Survey Report
-
ప్రపంచ సేంద్రియ సాగు పైపైకి!
రసాయన అవశేషాల్లేని సేంద్రియ ఆహారోత్పత్తుల సాగు, వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ఏటేటా విస్తరిస్తోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 188 దేశాల్లో 9.89 కోట్ల హెక్టార్లకు సేంద్రియ సాగు విస్తరించింది. 2022తో పోల్చితే 2023లో సేంద్రియ / ప్రకృతి సాగు విస్తీర్ణం 2.6 శాతం (25 లక్షల హెక్టార్లు) పెరిగింది. జర్మనీలోని నరెంబర్గ్లో జరుగుతున్న అంతర్జాతీయ సేంద్రియ ఆహారోత్పత్తుల వాణిజ్య ప్రదర్శనలో మంగళవారం విడుదలైన ‘ద వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2025’ వార్షిక సర్వే నివేదిక ఈ తాజా గణాంకాలను వెలువరించింది. స్విట్జర్లాండ్ సేంద్రియ పరిశోధనా సంస్థ (ఎఫ్ఐబీఎల్), ఐఫోమ్–ఆర్గానిక్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ సర్వే నివేదికను వెలువరించాయి. – సాక్షి సాగుబడి, హైదరాబాద్అత్యధిక రైతులు మన వాళ్లే..ప్రపంచవ్యాప్తంగా 43 లక్షల మంది రైతులు సేంద్రియ సాగు చేస్తుండగా, 24 లక్షల మంది సర్టిఫైడ్ సేంద్రియ రైతులు మన దేశంలోనే ఉన్నారు. ఉగాండా (4.04 లక్షలు), ఇథియోపియా (1.21 లక్షలు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా, విస్తీర్ణం పరంగా చూస్తే 5.3 కోట్ల హెక్టార్లలో సర్టిఫైడ్ సేంద్రియ సేద్యంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. 4.5 లక్షల హెక్టార్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం సాగు భూమిలోని 2.1 శాతంలో సర్టిఫైడ్ సేంద్రియ సేద్యం జరుగుతోంది.వినియోగంలో ఫస్ట్ అమెరికా2023లో ప్రపంచ సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారం 136 బిలియన్ యూరోల (రూ.12,17,920 కోట్ల)కు పెరిగింది. 59 బిలియన్ యూరోల వాటాతో అమెరికా అతిపెద్ద సేంద్రియ మార్కెట్‌గా నిలిచింది. జర్మనీ, చైనా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సేంద్రియ ఆహారం కొనుగోలుపై స్విట్జర్లాండ్ వాసులు అత్యధికంగా డబ్బు వెచ్చిస్తున్నారని ఈ సర్వే తెలిపింది. అనేక ఏళ్లుగా ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ స్థిరంగా పెరుగుతుండటం విశేషం. మున్ముందు కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
మంత్రులు వేస్ట్..కాదుకాదు పాలన వేస్ట్
సాక్షి, అమరావతి: ఆరునెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేయించుకున్న సర్వేలోనూ అదే విషయం వెల్లడికావడం అధికార పార్టీ వర్గాలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. పాలనను ప్రతిబింబించే మంత్రుల పనితీరు మీద సర్కారు ఇటీవల సర్వే చేయించి వారికి ర్యాంకింగ్ ఇచ్చింది. ఇదే విషయాన్ని సీఎం స్వయంగా కేబినెట్ సమావేశంలో మంత్రులకు వెల్లడించారు. తాజాగా.. మంత్రుల పనితీరు మీద ర్యాంకులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వ పెద్దలు లీక్ చేశారు. కేవలం ఆరుగురు మంత్రుల పనితీరు మాత్రమే సంతృప్తికంగా ఉందని, మిగతా 18 మంది ర్యాంకులు ఆధ్వానంగా ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. సహజంగా.. ప్రభుత్వ పాలన తీరుకు మంత్రివర్గం పనితీరును గీటురాయిగా తీసుకుంటారు. మంత్రివర్గంలో 75 శాతం మంది సభ్యుల తీరు ఏమాత్రం బాగోలేదని, సర్వేలో ర్యాంకులు అధ్వానంగా రావడం మంచి పరిణామం కాదని అధికార పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ర్యాంకులు మరీ అధ్వానంగా ఉన్న మంత్రుల జాబితాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, సీఎం కుమారుడు లోకేశ్ కూడా ఉండటం గమనార్హం. ప్రభుత్వానికి అన్నీ తామై వ్యవహరిస్తున్న ఈ ఇద్దరి పనితీరు, ప్రభుత్వ పనితీరును వేరుచేసి చూడలేమని, ప్రభుత్వం చేయించిన సర్వేలో తేలిన విషయమే ప్రజల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న తీరును ప్రజలు గుర్తించారు. ప్రజాసంక్షేమం దిశగా ప్రభుత్వం ఏమీచేయలేక చేతులెత్తేసిన విధానమే మంత్రుల పనితీరు మీద ప్రతిబింబించిందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించకుండా, ‘అధ్వాన్న పనితీరు’ పేరిట తమను నిందించడంలో అర్థంలేదని మంత్రులు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్న విషయం అధికార పార్టీ వర్గాలకు తెలుసు. పైపెచ్చు.. లోకేశ్ అన్ని మంత్రిత్వ శాఖల్లో జోక్యం చేసుకుంటే తాము చేయడానికి ఏముంటుందని.. తమ చేతులు కట్టేసి తాము అసమర్థులమని సర్వేల్లో తేల్చి ర్యాంకింగ్ ఇవ్వడం ఏమిటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. సర్వే చేశామని చెప్పి, ర్యాంకులంటూ లీకులు ఇస్తే ప్రయోజనం ఏమీ ఉండదని.. ప్రభుత్వమే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి హామీలు అమలుచేస్తే ప్రభుత్వ సామర్థ్యం పెరిగిందని ప్రజలు భావిస్తారని, అప్పుడు ప్రజలు అడిగిన పనులు చేశామని తమ పనితీరు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని మంత్రులు చెబుతున్నారు.పవన్ పనితీరుపైనా అసంతృప్తి..డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పనితీరు అంత బాగోలేదని నివేదిక తేల్చడమంటే.. అన్ని శాఖల కంటే అత్యధిక బడ్జెట్ ఉన్న పంచాయతీరాజ్ శాఖను ఇచ్చినా ఆయన అందుకు తగ్గ రీతిలో పనిచేయడంలేదని, అంటే ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందనే అర్థమని పరిశీలకులు చెబుతున్నారు. హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే మంత్రుల ర్యాంకింగ్ అద్దంపడుతోందని, అది కేవలం పవన్‌కళ్యాణ్ ఒక్కడి వ్యక్తిగత సామర్థ్యం తక్కువనే భావన కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు తనయుడు లోకేశ్ నిర్వహిస్తున్న కీలకమైన మానవవనరుల (విద్యా శాఖలు) శాఖలో అన్నీ సమస్యలే ఉండడంతో ఆయన పనితీరుపైనా పెదవి విరుస్తున్నారు. విద్యారంగంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు గండికొట్టడంతో ఆయన పనితీరు మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.పెత్తనం లోకేశ్‌ది.. తిట్లు మాకా!?ఈ ర్యాంకింగ్లపై మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తమ పనితీరు అంచనా వేసిందో తెలీడంలేదని సీనియర్ మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. ప్రభుత్వంలోని అన్ని వ్యవహారాల్లో లోకేశ్ తలదూరుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇక తమకు పనిచేయడానికి అవకాశమెక్కడ ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. తమ శాఖలకు చెందిన కీలక నిర్ణయాలు లోకేశే తీసుకుంటుంటే వాటికి తమను బాధ్యులను చేయడం ఏమిటని ఆందోళన చెందుతున్నారు. చివరికి.. తమ శాఖల కార్యదర్శులు, కమిషనర్లు తమను పట్టించుకోకుండా.. లోకేశ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని వీరు చెబుతున్నారు. అన్ని పనులూ వారే చేసుకుంటూ తమ పనితీరు బాగోలేదని ఎలా చెబుతారని ఈ మంత్రులు మండిపడుతున్నారు. పనిచేసేది ఈ ఆరుగురే..ఇక రాష్ట్ర కేబినెట్లో ఆరుగురు మంత్రులు మాత్రమే బాగా పనిచేస్తున్నట్లు నివేదిక తేల్చింది. అందులో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ ముందున్నారు. చంద్రబాబుకు బాగా దగ్గరగా ఉంటూ రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో ఆయన మనసెరిగి పనిచేస్తుండడంతో నారాయణకు అగ్రతాంబూలం దక్కింది. అలాగే..» విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంఎస్ఎంఈ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా బాగా పనిచేస్తున్నారని మంచి ర్యాంకింగ్ దక్కింది. » కూటమిలో జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున మంత్రిగా ఉన్న సత్యకుమార్ పనితీరు కూడా బాగుందని నివేదిక పేర్కొంది. » కలెక్టర్ల సదస్సు, ఇతర సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మరో మంత్రి లోకేశ్ బాగాపనిచేస్తున్నారంటూ సీఎం పొగుడుతూ ఆకాశానికెత్తేస్తున్న విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వ సర్వే నివేదికలో అందుకు భిన్నమైన ఫలితాలొచ్చాయి. పనితీరులో వీరిద్దరూ వెనుకబడ్డారని నివేదిక తేల్చేయడం గమనార్హం. -
‘‘లంచం.. సత్యం.. నిత్యం.. అనంతం’’!
ప్రజల సంక్షేమం కోసం, పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతీ రూపాయిలో.. చివరకు వాళ్ల దగ్గరకు చేరేది కేవలం 15 పైసలే!. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట.. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన మాట ఇది. ఈ మాట ఇవాళ్టికీ ఎన్నికల టైంలలో కొందరు నేతల నోటి వెంట వినాల్సి వస్తోంది. అంటే.. అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదా?.సమాజాన్ని పట్టి పీడించే సమస్యలంటూ అవినీతి, లంచగొండితనం మీద సినిమాలు తీసే దర్శకులు కూడా.. క్లైమాక్స్‌లో వాటికి ఓ సరైన ముగింపు చూపలేకపోతున్నారు. అందుకు కారణం.. జనం అవసరాలు అంతలా ఉండడం. వాటిని ఆసరాగా చేసుకుని కొంతమంది అత్యాశకు పోతున్నారు. వేలు, లక్షల్లో వేతనాలు వస్తున్నా.. చాలదన్నట్లుగా పక్కచూపులు చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే.. ఇలాంటి వాటికి తావులేకుండా.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ(డీబీటీ)లాంటి ఆలోచనలు చాలావరకు ఊరట ఇస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే..👉దేశంలోని మెజార్టీ కంపెనీలు ప్రభుత్వ అధికారులకు ఏదో ఒక దశలో లంచాలు ఇచ్చామని ఒప్పుకున్నాయి. ఇందుకు సంబంధించిన విస్తుపోయే వివరాలు.. ఓ సర్వే ద్వారా వెల్లడయ్యాయి.👉సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ సర్వే ప్రకారం.. గత ఏడాది కాలంలో ఒక్కసారైనా లంచం ఇచ్చామని మనదేశంలో సుమారు 66 శాతం కంపెనీలు తెలిపాయి. బలవంతంగా లంచం ఇవ్వాల్సి వచ్చిందని 54 శాతం బిజినెస్‌లు, పనులు వేగంగా పూర్తి చేసేందుకు లంచం ఇవ్వడానికి వాలంటరీగా ముందుకొచ్చామని 46 శాతం బిజినెస్‌లు ఒప్పుకున్నాయి.👉తూనికలు-కొలతలు, ఔషధాలు, ఆరోగ్యం.. ఈ విభాగాలు అత్యంత అవినీతిమయంగా మారాయి. ఈ విభాగాలకు సంబంధించిన ప్రతీ నాలుగింటిలో ముగ్గురు తప్పనిసరిగా లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఇక.. 👉మొత్తం 159 జిల్లాల్లోని కంపెనీల అభిప్రాయాలను సేకరించి ఈ వివరాలను బయటపెట్టింది. ఈ సర్వే కోసం 18 వేల రెస్పాన్స్‌లను సేకరించింది. ఇంకా ఈ సర్వే రిపోర్ట్‌లో.. ప్రభుత్వ డిపార్ట్మెంట్లతో డీల్ చేస్తున్నప్పుడు పర్మిట్స్ పొందడానికి, సప్లయర్ క్వాలిఫికేషన్, ఫైల్స్, ఆర్డర్స్, పేమెంట్స్ పొందడానికి లంచం ఇచ్చుకోవల్సి వచ్చిందని బిజినెస్‌లు తెలిపాయి. ‘ప్రభుత్వ అనుమతులను వేగంగా పొందాలంటే లంచం ఇవ్వడం తప్పదని చాలా బిజినెస్‌లు పేర్కొన్నాయి. ప్రాసెస్‌లో ఇదొక పార్ట్‌గా మారిందని చెప్పాయి. అథారిటీ లైసెన్స్ డూప్లికేట్ కాపీ కోసం కూడా లంచం ఇచ్చుకోవాల్సి వచ్చిందని, ప్రాపర్టీ సంబంధిత అంశాల్లో లంచం తప్పదని బిజినెస్‌లు పేర్కొన్నాయి. గత ఏడాది కాలంలో వివిధ రూపాల్లో లంచం ఇచ్చుకున్నామని 66 శాతం బిజినెస్‌లు ఒప్పుకున్నాయి. అయితే..159 జిల్లాల్లో వివిధ రంగాలకు చెందిన 9 వేల వ్యాపారాలను ఈ సర్వేలో భాగం చేసింది లోకల్‌సర్కిల్స్. మెట్రో(టైర్1) జిల్లాల నుంచి 42 శాతం, టైర్ 2 జిల్లాల నుంచి 33 శాతం, టైర్-3, టైర్-4 జిల్లాల నుంచి(రూరల్) 25 శాతం పాల్గొన్నారు.ఇందుగలడందులేడనిసందేహము వలదుఎందెందు వెదకి చూచినఅందందు అమ్యామ్యా మూలము గలదు!.. అవినీతిలో భారత్ స్థానం ప్రపంచంలో ఎంతో తెలుసా?లంచం ఇచ్చినవాళ్లలో 47 శాతం.. తాము ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అమ్యామా ముట్టజెప్పామని చెప్పారు. 62 శాతం మంది జీఎస్టీ అధికారులకు లంచాలిచ్చి పనులు చేయించుకున్నామని తెలిపారు. ప్రతీ ఇద్దరిలో ఒక వ్యాపారవేత్త.. కాలుష్యనివారణ, మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ రంగాల్లో అధికారులకు అమ్యామ్యా ఇచ్చామన్నారు. అయితే ఇదే సర్వేలో ఇంకో ఆసక్తికరమై విషయం గమనిస్తే..లంచం ఇవ్వకుండానే పనులు పూర్తి చేసుకోగలిగామని 16 శాతం బిజినెస్‌లు చెప్పాయి. అలాగే లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదని 19 శాతం బిజినెస్‌లు పేర్కొన్నాయి. అవినీతి నిరోధక చట్టం(2018-సవరణ) ప్రకారం.. లంచం తీసుకోవడం మాత్రమే కాదు.. ఇవ్వడమూ నేరమే. అయినా ఇలాంటి సర్వేలు అప్పుడప్పుడు మన దేశంలో లంచగొండితనం ఎంత లోతుల్లో వేళ్లు పాతుకుపోయిందో అనే విషయాన్ని మనకు చెబుతుంటాయి. అవినీతి అవగాహన సూచిక 2023 ప్రకారం.. 180 దేశాల్లో భారత్ 93వ స్థానంలో ఉంది. -
ఈవీలపై పెరుగుతున్న ఆసక్తి!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వంటి కొత్త ఇంధన వాహనాలపై (ఎన్ఈవీ) క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. 2030 నాటికి వాటికి గణనీయంగా ఆమోదయోగ్యత పెరగనుందని ఒక సర్వే నివేదికలో వెల్లడైంది. అర్బన్ సైన్స్ సంస్థ తరఫున ది హ్యారిస్ పోల్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం అప్పటికి, పెట్రోల్/డీజిల్ వాహనాల ధరతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలపై 49 శాతం వరకు అధికంగా చెల్లించేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటారని తేలింది. సర్వేలో పాల్గొన్న 1,000 మందిలో 83 శాతం మంది ఈ దశాబ్దం ఆఖరునాటికి ఎన్ఈవీని కొనుగోలు చేసే అంశం పరిశీలిస్తామని తెలిపారు. భారత్ సహా అమెరికా, ఆ్రస్టేలియా, చైనా, జర్మనీవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భారత్‌కి సంబంధించిన విశేషాలు చూస్తే.. → ప్రధాన నగరాలు, వర్ధమాన ద్వితీయ శ్రేణి పట్టణాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో పబ్లిక్ ఈవీ చార్జింగ్ నెట్వర్క్ వేగవంతంగా విస్తరిస్తుండటంతో ఎన్ఈవీలపై భారత్‌లో సానుకూల అభిప్రాయం నెలకొంది. ప్రస్తుతం ప్రధాన నగరాలు, హైవేల వెంబడి 6,000 పైచిలుకు చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. 2027 నాటికి ఈ సంఖ్య ఒక లక్షకు పైగా పెరగనుంది. → ఈవీ సెగ్మెంట్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రియాశీలక విధానాలు అమలు చేస్తుండటం కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై సానుకూలతకు దోహదపడుతోంది. → ఈ విభాగంలో చైనా స్థాయిలో భారత్ కూడా అధునాతన టెక్నాలజీ, ఉత్పత్తి సామర్థ్యాలను సాధించాలి. అవకాశాలు భారీగా ఉన్నప్పటికీ, చైనా ఆధిపత్యం కారణంగా భారత్‌లో ఈవీల తయారీకి సవాళ్లు ఉంటున్నాయి. ఈవీలకు కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీలు .. ఎలక్ట్రిక్ మోటర్లను ఉత్పత్తి చేయడంలోనూ, చార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలోనూ చైనా అధిపత్యం కనిపిస్తోంది. ఈ విభాగాల్లో నైపుణ్యాలు సాధించకుండా ముందుకెళ్లడంలో భారత్ కష్టపడాల్సి రావచ్చు. → భారత్‌లో ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో, ఎలక్ట్రిక్ కార్లను మరింత చౌకగా అందరికీ అందుబాటులోకి తేవడంలో చైనా కంపెనీలతో కలిసి పనిచేయడం కీలకంగా ఉండవచ్చు. చైనా అనుభవాల నుంచి నేర్చుకుని, భారత్ మరింత వేగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లవచ్చు. -
నిజమాడితే నేరమా!
‘వాస్తవాలు మొండిఘటాలు. అవి ఓ పట్టాన లొంగవు. గణాంకాలు అలా కాదు... అవి ఎటువంచితే అటు వంగుతాయి’ అంటాడు విఖ్యాత రచయిత మార్క్ ట్వైన్. పాలకులు గణాంకాలను ఇష్టానుసారం మార్చితే... నిజాలకు మసిపూస్తే ప్రమాదం. అయితే ఏ దేశంలోనైనా జరిగేది అదే అంటారు నిరాశా వాదులు. ఆ మాటెలా వున్నా కేంద్ర ప్రభుత్వం ప్రణబ్ సేన్ ఆధ్వర్యంలోని గణాంకాల స్థాయీ సంఘాన్ని ఇటీవల రద్దు చేసిన తీరు వాంఛనీయం కాదు. ఎన్ని విమర్శలున్నా, లోపాలున్నా గణాంకాలు పాలనా నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వాలు ప్రకటించే ఏ పథకానికైనా, రూపొందించే ఏ విధానానికైనా గణాంకాలే ప్రాతిపదిక. వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించే సర్వేల ప్రక్రియ ఎలావుండాలో, పరిశోధనకు వేటిని పరిణనలోకి తీసుకోవాలో, దాని నమూనా ఏ విధంగా ఉండాలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేయటం గణాంకాల కమిటీ ప్రాథమిక విధి. దీంతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలు గణాంకాల మంత్రిత్వ శాఖకు సమర్పించే సర్వే నివేదికల తీరుతెన్నులెలా వున్నాయో నిశితంగా పరిశీలించి, సందేహాలు నివృత్తి చేసుకుని ఆ ఫలితాలను ప్రకటించటం కూడా కమిటీ పనే. దేశంలోనే తొలిసారి 2019లో కేంద్రం 14 మందితో ఈ కమిటీని నియమించినప్పుడు అందరూసంతోషించారు. నిరుడు ఆ కమిటీ పరిధిని విస్తరించారు కూడా. కానీ దాన్ని కాస్తా మొన్నీమధ్య రద్దు చేశారు. జాతీయ నమూనా సర్వేలకు సంబంధించి ఇటీవల స్టీరింగ్ కమిటీ ఏర్పాటైనందున గణాంకాల కమిటీని రద్దు చేస్తున్నామని కమిటీ సభ్యులకు చెప్పారు. అసలు అప్పటికే ఆ పనిలో ఓ కమిటీ నిమగ్నమై ఉండగా కొత్త కమిటీ ఎందుకు ఏర్పాటైనట్టు? దాన్ని చూపించి పాతది రద్దు చేస్తున్నామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి? వీటికి జవాబిచ్చేవారు లేరు. ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయానికీ, వేసే ప్రతి అడుగుకూ గణాంకాలు ప్రాణం. ఏటా బడ్జెట్ ముందు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేనే తీసుకుంటే... దేశంలో ఆహారానికి జనం ఖర్చు చేస్తున్నదెంతో, అది పట్టణాల్లో ఎలావుందో గ్రామీణ ప్రాంతాల్లో ఎలా వుందో తెలుస్తుంది. నిరుద్యోగిత ఏ విధంగా వున్నదో, వ్యవసాయ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నవారి సంఖ్య ఎంతో వెల్లడవుతుంది. జనం విద్యకు ఖర్చు చేస్తున్నదెంత... ఆరోగ్యానికి ఖర్చవుతున్నదెంత అనే వివరాలు కూడా తెలు స్తాయి. ఇక పేదరిక నిర్మూలన పథకాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపాయో, వాటిని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఎటువంటి చర్యలు అవసరమో నిర్ణయించుకోవటా నికి గణాంకాలు తోడ్పడతాయి. అయితే ఈ గణాంకాల విశ్వసనీయత తేలాలంటే ఒక గీటురాయి అవసరం. జనాభా గణాంకాలే ఆ గీటురాయి. విషాదమేమంటే మూడేళ్ల క్రితం ప్రారంభం కావా ల్సిన జన గణన ఇంతవరకూ మన దేశంలో మొదలుకాలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పదేళ్లకోసారి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ గణన కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో సాగలేదు. వాస్తవానికి జనగణన నోటిఫికేషన్ పద్ధతిగా 2019 మార్చిలో విడుదలైంది. దాని ప్రకారం 2020 ఏప్రిల్–సెప్టెంబర్లమధ్య తొలి దశలో ఇళ్లు, కట్టడాలు, కుటుంబాలు వగైరాలకు సంబంధించిన సర్వే పూర్తి కావాలి. 2021 ఫిబ్రవరిలో జనాభా గణన ఉండాలి. కానీ 2020 మార్చితో మొదలై ఆ ఏడాది నవంబర్ వరకూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో జనాభా గణన సాధ్యపడలేదు. ఆ తర్వాతైనా వెనువెంటనే ప్రారంభించాలని కేంద్రం అనుకోలేదు. అమెరికా, చైనాలతో సహా ప్రపంచంలో ఎన్నో దేశాలు కరోనా తీవ్రత తగ్గగానే చకచకా రంగంలోకి దిగి జనాభా గణనను జయప్రదంగా పూర్తిచేశాయి. కేవలం ఘర్షణ వాతావరణం నెలకొన్న లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే జన గణన జరగలేదు. మన దగ్గర ఎందుకు కాలేదో సంజా యిషీ ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్ధపడలేదు.భిన్న మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఉండే సంస్థలూ, ఇతరత్రా స్వచ్ఛంద సంస్థలూ క్రమం తప్పకుండా సర్వేలు చేస్తున్నాయి. కానీ వాటిని దేంతో సరిపోల్చుకోవాలి? ఏ ప్రాతిపదికన వాటిని విశ్వసించాలి? తాజా జన గణన లేదు కాబట్టి 2011 నాటి జనాభా లెక్కలే వీటన్నిటికీ గీటురాయిగా వినియోగిస్తున్నారు. కానీ ఇందువల్ల వాస్తవ చిత్రం ఆవిష్కరణ కాదు. ఉదాహరణకు 2011 జనగణన ప్రాతిపదికగా మన జనాభా 120 కోట్లని తేలింది. తాజాగా అది 140 కోట్లకు చేరుకుందని చెబుతున్నారు. కానీ పాత లెక్కన పేదరికాన్నీ, ఇతర స్థితిగతులనూ గణిస్తున్నందువల్ల 12 కోట్లమంది నిరుపేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సదుపాయం వర్తించటం లేదని అంటున్నారు. తమ రాష్ట్ర జనాభా పెరిగినందువల్ల అదనపు కోటా కావాలని ఏ ప్రభుత్వమైనా ఏ ప్రాతి పదికన అడగాలి? అందుకు కేంద్రం ఎలా అంగీకరించాలి? అప్పుడప్పుడు వెలువడే ప్రపంచసంస్థల సర్వేలు పేదరికాన్నీ, నిరుద్యోగితనూ, ఇతరత్రా అంశాలనూ చూపుతూ మన దేశం వెనక బడి వుందని చెబుతుంటే కేంద్రం నిష్టూరమాడుతోంది. అక్కడివరకూ ఎందుకు... మన సర్వేల రూపకల్పన, అవి వెల్లడించే ఫలితాలు దేశంలో పేదరికం పెరిగినట్టు, అభివృద్ధి జరగనట్టు అభి ప్రాయం కలగజేస్తున్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు శామికా రవి ఆ మధ్య విమ ర్శించారు. ఈ విషయంలో ఆమెతో ప్రణబ్ సేన్‌కు వాగ్వాదం కూడా జరిగింది. బహుశా గణాంకాల కమిటీ రద్దు వెనకున్న అసలు కారణం అదేనా? ఇద్దరి వైఖరుల్లోనూ వ్యత్యాసానికి మూలం జన గణన జరపక పోవటంలో ఉంది. ఆ పనిచేయకుండా గణాంకాల కమిటీనే రద్దు పర్చటం ఉన్నదు న్నట్టు చూపుతున్నదని అలిగి అద్దాన్ని బద్దలుకొట్టడమే అవుతుంది. -
YSRCP: ఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. జాతీయ సర్వేలో ఎన్ని సీట్లంటే..
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. గతంలో ఏం చేశామన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక, భవిష్యత్‌లో ఫలానా చేస్తామని నమ్మకంగా చెప్పడంలో విశ్వసనీయత లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగించింది. వచ్చే ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థాయిలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు సర్వేలు ఇదే విషయాన్ని చెప్పాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. అలాగే, టీడీపీ కూటమికి 4-5 స్థానాల వస్తాయని వెల్లడించింది. సర్వే ప్రకారం ఫలితాలు ఇలా... 👉: YSRCP: 19-20. 👉: TDP: 3-4. 👉: JSP: 0. 👉: BJP: 1-1. Others: 0. TIMES NOW- @ETG_Research Survey Andhra Pradesh (Total Seats: 25) | Here are seat share projections: YSRCP: 19-20 TDP: 3-4 JSP: 0 BJP: 1-1 Others: 0 @PadmajaJoshi also takes us through vote share projections. pic.twitter.com/dzSNkzsEXB — TIMES NOW (@TimesNow) April 17, 2024 READ THIS ARTICLE IN ENGLISH : YS Jagan Again as CM: Top Surveys ఇది కూడా చదవండి: ఏపీ ఎన్నికల ఫలితాల గురించి అన్ని సర్వేలు ఏం చేబుతున్నాయంటే.. -
సర్వేలన్నీ జగన్ వైపే...సైలెంట్ అయిన పచ్చ బ్యాచ్...
-
జాతీయ స్థాయిని మించి ఏపీ తలసరి వినియోగ వ్యయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ స్థాయిని మించి నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే 2022–23 వెల్లడించింది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత ఆహార, ఇతర వస్తువులతోపాటు ఆహారేతర వస్తువుల వినియోగం ఆధారంగా 2022–23 గృహ వినియోగ వ్యయ సర్వే కోసం క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించినట్టు సర్వే నివేదిక వెల్లడించింది. ఆహార పదార్థాలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్న రాగులు, పప్పులు, చక్కెర, వంట నూనెలు, ఆహారేతర వస్తువులైన ల్యాప్‌టాప్, పీసీ, టాబ్లెట్, మొబైల్, సైకిల్, మోటార్ సైకిల్, స్కూటీ, స్కూల్ యూనిఫాం, స్కూల్ షూ తదితర వస్తువులను పరిగణనలోకి తీసుకుని నెలవారీ తలసరి వినియోగ వ్యయాన్ని లెక్కించినట్టు సర్వే నివేదిక తెలిపింది. రాష్ట్రంలో తలసరి వ్యయం ఇలా.. జాతీయ స్థాయిలో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.3,860 ఉండగా.. పట్టణాల్లో ఆ వ్యయం రూ.6,521 ఉన్నట్టు సర్వే పేర్కొంది. ఏపీ విషయానికి వస్తే గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,996 ఉండగా.. పట్టణాల్లో రూ.6,877 ఉన్నట్టు సర్వే వెల్లడించింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉంది. తెలంగాణలో తలసరి వినియోగ వ్యయం రూ.4,959గా ఉంది. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.2,257 రూపాయలు ఉండగా.. పట్టణాల్లో రూ.4,557 ఉందని సర్వే తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చూస్తే ఛండీగఢ్‌లో గ్రామాల్లో అత్యధికంగా నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.7,467 ఉండగా.. పట్టణాల్లో రూ.12,577 ఉంది. అత్యల్పంగా లడ్హాక్లో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,062 ఉండగా.. పట్టణాల్లో రూ.5,511 ఉందని సర్వే నివేదిక తెలిపింది. -
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. తొలి రెండు రోజులు ఉభయసభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్‌ను ఇప్పటికే రద్దు చేస్తూ బులిటెన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతిపాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ బడ్జెట్‌నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వాడీవేడిగా చర్చలు సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నిరుద్యోగిత, అధిక ధరలు, ఆర్థిక అసమానతల కారణంగా రైతాంగం, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ అంశాలపై మోదీ సర్కార్‌ను విపక్షాలు నిలదీయనున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంశం సైతం ప్రధానంగా విపక్షాలు ప్రస్తావించవచ్చు. ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్‌పై, భూమికి ఉద్యోగం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్‌పై ఈడీ, సీబీఐ కేసులనూ విపక్షాలు పార్లమెంట్లో లేవనెత్తనున్నాయి. జార్ఖండ్ సీఎంసోరెన్పై, తమిళనాడులో డీఎంకే నేతలపై ఈడీ, సీబీఐ వరుస దాడులను విపక్షాలు పార్లమెంట్లో ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. పశ్చిమబెంగాల్‌కు రావాల్సిన కేంద్ర నిధులను మోదీ సర్కార్ మంజూరుచేయకుండా ఆపేస్తోందని, ఈ అంశంలో కేంద్రాన్ని నిలదీస్తానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ్ చెప్పారు. 14 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత గత పార్లమెంట్ సమావేశాల్లో సస్పెండ్ అయిన వారిలో 14 మంది విపక్ష సభ్యులు ఈసారి సెషన్లో పాల్గొననున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సమావేశాల్లోకి రాకుండా గతంలో వీరిపై విధించిన నిషేధ కేసును సభాహక్కుల కమిటీలకు పంపామని, మా అభ్యర్థనతో ఆ కమిటీల చైర్మన్లు వీరి సస్పెన్షన్‌ను ఎత్తేశారని మంత్రి వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తేసిన 14 మందిలో 11 మంది రాజ్యసభ, ముగ్గురు లోక్‌సభ సభ్యులున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం అంశాన్ని ఎత్తిచూపుతూ లోక్‌సభ, రాజ్యసభ లోపల ప్లకార్డులు పట్టుకుని నినదించినందుకు కేంద్రం ఫిర్యాదుతో 100 లోక్‌సభ, 46 రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్‌కు గురైన విషయం తెల్సిందే. ప్రతి ఒక్కరి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సభాపతులను కోరామన్నారు. వీరిలో 14 మంది క్షమాపణలు చెప్పడంతో వారికి మాత్రమే ఈ సెషన్లో పాల్గొనే అవకాశం కల్పించారు. బుధవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ఇరు సభలకు తమ సభ్యులు ఎలాంటి ప్లకార్డులు తీసుకురారని విపక్ష పార్టీలు సమాచారం ఇచ్చాయని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. -
Archaeological Survey Of India: జ్ఞానవాపి మసీదులో దేవతా విగ్రహాలు
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద పురాతన హిందూ ఆలయ అవశేషాలున్నాయంటూ కోర్టుకు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) సమర్పించిన సర్వే నివేదికలో మరి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. శివలింగం భాగాలు, హిందూ దేవతల ధ్వంసమైన విగ్రహాలు మసీదులో ఉన్నాయి. వాటి ఫొటోలు తాజాగా జాతీయ మీడియాకు లభించాయి. హనుమాన్, గణేష, నంది విగ్రహాల ఫొటోలు, కొన్ని పానవట్టాలు, కిందిభాగం లేని శివలింగం వాటిలో ఉన్నాయి. శతాబ్దాల నాటి నాణేలు, పర్షియన్ లిపి సున్నపురాయి శాసనం, రోలు ఉన్నాయి. మసీదు కింద భారీ ఆలయముండేదని నివేదిక నిరూపిస్తోందని హిందువుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. ఆలయ రాతిస్తంభాలనే కాస్త మార్చి మసీదు నిర్మాణంలో వాడారని నివేదికలో ఉందన్నారు. ‘‘17వ శతాబ్దంలో ఔరంగజేబు ఇక్కడి ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని కూల్చేసినట్లు నివేదికలోని ఆధారాలు బలంగా చాటుతున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ ఒక ఆలయం ఉండేదని స్పష్టమవుతోంది’’ అని ఆయన చెప్పారు. దీనితో అంజుమన్ అంజామియా మసీదు కమిటీ ప్రతినిధి అఖ్లాఖ్ అహ్మద్ విభేదించారు. ‘‘ఇందులో కొత్తేమీ లేదు. గతంలోనూ అవి ఉన్నాయని ఏఎస్ఐ తెలిపింది. తాజా నివేదికలో వాటి కొలతలను స్పష్టంగా పేర్కొంది. అవి పురాతనమైనవని చెప్పే ఆధారాలను ఏఎస్ఐ ప్రస్తావించలేదు. ఆ రాళ్ల వయసు ఎంత అనే అంశాలపై ఏఎస్ఐ ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. సర్వేలో ఉన్నవన్నీ ఏఎస్ఐ అభిప్రాయాలు మాత్రమే. అవి నిపుణుల అభిప్రాయాలు కాదు’’ అని ఆయన వాదించారు. గత ఏడాది జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ మసీదు కాంప్లెక్స్‌లో శాస్త్రీయసర్వే చేపట్టి గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన సీల్డ్ కవర్లో సర్వే నివేదికను సమర్పించింది. తాజాగా కోర్టు వాటిని కేసులో భాగమైన ఇరుపక్షాల ప్రతినిధులు, న్యాయవాదులకు అందజేశారు. దీంతో నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి. -
చవక నగరాల్లో అహ్మదాబాద్, చెన్నై
ప్రపంచంలో తక్కువ ఖర్చుతో బతుకు వెళ్లదీయగల పెద్ద నగరాల్లో మన దేశానికి చెందిన రెండు సిటీలు అహ్మదాబాద్, చెన్నైలకు చోటు దక్కింది. ప్రఖ్యాత ‘ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లోని పెద్ద నగరాలను ఎంపిక చేసి, సర్వే నిర్వహించి ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఆయా నగరాల్లో నిత్యావసరాల నుంచి ఇంటి అద్దెల దాకా వివిధ ధరలను పరిశీలించి.. జీవించడానికి అయ్యే ఖర్చును తేల్చామని పేర్కొంది. ఇందులో సింగపూర్, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరాలు అత్యధిక జీవన వ్యయంలో టాప్‌లో నిలిచాయి. నిత్యావసరాలు, వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం గణనీయంగా ఉండటంతో యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని నగరాల్లో జీవన వ్యయం పెరుగుతోందని తెలిపింది. ఇక తక్కువ వ్యయం ఉండే నగరాల్లో ఆసియా ఖండానికి చెందినవే ఎక్కువగా ఉన్నా యని నివేదిక వెల్లడించింది. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
దక్షిణాదిపై సర్వే.. సంతానలేమి ఇక్కడే ఎక్కువ ఎందుకో తెలుసా?
ఉత్తరాది రాష్ట్రాల కంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలలో సంతానలేమి రేటు ఎక్కువగా ఉందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం, వివాహ వయస్సు, జీవసంబంధ కారకాలు, జీవనశైలి కారకాలు వంధ్యత్వంతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ సమస్యకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల తర్వాత స్థానంలో గోవా, ఢిల్లీ, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలున్నట్టు ప్లస్‌వన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. అయితే, ‘భారత్‌లో వంధ్యత్వ ధోరణులు.. ప్రవర్తనా నిర్ణాయకాలు’ పేరిట అధ్యయనం నిర్వహించారు. అనారోగ్యమే.. ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో దంపతుల్ని వెంటాడుతున్న సమస్య సంతానలేమి. అయితే, ఈ సమస్యను ఒక అనారోగ్య సమస్యగా కాకుండా అదొక ప్రత్యేక సమస్యగా పరిగణించడం జరుగుతోంది. కాగా, ఈ సమస్యకు ముందు, వెనుకా కూడా అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వంధ్యత్వానికి కారణాల్లో అపసవ్య జీవనశైలి, లైంగిక వ్యాధులు వంటివి ఉన్నాయి. విచ్చలవిడి శృంగారం, పలువురు సెక్స్ భాగస్వాములను కలిగి ఉండటం తద్వారా లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు.. వంధ్యత్వానికి, అవాంఛనీయ గర్భస్రావాలకు కారణాలుగా మారుతున్నాయని అధ్యయనం అభిప్రాయపడింది. ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్ నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. ‘లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు తగిన ఆధునిక వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలలో వంధ్యత్వ రేటు ఎక్కువగా ఉంది. పర్యావరణ, సామాజిక–ఆర్థిక జీవనశైలి అలవాట్లు వంటి అనేక ఇతర అంశాలు సమస్య తీవ్రతకు దోహదం చేస్తాయి. ఒక జంట నివసించే వాతావరణం, వేడికి, శబ్దానికి తరచుగా గురికావడం ఆ జంట పునరుత్పత్తి సామర్ధ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది’ అని అధ్యయనం పేర్కొంది. ‘అధిక బరువు దుష్పలితాలు రుతుస్రావం, వంధ్యత్వం, గర్భస్రావం, గర్భం ప్రసవంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ధూమపానం, మద్యపానం, తరచు గర్భస్రావాల ముందస్తు గర్భనిరోధక మందుల వినియోగం కూడా వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచుతాయని వెల్లడించింది. మానసిక సమస్యలెన్నో.. అనారోగ్య కారణాలతో ఏర్పడే ఈ సమస్య ఆ తర్వాత కూడా అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. పురుషులతో పోలిస్తే సంతాన లేమి మహిళలను మరింత ఎక్కువగా వేధిస్తుందని వారి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని అధ్యయనం తేల్చింది. అంతేకాకుండా కుటుంబ, సమాజ ఒత్తిడిని వారు అతిగా భరించాల్సి వస్తుందని కూడా వెల్లడించింది. భారతదేశంలోని జంటలలో వంధ్యత్వం 1981లో 13 శాతం మాత్రమే కాగా అది 2001 నాటికి 16 శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘1998–99 నుంచి 2005–06 మధ్య మాత్రం వంధ్యత్వ రేటు తగ్గింది. ఇక మిగిలిన కాలం అంతా పెరుగుదలే గమనించినట్టు అధ్యయనం స్పష్టం చేసింది. ప్రస్తుతం వివాహిత మహిళల్లో ఎనిమిది శాతం మంది ప్రాథమిక, ద్వితీయ వంధ్యత్వానికి గురవుతున్నారు. అందులో 5.8 శాతం మంది ద్వితీయ వంధ్యత్వానికి గురవుతున్నారు’ అని పేర్కొంది. వైద్య పరిష్కారాలు ఉన్నాయి.. సంతానలేమి సమస్య తీవ్రంగానే ఉందని గత కొంత కాలంగా అధ్యయనాలు చెబుతున్నాయి. మా వద్దకు వస్తున్న జంటల సంఖ్య కూడా దీన్ని నిర్ధారిస్తోంది అని నోవా ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు డా.స్వప్న అంటున్నారు. ఇటీవల ఈ సమస్యపై ఆధునికుల్లో అవగాహన పెంచడానికి విజయవాడలో ఎపీఆర్సీఓజీ ట్రస్ట్, విజయవాడ అబ్సెటెట్రిక్ అండ్ గైనకాలాజికల్ సొసైటీలతో కలిసి సదస్సును నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆధునిక వైద్య ప్రపంచం సంతానలేమికి విభిన్న రకాల పరిష్కారాలను అందిస్తోంది. అయితే, ఇవన్నీ జీవనశైలి మార్పులతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. సంతానలేమి కారణాలపై యువతలో అవగాహన పెరగాలని, కనీసం 25 నుంచి 28 ఏళ్లలోపు మధ్య వయసులోనే సంతానం పొందేలా ప్లాన్ చేసుకోవాలని ఆమె సూచించారు. -
సీఎం జగన్ జనాదరణ చూసి చంద్రబాబు గ్యాంగ్ లో కంగారు
-
తెలంగాణలో మరో సర్వే.. ఆ పార్టీకే ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్కే ఆధిక్యమంటూ మిషన్ చాణక్య సర్వే రిపోర్టు తేల్చింది. ఓట్ షేర్‌పై మిషన్ చాణక్య నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్-44.62 శాతం, కాంగ్రెస్-32.71 శాతం, బీజేపీ-17.6 శాతం, ఇతరులకు 5.04 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. కాగా, తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని ఇండియా టీవీ సర్వే కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను విడుదల చేసిన ఇండియా టీవీ.. బీఆర్ఎస్కు 70, కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 88, కాంగ్రెస్‌కు 19, ఎంఐఎం 7, ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. చదవండి: తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదల -
క్రిసిల్ సంస్థ పేరుతోనూ పురందేశ్వరి తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై క్రిసిల్ సర్వే నివేదిక అంటూ శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చూపిన కాగితాలు అసలు ఆ సంస్థకు సంబంధించిన నివేదికే కాదని తేలింది. వాటిని చూపిస్తూ (ప్రతులు మీడియా ప్రతినిధులకు ఇవ్వలేదు) ఆమె రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తీరా చూస్తే.. ఆ కాగితాలు ఓ వ్యక్తి తన పరిశోధన కోసం క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ రిపోర్ట్)గా వెబ్సైట్లో రాసుకున్న అంశాలని సాక్ష్యాధారాలతో స్పష్టమైంది. ఆ కాగితాలను పురందేశ్వరి మీడియాకు చూపిస్తున్నప్పుడు తీసిన ఫొటోలోనూ అదొక ఆన్లైన్ వెబ్సైట్లో ఉంచిన గ్రౌండ్ రిపోర్టు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన గ్రౌండ్ రిపోర్టును ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చి(ఎన్సీఏఈఆర్)’ సంస్థకు పరిశీలనకు సమర్పించారు. ఎన్సీఏఈఆర్ ఆ రిపోర్టును తిరస్కరించింది. అంటే.. అందులో వివరాలు అవాస్తవాలు, విలువ లేనివి. ఆ వ్యక్తి గ్రౌండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలు కూడా 2020 మే నెల 7వ తేదీ నాటిది. అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయి అప్పటికి ఏడాది కూడా పూర్తవదు. దీనినే క్రిసిల్ నివేదిక అంటూ పురందేశ్వరి రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు మేరకే స్కిల్ స్కాంపై సీఐడీ కేసు: పురందేశ్వరి ఎవరో విజిల్ బ్లోయర్ (అవినీతికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలిసిన అజ్ఞాత వ్యక్తి) ఫిర్యాదు మేరకే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసి, విచారణ జరిపి చంద్రబాబు అరెస్టు దాకా వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆమె శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేసుపై విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం లేదు. అరెస్టు చేసిన విధానంలో లోపాలు ఉన్నాయని బీజేపీ ఆనాడే చెప్పింది. అవినీతి జరిగిందా లేదా అన్నది కోర్టే తేల్చాలి’ అని అన్నారు. చంద్రబాబు ఆయన భద్రత, చికిత్స బాధ్యత ఎవరిదో వారినే అడగాలని అన్నారు. తనను అమిత్ షా పిలిచారని లోకేశ్ చెబుతున్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘ఎవరు పిలిచారన్నది అప్రస్తుతం. లోకేశ్‌కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య స్థితి, కేసు, సెక్షన్లు, జడ్జిలు ఎవరో ఆరా తీశారు. బాబు అరెస్టులో బీజేపీ హస్తం ఉంటే వారు ఎలా కలుస్తారు?’ అంటూ బదులిచ్చారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరమన్న లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించనని చెప్పారు. ఆరోపణలపై జగన్ సిబీఐ విచారణ కోరాలి రాష్ట్రంలో మద్యం తయారీ, నాణ్యత, అమ్మకాలు, ఇసుక, మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని, సీఎంజగన్ నిజాయితీని నిరూపించుకునేందుకు సీబీఐతో విచారణ చేయించుకోవాలని పురందేశ్వరి సవాల్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 20 మద్యం తయారీ సంస్థలలో 12 చంద్రబాబు కాలంలోనే అనుమతులు పొందాయని, అయితే 2019 తర్వాత మద్యం తయారీదారుల్ని బెదిరించి వైఎస్సార్సీపీ నేతలు వాటిని లాక్కున్నారని ఆరోపించారు. -
రాష్రంలో మహిళలే ఎక్కువ
దేశంలో అత్యధిక మహిళలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళలు 1,030 మంది ఉన్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను చూస్తే 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, అమరావతి దేశంలో పట్టణాలు ,గ్రామాల్లో పరిస్థితి ఇది దేశంలో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 941 మంది స్త్రీలు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 947 మంది స్త్రీలు ఏపీలో పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,030 మంది స్త్రీలు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,017 మంది స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,035 మంది స్త్రీలు -
చిర్రెత్తిస్తున్న స్పామ్ కాల్స్
సాక్షి, అమరావతి: అర్జంట్ పనిలో ఉన్నపుడు అదేపనిగా ఫోన్ మోగుతూ ఉంటుంది. అంత పనిలోనూ ఫోన్ ఎత్తితే.. తక్కువ వడ్డీతో లోన్ ఇస్తామనో, తక్కువ రేటుకే ఇంటి స్థలం అంటూనో.. అవతలి నుంచి గొంతు వినిపిస్తుంది. ఆ మాట వినగానే ఫోన్ వినియోగదారుడికి చిర్రెత్తుకొస్తుంది. ఈ స్పామ్ కాల్ సమస్య ప్రపంచ వ్యాప్తంగా చాలా వేధిస్తోంది. యూజర్లను కాల్స్‌తో పాటు మెసేజ్‌లు, ఈ–మెయిళ్లతో కూడా చికాకు పెడుతున్నారు. మన దేశంలో ఎక్కువ మందికి రోజులో మూడు అంతకంటే ఎక్కువ స్పామ్ కాల్స్ వస్తున్నట్టు లోకల్ సర్వే నివేదిక చెబుతోంది. ఇలాంటి కాల్స్‌ను 40 శాతం మంది బ్లాక్/డిస్కనెక్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. కేవలం 2 శాతం మంది మాత్రమే స్పామ్ కాల్స్‌లో మాట్లాడుతున్నట్టు వివరించింది. ఈ స్పామ్ కాలర్లను నియంత్రించడానికి భారత ప్రభుత్వం పదేపదే కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంది. 2007లో డునాట్డిస్టర్బ్ (డీఎన్డీ) సదుపాయా న్ని తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్‌ను అరికట్టడానికి టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్స్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ (టీసీసీసీపీఆర్) ఫ్రేమ్‌వర్క్‌ను 2010లో ట్రాయ్ ప్రవేశపెట్టింది. వీటిని యాక్టివేషన్ చేసుకున్నప్పటికీ 95 శాతం మంది తిరిగి స్పామ్కాల్స్ను ఎదుర్కొన్నట్టు సర్వే గుర్తించింది. స్పామ్బాట్లో రెండో స్థానం.. లండన్‌కు చెందిన స్పామ్, సైబర్ బెదిరింపులను ట్రాక్ చేసే సంస్థ ‘స్పామ్హాస్ ప్రాజెక్ట్’ నివేదిక ప్రకారం చైనా తర్వాత భారత దేశంలోనే అత్యధికంగా స్పామ్బాట్లను వినియోగిస్తున్నా రు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో స్పామ్ కాల్స్, మెసేజ్‌లను పంపేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన కంప్యూటర్ ప్రోగ్రామ్ స్పామ్బాట్ను వినియోగిస్తారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు భారత్‌లో దాదాపు 9.39 లక్షల స్పామ్బాట్లు చురుగ్గా ఉన్నట్టు అంచనా. వీటిని ప్రధానంగా ఫిషింగ్, క్లిక్–ఫ్రాడ్, డీడీఓఎస్ కోసం ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. రష్యాలో అధికంగా స్పామ్ ఈ–మెయిళ్లు స్పామ్, ఫిషింగ్ తాజా నివేదిక ప్రకారం 2022లో రష్యా (29.8 శాతం), చైనా (14శాతం), అమెరికా (10.7 శాతం) స్పామ్ ఈ–మెయిళ్లలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా స్పెయిన్‌లో 8.8 శాతం, తర్వాత రష్యాలో 7.3 శాతం హానికరమైన ఈ–మెయిళ్లను బ్లాక్ చేశారు. భార త్లో స్పామ్ మెయిళ్ల వాటా 1.8 శాతంగా ఉంటే.. బ్లాక్ చేసిన ఈ–మెయిళ్లు 1.6 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య.. స్పామ్కాల్ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ప్రబలంగా మారింది. అర్జెంటీనాలో ఫోన్ కాల్స్‌లో అత్యధికంగా 52 శాతం స్పామ్‌కాల్స్ నమోదవుతున్నట్టు గుర్తి ంచారు. భారత్‌లో ఆ వాటా 12.7 శాతంగా ఉంది. ఇక ఐర్లాండ్, హంగేరీ, థాయ్‌లాండ్ దేశాలు స్పామ్ కాల్ ముప్పు చాలా తక్కువగా ఉంది. ఈ దేశాల్లో 10 శాతం లోపే స్పామ్ కాల్స్ నమోదవుతున్నాయి. -
రాష్ట్రంలో పెద్ద పులుల గాండ్రింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద పులులు సందడి చేస్తున్నాయి. తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లు కలిపి 2018 టైగర్ సెన్సస్‌లో 26 పులుల జనాభాతో పోల్చితే తాజాగా 2022లో చేసిన సెన్సెస్‌లో వాటి సంఖ్య 30కు పైగా చేరుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంఖ్యాపరంగా ఇది ఎంతో వృద్ధి చెందినట్టుగా భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం మైసూరులో ప్రధాని మోదీ ‘50 ఇయర్స్ ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్’పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022’సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఈ సర్వేలో ‘పులుల ఉనికి’, అవి స్థిరనివాసం ఏర్పరుచుకోడానికి అమ్రాబాద్‌లో అత్యంత సానుకూల పరిస్థితులున్నట్టు వెల్లడైంది. పులుల కదలికలు, ఇతర అంశాలను తెలియజేసే మ్యాప్‌ల్లోనూ అమ్రాబాద్‌లో పులుల మనుగడ, సంరక్షణకు ఆరోగ్యకరమైన వాతావరణమున్నట్టు స్పష్టమైంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న పులులు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. అమ్రాబాద్ వెరీగుడ్లోకి.. గతంలో గుడ్ కేటగిరీలో ఉన్న అమ్రాబాద్ వెరీగుడ్లోకి, కవ్వాల్ గుడ్ కేటగిరిలోనే కొనసాగినట్టు వెల్లడైంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ నిర్వహణకు సంబంధించిన మరి కొన్ని పాయింట్లు సాధించి ఉంటే వెరీగుడ్ కేటగిరిలోకి వెళ్లి ఉండేదని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. 2018లో అమ్రాబాద్‌లో 18, కవ్వాల్‌లో 8 పులులు ఉన్నట్టుగా అప్పటి నివేదిక ద్వారా తెలిసింది. 2022 నాటికి ఒక్క అమ్రాబాద్‌లోనే 26కు పైగా పెద్దపులులు (4 పులి పిల్లలతో సహా), కవ్వాల్‌లో, టైగర్ కారిడార్ ఏరియాలు కలిపి ఆరేడు పెద్దపులులు ఉండొచ్చునని అధికారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే పులుల సంఖ్య వృద్ధితో పాటు వాటికి పరిరక్షణకు అనుకూల వాతావరణముందని సాక్షికి అటవీశాఖ వైల్డ్ లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్ తెలిపారు. కాగా, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వెరీగుడ్ నుంచి ఎక్స్లెంట్ కేటగిరీలోకి వెళ్లేందుకు బేస్‌క్యాంప్‌ల సంఖ్యను గణనీయంగా పెంచాల్సి ఉందని డీఎఫ్‌వో రోహిత్ గొప్పిడి అభిప్రాయపడ్డారు. -
కరీంనగర్–హసన్‌పర్తి ‘లైన్’క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్ – హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన రీ సర్వే చేసి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరం నిధుల కేటాయింపుతో పాటు నిర్మాణ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అశ్విని వైష్ణవ్‌తో బండి భేటీ శుక్రవారం ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ – హసన్‌పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి వినతిపత్రం అందించారు. ఈ లైన్ నిర్మాణానికి సంబంధించి 2013లో సర్వే చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోగా సరైన నిర్ణయం తీసుకోని కారణంగా పురోగతి లేకుండా పోయిందని సంజయ్ తెలిపారు. దాదాపు 62 కి.మీ. లైన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఉత్తర తెలంగాణలోని గ్రానైట్ ఇండస్ట్రీకి , వరి, పప్పు ధాన్యాలు, పసుపు పంట ఉత్పత్తుల రవాణాకు ఈ లైన్ ఉపయోగపడుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో ఈ రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కూడా సంజయ్ కోరారు. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రి అధికారులను పిలిపించి మాట్లాడారు. కరీంనగర్ –హసన్‌పర్తి లైన్ కు తక్షణమే రీసర్వేకు ఆదేశించారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా వచ్చే నెలలో పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొమరవెల్లిలో రైలు ఆగేలా చర్య లు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రి ఆదే శించారు. జమ్మికుంట రైల్వేస్టేషన్ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆలస్యం: సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరీంనగర్ – హసన్‌పర్తి రైల్వే లైన్ నిర్మాణం ఆలస్యమైందని, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలు ఇబ్బంది పడ్డారని సంజయ్ మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన రైల్వేమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ తప్పిదంతో రాష్ట్రానికి అన్యాయం ’కృష్ణా జలాల వాటా విషయంలో సీఎం కేసీఆర్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని సంజయ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రజల వనరుల శాఖ సలహా దారు వెదిరే శ్రీరాంతో కలిసి సంజయ్ శుక్రవారం ఢిల్లీలో ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరందే అవకాశం ఉందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరించి రాష్ట్రప్రజలకు నష్టం కలిగించారని వివరించారు. కృష్ణా జలాల వాటా నీటి కేటాయింపు, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ను పరిశీలించి త్వరగా పనులు చేపట్టేలా అను మతి ఇవ్వాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి అధికారులను పిలిచి మాట్లాడారు. డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపి పరిశీలించడంతోపాటు పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కృత్రిమ మేధ కబ్జాపర్వం!
దొడ్డ శ్రీనివాస రెడ్డి : కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా మన జీవితాల్ని కబ్జా చేస్తోంది. కంప్యూటర్ నిపుణుడు క్రిస్టఫర్ స్ట్రాచె 1951లో మాంచెస్టర్ యూనివర్సిటీలో కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రాంతో మొదలైన ఏఐ శకం నేడు అన్ని రంగాల్లోకి శరవేగంగా చొరబడుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలకు కోతపెడుతూ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. ‘కృత్రిమ మేధ మనిషి మేదస్సును చేరుకోవడానికి ఇంకా అనేక పరిశోధనలు, లక్ష్యాలను సాధించాల్సి ఉంది. ఈ లక్ష్యసాధనకు ఎంత సమయం పడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం’అని అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన ఏఐ నిపుణుడు స్టువర్ట్ రసెల్ నాలుగేళ్ల క్రితం అన్న మాటలివి. అయితే మనిషి మేదస్సును అందుకోవడంలో కృత్రిమ మేధకు ఇంకా ఎక్కువ సమయం పట్టకపోవచ్చనిపిస్తోంది. కోడ్ రాస్తుంది... చాట్‌జీపీటీ ప్రాథమిక స్థాయిలో కంప్యూటర్ ప్రోగ్రాం కోడ్ రాయగలుగుతుంది. అయితే కృత్రిమ మేధపై పెరుగుతున్న పరిశోధనలను పరిశీలిస్తే ఈ ఏడాదిలోనే సంక్లిష్టమైన కోడింగ్‌లను రాయగల సత్తా ఏఐ సమకూర్చుకోగలుగుతుందని అర్థమవుతోంది. మనిషి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించడానికి రెండేళ్ల క్రితమే ఏఐ ఆధారిత ‘టురింగ్ బోట్స్’అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు టురింగ్ బోట్స్ స్వయంగా సాఫ్ట్వేర్లను రూపొందించే దిశగా అవతరిస్తున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫోరెస్టర్ అంచనా ప్రకారం ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్లలో 10 శాతానికిపైగా టురింగ్ బోట్స్ కోడ్లను, టెస్ట్‌లను రాయగలుగుతాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలను ఇవి ఆక్రమించబోతున్నాయని, ఆ ఉద్యోగులు ఇక పర్యవేక్షణ, నిర్వహణ ఉద్యోగులుగా మారబోతున్నారనేది ఫోరెస్టర్ అభిప్రాయం. వచ్చే ఏడాదికల్లా చాలావరకు వ్యాపార సంస్థలు కోడింగ్‌కు సంబంధించి 30 శాతం వరకు కృత్రిమ మేధపై ఆధారపడబోతున్నాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఒక నిర్ధారణకు వ చ్చింది. ఈ ఏడాది ఫార్చూన్–500 కంపెనీల ద్వారా వెళ్లే అన్ని రకాల సమాచారాల్లో 10 శాతానికిపైగా ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్లే సృష్టించబోతున్నాయని ఫోరెస్టర్ చెబుతోంది. అదే 2025 నాటికి అన్ని వ్యాపార సంస్థల నుండి వెలువడే సమాచారంలో 30 శాతానికిపైగా కృత్రిమ మేధ ఆధారిత కంప్యూటర్లే సృష్టించబోతున్నాయని వ్యాపార పరిశోధనా సంస్థ గార్ట్నర్ అంచనా. అలాగే 2026 నాటికి వ్యాపార సంస్థల మధ్య లావాదేవీల్లో సగానికి పైగా ఏఐ ద్వారానే సాగబోతున్నాయని, 2030 నాటికి మొత్తంగా కృత్రిమ మేధ ఆధారంగా ఐదో వంతు వ్యాపార లావాదేవీలు సాగుబోతున్నాయని కూడా గార్ట్నర్ అభిప్రాయం. 2026 నాటికి 75 శాతం బడా కంపెనీల ఉత్పత్తుల నాణ్యత, సామర్థ్యం, సప్లయ్ చెయిన్, అభివృద్ధి కార్యక్రమాలను కృత్రిమ మేధే నిర్వహించబోతోందని డేటా కార్పొరేషన్ ఐడీసీ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 1.7 కోట్ల మంది కాంటాక్ట్ సెంటర్ ఏజెంట్లు పనిచేస్తుండగా 2026 నాటికి వాళ్ల మధ్య జరిగే లావాదేవీల్లో 10 శాతం ఏఐ ద్వారా ఆటోమేట్ కాబోతున్నాయని గార్ట్నర్ చెబుతోంది. దీనివల్ల మొత్తంగా 8,000 కోట్ల డాలర్లు ఆదా అవుతుందని కూడాఈ సంస్థ వెల్లడించింది. మనిషి అవసరం లేదు.. మనిషి రోజువారీ పనులన్నింటినీ అతిత్వరలో కృత్రిమ మేధ హస్తగతం చేసుకోబోతోందని ఏఐ నిపుణుడు కామ్ ఫులీ హెచ్చరిస్తున్నారు. ఆదాయం, చదువు విషయంలో సమాజంలో చివరన ఉన్న అత్యధిక జనాభాను ఏఐ తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని ఆయన అంటున్నారు. ‘ఒకçప్పుడు కంపెనీలు ఆదాయం కోసం ఉద్యోగుల సంఖ్యను 5–10 శాతం తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు చేసేవి, కానీ ఇప్పుడు అందుబాటులోకి వ చ్చిన ఏఐతో ఒక శాతం ఉద్యోగులతో మొత్తం పని ఎలా చేయించవచ్చో ఆలోచిస్తున్నాయి’అని ఇన్ఫోసిస్ అధ్యక్షుడు మోహన్ జోషి ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ సమాజంపై తీవ్ర ప్రభావం చూపబోతోందని దాని స్థాపిత సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ హెచ్చరిస్తున్నారు. మనిషి మాదిరి అనేక లక్ష్యాలను పూర్తిచేయగల ఏఐ చాట్‌బోట్ వల్ల మనుషులు నిర్వహించే అనేక ఉద్యోగాలకు ఎసరుపెట్టబోతోందని, అయితే మనిషికున్న సృజనాత్మకశక్తి కారణంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆల్డ్మన్ అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ సమాచారం అందించే రెస్యూమ్బిల్డర్.కామ్ సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికాకు చెందిన వెయ్యి కంపెనీల్లో సగానికిపైగా ఉద్యోగుల స్థానంలో ఇప్పటికే చాట్‌జీపీటీ లేదా ఇతర చాట్బోట్లను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. మరో సర్వేలో 44 శాతం కంపెనీలు కృత్రిమ మేధను తమ కంపెనీ వ్యవహారాల్లో ఉపయోగించుకొనేందుకు వీలుగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. గతేడాది ఐబీఎం సంస్థ సంపాదించుకున్న మొత్తం 9,130 పేటెంట్లలో 2,300 కృత్రిమ మేధతో సంబంధం ఉన్నవే కావడం రానున్న కాలంలో ఏఐ విస్తృతిని చెప్పకనే చెబుతోంది. నియంత్రణ ఎలా? ఇందుకలడందుగలడు అన్నట్లుగా అన్ని రంగాల్లోకి, అన్ని విభాగాల్లోకి చోచ్చుకుపోతున్న కృత్రిమ మేధ నియంత్రణ సాధ్యమా? దాన్ని కట్టడి చేయాలంటే అనుసరించాల్సిన పద్ధతులేమిటన్నది ఇప్పుడు కంపెనీ అధిపతుల నుంచి ప్రభుత్వాధినేతల వరకు వేధిస్తున్న ప్రశ్న. కృత్రిమ మేధ నిర్వహించే కార్యకలాపాలను, తప్పొప్పులను న్యాయపరంగా ఎలా ఎదురుకోవాలి, సైబర్ సెక్యూరిటీని ఎలా సాధించాలన్న చర్చ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే ఏఐ ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు ప్రతి కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ) లేదా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)ను నియమించుకుంటోంది. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ ద్వారా జరిగే కార్యకలాపాల నియంత్రణ అన్నది ప్రతి వ్యాపార సంస్థకు పెద్ద బాధ్యత కాబోతోందని ఫోరెస్టర్ చెబుతోంది. ఇటీవల జరిగిన డేటా రోబో సర్వేలో ఏఐపై ప్రభుత్వ నియంత్రణలకు 81 శాతం మంది టెక్ కంపెనీల అధిపతులు సానుకూలంగా స్పందించారు. కృత్రిమ మేధ విస్తరిస్తున్న వేళ ప్రజల సంరక్షణార్థం అమెరికా ఇటీవల ఏఐ బిల్ ఆఫ్ రైట్స్ పేరిట ఒక ముసాయిదా బిల్లును రూపొందించింది. సైబర్ సెక్యూరిటీ కోసం కంపెనీలు పాటిస్తున్న మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వ నిబంధనలుగా మార్చడంపై చాలా వరకు వ్యాపార సంస్థలు సుముఖంగా ఉన్నాయి. -
వేతనజీవులు.. ఆంధ్రాలో అధికం
సాక్షి, అమరావతి: దేశసగటు కన్నా రాష్ట్రంలోనే వేతన పురుషులు, మహిళల శాతం ఎక్కువగా ఉంది. ఈ విషయం కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాలశాఖ నిర్వహించిన 2021–22 లేబర్ ఫోర్స్ సర్వేలో వెల్లడైంది. వేతన మహిళలు దేశంలో సగటున 16.5 శాతం ఉండగా, రాష్ట్రంలో 17.2 శాతం ఉన్నారు. వేతన పురుషులు దేశంలో సగటున 23.6 శాతం ఉండగా, రాష్ట్రంలో 27.6 శాతం ఉన్నారు. రాష్ట్రంలో పట్టణాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా వేతనాలపై జీవిస్తున్నారు. పట్టణాల్లో 48.8శాతం వేతన పురుషులుండగా, 47.8శాతం వేతన మహిళలున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రంలో 15.7 శాతం వేతన పురుషులు ఉండగా, 9.7శాతం వేతన మహిళలున్నారు. కోవిడ్ ప్రభావం నేపథ్యంలో లేబర్ ఫోర్స్ సర్వేలో జాప్యం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేతన పురుషులు, మహిళలు, స్వయం ఉపాధిపై ఆధారపడినవారు, సాధారణ కూలీల శాతంపై సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో 44 శాతం పురుషులు, 42.4 శాతం మహిళలు స్వయం ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ కూలీలుగా 40.4 శాతం మహిళలు, 28.4 శాతం పురుషులు ఉపాధి పొందుతున్నారు. ఢిల్లీ, చండీగఢ్, కేరళల్లో వేతన మహిళలు అత్యధికం ఢిల్లీ, చండీగఢ్, కేరళల్లో వేతన పురుషుల కన్నా వేతన మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఢిల్లీలో వేతన మహిళలు 83 శాతం కాగా వేతన పురుషులు 63.3 శాతమే. చండీగఢ్‌లో వేతన మహిళలు 67.7 శాతం కాగా వేతన పురుషులు 61.5 శాతం, కేరళలో వేతన మహిళలు 37.3 శాతం, వేతన పురుషులు 27.5 శాతం ఉన్నారు. బిహార్‌లో అత్యల్పంగా వేతన పురుషులు 9.9 శాతం ఉండగా వేతన మహిళలు 10.7 శాతం ఉన్నారు. వేతన మహిళల్లో జార్ఖండ్‌లో అత్యల్పంగా 6.3 శాతం, ఆ తరువాత మధ్యప్రదేశ్‌లో 7.7 శాతం, రాజస్థాన్‌లో 7.6 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 6.7 శాతం ఉన్నారు. -
WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్ టాప్!
ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌ల ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగులకు ఊరట కలిగించే ఓ సర్వే విడుదైంది. భారత్‌లో ఈ ఏడాది జీతాలు 10 శాతం మేర పెరగనున్నట్లు తాజాగా ఓ సర్వే పేర్కొంది. దాని ప్రకారం ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో జీతాల పెరుగుదల భారత్‌లోనే అత్యధికం. ఇదే 2022లో మన దేశంలో జీతాల పెరుగుదల 9.8 శాతం నమోదైంది. గ్లోబల్ అడ్వయిజరీ, బ్రోకింగ్, సొల్యూషన్స్ సంస్థ డబ్ల్యూటీడబ్ల్యూ శాలరీ బడ్జెట్ ప్లానింగ్ పేరుతో ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం.. ఈ ఏడాదిలో చైనాలో 6 శాతం, వియత్నాంలో 8 శాతం, ఇండోనేషియాలో 7 శాతం, హాంకాంగ్‌లో 4 శాతం, సింగపూర్‌లో 4 శాతం జీతాలు పెరుగుతాయని అంచనా. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జీతాల పెరుగుదల క్షీణించింది. తర్వాత క్రమంగా పుంజకుంది. 2019లో 9.9 శాతం ఉన్న వేతనాలు 2020లో 7.5 శాతం, 2021లో 8.5 శాతం పెరిగాయి. 2022లో 9.8 శాతం పెరిగాయి. ఏయే రంగాల్లో ఎంతెంత? ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్ మీడియా, గేమింగ్, ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, కెమికల్స్, రిటైల్ రంగాలలో అత్యధికంగా 10 శాతం జీతాలు పెరుగుతాయని అంచనా. ఇక తయారీ రంగం, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ రంగాలలో జీతాల పెంపు అంతంత మాత్రమే. చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్! వ్యాపార అవకాశాలు, ఉద్యోగుల నిలుపుదల ప్రస్తుతం భారతదేశంలో జీతాల పెంపునకు ప్రధాన చోదకాలని డబ్ల్యూటీడబ్ల్యూ ఇండియా వద్ద వర్క్ అండ్ రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్‌గా ఉన్న రజుల్ మాథుర్ పేర్కొన్నారు. దాదాపు 80 శాతం భారతీయ కంపెనీలు రాబోయే ఈ ఏడాది వ్యాపార ఆదాయాన్ని మరింత పెంచుకునే ఆలోచనతో ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: MG Motor: ఆ స్మార్ట్ ఈవీ పేరు ‘కామెట్’... రేసింగ్ విమానం స్ఫూర్తితో... -
ఆడబిడ్డల ఆంధ్రప్రదేశ్.. పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అబ్బాయిలను మించి ఆడపిల్లల సంఖ్య పెరిగిపోతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అబ్బాయిలు కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 2021–22 లేబర్ ఫోర్స్ సర్వేను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దాని ప్రకారం.. దేశంలో అత్యధికంగా అమ్మాయిలున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి మొదటి స్థానంలో ఉంది. జూలై 2021 నుంచి జూన్ 2022 మధ్య సర్వే నిర్వహించినట్టు నివేదిక పేర్కొంది. దేశం మొత్తం మీద చూస్తే.. 8 రాష్ట్రాల్లోనే అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమ్మాయిలు కన్నా అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. జాతీయ స్థాయిలో కూడా అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది. 2019–20లో జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 963 మంది అమ్మాయిలుండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య 968కు పెరిగింది. అలాగే రాష్ట్రంలో 2019–20లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలుండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య 1,046కు పెరిగింది. అక్కడ అబ్బాయిలే అధికం రాష్ట్రంలో మొత్తం 1,41,28,100 కుటుంబాలుండగా.. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 96,72,100, పట్టణ ప్రాంతాల్లో 44,56,000 కుటుంబాలున్నట్టు నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో సగటు కుటుంబ పరిమాణం 3.3గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 3.4గా ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 3.2గా ఉందని నివేదిక తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్– హవేలీ–డామన్–డయ్యూలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిలు కేవలం 742 మందే ఉన్నారు. ఆ తర్వాత చండీగఢ్‌లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 879 మంది, హరియాణాలో 887 మంది, ఢిల్లీలో 891 మంది అమ్మాయిలున్నారు. గ్రామాల్లో కన్నా పట్టణాల్లో ఎక్కువ 2021–22లో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,038 మంది అమ్మాయిలుండగా.. పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,063 మంది అమ్మాయిలున్నారు. అలాగే 2019–20లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,007 మంది అమ్మాయిలుండగా.. పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,051 మంది అమ్మాయిలున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల్లోనే అమ్మాయిల సంఖ్య అత్యధికంగా ఉంటోందని స్పష్టమవుతోంది. ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలనే ధోరణి నుంచి క్రమంగా మగైనా ఆడైనా ఒకరే చాలనే వరకూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆడిపిల్లల సంఖ్య పెరుగుతూ వస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
‘డు నాట్ డిస్టర్బ్’ అన్నా తప్పని బెడద: కీలక సర్వే
న్యూఢిల్లీ: ‘డు నాట్ డిస్టర్బ్’ లిస్టులో నమోదు చేసుకున్నప్పటికీ మొబైల్ ఫోన్ యూజర్లకు అవాంఛిత కాల్స్ బెడద తప్పడం లేదు. ఏకంగా 92 శాతం సబ్స్క్రయిబర్స్కు రోజుకు కనీసం 1 కాల్ అయినా అలాంటిది వస్తోంది. ఆన్లైన్ సంస్థ లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ రంగాల సంస్థల నుంచి తమకు అత్యధికంగా అవాంఛిత కాల్స్ వస్తున్నాయని 78 శాతం మంది వెల్లడించారు. మొత్తం 11,157 మంది ఇందుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమివ్వగా వారిలో 66 శాతం మంది తమకు రోజుకు సగటున 3 లేదా అంతకు మించి ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు 96 శాతం మంది తమకు అటువంటి కాల్ ఏదో ఒకటి ప్రతి రోజూ వస్తూనే ఉంటుందని వివరించారు. ఇక 16 శాతం మంది తమకు రోజుకు సగటున 6 10 కాల్స్ వస్తుంటాయని చెప్పగా 5 శాతం మంది 10 పైగా అవాంఛిత ఫోన్స్ వస్తుంటాయని వివరించారు. -
కర్నాటకలో ఖతర్నాక్ పోటీ.. ఆసక్తికరంగా ట్రాకర్ పోల్ సర్వే
కర్ణాటకలో వచ్చే ఏప్రిల్/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడయ్యింది. ‘సౌత్ ఫస్ట్’ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్‌పల్స్ సంస్థ - ‘సిస్రో’తో కలిసి తాజాగా ఈ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాల్లో, మెజారిటీ రాకపోయినా.. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధిస్తుందని, మొత్తం మీద హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని ట్రాకర్ పోల్‌లో తెలిసింది. పీపుల్స్‌పల్స్ డైరెక్టర్ ఆర్.దిలీప్‌రెడ్డి గురువారం మొదటి ట్రాకర్‌పోల్ ఫలితాలను విడుదల చేశారు. మొదటి ట్రాకర్ పోల్ 2022 డిసెంబర్ 22-31 వరకు నిర్వహించారు. పది రోజుల పాటు జరిగిన తాజా సర్వే గణాంకాలను శాస్త్రీయంగా అన్వయించి విశ్లేషించి, సిస్రో వ్యవస్థాపక డైరెక్టర్ ధనుంజయ్ జోషి ఆధ్వర్యంలో నివేదికను రూపొందించారు. ఎన్నికలలోపు మరో రెండు విడతల్లో రాష్ట్రంలో ఈ సర్వే జరుగనుంది. మరో రెండు మార్లు ట్రాక్ పోల్స్ సర్వేను 2023 మార్చిలో ఒకసారి, సరిగ్గా ఎన్నికల ముందు మరోసారి చేపడుతారు. కర్నాటకలో గత మూడున్నర దశబ్దాలుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసగా తిరిగి విజయం సాధించలేదు. దక్షిణ భారత దేశంలో కర్నాటక రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ అధికారం నిలుపుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. 2022లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి తామే అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ కూడా పట్టు సాధించి, తిరిగి అధికారం నిలుపుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్‌లో అధికార మార్పు సంప్రదాయం కొనసాగినట్లే ఇక్కడ కూడా అధికార పార్టీ పరాజయం పాలై, తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలు ధీమాతో ఉన్నాయి. పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన మొదటి ట్రాకర్ పోల్ సర్వే ప్రకారం 224 అసెంబ్లీ స్థానాల్లో 101 స్థానాలు (ప్లస్/మైనస్ 9 స్థానాలు) సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అధికార బీజేపీ 91 స్థానాలకు (ప్లస్/మైనస్ 7 స్థానాలు) పరిమితమవుతుందని, జేడీ(ఎస్)29 (ప్లస్/మైనస్ 5 స్థానాలు), ఇతరులు మూడు స్థానాలు సాధించవచ్చని ట్రాకర్‌పోల్‌లో తేలింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాల మెజార్టీ సంఖ్యను ఏ పార్టీ సాధించలేకపోతోంది. 2018 ఎన్నికల తర్వాత రెండు పార్టీల కూటమి ప్రభుత్వం మరోసారి ఏర్పడే అవకాశాలున్నాయి. రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా మారనున్నామని జేడీ(ఎస్) ఇప్పటికే చెబుతూ వస్తోంది. వాస్తవిక ఫలితాలు ట్రాకర్‌పోల్ సర్వే అంచనాల ప్రకారంగానే ఉంటే, అదే నిజమై జేడీ(ఎస్) కీలకం కానుంది. ట్రాకర్‌పోల్ సర్వే గణాంకాల ప్రకారం కాంగ్రెస్ 2018 ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం ఓట్లను పెంచుకొని 22 స్థానాలను అధికంగా సాధిస్తుందని తేలింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 40 శాతం సాధిస్తుందని రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించిన ట్రాకర్‌పోల్ సర్వేలో తేలింది. అదే సమయంలో బీజేపీకి, 2018 ఎన్నికలతో పోలిస్తే 0.2 శాతం ఓట్లు తగ్గే ఆస్కారం కనిపిస్తోంది. 2018లో 36.2 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు 36 శాతం ఓట్లు సాధిస్తుంది. ఈ స్వల్ప వ్యత్యాసంతో ఆ పార్టీ 13 స్థానాలు కోల్పోనుంది. పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థల సర్వే ప్రకారం, జేడీ(ఎస్) ఈ ఎన్నికల్లో కిందటి ఎన్నికల కన్నా తక్కువ ఓటు షేర్‌తో, తక్కువ సంఖ్యలో సీట్లు సాధిస్తూ కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనుంది. ఈ పార్టీ 16 శాతం ఓట్లు సాధించనుంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 2.4 శాతం తక్కువ సాధించి 29 సీట్లు (కిందటిసారి వారి సంఖ్య 37) పొందుతుంది. జేడీ(ఎస్) దృష్ట్యా చూస్తే ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగినా దాదాపు తన ఓటు బ్యాంకును నిలుపుకోవడం ఎంతో కీలకం. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలంటే తన ఓటు బ్యాంకును జెడీ(ఎస్) నిలుపుకోవడంతోపాటు అధిక సీట్లను సాధించాలి. కర్నాటక ఎన్నికల్లో కులాలతో పాటు మత అంశాలు కూడా కీలకంగా మారనున్నాయని సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్ సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన ట్రాకర్‌పోల్ సర్వేలో తేలింది. ఓబీసీలు, మాదిగలు, హోలియాలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తున్నారు. మరోవైపు అగ్రకులాలు, వొక్కలింగాలు, లింగాయత్‌లు బీజేపీ వెంట ఉన్నట్లు ట్రాకర్‌పోల్ సర్వేలో తేలింది. జేడీ(ఎస్) ప్రధాన ఓటు బ్యాంకు అయిన వొక్కలింగాలలో 50 శాతం మంది ఈ పార్టీకి మద్దతుగా ఉన్నారు. అహిందా కూటమి, వొక్కలింగాయతేతరులైన ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ కొంతమేర ఆధిపత్యం పొందుతుందని ట్రాకర్‌పోల్‌లో తేలింది. 2013-2018 మధ్య కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కాలంలో, ఆయా వర్గాల సంక్షేమ పథకాల ప్యాకేజీలను అందజేయడం, సమర్థంగా అమలుపరచడంతో కాంగ్రెస్‌కు పార్టీకి వీరి నుండి ఎక్కువ మద్దతు లభిస్తోంది. పీపుల్స్ పల్స్- సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన ట్రాకర్‌పోల్ సర్వేలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు సిద్దరామయ్యకు 28 శాతం మద్దతిచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మైకు 19 శాతం, కుమారస్వామికి 18 శాతం మంది నుంచి మద్దతు లభించింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఏయే పార్టీలు కూటమిగా ఏర్పడాలన్న నిర్దిష్ట ప్రశ్నకు కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమి ప్రభుత్వం ఏర్పడాలని 41 శాతం బీజేపీ, జేడీ(ఎస్) కూటమి ప్రభుత్వం ఏర్పడాలని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. అవినీతి, ఉద్యోగ నియామకాలలో కుంభకోణాలు, నిరుద్యోగం, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం అంశాలు బీజేపీకి అడ్డంకులుగా ఉన్నాయని ఈ ట్రాకర్ పోల్ సర్వేలో తేలింది. రైతులలో 40 శాతం, నిరుద్యోగులలో 41 శాతం కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్‌కు 8 శాతం ఆధిపత్యం లభిస్తుండగా, బీజేపీకి పట్టణ ప్రాంత్రాల్లో కేవలం ఒక శాతం మాత్రమే ఆధిక్యం కనిపిస్తున్నది. కర్నాటక అభివృద్ధికి ఏ పార్టీ పాలన మెరుగైనదని ప్రశ్నించినపుడు.. 38 శాతం కాంగ్రెస్, 36 శాతం బీజేపీ, 18 శాతం జేడీ(ఎస్)కి అనుకూలంగా ఓటర్లు స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కర్నాటకలో ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని అడిగినపుడు.. 38 శాతం మంది కాంగ్రెస్ అని, 37 శాతం మంది బీజేపీ అని తెలిపారు. బీజేపీకి మరో మారు అవకాశమిస్తారా అని ప్రశ్నించగా 51 శాతం మంది లేదని, 41 శాతం అనుకూలమని తెలిపారు. సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే, హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనబడుతోంది. కర్నాటకలో ఇప్పటికే పలు రాజకీయ పరిణామాలతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. సర్వే చేపట్టిన విధానం.. ‘సౌత్ ఫస్ట్’న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థలు ఈ సర్వేను 56 అసెంబ్లీ స్థానాల్లో 224 పోలింగ్ బూత్‌లను ఎంపిక చేసుకొని మొత్తం 4584 శాంపిల్స్ (ఓటర్ల) నుండి సమాచారం సేకరించాము. జనాభా దామాషాను పరిగణనలోకి తీసుకొని, సామాజిక వర్గాల ఆధారంగా ర్యాండమ్ పద్దతిలో ఎంపిక ద్వారా ఈ శాస్త్రీయ సర్వే జరిగింది. డిసెంబర్ 22 నుండి 31 వరకు ఈ ట్రాకర్‌పోల్ సర్వే ప్రక్రియ సాగింది. మార్చి 2023లో ఒకసారి, ఎన్నికల ముందు మరోమారు సర్వేను నిర్వహించనున్నాము. ప్రతీ పోలింగ్ స్టేషన్ నుండి 35 మంది ఓటర్ల నుండి సమాచారం సేకరించాము. ఈ సర్వేలో సీఏపీఐ (కంప్యూటర్ అసిస్టెడ్ ఇంటర్‌పర్సనల్ ఇంటర్వీయింగ్) పద్దతిన డేటా సేకరణ జరిపి, ఓటర్లను ముఖాముఖి కలుసుకుని, ఈ సర్వేలో అవసరమైన ప్రశ్నలు వేస్తూ డమ్మీ ఈవీఎమ్ ద్వారా రహస్య ఓటింగ్ నిర్వహించారు. ఈ సర్వే ఫలితాల్లో 1-2 (+/-) వ్యత్యాసాలకు ఆస్కారం ఉంది. (క్లిక్ చేయండి: రాజకీయాలకు ఎస్ఎం కృష్ణ గుడ్‌బై) -
ప్రపంచ ఆర్థిక పరిణామాలపై జాగరూకత
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిణామాలు వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అవుట్‌లుక్‌ను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్వే నివేదిక శుక్రవారం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నవంబర్ నెలవారీ నివేదిక హెచ్చరించింది. అయితే కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాస) కట్టడిలోనే ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. బలమైన సేవల ఎగుమతులు, దేశానికి వచ్చే రెమిటెన్సులు ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు 100 బిలియన్ డాలర్లకు తాకే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్ పేర్కొన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. -
TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిలోపే జరగాల్సి ఉంది. కాని ముందస్తు ఊహాగానాలతో అన్ని పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. అదే విధంగా పార్టీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యేలు, ఆశావహులు ప్రజల దగ్గర తమ జాతకాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుంటున్నారు. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెక్ చేసుకుంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం ఈ నాయకులంతా తల కిందుల తపస్సులు చేస్తున్నారు. సాంతం.. సర్వేల మయం అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలతో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పటికే అసెంబ్లీలో ఉన్నవారు... కొత్తగా అసెంబ్లీలో ప్రవేశించాలనుకునేవారు తమ రాజకీయ భవిష్యత్ గురించి, రాబోయే ఎన్నికల్లో తమ అదృష్టం గురించి ప్రజల దగ్గర పరీక్షలు చేయించుకుంటున్నారు. అదేనండి... సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రతి పార్టీ ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకుని ఓవరాల్‌గా పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, వ్యతిరేకతల గురించి.. ఒక్కో నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే, సీటు కోరుకుంటున్నవారు, ప్రతిపక్షాల పరిస్థితులపై అధ్యయనం చేయిస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్నదాంతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీల తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. గ్రాఫ్ బాగుంటూనే టికెట్ ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నవారందరికీ వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తున్నట్లు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో ఎమ్మెల్యేలంతా సంతోషంగా తమ పనుల్లో బిజీ అయిపోయారు. అదే సమయంలో టిక్కెట్ల హామీతో పార్టీలోకి వచ్చినవారు... టిక్కెట్ కోసం ప్రతి సారీ ఎదురుచూస్తున్నవారు తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెక్ చేయించుకుంటున్నారు. కొందరిని నియమించుకుని సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే... గత ఎన్నికల్లో బాగా పనిచేసేవారికే టిక్కెట్లు ఇస్తామని, గ్రాఫ్ బాగాలేని ఎమ్మెల్యేలు ఇంటికే అని కేసీఆర్ హెచ్చరించారు. కాని ఒకరిద్దరు మినహా మిగిలిన సీట్లన్నీ సిట్టింగులకే కేటాయించారు. ఈసారి మాత్రం సిట్టింగులందరికీ అని ప్రకటించారు. దీంతో కేసీఆర్ మాటలకు అర్థాలు వేరులే అని కొందరు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఇప్పటికే అందరి జాతకాలు ఉన్నట్లు చెప్పారు. అందువల్ల ప్రజల్లో గ్రాఫ్ సరిగా లేకపోతే టిక్కెట్ రాదని భయపడుతున్నారు. అందుకే ఎవరికి వారు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. పల్లె పల్లెకు ప్రశ్నల రాయుళ్లు మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు చాలా పాఠాలు నేర్పింది. పోల్ మేనేజ్మెంట్ కొత్త పుంతలు తొక్కిన విధానాన్ని అక్కడ ప్రచారంలో పాల్గొన్న నాయకులంతా పరిశీలించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజలు వేసిన ప్రశ్నలు ఎలా ఉన్నదీ అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రత్యక్షంగా చూశారు. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడు ఉప ఎన్నికలో ఆయా పార్టీల కోసం పనిచేశారు. టీఆర్ఎస్ అయితే ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేను ఇన్చార్జ్గా నియమించింది. మునుగోడు నేర్పిన పాఠాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేంతా తమ నియోజకవర్గాల్లో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. యూత్, మహిళలు, వృద్ధులు, రైతులు, మైనారిటీలు.. ఇలా అన్ని వర్గాల్లో తమకు ఉన్న ఆదరణ గురించి సర్వే చేయించుకుంటున్నారు. ప్రజల్లో కనుక వ్యతిరేకత ఉంటే.. దాన్ని అధిగమించడం ఎలా అన్నదానిపై వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలో ఉన్న అసంతృప్తి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో తమకున్న గ్రాఫ్ పడిపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటుగా.. ఇతర పార్టీల నేతలు, ముఖ్య కార్యకర్తలను ఆకర్షించే పనిలో ఎమ్మెల్యేలంతా బిజీగా ఉన్నారు. ప్రతి పార్టీ ఆపరేషన్ ఆకర్ష గ్రామ స్థాయి నుంచి అమలు చేస్తోంది. ముందుస్తు ఊహాగానాల నేపథ్యంలో మొత్తం రాష్ట్రం అంతా రాజకీయ జాతర మొదలైంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సంసారంలో ‘స్మార్ట్’ తిప్పలు.. టెన్షన్ పెడుతున్న రిపోర్టు!
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల మితిమీరిన వినియోగంతో తిప్పలు తప్పడం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మొబైళ్లను విచ్చలవిడిగా ఉపయోగించడంతో భార్యాభర్తలు, అతి సన్నిహితుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అవసరమున్నా, లేకపోయినా సమయం, సందర్భం లేకుండా స్మార్ట్ఫోన్లలో మునిగిపోవడం చాలా మందికి అలవాటు అయ్యింది. కొంతమందిలో వ్యసనంగా మారడంతో పరిణామాలు సమాజాన్ని కలవర పరుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత ఒక వరంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎన్నో అవసరాలను తీరుస్తోంది. ఐతే ఈ టెక్నాలజీని మితిమీరి ఉపయోగిస్తే పెనుసమస్యగా మారుతోంది. మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల అతి వినియోగం వల్ల వివాహిత జంటల సంబంధాల్లో, మానసికంగా చూపుతున్న ప్రభావం, స్వభావంలో వస్తున్న మార్పులపై ‘స్మార్ట్‌ఫోన్స్ అండ్ దెయిర్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ రిలేషన్షిప్స్–2022’అనే అంశంపై వీవో–సైబర్ మీడియా పరిశోధన చేసింది. అందులో వెల్లడైన ఆసక్తికరమైన విషయాలను ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ స్విచ్ఛాఫ్ స్టడీలో వెలువరించింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణేలలోని స్మార్ట్ఫోన్ల వినియోగదారులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఫోన్ వాడకంలో వస్తున్న ట్రెండ్స్, అతి వినియోగంతో వస్తున్న మార్పులను విశ్లేషించింది. జెండర్‌తో సంబంధం లేకుండా భర్త/భార్య సగటున రోజుకు 4.7గంటలు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారు. తమతో కాకుండా ఫోన్‌తో గడుపుతున్నారంటూ తమ జీవిత భాగస్వామి తరచూ ఫిర్యాదు చేస్తుంటారని 73శాతం మంది అంగీకరించారు. ఇంకా మరెన్నో విషయాలను అధ్యయనం వెల్లడించింది. రిపోర్టులోని ముఖ్యాంశాలు - అవకాశమున్నా కూడా తమ భార్య/భర్తతో కాకుండా ఎక్కువ సమయం మొబైళ్లతోనే సమయం గడుపుతున్నామన్న 89% మంది. - స్మార్ట్ఫోన్లలో మునిగిపోయి కొన్నిసార్లు తమ చుట్టూ పరిసరాలనూ మరిచిపోయామన్న 72 శాతం మంది. - తమ వారితో సమయం గడుపుతున్నపుడు కూడా ఫోన్లను చూస్తున్నామన్న 67% మంది. - స్మార్ట్ఫోన్ల మితిమీరి వినియోగం వల్ల తమ భాగస్వాములతో సంబంధాలు బలహీనపడినట్టు 66 శాతం మంది అంగీకారం. - అతిగా ఫోన్ వాడకంతో మానసికమైన మార్పులు వస్తున్నాయని, స్మార్ట్‌ఫోన్ వాడుతున్నప్పుడు భార్య కలగజేసుకుంటే ఆవేశానికి లోనవుతున్నామన్న 70 శాతం - ఫోన్ కారణంగా భార్యతో మాట్లాడుతున్నపుడు కూడా మనసు లగ్నం చేయలేకపోతున్నామన్న 69 శాతం మంది. - భోజనం చేస్తున్నపుడు కూడా ఫోన్లను ఉపయోగిస్తున్నామన్న 58 శాతం మంది. - లివింగ్‌రూమ్‌లో స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న వారు 60 శాతం - రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ఫోన్లు చూస్తున్నవారు 86 శాతం - జీవితంలో ఒకభాగమై పోయిన స్మార్ట్ఫోన్లను వేరు చేయలేమన్న 84 శాతం - తీరిక సమయం దొరికితే చాలు 89% మంది ఫోన్లలో మునిగిపోతున్నారు - రిలాక్స్ కావడానికి కూడా మొబైళ్లనే సాధనంగా 90% మంది ఎంచుకుంటున్నారు. స్క్రీన్‌టైమ్‌పై స్వీయ నియంత్రణ అవసరం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆకర్షణకు లోనయ్యే, గంటలు గంటలు అందులోనే మునిగేపోయేలా చేసే గుణం స్మార్ట్ ఫోన్లలో ఉంది. అది ‘అటెన్షెన్ సీకింగ్ డివైస్’కావడంతో బయటకెళ్లినా, ఇంట్లో ఉన్నా పది నిమిషాలు కాకుండానే మొబైళ్లను చెక్ చేస్తుంటాం. వాడకపోతే కొంపలు మునిగేదేమీ లేకపోయినా అదో వ్యసనంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లోనూ తాము బిజీగా ఉన్నామని చూపెట్టేందుకు సెల్ఫోన్లు ఉపయోగిస్తుంటారు. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చాక అత్యవసరమైతే తప్ప మొబైళ్లు ఉపయోగించరాదనే నిబంధన వివాహితులు పెట్టుకోవాలి. బెడ్రూమ్లో ఫోన్లు వినియోగించరాదనే నియమం ఉండాలి. రోజుకు ఇన్ని గంటలు మాత్రమే సెల్‌ఫోన్ వాడాలనే నిబంధన పెట్టుకోవాలి. ఉపవాసం మాదిరిగా వారానికి ఒకరోజు అత్యవసరమైతే తప్ప ఫోన్ ఉపయోగించకుండా చూసుకోవాలి. మొబైల్ అధిక వినియోగ ప్రభావం తమ జీవితాలపై, సంబంధాలపై ఏ మేరకు పడుతోందనే జ్ఞానోదయమైతే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ . -
వ్యవసాయేతర రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: వ్యవసాయం కాకుండా, 9 రంగాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో కొత్తగా 10 లక్షల మందికి ఉపాధి లభించింది. దీంతో ఈ రంగాల్లో మొత్తం ఉపాధి అవకాశాలు 3.18 కోట్లకు పెరిగినట్టు కేంద్ర కార్మిక శాఖ త్రైమాసికం వారీ ఉపాధి సర్వే నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం విడుదల చేశారు. తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం/రెస్టారెంట్, ఐటీ/బీపీవో, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఈ ఉద్యోగాలు వచ్చినట్టు తెలిపింది. ఇదీ చదవండి : Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది, వావ్...తక్కువ ధరలో! 2021 జనవరి 1 నాటికి ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు 3.08 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి 3.18 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. కరోనా ఆంక్షల తొలగింపుతో ఆర్థికరంగ కార్యకలాపాలు ఊపందుకున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సంఘటిత రంగంలో ఉపాధికి సంబంధించి కీలక సమాచారం కోసం త్రైమాసికం వారీగా ఉపాధి సర్వేను కేంద్ర కార్మిక శాఖ నిర్వహిస్తుంటుంది. దేశవ్యాప్తంగా 12,000 సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ 9 రంగాల్లో కలిపి ఉపాధి అవాకాశాలు 2013–14 నాటి సర్వే నాటికి 2.37 కోట్లుగా ఉండడం గమనార్హం. తయారీలో ఎక్కువ.. ఈ గణాంకాల్లో అత్యధికంగా తయారీ రంగంలో 38.5 శాతం మందికి ఉపాధి లభిస్తోంది. ఆ తర్వాత విద్యా రంగంలో 21.7 శాతం, ఐటీ/బీపీవో రంగంలో 12 శాతం, ఆరోగ్య రంగంలో 10.6 శాతం మందికి ఉపాధి కల్పన జరిగింది. ఈ నాలుగు రంగాల్లోనే 83 శాతం మంది పనిచేస్తుండడం గమనార్హం. -
Telangana: సర్వే రిపోర్టులతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు !
ఓరుగల్లు గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. సర్వే రిపోర్టులు ఎమ్మెల్యేలను ఆందోళనకు గురి చేస్తుంటే.. ప్రజాదరణ తగ్గిన నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. మెజారిటీ స్థానాల్లో ప్రతికూల ఫలితాలు తప్పవని సర్వే రిపోర్టులు తేల్చడం సిట్టింగ్‌లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్కు మొన్నటివరకు కంచుకోట. రెండు పార్లమెంటు, 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 8 ఎమ్మెల్సీలు, ఆరు జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుని ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ఉంది గులాబీ పార్టీ. అయితే తాజా రాజకీయ పరిణామాలతో సీన్ మారి పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం కలకలం రేపుతోంది. 12 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ బలపడి ఆరేడు స్థానాల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశముందనే సర్వే రిపోర్టు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆరేడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్కు ప్రతికూల ప్రభావం తప్పవని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి నెలకొని ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైందట. దానికితోడు కాంగ్రెస్ రోజురోజుకు బలపడుతోందని, కొంతమంది ముఖ్యమైన నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఏక్షణమైనా సదరు నేతలు హస్తం గూటికి చేరే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ పశ్చిమలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డోర్నకల్‌లో ఎమ్మెల్యే రెడ్యానాయక్... ఈ నలుగురు ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉన్నారట. మిగతా ఎమ్మెల్యేలకు ఎదురీత తప్పదని సర్వేల్లో తేలడం సిట్టింగ్‌లకు గుబులు పుట్టిస్తోందట. మెజార్టీ ఎమ్మెల్యేలకు ప్రతికూల వాతావరణం ఉండడంతో.. అక్కడ అభ్యర్థులను మార్చే అవకాశముందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లిలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మహబూబాబాద్‌లో ఎంపీ కవిత, స్టేషన్ ఘన్‌పూర్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ తూర్పులో మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య, జనగామలో కేటీఆర్ సన్నిహితుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తాజా సర్వే రిపోర్టులతో ప్రజాదరణ తగ్గిన ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడుతున్నారు. అధిష్టానం దృష్టిని ఆకర్షించి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కేటీఆర్ బర్త్ డే ను పురస్కరించుకుని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య మోకాళ్లపై చెల్పూర్ వెంకటేశ్వరస్వామి గుడి మెట్లు ఎక్కి మొక్కులు చెల్లించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ భారీ ఖర్చుతో లేజర్ షో పెట్టి హల్ చల్ చేశారు. కానీ ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. సర్వేల సంగతి ఎలా ఉన్నా.. మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు అంతంతమాత్రంగానే ఉందని నియోజకవర్గాల్లోనూ చర్చ జరుగుతుండడం గులాబీ శిబిరంలో గుబులు రేపుతోంది. -
AARAA Mastan Survey Report: తెలంగాణ ఎన్నికలపై ‘ఆరా’ రిపోర్టు.. స్పందించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక టీఆర్ఎస్, బీజేపీ కలిసి ‘ఆరా’సంస్థతో సర్వే రిపోర్టు ఇప్పించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా సర్వే సంస్థ రిపోర్టు మార్చిందన్నారు. ఆరా సంస్థ చైర్మన్ తనతో వస్తే నిరూపిస్తానని సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదని, టీఆర్ఎస్, బీజేపీలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ అంతర్గత సర్వే ప్రకారం కాంగ్రెస్ 90 నుంచి 99 సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారని వెల్లడించారు. అయినా కాంగ్రెస్ కేడర్ ఇలాంటి సర్వేలను నమ్మదని, వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన వివరాలు అబద్ధం మరోవైపు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ‘ఆరా’పోల్ స్ట్రాటజీస్ సంస్థ అధినేత ఆరా మస్తాన్ స్పందించారు. తమ సంస్థ సర్వే పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించిన వివరాలు అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 38.88 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87 శాతంఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి ఓట్ల శాతం 41.71కి తగ్గిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 38.88 శాతానికి పడిపోయినా, అత్యధిక శాతం ప్రజల మద్దతున్న పార్టీగా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌కు 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూఓట్ల శాతం తగ్గుతూ వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 23.71 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని తమ సర్వేలో తేలినట్లు చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల నుంచి పుంజుకుంటూ వచ్చిన బీజేపీకి 30.48 శాతం ఓట్లు లభిస్తాయన్నారు. ఇతరులకు 6.91 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి 119 నియోజకవర్గాల్లోని మూడో వంతు నియోజకవర్గాల్లో 2021 నవంబర్, ఈ ఏడాది మార్చి, ప్రస్తుత నెలలో సర్వేలు నిర్వహించినట్లు తెలిపారు. -
Prashant Kishor-KCR: కేసిఆర్‌కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనలేంటీ?
రాజకీయాల్లో ఎప్పుడు తొందరగా ఒక నిర్ణయానికి రాకూడదు... చివరి బంతి పడేవరకు గెలుపు ఓటముల గురించి ఎవరూ ఊహించలేరు.. ఇది సాధారణంగా రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు ఎక్కువగా చెప్పే మాటలు. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇంటాబయటా బాగానే చర్చలు జరుగుతున్నాయి. అసలు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నారు? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేస్తున్నారు? దీనిపై అందరి దృష్టి నెలకొంది. ఎవరేమి చెప్పినా అంతిమంగా తాను అనుకునేది చేస్తారనేది కేసీఆర్‌కు మొదటి నుంచి ఉన్న ఇమేజ్. అయితే ప్రశాంత్ కిషోర్ తీరు మరోలా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ అధినేతలకు వ్యూహకర్తగా వ్యవహరించి సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్ ఈసారి తెలంగాణలో ఎలాంటి పాత్రను ఎంతవరకు పోషించబోతున్నారన్న దానిపై రకరకాల అంచనాలున్నాయి. పీకే టీం ఇచ్చే రిపోర్టులను, సలహాలను కేసీఆర్ పూర్తిగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది టిఆర్ఎస్ లో ప్రస్తుతం అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ప్రస్తుతం అత్యంత కీలకమైన అంశం నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా సీఎం కేసీఆర్ టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు చేస్తారా? అన్నదానిపై భారీగా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ నివేదిక అని ప్రచారంలో ఉన్న అంశాలేంటీ? * కనీసం 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలి * పార్టీకన్నా ఎమ్మెల్యేలపైనే వ్యతిరేకత ఎక్కువ * ప్రజలకు అందుబాటులో లేని వాళ్లకు టికెట్లు వద్దు * కొత్త ముఖాలను తీసుకురావాలి * ఇతర రంగాల్లో సక్సెస్ అయి.. ప్రజలకు సుపరిచితులయిన వారి పేర్లను పరిశీలించాలి దుబ్బాక ఎన్నికల నుంచి ఇప్పటివరకు టీఆర్ఎస్పై భారీగా విమర్శలు చేస్తోన్న కమలం నేతలు.. టీఆర్ఎస్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్నది బిజెపి, కాంగ్రెస్ పదేపదే చేస్తున్న ప్రచారం. కర్ణాటక అసెంబ్లీ తో పాటే తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈ పార్టీలు భావిస్తున్నాయి. అయితే తాము ముందస్తు కు వెళ్లే అవకాశం లేదని టిఆర్ఎస్ అధినాయకత్వం చెప్తున్నా ఎక్కడో ఓ మూల ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆ అభిప్రాయం ఇంకా పోలేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజ్‌భవన్ వర్గాలు గానీ, కేంద్రం గానీ ముందస్తుకు సుముఖంగా లేరన్నది ప్రజా బాహుళ్యంలో ఉన్న ప్రచారం. ఒక వేళ కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనుకుంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ అసెంబ్లీ రద్దు. ముందస్తు వచ్చినా రాకపోయినా... సాధారణ ఎన్నికలు కూడా అంత దూరంలో ఏమి లేవు. ఈ నేపథ్యంలోనే టికెట్ల అంశంపై ప్రశాంత్ కిషోర్ సర్వేలు నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ సర్వేలు చేస్తున్న మాట వాస్తవమేనని కేసీఆర్ కూడా ఇప్పటికే అంగీకరించారు. పార్టీ పనితీరు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సర్వేల వివరాలు ఎలా ఉన్నా ఎమ్మెల్యేల పనితీరు పై జరుగుతున్న సర్వేలపై మాత్రం ఆ పార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదు. కొత్తగా తమ నియోజకవర్గ పరిధిలోకి ఎవరు వచ్చినా సర్వేల పేరిట ఎక్కడైనా సమాచారం ఉన్నా వెంటనే ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారు. తమకు అనుకూలంగా సర్వేలు వచ్చేందుకు నానా తంటాలు కూడా పడుతున్నారు. * ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉంటున్నారా? * ఎమ్మెల్యేకు సమస్యలు చెబితే ఎప్పటిలోగా పరిష్కరిస్తున్నారు? * ఈ సారి ఈ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే గెలుస్తారా? * ఎమ్మెల్యే కాకుండా ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంది? ఈ అంశాలపై సర్వే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి సక్సెసైన కేసీఆర్ అప్పుడు ఎన్నికల్లో దాదాపుగా మెజార్టీ సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఈసారి కూడా అదే ఫార్ములాను అవలంబిస్తారా లేదా అన్నది పార్టీలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉమ్మడి జిల్లాలయిన వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాదులలో మార్పులు చేర్పులకు అవకాశం ఎక్కువగా ఉంటుందని కొందరు అంటున్నారు. ఈ జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి ఎదురయింది. దెబ్బతిన్న ఈ సెగ్మెంట్ల పై అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడ కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఫిర్యాదులు కూడా అందాయి. ప్రశాంత్ కిషోర్ టీం ప్రస్తుతం చేస్తున్న సర్వేల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్న కేసీఆర్, కనీసం 30 పైగా సీట్లలో మార్పులు చేస్తేనే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ 30 మంది ఎవరు అనే విషయం కేసీఆర్‌కు తప్ప మిగతా ఎవరికీ క్లారిటీ లేదని చెబుతున్నారు. కేసీఆర్ చాలా సందర్భాల్లో ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. పీకే 30 మందికి పైగా సిట్టింగులకు టికెట్ ఇవ్వకూడదని అంటే యధావిధిగా దానిని అమలు చేస్తారా లేక ప్రతికూల పరిణామాలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అన్నది కూడా ఆలోచించాలి. గత రెండు ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్కు ఎంత అవసరమో ఈసారి ఎన్నికల్లో గెలుపు అంతకన్నా ముఖ్యమైనది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించాలన్న వాదన చాలా రోజుల నుంచి పార్టీలో ఉంది. ఈసారి మంచి మెజార్టీ సాధిస్తే ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తారన్న భావన పార్టీ నేతల్లో ఉంది. ఇవన్నీ కేసీఆర్ అనుకున్న రీతిలో జరగాలంటే ప్రశాంత్ కిషోర్ ఇస్తున్న రిపోర్టులు కీలకమనే విషయాన్ని పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. -అప్పరసు నరసింహారావు, పొలిటికల్ బ్యూరో చీఫ్, సాక్షి టీవీ -
ఏఐసీటీఈ సర్వే: గణితంలో ఇంజనీరింగ్ విద్యార్థులు వీక్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో గణితం సబ్జెక్టులో వెనుకబాటు ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా ఆయా కోర్సుల్లో వారు తగిన నైపుణ్యాలను అలవర్చుకోలేకపోతున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరఖ్ సర్వే వెల్లడించింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో కీలకమైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఏఐసీటీఈ ‘పరఖ్’ పేరిట ఈ స్టూడెంట్ లెర్నింగ్ అసెస్మెంట్ (విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మూల్యాంకనం)ను ఇటీవల నిర్వహించింది. చదవండి: పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్సీ కీలక ఆదేశాలు.. ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది. సాంకేతిక విద్యలో అభ్యసన లోపాలను గుర్తించేందుకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఏఐసీటీఈ పరఖ్ పేరిట ఆన్లైన్ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2,003 సాంకేతిక విద్యాసంస్థలకు సంబంధించిన 1.29 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అభ్యర్థులు తమ అభ్యసన సామర్థ్యాలను ఈ పరఖ్ సర్వే ద్వారా స్వయం మూల్యాంకనం చేసుకునేలా దీన్ని నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నమోదైన ఈ సర్వే గణాంకాలను ఏఐసీటీఈ విశ్లేషించి నివేదికలు విడుదల చేసింది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులకు పరఖ్ ద్వారా ఏఐసీటీఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టు అంశాలతోపాటు ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహించింది. సెకండియర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు ఆయా కోర్ సబ్జెక్టు అంశాలను ఆధారం చేసుకొని మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంశాల్లో స్వయం సామర్థ్య పరీక్షలను పెట్టింది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు కోర్ సబ్జెక్టుల్లోనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాలపైనా నిర్వహించింది. మ్యాథ్స్‌లోనే సమస్యలు.. ఏఐసీటీఈ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. ఫస్టియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు అన్ని మేజర్ ప్రోగ్రాముల్లోనూ మ్యాథమెటిక్స్లోనే సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఈ విద్యార్థులకు గణితం సబ్జెక్టులో ప్రాథమిక స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు సరిగా అలవడకపోవడమేనని పేర్కొంది. ప్రాథమిక, మాధ్యమిక, హయ్యర్ సెకండరీ స్థాయిల్లో గణితం సబ్జెక్టులో వీరికి తగిన సామర్థ్యాలు అలవడలేదని వివరించింది. అత్యధిక శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠశాల స్థాయిలోని సామర్థ్యలోపాలు ఇప్పుడు సమస్యగా మారాయని పేర్కొంది. 22,725 మంది ఫస్టియర్ విద్యార్థులకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాల్లో నైపుణ్యాలు అంతంతమాత్రంగా ఉండగా.. గణితంలో మరింత అధ్వానంగా ఉన్నారని తేల్చింది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు సంబంధించి జనరల్ నాలెడ్జి, తదితర అంశాల్లోనూ చాలా వెనుకబడి ఉన్నారని స్పష్టం చేసింది. సబ్జెక్టులవారీగా స్కోర్లు ఎంతంటే.. పరఖ్ ద్వారా నిర్వహించిన సర్వే పరీక్షలో విద్యార్థులు ఇచ్చిన సమాధానాలను అనుసరించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్టుల్లో ఏయే విభాగాల విద్యార్థులు ఎంత స్కోర్ చేశారో పరిశీలిస్తే అన్ని విభాగాల్లోనూ సగం శాతమే స్కోర్ ఉంది. గణితంలో.. ♦గణితంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు సాధించిన సగటు స్కోరు 37.48 శాతం మాత్రమే. ♦ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విద్యార్థుల సగటు స్కోరు 38.9 శాతం. ♦మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 39.48 శాతం ♦ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 40.02 శాతం ♦కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 40.12 శాతం ఫిజిక్స్‌లో.. ♦ఫిజిక్స్ అంశాల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. 52.5 శాతం సగటు స్కోర్‌తో మంచి ప్రతిభ చూపారు. ♦వీరి తర్వాత 51 శాతం స్కోర్‌తో కంప్యూటర్ సైన్స్, 50 శాతం స్కోర్‌తో మెకానికల్ విద్యార్థులు వరుస స్థానాల్లో ఉన్నారు. కెమిస్ట్రీలో.. కెమిస్ట్రీ ప్రశ్నలకు సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 53.1% సగటు స్కోర్‌తో అగ్రభాగాన ఉన్నారు. సీఎస్ఈ విద్యార్థులు 53%, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 51.3 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచారు. ఆప్టిట్యూడ్ టెస్టులో.. ఆప్టిట్యూడ్ టెస్టుకు సంబంధించి జనరల్ నాలెడ్జి తదితర అంశాల్లో విద్యార్థుల లోపాలు పరఖ్ సర్వేలో వెల్లడయ్యాయి. జనరల్ నాలెడ్జి, లాజికల్ రీజనింగ్ తదితర అంశాల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. సర్వేలో పాల్గొనని అనేక విద్యాసంస్థలు పరఖ్ సర్వేలో ఐఐటీలు సహా అనేక సాంకేతిక విద్యాసంస్థలు పాల్గొనలేదు. తమిళనాడు నుంచి 24,499 మంది పాల్గొనగా.. అత్యల్పంగా గోవా నుంచి ముగ్గురు విద్యార్థులే పాల్గొన్నారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ల నుంచి 12,387 మంది విద్యార్థులు ఈ పరఖ్ సర్వేలో భాగస్వాములయ్యారు. ఏపీ నుంచి 5,628, తెలంగాణ నుంచి 4,234, కర్ణాటక నుంచి 8,739, కేరళ నుంచి 3,431, మహారాష్ట్ర నుంచి 11,334, యూపీ నుంచి 5,288 మంది పాల్గొన్నారు. -
కోవిడ్ వ్యథా చిత్రం.. బతుకు భారమై.. చదువుకు దూరమై..!
కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ బీటెక్ పూర్తి చేశాడు. తర్వాత ఎంబీఏ చేయాలనుకున్నాడు. కానీ వాళ్ల అమ్మకు 2020లో కోవిడ్ వచ్చింది. చికిత్స ఖర్చులతో ఆ కుటుంబం అప్పుల పాలైంది. దీనితో పై చదువుల ఆశలు వదిలేసి.. ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు కంపెనీలో నెలకు రూ. 25వేల వేతనంతో ఉద్యోగం చేస్తున్నాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన నవీన్ ప్రకాశ్ ఇంజనీరింగ్ పూర్తిచేశాక ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాలనుకున్నాడు. అందుకోసం ఏర్పాట్లూ చేసుకుంటూ వచ్చాడు. కానీ నవీన్ తండ్రిని కోవిడ్ బలితీసుకుంది. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు నవీన్ కిరాణా దుకాణం నడిపిస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కొట్టిన దెబ్బకు వేలు, లక్షల మంది యువత పైచదువులను, భవిష్యత్తు ఆశలను వదిలేసుకుని ఉద్యోగం, ఉపాధి వేటలో పడుతోంది. కోవిడ్ తర్వాత తిరిగి ఉపాధి అవకాశాలు పెరిగాయని.. యువత ఉద్యోగాల వైపు పరుగులు పెడుతోందని ప్రభుత్వాలు, సామాజిక సర్వేలు చెప్తున్నాయి. కానీ దీని వెనుక విషాద గాధలు ఎన్నో ఉన్నాయి. కోవిడ్‌తో చితికిపోయిన పేద, మధ్యతరగతి కుటుంబాల దయనీయ కథలున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ చేసిన సర్వే నివేదికలో ఈ విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఏమిటీ సర్వే? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 2000వ సంవత్సరంలో ‘యంగ్‌లైవ్స్’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టింది. మన రాష్ట్రంలో ఆ సర్వే బాధ్యతను సెస్ తీసుకుంది. మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లోని కొన్ని మండలాలను ఎంచుకుని.. 6–18 నెలల పిల్లలు 2 వేల మంది (యంగర్ గ్రూప్)ని, 7–8 ఏళ్ల పిల్లలు వెయ్యి మంది (ఓల్డర్ గ్రూప్)ని సర్వే కోసం ఎంపిక చేసింది. వారి జీవితంలో విద్య, పౌష్టికాహారం, ఆర్థిక పరిస్థితుల ప్రభావం, మానసిక పరివర్తన వంటి అంశాలను ప్రతీ నాలుగేళ్లకోసారి అధ్యయనం చేస్తూ వస్తోంది. తెలంగాణలో 2002లో మొదటి విడత సర్వే చేశారు. తర్వాత 2009, 2013, 2016లో, తాజాగా 2020లో సర్వే చేపట్టారు. సర్వేకు ఎంపికచేసిన వారిలో యంగర్ గ్రూప్ వారు ప్రస్తుతం 22–23 ఏళ్లు, ఓల్డర్ గ్రూప్ వారు 29–30 ఏళ్ల మధ్య ఉన్నారు. పేద, మధ్య తరగతి, ఉన్నత కుటుంబాలు.. అన్ని ఆర్థికస్థాయిలవారూ ఉన్నారు. కోవిడ్ కారణంగా సెస్ ప్రతినిధులు వారందరినీ ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి.. తాజాగా నివేదికను విడుదల చేశారు. కోవిడ్‌తో చితికిన బతుకులు పేద, మధ్యతరగతి వర్గాల బతుకులను కోవిడ్ మహమ్మారి చిదిమేసిందని సెస్ ‘యంగ్ లైవ్స్’ అధ్యయనంలో తేలింది. సర్వే నివేదిక ప్రకారం.. అనియత రంగంలో (రోజువారీ కూలీలు, భవన నిర్మాణ రంగం వంటివి) పనిచేస్తున్న, స్వయం ఉపాధి పొందుతున్న వారి కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. వీరిలో 72 శాతం కుటుంబాల్లో ఇంటికి ఒక్కరైనా ఉద్యోగం కోల్పోయారు. స్వయం ఉపాధి పొందేవారిలో 62 శాతం మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. మొత్తంగా 63 శాతం కుటుంబాల్లో 20–23 ఏళ్ల మధ్య యువత విద్యకు దూరమయ్యారు. 27 శాతం మందికి చదువుపై ఆసక్తి ఉన్నా విధిలేక ఉపాధి/ఉద్యోగం కోసం వెళ్లాల్సి వచ్చింది. భారీగా ఉద్యోగాల్లోకి.. వాస్తవానికి లాక్డౌన్ తర్వాత యంగర్ గ్రూప్ (20–23 ఏళ్ల మధ్యవారు) ఉద్యోగాల్లోకి ఎక్కువగా వచ్చారు. కానీ ఇవేవీ వారి చదువుకు తగ్గ ఉపాధి అవకాశాలు కాదని సర్వే పేర్కొంది. ఉదాహరణకు ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి ఓ చిన్న కంపెనీలో క్లర్క్‌గా కూడా పనిచేస్తున్నాడని తెలిపింది. స్కిల్డ్ పోస్టులు వెతుక్కునే అవకాశం కూడా లేకుండా పోయిందని వెల్లడించింది. సామాజిక అసమానతల దిశగా.. కోవిడ్ కాలంలో పేద, మధ్య తరగతి కుటుంబాల ఆదాయం గణనీయంగా తగ్గింది. ఎవరో ఒకరు ఉద్యోగం పోగొట్టుకోవడమో, ఉపాధి తగ్గడమో, కోవిడ్ వల్ల అప్పుల పాలవడమో, ఎక్కడికీ వెళ్లలేక ఉన్నదంతా అమ్మేసి లేదా పిల్లల చదువులకు దాచిపెట్టింది వాడేసి ఆర్థికంగా చితికిపోవడమో జరిగింది. కోవిడ్ తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చినా.. పేద, మధ్య తరగతి వర్గాలు ఏదో ఒక ఉద్యోగాన్ని చూసుకోక తప్పలేదు. దీనివల్ల ఆ కుటుంబాల వారు ఉన్నత చదువులకు దూరమయ్యారు. ఇది సామాజిక అసమానతలకు దారి తీస్తోందని యంగ్ లైవ్స్ సర్వే వెల్లడించింది. 20–23 ఏళ్ల మగ పిల్లలు కుటుంబ పోషణ కోసం చదువు మానేసి ఉద్యోగాల కోసం వెళితే.. ఆడపిల్లలు ఉద్యోగాలు మానేసి, ఇంటిపట్టునే ఉండి అందుబాటులో ఉన్న చదువులను ఆశ్రయిస్తున్నారని సర్వే గుర్తించింది. ఈ నేపథ్యంలోనే 73 శాతం యువకులు ఉపాధిలో ఉంటే, మహిళలు మాత్రం 36 శాతమే ఉన్నట్టు తెలిపింది. షెడ్యూల్డ్ కులాలపై కోవిడ్ ప్రభావం మరింత ఎక్కువగా కన్పిస్తోందని సర్వే పేర్కొంది. లాక్‌డౌన్‌కు ముందు 46 శాతం మంది ఉపాధి/ఉద్యోగంలో ఉండగా.. అది ఇప్పుడు 62 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇదేస్థాయిలో యువత చదువులకు దూరమైందని పేర్కొంది. తక్షణం మేల్కొనాలి కోవిడ్ ప్రమాద ఘంటికలు పేద, మధ్య తరగతి వర్గాలపై స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయనే సంకేతాలు కన్పిస్తున్నా, వాళ్లంతా ఉన్నత చదువులకు దూరమయ్యారనే వాస్తవాలు గమనించాలి. కోవిడ్ దెబ్బకు చదువుకునే అవకాశాలు సన్నగిల్లి, ఆర్థిక భారంతోనే కుటుంబ పోషణకు ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి యువతను వెంటాడుతోంది. ఇది రానురాను ఆర్థిక అసమానతలకు దారి తీస్తుంది. ఈ వర్గాలను ప్రోత్సహించి, ఉన్నత చదువుల వైపు మళ్లించాలి. వారికి ఆర్థిక చేయూతనిచ్చే దిశగా ప్రభుత్వ పథకాలు ఉండాలి. – ప్రొఫెసర్ ఈ.రేవతి, సెస్ డైరెక్టర్ సర్వేలో గుర్తించిన పలు కీలక అంశాలివీ.. 2021 నాటికి పేదరికం స్థాయి గణనీయంగా పెరిగింది. కష్టాల్లో ఉన్న కుటుంబాలు, పేద లేదా నిరాశ్రయులైన కుటుంబాలు కోవిడ్‌కు ముందు 36 శాతంగా ఉంటే.. 2020 ఆగస్టు–అక్టోబర్ నాటికి 52 శాతానికి పెరిగాయి. కోవిడ్ తగ్గినా 2021 డిసెంబర్ నాటికి కూడా 46శాతం కుటుంబాలకు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోనూ నిరుపేదల శాతం పెరిగింది. కోవిడ్ సమయంలో డిజిటల్ విద్యా అందడంలోనూ తారతమ్యాలు కనిపించాయి. ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యంలేని యంగర్ గ్రూప్ యువతలో ప్రతి ఐదుగురిలో ఒకరు అక్టోబర్ 2021 నాటికి చదువును విడిచిపెట్టాల్సి వచ్చింది. స్త్రీపురుష ఉపాధి అంతరం గణనీయంగా పెరిగింది. కోవిడ్‌కు ముందు 16 శాతంగా ఉన్న వివక్ష.. 2021 డిసెంబర్ నాటికి 36 శాతానికి పెరిగింది. కోవిడ్ సమయంలో వివిధ ఆందోళనలతో యువత మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది. 2021 డిసెంబర్ నాటికి 11 శాతం మంది డిప్రెషన్ లక్షణాలతో కనిపించారు. -
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021: దేశంలో పెరిగిన పచ్చదనం..
న్యూఢిల్లీ: ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన ద్వైవార్షిక ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021 ప్రకారం, భారతదేశం తన అటవీ విస్తీర్ణంలో 1,540 చ.కి.మీ పెరుగుదలను నమోదు చేసింది. ఈ మేరకు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలో 80.9 మిలియన్ హెక్టార్లలో అడవులు, చెట్ల విస్తీర్ణం ఉంది. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 24.62 శాతంగా నమోదైంది. గడిచిన రెండేళ్లలో దేశంలో 2,261 చ.కి.మీ మేర అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగింది. దేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఏపీలో గరిష్టంగా 647 చ.కి.మీ మేర అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదైంది. తర్వాతి స్థానాల్లో తెలంగాణ 632 చ.కి.మీ, ఒడిశాలో 537 చ.కి.మీ ఉన్నాయి. దేశంలో దాదాపు 17 రాష్ట్రాలు, యూటీల్లో 33 శాతానికిపైగా అటవీ, చెట్ల విస్తీర్ణం ఉంది. మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్‌లో 70 శాతానికి పైగా అడవులు, చెట్ల విస్తీర్ణం ఉన్నట్లు ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది. చదవండి: (బీజేపీకి షాక్ మీద షాక్.. యూపీలో 24 గంటల వ్యవధిలో..) -
సానుకూల పరిస్థితులున్నాయ్.. సమష్టిగా సాగుదాం
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిస్థితులున్నాయి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని పలు సర్వేల్లో తేలింది. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలి. అంతర్గత కలహాలకు అవకాశం ఉండకూడదు. టీపీసీసీ అధ్యక్షుడు అన్ని వర్గాల నాయకులను సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలి..’ అని టీపీసీసీ నేతలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ దిశా నిర్దేశం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాకెక్కి మాట్లాడితే సహించేది లేదని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు. బుధవారం ఠాగూర్ అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జూమ్ యాప్ ద్వారా జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డితో పాటు కన్వీనర్ షబ్బీర్ అలీ, పీఏసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా ఈ భేటీలో ఏఐసీసీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ‘పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేయాలి. కాంగ్రెస్ తలపెట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లాలి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, నిత్యావసర సరు కుల ధరల పెరుగుదల అంశాలను ప్రజలకు వివరించాలి. ఈనెల 10నుంచి నిర్వహించే ఏఐసీసీ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలి. జన జాగరణ పాదయాత్రలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా తప్పనిసరిగా నిర్వహించాలి. ఏఐసీసీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొని విజయవంతం చేయాలి..’ అని ఠాగూర్ పిలుపునిచ్చారు. మార్చి 31లోగా సభ్యత్వ నమోదు ‘సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగం పెంచాలి. రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా నిర్దేశించాం. ఇప్పటివరకు 6 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయి. మార్చి 31 నాటికి మిగతా లక్ష్యాన్ని పూర్తిచేయాలి. సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తకు రూ.2 లక్షల ప్రమాద బీమా వస్తుంది..’ అని తెలిపారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జంగ్ సైరన్, దళిత దండోర, వరి దీక్షలు, కల్లాల్లో కాం గ్రెస్ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని అభినందించారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్ని స్థాయిల్లో క్రమశిక్షణ పాటించాలి. అంతర్గత కలహాలతో రచ్చకెక్కొద్దు. ఇబ్బందులు తలెత్తితే నాకు లేదా ఏఐసీసీ కార్యదర్శికి, లేదా సోనియాగాంధీకి లేఖ ద్వారా అభిప్రాయాలను తెలపాలి..’ అని సూచించారు. కాగా క్రమశిక్షణ కమిటీ పనితీరుపై పార్టీ సీనియర్లు వీహెచ్, పొన్నాల అసంతృప్తి వ్యక్తం చేశారు. జంగా రాఘవరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని వారు ప్రస్తావించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామని, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు చెప్పారు. ‘ఏఐసీసీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. వీటితో పాటు టీపీసీసీ తరఫున కూడా పక్కా ప్రణాళికతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం..’ అని తెలిపారు. షబ్బీర్‌అలీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ కూడా మాట్లాడారు. వైఖరి నచ్చకుంటే తప్పుకుంటా: జగ్గారెడ్డి ఇటీవల రేవంత్‌రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టిన జగ్గారెడ్డి ఈ సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యారు. తాను ఏం మాట్లాడిందీ, ఎందుకు మాట్లాడిందీ వివరించారు. ఒకవేళ తన వ్యవహారశైలి పార్టీ అధిష్టానానికి నచ్చకపోతే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పినట్లు తెలిసింది. సీనియర్ నేతలు జానారెడ్డి, శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని ఎవరూ తప్పుకోవాల్సిన అవసరం లేదని, కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేద్దామని అన్నారు. -
వర్క్ ఫ్రమ్ హోం: ఆఫీస్‌లకు శాశ్వతంగా గుడ్‌బై!
పరిమితి లేని పని గంటలు.. పని ఒత్తిడిని భరిస్తూనే వర్క్ ఫ్రమ్ హోంలో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు ఎంప్లాయిస్. దీంతో జీతభత్యాల కోతల నడుమ కొన్నాళ్లపాటు అనుమతులు ఇస్తున్నాయి కంపెనీలు. వీటికి తోడు డెల్టా ఫ్లస్ వేరియెంట్ కేసులు పెరుగుతున్న టైంలో.. జనవరి వరకు వర్క్ ఫ్రమ్ హోంను పొడిగించాయి కొన్ని ఐటీ కంపెనీలు. అయితే ఈ అంశం ఇప్పుడు కంపెనీల పరిధి దాటిపోయినట్లు అనిపిస్తోంది. ఆఫీసులు తెరిచినా.. తాము ఎట్టిపరిస్థితుల్లో తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న చాలామంది ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బలవంతపు ఆదేశాలు జారీ చేస్తే.. కంపెనీలను వీడతామంటూ కుండబద్ధలు కొట్టేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం విషయంలో చాలా కంపెనీలు వరుసగా ఎంప్లాయిస్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము శాశ్వతమైన వర్క్ ఫ్రమ్ హోంకి ఆసక్తి చూపిస్తున్నట్లు ఉద్యోగులు చెప్తున్నారు. ఈ మేరకు కొన్ని సర్వేలు ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి. అయితే కంపెనీల స్పందన ఎలా ఉండబోతుందనేది రానున్న రోజుల్లోనే తెలిసేది. ►లండన్‌కు చెందిన ప్రైస్‌వాటర్‌హౌజ్ కూపర్స్.. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న 41 శాతం మంది తాము అసలు ఆఫీస్‌లకు రమ్మన్నా.. రామని తేల్చి చెప్పారు. జనవరిలో ఇదే కంపెనీ నిర్వహిచిన సర్వేలో కేవలం 29 మాత్రమే ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. చదవండి: హైదరాబాద్ ఐటీ కంపెనీల నయా ట్రెండ్ ఇది! ► భారత్‌కు చెందిన ఓ ప్రముఖ ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్ కంపెనీ ఆగష్టు రెండో వారంలో.. లక్షన్నర మంది ఎంప్లాయిస్ అభిప్రాయంతో ఓ సర్వే చేపట్టింది. అందులో 48 శాతం ఉద్యోగులు శాశ్వతమైన వర్క్ ఫ్రమ్ హోంకి ఓటేశారు. ఒత్తిడిలో ఉన్నా.. తాము రిమోట్ వర్క్‌తో అన్ని విధాలుగా కంఫర్ట్‌గా ఉన్నట్లు చెప్పారు. ► భారత్‌కు చెందిన మరో ఐటీ కంపెనీ జులై చివరి వారంలో చేపట్టిన సర్వేలో.. కరోనా పరిస్థితులు ఎలా ఉన్నా 19 శాతం ఉద్యోగులు రిమోట్ వర్క్(వర్క్ ఫ్రమ్ హోం)కే సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.17 శాతం మంది వారానికి మూడు రోజులైనా వర్క్ ఫ్రమ్ హోం కావాలని కోరుకుంటున్నారు. 22 శాతం మంది తాము కనీసం ఒక్కరోజైనా కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ► తెలుగు రాష్ట్రాల్లోనూ హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ 1500 మందితో ఇలాంటి సర్వేనే నిర్వహించగా.. 38 శాతం ఉద్యోగులు శాశ్వతమైన వర్క్ ఫ్రమ్ హోంను.. 21 శాతం వారంలో కనీసం మూడు రోజులైనా వర్క్ ఫ్రమ్ హోం కోరుకున్నారు. వ్యాక్సినేషన్ సర్వే చాలా కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో కచ్చితంగా ఉండాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో వర్క్ ఫ్రమ్ హోంతో పాటు ఆఫీసులకు రావాలనుకుంటున్న ఉద్యోగులను తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని ఆదేశిస్తున్నాయి. అయితే ఈ కంపల్సరీ రూల్‌ను చాలామంది ఉద్యోగులు ఆమోదిస్తున్నారు. గాలప్ సర్వే ప్రకారం.. 36 శాతం ఉద్యోగులు ఈ నిబంధనకు మద్దతు తెలపగా. 29 శాతం ఉద్యోగులు మాత్రం ఈ రూల్‌తో విభేదిస్తున్నారు. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం.. బాబోయ్ మాకొద్దు! -
కోవిడ్ ప్రమాదంలో 40 కోట్ల మంది
న్యూఢిల్లీ: దేశంలోని ఆరేళ్లపైబడి వయస్సున్న మూడింట రెండొంతుల మంది జనాభాలో కోవిడ్ నిరోధక యాంటీబాడీలు అభివృద్ధి చెందినప్పటికీ, సుమారు 40 కోట్ల మంది కోవిడ్ బారిన పడే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది. జాతీయ స్థాయిలో జూన్–జూలైల్లో చేపట్టిన నాలుగో సెరో సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మీడియాకు చెప్పారు. దేశ జనాభాలోని ఆరేళ్లకు పైబడిన మూడింట రెండొంతుల జనాభా, 67.6% మందిలో కోవిడ్ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు తేలిందని చెప్పారు. ఇంకా, సుమారు 40 కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మారి బారినపడే ప్రమాదంలో ఉన్నారని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తల్లో 85 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడైంది. కానీ, దేశంలోని ప్రతి 10 మందిలో ఒక ఆరోగ్య కార్యకర్త ఇప్పటికీ టీకా వేయించుకోలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలకు చెందిన 28,975 మంది సాధారణ ప్రజలు, 7,252 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ సర్వే జరిగింది. పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ కోవిడ్‌పై పోరులో రాజీ పడరాదని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిం దేనని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, సామాజిక, మత, రాజకీయ సమావేశాలకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. చిన్నారులు వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడేందుకు అవకాశాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే స్కూళ్లు తెరవడం మంచిదని సూచించారు. 125 రోజుల్లో కనిష్ట స్థాయికి కేసులు దేశంలో 125 రోజుల తర్వాత ఒక్క రోజులో కనిష్టంగా 30,093 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,11,74,322కు చేరాయి. అదేవిధంగా, 111 రోజుల తర్వాత ఒక్క రోజులో అతితక్కువగా 374 కోవిడ్ మరణాలు సంభవించాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో, కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,14,482కు చేరుకుంది. యాక్టివ్ కేసులు కూడా 117 రోజుల తర్వాత 4,06,130కి తగ్గాయని పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 1.30% మాత్రమే. రికవరీ రేట్ కూడా 97.37%గా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,03,53,710 మంది కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. చిన్నతరగతులతో స్కూళ్లు ఆరంభించడం బెటర్! ఒకవేళ భారత్‌లో బడులు తెరవడం ఆరంభించేట్లయితే ముందుగా చిన్న తరగతులతో ఆరంభించడం మేలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ సూచించారు. మానవ కణాల్లో వైరస్ రాకను అనుమతించే గ్రాహకాలు చిన్నపిల్లల్లో తక్కువని, అందువల్ల పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లల్లో వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని వివరించారు. అయితే బడులు తెరిచినా సరే నిబంధనలు కఠినంగా పాటించాల్సిందేనని సూచించారు. ముఖ్యంగా టీచర్లు ఇతర సిబ్బంది టీకాలు వేయించుకొనిఉండాలన్నారు. దేశంలో 6–9వయసు గ్రూపు జనాభాలో సీరోప్రీవాలెన్స్(బ్లడ్ సీరమ్‌లో సూక్ష్మజీవి స్థాయి) పెద్దలతో సమానంగా దాదాపు 57.2 శాతంఉందని జాతీయ సర్వేలో తేలిందన్నారు. ప్రైమరీ తరగతులకు చెందిన పిల్లలతో బడులు ఆరంభించడం మంచిదని అభిప్రాయపడ్డారు. పలు దేశాల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ సందర్భాల్లో కూడా ప్రైమరీ బడులు మూసివేయలేదని తెలిపారు. అందువల్ల మనదగ్గర కూడా ముందుగా ప్రైమరీ పాఠశాలలు తెరవడం మంచిదన్నారు. -
కరోనా మార్చిన అలవాట్లు.. యుగోవ్ సర్వే ఏం చెప్తోంది..?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల షాపింగ్ వైఖరిలో గణనీయంగా మార్పులొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాలలో మార్కెట్ పరిశోధన సంస్థ యుగోవ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటికొచ్చింది. ఈ మార్పులు ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, భారత్, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో 18 వేల మంది పాల్గొన్నారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవి ఇవీ.. తగ్గిన జంక్‌ఫుడ్ వినియోగం కరోనా కారణంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు, లాక్డౌన్ విధించారు. వైరస్ తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. జంక్‌ఫుడ్‌కు బదులుగా ఎక్కువ పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను తమ డైట్ చార్ట్‌లో చేర్చినట్లు 66 శాతం మంది సర్వే సందర్భంగా తెలిపారు. అదే సమయంలో మిగతా దేశాల్లోని 38% మంది ఈ విషయాన్ని అంగీకరించారు. 28% మంది జంక్‌ఫుడ్ తినడం తగ్గించినట్లు కూడా తెలిపారు. అదే సమయంలో భారత్‌లో 47% మంది ప్రజలు జంక్‌ఫుడ్ తగ్గించినట్లు పేర్కొన్నారు. మిగతా దేశాల్లోని 15% మంది ప్రజలు ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం తగ్గించామని చెబితే, భారత్‌లో ఇది 32%గా ఉంది. అదే సమయంలో, భారత్‌లో 29%, చైనాలో 27% మంది ప్రజలు మునపటి కంటే అధికంగా మద్యం తీసుకున్నామన్నారు. ఇతర దేశాల వారిలో ఇది 25%గా ఉంది. కాస్మోటిక్స్‌పై తగ్గిన మోజు సర్వేలో మరో ఆసక్తికర విషయం సైతం వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విధించిన ఆంక్షల ప్రభావం, కాస్మోటిక్ ఉత్పత్తులపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని కారణంగా కాస్మోటిక్ కొనుగోళ్ళు తగ్గుముఖం పట్టాయి. భారతదేశంలో 36% మంది ప్రజలు ప్రస్తుతం కాస్మోటిక్ ఉత్పత్తులను తక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రపంచంలో 33% మంది ప్రజలు సౌందర్య ఉత్పత్తులను తక్కువగా కొనుగోలు చేశామని వెల్లడించారు. స్థానిక కిరాణా షాపులకు ఊతం దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా షాపింగ్ మాల్స్, సూపర్మార్కెట్లు, పెద్ద దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసే అలవాటు తగ్గి, దగ్గర్లోని చిన్న కిరాణా షాపులకు మారింది. భారతదేశంలో ప్రజలు చిన్న వ్యాపారానికి మద్దతు ఇస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు ఇంటి సమీపంలో ఉన్న దుకాణాల నుంచి వస్తువులను కొనుగోలు చేయడం కొనసాగించారు. మొత్తం 17 దేశాలలో 60% మంది స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలని అనుకుంటున్నామని తెలిపారు. కావాల్సినవి మాత్రమే కొంటున్నారు ఈ మహమ్మారి సమయంలో కావాల్సిన వస్తువులను మాత్రమే కొంటున్నారని సర్వేలో తేలింది. ఇటువంటి షాపింగ్ ఇండోనేసియాలో 92%, భారతదేశంలో 90% మందికి, అగ్రరాజ్యం అమెరికాలోని 74% మందికి అలవాటైంది. మెక్సికోలో 83%, భారత్‌లో 81% మంది కరోనా కారణంగా తమ షాపింగ్ అలవాట్లు మారిపోయాయని చెప్పారు. అయితే ఈ ప్రభావం చైనీయులపై ఏమాత్రం కనిపించలేదు. కరోనా వల్ల వచ్చిన మార్పులతో చైనా మార్కెట్ తక్కువగా ప్రభావితమైంది. గతేడాది కరోనా వైరస్‌ను కనుగొన్న తరువాత చైనాలో లాక్డౌన్ విధించారు. అయినప్పటికీ చైనా ఆర్థిక వ్యవస్థ మిగతా దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉంది. -
మమతకు కష్టాలు తప్పవేమో, ‘పీపుల్స్ పల్స్’ ఇదే!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు తథ్యంగా కన్పిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వం పట్ల నెలకొన్న వ్యతిరేకతే దీనికి కారణం. పశ్చిమ బెంగాల్లో ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులు పర్యటించి రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ డైరెక్టర్, రీసెర్చర్ డాక్టర్ సజ్జన్ కుమార్ ఈ నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్ల ఈసారి బీజేపీకి లబ్ది చేకూరే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 160 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. రాష్ట్రంలోని 70 స్థానాల్లో మాత్రమే తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలత కన్పిస్తోంది. 12 స్థానాల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి అనుకూలత ఉంది. దాదాపు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ-టీఎంసీ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా పోటీ నెలకొంది. రాష్ట్రంలోని 5 స్థానాల్లో టీఎంసీ-లెఫ్ట్ కూటమి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరో 7 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య 1 స్థానంలో మాత్రమే తీవ్రమైన పోటీ నెలకొంది. బెంగాల్‌లోని మెజారిటీ హిందూ ఓటర్లు బీజేపీవైపు పోలరైజ్ అవుతున్నారు. బెంగాల్లో అబ్బాస్ సిద్దిఖీ కారణంగా ముస్లిం ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్‌కు ఇది పెద్ద దెబ్బ. ఇక రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా పరిశీలిస్తే... నార్త్ బెంగాల్ లో బీజేపీ హవా కొనసాగే అవకాశం ఉంది. నార్త్ బెంగాల్ లోని డార్జిలింగ్, కాళింపోంగ్, జల్పాయిగురి, అలిపుర్దౌర్, కూచ్ బిహార్ జిల్లాల్లోని 28 అసెంబ్లీ స్థానాలుండగా, వీటిలో ఏకంగా 22 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. మరో 5 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ మధ్య, 1 స్థానంలో టీఎంసీ-లెఫ్ట్-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నార్త్ బెంగాల్ లో 75 శాతానికిపైగా హిందువులుండగా, 14 శాతం ముస్లింలు, 4 శాతం క్రిస్టియన్లు, బౌద్ద ఓటర్లున్నారు. సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే.. దాదాపు 35 శాతం మంది ఎస్సీ ఓటర్లున్నారు. వీరిలో అత్యధిక ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్ పాలనపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. నార్త్ బెంగాల్లో మొత్తం ఓటర్లలో 10 శాతానికిపైగా ఎస్టీ ఓటర్లున్నారు. వీరు సైతం అధికార పార్టీ నేతల పనితీరు, అవినీతిపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఈసారి బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. మైనారిటీ ఓటర్ల ఆధికంగా ఉన్న నార్త్ దినాజ్ పూర్, సౌత్ దినాజ్ పూర్, మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో టీఎంసీకి అనుకూలత కన్పిస్తోంది. ఈ నాలుగు జిల్లాల్లోని మొత్తం ఓటర్లలో దాదాపు 50 శాతం మంది ముస్లిం సామాజికవర్గం వారే. ఈ జిల్లాల్లోని మొత్తం 49 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 17 స్థానాల్లో టీఎంసీ, 10 స్థానాల్లో బీజేపీ, 11 స్థానాల్లో లెఫ్ట్ కూటమికి అనుకూలత లభిస్తోంది. మిగిలిన సీట్ల విషయానికొస్తే...4 సీట్లలో టీఎంసీ-బీజేపీ, మరో 4 సీట్లలో బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా తీవ్రమైన పోటీ నెలకొంది. అలాగే 2 స్థానాల్లో టీఎంసీ-లెఫ్ట్-బీజేపీ, మరో స్థానంలో బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. సెంట్రల్ బెంగాల్ ప్రాంతంలోని బిర్భుం, పశ్చిమ వర్దమాన్+పూర్వవర్ధమాన్, నాదియా జిల్లాల్లో 49 అసెంబ్లీ స్థానాలున్నాయి. సెంట్రల్ బెంగాల్ రీజియన్ పరిధిలో 29 శాతం మంది ఎస్సీలు, 5 శాతానికిపైగా ఎస్టీలు ఉన్నారు. మతాల వారీగా విశ్లేషిస్తే... సెంట్రల్ బెంగాల్ రీజియన్ పరిధిలో 71 శాతానికైగా హిందువులు, 28 శాతానికిపైగా ముస్లింలు, 1 శాతానికిపైగా బౌద్దులున్నారు. సెంట్రల్ బెంగాల్ పరిధిలోని 49 సీట్లకుగాను 30 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. టీఎంసీకి 11 స్థానాల్లో, లెఫ్ట్ కూటమికి 1 స్థానంలో అనుకూలత కన్పిస్తోంది. అలాగే 7 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ కూటమి మధ్య తీవ్రమైన పోటీ (టఫ్ ఫైట్) నెలకొంది. జంగల్-మహల్ ప్రాంతంలోని పురూలియా, బంకురా, ఝారాగ్రాం, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లోని 42 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో 83 శాతానికిపైగా హిందువులు, 8 శాతానికిపైగా ముస్లింలు, 1 శాతంలోపు బౌద్దులు ఉన్నారు. జంగల్-మహల్ ప్రాంతంలోని 42 అసెంబ్లీ స్థానాలకుగాను 33 సీట్లలో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. అలాగే టీఎంసీకి 5 స్థానాల్లో మాత్రమే అనుకూలత కన్పిస్తోంది. మిగిలిన 4 సీట్లలో టీఎంసీ-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. సౌత్ బెంగాల్ పరిధిలో 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలోని హుగ్లి, హౌరా, ఉత్తర 24 పరగణాలు, కోల్ కతా, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 16 శాతం మంది ఎస్సీలు, 1.5 శాతం మంది ఎస్టీలున్నారు. ఈ ప్రాంతంలోని 126 అసెంబ్లీ స్థానాలకుగాను 65 స్థానాల్లో బీజేపీకి అనుకూల గాలి వీస్తోంది. అలాగే 37 స్థానాల్లో టీఎంసీకి అనుకూలత కన్పిస్తోంది. మరో 19 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ, 1 స్థానంలో టీఎంసీ-లెఫ్ట్ కూటమి, 4 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
111.03 ఎకరాల అటవీభూమికి టీడీపీ పెద్దల ఎసరు
విజయవాడ: ఓ కొండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమి అది. దానిని ఓ జమీందారు పలువురికి విక్రయించారు. ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖకు అప్పగించింది. ఆ మేరకు గెజిట్ కూడా ప్రచురించింది. అంతవరకు సవ్యంగానే ఉంది. ఆ తర్వాతే కథ ప్రారంభమైంది. ఎందుకంటే... అది విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన భూమి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నవీపోతవరం గ్రామ ఆర్.ఎస్.నంబర్ 86లో ఉన్న ఈ 111.03 ఎకరాల భూమికి విజయవాడ 24 కి.మీ. దూరం మాత్రమే. ఇక్కడి ఎకరం బహిరంగ మార్కెట్లో రూ. 3 కోట్ల వరకు ఉంది. ఈ లెక్కన భూమి విలువ రూ. 300 కోట్లు, అందులో నిక్షిప్తమైన కంకర విలువ సుమారు రూ. 200 కోట్లు. మొత్తం రూ. 500 కోట్లు ఉంటుందని ఓ అంచనా. దీనికి పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లో చదరపు గజం రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు ధర పలకడం గమనార్హం. దీంతో అటవీశాఖకు చెందిన ఆ భూమిని చేజిక్కించుకునే పన్నాగాలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ముమ్మరం చేశారు. మొదట 2000 సంవత్సరంలో మొదలు పెట్టి, 2014లో వేగవంతం చేశారు. దీనికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూత్రధారి కాగా, అప్పటి సీఎంవోలో పనిచేసిన ఓ ఐఏఎస్ చక్రం తిప్పారు. ఆ 111.03 ఎకరాల భూమిని కొనుగోలు చేసినందున తనకు రిజిస్ట్రేషన్ చేయాలని విజయవాడ నగర వాసి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) మాజీ సీఈవో జాస్తి కృష్ణ కిశోర్‌కు మామ అయిన ముక్కామల రామచంద్రరావు రిజిస్ట్రేషన్ శాఖను 2009లో సంప్రదించారు. వీలుకాదని చెప్పడంతో కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అటవీశాఖ భూమి అని రికార్డులు చెబుతున్నా... ►నవీపోతవరంలోని ఈ భూమిని సౌత్ వల్లూరు ఎస్టేట్ జమీందారు–1 తమదిగా పేర్కొంటూ వి.వీరేశలింగం, తదితరులకు విక్రయించారు. అయితే, ‘ది ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్ యాక్ట్ 1948’లో భాగంగా ఈ భూమిని 1949 సంవత్సరంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 1951లో అటవీశాఖకు బదలాయించింది. ►ప్రభుత్వ బదలాయింపును పునఃపరిశీలించాలని జమీందారు 1962లో ప్రభుత్వాన్ని కోరినా, ఆయనదేనని నిర్ధారించే రికార్డులు చూపలేకపోయారు. ►111.03 ఎకరాలను జమీందారు నుంచి కొనుగోలు చేశామని, ఆ భూమిని తమకు చూపాలని వి.వీరేశలింగం, మరో అయిదుగురు సర్వే విభాగం ద్వారా 2000లో పట్టా పొందారు. ముక్కామల రంగప్రవేశం.. ►వి.వీరేశలింగం, తదితరుల నుంచి 2006లో భూమి కొనుగోలు చేశానని, తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ముక్కామల రామచంద్రరావు సంప్రదించారు. ఇందుకు సర్వే విభాగం ఇచ్చిన పట్టాలను ఆధారంగా చూపారు. దీనిపై రిజిస్ట్రేషన్ విభాగం రెవెన్యూ శాఖను స్పష్టత కోరగా రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదని తేల్చేసింది. దీంతో సర్వే చేసి తనకు స్వాధీనం చేయాలని కోరుతూ రామచంద్రరావు ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్లను రెస్పాండెంట్లుగా చేర్చుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అయితే, ఆ భూమి అటవీశాఖకు చెందినదేనని ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కౌంటర్ పిటిషన్లో స్పష్టం చేశారు. అది ప్రభుత్వానికి చెందిన భూమే.. ►నవీపోతవరం సర్వే నెంబరు 86లోని భూమి అటవీశాఖకు చెందినదని తమ పరిశీలనలో స్పష్టమైందని కృష్ణా జిల్లా కలెక్టరు ఎ.ఎం.డి.ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ ఎం.మాధవీలత ‘సాక్షి’కి చెప్పారు. రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలింపజేశామని, న్యాయస్థానం దృష్టికి వాస్తవాలను తీసుకెళతామన్నారు. 20320/2009 రిట్ పిటిషన్లో జిల్లా ఉన్నతాధికారులను రెస్పాడెంట్లుగా వ్యూహాత్మకంగా చేర్చలేదని స్పష్టమవుతోందన్నారు. చిన్న ఉద్యోగుల వరకే పరిమితం చేశారన్నారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు న్యాయస్థానంలో వాదన వినిపించడానికి తమను కూడా అనుమతించాలని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామని కలెక్టరు, జేసీలు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వేగంగా పావులు... ►2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వేగంగా పావులు కదిలాయి. డీఎఫ్ఓగా బెనర్జీని నియమించి సర్వే ద్వారా 111.03 ఎకరాల సంగతి తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ, అటవీ, సర్వే శాఖలు ఉమ్మడి సర్వే నిర్వహించి సరిహద్దులు తేల్చాలని 2016 డిసెంబరు 13న డీఎఫ్ఓ ఉత్తర్వులిచ్చారు. కేవలం వారంలో అంటే అదే నెల 21లోగా పూర్తి చేయించి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవికుమార్‌కు పంపారు. అక్కడి కొండలు, గుట్టల్లోని 858 ఎకరాల భూమిని కేవలం వారం వ్యవధిలో సర్వే ముగించడం పరిశీలనాంశం. ఆ సర్వేకి మూడు నెలలకు పైగా పడుతుందని సర్వే విభాగానికి చెందిన రిటైర్డు అధికారి ఒకరు సాక్షికి చెప్పారు. త్వరితగతిన సర్వేకి అప్పటి జిల్లా కలెక్టరు ఎ.బాబు తమపై ఒత్తిడి తెచ్చారని అటవీశాఖ అధికారి ఒకరు వివరించారు. ►తనకు అందిన రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల ఉమ్మడి సర్వే నివేదికను ‘డిజిటల్ గ్లోబల్ పొజిషినింగ్ సిస్టం’ ద్వారా నిర్ధారించాలని ఎ.బాబు తర్వాత వచ్చిన కలెక్టరు బి.లక్ష్మీకాంతంకు సీసీఎఫ్ పంపారు. రెవెన్యూ రికార్డుల పరంగా ‘ఓకే’ అంటూ స్వల్ప వ్యవధిలోనే... అంటే 2017 ఫిబ్రవరి పదో తేదీకల్లా సీసీఎఫ్‌కు కలెక్టరు తిప్పి పంపారు. ►ఈ సర్వేలోనూ స్పష్టత లేదంటూ సర్వే నిర్వహించాలని ‘ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్’ను అటవీశాఖ 2018 అక్టోబరులో కోరగా రెండున్నర నెలల్లోనే సీసీఎఫ్‌కు నివేదిక అందింది. సాధారణంగా ఏపీఎస్ఎసీ నుంచి అంత త్వరగా నివేదిక అందదని, దాని కోసం అప్పటి సీఎంవోలోని సీని యర్ ఐఏఎస్ తన పరపతి ఉపయోగించారని సమాచారం. ►ఇక్కడ కూడా సర్వే స్పష్టత లేనందున టియోడిలైట్ సర్వే లేదా కాంపాస్ సర్వే (ఉత్తర దిశ, తూర్పు దిశల ఆధారంగా కో–ఆర్డినేటర్స్ టెక్నాలజీతో నిర్వహించే సర్వే)కి నిర్ణయం జరిగింది. 2019 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 9 కల్లా ఈ సర్వే కూడా ముగిసింది. ప్రైవేటు వ్యక్తికి అటవీభూమిని కట్టబెట్టేందుకు అనుకూల నివేదికలివ్వాలని మాజీ మంత్రి దేవినేని ఉమా, ఇతర ప్రభుత్వ పెద్దలు అధికారులకు హుకుం జారీ చేశారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ►సీఎంవోలో కీలకంగా వ్యవహరించిన ఓ ఐఏఎస్, కృష్ణా జిల్లా కలెక్టర్లు– అటవీ, సర్వే, రెవెన్యూ శాఖల అధికారులను పరుగులు పెట్టించారు. సీఎంఓలోనే ఈ అంశంపై పలు సమావేశాలు నిర్వహించారని ఓ అధికారి తెలిపారు. కాగా, ఈ ఎపిసోడ్‌ను పర్యవేక్షించిన అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారికి పదవీ విరమణ అనంతరం రాజ్యాంగ బద్ధమైన పదవిని గత సర్కారు కట్టబెట్టడం పరిశీలనాంశం. -
అత్యంత కాలుష్య నగరాలేవో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా ఢిల్లీ వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఢిల్లీని వెనక్కు నెట్టి మూడు నగరాలు అత్యంత కాలుష్యమైన నగరాలుగా ముందు వరుసలో నిలిచాయి. మొదటి రెండు నగరాలు బీహార్ రాజధాని పాట్నా, కాన్పూర్‌లు కాగా ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఐఐటీ కాన్పూర్, శక్తి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ మూడు నగరాలలో 2018 సంవత్సరానికి గానూ అక్టోబర్- నవంబర్ మధ్య కాలంలో గాలి నాణ్యత సూచీ(పీఎమ్) 2.5ను తాకినట్లు సర్వే వెల్లడించింది. ఈ మూడు నగరాల గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి క్షీణించిందని తెలిపింది. ఇండియా అధిక జనాభా కలిగిన చైనా కంటే యాభై శాతం అధికంగా గాలి కాలుష్యంతో ఇబ్బందులు పడుతోందని ఈ సర్వే పేర్కొంది. ప్రభుత్వాలు దీర్ఘకాలం ఈ సమస్యలను పట్టించుకోకపోవటమే దీనికి కారణమని తెలిపింది. అయితే ప్రభుత్వాలు మాత్రం చలికాలం కాబట్టి గాలిలో కాలుష్యం పెరిగిపోయిందనటం గమనార్హం. -
సర్వే రిపోర్ట్: మోదీకే పట్టం గట్టిన ప్రజలు
-
గ్రామస్వరాజ్ అభియాన్ ఖాతాలు తెరవాలి
ఆసిఫాబాద్ : గ్రామ స్వరాజ్ అభియాన్ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించి ఖాతాలు తెరవాలని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, ఐకేపీ ఏపీఎంలతో సమీక్షించారు. గ్రామస్వరాజ్ అబియాన్ యోజనలో ఏడు రకాల పథకాలు ఉన్నాయన్నారు. వీటిలో ముఖ్యంగా ధన్జన్యోజన, సురక్ష, జీవన జ్యోతి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఇందుకు సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా మండలాల వారీగా గ్రామాల్లో చేసిన సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి చేసిన సర్వే నివేదికను ఎల్డీఎంకు సాఫ్ట్ కాపీలను అందజేయాలని ఆదేశించారు. ఇంతుకు ముందు ఈ స్కీములో ఖాతాలు తెరిచిన వారిని రెన్యూవల్ చేయాలన్నారు. గ్రామాల వారీగా సర్వే పూర్తి చేసి వారం రోజుల్లో ఖాతాలు తెరిపించేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో పీడీ వెంకటి, ఎల్డీఎం చెంచు రామయ్య, ఎస్బీఐ మేనేజర్ కృష్ణమాచారి, జిల్లాలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు, ఏపీడీ రామకృష్ణ, జిల్లాలోని ఐకేపీ ఏపీఎంలు పాల్గొన్నారు. -
ఓటమి భయం.. బీజేపీ గుండెల్లో రైళ్లు..??
సాక్షి, బెంగళూరు : దక్షిణాదిలో ఇంకో దఫా పాగా వేసేందుకు తహతహలాడుతున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తప్పదేమోననే భయం గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. బీజేపీ మిత్ర పక్షమైన ఆరెస్సెస్ నిర్వహించిన సర్వేలో బీజేపీకి 70 సీట్లకు మించి రావాని తేల్చిచెప్పడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మిగతా సర్వేలు కూడా దాదాపు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. ఆరెస్సెస్ సర్వే బహిర్గత విషయాన్ని బీజేపీ ఖండించినా..లోలోపల మాత్రం చాలా మదనపడుతోంది. ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగానే మోదీ ఎన్నికల పర్యటన షెడ్యూల్లో మార్పులు చేశారు. మొదటగా మే 1 నుంచి ఐదు రోజుల పాటు 15 ర్యాలీల్లో పాల్గొనాలకున్న మోదీ, తన పర్యటనను మరో నాలుగు జిల్లాలకు పెంచి మొత్తం 21 ర్యాలీల్లో పాలు పంచుకోనున్నారు. హంగ్ ఏర్పడే అవకాశాలు ఉండటంతో జేడీఎస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను బీజేపీ మొదలెట్టేసింది. అందుకే ఉడిపిలో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. దేవగౌడపై ప్రశంసల జల్లు కురిపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జేడీఎస్‌ను బీజేపీకి తోక పార్టీ అని విమర్శించినా స్పందించలేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో నేతల మధ్య మాటల యుద్ధాలు బాగా పెరిగిపోయాయి. సోషల్ మీడియాను వేదిక చేసుకుని ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. మోదీ చరిష్మా, అమిత్‌షా వ్యూహం కర్ణాటక ఎన్నికల్లో ఫలిస్తాయో లేదో వేచి చూడాలి మరి. ఈ నెల 12న ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. మే 15 ఓట్ల లెక్కింపు జరగనుంది. -
కర్ణాటక ఎన్నికలు.. బీజేపీకి ఆరెస్సెస్ షాక్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికలకు సంబంధించి బీజేపీకి మాతృసంస్థ ఆరెస్సెస్ ఊహించని షాక్ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు మించి రాబోవని తేల్చి చెప్పింది. ఈ మేరకు అంతర్గత సర్వే వివరాలను దక్షిణ భారత ప్రాంతీయ ప్రముఖ్ వి నాగరాజ్.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు అందించినట్లు సమాచారం. బీజేపీ 70 లేదా ఆ లోపు సీట్లతోనే సరిపెట్టుకుంటుంది, కాంగ్రెస్‌కు 115 నుంచి 120 సీట్లు, జేడీఎస్ 29-34 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. నివేదికలో బీజేపీ వైఫల్యాలకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది. జీఎస్టీ ఎఫెక్ట్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు, నిరుద్యోగ సమస్య, తదితరాలు తీవ్ర ప్రభావం చూపటంతో బీజేపీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిపింది. ఇవిగాక రాజకీయ విశ్లేషణలో భాగంగా.. దళిత ఓట్లను క్రోడీకరించే విషయంలో బీజేపీ దారుణంగా విఫలమైందని.. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు లింగాయత్ కులస్తులపై పట్టుతప్పిందని, అన్నింటికి మించి గాలి జనార్దన్ అనుచరులకు పెద్దపీట వేయటం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లిందని నివేదికలో పేర్కొంది. అయితే ఈ సర్వే నివేదిక విషయాన్ని బీజేపీ వర్గాలు తోసిపుచ్చాయి. ఆరెస్సెస్ సర్వేలు అత్యంత గోప్యంగా ఉంటాయని, అలాంటప్పుడు ఈ నివేదికను ఎలా నమ్ముతారంటూ బీజేపీ నేత ఒకరు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అవకాశాలను దెబ్బ తీసేందుకే కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ నివేదిక సంగతి పక్కపెడితే ఇప్పటిదాకా వెలువడ్డ పలు సర్వే నివేదికలు మాత్రం స్పష్టమైన మెజార్టీ బీజేపీకి దక్కవనే తేల్చాయి. దీంతో బీజేపీలో వణుకు మొదలైంది. ఈ క్రమంలోనే జేడీఎస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సర్కారీ కొలువులకు పెరిగిన క్రేజ్
సాక్షి,న్యూఢిల్లీ : ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు తగ్గడం, ఉద్యోగ భద్రతపై ఆందోళనల నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ డిమాండ్ నెలకొంది. సర్కారీ కొలువులకు ఎన్నడూ లేనంతగా ప్రొఫెషనల్స్ సైతం పోటీ పడుతున్నారని రిక్రూట్మెంట్ సంస్థ వెల్లడించిన క్వార్ట్జ్ నివేదిక తెలిపింది. 2016లో నోట్ల రద్దుతో పాటు గత ఏడాది జులైలో జీఎస్టీ ప్రవేశపెట్టడంతో ఈ రెండేళ్లలో వ్యాపారాలు దెబ్బతిని ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ప్రైవేట్ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టాయి. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగాల్లో ఒకటైన ఐటీ సేవల పరిశ్రమ సైతం ఈ రెండేళ్లలో భారీ కుదుపులకు లోనైంది. ప్రభుత్వ ఉద్యోగాలే భద్రం.. ప్రైవేట్ రంగంలో అభద్రత నెలకొన్న క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలే సుస్థిరమైనవన్న ఆలోచన యువతలో కలుగుతున్నదని రిక్రూట్మెంట్ సంస్థ హెడ్‌హంటర్స్ వ్యవస్థాపకులు క్రిష్ లక్ష్మీకాంత్ అన్నారు. రైల్వేలు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో ప్యూన్ ఉద్యోగానికి సైతం నెలకు రూ 25,000 వేతనం లభిస్తోందని, సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు సైతం అతను టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీల్లో చేరితే మినహా ఇంత వేతనం లభించడం లేదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన వేతనంతో పాటు పిల్లల విద్య, గృహవసతి వంటి పలు సౌకర్యాలు ఉంటాయన్నారు.ప్రైవేట్ రంగంలో ఇంక్రిమెంట్లు ఒకింత అధికమగా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు లేఆఫ్‌ల బెడద ఉండదన్నారు. నోటిఫికేషన్ల జోరు.. కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పెద్ద ఎత్తున నియామకాలకు దిగడంతో పలు పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో రైల్వేలు 90,000 ఉద్యోగాలకు జారీ చేసిన ప్రకటనకు స్పందిస్తూ 2.3 కోట్ల దరఖాస్తులు వెల్లువెత్తాయి. టెక్నీషియన్లు, లోకోమోటివ్ డ్రైవర్ల వంటి పోస్టులకు 5 లక్షల మంది పైగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. రైల్వేల్లో క్లర్కులు, స్టేషన్ మాస్టర్, టీసీ, కమర్షియల్ అప్రెంటీస్, ట్రాక్‌మెన్, హెల్పర్, గన్‌మెన్, ప్యూన్ వంటి పోస్టులకు ప్రకటన వెలువడింది. ఇక తమిళనాడులో క్లరికల్ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు 992 మంది పీహెచ్డీ అభ్యర్థులు, 23,000 మంది ఎంఫిల్ చదివిన వారు, 2.5 లక్షల మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 8 లక్షల మంది గ్రాడ్యుయేట్లు పోటీపడ్డారు. కాగా మహారాష్ట్రలో ఈ నెల వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు డాక్టర్లు, ఎంబీఏలు, న్యాయవాదుల నుంచి దరఖాస్తులు రావడం గమనార్హం. ఇక ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్‌లో ప్యూన్ పోస్టుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్లో అత్యధిక విద్యార్హతలు కలిగిన వారు పెద్దసంఖ్యలో పోటీపడ్డారు. సర్కారీ పోస్టులకు పెద్దఎత్తున పోటీ నెలకొనడం ప్రైవేట్ రంగం కుదేలైన తీరుకు అద్దం పడుతున్నది. -
కృత్రిమ మేథతో మారుతున్న టెకీల తీరు
సాక్షి, న్యూఢిల్లీ : కృత్రిమ మేథ (ఏఐ)తో ఈ ఏడాది భారత్‌లో కంపెనీలన్నీ నవ్యతకు పెద్దపీట వేస్తున్నాయి. ఏఐ ప్రభావంతో ఈ ఏడాది 98 శాతం కంపెనీలు నూతన పనితీరుతో ముందుకెళ్లడమే అజెండాగా నిర్ధారించుకున్నాయని గ్లోబల్ టాలెంట్ ట్రెండ్స్ పేరిట మెర్సర్స్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. రాబోయే రోజుల్లో మానవ నైపుణ్యాలతో పాటు వినూత్న ఏఐ నైపుణ్యాలు, డిజిటల్ సాంకేతికతలే తమ వ్యాపారాలను దీటుగా నడిపిస్తాయని పలు సంస్థలు సర్వేలో పేర్కొన్నాయి. కంపెనీలు, ఉద్యోగులు మనుగడ కోసం నైపుణ్యాలను మెరుగుపరుచుకోక తప్పదని సర్వేలో పాల్గొన్నవారిలో 30 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు చెప్పినట్టు నివేదిక తెలిపింది. మరోవైపు సగానికి పైగా భారత టెకీలు తమ ప్రస్తుత ఉద్యోగం పట్ల సంతృప్తిగానే ఉన్నా కెరీర్ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఆయా సంస్థలను విడిచివెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారని మెర్సర్స్ కెరీర్ బిజినెస్ ప్రెసిడెంట్ ఇల్యా బొనిక్ తెలిపారు. పనివేళల్లో వెసులుబాటును అత్యధిక ఉద్యోగులు కోరుకుంటుడటం గమనార్హం. ఉద్యోగ ఎంపికలో పనివేళలకే తమ ప్రాధాన్యతని 92 శాతం మంది ఉద్యోగులు చెప్పారని సర్వే పేర్కొంది. -
ఉద్యోగార్ధులకు డబుల్ బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది నిరుద్యోగులకు కార్పొరేట్ భారతం నుంచి తీపికబురు అందింది. అత్యధిక నియామకాలతో పాటు భారీ ప్యాకేజ్లతో హైరింగ్ చేపట్టనున్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న 60 శాతం కంపెనీలు ఈ ఏడాది ఆకర్షణీయ వేతన ప్యాకేజ్లతో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు దిగనున్నట్టు తెలిపాయని నియామక ప్రక్రియ, వేతన విశ్లేషణ -2018 పేరుతో విస్డమ్జాబ్స్.కాం వెల్లడించిన నివేదిక తెలిపింది. నోట్ల రద్దు ప్రభావం సమసిపోవడం, హెచ్1బీ వీసా నిబంధనల సవరణ, జీఎస్టీ అమలు వంటి కారణాలతో ఈ ఏడాది రిక్రూట్మెంట్ ప్రణాళికలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఇక వేతన ప్యాకేజ్‌లు ఈ ఏడాది యథాతథంగా ఉంటాయని 54 శాతం కంపెనీలు భావిస్తే, ప్రారంభ వేతనాలు పెరిగే అవకాశం ఉందని 39 శాతం కంపెనీలు పేర్కొనడం గమనార్హం. వేతన ప్యాకేజ్‌లు తగ్గుముఖం పడతాయని కేవలం 5 శాతం కంపెనీలే అంచనా వేశాయని ఈ నివేదిక తెలిపింది. ఎంట్రీ, మిడిల్ లెవెల్స్‌లో వేతనాలు పెరుగుతాయని సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 60 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఈ ఏడాది భారీగా నియామకాలు చేపట్టనున్నట్టు 60 శాతం సంస్థలు పేర్కొన్నాయి. స్టార్టప్‌ల నుంచి పోటీని ఎదుర్కొనేందుకు హైరింగ్‌కు దిగుతామని 30 శాతం కంపెనీలు తెలిపాయి. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఈ ఏడాది భారీ నియామకాలుంటాయని విస్డమ్జాబ్స్.కాం వ్యవస్ధాపక సీఈఓ అజయ్ కొల్లా తెలిపారు. గత ఏడాది ఉపాధి కల్పనలో వెనుకపడ్డ తయారీ, ఐటీ అనుబంధ, రవాణా, హాస్పిటాలిటీ రంగాల్లో ఈ ఏడాది నియామకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉద్యోగార్ధులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో నియామకాలపై భారత కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో భారత కార్పొరేట్లలో 16 శాతం మంది ఈ క్వార్టర్లో హైరింగ్ ప్రణాళికల్లో ఉన్నట్టు తేలింది. క్రొయేషియా హైరింగ్ ప్రణాళికల్లో టాప్ ప్లేస్‌లో నిలవగా భారత్ ఎనిమిదవ ఆశావహ దేశంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లోని 58,000 కంపెనీలను మ్యాన్‌పవర్ గ్రూప్ పలుకరించగా క్రొయేషియాలో అత్యధిక కంపెనీలు నియామకాలను భారీగా చేపట్టనున్నట్టు వెల్లడించాయి. సర్వీస్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, తయారీ, టెక్నాలజీ తదితర ఏడు రంగాల్లో నియామకాలు అధికంగా చోటుచేసుకుంటాయని సర్వేలో తేలింది. భారత్‌లో పలు రంగాలకు చెందిన 4600 కంపెనీల్లో సర్వే జరగ్గా నియామకాలు పరిమితంగా చేపట్టనున్నట్టు వెల్లడైంది. కొన్ని రంగాల్లో ఉద్యోగుల కుదింపు ఉన్నా 16 శాతం కంపెనీలు నియామకాలకు మొగ్గుచూపాయి. భారత్‌లో ఈ ఏడాది టెక్నాలజీ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు ఉంటాయని, అందుకు అవసరమైన నైపుణ్యాలను యువత అందిపుచ్చుకోవాలని మ్యాన్‌పవర్ ఇండియా ఎండీ ఏజీ రావు చెప్పారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి నూతన టెక్నాలజీలపై పట్టు సాధించే ప్రొఫెషనల్స్‌కు మెరుగైన డిమాండ్ ఉంటుందన్నారు. -
భారత బిలియనీర్ల సంపద ఏకంగా..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ధనికులు, పేదల మధ్య అంతరాలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో దేశ జీడీపీలో భారత బిలియనీర్ల సంపద ఏకంగా 15 శాతంగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. పాలకుల అసంబద్ధ విధానాలతో అసమానతలు పెరుగుతున్నాయని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. దేశంలో సృష్టించబడుతున్న సంపదలో అధిక శాతం వారసత్వంగా, క్రోనీ క్యాపిటలిజం ద్వారా అత్యంత సంపన్నుల వద్దే పోగుపడుతోందని పేర్కొంది. మరోవైపు సమాజంలో అట్టడుగు ప్రజలకు దక్కాల్సిన వాటా మాత్రం కుచించుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 1991 ఆర్థిక సంస్కరణల అనంతరం ఈ అసమానతలు విపరీతంగా పెచ్చుమీరాయని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈఓ నిషా అగర్వాల్ పేర్కొన్నారు. తాజా అంచనాల ప్రకారం దేశ జీడీపీలో భారత బిలియనీర్ల మొత్తం సంపద 15 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. ఐదేళ్ల కిందట దేశ జీడీపీలో 10 శాతంగా ఉన్న బిలియనీర్ల సంపద ఇప్పుడు ఏకంగా 15 శాతానికి ఎగబాకింది. 2017 నాటికి భారత్‌లో 101 మందికి పైగా బిలియనీర్లున్నారు. -
ఇది రెండంచుల ఖడ్గం
‘ఫ్రీడమ్ ఆన్ ది నెట్–2017’ సర్వే చేసిన దేశాలు.. 65 భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదకరంగా మారిన దేశాలు.. 30 ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో భారత్ స్థానం.. 41 సాక్షి నాలెడ్జ్ సెంటర్ / తెలంగాణ డెస్క్ : ఇంటర్నెట్.. ఇప్పుడు ప్రతి ఇంటికి చేరింది.. ఎటు వెళ్లినా, ఎక్కడున్నా మొబైల్ఫోన్లో అందుబాటులో ఉంటోంది.. అందులో సామాజిక (సోషల్) మీడియా అయితే నిత్యావసరాన్ని దాటి అత్యవసరమనే స్థాయికీ చేరింది.. అవసరాలను తీర్చడంతోపాటు సామాజిక అవగాహనకు, చైతన్యానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు కేంద్రంగా మారింది. ఈ సోషల్ మీడియా చైతన్యమే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పోరాటాలకు, స్వేచ్ఛా, ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఊపిరినిచ్చింది. కొన్నేళ్ల కింద అరబ్ దేశాల్లో నియంతృత్వాలను ఎండగట్టి, రాచరికాలను గద్దె దింపిన ‘మల్లెల విప్లవం (జాస్మిన్ రివల్యూషన్)’.. ఢిల్లీలో నిర్భయ ఘటనపై దేశవ్యాప్తంగా ఉద్యమం.. కేజ్రీవాల్, అన్నాహజారేల నేతృత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక (లోక్‌పాల్) ఉద్యమం.. ఇవన్నీ సోషల్ మీడియా ఇచ్చిన స్వేచ్ఛా మార్గం సాధించిన విజయాలు. కానీ రెండు వైపులా పదునైన ఈ సోషల్ మీడియా కత్తికి మరోవైపున అత్యంత ప్రమాదకరమైన, దారుణమైన కోణమూ ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇదే సోషల్ మీడియాను తమకు అనుకూలంగా, తాము కోరుకున్న దానిని ప్రజల్లోకి చేర్చేలా, ఏకంగా ఎన్నికల ఫలితాలనే ప్రభావితం చేసే భారీ కుట్రలకూ మూలమవుతోంది. నియంతలు, పరిమితిలేని అధికారాన్ని చలాయిస్తున్నవారు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్), ఫైర్‌వాల్స్, కంటెంట్ ఫిల్టర్లు, బ్లాకింగ్ టూల్స్ వంటి వివిధ సాంకేతిక అంశాల ద్వారా.. భావ ప్రకటనా స్వేచ్ఛకు గండికొడుతున్నారు. తమకు వ్యతిరేకంగా, విమర్శనాత్మకంగా ఉన్న సమాచారాన్ని అడ్డుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న, తాము కోరుకున్న అంశాలు మాత్రమే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందేలా, చర్చ జరిగేలా చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో జరిగిన ఎన్నికలు ఈ విధంగా ప్రభావితమైనట్లు అమెరికాకు చెందిన ఫ్రీడంహౌస్ అనే స్వచ్చంద సంస్థ స్పష్టం చేస్తోంది. ఈ అంశంపై తాము చేసిన సర్వేలో తేలిన అంశాలతో.. ‘ఫ్రీడం ఆన్ ది నెట్–2017’పేరిట నివేదికను విడుదల చేసింది. 65 దేశాల్లో పరిశీలించి.. ప్రపంచంలో 87 శాతం ఇంటర్నెట్ సేవలను వినియోగించే 65 దేశాల్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఫ్రీడం హౌస్ సంస్థ అధ్యయనం చేసింది. 2016 జూన్ నుంచి 2017 మే మధ్య చోటు చేసుకున్న పరిణామాలతోపాటు పలు తాజా అంశాలను చేర్చి నివేదికను రూపొందించింది. ఈ 65 దేశాల్లో 30 దేశాలు ఆన్లైన్ సమాచారాన్ని వక్రీకరించాయని, ఇందుకోసం ‘సామాజిక మాధ్యమ సైన్యాల (ఆన్లైన్ బృందాల)’ను ఏర్పాటు చేసుకున్నాయని అందులో వెల్లడించింది. డబ్బు చెల్లించి అనుకూలంగా రాసే కాలమిస్టుల నియామకం, తప్పుడు సమాచార వార్తల సైట్లు, ప్రచార సంస్థల ఏర్పాటు వంటివాటి ద్వారా ప్రజామద్దతును పొందేందుకు నాయకులు ప్రయత్నించారని తెలిపింది. తమకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలుచుకునే విధంగా తాము కోరుకున్న అంశాలపై చర్చ జరిగేలా.. ఎన్నికలపై ప్రభావం పడేలా సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో.. ప్రభుత్వ, అధికార పార్టీలకు వ్యతిరేకంగా ఉండే సమాచారాన్ని అడ్డుకునేలా నియంత్రించారని వెల్లడించింది. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) వంటి సాధనాల ద్వారా ఫైర్‌వాల్స్, కంటెంట్ ఫిల్టర్లు, బ్లాకింగ్ టూల్స్ ద్వారా పలు సోషల్ మీడియా ఖాతాలు, పోస్టులను, వెబ్సైట్లను అడ్డుకున్నారని తెలిపింది. ఇలాంటి సాంకేతిక అంశాలను కనిపెట్టడం కష్టమేకాకుండా వివిధ రూపాల్లోని సెన్సార్షిప్, వెబ్సైట్ల నిలుపుదలను ఎదుర్కోవడం దుర్లభమని ‘ఫ్రీడం ఆన్ ది నెట్’అధ్యయనాన్ని ఆధ్వర్యం వహించిన సంజా కెల్లీ తెలిపారు. ఈ జాబితాలో వెనెజువెలా, ఫిలిప్పీన్స్, టర్కీ తదితర దేశాల ప్రభుత్వాలు టాప్‌లో ఉన్నాయి. స్వేచ్ఛా ఇంటర్నెట్కు ప్రమాదకరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు, మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సోషల్ మీడియాను నియంత్రించడం, తమకు అనుకూలంగా ఉన్న సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఇంటర్నెట్ స్వేచ్ఛను ప్రమాదంలో పడవేస్తోందని ఫ్రీడం హౌస్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాకుండా ఇంటర్నెట్ స్వేచ్ఛలో క్షీణత, మొబైల్, ఇంటర్నెట్ సేవల నిలుపుదల.. స్వతంత్ర మీడియాపై, మానవ హక్కుల పరిరక్షకులపై సాంకేతికంగా, భౌతికంగా దాడులు వంటివి పెరిగిపోతున్నాయని పేర్కొంది. తప్పుదారి పట్టించే సమాచారాన్ని విపరీతంగా ప్రచారంలోకి తేవడంతో అర్థవంతమైన చర్చ, వాస్తవ సమాచారం కనుమరుగై ఎన్నికల ఫలితాలు ప్రభావితమైనట్లు పేర్కొంది. ఇలా అమెరికా సహా 18 దేశాల్లో తాము కోరుకున్న నాయకులను ఎన్నుకునే సామర్థ్యాన్ని ప్రజలకు లేకుండా చేశారని విమర్శించింది. తమను గట్టిగా సమర్థించే వారి ద్వారా వివిధ రూపాల్లో ప్రభుత్వ అనుకూల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహన్ని గతంలో చైనా, రష్యా అనుసరించగా... ఇప్పుడది ప్రపంచవ్యాప్తమైందని పేర్కొంది. సర్వే నివేదికలో పేర్కొన్న ప్రధాన అంశాలు.. ⇒మొత్తం సర్వే చేసిన 65 దేశాలకుగాను 30 దేశాల్లోని ప్రభుత్వాలు సోషల్ మీడియాపై బలవంతపు ఆధిపత్యాన్ని సాధించాయి. రాజకీయ, భద్రతాపరమైన కారణాలతో మొబైల్ కనెక్టివిటీì, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించాయి. చైనాలోని టిబెట్, ఇథియోపియాలోని ఒరోమో, భారత్‌లో కశ్మీర్‌లలో ఈ సేవలపై తరచూ ఆంక్షలు పెడుతున్నారు. ⇒ ప్రపంచవ్యాప్తంగా 40 శాతం అంటే సుమారు 120 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ వినియోగదారులు చైనా, భారత్, అమెరికాలలోనే ఉన్నారు. ⇒ స్వేచ్ఛా సమాజంగా పేరున్న అమెరికాలోనూ ఎన్నికలకు ముందు, తర్వాత కూడా తప్పుడు, నకిలీ వార్తలు, జర్నలిస్టులపై ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం రష్యా ఇంటర్నెట్ కేంద్రంగా వివిధ రూపాల్లో సహాయపడినట్లుగా వచ్చిన ఆరోపణలపై విచారణ సాగుతోంది. ⇒ ఆయా అంశాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఇంటర్నెట్ స్వేచ్ఛపై 14 దేశాలు నియంత్రణలు విధించాయి. ⇒ 65 దేశాల్లో 34 దేశాలు వార్తా సంస్థలు, ప్రతిపక్షాలు, హక్కుల కార్యకర్తలపై సాంతికేతికంగా సైబర్ దాడులకు దిగాయి. ⇒ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (వీపీఎన్)లను అడ్డుకోవడం కోసం ప్రస్తుతం 14 దేశాలు సెన్సార్షిప్ను విధించాయి. ఆరుదేశాల్లో వీపీఎన్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిషేధించారు. ⇒ 30 దేశాల వరకు నెటిజన్లు, ఆన్లైన్ జర్నలిస్టులపై భౌతికదాడులు పెరిగాయి. ⇒ ప్రతిపక్షాల విమర్శలను సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టేందుకు టర్కీలో ప్రభుత్వం ఆరు వేల మందిని నియామించుకుంది. ⇒ రష్యా అనుకూల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ అధికారులు రష్యా ఆధారిత సేవలను నిలిపివేశారు. ⇒ వరుసగా మూడో ఏడాది కూడా చైనా ఇంటర్నెట్ స్వేచ్ఛను అధికంగా నియంత్రించిన దేశంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో సిరియా, ఇథియోపియా ఉన్నాయి. ⇒ ఫేస్బుక్, స్నాప్‌చాట్ లైవ్ వంటి మాధ్యమాల్లో లైవ్ వీడియోలపై 9 దేశాల్లో నియంత్రణ. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ప్రదర్శించకుండా అడ్డుకోవడం. ఇంటర్నెట్ ఉన్నా.. స్వేచ్ఛలో వెనుకబాటే! – ఇంటర్నెట్ అందుబాటు, వేగం విషయంలో భారత్ ర్యాంకు మెరుగుపడింది. కానీ ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో మాత్రం భారత్ 41వ స్థానంలో నిలుస్తోంది. పాకిస్తాన్, సౌదీ అట్టడుగున ఉన్నాయి. ఇంటర్నెట్ స్వేచ్ఛలో ఇస్టోనియా, ఐస్లాండ్ ప్రథమస్థానంలో.. కెనడా 2వ, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి. కొన్ని అంశాల్లో మనం మేలే.. అల్ప సంఖ్యాక వర్గాలు, జాతుల సమస్యలు, అవినీతి, ప్రతిపక్షాలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ఎల్జీబీటీల సమస్యలకు సంబంధించిన వార్తలపై భారత్‌లో సెన్సార్షిప్ లేదని ఫ్రీడం హౌస్ నివేదికలో పేర్కొంది. అయితే ప్రభుత్వాధికారులు, సంస్థలపై విమర్శలు, సామాజిక సంక్షోభాలు, దైవ దూషణ వంటి అంశాలు, వ్యంగ్య రచనలపై నియంత్రణ ఉందని పేర్కొంది. -
కార్పొరేట్ మోసాలు పెరుగుతాయ్
• వచ్చే రెండేళ్లలో మరింత పైకి... • డెలాయిట్ సర్వే నివేదిక... ముంబై: దేశీయంగా కార్పొరేట్ మోసాలు వచ్చే రెండేళ్లలో మరింత పెరగనున్నాయని గ్లోబల్ అకౌంటింగ్ దిగ్గజం డెలాయిట్ పేర్కొంది. నైతిక విలువలు అంతకంతకూ దిగజారుతుండమే దీనికి ప్రధాన కారణంగా కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నట్లు సర్వే నివేదికలో వెల్లడించింది. డెలాయిట్ నిర్వహించిన ‘ఇండియా ఫ్రాడ్ సర్వే’లో 309 కార్పొరేట్ కంపెనీలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, వృత్తి నిపుణులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలివీ... ⇔ నైతిక విలువలు దిగజారడమే మోసాలు పెరిగేందుకు దారితీస్తోందని సర్వేలో పాల్గొన్న బడా కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎస్ఎంఈ)లకు చెందిన 68 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు, వృత్తి నిపుణుల్లో 42 శాతం మంది ఇదే కారణాన్ని పేర్కొన్నారు. ⇔ అవినీతి, లంచాలు, వెండార్లకు అనుకూలంగా వ్యవహరిం చడం, స్వప్రయోజనాలు వంటివి గడిచిన రెండేళ్లలో జరిగిన కార్పొరేట్ మోసాల్లో ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ⇔ ఒకేవిధమైన మోసాలను ఎదుర్కోవడంలో కంపెనీలు అనుసరిస్తున్న విధానాల్లో తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నాయి. దీనిప్రకారం చూస్తే.. మోసాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని.. వీటికి అడ్డుకట్టవేయడంలోకంపెనీలు తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నట్లు అవగతమవుతోంది. ⇔ పెద్ద కంపెనీల్లో చాలావరకూ అందరికీ తెలిసిన మోసాలను అరికట్టడంపైనే దృష్టిపెడుతున్నాయి. సోషల్ మీడియా, పోటీ కంపెనీలు అనురిస్తున్న కొత్తరకం మోసాలను ఎదుర్కోవడానికి సమాయత్తంగా లేవు. ⇔ మోసం తీవ్రత ఆధారంగానే దర్యాప్తులను మొదలుపెడుతున్నట్లు 43 శాతం మంది పేర్కొన్నారు. ఇక మోసం చేసిన సిబ్బంది రాజీనామాకు అనుమతిస్తున్నట్లు 36 శాతం మంది వెల్లడించారు. ఇతరఉద్యోగులు, కంపెనీ బోర్డు, నియంత్రణ సంస్థలకు సబంధిత మోసం గురించిన సమాచారాన్ని అందిస్తున్నట్లు 33 శాతం మంది సర్వేలో పాల్గొన్న వారు వివరించారు. ⇔ ఎస్ఎంఈలకు సంబంధించి మోసాలను ఎదుర్కొనే సమాయత్తత, సంకల్పం లేదని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ఇటువంటి కార్యకలాపాలను నివారించేందుకు తగిన బడ్జెట్, వనరుల కేటాయింపులేదని 42 శాతం మంది చెప్పారు. -
15 రోజుల్లో ప్రభుత్వ భూములపై నివేదన
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ శాఖ భూముల వివరాలను సర్వే చేసి పూర్తి స్థాయి నివేదికను 15 రోజుల్లో నివేదించాలని జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బి లట్కర్ తహసిల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం తహశీల్దార్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ శాఖల భూముల రికార్డుల్లో తప్పొప్పులున్న సందర్భాల్లో వాటిని సమగ్రంగా సర్వే చేసి నివేదికను పొందుపరచాలన్నారు. పలు దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించి ఉన్నప్పటికీ మరోసారి వాటిని సవరణలుంటే సర్వే రిపోర్టు ఆధారంగా పక్కా నివేదిక తయారు చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఎంతమేర ఉన్నాయో గుర్తించి నివేదించాలన్నారు. ఇందుకోసం ఆయా మండలాల సర్వేయర్లను అప్రమత్తం చేయాలన్నారు. ప్రభుత్వ భూముల సరిహద్దులు, సర్వే నెంబర్లు పక్కాగా ఉండాలన్నారు. ఆలస్యమయితే ఉపేక్షించేది లేదన్నారు. సమావేశంలో డీఆర్వో మారిశెట్టి జితేంద్ర, జిల్లాలోని తహసిల్దార్లు పాల్గొన్నారు. -
ఓటు వేయకుంటే హక్కు కోల్పోయినట్టే
పంజగుట్ట: ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని, లేనిపక్షంలో సమాజంలో ఉండే హక్కును కోల్పోతారని యువ వారధి ఆర్గనైజేషన్ ప్రతినిధి మయూర్ పట్నాల పేర్కొన్నారు. యువ వారధి ఆర్గనైజేషన్, ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రేటర్లో ప్రజాప్రతినిధుల తీరుపై మూడు డివిజన్లలో సర్వే నిర్వహించామని ఆయన తెలిపారు. సర్వే రిపోర్టును ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివరించారు. మయూర్ మాట్లాడుతూ.. రామకృష్ణాపురం, గడ్డిఅన్నారం, హస్తినాపురం డివిజన్లలో సుమారు 230 కుటుంబాలను ప్రత్యక్షంగా కలిశామన్నారు. పోటీలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థుల పనితీరుపై వివరాలు సేకరించినట్టు చెప్పారు. అయితే, తమ సర్వేలో కేవలం 18 శాతం మంది మాత్రమే ప్రజాప్రతినిధుల పనితీరు బాగుందని చెప్పారన్నారు. చాలా మంది మధ్యతరగతి వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడున్నాయో తెలియదని, దిగువ మధ్యతరగతి వారు ప్రభుత్వం నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తే తప్పకుండా వినియోగించుకుంటామని తెలిపినట్లు వెల్లడించారు. పోలీస్ పెట్రోలింగ్ ఒక్కటే కాస్త మెరుగ్గా ఉందని పలువురు వెల్లడించినట్టు వివరించారు. ఐదేళ్లు పాలించే స్థానిక ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే విషయంలో జాగ్రత్తగా ఓటు వేయాలని, డబ్బులకు, ఇతర ప్రలోభాలకు లోనైతే సమస్యలు అలానే ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ ప్రతినిధులు మహేష్, నాగార్జున, యువ వారధి ప్రతినిధులు రుక్ మంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
స్వతంత్రంగా ఉండనిస్తే సమస్యలే రావు!
పిల్లల సంతోషం ఎందులో ఉంటుంది? ఈ ప్రశ్నకి ఏ తల్లిదండ్రులూ ఒకే రకమైన సమాధానం చెప్పరు. ఎందుకంటే, ఒక్కొక్కరికీ ఒక్కోటి నచ్చవచ్చు కాబట్టి. అయితే పిల్లలందరూ కామన్‌గా సంతోషించే విషయాలు కొన్ని ఉన్నాయని ఓ సర్వే రిపోర్టు చెబుతోంది. తినాలనిపించినవి తింటూ, తాగాలనిపించిన కూల్‌డ్రింక్స్ తాగుతూ, చూడాలనిపించినప్పుడు టీవీ చూస్తూ గడిపే చిన్నారులు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారని తేల్చింది బ్రిటన్ ప్రభుత్వ అధికారిక అధ్యయన బృందం. ఇది సర్వే చేసి చెప్పాలా అని తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ చేయాల్సిన అవసరం ఏర్పడిందంటారు పరిశోధకులు. ఇటీవల చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతుండటంతో బ్రిటన్ వైద్య నిపుణులు ప్రభుత్వ అనుమతితో పరిశోధన మొదలుపెట్టారు. అందులో భాగంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న కొందరు పిల్లల్ని ప్రశ్నించినప్పుడు... ఇష్టమైనవన్నీ చేయనివ్వకపోడమే వారి సమస్యలకు అసలు కారణమని తేలింది. అలాగని పిల్లల్ని వదిలేయమని కాదు. అవసరమైనచోట నియంత్రించాలి. కానీ ఆటలు, ఆహారం వంటి విషయాల్లో కాసింత స్వతంత్రం ఇవ్వాలి. అలా స్వేచ్ఛని ఇవ్వకుండా వాళ్లపై ఎంత ప్రేమను కురిపించినా పిల్లలు ఆనందంగా ఉండలేరని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఎక్కువ నియమాలను విధించడం వల్ల వాళ్లు లోలోపలే చాలా బాధ పడతారని, దానివల్ల మానసిక ఒత్తిడి, మందబుద్ధి లాంటి రుగ్మతలు వస్తాయని తేల్చి చెప్పారు. కాబట్టి... తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణలో పెడుతూనే వారి సంతోషం కోసం కొన్ని చూసీ చూడనట్లు పోవాలన్నమాట. అయినా పిల్లల క్షేమం కంటే కావలసినదేముంది!