Asifabad
-
ఇటు న్యాయం! అటు సాయం!!
సాక్షి, సిటీబ్యూరో: నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు.. ఆయనకు చదువు విలువ తెలుసు.. చదువుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో.. ఎంత గౌరవం ఉంటుందో తెలియజేసే నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కష్టాలు స్వయంగా అనుభవించారు. అందుకే తనకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏటా విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందిస్తూ సమాజ సేవకు నడుం బిగించారు. చేతనైనంత సాయం చేస్తే ప్రకృతి కూడా మనకు సాయపడుతుందని చెబుతారు న్యాయవాది సంగిశెట్టి బాబు. ఆయన గురించిన మరిన్ని విషయాలు..ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయ్‌పూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో యాదమ్మ, శంకరయ్య దంపతులకు జన్మించారు సంగిశెట్టి బాబు. చిన్నప్పటి నుంచి కడుపేదరికం అనుభవించారు. అయితే తమ జీవితాలను చదువు మాత్రమే మారుస్తుందన్న మాటను తు.చ. తప్పకుండా పాటించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ సాధించారు. లా ప్రాక్టీస్ చేసుకుంటూనే పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు పడొద్దనే తలంపుతో తన వంతు సాయంగా ముందడుగు వేస్తున్నారు.ఒక్క రూపాయి లేనిస్థితి నుంచి..తన తల్లిదండ్రుల పేరుతో 2016లో యాదశంకర మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదట. కానీ సంకల్ప బలం తోడైతే ఏదైనా సాధించవచ్చని నమ్మే బాబుకు.. విద్యా సామగ్రి పిల్లలకు అందజేసే ముందురోజు కేసులకు సంబంధించిన డబ్బులు వచ్చాయట. అందుకే తాను నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్తున్నాన్నంటారు బాబు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో..హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు చదువుకోవడమే కష్టం అవుతుందన్న విషయం గుర్తు చేసుకున్నారు. అంతే ఏటా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లోని పిల్లలకు సామగ్రి అందజేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక ఎవరూ చదువు మధ్యలో ఆపేయొద్దనేదే తన ఉద్దేశమని బాబు అంటున్నారు. భవిష్యత్తులో పిల్లల కోసం ఎంత కష్టమైనా తాను ముందుంటానని చెబుతున్నారు. బాబు నేపథ్యం స్ఫూర్తిదాయకం అయితే.. ఆయన సేవాగుణం ఆదర్శప్రాయం అనడంలో అతిశయోక్తి లేదు.ఇవి చదవండి: సాయపు చేతులు..! -
‘ఆసిఫాబాద్ ఆదివాసీ మహిళ ఘటన’.. బండి సంజయ్ సీరియస్
సాక్షి, జైనూరు: తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఒంటరిగా తన ఊరికి వెళ్తున్న ఆదివాసీ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్యాయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీకి ఫోన్ చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం దేవుగూడ గ్రామం ఉంది. దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ.. తన సోదరులను కలిసేందుకు నెల 31న సిర్పూర్(యు) మండలంలోని కోహినూర్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. జైనూర్‌లో ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం.. ఆమెను నమ్మించి తాను కోహినూరు వెళ్తున్నట్టు చెప్పి ఆటో ఎక్కించాడు. ఈక్రమంలో షేక్ ముగ్దూం రాఘాపూర్ దాటగానే ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగికదాడికి యత్నించాడు.దీంతో, భయపడిన ఆమె కేకలు వేసింది. అనంతరం, షేక్ మగ్దూం.. ఆమెను బెదిరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సమయంలో ఆమె ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో ఆమెను అక్కడే వదిలేసి ఆటో డ్రైవర్ పారిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు ఆమెను గుర్తించి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.అయితే, ఆమె స్పృహాలో లేకపోవడంతో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని బాధితురాలి తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు తాజాగా స్పృహలోకి రావడంతో అసలు విషయం బయట పడింది. తనపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడి చేయడానికి యత్నించాడని, తాను ఎదురు తిరిగితే.. తన ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడని వివరించింది. దీంతో, పోలీసులు.. నిందితుడిపై లైంగికదాడి, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. -
ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం...స్నానానికి వెళ్లి..!
-
ఫోరెన్సిక్ నివేదికలో సంచలన విషయాలు
-
ఆసిఫాబాద్ లో అత్యధికంగా 16శాంతం పోలింగ్
-
తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టింది: సీఎం కేసీఆర్
-
అభివృద్ధికి నోచుకోని ఆసిఫాబాద్ లో గెలుపెవరిది ?
-
Telangana Elections 2023: అక్కడ ఇద్దరి మీదా వ్యతిరేకత..?
-
'నన్ను మోసం చేశాడంటూ..' యువకుడి ఇంటి ముందే.. యువతి
సాక్షి, ఆదిలాబాద్: నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నిరాకరించిన యువకుడి ఇంటి ఎదుట న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి ఓ యువతి ఆందోళన చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని సంజీవయ్య కాలనీకి చెందిన ప్రకాశ్‌కు ఆరు నెలల క్రితం ఆసిఫాబాద్ మండలం బురుగూడకు చెందిన శిరీషతో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి జరగాల్సిన క్రమంలో పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా ప్రకాశ్ పెళ్లికి నిరాకరించడంతో శిరీష యువకుడి ఇంటికి వచ్చింది. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లో నుంచి బయటకు పంపించారు. దీంతో తీవ్ర చలిలోనే ప్రకాశ్ ఇంటి ముందు యువతి ఆందోళనకు దిగింది. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఎంబడి శ్రీకాంత్ అక్కడకు చేరుకొని ఇరు పక్షాల నుంచి వివరాలు సేకరించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, నచ్చజెప్పే ప్రయత్నం చేసినా యువతి వినకుండా ఆందోళన కొనసాగిస్తోంది. ఇవి చదవండి: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే.. -
అన్నం పెడ్తలేరు.. ఆరోగ్యం పట్టించుకోరు
ఆసిఫాబాద్‌రూరల్: ‘మెనూ ప్రకారం భోజనం పెడ్తలేరు.. అన్నంలో పురుగులు వచ్చినా పట్టించుకుంటలేరు.. నైట్ వాచ్మెన్ అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడు’ అంటూ గిరిజన విద్యార్థినులు కన్నీమున్నీరుగా విలపిస్తూ ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల బాలికలు సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కారు. సుమారు ఆరు గంటలపాటు వివిధ చోట్ల నిరసన తెలిపారు. గిరిజన గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 600 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి పట్టించుకోకుండా వేధిస్తున్నా రని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. బుధవారం ఉదయం పాఠశాల నుంచి బయటికి వచ్చిన విద్యార్థినులు ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్ వద్ద ఎండలోనే బైఠాయించారు. విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో భోజనం సక్రమంగా పెట్టడం లేదని, నైట్ వాచ్మెన్ అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. డార్మెంటరీలు శుభ్రంగా లేవని, రెండు రోజులుగా నీళ్లు రావడం లేదని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రిన్సిపాల్ ఇష్టారీతిన తమను తిడుతూ భయపెడుతుందని వి లపించారు. ఈ విషయం ఆర్సీవో దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న తమ బా ధను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రి న్సిపాల్‌ను తొలగించే వరకూ గురుకులానికి వెళ్లమ ని భీష్మించుకు కూర్చున్నారు. మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఓ విద్యార్థిని తండ్రి అరటి పండ్లు, వాటర్ప్యాకెట్లు తీసుకొచ్చి వారి ఆక లి తీర్చడం గమనార్హం. పోలీసులు, పాఠశాల టీచ ర్లు ఎంత బతిబాలినా విద్యార్థినులు మొండికేయడం.. ఎండలో విద్యార్థినుల అవస్థలు గమనించిన టీచర్లు సైతం కన్నీరుపెట్టుకున్నారు. టీచర్లను చూసి విద్యార్థినులూ కన్నీటిపర్యంతమయ్యారు. కలెక్టరేట్ వద్దకు చేరుకున్న ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా విద్యార్థినులు వెనక్కి తగ్గకుండా ఆమెకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వివిధ విద్యా సంఘాల నాయకులు విద్యార్థులకు మద్దతు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సురేశ్ ఘటన స్థలానికి చేరుకుని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వారు వినలేదు. అయితే విద్యార్థినులను సముదాయించి తీసుకురావాలని అధ్యాపకులు, ఉపాధ్యాయులపై ప్రిన్సిపాల్ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో కొంత మంది అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థినులతో మాట్లాడి గురుకులానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా విద్యార్థినులు ‘భోజనం చేయమని.. ప్రిన్సిపా ల్ తొలగించే వరకు ఇక్కడే కూర్చుంటాం’ అని గేటు ఎదుట బైఠాయించారు. అనంతరం పోలీసులు వారిని సముదాయించి లోపలికి పంపించారు. కొద్దిసేపు చెట్ల కింద కూర్చున్న విద్యార్థులు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత పాఠశాలలోకి వెళ్లారు. విద్యార్థినుల ఆరోపణలపై ప్రిన్సిపాల్ జ్యోతిలక్షి్మని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదు. ఆస్పత్రికి తీసుకెళ్తలేరు.. ప్రిన్సిపాల్‌కు చెప్పినా సమస్యలను పట్టించుకోవడం లేదు. జ్వరం వచ్చినా ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదు. ప్రస్తుతం ఓ విద్యార్థి ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. – స్వాతి, ఇంటర్ అన్నంలో పురుగులు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. అన్నంలో పురుగులు వస్తున్నాయి. ప్రిన్సిపాల్‌కు చెప్పినా అదే తినాలి అని చెబుతున్నారు. కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. – ఆర్తి, తొమ్మిదో తరగతి వేరే కళాశాలలో చేర్పిస్తా మా పాప నిఖిత గిరిజన గురుకులంలో ఇంటర్ చదువుతోంది. కళాశాలలో కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నానని ఏడుస్తోంది. టీసీ తీసుకుని వెళ్లి వేరే కళాశాలలో చేర్పిస్తా. – రమేశ్, విద్యార్థిని తండ్రి -
దడ పుట్టిస్తున్న బెబ్బులి
సాక్షి, ఆసిఫాబాద్: దాదాపు తొమ్మిది నెలల విరా మం తర్వాత జిల్లాలో మళ్లీ బెబ్బులి దాడులు మొదలయ్యాయి. పెద్దపులి సంచారంతో జిల్లాలోని అటవీ ప్రాంతాల సమీప గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా గత నెల రోజులుగా కాగజ్‌నగర్ మండల పరిసరాల్లో పులి సంచరిస్తోంది. మూడు రోజుల కిందట అంకుసాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఆవుపై దాడి చేసి చంపేసింది. పశువులు, మేకలను హతమారుస్తుండడంతో గ్రామీణులు భయంతో హడలెత్తిపోతున్నారు. పులి సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు దాని కదలికలపై నిఘా ఉంచారు. జనావాసాల్లో సంచారం.. గత నాలుగైదేళ్లుగా జిల్లాలో పెద్దపులుల సంచారం పెరిగింది. జిల్లాలో వ్యాపించి ఉన్న అభయారణ్యాలు కూడా జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు కారిడార్‌గా పనిచేస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి ఆహారం, తోడును వెతుకుంటూ వలస వస్తున్నాయి. ఒక్కోసారి పులులు జనావాసాల్లోకి వస్తూ ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో కాగజ్‌నగర్ పట్టణంలోకి పెద్దపులి వచ్చింది. అటు నుంచి నజ్రూల్‌నగర్, ఈస్గాం సమీపంలోని అనుకోడ గ్రామ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. మళ్లీ అదే పులి రాస్పెల్లి గ్రామంలో పత్తి చేన్లలో నక్కి ఉండగా రైతుల కంట పడింది. ఈ క్రమంలో సిర్పూర్(టి) మండలం చీలపెల్లి గ్రామంలో ప్రత్యక్షమైంది. ఆ తరువాత చింతలమానెపల్లి మండలం బాబాసాగర్, బెజ్జూర్ మండలం కుకుడా గ్రామంలో పులి ప్రజల కంట పడింది. అప్పట్లో వాంకిడి మండలం చౌపన్‌గూడ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో పంట చేనులో పని చేసుకునేందుకు వెళ్లిన సిడాం భీము అనే గిరిజన రైతుపై దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఆ పులే కాగజ్‌నగర్ డివిజన్ పరిసరాల వైపు వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవ్వడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జత కట్టే సమయంలో మరింత జాగ్రత్త.. పెద్దపులులు సహజంగా చల్లటి వాతావరణ పరిస్థితుల్లోనే ఆడ పులులతో జత కట్టేందుకు ఇష్టపడతాయి. ముఖ్యంగా నవంబర్ నుంచి జనవరి మధ్య మూడు నెలల కాలంలో పులులు జతకట్టేందుకు(మేటింగ్) తహతహలాడుతాయని వన్యప్రాణి సంరక్షణ అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో ఆడ పులులను వెతుకుంటూ తిరిగే మగ పులి దూకుడుగా ఉంటుందని ఆ క్రమంలో ఆహారం నీరు దొరకని పరిస్థితుల్లో ఏది తారసపడినా(మనుషులైనా) దాడికి పాల్పడుతుందని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కసారి మనిషి రక్తాన్ని రుచి మరిగితే తరుచూ జనావాసాల పరిసరాల్లోనే సంచరిస్తుంటాయని చెబుతున్నారు. అంతేకాదు సులభంగా లక్ష్యంగా మారే పశు సంపదను కూడా చంపి తింటాయంటున్నారు. కాబట్టి పులులు జట్టు కట్టే సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. వరుస దాడులు.. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులులు ఉన్నాయి. అవి కాగజ్‌నగర్, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల్లోని గ్రామాల్లో ఎక్కువగా సంచరిస్తున్న సంగతి తెలిసిందే. గత గురువారం కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన హన్మంతు తన అవును శివారు ప్రాంతంలో మేతకు వదలగా పులి దాడి చేసి హతమార్చింది. గత నెల రోజుల్లో పులి దాడిలో మూడు మేకలు, ఐదు ఎద్దులు మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే జనావాసాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అప్రమత్తంగా ఉండాలి.. అటవీ ప్రాంతాల్లోకి అవులు, మేకలను మేత కోసం తీసుకెళ్లే కాపరులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అడవి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయొద్దు. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులులు తిరుగుతున్నందున ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలి. పులి సంచరిస్తున్నందున గ్రామస్తులు రాత్రిపూట ఒంటరిగా బయట తిరగొద్దు. – విజయ్‌కుమార్, ఎఫ్‌డీవో, కాగజ్‌నగర్ -
గోండు సామ్రాజ్యంలో అక్కా చెల్లెళ్ళ పోటీ?.. ఆదివాసీలు ఎటువైపు!
ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి బంధువులు పోటీ పడటం కొత్తేమీ కాదు. అన్నదమ్ములు, అక్కా తమ్ముళ్ళ ఇలా రక్త సంబంధీకులు కూడా చాలా చోట్ల పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కారు, హస్తం పార్టీల నుంచి అక్కా చెల్లెళ్ళ పోటీ పడబోతున్నారు. ఆ ఇద్దరు ఎవరో..యుద్ధంలో గెలిచేదెవరో చూద్దాం. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్ చేతిలో ఉన్న ఈ సీటు దక్కించుకోవడానికి అధికార బీఆర్ఎస్.. సీటు నిలుపుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆరు నూరైనా ఆసిఫాబాద్ దక్కించుకోవాల్సిందేనని కేడర్‌ను సిద్ధం చేస్తున్నాయి. ఆదివాసీలైన గోండుల ప్రాబల్యం ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది వారే. అన్ని పార్టీలు ఆ వర్గం నుంచే అభ్యర్థిని బరిలో దించడం సర్వసాధారణం. అందుకే గోండుల సామ్రాజ్యంలో గులాబీ జెండాను ఎగురవేయడానికి అసిపాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోవ లక్ష్మి 2014లో ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోవ లక్ష్మి తప్పకుండా విజయం సాధిస్తారని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. ఇదే సమయంలో కోవ లక్ష్మిని కట్టడి చేయడానికి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. కోవ లక్ష్మి మీద ఆమె స్వంత చెల్లెలిని బరిలో దించే ఆలోచన చేస్తోంది. ఆసిఫాబాద్ సర్పంచ్‌గా పనిచేసిన మర్సకోల సరస్వతిని అభ్యర్థిగా నిలిపేందుకు పావులు కదుపుతోంది. కోవ లక్ష్మి, మర్సకోల సరస్వతి మాజీ రాష్ట్ర మంత్రి కోట్నాక భీమ్రావు బిడ్డలు కావడం విశేషం. గులాబీ పార్టీ అక్క లక్ష్మికి టిక్కెట్ ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి చెల్లెలు సరస్వతి దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సరస్వతి అయితేనే కోవ లక్ష్మికి సరైన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్నారు. అయితే కోవలక్ష్మి ఒకసారి ఎమ్మెల్యేగా, ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత ఉందని టాక్ నడుస్తోంది. అక్క మీద ఉన్న వ్యతిరేకతే తనకు అనుకూలంగా మారుతుందని సరస్వతి భావిస్తున్నారట. అక్కడ మీద తాను తప్పకుండా విజయం సాధిస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి గతంలో ఒకసారి తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రజల్లో పలుకుబడి లేని చెల్లెలు తనకు పోటీయే కాదంటున్నారు కోవ లక్ష్మి. తాను సునాయసంగా విజయం సాధిస్తానని చెబుతున్నారు. ఆసిఫాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న అక్కా చెల్లెళ్ళ యుద్ధంలో ఆదివాసీలు ఎటువైపు నిలుస్తారో చూడాలి. -
గిరిజనులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఆ కేసులు రద్దు!
సాక్షి, కొమురం భీం అసిఫాబాద్: అసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు పోడు భూముల పట్టాలను సీఎం విడుదల చేశారు. లక్షన్నర మంది గిరిజనులకు 4 లక్షల 6 వేల ఎకరాల పట్టాలు పంపిణీ చేశారు. పోడు భూములకు రైతుబంధు నిధులు విడుదల చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.. గిరిజన మహిళల పేరు మీదే పోడు భూముల పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. పోడు భూములపై ఉన్న గతంలోని కేసులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చిన తరువాత కేసులు ఉండటం సరికాదని అన్నారు. ఈ మేరకు వేదిక మీదే డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. రైతు బంధు కోసం దాదాపు రూ. 24 కోట్లు నిధుల కేటాయించినట్లు చెప్పారు. గిరిజన రైతుల పల్లెలకు త్రీ-ఫేజ్ కరెంట్ అందించాలని పేర్కొన్నారు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణనే అని పునరుద్ఘాటించారు. అసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీ కలలో కూడా ఊహించి ఉండరని అన్నారు. అంతకముందు మధ్యాహ్నం రెండు గంటలకు ఆసిఫాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ రిబ్బన్ కట్ చేసి పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. చదవండి: వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి: ఈటల కౌంటర్! -
పోడు భూముల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్
Updates.. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి మంత్రి హరీష్ రావు హెలికాప్టర్లో బయలుదేరారు. ► హరీష్‌తో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. ► సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతుల కల సాకారం కానుంది. వీరికి పట్టా పుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ క్రమంలో ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలు అందజేయనున్నారు. మిగతా జిల్లాల్లో జిల్లా మంత్రుల చేతుల మీదుగా అర్హులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తారు. ► పోడు భూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 1,50,012 మంది రైతులు 4,05,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గిరిజనులు, ఆదివాసీలే. కాగా అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్ జిల్లాలో 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించారు. -
నేడు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
-
సంతోషంగా నిశ్చితార్థం.. బంధువును దిగబెట్టి వస్తుండగా..
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రేమించిన అమ్మాయిని మనువాడేందుకు పెద్దలను ఒప్పించాడు. సంతోషంగా నిశ్చితార్ధం చేసుకుని.. ఆ శుభ కార్యక్రమానికి వచ్చిన బంధువును ఊళ్లో దిగబెట్టి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఇది తట్టుకోలేని అతని తండ్రి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనలు గురువారం కొమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామంలో చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన వసాకే తులసీరాం(21) అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించగా, ఇరు కుటుంబాల అంగీకారంతో బుధవారం నిశ్చితార్థం జరిగింది. దీనికి హాజరైన బంధువుల్లో ఒకరైన ఆసిఫాబాద్ మండలం ఎల్లారానికి చెందిన అంజన్నను గురువారం స్కూటీపై అతడి గ్రామంలో దింపి తులసీరాం ఇంటికి బయలుదేరాడు. బుదల్‌ఘాట్ వాగు దాటిన తర్వాత జైత్పూర్ రోడ్డు వద్ద కంకర క్రషర్ సమీపంలో జాతీయ రహదారి– 363పై వేగంగా వచి్చన డీబీఎల్ కంపెనీకి చెందిన టిప్పర్ స్కూటీని ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. లారీ టైర్ల కింద స్కూటీ ఇరుక్కుపోగా తులసీరాం అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మృతి తట్టుకోలేక: కుమారుడి మరణ వార్త విన్న తండ్రి భీంరావు(45) తీవ్ర మనస్తాపంతో ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. స్థానికులు అంబులెన్స్‌లో ఆసిఫాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తండ్రీకుమారుల మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వాంకిడి ఎస్సై సాగర్ తెలిపారు. -
కోలుకోలేని విషాదం.. కొడుకు మృతదేహంతో పుట్టినరోజు కేక్ కటింగ్
సాక్షి, ఆసిఫాబాద్ : అంత్యక్రియల రోజే కుమారుడి చివరి జన్మదిన వేడుక నిర్వహించాల్సి రావడం కన్నా విషాదం ఏముంటుంది. ఇరవై ఏళ్లు కూడా నిండని కుర్రాడికి.. తెల్లవారితే పుట్టినరోజు.. వేడుకలకు అంతా సిద్ధమవుతుండగా.. హఠాన్మరణం చెందడంతో ఆ ఇంట కోలుకోలేని విషాదాన్ని నింపింది. కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లో శుక్రవారం కంటతడి పెట్టించిన ఈ సంఘటన వివరాలివి. గ్రామానికి చెందిన చునార్కర్ గుణాంతరావు, లలిత దంపతుల చిన్న కుమారుడు సచిన్ (15) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. శుక్రవారం పుట్టినరోజు కావడంతో స్నేహితులతో వేడుకలు చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కడుపులో మంటతో ఇబ్బందిపడడంతో ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. అక్కడ బాలుడు అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో సాయంత్రం మృతిచెందాడు. తెల్లవారితే జన్మదినోత్సవం జరుపుకోవాల్సిన అతడి మరణం మిత్రులు, కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. శుక్రవారం పుట్టినరోజు కావడంతో అదేరోజు అర్ధరాత్రి చివరిసారిగా తల్లిదండ్రులు మృతుని చేతితో కేక్ కట్ చేయిస్తూ గుండెలు పగిలేలా విలపించారు. -
ఆసిఫాబాద్: ఛాతీలో నొప్పి.. దూకేసిన ఆర్టీసీ డ్రైవర్
కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్గంలో ప్రమాదం సంభవించింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సు నుంచి బయటకు దూకేశాడు. అదుపు తప్పిన బస్సు.. బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు సదరు సూపర్ లగ్జరీ బస్సులో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా.. ఒకరికి గాయాలైనట్లు సమాచారం. ప్రయాణికుడితో పాటు ఛాతీ నొప్పికి గురైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డెక్కిన పత్తిరైతులు
ఆసిఫాబాద్ అర్బన్: పత్తికి గిట్టుబాటుధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుమురంభీం జిల్లా రైతులు రోడ్డెక్కారు. జిల్లా రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌లోని అంబేడ్కర్ చౌక్ వద్ద హైదరాబాద్–నాగ్‌పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. విత్తనాలు, ఎరువులు, కూలిరేట్లు పెరగడంతో పెట్టుబడి రెట్టింపు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీసీఐ ఆధ్వర్యంలో క్వింటాల్‌కు రూ.15 వేలు చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు వచ్చి రైతులకు మద్దతు పలికారు. అనంతరం కలెక్టర్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు. సీసీఐ అధికారులు, మిల్లుల యజమానులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేవిధంగా ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ హామీ ఇచ్చారు. -
మళ్లీ అలజడి.. ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కదలికలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల కదలికలు మళ్లీ అలజడి రేపుతున్నాయి. ఇటీవల ఐదారు పులుల సంచారం పెరగడంతో సరిహద్దు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆసిఫాబాద్ అటవీ ప్రాంతంలోని ఓ పత్తిచేనులో పులి ఒకరిని చంపి కిలోమీటర్ దాకా ఈడ్చుకెళ్లిన ఉదంతంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అదీగాక తరచుగా జనావాసాలకు దగ్గరగా పులి కదులుతూ లేదా రోడ్డు దాటుతూ కనిపిస్తుండటంతో ఇక్కడి వారిలో భయం మరింత పెరిగింది. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్‌ల నుంచి ఆదిలాబాద్ అడవి పరిధిలోకి ఒక పెద్దపులి, ఏడాదిన్నర వయసున్న మూడు పులిపిల్లలు, వాంఖిడి నుంచి ఆసిఫాబాద్ అటవీ ప్రాంతంలోకి మ రో మగ పులి కొత్తగా ప్రవేశించాయి. కొత్త పులులతోనే సమస్య వాంఖిడి నుంచి వచి్చన పులి కాగజ్‌నగర్ అడవిలో స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు యతి్నంచింది. అయితే ఇప్పటికే అక్కడ స్థిరపడిన మరో మగపులి దానిని తరిమేసిందని అటవీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ పులి కాగజ్‌నగర్ అడవి నుంచి బయటకు వచ్చాక ఆసిఫాబాద్‌లో ఒకరిపై దాడి చేసింది. ఆ తర్వాత అది ఈద్గామ్ గ్రామం నుంచి ప్రస్తుతం బెజ్జూర్ మండలంలోని మారేపల్లి, కాటేపల్లి గ్రామాలకు సమీపంలో సంచరిస్తుండటం సమస్యగా మారింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న పులులతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. మహారాష్ట్ర నుంచి పులుల రాకపోకలు పెరగడంతో ఈ సమస్య తీవ్రమైంది. ఏటా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా సరిహద్దుల నుంచి తెలంగాణలోకి పులులు రాకపోకలు సాగిస్తుండటం మామూలేనని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఒకేసారి రెండు, మూడు ప్రాంతాల్లో ఐదారు పులులు సంచరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువైందని అంటున్నారు. అయితే, ప్రజలు భయపడకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెప్పారు. గ్రామస్తులను అప్రమత్తం చేశాం ఆసిఫాబాద్ చుట్టుపక్కల తిరుగాడుతున్న పులిని ట్రాక్చేసేందుకు బెజ్జూరు నుంచి రెండు, కార్జోలి నుంచి రెండు బృందాలను పెట్టాం. ఈ పులి జనావాసాలు, పొలాలకు దగ్గరగా వస్తున్నపుడు ప్రజలను అలర్ట్ చేస్తున్నాం. ఆ పులి కూడా పూర్తిగా అడవిలోకి వెళ్లేందుకే ప్రయతి్నస్తోంది. రెవెన్యూ ప్రాంతాల్లో పులి బోన్లు పెట్టడంతోపాటు ప్రత్యేక వెటర్నరీ బృందాన్ని కూడా సిద్ధం చేశాం. ఒకట్రెండు రోజుల్లో అది బోనులో చిక్కడమో లేదా దానిని మత్తుమందిచ్చి అడవిలోకి పంపడమో జరుగుతుంది. ఇప్పటికైతే ఎలాంటి సమస్య లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత బయట తిరగొద్దని, ఉదయం 10 గంటల తర్వాతనే పొలాల్లోకి వెళ్లాలని ప్రజలకు చెప్పాం. మారెడు, మార్కిడి, కాటేపల్లి గ్రామస్తులను అప్రమత్తం చేశాం. –దినేష్, ఆసిఫాబాద్ డీఎఫ్‌వో 40 కెమెరా ట్రాప్‌లు పెట్టాం కొత్తగా వచి్చన పులులు తిప్పేశ్వర్ నుంచి వచి్చనట్లు గుర్తించాం. సరిహద్దుల నుంచి ఆదిలాబాద్‌లోకి ప్రవేశించిన ఈ పులుల ట్రాకింగ్‌కు రెండు బేస్‌క్యాంప్‌లు, ట్రాకర్స్ ఏర్పాటుచేశాం. 40 కెమెరా ట్రాప్లను పెట్టి పర్యవేక్షిస్తున్నాం. ఎన్జీవోల సాయం కూడా తీసుకుంటున్నాం. ఈ పులులు తిప్పేశ్వర్ వైపు మళ్లీ మనవైపు అటూ ఇటూ తిరుగాడుతున్నాయి. టాస్క్‌ఫోర్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల ద్వారా రాత్రిళ్లూ పర్యవేక్షిస్తున్నాం. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పొలాలకు గుంపులుగా వెళ్లాలని సూచించాం. ఉదయం పూట పొదలు, తుప్పల్లోకి బహిర్భూమికి వెళ్లొద్దని చెప్పాం. సాయంత్రం 4 గంటలకే పొలాల నుంచి తిరిగి వచ్చేయాలని చెబుతున్నాం. –రాజశేఖర్, ఆదిలాబాద్ డీఎఫ్‌వో చదవండి: తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు -
దాడి చేసి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లి
వాంకిడి (ఆసిఫాబాద్): చేనులో ఒంటరిగా పత్తి ఏరుతున్న రైతుపై పెద్దపులి పంజా విసిరింది. ఒక్కసారిగా దాడి చేసి సుమారు కిలోమీటరు దూరం వరకు లాక్కెళ్లి వదిలేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన కుమురంభీం జిల్లా వాంకిడి మండలం చౌపన్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము (69) అటవీ ప్రాంతంలోని తన చేనులో పత్తి ఏరేందుకు పెద్ద కుమారుడు సిడాం అయ్యుతో కలిసి మంగళవారం వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుమారుడు భోజనానికి వెళ్లగా.. భీము ఒక్కడే పత్తి ఏరుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పులి అతడిపై దాడి చేసింది. అరుపులు విని పక్క చేనులోనే పనిచేస్తున్న కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా.. రక్తం మరకలు, మనిషిని ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో వారు వెంటనే కొంత దూరంలో పోడు భూముల సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి సమాచారం అందించారు. 20 మంది వరకు సిబ్బంది చేనుకు చేరుకొని రక్తం మరకలు, పులి ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లను అనుసరిస్తూ వెతికారు. కిలోమీటరు దూరంలోని ఓ లోయలో భీము మృతదేహం లభ్యమైంది. అంతకుముందు భీము చేను సమీపంలో పశువులు మేపుతున్న ఆత్రం అన్నిగా అనే కాపరిపై పులి దాడికి యత్నించింది. అప్పుడు తన కూతురు గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుంచి పరుగులు తీయడంతో పులి వెళ్లిపోయినట్లు అన్నిగా తెలిపాడు. జిల్లా అటవీశాఖ అధికారి దినేశ్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10వేలు అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజులపాటు ఎవరూ పొలం పనులకు వెళ్లొద్దని సూచించారు. పశువులపై పులుల దాడి.. దహెగాం/తలమడుగు: కుమురంభీం జిల్లాలోని దహెగాం మండలం కర్జి అటవీ ప్రాంతంలో ఆవుల మందపై పెద్దపులి సోమవారం రాత్రి దాడి చేసింది. లంగారి వెంకటేష్‌కు చెందిన కోడె సోమవారం మేతకు వెళ్లి తిరిగి రాకపోవడంతో మంగళవారం అడవిలో వెతకగా కళేబరం లభించింది. పులి దాడి చేసి హతమార్చినట్లు బీట్ అధికారి సుధాకర్ నిర్ధారించారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పిప్పల్‌కోఠి గ్రామానికి చెందిన బాబన్న లేగదూడపై మంగళవారం పులి దాడి చేసి గాయపర్చింది. తాంసి కే గ్రామ శివారు పొలంలో పులి వెనుక నుంచి దాడి చేయగా లేగదూడ తప్పించుకొని గ్రామానికి చేరింది. అటవీశాఖ అధికారులు పులి దాడిగా నిర్ధారించారు. -
పత్తి దిగుబడి రాలేదని మహిళా రైతు ఆత్మహత్య
కెరమెరి (ఆసిఫాబాద్): ఎదిగిన బిడ్డకు పెళ్లి చేయాలనుకుంది. పది రోజుల క్రితమే పెళ్లి సంబంధం రావడంతో సంబరపడింది. అయితే పెళ్లికి డబ్బు లేక తల్లడిల్లింది. పత్తి పంట చేతికి వస్తుందని అనుకున్న తరుణంలో మాడిపోవడం చూసి కుంగిపోయింది. కూతురు పెళ్లి ఎలా చేయాలో తెలి యక దిగులు చెంది మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం పెద్ద కరంజివాడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాథోడ్ మీరా బాయి, వసంత్‌రావు దంపతులకు కుమారుడు కిరణ్, కూతురు సుజీ ఉన్నారు. వసంత్‌రావు పదేళ్ల క్రితం చని పోయాడు. అప్పటి నుంచి మీరాబాయి వ్యవసాయం చేస్తూ పిల్లలను కంటికి రెప్పలా చూస్తోంది. ఈ సీజన్లో రూ.80 వేలు అప్పు చేసి తనకున్న ఐదెకరాల్లో పత్తి సాగు చేసింది. అయితే ప్రకృతి కరుణించక పత్తి పంట మాడిపోయింది. కనీసం 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించినా.. ఐదు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. పది రో జుల కిందట కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ లేక పోవ డం, పంట దిగుబడి సరిగా రాక పో వడంతో మీరాబాయి (40) గురు వా రం పత్తి చేనులోనే పురుగు మందు తాగింది. కుటుంబ స భ్యులు ఆమెను కెరమెరి పీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. మీరాబాయి మృతదేహం -
మైనారిటీల రెసిడెన్షియల్లో విషాహారంపై గవర్నర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మైనారిటీల రెసిడెన్షి యల్ పాఠ శాలలో విషాహారం ప్రభావంతో 31 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలుకావడం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల పరిస్థితి గురించి జిల్లా యంత్రాంగాన్ని అడిగి తెలుసుకోవాలని రాజ్‌భవన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులందరూ కోలుకున్నారని, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఈ ఘటనపై ఆరా తీస్తున్నారని రాజ్‌భవన్ అధికారులు గవర్నర్‌కు నివేదించారు. విద్యార్థులంతా డిశ్చార్జ్ అయినట్లు తెలుసుకుని గవర్నర్ ఊపిరి పీల్చుకున్నారు. -
వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం
పెంచికల్పేట్: కొమురంభీం జిల్లా పెంచికల్పేట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కోయచిచ్చాల వీఆర్ఏ తిరుపతి శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తిరుపతి ఒంటిపై పెట్రోల్ పోసుకోగా అక్కడే ఉన్న నాయకులు అడ్డుకున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాగా, రిలే దీక్షలకు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి మద్దతు ప్రకటించారు. -
పిడుగుపాటుకు ఇద్దరు తోడల్లుళ్లు మృతి
వాంకిడి (ఆసిఫాబాద్): సాగులో మామకు ఆసరా ఇద్దామని బుధవారం అత్తగారింటికి వచ్చిన తోడల్లుళ్లు పిడుగుపాటుకు బలైపోయారు. ఈ హృదయ విదారక సంఘటన బుధవారం కొమురంభీం జిల్లాలో జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి. వాంకిడి మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన లోబడే రాంచందర్‌కు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వాంకిడి మండలం కోమాటిగూడకు చెందిన వాడుగురే సంతోష్ (38)తో, రెండో కుమార్తెకు ఆసిఫాబాద్ మండలం ఆర్ఆర్ కాలనీకి చెందిన ఆదె సంతోష్ (36)తో వివాహం జరిపించారు. ఇంధాని ఎక్స్‌రోడ్డు వద్ద గల తన పత్తి చేనులో యూరియా వేసేందుకు రాంచందర్ ఇద్దరు అల్లుళ్లను బుధవారం ఇంటికి పిలిపించుకున్నాడు. పొద్దంతా కుటుంబ సభ్యులు పొలంలోనే గడిపారు. సాయంత్రం పని ముగించుకుని తోడల్లుళ్లు వాడుగురే సంతోష్, ఆదె సంతోష్ ఇద్దరు ఒకే బైక్‌పై ఇంటికి బయల్దేరారు. తేజాపూర్ గ్రామ శివారులో వీరి బైక్‌పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. వాడుగురే సంతోష్‌కు ఇద్దరు కుమారులు, ఆదె సంతోష్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
గర్భిణిని రక్షించేందుకు వరదలోకి దిగి.. ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతి
దహెగాం(సిర్పూర్)/శ్రీరాంపూర్: పురిటినొప్పులు పడుతున్న ఓ గర్భిణిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వెళ్లి గల్లంతైన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పెద్దవాగులో బుధవారం గ్రామస్తులను వాగు దాటించేందుకు ప్రయత్నిస్తుండగా ఇద్దరు రెస్క్యూ సిబ్బంది గల్లంతయ్యారు. వీరి కోసం రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తుండగా.. గురువారం ఉదయం మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాలు.. భారీ వర్షాలకు కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో పెద్దవాగు ఉప్పొంగి దహెగాం మండలంలో పలుచోట్ల ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన నేర్పల్లి సరస్వతికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో దహెగాం పీహెచ్‌సీకి తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. దహెగాం, ఐనం, పెసరికుంట వద్ద పెద్దవాగు వరద కారణంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి. మధ్యాహ్నం కాగజ్‌నగర్ రూరల్ సీఐ నాగరాజు, స్థానికులు ట్రాక్టర్ సాయంతో దహెగాం సమీపంలో ప్రధాన రహదారిపై వరద దాటే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ మొరాయించడంలో వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న సింగరేణి రెస్క్యూ టీంకు చెందిన ఆరుగురు తిరుపతి, మధుకర్, నర్సింగ్, చిలుక సతీష్, అంబాల రాము, గణేశ్ దహెగాంకు చేరుకున్నారు. గణేశ్ బయట ఉండగా మిగిలిన ఐదుగురు, సీఐ నాగరాజు, మర్రిపల్లి గ్రామానికి చెందిన బాదవత్ తిరుపతి, జర్పుల శ్యాం, జర్పుల సతీశ్ మొత్తం తొమ్మిది మంది తాడు సాయంతో వరద నీటిలోకి దిగారు. ఒకరికొకరు రెండు మీటర్ల దూరంలో ఉంటూ దాటుతుండగా రెస్క్యూటీం సభ్యులు సీహెచ్ సతీశ్, రాము నీటిలో గల్లంతయ్యారు. మిగిలిన వారు ఒడ్డుకు చేరుకుని విషయం అధికారులకు తెలిపారు. అక్కడే ఉన్న ఆర్డీవో దత్తు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు చేరవేశారు. అదనపు కలెక్టర్ రాజేశం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు బృందాలతో గాలింపు.. విషయం తెలియగానే శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిపై చర్చించారు. శ్రీరాంపూర్ నుంచి మరో మూడు రెస్క్యూ బృందాలను ఘటన స్థలానికి పంపించారు. మందమర్రి, బెల్లంపల్లి నుంచి మరో రెండు బృందాలను పంపారు. పరిస్థితిని ఎప్పకటికప్పుడు అక్కడికి వెళ్లిన వారితో చర్చించారు గర్భిణి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం.. బీబ్రా గ్రామంలో ఉన్న గర్భిణి నేర్పల్లి సరస్వతిని ఆస్పత్రికి తరలించేందుకు వరంగల్ నుంచి 22 సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం దహెగాంకు చేరుకుంది. నాలుగు బోట్ల సాయంతో మెడికల్ సిబ్బంది గ్రామానికి బయలుదేరారు. గనులపై ఆందోళన.. రామకృష్ణాపూర్ రామాలయం సమీపంలో నివాసం ఉంటున్న అంబాల రాము ఆర్కే 5 గనిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్పందన, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. గని మేనేజర్ అబ్దుల్ ఖాదర్, సంక్షేమ అధికారి రణధీర్, టీబీజీకేఎస్ నేతలు మహేందర్‌రెడ్డి, నీలం సదయ్య కార్మికుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే నస్పూర్ షిర్కేలో నివాసం ఉంటున్న చిలుక సతీశ్ శ్రీరాంపూర్ ఓసీపీలో ఈపీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే ఆపరేషన్‌లో పాల్గొన్న రెస్క్యూ సభ్యులెవ్వరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రెస్క్యూ స్టేషన్ నుంచి వీరిని పంపిన అధికారులు జాకెట్లు ఇచ్చి పంపారా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. -
యువతిపై లైంగిక వేధింపులు రెబ్బెన ఎస్సైపై వేటు
ఆసిఫాబాద్/రెబ్బెన: యువతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెబ్బెన ఎస్సైపై వేటు పడింది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ సీఐ, మరో ఎస్సై మహిళలపై లైంగికదాడుల ఘటనలు మరువక ముందే కుమురంభీం జిల్లా రెబ్బెన ఎస్సైపైనా ఆరోపణలొచ్చాయి. బాధితురాలి కథనం ప్రకారం రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఓ యువతి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. పరీక్షకు సిద్ధమవుతోంది. స్టడీ మెటీరియల్ ఇప్పిస్తానని, పరీక్ష లేకుండానే పాస్ చేయిస్తానని రెబ్బెన ఎస్సై భవానీసేన్ నెల క్రితం యువతికి ఫోన్ చేసి స్టేషన్‌కు పిలిపించుకున్నాడు. ఎత్తు కొలుస్తానంటూ స్టేషన్లోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. పలుమార్లు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆమె కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం సోమవారం బయటకు పొక్కింది. యువతి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సైపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఆమెను విచారించారు. ఆపై ఎస్సైని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. కాగా, యువతి డీఎస్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ... స్టేషన్ల చుట్టూ తిరగడం ఇబ్బందవుతుందని ఇంట్లోవారు చెప్పడంతో కేసు విత్‌డ్రా చేసుకుంటున్నానని తెలిపింది. మరోవైపు ఎస్సై వ్యవహారం టీవీ చానళ్లతోపాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవడంతో అవమానంగా భావించిన ఎస్సై భార్య మంగళవారం రెబ్బెనలోని ఎస్సై క్వార్టర్లో శానిటైజర్ తాగి, ఆత్మహత్యకు యత్నించింది. ఇరుగుపొరుగు వారు ఆమెను రెబ్బెన పీహెచ్‌సీకి అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు. -
రెడీమేడ్ గూడు.. భలేగుంది చూడు
సాక్షి, ఆసిఫాబాద్ (కెరమెరి): ఉండేందుకు ఇల్లు లేక.. కట్టుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక తలదాచుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆదిమ గిరిజనుల సొంతింటి కలను ఐటీడీఏ అధికారులు సాకారం చేశారు. రూ.3.4 లక్షలతో రెడీమేడ్ ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం బాబేఝరి గ్రామ పంచాయతీ పరిధి శివగూడలో 13 కుటుంబాలున్నాయి. ఆదిమ గిరిజనులు (పీటీజీ) గూన, పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. దీంతో వారి కోసం ఒక్కొక్క ఇంటికి రూ.3.4 లక్షలు వెచ్చించి రెడీమేడ్‌గా 13 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఐటీడీఏ అధికారులు నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా మొదటి ఇంటిని టేకం మాణిక్‌రావు అనే లబ్ధిదారుకు నిర్మించారు. హాల్, బెడ్రూం, కిచెన్, మరుగుదొడ్లు, నేలకు రంగురంగుల టైల్స్ తదితర సౌకర్యాలతో ఇంటిని పూర్తి చేశారు. కిటికీలకు చలువ అద్దాలు అమర్చడంతో ఆకర్షణీయంగా ఇల్లు కనిపిస్తోంది. ఇంటి నిర్మాణానికి 30 రోజుల సమయం పట్టిందని, 50 ఏళ్ల వరకు మన్నిక ఉంటుందని ఐటీడీఏ ఏఈ నజీమొద్దీన్ తెలిపారు. మిగతా ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అందమైన ఇంట్లో నివసించాలనే కల నెరవేరనుండటంతో ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఆరోగ్య ఉపకేంద్రం ‘రెడీ’మేడ్
తిర్యాణి(ఆసిఫాబాద్): అది దట్టమైన అటవీప్రాంతం.. రవాణా అంటే హైరానే.. బాహ్య ప్రపంచానికి బహుదూరంగా, నిర్మాణ సామగ్రి తరలింపు భారంగా మారడంతో 15 ఏళ్లుగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎట్టకేలకు అది రెడీమేడ్ తరహాలో సిద్ధమవుతోంది. కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గుండాల గ్రామపంచాయతీ ఏడు గూడేలతో ఉంటుంది. దట్టమైన అటవీప్రాంతం లోపల ఉండటంతో గ్రామస్తులు విద్య, వైద్యం, నిత్యావసర సరుకుల కోసం వేరే గ్రామానికి ఆరు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో పీహెచ్సీ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి 2007లో ఐటీడీఏ ద్వారా రాష్ట్రీయ స్వయం వికాస్ యోజన కింద రూ.7 లక్షలు మంజూరయ్యాయి. నిర్మాణ సామగ్రి తరలింపులో ఇబ్బందులు తలెత్తడంతో కాంట్రాక్టర్ బేస్మెంటు స్థాయిలోనే పనులు నిలిపివేశాడు. 15 ఏళ్లుగా స్తంభించిన పీహెచ్‌ఎసీ భవనం పనులు ఇటీవల కలెక్టర్ రాహుల్‌రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఐటీడీవో పీవో అంకిత్ ప్రత్యేక చొరవతో మళ్లీ ప్రారంభమయ్యాయి. సాధారణ భవనం కట్టడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ బేస్‌మెంట్‌పైనే కేరళకు చెందిన శాంతి మెడికేర్ ఇన్ఫర్మేషన్ సిస్టం అనే సంస్థ ద్వారా కృత్రిమ గోడల (సిమెంటు ఫైబర్ ప్యానెల్)ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహాలోనే ఆరోగ్య ఉపకేంద్రంలో విశ్రాంతి గది, ఫార్మసీ రూమ్, చికిత్స చేసే గది, హాలు, మరుగుదొడ్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో ప్రారంభిస్తామని డీఎంహెచ్‌వో కుడిమెత మనోహర్ తెలిపారు. ఇదే తరహాలో ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నిర్మించారు. -
Pranahita Pushkaralu: పుష్కరాలు షురూ.. తరలిన భక్త జనం
సాక్షి, మంచిర్యాల/భూపాలపల్లి /కాళేశ్వరం: ప్రాణహిత పుష్కర సంబురం మొదలైంది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వేమనపల్లి ఘాట్ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుష్కరాలను ప్రారంభించారు. వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, వైదిక క్రతువులు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ వెంట.. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాణహిత నది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రవహించి, కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ మేరకు ప్రాణహిత నది వెంట పలుచోట్ల పుష్కరాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇతర రాష్ట్రాలవారు మంగళవారం సాయంత్రానికే ప్రాణహిత తీరాలకు చేరుకుని.. తాత్కాలిక గుడారాల్లో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత పుష్కరాలు మొదలవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసి.. పిండ ప్రదానాలు, ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. సమీపంలోని ఆలయాలను దర్శించుకున్నారు. గురువారం నుంచి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాళేశ్వరంలో దేవాదాయశాఖ అధికారులు, వేదపండితులు కాలినడకన కలశాలు, మంగళ వాయిద్యాలతో ప్రాణహిత నదికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.54 గంటలకు పడవలో నదికి అవతలివైపు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నదికి పంచ కలశాలతో ఆవాహనం చేసి.. పుష్కరుడి(ప్రాణహిత)కి చీర, సారె, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం పంచ కలశాలల్లో నీటిని తీసుకొచ్చి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివారికి అభిషేకం, పూజలను నిర్వహించారు. ఇక కాళేశ్వరానికి అనుకుని అవతలివైపు ఉన్న మహారాష్ట్ర పరిధిలోని సిరొంచలో ఆ రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే, ఎమ్మెల్యేలు పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని రెండు ఘాట్లలో తొలిరోజు 10 వేల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్టు అంచనా. ఇక్కడికి తొలిరోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా తరలివచ్చారని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ సాయంత్రం ఆరు గంటలకు నదీ హారతి ఇచ్చారు. అర్జునగుట్ట వద్ద కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసభ్యులతోపాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: ఇంద్రకరణ్‌రెడ్డి గోదావరి ఉప నదిగా మనకు ప్రాణహిత పుష్కలంగా నీరందిస్తోంది. స్వరాష్ట్రంలో తొలిసారిగా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. ఇది సంతోషకరం. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు హరిస్తాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు అన్నిరకాల మేలు జరగాలని కోరుకున్నానని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ‘ప్రాణహిత’ ప్రత్యేక టూర్ ప్యాకేజీ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత పుష్కరాల కోసం తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) ప్రత్యేక యాత్ర ప్యాకేజీని బుధవారం ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం వరకు ఈ నెల 24దాకా అంటే 12 రోజుల పాటు ఈ ప్రత్యేక యాత్ర నడుస్తుంది. రోజూ ఉదయం 05:00 బషీర్‌బాగ్ సీఆర్వో నుంచి బస్సు బయలుదేరుతుంది, 8:30 గంటలకు అల్పాహారం ఉంటుంది. 11:00 గంటల సమయంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 వరకు సిరోంచ పుష్కరఘాట్ వీక్షించేందుకు సమయమిస్తారు. తర్వాత గంటపాటు దర్శన సమయం, 1.45 గంటలకు కాళేశ్వరం హరిత హోటల్లో భోజనం ఉంటాయి. 2.45 గంటలకు తిరుగు ప్రయాణమై రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ యాత్ర ఏసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,760, నాన్‌ఎసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600గా ఉంటాయని టీఎస్‌టీడీసీ ప్రకటించింది. -
వైద్యులూ.. వెల్డన్
కోల్‌సిటీ(రామగుండం)/ఆసిఫాబాద్ అర్బన్: కరోనా సోకిన ముగ్గురు గర్భిణులకు కాన్పులు చేసి విధి నిర్వహణపట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నారు ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది. అందరికీ ఆదర్శంగా నిలిచిన గోదావరిఖని, ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బందిని పలువురు అభినందించారు. మంథని మండలం వెంకటాపూర్, అంతర్గాం మండలం మర్రిపల్లికి చెందిన ఇద్దరు గర్భిణులకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కరోనా టెస్టులు చేయగా వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒకరి తర్వాత మరొకరికి వైద్యులు కాన్పులు చేశారు. రిస్క్ కేస్ అయినప్పటికీ గైనకాలజిస్టు డాక్టర్ కల్యాణి, అనస్తీషియా డాక్టర్ మోహన్‌రావు, స్టాఫ్‌నర్స్ రుద్రమ పీపీఈ కిట్లు ధరించి ఆ గర్భిణులకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లో సిజేరియన్ చేశారు. ఇద్దరికీ ఆడశిశువులే జన్మించారు. తల్లులు, శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని, వారిని కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన జాడి సింధూజకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించగా సిబ్బంది అంబులెన్‌లో తీసుకెళ్లి రాత్రి 7 గంటలకు అడ్మిట్ చేసుకున్నారు. రాత్రి పురిటినొప్పులు రావడంతో సూపరింటెండెంట్ స్వామి సూచనల మేరకు డాక్టర్ నవీద్, స్టాఫ్ నర్సులు ప్రీత, సుదీవన పీపీ కిట్లు ధరించి, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ కాన్పు చేశారు. సుఖ ప్రసవం చేసిన వైద్య సిబ్బందికి గర్భిణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆసిఫాబాద్‌లో పులి చర్మం స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా పులి చర్మాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. కొట్నాక దేవరావు, గొడుగు అవినాశ్ అనే వ్యక్తులు ఈ చర్మాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వడగామ్ గ్రామం నుంచి తీసుకొచ్చినట్టు ఆదివారం రాత్రి అటవీశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీరిద్దరిని విచారించిన అనంతరం ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ నేతృత్వంలో ఉట్నూరు, ఆసిఫాబాద్ ఎఫ్‌డీవోలు, కాగజ్‌నగర్ అటవీ సిబ్బంది వడగామ్ గ్రామానికి చెందిన మేస్రం మంకు, మేస్రం దీపక్, మేస్రం చంద్రకాంత్, మేస్రం ఈశ్వర్, మేస్రం లక్ష్మణ్‌లను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్టు అటవీ శాఖ తెలిపింది. గత ఏడాది ఇంద్రవెల్లి మండలం వాలుగొండ గ్రామంలో పెందూరు దేవరావు అనే వ్యక్తి పొలంలో అడవి పందుల కోసం అమర్చిన ఉచ్చులకు చిక్కి పులి మరణించినట్టు తెలుస్తోందని ఆ ప్రకటన పేర్కొంది. అదే గ్రామంలోని పెందూరు ముకంద్‌రావు ఇంట్లో సోదా చేయగా పులి కింది దవడ, ఇతర ఎముకలు దొరికినట్లు తెలిపింది. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ అనంతరం, సిర్పూర్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపింది. కాగా, పవిత్ర దండారీ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో అటవీ శాఖ అధికారులు సోదాల పేరుతో తమ ఇళ్లలోకి బూటుకాళ్లతో ప్రవేశించి సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించారంటూ ఇంద్రవెల్లిలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆదివాసీలు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. -
బహు సుందరం బాబేఝరి అడవులు.. ఎక్కడో తెలుసా..!
కెరమెరి(ఆసిపాబాద్) : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని ఆదివాసీ గ్రామమైన జాబేఝరి అడవులు ఊహల్లోకి విహరింపజేస్తున్నాయి. ఎవరూ ఊహించని, చూడని బాబేఝరి అడవులు మరో కశ్మీర్‌ను తలపిస్తున్నాయి. బాబేఝరి, టోకెన్మోవాడ్, పిట్టగూడ గ్రామాలకు ఆనుకొని వందల ఎకరాల విస్థీర్ణంలో ఉన్న ఈ అడవులు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఏపుగా పెరిగిన చెట్లు, గుబురుగుబురుగా పొదలు, ఆ పొదల్ల మధ్య పచ్చపచ్చని పొలాలు, అందమైన లోయలు ఎంతో అహ్లద భరితంగా కనిపిస్తున్నాయి. ఓ సారి చూస్తే మళ్లీమళ్లీ చూడాలనిపించక మానదు. అయితే వర్షాకాలంలో ప్రతి రోజు చల్లటి వాతావరణం ఉండేది ఇక్కడ. ప్రస్తుతానికి వర్షాకాలం ముగిసినా తేలిక పాటి చిరుజల్లులు పడుతూనే ఉంటాయి. దీంతో ప్రకతి పచ్చదనాన్ని పరచినట్లు ఆ దృశ్యాలను చూస్తే మైమరచి పోతాం. అలాగే హట్టి పై భాగం నుంచి ములుపులు తిరిగిన రోడ్డు, పచ్చపచ్చని పొలాలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. -
పేరుకు ఊరి సర్పంచ్.. చేసేది గంజాయి సరఫరా
కాగజ్‌నగర్ రూరల్: ఆయనో పంచాయతీకి సర్పంచ్. గ్రామానికి ప్రథమ పౌరుడు కాస్త దారి తప్పాడు. గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని ఈస్గాం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను గురువారం పట్టుకున్నట్లు సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ.. 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక పట్టుబడ్డ వారిలో చిన్నమాలిని గ్రామ సర్పంచ్ సుర్పం భగవంత్‌రావు, ఈస్గాం గ్రామానికి చెందిన సౌమిత్ర సర్కార్ ఉన్నారు. వారు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో దాడులు చేశారు. వారిద్దరూ రహస్య ప్రాంతం నుంచి ఈజ్గాం మార్కెట్‌కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? -
యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక
సిర్పూర్ (యూ) (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మోతిపటార్ గ్రామానికి చెందిన యువ కౌలు రైతు రాథోడ్ రాజు (34) వర్షాలకు పంట చేతికి రాదేమోననే బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మధుకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజుకు సొంత వ్యవసాయ భూమి లేకపోవడంతో గ్రామంలో 13 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగానికి పైగా పంట దెబ్బతింది. చదవండి: టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం: ఈటల రాజేందర్ చేనుకు గురువారం ఉదయం వెళ్లిన రాజు దెబ్బతిన్న పంటను చూసి, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతూ ఇంటికి వచ్చిన ఆయన ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య జమున వెంటనే స్థానికుల సాయంతో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతుడికి పిల్లలు లేరు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? -
వామ్మో ఆ యాప్.. మెడ మీద కత్తిరా బాబోయ్!
సాక్షి,కెరమెరి(ఆసిఫాబాద్): గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరును విశ్లేషించేందుకు, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు నూతనంగా తీసుకొచ్చిన డీఎస్ఆర్(డైలీ శానిటేషన్ రిపోర్టు) యాప్ ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే అదనపు భారం మోస్తున్న తమకు ఈ యాప్ మెడ మీద కత్తిలా ఉందని కార్యదర్శులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యంతో సహా పల్లె ప్రగతి పనుల పురోగతి నమోదు కోసం ప్రభుత్వం డీఎస్ఆర్ యాప్ తీసుకొచ్చింది. పల్లె ప్రగతి పనులు పరిశీలన, వీధుల శుభ్రం, రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు, మరణాల నమోదు, విద్యుత్ బిల్లులు ఇలా ప్రతి సమాచారాన్ని ప్రస్తుత డీఎస్ఆర్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఈ యాప్‌ను మార్చారు. కొత్త ఆప్షన్లను ఇందులో చేర్చారు. కొత్త డీఎస్ఆర్ ఆప్‌ను ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. కాని చాలా మంది ఇంకా ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోలేదు. దీన్ని వినియోగించడానికి నిరాకరిస్తున్నారు. నేటి నుంచి దీన్ని వాడకంలోకి తేవాలని కోరుతుండగా, కొద్ది మంది మాత్రమే ఇన్స్టాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి ఇది.. పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే ఉన్న యాప్‌ను తొలగించి కొత్తది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందులో పంచాయతీ కార్యాలయం చిత్రాలను లోపలి నుంచి ఒకటి, బయటి నుంచి మరొకటి తీసి అనుసంధానం చేయాలి. ఇది ఈ కార్యాలయ, ప్రాంతానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా పనిచేస్తుంది. ఆ తర్వాత రోడ్లు వీధులు, తదితర ఐదు ఫొటోలు అప్లోడ్ చేయాలి. పాత తేదీని తీసిన ఫొటో అయితే అప్లోడ్ కాదు. పంచాయతీ కార్యదర్శులు ఖచ్చితంగా లోకేషన్లో ఉండి పనిచేసేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. ఇది ప్రధానంగా ఇబ్బందికి కారణం. దీని ప్రకారం కార్యదర్శులు తప్పక ఉదయం 5 గంటలలోపు హాజరును యాప్‌లో నమోదు చేయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా తెరచుకోదు. స్వీయా చిత్రం తీసుకుంటేనే హాజరు నమోదవుతుంది. తర్వాత డైయిలీ శానిటేషన్ రిపోర్టును ఆన్లైన్లో చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అదనపు పనిభారంతో సతమతమవుతున్న తమకు ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుందని కార్యదర్శులు పేర్కొంటున్నారు. సిగ్నల్స్ రాని వారి పరిస్థితి? కొత్త విధానంతో కార్యదర్శులు సంకట స్థితిలో పడ్డారు. కార్యదర్శులు అందరూ స్థానికంగా నివాసం ఉండడం లేదు. నివాసిత ప్రాంతానికి దూరంగా ఉన్నా పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము లేచి బయలుదేరితే తప్పా 5 గంటల్లోపు కార్యాలయానికి చేరుకునే పరిస్థితి లేదు. ఇక మహిళా కార్యదర్శులు ఇక్కట్లకు గురికావాల్సిందే. వేళాపాళా లేకుండా కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించాల్సి రావడంతో లోలోనా కుమిలిపోతున్నారు. జిల్లాలో సెల్‌ఫోన్ సంకేతాలు సరిగా అందని పంచాయతీలు దాదాపు 200 వరకూ ఉన్నాయి. అక్కడ ఈ విధానాన్ని ఎలా అమలు చేయాలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ విధానం ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు.కొత్తయాప్‌ను మెడ మీద కతిక్తలాంటిదని పంచాయతీ కార్యదర్శులు వ్యతిరేకిస్తున్నారు. ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు పనులు తామే చేస్తున్నామని, పాఠశాలల్లో స్వీపర్లను తొలగించడంతో తమ సిబ్బంది ద్వారా పనిచేయించాల్సి వస్తుందని అంటున్నారు. ఊర్లో అన్ని సమస్యలు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. నాయకులు, పై స్థాయి అధికారులు వచ్చినా ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాప్‌లో పేర్కొన్న నిబంధనలు మార్చాలని విన్నవిస్తున్నారు. చదవండి: ఒక్కగానొక్క కూతురు.. అల్లారు మద్దుగా పెంచారు.. పుట్టిన రోజునే.. -
లావా చెక్కిన ‘స్తంభాలు’
ఈ చిత్రంలో కనిపిస్తున్నవి గండరాతి శిలలు.. కానీ సాధారణ రాయితో ఏర్పడ్డవి కాదు. భూపొరల నుంచి ఉప్పొంగిన లావా ఘనీభవించి ఇలా రాతిగా మారాయి. లావాతో ఏర్పడ్డ రాతి పొరలు సహజంగానే కనిపిస్తుంటాయి. కానీ ఉలితో శిల్పి చెక్కినట్టుగా ఇలా ఒకేరకం కడ్డీలుగా ఏర్పడటం మాత్రం కొంత అరుదే. వాటిని కాలమ్నార్ బసాల్ట్‌గా పిలుస్తారు. ఇలాంటి అరుదైన లావా రాతిస్తంభాలు ఆసిఫాబాద్ అడవుల్లో వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లో గతంలో విస్తారంగా కనిపించిన ఈ లావా స్తంభాలు తెలంగాణ లో తొలిసారి కనిపించడం విశేషం. ఇలాం టి రాతిస్తంభాలు కొన్ని ప్రాంతాల్లో చాలా పొడవుగా ఉంటాయి. అలాంటి స్తంభాలతో ఏర్పడ్డ గుట్టలు కూడా ఉన్నాయి. ఆసిఫాబాద్ అభయారణ్యంలో వెలుగుచూసిన లా వా ‘రాతికడ్డీలు’ భూ ఉపరితలంలో చిన్న విగానే కనిపిస్తున్నా భూగర్భంలో మరింత పొడవుగా ఉండి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ ప్రాంతంలో జీఎస్ఐ విభాగం పరిశోధన జరిపితే మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. 6.5 కోట్ల సంవత్సరాల క్రితం.. దక్కన్ పీఠభూమి చాలా వరకు లావా ప్రవహించిన ప్రాంతమే. దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలోని పొరల్లో చోటుచేసుకున్న చర్య ఫలితంగా లోపలి నుంచి లావా ఉప్పొంగి మహారాష్ట్ర పూర్తి భాగం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో కొంతభాగం చొప్పున ఆవరించిందని, వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలు అలా ఉప్పొంగిన లావా ఘనీభవించి ఏర్పడ్డవేనని ఔత్సాహిక పరిశోధకులు చెబుతున్నారు. చేవెళ్ల మీదుగా వికారాబాద్, ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర వైపు ఇలా లావాతో రాతి పొరలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల చదరపు కి.మీ. మేర ఇవి ఏర్పడటం గమనార్హం. ఈ సాధారణ రాతి పొరలే కాకుండా కొన్ని ప్రత్యేక ఒత్తిళ్ల వల్ల అవి నిర్దిష్ట ఆకృతిలో స్తంభాలుగా ఏర్పడ్డాయి. వాటినే కాలమ్నార్ బసాల్ట్‌గా పేర్కొంటారు. – సాక్షి, హైదరాబాద్ జీఎస్ఐ పరిశోధన చేపట్టాలి... కొందరు ఔత్సాహికులు కొంతకాలం క్రితం ఆసిఫాబాద్ అభయారణ్యంలో పరిశోధించి ఈ రాళ్లను గుర్తించారు. ఆ చిత్రాలను నేను జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ చకిలం వేణుగోపాల్‌కు పంపగా అవి కాలమ్నార్ బసాల్ట్‌గా ఆయన నిర్ధారించారు. ఈ అరుదైన రాళ్లకు సంబంధించి ఆ ప్రాంతంలో జీఎస్ఐ వెంటనే పరిశోధన చేపట్టాలి. – శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ తెలంగాణలో తొలిసారే... మహారాష్ట్రలోని యావత్మాల్లో ఇటీవల రోడ్డు నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో భారీ కాలమ్నార్ బసాల్డ్ పొర వెలుగుచూసింది. ఆసిఫాబాద్ అడవిలో కనిపించిన శిలాస్తంభాల చిత్రాలు చూస్తే అవి కాలమ్నార్ బసాల్ట్గానే అనిపిస్తోంది. జీఎస్ఐ పరిశోధించి వాటిని అధికారికంగా తేలిస్తే తెలంగాణలో మొదటిసారి అలాంటి శిలారూపాలు రికార్డయినట్టవుతుంది. – చకిలం వేణుగోపాల్,జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ -
ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. వాగులో చిక్కుకున్న 9 మంది
సాక్షి, ఆసిఫాబాద్: గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పోర్లుతున్నాయి. భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ వరదల వల్ల జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆసిఫాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చి వరదలో చిక్కుకున్నారు కార్మికులు. ఆ వివారలు.. ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం సృష్టించింది. పెంచికల్ పెద్దవాగులో 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన వీరు శుక్రవారం ప్రమాదవశాత్తు వాగులో చిక్కుకుపోయారు. తమను కాపాడాలని క్యాంప్‌పై నుంచి కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. -
మూడు వాగులు.. ఆరు కిలోమీటర్లు..
సాక్షి, ఆసిఫాబాద్(తిర్యాణి): పల్లె ప్రగతి పనుల పరిశీలనకు కుమ్రంభీం జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి అటవీ బాటపట్టారు. బుధవారం తిర్యాణి మండలం రోంపెల్లి నుంచి గుండాల గ్రామం వరకు దట్టమైన అటవీ ప్రాంతంలో ఆరు కిలోమీటర్ల నడకలో మూడు వాగులు దాటారు. గుండాలలో పల్లె ప్రగతి పనులు, జలపాతం సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమై ఎకో టూరిజం డెవలప్మెంటు ద్వారా గుండాల జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, తద్వారా ఇక్కడి 20 మంది యువకులకు స్వయం ఉపాధి లభిస్తుందని తెలిపారు. జలపాతం వద్ద గుడారాలను ఏర్పాటు చేసి పర్యాటకుల సంఖ్య మరింత పెరిగేలా చర్యలు చేపడతామని, రొంపెల్లి నుంచి గుండాల వరకు రోడ్డు సౌకర్యం కోసం ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపారు. ఆయన వెంట గిన్నెదరి ఫారెస్టు రేంజ్ అధికారి ప్రణయ్, ఈజీఎస్ ఏపీవో శ్రవణ్‌కుమార్, సర్పంచ్ జంగుబాయి, పంచాయతీ కార్యదర్శి రాధాకిషన్, ఆదివాసీ నాయకులు శంకర్, కోవ మెతిరాం, సీతారాం, అశోక్ ఉన్నారు. -
భారీ చోరి..పది లక్షల బంగారు నగలు మాయం
సాక్షి, అసిఫాబాద్: కాగజ్ నగర్ మండలం ఈస్గాం మార్కెట్ లో భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి స్నేహ జ్యువెలరీ దుకాణంలో కొందరు దుండగులు షట్టర్ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. కాగా దుకాణంలో సుమారు పది లక్షల విలువైన నగలు దోచుకెళ్లారిని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందాలతో రంగంలోకి దిగిన అధికారలు దర్యాప్తు ముమ్మరం చేశారు. దోపిడీ జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ సుదీంద్ర సందర్శించారు. ఈ సందర్బంగా దొంగలు దోపిడీ చేసిన తీరును స్థానిక పోలీసులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల ద్వారా ఈ దొంగతనం రికార్డు కావడంతో ప్రస్తుతం అధికారులు ఆ వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు చోరిలో పాల్లొన్నట్టు కెమెరాలలో రికార్డైంది. సీసీ పుటేజీ ఆధారంగా దొంగలని పట్టుకోవడానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
అయ్యో! పులి ఎంతపని చేసింది..
పెంచికల్పేట్/దహెగాం (సిర్పూర్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కమ్మర్గాం గ్రామ సమీపంలో మేతకు వెళ్లిన పశువులపై మంగళవారం పులి దాడి చేసింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన తలండి పోశయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. పేదం సురేష్‌కు చెందిన గేదెకు తీవ్ర గాయాలు అయ్యాయి. దహెగాం మండలం దిగిడ గ్రామంలోనూ పశువులపై పులి దాడి చేసింది. రైతు కుర్సింగ వెంకటేష్‌కు చెందిన ఆవు మేతకు వెళ్లి వస్తుండగా సాయంత్రం సమయంలో దాడి చేసి హతమార్చింది. -
కొమరంభీం ఆసిఫాబాద్: రోడ్డు ప్రమాదం
-
ఆన్లైన్ క్లాసెస్.. ఫోన్ సిగ్నల్ కోసం 5 కిలో మీటర్లు!
తిర్యాణి (ఆసిఫాబాద్): ఈ చిత్రంలోని చిన్నారి పేరు సరస్వతి విద్య. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మొర్రిగూడలోని గిరిజన కుటుంబానికి చెందిన కుడిమెత భగవంతరావు కూతురు. సరస్వతి మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. సాక్షాత్తూ చదువుల తల్లిని తన పేరులో నిలుపుకొన్న ఈ చిన్నారికి చదువంటే అమితమైన ఇష్టం. కానీ, కరోనా వల్ల తను చదివే పాఠశాలను మూసివేసి, ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. అయితే, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన మొర్రిగూడలో ఏ మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ అందవు. దీంతో సరస్వతి విద్యను తండ్రి ఇదిగో ఇలా ప్రతిరోజూ ఐదు కిలోమీటర్ల దూరంలో.. సిగ్నల్ వచ్చే ప్రాంతానికి బైక్‌పై తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తున్నాడు. -
అన్నదానంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం?
ఆసిఫాబాద్ రూరల్: జిల్లాలోని ఓ అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ బియ్యం వినియోగించారన్న వార్త కలకలం రేపుతోంది. ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామంలో ఆదివారం పులాజీ బాబా ధ్యాన పూజ కార్యక్రమంలో భాగంగా అన్నదానం నిర్వహించారు. భోజనం చేస్తున్న సమయంలో చిన్నారులు అన్నం తినలేక ఇబ్బందులు పడుతుండటంతో గమనించిన గ్రామస్తులు వండిన అన్నంతో పాటు బియ్యాన్ని పరిశీలించారు. అన్నం రబ్బరు మాదిరిగా ఉండటంతో ప్లాస్టిక్ బియ్యం ఉపయోగించారని ఆరోపిస్తూ బియ్యం అమ్మిన దుకాణం వద్ద బైఠాయించి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజేశ్వర్ తెలిపారు. -
వివాదం.. అగ్గిరాజేస్తున్న ఆధిపత్య పోరు
ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ మధ్య పోరు అగ్గిరాజేస్తోంది.. ఆధిపత్యం కోసం రెండు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. వర్గాలు వీడిపోయి ఒకరి పై ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే టార్గెట్ చేయడానికి కారణాలేంటి,? ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీలో కుంపట్లపై సాక్షి టీవీ స్పేషల్ రిపోర్ట్. సాక్షి, ఆదిలాబాద్ : కుమ్రంభీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గూలాబీ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే అత్రం సక్కు, జడ్పీ చైర్మన్ కోవలక్ష్మి మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఎమ్మెల్యే అత్రంసక్కు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కోవ లక్ష్మిపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత సక్కు కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరారు. కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలలో జైనూర్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి గిరిజనులకు కేటాయించడంతో కోవలక్ష్మి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇద్దరు ఒకే నియోజకవర్గం కావడంతో పార్టీలో పట్టుకోసం వర్గాలు విడిపోయారు. ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ ఆధిపత్యం కోసం వర్గాలను పెంచిపోషిస్తున్నారు. అభివృద్ధి పనులైనా, పదవులైనా అనుచరులకు దక్కించుకోవడానికి పోటీపడుతున్నారు. ఒక వర్గానికి అధికారులు పనులు ఇస్తే. తనవర్గానికి పనులు ఇవ్వడం లేదని ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. దీంతో అధికారులకు అడకత్తేరలో పోకమాదిరిగా మారింది. ఒకే పార్టీలో ఉన్నా.. ఉప్పు నిప్పులా ఒక వర్గానికి పనులు ఇస్తే.. మరోక వర్గం అధికారులపై కస్సుబుస్సు మంటోది. అదే విధంగా ఎస్సైలు, సీఐలు, మండల పరిషత్ అధికారులు, ఎమ్మార్వోలు ఎమ్మెల్యే అనుకూలంగా ఉంటే, జడ్పీ చైర్మన్‌కు గిట్టడంలేదట. చైర్మన్‌కు అనుకూలంగా ఉంటే ఎమ్మెల్యే సక్కుకు గిట్టడం లేదట. ఇద్దరి ప్రజాప్రతినిధుల పెత్తనం వల్ల అధికారులు నలిగిపోతున్నారట. కొందరు అధికారులు ఈ పెత్తనం వేధింపులు తట్టుకోలేక బదిలీ దారులు వెతుకున్నారట. అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గోయ్యిలా ఉంటే.. కార్యకర్తలది నాయకులది విచిత్రమైన పరిస్థితి. ప్రతి మండలంలో ఎమ్మెల్యే సక్కు వర్గం, జడ్పీ చైర్మన్ కోవలక్ష్మి వర్గాలుగా విడిపోయారు. చైర్మన్ కోవలక్ష్మి ఎమ్మెల్యేపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం ఉంది. సిర్పూర్ మండలం జడ్పీటీసీగా కోవలక్ష్మి కూతురు విజయం సాధించింది. కోవలక్ష్మి జడ్పీటీసీగా గెలుపొందిన జైనూర్, సిర్పూర్ మండలాల్లో చైర్మన్ అంత జనన కనుసన్నలో నడిపిస్తోందట. జిల్లా పరిషత్ నుంచి కేటాయించే నిధులు తనకు అనుకూలంగా కేటాయిస్తోందట. ఎమ్మెల్యే సక్కు తానేం తక్కువ కాదని ఎమ్మెల్యే కోటా నిధులు తనవర్గానికి కేటాయించి పట్టుపెంచుకున్నారట. చైర్మన్ వర్గాన్ని దూరం పెడుతున్నారని జోరుగా నియోజకవర్గంలో ప్రచారం సాగుతుందట. పైకి ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా.. ఉప్పు నిప్పులా ఉన్నారని కార్యకర్తల్లో చర్చసాగుతుందట. గులాబీ టికెట్‌పై అప్పుడే రచ్చ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గులాబీ టికెట్‌పై అప్పుడే రచ్చ మొదలైంది. ఓటమి పాలైన వారికి టిఅర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వదని.. తనకే టిక్కెట్ దక్కుతుందని సక్కు ప్రచారం చేసుకుంటున్నారట. ఎమ్మెల్యే టికెట్ దక్కని.. జడ్పీ చైర్మన్ వర్గంలో ఉండటం కన్నా రాజకీయ భవిష్యత్తు కోసం వర్గంలోకి రావాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారట. ఆ ప్రచారాన్ని నమ్మి కొందరు కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు చైర్మన్ వర్గం నుంచి ఎమ్మెల్యే వర్గంలోకి చేరిపోయారట. జిల్లా పరిషత్ చైర్మన్ కోవలక్ష్మి ఎమ్మెల్యే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారట. ఇప్పటికే జైనూర్, సిర్పూర్ మండలాల్లో తన ఆధిపత్యంలో ఉందని.. మిగితా తిర్యాణి, వాంకిడి, నార్నూర్, గాదే గూడ మండలాల ప్రజా ప్రతినిధులు తనవైపు ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారట. అదే విధంగా పార్టీ పెద్దల అండ తనకు టిక్కెట్ దక్కుతుందని సన్నిహితులకు చెప్పకుంటున్నారట. ఒకే పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యర్థి పార్టీ మాదిరిగా వ్యతిరేక ప్రచారం చేసుకోవడంపై కార్యకర్తలు అందోళన చెందుతున్నారట. ఇప్పుడే ఇలా గొడవలు ఉంటే.. మరి ఎన్నికల నాటికి టికెట్ గొడవలు ఎటువైపు ఎక్కడి వరకు పోతాయోనని కార్యకర్తలు అందోళన చెందుతున్నారట. ఈ ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య కుదుర్చాలని కార్యకర్తలు కోరుతున్నారట. పార్టీ పెద్దలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. -
అమ్మో పులి.. జంకుతున్న జనం
తెల్లవారకముందే నిద్ర లేచే పల్లె.. ఇప్పుడు సూరీడు నడినెత్తికొచ్చినా గడప దాటట్లేదు. పొద్దుగూకే వరకు పంట చేలల్లోనే గడిపే శ్రమజీవులు.. ఇప్పుడు పెందళాడే ఇంటికి చేరుకుంటున్నారు. పులి భయం పల్లెల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఇద్దరిని పొట్టన పెట్టుకుని.. రోజుకోచోట బయటపడుతున్న పులి జాడ అలజడి రేపుతోంది. ఏ క్షణంలో ఏ మూల నుంచి పంజా విసురుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. రైతులు, రైతుకూలీలు బయటకు అడుగుపెట్టలేని పరిస్థితుల్లో చేతికందిన పత్తి పంట ఇంటికి చేరనంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని అటవీ సమీప గ్రామాల్లో పులిదెబ్బకు ప్రజలదినచర్య, రోజువారీ కార్యకలాపాలు మారిపోయాయి. గుంపులుగా వెళ్లడం, పొలంలో పనిచేసే చోట డప్పు చప్పుళ్లు చేయడం, పులి బారిన పడకుండా ‘ముఖం మాస్కు’లు ధరించడం.. ఇంకా మరెన్నో జాగ్రత్తలతో బయట అడుగుపెడుతున్నారు. ఈ పరిస్థితులపై‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్’.. చేలల్లో పత్తి విచ్చుకున్నవేళ.. రైతుల్లో ఆనందం అలముకోవాలి. కానీ, వారిలో భయాందోళన నెలకొంది.. చేతికొచ్చిన పంట ఇంటికి చేరాలి. కానీ, చేలల్లోనే రైతుల కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. అడవిలో సంచరించాల్సిన పులి చేనుచెలకల్లో తిరుగుతోంది. కనబడినవారినల్లా పొట్టనపెట్టుకుంటోంది. కూలీలు వేకువజామునే బయలుదేరి ఉదయం ఆరుగంటలకల్లా పొద్దుతో పోటీపడి పత్తి చేలల్లో కనిపించేవారు. కానీ, పులి సంచారానికి భయపడి ఉదయం 10 గంటల తర్వాతే ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. చీకటి పడిందంటే.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని అటవీ సమీప ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పులి సంచరించిన ప్రాంతాల్లో ‘సాక్షి’ పర్యటించింది. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు స్థానికులతో మాట్లాడింది. సమయం ఉదయం పది గంటలు.. ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామంలో దిగాం. ఇక్కడే నవంబర్ 11న పులి దాడి చేసి సిడాం విగ్నేష్(21)ను పొట్టనబెట్టుకుంది. గ్రామ శివారులో కూలీలు గుంపులు, గుంపులుగా దారిలో మాకు ఎదురొస్తూ కనిపించారు. ఇంకొందరి చేతుల్లో ఉన్న డప్పులు అదేపనిగా మోగుతున్నాయి. మరికొందరు ప్లాస్టిక్ డబ్బాలతో చప్పుళ్లు చేస్తున్నారు. అసలు విషయమేమిటో కనుక్కుందామని.. అక్కడే ఉన్న కనక సాంబయ్య అనే కూలీని పలకరించగా... ‘పత్తి ఏరడానికి చేన్లకు పోతున్నాం. కా>నీ, పులి ఏడ నుంచి వచ్చి మీదపడ్తదో తెల్వక హడలిపోతున్నాం. సిడాం విగ్నేష్‌ని పొట్టనబెట్టుకుంది. అందుకే పులిని బెదరగొట్టడానికి డప్పుచప్పుళ్లు చేసుకుంటూ పొలాలకు పోతున్నం. మామూలుగానైతే వేకువజామున పత్తిచేలకు పోతం ’అని భయాందోళనతో చెప్పాడు. అక్కడ వారితో కొద్దిసేపు ముచ్చటించి మరో ఊరికి వెళ్లగా ఒక వ్యక్తి ఓ కుక్కను వెంటబెట్టుకొని వెళ్తూ కనిపించాడు. మరిచోట కొందరు యువకులు చేను చుట్టూ కాపాలా కాస్తుండగా కూలీలు పత్తి తీస్తున్న దృశ్యాన్ని ‘సాక్షి’గమనించింది. మాస్క్‌తో మస్కా.. మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నెత్తిమీదికొచ్చా డు. ఎండ చురుక్కుమంటోంది. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లికి ‘సాక్షి’ చేరుకుంది. నవంబర్ 29న ఈ ఊరుకు చెందిన పసుల నిర్మల పత్తి చేనులో ఉండగా పులి దాడి చేసి చంపేసింది. గ్రామానికి దూరంగా ఉన్న పత్తి చేనులో ఓ చోట గుమిగూడి పత్తి తీస్తున్న కూలీలు కనిపించా రు. కొందరి తలలకు వెనుకభాగంలో మాస్కులు కనిపించాయి. ఎందుకలా అని అడిగితే, ‘రెండుకాళ్ల జీవాల మీద పులి సాధారణంగా దాడి చేయదు. నాలుగు కాళ్ల జంతువుల మీదే ఎక్కువగా పంజా విసురుతుంది. అయితే, మేం చేలల్లో వంగి పనిచేస్తున్నప్పుడు నాలుగు కాళ్ల జంతువని భ్రమించి దాడిచేసే ప్రమాదం ఉంది. తలలకు వెనుక వైపు మాస్కు ధరించి కనిపిస్తే.. అక్కడున్నది మనిషి అనుకొని దాడి చేయదు’ అని ఓ కూలీ చెప్పాడు. పులి.. కెమెరా ‘కంట’బడేనా? మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కళ్లంపల్లిలో పత్తి చేనులో ప్లాస్టిక్ డబ్బాతో శబ్దం చేస్తూ ఓ యువకుడు కనిపించాడు. పులి జాడలను కనిపెట్టేందుకు కాటేపల్లి, ముక్కిడిగూడెం, బుడుగుఒర్రె, సుంపుటం, పాసినీళ్ల రోడ్ల వెంట ఏర్పాటు చేసిన కెమెరాలు కనిపించాయి. తాంసి(కె) శివా రు ప్రాంతాల్లో ఐదుచోట్ల అమర్చిన కెమెరాలను కనిపించాయి. ఈ పల్లె పెన్‌గంగా నదికి ఆనుకు ని ఉంటుంది. నదికి అవ తలి వైపు మహారాష్ట్ర భూ భాగం. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం(టైగర్ జోన్) నుంచి తరచూ ఇటువైపు పులులు వస్తున్నాయని గ్రామస్తులు భయంభయంగా చెప్పారు. నెలకు ఒకటి రెండుసార్లు పులి కన్పిస్తోందని చెప్పారు. మంచె మీద మొనగాడు మామూలుగానైతే కూలీలు కాలినడకన పొలం పనులకు వెళ్తుంటారు. కానీ, కొత్తగూడం జిల్లా గుండాల మండలం జగ్గయ్యగూడెంలో మాత్రం అందరూ కట్టకట్టుకుని ఒకే ట్రాక్టర్లో పొలం పనులకు వెళ్తుండటాన్ని ’సాక్షి‘గమనించింది. పాల్వంచ మండలం పాండురంగాపురంలో రైతులు ఊరేగింపు తీస్తున్నట్టుగా వెళ్తున్నారు. అందరి చేతుల్లోనూ కర్రలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్లగా దారిలో పెంపుడు కుక్కను వెంటపెట్టుకుని పొలం వద్దకు వెళ్తున్న ఓ రైతు కనిపించాడు. మరోచోట చేనులో మంచె మీద ఒక యువకుడు చురుకుగా అటు, ఇటు చూస్తున్నాడు. పులి రాకను గమనించి కూలీలను అప్రమత్తం చేయడానికి ఇలా మంచె మీద ఉన్నట్టు ఆ యువకుడు ‘సాక్షి’కి వివరించాడు. గుండెలో దడను కళ్లల్లో కనిపించకుండా ఎంతో దైర్యంగా ఉన్నాడతడు. అదిగో పులి.. పోదాం ఇంటికి సాయంత్రం నాలుగు గంటల వేళ.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి(కె) శివారులో కొందరు కూలీలు పత్తి చేలను వీడి అరుపులు, కేకలు వేస్తూ ఇళ్లకు వెళ్తుండటం ‘సాక్షి’కి గమనించింది. ప్రజ్వల్ అనే యుకుడిని పలకరించగా.. ‘ఒకసారి మా పశువుల మందపై పులిదాడి చేసి ఆవును చంపేసింది. అప్పటి నుంచి మందను అటవీలోకి తీసుకువెళ్లడం లేదు. పంట చేల సమీపంలోకే పశువులను మేత కోసం తీసుకెళ్తున్నాం’అని చెప్పాడు. చెబుతున్నప్పుడు అతడి కళ్లల్లో భయం స్పష్టంగా కనిపించింది. సీతాయిగూడెంలో తాజాగా.. చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతాయిగూడెం సమీపంలో గురువారం మిషన్ భగీ రథ వాటర్ ట్యాంక్ వద్ద పులి పాదముద్రలు కనిపించాయి. పులి అన్నపురెడ్డిపల్లి వెళ్లే రోడ్డు వరకు వచ్చి, తిరిగి అటవీ ప్రాంతం లోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. పులుల సంఖ్య అధికం కావడం వల్లే... ఒక్కసారిగా పులుల సంచారంతో కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం అభయారణ్యాన్ని టైగర్ రిజర్వ్‌గా చేస్తారంటూ ఆయా జిల్లాల్లో చర్చలు జరుగుతున్నాయి. సహజంగా పులి దట్టమైన అడవి దాటి బయటకు రాదు. పులుల సంఖ్య పెరగడంతోనే అవి తమకు అనువైన ప్రాంతా న్ని వెతుక్కునేందుకు కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి, మహారాష్ట్రలో ని చంద్రపూర్, తాడోబా, ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌ల నుంచి మం చిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల మీదుగా ఈ పులులు కిన్నెరసాని అభయారణ్యానికి వచ్చినట్లు తెలుస్తోంది. భయం గుప్పిట ఉన్న ప్రాంతాలివే ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి(కె), గొల్లఘాట్, పిప్పల్‌కోఠి గ్రామాలు ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ, లోహా, కర్జి, రాంపూర్ పరిసర ప్రాంతాలు.. పెంచికల్పేట్ మండలం కొండపల్లి, గుండెపల్లి, అగర్‌గూడ, మెరెగూడ, లోడుపల్లి, కొండపల్లి, దరోగపల్లి, బొంబాయిగూడ పరిసర ప్రాంతాలు.. బెజ్జూర్ మండలం చిన్నసిద్దాపూర్, పెద్దసిద్దాపూర్, పాపన్నపేట, ఏటిగూడ, గబ్బాయి గ్రామాలు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముక్కిడిగూడెం, కల్లెంపల్లి, సుంపుటం, రాజారాం, నాగారం, కాటేపల్లి, నీల్వాయి సమీప అటవీ ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో అటవీ ప్రాంతాలకు ఆనుకుని వందల గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కిన్నెరసాని అభయారణ్యంలో ప్రవేశించాక మొదట గుండాల, ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, మణుగూరు, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి మండలాల్లో పులి సంచారం అధికంగా ఉంది. రోజుకో చోట పులి సంచారం వెలుగుచూస్తోంది. -
రోడ్డు పక్కన చిరుత మృతదేహం
సాక్షి, మంచిర్యాల : అటవీ సమీప పల్లెల్ని పులి భయం వీడట్లేదు. పులి సంచారం అధికంగా ఉన్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలంలోని పది గ్రామాలు ఇంకా భయం గుప్పిటే ఉన్నాయి. గత నెలలో ఇద్దరు గిరిజనులను పొట్టనబెట్టుకున్న పులులను బంధించడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. సోమవారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ శోభ, అధికారులు, ప్రజాప్రతినిధులు పులుల దాడిలో మరణించిన విఘ్నేశ్, నిర్మల కుటుంబాలను పరామర్శించేందుకు కొండపలి్లకి వచ్చారు. అదే సమయంలో యువతిపై దాడిచేసి చంపిన గ్రామమైన కొండపల్లి శివారు శివయ్యకుంటలో మళ్లీ పులి కనిపించడంతో.. పత్తిచేల నుంచి మహిళలు భయంతో పరుగులు తీశారు. పులి భయంతో కూలీలు రాకపోవడంతో చేలలోనే పత్తి ఉండిపోతోందని రైతులు వాపోతున్నారు. చదవండి: ఆవును చంపిన పులి..? బోన్ల చుట్టూ తిరుగుతూ.. పులులను బంధించేందుకు ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ, కొండపల్లి అడవుల్లో 8చోట్ల బోన్లు ఏర్పాటుచేశారు. పందులను ఎరగా ఉంచారు. పులుల కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలతోపాటు అటవీ సిబ్బంది, ఎన్జీవో సభ్యులు ప్రయత్నిస్తున్నారు. కొండపల్లి శివారులో పలుమార్లు బోను వరకు వచ్చిన పులి అక్కడే తిరిగినట్టు అధికారులు గుర్తించారు. చదవండి: జస్ట్ మిస్.. పులికి బలయ్యేవారు..! వలస పులుల గాండ్రింపు రాష్ట్రంలో కొత్త పులుల రాకతో అడవుల్లో గాండ్రింపులు పెరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ పులుల అభయారణ్యానికి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా– అందేరి టైగర్ రిజర్వ్ నుంచి వలస వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వు నుంచి పులులు సరిహద్దు దాటి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అడుగుపెడుతున్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మగపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. గుండాల, ఇల్లెందు, ఆళ్లపల్లి, మణుగూరు, కరకగూడెం, అశ్వరాపురం అడవుల్లో పులి జాడలు బయటపడ్డాయి. మూడ్రోజుల క్రితం ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల సరిహద్దు నర్సంపేట అడవుల్లో ఆవును చంపిన పులిని గుర్తించే పనిలో అధికారులున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు డివిజన్లోని కోటపల్లి రేంజీలోకి మరో రెండు పులులు వచ్చాయి. ఇందులో ఒకటి గత వేసవిలో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు వలస వచ్చింది కాగా.. మరొకటి కొత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటికే చెన్నూరు ప్రాంతంలో రెండు పులులున్నాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోనే పది పులుల వరకు సంచరిస్తున్నాయి. కొత్త పులుల కదలికలు పెరిగిన నేపథ్యంలో ఆవాసాలు ఇరుకుగా మారి పులులు గ్రామశివార్లు, పొలాల్లోకి వస్తున్నాయని అధికారులు అంటున్నారు. అలాగే, మగపులులు తోడు కోసం వెతుక్కుంటూ అడవి దాటి బయటకొస్తున్నాయని చెబుతున్నారు. బాధితులకు అండగా ఉంటాం పెంచికల్పేట్(సిర్పూర్): ఇటీవల పులి దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పసుల నిర్మల, దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేష్ గత నెలలో పులిదాడిలో మృతిచెందిన విషయం తెల్సిందే. సోమవారం మృతుల కుటుంబ సభ్యులను మంత్రి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు. అటవీశాఖ తరఫున పరిహారంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి బాధిత కుటుంబాలకు మరో రూ.5 లక్షల పరిహారం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. రోడ్డుపక్కన చిరుత మృతదేహం సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే దారిలో 44వ జాతీయ రహదారిపై గుడిహత్నూర్ మండలం చింతగూడ వెళ్లే దారిలో సోమవారం సాయంత్రం వాహనదారులు రోడ్డుపక్కన చిరుతపులి పడిపోయి ఉండటాన్ని గమనించారు. కదలిక లేకపోవడంతో కొంతమంది దగ్గరకు వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. వెం టనే గుడిహత్నూర్ పోలీసులకు సమాచారం అం దించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత రోడ్డుపైకి వచ్చినప్పుడు ఏదైనా వాహనం ఢీకొట్టి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
వామ్మో.. పులి; ఆ వీడియో పాతది
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/గుండాల: జిల్లాలోని గుండాల, కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో రెండు, మూడు రోజులుగా పులి సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి ఆళ్లపల్లి మండలంలో ఓ పశువుల పాకపై దాడి చేసి దుక్కిటెద్దును చంపేసింది. గురువారం రాత్రి దామరతోడు అటవీ ప్రాంతం నుంచి కరకగూడెం మండలం అనంతారం అటవీ ప్రాంతంలో పులి అడుగులను గుర్తించిన స్థానికులు ఏడూళ్ల బయ్యారం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం ఆళ్లపల్లి మండలం రాయిగూడెం పోడు భూముల సమీపంలో పులి కనిపించిందని అక్కడి గ్రామస్తులు తెలిపారు. (చదవండి: పులి హల్చల్) ఆ పులి వీడియో పాతది: అటవీశాఖ సాక్షి, హైదరాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని, పశువుల కాపరులకు కనిపించిందని శుక్రవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో పాతదని, ఈ ప్రాంతానికి సంబంధించినది కాదని అటవీ శాఖ స్పష్టం చేసింది. ఈ వీడియోపై విచారణ చేపట్టిన అటవీ అధికారులు అది మహారాష్ట్రకు చెందిన పాత వీడియోగా నిర్ధారించారు. యావత్మల్ జిల్లా అంజన్‌వాడి అటవీ ప్రాంతంలో గత నెలలో కనిపించిన పులి వీడియోను కొందరు బెజ్జూరు ప్రాంతంలో పులి అంటూ వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేశారని ఆదిలాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) వినోద్ కుమార్ వెల్లడించారు. తప్పుడు సమాచారంతో చేస్తున్న ప్రచారం వల్ల స్థానిక గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. పులుల సంచారంపై శాఖాపరంగా అప్రమత్తంగా ఉన్నామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలోనే 32 ప్రత్యేక బృందాలతో పులుల కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: అది ఫేక్ వీడియో: కేసులు పెడతాం!) -
అదిగో పెద్దపులి.. చచ్చాంరా దేవుడో!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరోసారి పులులు జనారణ్యంలోకి చొరబడటంతో కలకలం రేగింది. కుమురంభీం జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి ఇప్పటికే ఓ యువకుడి ప్రాణాలు తీయగా దాని జాడ ఇంకా కానరాలేదు. శుక్రవారం జిల్లాలోని బెజ్జూర్ మండలం అంబగట్ట గ్రామ సమీపంలోని గట్టుచెరువు అటవీ ప్రాంతంలో శుక్రవారం పెద్దపులి హల్చల్ చేసింది. మేకల కాపరులు కొండయ్య, ఉపేందర్‌కు పులి తారసపడటంతో ప్రాణాలను కాపాడుకోవటానికి చెట్టెక్కారు. పులి సంచరిస్తున్న విషయంపై కర్జెల్లి రేంజ్ అధికారి రాజేందర్ పశువుల కాపరుల వద్ద నుంచి వివరాలను సేకరించారు. అలాగే మంచిర్యాల జిల్లా వేమనపల్లి ముక్కిడిగూడెం అడవుల్లో పులి సంచరిస్తోంది. గురువారం అడవిలోకి వెళ్లిన వేమనపల్లికి చెందిన మేకల కాపరి దేవనబోయిన భానేశ్కు పులి తారసపడింది. దీంతో సదరు యువకుడు ప్రాణభయంతో పరుగులు తీయగా.. మేకలు చెల్లాచెదురై ఇంటి ముఖం పట్టాయి. రెండు రోజుల కిందట ముక్కిడిగూడెం శివారులోని పత్తి చేన్లలోకి పులి వచ్చి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పాతజాజులపేట మీదుగా ప్రాణహిత నది వరకు వచ్చి అంపుడొర్రె నుంచి పులి అడవిలోకి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. (చదవండి: ఐదు రోజులాయే.. పులి బోనులో చిక్కేనా..?) మేకల్ని చంపి దర్జాగా.. అనంతపురం/పామిడి: పామిడి మండలంలోని దిబ్బసానిపల్లిలో శుక్రవారం చిరుత కలకలం రేపింది. ఆ గ్రామానికి చెందిన మనోజ్ మేకలను శివారు ప్రాంతానికి మేత కోసం తోలుకెళ్లాడు. అదే సమయంలో చిరుత ఒక్కసారిగా మేకల మందపై పంజా విసిరింది. ఈ దాడిలో మూడు మేకలు మృతి చెందగా.. కొన్ని గాయపడ్డాయి. అప్రమత్తమైన మనోజ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అటవీశాఖ అధికారులు చిరుత నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇక మేకలపై దాడి చేసిన అనంతరం పులి దర్జాగా ఓ బండరాళ్ల గుట్ట ప్రాంతంలో సంచరిస్తున్న దృశ్యాల్ని స్థానిక యువకులు తమ సెల్ ఫోన్లలో చిత్రించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
జస్ట్ మిస్.. పులికి బలయ్యేవారు..!
సాక్షి, ఆదిలాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ వద్ద నడి రోడ్డుపై పెద్ద పులి హల్చల్ చేసింది. ప్రయాణికులను, పాదచారులను వెంటాడింది. పులి వెంబడించడంతో ఇద్దరు యువకులు పరుగు తీసి కింద పడిపోయి మళ్ళీ పరిగెత్తి సమీపంలో ఉన్న చెట్టు ఎక్కారు. ప్రమాదం తప్పడంతో బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. మరో ఇద్దరు యువకులు బైకులపై తప్పించుకున్నారు. ఆరుగురు వ్యక్తులు కమ్మర్గాం గుండె పల్లి గ్రామాల నుంచి బెజ్జూర్ మండల కేంద్రానికి వస్తోన్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులి సంచారంతో అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటేనే స్థానికులు, గిరిజనులు జంకుతున్నారు. (చదవండి: ఐదు రోజులాయే.. పెద్దపులి చిక్కేనా..?) వారం రోజుల క్రితం పులి ఓ యువకుడిపై దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఇంకా ఆ పులి ఆచూకీ చిక్కలేదు. తాజాగా మరోసారి పులి హల్చల్ చేయడంతో స్థానికులు, గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 11న ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ (22)పై పులి దాడి చేసి హతమార్చింది. పులిని పట్టుకునేందుకు 12 బృందాలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. -
ఐదు రోజులాయే.. పెద్దపులి చిక్కేనా..?
సాక్షి, మంచిర్యాల: రాష్ట్రంలోనే తొలిసారిగా పెద్దపులి ఓ యువకుడిపై దాడి చేసి హతమార్చడంతో అటవీశాఖ అలర్ట్ అయింది. ఆ పులిని బంధించేందుకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారులు అడవిలో రెండు బోన్లను ఏర్పాటు చేశారు. కానీ.. ఇప్పటికి 5 రోజులైనా అటువైపు పులి అడుగు జాడలేవీ కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 11న ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ (22)పై పులి దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పులిని పట్టుకునేందుకు 12 బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 12న దిగిడ అడవి, పెద్దవాగు సమీపంలో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. ఆ బోన్లలో లేగ దూడలను ఎరగా వేసి పరిశీలిస్తున్నారు. అయితే అటువైపు పులి సంచరిస్తున్నట్లు ఎటువంటి ఆనవాళ్లూ కనిపించడం లేదు. దీంతో సదరు నరహంతక పులిని బంధించడం అంత సులువుగా జరిగేనా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతునాయి. ఆ పులి బెజ్జూరు మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లిందనే అనుమానాలు ఉన్నప్పటికీ.. ప్రాణహితలో నీటి ప్రవాహం కారణంగా నది దాటే అవకాశాలు తక్కువనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి మొదట దాడి చేసింది స్థానిక పులి అయి ఉండొచ్చని అధికారులు అనుమానించారు. అయితే ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు పరిశీలించాక కొత్తగా వలస వచ్చినదై ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే, స్థానికులను అడవుల్లోకి వెళ్లకుండా అవగాహన కల్పిస్తూ.. పులి సంచారంపై అప్రమత్తంగా ఉంటున్నారు. (చదవండి: పెద్దపులి టెర్రర్: యువకుడ్ని చంపి..) అడవులను ఆనుకునే పత్తి చేలు.. గత దశాబ్ద కాలంగా అటవీ సమీప ప్రాంతాల్లో చెట్లను నరికి పంటలు సాగు చేయడం ఎక్కువైంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతాలు కూడా సాగు భూములుగా మారాయి. పెద్దవాగు, ప్రాణహిత తీరాల వెంబడి వేలాది ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఇందులో కొంత మంది రైతులకు అటవీ హక్కు పత్రాలు ఉండగా వేలాది మంది రైతులకు ఎటువంటి గుర్తింపూ లేదు. పండించిన పంటలను కాపాడుకునేందుకు రైతులు రాత్రిపూట కాపలా వెళ్తుంటారు. కొందరు విద్యుత్ తీగలతో కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు విధానాల్లోనూ ప్రమాదమే పొంచి ఉంది. అడవుల్లో సంచరించే రైతులకు పులులతో భయం ఉండగా.. విద్యుత్ కంచెలతో పులికి ముప్పు పొంచి ఉంది. అలాగే, అడవుల సమీపంలోనే నివాసాలు, పంట పొలాలు ఉండటంతో రైతులు నిత్యం అడవుల్లోకి వెళ్తుంటారు. ఈ క్రమంలో స్థానికులకు రక్షణ కల్పిస్తూ పులి సంతతి పెంచడం అటవీ అధికారులకు సవాల్‌గా మారింది. మనుషులపై దాడి అరుదే.. పులి జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మానవ సంచారం ఉన్న చోట పులి ఉండదని, మనుషులపై దాడి చేయడం చాలా అరుదని అంటున్నారు. కొత్తగా వచ్చిన పులులు ఆవాసం వెతుక్కునే క్రమంలో చాలా దూరం సంచరిస్తుంటాయని, స్థిర ఆవాసం ఏర్పడితే అటువైపు వెళ్లకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తామని అధికారులు వివరిస్తున్నారు. దాడి చేసింది కొత్త పులి జిల్లా పరిధిలో సంచరించే పులులు కాకుండా కొత్తగా వచ్చిన పులి ‘దిగిడ’లో దాడి చేసిందనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆనవాళ్లు స్థానిక పులులతో సరిపోలడం లేదు. కొత్తగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన పులి అనేది తేలాల్సి ఉంది. పులిని బంధించేందుకు 12 బృందాలు పని చేస్తున్నాయి. – శాంతారాం, జిల్లా అటవీ అధికారి, ఆసిఫాబాద్ -
తెలంగాణలో పెద్దపులి కలకలం: యువకుడ్ని చంపి..
-
తెలంగాణలో పెద్దపులి కలకలం: యువకుడ్ని చంపి..
కొమరం భీం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ పెద్దపులి యువకుడిని పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటన అసిఫాబాద్‌లోని దహెగాం మండలం దిగిడా గ్రామంలో జరిగింది. మంగళవారం పొలంలో పనిచేసుకుంటున్న విఘ్నేష్ అనే యువకుడిపై పులి హఠాత్తుగా దాడి చేసింది. అనంతరం అతడ్ని చంపి మృతదేహాన్ని అడవిలోకి లాక్కెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు విఘ్నేష్ మృతుదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, పులి దాడితో చుట్టు ప్రక్కలి గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత నెల 12వ తేదీన ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ పరిధి కన్నాయిగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 20 రోజుల సమయంలో ఏటూరునాగారం అడవుల్లో పులి జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే వారం పది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించగా.. తాజాగా ఈ నెల 6న వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడలు కనిపించాయి. ( దుబ్బాక ఫలితం.. గందళగోళంలో కాంగ్రెస్ ) కాగా ఏటూరునాగారం అభయారణ్యానికి కొత్తగూడ, పాకాల అభయారణ్యాలకు కనెక్టివిటీ ఉండడంతో ఒకే పులి ఆయా అడవుల్లో సంచరిస్తుందా లేదా మరోటి ఉందా అనే అనుమానంలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న గిరిజనులు, గొత్తికోయ గూడేల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నట్లుగా రెండు నెలలుగా వార్తలు వినిపిస్తుండడంతో పులుల సంఖ్య అంశం సమస్యగా మారింది. -
చైనా సరిహద్దులో ఆర్మీ జవాను మృతి
కొమురం భీం, ఆసిఫాబాద్ : చైనా సరిహద్దులో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మరణించారు. వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ పట్టణం అహ్మద్ రజా కాలనీకి చెందిన ఆర్మీ జవాన్ మహమ్మద్ షాకీర్ చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో చనిపోయాడు.. ఆరుగురు బృందంతో విధులు నిర్వర్తిస్తుండగా కొండ చరియలు విరిగిపడి మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. 17 ఏళ్లుగా షాకీర్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. షాకీర్ మృతితో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి -
మావోయిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బ
సాక్షి, ఆదిలాబాద్ : మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు పార్టీ కేబీఎం కమిటీ (కుమురం భీం, మంచిర్యాల) కీలక సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేబీఎం కార్యదర్శి అడెల్లు అలియాస్ భాస్కర్ కమిటీలో కీలక సభ్యుడిగా వ్యవహరించిన లింగు గురువారం ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ ఎదుట సరెండర్ అయ్యాడు. జైనూర్ మండలానికి చెందిన 28 ఏళ్ల లింగు రెండున్నర నెలల కిందటే మావోయిస్టు పార్టీలో చేరాడు. అడేల్లు అలియాస్ భాస్కర్ దళంలో లింగు ఆదిలాబాద్ కమిటీ లో పని చేశాడు. కదంబ ఎన్కౌంటర్ తర్వాత లింగు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీసులు కలిసి.. లొంగుబాటు నిర్ణయానికి వచ్చాడు. దీనిపై ఎస్సీ మాట్లాడుతూ.. లింగుకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని తెలిపారు. (కదంబా అడవుల్లో అలజడి) మరికొంత మంది నేతలు కూడా లొంగిపోయే అవకాశం ఉందన్నారు. లింగు లొంగుబాటుకు అడెల్లుకి ఎదురుదెబ్బగా మాజీ మావోయిస్టులు, పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మావోల ఏరివేతే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం సాగుతుండగా పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో మావోలు ఉన్నారు. గతనెల 19న కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దళ సభ్యులు మృతి చెందగా, ఇందులో ఒకరు చత్తీస్‌గడ్‌కు చెందిన చుక్కాలు కాగా, మరొకరు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక్ బాదీరావు ఉన్నాడు. కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేబీఎం డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్న విషయం తెలిసిందే. భాస్కర్ నేతృత్వంలోని ఆరుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో కొద్దికాలంగా సంచరిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వలస కూలీల రూపంలో జిల్లాలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరం వెంట సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
భాస్కర్ వ్యూహమేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా ‘ఆపరేషన్ నిఘా’పేరుతో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ కోసం చేపట్టిన వేట ముమ్మరంగా సాగుతోంది. శనివారం రాత్రి కదంబా ఎన్కౌంటర్లో భాస్కర్ తృటిలో తప్పించుకోవడంతో అతని కోసం సమీపంలోని అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ కూంబింగ్‌లో పెద్ద ఎత్తున సివిల్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ దళాలు పాల్గొన్నాయి. మూడునెలలుగా పోలీసులు తనను నీడలా వెంటాడుతున్నా.. ఆసిఫాబాద్‌ను వీడకుండా.. భాస్కర్ ఇక్కడే ఎందుకు ఉంటున్నాడన్న విషయం పోలీసులకు తొలుత అంతుచిక్కలేదు. తర్వాత ఈ విషయంలో పోలీసులు ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. రిక్రూట్మెంట్ కోసం ఇక్కడే..! సాధారణంగా మావోయిస్టులు నిరంతరం స్థావరాలు మారుస్తారు. కానీ, ఆసిఫాబాద్ అడవుల్లో సివిల్, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ దళాలు తనను పట్టుకునేందుకు నీడలా అనుసరిస్తోన్నా.. భాస్కర్ అక్కడే ఎందుకు తచ్చాడుతున్నాడన్న దానిపై పోలీసులకు కొంత సమచారం లభించింది. తెలంగాణలో తిరిగి పూర్వవైభవం కోసం తపిస్తోన్న మావోయిస్టులు ఆసిఫాబాద్ నుంచి రిక్రూట్మెంట్ చేసుకునేందుకు భారీగా సన్నాహాలు చేశారు. ఇందులో కొంతమేరకు సఫలీకృతమయ్యారన్న అనుమానాలు ఉన్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కోటేశ్వరరావు ఆదేశాల మేరకు మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ మాజీ సానుభూతిపరులు, ఇన్ఫార్మర్లను కలుస్తున్నాడన్నది పోలీసులకు లభించిన సమాచారం. తిర్యాణి మండలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పోలీసులకు లభించిన డైరీలో లభ్యమైన 15 మంది పేర్లు సానుభూతిపరులవా? లేక రిక్రూట్ అయ్యారా? అన్న విషయంలో పోలీసులకు ఇంకా స్పష్టత లేదు. ఆ జాబితాలో కొందరు అనుమానితులను గుర్తించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. మిగిలిన వారి కోసం వెదుకులాట ఇప్పటికే ప్రారంభమైంది. మూడోసారి... జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తుంటే.. భాస్కర్ లాక్డౌన్ కాలంలో స్థానికంగా పలువురిని రిక్రూట్ చేసుకున్నాడని, పాత సానుభూతిపరులతో తిరిగి పరిచయాలు పెంచుకున్నాడన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. మహారాష్ట్ర సరిహద్దు నుంచి కాగజ్‌నగర్, ఈస్గాం వరకు భాస్కర్ దళం దాదాపు 40 కిలోమీటర్లు లోనికి వచ్చి స్వేచ్చగా సంచరించడం వెనక స్థానికుల సహకారం ఉండి ఉంటుందని పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. జూలై 12వ తేదీన తొలుత తిర్యాణి మండలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నాక పోలీసులు అతని కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ తరువాత ఇటీవల భాస్కర్ జైనూరు మండలం షార్పల్లిలో తలదాచుకున్నాడన్న సమాచారంతో గ్రేహౌండ్స్ పోలీసులు గ్రామంలోకి రాత్రిపూట వెళ్లారు. ఇది తెలుసుకున్న గూడెం ప్రజలు పోలీసులను అడ్డుకున్నారు. వాగ్వాదం చెలరేగడంతో గ్రేహౌండ్స్ బలగాలపై రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు. అలా భాస్కర్ రెండోసారి తప్పించుకున్నాడు. కదంబా ఎన్కౌంటర్లో మూడోసారి తమ కళ్ల ముందునుంచి భాస్కర్ పారిపోయాడని పోలీసులు వివరించారు. మైదానాల్లోకి వెళితే.. డ్రోన్ కెమెరాలకు చిక్కే ప్రమాదముండటంతో దట్టమైన అడవుల్లోకి వెళ్లాడని పోలీసులు అంటున్నారు. పోలీసుల వేట ముమ్మరమైన ప్రతీసారి మహరాష్ట్ర– తెలంగాణ సరిహద్దుల్లోని అడవుల్లో తలదాచుకుంటున్నాడన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది. సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి కుట్ర భగ్నం.. ఇటీవల మావోయిస్టులు చర్ల మండలంలోని తిప్పాపురం సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి కుట్రపన్నారు. 200 మందికిపైగా మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొనేందుకు సమాయత్తమయ్యారు. ఈనెల 13వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లో వాగు దాటుతున్న వందలాదిమంది మావోయిస్టులు ఈ దాడి కోసమే బయల్దేరారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. ఈ వీడియోలు మీడియాలో వైరల్ కావడంతో తెలిసిందే. వారిని ఎదుర్కొనేందుకు భారీగా బలగాలతో కూంబింగ్ చేపట్టారు. దీంతో తెలంగాణలోకి మావోయిస్టులు రాకుండా సీఆర్పీఎఫ్ క్యాంపు దాడిని పోలీసులు సమర్థంగా అడ్డుకోగలిగారు. భారీ విధ్వంసాలకు దిగాలన్న వ్యూహాలకు ముందుగానే చెక్‌పెట్టారు. -
కొనసాగుతున్న కూంబింగ్
సాక్షి, మంచిర్యాల: ఆసిఫాబాద్‌లోని కదంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఇందులో ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని పామి డి ప్రాంతానికి చెందిన చుక్కాలు, మరొకరు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అద్దాలతిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక బాది రావుగా గుర్తించారు. చుక్కాలు యాక్షన్ టీం సభ్యుడిగా ఉండగా, బాదిరావు 3 నెలల క్రితమే కేబీఎం (కుమురంభీం–మంచిర్యాల) దళంలో చేరాడు. మృతదేహాల వద్ద 9ఎంఎం కార్బన్ ఆటోమేటిక్, 12 బోర్ ఆయుధాలు, రెండు కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం, కేం ద్ర కమిటీ లేఖలు, రామజన్మభూమి ప్రతు లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలకు ఆ దివారం సిర్పూర్(టి) ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాదిరావు కు టుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ఘ టన స్థలానికి జిల్లా ఇన్చార్జి ఎస్పీ, రామగుం డం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఓ ఎస్డీ, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కు మార్రెడ్డి, ఏఎస్పీ సుధీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్రావు, కాగజ్‌నగర్ రూరల్ సీఐ సురేందర్ చేరుకున్నారు. అడెళ్లు కోసం గాలింపు ఎన్కౌంటర్ మృతుల్లో మైలవరపు అడెళ్లుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న వర్గీస్‌తో పాటు మరో మహిళ ఉన్నట్లు తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వారిద్దరు కాదని ఐడీ కార్డుల ద్వారా తేల్చారు. కదంబా అటవీ ప్రాంతంలోనే మరికొందరు దళ సభ్యులు ఉ న్నారనే సమాచారంతో 14 గ్రేహౌండ్స్ బృం దాలు, ఉమ్మడి జిల్లాకు చెందిన 6 స్పెషల్ పా ర్టీ బలగాలతో ప్రాణహిత తీరం నుంచి కౌటా ల, బెజ్జూరు, దహెగాం, నీల్వాయి, చెన్నూరు గోదావరి తీరం వరకు కూంబింగ్ ముమ్మరం గా సాగుతోంది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేఎంబీ దళ నేత అయిన అడెళ్లు అలియాస్ భాస్కర్ కోసం గాలింపు విస్తృతం చేశారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 15 మంది దళంలో చేరినట్లు సమాచారం రావడంతో వారి కోసం గాలిస్తున్నారు. అనుమానితుల ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2 గంటల పాటు కాల్పులు: ఇన్చార్జి ఎస్పీ కదంబా అడవుల్లో పోలీసులకు, దళ సభ్యులకు మధ్య 2 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయని జిల్లా ఇన్చార్జి ఎస్పీ వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఘటన స్థలంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భాస్కర్ దళం సంచరిస్తుందనే సమాచారంతో కూంబింగ్ విస్తృతం చేశాం. 5 రోజుల్లో సిర్పూర్(యూ) మండలం కాకరబుద్ది, తిర్యాణి, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో మూడు సార్లు తప్పించుకున్నారు. దీంతో వారి కదలికలను గుర్తించి ముమ్మరంగా కూంబింగ్ చేయగా కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో దళ సభ్యులు తారసపడ్డారు. ఆయుధాలతో ఉన్న వారిని చూసి లొంగిపోవాలని పోలీసులు అంటుండగానే దళ సభ్యులు విచè క్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసు లు వెంటనే పొజిషన్ తీసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసులకు ఎవరికీ గాయాలు కాలేదు. తప్పించుకున్న కీలక సభ్యులు ఇక్కడే కిలోమీటరున్నర పరిధిలోనే ఉన్నారు. వారి కోసం బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి’అని తెలిపారు. పట్టుకుని కాల్చి చంపారు: మావోలు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చి న కామ్రేడ్లను పోలీసులు నిర్దాక్షిణ్యంగా పట్టుకుని కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఆదివారం సాయంత్రం కేబీఎం కమిటీ కార్యదర్శి భాస్కర్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. ‘ఈ ఎన్కౌంటర్ బూటకం. కామ్రేడ్లు చుక్కాలు, బాదిరావులు తమ ప్రాణ త్యాగంతో మరోసారి ఉమ్మడి జిల్లాలో విప్లవ కేతనం ఎగరేశారు. భారత దోపిడీ పాలకులు 2022 నాటికి విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు ఆపరేషన్ సమాధాన్‌తో తెలంగాణలోనూ అణచివేత తీవ్రతరం చేశారు. కార్డన్ సెర్చ్ పేరుతో గ్రామాల్లో సోదాలు, అక్రమ అరెస్టులు చేసి కోర్టులో ప్రవేశపెట్టకుండా చిత్రహింసలు చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలకు శిక్షలు తప్పవు’ అని లేఖలో హెచ్చరించారు. -
ఆసిఫాబాద్‌లో ఎన్కౌంటర్
సాక్షి, మంచిర్యాల : పచ్చటి అడవి కాల్పులతో దద్ద రిల్లింది. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుమురంభీం– ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కదంబా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయి స్టులకు మధ్య ఎదురు కాల్పులు జరి గాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయి నట్లు తెలుస్తోంది. దట్టమైన అడవిలో, పులులకు ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం. రాత్రివేళ కావడం, భారీ వర్షం కురుస్తుం డటంతో మృతదేహాల గుర్తింపు ఆలస్యమవు తోంది. మృతుల్లో వర్గీస్ ఉన్నట్లు ప్రాథమి కంగా నిర్ధారణ అవుతోంది. చనిపోయిన మరొ కరు మహిళా మావోయిస్టు అని సమా చారం. మరో ఇద్దరు కూడా మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో ఏకే 47 స్వాధీన పర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో మావో యిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా గాలింపు చర్యలు కొనసాగు తున్నాయి. 25 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న భాస్కర్ తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. కుమురం భీం జిల్లా ఇన్చార్జి ఎస్పీ, రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారా యణ, ఏఎస్పీ సుధీంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మొత్తం ఎనిమిది గ్రేహౌండ్స్ బృందాలు, ఆరు స్పెషల్ పార్టీలు పాల్గొన్నాయి. ఇంకా కుంబింగ్ కొనసాగుతుండంతో మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసుల దగ్గరగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఐదుగురు దళ సభ్యులను చట్టుముట్టి మూడు అంచెల్లో దిగ్బంధం చేసినట్లు సమాచారం. మృతి చెందిన వర్గీస్ ఇటీవలి నియామకాల్లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఏరియా కమిటీ సారథిగా నియమితులయ్యారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయనపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది. పక్కా సమాచారంతో దాడి మావోల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పక్క సమాచారంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ సమీప అటవీ ప్రాంతాల్లో బలగాలు కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. శుక్రవారం ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడలో సంచరించినట్లు సమాచారం రావడంతో గాలింపు మరింత ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేబీఎం (కుమురం భీం మంచిర్యాల) డివిజన్ కార్యదర్శి మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని ఐదుగురు దళ సభ్యులు ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం నుంచి మహారాష్ట్ర నుంచి ప్రాణహిత మీదుగా కొన్నాళ్ల కిందట ఆసిఫాబాద్‌లో ప్రవేశించారు. వారి కదలికలు గుర్తించిన పోలీసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. గత నెలలో తిర్యాణి మండలం టొక్కిగూడ అడవుల్లో కాల్పులు జరగగా మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి మరింత ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ నెల 2న ఆసిఫాబాద్ చేరుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి ఐదురోజుల పాటు ఇక్కడే మకాం వేశారు. మావోయిస్టుల ఆపరేషన్‌పై స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు. తిరిగివెళ్లిపోతున్నారా? మావోయిస్టుల ఉనికిని ఎప్పటికప్పుడు పోలీసులు పసిగడుతుండటంతో తిరిగి దండకారణ్యంలోకి వెళ్లే క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం మహారాష్ట్రకు వెళ్లే దారిలో ఉండటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇన్నాళ్లు కొమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన తిర్యాణి, జన్నారం, ఊట్నూరు, నేరడిగొండ ప్రాంతాల్లో పలుమార్లు దళ సభ్యుల కదలికలను పోలీసులు గుర్తించారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ అటవీ ప్రాంతంలో దళ సభ్యులు సంచరిస్తున్నట్లు గుర్తించగా... తాజాగా ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయే క్రమంలోనే ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
సై అంటే సై
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టులు తిరిగి పుంజుకోకుండా చూడాలని పోలీసులు.. ఎలాగైనా తిరిగి తెలంగాణలో విస్తరించా లన్న పట్టుదలతో మావోయిస్టులు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తుండటం ఏజెన్సీ ప్రాం తాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కొత్త రిక్రూట్మెంట్ కోసం మావోలు ప్రయత్నిస్తుండటం, ఆ ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని పోలీసులు అడవులను జల్లెడ పడుతుండటం మరింత వేడి రాజేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు బాస్ ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో పర్యటించి శాఖాపరంగా కీలక మార్పుచేర్పులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్డౌన్ కాలంలోనే మొదలు... 2005 తరువాత రాష్ట్రంలో దాదాపుగా ఉనికి కోల్పోయిన మావోయిస్టులు... లాక్డౌన్ కాలంలో అనూహ్యంగా పుంజుకున్నారు. జనవరి, ఫిబ్రవరిలలో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి మావోల యాక్షన్ టీమ్‌లు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ ప్రహార్ కారణంగా వారంతా తాత్కాలికంగా తెలంగాణలోకి వచ్చారని పోలీసులు తొలుత భావించారు. అయితే వారు చాపకింద నీరులా మావోయిస్టు పార్టీ విస్తరణకు వచ్చారన్న విషయం తెలియడం పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. అదే సమయంలో కరోనా విజృంభణతో లాక్డౌన్ విధించడం మావోలకు కలసి వచ్చింది. ఈ సమయంలో వారు పార్టీకి కావాల్సిన చందాలు, సామగ్రి సమకూర్చుకున్నారు. పలువురు ప్రజాసంఘాల నాయకులు కూడా పార్టీ రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరు మావో సానుభూతిపరులు చందాలు వసూలు చేస్తూ సిరిసిల్లలో పోలీసులకు దొరికారు. జూలై 15న ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఆటవీ ప్రాంతంలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడేళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని దళం స్పెషల్ పార్టీ పోలీసులకు తారసపడటం.. పరస్పరం కాల్పులు జరుపుకోవడం కలకలం రేపింది. ఆ సమయంలో స్థానిక అటవీ ప్రాంతంలోకి 15 మంది యువత అదృశ్యమయ్యారన్న వార్త కూడా పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఆ మర్నాడే డీజీపీ మహేందర్‌రెడ్డి హుటాహుటిన ఆసిఫాబాద్ వెళ్లారు. అదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలోనూ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఆ రోజు నుంచి గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులంతా అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. రెండుసార్లు ఆసిఫాబాద్‌కు.. మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారంటూ ఈ నెల 1న జరిగిన ప్రచారంతో పోలీసులు, మావోయిస్టులు ఉలిక్కిపడ్డారు. ఆ మర్నాడే డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకస్మికంగా ఆసిఫాబాద్ చేరుకున్నారు. 45 రోజుల్లో డీజీపీ రెండుసార్లు ఆసిఫాబాద్‌లో పర్యటించడంతో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆసిఫాబాద్‌లో మావోల కదలికలు పెరగడం, అదే సమయంలో గణపతి, మరికొందరు మావో అగ్రనేతలు లొంగిపోతారన్న వార్తలు తోడవడంతో రాష్ట్రంలో ఏదో జరుగుతోందన్న చర్చ తీవ్రమైంది. అయితే గణపతి లొంగుబాటు ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. అవన్నీ కట్టుకథలని, పోలీసుల మైండ్‌గేమ్ అని లేఖ విడుదల చేసింది. తమకు ప్రజల్లో పూర్వ ఆదరణ లభిస్తోందని, తప్పకుండా రాష్ట్రంలో పునర్వైభవం సాధిస్తామని మావోలు ప్రతినబూనారు. అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ గన్‌మన్, యాక్షన్ కమిటీ సభ్యుడు శంకర్ గుండాలలో పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందడంతో యాక్షన్ కమిటీ సభ్యుల సంచారం నిజమేనని తేలింది. దీంతో డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మావోలు బలపడేందుకు అవకాశమున్న అటవీ, గోదావరి పరీవాహక జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు ఠాణాల్లో సీఐలు, ఎస్సైలను ఆకస్మికంగా బదిలీ చేశారు. గతంలో మావోలను సమర్థంగా ఎదుర్కొన్న సీనియర్ పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే రెండు దశాబ్దాలనాటి ఇన్ఫార్మర్ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసుకోవాలని, అటవీ ప్రాంతాల్లో కొరియర్లు, సానుభూతిపరుల కదలికలపై నిఘా పెట్టాలంటూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తిరిగి కార్యాకలాపాలు ప్రారంభించిన మావోయిస్టులను సరిహద్దులోనే అడ్డుకోవాలని డీజీపీ వ్యూహాలు రచిస్తుండగా.. ప్రజామద్దతుతో తిరిగి బలపడతామని మావోలు చెబుతున్నారు. -
మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్ సర్వే
సాక్షి, అసిఫాబాద్: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. పోలీసు అధికారులతో మావోయిస్టుల కదలికలపై ఆరాతీస్తున్నారు. నెల రోజుల్లో రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడంతో స్థానికంగా ప్రాధాన్యత నెలకొంది. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు విషయమై కూడా చర్చ కొనసాగుతోంది. (మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?) -
అసిఫాబాద్‌లో డీజీపీ పర్యటన
సాక్షి, అసిఫాబాద్: జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం అసిఫాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఏఆర్ హెడ్‌క్వార్టర్ట్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐజీ నాగిరెడ్డి, అదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు వారియర్, ఏఎస్పీ సుధీంద్ర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో పోలీసు బలగాల నుంచి మావోయిస్టు దళ సభ్యులు తప్పించుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్ , మెడం భాస్కర్ , వర్గీస్ తెలంగాణలో ప్రవేశించినట్లు ఇంటలిజెన్స్ తేల్చిన క్రమంలో మూడు రోజులుగా గ్రే హౌండ్స్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. చత్తీస్‌గఢ్ వైపు నుంచి తెలంగాణలోని కొమురం భీమ్ అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోకి వస్తున్న మావోయిస్టుల కదలికలపై సమీక్షా సమావేశంలో లోతుగా చర్చించారు. మరోవైపు రెండు జిల్లాల అడవుల్లో గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.(తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్) -
ఉత్తరాన ఉలికిపాటు..!
సాక్షి, హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ... మావోయిస్టు ఉద్యమానికి పుట్టినిల్లుగా చెప్పుకునే ఈ ప్రాంతంలో తిరిగి మావోల సంచారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విజృంభణ, మరోవైపు పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు మద్దతు వంటి అంశాలను తమ కేడర్ రిక్రూట్మెంట్కు అనుకూలంగా మలుచుకునే య త్నాలు చేస్తున్నారు. తాజాగా పోలీసుల కూంబింగ్ లో ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి పలువురు కీలక మావోయిస్టులు త్రుటిలో తప్పించుకోవడం, రెండు చోట్ల ఎదురుకాల్పులు చోటుచేసుకోవ డమే ఇందుకు నిదర్శనం. లాక్డౌన్ సమయం నుంచే ఉమ్మడి కరీంనగర్‌లోని జగిత్యాల, మెట్పల్లి, సిరిసిల్ల, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం మొదలైంది. ఇదే సమయంలో రిక్రూట్మెంట్ కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఛత్తీస్గడ్, ఒడిశాల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలంతా ఉత్తర తెలంగాణవారే అయినా.. వారి సొంత ప్రాంతాల్లో పార్టీ పటిష్టంగా లేదన్న వి మర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకే, ఈ విమర్శలను పోగొట్టుకునేందుకే ఈ సంక్షోభ సమయంలో ఉత్తర తెలంగాణపై దృష్టి సారించారని సమాచారం. ఇపుడే ఎందుకు? ప్రస్తుతం కోవిడ్ వైరస్ విజృంభణకు వేలాది మందికి ఉపాధి కరువైంది. ముఖ్యంగా అసంఘటి త రంగంలో ఉండే కార్మికులు, విద్యావంతులు సైతం ఉపాధి కోల్పోతున్నారు. దేశంలో ప్రస్తు తం నెలకొన్న ఆర్థిక మందగ మనం కారణంగా క్రమంగా నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయి. అంటే తిరిగి 1990ల నాటి పరిస్థితులు కనిపిస్తున్నా యి. అందుకే, కేడర్ రిక్రూట్మెంట్ ఇదే సరైన సమయమని భావించిన మావో అగ్రనేతలు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్‌లపై దృష్టి కేంద్రీకరించారు. ప్రజాసమస్యలపై పోరాటం పేరిట గిరిజన, అటవీ ప్రాంతాల ఆదివాసీల్లోని అనాథలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతను తమతో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీ కోసం పలు ప్రాంతాల్లో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వ్యాపారులు ఇచ్చిన సమాచారంతో ఇటీవల సిరిసిల్లలో పోలీ సులు కొందరు మావోయిస్టులను, కొన్ని తుపాకులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. రెండో ప్రధాన కారణం పోడు వ్యవసాయం... ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోడు వ్యవసాయం పోకడలు అధికం. దాంతో ఇక్కడ ఫా రెస్టు ఆఫీసర్లకు పోడు వ్యవసా యం చేసుకునేవారికి ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా తిప్పుకోవాలని మావో నేతలు నిర్ణ యించినట్లు కనిపిస్తోంది. పోడు రైతుల్లో యువకులను తమవైపు తీసుకెళ్లేందుకు పలు రకాల వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. ఆ 15 మంది ఎక్కడ? ఆసిఫాబాద్‌లో తిర్యాణి మండలంలో మైలరేపు అడెళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని వీరి స్థావరం నుంచి ఆసిఫాబాద్ పోలీసులు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆసిఫాబాద్‌కు చెందిన 15 మంది యువకుల పేర్లు ఉన్నాయి. వీరిలో చాలామంది స్థానికంగా లేరని, మిస్సయ్యారని సమాచారం. వీరు ఎక్కడికెళ్లారని పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరి పేర్లు డైరీ లో ఎందుకున్నాయి? వీరిని ఇప్ప టికే రిక్రూట్ చేసుకున్నారా? శిక్షణ కోసం ఛత్తీస్గడ్ పంపారా? లేక మరేదైనా కారణం కోసం డైరీలో రాసుకున్నారా? అన్న అంశాలను ధ్రువీకరించుకునే పనిలో పడ్డారు. 24 గంటల్లో రెండు చోట్ల ఎదురుకాల్పులు.. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు మావోయిస్టులకు మధ్య రెండు చోట్ల ఎదురుకాల్పులు జరగడం తెలంగాణ ఏర్పడ్డాక ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈవారంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల పరిధిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడెళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని దళం సంచరిస్తోందన్న సమాచారంతో స్పెషల్ పోలీసులు రంగంలోకి దిగారు. అతనితోపాటు బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, ఛత్తీస్‌గడ్‌కు చెందిన వర్గీస్ కోయ మగ్లు, కంతి లింగవ్వ అలియాస్ అనిత, పాండు అలియాస్ మంగులు, మీనా, రాములతో కూడిన దళం పోలీసులకు ఎదురుపడగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ఇందులో భాస్కర్, ప్రభాత్ తలలపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా మిగిలిన దళ సభ్యులపై రూ.4 నుంచి 5 లక్షల రివార్డు ఉంది. వీరి ఫొటోలను ఇప్పటికే విడుదల చేసిన పోలీసులు..తిర్యాణి అడవుల్లో జల్లెడ పడుతున్నారు. మరోవైపు కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలోని మల్లెపల్లితోగు సమీపంలో కూంబింగ్ చేస్తోన్న పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. సామగ్రి వదిలేసిన మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రగతి భవన్‌కు రండి
కెరమెరి (ఆసిఫాబాద్): ఏళ్ల తరబడి పడిన శ్రమకు ఎట్టకేలకు గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఆపిల్ రుచిని చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో ఆపిల్ సాగు చేస్తున్న కేంద్రె బాలాజీకి ముఖ్యమంత్రి నుంచి ఆహ్వానం అందింది. ప్రగతి భవన్‌కు వచ్చి తనను కలవాలని కోరారు. ఈ నెల 5న ‘ఇదిగో తెలంగాణ ఆపిల్’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ప్రగతి భవన్లో ఉద్యానశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆపిల్ సాగు విషయం చర్చకు వచ్చింది. దీంతో ఆపిల్ సాగు చేస్తున్న రైతును ఆహ్వానించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దీంతో సోమవారం ఉదయం ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రాంరెడ్డి నుంచి బాలాజీకి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఆపిల్ పంట సాగు గురించి సీఎంకు వివరించాం.. మిమ్మల్ని హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వచ్చి కలవమన్నారు’అని చెప్పారు. కాగా, ఈ నెలాఖరులో సీఎంను కలసి ఆపిల్ రుచి చూపిస్తానని బాలాజీ అంటున్నారు. ఆపిల్ పండ్లను చూపుతున్న రైతు బాలాజీ -
ప్రేమ జంట ఆత్మహత్య
నార్నూర్(ఆసిఫాబాద్): ప్రేమ జంట మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఖంపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఖంపూర్ గ్రామానికి సోయం సీతాబాయి(20) ఉట్నూర్ మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన పెందూ గణేశ్(22) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఇరువురి నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి చేద్దామని మాట్లాడుకున్నట్లు తెలిపారు. పెందూర్ గణేశ్ సీతాబాయి స్వగ్రామమైన ఖంపూర్‌లోనే కొన్ని రోజులుగా ఉంటున్నాడు. గురువారం పొలం పనుల కోసం అని వెళ్లి లాక్డౌన్ ముగుస్తుందో.. లేదో.. పెళ్లి జరగదేమోనని మనస్థాపానికి గురైన వారు అమ్మాయి సోదరుడికి ఫోన్ ద్వారా తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నటు తెలిపారు. ఆమె సోదరుడు అక్కడకు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఎస్సై పంచనామా నిర్వహించి పోస్టుమార్టమ్ నిమిత్తం ఉట్నూర్ తరలించి అమ్మాయి తండ్రి సోయం గంగారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.(లాక్డౌన్: ట్రక్కులో దొరికిన ప్రేమికులు) -
ఎంఐఎం నేతను ఉరి తీయాలి
సాక్షి, ఆసిఫాబాద్ : హైదరాబాద్ పాత బస్తీలోని చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఎంఐఎం నాయకుడు షకీల్‌ను ఉరి తీయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మొండయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని అంకుసాపూర్‌లో ఆయన మాట్లాడారు. మలక్‌పేట ఎమ్మెల్యే హైమద్ అనుచరుడు షకీల్ పథకం ప్రకారమే అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. బాలిక కుటుంబానికి ప్రాణ భయం ఉందన్నారు. బాధితురాలికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. పోలీసులు అతడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు నా గోశ శంకర్, రేగుంట సాగర్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆసిఫాబాద్‌లో పెద్దపులి సంచారం
సాక్షి, ఆదిలాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా రెబ్బన, ఆసిఫాబాద్ మండలాల్లో పులి సంచారం చేస్తూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే రెండు ఆవులను చంపటంతో పశువులు, గొర్రెల కాపరులు బయటకు వెళ్లేందుకు వణుకుతున్నారు. గత శనివారం ఉదయం పెద్దపులది చిర్రకుంట గ్రామం వద్ద రోడ్డు దాటుతూ ఫారెస్ట్ సిబ్బందికి కనిపించినట్లు సమాచారం. ఇక అదే రోజు రాత్రి కూడా పులి రోడ్డు మీదకు వచ్చేందుకు ప్రయత్నించగా ఆటవీ సిబ్బంది దానిని అడవిలోకి పంపించారు. ఈరోజు ఉదయం కైరిగూడ ఓసిసి వద్ద వాగు దాటుతుండగా చూసిన స్థానికులు మొబైల్లో వీడియో తీసి అధికారులకు పంపించారు. కాగా ఏప్రిల్ 21న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు కూడా పెద్దపులి కనిపించినట్లు సమాచారం. -
క్వారంటైన్లో యువకుడు ఆత్మహత్యాయత్నం
సాక్షి, కుమురం భీం : క్వారంటైన్లో ఉన్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తాను ఉన్న వార్డులో ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో భయపడిన యువకుడు.. తనను వేరే చోటికి తరలించాలని అధికారులను కోరాడు. అయితే అధికారులు సరిగా స్పందించకపోవడంతో ఆ యువకుడు వార్డులోనే ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు, వైద్య సిబ్బంది అతన్ని అడ్డుకొని మరో చోటికి తరలించారు. (చదవండి : తెలంగాణలో మరో 43 మందికి కరోనా) కాగా, ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఐదుకి చేరింది. తాజాగా ఆరేళ్ల బాలుడికి కూడా కరోనా పాటిజివ్ అని తేలింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 800 దాటింది. శనివారం రాత్రి నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 809కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 186 మంది కోలుకుని డిశ్చార్చి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 605గా ఉండగా, మొత్తం 18మంది మృత్యువాతపడ్డారు. -
ఆసిఫాబాద్‌లో రెండు కరోనా కేసులు
సాక్షి, ఆదిలాబాద్: ఆసిఫాబాద్‌లో మర్కజ్ వెళ్లొచ్చిన వ్యక్తి ఇంట్లో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. మర్కజ్ వెళ్లొచ్చిన తండ్రికి నెగిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆయన ఇద్దరు కుమారులకు కరోనా పాజిటివ్ రావడం పట్ల వైద్యాధికారులు విస్మయం చెందుతున్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మర్కస్ వెళ్లొచ్చిన జైనుర్కు చెందిన వ్యక్తిని ఆసిఫాబాద్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు అధికారులు తరలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కూడా వాంకిడి ఆశ్రమ పాఠశాల క్వారంటైన్ కేంద్రానికి తరలించి వైద్య పరీక్షల కోసం వారి శాంపిల్స్‌ను సేకరించి పంపించారు. శుక్రవారం వచ్చిన రిపోర్ట్స్‌లో మర్కస్ వెళ్లొచ్చిన తండ్రికి నెగిటివ్ వచ్చి.. ఆయన కుమారులు ఇద్దరికి పాజిటివ్ రావడం పట్ల ఇదెలా సాధ్యం అన్న అనుమానంతో వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
‘గురుకుల’ విద్యార్థినికి గర్భం
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లోని గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని గర్భం దాల్చడం కలకలం సృష్టించింది. అయితే.. ప్రేమ వ్యవహారమే కారణమని అధికారుల విచారణలో తేలింది. వివరాలు.. గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థినులకు ఇటీవల రుతుస్రావం సమస్య ఎదురైంది. దీంతో నవంబర్ 21న కళాశాల సిబ్బంది ఆదిలాబాద్ రిమ్స్‌లో పరీక్షలు చేయించారు. ఇందులో ముగ్గురిపై అనుమానంతో గర్భనిర్దారణ పరీక్షలు చేయించారు. వారికి మొదట పాజిటివ్ వచ్చింది. ధ్రువీకరణ కోసం మళ్లీ వారం తర్వాత రావాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే.. కళాశాల సిబ్బంది మళ్లీ రిమ్స్‌కు వెళ్లకుండా స్థానికంగా ఉన్న ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో ఒక విద్యార్థిని మాత్రమే గర్భం దాల్చినట్లు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాగా, శనివారం ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు, గిరిజన సంక్షేమ శాఖ జీసీడీవో శంకుతల, డీసీపీవో మహేశ్, ఐసీడీఎస్ పీడీ సావిత్రి శనివారం విచారణ చేపట్టగా.. గర్భానికి ప్రేమ వ్యవహారమే కారణమని సదరు విద్యార్థిని ఒప్పుకుంది. మా కళాశాలను బద్నాం చేస్తారా? గురుకుల కళాశాలలో విద్యార్థిని గర్భం దాల్చడంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆ కళాశాల విద్యార్థినులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కళాశాల పేరుప్రఖ్యాతులు భంగం కలిగేలా మీడియాలో ప్రచారం చేశారని, ఇందులో ప్రిన్సిపాల్ పాత్ర ఏమీ లేదని వసతిగృహ భవనం ఎదుట ధర్నాకు దిగారు. ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ విద్యార్థినులతో మాట్లాడి శాంతిపజేశారు. కాగా, ఈ ఘటనపై విచారణ కోసం ఆర్డీఓ లక్ష్మయ్య ఆలస్యంగా రావడంపై విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని ఆందోళన చేశారు. -
సమత కేసు: కోర్టుకు ఏడుగురు సాక్ష్యులు
సాక్షి, ఆసిఫాబాద్ : జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత కేసు విచారణ ప్రారంభమైంది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఏడుగురు సాక్షులు సోమవారం ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు హాజరు అయ్యారు. సెలవు దినాలు తప్ప ఈ నెల 31 వరకూ రోజుకు ఏడుగురు సాక్ష్యులను న్యాయస్థానం విచారణ చేయనుంది. సాక్ష్యుల స్టేట్మెంట్ రికార్డు అనంతరం, పోలీసులు సేకరించిన ఆధారాలు, ఎఫ్ఎస్ఎల్, డీఎన్ఏ నివేదికలు పరిశీలించిన తర్వాత జనవరి మొదటివారంలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. కాగా గత నెల 24న దళిత మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. చదవండి: ‘సమత’ హత్యాచార కేసులో ప్రత్యేక కోర్టు 'సమత' పిల్లలకు ఉచిత విద్య ‘సమత’గా పేరు మార్పు: ఎస్పీ దారుణం: వివాహితపై అత్యాచారం.. హత్య -
సమత నిందితుల తరఫున వాదించేందుకు నిరాకరణ
సాక్షి, ఆదిలాబాద్: సమతపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుల తరఫున వాదించేందుకు న్యాయవాదులెవరూ ముందుకు రాలేదు. ఈ కేసులోని నిందితుల రిమాండ్ ముగియడంతో జిల్లా జైలు నుంచి పోలీసులు సోమవారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. వారి కేసును ఎవరు వాదించవద్దని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. న్యాయవాదులను నియమించుకునేందుకు నిందితులు కోర్టును మూడు రోజుల సమయం కోరారు. కాగా మంగళవారం ఉదయం 10గంటల వరకు గడువు ఇచ్చింది. నిందితులను పోలీసులు జుడీషియల్ కస్టడీకి తరలించారు. మంగళవారం తదుపరి విచారణ కోసం నిందితులను హాజరుపర్చనున్నారు. ఆదిలాబాద్‌లోని స్పెషల్ ఎస్సీ, ఎస్టీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సమత కేసు నిందితులైన షేక్ బాబు, షేక్ శాబొద్దీన్, షేక్ ముగ్దుమ్లపై విచారణ జరగనుంది. జుడీషియల్ కస్టడీకి.. నిందితులపై లింగాపూర్ పోలీసులు 376–డి, 404, 312, 325, 3(2)(5)ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. సోమవారం రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో నిందితులను పోలీసులు హాజరుపర్చారు. జుడీషియల్ కస్టడీకి న్యాయస్థానం వారిని అప్పగించింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి, సెల్‌ఫోన్, రూ.200లతో పాటు 72 రకాల వస్తువులను కోర్టులో పోలీసులు డిపాజిట్ చేశారు. వీటిలో సమత దుస్తులు, సంఘటన స్థలంలో లభించిన ఆధారాలను పోలీసులు కోర్టులో డిపాజిట్ చేసినట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. మొత్తం 44 మంది సాక్షులు.. ఒకవేళ న్యాయవాదులెవరూ కేసును వాదించేందుకు ముందుకు రాకపోతే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా, ప్రభుత్వం తరఫునుంచైనా న్యాయవాదిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో మొత్తం 44 మంది సాక్షులను పోలీసులు సేకరించగా, రోజు కొంతమంది కోర్టులో హాజరుకానున్నట్లు సమాచారం. -
ఇక బాలామృతం ‘ప్లస్’!
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో తీవ్ర పోషక లోపాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త పౌష్టికాహారం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అన్నిరకాల పోషక విలువలున్న ఆహారంగా ‘బాలామృతా’న్ని చిన్నారులకు అందిస్తున్నారు. దీంతో చిన్నారుల పెరుగుదల సంతృప్తికరంగా ఉంటోంది. అయితే పోషకలోపాలున్న చిన్నారులకు బాలామృతం కంటే మరింత అధిక పోషణ గుణాలున్న ఆహారాన్ని ఇవ్వాలని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘బాలామృతం ప్లస్’ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం తార్నాకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (ఎన్ఐఎన్)లో జరిగిన కార్యక్రమంలో ‘బాలామృతం ప్లస్’ను వినియోగంలోకి తెచ్చారు. ముందుగా రెండు జిల్లాల్లో... అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఆరోగ్య స్థితిని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. వారి బరువు, ఎదుగుదలను క్రమం తప్పకుండా కొలవడంతో పాటు వారి ఆరోగ్య స్థితిని సైతం రికార్డు చేస్తుంది. ఈక్రమంలో రాష్ట్రస్థాయి నివేదికను విశ్లేషించగా... కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఎక్కువ మంది చిన్నారులు తీవ్ర పోషక లోపాల బారిన పడినట్లు గుర్తించారు. ఇలాంటి వారికి సాధారణ ఆహారంతో పాటు అధిక పోషక విలువలున్న ఆహారాన్ని ఇవ్వాలి. అలా అయితేనే వారు ఐదేళ్ల వయసొచ్చేసరికి పోషక లోపాలు అధిగమించడంతో పాటు ఆ తర్వాత ఎదుగుదల సాధారణంగా మారుతుంది. ఈ అంశంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ యంత్రాంగంతో పాటు ఎన్ఐఎన్, టీఎస్ ఫుడ్స్, యూనిసెఫ్ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి పోషక విలువలు ఎక్కువగా ఉన్న బాలామృతం ప్లస్‌ను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్, యూనిసెఫ్ దక్షిణాది రాష్ట్రాల చీఫ్ మిషల్ రాస్డియా తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆహారంలో... కొత్తగా తీసుకొచ్చిన బాలామృతం ప్లస్‌లో పాలపొడి, పల్లీ నూనె, రైస్, వీట్, బెంగాల్‌గ్రామ్, చక్కెరతో పాటు కొవ్వు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిశ్రమాలను జత చేస్తారు. దీంతో పోషక విలువలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బాలామృతం ప్లస్‌ను కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు జిల్లాల్లో నెలకు సగటున టన్ను బాలామృతం ప్లస్ సరఫరా చేసేలా తయారు చేస్తున్నారు. డిమాండ్‌కు తగినట్లు పరిమాణాన్ని పెంచేందుకు టీఎస్‌ఫుడ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్లస్ ఆహారాన్ని అందిస్తూ చిన్నారుల ఎదుగుదల, పోషక లోపాల తీరును వరుసగా మూడు నెలల పాటు పరిశీలిస్తారు. ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది మరో 10 జిల్లాల్లో బాలామృతం ప్లస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తోంది. -
కోర్టుకు ‘సమత’ నిందితులు; 44 మందిని..
సాక్షి, ఆదిలాబాద్: సమత అత్యాచారం, హత్య కేసు నిందితులను ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్ బాబు సహా మరో ఇద్దరు నిందితులు షేక్ శాబొద్దీన్, షేక్ ముఖ్దూమ్‌లను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనలో 44 మంది సాక్షులతో కూడిన చార్జిషీట్‌ను అసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శనివారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రోజుకు ఐదుగురు సాక్షుల చొప్పున విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా బాధితురాలు దళిత మహిళ కావడంతో అత్యాచారం, హత్య కేసులతో పాటుగా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అభిప్రాయపడుతున్నారు. కాగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. నవంబరు 24న కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురై న విషయం తెలిసిందే. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను అదే నెల27న పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బాధితురాలి పేరును ‘సమత’గా మార్చిన పోలీసులు.. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాక.. గొంతుకోసి చంపారని కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. అలాగే బాధితురాలి శరీరంలో నిందితుల డీఎన్ఏ లభించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఇక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఘటనకు మూడు రోజుల ముందు ఈ దారుణం జరిగింది. అయితే దిశ తరహాలో మొదట ప్రాధాన్యత దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిందితులు ఏ1గా షేక్‌బాబా, ఏ2 షేక్ షాబొద్దీన్, ఏ3 షేక్ ముఖ్దూమ్లకు ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. -
మహిళలకు భద్రత కరువు : భట్టి విక్రమార్క
సాక్షి, ఆసిఫాబాద్ : రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గతనెల 24న కుమురంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ శివారులో దళిత మహిళ సమతపై అత్యాచారం, హత్య చేసిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తదితరులతోకలసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుని పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రతిరోజు సచివాలయానికి వచ్చి ప్రజా పరిపాలనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. విచ్ఛలవిడిగా మద్యం అమ్మకాల వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎల్లాపటార్‌లో దళిత మహిళపై అత్యాచార, హత్య ఘటనపై గవర్నర్ దృష్టికి తెచ్చామని పేర్కొన్నారు. మహిళలపై దాడులు అరికట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మహిళలపై ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. భద్రతపై మహిళలకు ప్రభుత్వం ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు కేవలం టీఆర్ఎస్ నాయకులకే పని చేస్తున్నారని విమర్శించారు. వారి వెంట మాజీ ఎంపీలు నిఖిల్, రాథోడ్ రమేశ్ తదితరులు ఉన్నారు. -
దళిత మహిళను అత్యాచారం, గొంతుకోస్తే స్పందించరా?
సాక్షి, లింగాపూర్: ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో నవంబర్ 25న దళిత బుడగజంగం సామాజిక వర్గానికి చెందిన మహిళపై ఎల్లాపటార్ గ్రామానికి చెందిన ముగ్గురు సాముహికంగా అత్యాచారం చేసి.. గొంతుకోసి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. దళిత మహిళ టేకు లక్ష్మి హత్య జరిగిన ప్రదేశాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. శంషాబాద్‌లో జరిగిన దిశ సంఘటనను పార్లమెంట్లో ప్రస్తావించారని, అదే లక్ష్మి ఘటనను ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు. ఉన్నత వర్గాలకు ఒక న్యాయం.. దళితులకు మరో న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. దిశ నిందితులను శిక్షించే ముందు లింగాపూర్ నిందితులనూ శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితుల ఓట్లు కావాలిగానీ.. వారిపై హత్యాచారాలు జరిగితే మాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. -
ఆర్టీసీ సమ్మె: బస్సుపై రాళ్ల దాడి
ఆసిఫాబాద్: ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉదృతమవుతోంది. ఆసిఫాబాద్‌లోని హనుమాన్ విగ్రహం వద్ద రెండు బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరి ద్వంసం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో ప్రభుత్వం బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాగజ్‌నగర్ నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న బస్సుపై దుండగులు రాళ్లు విసరడంతో ధ్వంసమైంది. దాంతోపాటు మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న మరో బస్సుపై కూడా ఇదే తరహా దాడి జరిగింది. దీంతో బస్సు స్వల్పంగా ధ్వంసమైంది. ఊహించని ఘటనలతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాడికి పాల్పడిన వ్యక్తులు పరారయ్యారు. దాడులపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఎస్టీల నుంచి లంబాడీలను తొలగించాలి
సాక్షి, ఆసిఫాబాద్: ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీ ప్రజాప్రతినిధులు కుమురం భీం వర్ధంతి సందర్భంగా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఆదివాసీల న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కుమురం భీం జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివారం ఆదివాసీ పోరాట యోధుడు కుమురం భీం 79వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, కుమురం భీం జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ గొడెం నగేశ్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఉట్నూర్ ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య, కుమురం భీం మనవడు సోనే రావు, 9 ఆదివాసీ తెగల నేతలు హాజరయ్యారు. ముందుగా భీం స్మారకం, సమాధి వద్ద ఆదివాసీ డప్పు చప్పుల మధ్య పూజలు చేసి నివాళులర్పించారు. -
మంచిర్యాలకు వైద్య కళాశాల!
సాక్షి, మంచిర్యాలటౌన్: మంచిర్యాల, కుమురంభీం జిల్లా ప్రజలకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయి. రెండు జిల్లాలకు దిక్కుగా ఉన్న ఏకైక జిల్లా ఆసుపత్రికి త్వరలోనే వైద్య కళాశాల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఖమ్మం ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాల జిల్లా కేంద్రాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపినట్లు మంత్రి ప్రకటించడంతో జిల్లా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా ఏర్పాటుకు ముందు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిగా సేవలు అందించి.. జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా ఆసుపత్రిగా మారింది. వంద పడకల ఆసుపత్రిగా ఉన్న ప్రభుత్వాసుపత్రిని 250 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ.. 2018 ఫిబ్రవరి 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం 250 పడకలకు సరిపోకపోవడంతో అప్పటి జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ కళాశాల రోడ్డులో ఉన్న భూదాన్ భూమి 27 ఎకరాలను ప్రభుత్వాసుపత్రితోపాటు, మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి కేటాయించారు. ఏడాది క్రితం మాతాశిశు సంరక్షణ కేంద్రం భవన నిర్మాణం కోసం టెండర్లను పూర్తి చేసి పనులు ప్రారంభించారు. జిల్లా ఆసుపత్రి నిర్మాణం కోసం టెండర్లను పిలవాల్సి ఉండగా.. మంత్రి ప్రకటనతో వైద్య కళాశాలను భూదాన్ భూమిలోని 27 ఎకరాల్లోనే నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ప్రస్తుతం కేటాయించిన 27 ఎకరాల స్థలంపై బుధవారం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ యశ్వంత్‌రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో త్వరలోనే వైద్యకళాశాలకు మోక్షం కలిగేందుకు అవకాశం ఉండడంతో రెండు జిల్లాల ప్రజల్లో ఆనందం నెలకొంది. వైద్యకళాశాల ఏర్పాటుతోనే సమస్యలు దూరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్‌లో రిమ్స్ వైద్యశాల ఉంది. కొత్తగా ఏర్పడిన ఏ జిల్లాలోనూ వైద్య కళాశాలగాని, 250 పడకల ఆసుపత్రులుగానీ లేవు. మంచిర్యాల ఏరియా ఆసుపత్రి వంద పడకల నుంచి 250 పడకలకు అప్‌గ్రేడ్ చేసినా.. అందుకు సరిపడా సౌకర్యాలు కల్పించలేదు. మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రం లో మూడు వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రతి పాదనలు పంపినట్లు ప్రకటించడంతో జిల్లాకు 250 పడకలకు బదులు 500 పడకల ఆసుపత్రిగా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనంలో గదులు సరిపోకపోవడంతో వరండాల్లోనే రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవ నం చిన్నపాటి వర్షానికే ఉరుస్తూ, పైకప్పుపెచ్చులు ఊడుతోంది. ఇరుకైన గదులు, వరండాల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్‌కు ఇబ్బంది తలెత్తుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురికి నీరు బయటకు వెళ్లడం లేదు. పారిశుధ్యం మెరుగుపర్చినా.. ఆసుపత్రి ఆవరణ దుర్వాసన వెదజల్లుతోంది. గతంలో ఏరియా ఆసుపత్రిగా ఉన్నప్పుడు రోజుకు 300 మంది ఓపీ రాగా.. ఇప్పుడు 600కు పైగా వస్తున్నారు. 260కి పైగా రోగులు ప్రతిరోజూ ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. గతంలో నెలకు 50 ప్రసవాలు జరగగా.. ప్రస్తుతం 360కి పైగా జరుగుతున్నాయి. వైద్యకళాశాల ఏర్పాటుతో 500 పడకల ఆసుపత్రిగా మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి మారితే కొత్త భవనంలో, అన్నిరకాల వసతులతో రోగులకు చికిత్స అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. సింగరేణి సంస్థ తన లాభాల నుంచి ప్రజలకు ఉపయోగపడేందుకు నిధులు వెచ్చిస్తుంది. అందులో అధికభాగం వైద్యరంగానికే అందిస్తోంది. సింగరేణి సంస్థ సహకారంతోనే ప్రస్తుత జిల్లా ఆసుపత్రిలో ఐసీ యూ ఏర్పాటుతోపాటు, సీటీస్కాన్, బ్లడ్బ్యాం కులో కోట్లు విలువ చేసే యంత్రాలను కొనుగోలు చేసి అందించింది. వీటిని వినియోగంచుకునేందుకు సరైన సదుపాయాలు ప్రస్తుత ఆసుపత్రి భవనంలో లేకపోయినా.. ఉన్న గదుల్లోనే వినియోగిస్తున్నారు. కొత్త భవనంలోకి మారితే ప్రస్తుతం ఉన్న ఆధునిక పరికరాలను రోగుల కోసం వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు జరిగి నప్పుడు ప్రాథమి కంగా మాత్రమే మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. వైద్య కళాశాల పూర్తయితే మంచిర్యాల, కుమురంభీం జిల్లాల ప్రజలకు అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
‘ఈఎస్ఐ’ వెలవెల..
సాక్షి, ఆసిఫాబాద్: సిర్పూర్ పేపర్ మిల్లు పునఃప్రారంభం కావడంతో ఆసుపత్రికి పూర్వవైభవం వస్తుందని ఆశప డ్డ కార్మికులకు నిరాశే ఎదురవుతోంది. ఈ ఆసుపత్రిలో 9526 వేల మంది కార్మికులు ఆరోగ్య కార్డులు పొంది ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చాలా తక్కువ మంది కార్మిక కుటుంబా లకు నామమాత్రంగా వైద్యసేవలు అందిస్తున్నారు. నిత్యం దాదాపు 200 మంది ఇక్కడికి వైద్య పరీక్షల కోసం వస్తున్నారు. అయినా సౌకర్యాలు, వైద్య సిబ్బంది లేక ఆశించిన స్థాయి వైద్యం అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో అడ్మిట్ అవుదామన్నా భయంగా ఉంటుందని రోగులు పేర్కొంటున్నారు. పెచ్చులూడుతున్న పై కప్పు.. ఆసుపత్రిలో విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేదు. పైకప్పు పెచ్చులు ఊడుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని రోగులు భయాందోళనకు గురవుతున్నారు. గత 15 ఏళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆసుపత్రి బూతు బంగ్లాలా మారింది. దీంతో ఆసుపత్రికి వచ్చే ఒకరిద్దరూ కూడా వైద్యం తీసుకుని వెనుతిరుగుతున్నారు. ఇక ఆసుపత్రిలో మరుగుదొడ్లు సక్రమంగా పనిచేయడం లేదు, తాగునీటి వసతి లేదు. వీటికి తోడు అంతో,ఇంతో వైద్యం అందుతుందని ఆసుపత్రి కి రోగులు వస్తే గంటల తరబడి వేచిచూడాల్సి దుస్థితి నెలకొంది. వైద్యులు ఆలస్యంగా వస్తుండడంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నామమాత్రంగా విధులు.. కాగజ్‌నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో సిబ్బంది నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ఆసుపత్రిలో 75 మంది వివిధ విభాగాలకు చెందిన సిబ్బందిని నియమించారు. అయితే ఇందులో చాలా మంది ప్రధాన వైద్య సిబ్బంది దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, తదితర పట్టణాల నుంచి వారానికి ఒకసారి వచ్చి వెళుతున్నారని ఆరోపణలున్నాయి. సూపరింటెండెంట్ సైతం స్థానికంగా ఉండడం లేదు. దీంతో ఇదే అదనుగా ఇతర సిబ్బంది సైతం సమయపాలనా పాటించడం లేదు. డిస్పెన్సనరీలో ఏఎన్ఎంలే దిక్కు.. ఈఎస్ఐ డిస్పెన్షనరీలోనూ వైద్యులు లేకపోవడంతో సేవలు అందని ద్రాక్షగానే ఉన్నాయి. డిస్పెన్షనరీకి నిత్యం 200 మంది వైద్యం కోసం వస్తుంటారు. అయితే ఇందులో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. ఏఎన్ఎంలు కేవలం తమకు తోచిన వైద్యం అందిస్తున్నారు. ఫార్మసిస్టులు ముగ్గురు ఉండాల్సి ఉండగా ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు. ఒకరు డిప్యూటేషన్‌పై, స్టాఫ్‌నర్స్ ఒకరు ఉండగా ఒక పోస్టు ఖాళీగా ఉంది. వెంటనే ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులతో పాటు ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని కార్మికులు కోరుతున్నారు. దీంతో పాటు ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి పూర్వవైభవం తీసుకురావాల్సి అవసరముంది. ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ బీమా ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందడం లేదు. కొన్నేళ్ల క్రితం ఆసుపత్రిలో అన్ని విభాగాల వైద్యసేవలు అందేవి. ప్రస్తుతం సరిపడా సిబ్బంది లేకపోవడంతో సరైన చికిత్సలు అందడం లేదు. ఎంతపెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చన్న దీమా లేకుండా పోయింది. అన్ని విభాగాలకు చెందిన వైద్యులను నియమించి, వసతులు కల్పించాలి. – శేబ్బీర్‌హుస్సేన్, ఎస్పీఎం కార్మిక సంఘం నాయకుడు -
చోరీకి నిరాకరించాడని.. నమ్మించి ప్రాణం తీశారు
సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్) : మద్యం సేవిద్దామని యువకుడిని ఇంట్లో నుండి బయటకు తీసుకువచ్చి మద్యం సేవించిన అనంతరం కిరాతంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. గూడ్స్ రైలులో నుండి బస్తాలు దొంగతనం చేద్దామని తోటి స్నేహితుడిని కోరడంతో నిరాకరించిన పాపానికి విచక్షణ రహితంగా దాడి చేయటంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. జీఆర్పీ ఖాజీపేట సీఐ కే. స్వామి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం లోని ఇందిరా కాలనీకి చెందిన ఆత్రం రమేష్ (19) కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. 14న రాత్రి మండల కేంద్రానికి చెందిన రమేష్‌తో పాటు మరో స్నేహితుడు కలిసి ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్లో గూడ్స్ రైలులో నుండి బస్తాలు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో వీరిద్దరు కలిసి ఆత్రం రమేష్ ఇంటికి వెళ్లి రైలులో నుండి బస్తాలు దొంగతనం చేద్దామని పిలిచారు. దానికి ఆత్రం రమేష్ నిరాకరించటంతో వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత మరోసారి ఆత్రం రమేష్ ఇంటికి వెళ్లి మద్యం సేవిద్దామని ఇంట్లో నుండి ఆయనను బయటకు తీసుకువచ్చారు. ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం గూడ్స్ రైలులో నుండి బస్తాలు దొంగతనం చేద్దామని ఆత్రం రమేష్‌కు తెలపటంతో దానికి ఆయన నిరాకరించాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రమేష్‌తో పాటు మరో వ్యక్తి ఆత్రం రమేష్‌ను వెనుక వైపు నుండి కాలితో బలంగా తన్నటంతో రైల్వేస్టేషన్లో ఉన్న సిమెంట్ బెంచీపై పడ్డాడు. దాంతో ఆత్రం రమేష్ మెడ నరాలు తెగిపోగా శరీరంలో అంతర్గతంగా తీవ్రగాయాలై అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన మిగిలిన ఇద్దరు అక్కడి నుండి పారిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న రమేష్‌ను గమనించిన పలువురు వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియ జేయడంతో హుటాహుటిన బెల్లంపల్లికి అక్కడి నుండి మంచిర్యాలకు తరలించారు. పరిస్థితి విషమంగా మారటంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు ఈమేరకు మృతుడి అన్న ఆత్రం వినోద్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వాగు దాటి.. వైద్యం అందించి..!
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్) : ఇటీవల కురుస్తున్న వానలకు పొంగిపొర్లుతున్న వాగులను సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 30కు పైగా గ్రామాలు వాగు అవతల ఉండడంతో ఈ కష్టాలు నిత్యం తప్పడం లేదని సిబ్బంది వాపోతున్నారు. కెరమెరి ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో ఏఎన్ఎం సుమలత, హెల్త్ అసిస్టెంట్లు వసంత్, శత్రుఘన్ గురువారం మండలంలోని కరంజివాడ వాగును దాటి వైద్య సేవలిందించారు. నడుము వరకు నీళ్లు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఆంద్‌గూడ, గోండ్ కరంజివాడ, పెద్ద కరంజివాడ గ్రామాలకు వెళ్లి 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరుగురి రోగుల నుంచి రక్త పూతలు సేకరించారు. నలుగురి గర్భవతులకు పరీక్షలు నిర్వహించి మాత్రలు అందించారు. -
మిత్రుడి కోసం ఆవుల మూగ వేదన
సాక్షి, ఆసిఫాబాద్ : తమ ఆత్మీయులను కోల్పోయినప్పుడు మనుషులే కాదు. మూగ జంతువులు సైతం బాధతో విలపిస్తాయి. బుధవారం కుమురం భీం జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో ఓ ఆవు అనారోగ్య కారణంతో మృతి చెందింది. మరణించిన ఆవును గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ వెనక వైపు తాడుతో కట్టి పట్టణ శివారువైపు తీసుకెళ్తుండగా తోటి పశువులు చూసి తమ ఆత్మీయురాలిని కోల్పోతున్నామనే బాధతో ఆ ట్రాక్టర్‌ను అరుస్తు వెంబడించసాగాయి. సబ్ జైలు సమీపం నుంచి ఆదిలాబాద్ చౌరస్తా వరకు ఆ ట్రాక్టర్ వెనకలే దాదాపు రెండు కిలోమీటర్ల మేర పరిగెడుతూ తమ మూగ బాధను వెల్లబుచ్చాయి. మృతి చెందిన ఆవును బాధతో వెంబడిస్తున్న తోటి ఆవులు -
ఆదివాసీ మహిళను వంచించిన హోంగార్డు
సాక్షి. ఆసిఫాబాద్ : కుమురం భీం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహితుడైన ఒక హోంగార్డు అవివాహితను పెళ్లి చేసుకుంటానని మోసగించి గర్భవతిని చేసి ఆమె మరణానికి కారణమైన సంఘటన కుమురం భీం జిల్లాలో ఆదివారం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే ఆసిఫాబాద్ మండలంలోని దంపూర్ గ్రామానికి చెందిన దుర్వా అరుణ (28) అనే గిరిజన మహిళను ఆసిఫాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలోని లచ్చిరాం కుమారుడైన జాదవ్ సజన్ లాల్ ప్రేమ పేరుతో వివాహం చేసుకుంటానని మాయ మాటాలు చెప్పి నమ్మించాడు. అతనికి పెళ్లి జరిగిన విషయం, కుమారుడు ఉన్న విషయాన్ని అరుణ దగ్గర చెప్పకుండా పెళ్లి కాక ముందే గర్భవతిని చేశాడు. ఎంత కాలం గడిచిన సజన్ లాల్ ఆమెను వివాహం చేసుకోకపోవడంతో బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు అధికారులు అతన్ని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించగా అరుణను పెళ్లి చేసుకుంటానని, డెలివరీ ఖర్చులు సైతం తానే భరిస్తానని ఒప్పుకున్నాడు. ఇదీ జరిగింది.. ఈ నెల 4వ తేదిన బాధిత మహిళకు పురిటి నొప్పులు రాగా ఆమెను ఆసిఫాబాద్ ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ ఆసిఫాబాద్ వైద్యులు మంచిర్యాల ఆస్పత్రికి రెఫర్ చేశారు. యువతి పరిస్థితి ఉందోళనకరంగా ఉందని హైదరాబాద్ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ సజల్ లాల్ ఆమెను ఆసిఫాబాద్ తీసుకుని వచ్చి ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు. బాధిత కుటుంబీకులు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా ఆసిఫాబాద్ వైద్యులు, డీఎస్పీ సహాయంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు అరుణను తరలించారు. అక్కడే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు కడుపులో మంటలు రావడంతో హైదారాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కాని కొద్ది సేపటికే ఆమె మరణించింది. పోలీసులు మృతదేహాన్ని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఇది తెలుసుకున్న యువతి బంధువులు ఆస్పత్రికి చేరుకుని హోంగార్డును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు సహకరించడం లేదని బాధితురాలి బంధువుల ఆవేదన.. గత తొమ్మిది నెలల నుంచి తమకు న్యాయం చేయాలని గతంలో పని చేసిన సీఐని కలిసినట్లు బాధితురాలి తండ్రి నాందేవ్, సోదరీమణులు మాత శ్రీ, సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మోసం చేసిన వ్యక్తి పోలీస్ శాఖకు చెందిన వాడు కావడంతో తమకు పోలీసులు సహకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పకోవాలో తెలియక అరుణను కోల్పోవాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరయ్యారు. ఎమెల్యే హామీతో ఆందోళన విరమణ.. సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీఎస్పీ సత్యనారాయణ, ఎంపీపీ మల్లికార్జున్ ఆస్పత్రికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనకు కారణమైన హోంగార్డుపై చర్యలు తీసుకుంటామని తెలపడంతో ఆందోళన విరమించారు. శిశు సంరక్షణ కేంద్రానికి చేరిన శిశువు.. హోంగార్డు మోసానికి బలైపోయిన యువతి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి మరణించడంతో ఆ శిశువును జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి సావిత్రికి అప్పగించారు. ఆమె శిశువును ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆదివాసీ మహిళకు జరిగిన అన్యాయానికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలికి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ఇలాంటి ఘటన జరగడం బాధకరమని వాపోతున్నారు. -
ప్రేమ పేరుతో హోంగార్డు మోసం
సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు పోలీసుల చర్యలు ఆ శాఖ పరువు తీస్తున్నాయి. దీంతో పోలీసు ఉద్యోగుల వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే కొమురం ఆసిఫాబాద్ జిల్లాలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి మహిళల అక్రమరవాణా కేసులో జైలుపాలయ్యాడు. ఇక లక్సెట్టిపేటకు చెందిన రిజర్వ్ సీఐ శ్రీనివాస్‌పై 498-ఎ కేసు విచారణ జరుగుతోంది. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువతి గర్భందాల్చి బిడ్డకు జన్మనిస్తూ మృతి చెందింది. ఇందుకు జిల్లాకు చెందిన ఓ హోంగార్డే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసుల ప్రవర్తనపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఏఆర్ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తున్న సజ్జన్‌లాల్ ధాంపూర్‌కు చెందిన అరుణ అనే యువతిని ప్రేమపేరుతో గర్భవతిని చేశాడు. ఆమె ఆదివారం ఆసిఫాబాద్‌లో మగబిడ్డకు జన్మనిచ్చి అనంతరం మృతి చెందింది. అయితే గతంలోనే సజన్ లాల్‌కు పెళ్లి కాగా, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ప్రేమ, పెళ్లి పేరుతో అరుణను లోబరచుకుని గత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. గర్భవతి అయిన ఆమెకు ఇవాళ ఉదయం పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకు వెళ్లకుండా ఆలస్యం చేశాడు. దీంతో ఆమె దారిలోనే బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి అక్కడ నుంచి సజ్జన్ లాల్ పరారయ్యాడు. అరుణ మృతితో న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తీసుకు వెళ్లేది లేదని ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కాగా సజన్ లాల్ వ్యవహారంపై గతంలోనే ఆసిఫాబాద్ పోలీసులకు అరుణ బంధువులు ఫిర్యాదు చేశారు. అయితే తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే తన చెల్లెలు చనిపోయిందని అరుణ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ సత్యనారాయణ...బాధితురాలి కుటుంబసభ్యులను సముదాయించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. ఇక పుట్టిన బిడ్డను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
బస్సులో పాము కలకలం
మంచిర్యాల టౌన్ : ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి ఆసిఫాబాద్‌కు వెళుతుండగా, బస్సులోకి పాము దూరడంతో కలకలం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి లగ్జరీ బస్సు పెద్దపల్లి వరకు రాగానే, పాము బస్సులోకి వచ్చి చేరింది. అయితే డ్రైవర్ పాము కోసం వెతికినప్పుడు అది కనిపించకపోవడంతో వెళ్లిపోయిందనుకుని బయలుదేరారు. శ్రీరాంపూర్‌కు చేరుకునే సరికి పాము డ్రైవర్ సీటు కిందనే ఉండడంతో బస్సును పక్కన నిలిపి వేశాడు. వెంటనే ప్రయాణీకులను కిందకు దించి, స్థానికుల సహాయంతో పామును బయటకు పంపి దానిని చంపేశారు. -
తెలంగాణ ‘నయాగరా’
సాక్షి, ఆసిఫాబాద్: చుట్టూ అడవి.. కొండల నుంచి జాలువారే జలపాతాలు.. పాలనురుగును తలపించే నీళ్లు.. దిగువకు దూకుతున్న జల సవ్వడులు.. రెప్పకూడా వేయకుండా తనివితీరా చూడాలనిపించే ప్రకృతి సోయగాలు.. ఫొటో చూస్తుంటేనే అదిరిపోతోంది.. నిజంగా అక్కడకు వెళ్లి చూస్తే తన్మయత్వంతో మైమరచిపోవడం ఖాయం అనిపిస్తోంది కదూ! మరి ఇంతటి అందమైన.. మినీ నయాగరాలా కనిపిస్తున్న ఈ జలపాతం ఎక్కడుందో తెలుసా? అచ్చంగా మన గడ్డ మీదే..! చదవండి: జలపాతాల కనువిందు మనసు దోచే జలపాతాలు, హృదయం పులకరించే ప్రకృతి సోయగాలు చూడాలంటే ఇకపై మనం ఎక్కడికో వెళ్లక్కర్లేదు. దర్జాగా మన గడ్డపైనే వాటిని చూస్తూ తన్మయత్వంతో మైమరచిపోవచ్చు. మదిని కట్టిపడేస్తూ కనువిందు చేస్తున్న ఈ అందాలు.. మన కుమురంభీం జిల్లాలోనే ఉన్నాయి. లింగాపూర్ మండల సమీపంలో ఈ జలపాతాలు హోయలొలికిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. సప్తగుండాలుగా పిలిచే ఏడు జలపాతాలు మదిని పులకరింపజేస్తున్నాయి. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రామ గుండం, సీత గుండం, లక్ష్మణ గుండం, భీమ గుండం, సవితి గుండం, చిరుతల గుండం, సప్తగుండం అనే ఏడు గుండాలను కలిపి మిట్టె జలపాతం అని పిలుస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద చేరడంతో ఎత్తైన కొండల నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను కట్టిపడేస్తోంది. కుమురంభీం జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని గతంలో పనిచేసిన కలెక్టర్ చంపాలాల్ సందర్శించడంతో మరింత వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరజిల్లాల్సిన ఈ ప్రదేశం.. సరైన రోడ్డు మార్గం లేకపోవడంవల్ల ప్రాచుర్యం సంతరించుకోలేకపోతోంది. ఇవే కాకుండా ఈ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో అనేక జలపాతాలు ఉన్నా ఇన్నాళ్లూ అవి బాహ్య ప్రపంచానికి పరిచయం కాలేదు. -
జలపాతాల కనువిందు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన అడవుల్లోని కొండల మధ్య జాలువారుతున్న దృశ్యాలు చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అడవుల్లో అందాలు దాగి ఉన్న అందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జలపాతాల వద్ద సరైన వసతులు లేకున్నప్పటికీ పర్యాటకుల సంఖ్య ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉంది. పలు జలపాతాల వద్దకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పిస్తే మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు లేకపోలేదు. సాక్షి, ఆసిఫాబాద్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతల మాదర, గుండాల జలపాతం సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. చింతలమాదర జలపాతానికి చేరుకోవాలంటే మండల కేంద్రం నుంచి 15కిలో మీటర్ల వయా సుంగాపూర్ వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మూడు కిలో మీటర్ల ముందు నుంచి నడకనే ద్వారానే వెళ్లడం సాధ్యమవుతుంది. మండలంలోని మరో జలపాతం గుండాల. ఈ జలపాతం చేరుకోవాలంటే 16కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందులో 10కిలో మీటర్లు వయా రోంపెల్లి మీద నుంచి వాహనాల ద్వారా వెళ్లవచ్చు. మిగత ఆరు కిలో మీటర్లు దట్టమైన అడవి కొండలపై నడుచుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం పర్యాటకులకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని గురిస్తే అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకర్షిస్తున్న కుంటాల రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతమిది. తెలంగాణ నయాగార పిలుచుకునే ఈ వాటర్‌ఫాల్స్ టీవీ సీరియల్స్ ద్వారా మనకు సుపరిచితమే. ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల వద్ద ఉంది. ఈ జలపాతం చుట్టూ దట్టమైన కుంటాల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అయితే ఇప్పటివరకు జలపాతం జలధారతో ఉట్టిపడింది. ఇప్పుడు వర్షాలు లేక జలధార బోసిపోయి కనిపిస్తుంది. అయినప్పటికీ పర్యాటకుల తాకిడి తగ్గడంలేదు. జలపాతం అందాలను ఆస్వాదించి వెనుదిరుగుతున్నారు. సముతుల గుండం వర్షాకాలంలో ప్రకృతితో పరశించిపోతున్న సుముతుల గుండం జలపాతం కుమురం భీం జిల్లా నుంచి 26కిలో మీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కలదు. జిల్లా నుంచి వాహనాలు బలంపూర్ 21కిలో మీటర్ల వరకు రోడ్డు సౌకర్యాల కలదు. మిగతా 5కిలో మీటర్ల వరకు దట్టమైన అడవి పెద్ద పెద్ద రాళ్లు మధ్యలో కాలినకతో వెళ్లాల్సి వస్తోంది. ఆసిఫాబాద్ మండలంలోని ఏకైక జలపాతానికి సంబంధిత అధికారులు రోడ్డు సౌకర్యం కల్పిస్తే ప్రకృతి ప్రేమికులతో పాటు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తోందని స్థానికులు అంటున్నారు. వర్షాకాలంలో జలపాతం చుట్టు పచ్చని అటవితో పర్చుకుని నీరు జాలువారుతో అందరిని ఆకర్షిచే విధంగా ఈ జలపాతం ఉంది. -
ఎడ్లబండే 108
సాక్షి, నార్నూర్ (ఆసిఫాబాద్) : మండలంలోని మల్లెంగి గ్రామ పంచాయతీ పరిధిలోని బారిక్‌రావుగూడ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఎన్నికలప్పుడు అధికారులు, పాలకులు ఇచ్చిన హా మీలు నీటిమూటలుగానే మిగిలాయి. గిరిజనుల గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోడ్డు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్, ఐటీడీ ఏపీవో, స్థానిక పాలకులకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వాహనం 108 అం బులెన్స్ రాలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఎ వరికైన జ్వరం వచ్చిన లేదా అనారోగ్యానికి గురైన ఎడ్ల బండిలో వాగు దాటాల్సిందేనని వాపోతున్నారు. బారిక్‌రావుగూడ గ్రామానికి రోడ్డు మా ర్గం సరిగా లేకపోవడంతో దాదాపు 5 కిలో మీటరు కాలినడకన మల్లెంగి గ్రామానికి చేరుకోలి. గ్రామం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఆటోలు, 108 అంబులెన్స్‌లు రాలేని పరిస్థితి ఉందని గ్రామ పటల్ బారిక్రావు తెలిపారు. ఇప్పటికైనా బారిక్‌రావుగూడ వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆరచేతిలో ప్రాణాలు.. కాన్పు సమయంలో అందుబాటులో రవాణా సౌకర్యం లేకపోవడంతో ఏ రాత్రైనా ఎడ్ల బండిపై నార్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే. ఇప్పటి వరకు గ్రామంలో చాలా మంది గర్భిణులు ఇబ్బందిపడ్డారు. దాదాపు 12కిలో మీటర్లు ఎడ్ల బండిలో ప్రయాణించడం వలన అనారోగ్యానికి గురి కావడంతో పాటు ప్రాణాలను ఆరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లాదిస్తున్నారు. వర్షా కాలం వాగులో వరద నీరు భారీగా చేరడంతో రా కపోకలకు అంతరాయం ఏర్పాడుతోంది. ఖరీప్ సాగు పనులకు అవసరమయ్యే సరకులను ముందే విత్తనాలు, వస్తువులను ప్రజలు తెచ్చుకొని పెట్టుకుంటారు. అత్యవసర సమయంలో తాడు సహాయంతో వాగు దాటాల్సిందే. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు.. గ్రామ సమస్యలను జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లే దు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామస్తులు చెబుతున్నా రు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. వంతెన నిర్మించాలి బారిక్‌రావుగూడలో దాదాపు 150 కుటుంబాలు ఉంటాయి. కనీసం రోడ్డు లేదు. వాగుపై వంతెన లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. వర్షకాలంలో పరిస్థితి మరీ దారుణం. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు స్పందించి సౌకర్యాలు కల్పించాలి. – పూసం రూపాబాయి, సర్పంచ్, మల్లెంగి ఎండ్ల బండే దిక్కు గ్రామంలో జ్వరం వచ్చి నా.. గర్భిణులకు పురిటి నొ ప్పులు వచ్చినా.. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ రాదు. ఎండ్ల బండిపైనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అధికారులకు చెప్పినా పట్టించుకో వడం లేదు. రోడ్డు లేక చాలా గోసైతాంది. – నాగు, బారిక్‌రావుగూడ -
భర్త సహకారం మరువలేనిది
‘రాజకీయ జీవితంలో నా భర్త సోనేరావు సహకారం మరువలేనిది. రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చిన నాకు ఎక్కడా కూడా అభ్యంతరం చెప్పకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు ఏ పనిచేసినా ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోవాలన్నది నా అభిలాష’ అని అంటున్నారు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే, కుమురం భీం జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి. పాలిటిక్స్‌లోకి వచ్చాక పర్సనల్ లైఫ్ మిస్సవుతున్నానని అంటున్న ఆమె తన కుటుంబం, ప్రస్థానం తదితర అంశాలపై పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ఆదివాసీ మహిళగా ఉన్నతస్థాయి పదవులు అలంకరించిన కోవలక్ష్మితో ‘సాక్షి’ ఈ వారం పర్సనల్ టైం.. సాక్షి ఆసిఫాబాద్: మా సొంతూరు వాంకిడి మండలం బంబార. నాన్న కోట్నాక భీంరావు, మాజీ మంత్రి. మా నాన్నకు ఇద్దరు భార్యలు. అమ్మ భీంబాయి, చిన్నమ్మ సొంబాయి. మా అమ్మకు ఐదుగురు, చిన్నమ్మకు ఐదుగురు మొత్తం పది మంది సంతానం. నలుగురం అక్కాచెల్లెళ్లం. ఆరుగురు అన్నదమ్ములు. మా పెద్దన్నయ్య సంజీవ్ కుమార్ చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. మేం స్కూల్‌కు వేళ్లే సమయంలో నాన్న ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉంటూ నేను, మా చెల్లి సరస్వతి ఇద్దరం సెక్రెటేరియేట్ సమీపంలో ఉన్న పబ్లిక్ స్కూల్లో ఐదోతరగతి వరకూ చదువుకున్నాం. మంత్రి పదవీ కాలం పూర్తయ్యాక సొంతూరు బంబార ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. అప్పటికీ నేను హైదరాబాద్‌లో ఇంగ్లిష్ మీడియంలో 5వ తరగతి పూర్తిచేశాను. ఇక్కడికి వచ్చాక బంబార ఆశ్రమ పాఠశాలలో తెలుగు మీడియంలో మళ్లీ రెండో తరగతిలో వేశారు. సరస్వతిని ఒకటో తరగతిలో వేశారు. దీంతో నా చదవు సవ్యంగా సాగలేదు. పాఠశాల స్థాయిలోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టాల్సి వచ్చింది. చిన్న వయస్సులోనే పెళ్లి.. అప్పట్లో చాలా చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు అవుతుండే. 1986లో 17 సంవత్సరాలకే కోవ సోనేరావుతో నా వివాహం జరిగింది. మా అత్తగారిది తిర్యాణి మండలం బీంజిగూడ. పెళ్లైన మూడేళ్లకు మా ఆయనకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ముగ్గురు పిల్లలు అయ్యాక 1995లో మా ఆయన వాళ్ల తాత పెందోరు నాగు పంగడి మాదర ఎంపీటీసీగా నా పేరు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. అప్పడు ఆయన పంగిడి మాదర సర్పంచ్‌గా ఉన్నారు. నాకు ఇష్టం లేకున్నా పెద్దాయన పట్టుబట్టడంతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీటీసీగా విజయం సాధించా. అలా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. మొదట్లో కష్టంగా ఉండేది.. మొదటిసారి ఎంపీటీసీగా గెలుపొందినప్పుడు మా కొడుకు సాయినాథ్కు మూడేళ్లు. ఏదైనా స మావేశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. అలాగే ఇద్దరు అమ్మాయిల చదువు. నేను రాజకీయాల్లో ఉండలేనని అందరితో చెప్పాను. ఆ తర్వాత పిల్లల చదువుల కోసం ఆసిఫాబాద్‌కి వచ్చాం. ఇక్కడ కంఠ కాలనీలో మాకో ఇల్లు ఉండే ది. అక్కడ ఉండేవాళ్లం. ఆ తర్వాత 2001లో మళ్లీ ఎంపీటీసీగా పోటీ చేయాలని స్థానిక నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నాకు ఇష్టం లేదని, పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుందని చెప్పా. కాని ఎవరూ వినలేదు. అయిష్టంగానే రెండోసారి ఎంపీటీసీగా గెలుపొందడంతో తిర్యాణి ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఎంపీపీ అయినట్లు కూడా నాకు తెలియదు. ఎవరో ఇంటికి వచ్చి చెబితే తెలిసింది. మొదట అంత అయిష్టంగా ఉండే రాజకీయాలంటే. ఆ తర్వాత 2007లో ఆసిఫాబాద్ సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందాను. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో 2010లో టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరాను. మరోసారి 2013లో ఆసిఫాబాద్ సర్పంచ్‌గా పోటీ చేసి గెలిపొందాను. 2014లో సీఎం కేసీఆర్ సార్ నాకు టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాను. అంతేకాక కేబినెట్‌స్థాయి ర్యాంకుతో ఉన్న పార్లమెంటరీ సెక్రెటరీ పదవి ఇచ్చారు. మొదటి సారే నేను ఓ సహాయ మంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత 2018లో స్వల్ప ఓట్ల తేడా ఓడిపోయాను. కాని కేసీఆర్ గారు కుమురం భీం జిల్లా తొలి జెడ్పీచైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. జెడ్పీచైర్‌పర్సన్ అవకాశం రావడంతో రెండోసారి ఎమ్మెల్యేగా ఓడిపోయానన్న బాధను మరచిపోయాను. జిల్లా ఏర్పాటుతో సంతోషం.. సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న సమయంలో మా గిరిజన ప్రాంతాన్ని కూడా జి ల్లాగా ఏర్పాటు చేయాలని కోరాను. దీంతో ఆయన వెంటనే కొత్త జిల్లాకు ఓకే చెప్పడం, కు మురం భీం పేరు మీదుగా కొత్త జిల్లా ఏర్పడడం ఎంతగానో సంతోషాన్నిచ్చింది. అనుకున్నట్లుగానే జిల్లా ఏర్పడడంతో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. రాజకీయాల్లోకి రావొద్దన్నాను.. మా పెద్దమ్మాయి అరుణ ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో సర్పంచుగా పోటీ చేసినప్పుడు గాని ఇటీవల సిర్పూర్(యూ) నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయడం గాని నాకు ఇష్టం లేదు. రాజకీయాల్లోకి వద్దన్నాను. సిర్పూర్(యూ)లో నేను, అరుణ చేరో సెట్ నామినేషన్ వేశాం. నేను జైనూర్‌లో పోటీలో నిలబడాలని నిశ్చయంతో సిర్పూర్(యూ)లో ఉపసంహరించుకున్నాను. అదే సమయంలో మా అమ్మాయిని కూడా విత్‌డ్రా చేసుకోవాలని చెప్పా. బీ ఫాం కూడా వేరే వాళ్లకు అనుకున్నాం. కాని జైనూర్ నుంచి పోటీలో ఉండడంతో కనీసం మీ కూతురు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలని అక్కడి వారు కోరడంతో అలా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. చెల్లె, నేను ప్రత్యర్థులుగా తలపడ్డాం.. వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు బంధుత్వాలు ఉండవు. మా చెల్లి సరస్వతి, నేను ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా తలపడ్డాం. ఆ తర్వాత 2014లో నేను టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చెల్లి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అలా మేమిద్దరం అక్కాచెల్లెళ్లు అయినా వేర్వేరు పార్టీల్లో ఉండడంతో రాజకీయంగా ప్రత్యర్థులం అయినాం. నేర్చుకునేలా ప్రోత్సహించారు మా పెద్దమ్మాయి అరుణ డిగ్రీ పూర్తి చేసి పీజీ చేస్తూ ప్రస్తుతం సిర్పూర్(యూ) జెడ్పీటీసీగా కొనసాగుతోంది. రెండో అమ్మాయి మాన్విత ఎల్ఎల్ఎం పూర్తయింది. అబ్బాయి సాయినాథ్ బీబీఏ చదివాడు. నా రాజకీయ జీవితంలో మా ఆయన తోడ్పాడు ఎల్లప్పుడూ ఉంటుంది. నాకు స్వతహాగా తెలియని విషయాలను నాకు నేనే నేర్చుకునేలా ప్రోత్సహించారు. కుటుంబ సభ్యులందరి సహకారంతోనే ఈస్థాయిలో ఉన్నాను. ఉదయం నేను లేచే సరికే అనేక మంది ఇంటికి వస్తుంటారు. అలా ఉదయాన్నే ప్రజా దర్బార్ మొదలవుతుంది. వచ్చిన వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తా. రాజకీయాల్లో ఉన్నంత కాలం నా శక్తి మేర ప్రజాసేవ చేస్తా. -
విషాదం: ముగ్గురు యువకుల మృతి
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కౌటాల మండలం ముత్యంపేట్ గ్రామంలో ముగ్గురు యువకులు బావిలోకి దిగి ప్రమాదవశాత్తు మృతిచెందారు. ఒకరిని కాపాడటానికి మరోకరు బావిలోకి దిగి ముగ్గురు యువకులూ మరణించారు. మొదట రాజేష్ (26) అనే వ్యక్తి బావిలోకి దిగాడు, అతను ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో శ్రీనివాస్ (25) లోపలికి దిగాడు. వారిద్దరూ బయటకు రాకపోవడంతో వారిని కాపాడేందుకు మహేష్ (18) బావిలోపలికి దిగాడు. చివరికి ముగ్గురూ మృతి చెంది వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చారు. అయితే వారి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బావిలో విషవాయువులు ఏమైనా ఉన్నాయా?, లేక ఊపిరాడక చనిపోయారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా మృతదేహాలను బయటకు తీయడానికి ఎవరినీ బావిలోనికి దిగనీయడం లేదు. జేసీబీ యంత్రాలతో వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి వరకు సరదగా ఉన్న ముగ్గురు యువకులు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
గిరిజన చరిత్ర డిజిటలీకరణ
సాక్షి, ఆసిఫాబాద్: కేంద్ర బడ్జెట్లో జిల్లాకు నిరాశే మిగిలింది. దేశ వ్యాప్తంగా వెనకబడిన కుమురంభీం జిల్లా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఎటువంటి బడ్జెట్ కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ అస్ప్రిరేషనల్ జిల్లాలో కుమురం భీం జిల్లా ఒకటిగా ఉన్నప్పటికీ బడ్జెట్లో ఆ ఊసే లేదు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజన సాంస్కృతిని డిజిటలీకరణ చేస్తామని పేర్కొనడం జిల్లాలో గిరిజనుల కొంత ఊరట కలిగే అంశం. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ 2019–20 దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రాష్ట్రాల పరంగా తెలంగాణకు పెద్దగా నిధుల కేటాయింపులేవు. అందులోనూ జిల్లాలకు ప్రత్యేకించి ప్రస్తావన లేకపోవడంతో దేశ వ్యాప్తంగా ఈ వా ర్షిక సంవత్సరంలో అమలు చేయనున్న పలు పథకాల్లో జిల్లా ప్రజలకు అనాది నుంచి ఆదివాసీ, గిరిజనులు ఎంతో చరిత్ర కలిగినప్పటికీ వారిపై పరిశోధన, చరిత్ర అందరికీ అందుబాటులో లేదు. అయితే ఈ బడ్జెట్లో దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనుల సంస్కృతి, నృత్యం, ఆచారాలు, చరిత్రను డిజటలీకరణ చేయనున్నారు. చరిత్రను పుస్తకాల్లో కాక ఇక ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి భద్ర పర్చనున్నారు. దీంతో జిల్లాలో పోరాట యోధుడు కుమురం భీం చరిత్ర, జంగుబాయి, గిరిజన కట్టు బొట్టు ఆచార వ్యవహారాలు, గుస్సాడీ నృత్యాలు, తుడం వాయిద్యాలు, ఇతర సంప్రదాయాలకు సంబందించిన నృత్యాలతో పాటు హైమన్ డార్ఫ్ పరిశోధనలు, జోడే ఘాట్ లాంటి ప్రదేశాలు జిల్లాలో గిరిజన చరిత్ర డిజిటలీకరణ లో చోటు దక్కే అవకాశం ఉంది. రైతులకు మరింత భారం ఇక పెట్రోల్ డిజీల్ ధరలు పెరగడంతో రైతులకు, వాహనదారులకు మరింత భారం కానుంది. లీటరు పెట్రోల్, డిజిల్ కు రూ.1 చొప్పున సెస్ విధిస్తుండడంతో వ్యవసాయంలో ట్రాక్టర్లు, జనరేటర్లు, ఇతర సాగు చేసే యంత్రాల వినియోగంలో ఆర్థిక భారం పడనుంది. అయితే రైతు సంఘాల ఏర్పాటుతో రైతులకు కొంత లబ్ధితో పాటు చిరు దాన్యాల సాగు కోసం పప్పు దాన్యాల విప్లవం కోసం ప్రోత్సాహాకాలు అందిస్తే స్థానిక రైతులు పత్తి నుంచి పప్పుదాన్యాల పంటల వైపు మళ్లే అవకాశం ఉంది. గ్యాస్ సడ్సిడీతో మహిళలకు ఊరట పేదింటి మహిళకు కట్టెల పొయ్యి వాడే వారికి కొంత ఊరట కలగనుంది. దేశ వ్యాప్తంగా అందరికీ గ్యాస్ పొయ్యిలను సబ్సిడీ పై ఇచ్చేందుకు ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. ఇప్పటికే జిల్లాలో ఆరు గ్యాస్ ఎజెన్సీల పరిధిలో లక్ష వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మరో 10వేల మంది వరకు గ్యాస్ క¯ð క్షన్లు వరకు పొందాల్సి ఉంది. గిరిజన గూడెల్లో ఉండే మహిళలు ఇంకా కట్టెల పొయ్యిల మీదనే వంట చేస్తున్నారు. వీరికి లబ్ధి చేకూరనుంది. మహిళ సంఘాలకు ‘ముద్ర’ ఇప్పటి వరకు వివిధ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేందుకు ఇచ్చే ముద్ర రుణాలను ఇక నుంచి మహిళా సంఘాల సభ్యలకు ఇవ్వనున్నారు. ఒక మహిళా సంఘానికి ఒక లక్ష రూపాయల వరకు ముద్ర రుణాలను ఇవ్వనున్నారు. జిల్లాలో 7425 మహిళా సంఘాలు ఉండగా ఇందులో 80వేల మంది మహిళా సభ్యులు ఉన్నారు. అలాగే జన్‌ధన్ బ్యాంకు ఖాతా ఉన్న మహిళలకు రూ.5వేల వరకు ఓవర్ డ్రాప్ట్ నగదు తీసుకునే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా మహిళా సమ్మిళిత శిశు అభివృద్ధి పథకం కోసం 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.27వేల కోట్లు కేటాయించారు. అంతేకాక మహిళా సంక్షేమం అమలు చేసేందుకు ‘నారి తూ నారాయణీ’ అనే కమిటీ ఏర్పాటు కూడా చేయననున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి దేశ వ్యాప్తంగా కోటి మంది యువతకు వృత్తిలో నైపుణ్యతను సాధించేందుకు ప్రధాన్ మంత్రి కౌశల్ యోజనతో నైపుణ్యం కలిగించనున్నారు. జిల్లాలో దాదాపు 20వేల మంది యువత నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా. ఈ పథకం అమల్లోకి వస్తే జిల్లాలోని యువతకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అంతేకాక ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కోసం భారత్ నెట్ పథకం కింద ఇంటర్నెట్ సేవల పథకం ప్రారంభం కానుంది. రూ.45లక్షల లోపు ఇళ్లు కొనుగోలు చేసే వారికి ఇంటి రుణం పై ఆదాయపు రాయితీ రూ.1.5 మేర కొత్తగా కలగనుంది. దేశవ్యాప్తగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు, సాగుతోపాటు ప్రతి నివాసాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జిల్లాలో రోడ్డు సౌకర్యం లేని 300పైగా ఆవాసాలకు సౌకర్యం కలగనుంది. దీంతో గ్రామస్తులు కొంత ఊరట చెందుతున్నారు. -
‘పోడు’ బినామీలు
సాక్షి, ఆసిఫాబాద్: గిరిజనుల మాటున బడా బాబులు ‘పోడు’దందా సాగిస్తున్నారు. అనాది నుంచి ఆదివాసీలు అడవిని ఆధారం చేసుకుని సంప్రదాయ పోడు సాగు చేస్తున్నంత కాలం అటవీ ఆక్రమణలు పెరగలేదు. ఎప్పుడైతే అటవీ అధికారులపై గిరిజనేతర, స్థానిక లీడర్ల పెత్తనం మొదలైందో అప్పటి నుంచి అక్రమ కలప రవాణా, భూకబ్జాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో పెద్ద ఎత్తున పచ్చని అడవిని నరికి సుదూర ప్రాంతాలకు అక్రమంగా కలప రవాణా సాగించి కోట్లు గడించిన వారున్నారు. గత కొంత కాలంగా కలప రవాణా కాస్త తగ్గుముఖం పట్టడంతో అక్రమార్కుల కన్ను అటవీ భూములపై పడింది. కబ్జాలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున అటవీ భూములు సాగు చేస్తూ గిరిజనుల ముసుగులో అటవీ హక్కు పత్రాలకు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి మండలానికో నేత.. జిల్లా వ్యాప్తంగా ఒక్కో మండలంలో ఒక్కో నేత స్థానికంగా ఉన్న పలుకుడిని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున అటవీ భూములను చెరపడుతున్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అటవీ అధికారులు ఈ కబ్జాల వివరాలు సేకరిస్తున్నారు. కాగజ్‌నగర్ మండలం సార్సాల ఘటనలో ఇదే తీరుగా పెద్ద మొత్తంలో భూ కబ్జాలకు పాల్పడడంతోనే చినికి చినికి గాలివానలా మారి దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఇందులో చిన్న చిన్న రైతుల కంటే పెద్ద తలల చేతిలోనే ఎక్కువ భూమి కబ్జాలో ఉన్నట్లు తేలింది. ఇక ఇదే మండలంలో పట్టణంలో ఉండే అనేక మంది పెద్ద ఎత్తున అటవీ భూములను సాగు చేస్తున్నవారు. తమ అవసరాల కోసం ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఏటా పోడు సాగు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. రేగులగూడ, ఊట్పల్లి లాంటి గిరిజన గూడెల్లో ఎకరాకు అతి తక్కువగా ముట్టుజెప్పి గిరిజన భూములను సాగు చేస్తూ కొంత మంది వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. ఇక ఆసిఫాబాద్ మండలం మోవాడ్, సిరియన్ మోవాడ్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు కౌలు పేరిట తీసుకుని లబ్ధి పొందుతున్నారు. కెరమెరి మండలంలో ఓ నేత వందల ఎకరాల్లో అనేక గ్రామాల్లో ఏజెన్సీ భూములను చెరపట్టి రెవెన్యూ భూములుగా మార్చేపనిలో ఉన్నారు. కుమురం భీం ప్రాజెక్టు ముంపు ప్రాంతంతో పాటు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భూములను తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఇప్పటికే బదాలింపు చేయించారు. ఇందుకోసం స్థానిక రెవెన్యూ అధికారులు కూడా సహకరించడంతో పెద్ద మొత్తంలో అటవీ భూమి పట్టాలుగా మారింది. జైనూర్ మండల కేంద్రానికి చెందిన కొంత మంది వడ్డీ వ్యాపారులు తమ అప్పుల కింద భూములను తాకట్టు పెడుతున్నారు. వాంకిడిలో కొంత మంది వ్యాపారులు పెద్ద ఎత్తున వివాదాస్పద భూములు కొనుగోలు చేస్తున్నారు. వీటిపై పంట రుణాలు పొందడంతో పాటు పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం అందించడం మొదలైనప్పటి నుంచి పోడుకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ మరింత పెరిగిపోయింది. బెజ్జూరు లాంటి ప్రాంతంలోనూ గిరిజనేతరులు కొద్ది మంది పది ఎకరాల కంటే అధికంగా సాగు చేస్తున్నవారు ఉన్నారు. ఇలా అమాయక గిరిజనుల జీవనోపాధి కోసం మొదలైన పోడు రానురానూ ఓ వ్యాపారంగా మారుతోంది. మరోవైపు రెవెన్యూ, అటవీ సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చేందుకు సైతం కొంతమంది సమగ్ర భూ సర్వేలో పట్టాపాస్ పుస్తకాలు పొందేందుకు తప్పుడు పత్రాలు సృష్టించి మరీ తమ పేరున దరఖాస్తులు చేసుకుంటున్నారు. అమాయక గిరిజన రైతుల బలి.. బడా బాబులు అమాయక రైతుల ముసుగులో వందల ఎకరాలు కబ్జాలు చేస్తుండడంతో స్థానికంగా పోడు భూములపైనే ఆధారపడి జీవిస్తున్నవారికి అన్యాయం జరిగిపోయే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ముందుగా గిరిజనేతరుల కబ్జాలో ఉన్న అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ వేస్తోంది. ఎవరి దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయో వివరాలు సేకరిస్తోంది. అయితే కేవలం పోడు భూములపైనే పొట్టపోసుకునే అనేక మందికి తమ భూములు కూడా ఎక్కడ పోతాయోనని జిల్లాలో జరుగుతున్న వరస ఘటనలతో భయాందోళన మొదలవుతుంది ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీ పెంపకంలో భాగంగా కాగజ్‌నగర్, పెంచికల్పేట్, బెజ్జూరు, చింతలమానెపల్లిలో మొక్కలు నాటే పనిలో అటవీ అధికారులు ఉన్నారు. దీంతో చిన్న చిన్న రైతులు ఎకరం నుంచి మొదలై ఐదేకరాల లోపు ఉన్న వారు పోడు జీవనంగా బతికే వారికి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోడుపై స్పష్టమైన విధానం ప్రకటించి అర్హులను గుర్తించి న్యాయం చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. -
విలన్ కోనేరు కృష్ణనే!
సాక్షి, ఆసిఫాబాద్: కాగజ్‌నగర్ మండలం సార్సాలలో అటవీ అధికారులపై జరిగిన దాడుల్లో బుధవారం మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ హల్చల్ సృష్టించినట్లు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దాడుల్లో మొదటి నుంచి పకడ్బందీగా అన్నీ తానై వ్యవహరించారు. ఆ వీడియో ప్రకారం.. ఆదివారం ఉదయం సార్సాల గ్రామస్తులను వెంట బెట్టుకుని అటవీ అధికారుల వద్ద ఉన్న ట్రాక్టర్ యజమాని మేకల తిరుపతిపై దాడికి పాల్పడ్డాడు. తిరుపతిని విచక్షణారహితంగా కర్రలతో కొట్టినట్లు కనిపిస్తోంది. తన ట్రాక్టర్ రాలేదని అతను ఎంత చెప్పినా వినకుండా దాడికి తెగబడ్డాడు. కాగజ్‌నగర్ టౌన్ సీఐ కిరణ్‌కుమార్ అటవీ అధికారులను అడ్డుకున్న వారందరినీ జీపులో ఎక్కించుకుని వెళ్లే క్రమంలో పోలీసులను బెదిరించి జీపులో ఉన్న వారిని కృష్ణ కిందకు దింపేశారు. అనంతరం ఎఫ్ఆర్వో అనితను దుర్భాషలాడారు. ఆగ్రహంతో ఊగిపోతూ ఆమెపై కర్రతో దాడి చేశారు. అనంతరం అక్కడ కనిపించిన వారిపై దాడి చేస్తూ వెళ్లారు. కృష్ణ సార్సాల గ్రామానికి రాకముందు అటవీ అధికారులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చేటు చేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆయన అండతో గ్రామస్తులు సైతం కర్రలు చేతబూని దాడులకు తెగబడ్డారు. పోలీసుల ప్రేక్షక పాత్ర ఈ దాడుల్లో పోలీసుల ప్రేక్షక పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. సీఐ కిరణ్‌కుమార్ జీపులో ఉన్న వారందరినీ దింపుతున్నా కృష్ణకు ఎదురు చెప్పకపోగా.. ఆయన దాడులను చూస్తూ ఉండిపోయారు. 31 మంది అరెస్టు అటవీ అధికారులపై దాడులు చేసిన వారిలో బుధవారం వరకు మొత్తం 38 మంది నిందితులను గుర్తించగా.. ఇందులో 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు కోనేరు కృష్ణతో సహా వీరంతా ప్రస్తుతం ఆదిలాబాద్ జైలులో ఉన్నారు. -
ఖద్దరు మాటున కబ్జాలు
సాక్షి, ఆసిఫాబాద్: కన్ను పడిందంటే చాలు తమ ఆధీనంలోకి రావాల్సిందే. లేదు, కాదు అంటే అనుచరులను రంగంలోకి దింపి ఆక్రమణకు గురిచేయడమే. ప్రజాప్రతినిధి ముసుగులో ఉన్న కొంత మంది తీరు ఇది. ఖద్దరు మాటున యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతూ, ఎదురుతిరిగితే బాధితులను భయబ్రాంతులకు గురిచేయడం పరిపాటిగా మారింది. ఈ వ్యవహారం కుమురం భీం జిల్లాలో జోరుగా సాగుతోంది. అధికారం గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సిర్పూర్ నియోకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి భూదందాలు, కబ్జాలు రానురానూ తారాస్థాయికి చేరుతున్నాయి. సర్‌సిల్క్ మిల్లుకు సంబంధించిన భూముల్లో తన అనుచరుల్ని రెచ్చగొట్టి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. సర్‌సిల్క్ భూముల్లో తనకు వాటా ఇవ్వకుంటే రాత్రికి రాత్రే గుడిసెలు వేయిస్తాని బెదిరిస్తున్నారు. గత నెల 6లోపే పది ఎకరాల భూమి ఇవ్వాలని, లేకపోతే భూమి దక్కకుండా చేస్తానని చట్టబదంగా కొనుగోలు చేసిన యజమానికి సైతం డెడ్‌లైన్ విధించడం విశేషం. కాగజ్‌నగర్‌లో గత 34 ఏళ్ల క్రితం మూతపడిన సర్‌సిల్క్ వస్త్ర పరిశ్రమ కింద మొత్తం 808 ఎకరాల భూమి విస్తరించి ఉంది. ఇందులో ఫ్యాక్టరీ, వ్యాపార సముదాయం, నివాస స్థలాలు, క్వార్టర్లు, ఖాళీ స్థలంతో పాటు దీనికి సంబంధించిందే కోసిని, చింతగూడలో వ్యవసాయ భూములు ఉన్నాయి. 1985లో మిల్లు మూతపడే నాటికే ఈ భూముల్లో కొంత ఆక్రమణలు గురయ్యాయి. అప్పటికే ఐడీబీఐ బ్యాంకు, వర్కర్లకు కలపి రూ.35.84 కోట్లు బకాయిలు ఉన్నాయి. దీంతో మిల్లు భూములను కొంత కార్మికులకు ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి. ఆ తర్వాత 1991లో అప్పటి ఉమ్మడి హైకోర్టు అధికారికంగా లిక్విడేటర్‌ని నియమించి మిల్లు ఆస్తులను మదింపు చేయించింది. బకాయిలతో పాటు ఆస్తులను లెక్కగట్టి యాక్షన్‌కు పిలిచింది. భూములు కొనుగోలు చేసేందుకు మొత్తం 14 బిడ్డింగులు వచ్చాయి. ఇందులో మూడో బిడ్ వేసిన బి.వెంకట నారాయణరావు దాదాపు రూ.3 కోట్లతో మొత్తం 182 ఎకరాలకు యాక్షన్ చేయగా ఇందులో 156 ఎకరాలు అధికారికంగా ఇచ్చారు. అప్పటికే అందులో ఆక్రమణలు ఉండగా వారిని ఖాళీ చేయించి మరీ ఆయనకు ఇవ్వాల్సిందిగా ఆ సందర్భంలో పేర్కొన్నారు. అయితే ఆ ఆక్రమణలు ఖాళీ చేయకపోగా రానురానూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. 9 ఏళ్లుగా భూమి కోసం.. హైకోర్టు యాక్షన్‌లో పూర్తి డబ్బులు చెల్లించిన నారాయణరావుకు భూమి సర్వే చేసి హద్దులు చూపాల్సిందిగా 2011లో పేర్కొన్నారు. అయితే తొమ్మిదేళ్లు గడుస్తున్నా స్థానిక అధికారులు మాత్రం స్పందించడం లేదు. దీనిపై కలెక్టర్, ఎస్పీ, సీఎంవో కార్యాలయానికి, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, కోసిని గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు అనేక మందిని చట్టబద్దంగా కొనుగోలు చేసిన తన భూమిని ఇప్పించాలని వేడుకుంటున్నాడు. అయినా స్థానిక అధికారులు మాత్రం కనికరించడం లేదు. సర్వే కూడా చేపట్టడం లేదు. దీనికంతటికీ స్థానికంగా ఓ ప్రజాప్రతినిధే కారణం. ఆయనే చక్రం తిప్పుతుండడంతో అటు కబ్జాలు పెరగడంతో పాటు ఇటు మిల్లు భూములు అధికారికంగా కొనుగోలు చేసిన వారికి దక్కకుండా పోతున్నాయి. పదెకరాలు ఇవ్వాలని డెడ్‌లైన్.. హైకోర్టు లిక్విడిటేర్ ద్వారా కొనుగోలు చేసిన సర్‌సిల్క్ భూములకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఈ భూములు సిర్పూర్ వెళ్లే దారిలో ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్నాయి. ప్రస్తుతం ఎకరానికి రూ.కోటి వరకు ధర పలుకుతోంది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భూమిలో తనకు పదెకరాల భూమి ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి నారాయణరావుపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే తాను డబ్బులు పెట్టి కోనుగోలు చేసిన భూమిని ఎందుకు ఇవ్వాలని ఎదురుతిరగడంతో సర్వే చేపట్టకుండా అధికారులపై ఒత్తిడి తెస్తూ పెండింగ్‌లో ఉండేలా చేస్తున్నారు. తన భూములు సర్వే చేయాలని 2014లోనే రూ.14లక్షలు చెల్లించినా సర్వే అధికారులు స్పందించడం లేదని నారాయణరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయనకు భూమి స్వాదీనం చేయకపోగా, మరింత కబ్జాలను తన అనుచరులతో ప్రోత్సహిస్తున్నారు. ఇందులో అక్రమ కట్టడాలు, సెల్‌ఫోన్ టవర్లతో పాటు ఇతర నిర్మాణాలను చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ రకంగానైనా తన దారికి తెచ్చుకుని పదెకరాల భూమి పొందాలని సదరు ప్రజాప్రతినిధి యోచన. అనుచరులతో ఆక్రమణ.. తాను చట్టబద్దంగా కొనుగోలు చేసిన భూమిని ఎట్టి పరిస్థితిల్లోనూ ఇచ్చేది లేదని నారాయణరావు తెగించి చెప్పడంతో వివిధ సామాజికవర్గాలకు చెందిన వారిని కబ్జాలకు ఉసిగోలుపుతు చట్టబద్దంగా కొనుగోలు చేసిన భూమిని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ప్రయత్నంలోనే ఇటీవల ఎక్కడికక్కడ ఆక్రమణలు సాగుతున్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ దీనిపై వారం రోజుల్లో విచారణ జరపాలని కాగజ్‌నగర్ ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. అయినా స్పందన లేదని నారాయణరావు పేర్కొంటున్నారు. మరోవైపు కొత్త ఆక్రమణల్లో సర్‌సిల్క్ మిల్లు కార్మికుల కంటే కార్మికేతరులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కబ్జాలు చేసిన వారికి స్థానిక అధికారులు ఇళ్ల నంబర్లు ఇవ్వడంతో పాటు కరెంటు కనెక్షన్లు కూడా ఇచ్చారు. కొంత మంది గుట్టుగా నిర్మాణాలు కూడా సాగిస్తున్నారు. -
భర్తను కడతేర్చిన భార్య
సాక్షి, ఆసిఫాబాద్: తాగుడుకు బానిసై వేధింపులకు గురిచేస్తున్న భర్తను కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు ఇచ్చి కడతేర్చిన సంఘటన రెబ్బెన మండలంలోని లక్ష్మిపూర్‌లో మంగళవారం వెలుగుచూసింది. ఎస్సై దీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... రెబ్బెన మండలంలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన చౌదరి శంకర్ (34) 11 సంవత్సరాల క్రితం ఆసిఫాబాద్ పరిధిలోని చిలాటిగూడకు చెందిన రూపతో వివాహమైంది. ప్రస్తుతం వీరికి హరిక, కీర్తణ ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. ఇటీవల భార్యభర్తలకు తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శంకర్ తాగుడుకు బానిసగా మారాడు. సోమవారం సాయంత్రం శంకర్ కూల్‌డ్రింక్ కావాలని భార్యను కోరాడు. కూల్‌డ్రింక్ తెప్పించిన రూప బాటిల్లోని కొంత పిల్లలకు పోసి మిగిలిన దాంట్లో పురుగుల మందు కలిపి శంకర్‌కు ఇచ్చింది. దానిని తాగిన శంకర్ చేదుగా ఉందని భార్యను నిలదీశాడు. అప్పటికే శంకర్ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో స్థానిక ఆర్ఎంపీని పిలిపించి పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించేలోగా మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వికటించిన పెళ్లి భోజనం
నార్నూర్ (ఆసిఫాబాద్): పెళ్లి విందు భోజనం వికటించి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. 21 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో చోటు చేసుకుంది. నార్నూర్ మండలం కొత్తపల్లి–హెచ్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగూడ (గణపతిగూడ)లో ఇరవై కొలాం గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మిబాయి ఇంట్లో మంగళవారం పెళ్లి జరిగింది. బుధవారం విందు ఏర్పాటు చేశారు. భోజనం వికటించడంతో 24 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో చింటు, అయ్యు, కొడప ముత్తు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల మృతితో గిరిజనుల ఆగ్రహం పీహెచ్సీలో సకాలంలో వైద్యం అందకపోవడం, 108 రాకపోవడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారని ఆరోపిస్తూ బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఐటీడీఏ పీవో కొలాంగూడను సందర్శించి పరిస్థితిని ఆరా తీశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మిగతా వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో వసంతరావును ఆదేశించారు. -
ట్రాఫిక్ పోలీసుల తిట్ల పురాణం
ఆసిఫాబాద్ అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసు విధానం అమల్లో ఉంటే, జిల్లాలో మాత్రం కొంతమంది పోలీసుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద తరచూ పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఇదే తరహాలో మంగళవారం సాయంత్రం ఓ సివిల్ ఎస్సై, ఒక ట్రాఫిక్ ఎస్సై, ఏఎస్సై తమ సిబ్బందితో వాహనదారుల వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో ఆసిఫాబాద్‌కు చెందిన ఓ యువకుడు బైక్‌పై వస్తూ పోలీసులను చూసి దూరంగా వెళ్తున్న క్రమంలో విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ తిట్లపురాణం మొదలెట్టాడు. దీంతో ఆ యువకుడు తనను ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్సై మాత్రం తిట్టిన విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా యువకున్ని మరింత బెదిరించాడు. దీంతో ఆ యువకుడు దయచేసి తనను తిట్టవద్దని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమాన విధించాలి తప్పా ఇలా అసభ్య పదజాలంతో దూషించడమేమిటన్నారు. అక్కడే ఉన్న సాక్షి ప్రతినిధి ఇదంతా గమనించి ఆ యువకున్ని ఎందుకు దూషిస్తున్నారని పోలీసులను అడిగితే మీ పని మీరు చూసుకోండని దురుసుగా సమాధానం ఇచ్చారు. ఇటీవల ఓ ఏఆర్ కానిస్టేబుల్ మంచిర్యాల బస్టాండులో కదులుతున్న బస్సులోకి ఎక్కవద్దని సూచించినందుకు ఏకంగా ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో ఆవరణలోకి చొరబడి దాడి చేయడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగారు. రెండు గంటల పాటు బస్సులు నిలిపివేశారు. ఎట్టకేలకు ఉన్నతాధికారుల హామీతో ఆందోళన విరమించారు. తాజాగా బుధవారం సాయంత్రం పట్టణంలోని జన్కాపూర్ స్పెషల్ సబ్ జైలు ముందు ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ రెవెన్యూ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించినట్లు సదరు ఉద్యోగి వాపోయాడు. ఈ వరుస ఘటనలు జిల్లాలో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు తీరుకు అద్దం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
79 మంది విద్యార్థినులకు అస్వస్థత
సాక్షి, ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు, ఆహారం తిని 36 మంది విద్యార్థినినులు సోమవారం రాత్రి 11 గంటలకు అస్వస్థతకు గురికాగా, ఆ సంఖ్య మంగళవారం మధ్యాహ్నం వరకు 79కి చేరింది. బాధిత విద్యార్థినులు స్థానిక ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాగునీటి కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన బోర్ చెడిపోయి 20 రోజులైందని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ స్వర్ణలతకు చెప్పినా పట్టించుకోలేదనీ.. దీంతో 10 ఏళ్లుగా వాడకుండా నిరుపయోగంగా ఉన్న చేతిపంపు నీటిని తాగాల్సి వచ్చిందని వారు వాపోయారు. కాగా, పాఠశాలను డీటీడీవో దిలీప్‌కుమార్ సందర్శించి వంటశాల పరిసరాలను పరిశీలించి సంబంధిత అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందనీ, దీనిపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిర్లక్ష్యమే శాపం.. జిల్లాలో మొత్తం 40 ఆశ్రమ వసతి గృహాల్లో సుమారు 13 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ వసతిగృహాల్లో కనీస వసతులు కల్పించడం అటుంచి.. వాటిలో ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అధికారులు మేల్కోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వాంకిడి మండలంలోని బాంబార ఆశ్రమ పాఠశాలలో 30 మంది, తిర్యాణి మండలంలోని చెలమెల గురుకుల పాఠశాల 70 మంది, కౌటాల కేజీబీవీ పాఠశాలలో 50 మంది విద్యార్థులు కలుషిత ఆహరం తిని అస్వస్థతకు గురైన సంఘటనలు జరిగాయి. ఇలా ప్రతీ ఏడాది మూడు నాలుగు సంఘటనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు.. ఆయా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడం లేదని బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వారం నుంచి కడుపునొస్తుంది.. బోర్ పని చేయకపోవడంతో చేతి పంపు నీళ్లనే తాగినం. అవి తాగినప్పుటి నుంచి కడుపు నొప్పి వస్తోంది.మేడంకు చెప్పినా ఏం కాదన్నారు. ఇప్పుడు ఎక్కువయ్యే సరికి దవాఖానకు తీసుకొచ్చిన్రు. – కళ్యాణి, 8వ తరగతి చెప్పినా పట్టించుకోలేదు.. బోర్ నీళ్లు రావడం లేదని వార్డెన్‌కు, ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోలేదు. మురికి నీటితోనే వంటలు కూడా చేస్తున్నారు. సోలార్ ప్లాంట్లు పని చేయక చల్లనీళ్లే స్నానం చేస్తున్నం. – మౌనిక, 9వ తరగతి బాధ్యులను సస్పెండ్ చేయాలి ఇలా మళ్లీ జరగకుండా ఉండలంటే బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. విద్యార్థుల కోసం వచ్చిన నిధులను వారి కోసం ఖర్చు చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. -యూకే రాము, పాఠశాల చైర్మన్ ఇద్దరి సస్పెన్షన్ విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనలో సిబ్బం ది నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించి, ఇందుకు బాధ్యులుగా పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు స్వర్ణమంజుల, వార్డెన్ శాంతను సస్పెండ్ చేస్తున్నట్లు డీటీడీవో దిలిప్‌కుమార్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. విద్యార్థుల వసతి గృహాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలే తీసుకోకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. డీటీడీఓ దిలీప్ కుమార్ -
అభివృద్ధి కోసమే పార్టీ మార్పు
సాక్షి, తిర్యాణి: ఆసిఫాబాద్ నియోజక వర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ నుంచి మారాల్సి వస్తుంద ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించారు. డిసెంబర్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గిరిజన ప్రాంతాలలో ఆభివృద్ధి విషయమై చర్చించామన్నారు. గిరిజన ప్రాంతాలలో విద్య, వైద్యం, భూమి సమస్యలు కొకొల్లలుగా ఉన్నాయ ని వాటిని పరిష్కరించాలని కోరగా గిరిజన ప్రాంత అభివృద్ధికి తాము కోరిన విధంగా చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారని, కేసీఆర్ ఇచ్చిన హామీతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నామన్నారు. నియోజకవర్గం, మండలాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు సూ చించారు. గతంలో టీఆర్ఎస్లో పార్టీ లో ఉన్న కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు. ఇందు లో భాగంగా మండలంలో పర్యటించానని కార్యకర్తల అభిప్రాయాలను పంచుకున్నామన్నారు. తాము టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విధివిధానాలు రూపొందించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడంటే అపుడే పార్టీలో చేరతామన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పార్టీ నాయకులు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సక్కు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని కలిసి çపని చేస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాజి అనిల్‌గౌడ్, జెడ్పీటీసీ వెడ్మకమల, సింగిల్ విండో చైర్మన్ చుంచు శ్రీనివాస్, సర్పంచ్ సింధూజ, ఉపసర్పంచ్ తోట లచ్చయ్య, రిటైర్ట్ ఎంఈవో శంకర్, నాయకులు తోట భీమయ్య, పెరుమాండ్ల వెంకటేశం, గాజంగి మల్లేశ్, బుర్రరమేశ్, బ్రహ్మం, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
తీరనున్న ఇబ్బందులు
సాక్షి, నార్నూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవానంతరం పుట్టిన శిశువు పేరుతో తక్షణమే ఈ–బర్త్ పేరిట జనన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ మన్ననలు పొందే విధంగా చర్యలు చేపడుతోంది. అదే విధంగా పీహెచ్సీలలో సుఖ ప్రసవాలు జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని రకాల పరీక్షలు (రక్త, మూత్ర, షుగర్, బీపీ) చేయించుకునేందుకు హెమోటాలజీ ఎనలైజర్ మిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఇప్పటివరకు పీహెచ్సీలలో జరిగే ప్రసవ అనంతరం తక్షణమే కేసీఆర్ కిట్టు అందజేస్తున్నారు. దీంతో పాటు మరింత పారదర్శకంగా ఉండేందు కు 2019 జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవం జరిగే శిశువుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి అప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా ఈ–బర్త్ పేరిట జనన ధ్రువీకరణపత్రం జారీ చేస్తున్నారు. పీహెచ్సీ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణపత్రం ఆధారంగా సబంధి త మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో ఒరి జినల్ ధ్రువీకరణ పత్రం క్షణాల్లో పొందే అవకాశం కల్పించారు. దీంతో నిరక్షరాస్యులు భవి ష్యత్ అవసరాల నిమిత్తం అధికారుల చుట్టూ జన న ధ్రువీకరణ పత్రం పొందేందుకు కార్యాలయా ల చుట్టూ తిరిగే పరిస్థితికి చెక్ పెట్టారు. ఈ–బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నాం జనవరి ఒకటి నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పీహెచ్సీలో కాన్పు అయిన వారికి వెంటనే ఈ–బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నాం. ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియను చేపడుతున్నాం. దీంతో బాధితులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సర్టిఫికెట్ గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీలో చూపిస్తే వెంటనే సర్టిఫికెట్ జారీ చేస్తారు. –శ్రీకాంత్, పీహెచ్సీ వైద్యాధికారి, నార్నూర్ డాక్టర్లు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం -
రేషన్ కోట.. సరుకుల కోత
కెరమెరి: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం ప్రస్తుతం కనుమరుగైంది. రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు 9 రకాల సరుకులను అందించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కొంత కాలం పాటు సజావుగా సాగిన సరుకుల పంపిణీ ప్రత్యేక రాష్ట్రం తర్వాత ఆగిపోయింది. అప్పుడు పంపిణీ చేసిన 9 రకాల సరుకుల్లో ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ మాత్రమే సరఫరా అవుతున్నాయి. మూడు మాసాల క్రితం వరకు ఇచ్చిన పంచదార కూడా నిలిచి పోవడంతో ప్రధానంగా రేషన్ దుకాణాలు బియ్యానికే పరిమితమయ్యాయి. వాస్తవ పరిస్థితి ఇలా.. మండలంలోని 16 చౌరధరల దుకాణాల్లో నాలేగళ్ల క్రితం వరకు రేషన్ దుకాణాల్లో అన్ని రకాల సరుకులు దొరిగేవి. పేదలకు 9 రకాల సరుకులు ఇచ్చేవారు. తెలంగాణేర్పడిన తర్వాత బియ్యం. కిరొసోన్ తప్ప మరే ఇతర నిత్యావసర వస్తువులు అందడం లేదు.మండలంలో 16 చౌకధరల దుకాణాలున్నాయి. 8,446 రేషన్ కార్డులుండగా.. 194.568 క్వింటాళ్ల బియ్యంతో పంపిణీ అవుతుంది. కాగా 8,446 లీటర్ల కిరోసిన్ అందజేస్తున్నారు. వీరంతా పేదలు. ప్రభుత్వం కల్పించే నిత్యావసర సరుకులపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో బియ్యం, గోధుములు, చక్కెర, కందిపప్పు, ఉప్పు, మంచినూనె, కారంపొడి, పసుపు, చింతపండు, ఉప్పు, తదితర నిత్యావసర వస్తువులు ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రస్తుతం లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున బియ్యం. లీటరు కిరోసిన్ మాత్రమే అందిస్తున్నారు. పోరాగి సిద్ధించుకున్న తెలంగాణలో పూర్తి స్థాయి సరుకులు ఎందుకు సరఫరా చేయడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. బియ్యం కూడా నాణ్యతగా లేవని మహిళలు అంటున్నారు. కాగా ఒక బియ్యం బస్తాలో 3 నుంచి 4 కిలోల వరకు కోత వస్తుందని పలువురి ద్వారా తెలిసింది. లబ్ధిదారుల ఆందోళన అయితే ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఉన్న వారికి రేషన్ సరుకులు నిలిపి వేయనున్నట్లు ప్రకటించడంతో అనేక మందిలో ఆందోళన మొదలైంది. మండలంలో వివిధ గ్రామాల్లో అనేక మందికి 10 ఎకరాలు పైగానే సాగు భూముల పట్టాల ఉన్నాయని, అయినా వారందరు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం అనుకున్న ప్రకారంగానే 10 ఏకరాలు ఉన్నవారికి రేషన్ సరుకులు నిలిపి వేస్తే సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు చెందిన రేషన్ సరుకులు అందకుండా పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చేది బియ్యం, కిరోసిన్ అదికూడా నిలిపి వేస్తే ఏం తిని బతకాలని వారు ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. రేషన్ బియ్యం జోకుతున్న డీలర్ , కిరోసిన్ పోస్తున్న సిబ్బంది -
కలవరం
సాక్షి, ఆసిఫాబాద్: ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కు పార్టీ మార్పు ఎపిసోడ్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులకు ఈ మార్పు మింగుడు పడడం లేదు. రెండురోజులు గా జిల్లాలో జరగుతున్న పరిణామాలు కాంగ్రెస్, టీఆర్ఎస్ల అభిమానులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి రేపుతున్నా యి. ఈ నెల 2న కాంగ్రెస్ నుంచి ఆసిఫాబాద్, పినపాక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం కావడం తెలిసిందే. ఆ మర్నాడు పార్టీ మారడంపై కాంగ్రెస్ నేతలు ఇద్దరు ఎమ్మెల్యేలపై తీవ్రంగా విమర్శలు చేయడం సక్కు కూడా ఆ పార్టీ నేతలకు సోమవారం ఘాటుగా సమాధానం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం లో టీఆర్ఎస్లోని ఓ వర్గం మాత్రం ఒకింత ఆం దోళన వ్యక్తం చేస్తోంది. ఇన్నాళ్లు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న వారితో కలిసి పని చేయడం ఎ లా అని తర్జనభర్జన పడుతున్నారు. మొన్న జరి గిన ఎన్నికల్లో ఒకరినొకరు విమర్శించుకోవడంతో పాటు, పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా భా విస్తుండడంతో ఎవరూ కూడా ఈ పరిణామాలకు వ్యతిరేకంగా బహిరంగంగా నోరు మెదపడం లేదు. నాయకుల్లో కలవరం మొన్నటివరకు రాజకీయంగా ఆత్రం సక్కు, కోవ లక్ష్మీ వర్గాలు రాజకీయంగా శత్రువులుగా ఉన్నా యి. సక్కు పార్టీలో చేరికను ఆహ్వానిస్తున్నట్లు చె బుతున్నప్పటికీ భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని పలువురు ఆం దోళన చెందుతున్నారు. తమ నాయకత్వానికి ఎ క్కడ ముప్పు వస్తుందోనని భయపడుతున్నారు. ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మీ డిసెంబర్లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ పార్టీలో గుర్తింపును కాపాడుకుంటూ వస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకురాలు కావడంతో స్థానిక అధికారులతో సాధారణ ప్రజానీకంలోనూ ఆమె స్థానం చెదిరిపోకుండా ఉంది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఆమెకు ఎమ్మెల్యేగా ఎటువంటి అధికారికంగా ప్రొటోకాల్ లేకున్నప్పటికీ అనధికారంగా ఆహ్వానాలు అందుతున్నాయి. ఆమె వర్గానికి కూ డా అంతే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పదవి లేకున్నప్పటికీ అధికార యంత్రాంగంతో పనులు చేయించుకోవడంతోపాటు స్థానికంగా పలుకుబడి కాపాడుకుంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సక్కు పార్టీ మారడంతో ప్రస్తుత టీఆర్ఎస్ కేడర్‌లో ఆందోళన మొదలైంది. ఇక నుంచి అధికారంలో ఉన్న పార్టీతోపాటు పదవిలో ఉన్న ఎమ్మెల్యేకే అంతా ప్రాధాన్యం ఇవ్వడం సహజం గా జరుగుతుంది. తమవర్గం భవిష్యత్ ఎలా ఉం డబోతుందనే ఆలోచనలో పడ్డారు. అలాకాకుండా ఇరువర్గాలు ఒకరిని ఒకరు కలుపుకుపోతే ఏ గొడవ రాకపోవచ్చు. కానీ ఇప్పటికే టీఆర్ఎస్లో అంతర్గతంగా గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి. తాజాగా జరిగే ఈ గ్రూపు విభేదాలతో ఎవరికి అంతిమంగా లబ్ధి చేకూరనుందోనని కొంత మంది నాయకులు ఆందోళనలో పడుతున్నారు. భవిష్యత్‌లో పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సిర్పూర్ పరిస్థితి ఎదురైతే? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై రాజకీయ వర్గాలు జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నాయి. అక్కడ ఇదే తరహాలో 2014లో కావేటి సమ్మయ్య టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కోనేరు కోనప్ప చేతిలో స్వల్పతేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో బీఎస్పీ నుంచి పోటీచేసి గెలుపొందిన కోనప్ప టీఆర్ఎస్లో చేరికతో కావేటి రాజకీయ భవిష్యత్ ఇబ్బందుల్లో పడింది. కాలక్రమేణా పార్టీలోనూ పూర్తిగా పట్టుకోల్పోయారు. చివరకు శాసనసభ ఎన్నికల ముందు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆసిఫాబాద్‌లో కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తుండడంతో కార్యకర్తలు కలరపాటుకు గురవుతున్నారు. కొత్తగా చేరేవారి ఆధిపత్యం పార్టీలో మొదలైతే తమ పరిస్థితి ఏమిటనేది తలచుకుంటే భయంగా ఉందని పార్టీలో సీనియర్‌గా ఉన్న ఓ నాయకుడు చెప్పుకొచ్చాడు. అయితే కొందరు మాత్రం పార్టీలో ఎంత మంది చేరినప్పటికీ ఎవరి గుర్తింపు వారికి ఉంటుందని చెబుతున్నారు. ఇరువర్గాలు సమన్వయంతో ముందుకు వెళ్తామంటున్నారు. పార్టీ అధిష్టానం ఇరువురికి తగిన న్యాయం చేస్తుందని సిర్పూర్ తీరు ఇక్కడ ఉండబోదని ధీమాగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మాత్రం పార్టీలో ఎవరూ చేరిన తమకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అందరితో కలిసి పని చేస్తామని చెబుతున్నారు. అయితే వచ్చే పార్లమెంటు, పరిషత్ ఎన్నికల్లో ఇరువర్గాల నుంచి కింది స్థాయిలో కేడర్ ఏ మేరకు కలిసి పని చేస్తాయో వేచిచూడాలి. -
మామపై కత్తితో అల్లుడి దాడి..
రెబ్బెన(ఆసిఫాబాద్): కక్షతో మామపై కత్తితో అల్లుడు దాడి చేసిన సంఘటన రెబ్బెనలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై దీకొండ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాపూర్‌కు చెందిన జాగిరి చంద్రయ్య తన కూతురు క్రిష్ణవేణిని పదేళ్ల క్రితం రెబ్బనకు చెందిన నానవేని లింగన్నకు ఇచ్చి వివాహం చేశాడు. తాగుడుకు బానిసైన లింగన్న భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. ఈక్రమంలో పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ కూడా జరిగింది. అయినా లింగన్న ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈక్రమంలోనే లింగన్న అన్నదమ్ములతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు రాగా చంద్రయ్య చేరదీశాడు. అయినా మారని లింగన్న భార్యను నిత్యం కొట్టేవాడు. ఇదే క్రమంలో చంద్రయ్య ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోయి వేరే చోట ఉన్నాడు. అప్పుడు తన మేనత్త పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె కేసు పెట్టి జైలుకు పంపింది. జైలులో ఉన్న తనకు భార్య, మామ బెయిల్ ఇప్పించలేదని కక్ష పెంచుకున్నాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చిన లింగన్న మామపై కక్షతో దాడి చేసేందుకు పథకం పన్నాడు. ఆదివారం రాత్రి గంగాపూర్ నుంచి రెబ్బెనకు వస్తున్న చంద్రయ్యను మండల కేంద్రంలోని పోస్టాఫీస్ ఎదుట అడ్డగించి వెంట తెచ్చుకున్న కత్తితో లింగన్న దాడికి పాల్పడ్డాడు. గమనించిన చంద్రయ్య తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎడమ కంటి బొమ్మపై తీవ్రగాయమైంది. చంద్రయ్య ఫిర్యాదుతో లింగన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్ల డించారు. -
ఎదురుకాల్పుల్లో తెలంగాణ జవాన్ మృతి
సాక్షి, ఆసిఫాబాద్: దేశ భద్రత కోసం ఆర్మీలో చేరిన తెలంగాణకు చెందిన ఓ జవాన్ అమరుడయ్యాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లికి చెందిన ఆర్మీ జవాన్ దక్వా రాజేష్ శ్రీనగ్‌ర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజేష్ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జమ్మూ కశ్మీర్లో గత కొంతకాలంగా విధులు నిర్వర్తిస్తున్న రాజేష్.. విధుల నిర్వహణలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పోల్లో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాటుచేశారు. ఈరోజు సాయంత్ర వరకు మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. -
సమాచారం ఇస్తే రూ.5లక్షల బహుమతి
సాక్షి, ఆసిఫాబాద్: మావోయిస్టుల సమాచారం తెలిపిన వారికి రూ.5లక్షల బహుమతి ఇస్తామని ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ఇద్దరు యాక్షన్ టీం సభ్యులు పట్టుబడ్డ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు ఎస్పీ గోద్రుతో కలిసి నిర్వహించిన సమావేశంలో నిషేధిత మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం సభ్యుల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మావోయిస్టు పార్టీకి చెందిన యాక్షన్ టీం సభ్యులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. యాక్షన్ టీంల సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణలో జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రజాపోరాటం ముసుగులో శాంతి యుతవాతావరణం విచ్ఛిన్నం చేసేలా మావోయిస్టులు ప్రజాఆస్తులను విధ్వంసం చేసి సాధించేది శూన్యమన్నారు. జిల్లాలో నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తులు యాక్షన్ టీమ్ సభ్యులుగా ఏర్పడి రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా చేసుకొని పనిచేయుటకు అవకాశం ఉన్నందున ముందస్తుగా జిల్లా ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకున్న గ్రామాల్లో వారి కదలికలను పసిగట్ట వారి చర్యలను నిర్వీర్యం చేసేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మావోయిస్టులను గుర్తించేందుకు వీలుగా వారి ఫొటోలతో కూడిన పోస్టర్‌ను ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విడుదల చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోస్టర్లలో ఉన్న మావోయిస్టుల సమాచారం తెలిపిన వారికి పారితోషికం ఇవ్వడంతోపాటు, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా ప్రొజెక్టర్ ద్వారా మావోయిస్టుల చిత్రాలను చూపించారు. సమావేశంలో రిజర్వ్ ఇన్పెక్టర్ శేఖర్‌బాబు, ఐటీకోర్ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మరో మూడు కొత్త పురపాలికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. గిరిజన ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, ఆసిఫాబాద్, సారపాకలను మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అనుమతులు కోరుతూ గవర్నర్ నరసింహన్ కార్యాలయానికి కొన్ని నెలలకిందట పురపాలక శాఖ పంపిన ప్రతిపాదనలకు కదలిక వచ్చింది. ఈ ప్రతిపాదనలపై తాజాగా గవర్నర్ కార్యాలయం వివరణలను కోరింది. గవర్నర్ కార్యాలయం నుంచి అనుమతులు వస్తే ఈ ప్రాంతాలను మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయని పురపాలక శాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి. 173 గ్రామ పంచాయతీల విలీనంతో రాష్ట్రంలో 68 పురపాలికలను ఏర్పాటుచేస్తూ గత మార్చిలో ప్రభుత్వం శాసనసభలో రాష్ట్ర మునిసిపాలిటీల చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, జీహెచ్ఎంసీ చట్టాలకు సవరణలు జరిపిన విషయం తెలిసిందే. అప్పుడే ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, ఆసిఫాబాద్, సరపాకలతో పాటు ఉట్నూరును సైతం మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో ఈ నాలుగు ప్రాంతాలు ఉండడంతో మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరిగా మారింది. గవర్నర్ కార్యాలయం నుంచి అనుమతులు లభించకపోవడంతో అప్పట్లో 68 కొత్త మునిసిపాలిటీల ఏర్పాటుతో ప్రభుత్వం సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఉట్నూరు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గవర్నర్ కార్యాలయం నుంచి అనుమతులు లభించిన తర్వాత భద్రాచలం, ఆసిఫాబాద్, సరపాకలను మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ ప్రారంభించనుంది. -
పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు
కొమురం భీం ఆసిఫాబాద్: పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం నుంచి రద్దు చేసింది. పెద్దంపేట నుంచి మంచిర్యాల వరకు రైల్వే మరమ్మతులు జరుగుతుండటంతో ఈ నెల 8 వరకు రద్దు చేస్తున్నట్లు స్థానిక రైల్వే అధికారులకు ఉత్తర్వులు అందాయి. కరీంనగర్ నుంచి సిర్పూర్( రైలు నెంబర్ 77255), సిర్పూర్ నుంచి కరీంనగర్(77256), కాజీపేట్ నుంచి బల్లర్ష(77121), సిర్పూర్ నుంచి కాజీపేట్(57122), అజ్ని నుంచి కాజీపేట్(57135), కాజీపేట్ నుంచి అజ్ని(57136) మధ్యలో నడిచే రైళ్లను రద్దు చేశారు. కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును కాజీపేట్ నుంచి సికింద్రాబాద్ వరకు మాత్రమే నడుస్తుంది. -
గ్రామస్వరాజ్ అభియాన్ ఖాతాలు తెరవాలి
ఆసిఫాబాద్ : గ్రామ స్వరాజ్ అభియాన్ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించి ఖాతాలు తెరవాలని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, ఐకేపీ ఏపీఎంలతో సమీక్షించారు. గ్రామస్వరాజ్ అబియాన్ యోజనలో ఏడు రకాల పథకాలు ఉన్నాయన్నారు. వీటిలో ముఖ్యంగా ధన్జన్యోజన, సురక్ష, జీవన జ్యోతి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఇందుకు సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా మండలాల వారీగా గ్రామాల్లో చేసిన సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి చేసిన సర్వే నివేదికను ఎల్డీఎంకు సాఫ్ట్ కాపీలను అందజేయాలని ఆదేశించారు. ఇంతుకు ముందు ఈ స్కీములో ఖాతాలు తెరిచిన వారిని రెన్యూవల్ చేయాలన్నారు. గ్రామాల వారీగా సర్వే పూర్తి చేసి వారం రోజుల్లో ఖాతాలు తెరిపించేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో పీడీ వెంకటి, ఎల్డీఎం చెంచు రామయ్య, ఎస్బీఐ మేనేజర్ కృష్ణమాచారి, జిల్లాలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు, ఏపీడీ రామకృష్ణ, జిల్లాలోని ఐకేపీ ఏపీఎంలు పాల్గొన్నారు. -
ర్యాంకుల్లో భారీగా ఎగబాకిన ఆసిఫాబాద్ జిల్లా!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలోని వెనుకబడిన జిల్లా ఆసిఫాబాద్ జిల్లా అద్భుతమైన పురోగతి సాధిస్తోందని నీతి ఆయోగ్ తాజా నివేదిక చాటుతోంది. దేశంలో వెనుకబాటు నుంచి పురోగమి పథంలో సాగుతున్న జిల్లాల జాబితాను తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈ జాబితాలో గతంలో వందో స్థానంలో ఉన్న ఆసిఫాబాద్ జిల్లా అద్భుతమైన పురోగతితో 15వ స్థానానికి ఎగబాకింది. విద్య, వైద్యం, వ్యవసాయం, సమ్మిళిత ఆర్థిక వృద్ది, మౌలిక సదుపాయాల ఆధారంగా జిల్లాలకు నీతి ఆయోగ్ ర్యాంకులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా వెనుకబడిన 115 జిల్లాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఆశావహ జిల్లాల అభివృద్ధి పథకం (ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ స్కీమ్) అని దీనికి నామకరణం చేసింది. తెలంగాణ నుంచి భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఖమ్మం తదితర వెనుకబడిన జిల్లాలు ఈ పథకంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం, విశాఖపట్నం, కడప తదితర జిల్లాలు ఉన్నాయి. -
అన్న చేతిలో తమ్ముడు హతం
రెబ్బెన(ఆసిఫాబాద్): భూ వివాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భూముల పంపకం విషయంలో తలెత్తిన గొడవలు చివరకు హత్యకు దారితీశాయి. వరుసకు తమ్ముడినే అన్న అతి కిరాతకంగా చంపిన ఘటన బుధవారం ఉదయం రెబ్బెన మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. నాయిని లచ్చయ్య(33) వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయనకు భార్య ప్రమీల, కూతుళ్లు పోషక్క, అక్షయ ఉన్నారు. లచ్చయ్యకు వరుసకు అన్న అయిన నాయిని వెంకటేశ్ గత 6 ఏళ్ల క్రితం తిర్యాణి మండలంలోని దేవాయిగూడ నుంచి ధర్మారం గ్రామానికి వలస వచ్చాడు. లచ్చయ్య ఇంటికి సమీపంలోనే అతను ఉంటున్నాడు. ఈ క్రమంలో గత సంవత్సర కాలంలో లచ్చయ్యకు, వెంకటేశ్‌కు మధ్య భూముల పంపకం విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. పలుమార్లు పెద్ద సమక్షంలో పంచాయతీ పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. బుధవారం ఉదయం చేనులో దుక్కి దున్నేందుకు లచ్చయ్యతోపాట భార్య ప్రమీల నంబాలకు వెళ్లి ట్రాక్టర్‌ను మాట్లాడి ఇంటికి చేరుకున్నారు. అన్నం వండితే తిని చేనుకు వెళ్దామని లచ్చయ్య భార్యతో చెప్పడంతో ప్రమీల ఇంట్లోకి వెళ్లి వంట పనిలో నిమగ్నమైంది. లచ్చయ్య మాత్రం ఇంటి ముందు మాట్లాడుకుంటూ ఉండగా గమనించిన వెంకటేశ్ గొడ్డలితో ఒక్కసారిగా లచ్చయ్య చెవి కింది భాగంపై దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై లచ్చయ్య అక్కడిక్కక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న రెబ్బెన సీఐ పురుషోత్తం వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు దారి తీసిన సంఘటనపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
తాగిన మైకంలో ఒకరిపై దాడి
ఆసిఫాబాద్‌క్రైం: తాగిన మైకంలో దాడి చేసిన ఘటన మండలంలోని దాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బోందల శంకరయ్య(35) తరచూ మండలంలోని దాంపూర్‌లో నివాసముండే నాందేవ్ ఇంటికి వస్తుండేవాడు. ఈక్రమంలో గురువారం దాంపూర్ వచ్చిన శంకరయ్య, నాందేవ్‌తో కలసి మద్యం తాగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో పక్కనే ఉన్న గొడ్డలితో నాందేవ్, శంకరయ్య తల, కుడుపు భాగంలో బలంగా దాడి చేశాడు. గమనించిన స్థానికులు శంకరయ్యను 108 అంబులెన్స్‌లో ఆసిఫాబాద్‌లోని ప్రభు త్వాసుప్రతికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. గొడవకు గల కారణాలు తెలియరాలేదు. బంధుమిత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల కుప్పలా తెలంగాణ: భట్టి విక్రమార్క
సాక్షి, అసిఫాబాద్ : మిషన్ భగీరథ పథకం పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు. ఆయన బుధవారం అసిఫాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలకు మంచి నీళ్లు అందించాలనే సంకల్పంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాగునీటి పథకాలకు భగీరథ అనే పేరు మార్చి నిర్వీరం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు మొదలు పెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కమీషన్ల కోసమే రీడిజైన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసం ప్రాణహిత-చేళ్లతో పాటు, రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను మొదలు పెట్టి 70 నుంచి 80 శాతం పూర్తి చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల్లో చుక్కనీరు లేకుండా చేసిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలా మారిపోవడం ఖాయమని భట్టి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఇంటికి పంపాలని ప్రజలకు భట్టి పిలుపు ఇచ్చారు. -
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
రెబ్బెన(ఆసిఫాబాద్) : వివాహేతర సంబంధా నికి అడ్డుగా ఉన్నాడని ఏడడుగులు నడిచిన భార్యే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నర్సయ్య(36) సోమవారం రాత్రి భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురయ్యాడు. నర్సయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 15 ఏళ్ల క్రితం నర్సయ్యకు జ్యోతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కాపురం సజావుగా సాగుతుండగా ఆర్నెళ్ల క్రితం జ్యోతి గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇటీవలే నర్సయ్యకు తెలిసింది. అప్పటి నుంచి భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి సైతం గొడవ జరిగింది. రాత్రి భోజనం అనంతరం నర్సయ్య ఇంటి ఎదుట నిద్రపోయాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతున్నాడని జ్యోతి నర్సయ్య హతమార్చేందుకు ఇదే అదునుగా భావించింది. ప్రియుడు శ్రీనివాస్‌ను పిలిపించుకుంది. ఇద్దరు కలిసి నర్సయ్య గొంతు నులుమి హత్య చేశారు. అనంతరం ఇంట్లో చీరతో ఊరి వేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మతదేహాన్ని పరిశీలించారు. మతుడి గొంతుపై గాయాలను గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు. జ్యోతి విచారించగా అసలు విషయం బయటపడింది. మతుడి తమ్ముడు సంతోశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెబ్బెన ఎస్సై శివకుమార్ తెలిపారు. -
‘ఆదివాసీ ఉద్యమాన్ని అణచివేస్తున్న సీఎం’
సాక్షి,ఆసిఫాబాద్: సీఎం కేసీఆర్ ఆదివాసీ ఉద్యమాన్ని అణగదొక్కుతూ, లంబాడాలకు వత్తాసు పలుకుతున్నారని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెస్రం మోతీరాం, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాయిసెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో లంబాడాలతో సమావేశం నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఆదివాసీల సమస్యను పక్కన పెట్టి గ్రామ పంచాయతీల పేరుతో తండాలకు ప్రాధాన్యం కల్పించడం బాధాకరమన్నారు. గత నాలుగు నెలలుగా ఆదివాసీ ఉద్యమం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం శోఛనీయమని పేర్కొన్నారు. టీఆర్టీలో లంబాడాలకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించవద్దని డిమాండ్ చేశారు. అలాంటి పరిస్థితి వస్తే ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తామని హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారంలో భాగంగా ఈ నెల 9న నార్నూర్‌లో పెద్ద ఎత్తున ఆదివాసీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, ఈ సమావేశానికి ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో ఏటీఈ జిల్లా అధ్యక్షుడు కొట్నాక తెలంగరావు, ప్రధాన కార్యదర్శి కొట్నాక ప్రవీణ్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి గెడం గోపీచంద్, ఏవీఎస్ జిల్లా ఇన్చార్జి కొట్నక గణపతి, సంఘ నాయకులు మడావి గణవంత్‌రావు, కొట్నాక మెహపత్‌రావు, వెడ్మ బాదు పటేల్, సుధాకర్, ఆత్రం అనిల్, సిడాం శంకర్ పాల్గొన్నారు. -
కెమెరాకు చిక్కిన చిరుతలు
ఆసిఫాబాద్ : రెండు చిరుత పులులు పశుకళేబరాన్ని తింటూ కెమెరాకు చిక్కాయి. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని సిర్పూర్ రేంజి ప్రాంతంలో ఈ నెల 28న రెండు చిరుతలు పశు కళేబరాన్ని తింటూ అటవీ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కాయి. సాధారణంగా చిరుతలు ఒంటరిగా వేటాడడం, సంచారిస్తుంటాయని ఏదైనా వేటాడిన జంతువును రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి స్వీకరస్తాయని కాగజ్‌నగర్ డివిజన్ అటవీ అధికారి ఎన్.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సాధారణంగా ఇలా రెండు చిరుతలు ఎక్కడా ఒక చోట వేటాడడం ఉండదని ఇది అరుదని తెలిపారు. అయితే ఈ రెండు ఒకే తల్లి పిల్లలు లేక జత కట్టిన చిరుతలు అయితేనే ఇలా ఒక చోట ఉంటాయన్నారు. గతేడు డిసెంబర్‌లోనూ మూడు చిరుతలు ఒకె కెమెరాలో కన్పించాయని ఆయన గుర్తుచేశారు. చనిపోయిన పశువు యాజమానికి నష్టపరిహారం అటవీ శాఖ నుంచి చెల్లిస్తామని తెలిపారు. -
విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
నార్నూర్(ఆసిఫాబాద్): విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారితప్పాడు. పిల్లలను తన పిల్లల వలే చూసుకోవాల్సిన అతడు ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన నార్నూర్‌లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గిరిజన బాలిక పట్ల బయోసైన్స్ ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్ వారం రోజుల క్రితం అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలియడంతో విజయ్‌కుమార్‌ను ప్రధానోపాధ్యాయుడు జాదవ్ విఠల్ ఐటీడీఏ డీడీకి సరెండర్ చేశాడు. దీంతో అతడిని సస్పెండ్ చేస్తూ రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. వాట్సప్ ద్వారా విషయం బయటకు పొక్కడంతో కలెక్టర్ దివ్యదేవరాజన్ విచారణకు ఆదేశించారు. బుధవారం ఐసీడీఎస్ పీడీ మిల్కా పాఠశాలలో విచారణ జరిపారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆరా తీశారు. కాగా, బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బయోసైన్స్ ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేష్ తెలిపారు. ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు. బుధవారం పాఠశాలను సందర్శించి జరిగిన సంఘటనపై నిజనిర్ధారణ చేశారు. సదరు ఉపాధ్యాయుడిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటేశ్‌కు ఫిర్యాదు చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కన్నిబాయి, భాగుబాయి, ఇంద్రబాయి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని బంధువుల ఆందోళన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. ఐసీడీఎస్ పీడీ విచారణ జరుపుతుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల లోపలికి ఎవరినీ రానివ్వలేదు. గేటుకు తాళం వేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు గేటు తాళం పగులగోట్టి లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. సీఐ హనోక్ విద్యార్థిని తల్లిదండ్రులను లోపలికి అనుమతించడంతో శాంతించారు. -
ప్రయాణం.. ప్రమాదం
ఆసిఫాబాద్‌రూరల్ : పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజు ప్రమాదపుటంచున ప్రయాణిస్తున్నారు. ఏ రోజు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియకుండానే ప్రైవేటు వాహనాలు ఆటోల్లో పాఠశాలలకు వెళ్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది విద్యార్థులను ఆటోల్లో తీసుకెళ్తున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో విచ్చలవిడిగా ప్రైవేటు వహనదారులు రెచ్చిపోతున్నారు. భద్రత చర్యలను పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. లాభాపేక్షే ధ్యేయంగా.. లాభాల కోసం తప్పా విద్యార్థుల జీవితం గురించి అలోచించడం లేదు ప్రైవేటు వాహనదారులు. డబ్బుల కోసం ఒక్కో ఆటోలో సుమారు 10 నుంచి 13 మంది విద్యార్థులను కూర్చోబెట్టుకుని వెళ్తున్నారు. ఇతర వాహనాల్లో కూడ రెట్టింపు మందిని కూర్చోబెడుతున్నారు. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిరోజు ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోందని విద్యార్థులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రంగానే తనిఖీలు ప్రతిరోజు తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు నెలలో కనీసం రెండు సార్లైనా తనిఖీలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇష్టానుసారం ప్రైవేటు వాహనాల్లో విద్యార్థులను తీసుకెళ్తున్నారని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆ ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు తనిఖీలు చేపట్టక పోవడం వల్లనే ప్రైవేలు వాహనదారులు విచ్చలవిడిగా ప్రయాణికులకు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి, విద్యార్థుల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బస్సులు లేక పోవడంతోనే తప్పని పరిస్థితుల్లో ఆటోలు ఇతర వాహనాల్లో విద్యార్థులను పాఠశాలలకు పంపుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రానికి నిత్యం వేల మంది రాకపోకలు.. జిల్లాకు ప్రతినిత్యం ఏదో ఒక పని మీద రోజూ వందల మంది ప్రజలు, విద్యార్థులు జిల్లా కేంద్రానికి ఆటోల్లో వస్తున్నారు. మండలంలోని ఇటిక్యాల, బెల్గాం, ఖప్రి, వావుదాం, మోవాడ, వెంకటాపూర్, బాబాపూర్, అక్సాపూర్, మేటిగూడ, గుండిగూడ,» లంపూర్, అలీగూడ నుంచి విద్యార్థులే సూమారు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వస్తుంటారు. బస్సు సౌకర్యం లేక పోవడంతోనే ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నామని ప్రయాణాకులు, విద్యార్థులు తెలుపుతున్నారు. బస్సు నడపాలి బస్సు సౌకర్యం లేనందున ఆటో వాలాలు ప్రయాణికులను ఇష్టారాజ్యంగా ఎక్కస్తున్నారు. చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సు ఉంటే నెలకు రూ.150 ఖర్చవుతాయి. కానీ ఆటో రాడానికి నెలకు రూ.600 ఖర్చవుతున్నాయి. – రాజేశ్వర్, ఇంటర్ విద్యార్థి, బెల్గాం ఇబ్బందిగా ఉంది బస్సు సౌకర్యం లేనందున ఆటో వాలాలు 12 నుంచి 15 మందిని కుర్చొబెట్టి తీసుకెళ్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం గుప్పెట్లో పెట్టుకుని తప్పని పరిస్థితుల్లో ఆటోల్లో వస్తున్నాం. – సాయినాథ్, విద్యార్థి, ఇటిక్యాల బస్సు రాక ఆరు నెలలు గతంలో ఐదు నెలలు బస్సు సౌకర్యం కల్పించారు. ఇప్పుడు ఆరు నెలల నుంచి బస్సు రావడం లేదు. చాలా ఇబ్బందిగా మారింది. అధికారులు స్పందించి మళ్లీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. – భీమయ్య, బెల్గాం -
ఎరువు భారం
సాక్షి, ఆసిఫాబాద్ : ఎరువుల ధరలు పెరగనున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి ఎరువుల ధరలు పెంచనున్నట్లు ఎరువుల కంపెనీ లు నిర్ణయించాయి. దీంతో రైతులపై మరింత భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌లో రైతులకు ఎకరాకు రూ.4వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడంతో ఓ వైపు ఆనందం వ్యక్తం కాగా.. మరో వైపు ఎరువుల ధర పెంపు వార్తతో రై తులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకు పెరగడంతో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు కంపెనీలు చెబుతున్నాయి. గత రెండేళ్లుగా ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో సాగు పెట్టుబడులు అధికమై వ్యవసాయం రైతులకు భారంగా మారింది. ఫిబ్రవరి ఒకటి నుంచి యూరియా, కాంప్లెక్స్ ధరలు పెరుగుతా యని డీలర్లు పేర్కొంటున్నారు. టన్ను యూరి యాపై రూ.2,600 వరకు, టన్ను కాంప్లెక్స్ ఎరువులపై రూ.2,240 వరకు పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బస్తా డీఏపీ రూ.1,083 ఉండగా, రూ.1213కు పెంచనున్నారు. 28:28:0 కాంప్లెక్స్ ఎరువు బస్తా రూ.1122 ఉండగా, దీన్ని రూ.1234కు పెరుగుతుందని అంటున్నారు. అన్ని రకాల కంపెనీలపై బస్తాకు కనీసం రూ. వంద పెరగున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న సాగు ఖర్చులు రైతులకు భారంగా మారాయి. భూమి కౌలు ధరలు మొదలుకొని విత్తనాలు, ఎరువులతోపాటు వ్యవసాయ ఖర్చులు రైతులకు భారంగా మారింది. పత్తి రైతు ఎకరానికి సాగు ఖర్చు సుమారు రూ.30 వేలు అవుతుంది. ఈ ఏడాది గులాబీరంగు పురుగు పత్తి రైతులను, తెల్లదోమ వరి రైతులను నిలువునా ముంచింది. పురుగు ప్రభావంతో వరి, పత్తి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతోయాభై శాతం మంది రైతులకు పెట్టుబడులు వెళ్లని దుస్థితి నెలకొంది. ఏటా పెరుగుతున్న కౌలు భూముల ధరలు, పెరుగుతున్న ఎరువులు, విత్తనాల ధరలతో సాగు ఖర్చులు రైతులకు భారంగా మారుతున్నాయి. రైతులపై భారం.. ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం 1,17,918 హెక్టార్లు కాగా, ఖరీఫ్‌లో 1,17,918 హెక్టార్ల పంటలు సాగు చేయగా, 87,118 హెక్టార్ల పత్తి, 12,495 హెక్టార్ల కంది, 8281 హెక్టార్ల వరి, 3445 హెక్టార్ల సోయా, 1566 హెక్టార్ల జొన్న, 977 హెక్టార్ల మక్క, 1477 హెక్టార్ల పెసరు, 426 హెక్టార్ల మినుము, 40 హెక్టార్ల వేరుశనగ, 152 హెక్టార్ల మిరప, 26 హెక్టార్ల ఆముదంతోపాటు కూరగాయల పంటలు సాగు చేశారు. రబీలో మొక్కజొన్న 2312 హెక్టార్లు, మక్క 1419, కంది 236, మినుము 12, పెసలు 191, శనగ 1587, వరి 1616 హెక్టార్లు సాగు చేస్తున్నారు. పంట సాగుకు ఎకరాకు మూడు బస్తాల యూరియా, డీఏపీ 1, కాంప్లెక్స్ 1, పొటాష్ 1 బస్తా అవసరముంటుంది. ఈ లెక్కన బస్తాకు సుమారు రూ.ఒక వంద పెరగడంతో జిల్లా వ్యాప్తంగా ఏటా రైతులపై రూ.6.65 కోట్ల భారం పడుతుంది. ఎరువుల ధరలు నియంత్రించాలి రోజురోజుకు వ్యవసాయం సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కూలీల కొరత, పెరుగుతున్న ఎరువులు, విత్తనాల ధరలు రైతులకు భారంగా మారింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించపోవడంతో ఈ యేడాది దిగుబడి గణనీయంగా తగ్గింది. పెట్టుబడులు వెళ్లని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎరువుల ధరలు నియంత్రించాలి. – సేనాపతి, రైతు, ఆసిఫాబాద్ -
నా మాటలను వక్రీకరించారు
సాక్షి, ఆసిఫాబాద్: ఆదివాసీల ఉద్యమం వెనుక మాజీ మావోయిస్టులు ఉన్నారని తానెప్పుడూ అనలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కావాలనే కొందరు తన మాటలను వక్రీకరించారని పేర్కొనారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పిన మాటలను తాను చెబితే కొందరు వక్రీకరించారని అన్నారు. అల్లర్ల వెనుక మావోయిస్టులు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ, తాను కానీ ఎక్కడా అనలేదని తెలిపారు. కావాలనే కొంతమంది తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఆసిఫాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తాను డీజీపీ పేర్కొన్న విధంగా అలర్లను అదనుగా తీసుకుని అదృశ్యశక్తులు బలపడతాయనే విషయాన్ని చెప్పానే తప్ప ఆదివాసీ ఉద్యమానికి, మావోయిస్టులకు సంబంధం ఉందని చెప్పలేదని స్పష్టం చేశారు. ఆదివాసీల సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పరిష్కారం చూపుతుందన్నారు. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఏజెన్సీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అందరూ సమన్వయంతో మెలగాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమకు విన్నవిస్తే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. -
పింఛన్..పరేషాన్
సాక్షి, ఆసిఫాబాద్: ఇంటర్నెట్ సమస్య ‘ఆసరా’ లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. డిసెంబర్ నెల పూర్తయినా ఇంకా పింఛన్ డబ్బులు చేతికందకపోవడంతో వృద్ధుల్లో టెన్షన్ పెరుగుతోంది. పింఛన్‌పైనే పూట గడిపేవారు..మందులు అవసరం ఉన్న వారు, ఇతరాత్ర పనులకు నానా పాట్లు పడుతున్నారు. ఏజెన్సీలో ఆదివాసీ, లంబాడా ఆందోళనల నేపథ్యంలో గత పదిహేను రోజులుగా జిల్లాలో ఇంటర్నెట్ సేవలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలన్నీ ఇంటర్నెట్‌పైనే ఆధారపడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉండగా, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం సమస్యగా మారింది. ప్రతినెలా పంపిణీ చేసే ‘ఆసరా’ పింఛన్లు కూడా ఇంటర్నెట్‌పైనే ఆధారపడి ఉండడంతో డిసెంబర్ నెల పింఛన్లు నిలిచిపోయాయి. ప్రతినెలా ప్రభుత్వం పింఛన్ డబ్బులు విడుదల చేసి, కలెక్టర్ల ఆమోదం పొంది, పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పంపిణీ కార్యక్రమం పూర్తయ్యాక అందుకు సంబంధించిన అక్విటెన్స్లను పంపిణీ చేసిన సిబ్బంది ఉన్నతాధికారులకు అందజేస్తారు. ప్రతీ నెల ఒకటి నుంచి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు డిసెంబర్ నెల పింఛన్లు పంపిణీ జరగకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. లబ్ధిదారుల పాట్లు జిలాల్లోని 15 మండలాల్లో 50,017 మంది ఆసరా లబ్ధిదారులుండగా వీరికి ప్రతినెలా రూ.5.59 కోట్లు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.1000, వికలాంగులకు రూ.1500 అందిస్తున్నారు. వీరికి ప్రతి నెలా గ్రామపంచాయతీలు, పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. నెలనెలా వచ్చే పింఛన్‌పైనే అధిక శాతం లబ్ధిదారులు ఆధారపడి ఉన్నారు. వీరు తమకు అవసరమున్న మందులు, నిత్యావసరాలు పింఛన్ డబ్బులతోనే వెల్లదీస్తున్నారు. నెల రోజులుగా పింఛన్ అందకపోవడంతో లబ్ధిదారులు పాట్లు పడుతున్నారు. ప్రతినెలా మొదటి వారంలోనే పింఛన్లు పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. ఇంటర్నెట్ సమస్య పింఛన్ల పంపిణీకి అవరోధంగా మారింది. ఇంటర్నెట్ సమస్య వల్లే జాప్యం ఇంటర్నెట్ సమస్య వల్లే ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – వెంకట్, డీఆర్డీవో, ఆసిఫాబాద్ పదిహేను రోజులుగా తిరుగుతున్న పింఛన్ కోసం పదిహేను రోజులుగా పోస్టాఫీసు చుట్టూ తిరుగుతున్న. సార్లేమో లైన్లు లేవంటున్నరు. ఎప్పుడస్తయో చెప్పలేమంటున్నారు. పింఛన్ డబ్బులు రాకపోవడంతో పూటగడవడం ఇబ్బందైతుంది. – తామిడె పెంటుబాయి, టీఆర్‌నగర్, ఆసిఫాబాద్ పింఛన్ మీదనే బతుకుతున్నం నాకు గత కొన్ని సంవత్సరాలుగా నెలనెలా రూ.వెయ్యి పింఛన్ వస్తుంది. నా భార్య, నేను పింఛన్ మీదనే బతుకుతున్నం. ఈ నెల పింఛన్ ఇప్పటి వరకు పంపిణీ కాలేదు. రోజూ గ్రామపంచాయతీ ఆఫీసు చుట్టు తిరుగుతున్న. నెట్ లేదంటున్నరు. – బోయిరె నారాయణ, కోమటిగూడ, వాంకిడి తిండికి కష్టమైతంది నాకు చిన్నప్పుడే అగ్ని ప్రమాదంలో చేతివేళ్లు కాలిపోయాయి. నెలనెలా వచ్చే ఆసరా పింఛన్‌పైనే బతుకు. పింఛన్ డబ్బుల కోసం వారం రోజులుగా పోస్టాఫీసు చుట్టూ తిరుతున్నా డబ్బులు రాలేదంటున్నారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో తిండికి కష్టమైతంది. చుట్టు పక్కల ఉన్న బంధువులు పెడ్తే తింటున్న. – వైరాగడే భీంబాయి, చెక్‌పోస్టుకాలనీ, ఆసిఫాబాద్ -
ఆవుపేడతో అడవికి జీవం
సాక్షి, ఆసిఫాబాద్: ఏళ్ల నాటి చెట్టు కళ్ల ముందే కనుమరుగవుతుంటే ఏమి చేయలేక ఇన్నాళ్లు నిరాశపడిన అటవీ అధికారులకు ఓ చక్కటి పరిష్కారం దొరికింది. సహజ సిద్ధంగా ఎటు వంటి ఖర్చు లేకుండా ఆవుపేడ, బంకమట్టి తో ఎండిపోయే చెట్లకు పునర్జీవం పోయడమే ఈ పద్ధతి ప్రత్యేకత. సాధారణంగా అడవి లోని చెట్లను కలప కోసమో లేక అటవీ భూమిని సాగుచేయాలనో స్థానికులు చెట్లను నరికివేస్తారు. కానీ కొన్ని చెట్లు ధృఢంగా ఉంటాయి. వీటిని గొడ్డలితో నరకడం కష్టం. దీంతో చెట్టు కాండానికి గొడ్డలితో గాటు పెట్టి కొద్ది రోజుల తర్వాత వాటంతట అవే ఎండిపోయేలా చేసి అక్కడి భూమిని సాగు చేయడమో లేక ఎండిన కలపను అక్రమంగా తరలించడమో చేసేవారు. అటవీ అధికారు లు ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టడం, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను సస్పెండ్ చేయడమో చేసేవారు. కానీ గొడ్డలి గాయలతో ఉన్న చెట్లు మాత్రం నెల రోజుల వ్యవధిలో చూస్తుండగానే ఎండిపోయేవి. గాటు పెట్టి వదిలివేయడం అక్రమంగా అడవిలో చెట్లను నరికేవాళ్లు గొడ్డలి వంటి ఆయుధాలతో నరికి వేసి తమకు అనువైన సమయంలో వాటిని తరలిస్తారు. కానీ నారేపి, నల్లమద్ది తదితర జాతులకు చెందిన చెట్లు ధృ«ఢంగా ఉంటాయి. వీటిని గొడ్డలితో నరకడం కొంత కష్టంతో పని. అంతేకాక ఒక వేళ కష్టపడి చెట్టును నరికి వేసిన దానిని మరల ముక్కలుగా చేసి అటవీ ప్రాంతం నుంచి బయటికి తరలించడం మరింత కష్టం. ఎలాగైనా చెట్లను అక్కడి నుంచి తొలగించాలని భావించిన వాళ్లు ముందుగా ఆ చెట్టు కాండం చుట్టూ దాదాపు 10 సెంటీమీటర్ల వరకు గొడ్డలితో ఒక పెద్ద గాటు పెడతారు. దీంతో కాండంపై ఉన్న బెరడు తొలగిపోవడంతో ఆ చెట్టు కొమ్మలపై భాగానికి కింది భాగంలో ఉండే వేరు వ్యవస్థకు పోషక పదార్థాల సరఫరా ఆగిపోతుంది. దీంతో నెల రోజుల్లోనే ఆ చెట్టు పూర్తిగా ఎండిపోతుంది. అప్పుడు చెట్టు మొదలు వద్ద నిప్పు పెట్టడంతో మొత్తం బూడిద అవుతుంది. అలాకాక దుంగలు అవసరముంటే ఎండిన తర్వాత ముక్కలుగా చేసుకుని అక్కడి నుంచి తరలిస్తారు. దీంతో చెట్టు దానంతట అదే కింద పడిపోయి చనిపోయిందనుకునేలా అటవీ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు కొంత మంది ఈ ఎత్తుగడను అనుసరించేవారు. దీనికి విరుగుడుగా ఆసిఫాబాద్ డివిజన్ అటవీ అధికారి డి.రవీందర్‌గౌడ్ ఓ కొత్త పద్ధతిని తెలుసుకుని ఆ చెట్లను బతికించి నిరూపించారు. ఆవుపేడ, బంక మట్టితో చెట్టు కాండం చుట్టూ గొడ్డలితో చేసిన గాటును మొదట సున్నితంగా ఎండిన బెరుడు కణాల్ని తొలగించారు. ఆ ప్రాంతాన్ని నునుపుగా చేసి జీవం ఉన్న కణాలకు పైభాగాన్ని కింది భాగాన్ని కలుపుతూ ఆవుపేడ, బంక మట్టిని నీటితో కలిపి చేసిన మిశ్రమాన్ని ఆ గాటు పడిన ప్రాంతంలో అతికించారు. ఇలా కొద్దిరోజుల వరకుపై బెరుడుకు కింది బెరడు ద్వారా పోషక పదార్థాల సరఫరా జరిగి చెట్టుకు మళ్లీ పునరుజ్జీవనం కలిగింది. ఈ పద్ధతిలో గత సెప్టెంబర్‌లో ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని దహెగం మండలం రావులపల్లి అడవిలో సుమారు 70పైగా నారేపి, నల్లమద్ది తదితర జాతులకు చెందిన చెట్లకు జీవం పోశారు. ఈ ప్రయోగంతో అటవీశాఖకు ఓ పరిష్కారం దొరికినట్టేనని అటవీ అధికారులు పేర్కొన్నారు. -
జాతీయ స్థాయి క్రీడల్లో ఆటోడ్రైవర్ ఘనత
-
విజృంభిస్తున్న డయేరియా
► రోజురోజుకు పెరుగుతున్న కేసులు ► కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ► గ్రామాలు, పట్టణాల్లో లోపించిన పారిశుధ్యం పట్టించుకోని అధికారులు ఆసిఫాబాద్: జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో పదుల సంఖ్యలో డయేరియా, విషజ్వరాలతో రోగులు చికిత్స పొందుతున్నారు. వారం రోజుల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో 63 మంది డయేరియా చికిత్స పొందగా, మలేరియా, టైఫాయిడ్‌తో పలువురు చికిత్స పొందారు. వీరితోపాటు ప్రతీరోజు సుమారు 400 నుంచి 500 వరకు ఔట్ పేషెంట్లు నమోదవుతున్నారు. వారం రోజుల్లో మండలంలోని ఆర్‌ఆర్‌కాలనీకి చెందిన పాపయ్య, మోతుగూడకు చెందిన అనిత, కొసరకు చెందిన సునీత, చిర్రకుంటకు చెందిన మోహన్, తారకరామానగర్‌కు చెందిన సునీత, రాకేశ్, జన్కాపూర్‌కు చెందిన రోహిణి, గుడిసెల కాశమ్మ, లచ్చయ్య, మజీద్వాడికి చెందిన లక్ష్మి, బజార్‌వాడికి చెందిన భారతి, గొల్లగూడకు చెందిన విజయ, సందీప్‌నగర్‌కు చెందిన ఎల్లవ్వ, హడ్కోకాలనీకి చెందిన శివకృష రెబ్బెన మండలం ఖైర్‌గాంకు చెందిన రంగమ్మ, రాంపూర్‌కు చెందిన రేణుకతోపాటు పలువురు డయేరియా, మలేరియా చికిత్స పొందగా, ఆదివారం మండలంలోని సందీప్‌నగర్‌కు చెందిన లత, జన్కాపూర్‌కు చెందిన తారుబాయి, బెస్తవాడకు చెందిన మారుతి, రెబ్బెన మండలం ఖైర్‌గాంకు చెందిన అంజలి డయేరియాతో ఆస్పత్రిలో చేరారు. వీరితోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డయేరియా, జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. లోపిస్తున్న పారిశుధ్యం జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లోని 173 గ్రామపంచాయతీలకు ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.24.32 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో 60 శాతం పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయనున్నారు. గ్రామపంచాయతీలకు రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు లేకపోవడంతోపాటు ఉన్న సిబ్బందికి అదనపు బాధ్యతలు ఇవ్వడంతో పంచాయతీ పాలన పడకేసింది. జిల్లా కేంద్రంలోనే ఎక్కడ చేసినా చెత్తాచెదారం దర్శనమిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా గ్రామీణ, పల్లె ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో చెత్తా చెదారం నిండిపోయింది. అందులో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు పెరిగి జ్వరాల పాలవుతున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలు, పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం పాట్లు పడుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి సరఫరాపై నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంతో ఏటా వర్షాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోనే రోజుల తరబడి నల్లాల ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో, తాగునీటికోసం చేతి పంపులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు వ్యాధుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
100 మంది విద్యార్థినులకు అస్వస్థత
ఆసిఫాబాద్: కుమ్రంభీ ఆసీఫాబాద్ జిల్లాలోని కౌటాలలో ఉన్న కస్తూర్భా బాలికల పాఠశాలలో ఫుడ్ ఫాయిజన్ అయింది. దీంతో 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం అల్పాహారం తిన్న తరువాత పిల్లలకు వాంతులు, కడుపునొప్పి ప్రారంభమయ్యాయి. బాధితులను కౌటాల, సిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. పాఠశాలకు చేరుకున్న డీఈవో విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. -
నల్లాలు బంద్
► జిల్లా కేంద్రంలో 15 రోజులుగా నీటి కటకట ► పనిచేయని రక్షిత మంచినీటి పథకం ► ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులు ► పట్టించుకోని అధికారులు ఆసిఫాబాద్/ఆసిఫాబాద్ అర్బన్: జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌లో నల్లాలు బంద్ అయ్యాయి. గత 15 రోజులుగా నల్లాలు రాక ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఎక్కడైనా వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ ఆసిఫాబాద్ పట్టణంలో ఏటా వర్షాకాలంలో రక్షిత మంచినీటి పథకం పనిచేయకపోవడం పరిపాటిగా మారింది. గతంలో పట్టణంలో నల్లాల ద్వారా మురికి నీరు సరఫరా కావడంతో పలు మార్లు స్థానికులు ఆందోళనలు చేపట్టారు. ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టి సాధించికున్న రక్షిత మంచినీటి పథకం తరచూ విద్యుత్ మోటార్లు కాలిపోవడం, వర్షాకాలంలో పెద్దవాగులో నీటి ప్రవాహం పెరగడం, విద్యుత్ లో ఓల్టేజితో పాటు చిన్న చిన్న సమస్యలతో గత పక్షం రోజులుగా రక్షిత మంచినీటి పథకం పని చేయడం లేదు. పట్టణ ప్రజలకు శుద్ధజలం అందించేందుకు రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ పథకం తరచూ మొరాయిస్తోంది. దీంతో పట్టణ ప్రజలకు శుద్ధజలం అందని ద్రాక్షగా మారుతోంది. నల్లాలు రాక ప్రజలు చేతి పంపు నీటిని తాగాల్సి వస్తోంది. పని చేయని ఫిల్టర్లుపట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఎఫ్, ఆర్ఎస్ఎఫ్ ఫిల్టర్ యూనిట్లు వర్షాకాలంలో పెద్దవాగు నుంచి సరఫరా అయ్యే మురికి నీటిని శుద్ధి చేయకపోవడం ఇబ్బందిగా మారింది. వాగులో ఇన్ఫిల్ట్రేషన్ లేకపోవడం, పెద్దవాగు నుంచి మోటార్ సహాయంతో నేరుగా ఇన్‌టెక్ వెల్‌లోకి, అక్కడి నుంచి పంపింగ్ మోటార్ల సహాయంతో ఎస్ఎస్ఎఫ్, ఆర్ఎస్ఎఫ్ ఫిల్టర్ యూనిట్ల వద్దకు చేర్చిన నీటిని శుద్ధిచేయకపోవడంలో తరచూ సమస్య తలెత్తుతోంది. గ్రామీణ నీటి సరఫరాల విభాగం అధికారులు వర్షాకాలంలో రక్షిత మంచినీటి సరఫరాపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ఏటా తాగునీటి సమస్య తలెత్తుతోంది. ఈ విషయమై పంచాయతీ అధికారులు నిర్వహణ బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ అధికారులదేనని చేతులెత్తేయడం, బిల్లుల్లో జాప్యం పేరుతో పథకం నిర్వహణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే సమస్య తలెత్తుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు. ఫిల్టర్ యూనిట్లో నీటిని శుద్ధిచేసేందుకు ఉపయోగించే క్లోరిన్, పటిక, ఆలంలను వినియోగించకపోవడంతో నల్లాల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతోంది. కలుషిత నీటి సరఫరా.. పట్టణంలోని గాంధీచౌక్, బ్రాహ్మణవాడ, రావులవాడ, శివకేశవమందిర్తోపాటు పలు కాలనీల్లో నల్లాల ద్వారా కళుశిత నీరు సరఫరా అవుతోంది. తాగునీటి పైపుల్లో లీకేజీలు ఉండడంతో వాటిలో డ్రెయినేజీ నీరు చేరి మురికినీరు సరఫరా అవుతోంది. దీంతో చాలా మంది ప్రజలు చేతిపంపు నీటిని సేవిస్తున్నారు. ఈ నీటిలో క్యాల్షియం శాతం అధికంగా ఉండడంతో ప్రజలు అనారోగ్యంతోపాటు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తాగునీటికి ఇబ్బందవుతోంది వర్షాకాలంలో ఏటా రోజుల తరబడి నల్లాలు రాకపోవడంతో తాగునీటికి ఇబ్బందవుతోంది. దీంతో చేతిపంపులు, వాటర్ ప్లాంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. సంపన్న వర్గాలకు వాటర్ ప్యూరిఫై ప్లాంట్లు ఉండగా, పేద వర్గాలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలి. – మల్రాజ్ కిరణ్, ఆసిఫాబాద్ 15 రోజులుగా నల్లాలు వస్తలేవు గత 15 రోజులుగా పట్టణంలో నల్లాలు రావడం లేదు. దీంతో మహిళలు చేతిపంపుల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. నల్లాలు రానప్పుడు గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలి. చేతిపంపు నీటిని తాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నాం. – ఆమ్టే శ్రీమతి రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తాం లో ఓల్టేజ్ సమస్యతో తరచూ మోటార్లు కాలిపోతున్నాయి. మోటార్లకు ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ సరిపోకపోవడంతో సమస్య తలెత్తుతోంది. ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్‌శాఖ సమన్వయంతో సమస్య పరిష్కరించాలి. ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. – రుషి, పంచాయతీ కార్యదర్శి, ఆసిఫాబాద్ -
గిరిజన యువతి కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్
ఆసిఫాబాద్ : పెళ్లి పేరుతో గిరిజన యువతులను కిడ్నాప్ చేసి మహారాష్ట్రలో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొంత కాలంగా ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి ఓ ముఠా అనేకమంది అమాయక యువతులను డబ్బుల ఎరజూపి పక్క రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని బనార్‌గోంది గ్రామానికి చెందిన గిరిజన యువతి ఈ నెల 16 నుంచి కనిపించడం లేదు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు పట్టణంలోని చెక్‌పోస్టు కాలనీకి చెందిన హీనా అనే మహిళ బాధిత గిరిజన యువతికి మాయమాటలు చెప్పి బ్రోకర్ల సహాయంతో గుజరాత్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తికి రూ.60వేలకు విక్రయించింది. జిల్లా కేంద్రంలోని చెక్‌పోస్టు కాలనీలో యువతుల అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు అనుమానం వచ్చిన ఎస్‌హెచ్‌వో సతీశ్‌కుమార్ విచారణ ప్రారంభించారు. కాలనీకి చెందిన హీనాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, పొరుగురాష్ట్రంలోని చంద్రపూర్‌లో బాధితురాలు ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో నిందితులు సుజాత, సరిత, శారద, శ్రావణ్, దివాకర్, విమల, గోకుల్దాస్, మహేశ్‌లను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. పెళ్లి కొడుకు శంకర్ సాహు, అతనికి సహకరించిన సుధాకర్, రమేశ్‌లను అదుపులోకి తీసుకోవాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. డీఎస్పీ భాస్కర్, సీఐ సతీశ్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
ఆసీఫాబాద్: ఆసీఫాబాద్ జిల్లా నెన్నెల మండల కేంద్రంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడు అశోక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా గమనించిన కుటుంబసభ్యులు అతణ్ణి ఆస్పత్రికి తరలించారు. ప్రియురాలు స్వరూప బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే కాపాడారు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకుంటున్నారు. -
విస్తరణపైనే ఆశలు
అభివృద్ధి కార్యక్రమాలన్నీరెండు జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలోనే..! భవిష్యత్ మంత్రివర్గ విస్తరణపై తూర్పు ఎమ్మెల్యేల్లో ఆశలు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు మంత్రులు లేరు! ఉమ్మడి ఆదిలాబాద్ మంత్రులకు ఈ జిల్లాలతో సంబంధం కట్! సాక్షి, మంచిర్యాల : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో జిల్లా మంత్రి పాత్ర ప్రధానం. జిల్లాకు పెద్దన్న పాత్ర పోషించే మంత్రి లేకపోతే ఇన్చార్జి మంత్రి ఆ బాధ్యత తీసుకుంటారు. కానీ.. పునర్విభజనతో కొత్తగా ఏర్పాౖటెన తూర్పు జిల్లా లు మంచిర్యాల, ఆసిఫాబాద్లకు ఆ పరిస్థితి లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో జోగు రామన్న (ఆదిలాబాద్), అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (నిర్మల్) మంత్రులుగా ప్రాతినిధ్యం వహించేవారు. మాతృ జిల్లాను నాలుగుగా విభజించడంతో రామన్న ఆదిలాబాద్‌కు, ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌కు పరిమితమయ్యారు. మంచిర్యాల, ఆసిఫాబాద్లకు మాత్రం మంత్రులు లేరు. ఈ కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి సైతం ఇన్‌చార్జీలుగా పద్మారావుగౌడ్, జోగు రామన్న వచ్చారు. ఈ పరిస్థితుల్లో మంత్రులు లేని మంచిర్యాల, ఆసిఫాబాద్‌ల భవిష్యత్ రాజకీయాలపై అధికార పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇన్చార్జి మంత్రుల వ్యవస్థకు తిరిగి ప్రాణప్రతిష్ట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో ప్రతి జిల్లాకూ మంత్రి ఉన్నా, ఇన్చార్జి మంత్రిగా వేరే జిల్లా మంత్రి ఉండేవారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల(డీడీఆర్సీ)తోపాటు ఆయా జిల్లాల్లో జరిగే అన్ని కీలక సమావేశాలను ఇన్చార్జి మంత్రులే ముందుండి నడిపించేవారు. అలాగే శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధులు (ఏసీడీఎఫ్) వెచ్చించే విషయంలో కూడా ఇన్చార్జి మంత్రులకు 50 శాతం అధికారం ఉండేది. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాౖటెన తరువాత 10 జిల్లాలే ఉండడం, ప్రతి జిల్లాకూ ఓ మంత్రి తప్పనిసరిగా ఉండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్చార్జి మంత్రుల వ్యవస్థను తొలగించారు. ఒక జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే వారిలో సీనియర్‌కే ప్రొటోకాల్ ప్రకారం బాధ్యత అప్పగించారు. సీనియర్ మంత్రి ద్వారానే స్వాతంత్య్ర దినోత్సవం రోజు జాతీయ పతాకావిష్కరణ వంటి కార్యక్రమాలు జరిగేవి. అయితే.. ఇప్పుడు జిల్లాలు 31కి చేరగా, అనేక కొత్త జిల్లాలకు మంత్రులు లేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి విడిపోయిన మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలదీ అదే సీన్. ఈ నేపథ్యంలో ఇన్చార్జి మంత్రుల వ్యవస్థను తిరిగి తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పరిమితుల దృష్ట్యా ప్రతి జిల్లాకూ మంత్రిని నియమించే పరిస్థితులు లేనందునా ఇన్చార్జీల నేతృత్వంలోనే కార్యక్రమాలు సాగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్లదే హవా.. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలతోపాటు ఆదిలాబాద్ జిల్లా పరిధి ఖానాపూర్ సెగ్మెంట్లోని జన్నారం మండలం మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఒక్కరే ప్రభుత్వంలో విప్ బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి , సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఉన్నప్పటికీ ప్రభుత్వంలో బాధ్యతలేమీ లేవు. దీంతో నియోజకవర్గాల్లోని స్థానిక ఎమ్మెల్యేలే తమకు సంబంధించిన కార్యక్రమాలకు కీలకమయ్యారు. ఎంపీ బాల్క సుమన్ ఉన్నా, ఆయనది అతిథి పాత్రే. ఈ పరిస్థితుల్లో రెండు జిల్లాల కలెక్టర్లే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కీలకంగా మారనున్నారు. కేంద్ర నిధులతో అమలయ్యే పథకాలన్నీ ప్రస్తుతం కలెక్టర్ల కనుసన్నల్లోనే జరుగుతున్నా యి. మంత్రులు లేనందు వల్ల వారి బాధ్యతలను కూడా ఇక ముందు కలెక్టర్లే చూస్తారని సమాచారం. మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేల ఆశ 10 నియోజకవర్గాల ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రాతినిథ్యం ఉండేది. వీరు ‘కొత్త’ జిల్లాల మంత్రులుగా మారడంతో తూర్పు జిల్లాల ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఆశతో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరి జాతకాలు ఎలా మారుతాయో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే తెలుసు. -
ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం
ఆసిఫాబాద్(కొమరం భీం) కలెక్టర్ : చంపాలాల్ ఎస్పీ: సన్‌ప్రీత్‌సింగ్] ఇతర ముఖ్య అధికారులు జేసీ: అశోక్‌కుమార్ డీఆర్వో: అద్వైత్ కుమార్‌సింగ్ డీఈవో: రసిక్ డీఎస్ఎస్వో: సత్యనారాయణ డీఎఫ్‌వో: వెంకటేశ్వర్లు డీఎంహెచ్‌వో: తొడసం చందు ఎక్సైజ్ సూపరింటెండెంట్: జానయ్య జిల్లా సంక్షేమ అధికారి: సావిత్రి డీసీహెచ్‌వో: విద్యాసాగర్ డ్వామా పీడీ: ఈ శంకర్ జిల్లా వ్యవసాయాధికారి: అలీం డీపీవో: గంగాధర్‌గౌడ్ డీటీవో: నీలకంఠ లాండ్ అండ్ సర్వే రికార్డు జిల్లా అధికారి: జనార్దన్ సీపీవో: కష్ణయ్య మండలాలు: 15 ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, తిర్యాణి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), బెజ్జూర్, చింతనమానెపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట రెవెన్యూ డివిజన్లు: 2 (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్) మున్సిపాలిటీ: 1 (కాగజ్‌నగర్) గ్రామ పంచాయతీలు: 177 ప్రధాన పరిశ్రమలు: పత్తి జిన్నింగ్ మిల్లులు నీటి పారుదల: కొమురంభీం ప్రాజెక్టు, వట్టివాగు, జగన్నాథ్‌పూర్, ఎర్రవాగు, తమ్మిడిహెట్టి ప్రాజెక్టులు, ప్రాణహిత నది పర్యాటకం: కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గాంలోని శివమల్లన్న ఆలయం, టోంకిని హనుమాన్ మందిర్, గంగాపూర్ వెంకటేశ్వర ఆలయం, జోడేఘాట్, కెరమెరి ఘాట్ ఎంపీ: గోడం నగేశ్, ఎమ్మెల్యే: కోవ లక్ష్మి జాతీయ రహదారులు: లేవు హైదరాబాద్ నుంచి దూరం: 325 కిలోమీటర్లు ఖనిజాలు: బొగ్గు (సింగరేణి) -
పోరుగడ్డ.. ఆసిఫాబాద్
ఆదివాసీల ఖిల్లా.. ఈ జిల్లా కొమురం భీమ్ పేరిట ఏర్పాటు నిజాం కాలం నాటి ఆనవాళ్లు ఎన్నో జల్..జంగల్..జమీన్.. అంటూ నినదించిన గిరిజన పక్ష పోరాట యోధుడు కొమురం భీమ్ పురిటిగడ్డ ఈ ఆసిఫాబాద్. ఆయనతో పాటు మరెందనో పోరాట యోధుల జన్మస్థలాలున్నది ఈ ప్రాంతంలోనే. కెరమెరి ఘాట్ల అందాలు.. సిర్పూర్ పేపర్‌మిల్లు, హైమన్‌డార్ఫ్ దంపతుల సేవలు.. మినీ ఇండియూగా కనిపించే కాగజ్‌నగర్.. ఇక్కడి విశేషాలు. ఒకప్పుడు జిల్లా కేంద్రం ఇప్పుడు మళ్లీ జిల్లాగా..- ఆసిఫాబాద్ ఆజంజాహి వంశ కాలంలో.. హైదరాబాద్ సంస్థానాధీశుడిగా ఉన్న ఆజంజాహి వంశానికి చెందిన నిజాం నవాబు 1907లో ఈ ప్రాంతాన్ని ఆసిఫాబాద్‌గా నామకరణం చేశారు. ఈ ప్రాంతం గుండా రెబ్బెనలో ఉన్న రైల్వేస్టేషన్‌ను ఆసిఫాబాద్ రోడ్‌గా మార్చారు. 1913 నుంచి 1940 వరకు ఇది జిల్లా కేంద్రంగా ఉండేది. ఆ తరువాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్ తరలిపోయినా, ఆసిఫాబాద్ మాత్రం విశిష్టతను కాపాడుకుంటూ వస్తుంది. నిజాం నాటి కార్యాలయ భవనాలు నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తాయి. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొన్నటి వరకు నిజాం కాలం భవనంలోనే కొనసాగింది. జిల్లా ప్రత్యేకత జల్ జంగల్ జమీన్ కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కొమరం భీమ్ వర్ధంతి ఏటా ప్రభుత్వం కెరమెరి మండలం జోడేఘాట్‌లో నిర్వహిస్తుంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే కావడం, రాష్ట్రంలో మొదటి గిరిజన పట్టభద్రుడు కొట్నాక భీమ్రావు నియోజకవర్గానికి చెందిన వారు కావడం విశేషం. నిజాం మెచ్చిన గ్రామంగా పేరొందిన ఆసిఫాబాద్ ఒకప్పటి జిల్లా కేంద్రం. మొట్టమొదటి ఆర్టీసీ డిపో కూడా ఇక్కడే ఏర్పాటైంది. జైనూరు మండలం మార్లవాయిలో గిరిజనులకు సంక్షేమ ఫలాలందించిన శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ హెమండార్ఫ్ దంపతుల సమాధులున్నాయి. కెరమెరి ఘాట్లు ప్రకృతి అందాలకు కనువిందు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పూలాజీ బాబా క్షేత్రం కూడా నియోజకవర్గంలోనే ఉంది. దీంతో పాటు పట్టణంమలోని శిర్డీ సాయి మందిరం కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఆసిఫాబాద్ మండలంలో కొమురం భీమ్, వట్టివాగు, తిర్యాణిలో చెలిమెల వాగు, కాగజ్‌నగర్ నియోజకవర్గంలో జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులున్నాయి. రెబ్బెన మండలంలోని గంగాపూర్‌లో వేంకటేశ్వర దేవాలయం, కాగజ్‌నగర్ మండలం ఈజ్గాంలో శివమల్లన్న దేవాలయం, టొంకిని హనుమాన్ ఆలయం ప్రసిద్ది చెందినవి. ఇక్కడి రైతులు రికార్డు స్థాయిలో పత్తి పండిస్తారు. దీంతో పారిశ్రామికంగా జిన్నింగు, ఆయిల్ మిల్లులు వెలిశాయి. రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైల్వేస్టేషన్‌కు ఆసిఫాబాద్ రోడ్ పేరు పెట్టారు. కాగజ్‌నగర్‌లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎస్పీఎం పేపర్ మిల్లు, సర్‌సిల్క్ మిల్లులు మూత పడ్డాయి. క్రీశ 1700 శతాబ్దంలో ఆసిఫాబాద్‌ను సుమారు 200 సంవత్సరాలు గోండు రాజులు పరిపాలించినట్లు చరిత్ర చెబుతుంది. అభివృద్ధి వైపు... ఆసిఫాబాద్‌ను కొమురం భీమ్ జిల్లాగా ప్రకటించడంతో ఇ క్కడి ప్రజల్లో అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇక్కడ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు సుమారు 60 శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు ఏర్పాటుతో సుమారు 2 వేలకు పైగా ఉద్యోగుల సంఖ్య పెరగనునుంది. జిల్లా కేంద్రంలో విద్య, వైద్యం, రోడ్లు, కనీస సౌకర్యాలు లేవు. తాజాగా జిల్లా ప్రకటనతో జిల్లాలో రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థ, వైద్య సేవలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆస్పత్రి 500 పడకల ఆస్పత్రిగా స్థాయి పెరిగింది. హోటళ్లు, లాడ్జిల సంఖ్య పెరగనుంది. జిల్లా ఏ ర్పాటుతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అద్దె ఇళ్లకు సై తం డిమాండ్ పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడ వివిధ పనుల కోసం వచ్చే ప్రజలతో వ్యాపారం గణనీయం గా అభివృద్ధి చెందుతుందే అవకాశాలున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించే అవకాశాలున్నా యి. జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలతో ఆర్టీసీ బస్సుల సంఖ్య, ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో వ్యవసా యాభివృద్ధికి సమృద్దిగా వనరులున్నాయి. మండలంలోని కొమురంభీమ్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 45,500, వట్టివాగు ప్రాజెక్టు ద్వారా 24,500 ఎకరాల ఎకరా ల ఆయకట్టుకు సాగునీరందనుంది. దీంతో పంట పొలాలు, చేలు సస్యశామలమవుతాయి. వ్యవసాయాభివృద్ధి జరుగుతుంది. జిల్లా అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరగడంతో జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులూ ఏర్పాటవొచ్చు. దీంతో పాటు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల సంఖ్య పెరిగి గ్రామీణ ప్రాంతంలో అక్షరాస్యత పెరిగే అవకాశాలున్నాయి. -
ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాట్లు వేగవంతం
విభ జన పనుల్లో అధికారులు బిజీబిజీ కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాల భవనాల వేట ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాట్లలో అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. ఆసిఫాబాద్‌ను కొమరంభీమ్ జిల్లాగా ప్రకటించి ఈ నెల 11 దసరా నుంచి జిల్లా పరిపాలన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో శరవేగంగా పనులు సాగుతున్నాయి. పట్టణంలోని వివిధ ప్రభుత్వ శాఖల భవనాలను జిల్లా కార్యాలయాల కోసం అధికారులు సిద్ధం చేస్తున్నారు. సబ్ కలెక్టర్ అద్వైత్‌సింగ్ ఆధ్వర్యంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు సుమారు 55 ప్రభుత్వ కార్యాలయాల ఏర్పా టు చేయాల్సి ఉండగా.. 50 శాతం భవనాలను గుర్తించా రు. గతంలో జిల్లా కేంద్రంగా వెలుగొందిన ఆసిఫాబాద్‌లో జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు చాలా భవనాలు అనుకూలంగా ఉండడంతో అధికారులకు శ్రమ తప్పింది. జిల్లా ప్రకటిం చిన 24 గంటలలోపే సబ్ కలెక్టర్ ప్రభుత్వ భవనాలను గుర్తించారు. కాగజ్‌నగర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా, సిర్పూర్(యు) మండలంలో కొత్తగా ఏర్పాట య్యే లింగాపూర్ మండలం, కాగజ్‌నగర్ నియోజకవర్గం లోని పెంచి కలపేట, చింతలమానెపల్లి మండలాల ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు. కాగజ్‌నగర్ డివిజన్ కార్యాలయాలతోపాటు, ఫైళ్ల విభజనలో అధికారులు బిజీ ఉన్నారు. కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారుల కార్యాలయ భవనాలను కలెక్టర్ జగన్మోహన్, సబ్ కలెక్టర్ పరిశీలించారు. పట్టణంలోని వైటీసీ భవనంలో కలెక్టరేట్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, డీఎస్వో, అసిస్టెంట్ డెరైక్టర్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్, జిల్లా ట్రెజరీ కార్యాలయాలు, ఏఎంసీ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో కార్యాలయం, పోస్ట్‌మెట్రిక్ హాస్ట ల్ భవనంలో ఎక్సైజ్, హర్టికల్చర్, వ్యవసాయ, ఆత్మ, సిరికల్చర్, మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సెరికల్చర్, జిల్లా ట్రెజరీ, ఎంప్లాయిమెంట్, వెటర్నరీ ఆస్పత్రి కొత్త భవనంలో పశుసంవర్ధశాఖ, మత్స్యశాఖ కార్యాలయా లు, జెడ్పీ బాలుర పాఠశాలలో డీఈవో, సాక్షర భారత్, గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో గ్రౌండ్‌వాటర్ కార్యాలయం, ఎస్సీ దుకాణాల సముదాయంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాలు, మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో మైనర్ ఇరిగేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణరుుంచారు. ఫైర్స్టేషన్లో ఆ శాఖ జిల్లా కార్యాలయం కొనసాగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ సబ్ జైల్లోనే జిల్లా జైలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత సబ్ కలెక్టర్ నివాసంలో కలెక్టర్ నివాసం, జైలు క్వార్టర్లలో ఎస్పీ నివాసం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మిగితా కార్యాలయాల భవనాల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
మళ్లీ మార్పులు
తాండూరు, భీమిని, కన్నెపల్లిలు మంచిర్యాల జిల్లాలోకి.. 15 మండలాలతో ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో 18కి చేరిన మండలాలు ఘనంగా కొత్త జిల్లాల ప్రారంభ వేడుకలు హాజరుకానున్న పద్మారావు, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్త జిల్లాల ప్రతిపాదనలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆసిఫాబాద్ జిల్లాలో 18 మండలాలను చేర్చాలని ప్రతిపాదించిన జిల్లా అధికార యంత్రాంగం ఇప్పుడు మళ్లీ మార్పులు చేసింది. ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి చేర్చిన బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు, భీమిని, కన్నెపల్లి మండలాలను తిరిగి మంచిర్యాల జిల్లాలోకి మార్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు మరోమారు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. మూడు మండలాలు తగ్గడంతో ఆసిఫాబాద్ (కుమ్రంభీం) జిల్లా పరిధిలో 15 మండలాలు ఉంటాయి. 15 మండలాలున్న మంచిర్యాల ఇప్పుడు 18 మండలాలు కానున్నాయి. తాజా మార్పులతో బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని మండలాన్నీ మంచిర్యాల జిల్లా పరిధిలో ఉండనున్నాయి. తాండూరును ఆసిఫాబాద్ జిల్లాలో చేర్చడాన్ని నిరసిస్తూ తాండూరు మండల వాసులు ఆందోళనకు దిగారు. బుధవారం జాతీయ రహదారిపై రాస్తోరోకో నిర్వహించి, అటువైపు వెళ్లిన కలెక్టర్ ఎం.జగన్మోహన్కు వినతిపత్రం అందజేశారు. జన్నారంపై తర్జన భర్జన.. జన్నారం మండల విషయంలో కొంత తర్జనభర్జన జరిగింది. ఈ మండలాన్ని మంచిర్యాల జిల్లా పరిధిలో ఉంచాలని ముందుగా నిర్ణయించారు. ఈ మండలంలోని కొన్ని గ్రామాలను దస్తూరాబాద్ (కొత్త మండలం)లో చేర్చి నిర్మల్ జిల్లా పరిధిలో ఉంచాలని భావించారు. కానీ.. మళ్లీ మార్పులు చేసి ఆ గ్రామాలను తిరిగి జన్నారం మండలంలోనే ఉంచుతూ.. ఈ మండలం మొత్తాన్ని మంచిర్యాల జిల్లాలోనే చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తుది నోటిఫికేషన్‌కు తేదీ దగ్గర పడుతున్న ఈ తరుణంలో రోజుకొక్కటి అన్నట్లు ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటుండటం గమనార్హం. జిల్లాలను ప్రారంభించేది వీరే.. కొత్త జిల్లాల సంబరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పెద్దఎత్తున సంబరాలు చేయాలని నిర్ణయించారు. అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న మూడు జిల్లాలను ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. మంచిర్యాల జిల్లా ప్రారంభ వేడుకలకు రాష్ట్ర ఎకై్సజ్ శాఖ మంత్రి టి.పద్మారావు ముఖ్య అథితిగా హాజరు కానున్నారు. అలాగే ఆసిఫాబాద్ జిల్లాను మంత్రి జోగు రామన్న చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. నిర్మల్ జిల్లా ప్రారంభ వేడుకలు స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. ఆసిఫాబాద్‌కు కుమ్రంభీం పేరు అధికారిక ఆదేశాలు మంచిర్యాల జిల్లాకు పెట్టిన కుమ్రంభీం పేరును ఆసిఫాబాద్ జిల్లాకు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆదేశాలందాయి. ఇకపై జరిగే ప్రక్రియ అంతా ఆసిఫాబాద్ జిల్లాను కుమ్రంభీం పేరుతో జరపాలని ఆదేశించారు. ఆసిఫాబాద్‌లో కార్యాలయాల వేట.. కొత్తగా ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు కానుండటంతో జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ప్రభుత్వ కార్యాలయాల వేటలో పడింది. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఆయా శాఖల జిల్లా కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ రెండు రోజులుగా ఆసిఫాబాద్‌లో పర్యటించి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్న వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్) భవనంలో తాత్కాలిక కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులోనే సీపీవో, ట్రెజరీవంటి కార్యాలయాలను ఉంచాలని చూస్తున్నారు. నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలాగే జెడ్పీ హైస్కూల్ భవనంలో ఖాళీగా ఉన్న గదుల్లో డీఈఓ కార్యాలయం, గ్రామపంచాయతీ భవనంలో డీపీఓ కార్యాలయం.. ఇలా ఆయా శాఖల కార్యాలయాల్లోనే జిల్లా కార్యాలయాలను తాత్కాలికంగా సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. -
ఆసిఫాబాద్‌కు పూర్వ వైభవం
జిల్లా ప్రకటనతో ప్రజల్లో ఆనందం ఆసిఫాబాద్ : కొత్త జిల్లాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్‌ను 31వ జిల్లాగా ప్రకటించడంతో పూర్వ వైభవం సంతరించుకోనుంది. ఆసిఫాబాద్‌ను కొమరంభీమ్ జిల్లాగా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గతంలో స్థానిక అంబేద్కర్ చౌక్‌లో 90 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి హామీతో ఉద్యమకారులు దీక్షలు విరమించారు. ఎట్టకేలకు కేసీఆర్ ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భౌగోళికంగా ఆసిఫాబాద్ డివిజన్ 2,85,742 హెక్టార్లు ఉండగా, అందులో 1,10,274 హెక్టార్లు అటవీ ప్రాంతం ఉంది. జిల్లాలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో అభివృద్ధి చెందే అవకాశాలున్నారుు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలు, బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలాలతో జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కొత్త జిల్లాకు కుమ్రం భీమ్ జిల్లాగా నామకరణం చేసే అవకాశాలన్నారుు. నిజాం కాలంలో జిల్లా కేంద్రం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆసిఫాబాద్ ఒకప్పటి జిల్లా కేంద్రం కాగా, ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కొనసాగుతోంది. నిజాం ప్రభువు 1913లో ఆదిలాబాద్‌లోని జిల్లా కేంద్రాన్ని ఆసిఫాబాద్‌కు తరలించి ఇక్కడే అన్ని వసతులు కల్పించారు. అన్ని జిల్లా కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించారు. 1913 నుంచి 1940 వరకు 27 ఏళ్లపాటు జిల్లా కేంద్రంగా కొనసాగింది. ఢిల్లీ సుల్తానుల ఆధీనంలో 1872లో ఆదిలాబాద్ జిల్లాగా, సిరపూర్(టి), తాండూర్ ఉప జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. 1905లో ఆసిఫ్‌జాహి వంశీకులు ఆదిలాబాద్‌ను స్వతంత్ర జిల్లాగా ప్రకటించారు. 1907 వరకు జనగామగా పేరున్న ఆసిఫాబాద్‌ను ఆసిఫ్‌జాహి వంశానికి చెందిన హైదరాబాద్ బాషా, నిజాముల్ ముల్క్ తమ వంశం పేరుతో ఆసిఫాబాద్‌గా నామకరణం చేశారు. అప్పటి నుంచి జనగామ ఆసిఫాబాద్ పేరుతో పిలుస్తున్నారు. కొంత మంది వృద్ధులు నేటికి ఆసిఫాబాద్‌ను జనగామగానే పిలుస్తారు. తొలగనున్న కష్టాలు నియోజకవర్గ ప్రజలకు జిల్లా కేంద్రం ఆదిలాబాద్ సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో వివిధ అవసరాలకు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బందులకు గురయ్యేవారు. రెవెన్యూ, కోర్టు కేసులు, వైద్యంతోపాటు ఇతర కార్యాలయ పనులకు తూర్పు జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ప్రజలు వెళ్తుంటారు. దూరభారంతో పనుల నిమిత్తం జిల్లా కేంద్రంలో బస చేయాల్సి వచ్చేది. ఆసిఫాబాద్ జిల్లా ప్రకటన ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మంగళవారం సబ్ కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, కాగజ్‌నగర్ డీఎస్పీ హబీబ్‌ఖాన్ పట్టణంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు ఇతర శాఖల ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం భవనాలు పరిశీలించారు. ఇప్పటికీ జిల్లా ఆనవాళ్లు నిజాం పరిపాలనలో ఆసిఫాబాద్‌లో నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. జిల్లా జైలు, పోలీసుస్టేషన్ భవనాలు నేటికి కొనసాగుతున్నాయి. కోర్టు భవనాలు, తహశీల్దార్ కార్యాలయంతోపాటు కలెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. -
మారిన రూపు రేఖలు..
ఆసిఫాబాద్ జిల్లాకు కొమురంభీం పేరు కొమురంభీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో 18 చొప్పున మండలాలు మంచిర్యాలలో 15.. కొత్తవి 17.., మొత్తం 69కి చేరిన మండలాల సంఖ్య అధికార యంత్రాంగం తాజా ప్రతిపాదనలు.. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాల విభజన ప్రక్రియలో రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. అనూహ్యంగా ఆసిఫాబాద్ జిల్లా తెరపైకి రావడంతో ముందుగా మూడు జిల్లాల కోసం రూపొందించిన ప్రతిపాదనల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జిల్లా టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా అధికార యంత్రాంగం కొత్త ప్రతిపాదనలు తయారు చేసింది. కొత్తగా తెరపైకి వచ్చిన ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా కాగజ్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని నిర్ణయించారు. కొత్త మండలాల సంఖ్యను 17కు పెంచాలని తాజాగా ప్రతిపాధించారు. దీంతో మండలాల సంఖ్య 69కి చేరుకుంది. జిల్లా అధికార యంత్రాంగం రూపొందించిన తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తే.. ఆసిఫాబాద్(కొమురంభీం) పరిధిలో 18 మండలాలు.. కొత్తగా తెరపైకి వచ్చిన ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో 18 మండలాలను చేర్చారు. సిర్పూర్(టి) నియోజవకర్గ పరిధిలోని ఐదు మండలాలు, కొత్తగా ఏర్పడనున్న పెంచికల్‌పేట, చింతలమానేపల్లి మొత్తం ఏడు మండలాలతో కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రతిపాదించారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చిన జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్(కొత్త) మండలాలను ఆసిఫాబాద్ పరిధిలోకి చేర్చారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని మూడు.. తాండూర్, భీమిని, కన్నేపల్లి(భీమినిలో కొత్త) మండలాలను ఆసిఫాబాద్ జిల్లాలో చేర్చుతున్నారు. సుమారు 4,763 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఆసిఫాబాద్ జిల్లాలో 5.92 లక్షల మంది జనాభా ఉంటుంది. భీం నడయాడిన కెరమెరి మండలం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉండడంతో ఆదివాసీ పోరాట యోధుని పేరు ఆసిఫాబాద్‌కు పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. నార్నూర్ ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి... ఆదిలాబాద్ జిల్లాలో కూడా 18 మండలాలు ఉండనున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని నార్నూర్, గాదిగూడ(నార్నూర్‌లో కొత్తది) మండలాలను ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉంచాలని నిర్ణయించారు. కొత్తగా భీంపూర్(తాంసిలో కొత్తది), సిరికొండ(ఇచ్చోడలో కొత్తది) మండలాలుగా చేయాలని నిర్ణయించారు. తాజా ప్రతిపాదనల మేరకు ఆదిలాబాద్ జిల్లా విస్తీర్ణం 4,153 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. జనాభా 7.21 లక్షలు ఉంటుందని ప్రతిపాదించారు. కొమురంభీంలో భీమారం కొత్త మండలం.. మొత్తం 15 మండలాలతో కలిపి మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేయాలని తాజా ప్రతిపాదనలు తయారు చేశారు. కొత్తగా భీమారం(జైపూర్‌లో కొత్తది) మండలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జన్నారం మండలాన్ని మంచిర్యాలలోనే కొనసాగించాలని నిర్ణయించారు. సుమారు 7.07 లక్షల జనాభా కలిగిన కొమురంభీం జిల్లా 3,350 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉండనుంది. కొత్తగా ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు కానుండడంతో కొమురంభీం పేరును ఆసిఫాబాద్‌కు పెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. నిర్మల్‌లో మరికొన్ని కొత్త మండలాలు.. నిర్మల్ జిల్లాలో మరికొన్ని కొత్త మండలాలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం నిర్మల్ మండలాన్ని మూడు మండలాలుగా.. సోన్, నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్‌గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దిలావర్పూర్ మండలంలో నర్సాపూర్-జి(కొత్త), కడెం మండలం దస్తూరాబాద్(కొత్త)ను మండలం చేయాలని ప్రతిపాదించారు. బాసర కూడా మండలంగా ఏర్పడనుంది. మొత్తం 7.30 లక్షల జనాభా కలిగిన నిర్మల్ జిల్లా 3,844 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండనుంది. ఆదిలాబాద్ : ఆదిలాబాద్(అర్బన్), ఆదిలాబాద్(రూరల్), మావల, భీంపూర్, సిరికొండ, గాదిగూడ ; మంచిర్యాల : భీమారం, నస్పూర్, హాజీపూర్ ; ఆసిఫాబాద్ : లింగాపూర్, పెంచికల్పేట్, చింతల్మానపల్లి ; నిర్మల్ : నిర్మల్ రూరల్, నిర్మల్ అర్బన్, సోన్, నర్సాపూర్-జి, దస్తూరాబాద్, బాసర. (నిర్మల్ మూడు మండలాలుగా విడిపోతోంది) -
ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేయాలి
ఆసిఫాబాద్ మండలంను ఆదిలాబాద్ జిల్లాకేంద్రంగా చేయాలంటూ అఖిలపక్షం ఇచ్చిన బంద్ విజయవంతం అయింది. అంతరాష్ట్ర రహదారిపై అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. ఆసిఫాబాద్‌ను వెంటనే జిల్లాకేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
వాగులో పడి యువకుడి గల్లంతు
ఆసిఫాబాద్ (ఆదిలాబాద్) : శుభకార్యానికి వెళ్లి స్నేహితులతో కలసి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన యువకుడు వాగులో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లోని పెద్దవాగు వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. తాండూరు మండలం కాసిపేటకు చెందిన తిరుపతి(17) శుభకార్యం నిమిత్తం ఆసిఫాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలసి ఈత కొట్టడం కోసం వాగులోకి దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. -
బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య
ఆసిఫాబాద్(ఆదిలాబాద్ జిల్లా): కాన్సర్‌తో బాధపడుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో జరిగింది. తిర్యాణి మండల కేంద్రానికి చెందిన తిప్పరి స్రవంతి(23) ఆసిఫాబాద్‌లోని రాజేంద్రప్రసాద్ బీఈడీ కాలేజీలో చదువుతోంది. ఆమె గత కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెల్టుషాపులు ఎత్తేయాలని ఏఐవైఎఫ్ ధర్నా
ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో బెల్టుషాపులు ఎత్తివేయాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్(ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో మండల ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. బెల్టుషాపులు ఎత్తివేయాలని ఏఐవైఎస్ సభ్యులు ధర్నా చేశారు. బెల్టుషాపులు ఎత్తివేయకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవితో పాటు మండలానికి చెందిన నాయకులు పాల్గొన్నారు. -
ఆసిఫాబాద్ బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా విక్రయాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 14 షెడ్లకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బాణాసంచా కాలిపోయింది. అధికారులు మెదక్ జిల్లా గజ్వేల్‌లో బాణాసంచా దుకాణాలపై దాడులు నిర్వహించారు. అనుమతి లేని 12 దుకాణాలను సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో బాణాసంచా కేంద్రాల్లో పేలుడుకు భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. -
జోడేఘాట్‌లోనే జోహార్లు
ఆసిఫాబాద్ : గిరిజనుల ఆరాధ్య దైవం.. జల్, జంగల్, జమీన్ కోసం నిజాం పాలకులకు ఎదురొడ్డి పోరాడిన వీరుడు.. కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఈసారి ఆయన సొంత గడ్డ అయిన జోడేఘాట్‌లోనే జరగనున్నాయి. దీంతో భీమ్ వర్ధంతి వేడుకలు పూర్వవైభవం సంతరించుకోనున్నాయి. దీనికితోడు ఈ నెల 8న నిర్వహించే ఈ వర్ధంతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరవుతుండడం విశేషం. మొన్నటి వరకు హట్టికే పరిమితం.. ఆదివాసీల్లోని అసంతృప్తిని తొలగించి.. వారికి ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో 1984లో ఐటీడీఏ ఆధ్వర్యంలో కెరమెరి మండలం జోడేఘాట్‌లో అధికారికంగా వర్ధంతి వేడుకలు ప్రారంభించారు. మూడేళ్ల పాటు ఆర్భాటంగా జోడేఘాట్‌లోనే భీమ్ వర్ధంతి, దర్బార్ విజయవంతంగా కొనసాగించారు. తదనంతరం మావోయిస్టుల ప్రభావంతో జోడేఘాట్‌లో నిర్వహించే వేడుకలకు ఆటంకం కలిగింది. కాగా.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జన్మభూమి కార్యక్రమాలు ని ర్వహిస్తూ.. ఇక ప్రత్యేకంగా దర్బార్ అవసరం లేదం టూ అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి పోర ట వీరుడి వర్ధంతిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. కేవలం భీమ్ వారసులే జోడేఘాట్‌కు వెళ్లి ఆదివాసీల సంప్రదాయ పద్ధతిలో సంస్మరణ సభ కొనసాగించారు. భద్రతా బూచీతో జోడేఘాట్‌కు ప్రముఖులు, ఉన్నతాధికారులు ఎవరూ రావడం లేదు. ఏటా పలువురు వస్తున్నా పోలీ సులు వారిని హట్టి వద్దే అడ్డుకుంటున్నారు. దీంతో ఎంతో ఆర్భాటంగా జరగాల్సిన వేడుకలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం భీమ్ వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినా.. భద్రతా కారణాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు హట్టికే పరిమితమయ్యారు. ముస్తాబవుతున్న జోడేఘాట్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటిసారి నిర్వహించే భీమ్ 74వ వర్ధంతి వేడుకలకు జోడేఘాట్ ముస్తాబవుతోంది. ఈ నెల 8న జరగనున్న వర్ధంతి వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరు కానున్నారు. జోడేఘాట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు రావాలని అధికారులను ఆదేశించడంతో జిల్లా అధికార యంత్రాంగం వారం రోజులుగా ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖుల తాకిడితో ఈ ప్రాంతం కొత్తరూపు సంతరించుకుంది. ఇటీవల భీమ్ మనువడు సోనేరావు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి వర్ధంతికి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన జోడేఘాట్‌కు వస్తున్నారు. కాగా.. 2007లో వర్ధంతికి హాజరైన కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జోడేఘాట్ పరిసర ప్రాంతాల్లోని 200 ఎకరాల్లో రూ.వంద కోట్లతో బొటానికల్ పార్కు, మూడెకరాల స్థలంలో మ్యూజియం, భీమ్ నిలువెత్తు కాంస్య విగ్రహంతో పాటు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆదివాసీల్లో ఆనందం.. జోడేఘాట్ పోరుగడ్డపైనే వర్ధంతి వేడుకలను జరపాలనే అధికారుల నిర్ణయంతో ఆదివాసీల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను జోడేఘాట్‌లోనే పరిష్కరించుకుందామనే ధీమాలో కనిపిస్తున్నారు. ఇందుకోసం ఆయా సంఘాల నేతలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలను జోడేఘాట్‌కు పెద్దఎత్తున తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి ఆదివాసీలను తీసుకొచ్చేం దుకు గిరిజన సంఘాలు కార్యాచరణ పూర్తిచేశాయి. ప్రభుత్వ పరంగా తమ ఆరాధ్య దైవమైన కొమురం భీమ్‌కు ఈ సారి నివాళులర్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తరలి వస్తుండడంతో ఇక జోడేఘాట్ పూర్వవైభవం సంతరించుకోనుంది. -
సేంద్రియ ఎరువులు వాడాలి
ఆసిఫాబాద్ : సేంద్రియ ఎరువుల వాడకం వల్ల అనేక లాభాలుంటాయని వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో ‘ఆత్మ’ ఆధ్వర్యంలో ఆదర్శరైతులకు కిసాన్ గోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువుల వాడకం వల్ల మానవులకు కలిగే ఉపయోగాలు, రసాయనిక ఎరువుల వల్ల మానవుని ఆరోగ్యంపై కలిగే నష్టాలు వివరించారు. బీటీఎం గురుమూర్తి మాట్లాడుతూ రైతులు వాణిజ్య పంటలతోపాటు కూరగాయలు, ఆహార పంటలు సాగు చేయాలని సూచించారు. ఎరువులు సమతుల్యంతో వాడడం వల్ల సూక్ష్మధాతువులను నివారించవచ్చని పేర్కొన్నారు. సస్యరక్షణపై అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్, కెరమెరి ఏవోలు ఖాదర్ హుస్సేన్, గోపికాంత్, ఏఈవోలు యాకూబ్, అఖిల్, రామకృష్ణ, ఆసిఫాబాద్, కెరమెరి మండలాలకు చెందిన ఆదర్శరైతులు పాల్గొన్నారు. -
బెల్ట్ షాపులు ఎత్తివేయాలి
ఆసిఫాబాద్ : పట్టణంలోని బెస్తవాడ, బనార్వాడ ప్రాంతాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులు, గుడుంబా స్థావరాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాలనీకి చెందిన మహిళలు స్థానిక ఎక్సైజ్కార్యాలయం ఎదుట ధర్నా చేపటా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూలి పని చేసుకుని జీవించే కార్మికులు, యువకులు మద్యానికి బానిసై ఆర్థికంగా నష్టపోవడంతోపాటు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నడుస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అనం తరం ఎక్సైజ్ ఎస్సై సుందల్ సింగ్‌కు వినతిపత్రం అంద జేశారు. కాలనీ మహిళలు విఠుబాయి, సిందూబాయి, అనిత, మాయ, మనుబాయి, అరవింద్, ఆనంద్, మనోహర్, పెంటుతోపాటు సుమారు 50 మంది పాల్గొన్నారు. -
వ్యాన్ బోల్తా
20 మందికి గాయాలు - ఆసిఫాబాద్‌లో ప్రమాదం - బారసాలకు వస్తుండగా ఘటన - బాధితుల్లో మహిళలే అధికం - క్షతగాత్రులు మహారాష్ట్ర వాసులు ఆసిఫాబాద్/మంచిర్యాల టౌన్ : ఆసిఫాబాద్ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ టవర్స్ సమీపంలోని రాష్ట్రీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా భారీ గ్రామానికి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. భారీ గ్రామానికి చెందిన 40 మంది బంధువులు ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామానికి చెందిన నాగోశ గణపతి ఇంట్లో నిర్వహించనున్న బారసాల శుభకార్యానికి ఉదయం వ్యాన్‌లో బయలు దేరారు. అరగంటలో గమ్యానికి చేరుకోవాల్సిన వారు బీఎస్ఎన్ఎల్ టవర్స్ సమీపంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వ్యాన్‌లో ఉన్న శెండె తారాబాయి, ఊశన్కర్ తిరుపతి, శెండె గంగుబాయి, శెండె సుమిత్ర బాయి, పూర్ణె లక్ష్మి, శెండె అమ్మబాయి, శెండె రమలాబాయిలకు తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కాగా, మొహర్లె పోతాబాయి, చోటాబాయి, విమలాబాయి, కమలాబాయి, తారాబాయి, సుకాజి, సోంబాయి, గౌరుబాయి, నాలుగేళ్ల చిన్నారి శ్వేతతోపాటు 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. వైద్యులు సత్యనారాయణ, తిరుపతి వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శాంతాబాయి, తిరుపతి, గంగుబాయి, సుమిత్ర బాయి, లక్ష్మిలను మంచిర్యాలకు తరలించారు. ఎస్సై రాంబాబు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధితులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆసిఫాబాద్, వాంకిడి జెడ్పీటీసీలు కొయ్యల హేమాజి, అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ తారాబాయి, టీఆర్ఎస్ నాయకులు గంధం శ్రీనివాస్, గాదెవేని మల్లేశ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్ల నారాయణ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. డ్రైవర్ సుభాష్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మిన్నంటిన రోదనలు ఆసిఫాబాద్‌లోని బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 13 మంది క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. వీరికి వైద్యులు ప్రత్యేక వైద్య పరీక్షలు అందజేశారు. ఇందులో గంగుబాయి, శాంతాబాయి, కమలాబాయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. కాగా 13 మంది క్షతగాత్రుల బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలిరావడంతో ఆస్పత్రి ఆవరణ బంధువుల రోదనలతో దద్దరిల్లింది. -
రాథోడ్‌కు ఓటమి భయం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్‌కు ఓటమి భయం పట్టుకుందా? ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం బరిలో దిగితే పరాజయం పాలవుతానని ఆందోళన చెందుతున్నారా? ఎంపీ స్థానం కంటే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే స్థానం సురక్షితమని భావిస్తున్నారా? ఆయ న వేసిన నామినేషన్లను పరిశీలిస్తే అవుననే విషయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల పర్వం బుధవారం ప్రారంభమైంది. తొలిరోజే రాథోడ్ రమేష్ ఆదిలాబాద్ ఎంపీ స్థానంతోపాటు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్లు వేశారు. ఖాళీ అయిన జిల్లా టీడీపీలో మిగిలిన ఒకరిద్దరు ముఖ్యనేతల్లో రాథోడ్ రమేష్ ఒకరు. రెండు కళ్ల సిద్ధాం తం, అప్పుడే రాష్ట్ర విభజనకు తొందరెందుకంటూ తెలంగాణ అడ్డుకునేందుకు కేంద్రంలో పావులు కదిపిన చంద్రబాబుకు రాథోడ్మ్రేష్ ఆది నుంచి అండగా నిలుస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్‌తోపాటు, ముఖ్యనేతలంతా టీడీపీని వీడినా, రాథోడ్ రమేశ్ మా త్రం చంద్రబాబునే అంటి పెట్టుకున్నారు. దీంతో తెలంగాణవాదుల్లో రాథోడ్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ అంశమే అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపనుండటంతో రాథోడ్ అం తర్మథనంలో పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆయన ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు బీజేపీతో పొత్తుల చర్చలు కొలిక్కి వస్తున్నా, సీట్ల పంపకాల విషయంలో స్పష్టత రాలేదు. జిల్లాలో ఏ సీటు బీజేపీకి వెళుతుందో, టీడీపీకి ఏఏ స్థానాలు దక్కుతాయో తేలక ముందే ఆయన ఆఘమేఘాలపై ఆసిఫాబాద్‌కు నామినేషన్ వేయడం ఈ రెండు పార్టీల శ్రేణుల్లో కలకలం రేగింది. బీజేపీతో పొత్తుపైనే ఆశలు వరుస వలసలు, తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత, చంద్రబాబు వైఖరి కారణంగా తీవ్ర సంక్షోభంలో పడిన టీడీపీ జిల్లాలో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోర పరాజయం పాలవుతామనే నిర్ణయానికి వచ్చిన ‘దేశం’ నేతలు బీజేపీతో పొత్తుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు ఉంటుందని రాథోడ్ రమేష్ మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. కానీ జిల్లాలోని బీజేపీ శ్రేణులు టీడీపీతో పొత్తుకు ససేమిరా అం టున్నాయి. ఇందులో భాగంగా టీడీపీకి ధీటుగా బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఎంపీగా ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎంపీగా పోటీ చేసేందుకు రాథోడ్ పునరాలోచనలో పడటంతో టీడీపీ ప్రత్యామ్నాయ అభ్యర్థి వేటలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన సోయం బాపురావును ఎంపీగా బరిలో దించాలని భావిస్తోంది. సోయం బాపురావు మాత్రం బోథ్ ఎమ్మెల్యే స్థానానికి మాత్రమే పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. పొత్తులో భాగంగా ఈ ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాను మాత్రం బోథ్ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, ఒకవేళ ఎంపీగా పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే ఎంపీగానే బరిలోకి దిగుతానని సోయం బాపురావు తన సన్నిహితుల వద్ద పేర్కొంటున్నారు. -
తనిఖీల్లో నగదు పట్టివేత
రెబ్బెన, న్యూస్‌లైన్ : మండలంలోని గోలేటి ఎక్స్‌రోడ్డు వద్ద మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు బెల్లంపల్లి నుంచి ఆసిఫాబాద్‌కు కారులో తరలిస్తున్న రూ.33లక్షల నగదు పట్టుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించి తహశీల్దార్ జగదీశ్వరి సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం బెల్లంపల్లి డీఎస్పీ ఈశ్వర్రావు వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లికి చెందిన ఓ పెట్రోల్ బంక్ యజమాని రూ.33లక్షల నగదు కారులో ఆసిఫాబాద్‌కు తరలిస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో పత్రాలు లేకపోవడంతో ఐటీ అధికారులకు అప్పగించన్నుట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ తహశీల్దార్ రాంమోహన్‌రావు, తాండూర్ సీఐ ఎండీ సర్వర్, రెబ్బెన ఎస్సై శ్రీనివాస్, ఆర్ఐ బక్కయ్య పాల్గొన్నారు. గూడెం చెక్‌పోస్టు వద్ద.. దండేపల్లి : మండలంలోని గూడెం అటవీ చెక్‌పోస్టు వద్ద సోమవారం రాత్రి ఎన్నికల అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. రామకృష్ణాపూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి మారుతీకారు తనిఖీ చేయగా రూ.60వేల నగదు లభించింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో దండేపల్లి ఎస్సై మోహన్‌బాబుకు అప్పగించారు. నగదును మంగళవారం కోర్టులో స్వాధీనం చేశారు. కాగజ్‌నగర్‌లో.. కాగజ్‌నగర్ : ఆసిఫాబాద్ నుంచి సిర్పూర్(టి) వైపు వెళ్తున్న ఎండీ.తాజుద్దీన్ వద్ద రూ.లక్షా 6వేలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పట్టణంలోని అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఆసిఫాబాద్‌కు చెందిన తాజుద్దీన్ ఎలాంటి ఆధారాలు లేకుడా ద్విచక్ర వాహనంపై నగదు తరలిస్తుండగా పట్టుకున్నారు. సిర్పూర్(టి) మండలం హీరాపూర్‌లో పత్తి కొనుగోలు చేశానని, దానికి సంబంధించిన డబ్బులను చెల్లించేందుకు వెళ్తున్నానని చెప్పినా ఆధారాలు లేకపోవడంతో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
జోరుగా ఇసుక దందా
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. స్మగ్లర్లకు కాసులు కురిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని పెద్దవాగు, చిర్రకుంట, చిలాటిగూడ, రెబ్బెన మండలం కొండపెల్లి తదితర గ్రామాల్లోని వాగులు, ఒర్రెల నుంచి నిత్యం ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కొందరు రాత్రివేళ పెద్ద వాగు నుంచి జేసీబీ ద్వారా ఇసుక తోడి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రహస్యంగా నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అభివృద్ధి పనులు, గృహనిర్మాణ పనుల పేరుతో స్మగ్లర్లు ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. పెద్దవాగు నుంచి ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను ఇటీవల పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయినా స్మగ్లర్లు వెనుకంజ వేయకుండా దందా అలాగే కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆసిఫాబాద్ నుంచి వాంకిడి, కెరమెరి, జైనూర్, ఉట్నూర్, ఆదిలాబాద్‌కు ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.600 నుంచి రూ.800, వాంకిడికి రూ.1200 నుంచి రూ.1600, కెరమెరికి రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్కైతే టిప్పర్ల ద్వారా తరలిస్తూ ఒక్కో టిప్పర్ ఇసుకకు రూ.20 వేల వరకు దండుకుంటున్నారు. టెండర్ల ప్రక్రియ స్థానిక పెద్దవాగు నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమంగా రవాణా చేస్తుండడంతో ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. నియోజకవర్గం లోని వాగులు, ఒర్రెల్లో ఇసుక సేకరణకు టెం డర్లు నిర్వహిస్తే ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదా యం సమకూరుతుంది. ఇటీవల ఇసుక టెండర్ల నిర్వహణకు సర్వే నిర్వహించిన అధికారులు ఆపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో టెండర్ల ప్రక్రియ ముందుకు సాగడంలేదు. నిబంధనలకు తూట్లు వంతెనలు, కల్వర్టుల వద్ద ఇరువైపులా ఇసుక తవ్వకాలపై నిషేధం అమలులో ఉన్నా స్మగ్లర్లు ఖాతరు చేయడంలేదు. అడ్డూఅదుపు లేకుండా తవ్వకాలు సాగిస్తూ అందినంత ఇసుక తరలిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదముందని, పర్యావరణానికి ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. -
ప్రాణం తీసిన క్రికెట్
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్: బూర్గుడ గ్రామానికి చెందిన రైతు లోకండే నాగయ్య, లక్ష్మీ దంపతుల నాలుగో కుమారుడు సాయికిరణ్(15) ఆసిఫాబాద్‌లోని వాసవి విద్యామందిర్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో గురువారం సాయంత్రం స్నేహితులతో కలిసి గ్రామంలోని రైస్‌మిల్లు వెనుకాల ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా బంతి వెళ్లి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కంచెలో పడింది. బంతిని పట్టుకునేందుకు పరుగెత్తిన సాయికిరణ్ ట్రాన్స్ఫార్మర్ను గమనించకుండా లోపలికి వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్కు ప్రమాదవశాత్తు తగలడంతో షాక్‌కు గురై సాయికిరణ్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. అతడి వెనుకాల వెళ్లిన ఇదే గ్రామానికి చెందిన జనగాం పెంటయ్య, పద్మ దంపతుల కుమారుడు ప్రసాద్ కూడా షాక్‌కు గురయ్యాడు. అక్కడే ఉన్న స్నేహితులు గమనించి కర్రతో కొట్టగా.. తీవ్ర గాయాలై ప్రాణాలతో బయపడ్డాడు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కాగజ్‌నగర్‌కు తరలించారు. విషాదం మిగిల్చిన సెలవులు సంక్రాంతి సెలవులు సాయికిరణ్ కుటుంబంలో విషాదం మిగిల్చాయి. సాయికిరణ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. ఆసిఫాబాద్‌లోని విద్యామందిర్‌లో చదువుతూ స్నేహితులు, విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి మెలిసి ఉండేవాడు. మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు అధిక సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి కుటుంబాన్ని డీసీసీ ప్రధాన కార్యదర్శి విశ్వప్రసాదరావు, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, సర్పంచ్ మెకర్తి కాశయ్య, వాసవి విద్యామందిర్ ఉపాధ్యాయులు పరామర్శించారు. ఎస్సై సాదిక్ పాషా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. -
చుక్కల్లో ‘సన్నాలు’
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు సన్న బియ్యం కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. పక్షం రోజుల్లో క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు పెరిగాయి. పదిహేను రోజుల క్రితం బ్రాండేడ్ జై శ్రీరాం బియ్యం క్వింటాల్‌కు రూ.4,800 ఉండగా, ప్రస్తుతం రూ.5,800 చేరాయి. లోకల్ జైశ్రీరాం రూ.4,200 నుంచి రూ.5,200, బీపీటీ రూ.3,400 నుంచి రూ.4,000, హెచ్ఎంటీ రూ.4,000 నుంచి రూ.4,600 పెరిగాయి. స్వల్ప వ్యవధిలోనే బియ్యం ధరలు పెరగడంతో ప్రజలు జంకుతున్నారు. తుపాన్ ప్రభావం.. మిల్లర్ల మాయాజాలం ఇటీవల ఆంధ్ర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన నీలం, పై-లీన్, హెలెన్ తుపాన్ల ప్రభావంతో తీవ్రంగా పంటల నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో వరి పంటలపై తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఆంధ్రలో పంటలు నష్టపోవడంతో బియ్యం కొరత ఏర్పడింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రాకు టన్నుల కొద్ది బియ్యం ఎగుమతి అవుతున్నాయి. దీనికి తోడు రైస్ మిల్లుర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధాన్యాన్ని నిల్వ ఉంచిన మిల్లర్లు అక్రమార్జన కోసం ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారు. ప్రభుత్వం బియ్యం ధరలు నియంత్రించక పోవడంతో ప్రజలు వ్యాపారులు చెప్పిన ధరలకే కొనాల్సి వస్తుంది. జిల్లాలో కూడా ఈఏడు అత్యధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గింది. ఏటా ఆంధ్ర ప్రాంతం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌తోపాటు మహారాష్ట్ర నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి. కానీ, ఈసారి జిల్లా నుంచే ఎగుమతి చేయడంతో కొరత ఏర్పడి ధరలు భగ్గుమంటున్నాయి. -
ముస్లింలు అభివృద్ధి చెందే వరకు పోరాడుతా..
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే వరకు పారాటం సాగిస్తానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం ముస్లింలకు అన్ని రంగాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్‌లోని రోజ్ గార్డెన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఒక అడుగు ముందుకు వెళ్తే, అగ్రకుల ఆధిపత్యంతో ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. స్వాతంత్య్రానంతరం విద్యా, ఉద్యోగ రంగాల్లో 30 నుంచి 40 శాతం ఉన్న ముస్లింలు ప్రస్తుతం మూడు శాతానికి వచ్చారన్నారు. ముస్లింలకు సమస్యలు వస్తే చెప్పుకునేందుకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడన్నారు. సమాజంలో ఏ వర్గం వెనుకబడి ఉంటే, ఆ వర్గానికి అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుంచి ముస్లింలకు అండగా నిలుస్తుందని, బాబ్రీ మసీదు కూల్చివేత, గోద్రా అల్లర్ల సమయంలో పూర్తి మద్దతు ప్రకటించానన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని సామాజిక న్యాయమే లక్ష్యంగా, జనవరి 4న కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భాగస్వామ్యంతో రాజ్యాధికారం లక్ష్యంగా పని చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం వికలాంగులు, ఎమ్మార్పీఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్, జిల్లా అధ్యక్షుడు పెద్ద సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు అమీన, వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇస్లాంబిన్ హసన్, ఎంఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి ఊశన్న, ముస్లిం నాయకులు అవద్‌బిన్ మోసిన్, ముబీన్, శేక్ చాంద్, జాఫర్, ఉమేద్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సునీల్, మండల అధ్యక్షుడు ఇప్పదాసు, నాయకులు నాగరాజు, వడ్లూరి కృష్ణ , వికలాంగులు, వితంతువులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
బీజేపీకి టీడీపీతో పొత్తు ఉండదు
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ గిరిజన మోర్చా జాతీయ కార్యదర్శి గుగ్లావత్ శ్రీరాంనాయక్ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక అటవీ శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తాము ఒంటరి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలోని కొందరు టీడీపీ ప్రధాన నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశ ప్రజల కష్టాలు తొలగిపోతాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణను మరో గుజరాత్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. సర్ధార్ వల్లాభాయ్ పటేల్‌ను కేంద్రప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. ప్రధాని మన్మోహన్సింగ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చేతిలో, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాజీ ఎమ్మెల్సీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో ఆసిఫాబాద్‌లో అభివృద్ధి కానరావడం లేదని ఆరోపించారు. బీజేపీ కాంట్రాక్ట్ సెల్ జిల్లా కన్వీనర్ గుల్ఫం చక్రపాణి, జిల్లా కన్వీనర్ చెర్ల మురళి, నాయకులు ప్రకాశ్ జాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలతో అంతే.. రెబ్బెన : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యహరించే ఏ పార్టీతో బీజేపీ పొత్తులు పెట్టుకోబోదని శ్రీరాంనాయక్ స్పష్టం చేశారు. ఆదివారం గోలేటిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మనుగడ కోసమే బీజేపీతో పొత్తు ఉంటుందని తప్పుడు సంకేతాలు ప్రజలకు అందిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో తాము పార్టీ తరఫునే పోటీ చేస్తామని తెలిపారు. జిల్లా కార్యదర్శి మురళీధర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆంజనేయులుగౌడ్, అసెంబ్లీ కన్వీనర్ జేబీ పౌడెల్, కాంట్రాక్టర్ సెల్ జిల్లా కన్వీనర్ చక్రపాణి, మాజీ అసెంబ్లీ కన్వీనర్ సంతోష్ శర్మ, బీజేవైఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, మండల అధ్యక్షుడు రాచకొండ రాజు పాల్గొన్నారు.