ముంబై: జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ సంస్థ జనవరి 1 నుంచి తన కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. రూపాయి విలువ పడిపోవడం, తయారీ వ్యయాలు పెరిగిపోవడమే ధరలు పెంచడానికి కారణమని పేర్కొంది. ఈ కారణాల వల్ల తప్పనిసరై ధరలను పెంచుతున్నట్టు సంస్థ ప్యాసింజర్ కార్ల విభాగం డైరెక్టర్ స్టీఫెన్‌న్యాప్ తెలిపారు. మారుతి సుజుకి, టయోటా, ఇసుజు మోటార్స్ ఇప్పటికే ధరలను పెంచాయి.
Comments
Please login to add a commentAdd a comment