![Made In India Pravaig Electric SUV Defy Launched November - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/26/Untitled-6.jpg.webp?itok=BwkZbsf7)
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ ప్రవేగ్ డైనమిక్స్ తాజాగా డిఫై పేరుతో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.39.5 లక్షలు. డెలివరీలు వచ్చే ఏడాది మూడవ త్రైమాసికం నుంచి ఉంటాయి. 800 యూనిట్లకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ తెలిపింది.
ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని వివరించింది. బెంగళూరు ప్లాంటులో ఏటా 6,000 బ్యాటరీ ప్యాక్స్ తయారు చేస్తున్నట్టు వెల్లడించింది. వీర్ పేరుతో ఆఫ్–రోడ్ మిలిటరీ వర్షన్ ఎస్‌యూవీని కంపెనీ అభివృద్ధి చేసింది.
చదవండి: భారీ షాక్, మరో రంగానికి చెందిన వేలాది మంది ఉద్యోగుల తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment