చంద్రబాబు ఒరిజినల్‌ క్యారెక్టర్‌ ఇదే: సజ్జల | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu Naidu, Details Inside - Sakshi
Sakshi News home page

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ఒరిజినల్‌ క్యారెక్టర్‌ ఇదే

Published Sun, Mar 31 2024 2:31 PM | Last Updated on Sun, Mar 31 2024 5:55 PM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికీ అందుతున్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా?
‘‘చంద్రబాబుది మోసపూరిత రాజకీయం. ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా?. చంద్రబాబు ఒరిజినల్‌ క్యారెక్టర్‌ చూపిస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. ‘‘వాలంటీర్లపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నాడు. పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబు గిట్టదు. నిమ్మగడ్డ రమేష్‌ చంద్రబాబు తరపున పనిచేస్తున్నారు. సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే. తానొస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని చంద్రబాబు మేసెజ్‌ ఇచ్చారు. వాలంటీర్‌ వ్యవస్థ చంద్రబాబు పడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవి. చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కూడా లేదు. వృద్ధులకు, వికలాంగులను ఇబ్బంది పెడితే మీకు ఏమొస్తుంది. చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదు’’ అంటూ సజ్జల ధ్వజమెత్తారు.

సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు..
‘‘పవన్‌ను చంద్రబాబు మింగేస్తాడని ముందే చెప్పాం. పవన్‌కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారు. పెన్షనర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందజేస్తాం. లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పెన్షన్లు తీసుకోవాలి. మూడో తేదీన పెన్షన్లు అందిస్తాం’’ అని సజ్జల వెల్లడించారు.

‘‘పేదలను రాచి రంపాన పెట్టంలో చంద్రబాబు ఎంతో ఉత్సాహం చూపుతారు. వాలంటీర్లు వద్దనుకుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లొచ్చు. వాలంటీర్లకు బదులుగా జన్మభూమి కమిటీలను తెస్తామని చెప్పుకోవచ్చు కదా?. వాలంటీర్లంటే చంద్రబాబుకు ఎందుకంత భయం?. సిటిజన్స్ ఫర్ డ్రమొక్రసీ అనే సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఈ సంస్థ ఏర్పాటు అయిన 15 రోజులకే వాలంటీర్లపై కోర్టులో కేసు వేశారు. చంద్రబాబు పార్టీ ఆఫీసులో తయారయ్యే స్క్రిప్టు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తారు. కపిల్ సిబాల్ లాంటి కోట్లకు కోట్లు తీసుకునే లాయర్లతో కేసులు వేయించారు’’ సజ్జల ధ్వజమెత్తారు.

చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్లీ పాతరోజులు..
చంద్రబాబు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్ళీ పాతరోజులు వస్తాయి. పెన్షన్లు అందటం కాదుకదా.. కనీసం దరఖాస్తు చేసుకోవటానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. చిన్న సర్టిఫికేట్ కావాలన్నా రోజుల తరపడి తిరిగే పరిస్థితి గతంలో ఉండేది. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తున్నది వాలంటీర్లే. చంద్రబాబు కడుపుమంటతో వృద్దులు, వికలాంగులకు సేవలను నిలిపేశారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మరి సచివాలయ సిబ్బందిని కూడా జగనే నియమించారు కదా?’’ అని సజ్జల ప్రశ్నించారు.

లబ్ధిదారులే మాకు స్టార్ క్యాంపెయినర్లు
సీఎం జగన్ బస్సుయాత్రకు జనసునామీ కదిలి వస్తోంది. పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీలను చంద్రబాబు మింగేశారు. పిఠాపురానికి ఎవరో పంపితే పవన్ వెళ్లాల్సి వచ్చింది. ఇష్టం లేకుండా పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. సీఎం సీఎం అనే పరిస్థితి నుంచి చివరికి 21 సీట్లకే పరిమితం అయ్యాడు. బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీలో జెండా ఎత్తేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబుకు అర్థం అయింది. అందుకే చౌకబారు మాటలు, దూషణలతో ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకం. కుట్రలు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో ప్రజలకు అర్థం అయ్యింది. ప్రతి ఇంట్లో ఉన్న లబ్ధిదారులే మాకు స్టార్ క్యాంపెయినర్లు’’ అని సజ్జల పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పేదవాళ్ల లబ్ధిపై టీడీపీ కుట్రల రాజకీయం: మంత్రి బొత్స 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement