ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టాటా కర్వ్ (Tata Curvv) ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ (EV)తో పాటు పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఐసీఈ వెర్షన్‌ను కూడా అధికారికంగా విడుదల చేసింది.
టాటా కర్వ్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. 45 kWh ప్యాక్ 502 కిమీ రేంజ్, 55 kWh ప్యాక్ 585 కిమీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. వాస్తవ పరిస్థితులలోకి వచ్చేసరికి ఇవి వరుసగా 350 కిమీ, 425 కిమీల వరకు రేంజ్‌ని అందిస్తాయని అంచనా. టాటా కర్వ్ ఈవీ 45 (Tata Curvv EV 45) ధర రూ. 17.49 లక్షల నుంచి రూ. 19.29 లక్షల మధ్య ఉండగా, కర్వ్ ఈవీ 55 (Curvv EV 55) ధర రూ. 19.25 లక్షల నుంచి రూ. 21.99 లక్షల మధ్య ఉంది.
ఇది 1.2C ఛార్జింగ్ రేట్‌తో వచ్చింది. అంటే కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కిమీ రేంజ్‌ని అందిస్తుంది. అదనంగా, Curvv EV వెహికల్-టు-లోడ్, వెహికల్-టు-వెహికల్ ఫంక్షన్ రెండింటినీ కలిగి ఉంటుంది. ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, పాదచారులను అప్రమత్తం చేసే అకౌస్టిక్ అలర్ట్ వంటివి ఉన్నాయి. దీంతోపాటు లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కూడా ఉంది.
ఇక టాటా కర్వ్ ఐసీఈ (Curvv ICE) మూడు ఇంజన్ ఆప్షన్లు అందిస్తుంది. రెండు పెట్రోల్‌తో నడిచేవి కాగా ఒకటి డీజిల్‌తో నడిచేది. పెట్రోల్ వేరియంట్‌లలో 225 Nm టార్క్‌ను అందించే 125 hp కొత్త హైపెరియన్ GDi ఇంజన్ ఇచ్చారు. డీజిల్ ఇంజన్ టాటా లైనప్‌లో మొదటిసారిగా డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. ఈవీ, ఐసీఈ రెండు వెర్షన్‌లు 18-ఇంచ్ వీల్స్, 190 mm గ్రౌండ్ క్లియరెన్స్, 450 mm వాటర్-వేడింగ్ డెప్త్‌తో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment