటాయి. ప్రో పెర్ఫార్మెన్స్ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్లు వెల్లగలదని సంస్థ పేర్కొంది. ఇక వోక్స్ వ్యాగన్ ఐడీ 5 జీటీఎక్స్ కారు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గల డ్యూయల్ మోటార్ తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 295 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో 6.3 సెకండ్లలో 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్లు వెల్లగలదని సంస్థ పేర్కొంది. వోక్స్ వ్యాగన్ ఐడీ 5 ఈవీ ధరలను ఇంకా వెల్లడించలేదు. ఇది 2022లో ఎప్పుడైనా యూరోపియన్ మార్కెట్లలో అమ్మకానికి వస్తుందని సమాచారం. మనదేశంలోకి తీసుకోవస్తారు అనే విషయంలో స్పష్టత లేదు. -
దేశంలో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే!
దేశంలో కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు కంపెనీలు కూడా కార్లను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. 10 లక్షల రూపాయల ధరలో మంచి కార్లు అందుబాటులో ఉండటం, మధ్యతరగతి ఆదాయం పెరగడం చేత కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అయితే, చాలా మంది వినియోగదారులు కారు కొనేముందు ఆ ఫీచర్ ఉందా? ఈ ఫీచర్ ఉందా? అని అడుగుతున్నారే కానీ, అన్నిటికంటే ముఖ్యమైన ఫీచర్ భద్రత పరంగా ఈ కారు ఎంత రేటింగ్ పొందింది అనేది ఎవరు తెలుసుకోవడం లేదు. ఇంకొంత మంది రూ.2 లక్షలు తక్కువకు వస్తుంది కదా అని తక్కువ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లను కొంటున్నారు. కానీ, అన్నింటికంటే సేఫ్టీ రెంటింగ్ చాలా ముఖ్యం. గ్లోబల్ కార్ సేఫ్టీ ఏజెన్సీ గ్లోబల్ ఎన్సీఏపీ గత కొన్ని ఏళ్లుగా భారతీయ వాహనాలకు రేటింగ్ ఇస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం రాబోయే టాటా పంచ్ ఎస్యువి కారుకు భద్రతా పరీక్ష నిర్వహించిన తర్వాత భద్రతా సంస్థ భారతదేశంలో ఉత్తమమైన రేటింగ్ పొందిన కార్ల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో దేశీయ ఆటోమేకర్లు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా పై చేయి సాధించాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న 10 కార్లు ఏవి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.. (చదవండి: కష్టాల్లో ఉన్నాం కాపాడమంటూ భారత్‌ను కోరిన శ్రీలంక) 1. టాటా పంచ్ యూకేకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం(ఎన్సీఏపీ)ను నిర్వహిస్తుంది. మనదేశంలో 'సేఫర్ కార్స్ ఫర్ ఇండియా' పేరుతో పలు కార్లపై టెస్టులు నిర్వహిస్తుంది. ఆ టెస్టుల్లో కార్ల సేఫ్టీని బట్టి స్టార్ రేటింగ్‌ను అందిస్తుంది. తాజాగా నిర్వహించిన సేఫర్ కార్స్ క్యాంపెయినింగ్లో టాటా పంచ్ కారు 5 స్టార్ రేటింగ్((16.453), పిల్లల సేప్టీ విషయంలో 4 స్టార్((40.891) రేటింగ్ సాధించింది. 2. మహీంద్రా ఎక్స్యువి300 గ్లోబల్ ఎన్సీఏపీ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో తన స్థానాన్ని నిలుపుకున్న మహీంద్రా ఎక్స్యువి300, అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించినందుకు సేఫ్టీ ఏజెన్సీ మొట్టమొదటి 'సేఫర్ ఛాయిస్' అవార్డును కూడా అందుకుంది. ఇది వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ భద్రతా రేటింగ్, పిల్లల రక్షణ కోసం 4 స్టార్ రేటింగ్ పొందింది. 3. టాటా ఆల్ట్రోజ్ టాటా మోటార్స్ కంపెనీకు చెందిన ప్రముఖ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు క్రాష్ టెస్ట్ సమయంలో గ్లోబల్ ఎన్సీఏపీ ద్వారా వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ రేటింగ్, పిల్లల సేప్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. (చదవండి: సేఫ్టీలో టాటా మోటార్స్ కార్లకు తిరుగులేదు) 4. టాటా నెక్సన్ టాటా మోటార్స్ కంపెనీకు చెందిన నెక్సన్ వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ రేటింగ్, పిల్లల సేప్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. నెక్సన్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఫ్రంటల్ డబుల్ ప్రెటెన్షన్ లు, ఏబిఎస్ బ్రేకులు వంటివి ఉన్నాయి. 5. మహీంద్రా థార్ మహీంద్రా కంపెనీకు చెందిన ఆఫ్ రోడర్ ఎస్యువి వయోజనులు, పిల్లల సేఫ్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందింది. భద్రతా రేటింగ్ పరంగా థార్ ఎస్యువి జాబితాలో ఐదువ స్థానంలో ఉంది.(చదవండి: క్రిప్టోకరెన్సీపై బిలియనీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!) 6. టాటా టిగోర్ ఈవీ గ్లోబల్ ఎన్సీఏపీ మొట్టమొదటిసారి పరీక్షించిన ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ)గా టిగోర్ ఈవీ నిలిచింది. వయోజనులు, పిల్లల సేఫ్టీ విషయంలో టాటా టిగోర్ ఈవీ 4 స్టార్ రేటింగ్ పొందింది. దీనిలో రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఈఎస్ సీ), సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, వేహికల్ లో అన్ని సీటింగ్ పొజిషన్లలో త్రీ పాయింట్ బెల్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 7. టాటా టిగోర్ టాటా మోటార్స్ టిగోర్ కంబస్టివ్-ఇంజిన్ వెర్షన్ కారు వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. 8. టాటా టియాగో మరో ప్రముఖ హ్యాచ్ బ్యాక్ టియాగో భద్రతా ప్రమాణాల పరంగా టాటా టిగోర్ తో సమానంగా ఉంది. టియాగో కూడా వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. దీనిలో కూడా రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. 9. వోక్స్ వ్యాగన్ పోలో వోక్స్ వ్యాగన్ ఇండియాకు చెందిన హ్యాచ్ బ్యాక్ 2014లో గ్లోబల్ ఎన్సీఏపీ సేఫ్టీ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఇది వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. డ్యాష్ బోర్డ్ లోని ప్రమాదకరమైన నిర్మాణాల కారణంగా ముందు ప్రయాణీకుల మోకాళ్లు ప్రమాదానికి గురవుతాయని భద్రతా నివేదిక పేర్కొంది. (చదవండి: ఆపిల్..గూగుల్..శాంసంగ్..! ఎవరు తగ్గేదెలే...!) 10. రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి రెనాల్ట్ ఇండియా ఫ్లాగ్ షిప్ ట్రైబర్ ఎమ్‌పివి వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించిన తర్వాత ఈ ఏడాది జూన్ లో సురక్షితమైన కార్ల జాబితాలోకి ప్రవేశించింది. -
ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్..! నీ రాక..వారికి శాపమే..!
Volkswagen Considering Cutting Up To 30,000 Jobs Handelsblatt: బెర్లిన్: ప్రపంచవ్యాప్తంగా కర్భన ఉద్గారాలను తగ్గించడం కోసం పలు ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిసారించాయి. ఇప్పటికే టెస్లా లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందంజలో ఉన్నాయి. ఫోక్స్‌వేగన్, మెర్సిడెజ్, బీఎమ్‌డబ్ల్యూ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి పెట్టాయి. ఉత్పత్తి వేగంగా చేయకపోతే..! గత నెల బోర్డు సమావేశంలో జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ వాహనాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వేగంగా జరకపోతే జర్మనీలో పనిచేసే 30 వేల మంది ఉద్యోగాలు కచ్చితంగా కోల్పోయే అవకాశం ఉందని కంపెనీ సీఈవో హెర్బర్ డైస్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డైస్ ప్రకటనను మొదటిసారిగా ఆ దేశ పత్రిక హ్యాండెల్స్‌బ్లాట్ నివేదించింది. చదవండి: మార్కెట్లోకి కొత్త కారు.. తెగ కొనేస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ టెస్లా ఎంట్రీతో...! కంపెనీలో అనూహ్య పరిమాణాలు..! కొద్ది రోజుల క్రితం ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా జర్మనీలో గిగా ఫ్యాక్టరీను నెలకొల్పనున్నట్లు ఎలన్ మస్క్ పేర్కొన్నారు. దీంతో టెస్లా రాకతో ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. టెస్లా నుంచి పోటీని ఎదుర్కోవడం కోసం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వేగంగా చేయాలని ఫోక్స్‌వ్యాగన్ సీఈవో డైస్ కంపెనీ ఉద్యోగులకు తెలిపారు. ఫోక్స్‌వ్యాగన్ వోల్ఫ్స్బర్గ్ ప్లాంట్‌లో సుమారు 25 వేల మంది ఉద్యోగులతో కేవలం 700,000 కార్లను ఉత్పత్తి మాత్రమే చేస్తుంది. మరోవైపు జర్మనీలో సంవత్సరానికి 5 లక్షల కార్లను 12 వేల మంది ఉద్యోగులతో ఉత్పత్తి చేయాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగుల్లో అలజడి..! ఫోక్స్‌వ్యాగన్ సీఈవో చేసిన వ్యాఖ్యలపై కంపెనీలో ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఫోక్స్‌వ్యాగన్ కార్మికుల మండలి ప్రతినిధి మాట్లాడుతూ...డైస్ ఈ వ్యాఖ్యలు చేశాడా లేదా అనే దానిపై అసలు స్పందించలేదు. కానీ 30వేల ఉద్యోగుల తొలగింపు అసంబద్ధం, నిరాధారమైనదని అన్నారు. చదవండి: భారత్ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..! -
ఇండియన్ మార్కెట్లో ఫోక్స్ వ్యాగన్ టైగున్ ఎస్యూవీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా తాజాగా సరికొత్త టైగున్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆఫర్లో ధర ఎక్స్‌షోరూంలో రూ.10.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల మధ్య ఉంది. పెట్రోల్ ఇంజన్‌తో 1 లీటర్, 1.5 లీటర్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో తయారైంది. ఇప్పటికే 12,200 పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. హ్యూండాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కు ఇది పోటీ ఇవ్వనుంది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో టైగున్ తొలి ఉత్పాదన. మధ్యస్థాయి ఎస్యూవీ విభాగంలో దేశంలో అన్ని బ్రాండ్లవి కలిపి ఏటా 4 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయని కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. ‘వినియోగదార్లకు ఎంపిక పరిమితమైంది. రెండు సంస్థలదే ఈ విభాగంలో ఆధిపత్యం. అందుకే టైగున్‌ను ప్రవేశపెట్టాం. మధ్యస్థాయి ఎస్యూవీ విభాగంలో వచ్చే ఏడాది నుంచి 10% వాటా చేజిక్కించుకోవాలన్నది మా లక్ష్యం. కొత్త విభాగాలు, కొత్త అవకాశాలపై దృష్టిసారించాల్సిన సమయం వచ్చింది’ అన్నారు. చదవండి: టెస్లా ఎలక్ట్రిక్ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్ బ్రేకర్’ -
ఆ పాపులర్ మోడల్ కార్ల ధరలు పెరిగాయ్!
ముంబై: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ సెప్టెంబర్ 1 నుంచి పలు మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. వీటిలో హ్యాచ్‌బ్యాక్ పోలో, మిడ్ సైజ్ సెడాన్ వెంటో ఉన్నాయి. 3 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. తయారీ వ్యయం అధికం అవుతున్నందునే ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. పోలో జీటీ మినహాయిస్తున్నట్టు వివరించింది. ఆగస్ట్ 31 నాటికి కార్లను బుక్ చేసుకున్న వినియోగదార్లపై ఎటువంటి ధరల భారం ఉండబోదని స్పష్టం చేసింది. -
టెస్లా పాటే పాడుతున్న ఫోక్స్‌వ్యాగన్
దిగుమతి సుంకం తగ్గించాలంటూ విదేశీ కార్ల తయారీ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి విషయంలో ప్రస్తుతం ఉన్న పన్నులను పరిశీలించాని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయంలపై ఇప్పటికే టెస్లా, హ్యుందాయ్‌లు తమ అభిప్రాయం చెప్పగా తాజాగా ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్‌లు వాటికి వంత పాడాయి. పన్ను తగ్గించండి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి పన్ను తగ్గించాలంటూ ఫోక్స్‌వ్యాగన్ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లపై వంద శాతం పన్నును ప్రభుత్వం విధిస్తోంది. దీంతో విదేశీ కార్లు ఇండియా మార్కెట్లోకి వచ్చే సరికి ధర అమాంతం పెరిగిపోతుంది. ఫలితంగా అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు అంశం పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఫోక్స్ వ్యాగన్ కోరింది. ఈ మేరకు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా హెడ్ గుర్ప్రతాప్ బొపారియా మాట్లాడుతూ ‘ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల స్థానిక ఆటో ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని తాను భావించడం లేదన్నారు. ఇప్పుడున్న పన్నులను 100 శాతం నుంచి 25 శాతానికి తగ్గించినా.. ఇండియన్ ఆటోమోబైల్ ఇండస్ట్రీకిపై పెద్దగా ప్రభావం ఉందని ఆయన రాయిటర్స్ వార్త సంస్థతో అన్నారు. మినహాయింపు వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో నంబర్ వన్ స్థానం కోసం ఫోక్స్ వ్యాగన్ పోటీ పడుతోంది. దీంతో ఆ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే ఆడీ ఈ ట్రాన్ పేరుతో ఎలక్ట్రిక్ కారుని ఇండియాలో లాంఛ్ చేసింది. అయితే ఈ కారు ధర ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు ఆశించినంతగా లేవు. దిగుమతి సుంకం తగ్గిస్తే ఫోక్స్‌వ్యాగన్, స్కోడా బ్రాండ్ల కింద పలు ఈవీ కార్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ఫోక్స్‌వ్యాగన్ ప్రయత్నాలు చేస్తోంది. క్లారిటీ లేదు ఫారిన్ బ్రాండ్ల కార్లపై ఇంపోర్ట్ ట్యాక్స్ విషయంలో టెస్లా, హ్యుందాయ్, బెంజ్, ఫోక్స్‌వ్యాగన్‌ల విజ్ఞప్తులు ఇప్పటికే కేంద్రానికి చేరాయి. దీంతో మిగిలిన కార్లకు మినహాయింపు ఇవ్వకున్నా ఈవీ కార్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 100 శాతం పన్నుని 40 శాతానికి తగ్గించే అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఇండియాలో కార్ల తయారీ యూనిట్ పెట్టాలని విదేశీ కంపెనీలను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అయితే విదేశీ కంపెనీల విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి క్లారిటీ రాలేదు. స్వదేశీపై ప్రభావం ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లకు సంబంధించి రూ. 40 లక్షలకు పైబడి ధర ఉన్న అన్ని లగ్జరీ కార్లపై వంద శాతం పన్ను విధిస్తున్నారు. విదేశీ ఈవీ కార్ల ధరలన్నీ కూడా రూ. 40 లక్షలకు పైగానే ఉన్నాయి. దీంతో వీటిపై వందశాతం పన్ను వసూలు అవుతోంది. దీంతో పన్ను తగ్గించాలంటూ విదేశీ కార్ల కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు దిగుమతి పన్ను శాతాన్ని తగ్గిస్తే దేశీ ఈవీ కార్ల తయారీ కంపెనీలకు నష్టం జరుగుతందని టాటా మోటార్ వంటి సంస్థలు వాదిస్తున్నాయి. విదేశీ కంపెనీలతో స్వదేశీ కంపెనీలు పోటీ పడలేవనే సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పన్ను తగ్గింపు అంశంపై మారుతి, మహీంద్రాలు ఇంకా స్పందించలేదు. -
వాహన ఎగుమతులు పెరిగాయ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మహమ్మారి నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో.. భారత్ నుంచి వాహన ఎగుమతులు తిరిగి పుంజుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 14,19,430 వాహనాలు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 4,36,500 మాత్రమే. ప్రయాణికుల వాహనాలు 43,619 నుంచి 1,27,115 యూనిట్లకు చేరాయి. వీటిలో కార్లు 79,376 కాగా, యుటిలిటీ వెహికిల్స్ 47,151 ఉన్నాయి. మారుతి సుజుకి 45,056, హ్యుండాయ్ మోటార్ 29,881, కియా 12,448, ఫోక్స్‌వ్యాగన్ 11,566 యూనిట్లను ఎగుమతి చేశాయి. ద్విచక్ర వాహనాలు గడిచిన మూడేళ్లతో పోలిస్తే మెరుగ్గా నమోదు అయ్యాయి. ఈ విభాగంలో 2021–22 తొలి త్రైమాసికంలో 11,37,102 యూనిట్లు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,37,983. వాణిజ్య వాహనాలు 3,870 నుంచి 16,006 యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 50,631 నుంచి 1,37,582కు ఎగిశాయి. కాగా విక్రయాలు కోవిడ్ ముందస్తు స్థాయికి రావాల్సి ఉంది. -
ఇక ఆడి పెట్రోల్, డీజిల్ కార్లు ఉండవా?
వెబ్‌డెస్క్: లగ్జరీ కార్లలో ఆడిది ప్రత్యేక స్థానం. రాబోయే ట్రెండ్‌కి తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది ఆడి. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ఇంజన్ కార్లకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మాత్రమే కొత్త మోడళ్లు తేవాలన్నది ఆ సంస్థ వ్యూహంగా ఉంది. ఈ మేరకు జర్మన్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. 2026 వరకే ఎన్నో ఏళ్లుగా ఈ సంస్థ ప్రతీ ఏడు ఓ కొత్త మోడల్ని మార్కెట్లోకి ఆడి రిలీజ్ చేస్తోంది. ఆడిని ప్రమోట్ చేస్తోన్న వోక్స్వ్యాగన్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఆడిని పూర్తిగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌కే పరిమితం చేసే విధంగా కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ సెగ్మెంట్‌కు సంబంధించి చివరి మోడల్ని 2026లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఆ తర్వాత మరో పదేళ్ల పాటు డిజీల్, పెట్రోల్ ఇంజన్ వెహికల్స్‌కి సర్వీస్ అందివ్వనుంది. అనంతరం పూర్తిగా పెట్రోల్, డీజిల్ సెగ్మెంట్ నుంచి తప్పుకోవడం ఖాయమని తేల్చి చెబుతోంది ఆడి యాజమాన్యం. ఇప్పటికే కంబస్టర్ ఇంజన్ తయారీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఖర్చును గణనీయంగా తగ్గించింది. ఓన్లీ ఈవీ వోక్స్వ్యాగన్ నుంచి ఎంట్రీ, మిడ్ రేంజ్ కార్లు వివిధ పేర్లతో మార్కెట్‌కి వస్తుండగా.... లగ్జరీ విభాగంలో ఆడీ, హై ఎండ్ విభాగంలో పోర్షే, స్పోర్ట్స్ సెక్షన్లో లాంబోర్గిని కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో ఆడిని పూర్తి స్థాయి ఈవీ కార్ల తయారీకే వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆడి నుంచి ఈ ట్రోన్, ఈ ట్రోన్ స్పోర్ట్ బ్యాక్, క్యూ 4 ఈ ట్రోన్, ఈ ట్రోన్ జీటీ కార్లను ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో తెచ్చింది. ఇందులో ఈ ట్రోన్ పేరుతో కొత్త ఈవీ లగ్జరీ కారుని ఇండియా మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. చదవండి : స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా' -
స్కోడా వోక్స్‌వ్యాగన్‌కు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డీజిల్ కారులో ఉద్గార నిబంధనలను తారుమారు చేసేందుకు మోసపూరిత పరికారాన్ని (చీట్ డివైజ్) కంపెనీ ఏర్పాటు చేసిందంటూ ఉత్తరప్రదేశ్‌లో ఓ వినియోగదారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దీన్ని కొట్టివేయాలని కోరుతూ స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా కోరుకున్న ఫలితం దక్కలేదు. వాహనాల్లో చీట్ డివైజ్‌ల ఏర్పాటుపై కచ్చితంగా విచారణ జరగాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేవేస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో విచారణ ఎందుకు కొనసాగించరాదంటూ ఈ నెల 4న విచారణలో భాగంగా ప్రశ్నించిన ధర్మాసనం.. తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ‘చీట్’ లేదా ‘డిఫీట్ డివైజ్’ అన్నది సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఓ పరికరం. దీన్ని ఆటో ఇంజన్లలో అమర్చడం ద్వారా కాలుష్యం విడుదల పరీక్షల ఫలితాలను తారుమారు చేయగలదు. ఈ విషయంలో అంతర్జాతీయంగా వోక్స్వ్యాగన్ కొన్నేళ్ల క్రితం ఆరోపణలను కూడా ఎదుర్కొన్నది. ఈ కేసులో స్కోడా వోక్స్వ్యాగన్ రూ.671.34 కోట్ల పరిహారం చెల్లించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ గతంలో ఆదేశాలు జారీ చేసింది. -
ఇండియాలో ‘ఆడి’కి షాక్
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్‌కు చెందిన మరో సంస్థ ఆడికు దేశంలో తొలి ఎదురు దెబ్బతగిలింది. ఉద్గార నిబంధనలకు సంబంధించిన ఆరోపణలతో దేశంలో తొలిసారిగా కేసు నమోదైంది. నోయిడా నివాసి ఒకరు కంపెనీపైనా, కంపెనీకి చెందిన ఇతర ఉన్నతాధికారులపైనా తాజాగా ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర లాంటి ఆరోపణలతో సంస్థపై కేసు నమోదైంది. (ఆడి కొత్తకారు వచ్చేసింది) కాలుష్య నివారణకు సంబంధించి, ఉద్గారాల శాతాన్ని తక్కువగా చూపించే మోసపూరిత పరికరాలతో తనను మోసం చేశారని ఆరోపిస్తూ అనిల్ జిత్ సింగ్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫోక్స్ వ్యాగన్, ఆడి ఉన్నతాధికారులతోపాటు, జర్మనీలోని ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాల పైనా కూడా ఆయన కేసు పెట్టారు. ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ రాహిల్ అన్సారీ, ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్, ఆడి ఏజీ చైర్మన్ బ్రామ్ షాట్ పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 2018లో కోట్ల రూపాయల విలువైన ఏడు ఆడి కార్లను కొనుగోలు చేసినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. డెలివరీ సమయంలో, భారతదేశంలో చీట్ డివైసెస్ గురించి తాను విచారించానని, అయితే అలాంటి దేమీ లేదని చెప్పి తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. దేశంలో నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలు అనుమతించిన పరిమితుల కంటే ఆడికార్లలో 5-8 రెట్లు ఉన్నాయని తేలడంతో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ ఫోక్స్ వ్యాగన్‌పై 500 కోట్ల రూపాయల జరిమానా విధించిన నేపథ్యంలో తాను మేల్కొన్నాని పేర్కొన్నారు. తప్పుడు పత్రాలు, నకిలీ పరికరాలతో ఉద్దేశ పూర్వకంగానే ఈ కంపెనీలు తనను మోసం చేశాయని, తన కష్టార్జితాన్ని దోచుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాల్సింగా సింగ్ డిమాండ్ చేశారు. కాగా ఫోక్స్ వ్యాగన్ గ్లోబల్ ఉద్గార నిబంధనల ఉల్లంఘన కుంభకోణంలో చిక్కుకున్న నేపథ్యంలో దేశంలో తాజా కేసు నమోదు కావడం గమనార్హం. పరిమితికి మించి 10-40 రెట్లు ఉద్గారాలను ఉత్పత్తి చేసే పరికరాలను కార్లలో అమర్చుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత్‌లో విడుదల చేసిన డీజిల్ కార్లలో ‘చీట్ డివైజ్’ కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందంటూ ఎన్జీటీ గత ఏడాది మార్చిలో ఫోక్స్ వ్యాగన్‌కు 500 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
ఇక్కడ ఎస్‌యూవీలంటేనే ఇష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూరోపియన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ వచ్చే రెండేళ్లలో కొత్తగా నాలుగు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్‌ను (ఎస్యూవీ) మార్కెట్లోకి తేనుంది. ప్రస్తుతం టిగువన్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో కంపెనీ విక్రయిస్తోంది. భారతీయులకు ఎస్‌యూవీలపై మక్కువ ఎక్కువని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డైరెక్టర్ స్టీఫెన్ న్యాప్ శుక్రవారమిక్కడ చెప్పారు. ఈ విభాగంలో రానున్న రోజుల్లో తమ స్థానాన్ని పదిలపర్చుకుంటామన్నారు. 2020లో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలో నూతన మోడళ్లను ప్రదర్శిస్తామని తెలియజేశారు. కంపెనీ 20వ కార్పొరేట్ బిజినెస్ సెంటర్‌ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు వచి్చన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఫోక్స్‌వ్యాగన్ కార్లు ఖరీదైనవని కస్టమర్లు అనుకునేవారు. నాలుగేళ్ల వారంటీ, విడిభాగాల ధర 15 శాతం తగ్గించడం ద్వారా ఆ భావన నుంచి బయటపడేలా చేశాం’ అని చెప్పారు. ఎస్‌యూవీలతోపాటు మరో రెండు కొత్త మోడళ్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. అయిదేళ్లలో 3 శాతం.. ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్‌కు 1.4 శాతం వాటా ఉంది. అయిదేళ్లలో 3 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు స్టీఫెన్ చెప్పారు. ‘ఇండియా 2.0 కార్యక్రమంలో భాగంగా 2022 నాటికి రూ.8,000 కోట్లు ఖర్చు చేయాలని గతేడాది నిర్ణయించాం. మోడళ్ల అభివృద్ధి, ఆర్అండ్ డీ కోసం ఈ పెట్టుబడి పెడతాం. పుణే ఆర్అండ్ డీ కేంద్రంలో ప్రస్తుతం 650 మంది ఇంజనీర్లు ఉన్నారు. దీనిని 5,000 స్థాయికి పెంచుతాం. భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్ కోసం ఇక్కడ కార్లను అభివృద్ధి చేస్తాం. బీఎస్–4 వాహనాల తయారీని డిసెంబర్ నుంచి నిలిపేస్తున్నాం. మార్కెట్లో బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనాల ధర డీజిల్ 12– 15 శాతం, పెట్రోల్ 5 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పాత మోడళ్లన్నిటినీ కొనసాగిస్తాం. చార్జింగ్ స్టేషన్లు విరివిగా అందుబాటులోకి వచ్చాక ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెడతాం’ అని తెలిపారు. -
త్వరలో ఫోక్స్ వాగన్ ఎలక్ట్రిక్ కారు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెల్సా తీసుకొచ్చిన మూడో మోడల్‌కు పోటీగా జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ‘ఫోక్స్ వ్యాగన్ (వీడబ్లూ)’ ఐడీ.3 మోడల్ పేరిట ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో సోమవారం జరిగిన మోటార్ షోలో ప్రదర్శించిన ఈ కారు ధర 27 వేల పౌండ్ల నుంచి 30 వేల పౌండ్ల వరకు (24. 03 లక్షల నుంచి 26.69 లక్షల రూపాయల వరకు) ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. టెల్సా మూడో మోడల్తోని పోలిస్తే ధర దాదాపు పది వేల డాలర్లు తక్కువగా ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఐడీ.3 ఎలక్ట్రిక్ కారు గంటకు 99 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఒకసారి చార్జిచేస్తే నిరాటంకంగా 420 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, బ్యాటరీ కూడా టెల్సా కంపెనీతో పోలిస్తే ఏడు మైళ్లు ఎక్కువగా వస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మోడల్‌కు చెందిన మొదటి ఎడిషన్ కార్లను వచ్చే ఏడాది మధ్యలో ఈజిప్టులో మార్కెట్‌కు విడుదల చేస్తామని, మరో రెండు రకాల ఎడిషన్లను ఆ తర్వాత విడుదల చేస్తామని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. లాంచింగ్ వర్షన్లో 58 కిలోవాట్ల బ్యాటరీని ఉపయోగిస్తున్నామని, వెనక డిక్కీలో 368 లీటర్ల లగేజీ స్థలం ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. బ్యాటరీ చార్జింగ్ కోసం 100 కిలోవాట్స్ ఫాస్ట్ చార్జర్‌లో పెడితే అరగంటలో మొత్తం కారు బ్యాటరీ చార్జ్ అవుతుందని, ఈ కార్ మోడల్‌ను మొత్తం మూడు వేరియంట్లలో 45 కిలోవాట్స్, 58 కిలోవాట్స్, 77 కిలోవాట్స్‌తో తీసుకొస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. -
ఫోక్స్‌వాగన్ మాజీ చైర్మన్ కన్నుమూత
బెర్లిన్: ఫోక్స్‌వాగన్‌ను ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజంగా మార్చడానికి ఎంతో కృషి చేసిన, మాజీ చైర్మన్ ఫెర్డినార్డ్ పీచ్(82) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఫోక్స్‌వాగన్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం అధికారికంగా ధృవీకరించారు. ప్రపంచంలోనే అదిపెద్ద కార్ల తయారీదారు, విలాసవంతమైన, ఖరీదైన కార్లకు పెట్టింది పేరైన ఫోక్స్ వ్యాగన్. రెండు దశాబ్దాల పాటు జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజ కంపెనీలో అనేక పదవులు చేపట్టి విశిష్ట సేవలందించారు. కంపెనీ అభివృద్ధికి ఎనలేని కృషిచేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగేలా చేసిన ఘనత ఆయన సొంతం. పీచ్ కెరీర్ విషయానికి వస్తే ప్రఖ్యాత కార్ల తయారీదారు ఫెర్డినార్డ్ పోర్షే మనమడైన పీచ్... ప్రఖ్యాత కార్ల కంపెనీ ఆడిలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఫోక్స్వాగన్లో 1993 లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2002 లో చైర్మన్‌గా ఎదిగారు. ఆ తర్వాత లంబోర్ఘిని, బెంట్లే లాంటి బ్రాండ్లను కలుపుకొని ఫోక్స్‌వాగన్ కంపెనీని ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజంగా తయారు చేశారు. ప్రస్తుతం పీచ్ కుటుంబం వాటాలు ఫోక్స్‌వాగన్ గ్రూపులో 53 శాతంగా ఉన్నాయి. సీఈఓ మార్టిన్ వింటర్కాన్ విషయంలో వివాదం కారణంగా పీచ్ 2015 ఏప్రియల్ లో చైర్మన్ పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కంపెనీ బోర్డ్ విశ్వాసం కోల్పొయినందునే పీచ్ తన పదవి నుంచి తప్పుకున్నారని ఫోక్స్‌వాగన్ కంపెనీ ప్రకటించింది. అయితే పీచ్ తప్పుకున్న కొన్ని రోజులకే ఫోక్స్‌వాగన్ వివాదాలు చుట్టుముట్టాయి. డీజిల్ ఉద్గారాల స్కాంలో కంపెనీ చిక్కుకుంది. ఈ వివాదం నేటీకీ కొనసాగుతున్నా ఇప్పటీకీ ఫోక్స్‌వాగన్ కార్ల అమ్మకం విషయంలో ప్రధమ స్ధానంలోనే కొనసాగుతోంది. అయితే కంపెనీని ఈ స్థాయికి తీసురావడంలో కీలక భూమిక పోషించిన పీచ్ మృతి పట్ల కంపెనీకి చెందిన పలువురు ఆటో పరిశ్రమ పెద్దలు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమోటివ్ పరిశ్రమలో నాణ్యత, పర్ఫెక్షన్ను తీసుకురావడానికి ఫెర్డినాండ్ పిచ్.. ఎంతో కృషిచేశారని కంపెనీ ప్రస్తుత సీఈఓ హెర్బర్ట్ డైస్ అన్నారు. పీచ్ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, ఆయన చేసిన కృషి పట్ల తనకెంతో గౌరవం ఉందని తెలిపాడు. -
ఫోక్స్‌వాగన్‌కు భారీ జరిమానా
జర్మన్ ఆటోమోబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఉద్గారాల నిబంధనల ఉల్లంఘన కింద జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రూ. 500 కోట్ల జరిమానా విధించింది. ఫోక్స్‌వ్యాగన్ డీజిల్ కార్ల వల్ల దేశంలో పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని ఆ సంస్థపై కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ ఈ పెనాల్టీ విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా నగదును జమచేయాలని ఎన్జీటీ అధ్యక్షుడు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ఆదేశాలు జారీచేశారు. ట్రైబ్యూనల్ నష్ట నివారణ చర్యల కింద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సెంట్రల్ పొల్యూషన్ బోర్డు) వద్ద రూ.100కోట్లు జమ చేయాలని ఆదేశించింది. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ డీజిల్ కార్ల ఉద్గార పరీక్షల సమయంలో మోసపూరిత పరికరాన్ని సంస్థ వాడిందన్న కేసులో ట్రిబ్యునల్ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ చేసిన ఈ పని వల్ల పర్యావరణానికి కలిగిన అసలు నష్టాన్ని అంచనా వేయడానికి పర్యావరణ శాఖ, భారీ పరిశ్రమల శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లతో ఓ కమిషన్‌ను ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ కమిటి నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ ఆదేశాలిచ్చింది. -
జనవరి నుంచి ఫోక్స్‌వ్యాగన్ ధరల పెంపు
ముంబై: జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ సంస్థ జనవరి 1 నుంచి తన కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. రూపాయి విలువ పడిపోవడం, తయారీ వ్యయాలు పెరిగిపోవడమే ధరలు పెంచడానికి కారణమని పేర్కొంది. ఈ కారణాల వల్ల తప్పనిసరై ధరలను పెంచుతున్నట్టు సంస్థ ప్యాసింజర్ కార్ల విభాగం డైరెక్టర్ స్టీఫెన్న్యాప్ తెలిపారు. మారుతి సుజుకి, టయోటా, ఇసుజు మోటార్స్ ఇప్పటికే ధరలను పెంచాయి. -
బుజ్జిగా, ముద్దుగా ఉండే ఆ కారు ఇక కనిపించదట!!
బీటిల్ కారు గుర్తుందా... కేవలం రెండే రెండు డోర్లతో, చూడటానికి బుజ్జిగా ముద్దుగా ఉంటూ సినిమాల్లోనూ, రోడ్లపై ఆసక్తికరంగా కనిపించేది. ఈ కారు ఇక నుంచి కాల గర్భంలో కలిసిపోనుందట. ఈ కార్లను తయారు చేసే ప్రముఖ అంతర్జాతీయ ఆటోమోటివ్ దిగ్గజ సంస్థ ఫోక్స్‌వాగన్, బీటిల్ కాంపాక్ట్ కారును 2019 నుంచి ఉత్పత్తి చేయడం ఆపివేయాలని నిర్ణయించింది. 2019లో బీటిల్ కాంపాక్ట్ కారు ఉత్పత్తిని ఆపివేస్తున్నామంటూ గురువారం ఫోక్స్‌వాగన్ ప్రకటించింది. 1930లో ఫోక్స్‌వాగన్ బీటిల్ రోడ్లపైకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం జర్మన్ల పునర్జన్మకు ఇది సింబల్‌గా నిలుస్తూ వచ్చింది. 1979లో ఓ బగ్ కారణంతో అమెరికాలో విక్రయాలను ఫోక్స్‌వాగన్ నిలిపివేసింది. కానీ మెక్సికో, లాటిన్ అమెరికాలో ఉత్పత్తిని కొనసాగిస్తూ వచ్చింది. 1990 మధ్య కాలంలో, ఫోక్స్‌వాగన్ అమెరికాలో విక్రయాలను పునర్నిర్మించుకోవాలని కష్టపడుతున్న సమయంలో, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫెర్డినాండ్ పైచ్ తన తాత ఫెర్డినాండ్ పోర్స్చే చేత బీటిల్ డిజైన్‌ను పునరుద్ధరించడం, ఆధునీకరించడం చేశారు. దీనికి ఫలితంగా 1998లో చంద్రవంక ఆకారంలో ‘కొత్త బీటిల్’ కారు రూపుదిద్దుకుంది. 1999లో 80వేలకు పైగా కార్లను విక్రయించింది. కానీ ఇటీవల అమెరికాలో దీని విక్రయాలు పడిపోయాయి. చాలా వరకు చిన్న కార్ల విక్రయాలు తగ్గిపోయాయి. దీంతో మొత్తంగా 1998 నుంచి గ్లోబల్‌గా 5 లక్షల బీటిల్ కార్లనే విక్రయించింది ఫోక్స్‌వాగన్. 2018లో తొలి ఎనిమిది నెలల కాలంలో ఫోక్స్‌వాగన్ కేవలం 11,151 బీటిల్స్నే అమ్మింది. అంటే అంతకముందటి సంవత్సరం కంటే 2.2 శాతం తక్కువ. అమెరికా వినియోగదారులు ప్రస్తుతం బీటిల్ కారును పక్కన పెట్టి, జెట్టా సెడాన్, టిగువన్ స్పోర్ట్ యుటిలిటీ వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. దీంతో పాటు గత మూడేళ్లుగా కూడా ఫోక్స్‌వాగన్, కర్బన్ ఉద్గారాల స్కాం విషయంలో అతలాకుతలమవుతోంది. బీటిల్ విక్రయాలు మందగించడం, ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు ఎక్కువగా దృష్టిసారించడం ఆ కంపెనీకి దెబ్బకొడుతోంది. దీంతో బీటిల్ ఉత్పత్తిని నిలిపివేసి, ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని ఫోక్స్‌వాగన్ ప్లాన్ చేసింది. తన ఫైనల్ లెనప్లో రెండు స్పెషల్ బీటల్ మోడల్స్‌ను విడుదల చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఫైనల్ ఎడిషన్ ఎస్ఈ, ఫైనల్ ఎడిషన్ ఎస్ఈఎల్లను, డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీతో ప్రవేశపెట్టిన అనంతరం, బీటిల్ ఉత్పత్తికి గుడ్‌బై చెప్పనుంది ఫోక్స్‌వాగన్. -
ప్రాణం తీసిన కునుకు
పూతలపట్టు (చిత్తూరు): రెప్పపాటులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగం, పైగా ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ కునుకుపాటు గురవడంతో వోక్స్వ్యాగన్ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ దెబ్బకు అది బోల్తా పడి అదే మార్గంలో వోక్స్ వ్యాగన్ కారు వెనుక వస్తున్న ఇండిగో పైకి దూసుకెళ్లింది. తర్వాత రోడ్డు పక్కన ఉన్న బోరు స్టాటర్ గదిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వోక్స్వ్యాగన్ కారు నడుపుతున్న వ్యక్తి, ఇండిగో కారులోని మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన చిత్తూరు– తిరుపతి జాతీయ రహదారిలోని ఒంటిల్లు వద్ద శనివారం తెల్లవారుజూమున 4.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన సురేష్‌రెడ్డి(47), భార్య అనిత(41), చిన్న కూతురు యతినశ్రీ(21)తో వోక్స్వ్యాగన్ కారులో బెంగళూరులోని పెద్దకూతురు ఇంటికెళ్లి తిరిగి గుంటూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున పూతలపట్టు సమీపంలోని ఒంటిళ్లు వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి, తిరుపతి నుంచి వస్తున్న కంటైనర్ లారీని ఢీకొన్నాడు. దీంతో అది బోల్తాపడి.. రోడ్డుపై రాజుకుంటూ అదే సమయంలో ఇటు వైపుగా వస్తున్న ఇండికా కారును ఢీకొంది. అందులో కర్ణాటక తుమ్ముకూరుకు చెందిన శివరాజు(35), బసవరాజు(40), త్రిభవన(25) తిరుమలకు వెళుతున్నారు. ఈ ప్రమాదంలో వోక్స్ వ్యాగన్ కారు నడుపుతున్న సురేష్ రెడ్డి, ఇండికా కారులోని శివరాజ్ చనిపోయారు. అనిత, యతినశ్రీ, బసవరాజు, త్రిభవన తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద శబ్దం రావడంతో చుట్టు పక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే 108కు సమాచారం అందించారు. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండడంతో క్షతగాత్రులను వాహనాల్లో నుంచి తీసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. వెంటనే హైవే పెట్రోల్ వాహనం అక్కడి చేరుకోవడంతో పోలీసులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత 108 వాహనంలో యతినశ్రీ, అనితను మొదట చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తర్వాత మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. జాతీయ రహదారిపై బోల్తాపడిన కంటైనర్‌ను తొలగించి పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం ఘటన స్థలాన్ని పాకాల సీఐ రామలింగయ్య పరిశీలించారు. ఈ మేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
భారత్‌లో ఫోక్స్‌వ్యాగన్ భారీ పెట్టుబడులు!!
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ ‘ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్’ తాజాగా భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. 2019–21 మధ్యకాలంలో 1 బిలియన్ యూరోలు (దాదాపు రూ.7,900 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తామని పేర్కొంది. ‘2021 నాటికి భారత్‌లో బిలియన్ యూరోల పెట్టుబడులు పెడతాం. మేం ఒక మార్కెట్లో చేయబోయే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది’’ అని స్కోడా ఆటో సీఈవో బెర్న్‌హర్డ్ మేయర్ తెలిపారు. ఇండియాలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ గత వారం తన భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన భారత్ కార్యకలాపాలకు స్కోడా ఇండియా బాధ్యత వహిస్తుందని పేర్కొంది. అలాగే ఇండియా 2.0 ప్రాజెక్ట్‌ను కూడా ఆవిష్కరించింది. సంస్థ ఇందులో భాగంగా 2020 రెండో అర్ధభాగంలో సబ్–కాంపాక్ట్ ఎంక్యూబీ ఏవో ప్లాట్‌ఫామ్‌పై తొలి ఎస్యూవీ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. పుణేలో ఇంజినీరింగ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఔరంగాబాద్, పుణే ప్లాంట్ల తయారీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. కంపెనీ 2025 నాటికి ఇండియన్ మార్కెట్లో 5 శాతాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
ఆడి సీఈవో స్టాడ్లర్ అరెస్టు
ఫ్రాంక్ఫర్ట్: ఫోక్స్‌వ్యాగన్ డీజిల్ వాహనాల ఉద్గారాల వివాద కేసులో జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఆడి సీఈవో రూపర్ట్ స్టాడ్లర్ అరెస్టయ్యారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉన్నందున ఆయన్ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. స్టాడ్లర్ నివాసంలో సోదాలు నిర్వహించిన వారం రోజుల వ్యవధిలోనే అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నియంత్రణ సంస్థలను, వినియోగదారులను మోసపుచ్చేలా.. కాలుష్యకారక వాయువుల పరిమాణాన్ని తగ్గించి చూపే సాఫ్ట్‌వేర్‌ను ఫోక్స్‌వ్యాగన్ తమ డీజిల్ కార్లలో అమర్చిందనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే. సాఫ్ట్వేర్ అమర్చడం నిజమేనంటూ ఆడికి మాతృసంస్థయిన ఫోక్స్‌వ్యాగన్ 2015లో అంగీకరించింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆడి ఇంజినీర్లే అందించి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. ఈ స్కామ్‌తో ఫోక్స్‌వ్యాగన్ దాదాపు 25 బిలియన్ యూరోల మేర బైబ్యాక్, నష్టపరిహారాలు, జరిమానాల రూపంలో కట్టుకోవాల్సి వచ్చింది. -
మా ఫోకస్ రూ.5–10 లక్షల కార్లపైనే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ వచ్చే అయిదేళ్లలో భారత మార్కెట్లో ఆరు కొత్త కార్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో మూడు స్కోడా బ్రాండ్‌లో రానున్నాయి. వర్చూస్ సెడాన్, టి–రాక్ ఎస్యూవీ అడుగుపెట్టే అవకాశం ఉంది. కొత్త మోడళ్ల రాకతో కొన్ని పాత మోడళ్లకు స్వస్తి పలుకుతామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డైరెక్టర్ స్టీఫెన్ నాప్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘2022 నాటికి 3 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నాం. ఆ సమయానికి కంపెనీ వార్షిక అమ్మకాలు 1,20,000–1,30,000 యూనిట్లకు చేరుతుందని అంచనా. 32 లక్షల యూనిట్ల భారత కార్ల పరిశ్రమలో ప్రస్తుతం కంపెనీకి 1.50% వాటా ఉంది. పాత కార్ల విక్రయాల్లోకి అడుగు పెడతాం. స్కోడాతో కలిసి తయారీని విస్తరించనున్నాం. భారత్‌లో పోటీ ధరలో ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెడతాం’ అని వివరించారు. ఆ విభాగంలోనే మోడళ్లు..: ప్రస్తుతం కంపెనీ భారత్‌లో అయిదు మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో అమియో, వెంటో, పోలో మోడళ్ల ధర రూ.10 లక్షల లోపు ఉంది. 2017లో కంపెనీ నుంచి మొత్తం 47,500 కార్లు రోడ్డెక్కాయి. వీటిలో ఈ మూడు మోడళ్ల నుంచి 43,000 యూనిట్లు నమోదయ్యాయి. 2022 నాటికి రానున్న ఆరు మోడళ్లలో కూడా మూడు నాలుగు మోడళ్లు రూ.10 లక్షల లోపు విభాగంలోనే ఉంటాయని స్టీఫెన్ నాప్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. రూ.5–10 లక్షల ధరల శ్రేణిపైనే ఫోకస్ ఉంటుందని స్పష్టం చేశారు. భారత్‌లో కార్ల అమ్మకాల్లో రూ.10 లక్షలలోపు విభాగం వాటా 90–92% ఉందని వివరించారు. 2022 కల్లా కార్ల పరిశ్రమ 40 లక్షల యూనిట్లకు చేరుతుందని చెప్పారు. ఇక 2018లో సైతం కంపెనీ అమ్మకాలు గతేడాది స్థాయిలోనే ఉండొచ్చని చెప్పారు. డీలర్షిప్ కేంద్రాలు ప్రస్తుతమున్న 124 నుంచి అయిదేళ్లలో 200కు చేరనుంది. -
ఫోక్స్‌వ్యాగన్ కొత్త వెర్షన్ పోలో
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వాగన్ కొత్త వెర్షన్ కారును లాంచ్ చేసింది. తన ప్రముఖహ్యాచ్బ్యాక్ మోడల్ పోలోలో కొత్త వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1.0 లీటర్ల ఎంపీఐ ఇంజిన్‌తో తీసుకొస్తున్న ఈ కారుకు రూ. 5,41,800 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా నిర్ణయించింది. అలాగే ఇండియాలో 1.2 ఎంపీఐ ఇంజిన్‌ను కొత్త 1.0 ఇంజిన్‌తో భర్తీ చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక కొత్త పోలో లో 56 కిలోవాట్ల పపర్, 95 ఎన్ఎం టార్క్, లీటరుకు 18.78 కిలోమీటర్ల మైలేజీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. తమ బ్రాండ్‌ను మరింత మెరుగుపరుచుకుంటూ, భారతీయ విలక్షణమైన కారు-కొనుగోలుదారులకు విభిన్న పోర్ట్‌ఫోలియోలను అందించడమే తమ లక్ష్యమని వోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టీఫెన్ నాప్ చెప్పారు. ఈ కొత్త వెర్షన్లో ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరిచామన్నారు. కాగా ఫోక్స్‌వ్యాగన్ దేశీయ మార్కెట్లో పోలో, వెంటో, జెట్టా, పాసట్, టౌరేగ్ వంటి మోడల్ కార్లను విక్రయిస్తుంది. -
కోటిన్నర కార్ల భవిష్యత్ తేలేది నేడే
2015లో ఫోక్స్‌వాగన్ చీటింగ్ కేసు బయటికి వచ్చినప్పటి నుంచి డీజిల్ ఇంజిన్ కార్లపై ఇటు పర్యావరణవేత్తలు, అటు ప్రభుత్వాలు, కోర్టులు వాటిపై తీవ్ర దృష్టిసారించాయి. కర్బన్ ఉద్గారాలు ఎక్కువగా ఉన్న ఈ కార్లపై ప్రపంచవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జర్మన్‌లోని కోటిన్నర డీజిల్ కార్ల భవిష్యత్ నేడు తేలబోతుంది. ఈ కార్లు జర్మన్ నగర రోడ్లపై నడవాలో వద్దో జర్మన్ కోర్టు నేడు తేల్చబోతుంది. పర్యావరణ గ్రూప్ డీయూహెచ్ వేసిన దావాలో యూరోపియన్ యూనియన్ పరిమితులకు మించి సుమారు కోటిన్నర డీజిల్ కార్లు ఎక్కువ మొత్తంలో ఉద్గారాలను కలిగి ఉన్నట్టు తెలిసింది. తాజా ప్రమాణాలకు అనుగుణంగా లేని, కాలుష్యం భారీగా ఉన్న డీజిల్ కార్లపై నిషేధం విధించాలని స్థానిక కోర్టులు ఆదేశించాయి. ఈ ఆదేశాలపై జర్మన్ రాష్ట్రాలు అప్పీల్ పెట్టుకున్నాయి. దీనిపై నేడు జర్మన్ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. ఈ విషయం కేవలం జర్మన్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. మరికొన్ని అతిపెద్ద కార్ల తయారీదారుల ఖండాలకు కూడా విస్తరించింది. పారిస్, మెక్సికో సిటీ, అథెన్స్ అధికారులు కూడా 2025 నాటికి తమ నగరాల్లో డీజిల్ వాహనాలు తిరగకుండా నిషేధం విధిస్తామని తెలిపాయి. వచ్చే ఏడాది నుంచి తమ నగరంలోకి కొత్త డీజిల్ కార్లు రాకుండా నిషేధం విధిస్తామని ఇటు కోపెన్హాగన్ మేయర్ కూడా చెప్పారు. ఫ్రాన్స్, బ్రిటన్లు కూడా 2040 నాటికి కొత్త పెట్రోల్, డీజిల్ కార్లను బ్యాన్ చేసి, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లోకి మారతామని తెలిపాయి. -
ఫోక్స్‌వాగన్ కార్ల ధరలు పెరుగుతున్నాయ్..
ఇన్పుట్ వ్యయాలు పెరుగడంతో, కార్ల ధరలను పెంచబోతున్నట్టు కార్ల తయారీ సంస్థలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జర్మన్ కారు తయారీదారు ఫోక్స్‌వాగన్ కూడా తన మోడల్స్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. 2018 జనవరి నుంచి తన మోడల్స్ అన్నింటిపై రూ.20వేల వరకు ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల్లో, స్థానిక ఇన్పుట్ వ్యయాల్లో మార్పులు వంటి పలు బాహ్య ఆర్థిక కారణాలతో కార్ల ధరలను పెంచబోతున్నట్టు ఫోక్స్‌వాగన్ ప్యాసెంజర్ కార్ల డైరెక్టర్ స్టెఫెన్ నాప్ తెలిపారు. ఈ ప్రభావం తమ ప్రొడక్ట్ రేంజ్ అన్నింటిపై పడనున్నట్టు పేర్కొన్నారు. దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ కూడా బుధవారం తన కార్లపై వచ్చే నెల నుంచి రూ.20వేల వరకు ధర పెంచబోతున్నట్టు తెలిపింది. నిర్వహణ, ఇతర వ్యయాలు పెరుగుతుండడం, రూపాయి క్షీణత వంటి కారణాల వల్ల ధరలు పెంచక తప్పడం లేదని మారుతీ సుజుకీ తెలిపింది. అదేవిధంగా టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా, టోయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా మోటార్స్, స్కోడా ఆటో ఇండియాలు కూడా ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి. -
ఫోక్స్‌వ్యాగన్ మేనేజర్‌కి ఏడేళ్ల జైలు
డెట్రాయిట్: పర్యావరణ పరిరక్షణ నిబంధనల ఉల్లంఘనకి సంబంధించిన కేసులో ఫోక్స్‌వ్యాగన్ జనరల్ మేనేజర్ ఆలివర్ ష్మిట్కి అమెరికా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, 4 లక్షల డాలర్ల జరిమానా విధించింది. అమెరికాను మోసగించేందుకు ఉద్దేశించిన కుట్రలో ఆలివర్ కీలక పాత్ర పోషించారని డెట్రాయిట్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి షాన్ కాక్స్ వ్యాఖ్యానించారు. ఫోక్స్‌వ్యాగన్‌లో ఉన్నత స్థానానికి చేరడానికి దీన్ని అవకాశంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారని ఆక్షేపించారు. కాలుష్యకారక వాయువుల ప్రమాణాల పరీక్షలను గట్టెక్కడానికి ఫోక్స్‌వ్యాగన్ తమ కార్లలో రహస్య సెన్సార్లను అమర్చేదని అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆలివర్‌కి 169 ఏళ్ల దాకా జైలు శిక్షకు అవకాశం ఉంది. అయితే, తప్పులను అంగీకరించిన దరిమిలా శిక్షాకాలాన్ని న్యాయస్థానం తగ్గించింది. -
ఫోక్స్‌వ్యాగన్ కొత్త ‘పసాట్’@ రూ.29.99 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ వాహన తయారీ కంపెనీ ‘ఫోక్స్‌వ్యాగన్’ తాజాగా తన ప్రీమియం సెడాన్ ‘పసాట్’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎంక్యూబీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందిన ఈ కారులో 2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది రెండు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఎంట్రీ లెవెల్ కంఫర్ట్‌లైన్ వేరి యంట్ ధర రూ.29.99 లక్షలుగా, టాప్ ఎండ్ హైలైన్ వేరియంట్ ధర రూ.32.99 లక్షలుగా ఉందని తెలిపింది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కొత్త పసాట్ బుకింగ్స్‌ను ప్రారంభించామని, వచ్చే ఏడాది జనవరి నుంచి వీటిని కస్టమర్లకు డెలివరీ చేస్తామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసెంజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టిఫెన్ నాప్ తెలిపారు. ఇందులో 6 స్పీడ్ ఆటోమేటిక్ డీఎస్జీ గేర్‌బాక్స్, 9 ఎయిర్ బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, 360 డిగ్రీ వ్యూ రివర్స్ కెమెరా, పార్క్ అసిస్ట్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించారు. -
ఈ కారు ధర ఎంత తగ్గిందో తెలిస్తే..
న్యూఢిల్లీ :జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ తన రీసెంట్ హ్యాచ్‌బ్యాక్ ధరను భారీగా తగ్గించింది. టీం-బిహెచ్పీ అందించిన నివేదిక ప్రకారం పోలో జిటిఐ ధరలపై సుమారు రూ.6లక్షల తగ్గింపును ఆఫర్ చేస్తోంది. 2016లో లాంచ్ చేసిన పోలో జిటిఐ ధర రూ 6 లక్షల మేరకు తగ్గించింది. 2016 లో భారతదేశంలో విడుదల సందర్భంగా దీని ధరను రూ. 25.99 లక్షలతో(ఢిల్లీ ఎక్స్ షోరూం)ప్రారంభించారు. ప్రస్తుత తగ్గింపుతో ఇపుడు రూ .19,99 లక్షల (ఢిల్లీ ఎక్స్ షోరూం) ధరకే లభిస్తుంది.1.9 లీటర్ టర్బోచార్జెడ్ పెట్రోల్ ఇంజన్ లో లభ్యంకాన్ను ఈ పోలో జీటీఐ 7.2 సెకన్లలో 0-100 వేగంతో దూసుకుపోగలదు. గరిష్టంగా 250ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థతోపాటు డీఎస్జీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు అనుగుణంగా యూనిట్ 7-స్పీడ్, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, డబుల్ క్రోమ్ ఎగ్జాస్ట్ పైప్స్ , ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ అండ్ ఈఎస్పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) వంటి ఇతర ఫీచర్లు దీని సొంతం. -
టాటా , ఫోక్స్‌వ్యాగన్ మధ్య విభేదాలు
న్యూఢిల్లీ: కొత్త వాహనాన్ని అభివృద్ధి చేసే విషయంలో జట్టు కట్టిన టాటా మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌ల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. ప్లాట్‌ఫాం వినియోగం, వ్యాపారపరమైన లాభదాయకత వంటి అంశాలపై సందేహాలు తలెత్తడమే ఇందుకు కారణం. సంయుక్తంగా వాహనాలను అభివృద్ధి చేయనున్నట్లు ఇరు సంస్థలు ఈ ఏడాది మార్చిలో ప్రకటించాయి. ఇందులో భాగంగా తొలి వాహనం 2019లో మార్కెట్లోకి రావాల్సి ఉంది. ఎకానమీ సెగ్మెంట్‌కి చెందిన ఈ కారుపై ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ తరఫున స్కోడా ఆటో పనిచేయనుంది. టాటా మోటార్స్‌కి చెందిన అడ్వాన్స్డ్ మాడ్యులర్ ప్లాట్‌ఫాంపై ఫోక్స్‌వ్యాగన్ టెక్నాలజీ ఉపయోగించి వర్ధమాన మార్కెట్ల కోసం కార్లను తయారు చేయాలని భావించారు. అయితే, వ్యాపారపరంగా ముందు అనుకున్నంతగా ఇది అంత ఆకర్షణీయ ఒప్పందం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. -
డుకాటి కొనుగోలు రేసులోకి మరో దిగ్గజం
ఇటాలియన్ మోటార్ సైకిల్ ప్రత్యర్థి డుకాటిని సొంతం చేసుకోవడం కోసం అమెరికా మోటార్ సైకిల్ దిగ్గజం హార్లే-డేవిడ్ సన్ కొనుగోలు రేసులోకి వచ్చింది. మోటార్ సైకిలింగ్ అత్యంత ఫేమస్ అయిన ఈ రెండు సంస్థలు ఓ డీల్ కుద్చుబోతున్నాయని తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం మేరకు ఈ డీల్ 1.5 బిలియన్ యూరోల(రూ.10,812కోట్లకు పైగా) వరకు ఉండొచ్చని సమాచారం. డుకాటిని జర్మన్ కారు తయారీదారు ఫోక్స్ వాగన్ విక్రయానికి పెట్టింది. ఈ విక్రయానికి దేశీయ మోటార్ సైకిల్ తయారీదారి బజాజ్ ఆటోతో పాటు పలు కంపెనీలు బిడ్స్ దాఖలు చేశాయి. హీరో మోటార్ కార్పొ, తన ప్రత్యర్థి టీవీఎస్ మోటార్ కూడా డుకాటి కొనుగోలు చేయాలనుకుని, తర్వాత విరమించుకున్నాయి. అయితే ఫోక్స్ వాగన్ లో అత్యంత పాపులర్ లేబర్ యూనియన్లు ఈ విక్రయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా దీన్ని కొనుగోలుచేయాలని ఆసక్తి కనబరిచింది. ప్రస్తుతం హార్లే-డేవిడ్ సన్ కూడా ఈ కొనుగోలురేసులోకి వచ్చేసింది. డీజల్ ఉద్గార కుంభకోణం వోక్స్వ్యాగన్ గ్రూపు మీద తీవ్ర ప్రభావం చూపింది. దీని నుండి ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వోక్స్వ్యాగన్ తమ డుకాటి టూ వీలర్ల తయారీ సంస్థను విక్రయించేందుకు సిద్దమైంది. ఖరీదైన మరియు శక్తివంతమైన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటి మొత్తం విలువ రూ. 10,500 కోట్ల రుపాయలుగా ఉంది. 1926లో లాంచ్ అయిన ఈ డుకాటిని, ఆడి కు చెందిన వోక్స్వ్యాగన్ గ్రూపు 2012 లో 6,000 కోట్ల రుపాయలకు కొనుగోలు చేసింది. ఆ తరువాత కాలంలో 800సీసీ నుండి 1,200సీసీ సామర్థ్యం రేంజ్ ఉన్న మోటార్ సైకిళ్లను అభివృద్ది చేసింది. ప్రస్తుతం హార్లే డేవిడ్ సన్ కు అమెరికాలో సగానికి పైగా మార్కెట్ కలిగి ఉంది. -
ఫోక్స్‌వాగన్ పోలో కొత్త వెర్షన్ రివీల్
ఫ్రాంక్ఫర్ట్ : ఫోక్స్ వాగన్ తన పోలో సబ్ కాంపాక్ట్ కొత్త వెర్షన్ ను ఆవిష్కరించింది. జర్మన్ లోని తన ప్రధాన కార్యాలయం వోల్ఫ్స్ బర్గ్ లో దీన్ని రివీల్ చేసింది. 1975లో తొలిసారి ఈ కారును ఆవిష్కరించారు. ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి 1.4కోట్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కొత్త పోలో, ముందస్తు మోడల్ కంటే పెద్దదిగా ఉంది. కానీ రూఫ్ లైన్ మాత్రం ప్రస్తుతమున్న దానికంటే తక్కువగా ఉంది. సన్నటి గ్రిల్, పొడవైన ట్విన్-బ్యారెల్ హెడ్ ల్యాంప్స్ ను ఇది కలిగి ఉంది. డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కొత్త సేఫ్టీ ఫీచర్లను ఈ మోడల్ లో ఆఫర్ చేస్తున్నారు.కొత్త సేఫ్టీ ఫీచర్లతో వెనుకవైపు నుంచి జరిగే ప్రమాదాలను 45 శాతం తగ్గించవచ్చని కంపెనీ పేర్కొంది. రియర్ ట్రాఫిక్ అలర్ట్ ను ఇది కలిగి ఉంది. దీని ద్వారా కారును పార్క్ చేసేటప్పుడు వెనుక వైపున్న ట్రాఫిక్ ను తేలికగా గుర్తించవచ్చు. ఐదు డోర్ల హ్యాచ్ బ్యాక్ రూపంలో ఇది వస్తోంది. ఆరు గ్యాస్ ఓలైన్ ఇంజిన ఆప్షన్లు దీనిలో అందుబాటులో ఉన్నాయి. ఒకటి సహజవాయువుకి సంబంధించినది కాగ, మిగతా రెండు డీజిల్, మూడు పెట్రోల్ ఆప్షన్లు. హ్యుందాయ్ వారి క్రెటా ఎస్‌యువికి ఇది ప్రత్యక్ష పోటీగా నిలవనున్నట్టు తెలుస్తోంది.. ఈ ఏడాది చివరి నుంచి యూరోపియన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈ కారు బేస్ ధర జర్మనీలో 12,975 యూరోలు అంటే రూ.9,35,057 వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఈ వాహనం అమెరికా మార్కెట్ కు అందుబాటులోకి రావడం లేదు. -
మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్ ‘టిగువన్’
ధర శ్రేణి రూ.27.98 లక్షలు– రూ.31.38 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ ‘ఫోక్స్‌వ్యాగన్’ తాజాగా తన ప్రీమియం ఎస్యూవీ ‘టిగువన్’ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.27.98 లక్షలు– రూ.31.38 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. కంపెనీ ఈ ఎస్‌యూవీలో 7 స్పీడ్ ఆటోమేటిక్ డీఎస్జీ గేర్‌బాక్స్‌తో కూడిన 2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చింది. తమ గ్లోబల్ బెస్ట్ సెల్లర్ మోడల్ అయిన ‘టిగువన్’ను ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చామని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ (సేల్స్) ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ థియరీ లెస్పియాచ్క్ తెలిపారు. సేఫ్టీ, లగ్జరీ, స్టైల్, పనితీరు వంటి ఫీచర్ల సమాహారంగా ఈ మోడల్‌ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఎంక్యూబీ ప్లాట్‌ఫామ్ ఆధారిత 4మోషన్ ఇంటెలిజెంట్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కంపెనీ నుంచి భారత్‌లోకి వస్తున్న తొలి కారు ఇదని తెలిపారు. ‘టిగువన్’ ఎస్యూవీ దేశవ్యాప్తంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ డీలర్షిప్స్ వద్ద కంఫర్ట్‌లైన్, హైలైన్ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
ఫోక్స్‌వాగన్ కొత్త ఎస్యూవీ లాంచ్
జర్మనీ కార్ మేకర్ ఫోక్స్‌వాగన్ ఇండియా తనకొత్త ఎస్‌యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి వాహనాన్ని బుధవారం లాంచ్ చేసింది. టిగ్వాన్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారును రెండు వేరియంట్లలోలాంచ్ చేసింది. కంఫర్ట్ లైన్ రూ .27.68 లక్షలు (ఎక్స్ షోరూమ్ ముంబై)లుగాను, హై లైన్ రూ .31.04 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై)లుగా నిర్ణయించింది. 4 మోషన్ టెక్రాలజీ లాంటి డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్‌తో పాటు మాడ్యులర్ ట్నాన్స్వెర్జ్ ఎంక్యూబీ ప్లాట్‌ఫాంలో 2791, 4704ఎంఎం 2.0లీటర్ల డీజిల్ ఇంజీన్, 7 స్పీడ్ డీఎస్ జీ గేర్ బాక్స్ 147 బీహెచ్పవర్ 340 ఎన్ఎం టాప్ టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రో యాంటి స్లీప్ రెగ్యులేషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఇంజన్, డ్రాగ్ టార్క్ కంట్రోల్ సిస్టమ్ అమర్చింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్కొడా ప్లాంట్‌లో దీన్ని రూపొందించిది. ఢిల్లీ ఆటో ఎక్స్ పో 2016 లో ఫోక్స్ వ్యాగన్ మొట్టమొదటిసారి టిగువాన్ ప్రదర్శించింది. ఆడి 3కి పోలిన ఈ కొత్త కారు టయోటా ఫార్చ్యునర్, ఫోర్డ్ ఎండీవర్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మరొక అంతర్గత ప్రత్యర్థి స్కోడా రాబోయే మోడల్ కోడియాక్ కు గట్టి పోటీగానిలవనుందని అంచనా. దేశీయంగా తమకు ఎస్యూవీ సెగ్మెంట్లో భారీ డిమాండ్‌ను టిగువాన్ తీరుస్తుందని సంస్థ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ మైఖేల్ మేయర్ గతంలో చెప్పారు. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ ను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
ఫోక్స్‌వ్యాగన్ కార్లలో ఉద్గారాల గుట్టు రట్టు..
లాస్ ఏంజెలిస్: కాలుష్య ఉద్గారాల విషయంలో వాహన తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ .. అమెరికా, యూరప్ నియంత్రణ సంస్థల కన్నుగప్పిన తీరును శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఉద్గార పరీక్షలు జరిపేటప్పుడు కాలుష్యకారక వాయువుల విడుదలను నియంత్రించేలా ఫోక్స్‌వ్యాగన్ కార్లలో కంప్యూటర్ కోడ్‌ను ఉపయోగించినట్లు కనుగొన్నారు. టెస్ట్ పూర్తయిపోయినట్లు కంప్యూటర్ ధృవీకరించుకున్నాక.. నియంత్రణ వ్యవస్థ డీయాక్టివేట్ అయ్యేది. అటు తర్వాత నుంచి పరిమిత స్థాయికి 40 రెట్లు అధికంగా నైట్రోజన్ ఆక్సైడ్ వాయువులు కారు నుంచి విడుదలయ్యేవి. -
ఫోక్స్ వాగన్ పోలో జీటీ స్పోర్ట్స్ కార్లు వచ్చేశాయ్!
గతవారం ఫోర్డ్ లాంచ్ చేసిన ఫిగో స్పోర్ట్స్ వేరియంట్ అనంతరం జర్మన్ ఆటో దిగ్గజం ఫోక్స్ వాగన్ కూడా తన పాపులర్ మోడల్ పోలో జీటీలో స్పోర్ట్ వేరియంట్లను మార్కెట్ కు పరిచయం చేసింది. పోలో జీటీ టీఎస్ స్పోర్ట్ తో పాటు, జీటీ టీడీఐ స్పోర్ట్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. పోలో జీటీ టీఎస్ఐ స్పోర్ట్ వేరియంట్ ధర రూ.7.91 లక్షలు(ఎక్స్ షోరూం, ముంబై) కాగ, జీటీ టీడీఐ ధర 9.81 లక్షల రూపాయలు.భారత్ లోని ఫోక్స్ వాగన్ డీలర్ షిప్ షోరూంలన్నింటిలోనూ ఈ రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇంటీరియర్,ఎక్స్ టీరియర్ అప్డేట్లతో ఈ కొత్త పోలో జీటీ స్పోర్ట్ వేరియంట్లను ఫోక్స్ వాగన్ రూపొందించింది. ఎక్స్ టీరియర్ అప్ డేట్లు : అంతా కొత్త గ్లోసీ బ్లాక్ స్పాయిరల్,16 అంగుళాల పోర్టాగో అలోయ్ వీల్స్, గ్లోసీ బ్లాక్ రూఫ్ ఫోయిల్, ఆకర్షణీయమైన జీటీ స్పోర్ట్ సైడ్ ఫోయిల్తో ఇది రూపొందింది. ఈ కొత్త పోలో జీటీ స్పోర్ట్ వేరియంట్లు 1.2 లీటర్ల టీఎస్ఐ,1.5 లీటర్ల టీడీఐ ఇంజిన్ ను కలిగిఉన్నాయి. రెండు కలర్ వేరియంట్లో ఇది అందుబాటులోకి వచ్చింది. ఫ్లాష్ రెడ్, క్యాండీ వైట్ రంగుల్లో ఇది అన్ని ఫోక్స్ వాగన్ షోరూంలలో లభ్యం కానుంది. -
ఫోక్స్‌వ్యాగన్, స్కోడాలతో టాటా మోటార్స్ జట్టు
⇒ సంయుక్తంగా ప్రొడక్టుల రూపకల్పనే లక్ష్యం ⇒ 2019లో మార్కెట్లోకి తొలి ఉత్పత్తి! న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన సంస్థ ‘టాటా మోటార్స్’ తాజాగా అదే రంగంలోని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్, స్కోడా కంపెనీలతో దీర్ఘకాలపు వ్యూహాత్మక భాగస్వామ్యఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులోభాగంగా మూడుసంస్థలు కలిసి సంయుక్తంగా ప్రొడక్టులను రూపొందించనున్నాయి. టాటా మోటార్స్ సీఎండీ గుంటర్ బషెక్, ఫోక్స్‌వ్యాగన్ ఏజీ సీఈవో మథియస్ ముల్లర్, స్కోడా ఆటో సీఈవో బెర్న్‌హార్డ్ మేయర్ ఒప్పందంపై సంతకాలు చేశారని టాటా మోటార్స్ పేర్కొంది. భాగస్వామ్యంలో భాగంగా తొలి ఉత్పత్తిని 2019లో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపింది. -
కేక వేస్తే వచ్చేస్తుంది
ఈ మధ్యకాలంలో డ్రైవర్లు లేని కార్లు అనేకం రోడ్ల మీదకు వచ్చేస్తున్నాయి కదా.. ఒకవైపు గూగుల్, ఇంకోవైపు ఉబెర్, టెస్లాలు ఈ రకమైన కార్లను వీలైనంత వేగంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫోక్స్‌వ్యాగన్ ఇంకో అడుగు ముందుకేసి.. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కాన్సెప్ట్ కారును డిజైన్ చేసింది. పేరు సెడ్రిక్! స్టీరింగ్, డ్రైవర్ ఇద్దరూ అవసరం లేకపోతే ప్రయాణీకులు ఒక దిక్కుకు కాకుండా ఎదురుఎదురుగా కూర్చుని వెళ్లేలా ఉంటుంది ఇది. అంతేకాదు.. ఈ కారులో వెళ్లేటప్పుడు స్వచ్ఛమైన గాలి అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయి. సెడ్రిక్ను కేక వేయడంతోనే అది ఎక్కడున్నా... సర్రు సర్రున మీ ముందుకు వచ్చేస్తుంది. ఆ తరువాత లోపల కూర్చున్న వెంటనే.. ‘ఆఫీసుకు వెళ్లాలి’’ అని చెబితే చాలు. అప్పటికే ఫీడ్ చేసిన ఆఫీస్ అడ్రస్‌కు నేరుగా వెళ్లిపోతుంది. అంతేకాకుండా.. దారిలో ట్రాఫిక్ ఎలా ఉంది? వాతావరణం ఎలా ఉండబోతోంది అనే విషయాలన్నింటిని మీకు వినిపిస్తుంది కూడా. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఈ కారు పూర్తిగా విద్యుత్తుతోనే నడుస్తుంది. టెస్లా కారు మాదిరిగా దీంట్లోనూ బ్యాటరీ ప్లాట్‌ఫార్మ్‌లో ఏర్పాటు చేస్తారు. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చునని అంచనా. ప్రస్తుతం జరుగుతున్న జెనీవా మోటర్ షోలో ఈ సరికొత్త కారును ప్రదర్శిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జత కట్టబోతున్న ఆటో దిగ్గజాలు
న్యూఢిల్లీ : రెవెన్యూలో దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్, వాల్యుమ్‌లో అతిపెద్ద యూరప్ కార్ మేకర్ ఫోక్స్ వాగన్ రెండూ జతకట్టబోతున్నాయి. ఈ రెండూ భాగస్వామ్యం కుదుర్చుకునే ఒప్పంద చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండింటి భాగస్వామ్యం భారత్ , ఇతర వర్దమాన దేశాలపై ఎక్కువగా ప్రభావం చూపనుందని తెలుస్తోంది. అయితే ఈ భాగస్వామ్యం జాయింట్ వెంచర్ లేదా టెక్నాలజీ టై-అప్ గా ఉండొచ్చని ఆటో వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ పార్టనర్ షిప్‌పై చర్చలు కొనసాగుతున్నాయని, మార్చిలో జరుగబోయే జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో దీన్ని ప్రకటించవచ్చని సమాచారం. వెహికిల్ ఆర్కిటెక్చర్ షేరింగ్, టెక్నాలజీ అనేవి ఈ చర్చలకు ప్రధాన అంశంగా దీనికి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పారు. ఇండియా, ఎమర్జింగ్ మార్కెట్లలో మోడ్యులర్ ప్లాట్ ఫామ్‌లను షేర్ చేసుకునేందుకు ఈ కంపెనీలు యోచిస్తున్నాయని తెలుస్తోంది. -
30వేల ఉద్యోగులపై ఆ కంపెనీ వేటు!
-
30వేల ఉద్యోగులపై ఆ కంపెనీ వేటు!
వోల్ఫ్స్ బర్గ్ : యూరప్‌లో అతిపెద్ద కార్ల తయారీదారిగా పేరున్న జర్మన్ కార్‌మేకర్ ఫోక్స్‌వాగన్ 30 వేల ఉద్యోగాలకు కోత పెట్టనున్నట్టు ధృవీకరించింది. కర్బన్ ఉద్గారాల స్కాంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న ఈ కంపెనీ, ఆ నష్టాల నుంచి బయటపడటానికి 2021లోపు 30వేల ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు తెలిపింది. ఫోక్స్‌వాగన్, ఆ దేశ లేబర్ యూనియన్లు ఈ విషయాన్ని అంగీకరించాయి. తన ఫోక్స్‌వాగన్ బ్రాండును లాభాల బాటలో నడిపించడానికి, ఎలక్ట్రిక్, స్వీయనియంత్రణ కార్ల వైపు తమ వ్యాపారాలను మరల్చడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కర్బన ఉద్గారాల స్కాం అనంతరం కంపెనీ పడరాని పాట్లు పడింది. పలు దేశాల్లో ఈ కంపెనీకి భారీ నష్టపరిహారాలే ఎదురయ్యాయి. జర్మనీలో కలిగిఉన్న తన అతిపెద్ద యూనిట్లో వ్యయాలు తగ్గించుకుని, పొదుపులను పెంచుకోవడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ యూనిట్ నుంచి కంపెనీకి అత్యధికంగా ఖర్చులు నమోదవుతున్నాయి. అదేవిధంగా డీజిల్ ఉద్గారాల చీటింగ్ స్కాండల్ నుంచి బయటపడటానికి అవసరమైన బిలియన్ల కొద్దీ యూరోలను సమకూర్చుకోవడంపై కూడా కంపెనీ ఫోకస్ చేసింది. ఉద్యోగాల కోత వివరాలను ఫోక్స్బాగన్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో వివరించింది. జర్మన్ ఒక్క దేశంలోనే 23వేల మంది ఉద్యోగాలపై వేటు వేసి, ఫోక్స్‌వాగన్ బ్రాండ్‌లో 3.9 బిలియన్ డాలర్లను (రూ.26,596కోట్లకు) వార్షిక పొదుపు చేసుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. మిగతా ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా ఉండనుంది. ఫోక్స్‌వాగన్ గ్రూప్‌లో మొత్తం 6,10,076 ఉద్యోగులున్నారు. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టి, కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్టు కంపెనీ వాగ్దానం చేయడంతో లేబర్ యూనియన్ లీడర్లు ఈ కోతకు అంగీకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సంప్రదాయ ఉద్యోగాలకు గుడ్‌బై చెబుతున్న ఈ కంపెనీ 9వేల ఉద్యోగాలను ఎలక్ట్రిక్ కారు టెక్నాలజీలో సృష్టించనుంది. -
అమియో డీజిల్ వేరియంట్... రేటెంతో తెలుసా?
పండుగ సీజన్లో కస్టమర్లను మురిపించేందుకు యూరప్ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వాగన్ అమియో డీజిల్ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.6.27 లక్షలుగా కంపెనీ పేర్కొంది. టాప్ వేరియంట్ ధర రూ.9.32 లక్షలుగా(ఎక్స్ షోరూం ఢిల్లీలో) కంపెనీ వెల్లడించింది. హోండా అమేజ్, టాటా జిస్ట్, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, హ్యుందాయ్ అసెంట్లకు గట్టిపోటీగా వచ్చిన ఫోక్స్ వాగన్ అమియో పెట్రోల్ వెర్షన్‌కు.. తోబుట్టువుగా ఈ డీజిల్ వెర్షన్ ను ఫోక్స్‌వాగన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఈ డీజిల్ కారును కూడా మూడు వేరియంట్లలో ఫోక్స్‌వాగన్ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది వేసవిలో తీసుకొచ్చిన 'మేడ్ ఇన్ ఇండియా' పెట్రోల్ వెర్షన్ విజయవంతమైనదని ఫోక్స్ వాగన్ ప్యాసెంజర్ కార్ల ఇండియా డైరెక్టర్ మైఖేల్ మేయర్ తెలిపారు. పండుగల సీజన్ కానుకగా ప్రస్తుతం ఈ డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. 5 స్పీడ్ మాన్యువల్‌తో దీన్ని రూపొందించారు. అదేవిధంగా ఎక్కువ ప్రజాదరణ కలిగిన 7-స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్‌ని కూడా దీనిలో అమర్చినట్టు చెప్పారు.చాలా ఉత్తమమైన లక్షణాలతో, హై క్వాలిటీ క్యాబిన్‌ను ఈ కారు కలిగి ఉంది. భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఫోక్స్ వాగన్ అమియో డీజిల్‌ను వెర్షన్‌ను ఆవిష్కరించారు. డ్రైవర్ సీటుతో పాటు ఆ పక్క సీటు వాళ్లకు కూడా ఎయిర్‌బ్యాగ్స్ ఇందులో ఉన్నాయి. నేటి నుంచి అన్ని షోరూంలలో ఈ వేరియంట్‌ను బుక్ చేసుకునే సదుపాయం ఫోక్స్‌వాగన్ కల్పించింది. మార్కెట్లో లభ్యమౌతున్న అన్ని వేరియంట్లలో కన్నా స్టాండర్ట్ ఫింట్ మెంట్ తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ను ఏర్పాటుచేశారు. -
ఫోక్స్ వాగన్ చీట్ చేసిన ఈయూ దేశాలెన్నో తెలుసా?
కర్బన ఉద్గారాల స్కాంలో మోసపూరిత చర్యలకు పాల్పడిన జర్మన్ కారు తయారీదారి ఫోక్స్‌వాగన్, యూరోపియన్ యూనియన్‌లో చాలా దేశాలనే మోసం చేసిందట. 20కి పైగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో వినియోగదారులు చట్టాలను కొల్లగొట్టిందని యూరోపియన్ కమిషన్ తేల్చింది. ఈ విషయాన్ని జర్మన్ డైలీ డై వెల్ట్ రిపోర్టు చేసింది. ఈ కర్బన ఉద్గారాల స్కాంలో వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించడానికి ఫోక్స్‌వాగన్ స్వతాహాగా ముందుకు రావాల్సి ఉంటుందని యూరోపియన్ కమిషన్ ఇండస్ట్రి కమిషనర్ ఆదేశించారు. వినియోగదారులు చట్టబద్దంగా నష్టపరిహారం కిందకు వస్తారా అనేది జాతీయ కోర్టులు నిర్ధారిస్తున్నాయని వెల్లడించారు. వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఈయూ వ్యాప్తంగా ఉన్న కన్సూమర్ అసోసియేట్స్‌కు ఇప్పటికే కన్సూమర్ కమిషనర్ వెరా జౌరోవా లేఖలు రాశారు. సంబంధిత ప్రతినిధులతో ఆమె ఈ వారంలో భేటీ కానున్నట్టు కమిషన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ఈ విషయంపై స్పందించడానికి ఫోక్స్‌వాగన్ నిరాకరించింది. కన్సూమర్ గ్రూపులతో పనిచేస్తూ యూరప్‌లోని క్లయింట్లకు ఫోక్స్‌వాగన్ నష్టపరిహారం చెల్లించేలా జౌరోవా కృషిచేస్తున్నారు. డీజిల్ కార్ల ఓనర్లకు బిలియన్ యూరోల నష్టపరిహారం చెల్లిస్తానన్న ఫోక్స్‌వాగన్, అనంతరం యూరప్‌లో కర్బన ఉద్గారాల స్కాంకు ప్రభావితమైన 8.5 మిలియన్ వెహికిల్స్‌కు మాత్రం మాట మార్చింది. విభిన్నమైన చట్టపరమైన నియమాలను అడ్డం పెట్టుకుని ఈ పరిహార చెల్లింపుల నుంచి తప్పించుకుంది. దీనిపై పోరాడుతున్న జౌరోవా యూరోపియన్ మెంబర్ స్టేట్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషించామని, చాలా దేశాల్లో ఈ కంపెనీ యూరోపియన్ వినియోగదారుల చట్టాలను ఉల్లంఘించిందని వెల్లడైనట్టు తెలిపారు. ప్రస్తుతం వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించేలా ఫోక్స్వాగన్పై చర్యలకు సిద్దమైనట్టు తెలిపారు. -
ఫోక్స్‌వాగన్‌కు షాకిచ్చిన దక్షిణ కొరియా
జర్మన్ కారు తయారీదారి ఫోక్స్ వాగన్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. 80 ఫోక్స్‌వాగన్ మోడల్స్ అమ్మకాలను నిషేధిస్తున్నట్టు ఆ దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఉద్గారాల చీటింగ్ స్కాండల్‌కు పాల్పడినందుకు గాను నిషేధంతో పాటు 16.06 మిలియన్ డాలర్ల నష్టపరిహారం విధిస్తున్నట్టు తెలిపింది. మొత్తం 83వేల డీజిల్, పెట్రలో సామర్ధ్యంతో రూపొందిన ఫోక్స్ వాగన్ వెహికిల్స్‌కు, తన లగ్జరీ కారు బ్రాండ్లు ఆడీ,బెంట్లీలకు అమ్మక సర్టిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం 2,09,900 ఫోక్స్ వాగన్ అమ్మకాలు దక్షిణ కొరియాలో నిలిపివేయనున్నారు. ఈ అమ్మక నిషేధం ఫోక్స్ వాగన్ గ్రూపుకు చెందిన మొత్తం 32 రకాల వాహనాలపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. 2007 నుంచి ఫోక్స్‌వాగన్ మొత్తం 68 శాతం వెహికిల్స్ ను ఆ దేశంలో విక్రయించినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. నవంబర్ లోనే 1,26,000 ఫోక్స్ వాగన్ వాహనాలకు ప్రభుత్వం అమ్మక సర్టిఫికేషన్ రద్దు చేసింది. ఆ వాహనాలన్నింటినీ వెంటనే రీకాల్ చేసుకోమని ఆదేశించి, నష్టపరిహారం సైతం విధించింది. తాజాగా అమ్మకాల నిషేధంతో పాటు, 16.06 మిలియన్ డాలర్లను ఫైన్ గా విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి ముందే ఈ కారు తయారీదారి వినియోగదారుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించడానికి స్కాంకు ప్రభావితమైన కార్ల అమ్మకాలను జూలై 25నుంచి నిషేధిస్తున్నట్టు తెలిపింది. డీజిల్ ఉద్గారాల టెస్టులో చీటింగ్‌కు పాల్పడినట్టు ఈ కారు తయారీదారు అమెరికాలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 110 లక్షల వాహనాల్లో ఈ అక్రమ సాప్ట్‌వేర్‌ను అమర్చినట్టు తన తప్పును ఒప్పుకుంది. ఈ తప్పును సరిదిద్దుకునే నేపథ్యంలో ఫోక్స్ వాగన్ అష్టకష్టాలు పడుతోంది. దక్షిణ కొరియాలో ఇప్పటికే అమ్మకాలు పతనమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఫోక్స్‌వాగన్‌కు నేడు వెలువరించిన నిర్ణయం మరింత కుంగదీయనున్నట్టు తెలుస్తోంది. ఈ స్కాండల్ బయటపడక ముందు దక్షిణ కొరియాలో టాప్ సెల్లింగ్ వెహికిల్స్ లో ఫోక్స్ వాగన్ ఒకటిగా నిలిచేది. -
అక్కడ ఫోక్స్‌వాగన్ కార్లను అమ్మదట!
జర్మన్ కారు తయారీదారి ఫోక్స్‌వాగన్‌కు కష్టాలు తప్పట్లేదు. కర్బన ఉద్గారాల స్కాంకు పాల్పడినందుకు గాను దక్షిణ కొరియాలో ఈ 25 నుంచి తన మోడల్స్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. డీజిల్ ఉద్గారాల టెస్టులో చీటింగ్‌కు పాల్పడినట్టు ఈ కారు తయారీదారు అమెరికాలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 110 లక్షల వాహనాల్లో ఈ అక్రమ సాప్ట్‌వేర్‌ను అమర్చినట్టు తన తప్పును ఒప్పుకుంది. ఈ తప్పును సరిదిద్దుకునే నేపథ్యంలో తన కార్లను ఫోక్స్‌వాగన్ రీకాల్ చేయడం, అమ్మకాలు నిలిపివేయడం చేస్తోంది. తాజాగా దక్షిణ కొరియాలో తన మోడల్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ఫోక్స్‌వాగన్ ప్రకటించింది. డీలర్స్, కస్టమర్ల మదిలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించడానికి ఈ స్కాంకు ప్రభావితమైన మోడల్స్ అమ్మకాలు నిలిపివేస్తున్నామని దక్షిణ కొరియా ఫోక్స్‌వాగన్ బిజినెస్‌ల అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ నెలలో లేదా ఆగస్టు నెల మొదట్లో దీనిపై ఆ దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించనుంది. 32 వెహికిల్స్‌పై సర్టిఫికేషన్‌ను ఉపసంహరించుకుని, ఫోక్స్‌వాగన్ కార్ల అమ్మకాలకు అనుమతి ఇస్తుందో లేదో ఆ సమీక్షలో తేలిపోనుంది. తన లగ్జరీ కారు బ్రాండ్ ఆడీ, ఈ అమ్మకాల బ్యాన్‌లో మొదటి స్థానంలో ఉండనుంది. ఉద్గారాల స్కాండల్‌తో కనెక్షన్ నేపథ్యంలో ఫోక్స్‌వాగన్ ఎగ్జిక్యూటివ్‌కు దక్షిణ కొరియా న్యాయవాదులు గత నెలే మొదటి వారెంట్‌ను సైతం జారీచేశారు. గ్లోబల్‌గా ఈ కంపెనీలకు చర్యలు సైతం రెట్టింపయ్యాయి. 16.2 బిలియన్ యూరోల జరిమానాలను కంపెనీ భరించిందని అంతకముందు వెల్లడించింది. మరో 2.2 బిలియన్ యూరోలను కంపెనీకి ఫైన్ గా భరించినట్టు కంపెనీ ఈ వారంలో ప్రకటించింది. దక్షిణ కొరియాలో ఇప్పటికే అమ్మకాలు పతనమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఫోక్స్‌వాగన్‌కు ఈ చర్యలు మరింత కుంగదీయనున్నట్టు తెలుస్తోంది.ఈ ఏడాదిలో ఇప్పటికే ఫోక్స్ వాగన్ బ్రాండెడ్ కార్ల అమ్మకాలు దాదాపు 33 శాతం క్షీణించి, 12,463 వెహికిల్స్ మాత్రమే అమ్ముడుపోయినట్టు ఇండస్ట్రి అసోసియేషన్ డేటా పేర్కొంది. గతేడాది కొరియాలో టాప్ సెల్లింగ్ వెహికిల్స్‌లో ఈ కంపెనీనే నిలిచింది. -
రూ. లక్ష కోట్లకుపైగా చెల్లిస్తున్న ఫోక్స్‌వ్యాగన్
మైలేజీ మోసం కేసు... డెట్రాయిట్: మైలేజీ మోసాల కేసులో వినియోగదారుల, ప్రభుత్వాలతో కేసుల సెటిల్మెంట్, కోసం ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి 1,500 కోట్ల డాలర్లకు పైగా(రూ. లక్ష కోట్లకు పైనే) చమురు వదులనున్నది. మైలే జీ సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో మోసాలకు పాల్పడినందుకు వినియోగదారులకు, ప్రభుత్వానికి ఈ స్థాయిలో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ పరిహారం చెల్లించనున్నది. కాగా అమెరికా చరిత్రలో అతి పెద్ద వాహన సంబంధిత క్లాస్-యాక్షన్ సెటిల్మెంట్ ఇదే. శాన్ఫ్రాన్సిస్కో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ వెల్లడించిన దాని ప్రకారం, 4,75,000 వాహనాలను రిపేర్ చేయడానికి గానీ, లేదా తిరిగి వాటిని వెనక్కి తీసుకోవడానికి గానీ ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ 1,000 కోట్ల డాలర్లు చెల్లించడానికి ఒప్పుకుంది. అంతేకాకుండా వాహన వయస్సును బట్టి వినియోగదారులకు 5,100- 10,000 డాలర్ల రేంజ్లో పరిహారం చెల్లించనున్నది. మైలేజీ విషయమై మోసం చేసిన కార్లను రిపేర్ చేయడానికి గత కొన్ని నెలలుగా ఫోక్స్‌వ్యాగన్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ కార్లను రిపేర్ చేయడం సాధ్యం కాదని, ఆ కార్లను కంపెనీ వినియోగదారుల నుంచి తిరిగి కొనుగోలు చేయక తప్పదని సమాచారం. పర్యావరణానికి హాని కలిగించినందుకు ప్రభుత్వానికి 270 కోట్ల డాలర్ల చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఫోక్స్‌వ్యాగన్‌కు 1,530 కోట్ల డాలర్ల చమురు వదలనున్నది. -
భారీ మొత్తంలో ఫోక్స్ వాగన్ నష్టపరిహారం
శాన్ ఫ్రాన్సిస్కో : కర్బన ఉద్గారాల స్కాంకు పాల్పడినందుకు జర్మన్ కార్ల తయారీదారు ఫోక్స్ వాగన్ భారీ మొత్తంలో సెటిల్ మెంట్ కుదుర్చుకుంది. ఈ దావా కేసులో నష్టపరిహారంగా 1500 కోట్ల డాలర్లును నగదు రూపంలో చెల్లించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కాలుష్యానికి పాల్పడిన డీజిల్ వాహనాలను బాగుచేయడం కాని, బై బ్యాక్ చేయడం కాని చేస్తామని ఒప్పుకున్నట్టు ఒప్పంద చర్చల ఓ అధికారి చెప్పారు. స్కాంకు పాల్పడిన కార్లు కొన్న ప్రతి యజమానికి 1500 కోట్ల డాలర్ల కింద 10వేల డాలర్లు చెల్లించనున్నట్టు తెలుస్తోంది. అమెరికా ఆటో స్కాండల్ సెటిల్ మెంట్ లో ఇదే అతిపెద్ద మొత్తమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సెటిల్ మెంట్ ను కంపెనీ మంగళవారం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అమెరికా పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ, ఫోక్స్ వాగన్ స్పందించడానికి తిరస్కరించాయి. . 1000 కోట్ల డాలర్లను యజమానులకు బైబ్యాక్ ఆఫర్ ను ప్రకటిస్తుండగా.. దాదాపు 500 కోట్ల డాలర్లను కర్బన ఉద్గారాలకు నష్టపరిహారంగా.. జీరో ఉద్గారాలకు తెచ్చుకోవడానికి ఫండ్స్ చెల్లిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.అయితే ఈ సెటిల్ మెంట్ వ్యవహారంలో మరో వెర్షన్ చీటింగ్ పాల్పడిన 3 లీటర్ల ఫోక్స్ వాగన్ డీజిల్ వాహనాలకు వర్తించదని తెలుస్తోంది. ఇప్పటికే ఫోక్స్ వాగన్ జరిమానాల మీద జరిమానాలు భరించాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. 2.0 లీటర్ డీజిల్ ఫోక్స్ వాగన్ 2009-15 కార్ల యజమానులు సెప్టెంబర్ నాటి అంచనా విలువతోపాటు కనీసం 5,100 డాలర్లను నష్టపరిహారంగా పొందుతారని అధికారులు చెబుతున్నారు. కొంతమంది ఓనర్లు 10వేల డాలర్లను నష్టపరిహారంగా పొందచ్చని, కారు విలువను బట్టి నష్టపరిహారం ఉంటుందని పేర్కొంటున్నారు. 2015 సెప్టెంబర్ 18న ఈ స్కాం బయటికి పొక్కింది. స్కాండల్ మొదలైనప్పటినుంచి ఫోక్స్ వాగన్ డీజిల్ సగటు విలువ 19 శాతం పడిపోయింది. జడ్జి అనుమతితో ఈ సెటిల్ మెంట్ అమల్లోకి రానుంది. -
1.9లక్షల ఫోక్స్ వాగన్ కార్లు రీకాల్
కర్బన ఉద్గారాల స్కాం ఎఫెక్ట్ భారత్ లో అమ్ముడుపోయిన ఫోక్స్ వాగన్ కార్లపైనా పడింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ, జర్మన్ ఆటోమేకర్ ఫోక్స్ వాగన్, భారత్ లో కూడా తన కార్లను రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. 1.9లక్షల కార్లను ఈ ఏడాది జూలై నుంచి రీకాల్ చేస్తామని వెల్లడించింది. కర్బన ఉద్గారాల స్కామ్ ఆరోపణలు రుజువైన క్రమంలో ఫోక్స్ వాగన్ తన కార్లను రీకాల్ చేయడం ప్రారంభించింది. అయితే భారత్ లో స్వచ్ఛందంగానే తమ కార్లను రీకాల్ చేస్తున్నామని, అమెరికాలో లాగా భారత్ లో కర్బన ఉద్గారాల నిబంధనలను ఉల్లఘించినందుకు ఎలాంటి చర్యలను, ఫీజులను భరించలేదని పేర్కొంది. జూలై నుంచి రీకాల్ ప్రాసెస్ ప్రారంభించి, తర్వాత 10 నెలల వరకు కొనసాగిస్తామని ఫోక్స్ వాగన్ మార్కెటింగ్ అధినేత కమల్ బసు వెల్లడించారు. నిబంధనలు ఉల్లఘించి మోసపూరిత కర్బన ఉద్గారాల సాప్ట్ వేర్ ను ఫిక్స్ చేసినందుకు అమెరికాలో తన కార్లను ఫోక్స్ వాగన్ రీకాల్ చేసింది. భారత్ లో కూడా ఈ సాప్ట్ వేర్ ఫిక్స్ చేసిన వాహనాలను రీకాల్ చేయనున్నామని బసు ప్రకటించారు. రీకాల్ కోసం రెగ్యులేటరీ నుంచి ఫోక్స్ వాగన్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ మోసపూరిత సాప్ట్ వేర్ ఉన్న దాదాపు 11 మిలియన్ డీజిల్ ఇంజన్ కార్లను యూఎస్, యూరప్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మినట్టు ఫోక్స్ వాగన్ ప్రకటించింది. అమెరికాలో ఈ స్కామ్ బయటపడిన తర్వాత భారత్ లో ఫోక్స్ వాగన్ అమ్మకాలు పడిపోయాయి. అమెరికాలో మార్కెట్లో ఫోక్స్ వాగన్ జరిమానాలు, క్రిమినల్ ఇన్ వెస్టిగేషన్లతో రెట్టింపు చర్యలను ఎదుర్కొంటోంది. -
లక్షకు పైగా కార్లను రీకాల్ చేస్తున్న వోక్స్ వాగన్
బీజింగ్ : ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగి అల్లాడుతున్న జర్మన్ కార్ల కంపెనీ వోక్స్ వాగన్ నెత్తిమీద మరొక పిడుగు పడింది ఈ కంపెనీకి చెందిన దాదాపు లక్ష కార్లను వెనక్కి తీసుకోనున్నట్టు ప్రకటిస్తూ సంచలన రేపింది. చైనా లో లక్షా 3 వేల 569 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు , నాణ్యత పర్యవేక్షణ, తనిఖీ విభాగం వెల్లడించింది. 2010 - 2016 మధ్య తయారైన తౌరెగ్ వాహనాల్లో బ్రేక్ పెడల్స్ వైఫల్యం కారణంగా రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. బ్రేక్ పెడల్స్ లోని లోపం ప్రమాదాల తీవ్రతను పెంచుతుందనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది. ఏప్రిల్18 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభంకానుందని చెప్పింది. లోపాలున్న వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఆయా భాగాలను ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్టు తెలిపింది. కాగా ఆటోమొబైల్స్ రంగంలో అంతర్జాతీయ స్ధాయిలో సత్తా చాటిన జర్మనీ కార్ ల దిగ్గజం వోక్స్ వేగాన్ పలు స్టైలిష్ మోడల్స్ తో కార్ లవర్స్ హృదయాలను గెలుచుకుంది. అత్యుత్తమ పనితీరుతో ప్రపంచ ఖ్యాతి గడించింది. అయితే ఉద్గార పరీక్షల ఫలితాల్లో అవకతవకలు ఆరోపణలతో ఇప్పటికే కంపెనీపై భారీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటాం
న్యూఢిల్లీ: తాము తప్పుచేసినట్లు రాతపూర్వకంగా ఒప్పుకుంటే జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ కంపెనీపై చర్యలు తీసుకుంటామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు. భారత్‌లోని కాలుష్య ఉద్గారాల నియమాలకు అనుగుణంగా కార్లు రూపొందించలేదని ఆ కంపెనీ రాతపూర్వకంగా వెల్లడించాలన్నారు. గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... గతంలోనే ఆ కంపెనీ తన తప్పును ఒప్పుకుందని, ఇక రాతపూర్వకంగా, ఏదైనా డాక్యుమెంట్లోనైనా ఆ విషయాన్ని పేర్కొన్న తర్వాత ఫోక్స్ వ్యాగన్ కంపెనీపై చర్యలు చేపడతామని చెప్పారు. వాహనాలను వెనక్కి తీసుకోవాలని ఆ కంపెనీకి ఇదివరకే చెప్పామన్నారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందించడానికి ఫోక్స్ వ్యాగన్ మోటార్ స్పోర్ట్ ఇండియా చీఫ్ శిరిష్ విస్సా నిరాకరించారు. కంపెనీ పేరు తిరిగి సంపాదించడానికి కార్లను తిరిగి తీసుకుని వాటి ఇంజన్లను మార్చి ఇస్తామని.. అవసరమైతే రీప్లేస్ చేస్తామని ఆ కంపెనీ అధికారులు గతంలోనే ప్రకటించారు. 3.23 లక్షల ఆడీ, స్కోడా, ఫోక్స్ వ్యాగన్ కార్ల పాత ఇంజన్ల స్థానంలో సరైన వాటిని అమర్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.