CM KCR To Distribute Podu Lands At Asifabad: Live Updates - Sakshi
Sakshi News home page

పోడు భూముల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్‌

Published Fri, Jun 30 2023 10:44 AM | Last Updated on Fri, Jun 30 2023 11:29 AM

CM KCR Podu Lands Distribution At Asifabad Live Updates - Sakshi

Updates..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి మంత్రి హరీష్ రావు హెలికాప్టర్‌లో బయలుదేరారు. 

► హరీష్‌తో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. 

► సాక్షి, హైదరాబాద్‌/ ఆసిఫాబాద్‌: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతుల కల సాకారం కానుంది. వీరికి పట్టా పుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ క్రమంలో ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలు అందజేయనున్నారు. మిగతా జిల్లాల్లో జిల్లా మంత్రుల చేతుల మీదుగా అర్హులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తారు.

► పోడు భూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 1,50,012 మంది రైతులు 4,05,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గిరిజనులు, ఆదివాసీలే. కాగా అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్‌ జిల్లాలో 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement