సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్
ఆసిఫాబాద్ : గ్రామ స్వరాజ్ అభియాన్ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించి ఖాతాలు తెరవాలని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, ఐకేపీ ఏపీఎంలతో సమీక్షించారు. గ్రామస్వరాజ్ అబియాన్ యోజనలో ఏడు రకాల పథకాలు ఉన్నాయన్నారు. వీటిలో ముఖ్యంగా ధన్‌జన్‌యోజన, సురక్ష, జీవన జ్యోతి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఇందుకు సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా మండలాల వారీగా గ్రామాల్లో చేసిన సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పూర్తి చేసిన సర్వే నివేదికను ఎల్‌డీఎంకు సాఫ్ట్ కాపీలను అందజేయాలని ఆదేశించారు. ఇంతుకు ముందు ఈ స్కీములో ఖాతాలు తెరిచిన వారిని రెన్యూవల్ చేయాలన్నారు. గ్రామాల వారీగా సర్వే పూర్తి చేసి వారం రోజుల్లో ఖాతాలు తెరిపించేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో పీడీ వెంకటి, ఎల్‌డీఎం చెంచు రామయ్య, ఎస్‌బీఐ మేనేజర్ కృష్ణమాచారి, జిల్లాలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు, ఏపీడీ రామకృష్ణ, జిల్లాలోని ఐకేపీ ఏపీఎంలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment