హైదరాబాద్‌కు తొలి సీయూవీ ఎంజీ విండ్సర్‌ | MG Windsor Launched in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు తొలి సీయూవీ ఎంజీ విండ్సర్‌

Published Thu, Sep 26 2024 1:54 PM | Last Updated on Thu, Sep 26 2024 2:09 PM

MG Windsor Launched in Hyderabad

హైదరాబాద్‌: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఆవిష్కరించిన భారతదేశపు మొదటి ఇంటెలిజెంట్ సీయూవీ విండ్సర్‌ ఈవీ హైదరాబాద్‌లో విడుదలైంది. టేబుల్ టెన్నిస్ స్టార్‌ నైనా జైస్వాల్ ఈ సరికొత్త వాహనాన్ని ప్రారంభించారు. దీని ప్రారంభ ధర రూ.13,49,800 (ఎక్స్-షోరూమ్).

సెడాన్ సౌలభ్యాన్ని, ఎస్‌యూవీ విస్తీర్ణాన్ని సమ్మిళితం చేసి దీన్ని రూపొందించారు. ఫ్యూచరిస్టిక్ ఏరోడైనమిక్ డిజైన్, విశాలమైన లగ్జరీ ఇంటీరియర్స్, అధునాతన భద్రత వ్యవస్థ, స్మార్ట్ కనెక్టివిటీ, సౌకర్యవంతమైన డ్రైవింగ్ తదితర హైటెక్ ఫీచర్లతో ఈ సీయూవీ మోడల్‌ రూపొందింది. స్టార్‌బర్స్ట్ బ్లాక్, పెరల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్‌ అనే 4 రంగుల్లో అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: హైదరాబాద్‌కు హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌లు

ఎంజీ విండ్సర్ ఎక్సైట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13,49,800, ఎక్స్‌క్లూజివ్‌ రూ. 14,49,800, ఎసెన్స్‌ రూ. 15,49,800లుగా కంపెనీ పేర్కొంది. విండ్సర్‌ 38 kWh Li-ion బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది IP67 సర్టిఫికెట్ పొందింది. నాలుగు (ఎకో ప్లస్‌+, ఎకో, నార్మల్‌, స్పోర్ట్‌) డ్రైవింగ్ మోడ్‌లతో 100KW (136ps) పవర్, 200Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఒకే ఛార్జ్‌పై 332 కి.మీ. రేంజ్‌ (ARAI) అందిస్తుంది. ఈ వాహనానికి బుకింగ్స్‌ అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement