distribution
-
అంతా మనకే.. నీకింత.. నాకింత!
ఎప్పుడూ లేనిది ఇప్పుడే జరుగుతున్నట్లు హడావిడి చేయడం.. ఆ ముసుగులో అందినకాడికి దండుకునేందుకు మంత్రాంగంతో యంత్రాంగాన్ని పురమాయించడం.. ఆపై అనుకూల సంస్థలకే టెండర్లు దక్కేలా తిమ్మినిబమ్మి చేస్తూ నిబంధనలు మార్చడం.. ఆ తర్వాత ఇష్టానుసారం ఎస్టిమేషన్లతో సర్కారు ఖజానాకు కన్నం వేయడం కూటమి ప్రభుత్వ పెద్దలకు పరిపాటిగా మారింది. ఏ మంత్రిత్వ శాఖలో ఏ పనికి టెండర్ పిలవాల్సి వచ్చినా, తొలుత ముఖ్య నేత దిశా నిర్దేశం తప్పనిసరిగా మారింది. ఆ నేత సూచనల మేరకే సదరు మంత్రి మధ్యవర్తిత్వంతో కాంట్రాక్టు సంస్థ ఏదన్నది ముందుగానే ఫైనలైపోతోంది.ఆ తర్వాత ఆ సంస్థకే కాంట్రాక్టు దక్కేలా చేసేందుకు అనుకూల యంత్రాంగం ద్వారా చకచకా పావులు కదులుతున్నాయి. ఇందులో సంస్థ గత అనుభవంతో పని లేదు.. ఎంత బాగా పని చేసిందన్నది అక్కర్లేదు.. అసలు ఆ సంస్థకు అర్హత ఉందా అన్నది అసలే అవసరం లేదు. దిక్కుమాలిన షరతులతో టెండర్లు పిలవడం.. ఇతర సంస్థలన్నింటిపై అనర్హత వేటు వేయడం.. అనుకున్న సంస్థకే టెండర్ కట్టబెట్టడమే ప్రధానం. ఇందుకు ఎవరైనా అడ్డు తగిలితే.. తప్పుడు కేసులు పెట్టి అయినా వారి నోరు మూపించడం మామూలైపోయింది. రాష్ట్రంలో ఏడు నెలలుగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి మచ్చుకు మూడు ఉదాహరణలు ఇలా ఉన్నాయి. – సాక్షి, అమరావతి/సాక్షి ప్రత్యేక ప్రతినిధి పెద్ద కంపెనీలే ముద్దు రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడేళ్లకు రూ.1,300 కోట్ల విలువైన సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ పనుల కోసం వైద్య శాఖ టెండర్లు పిలిచింది. మొత్తం ఆస్పత్రులను మూడు జోన్లుగా విభజించి టెండర్లు పిలిచారు. ఈ పనులను ఇప్పటి వరకు ఎక్కడికక్కడ చిన్న చిన్న కంపెనీలు చేసేవి. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న యువ మంత్రి జోక్యంతో సీన్ మారిపోయింది. చిన్న కంపెనీలు టెండర్లలో పాల్గొనకుండా నిబంధనలు మార్చేశారు. ఎక్కువ టర్నోవర్ ఉండే పెద్ద కంపెనీకే కాంట్రాక్ట్ దక్కేలా చక్రం తిప్పారు.గతంలో రాష్ట్ర వైద్య శాఖలో అత్యవసర వైద్య సేవల కాంట్రాక్టు నిర్వహించిన సంస్థతోపాటు, ఉత్తరాదికి చెందిన బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడి సెక్యూరిటీ నిర్వహణ సంస్థకు కాంట్రాక్టులు దక్కేలా ఓ మంత్రి, జనసేనకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ముందుండి నడిపిస్తున్నట్లు సమాచారం. జోన్–1లో కాంట్రాక్ట్‌లు జనసేన కోటాగా కేటాయించారు. చిన్నా చితకా కంపెనీలు కన్షార్షియంగా టెండర్లు వేసినప్పటికీ, వారికి పనులు దక్కకుండా ఆపరేషనల్ ఎక్స్పెండేచర్ 3.85 శాతం నుంచి 5 శాతం మధ్యే ఉండాలంటూ మరో నిబంధన పెట్టారు. ఈ నేపథ్యంలో టెండర్లు వేసిన వారందరూ 3.85 శాతం ఎలాగూ వేస్తారని, అయితే ఎక్కువ టర్నోవర్ ఉన్న వారినే ఎల్1గా పరిగణిస్తారని చిన్న కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ‘కుట్టు’ టెండర్లో కనికట్టు! రాష్ట్రంలో బీసీ మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ టెండర్లలో భారీ అవినీతికి రంగం సిద్ధమైంది. అస్మదీయులు ఒకరిద్దరికి టెండర్ కట్టబెట్టేలా దేశంలో మరెక్కడా లేని షరతులు ముందుకొచ్చేశాయి. ఏపీ బీసీ సహకార సంస్థ లిమిటెడ్ ద్వారా 46,044 మంది బీసీ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లను పంపిణీ చేసేందుకు గత నెల 18న ప్రభుత్వం టెండర్‌ను ఆహ్వానించింది. ఒక్కో లబ్ధిదారుకు రూ.25 వేల చొప్పున రూ.115 కోట్లు టెండరు మొత్తంగా పేర్కొంది. గత నెల 31వ తేదీ తుది గడువు కాగా ప్రీబిడ్ మీటింగ్ ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు 360 గంటలు ఉచిత శిక్షణ ఇవ్వాలి. ఒక్కో బ్యాచ్‌లో 50 మందికి తక్కువ కాకుండా ఉండాలి.బయోమెట్రిక్, మాన్యువల్ హాజరు నమోదు చేయాలి. షార్ట్ టెండర్ అయినప్పటికీ వివిధ రాష్ట్రాలకు చెందిన 80 మందికి పైగా టెండర్లు దాఖలు చేశారు. గత పది ఆర్థి క సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఒక్క ఏడాదైనా పది వేల మందికి కుట్టు పనుల్లో శిక్షణ ఇచ్చి ఉండాలనేది టెండరులో ముఖ్య నిబంధన. దీనిపై ప్రీ బిడ్ సమయంలో టెండర్‌దారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ‘సర్దుబాటు ఒప్పందాల’కు ఇబ్బంది లేకుండా ముఖ్య నేత సూచనతో లబ్ధిదారుల సంఖ్య 92,088కు, టెండర్ విలువ రూ.230 కోట్లకు పెంచేశారు. దేశ వ్యాప్తంగా ఎక్కడైనా శిక్షణ ఇచ్చి ఉండవచ్చని చెబుతూ తాజాగా టెండర్‌ను ఆహా్వనించారు. అస్మదీయులకు టెండర్ కట్టబెట్టడానికే ఇలా చేశారని టెండరుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే సంస్థకు ఆలయాల్లో ‘క్లీనింగ్’! రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో పారిశుధ్య నిర్వహణ పనులను ఒకే సంస్థకు అప్పగించేందుకు వీలుగా ‘ముఖ్య’ నేత డైరెక్షన్లో దేవదాయ శాఖ అధికారులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఏ ఆలయానికి ఆ ఆలయమే పారదర్శకంగా టెండర్లు పిలిచి కాంట్రాక్టులు అప్పగించి పనులు చేయించుకునే విధానాన్ని నిలిపి వేసి, నెలానెలా కాంట్రాక్టును పొడిగిస్తూ వస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఏకీకృత విధానం పేరుతో శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం ఆలయాల్లో పనులు ఒక్కరికే అప్పగించేలా స్కెచ్ వేశారు. ఏటా ఈ ఆలయాలకు రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఒక్కోదానికి ఆదాయం ఉంటుంది. ఇంత భారీగా ఆదాయం ఉన్నందున ఒకే సంస్థకు పారిశుధ్య నిర్వహణ అప్పగిస్తే అనుకున్న రీతిలో దండుకోవచ్చని స్కెచ్ రూపొందించారు.2015–19 మధ్య చంద్రబాబుకు బంధువుగా చెబుతున్న భాస్కరనాయుడు అనే వ్యక్తికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్విసు సంస్థకు ఏడు ఆలయాల క్లీనింగ్ కాంట్రాక్టును కట్టబెట్టారు. అప్పట్లో క్లీనింగ్ పనులు సరిగా చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ సంస్థలకు ఆయా ఆలయాలు రెట్టింపు డబ్బు చెల్లించినట్లు ఆ శాఖ అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఉమ్మడి టెండర్ విధానానికి స్వస్తి పలకడంతో ఈ దందా ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పగ్గాలు చేపట్టడంతో భాస్కర్‌నాయుడితో పాటు అలాంటి వాళ్లు తెరపైకి వచ్చి దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. -
పేదల ఇళ్లను కూడా వదల్లేదు.. చంద్రబాబు మరో కుట్ర
-
పాతబస్తీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో భూసేకరణ ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు రేపు(సోమవారం) చెక్కుల పంపిణీ చేయనున్నట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పాత నగరంలో రెండో దశ మెట్రో పనుల ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతోంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడానికి ముహూర్తం ఖరారు చేసింది.కారిడార్-6లో ఎంజీబీఎస్- చంద్రాయణ్ గుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా, పెద్ద ఎత్తున వాటి యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 169 మంది వారి అనుమతి పత్రాలను ఇచ్చారని ఆయన వెల్లడించారు. వాటిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ధ్రువీకరణ పూర్తయిందన్నారు. తొలి దశలో ఈ 40కి పైగా ఆస్తుల యజమానులకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.వారికి నష్టపరిహారాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ చెక్కుల రూపంలో అందజేస్తారని తెలిపారు. ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి రు. 81,000/- ఇవ్వడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిర్ణయించారని.. దీంతో పాటు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ప్రకారం, పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా నష్టపరిహారాన్ని అర్హులైన ఆస్తుల యజమానికి ఇవ్వడం జరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: సంక్రాంతికి సొంతూరు వెళ్లేదెలా?భూ సేకరణ చట్టానికి లోబడి నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ నిర్ణయం ప్రకారం పరిహారాలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. లక్డీకాపుల్ దగ్గర ఉన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు త్వరిత గతిన మెట్రో పనులు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని, దీనిలో భాగంగా తొలుత 40 కి పైగా ఆస్తుల యజమానులకు ఇప్పుడు చెక్కుల పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అధికారుల తరఫున మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. -
సు‘దూర’ విద్య!
గుంటూరు ఎడ్యుకేషన్: దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఆగస్టులో అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు డిసెంబర్ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయకుండా ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.2024–25 విద్యాసంవత్సరానికి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించిన అడ్మిషన్ల ద్వారా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో దాదాపు లక్ష మంది ప్రవేశం పొందారు. వీరికి వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు జరుగుతాయి. వీరందరికీ ప్రస్తుతం గుంటూరులోని ఏపీఓఎస్ ఎస్ రాష్ట్ర కార్యాలయం నుంచి పాఠ్య పుస్తకాలను పోస్టాఫీసుల ద్వారా పంపుతున్నారు. డిసెంబర్ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్తకాలు అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పటికి 30 వేల మందికి పైగా పుస్తకాలు అందించినట్టు ఏపీఓఎస్ఎస్ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. -
ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఒకే డిజైన్ చీరలు
సాక్షి, హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) సభ్యులుగా ఉన్న మహిళలకు ఒకే డిజైన్‌తో ఉండే చీరలు పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా విధి విధానాలు ఖరారు చేయా లని నిర్ణయించింది. చీరల పంపిణీ పథకాన్ని ఏ తరహాలో అమలు చేయాలనే అంశానికి సంబంధించి చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల సమీక్షించారు. మరో వారం రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డితో జరిగే భేటీలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత, చీరల పంపిణీ పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్‌కార్డులో పేర్లు కలిగిన 18 ఏళ్లు పైబడిన యువతులు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. అయితే రాష్ట్రంలో గ్రామీణ పేదరి క నిర్మూలన సంస్థ (సెర్ప్), మెప్మా పరిధిలోని 63 లక్షల మంది మహిళా సభ్యులకు ఈ చీరలు పంపిణీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే స్వయం సహాయక సంఘా ల మహిళలకు పంపిణీ చేసేది బతుకమ్మ చీరలు కాదని, రాష్ట్రమంతటా ఒకే డిజైన్ కలిగిన చీరలను పంపిణీ చేస్తామని చేనేతశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని, సరఫరాలో కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా స్థానికంగా ఉండే నేత కారి్మకులను భాగస్వాములను చేస్తూ నాణ్యత కలిగిన చీరలను ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో మహిళకు ఒకటా.. రెండా..? స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒక్కొక్కరికీ ఏటా ఎన్ని చీరలు పంపిణీ చేయాలనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎస్‌హెచ్‌జీల్లో పెరిగే సభ్యు ల సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకొని ఏటా రెండేసి చీరల చొప్పున పంపిణీ చేస్తే 1.3 కోట్ల చీరలు అవసరమవుతాయని ప్రాథమికంగా లెక్కలు వేశా రు. ఒక్కో చీర తయారీకి అయ్యే ఖర్చు, ఏటా కేటాయించాల్సిన బడ్జెట్ తదితరాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఈ చీరలను పండుగ సమయా ల్లో ఇవ్వాలా, ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఇవ్వా లా అకోణంలోనూ అధికారులు ఆలోచిస్తున్నారు. 2017లో బతుకమ్మ చీరల పథకం ప్రారంభంకాగా సగటున రూ.325 కోట్ల బడ్జెట్‌తో కోటి చీరలు పంపిణీ చేస్తూ వచ్చారు. గత ఏడాది 30 రకాల డిజైన్లు, 20 విభిన్న రంగుల్లో 240 వెరైటీల్లో చీరలను తయారు చేయించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) డిజైనర్లతో బతుకమ్మ చీరలు డిజైన్ చేయించారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు పంపిణీ చేసే చీరల డిజైన్లను కూడా నిఫ్ట్ డిజైనర్ల సూచనలు, సలహాల ఆధారంగా ఖరారు చేస్తారు. ప్రస్తుతం సొంతంగా ఎస్‌హెచ్‌జీల కొనుగోలు ప్రస్తుతం రాష్ట్రంలోని ఎస్‌హెచ్‌జీల మహిళలకు ప్రత్యేక యూనిఫారం లేకున్నా స్థానికంగా గ్రామ, మండల సమాఖ్యలు మూకుమ్మడిగా నిర్ణయించుకొని తమకు నచ్చిన డిజైన్ చీరలను యూనిఫారాలుగా ఎంచుకుంటున్నాయి. ఎస్‌హెచ్‌జీల సమావేశాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఒకే డిజైన్ చీరలు ధరించి హాజరవుతున్నారు. గ్రామ, మండల సమాఖ్య నిధుల నుంచి లేదా సొంతంగా తలాకొంత మొత్తం పోగు చేసి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే పంపిణీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఒకటి లేదా రెండు డిజైన్లను ఎంపిక చేసి చీరల తయారీకి ఆర్డర్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా పది డిజైన్లను సిద్ధం చేసిన చేనేత విభాగం త్వరలో సీఎంతో జరిగే భేటీలో ఒకటి రెండు డిజైన్లను ఖరారు చేసే అవకాశముంది. -
చేదెక్కిన రేషన్ చక్కెర!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పౌరసరఫరాల శాఖలో సబ్సిడీ చక్కెర చేదెక్కింది. అర్హులైన లబ్ధిదారులకు ప్రతీ నెల పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా పట్టింపు కరువైందని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) రేషన్‌కార్డు ఉన్న లబ్ధిదారులైన ఒక్కో యూనిట్‌కు 35 కిలోల బియ్యంతోపాటు ఒక కిలో చక్కెర తప్పనిసరిగా అందించాలి. కానీ గత కొంతకాలంగా లబ్ధిదారులకు చక్కెర పంపిణీ జరగడం లేదని చెపుతున్నారు. గత సర్కారు హయాం నుంచే చక్కెరను లబ్ధిదారులకు అందించడం నిలిపివేశారని సమాచారం. దీంతో లబ్ధిదారులు తప్పని పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఒక కిలో పంచదారకు బహిరంగ మార్కెట్లో రూ.42 వరకు ధర ఉంది. అదే చౌకధరల దుకాణాల్లో సబ్సిడీతో రూ.13.50 చొప్పున అందించే అవకాశం ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఖర్చు భరిస్తోంది. చక్కెరను రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ సేకరించి సరఫరా చేయాలి. కానీ చక్కెర సరఫరా సక్రమంగా జరగక గత కొన్నేళ్లుగా కేవలం రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. గతంలో కొందరు డీలర్లు చక్కెర కోసం డీడీలు కట్టినా సరుకు రేషన్ షాపులకు చేరలేదు. దీంతో చాలామంది డీలర్లు చక్కెరను అడగడమే మానేశారు. కట్టిన డబ్బులు రాకపోవడంతో ఆయా డీలర్లు సైతం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. జిల్లాస్థాయి అధికారులు చొరవ తీసుకుంటున్న చోట్ల మాత్రమే చక్కెర పంపిణీ జరుగుతోందని చెపుతున్నారు.రాష్ట్రంలో చౌకధరల దుకాణాల వివరాలు..మొత్తం రేషన్ షాపులు :17,352రేషన్ కార్డులు : 89,95,931పంపిణీ చేస్తున్న బియ్యం: 1.79 లక్షల మెట్రిక్ టన్నులుఅంత్యోదయ కార్డులు : 5,66,845పంపిణీ చేయాల్సిన చక్కెర: 566 మెట్రిక్ టన్నులుఅక్టోబర్లో చక్కెర కేటాయింపులు: 538 మెట్రిక్ టన్నులుచక్కెర ఇవ్వాలి..రేషన్ షాపుల్లో ప్రస్తుతం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ప్రతీ నెల తక్కువ ధరలో వచ్చే చక్కెర కూడా ఇస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది. – కుమ్మరి బక్కక్క, మల్లంపేట, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా -
అందరికీ ఆహారం అందించలేకపోయాం
సాక్షి, అమరావతి : వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ ఆహారం అందించలేకపోయామని సీఎం చంద్రబాబు చెప్పారు. సోమవారం రాత్రి 11.30గంటలకు విజయవాడలోని ఎన్డీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందు వచ్చిన వాళ్లు ఎక్కువ ఫుడ్ ప్యాకెట్లు తీసుకోవడం వల్ల తర్వాత వారికి ఇవ్వలేకపోయామన్నారు. సింగ్‌నగర్ ప్రాంతంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు కనీసం నీళ్లు లేక అలమటించిపోతున్నారన్నారు.బుడమేరుకు గండ్లు పడిన విషయాన్ని తమ ప్రభుత్వం గుర్తించలేకపోయిందని, అందుకే సింగ్‌నగర్ ప్రాంతం మునిగిందన్నారు. తన ఇంట్లోకి నీళ్లు రావడాన్ని రాజకీయం చేస్తున్నారని, నీళ్లు వస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇల్లు మునగకుండా ఉండేందుకు విజయవాడను ముంచానడం ఏమిటని నిలదీశారు. సహాయక చర్యలు విఫలమవడానికి కొందరు అధికారులే కారణమన్నారు. డ్రోన్ డ్రామా..! సర్వే డ్రోన్లతో ఆహార పంపిణీ అంటూ హడావుడిమధ్యాహ్నం 12.30 గంటలు.. విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణం.. ఓ వ్యక్తి హడావుడిగా డ్రోన్‌తో కలెక్టర్ కార్యాలయంలోకి ప్రవేశించాడు. ఖాళీ ప్రాంగణంలో డ్రోన్‌ను కిందకు దింపి ఓ అధికారిని పరిచయం చేసుకున్నాడు. డ్రోన్ కంపెనీ యజమానితో ఫోన్ ద్వారా మాట్లాడించాడు. తమ డ్రోన్లను సర్వే కోసం వినియోగిస్తామని, వరద ప్రాంతాల్లో ఫొటోలు తీసేందుకు చక్కగా పనికొస్తాయని, రెండు కిలోల వరకు మాత్రమే బరువు మోస్తాయని యజమాని పేర్కొనడంతో వరద ప్రాంతాలకు ఆహారం, మంచినీళ్లు, మందులు సరఫరా చేసేందుకు డ్రోన్లు కావాలని ఆ అధికారి కోరారు. అనంతరం ఓ ప్లాస్టిక్ బక్కెట్లో దాదాపు కిలో పురికొసలు వేసి తాడు ద్వారా డ్రోన్‌కు కట్టి ఎగురవేశారు.కాసేపటికి పెట్టుబడులు, మౌలిక వసతుల కార్యదర్శి రంగ ప్రవేశం చేశారు. వాటి పనితీరును గమనించిన ఆయన చిన్న బరువుకే ప్లాస్టిక్ బక్కెట్ ఊగిపోతోందని, వరద ప్రాంతాల్లో బలమైన గాలులను తట్టుకుంటుందా? అని సందేహం వ్యక్తం చేశారు. ఇంతలో సీఎం చంద్రబాబు అరగంట తర్వాత వచ్చి డ్రోన్ ప్రయోగాన్ని వీక్షించారు. అంతే.. డ్రోన్లు ఎనిమిది నుంచి పది కేజీలు బరువు మోసుకెళ్తాయని, వాటి ద్వారా మందులు, మంచినీళ్లు, ఆహారం సరఫరా చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన డ్రోన్ల డ్రామా ఇదీ!! -
అనాథ జీవాలకు అమ్మా.. నాన్న
సాటి మనిషికి సాయం చేయలేని మనుషులున్న నేటి రోజుల్లో మూగజీవాలను కూడా ప్రేమతో...అక్కున చేర్చుకుంటున్నారు.. ఆకలితో ఉన్న జీవాలకు ఆపన్నహస్తంగా ఆహారం పంపిణీ చేస్తున్నారు.. వారి ఇంటి దరిదాపుల్లో వివిధ జాతుల ఆవులు, దూడలు, కుక్కలు, పిల్లులు, కోతులు, కాకులు.. ఇలా ఒక్కటేమిటి..ఎన్నో మూగ జీవాలు చూపరులను అబ్బురపరుస్తాయి. అటుగా వెళ్లేవారికి ఆ మూగజీవాలు తారసపడుతుంటాయి. వీటిని అక్కున చేర్చుకున్న వారే కూకట్‌పల్లికి చెందిన మణికొండ దేవేందర్‌రావు, రమాదేవి దంపతులు. ఇదంతా వీరు గుర్తింపు కోసమో.. లేక వ్యాపారం కోసమో అనుకుంటే పొరపాటే.. వారికి తెలిసిందల్లా ఒక్కటే.. వాటికి నిస్వార్థంగా సేవ చేయడమే.. – తొట్ల పరమేష్ఆపదలోని మూగ ప్రాణులకు ఆపన్నహస్తంఅక్కున చేర్చుకుని ఆహారం పంపిణీ వందల సంఖ్యలో జీవాలకు సేవ నవ సేవే.. మాధవ సేవ.. ఇది అందరికీ తెలిసిన నానుడి. కానీ సర్వ ప్రాణి సేవయే మాధవ సేవ అన్నది వారి పంథా. ఔను..భువిపై తనకు మాత్రమే హక్కు అన్నట్లు జీవుడు విర్రవీగుతుంటాడు. కానీ ఇలపై మనిషి ఎలాగో అన్ని ప్రాణులకూ జీవించే హక్కు ఉందంటూ వారు నినదిస్తున్నారు. ఆపై సేవకు అంకితమయ్యారు. ఒకటి కాదు..రెండు కాదు..వందల సంఖ్యలో మూగ జీవాలను అక్కున చేర్చుకుని కన్న బిడ్డల మాదిరిగా సాకుతున్నారు. మనిషికి మనిషే బరువైన ప్రస్తుత సమాజంలో ప్రతి ప్రాణినీ తన బిడ్డగా భావిస్తూ నిస్వార్థ సేవకు నిర్వచనం.. కూకట్‌పల్లికి చెందిన మణికొండ దేవేందర్‌రావు, రమాదేవి దంపతులు. వీరితోపాటు వీరి ఇద్దరి బిడ్డలు సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా కూడా మూగ జీవాల సేవలో తరిస్తున్నారు. జీవాలకూ సొంత పేర్లు...వీరి ఇంటి దరిదాపుల్లో వెళ్లిన వారికి కొన్ని పేర్ల పిలుపులు వినిపిస్తుంటాయి.. కొత్తగా వినేవారికి ఎవరి కోసమో వెతుకుతున్నారని పొరపడతారు.. కానీ, వారు పిలిచేది మూగజీవాలని తెలిశాక ఆశ్చర్యపోక మానరు... ‘ఏయ్ లక్ష్మీ ఇటు రావే..ఓయ్ శివా అటు వెళ్లరా..!’ ఎలాగైతే మనం సాటి మనుషులతో మాట్లాడతామో! అలాగే వారు మూగ జీవాలతో మాట్లాడుతుంటారు. వాటికి పేర్లు పెట్టడమే కాదు..ఆ పేరుతో పిలిస్తే అవి కూడా ఠక్కున అలెర్ట్ అయ్యి వారు చెప్పింది చేసేస్తాయి. మమకారం చూపించాలే గానీ మూగ జీవాలు అంతకంటే ఎక్కువ వాత్సల్యాన్ని చూపిస్తాయని ఆ దంపతులు నిరూపిస్తున్నారు. పేరు పెట్టి వారు రమ్మంటే వచ్చేస్తాయి.. వెళ్లు అంటే వెళ్లిపోతాయి..తిను అంటే తినేస్తాయి..ఇక చాలు అంటే ఆపేస్తాయ్..అంతగా మూగ జీవాలతో వారికి బాండింగ్ ఏర్పడింది.పక్కాగా టైం పాటిస్తూ.. మూగ జీవాలకు ఆహారంతో పాటు ప్రేమాప్యాయతలు కలగలిపి వడ్డిస్తారో ఏమో గానీ ఎక్కడున్నా సరే..రోజూ పక్కాగా టైం ప్రకారం వీరి వద్దకు వచ్చేస్తాయి. ఒక్క కాకులు, పావురాలే కాదు ఆవులు, కుక్కలు, పిల్లులు, కోతులు వాటికి నిర్దేశించిన సమయాల్లో వచ్చి వీరి రోజువారీ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తుంటాయి. ఇలా ఉదయం 6–7 గంటలకు ప్రారంభమయ్యే మూగ జీవాల రాక సాయంత్రం 7 గంటల వరకూ కొనసాగుతుంటుంది. ఉదయం6–7 గంటల మధ్య కాకులు, 9 గంటలకు పావురాలు, 10 గంటలకు ఆవులు, మధ్యాహ్నం 3 గంటలకు కుక్కలు, సాయంత్రం పిల్లులు..ఇలా ఒక్కో సమయంలో ఒక్కో మూగ జీవాలు ఇక్కడకు వచి్చపోతుండడం గమనార్హం.ఆవుల గైనిక్..రమాదేవిఆవుల ప్రసవానికి వచ్చాయంటే జీహెచ్ఎంసీలో గుర్తుకొచ్చే వైద్యురాలు రమాదేవి. తమ వద్దకు వచ్చే ఆవులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని గోశాలల్లో ఎక్కడైనా సరే ఆవులు ఈతకు వచ్చాయంటే ఆమెనే దగ్గరుండి ప్రసవం చేస్తారు. భుమి మీదకు వచ్చే ఆవు దూడపై మొదట తన చేతులు పడాల్సిందే.. ఒకరకంగా ఆమె ఆవులకు గైనిక్గా మారిపోయారు.లేగ దూడలకు ప్రత్యేక బెడ్మూగ జీవాల ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ వాటికి సపర్యలు చేస్తుంటారు. వాటిని తనకుటుంబ సభ్యులు, పిల్లల మాదిరిగానే బెడ్ మీద పడుకోబెట్టి సేవలందిస్తారు. ఓసారి 20 రోజుల లేగదూడకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరగటంతో విషయం తెలుసుకున్న రమాదేవి రహదారి వద్దకు వెళ్లి దానిని ఆటోలో తీసుకొచ్చి అక్కడ నుంచి పశువుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో మూడు గంటల పాటు వేచి ఉండి డాక్టర్‌ను పిలిపించి చికిత్స చేయించిన అనంతరం రమాదేవి భర్త దేవేందర్‌రావు ఆ లేగ దూడను తన బెడ్‌పై పడుకోబెట్టి ఆహారంలో మాత్రలు, ఇంజక్షన్లు ఇచ్చి రెండు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మరణించిన వాటికి అంత్యక్రియలుదెబ్బతగిలిన లేగదూడ కొద్ది రోజుల తరువాత మూర్చ వ్యాధితో చనిపోయింది. దాంతో మనస్తాపానికి గురైన వారు లేగదూడను బహిర్భూమిలో వదిలివేయకుండా మనుషులకు చేసిన విధంగానే లేగ దూడకు అంత్యక్రియలు నిర్వహించి కొద్ది రోజుల పాటు ఆ దంపతులు దిగులుతో రెండు మూడు రోజులు ఆహార పానీయాలు కూడా ముట్టలేదు. ఈ విధంగా మూగ జీవాలతో వారి అనుబంధం కొనసాగింది. కుక్కలకు కూడా ఏ చిన్న దెబ్బ తాకినా వాటికి చికిత్స చేయించి మందులు ఇవ్వటం వారికి అలవాటుగా మారింది. కాంక్రీట్ జంగిల్లోనూ కావ్..కావ్..జాడ పితృ దేవతలకు ప్రతీకగా కాకులను విశ్వసిస్తారు. అలాంటి కాకులను కాంక్రీట్ జంగిల్లో భూతద్దం పెట్టి మరీ వెతికినా కనిపిస్తాయో లేదో తెలియదు. కనుమరుగు అయిపోతున్నాయి అనుకుంటున్న కాకులు సైతం రోజూ ఠంచనుగా ఒకే సమయంలో వీరి ముంగిట వాలిపోతుంటాయి. వారు అందించే ఆహారాన్ని ఆరగించి వెళ్లిపోతుండడం ఇక్కడ నిత్యకృత్యమే.ఐదేళ్ల క్రితం ప్రారంభమై... ఐదేళ్ల క్రితం మాట.. రెండు మూడు ఆవులతో ప్రారంభమై రోజులు గడిచే కొద్దీ ఆవుల సంఖ్య పెరిగింది. వీటికి తోడుగా కుక్కలు, పిల్లలు, కోతులు, కాకులు, పావురాలు.. ఇలా 70 వరకూ ఆవులు, 40 వరకు కుక్కలు, 15 వరకు పిల్లులు, 15 వరకు కాకులు, మరెన్నో పావురాలు వచ్చిపోతున్నాయి. అయితే ఇటీవల కోతులు కూడా వచ్చేవి. కానీ కుక్కల భయంతో అవి రావడం మానేశాయి.నెలకు లక్షన్నర ఖర్చు..మూగ జీవాలకు ఆహారం కోసం నెలకు లక్షన్నర వరకూ ఖర్చు చేస్తున్నారు. ఆవుల కోసం ప్రతిరోజూ రకరకాల కూరగాయలు, ఫలాలు, కుక్కల కోసం ఇంట్లో నాన్‌వెజ్ తినకపోయినప్పటికీ ప్రత్యేకంగా నాన్‌వెజ్ తెప్పించి పెడతారు. నెలకు నాలుగు క్వింటాళ్ల రైస్ మూగ జీవాల కోసం కొనుగోలు చేస్తుంటారు. -
ఏపీలో పెన్షన్ల పంపిణీ
-
బోనాల ఉత్సవాలకు నిరంతర విద్యుత్
హైదరాబాద్, సాక్షి: నగరంలో బోనాల సందర్భంగా నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని.. ప్రముఖ ఆలయాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సీజీఎంలు, ఎస్ఈలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జులై 2 నాటికి సంబంధిత సీఈలు/ఏస్ఈలు ఆలయ ప్రాంగణాలను సందర్శించి 24 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ దేవాలయానికి ఒక నోడల్ అధికారి/ఏఈని కేటాయించాలన్నారు. ఆర్అండ్బీ, ఆలయ కమిటీలతో సమన్వయం చేసుకోవడంతో పాటు డీటీఆర్లు, అదనపు లైట్లు, ఎయిర్ కండిషనింగ్, సౌండ్ సిస్టంకు తగినట్లు విద్యుత్ లోడ్ ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ సామగ్రిని సమకూర్చుకోవాలన్నారు. ప్రజలు గుమిగూడే చోట విద్యుత్ స్తంభాలు షాక్ కొట్టకుండా ముందే చెక్ చేయాలన్నారు. విద్యుత్ లీకేజీలను పూర్తిగా అరికట్టాలన్నారు. అన్ని పంపిణీ కేంద్రాల్లోనూ టంగ్ టెస్టర్ ద్వారా ఎర్తింగ్‌ను చెక్ చేయడంతో పాటు ప్రతి గంటకోసారి రీడింగ్ తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి డైరెక్టర్లు నందకుమార్, డాక్టర్ నర్సింహులు, సీజీఎంలు కె.సాయిబాబా, ఎల్.పాండ్య, వి.శివాజీ, పి.భిక్షపతి, పి.ఆనంద్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కొనసాగుతున్న చేప మందు పంపిణీ
-
వంద చిత్రాల ఆకాంక్ష నెరవేరకుండానే..
సాక్షి, హైదరాబాద్: రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌తో తెలుగు చలనచిత్ర పరిశ్రమపైనా తన ముద్ర వేశారు. ఈ బ్యానర్‌పై తెలుగులో నిర్మించిన తొలి చిత్రం ‘శ్రీవారికి ప్రేమలేఖ (1984)’. జంధ్యాల దర్శకత్వంలో.. వీకే నరేశ్, పూరి్ణమ నటించిన ఆ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. తర్వాత ‘మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్, నువ్వే కావాలి, నిన్ను చూడాలని.., చిత్రం, ఆనందం, ఇష్టం, నచ్చావులే’వంటి పలు సినిమాలు నిర్మించారు. వివిధ భాషల్లో కలిపి దాదాపు 80 సినిమాలు నిర్మించారు రామోజీరావు. మయూరి పేరిట ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించి.. పలు చిత్రాలను పంపిణీ చేశారు. రామోజీరావు ఓ సినిమాలో నటించారు కూడా. యు.విశ్వేశ్వరరావు దర్శకత్వంలో వచి్చన ‘మార్పు’ సినిమాలో అతిథి పాత్ర పోషించారు. రామోజీరావు నిర్మించిన చివరి చిత్రం ‘దాగుడుమూత దండాకోర్ (2015)’. అంతకు ముందు కొన్ని చిత్రాలు అపజయం కావడంతో ఉషాకిరణ్ మూవీస్‌లో సినిమాల నిర్మాణానికి గ్యాప్ వచ్చింది. 2019లో మళ్లీ సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్టు వార్తలు వచ్చాయి. కొందరు యువ దర్శకులను సంప్రదించి, కథలు తయారు చేయించారని, పలువురికి అడ్వాన్సులు కూడా ఇచి్చనట్టు వినిపించింది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో బ్రేక్ పడింది. రామోజీరావుకు వంద చిత్రాలు నిర్మించాలనే ఆకాంక్ష ఉండేదని సన్నిహితులు చెప్తుంటారు. అది నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు. జూ.ఎన్టీఆర్ తొలి చిత్రం ఉషాకిరణ్‌లోనే.. రామోజీరావు ఎందరో నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌ను ‘నిన్ను చూడాలని’(2001) మూవీ ద్వారా పరిచయం చేసింది ఉషాకిరణ్ సంస్థనే. అలాగే ‘చిత్రం’సినిమా ద్వారా ఉదయ్‌కిరణ్, రీమాసేన్లను హీరో హీరోయిన్లుగా, ఇదే సినిమాతో నటుడు ‘చిత్రం’ శ్రీనును, దర్శకుడు తేజను పరిచయం చేశారు.‘నువ్వే కావాలి’తో హీరోగా తరుణ్, హీరోయిన్గా రిచా, ఓ కీలక పాత్రలో సాయికిరణ్‌లను.. ‘పీపుల్స్ ఎన్కౌంటర్స్’ద్వారా శ్రీకాంత్‌ను.. ‘ఇష్టం’చిత్రంతో కథానాయికగా శ్రియను.. ఇలా మరికొందరు నటీనటులను పరిచయం చేశారు. హిందీలో ‘తుజే మేరీ కసమ్’ద్వారా రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఎంఎం కీరవాణిని ‘మనసు మమత’చిత్రంతో సంగీత దర్శకునిగా పరిచయం చేసింది ఉషాకిరణ్ మూవీస్ సంస్థనే.ఇతర భాషల్లోనూ.. రామోజీరావు తెలుగులోనే కాదు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ.. ఇలా పలు భాషల్లో కలిపి దాదాపు 80కిపైగా సినిమాలను నిర్మించారు. హిందీలో నేరుగా ఓ సినిమా నిర్మించగా.. మూడు రీమేక్‌లు ఉన్నాయి. రామోజీరావు హిందీలో నిర్మించిన తొలి రీమేక్ ‘నాచే మయూరి’(1986). తెలుగులో ‘మయూరి’. క్లాసికల్ డ్యాన్సర్ సుధాచంద్ర బయోపిక్‌గా ఆ మూవీ రూపొందింది.తర్వాత విజయశాంతి లీడ్ రోల్లో టి.కృష్ణ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘ప్రతిఘటన’సూపర్ హిట్ కావడంతో దానిని హిందీలో ‘ప్రతిఘట్’(1987) పేరుతో రీమేక్ చేశారు. అలాగే తెలుగు సూపర్ హిట్ మూవీ ‘నువ్వే కావాలి’ని ‘తుజే మేరీ కసమ్’ (2003) పేరిట హిందీలో రీమేక్ చేశారు. రామోజీరావు నేరుగా నిర్మించిన హిందీ చిత్రం ‘తోడా తుమ్ బద్లో తోడా హమ్’(2004). ఆ చిత్రంలో ఆర్య బబ్బర్, శ్రియ శరణ్ జోడీగా నటించారు. -
చేప మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
-
చేప ప్రసాదానికి వేళాయే
హైదరాబాద్: మృగశిర కార్తెను పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు బత్తిని హరినాథ్, బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. కాగా.. శుక్రవారం ఉదయం చేప ప్రసాదం తయారీ కోసం దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం మత్స్యశాఖ, జీహెచ్ఎంసీ, పోలీస్ తదితర శాఖల అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించారు. 2 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మొత్తం 32 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రూ.40 చొప్పున చేప పిల్లల టోకెన్ ధర నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే ఆస్తమా రోగులు, వారి సహాయకులకు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతులు ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందుకోసం 300 మంది బత్తిని కుటుంబ సభ్యులు, వలంటీర్లు విడతల వారీగా విధుల్లో ఉంటారు. చేప ప్రసాదం కార్యక్రమ ప్రారం¿ోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహా్వనించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ఆస్తమా బాధితులు తరలివచ్చారు. ట్రాఫిక్ ఆంక్షలు.. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గృహకల్ప, గగన్ విహార్ల వద్ద తమ వాహనాలను పార్క్ చేసి గేట్‌నెం. 2 ద్వారా ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి చేరుకోవాలని సూచించారు. వీఐపీలకు గేట్‌నెం.1 నుంచి ప్రవేశం కలి్పంచారు. -
ఇంటర్లో ఇక ఆన్లైన్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి/నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మిడియట్ పరీక్షల జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం ప్రక్రియకు ఇంటర్మిడియట్ విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అధ్యాపకులు సెంటర్లలో మాన్యువల్‌గా చేస్తున్న ప్రక్రియను ఇకపై ఇంటి నుంచి లేదా కళాశాల నుంచి ఆన్లైన్లో చేయవచ్చు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ విధానం వల్ల మూల్యాంకనంలో పొరపాట్లు జరగవని, తద్వారా రీ వెరిఫికేషన్ లేదా రీ కౌంటింగ్‌కు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఖర్చు, సమయం ఆదా అవడంతో పాటు విద్యార్థికి నూరు శాతం న్యాయం జరుగుతుంది. తక్కువ సమయంలోనే ఫలితాలు ఇవ్వవచ్చని చెబుతున్నారు. డీఆర్డీసీల స్థానంలో స్కానింగ్ సెంటర్లు జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఇప్పటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా రీ కలెక్షన్, డి్రస్టిబ్యూషన్ సెంటర్ (డీఆర్డీసీ) లు ఉన్నాయి. ఆన్లైన్ మూల్యాంకనంలో డీఆర్డీసీ స్థానంలో రీజినల్ రిసెప్షన్ స్కానింగ్ సెంటర్లు (ఆర్ఆర్ఎస్సీ) ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ప్రతి జిల్లాలో సేకరించిన జవాబు పత్రాలను జంబ్లింగ్ విధానంలో ఇతర జిల్లాలకు పంపేవారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నంలలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆ రోజు జవాబు పత్రాలను ఈ కేంద్రాల్లో స్కాన్ చేస్తారు. ప్రతి ప్రశ్నను పరిశీలించాల్సిందే ఆన్లైన్ మూల్యాంకనంలో పొరపాట్లకు తావుండదు. ఆఫ్‌లైన్ విధానంలో జరిగే అనేక పొరపాట్లకు ఆన్లైన్ విధానంతో చెక్ పెట్టవచ్చు. విద్యార్థి రాసినా, రాయకపోయినా ప్రతి ప్రశ్నను అధ్యాపకుడు పరిశీలించాలి. జవాబుకు ఇచి్చన గరిష్ట మార్కులకంటే ఎక్కువ వేసినా సిస్టం తీసుకోదు. – ఎం.నీలావతిదేవి,జిల్లా ఇంటర్మిడియట్ విద్యా శాఖాధికారి, పల్నాడు జిల్లాతప్పులకు ఆస్కారం లేదు ఎనీ్టఆర్ హెల్త్ యూనివర్సిటీ, పలు విద్యా సంస్థలు ఆన్లైన్ మూల్యాంకనం అమలు చేస్తున్నాయి. ఈ విధానంలో తప్పులకు ఆస్కారం ఉండదు. ముందుగానే కొన్ని జవాబు పత్రాలను సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తాం. వాటిని అధ్యాపకులకూ పంపిస్తాం. నిపుణులు మూల్యాంకనం చేసిన విషయం అధ్యాపకుడికి తెలియదు. దీనివల్ల వారు పేపర్లు ఎలా మూల్యాంకనం చేస్తున్నారో తెలుస్తుంది. మాన్యువల్ విధానంలో పలు పొరపాట్లు జరిగేవి. ఆన్లైన్ విధానంలో ఒక్క తప్పు కూడా జరగదు. – సౌరభ్ గౌర్,ఇంటర్ విద్యా మండలి కమిషనర్ఆన్లైన్ మూల్యాంకనం ఇలా..స్కాన్ చేసిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు అర్హతలుండి జ్ఞానభూమి పోర్టల్‌లో నమోదైన అధ్యాపకులకు పంపిస్తారు. వారు httpr://apbieeva.order.in/ వెబ్సైట్లో తమ టీచర్ యుఐడీ ద్వారా ఓటీపీ నమోదు చేసి లాగిన్ అవ్వాలి. సైట్లో ప్రతి రోజూ ఒక్కో అధ్యాపకునికి 60 జవాబు పత్రాలు ఉంటాయి. ⇒ ఉదయం 7 నుంచి సాయంత్రం 8 గంటల్లోపు ఇల్లు లేదా కళాశాలలో సొంత ల్యాప్‌టాప్/ కంప్యూటర్ లేదా కాలేజీ సిస్టంలో మాత్రమే మూల్యాంకనం చేయాలి. ఇంటర్నెట్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లోని కంప్యూటర్లను వినియోగించకూడదు. ⇒ మొత్తం 25 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థి వివరాలు ఉన్న మొదటి పేజీ తప్ప, మిగిలిన 24 పేజీలు అధ్యాపకులకు ఇస్తారు. తద్వారా ఏ పేపర్ ఎవరిదో అధ్యాపకులకు తెలియదు. మొదటి పేజీలోని విద్యార్థి బార్కోడ్ నంబర్ డీ–కోడ్ అవడంతో కంప్యూటర్ తప్ప మరొకరు గుర్తించడం సాధ్యం కాదు. ⇒ కంప్యూటర్‌కు ఉన్న కెమెరా ద్వారా ప్రతి 15 నిమిషాలకు అధ్యాపకుడి లైవ్ ఫొటో బోర్డుకు చేరుతుంది. తద్వారా మూల్యాంకనం ఎవరు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలుస్తుంది. ⇒ ఆన్లైన్లో కనిపించే జవాబు పత్రాలను ఫొటోలు తీసినా, ఇతరులకు పంపినా ఆ వివరాలు కూడా బోర్డుకు తెలిసేలా ‘ఏఐ’ టెక్నాలజీని వినియోగించారు. ⇒ ఆన్లైన్ మూల్యాంకనంలో డాష్‌బోర్డుపై ఎడమ చేతి వైపు జవాబు పత్రం, కుడివైపు గ్రిడ్‌లో ప్రశ్నల నంబర్లు, వాటికి కేటాయించిన మార్కులు ఉంటాయి. పక్కనే ఎగ్జామినర్ ఇచ్చే మార్కుల నమోదుకు బాక్స్ ఉంటుంది. అధ్యాపకుడు అందులో మార్కులు వేయాలి. ⇒ విద్యార్థి ఏదైనా ప్రశ్నకు జవాబు రాయకపోతే ఆ ప్రశ్న సంఖ్య ఆన్లైన్లో కనిపిస్తుంది. ⇒ ఒక గ్రూప్‌లో 4 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటే కొందరు విద్యార్థులు 6 ప్రశ్నలకు జవాబులు రాస్తారు. ఇలాంటప్పుడు రాసిన అన్ని జవాబులకు మార్కులు వేయాలి. ఎక్కువ మార్కులు వచి్చన 4 జవాబులనే సిస్టం తీసుకుంటుంది. దీనిద్వారా విద్యారి్థకి న్యాయం జరుగుతుంది. ⇒ మాన్యువల్ మూల్యాంకనంలో ఎగ్జామినర్లు కొన్ని ప్రశ్నలకు మార్కులు వేయడం, మరికొన్నింటిని మర్చిపోవడం, టోటల్ మార్కుల నమోదులో పొరపాట్లు జరుగుతుంటాయి. విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోరినప్పుడు ఇవి బయటపడుతున్నాయి. ఆన్లైన్ విధానంలో ఏ జవాబుకైనా మార్కులు ఇవ్వకపోతే వెంటనే ‘ఎర్రర్’ చూపి ఎక్కడ మార్కులు వేయలేదో చూపుతుంది. దీంతో మార్కుల నమోదు మర్చిపోయేందుకు ఆస్కారం లేదు. ప్రతి జవాబుకు తప్పనిసరిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ మూల్యాంకనం పూర్తయిన తర్వాత అధ్యాపకుడు ఇచి్చన మార్కులను చీఫ్ ఎగ్జామినర్ మరోసారి పరిశీలిస్తారు. జవాబు పత్రాల్లో 10 శాతం పత్రాలను మరోసారి మూల్యాంకనం చేసి ఫైనల్ మార్కులను నమోదు చేస్తారు. -
వైఎస్ఆర్ జిల్లాలో మొదలైన ఈవీఎంల పంపిణీ
-
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: పెన్షన్లు పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుండి 5 వ తేదీలోపు పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీబిటి విధానం లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. 74.70 శాతం మంది పెన్షన్లను బ్యాంకుల్లో ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది.ఆధార్ లింక్‌యిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం.. దివ్యాంగులు, దీర్ఘకాలిగా వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంక్ ఖాతాలేని 25 శాతం మందికి ఇంటింటికి వెళ్లి ఉద్యోగులు పెన్షన్ ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రిన్సిపాల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
జూన్‌లో జాబ్‌ల జాతర
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్‌ల జాతరకు లైన్‌క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫిబ్రవరి నుంచే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్‌శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది. -
తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం.. ప్రారంభించిన టాలీవుడ్ నిర్మాత!
ఊర్వశివో రాక్షసివో, బేబి, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన నిర్మాతగానే కాదు.. సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా పలు సూపర్ హిట్ సినిమాలను పంపిణీచేస్తున్నారు. బేబి, గుంటూరు కారం, హనుమాన్, గామి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళ్తున్నారు. ఆయన తాజాగా సీడెడ్ ఏరియా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతితో కలిసి తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించారు ధీరజ్ మొగిలినేని. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా నటించిన 'ఓం భీమ్ బుష్', సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్'తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తిరుపతిలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
23న ఒంగోలుకు సీఎం జగన్
ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23వ తేదీన ఒంగోలు రానున్నారు. నగరంలోని 22వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నగర శివారు అగ్రహారం వద్ద నిర్వహించనున్న సభ ఏర్పాట్లను సోమవారం మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, కలెక్టర్ దినేష్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లోని జగనన్న టౌన్‌షిప్‌లలో అర్హులైన 22వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఆలోచనల మేరకు నగర పరిధిలో అర్హులైన 22 వేల మంది పేదలకు సీఎం చేతుల మీదుగా చేపడుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జగనన్న టౌన్‌షిప్‌లను అర్బన్ డెవలప్మెంట్ టౌన్‌గా ఏర్పాటు చేయడంతోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పింస్తామన్నారు. కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాలు భూసేకరణ చేశామన్నారు. పట్టాల పంపిణీ పూర్తి పారదర్శకంగా చేపట్టడంతోపాటు నగరంలోని 70 సచివాలయాల పరిధిలో కన్వేయడ్ డీడ్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ ‘అయోధ్య’ చిత్రపటాలు
హుజూరాబాద్ రూరల్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఇంటికే అయోధ్య రామయ్య రానున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అవును.. ఎంపీ బండి సంజయ్‌కుమార్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజల ఇళ్లకు రాములోరి చిత్రపటాలను పంపిణీ చేయనున్నారు. అయోధ్య వెళ్లలేని వారు తమ ఇళ్లల్లోనే స్వామివారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతమంది ఓటర్లున్నారు? ఎన్ని కుటుంబాలున్నాయి? వారిలో రామయ్యను కొలిచే వాళ్లెందరున్నారు? అనే వివరాలను సేకరించారు. మొత్తం 5 లక్షల కుటుంబాలకు పైగా ఉండగా.. వాటిలో నాలుగు లక్షలకు పైగా కుటుంబాలు హిందువులని తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, 4.21 లక్షల అయోధ్య రాముని చిత్రపటాలను తయారు చేయించే పనిలో ఎంపీ నిమగ్నమయ్యారు. ఇప్పటికే లక్షకు పైగా సిద్ధమవడంతో ఇంటింటికీ చేరవేసే పనిలో కాషాయ శ్రేణులు నిమగ్నమయ్యాయి. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంజయ్ మంగళవారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలో పర్యటించనున్నారు. -
96.13 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 96.13 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది. వలంటీర్లు శనివారం కూడా రాష్ట్రమంతటా లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. 66,15,482 మంది లబ్ధిదారులకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం రూ.1961.13 కోట్లు విడుదల చేసింది. శనివారం వరకు మొత్తం 63,59,727 మంది లబ్ధిదారులకు రూ.1,885 కోట్లు అందజేశారు. ఇందులో దాదాపు 54 లక్షల మంది లబ్ధిదారులకు 1వ తేదీనే పింఛను డబ్బులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. -
వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ సీఎం జగన్ ఫోటో కు పాలాభిషేకం
-
ఫాదర్ ఆఫ్ రింకుసింగ్
ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ రింకుసింగ్ తండ్రి ఖాన్చందర్సింగ్ ఇప్పటికీ ఆలిగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్)లో ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చందర్‌సింగ్ ఎల్పీజి సిలిండర్లు డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చందర్ వృత్తినిబద్ధతకు నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు రెస్ట్ తీసుకోండి అని నాన్నకు చాలాసార్లు చెప్పాను. అయితే పనిని ప్రేమించే నాన్న విశ్రాంతి తీసుకోవడానికి నిరాకరించారు. పని చేస్తేనే నేను చురుగ్గా ఉంటాను అని చెబుతుంటారు’ అంటున్నాడు రింకుసింగ్. ‘కాస్త పేరు, కాస్త డబ్బు రాగానే చాలామంది గతాన్ని మరిచిపోయి గర్వంతో ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి ఈ చిన్న వీడియో క్లిప్ కనువిప్పు కలిగిస్తుంది’ ‘కొడుకును ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా తయారుచేయడానికి ఈ తండ్రి ఎంతో కష్టపడి ఉంటాడు. అప్పుడూ , ఇప్పుడూ తన సొంత కష్టాన్నే నమ్ముకున్నాడు. గ్రేట్ ఫాదర్!’...కామెంట్ సెక్షన్లో ఇలాంటివి చాలా కనిపించాయి. -
ఆసరా వేడుక.. పుట్టింటి కానుక
రాష్ట్రవ్యాప్తంగా ఆసరా సంబరాలు పండుగలా సాగుతున్నాయి. పుట్టింటి నుంచి వచ్చిన కానుకలా భావిస్తూ అక్కాచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెక్కులు తీసుకునేటప్పుడు వారి మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున సీఎం జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు. పండుగ వాతావరణవంలో ప్రజాప్రతినిధులు చెక్కుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇంత పెద్ద మనస్సుతో ఆర్థికంగా ఆదుకుంటారని తాము కలలో కూడా ఊహించుకోలేదని మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. క్రమం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా నిధులు తమ అకౌంట్లో జమ అవుతుంటే అక్కచెల్లెమ్మల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. – సాక్షి నెట్వర్క్ పండ్ల వ్యాపారం ఫలించింది నేను డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా చాలా కాలంగా ఉన్నాను. గతంలో రుణం తీసుకున్నప్పటికీ తిరిగి కట్టడానికి మాత్రమే అవి సరిపోయేది. సీఎం జగన్ దయ వల్ల ఆసరా ద్వారా నాలుగు విడతలుగా, విడతకు రూ.16,200 చొప్పున మొత్తం రూ.64,800 రుణమాఫీ అయ్యింది. వాటితో అప్పటి వరకు చిన్నగా చేస్తున్న పండ్ల వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాను. బ్యాంకు అధికారులు మరో రూ.2 లక్షల రుణం ఇచ్చారు. వ్యాపారం కోసం ఇప్పుడు వడ్డీలకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేకపోయింది. – ముచ్చర్ల సత్యకుమారి, రేలంగి, ఇరగవరం మండలం, పశ్చిమగోదావరి జిల్లా చీరల వ్యాపారం చేస్తున్నా.. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మా గ్రూపునకు రూ.5.68 లక్షలు రుణమాఫీ అయ్యింది. మాకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.14,200 చొప్పున నాలుగేళ్లకు 56,800 వచ్చింది. దీంతో నేను చీరల వ్యాపారం చేస్తున్నా. అప్పులు తెచ్చి వ్యాపారం చేద్దామంటే వడ్డీలకే సరిపోతుంది. కానీ సీఎం వైఎస్ జగన్ పొదుపు సంఘాల్లో ఉన్న మాకు రుణ మాఫీ చేసి నిలబెట్టారు. – ఉప్పర ఉమాదేవి, మద్దికెర, కర్నూలు జిల్లా టైలరింగ్ ద్వారా ఇద్దరికి చేయూత నేను టైలరింగ్ చేస్తాను. నా భర్త కార్పెంటర్. జగనన్న అందించిన ఆసరా ఒకటి రెండు విడతలు డబ్బులతో కుట్టు మిషన్ కొనుగోలు చేశాను. తర్వాత అందించిన డబ్బులతో ఒక ఎలక్ట్రికల్ మిషన్, ఒక జిగ్‌జాగ్ మిషన్ కొనుగోలు చేశాను. మరో ఇద్దరు మహిళలను సహాయకులుగా పెట్టుకుని వారికి కూడా చేయూతనిస్తున్నాను. పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలి. – ఎన్.స్వాతి, సింగుపురం, సాయిరాం స్వయం శక్తి సంఘం, శ్రీకాకుళం ‘ఆసరా’ ఆదుకుంది ఈమె పేరు ఏకుల వాణి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని అనంతరాయయేని గిరిజన కాలనీలో ఉంటారు. ఈమెకు ఇద్దరు కుమారులు. భర్త ఆరేళ్ల క్రితం మృతిచెందారు. సరస్వతి పొదుపు గ్రూపు సభ్యురాలిగా ఉన్న ఈమెకు గతంలో సక్రమంగా రుణాలు వచ్చేవి కావు. ఈమె గ్రూపునకు 2019లో రూ.3 లక్షల రుణం మంజూరైంది. వాటితో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నారు. నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా నగదును ఆమె ఖాతాలో జమ చేశారు. మొత్తం రూ.32 వేలు ఆమె ఖాతాలో జమైంది. దీంతో ఆమె నిర్వహిస్తున్న బడ్డీకొట్టును ఫ్యాన్సీ దుకాణంగా మార్చుకుని సంతోషంగా వ్యాపారం సాగిస్తోంది. ‘సొంత అన్న’లా ఆదరిస్తున్నాడు ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు అంతపు లీల. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం రామాపురం. సరస్వతి డ్వాక్రా గ్రూపు సభ్యురాలిగా ఉంది. ‘వైఎస్సార్ ఆసరా’ పథకంలో భాగంగా డ్వాక్రా రుణ మాఫీ కింద ఈమెకు ఏడాదికి రూ.12,600 ప్రకారం నాలుగేళ్లకు రూ.50,400 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యింది. అంతేకాకుండా పావలా వడ్డీతో రూ.లక్ష రుణం తీసుకున్న ఈమె కుటుంబ పోషణకు చేదోడుగా ఉంటోంది. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం జగన్ చేస్తున్న కృషి మరువలేమని, అన్నలా ఆదరిస్తున్న ఆయనకు అండగా ఉంటామని ఆనందంగా చెబుతోంది. ఈ ప్రభుత్వ మేలు మరువలేం ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు మాదాసు జమున. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు. ఈమె భర్త నాగబాబు లారీ క్లీనర్. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తొలుత జమున ఓ దుకాణంలో పని చేసేది. ఈమె సభ్యురాలిగా ఉన్న ‘వెలుగు దీపం’ గ్రూపునకు ఆసరా ద్వారా రుణ మాఫీ వర్తించింది. వరుసగా మూడు విడతల్లో సుమారు 40వేలు లబ్ధి చేకూరింది. డ్వాక్రా గ్రూపు ద్వారా రూ.4 లక్షలు రుణ సహయం పొందింది. దీంతో టిఫిన్ బండి పెట్టుకుంది. చిరు వ్యాపారులకు సీఎం జగన్ అందించే రుణ సహయం కూడా తోడైంది. ఇప్పుడు ఆసరా ద్వారా వచ్చే రూ.12 వేలతో వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని చెబుతోంది.