volunteers
-
బాబు, పవన్ ను ఏకిపారేసిన వాలంటీర్లు
-
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వాలంటీర్ల మండిపాటు
-
‘చలో విజయవాడ’పై ఉక్కుపాదం.. వాలంటీర్ల గృహ నిర్బంధం
సాక్షి, విజయవాడ: వాలంటీర్ల ‘చలో విజయవాడ’(Chalo Vijayawada) కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల(Volunteers)ను హౌస్ అరెస్ట్ చేశారు. కేబినెట్లో వాలంటీర్ల అంశంపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సెక్రటేరియట్‌కు వెళ్లి సీఎంను కలుస్తామన్న వాలంటీర్లపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. విజయవాడలోని దాసరి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.చలో విజయవాడను అడ్డుకోవడంపై వాలంటీర్లు మండిపడ్డారు. గత ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. వాలంటీర్లకు ఉద్యోగం కల్పించడంతో పాటు బకాయి పడ్డ ఎనిమిది నెలల వేతనం ఇవ్వాలి. పోలీసులతో అడ్డుకున్నంత మాత్రాన మా పోరాటం ఆగదు’’ అని గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయున్ బాషా అన్నారు.‘‘ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే వరకూ వదిలిపెట్టం. చంద్రబాబు అబద్ధాల ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నాడు. మమ్మల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడుపోతుందోనని వాలంటీర్లు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట తప్పి మహిళలను మోసం చేశారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని మంత్రి డోలా బాలవీరాంజనేయులు మాట్లాడటం సిగ్గుచేటు’’ అని షేక్ హుమాయున్ బాషా మండిపడ్డారు.వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: చంద్రశేఖర్‌రెడ్డి 2.50 లక్షల మంది వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశారని ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. చలో విజయవాడ పేరుతో నిరసనకి పిలుపు ఇస్తే వారిని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వాలంటీర్లను అరెస్టు చేయటం హేయమైన చర్య. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పది వేల జీతం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్, లోకేష్ కూడా వాలంటీర్లకు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎగ్గొట్టారు’’ అని ఆయన ధ్వజమెత్తారు.‘‘పది వేలకు జీతం పెంచకపోగా గత ఏడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వటం లేదు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు అమలు చేయాలి. ఇప్పుడేమో అసలు వాలంటీర్ల వ్యవస్థే ప్రభుత్వంలో లేదంటూ హేళన చేస్తున్నారు. వాలంటీర్లకు సంబంధించిన జీవో లేకపోతే ఈ ప్రభుత్వం తొలిరోజుల్లో వారిని ఎలా వాడుకుంది?. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’’ అని చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం -
వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు: పెద్దిరెడ్డి
-
వలంటీర్లను కొనసాగించలేం
సాక్షి, విశాఖపట్నం: వలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేమని, వారిని విధుల్లోకి తీసుకుంటే న్యాయ పరమైన సమస్యలు తలెత్తుతాయని ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వలంటీర్లపై స్పష్టమైన విధానంతో ఉన్నామని చెప్పారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని తమ మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు. ‘వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం. అంతేకాకుండా మీ గౌరవ వేతనాన్ని నెలకు రూ.5 వేల నుంచి రెట్టింపు చేసి రూ.10 వేలు ఇస్తాం’ అని ఎన్నికల ముందు ఎంతో నమ్మకంగా ఊరూరా బహిరంగ సభల్లో పదే పదే చెప్పిన చంద్రబాబు, లోకేశ్.. కూటమి పార్టీల నేతలు అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ఇలా మాట మార్చడం విస్తుగొలుపుతోంది.మంత్రి లోకేశ్ తీరు ఏరు దాటాక తెప్పను తగలేసిన వైనాన్ని గుర్తుకు తెస్తోంది. ప్రజల ఇళ్ల వద్దకే సేవలు అందించడానికి విప్లవాత్మకంగా తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు సాగడం అందరికీ తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పార్టీల నేతలు ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని వలంటీర్ల సేవలను ఆపించినా, గత ప్రభుత్వం వారికి ఏప్రిల్, మే నెల జీతాలు అందజేసింది. జూన్ 1న వారు వేతనం అందుకున్నారు. ఆ సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్.. కూటమి నేతల వైఖరిని ఎండగడుతూ.. ‘తాత్కాలికంగా వాళ్లు మీ సేవలను ఆపించారు. అయినా ఏప్రిల్, మే నెలల జీతాలిచ్చాం. ఎన్నికలవ్వగానే తిరిగి మీరు మీ విధి నిర్వహణలో ఉంటారు.’ అని స్పష్టం చేయడం విదితమే.హెడ్ ఆఫ్ ఆకౌంట్ల వివరాలే అందుకు నిదర్శనం. వలంటీర్ల సేవలను ప్రశంసిస్తూ ఏటా వారిని మూడు రకాల అవార్డులతో సత్కరించడం కూడా తెలిసిందే. ఇలాంటి వలంటీర్ల వ్యవస్థపై కూటమి నేతలు ఆది నుంచీ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఓ దశలో వారిపై కిడ్నాపర్లుగా, సంఘ విద్రోహ శక్తులుగా, ఉమెన్ ట్రాఫికర్స్గా కూడా నిందలేశారు. తీరా ఎన్నికలు సమీపించగానే.. వారిని బుట్టలో వేసుకుని ఓట్లు వేయించుకోవడానికి నెలకు రూ.10 వేలు ఇస్తామని డప్పు కొట్టారు.కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు గడుస్తున్నా, వలంటీర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ వారు కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు గాను ఆదివారం విశాఖ వచ్చిన మంత్రి లోకేశ్.. వలంటీర్లపై తన కపట వైఖరిని వెల్లడించడం చూసి సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. వారిని ఇక కొనసాగించే ప్రసక్తే లేదన్నట్లు చెప్పడం పట్ల వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలకే డబ్బుల్లేవు.. ‘ప్రతినెలా రూ.4 వేల కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్ర బడ్జెట్ నడుస్తోంది. జీతాలు ఇవ్వడానికి సైతం ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. కేంద్రం సహకారంతో నెట్టుకొస్తున్నాం’ అని లోకేశ్ అన్నారు. గంజాయి నిర్మూలనకు రెండేళ్ల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. వాల్తేరు డివిజన్‌ను రెండు రాష్ట్రాలు చూసుకుంటాయని, మిలీనియం టవర్‌లో టీసీఎస్ సెంటర్ రావడానికి మరో రెండు, మూడేళ్లు పడుతుందన్నారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, చెన్నై–విశాఖ ఇండ్రస్టియల్ కారిడార్‌లో క్రిస్ సిటీనోడ్, పలు జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు రైల్వే జోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్నారు. -
వాలంటీర్లను విధుల్లోకి తీసుకోమని పరోక్షంగా స్పష్టం చేసిన లోకేష్
-
వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు: నారా లోకేష్
సాక్షి, అమరావతి: కూటమి నేతలు మాటల మార్చారు. వాలంటీర్ల విషయంలో కూటమి నేతలు యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ఒకలా.. ప్రభుత్వంలో మరోలా మాట్లాడుతూ.. వాలంటీర్ల(volunteers)ను తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయని బూకాయిస్తున్నారు. దీంతో, వాలంటీర్లకు నిరాశే ఎదురుకానుంది.వాలంటరీ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మొండిచేయి ఇచ్చింది. వారిని విధుల్లోకి తీసుకోమని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పరోక్షంగా స్పష్టం చేశారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతారని తమ మంత్రి చెప్పారని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయని చెప్పుకొచ్చారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) మాత్రం ఎన్నికలకు ముందు వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందన్నారు. అలాగే, వాలంటీర్లకు రూ.10వేలు జీతం ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు మాట మార్చడం గమనార్హం.ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాపంగా వాలంటీర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తమను విధుల్లోకి తీసుకోవాలని నిరసనల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా తమకు రూ.10వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా విజయవాడలో వాలంటీర్లు వినూత్నంగా వెనక్కి నడుస్తూ ఆందోళనలు చేపట్టారు. ఇది యూటర్న్ ప్రభుత్వం అనే ప్రయత్నం భాగంగా తాము ఇలా వెనక్కి నడిచినట్టు తెలిపారు. -
ఊపందుకుంటున్న వలంటీర్ల ఆందోళనలు
సాక్షి,అమరావతి/సత్యనారాయణపురం(విజయవా డ సెంట్రల్)/కర్నూలు (సెంట్రల్): ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజున చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి మోసపోయిన వలంటీర్ల ఆందోళనలు మరింతగా ఊపందుకున్నాయి. వరుసగా గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మరోవిడత ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2న గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్లకు వినతిపత్రాలు ఇవ్వగా.. 3న జిల్లా కేంద్రాల్లో న్యాయం చేయాలని కోరుతూ వలంటీర్లు మోకాళ్ల మీద కూర్చుని భిక్షాటన చేశారు.ఇక శనివారం (4న) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వలంటీర్లూ వెనుకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వలంటీర్లకు న్యాయంచేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకోవడాన్ని నిరసిస్తూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ బ్యాక్‌వాక్ చేస్తున్నారన్న దానిని గుర్తుచేస్తూ తమ ఆందోళన నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతో పాటు వలంటీర్లకు రూ.10 వేలు ఇచ్చే బాధ్యత తమది అంటూ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని వలంటీర్ల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పైగా.. జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదని వారంటున్నారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు.ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం..ఈ నేపథ్యంలో శనివారం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వలంటీర్లు ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వెనక్కి నడిచి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, లంక గోవిందరాజులు మాట్లాడుతూ.. విజయవాడ వరద ముంపు సమయంలో వలంటీర్లతో సేవలు చేయించుకుని నేడు కనీసం వారికి సచివాలయాల్లో హాజరు వేసుకునే అవకాశం కూడా కల్పించకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు.వలంటీర్లకు గత ఎనిమిది నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి రూ.పది వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల వలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించి నిరసన తెలియజేస్తామని వారు హెచ్చరించారు.బాబుగారూ.. మా కడుపులు కొట్టొద్దు!ఇక కర్నూలులో కూడా వలంటీర్లు వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. ఖాళీ ప్లేట్లు పట్టుకుని భిక్షాటన చేశారు. తమ కడుపులు కొట్టొద్దని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఈ సందర్భంగా వేడుకున్నారు. ముందుగా కలెక్టరేట్ గేటు నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వలంటీర్లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా స్వచ్ఛంధంగా పనిచేశామని.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమను తీసివేయడం అన్యాయమన్నారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లేదంటే పెద్దఎత్తున వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాలకు ఏఐవైఎఫ్ మద్దతిస్తోంది. -
బాబు వచ్చాడు.. జాబ్ తీశాడు.. వెనక్కి నడిచి వాలంటీర్ల నిరసన
-
ఉద్యోగ భద్రత కల్పించాలి..
సాక్షి నెట్వర్క్: తమకు ఉద్యోగ భద్రత(job security) కల్పించాలని, ఎన్నికల ముందు టీడీపీ(TDP) ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని డిమాండు చేస్తూ గ్రామ, వార్డు వలంటీర్లు(Volunteers) శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. తక్షణం వలంటీర్లను రెన్యువల్ చేసి, ఆరు నెలలుగా పేరుకుపోయిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన దీక్షలకు ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. అధికారంలోకి రాక ముందు ఒక మాట, వచ్చాక మరోమాట మాట్లాడడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు.అల్లూరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఎదుట వలంటీర్లు నిరసన దీక్షలు(Volunteers Protest) ప్రారంభించారు. వలంటీర్లను రెన్యూవల్ చేయకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోసంచేసిందని ఆరోపిస్తున్న టీడీపీ నాయకులు.. లిక్కర్ టెండర్లు, ఇసుక టెండర్లు ఇచ్చినట్లుగానే వలంటీర్లను కూడా రెన్యువల్ చేస్తూ ఎందుకు ఆదేశాలివ్వరని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తమను రోడ్డునపడి అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిందని విజయవాడలో వలంటీర్లు ఆవేదన వ్యక్తంచేశారు. తమ దుస్థితికి ప్రభుత్వమే కారణమంటూ వారు దుమ్మెత్తి పోశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని, ఈ దుస్థితికి కారణం ప్రభుత్వమేనని ఆరోపించారు. మంచి ప్రభుత్వమని స్టిక్కర్లు వేసుకోవడం కాదు, వలంటీర్లకు మేలుచేసే మంచి జీఓలు తెచ్చి రాష్ట్రంలోని 2.60 లక్షల వలంటీర్ల కుటుంబాలను ఆదుకోవాలని వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు కోరారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తామని.. అలా చంద్రబాబు ఇంటికీ వెళ్తామన్నారు. ఇక విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూడా ఈ నిరసన దీక్ష జరిగింది. -
చంద్రబాబుకు జ్ఞానాన్ని ప్రసాదించండి
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్)/కపిలేశ్వరపురం/అయినవిల్లి : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బుద్ధి, జ్ఞానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రసాదించాలని కోరుతూ వలంటీర్లు ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఏపీ వలంటీర్ అసోసియేషన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్‌నగర్ కృష్ణా హోటల్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గురువారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ.. చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగిస్తామని, వారికి నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని, అన్ని విధాలా న్యాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల విజయవాడలో బుడమేరు వరదల సమయంలో కూడా వలంటీర్లతో సేవలు చేయించుకొని, సచివాలయాల్లో కనీసం అటెండెన్స్ వేసుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా వివక్ష చూపుతోందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా బకాయి పడ్డ గౌరవ వేతనం చెల్లించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు తగిన జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించి వలంటీర్లకు న్యాయం చేసేలా చూడాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మమత, దమ్ము రమేష్, నరేష్, కల్యాణ్, షేక్ సైదాబీ, భాను, తేజస్విని, స్వప్న, షైనీ, రాజ్ కుమార్, సీపీఐ నాయకుడు కె.వి.భాస్కరరావు, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.ఎన్నికల హామీని అమలు చేయాలి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి, తమను విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఏడు నెలలుగా తమకు జీత భత్యాలు ఇవ్వడం లేదని ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలోని పంచాయతీ కార్యాలయాల్లో ఈ మేరకు గురువారం వారు వినతిపత్రాలు అందజేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో వలంటీర్లు తమ సమస్యలపై సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. -
ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ల నిరసన
-
రేపటి నుంచి వలంటీర్ల నిరసనలు
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనైనా సీఎం చంద్రబాబు ఎన్నికల వాగ్ధానాలను అమలు చేయాలని, వలంటీర్లకు న్యాయం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2న జరగనున్న కేబినెట్ భేటీలో వలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ 2,3,4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.జనవరి 2న గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్లకు వినతి పత్రాలు, 3న జిల్లా కేంద్రాల్లో మోకాళ్లమీద కూర్చుని భిక్షాటన, 4న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాక్ వాక్ చేస్తున్నారని గుర్తు చేస్తూ వలంటీర్లు బ్యాక్ టు వాక్ పేరుతో వెనుకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వివరించారు. -
‘ఉద్యోగ భద్రత’ హామీ నిలబెట్టుకోండి
సాక్షి,పాడేరు/హుకుంపేట/ముంచింగిపుట్టు (అల్లూరి జిల్లా): గ్రామ వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ.. రూ.10 వేల వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. పాడేరుతో పాటు చింతూరు, జి.మాడుగుల, అరకులోయ, ముంచంగిపుట్టు, హుకుంపేట తదితర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి రిలే దీక్షలు నిర్వహించారు. దీక్షల ముగింపు సందర్భంగా శనివారం ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. హుకుంపేటలో వలంటీర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బర్లు కొండబాబు,గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.కృష్ణారావు మాట్లాడుతూ వలంటీర్ల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జి.మాడుగులలో వలంటీర్లంతా రోడ్డుపై భిక్షాటన చేశారు. కూటమి ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమకు న్యాయం చేయని పక్షంలో తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఆందోళనలతో దద్దరిల్లుతున్న ఏపీ..
-
Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం
సాక్షి, నెట్వర్క్: కూటమి సర్కారు తీరుపై రాష్ట్రం నలుచెరుగులా అసహనం కట్టలు తెంచుకుంది. గిరిజన గురుకులాల టీచర్లు సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట బైఠాయించారు.. విధుల్లోకి తీసుకోవాలంటూ వలంటీర్లు ధర్నాలు చేపట్టారు.. సమ్మె సైరన్ మోగించిన 108 ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు.. సమస్యలు పరిష్కరించాలంటూ పిడికిలి బిగించి ఆశా వర్కర్లు భారీ ధర్నాకు దిగారు.. ఆకలి కేకలతో అలమటిస్తున్న ఆయాలు పెండింగ్ జీతాల కోసం పొలికేక పెట్టారు.. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం ఎక్కడికక్కడ రోడ్లెక్కితే.. ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు.. పారిశుధ్య కార్మీకులు.. వీవోఏలు.. మధ్యాహ్న భోజన కార్మీకులు.. పాఠశాల ఆయాలు.. సీహెచ్‌సీ వైద్యులు.. వెలుగు యానిమేటర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు.. నిరసనలు చేపట్టారు. మొత్తంగా వీరందరి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది. 108 ఉద్యోగుల భారీ ధర్నా సకాలంలో జీతాలు చెల్లించడంతోపాటు 104, 108 వ్యవస్థలను ప్రభుత్వమే నిర్వహించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో 108 అంబులెన్స్ ఉద్యోగులు సోమవారం మహాధర్నా చేపట్టారు. ఏపీ 108 సేవల కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ గౌరవాధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 25 నుంచి సమ్మె చేపడతామని నోటీసిచ్చినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల పేరిట ఈనెల 22న వైద్యశాఖ ఉన్నతాధికారులు బెదిరింపు ధోరణిలో మాట్లాడారన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోనూ 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కలెక్టరేట్ల వద్ద వలంటీర్ల నిరసన ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లు సోమవారం గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య జిల్లా రాయచోటి, పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్లు, రాజంపేట సబ్ కలెక్టరేట్ వద్ద, విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ ధర్నాలు, ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్‌లో అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఇందులో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు తలకిందులుగా నిలబడి నిరసన తెలియజేశారు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు కలెక్టరేట్ల వద్ద సంఘ నేతలు మాట్లాడుతూ తమను ఉద్యోగాల్లోకి తీసుకొని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ అధ్యాపకుల ధర్నా రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లోని ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తమను మెగా డీఎస్సీ నుంచి మినహాయించాలని, ఔట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ కలెక్టరేట్ వద్ద ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ధర్నా చేపట్టారు. దద్దరిల్లిన విశాఖ కలెక్టరేట్చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ చేసిన ధర్నాలతో విశాఖపట్నం కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మీకులు, సామాజిక కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వీవోఏలతో పాటు మధ్యాహ్న భోజన పథకం కార్మీకులకు 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేసి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ⇒ విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో 30 మంది హౌస్‌కీపింగ్ కార్మీకులను తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ⇒ ఇసుక విధానం ఎంతోమంది జీవితాల్ని రోడ్డున పడేసిందంటూ క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కలెక్టరేట్ ఎదుట భారీఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టింది. అసోసియేషన్ కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. ఇసుక రీచుల్లో దళారులు దోచేస్తున్నారనీ.. టన్నుకు అదనంగా రూ. 300 వరకూ వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయాల ఆందోళనచిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఆయాలకు 5 నెలలుగా జీతాలు మంజూరు చేయలేదని సోమవారం ఆయాలు చిత్తూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఆయాలకు చీపురుకట్టలు, ఫినాయిల్, గ్లౌజు, సోపులు ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట పెండింగ్ జీతాలు ఇవ్వాలని పాఠశాలలో పని చేసే ఆయాలు ధర్నాకు దిగారు. పంటకు పరిహారం ఇవ్వాలని ధర్నావిజయనగరం జిల్లాలో కోత దశలో ఉన్న వరి పంటను కత్తెర, కొమ్ము పురుగు ఆశించి కంకులన్నీ రాలిపోతున్నాయని, పరిహారం అందజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సభ్యులు సోమవారం ధర్నా చేశారు. సమగ్ర కులగణన చేపట్టాలిసమగ్ర కులగణన చేపట్టాలని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కల్లూరి నాగరాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఇదే విషయంపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నాయకులు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్‌కు వినతిపత్రం అందించారు. తక్షణం బ్లాస్టింగ్లు ఆపండి.. అపరిమిత బ్లాస్టింగ్లతో మార్టూరు బీటలు వారుతోందని, సర్వే నంబర్ 1 కొండపై ఖనిజాన్ని దోచేస్తూ ప్రజలను కాలుష్యంలోకి నెట్టేస్తున్న క్వారీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి మండలం మార్టూరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టి.. కిడ్నీ బాధితులుగా మారుతున్న ప్రజలను కాపాడాలంటూ కలెక్టరేట్లో ఫిర్యాదు ఇచ్చారు.చంద్రబాబు ఇంటి వద్ద ధర్నావిద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిసేందుకు గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్ల ప్రయత్నానికి పోలీసులు సోమవారం అడ్డుతగిలారు. మెగా డీఎస్సీతో తమకు అన్యాయం జరుగుతోందని, కనీసం తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్(సీఆర్టీ)గా మార్చాలనే డిమాండ్‌పై 1,656 మంది ఔట్సోర్సింగ్ టీచర్లు ఈ నెల 16 నుంచి సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం వద్ద ధర్నా చేస్తున్న గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్లు అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఉండవల్లిలోని ప్రజాదర్బార్ వేదిక వద్ద లోకేశ్‌ను కలిసేందుకు ఔట్సోర్సింగ్ టీచర్లు తరలివచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందిస్తామని టీచర్లు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ పోలీసులు అనుమతించలేదు. పోలీసులు, టీచర్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో సీఎం ఇంటి వద్దే టీచర్లు బైఠాయించారు. పరిస్థితి అదుపుతప్పేలా ఉండటంతో గిరిజన గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి సదా భార్గవి వచ్చి వారితో చర్చలు జరిపారు. ప్రభుత్వం దృష్టికి మీ విషయాన్ని తీసుకెళ్తామని, విధుల్లో చేరాలని కోరారు. ఇప్పటికే ఒకసారి ఆందోళన చేశామని, తమ డిమాండ్‌ను పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చి ఇంత వరకు పరిష్కరించలేదని టీచర్లు మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. దీంతో సదాభార్గవి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ధృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లోకేశ్ సమావేశంలో బిజీగా ఉన్నారంటూ లోకేశ్ ఓఎస్డీ వరప్రసాద్ ఔట్సోర్సింగ్ టీచర్లతో మాట్లాడారు. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లుగా పరిగణించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి మూడు రోజుల్లో ఏ విషయాన్ని చెబుతామని వరప్రసాద్ చెప్పడంతో ఔట్సోర్సింగ్ టీచర్లు ధర్నాను విరమించి వెనుదిరిగారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించే వరకు సమ్మె విరమించేది లేదని గిరిజన గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ తేల్చిచెప్పారు. 15 ఏళ్లకుపైగా గురుకులాల్లో కేవలం రూ.10,500 నుంచి రూ.18,000 చాలీచాలని జీతాలతో సేవలు అందిస్తున్న తమకు డీఎస్సీ కారణంగా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేవరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. పిడికిలి బిగించిన ఆశా వర్కర్లు.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో ఆశాలు భారీ ధర్నా నిర్వహించారు. తమను ప్రభుత్వం కార్మీకులుగా గుర్తించాలని, పదవీ విరమణ ప్రయోజనాలను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ వయసును పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సహజ మరణానికి రూ. 2లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీహెచ్సీ వైద్యుల ధర్నా విజయవాడ ధర్నా చౌక్‌లో పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు ధర్నా చేశారు. పీజీ కోటా తగ్గింపుపై ఆందోళన చేపట్టారు. బుడమేరు వరదల వల్ల నష్టపోయిన తమకు పరిహారం అందించాలని కోరుతూ బాధితులు ధర్నా చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల ఆందోళన ప్రభుత్వం ఉచిత ఇసుక అందించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు విజయవాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. పనులు లేక అల్లాడుతున్న 40లక్షల మంది కార్మీకులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఏపీ వెలుగు యానిమేటర్ల ధర్నా విజయవాడలో కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. రాజకీయ కక్షలతో తొలగించిన వీఓఏలను విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు రద్దు చేయాల్సిందే విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని సీపీఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ శ్రీకాకుళం జిల్లా హిరమండలం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. నిత్యావసర వస్తువుల ధరలతో బెంబెలేత్తిపోతున్న సామాన్యులపై విద్యుత్ చార్జీల పేరుతో మరింత భారం మోపడం సరికాదన్నారు. విజయవాడలోనూ విద్యుత్ ట్రూఅప్ చార్జీల పేరుతో వినియోగదారులపై భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
విజయవాడ ధర్నా చౌక్ వద్ద వాలంటీర్ల ధర్నా
-
పెద్దలే పిల్లలై..!
ఆటలు, పాటలు.. అంటే మనకు పిల్లలే గుర్తొస్తారు. కానీ వృద్ధులు కూడా తమ బాల్యం నాటి రోజులు గుర్తు చేసుకుని ఆడిపాడితే ఎలా ఉంటుంది. అచ్చు అదే ఆలోచన చేసింది వీ ది వలంటీర్స్ అనే స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ఆదివారం బౌరంపేటలోని ఓ పాఠశాలలో ‘పెద్దల జాతర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో 30 వృద్ధాశ్రమాల నుంచి దాదాపు 400 మంది వృద్ధులు పాల్గొన్నారు. ఆడుతూ, పాడుతూ, రంగురంగుల బొమ్మలు వేసి రోజంతా సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని ఏటా జరుపుతుంటారు. అయితే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం విశేషం. -
ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ల నిరసనలు
-
మా ఉద్యోగాలు మాకు ఇచ్చే వరకు చంద్రబాబుని వదిలే ప్రసక్తే లేదు.. వాలంటీర్లు సీరియస్ వార్నింగ్
-
వలంటీర్లను కొనసాగించాలి
సీతమ్మధార/చిలకలూరిపేట/తిరుపతి అర్బన్: వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి, రూ.10 వేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ధర్నా నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ గాం«దీపార్కులో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మణి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన మాటకు పూర్తి భిన్నంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేదని ప్రకటించడం విశ్వాస ఘాతుకమని దుయ్యబట్టారు. తక్షణం వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఏపీ ప్రజా గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ కరోనా సమయంలో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. చాలామంది కరోనా రోగుల్ని ఆస్పత్రులకు తీసుకెళ్లి, మెరుగైన వైద్యం అందించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు నడిరోడ్డు మీదికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు న్యాయం చేయకపోతే విజయవాడలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కక్షసాధింపు తగదు ఇచ్చిన హామీ మేరకు వార్డు, గ్రామ వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్లను విధుల్లోకి తీసుకొనేది లేదని చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం వలంటీర్లతో కలసి చిలకలూరిపేటలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతోపాటు ఐదు నెలల బకాయిలు చెల్లించి రూ.10 వేల గౌరవవేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వలంటీర్లను కొనసాగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలి ‘మా ఉద్యోగం మాకు ఇవ్వండి.. మాకు రాజకీయ రంగు పూయకండి..ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అదేశాలను తు.చ. తప్పకుండా పాటించడమే మా పని.. గత సర్కార్లోను ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో వారధిలాగానే పనిచేశాం’ అంటూ వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద వలంటీర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచి్చన హామీని నిలబెట్టుకోమని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. -
గ్రామ సచివాలయ వాలంటీర్లకు స్వచ్ఛందంగా ద్రోహం చేసిన బాబు
-
చంద్రబాబు వాలంటీర్లను మోసం చేశాడు: Kannababu
-
జీతాల కోసం ఆశా వర్కర్లు రోడ్డెక్కెతున్నారు
-
వలంటీర్ వ్యవస్థకి చంద్రబాబు ప్రభుత్వం షాక్