సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుఝాము నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందిస్తున్నారు వలంటీర్లు. రాష్ట్ర వ్యాప్తంగా 63. 33 లక్షల మంది పెన్షనర్ల కోసం.. రూ. 1,747.38 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా.. వృద్ధులు, దివ్యాంగులు, పలు రకాల చేతివృత్తిదారులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆసరా కోసం పింఛన్లు నెలవారీగా అందజేస్తూ వస్తోంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. ఈ నెలకుగానూ రూ. 1,747.38 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. పింఛన్ల పంపిణీ కోసం నిధులను శనివారమే ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయడు వెల్లడించారు.
పించన్ల పంపిణీలో ఏ సమస్యలు ఉన్నా.. అప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో సెర్ప్ కార్యాలయాల్లోనూ, జిల్లాల పరిధిలోని ఆయా డీఆర్‌డీఏ పీడీ కార్యాలయాల్లోనూ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
లబ్ధిదారులకు ఏమాత్రం శ్రమ, ఇబ్బందులు లేకుండా ఇంటికే వలంటీర్లు పెన్షన్లు వెళ్లి అందజేస్తూ వస్తున్నారు. ఈ జనసంక్షేమ పథకం కోసం నిధుల కేటాయింపు విషయంలో వెనకడుగు వేయట్లేదు సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.
ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో బయటపడ్డ మరో మార్గదర్శి స్కాం
Comments
Please login to add a commentAdd a comment