Electric Car
-
ఎలక్ట్రిక్ కిసిక్!
కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు దుమ్మురేపేందుకు ఫుల్ చార్జ్ అవుతున్నాయి. దేశీ కంపెనీలతో పాటు విదేశీ దిగ్గజాలు సైతం భారత్ మార్కెట్లోకి పలు కొంగొత్త మోడళ్లను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ముఖ్యంగా దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన ఎలక్ట్రిక్ జర్నీ షురూ చేస్తోంది. ఎలాన్ మస్క్ టెస్లా కూడా ఈ ఏడాదే మన ఈవీ మార్కెట్ రేసుకు సిద్ధమవుతోంది. ఈ నెలలో జరగనున్న అతిపెద్ద భారత్ మొబిలిటీ ఆటో షోలో అనేక కంపెనీలు ‘ఎలక్ట్రిక్’ ఆవిష్కరణలతో ఫాస్ట్ ట్రాక్‌లో దూసుకెళ్లనున్నాయి.గతేడాది రికార్డు ఈవీ అమ్మకాలతో జోష్ మీదున్న వాహన దిగ్గజాలు... 2025లో రెట్టించిన ఉత్సాహంతో గ్రీన్ కార్ల కుంభమేళాకు సై అంటున్నాయి. ఈ ఏడాది కొత్తగా రోడ్డెక్కనున్న ఈవీల్లో అత్యధికంగా ఎస్‌యూవీలే కావడం విశేషం! కాలుష్యానికి చెక్ చెప్పడం, క్రూడ్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా పర్యావరణానుకూల వాహనాలను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. దీంతో దాదాపు దేశంలోని అన్ని కార్ల కంపెనీలూ ఎలక్ట్రిక్ మార్కెట్లో వాటా కొల్లగొట్టేందుకు పోటీ పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేశీ కార్ల అగ్రగామి మారుతీ. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహన రంగంలో ఎదురులేని రారాజుగా ఉన్న మారుతీ తొలిసారి ఈవీ అరంగేట్రం చేస్తోంది. హ్యుందాయ్తో పాటు లగ్జరీ దిగ్గజాలు మెర్సిడెస్, ఆడి, స్కోడా కూడా తగ్గేదేలే అంటున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రాతో సహా చైనా దిగ్గజం బీవైడీ ఈవీ డ్రైవ్‌తో పోటీ మరింత హీటెక్కనుంది. వీటి ప్రారంభ ధరలు రూ. 16 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఆటో ఎక్స్పో వేదికగా... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ మెగా ఆటో షో (జనవరి 17–22 వరకు)లో 16 కార్ల కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇందులో పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ వాహనాలు ఉన్నప్పటికీ ఈసారి ఆధిపత్యం ఈవీలదే. అయితే అందరి కళ్లూ మారుతీ తొలి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) ఈ–విటారా పైనే ఉన్నాయి. దీని రేంజ్ 500 కిలోమీటర్లకు మించి ఉంటుందని, ధర రూ.15 లక్షలతో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక గతేడాది మార్కెట్ వాటాను కొద్దిగా పెంచుకున్న మహీంద్రా ఈ ఏడాది ఎలక్ట్రిక్ గేర్ మారుస్తోంది. రెండు ఈవీ ఎస్‌యూవీలను రోడ్డెక్కించనుంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాటా 2024లో ఏకంగా రెట్టింపై 21 శాతానికి ఎగబాకింది. విండ్సర్తో భారత్ ఈవీ మార్కెట్లో సంచలనానికి తెరతీసింది. గడిచిన 3 నెలల్లో 10 వేలకు పైగా విక్రయాలతో అదరగొట్టింది. బ్యాటరీ రెంటల్ సర్వీస్ (బీఏఏఎస్)ను అందించడం వల్ల కారు ధర కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లయింది. హ్యుందాయ్ వెన్యూ, కియా కారెన్ ్స ఈవీలు కూడా క్యూలో ఉన్నాయి. అన్ని కంపెనీలూ ఎలక్ట్రిక్ బాట పడుతుండటంతో టాటా మోటార్స్ వాటా గతేడాది 62%కి (2023లో 73%) తగ్గింది. అయితే, సియరా, సఫారీ, హ్యారియర్ ఎస్యూవీ ఈవీలతో మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.టెస్లా వచ్చేస్తోంది... భారత్‌లో ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ కింగ్ టెస్లా ఈ ఏడాది ముహూర్తం ఖారారు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం, ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దిగుమతి సుంకం విషయంలో త్వరలోనే భారత్ సర్కారుతో సయోధ్య కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు పట్టుబడుతుండగా.. ముందుగా దిగుమతి రూట్లో వచ్చేందుకు మస్క్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బెంగళూరు ఆర్‌ఓసీలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో కంపెనీ రిజిస్టర్ కూడా చేసుకుంది. పలు నగరాల్లో రిటైల్ షోరూమ్స్ ఏర్పాటు కోసం కంపెనీ లొకేషన్లను అన్వేషిస్తోంది. తొలుత కొన్ని మోడళ్లను (మోడల్ ఎస్, మోడల్ 3) పూర్తిగా దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది. వీటి ప్రారంభ రూ. 70 లక్షలు ఉంటుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) మార్కెట్లో 'ఈక్యూఎస్ 450' (EQS 450) లాంచ్ చేసింది. దీని ధర ఇప్పటికే అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈక్యూఎస్ కంటే తక్కువ. ఇది 5 సీటర్ మోడల్.. కేవలం సింగిల్ మోటార్ సెటప్‌తో వస్తుంది. ఈ కారు డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.రూ. 1.28 కోట్ల ధర వద్ద లాంచ్ అయిన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ కారు రేంజ్ కూడా దాని 580 మోడల్ కంటే 11 కిమీ కంటే ఎక్కువ. రేంజ్ కొంత ఎక్కువ ఉంది కాబట్టి మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు.. ముందు బంపర్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిలో కొన్ని చిన్న మార్పులు చూడవచ్చు. ఇంటీరియర్ కూడా కొంత అప్డేట్స్ పొందుతుంది. ఇందులో MBUX హైపర్‌స్క్రీన్ చూడవచ్చు. లోపల గమనించాల్సిన అతిపెద్ద మార్పు మూడో వరుస సీట్లు లేకపోవడం. అయితే రెండవ వరుస సీట్లు పవర్ అడ్జస్టబుల్గా కొనసాగుతాయి. ఎక్కువ సౌలభ్యం కోసం స్లైడ్ అండ్ రిక్లైన్ రెండూ చేయవచ్చు.ఈ కొత్త లగ్జరీ కారులో 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ వెంట్స్, 4 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు, పుడ్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డ్‌లతో పాటు లెవల్ 2 ఏడీఏఎస్, తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైనవి ఉన్నాయి.బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు వెనుక యాక్సిల్‌పై సింగిల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది 355 Bhp పవర్, 800 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 6.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేహవంతం అవుతుంది. ఇందులోని 122 కిలోవాట్ బ్యాటరీ.. సింగిల్ ఛార్జీతో 671 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు 200 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 31 నిమిషాల సమయం పడుతుంది. అయితే 22 కేడబ్ల్యు వాల్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6.25 గంటలు. ఈ కారు డెలివరీలు కూడా ఫిబ్రవరిలోనే జరుగుతాయి.ఇండియన్ మార్కెట్లో బెంజ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగానే మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేసింది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువ. ఇది ఒక సింగిల్ చార్జితో 473 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. -
'క్రెటా ఈవీ' రేంజ్ ఎంతో తెలిసిపోయింది: సింగిల్ ఛార్జ్‌తో..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్' (Hyundai Motor) దేశీయ మార్కెట్లో 'క్రెటా' (Creta) కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనిని కంపెనీ త్వరలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరించనుంది. కాగా అంతకంటే ముందే సంస్థ దీని రేంజ్ వివరాలను వెల్లడించింది.మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త 'హ్యుందాయ్ క్రెటా ఈవీ' (Hyundai Creta EV) 51.4 కిలోవాట్, 42 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందనుంది. 51.4 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ ఛార్జితో 473 కిమీ రేంజ్ అందించగా.. 42 కిలోవాట్ బ్యాటరీ 390 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.హ్యుందాయ్ క్రెటా ఈవీ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మారుతి సుజుకి ఈ విటారా, మహీంద్రా బిఈ 6, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కారు ధర ఎంత వుంటుందనేది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ.22 లక్షలు ఉండొచ్చని అంచనా.చూడటానికి కొంత స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. హ్యుందాయ్ క్రెటా ఈవీ అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. బ్రాండ్ లోగో వద్ద ఛార్జింగ్ పోర్ట్, కొత్త సైడ్ ప్రొఫైల్, అప్డేటెడ్ రియర్ ఎండ్ వంటివన్నీ ఇందులో గమనించవచ్చు. మొత్తం మీద ఇది మార్కెట్లో దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. -
అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!
భారతీయ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మరో విలాసవంతమైన ఎలక్ట్రిక్ కారును (Electric Car) కొనుగోలు చేశారు. ఇది అంబానీ బ్యారేజిలో చేరిన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) బ్రాండ్ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్. దీని ధర రూ. 7.5 కోట్లు (ఎక్స్ షోరూమ్).అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు పేరు 'స్పెక్టర్' (Spectre). ఈ కారుకు MH 0001 అనే వీఐపీ నెంబర్ ప్లేట్ ఉంది. ఈ నెంబర్ ప్లేట్ కోసం కూడా వారు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఎంత వెచ్చించారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు కస్టమైజ్డ్ అని తెలుస్తోంది. కాబట్టి దీని ధర ఎక్స్ షోరూమ్ ధర కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ కారు 102 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఒక సింగిల్ ఛార్జితో ఏకంగా 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఇదీ చదవండి: ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!స్పెక్టర్ అనేది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇప్పటికే మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', కేరళకు చెందిన ఒక బిల్డర్ కూడా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.రోల్స్ రాయిస్ స్పెక్టర్ (Rolls Royce Spectre)రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన స్పెక్టర్ కారు ధర రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. కాబట్టి దీనిని సామాన్య ప్రజలు కొనుగోలు చేయడం కష్టం. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ కారును 10మంది కంటే తక్కువే.. దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారాం. అయితే ఈ కారు చూడటానికి మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!అంబానీ గ్యారేజిలోని కార్లు (Mukesh Ambani Car Collection)భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గ్యారేజిలో.. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్660 గార్డ్, మాట్ బ్లాక్ బీఎండబ్ల్యూ 760ఎల్ఐ, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, టెస్లా మోడల్ ఎస్ 100డీ, రోల్స్ రాయిస్ కల్లినన్, మెర్సిడెస్ మేబ్యాక్ 62, ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్, ఆస్టన్ మార్టిన్ రాపిడ్, లంబోర్ఘిని ఉరుస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ఆర్మర్డ్ బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ, బెంట్లీ బెంటయ్గా, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ మొదలైనవి ఉన్నాయి. మొత్తం మీద అంబానీ గ్యారేజిలో సుమారు 170 కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హ్యుందాయ్ కారు ఇదే
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai).. దేశీయ మార్కెట్లో లాంచ్ చేసిన 'ఐయోనిక్ 5' (IONIQ 5) ఎలక్ట్రిక్ కారు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.హ్యుందాయ్ ఐయోనిక్ 5 కారు అత్యంత ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కిన ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించడంతో.. గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ కారు లేహ్ లడఖ్‌లోని ఉమ్లింగ్ లా నుంచి సముద్ర మట్టానికి 5799 మీ (19,024 అడుగులు) ఎత్తులో కేరళలోని కుట్టనాడ్ వరకు ప్రయాణించింది.మొత్తం 14 రోజులు 4900 కిమీ కంటే ఎక్కువ దూరం.. విభిన్న రహదారుల్లో, పలు వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ ఐయోనిక్ 5 విజయవంతంగా గమ్యాన్ని చేరుకుంది. ఈవో ఇండియా టీమ్ ఈ డ్రైవ్‌ను చేపట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హ్యుందాయ్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న సందర్భంగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'అన్సూ కిమ్' (Unsoo Kim) మాట్లాడుతూ, ఐయోనిక్ 5 పర్ఫామెన్స్.. ఇంజినీరింగ్ నైపుణ్యం వంటివి తిరుగులేనివి. కంపెనీ విజయానికి, కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం అని అన్నారు.Hyundai IONIQ 5 takes part in GUINNESS WORLD RECORDS™ Title for the Greatest Altitude Change by an Electric Car ▶ https://t.co/KeB82JGXOX@GWR #Hyundai #IONIQ5 #EV #GUINNESSWORLDRECORDS pic.twitter.com/G2kzjNjVr2— Hyundai Motor Group (@HMGnewsroom) December 26, 2024హ్యుందాయ్ ఐయోనిక్ 5హ్యుందాయ్ ఐయోనిక్ 5 అనేది ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (E-GMP)పై తయారైంది. స్మార్ట్ మొబిలిటీ అనుభవాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం నిర్దేశించింది.ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా స్మార్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. దీని ధర రూ. 52.92 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
ఈకార్లతో.. ఫ్రీగా తిరిగేయొచ్చు
శిలాజ ఇంధనాల వాడకాన్ని నియంత్రించి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయినా వాటివినియోగం ఆశించినంతగా పెరగడం లేదు. అసలే వాటి ధరలు అధికం, అయినా కొనేద్దామనుకున్నా.. ఒకేసారి ఎక్కువ దూరం వెళ్లలేం, పైగాగంటలకు గంటలు చార్జింగ్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ త్వరలోనే పరిస్థితి మారిపోతుందని.. అసలు చార్జింగ్ అవసరం లేకుండానే వేల కిలోమీటర్లు తిరగొచ్చని మెర్సిడెస్–బెంజ్ కంపెనీ ప్రకటించింది. ఇందుకోసంవినూత్నమైన ‘సోలార్ పెయింట్’ను అభివృద్ధి చేసినట్టు తెలిపింది.దానంతట అదేచార్జింగ్ అవుతూ...సోలార్ ప్యానల్స్ తరహాలో సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్‌గా మార్చే ఈ ‘ఫొటో వోల్టాయిక్ పెయింట్’ను నానో పార్టికల్స్‌తో రూపొందించినట్టు మెర్సిడెస్–బెంజ్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. వాహనంపై వెలుగు పడినంత సేపూ చార్జింగ్ అవుతూనే ఉంటుందని... ఇలా ఏడాదిలో సుమారు 12 వేల కిలోమీటర్ల దూరం తిరిగేందుకు సరిపడా చార్జింగ్ లభిస్తుందని తెలిపారు. వాహనంపై మొదట సోలార్ కోటింగ్ వేసి, దానిపైన ప్రత్యేకమైన రంగుల కోటింగ్ వేస్తారని... దీనివల్ల ఇప్పుడున్న వాహనాల్లానే కనిపిస్తాయని వివరించారు.మన దేశంలో అయితే మరింత లాభంఎక్కువగా ఎండ పడే ప్రాంతాల్లోఈ సోలార్ పెయింట్‌తో రూపొందించిన కార్లు వేగంగా, ఎక్కువగాచార్జింగ్ అవుతాయని కంపెనీప్రతినిధులు తెలిపారు. అంటే భారత్ సహా దక్షిణాసియా దేశాలు, ఆఫ్రికా, అరేబియన్ దేశాల్లో ఈ ‘సోలార్ పెయింట్’కార్లతో మరింత ప్రయోజనంఉండనుంది. ఈటెక్నాలజీని కార్లు మాత్రమేకాదు బస్సుల వంటి ఇతర వాహనాల్లోనూ వాడవచ్చు. అయితే ఈ టెక్నాలజీకి అయ్యే ఖర్చుతక్కువేనని మెర్సిడెస్–బెంజ్ ప్రతినిధులు పేర్కొన్నా... అది ఎంతనేదిగానీ, దీనిని ఎప్పటికి మార్కెట్లోకి తీసుకువస్తారన్నదీ వెల్లడించలేదు.పెయింట్‌తో ఎలా చార్జింగ్ అవుతుంది? వాహనాల బాడీపై ఈ సోలార్ పెయింట్ కోటింగ్ వేస్తారు. అందులోనే అతి సన్నని ఎలక్ట్రోడ్లు కూడా ఉంటాయి. అవన్నీ ఒకదానికొకటి కలసి కారులోని బ్యాటరీ వ్యవస్థకు అనుసంధానం అవుతాయి. సోలార్ పెయింట్ సూర్యరశి్మని గ్రహించి ఈ ఎలక్ట్రోడ్ల ద్వారా విద్యుత్‌గా మార్చి బ్యాటరీకి పంపుతుంది. దీనితో కారుపై వెలుతురు పడినంత సేపూ (అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు) బ్యాటరీ చార్జింగ్ అవుతూనే ఉంటుంది. ఇక ప్రత్యేకంగా చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ దూరం ప్రయాణించి, బ్యాటరీ ఖాళీ అయిపోయి, వెంటనే మళ్లీ ప్రయాణం చేయాల్సి వస్తేనే చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. నిత్యం తక్కువ దూరాలకు వెళ్లేవారు అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదని మెర్సిడెస్–బెంజ్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. సాక్షి సెంట్రల్‌డెస్క్ -
2025 ఆటో ఎక్స్‌పోలో ‘ఈ–విటారా’
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది (2025) జరగబోయే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తమ తొలి ఎలక్ట్రిక్ కారు ఈ–విటారాను ప్రదర్శించే ప్రణాళికల్లో ఉంది. ఇటీవలే దీన్ని ఇటలీలో ఆవిష్కరించింది. వాహన రంగంలో దశాబ్దాల అనుభవంతో అధునాతన ఎలక్ట్రిక్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని రూపొందించినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. మరోవైపు, సమగ్రమైన ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మారుతీ సుజుకీ డీలర్íÙప్లు, సరీ్వస్ టచ్ పాయింట్లలో ఫాస్ట్ చార్జర్ల నెట్వర్క్, హోమ్ చార్జింగ్ సొల్యూషన్స్ మొదలైనవి వీటిలో ఉంటాయని వివరించారు. సరైన చార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్ద అవరోధంగా ఉంటోందని బెనర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈవీలను మ రింత అదుబాటులోకి తెచ్చేందు కు, విస్తృత స్థాయిలో కస్టమర్లకు ఆకర్షణీయంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. -
2025లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే (ఫోటోలు)
-
కోర్టు మెట్లెక్కిన ఇండిగో: మహీంద్రా ఎలక్ట్రిక్‌పై దావా
దేశీయ వాహన తయారీ దిగ్గజం ఇటీవల 'బీఈ 6ఈ' ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. మహీంద్రా కంపెనీ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.మంగళవారం ఈ కేసు జస్టిస్ 'అమిత్ బన్సల్' ముందుకు వచ్చింది. అయితే ఈయన ఈ కేసు నుంచి తప్పకున్నారు. కాబట్టి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా పడింది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఇండిగోతో సామరస్య పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్‌లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది.నిజానికి మహీంద్రా ఎలక్ట్రిక్ నవంబర్ 25న 'బీఈ 6ఈ' నమోదు కోసం దరఖాస్తును చేసుకుంది. దీనిని రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్‌మార్క్ అంగీకరించింది. ద్విచక్ర వాహనాలను మినహాయించి, ఫోర్ వీలర్ వాహనాలకు '6E' హోదాను ఉపయోగించడానికి హక్కులను కంపెనీ సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు ఇండోగో అభ్యంతరం చెబుతోంది. దీనిపై తీర్పు త్వరలోనే వెల్లడవుతుంది. -
మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే: ధరలు ఎలా ఉన్నాయంటే..
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఒకటి 'బీఈ 6ఈ', మరొకటి 'ఎక్స్ఈవీ 9ఈ'. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ.18.90 లక్షలు, రూ.21.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కార్లను 2025 మార్చిలో డెలివరీ చేయనున్నట్లు సమాచారం.మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు చూడటానికి కొంత భిన్నమైన డిజైన్ పొందుతాయి. ఎందుకంటే ఈ రెండూ INGLO ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా తయారైన వాహనాలు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి. కాబట్టి మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి.XEV 9e ఒక స్పోర్టి కూపే డిజైన్ పొందుతుంది. త్రిభుజాకార ఎల్ఈడీ హెడ్లైట్లు, విస్తృతమైన ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కూపే స్టైల్ రూఫ్‌లైన్ వంటివి ఇందులో చూడవచ్చు. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌ల మధ్యలో.. ప్రకాశవంతమైన మహీంద్రా లోగో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారులో 12.3 ఇంచెస్ డిస్ప్లేలతో కూడిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్ప్లే, లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు.. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, 16 స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.BE 6e షార్ప్ క్యారెక్టర్ లైన్లు, హుడ్ స్కూప్‌తో కూడిన పాయింటెడ్ హుడ్, సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, స్ట్రీమ్లైన్డ్ బంపర్‌ను కలిగి ఉంది. ఈ కారు ఏరోడైనమిక్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్.. ఇల్యూమినేటెడ్ బీఈ లోగో వంటివి దీనిని కొత్తగా చూపిస్తాయి. ఇందులో ట్విన్-స్క్రీన్ ర్యాప్‌రౌండ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో కూడా 16 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ రెండూ.. 59 కిలోవాట్, 79 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. 59 kWh బ్యాటరీ 450 నుంచి 500 కిమీ రేంజ్.. 79 kWh బ్యాటరీ 650 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇవి రెండూ ఏసీ ఛార్జర్‌కు మాత్రమే కాకుండా డీసీ ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తాయి. -
స్మార్ట్‌ఫోన్ కంపెనీ కారు.. లక్ష మంది కొనేశారు
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'షియోమీ' (Xioami) గత ఏడాది ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ డిసెంబర్ 2024లో ఎస్‌యూ7 (SU7) పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. షియోమీ లాంచ్ చేసిన ఈ కారును ఇప్పటికి లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..షియోమీ ఎస్‌యూ7 మార్కెట్లో అడుగు పెట్టి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, అప్పుడే లక్ష యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది అంటే.. చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎస్‌యూ7 కారు లక్ష యూనిట్ల సేల్స్ పొందిన విషయాన్ని కంపెనీ ఫౌండర్ & సీఈఓ 'లీ జున్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేశారు. ఈ ఏడాది చివరి నాటికి షియోమీ ఎస్‌యూ7 మొత్తం 1.30 లక్షల సేల్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.షియోమీ ఎస్‌యూ7షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్ అనే మూడు వెర్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.25.18 లక్షలు, రూ. 28.67 లక్షలు, రూ. 34.97 లక్షలు. ఇవి మూడు చూడటానికి చాలా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువమంది వీటిని ఇష్టపడి కొనుగోలు చేశారు. కంపెనీ కూడా తన కస్టమర్లకు డెలివరీలను వేగంగా చేయడానికి.. ఉత్పత్తిని కూడా వేగవంతం చేసింది.ఇదీ చదవండి: ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..ఆరు కలర్ ఆప్షన్లలో లభించే షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు 5.28 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ/గం కాగా.. ఇది 400 న్యూటన్ మీటర్ టార్క్, 299 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జీతో గరిష్టంగా 800కిమీ రేంజ్ అందిస్తుంది.The 100,000th Xiaomi SU7 has found its owner! She chose Radiant Purple and shared, "I’ve always been a Xiaomi Fan and picked the Pro for its smart driving and range." pic.twitter.com/c8G8GrVzwO— Lei Jun (@leijun) November 18, 2024 -
టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్ ప్లాంటులో తయారీ
న్యూఢిల్లీ: పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టయోటా మోటార్ కార్పొరేషన్‌కు సుజుకీ మోటార్ కార్పొరేషన్ సరఫరా చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు తమ సహకారాన్ని మరింత విస్తరింపజేశాయి. ఈ మోడల్‌ను 2025 ప్రారంభంలో గుజరాత్ ప్లాంటులో తయారు చేయనున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.మారుతీ సుజుకీ ఇండియా వచ్చే ఏడాది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ మోడల్ కోసం తీసుకున్న బీఈవీ యూనిట్, ప్లాట్‌ఫామ్‌లను సుజుకీ, టయోటాతోపాటు డైహట్సు మోటార్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.‘ప్రపంచవ్యాప్తంగా టయోటాకు మా మొదటి బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) సరఫరా చేస్తాం. ఈ విధంగా రెండు కంపెనీల మధ్య సహకారం మరింతగా కొనసాగినందుకు చాలా సంతోషంగా ఉంది. పోటీదారులుగా కొనసాగుతూనే ఇరు కంపెనీలు విభిన్న మార్గాల ద్వారా కార్బన్–న్యూట్రల్ సొసైటీని సాకారం చేయడంతో సహా సామాజిక సమస్యలను పరిష్కరించడంలో మరింత సహకరించుకుంటాయి’’ అని సుజుకీ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ తెలిపారు.ఇదీ చదవండి: టీవీఎస్ రికార్డ్.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!ఉత్పత్తులను ఇచ్చిపుచ్చుకోవడం, తయారీ కేంద్రాల వినియోగానికై భాగస్వామ్యం కోసం టయోటా మోటార్ కార్పొరేషన్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2017లో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మారుతీ సుజుకీలో... సుజుకీ కార్పొరేషన్‌కు దాదాపు 58 శాతం వాటా ఉంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదే..
భారతీయ మార్కెట్లో అమ్మకాల పరంగా అగ్రగామిగా ఉన్న 'మారుతి సుజుకి' ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ టయోటాతో కలిసి 'ఈవీఎక్స్' పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది.టయోటా కిర్లోస్కర్ మోటార్, మారుతి సుజుకి ఇండియా రెండూ కలిసి మొదటి ఎలక్ట్రిక్ కారును 2025లో ఈవీఎక్స్ కారును లాంచ్ చేయనున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును గుజరాత్‌లోని తయారీ కర్మాగారంలో ఉత్పత్తి చేయనుంది.మారుతి సుజుకి తయారీ కర్మాగారం.. గుజరాత్ హన్సల్పూర్లో ఉంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7,50,000 యూనిట్లు. ప్రస్తుతం ఇక్కడ బాలెనో, స్విఫ్ట్, డిజైర్, ఫ్రాంక్స్ వంటి మోడల్‌లు తయారవుతున్నాయి. ఈ కార్లను సంస్థ దేశీయ విఫణిలో మాత్రమే కాకుండా.. విదేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.ఇదీ చదవండి: ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలుమారుతి సుజుకి లాంచ్ చేయనున్న కొత్త ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 500 కిమీ నుంచి 550 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈవీఎక్స్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందనున్నట్లు సమాచారం. లాంచ్‌కు సిద్దమవుతున్న మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. -
ఎలక్ట్రిక్ వాహనాలు.. ఎన్నెన్నో అనుమానాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర వాసుల్లో విద్యుత్ వాహనాలపై అనేక అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా విద్యుత్ వాహనాల వినియోగం విరివిగా పెరిగింది. దీనికితోడు ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా ఓ కారణం అయితే, మెయింటెనెన్స్ కూడా మరో కారణంగా పలువురు వినియోగదారులు చెబుతున్నారు.అయితే ధరల విషయంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని, సామాన్యులకు అందుబాటులో లేవని పలువురి వాదనలు వినిపిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశంలో అనేక కంపెనీలు ఈవీ వాహనాలను తయారు చేస్తున్నాయి. వీటిలో కొన్ని బ్రాండెడ్ కాగా మరికొన్ని హైబ్రిడ్ వెహికల్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే విద్యుత్ వాహనాల గురించి సమాచారం తెలుసుకునే వారికి పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.కంపెనీల వారీగా వాహనాల ధర, ఒక సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించవచ్చు. మన్నిక, లేటెస్ట్ ఫీచర్స్, ఇతర అంశాలపై ఆన్లైన్లో శోధించడం పరిపాటిగా మారింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకుని, అన్నింటినీ సరిపోల్చుకున్నాకే నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే విద్యుత్తు మోటారు సైకిల్ వరకూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నా, కార్లు, ఆటో రిక్షాల విషయంలో వినియోగదారుల మన్ననలు పొందలేకపోతున్నాయి.ఛార్జింగ్ స్టేషన్ల కొరత.. ప్రధానంగా విద్యుత్ వాహనాల కొనుగోలుకు వెనుకాడటానికి నగరంలో సరైన ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడమే అనే వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా నగర పరిధి దాటి బయటకు వెళ్లాలనుకుంటే మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాలకు ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లను విద్యుత్ ఛార్జింగ్ విషయంలో కనిపించడం లేదు. దీంతో లోకల్లో తిరగడానికి మాత్రమే విద్యుత్ వాహనాలు ఉపయోగపడతాయనే వాదన బలంగా వినిపిస్తోంది. నగరంలో విద్యుత్ వాహనాల అమ్మకాల సంఖ్య సైతం దీన్నే సూచిస్తోంది. టూవీలర్ కొనుగోలుకు సై.. ఇప్పటి వరకూ సుమారు 1.20 లక్షల విద్యుత్ మోటారు సైకిళ్లు మార్కెట్లో అమ్మకాలు జరగగా, కార్లు, ఆటో రిక్షా, ఇతర వాహనాలన్నీ కలపి సుమారు 16 వేలు అమ్ముడయ్యాయి. సాధారణంగా మోటారు సైకిళ్లు 70 శాతం ఉంటే, ఇతర వాహనాలు 30 శాతం ఉంటాయి. విద్యుత్తు వాహనాల విషయంలో ఇతర వాహనాల సంఖ్య 15 శాతం కంటే తక్కువ ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వం మరిన్ని ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తే ఈవీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.లాంగ్‌డ్రైవ్ వెళ్లాలంటే ఇబ్బంది హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలనుకుంటే బస్సు, ట్రైన్ నమ్ముకుంటే సమయానికి చేరుకోలేము. డ్యూటీ అయ్యాక రాత్రి బయలుదేరితే ఉదయం విశాఖ చేరుకునేట్లు ప్లాన్ చేసుకుంటాం. విద్యుత్ కారులో పోవాలంటే ఛార్జింగ్ సరిపోదు. ప్రతి 300 కిలో మీటర్లకు ఒక దఫా ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. ఒక వేళ ఎక్కడైనా ఛార్జింగ్ పెడదాం అంటే సుమారు 6 గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ లైఫ్ 8 ఏళ్లు అన్నారు. ఆ తరువాత కారు విలువలో సుమారు 40 శాతం బ్యాటరీ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే పెట్రోల్ కారు తీసుకున్నాను. – వై.రాజేష్, కేపీహెచ్‌బీ నెలకు రూ.3 వేల ఖర్చు తగ్గిందిరెండేళ్ల క్రితం ఈవీ మోటారు సైకిల్ కొన్నాను. ప్రతి 5 వేల కిలో మీటర్లకు సర్వీసింగ్ చేయించాలి. ఫుల్ ఛార్జింగ్ చేశాక ఎకానమీ మోడ్‌లో వెళితే 105 కిలో మీటర్లు వస్తుంది. స్పోర్ట్స్ మోడ్‌లో వెళితే 80 కిలో మీటర్లు వస్తుంది. పెట్రోల్ స్కూటీకి నెలకు రూ.3,500 పెట్రోల్ అయ్యేది. ఈవీ కొన్నాక నెల కరెంటు బిల్లు రూ.500 నుంచి రూ.700కి పెరిగింది. అదనంగా రూ.200 పెరిగినా పెట్రోల్ రూ.3,500 వరకూ తగ్గింది. – గాదిరాజు రామకృష్ణంరాజు, హైటెక్ సిటీ -
ఓ బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ పండుగ సీజన్లో సరసమైన ధరలో ఓ మంచి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని కొందరు ఆలోచించవచ్చు. అలాంటి వారు ఏ కారు కొనాలి? దాని ధర ఎంత ఉంటుందనే సమాచారం కోసం వెతికే అవకాశం ఉంది. ఇలాంటి వారి సందేహాలకు సమాధానమే ఈ కథనం..ఎంజీ విండ్సర్ ఈవీఇటీవల భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'ఎంజీ విండ్సర్' పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.13.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ కారును బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులోని 38 కిలోవాట్ బ్యాటరీ 332 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది.ఎంజీ కామెట్ ఈవీప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరసమైన ఎలక్ట్రిక్ కారు ఈ ఎంజీ కామెట్ ఈవీ. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.99 లక్షలు. అయితే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద, రూ. 4.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. పరిమాణంలో చిన్నదిగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు 17.3 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 230 కిమీ రేంజ్ అందిస్తుంది.టాటా టియాగో ఈవీటాటా కంపెనీకి చెందిన టియాగో ఈవీ నాలుగు వేరియంట్లు, రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటితో పాటు.. ప్రీమియం అనుభవం కోసం హర్మాన్ సౌండ్ సిస్టమ్‌తో కూడిన టెక్-ఫార్వర్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా పొందుతుంది.టాటా పంచ్ ఈవీదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న టాటా పంచ్ ఈవీ కూడా పండుగ సీజన్లో కొనుగోలు చేయదగిన బెస్ట్ ఎలక్ట్రిక్ కారు. ఇది ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు 25 కిలోవాట్, 35 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇవి వరుసగా 265 కిమీ మరియు 365 కిమీ రేంజ్ అందిస్తాయి. దీని ధరలు రూ. 9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.ఇదీ చదవండి: మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..సిట్రోయెన్ ఈసీ3ఫ్రెంచ్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ ఈసీ3 ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 11.61 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జితో 320 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 10.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. -
కదిలి వచ్చిన రోబోల దండు..!
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా సీఈఓ ఇలొన్‌మస్క్ గతంలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన ‘వి రోబోట్’ ఈవెంట్లో కృత్రిమమేధ సాయంతో పనిచేసే ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌లతోపాటు ఆప్టిమస్ రోబోలను పరిచయం చేశారు.టెస్లా సీఈఓ ఇలొన్ మస్క్ గతంలో ఏజీఎంలో చెప్పిన విధంగానే కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఏఐలో విప్లవాత్మక మార్పు రాబోతుందని, భవిష్యత్తు అంతా ఏఐదేనని మస్క్ చెప్పారు. అందుకు అనుగుణంగా కంపెనీ ఏఐ ఉత్పత్తులను తయారు చేస్తుందని తెలిపారు. తాజాగా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌లతోపాటు రోబోల దండును పరిచయం చేశారు.pic.twitter.com/VK9vlGF0Ms— Elon Musk (@elonmusk) October 11, 2024ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లాభవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని గతంలో మస్క్ చెప్పారు. కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందన్నారు. హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు. తయారీ రంగంతోపాటు రోజువారీ జీవితంలో రోబోలు పాత్ర కీలకంగా మారనుందని తెలిపారు. ఆప్టిమస్ రోబో ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. టెస్లా ఏటా ఆప్టిమస్ ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల (రూ.83లక్షల కోట్లు) లాభాన్ని ఆర్జించగలదని గతంలో మస్క్ అంచనా వేశారు. -
‘ఈవీ’లు... టైంబాంబులు!
“టిక్.. టిక్.. టిక్..” అంటూ నిశ్శబ్దంగా ఆడుతున్న టైంబాంబులు అవి! ఆదమరిస్తే ఏ క్షణమైనా అంటుకోవచ్చు. కన్ను మూసి తెరిచేంతలో ఉవ్వెత్తున మంటలు చెలరేగవచ్చు. విధ్వంసం సృష్టించవచ్చు. ప్రాణాలు తీయవచ్చు. ఆస్తినష్టం కలిగించవచ్చు. ఇంతకీ ఏమిటవి అంటారా? కాలుష్యం కలిగించకుండా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయని మనం ఎంతో గొప్పగా చెబుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ). అమెరికాలో తాజాగా విరుచుకుపడుతున్న హరికేన్ ‘మిల్టన్’ మరో ఉపద్రవాన్ని మోసుకొస్తోంది. ఈవీలు, హైబ్రిడ్ వాహనాలు వంటి రీఛార్జి బ్యాటరీ ఆధారిత ఇంధనాన్ని వాడే వస్తువాహనాలతో ప్రస్తుతం అమెరికన్లకు ముప్పు పొంచివుంది.ఇదంతా వాటిలోని లిథియం-అయాన్ బ్యాటరీలతోనే. ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా రీఛార్జి బ్యాటరీల శక్తితో పనిచేసే స్కూటర్లు, బైకులు, హోవర్ బోర్డులు, వీల్ ఛైర్లు, లాన్ మూవర్స్, గోల్ఫ్ కార్లు, బొమ్మలతోనూ ఇకపై అప్రమత్తంగా మెలగక తప్పదు. హరికేన్ ‘మిల్టన్’ ఉప్పునీటి వరద ముంపు బారినపడిన ఈవీలను అగ్నికీలలు చుట్టుముట్టే అవకాశముంది. హరికేన్ల ప్రభావంతో 15 అడుగుల లోతుతో ఉప్పునీటి వరద నీరు చేరుకునే తీరప్రాంతాలు అమెరికాలో చాలా ఉన్నాయి.కొద్ది రోజుల క్రితం హరికేన్ ‘హెలెన్’ వచ్చిపోయాక అమెరికాలో పలు చోట్ల లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల కారణంగా 48 ఎలక్ట్రిక్ వస్తువాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఫ్లోరిడాలోని ఓ ఇంటి గ్యారేజీలో నిలిపివుంచిన టెస్లా కారు ఇటీవలి ‘హెలెన్’ ప్రభావపు ఉప్పునీటి ముంపు కారణంగా మంటల్లో ఆహుతి కావటంతో ఆ ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. గతంలో 2022లో సంభవించిన హరికేన్ ‘ఇయాన్’ సందర్భంగానూ అమెరికాలో పలు ఈవీలు అగ్నికి ఆహుతయ్యాయి.తొలుత వేడి... తర్వాత మంటలు! ఈవీల్లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లోపల సెల్స్, జ్వలించే స్వభావం గల విద్యుద్వాహక ద్రావణి ఉంటాయి. ఉప్పునీరు విద్యుద్వాహకం. ఈ-బైకులతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాల్లో వెయ్యి రెట్లు ఎక్కువగా సెల్స్ (చిన్న ఘటాలు) ఉంటాయి. ఎక్కువ సెల్స్ ఉండే హై ఎనర్జీ బ్యాటరీలు విఫలమయ్యే అవకాశాలు మరింత అధికం. సాధారణ వర్షపు నీటితో లేదా నదుల మంచినీటితో తలెత్తే ముంపుతో ఈవీలకు పెద్దగా నష్టం ఉండదు. కానీ ఎక్కువ కాలం... అంటే కొన్ని గంటలు లేదా ఒకట్రెండు రోజులపాటు ఉప్పునీటిలో వాహనాలు మునిగితే మాత్రం ఉప్పు వల్ల ఈవీ ‘బ్యాటరీ ప్యాక్’ దెబ్బతింటుంది.ఉప్పునీటికి ‘తినివేసే’ (కరోజన్) లక్షణం ఉంది. బ్యాటరీ లోపలికి ఉప్పునీరు చేరాక విద్యుద్ఘటాల్లోని ధనాత్మక, రుణాత్మక టెర్మినల్స్ మధ్య కరెంటు ప్రవహించి షార్ట్ సర్క్యూట్లు సంభవిస్తాయి. ఫలితంగా వేడి పుడుతుంది. విద్యుద్ఘటాలను వేరు చేసే ప్లాస్టిక్ లైనింగ్ ఈ వేడికి కరిగిపోతుంది. దాంతో వేడి ఓ శృంఖల చర్యలాగా (థర్మల్ రన్ అవే) ఒక విద్యుద్ఘటం నుంచి మరో విద్యుద్ఘటానికి ప్రసరించి మరిన్ని షార్ట్ సర్క్యూట్లతో విపరీతంగా వేడిని పుట్టిస్తుంది. అలా చివరికి అగ్గి రాజుకుని వాహనాలు బుగ్గి అవుతాయి.ఎత్తైన ప్రదేశాలకు తరలించాలి హరికేన్లు తీరం దాటడానికి మునుపే ప్రజలు అప్రమత్తమై తమ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవీలు తుపాన్ల ఉప్పునీటిలో తడవకుండా, వరద ముంపులో నానకుండా వాటిని ఎత్తైన, సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా పార్క్ చేయాలి. ఇంటికి కనీసం 50 అడుగుల దూరం అవతల వాటిని పార్క్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. తుపాన్లు/హరికేన్లు దాటిపోయాక రీ-స్టార్ట్ చేయడానికి ముందు బ్యాటరీ వాహనాలను ఖాళీ ప్రదేశాలకు తరలించాలి.వాటిని మెకానిక్ సాయంతో అన్ని రకాలుగా పరీక్షించాకే పునర్వినియోగంలోకి తేవాలి. వరద నీటిలో మునిగిన వాహనాలను పరీక్షించకుండా నేరుగా కరెంటు ప్లగ్గులో వైరు పెట్టి వాటిని రీఛార్జి చేయడానికి ఉపక్రమించరాదు. ఆ వాహనాలను ఇళ్లలోనే ఉంచి రీ-స్టార్ట్ చేస్తే లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి, మంటలు అంటుకుని గృహాలు సైతం అగ్నిప్రమాదాల బారినపడవచ్చు. హరికేన్ ‘మిల్టన్’ నేపథ్యంలో ఈవీల వినియోగదారులకు పలు హెచ్చరికలు చేస్తూ ఫ్లోరిడా ఫైర్ మార్షల్ జిమ్మీ పాట్రోనిస్ ఓ ప్రకటన విడుదల చేశారు.- జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The New York Times, The Washington Post, CBS News, Business Insider) -
హైదరాబాద్‌కు తొలి సీయూవీ ఎంజీ విండ్సర్
హైదరాబాద్: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఆవిష్కరించిన భారతదేశపు మొదటి ఇంటెలిజెంట్ సీయూవీ విండ్సర్ ఈవీ హైదరాబాద్‌లో విడుదలైంది. టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ ఈ సరికొత్త వాహనాన్ని ప్రారంభించారు. దీని ప్రారంభ ధర రూ.13,49,800 (ఎక్స్-షోరూమ్).సెడాన్ సౌలభ్యాన్ని, ఎస్యూవీ విస్తీర్ణాన్ని సమ్మిళితం చేసి దీన్ని రూపొందించారు. ఫ్యూచరిస్టిక్ ఏరోడైనమిక్ డిజైన్, విశాలమైన లగ్జరీ ఇంటీరియర్స్, అధునాతన భద్రత వ్యవస్థ, స్మార్ట్ కనెక్టివిటీ, సౌకర్యవంతమైన డ్రైవింగ్ తదితర హైటెక్ ఫీచర్లతో ఈ సీయూవీ మోడల్ రూపొందింది. స్టార్బర్స్ట్ బ్లాక్, పెరల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ అనే 4 రంగుల్లో అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌కు హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్లుఎంజీ విండ్సర్ ఎక్సైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13,49,800, ఎక్స్‌క్లూజివ్ రూ. 14,49,800, ఎసెన్స్ రూ. 15,49,800లుగా కంపెనీ పేర్కొంది. విండ్సర్ 38 kWh Li-ion బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది IP67 సర్టిఫికెట్ పొందింది. నాలుగు (ఎకో ప్లస్+, ఎకో, నార్మల్, స్పోర్ట్) డ్రైవింగ్ మోడ్లతో 100KW (136ps) పవర్, 200Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒకే ఛార్జ్‌పై 332 కి.మీ. రేంజ్ (ARAI) అందిస్తుంది. ఈ వాహనానికి బుకింగ్స్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. -
తక్కువ ధర.. ఎక్కువ రేంజ్: ఇదిగో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు
మార్కెట్లో ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అయినా.. తక్కువ ధర, ఎక్కువ రేంజ్ అందించే వాహనాలనే ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం..ప్రస్తుతం దేశీయ విఫణిలో 15 లక్షల రూపాయలకంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా నెక్సాన్ ఈవీ, సిట్రోయెన్ ఈసీ3, టాటా టియాగో ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ వంటివి ఉన్నాయి.టాటా నెక్సాన్ ఈవీ: భారతదేశంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా నెక్సాన్ ఈవీ రూ. 15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 12.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఒక ఫుల్ ఛార్జీతో 325 కిమీ నుంచి 465 కిమీ మధ్య రేంజ్ అందిస్తుంది.ఎంజీ విండ్సర్ ఈవీ: ఇటీవల ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన విండ్సర్ ఎలక్ట్రిక్ ప్రారంభ ధర రూ. 10.05 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో 331 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది.సిట్రోయెన్ ఈసీ3: ఫ్రెంచ్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన ఈసీ3 ధర రూ. 12.70 లక్షల నుంచి రూ. 13.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జీతో గరిష్టంగా 320 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.టాటా టిగోర్ ఈవీ: టాటా మోటార్స్ కంపెనీకి చెందిన టియాగో ఈవీ.. ప్రస్తుతం మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 13.75 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్ 315 కిమీ.టాటా పంచ్ ఈవీ: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్న టాటా పంచ్ ఈవీ ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జీతో 315 కిమీ నుంచి 421 కిమీ మధ్య రేంజ్ అందిస్తుంది.టాటా టియాగో ఈవీ: రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.49 లక్షల మధ్య లభించే టాటా టియాగో ఈవీ.. ఇండియన్ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందిన సరసమైన ఎలక్ట్రిక్ కారు. సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు 250 కిమీ నుంచి 315 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!ఎంజీ కామెట్ ఈవీ: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత సరసమైన కారు ఈ ఎంజీ కామెట్ ఈవీ. దీని ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే. సింపుల్ డిజైన్ కలిగి, మూడు డోర్స్.. నలుగురు ప్రయాణానికి అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ కారు 230 కిమీ రేంజ్ అందిస్తుంది.రేంజ్ (పరిధి) అనేది ఎంచుకునే బ్యాటరీ ప్యాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంచుకునే బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. వాహన కొనుగోలు దారులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
న్యూ లాంచ్: ఎలక్ట్రిక్ యుటిలిటీ కారు ఎంజీ విండ్సర్
గురుగ్రామ్: ఆటోమొబైల్స్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా ’ఎంజీ విండ్సర్’ పేరిట ఎలక్ట్రిక్ యుటిలిటీ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 9.9 లక్షలు కాగా కి.మీ.కు రూ. 3.5 చొప్పున బ్యాటరీ అద్దె ఉంటుంది. ఇందుకోసం బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్ (బీఏఏఎస్)ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.ఒకసారి చార్జ్ చేస్తే దీని రేంజ్ 331 కిలోమీటర్లు ఉంటుంది. ఏదైనా డీసీ ఫాస్ట్ చార్జర్‌తో విండ్సర్ను 40 నిమిషాల్లో చార్జ్ చేయొచ్చు. ఎంజీ ఈ–హబ్ ద్వారా ఏడాది పాటు ఉచితంగా పబ్లిక్ చార్జింగ్ సదుపాయాన్ని పొందవచ్చని సంస్థ తెలిపింది. బుకింగ్స్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.ఎంజీ మోటార్ ఇండియాలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి వాహనం విండ్సర్. తాము న్యూ ఎనర్జీ వెహికల్ (ఎన్ఈవీ) విభాగంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ డైరెక్టర్ పార్థ్ జిందాల్ తెలిపారు. ప్రతి 4–6 నెలల వ్యవధిలో ఒక కొత్త కారును ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. -
ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
ఆటోమొబైల్ రంగం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఎలక్ట్రిక్ కార్ల హవా జోరుగా సాగుతోంది. 1888లో జర్మన్ ఆండ్రియాస్ ఫ్లాకెన్ 'ఫ్లాకెన్ ఎలెక్ట్రోవాగన్' రూపొందించారు. ఆ తరువాత 1890లో ఆండ్రూ మారిసన్ మొదటి ఎలక్ట్రిక్ కారును యునైటెడ్ స్టేట్స్కు పరిచయం చేశారు. ఆ తరువాత ఈ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో కొన్ని కంపెనీలు నిమగ్నమై ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఎక్కువ రేంజ్ అందించే కార్లను లాంచ్ చేశాయి.ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో కొన్ని సింగిల్ చార్జితో ఏకంగా 1000 కిమీ రేంజ్ అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ జాబితాలో టెస్లా, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు ఉన్నాయి. ఆ తరువాత జాబితాలో పోర్స్చే, హ్యుందాయ్ మొదలైన కంపెనీలు ఉన్నాయి.ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు👉టెస్లా రోడ్‌స్టర్: 1000కిమీ👉విషన్ ఈక్యూఎక్స్ఎక్స్: 1000 కిమీ👉లుసిడ్ ఎయిర్: 830 కిమీ👉మెర్సిడెస్ ఈక్యూఎస్: 727 కిమీ👉కియా ఈవీ6: 708 కిమీ👉ఫోక్స్‌వ్యాగన్ ఐడీ: 703 కిమీ👉పోర్స్చే టైకాన్: 677 కిమీ👉పోలెస్టర్ 2: 653 కిమీ👉పోర్స్చే మకాన్ ఎలక్ట్రిక్: 640 కిమీ👉ఆడి క్యూ6 ఈ ట్రాన్: 637 కిమీ👉టెస్లా మోడల్ ఎస్: 634 కిమీ👉హ్యుందాయ్ ఐయోనిక్ 5: 631👉బీవైడీ సీల్: 630 కిమీ👉టెస్లా మోడల్ 3: 627 కిమీ👉హ్యుందాయ్ ఐయోనిక్ 6: 580 -
World EV Day 2024: దేశంలో రయ్ మంటున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫోటోలు)
-
ఈవీ రంగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా ఎలక్ట్రిక్ కార్లు (ఈవీ), బ్యాటరీల తయారీ విభాగంలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికలకు సంబంధించి వ్యయాలపరంగా సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేసేందుకు చైనా దిగ్గజం బీవైడీ ఇండియా మాజీ హెడ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను కన్సల్టెంటుగా నియమించుకున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇన్ఫ్రా ప్రాథమికంగా ఏటా 2,50,000 ఈవీలతో మొదలుపెట్టి 7,50,000 వాహనాలకు ఉత్పత్తిని పెంచుకోవాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే 10 గిగావాట్ అవర్స్ (జీడబ్లూహెచ్) సామర్థ్యంతో బ్యాటరీల తయారీ ప్లాంటు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు వివరించాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రిలయన్స్ ఇన్ఫ్రా జూన్‌లోనే వాహన రంగానికి సంబంధించి కొత్తగా రెండు అనుబంధ సంస్థలను ప్రారంభించింది. రిలయన్స్ ఈవీ ప్రైవేట్ లిమిటెడ్ వీటిలో ఒకటి. అధిక రుణభారం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కంపెనీ ఈ కొత్త ఈవీ ప్రాజెక్టులకు నిధులెలా సమకూర్చుకుంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
బంపర్ డిస్కౌంట్.. ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ.2 లక్షల తగ్గింపు!
ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నవారికి ఇది నిజంగా భారీ శుభవార్త. ప్రముఖ దేశీయ కార్ మేకర్ టాటా మోటర్స్ '2 మిలియన్ ఎస్యూవీ వేడుక'లో భాగంగా తమ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని పలు వాహనాలపై బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. పాపులర్ టాటా నెక్సాన్ ఈవీపై గరిష్టంగా రూ. 2.05 లక్షల వరకూ తగ్గింపు అందిస్తోంది.ఈ సెప్టెంబర్ నెలలో టాటా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి భారీగా డబ్బు ఆదా కానుంది. టాటా మోటర్స్ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), పంచ్ ఈవీ (Punch EV), టియాగో ఈవీ (Tiago EV)లపై గ్రీన్ బోనస్‌లో భాగంగా క్యాష్ డిస్కౌంట్లు అందిస్తోంది. 2023 మోడల్లను ఎంచుకునే వారికి అదనపు తగ్గింపు లభిస్తుంది.టాటా నెక్సాన్ ఈవీపై భారీ డిస్కౌంట్టాప్ స్పెక్స్ ఉండే టాటా నెక్సాన్ ఈవీ ఎంపవర్డ్+ లాంగ్ రేంజ్ వేరియంట్లపై ఈ నెలలో రూ. 1.80 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది టాటా మోటర్స్. రూ. 20,000 తగ్గింపుతో లభించే ఎంట్రీ-లెవల్ క్రియేటివ్ + ఎంఆర్ వేరియంట్ తప్ప మిగిలిన అన్ని వేరియంట్లు రూ. 1 లక్ష నుండి రూ. 1.2 లక్షల వరకూ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.2023లో తయారైన అన్ని మోడల్‌లపై అయితే రూ. 25,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. కంపెనీ పేర్కొన్నదాని ప్రకారం.. 30kWh వేరియంట్ 275 కి.మీ, 40.5kWh యూనిట్ 390 కి.మీ. రేంజ్ ఇస్తాయి.ఇతర ఈవీలపైనా..ఇక టాటా మోటర్స్ డిస్కౌంట్ అందిస్తున్న ఇతర ఈవీలలో టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ ఉన్నాయి. వీటిలో టాటా టియాగో ఈవీలపై గరిష్టంగా రూ.65,000, అలాగే టాటా పంచ్ ఈవీలపై రూ.30,000 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. -
సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసింది
మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారతీయ మార్కెట్లో కొత్త 'మేబ్యాచ్ ఈక్యూఎస్' ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ.2.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). 'లోటస్ ఎలెట్రే' ఎలక్ట్రిక్ కారు తరువాత అత్యంత ఖరీదైన కారుగా మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ నిలిచింది.కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారు.. బ్లాక్ గ్రిల్ ప్యానెల్ పొందుతుంది. బానెట్ మీద బ్రాండ్ లోగో, డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. హెడ్ లైట్, టెయిల్ లైట్ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ఉన్నాయి. 11.6 ఇంచెస్ ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే కలిగిన బెంజ్ ఈక్యూఎస్.. ముందు సీట్ల వెనుక భాగంలో కూడా 11.6 ఇంచెస్ డిస్ప్లే కూడా ఉంది. కప్ హోల్డర్లు, నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్స్, కూలింగ్ కంపార్ట్మెంట్స్ మొదలైనవన్నీ ఇందులో చూడవచ్చు.మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ 680 ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ పొందుతుంది. ఇది 658 హార్స్ పవర్, 950 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ. ఇది ఒక ఫుల్ చార్జితో 611 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంటమెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ కారులోని 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ కారు 20 నిమిషాల చార్జితో 300 కిమీ ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జ్ చేసుకుంటుంది. ఈ కారుకు ప్రస్తుతం దేశీయ విఫణిలో ప్రధాన ప్రత్యర్థులు లేదు.