
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుతోపాటు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ఏఐవైఎఫ్ అనుబంధ ఏపీ రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో వలంటీర్ల ఆవేదన సదస్సు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐదు నెలల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్న అంశంపై సదస్సులో చర్చించనున్నట్టు పేర్కొన్నారు.