సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతోంది. 62,79,486 మంది లబ్ధిదారులకు రూ.1,596.77 కోట్లు ప్రభుత్వం విడుదలచేసింది. తెల్లవారుజామున నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా 3.10 లక్షల మందికి పింఛన్ సొమ్ము అందజేస్తున్నారు. సాయంత్రం 5:30 గంటల వరకు 80.28 శాతం పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే 50.40 లక్షల మందికి రూ.1280.20 కోట్లు అందజేసినట్లు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు తెలిపారు.
చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్
లబ్ధిదార్లకు పింఛన్లు అందజేసే సమయంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నారు. ఆర్‌బీఐఎస్ (రియల్ టైమ్ బెనిఫిషరీష్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 26 జిల్లాలోని డీఆర్‌డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment