గిరిజన చరిత్ర డిజిటలీకరణ         | Union Budget Focused On Tribal Digitalisation | Sakshi
Sakshi News home page

గిరిజన చరిత్ర డిజిటలీకరణ        

Published Sat, Jul 6 2019 11:30 AM | Last Updated on Sat, Jul 6 2019 11:34 AM

Union Budget Focused On Tribal Digitalisation - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే మిగిలింది. దేశ వ్యాప్తంగా వెనకబడిన కుమురంభీం జిల్లా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఎటువంటి బడ్జెట్‌ కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌ అస్ప్రిరేషనల్‌ జిల్లాలో కుమురం భీం జిల్లా ఒకటిగా ఉన్నప్పటికీ బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజన సాంస్కృతిని డిజిటలీకరణ చేస్తామని  పేర్కొనడం జిల్లాలో గిరిజనుల కొంత ఊరట కలిగే అంశం. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌ 2019–20 దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రాష్ట్రాల పరంగా తెలంగాణకు పెద్దగా నిధుల కేటాయింపులేవు.

అందులోనూ జిల్లాలకు ప్రత్యేకించి ప్రస్తావన లేకపోవడంతో దేశ వ్యాప్తంగా ఈ వా ర్షిక సంవత్సరంలో అమలు చేయనున్న పలు పథకాల్లో జిల్లా ప్రజలకు అనాది నుంచి ఆదివాసీ, గిరిజనులు ఎంతో చరిత్ర కలిగినప్పటికీ వారిపై పరిశోధన, చరిత్ర అందరికీ అందుబాటులో లేదు. అయితే ఈ బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనుల సంస్కృతి, నృత్యం, ఆచారాలు, చరిత్రను డిజటలీకరణ చేయనున్నారు. చరిత్రను పుస్తకాల్లో కాక ఇక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించి భద్ర పర్చనున్నారు. దీంతో జిల్లాలో పోరాట యోధుడు కుమురం భీం చరిత్ర, జంగుబాయి,  గిరిజన కట్టు బొట్టు ఆచార వ్యవహారాలు, గుస్సాడీ నృత్యాలు, తుడం వాయిద్యాలు, ఇతర సంప్రదాయాలకు సంబందించిన నృత్యాలతో పాటు హైమన్‌ డార్ఫ్‌ పరిశోధనలు, జోడే ఘాట్‌ లాంటి ప్రదేశాలు జిల్లాలో గిరిజన చరిత్ర డిజిటలీకరణ లో చోటు దక్కే అవకాశం ఉంది. 

రైతులకు మరింత భారం
ఇక పెట్రోల్‌ డిజీల్‌ ధరలు పెరగడంతో రైతులకు, వాహనదారులకు మరింత భారం కానుంది. లీటరు పెట్రోల్, డిజిల్‌ కు రూ.1 చొప్పున సెస్‌ విధిస్తుండడంతో వ్యవసాయంలో ట్రాక్టర్లు, జనరేటర్లు, ఇతర సాగు చేసే యంత్రాల వినియోగంలో ఆర్థిక భారం పడనుంది. అయితే రైతు సంఘాల ఏర్పాటుతో రైతులకు కొంత లబ్ధితో పాటు చిరు దాన్యాల సాగు కోసం పప్పు దాన్యాల విప్లవం కోసం ప్రోత్సాహాకాలు అందిస్తే స్థానిక రైతులు పత్తి నుంచి పప్పుదాన్యాల పంటల వైపు మళ్లే అవకాశం ఉంది. 

గ్యాస్‌ సడ్సిడీతో మహిళలకు ఊరట
పేదింటి మహిళకు కట్టెల పొయ్యి వాడే వారికి కొంత ఊరట కలగనుంది. దేశ వ్యాప్తంగా అందరికీ గ్యాస్‌ పొయ్యిలను సబ్సిడీ పై ఇచ్చేందుకు ఈ బడ్జెట్‌లో ప్రస్తావించారు. ఇప్పటికే జిల్లాలో ఆరు గ్యాస్‌ ఎజెన్సీల పరిధిలో లక్ష వరకు గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. మరో 10వేల మంది వరకు గ్యాస్‌ క¯ð క్షన్లు వరకు పొందాల్సి ఉంది. గిరిజన గూడెల్లో ఉండే మహిళలు ఇంకా కట్టెల పొయ్యిల మీదనే వంట చేస్తున్నారు. వీరికి లబ్ధి చేకూరనుంది. 

మహిళ సంఘాలకు ‘ముద్ర’
ఇప్పటి వరకు వివిధ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేందుకు ఇచ్చే ముద్ర రుణాలను ఇక నుంచి మహిళా సంఘాల సభ్యలకు ఇవ్వనున్నారు. ఒక మహిళా సంఘానికి ఒక లక్ష రూపాయల వరకు ముద్ర రుణాలను ఇవ్వనున్నారు. జిల్లాలో 7425 మహిళా సంఘాలు ఉండగా ఇందులో 80వేల మంది మహిళా సభ్యులు ఉన్నారు. అలాగే జన్‌ధన్‌ బ్యాంకు ఖాతా ఉన్న మహిళలకు రూ.5వేల వరకు ఓవర్‌ డ్రాప్ట్‌  నగదు తీసుకునే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా మహిళా సమ్మిళిత శిశు అభివృద్ధి పథకం కోసం 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.27వేల కోట్లు కేటాయించారు. అంతేకాక మహిళా సంక్షేమం అమలు చేసేందుకు ‘నారి తూ నారాయణీ’ అనే కమిటీ ఏర్పాటు కూడా చేయననున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 

యువతకు నైపుణ్యాభివృద్ధి 
దేశ వ్యాప్తంగా కోటి మంది యువతకు వృత్తిలో నైపుణ్యతను సాధించేందుకు ప్రధాన్‌ మంత్రి కౌశల్‌ యోజనతో నైపుణ్యం కలిగించనున్నారు. జిల్లాలో దాదాపు 20వేల మంది యువత నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా. ఈ పథకం అమల్లోకి వస్తే జిల్లాలోని యువతకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అంతేకాక ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ కోసం భారత్‌ నెట్‌ పథకం కింద ఇంటర్నెట్‌ సేవల పథకం ప్రారంభం కానుంది.

రూ.45లక్షల లోపు ఇళ్లు కొనుగోలు చేసే వారికి ఇంటి రుణం పై ఆదాయపు రాయితీ రూ.1.5 మేర కొత్తగా కలగనుంది. దేశవ్యాప్తగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు, సాగుతోపాటు ప్రతి నివాసాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జిల్లాలో రోడ్డు సౌకర్యం లేని 300పైగా ఆవాసాలకు సౌకర్యం కలగనుంది. దీంతో గ్రామస్తులు కొంత ఊరట చెందుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement