Vijay Sethupathi Fan Club Distributes Tomatoes to All Homemakers - Sakshi
Sakshi News home page

Vijay Sethupathi Fans: సామాన్యులకు టమాటాలు పంచిన విజయ్ సేతుపతి ఫ్యాన్స్!

Published Tue, Jul 11 2023 4:29 PM | Last Updated on Tue, Jul 11 2023 4:51 PM

Vijay Sethupathi Fan Club distributes tomatoes to all homemakers - Sakshi

ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్, డీజిల్, బంగారం ధరల కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటివరకు ఎప్పుడులేని రీతిలో వాటితో పోటీపడుతోంది. మరేదో కాదు.. అదేనండీ.. టమాటా. ఎందుకంటే మనకు టమాటా లేకుండా ఏ కూర, పప్పు చేయలేరు. ఒకప్పుడు ఉ‍ల్లిగడ్డ ఇతర వాటితో పోటీ పడేది. అదేంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఉల్లిగడ్డ ప్లేస్‌ను టమాటా ఎప్పుడో కబ్జా చేసింది. ఇప్పుడు ఎక్కడా చూసిన టమాటా ధరలపైనే చర్చ నడుస్తోంది. పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి అభిమానులు గొప్ప మనసును చాటుకున్నారు. 

(ఇది చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!)

తమిళనాడులో పెరుగుతున్న టమాటా ధరలతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు.  వారి పరిస్థితిని గమనించిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అభిమాన సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టమాటాలు పంపిణీ చేశారు. తమిళనాడులోని మానవహారం జిల్లా ఆలందూరులో ఈ కార్యక్రమం చేపట్టారు. చెంగల్పట్టు విజయ్ సేతుపతి అభిమానుల సంఘం అధినేత తాంబరం విక్కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

(ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement