New Electric Vehicle Model
-
ఈవీలపై పెరుగుతున్న ఆసక్తి!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వంటి కొత్త ఇంధన వాహనాలపై (ఎన్ఈవీ) క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. 2030 నాటికి వాటికి గణనీయంగా ఆమోదయోగ్యత పెరగనుందని ఒక సర్వే నివేదికలో వెల్లడైంది. అర్బన్ సైన్స్ సంస్థ తరఫున ది హ్యారిస్ పోల్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం అప్పటికి, పెట్రోల్/డీజిల్ వాహనాల ధరతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలపై 49 శాతం వరకు అధికంగా చెల్లించేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటారని తేలింది. సర్వేలో పాల్గొన్న 1,000 మందిలో 83 శాతం మంది ఈ దశాబ్దం ఆఖరునాటికి ఎన్ఈవీని కొనుగోలు చేసే అంశం పరిశీలిస్తామని తెలిపారు. భారత్ సహా అమెరికా, ఆ్రస్టేలియా, చైనా, జర్మనీవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భారత్‌కి సంబంధించిన విశేషాలు చూస్తే.. → ప్రధాన నగరాలు, వర్ధమాన ద్వితీయ శ్రేణి పట్టణాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో పబ్లిక్ ఈవీ చార్జింగ్ నెట్వర్క్ వేగవంతంగా విస్తరిస్తుండటంతో ఎన్ఈవీలపై భారత్‌లో సానుకూల అభిప్రాయం నెలకొంది. ప్రస్తుతం ప్రధాన నగరాలు, హైవేల వెంబడి 6,000 పైచిలుకు చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. 2027 నాటికి ఈ సంఖ్య ఒక లక్షకు పైగా పెరగనుంది. → ఈవీ సెగ్మెంట్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రియాశీలక విధానాలు అమలు చేస్తుండటం కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై సానుకూలతకు దోహదపడుతోంది. → ఈ విభాగంలో చైనా స్థాయిలో భారత్ కూడా అధునాతన టెక్నాలజీ, ఉత్పత్తి సామర్థ్యాలను సాధించాలి. అవకాశాలు భారీగా ఉన్నప్పటికీ, చైనా ఆధిపత్యం కారణంగా భారత్‌లో ఈవీల తయారీకి సవాళ్లు ఉంటున్నాయి. ఈవీలకు కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీలు .. ఎలక్ట్రిక్ మోటర్లను ఉత్పత్తి చేయడంలోనూ, చార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలోనూ చైనా అధిపత్యం కనిపిస్తోంది. ఈ విభాగాల్లో నైపుణ్యాలు సాధించకుండా ముందుకెళ్లడంలో భారత్ కష్టపడాల్సి రావచ్చు. → భారత్‌లో ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో, ఎలక్ట్రిక్ కార్లను మరింత చౌకగా అందరికీ అందుబాటులోకి తేవడంలో చైనా కంపెనీలతో కలిసి పనిచేయడం కీలకంగా ఉండవచ్చు. చైనా అనుభవాల నుంచి నేర్చుకుని, భారత్ మరింత వేగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లవచ్చు. -
హైదరాబాద్‌కు తొలి సీయూవీ ఎంజీ విండ్సర్
హైదరాబాద్: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఆవిష్కరించిన భారతదేశపు మొదటి ఇంటెలిజెంట్ సీయూవీ విండ్సర్ ఈవీ హైదరాబాద్‌లో విడుదలైంది. టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ ఈ సరికొత్త వాహనాన్ని ప్రారంభించారు. దీని ప్రారంభ ధర రూ.13,49,800 (ఎక్స్-షోరూమ్).సెడాన్ సౌలభ్యాన్ని, ఎస్యూవీ విస్తీర్ణాన్ని సమ్మిళితం చేసి దీన్ని రూపొందించారు. ఫ్యూచరిస్టిక్ ఏరోడైనమిక్ డిజైన్, విశాలమైన లగ్జరీ ఇంటీరియర్స్, అధునాతన భద్రత వ్యవస్థ, స్మార్ట్ కనెక్టివిటీ, సౌకర్యవంతమైన డ్రైవింగ్ తదితర హైటెక్ ఫీచర్లతో ఈ సీయూవీ మోడల్ రూపొందింది. స్టార్బర్స్ట్ బ్లాక్, పెరల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ అనే 4 రంగుల్లో అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌కు హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్లుఎంజీ విండ్సర్ ఎక్సైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13,49,800, ఎక్స్‌క్లూజివ్ రూ. 14,49,800, ఎసెన్స్ రూ. 15,49,800లుగా కంపెనీ పేర్కొంది. విండ్సర్ 38 kWh Li-ion బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది IP67 సర్టిఫికెట్ పొందింది. నాలుగు (ఎకో ప్లస్+, ఎకో, నార్మల్, స్పోర్ట్) డ్రైవింగ్ మోడ్లతో 100KW (136ps) పవర్, 200Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒకే ఛార్జ్‌పై 332 కి.మీ. రేంజ్ (ARAI) అందిస్తుంది. ఈ వాహనానికి బుకింగ్స్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. -
15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కిమీ.. కొత్త ఈవీ లాంచ్
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టాటా కర్వ్ (Tata Curvv) ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ (EV)తో పాటు పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఐసీఈ వెర్షన్‌ను కూడా అధికారికంగా విడుదల చేసింది.టాటా కర్వ్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. 45 kWh ప్యాక్ 502 కిమీ రేంజ్, 55 kWh ప్యాక్ 585 కిమీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. వాస్తవ పరిస్థితులలోకి వచ్చేసరికి ఇవి వరుసగా 350 కిమీ, 425 కిమీల వరకు రేంజ్‌ని అందిస్తాయని అంచనా. టాటా కర్వ్ ఈవీ 45 (Tata Curvv EV 45) ధర రూ. 17.49 లక్షల నుంచి రూ. 19.29 లక్షల మధ్య ఉండగా, కర్వ్ ఈవీ 55 (Curvv EV 55) ధర రూ. 19.25 లక్షల నుంచి రూ. 21.99 లక్షల మధ్య ఉంది.ఇది 1.2C ఛార్జింగ్ రేట్‌తో వచ్చింది. అంటే కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కిమీ రేంజ్‌ని అందిస్తుంది. అదనంగా, Curvv EV వెహికల్-టు-లోడ్, వెహికల్-టు-వెహికల్ ఫంక్షన్ రెండింటినీ కలిగి ఉంటుంది. ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, పాదచారులను అప్రమత్తం చేసే అకౌస్టిక్ అలర్ట్ వంటివి ఉన్నాయి. దీంతోపాటు లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కూడా ఉంది.ఇక టాటా కర్వ్ ఐసీఈ (Curvv ICE) మూడు ఇంజన్ ఆప్షన్లు అందిస్తుంది. రెండు పెట్రోల్‌తో నడిచేవి కాగా ఒకటి డీజిల్‌తో నడిచేది. పెట్రోల్ వేరియంట్లలో 225 Nm టార్క్‌ను అందించే 125 hp కొత్త హైపెరియన్ GDi ఇంజన్ ఇచ్చారు. డీజిల్ ఇంజన్ టాటా లైనప్‌లో మొదటిసారిగా డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. ఈవీ, ఐసీఈ రెండు వెర్షన్లు 18-ఇంచ్ వీల్స్, 190 mm గ్రౌండ్ క్లియరెన్స్, 450 mm వాటర్-వేడింగ్ డెప్త్‌తో ఉన్నాయి. -
Electric Scooter: బైక్ లాంటి స్కూటర్ భలే ఉందే.. లాంచ్ చేస్తున్న టీవీఎస్
భారత్‌కు చెందిన మల్టీ నేషనల్ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ (TVS) తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) టీవీఎస్ క్రియాన్ (TVS Creon)ను దుబాయ్‌లో లాంచ్ చేస్తోంది. 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన టీవీఎస్ క్రియాన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించినట్లుగా చెబుతున్న ఈ ఈ-స్కూటర్‌కు సంబంధించిన టీజర్ తాజాగా విడులైంది. తాజా టీజర్లో స్కూటర్‌పై 'Xonic' అనే పదం రాసి ఉన్న క్లోజప్ కనిపిస్తోంది. ఈ టీజర్లో స్పీడోమీటర్ క్లైంబింగ్‌ను కూడా చూపించారు. గరిష్టంగా గంటకు 105 కి.మీ వేగం ఉంటుందని, పూర్తి ఛార్జ్‌తో 100 కి.మీ రేంజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్కూటర్ స్పెసిఫికేషన్లు, ధర, డిజైన్, ఫీచర్లు (అంచనా) కంపెనీ ఇప్పటివరకు స్పెసిఫికేషన్లు, రేంజ్, ఇతర సాంకేతిక వివరాల గురించి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కొత్త టీవీఎస్ మోడల్ కొన్ని ప్రత్యేక ఫీచర్లతో వస్తుందని, ఐక్యూబ్ (iQube) కంటే ఎక్కువ పనితీరు ఉంటుందని భావిస్తున్నారు. హెడ్‌లైట్ కన్సోల్‌గా పనిచేసే నాలుగు ఎల్ఈడీ ల్యాంప్‌లను కలిగి ఉన్న ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో పాటు స్కూటర్ పూర్తి టీఎఫ్టీ స్క్రీన్‌తో వస్తుంది. ఈ-స్కూటర్లో బ్లూటూత్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండవచ్చు. ఈ స్కూటర్ స్మార్ట్‌వాచ్-కనెక్ట్ కంట్రోల్‌లను కలిగి ఉంటుందని కూడా టీజర్ సూచించింది. వెనుక భాగంలో ఉన్న సొగసైన ఎల్ఈడీ ఇండికేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్‌తో పోలిస్తే కొత్త స్కూటర్ ప్రీమియం ధరలో ఉండవచ్చు. టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్ (Ather 450X), ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)తో పోటీపడనుంది. -
ఒకినామా ఎలక్ట్రిక్ స్కూటర్లు
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను 71,990 రూపాయల (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్ బ్లాక్, గ్లాసీ స్పార్కిల్ బ్లాక్‌అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్నుతీసుకొచ్చామని ఒకినావా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒకినావా ప్రైజ్‌ప్రో ఎకానమీ, స్పోర్ట్స్, టర్బో అనే మూడు మోడళ్లలో వినియోగదారులకు లభ్యంకానుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 90-110కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడంలో గణనీయమైన ప్రగతిని సాధించామని ఓకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎండీ జితేందర్ శర్మ వెల్లడించారు. భారతీయ వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి, ఎక్కువమంది వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పెట్రోల్ స్కూటర్ కంటే సమర్థవంతమైన ఉత్పత్తులను పరిచయం చేయాలనుకుంటోందన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీలు బ్యాటరీ ఛార్జింగ్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాయని తెలిపారు. ఆఫీసులకు వెళ్లేవారికి, కుటుంబాలకు సంబంధించిన రోజువారీ ప్రయాణ అవసరాలను ఈ ప్రొడక్ట్ తీరుస్తుందన్నారు. అలాగే ఈ వాహనాలపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గించిన కారణంగా ఇది అత్యంత చౌకైన స్కూటర్ అని శర్మ తెలిపారు. ప్రైజ్‌ప్రో స్కూటర్ కీలక స్పెసిఫికేషన్స్ 1000-వాట్ల బీఎల్డీసీ వాటర్‌ప్రూఫ్ ఎలక్ట్రిక్ మోటారు ఇది 2.0 కిలోవాట్ డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. గరిష్ట శక్తి 2500 వాట్స్ 2 నుండి 3 గంటల్లో పూర్తి ఛార్జింగ్ స్పోర్ట్స్ మోడ్‌లో 90 కిమీ / ఛార్జ్ ఎకో మోడ్‌లో 110 కిమీ / ఛార్జ్ బ్యాటరీ వారెంటీ: 3 సంవత్సరాలు లేదా 20000 కి.మీ (ఏది ముందు అయితే అది) ఫైనాన్సింగ్ పార్టనర్లు: మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎకో మోడ్ 30-35 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుండగా, స్పోర్ట్స్ మోడ్‌లో 50-60 కిలోమీటర్ల వేగాన్ని, టర్బో అత్యధిక టాప్ స్పీడ్‌తో 65-70 కిలోమీటర్లు అందిస్తుంది. ఇంకా సెంట్రల్ లాకింగ్ విత్ యాంటీ-తెఫ్ట్ అలారం, కీలెస్ ఎంట్రీ, ఫైండ్ మై స్కూటర్ ఫంక్షన్, మొబైల్ ఛార్జింగ్ యుఎస్బీ పోర్ట్ , మోటర్ వాకింగ్ అసిస్ట్ విత్ ఫ్రంట్ అండ్ రివర్స్ మోషన్, రోడ్డుసైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వంటి కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను ఇందులో జోడించింది. ఒకినావా ప్రైజ్ప్రోలో 150 కిలోల లోడింగ్ సామర్థ్యం ఉంది. -
ఇక ప్రతీ ఏడాదికి ఓ ఆడి ఎలక్ట్రిక్ కారు
జర్మన్ ఆటోమొబైల్ తయారీసంస్థ ఆడీ, కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ మోడల్ ను ప్రతిఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. 2018 నుంచి ఈ ప్లాన్ ను అమలుచేయాలని భావిస్తోంది. టెస్లాకు, లగ్జరీ కార్ల మార్కెట్ ల్లో ఉన్నఇతర కంపెనీలకు పోటీగా ఈ కార్లను ప్రవేశపెట్టాలని ఆడీ నిర్ణయించింది. ఈ కొత్త ప్రయత్నం ఆడీ ఈ-క్రోన్ క్వాట్రో కాన్సెప్ట్ తో రూపొందే అన్నీ ఎలక్ట్రిక్ లగ్జరీ క్లాస్ ఎస్‌యూవీలపై చేపట్టనుంది. గురువారం జరిగిన కారు తయారీదార్ల వార్షిక సమావేశంలో ఆడీ సీఈవో రాబర్ట్ స్టాడ్లర్ ఈ విషయాన్ని తెలిపారు. మొదట లార్జ్ సిరీస్ ఎలక్ట్రిక్ కారు తయారీని 2018లో చేపడతామని వెల్లడించారు. ఆ ఏడాది నుంచి ప్రతి ఏడాది ఎలక్ట్రిక్ మోడల్ కారును మార్కెట్లోకి ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆడీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను మార్కెట్లోకి చూపించుకోవడానికి కాదని, అధిక వాల్యుమ్ విభాగాలు క్యూలైన్ క్రాస్ ఓవర్స్, వాగన్స్, ఎస్‌యూవీలను మార్కెట్లోకి ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది. గ్యాస్, డీజిల్ వెహికిల్స్ తో పాటు ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికిల్స్ పై ఆడీ మొదటి నుంచి దృష్టిపెట్టింది. తన పేరెంట్ కంపెనీ ఫోక్స్ వాగన్ డీజిల్ కర్బన ఉద్గారాల ఎక్కువగా ఉపయోగించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతేడాది నుంచి ఆడీ ఎలక్ట్రిక్ కార్లపై ఎక్కువ దృష్టిసారిస్తోంది.