ఈవీలపై పెరుగుతున్న ఆసక్తి! | Acceptability of new energy vehicles set to rise by end of decade says Harris Poll | Sakshi
Sakshi News home page

ఈవీలపై పెరుగుతున్న ఆసక్తి!

Published Sun, Sep 29 2024 4:34 AM | Last Updated on Sun, Sep 29 2024 4:34 AM

Acceptability of new energy vehicles set to rise by end of decade says Harris Poll

2030 నాటికి గణనీయంగా ఆమోదయోగ్యత ∙సర్వేలో వెల్లడి 

న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వంటి కొత్త ఇంధన వాహనాలపై (ఎన్‌ఈవీ) క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. 2030 నాటికి వాటికి గణనీయంగా ఆమోదయోగ్యత పెరగనుందని ఒక సర్వే నివేదికలో వెల్లడైంది. అర్బన్‌ సైన్స్‌ సంస్థ తరఫున ది హ్యారిస్‌ పోల్‌ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం అప్పటికి, పెట్రోల్‌/డీజిల్‌ వాహనాల ధరతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ వాహనాలపై 49 శాతం వరకు అధికంగా చెల్లించేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటారని తేలింది. సర్వేలో పాల్గొన్న 1,000 మందిలో 83 శాతం మంది ఈ దశాబ్దం ఆఖరునాటికి ఎన్‌ఈవీని కొనుగోలు చేసే అంశం పరిశీలిస్తామని తెలిపారు. భారత్‌ సహా అమెరికా, ఆ్రస్టేలియా, చైనా, జర్మనీవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భారత్‌కి సంబంధించిన విశేషాలు చూస్తే.. 

→ ప్రధాన నగరాలు, వర్ధమాన ద్వితీయ శ్రేణి పట్టణాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ నెట్‌వర్క్‌ వేగవంతంగా విస్తరిస్తుండటంతో ఎన్‌ఈవీలపై భారత్‌లో సానుకూల అభిప్రాయం నెలకొంది. ప్రస్తుతం ప్రధాన నగరాలు, హైవేల వెంబడి 6,000 పైచిలుకు చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. 2027 నాటికి ఈ సంఖ్య ఒక లక్షకు పైగా పెరగనుంది.  
    
→ ఈవీ సెగ్మెంట్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రియాశీలక విధానాలు అమలు చేస్తుండటం కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలపై సానుకూలతకు దోహదపడుతోంది. 
→ ఈ విభాగంలో చైనా స్థాయిలో భారత్‌ కూడా అధునాతన టెక్నాలజీ, ఉత్పత్తి సామర్థ్యాలను సాధించాలి. అవకాశాలు భారీగా ఉన్నప్పటికీ, చైనా ఆధిపత్యం కారణంగా భారత్‌లో ఈవీల తయారీకి సవాళ్లు ఉంటున్నాయి. ఈవీలకు కీలకమైన లిథియం అయాన్‌ బ్యాటరీలు .. ఎలక్ట్రిక్‌ మోటర్లను ఉత్పత్తి చేయడంలోనూ, చార్జింగ్‌ మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలోనూ చైనా అధిపత్యం కనిపిస్తోంది. ఈ విభాగాల్లో నైపుణ్యాలు సాధించకుండా ముందుకెళ్లడంలో భారత్‌ కష్టపడాల్సి రావచ్చు. 
→ భారత్‌లో ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో, ఎలక్ట్రిక్‌ కార్లను మరింత చౌకగా అందరికీ అందుబాటులోకి తేవడంలో చైనా కంపెనీలతో కలిసి పనిచేయడం కీలకంగా ఉండవచ్చు. చైనా అనుభవాల నుంచి నేర్చుకుని, భారత్‌ మరింత వేగంగా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వైపు మళ్లవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement