volunteers System
-
‘ఉద్యోగ భద్రత’ హామీ నిలబెట్టుకోండి
సాక్షి,పాడేరు/హుకుంపేట/ముంచింగిపుట్టు (అల్లూరి జిల్లా): గ్రామ వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ.. రూ.10 వేల వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. పాడేరుతో పాటు చింతూరు, జి.మాడుగుల, అరకులోయ, ముంచంగిపుట్టు, హుకుంపేట తదితర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి రిలే దీక్షలు నిర్వహించారు. దీక్షల ముగింపు సందర్భంగా శనివారం ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. హుకుంపేటలో వలంటీర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బర్లు కొండబాబు,గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.కృష్ణారావు మాట్లాడుతూ వలంటీర్ల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జి.మాడుగులలో వలంటీర్లంతా రోడ్డుపై భిక్షాటన చేశారు. కూటమి ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమకు న్యాయం చేయని పక్షంలో తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
వాలంటీర్లకు అవమానం.. అసెంబ్లీ సాక్షిగా పచ్చి నిజాలు.. ఒప్పుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
-
Big Question: వాలంటీర్లకు వెన్నుపోటు
-
వాలంటీర్లకు మంగళం.. అబద్ధాల్లో పోటీ పడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
-
వాలంటీర్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం
-
చంద్రబాబు పచ్చి మోసంపై ప్రజాగ్రహం
అమరావతి, సాక్షి: ఏపీలో సంక్షేమ వారధులుగా ముద్రపడిపోయిన వలంటీర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పెద్ద షాకే ఇచ్చారు. గతంలో వాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పించి.. ఎన్నికలటైంలో వాళ్లను కొనసాగిస్తానని, జీతం సైతం పెంచుతామని స్వయంగా ఆయన ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థకే మంగళం పాడేశారు.ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వలంటీర్ వ్యవస్థ మొదలైంది. సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను మొదలుపెట్టారాయన. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంతకాలం.. వీళ్ల ద్వారానే పౌర సేవలు నిరాటంకంగా సాగాయి. ఎండా, వాన, చలి లెక్కచేయకుండా.. చివరకు కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి మరీ సేవల్ని అందించారు వాళ్లు. దేశవ్యాప్తంగా వలంటీర్ వ్యవస్థ గురించి చర్చ నడిచింది. అయితే.. ఎన్నికలకు నెలముందు.. టీడీపీ రాజకీయం నడిపించి వలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. దీంతో లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఈలోపు ఎన్నికలయ్యాయి. అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులైనా వాళ్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. మరోవైపు.. తమ విధులకు సంబంధించి 2.66 లక్షల మంది వాలంటీర్ల ఆందోళనకు గురయ్యారు. కలెక్టరేట్ల చుట్టూ తిరిగి వినతి పత్రాలు సమర్పించారు. ఇంకోపక్క.. నామ మాత్రంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కొనసాగించారు. దీంతో వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే.. ఇక్కడ వైఎస్సార్సీపీ అనుమానాలే నిజమయ్యాయి. జగన్ ఆలోచనను తుడిచేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఆ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్లే.. అసెంబ్లీ సాక్షిగా ఏపీ మంత్రి చేసిన ప్రకటనతో.. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్ల ఊపిరి తీసింది. వలంటీర్లు విధుల్లో లేరని, వాళ్లను కొనసాగించేది లేదని, అలాంటప్పుడు జీతాల పెంపు ఎక్కడిదంటూ? చెప్పడంతో చంద్రబాబు పచ్చి మోసంపై.. ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.బుధవారం మండలిలో మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా వలంటీర్ వ్యవస్థపై ప్రశ్న YSRCP ఎమ్మెల్సీల ప్రశ్న.. గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ వేతనం ఎప్పుడు పెంచుతారు?మంత్రి వీరాంజనేయస్వామి సమాధానం.. ప్రస్తుతం రాష్ట్రంలో వలంటీర్లు పనిచేయడంలేదని చెప్పారు. వారికి ఈ ఏడాది మే వేతనం రూ.277.21 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం వలంటీర్లను నియమించిందని, ఆ తర్వాత వారిని కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదని, అందుకే తాము వారిని కొనసాగించలేమని అన్నారు. వలంటీర్ వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎలా వస్తుంది. -
వాలంటీర్ వ్యవస్థే లేకపోవడం ఏంటి అద్యక్ష.. బొత్స కౌంటర్
-
‘‘వలంటీర్ వ్యవస్థే లేదు’’.. భగ్గుమన్న శాసనమండలి
సాక్షి, అమరావతి: వలంటీర్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంటలు చేగాయి. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల టైంలో వైఎస్సార్సీపీ ఈ అంశాన్ని లేవనెత్తగా.. ప్రభుత్వం నుంచి దిగ్భ్రాంతికి గురి చేసే సమాధానం వచ్చింది. ‘‘రాష్ట్రంలో వలంటీర్లు పని చేయడం లేదు. అసలు వలంటీర్ వ్యవస్థే లేదు. లేనివ్యవస్థ ను అసలు ఎలా కొనసాగిస్తాం. ఒకవేళ కొనసాగిస్తేనే జీతాలు పెంచుతాం అన్నాం. అసలు కొనసాగించలేదు.. కాబట్టి జీతాలు పెంచం’’ అని ఏపీ సాంఘిక సంక్షేమ మంత్రి బాల వీరాంజనేయులు బదులిచ్చారు. దీంతో మండలిలో మంటలు చెలరేగాయి. మంత్రి సమాధానంపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. ‘‘ఎన్నికల్లో మీరు వలంటీర్లకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు మంత్రి అసలు వ్యవస్థ లేదనడం దారుణం. రెన్యూవల్ జీవో మీరు ఇవ్వొచ్చు కదా!’’ అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు.‘‘వాలంటీర్ల గౌరవ వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 5 వేలు వేతనాన్ని 10 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు అయ్యాక వాలంటీర్ల ను మోసం చేశారు’’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు.వలంటీర్ వ్యవస్థ విషయంలో వైఎస్సార్సీపీ అనుమానాలే నిజమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్లను దారుణంగా మోసం చేస్తారని, ఆ వ్యవస్థను రద్దు చేసే కుట్ర జరుగుతోందని చెబుతూ వస్తోంది. ఇప్పుడు మంత్రి సమాధానంతో ఆ కుట్రే నిజమని తేలింది. -
నేడు వలంటీర్ల ఆవేదన సదస్సు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుతోపాటు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ఏఐవైఎఫ్ అనుబంధ ఏపీ రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో వలంటీర్ల ఆవేదన సదస్సు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐదు నెలల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్న అంశంపై సదస్సులో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. -
వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి!
ప్రభుత్వ పథకాలను అర్హులకు ఎలాంటి అవి నీతికి, వివక్షకు తావులేకుండా చేరేలా చూడటానికి వైఎస్ జగన్ తన పాలనా కాలంలో తీసుకువచ్చిన సమున్నత వ్యవస్థ వలంటీర్ల వ్యవస్థ. దాదాపు రెండున్నర లక్షల మంది యువతీ యువకులు నెలకు కేవలం ఐదువేల రూపాయలు చొప్పున పొందుతూ ప్రభుత్వానికీ–ప్రజలకూ మధ్య వారధిగా నిలిచారు. పదకొండు వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాల నుండి ఆయా గ్రామాల– వార్డుల లోని ఇళ్ళ ముంగిటకు ప్రభుత్వ సేవలను చేర్చే వ్యవస్థ ఇది. ముఖ్యంగా నిరుపేదల, వృద్ధుల, దివ్యాంగుల, దీర్ఘరోగ పీడితుల మన్ననలను చూరగొని ఇతర రాష్ట్రాలకు సయితం స్ఫూర్తిగా నిలిచింది. కరోనా లాంటి విపత్కర సమయంలో విశిష్ట సేవలు అందించింది. అటువంటి ఉదాత్త వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గత ఐదేళ్ళలో ఎంతో బురద చల్లారు, దుష్ప్రచారం చేశారు. గోనె సంచులు మోసే ఉద్యోగమా అని ఈసడించి అవమానించారు. పవన్ కల్యాణ్ అయితే, మరింత హీనంగా దిగజారి వలంటీర్లు తాము సేకరించిన డేటా ద్వారా 30 వేల ఎమంది మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేయించారని పెద్ద అభాండమే వేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, తన ఆరోపణలపై ఎందుకు విచారణ జరిపించలేదో మరి!తీరా ఎన్నికలు సమీపించేసరికి బాబు వలంటీర్లను చంకకెత్తుకొని ‘మీకు పదివేలు ఇస్తా, మీ నైపుణ్యాలను పెంచుతా, సంపన్నులను చేస్తా’ అని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు గెలిచి ప్రభుత్వం ఏర్పరిచాక వారి సేవలను కొనసాగించకుండా, పరోక్షంగా రద్దు చేసినట్లే ప్రవర్తిస్తున్నారు. సచివాలయ సిబ్బందినే ఇంటింటికి పంపి మొదటి నెలలో వలంటీర్లు లేకుండానే పెన్షన్లను డోర్ డెలివరీ చేశామని గొప్ప చెప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటినా, తమ వ్యవస్థను కొనసాగించకపోవడంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వలంటీర్లు ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదే బాబు నిర్వాకం వల్ల బెజవాడ బుడమేరు వరదలో ముని గితే, గతిలేని పరిస్థితుల్లో వలంటీర్లను పిలిచి వారి సేవలను ఉపయోగించుకున్నారు. విలయం తగ్గాక వలంటీర్లను పట్టించుకోవడం మానేశారు.కూటమి హామీ ఇచ్చిన సూపర్–6లో ఏడాదికి నాలుగు లక్షలు చొప్పున 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామనే హామీ అమలు ప్రారంభం కాకపోగా, ఉన్న రెండున్నర లక్షల వలంటీర్లతో సహా మరెన్నో వేలమంది ఉపాధికి ఎసరు పెట్టారు. ఎంతో సదుద్దేశంతో జగన్ ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థను మంచి బుద్ధితో కొనసాగించాల్సింది పోయి జగన్ మీది ద్వేషం, పగ, కక్షలతో ఆ వ్యవస్థను నిర్మూలించడానికే దురాలో చనలు చేస్తున్నారు. ఇది తగదు. పాలక–ప్రతిపక్ష పార్టీల మధ్య విధానాల పరంగా, రాజకీయంగా విభేదాలు ఉండవచ్చుగాక... కానీ ఒక ఆదర్శ వ్యవస్థను అంతం చేయబూనటం మున్ముందు పాలక కూటమికి పతనహేతువు కాగలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.వలంటీర్లు అంటే ఎవరనుకుంటున్నారు? వాళ్ళు మన సామాజిక స్వర్ణయుగపు చందమామ కథల రోజుల నాటి ‘పరోపకారి పాపన్నలు!’ 50 ఇళ్ళకు ఒకరు చొప్పున పిలిస్తే పలికే ఆపద్బాంధవులు! ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులకు సత్వరం అందించే దూతలు! పేదల ఆశీర్వచనాలు అందుకుంటూ తృప్తిపడే అల్ప సంతోషులు!1969 మహాత్మాగాంధీ శత జయంతి సందర్భంగా దేశంలోని అన్ని కళాశాలల విద్యార్థులలో స్వచ్ఛంద సేవానిరతిని పెంపొందించేందుకు జాతీయ సేవా పథకం ప్రవేశపెట్టారు. ఒక విధంగా దానికి కొనసాగింపుగా మన రాష్ట్రంలో వచ్చిన వ్యవస్థ ఈ వలంటీర్ వ్యవస్థ అని చెప్పవచ్చు. లక్ష లాదిగా వున్న ఈ వలంటీర్లకు ప్రభుత్వం న్యాయం చేకూర్చాలి.ఈదర గోపీచంద్ వ్యాసకర్త ‘గాంధీ స్మారక సమితి’ వ్యవస్థాపకులు ‘ 94403 45494 -
వలంటీర్ల వ్యవస్థకు ఉరి!
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర కుటుంబాలకు ఇంటి వద్దే సేవలు అందించిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ప్రతి సంక్షేమ పథకం నుంచి సర్టిఫికెట్ వరకు వివిధ సేవలను ప్రజలకు సత్వరం అందించి మన్ననలు పొందిన ఆ వ్యవస్థపై కక్ష సాధిస్తోంది. ప్రజల మనసు గెలిచిన వలంటీర్ వ్యవస్థ నిర్వీర్యానికి కుటిల పన్నాగం పన్నిన చంద్రబాబు.. తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటూ ఆ ప్రజల నుంచి వారికి సంబంధాలు లేకుండా చేయాలని నిర్ణయించారు.వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన @ncbn.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచాక నట్టేట ముంచేశాడు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వాలంటీర్ గ్రూప్‌లన్నీ డిలీట్ చేయాలని అధికారులకి ఆదివారం ఆదేశాలుచంద్రబాబు తేనె పూసిన కత్తికి… pic.twitter.com/16asihjkF1— YSR Congress Party (@YSRCParty) August 5, 2024 ఇప్పటికే రెండు నెలల నుంచి వారికి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. పింఛన్ల పంపిణీ విధుల నుంచి వారిని తొలగించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ నెరవేర్చలేదు. మేనిఫెస్టోలో పెట్టిన రూ. 10 వేతనం పెంపు ఊసేలేదు. తాజాగా, వారి వాట్సాప్ గ్రూపులన్నింటినీ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం చూస్తే.. ఈ చిన్న వేతన జీవులపై చంద్రబాబు సర్కార్ ఎంత కక్షగట్టిందో అర్థమవుతుంది. అధికారంలోకి రాకముందు నుంచే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ఒక్కో పావు కదుపుతూ వస్తున్న చంద్రబాబు.. తానిచ్చిన ఎన్నికల హామీలనే విస్మరిస్తూ ఇప్పుడు ఆ వ్యవస్థకు మంగళం పాడేందుకు సిద్ధమయ్యారు. ఉగాది పర్వదినం రోజునే చంద్రబాబు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. వలంటీర్ల వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని హామీ కూడా ఇచ్చారు. ఎన్నికల ముందు ఆయన హామీలు ఇచ్చి ఆనక మోసం చేస్తాడు అనడానికి వలంటీర్ల వ్యవస్థపై నిర్ణయాలనే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు వలంటీర్ల విషయంలో సెలవు దినం రోజే నిర్ణయం తీసుకుని భారీ మోసానికి పాల్పడటం చూస్తే.. ఇది ఆయన నైజానికి పరాకాష్టగా భావించవచ్చు.హామీలు నెరవేర్చమనడమే పాపమా? ఎన్నికల్లో ఇచి్చన, మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చమని అడగడమే వలంటీర్ల విషయంలో పాపమైంది. వలంటీర్లను ఎవరినీ తొలగించబోమని, పైగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే వారి వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయితే అధికారం చేపట్టాక వారిని పింఛన్ విధుల నుంచి తొలగించారు. రెండు నెలల నుంచి ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. హామీ ఇచ్చి న మేరకు వేతనాలు పెంచాలని కోరుతున్నారు. దీంతో కక్ష గట్టిన ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది.వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించండి..ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాల సమాచారం క్షణాల్లో ప్రజలందరికీ తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ల వాట్సాప్, టెలిగ్రాం తదితర గ్రూపులన్నింటినీ తక్షణమే తొలగించాలంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ శాఖ డైరెక్టర్ ఫోన్ మెసేజ్ ద్వారా హడావుడిగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు తక్షణం క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఆయా వలంటీర్ల వాట్సాప్ గ్రూపుల తొలగించిన వివరాలను అధికారులు తనకు సోమవారం ఐదు గంటల లోపు తెలియజేయాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేగాక ప్రజలను కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలాగ అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో జిల్లాలోనూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఇన్చార్జిలు హడావుడిగా ఆ సమాచారాన్ని మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు పంపారు. కాగా, ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వలంటీర్ల అందరికీ అప్పట్లో ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులను గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్వా«దీనం చేసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వలంటీర్లు ఎవ్వరికీ ఆ ఫోన్లను, సిమ్‌కార్డులను తిరిగి అందజేయలేదు. -
మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
ప్రొద్దుటూరు: గత ఎన్నికల్లో తాము ఓడిపోయామని, చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చెప్పారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాస్తవానికి ఇంకో ఏడాది వరకు ప్రతిపక్ష నేతగా తమకు పని ఉండదని భావించామని, అయితే ఎన్డీఏ ప్రభుత్వం తమకు అంత సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు. నెలరోజులు కాకముందే ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సి వస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రూ.3 వేలు ఉన్న వృద్ధాప్య పింఛన్‌ను రూ.4 వేలకు పెంచడంతోపాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వ్యత్యాసాన్ని కలిపి రూ.7 వేలు జూలై 1న చెల్లిస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఈ ఒక్క పింఛన్లు మాత్రమే జూలై నెలలో పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రకారం దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేలు నుంచి రూ.6 వేలకు పెంచడంతోపాటు మూడునెలల వ్యత్యాసాన్ని కలిపి రూ.15 వేలు చెల్లించాల్సి ఉందన్నారు.మంచానికే పరిమితమైన వారి పింఛన్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పడంతోపాటు మూడునెలల వ్యత్యాసాన్ని కలిపి రూ.25 వేలు చెల్లిస్తామని చెప్పారన్నారు. డయాలసిస్ పేషెంట్లకు రూ.10 వేలు ఉన్న పింఛన్‌ను రూ.15 వేలకు పెంచుతామని తెలిపారని, ఈ ప్రకారం మూడునెలల వ్యత్యాసాన్ని కలిపి రూ.30 వేలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పిన ప్రకారం ఈ నెల వివిధ రకాలు పెంచి ఇవ్వాల్సి ఉండగా కేవలం వృద్ధాప్య, వితంతు పింఛన్లు మాత్రమే పెంచి మూడునెలల వ్యత్యాసాన్ని కలిపి ఇస్తున్నారన్నారు.మిగతా పింఛన్లను పెంచలేదని స్వయంగా అధికారులు చెబుతున్నారని తెలిపారు. నిరుద్యోగులు చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లు వేశారని, మళ్లీ వారికి మోసమే జరిగిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వస్తే వలంటీర్లకు రూ.10 వేలు వేతనం పెంచి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయిస్తున్నారన్నారు. దీన్నిబట్టి వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడినట్లేనన్న అనుమానం వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీముని పల్లి లక్ష్మీదేవి పాల్గొన్నారు. -
జూన్‌లో లోకల్ వార్.. తెలంగాణ రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ జూన్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బుధవారం జరిగిన భువనగిరి లోక్‌సభ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. మధ్య మధ్యలో ఎన్నికలతో ఇబ్బంది.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పాలకవర్గాల పదవీకాలం జనవరి నెలాఖరులోనే పూర్తికాగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జూలైలో గడువు ముగియనుంది. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. జూలై తొలివారం నాటికి కొత్తగా మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. దీంతో జూన్ రెండో వారం నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, ఒకే దఫాలో పూర్తిచేయాలని సీఎం రేవంత్ యోచిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని, స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా పూర్తిచేయడం ద్వారా గ్రామ స్థాయిలోనూ రాజకీయంగా పట్టు సాధించడానికి, అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ నేతలతో సీఎం పేర్కొన్నట్టు సమాచారం. మధ్యమధ్యలో ఎన్నికలు వస్తూ ఉంటే ఇబ్బందులు వస్తుంటాయని చెప్పినట్టు తెలిసింది. రేవంత్ ఇచ్చిన సంకేతాల ప్రకారం.. జూన్ చివరి వారంలో లేదా జూలై తొలివారంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పనితీరు ఆధారంగా చాన్స్ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీపరంగా చూపిన పనితీరు ప్రాతిపదికనే.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అభ్యరి్థత్వాలతోపాటు ఇందిరమ్మ కమిటీల్లో సభ్యుల నియామకం చేపడతామని పార్టీ నేతలతో సీఎం రేవంత్ పేర్కొన్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని.. ఇప్పటికే నామినేటెడ్ పదవుల నియామకాలు జరుగుతున్నాయని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా స్థానిక నేతలకు ఎన్నికల్లో పోటీ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. వలంటీర్ల వ్యవస్థను తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా భువనగిరి సమీక్ష సందర్భంగా ఈ కోణంలో చర్చ జరిగినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని.. ఈ కమిటీల నుంచి చురుగ్గా ఉన్న ఒక కార్యకర్తను వలంటీర్‌గా ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలు క్రియాశీల పాత్ర పోషించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. వలంటీర్ల ద్వారా పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరువ చేయవచ్చనే ఆలోచనతో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. -
‘వలంటీర్లకు గాలం వేయడం నీ తరం కాదు’
కృష్ణా, సాక్షి: నాలుగున్నరేళ్లుగా క్షోభపెట్టి.. ఇప్పుడు వలంటీర్లకు గాలం వేస్తున్నావా? అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మండిపడ్డారు. అయితే వలంటీర్లంటే నిస్వార్ధ సేవకులని, వారికి గాలం వేయడం అంత సలువు కాదని బాబుకి పేర్ని నాని చురకలంటించారు. ‘‘నాలుగున్నరేళ్లుగా మీరు(బాబు అండ్ కో) పెట్టిన క్షోభంతా వలంటీర్లు మర్చిపోయారనుకుంటున్నారా?. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి.. బాంబే రెడ్ లైట్ ఏరియాకు అమ్మాయిలను అమ్ముతున్నారన్నారంటూ వలంటీర్లపై అడ్డగోలు ఆరోపణలు చేశారు. పైగా మూటలు మోసే ఉద్యోగం, మగవాళ్లు ఇంట్లో లేకుండా తలుపులు కొడతారని వ్యాఖ్యానించారు. మరి ఆ వ్యాఖ్యలన్నీ చంద్రబాబు మర్చిపోయారా?.. పొరపాటున రేపు నువ్వొస్తే నీ జన్మభూమి కమిటీలను వలంటీర్లుగా మారుస్తావని వారికి(వలంటీర్ల) తెలియదా?. చంద్రబాబూ.. నీ మోసాలు, కుట్రలు, కుయుక్తులు నమ్మేవారు ఎవరూ లేరు. రాష్ట్రంలో ఉన్న 2.60 లక్షల మంది వలంటీర్లందరికీ జగన్ గారంటే ఏంటో తెలుసు. వచ్చేది జగన్ ప్రభుత్వమే అనేదీ వలంటీర్లకు తెలుసు. జగన్ ప్రభుత్వంలో వారి సంక్షేమం, బాగోగులు ఎలా చూసుకోవాలో మాకు తెలుసు అని పేర్ని నాని అన్నారు. అంతలా క్షోభపెట్టి ఇప్పుడు.. బూటకాలకు, నయవంచనకు మారు పేరైన నారా చంద్రబాబునాయుడు వివిధ కులాలకు గాలం వేయడం అయిపోయింది. కులాలను వాడుకుని వదిలేసి మోసం చేయడం కూడా అయిపోయింది. రాష్ట్ర ప్రజలకు కూడా గాలం వేయడం, వారిని వాడుకోవడం, విసిరి పారేయడం అయిపోయింది. కొత్తగా ఇప్పుడు వలంటీర్లకు కూడా చంద్రబాబు గాలం వేస్తున్నాడు. ఆ గాలానికి ఎరగా గౌరవవేతనం పదివేలు చేస్తానంటున్నాడు. పదివేలు చేస్తానన్న పెద్ద మనిషి ఎవరయ్యా అంటే గత నాలుగున్నరేళ్లుగా వలంటీర్లను మానసికంగా క్షోభకు గురిచేసిన చంద్రబాబు వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. బాంబే రెడ్ లైట్ ఏరియాకు అమ్మాయిలను అమ్ముతున్నారని వాళ్ల పార్టనర్ అంటే..మగవాళ్లు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్లను లొంగదీసుకుంటారని మాట్లాడని వ్యక్తులు వీళ్లు. మూటలు మోసే వారని, డేటాను ఇతర దేశాలకు అమ్ముతారని వీళ్లంతా ఇష్టారీతిన మాట్లాడారు. తన రాజకీయం కోసం పట్టుమని ముప్పై ఏళ్లు కూడా నిండని ఆడ, మగ పిల్లల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ప్రజలు ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండా జగన్ గారి ప్రభుత్వంలో పథకాలను వారి గుమ్మం వద్దకే తీసుకెళ్లిన వ్యవస్థ వలంటీర్ వ్యవస్థ. ముక్కలు చేయాలని కుయుక్తులు వలంటీర్ వ్యవస్థను ముక్కలు ముక్కలు చేద్దామని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగా వారిని ఎంత దిగజార్చాలో అంత చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరిచాడు. చంద్రబాబు తాబేదారు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబు కోసం పనిచేశాడు. ఇప్పుడు ప్రజా స్వామ్య పరిరక్షణ అంటూ రిటైర్ అయిన తర్వాత కూడా చంద్రబాబు కోసం ఓ డమ్మీ సంస్థను ఏర్పాటు చేశాడు. చంద్రబాబు రాజకీయం కోసం ప్రజాస్వామ్యం అనే ముసుగు వేసుకుని ఈ నిమ్మగడ్డ పనిచేస్తున్నాడు. అలాంటి నిమ్మగడ్డ వలంటీర్లు పింఛన్లు పంచకూడదు, ప్రజలకు గుమ్మంలోకి సేవలు అందించకూడదని హైకోర్టులో కేసు వేశాడు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కూడా కేసులు వేశాడు. ఎక్కడా వీళ్ల ఆటలు సాగలేదని బీజేపీ పొత్తు ప్రభావంతో వలంటీర్ల సేవలు నిలిపివేయండి అని ఆదేశాలు తెచ్చారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు వలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వొచ్చు అంటే...మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘం కుదరదని ఆదేశాలు ఇచ్చింది. ఎప్పుడైతే ఈ 66 లక్షల మంది పింఛన్‌దారులే కాకుండా, సామాన్య ప్రజానీకంలో తిరుగుబాటు వచ్చిందో అప్పుడు చంద్రబాబు మాటమారుస్తున్నాడు. వలంటీర్లు ఇస్తే తప్పేంటి..58 నెలలు ఇచ్చారు..ఈ రెండు మాసాలు ఇస్తేనే ప్రజలు మారిపోతారా? అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రజలు కాలర్ పట్టుకునే సరికి.. ప్రజలు కాలర్ పట్టుకుని ప్రశ్నించే స్థితికి వచ్చేసరికి వలంటీర్లు అందరూ మంచోళ్లు అంటూ కొత్త రాగం అందుకున్నారు. వలంటీర్లు ఇంటింటికి పింఛన్ పంచాలి, వారు మంచోళ్లు వారిని కొనసాగిస్తాం, వారికి పదివేలు ఇస్తాం అంటూ మాట్లాడుతున్నారు. మీరు పెట్టిన క్షోభంతా వలంటీర్లు మర్చిపోయారని మీరనుకుంటున్నారా? జగన్ గారి సారధ్యంలో ఏర్పాటైన ఈ వ్యవస్థలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా సేవే పరమావధిగా పనిచేస్తున్నారు. సేవ చేయాలని వారు ఈ బాధ్యతలు తీసుకున్నారు కానీ జీతం, డబ్బులు కోసం కాదని చంద్రబాబు గుర్తించాలి. డబ్బుతో వలంటీర్లను కొనలేవు చంద్రబాబూ..!: చంద్రబాబూ..నువ్వో, నీ దత్తపుత్రుడో డబ్బులకు అమ్ముడుపోతారేమో కానీ..వలంటీర్లు డబ్బులకు అమ్ముడు పోయేవారు కాదు. వలంటీర్లంటే నిస్వార్ధంగా పనిచేసే వారు. వారికి గాలం వేయడం నీ తరం కాదు. నీ నైజం వారికి తెలియంది కాదు. పొరపాటున రేపు నువ్వొస్తే నీ జన్మభూమి కమిటీలకు వలంటీర్లు అని పేరు తగిలిస్తావని వారికి తెలియంది కాదు. ఇప్పటికే మీ టీడీపీ కార్యకర్తలు గ్రామ గ్రామాన మాకు సహకరించండి మీ వాళ్లకి వలంటీర్ ఉద్యోగం ఇస్తామని గాలం వేస్తున్నారు. జనం ఒకసారి, రెండు సార్లకు నమ్ముతారు కానీ..మాటిమాటికీ నమ్మరు చంద్రబాబూ..! నీ మోసాలు, కుట్రలు, కుయుక్తులు నమ్మేవారు ఎవరూ లేరు. వలంటీర్లకు డబ్బు ఎర చూపితే నీకు లొంగే వాళ్లు కాదు. రాష్ట్రంలో ఉన్న 2.60 లక్షల మంది వలంటీర్లందరికీ జగన్ గారంటే ఏంటో తెలుసు. వచ్చేది జగన్ గారి ప్రభుత్వమే అనేదీ వారికి తెలుసు. ఆ ప్రభుత్వంలో వారి ఆలనా, పాలన ఎలా చూసుకుంటారో కూడా వారికి తెలుసు. నువ్వు కుట్రలు పన్నితే, ఎర వేస్తే డబ్బులుకు అమ్ముడుపోయే వారు కాదని చంద్రబాబు గుర్తెరగాలి. -
చంద్రబాబు అరాచకాలు.. ప్రజలకు ఆ మాత్రం తెలియదా?: సజ్జల
సాక్షి, గుంటూరు: ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నవాళ్లే ఇవాళ లక్ష మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచవచ్చని అంటున్నారని ప్రతిపక్షాల తీరుపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం మధ్యాహ్నాం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు స్వార్థం తప్ప మరేమీ చూసుకోలేదు.ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. వలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. డబ్బులు లేవని ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలకు ఆ మాత్రం తెలియదా?. చంద్రబాబు తీరు చూసి ప్రజలకు ఒక్కసారిగా జన్మభూమి కమిటీల అరాచకాలు గుర్తుకు వచ్చాయి. అందుకే టీడీపీ వాళ్లు మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదని గతంలో ఎవరైతే విమర్శలు చేశారో.. ఇవాళ వాళ్లే లక్ష మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచొచ్చు కదా అని అంటున్నారు. వలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో.. గతంలో ఒకటో తేదీన వలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడు రెండోరోజుకి 60 శాతం పంపిణీ మాత్రమే జరిగింది. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు అని సజ్జల ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారు. ఎంత కోపంగా ఉన్నారనేది టీడీపీ వాళ్ల మాటల్లోనే తెలుస్తోంది. ఆ విషయం చంద్రబాబుకి తెలుసుకాబట్టే మాపై ఆరోపణలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఉద్దేశం ప్రజలకు మంచి చేయడం కాదు. ఎన్నికల్లో ఎలాగైనా బయటపడాలన్నదే ఆలోచన. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ రెండ్రోజుల్లో రుచి చూపించారు. ప్రజలు ఇదంతా అర్థం చేసుకున్నారు. అది రేపు ఎన్నికల్లో తెలుస్తోంది అని సజ్జల అన్నారు. అధికారుల బదిలీలపై.. అధికారుల్లో వందశాతం ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు ఉంటారు?. అధికారుల్ని డీమోరలైజ్ చేసేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని సభలో పోలీసుల పాత్ర తక్కువగా ఉంటుంది. చంద్రబాబు, పురందేశ్వరి వైఫల్యాన్ని రాష్ట్ర పోలీసులపై రుద్దే ప్రయత్నం చేశారు. కూటమిలో ఉన్నారు కాబట్టే పైనుంచి ఒత్తిడి చేయించి మరీ అధికారుల్ని బదిలీ చేయించారు. మేం వ్యవస్థల్ని మేనేజ్ చేయాలనుకోవట్లేదు. మేం ప్రజలనే నమ్ముకున్నాం. రేపు మేం గెలిచాక అధికారుల వల్లే గెలిచారు అని అనడానికి వాళ్లకు ఇప్పుడు లేకుండా పోయింది అని సజ్జల పేర్కొన్నారు. -
‘ప్రజలు అన్నీ చూస్తున్నారు..’ వలంటీర్ల రాజీనామా
సాక్షి, అనకాపల్లి: ఓ అక్కా.. ఓ చెల్లి.. ఓ అవ్వా.. ఓ తాతా అంటూ ఒకటో తేదీన ఉదయాన్నే తలుపు తట్టి చిరునవ్వుతో ఫించన్ అందించే పరిస్థితికి బ్రేక్ పడింది. సీఎం జగన్ ఆలోచనల్లోంచి పుట్టి.. ఎండనకా వాననకా, ఆఖరికి కరోనాను సైతం లెక్క చేయకుండా నాలుగన్నరేళ్లు నిర్విరామంగా విధులు నిర్వహించారు వలంటీర్లు. అలాంటి వ్యవస్థకు ఆటంకాలు కలగజేయాలని కుట్ర కార్యరూపం దాల్చింది. పెన్షన్‌దారులు మండుటెండలో మళ్లీ క్యూలు కట్టాల్సిన పరిస్థితిని తెచ్చి పెట్టింది. 2019 అక్టోబర్ 2వ తేదీన పురుడుపోసుకున్న వలంటీర్ వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో బలంగా పాతుకుపోయింది. రెండున్నల లక్షల మందికిపైగా వలంటీర్లు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సుమారు 530 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా, సంక్షేమ వారధులుగా వలంటీర్లను సీఎం జగన్ అభివర్ణిస్తుంటారు. అయితే.. ఈ నాలుగున్నరేళ్లలో వలంటీర్లను మానసికంగా వేధించే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, పలువురు టీడీపీ నేతలు.. ప్రజా సేవకులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. అయినా అవమానాల్ని దిగమింగుకుని తమ సేవల్ని వలంటీర్లు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు.. ఈసీ కోడ్ పేరుతో తమ విధులకు విఘాతం కలిగించడాన్ని వలంటీర్లు భరించలేకపోతున్నారు. ఈ ఉదయం పెందుర్తి నియోజకవర్గంలో 23 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తానం గ్రామ వలంటీర్లు సాక్షితో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలలోకి తీసుకునే వెళ్ళే అదృష్టం సీఎం జగన్ మాకు ఇచ్చారు. కానీ, మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మమ్మల్ని అనేక విధాలుగా మానసికంగా హింసించారు. పేదలకు, లబ్ధిదారులకు సేవ చేస్తుంటే.. స్లీపర్ సెల్స్ అని అపవాదు చేశారు. ఇప్పుడు ఇలా విధులకు ఆటంకాలు విధించారు. మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అప్పుడే విధుల్లో చేరతాం’’ అని వలంటీర్లు శపథం చేశారు. ‘ ఏపీ ప్రజలు అన్ని చూస్తున్నారు.. మళ్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించుకునే దిశగా అడుగులేస్తున్నారు’ అని వలంటీర్లు చెబుతున్నారిప్పుడు. పెందుర్తి పరిధిలోనే కాదు.. రాష్ట్రంలో పలుచోట్ల వలంటీర్లు స్వచ్ఛందంగా తమ విధులకు రాజీనామా చేస్తున్నట్లు తెలస్తోంది. -
మంచి చేసినా ఏడుపేనా?.. ఎల్లో బ్యాచ్‌పై పేర్ని నాని ఫైర్
సాక్షి, తాడేపల్లి: పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లపై కక్ష కట్టారని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం జగన్ పేదలకు మేలు చేసేందుకు వాలంటీర్లను తెచ్చారని.. చంద్రబాబుకు వాలంటీర్ వ్యవస్థ అంటే గిట్టదన్నారు. పేదలకు మంచి చేసే ఏ పనీ చంద్రబాబుకు నచ్చదని దుయ్యబట్టారు. ‘‘పెన్షన్ సౌకర్యాన్ని ఆపేందుకు చంద్రబాబు అండ్‌కో ప్రయత్నించారు. సీఎం జగన్ పాలన చూసి మీకు భయం పుడుతోంది. పాలనలో సేవలను అడ్డుకోవాలనేదే చంద్రబాబు లక్ష్యం. సిటిజన్ ఫర్ డెమొక్రసీ రాజకీయ ప్రేరేపిత సంస్థ. చంద్రబాబు దిగజారిన రాజకీయ నాయకుడు. వాలంటీర్ల అంటే చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలకు గిట్టుదు. వాలంటీర్లను కొనసాగిస్తామంటూ ఒక వైపు చెబుతున్నారు. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. ‘పవన్ కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. భీమవరంలో ఉంటానంటూ గత ఎన్నికల టైంలో పవన్ చెప్పారు. పవన్ కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. భీమవరంలో ఉంటానంటూ గత ఎన్నికల టైంలో పవన్ చెప్పారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని పవన్ వేడుకుంటున్నాడు. ఎమ్మెల్యే అయితే చాలని పవన్ అనుకుంటున్నారు. సీఎం జగన్ ప్రభుత్వమే వస్తుందని కూటమికి అర్థమైంది. ఎంత మంది కలిసొచ్చినా జగన్ మళ్లీ సీఎం అవ్వడం ఖాయం’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ చంద్రబాబు జేబు సంస్థ. దాని అధ్యక్షుడు జస్టిస్ భవానీ ప్రసాద్. ఈయన చంద్రబాబు హయాంలో పదవులు పొందారు. కార్యదర్శిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్‌గా ఉండి సుజనచౌదరి, కామినేని శ్రీనివాసరావులతో రహస్యంగా హోటల్లో కలిసిన వ్యక్తి. హైకోర్టు, సుప్రీంకోర్టులలో కపిల్ సిబల్ వీరికి అడ్వకేట్. ఇంటింటికీ తిరిగి పెన్షన్లు ఇవ్వొద్దని వీరంతా కలిసి కేసులు వేశారు. జగన్ ప్రభుత్వం మేలైన సేవలు అందిస్తుందని వీరికి కడుపు మంట. గత ఆరు నెలలుగా ఎన్నికల లక్ష్యంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. ఈనాడులో జగన్‌పై ఏం వార్తలు రాసినా ఎన్నికల కమిషన్ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు?. ఎన్నికల సంఘం ఈనాడుకు ఎందుకు లొంగిపోయింది?. ఈనాడులో వార్త రావటం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం ఏంటి?. చంద్రబాబు ఆఫీసు ఎదుట అడ్డగోలుగా ఫ్లెక్సీలు పెట్టినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?. భువనేశ్వరి మూడు లక్షల చెక్కులు ఇస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?. దానిపై మేము ఫిర్యాదు చేస్తే కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వరు?. ఎన్నికల సంఘాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు?. ఈ పక్షపాత ధోరణిలో ఎన్నికల సంఘం ఎందుకు వ్యవహరిస్తోంది?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నలు గుప్పించారు. ‘‘వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి విషం చిమ్ముతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చేంతవరకు వాలంటీర్లు రెడ్ లైట్ ఏరియాకు అమ్మాయిలను సరఫరా చేసేవారని విమర్శించారు. కోడ్ వచ్చాక వారికి తర్వాత యాభై వేల జీతం ఇస్తామని కళ్లబొల్లి మాటలు చెప్తున్నారు. వాలంటీర్లపై వేటు వేయించటం ద్వారా పేదలందరినీ ఇబ్బందులు పెట్టారు. మూడు నెలల పాటు 66 లక్షల మంది పేదలు నరకయాతన పడేలా చంద్రబాబు బ్యాచ్ కుట్ర పన్నింది. వీరి దుర్మార్గపు చర్యలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలి’ అని పేర్ని నాని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టాలి. మాట ఇస్తే వెనక్కి వెళ్లే మనిషిని కాదని పవన్ అంటున్నారు. భీమవరంలో కూడా ఇదే మాట అన్నారు. భీమవరం ప్రజల సేవే నాకు ముఖ్యమంటూ అప్పట్లో చెప్పి ఏం చేశారో జనం చూశారు. పిఠాపురంలో ప్రయివేటు ఆస్పత్రి కట్టిస్తానని పవన్ అంటున్నారు. అంటే.. తమ కూటమి ఓడిపోతుందనీ, మళ్ళీ జగనే గెలుస్తాడని పవన్ కి అర్ధమైంది. జగన్ బస్సుయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. వాలంటీర్లను పక్కన పెట్టగలరేమోగానీ, జనానికి జగన్ మీద ఉన్న ప్రేమను ఆపలేరు. బీజేపీకి ఓటేయొద్దని చంద్రబాబు అంటున్నారు. తమ పార్టీ అభ్యర్థి పేరు తెలియక నువ్వు ఎవరు అని అడుగుతున్నారు. చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయింది’’ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
వాలెంటీర్ వ్యవస్థ పై ప్రజాభిప్రాయం
-
వాళ్లది విద్వేషం! ఆ ఒక్కమాటతో..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేదేదో స్పష్టంగా చెప్పేస్తారు. తన మనసులో ఉన్నమాట దాచుకోరు. చల్లకొచ్చి ముంత దాచే వ్యవహారం ఆయనతో కాదు. వలంటీర్ల అభినందన సభలో ఆయన తన మనోగతాన్ని చాలా గట్టిగా మొహమాటం లేకుండా వెల్లడించారు. వచ్చే రెండు నెలలు ప్రజలకు అందించవలసిన సేవలను, చెప్పవలసిన విషయాలను వలంటీర్లకు వివరించి వచ్చే ఎన్నికల యుద్దానికి సన్నద్దం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఒకరకంగా ఇది ధైర్యంతో కూడిన విషయం. విపక్షాలు చేసే విమర్శలతో నిమిత్తం లేకుండా ఆయన.. పేదల తరపున పనిచేసే ప్రభుత్వానికి వలంటీర్లు వారధులుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వలంటీర్లు నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు కారు. కేవలం స్వచ్చంద కార్యకర్తలు. వారు తమ అభిప్రాయాల ప్రకారం రాజకీయంగా నడుచుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్థను సృష్టించి ప్రపంచంలోనే ఒక సరికొత్త చరిత్ర సృష్టించిన జగన్ దాని వల్ల కూడా తన ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడానికి మార్గం సుగమం అయిందని చెప్పకనే చెప్పేశారు. సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్లకు అభివందనం పేరుతో వారి సేవలను దృష్టిలో ఉంచుకుని అవార్డులను ప్రకటించారు. వచ్చే ఎన్నికలు ఎంత కీలకమైనవో ప్రజలకు తెలియచెప్పవలసిన బాద్యత వలంటీర్లపై ఉందని అన్నారు. ఈ అభినందన సభలో జగన్ మాట్లాడిన ప్రతి మాటకు విశేష స్పందన కనిపించింది. సీఎం., సీఎం. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. సభ జరిగిన తీరు చూస్తే వలంటీర్లు ఎంత కమిటెడ్‌గా ఉన్నది, జగన్ పట్ల ఎంత అభిమానంతో ఉంది అర్ధమవుతుంది. వారిని చూడగానే ప్రభుత్వ స్కీములు పొందిన పేదలంతా ముఖ్యమంత్రి జగన్ ను చూసినట్లు సంతోషపడుతున్నారు. ప్రత్యేకించి వృద్దులైతే వారి సంతోషానికి అవధులు ఉండడం లేదు. గతంలో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి గంటల తరబడి వేచి చూసి పెన్షన్ పొందడానికి నానా కష్టాలు పడవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు వలంటర్ ప్రతి నెల మొదటి తేదీన ఇంటికి వచ్చి మూడువేల పెన్షన్ ఇస్తుండడంతో వారికి ఎంతో గౌరవం, సంతృప్తి ఇస్తోంది. ఇదే విషయాన్ని జగన్ తన స్పీచ్ లో కూడా ప్రస్తావిస్తూ, చంద్రబాబుకు ఓటు వేయడం అంటే ప్రస్తుతం అమలు చేస్తున్న స్కీముల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని హెచ్చరించారు. గతంలో వలంటీర్ల వ్యవస్తను ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వలంటీర్లు అంటే మూటలు మూసే ఉద్యోగమని, ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు ఆడవాళ్లను ఇబ్బంది పెడతారని టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వలంటీర్లను మహిళలను కిడ్నాప్ చేసే వ్యక్తులంటూ తీవ్రంగా అవమానించారు. ఎన్నికలు దగ్గరబడుతున్న తరుణంలో వారు తమ వైఖరి మార్చుకుని వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నా, వారిలో ఈ వలంటీర్లపై పేరుకున్న విద్వేషాన్ని మాత్రం దాచుకోలేకపోతున్నారు. ఈనాడు రామోజీరావు ఈ అల్పజీవులపై విషం చిమ్ముతూ టీడీపీ, జనసేన ఎజెండాను మోస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ వారందరిని తన సొంత కుటుంబ సభ్యుల మాదిరి చూసుకుంటూ వారి సేవలను అభినందిస్తూ మాట్లాడారు. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కల వంటివైతే, వలంటీర్లుతో కూడిన ప్రస్తుత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తులసి మొక్క వంటివని సీఎం జగన్ కొనియాడారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్దంలో నిరుపేదలకు వలంటీర్లకు అండగా నిలవాలని ఆయన కోరారు. మేనిఫెస్టోల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి తాము ఎంతో కష్టపడి నవరత్నాల అమలుకు 70 వేల కోట్లు వ్యయం చేస్తున్నామని, అలాంటిది చంద్రబాబు నాయుడు ఏకంగా 1.26 లక్షల కోట్లు ఖర్చు చేస్తానని చెబుతున్నారని, అది ప్రజలను మోసం చేయడమేనని, ఈ విషయం ప్రజలకు వలంటీర్లు తెలియచెప్పాలని జగన్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును నమ్మితే ఇంతే సంగతన్నది ప్రజలకు అర్ధం కావాలని అన్నారు. తాము బటన్ నొక్కుతుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం అంతకు మించి పంచుతామని అంటున్నారని, దీనిన ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మీ బిడ్డ పై చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు, ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా,మరో జాతీయ పార్టీ పరోక్షంగా ఏకం అవుతున్నాయని, కాని నాకు మాత్రం రెండున్నరలక్షల మంది సైన్యం ఉన్నారని జగన్ అన్నప్పుడు వలంటీర్లు అంతా హర్షద్వానాలతో హోరెత్తించారు.వలంటీర్ల సేవలకు తాను సాల్యూట్ చేస్తున్నానని అంటూ, పెత్తందార్లకు,పేదలకు మద్య జరుగుతున్న యుద్దంలో పేదలే గెలవాలని జగన్ అన్నారు. ఒకవైపు పోరాట పటిమను ప్రదర్శించడానికి వలంటీర్లలో స్పూర్తి నింపే విధంగా, మరో వైపు ప్రత్యర్ధి రాజకీయ పక్షాల డొల్లతనాన్ని ఎండగడుతూ జగన్ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుందని చెప్పాలి. రెండు నెలల్లో జరిగే యుద్దానికి అంతా సిద్దం కావాలని , సిద్దం సభ తరహాలో ఆయన నినదించారు.తన ప్రభుత్వం ఎక్కడా అవినీతి లేకుండా రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర వివిధ స్కీముల కింద నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో వేసిందని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు టైమ్ లో అంతా అవినీతిమయంగా ఉండేదని ఆయన అన్నారు. ఏది ఏమైనా టైమ్ చూసి దెబ్బగొట్టడం అంటే ఇదేనేమో!. వలంటీర్లపై టీడీపీ,జనసేన తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అందుకు భిన్నంగా వలంటీర్లను గౌరవించి వారి ఆదరణను చురగొనే యత్నం జగన్ చేశారని అనుకోవచ్చు!!. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చినా ఆయన ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారు. గతంలో జన్మభూమి కమిటీలను రాజకీయ లక్ష్యంతోనే చంద్రబాబు ఏర్పాటు చేశారు.కాకపోతే వారు పూర్తిగా అవినీతి మయం అయి టీడీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశారు.కాని వలంటీర్లు ఎక్కడా అవినీతి లేకుండా సేవలు అందిస్తున్నారు. ఈ వ్యవస్థ ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారు. దాంతో విపక్షాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నాయి. అంతేకాక.. చంద్రబాబు ఒకసారి తాను వేసిన రోడ్డు మీద నడుస్తూ వేరే వాళ్లకు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు.చివరికి తాను మంజూరు చేసిన మరుగు దొడ్డిని వాడుతూ వేరే వారికి ఓటు వేయరాదని ఆయన వాదించారు. ఈ పరిస్థితిలో జగన్ ఎక్కడా ప్రజలను బెదించడం లేదు. తాను చేసిన సేవలను ప్రజలకుగుర్తు చేయాలని మాత్రమే కోరుతున్నారు. తద్వారా ఆయన తనవాదన రెడీ చేసుకుని వలంటీర్ల అభినందన సభలో ఇంత స్పష్టంగా వారిని ఆకట్టుకునే రీతిలో స్పీచ్ ఇచ్చారని అనుకోవచ్చు. వచ్చే ఎన్నికలలో వలంటీర్ల ప్రభావం ప్రజలపై బాగా ఉండే అవకాశం ఉంటుందని టీడీపీ ,జనసేన భయపడుతున్నాయి. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా వారిపై కక్షపూరిత ప్రచారం చేశాయి. తద్వారా జగన్ ప్రభుత్వానికి అండగా నిలబడే విధంగా వారిని రెచ్చగొట్టారని అనుకోవచ్చు. దాని ఫలితమే అభినందన సభలో జగన్ పట్ల వలంటీర్లు అంత అభిమానాన్ని కనబరుచుకున్నారని భావించవచ్చు. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబు పాలన విష వృక్షం.. మన పాలన కల్పవక్షం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు జిల్లా: గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందని.. పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో మాట్లాడుతూ, మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆసుపత్రులు మారాయని పేర్కొన్నారు. ‘‘ఇంటింటి ఆర్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని సురక్ష ప్రవేశపెట్టాం. గత ప్రభుత్వంలో ప్రతీ పథకానికి లంచం ఇవ్వాలిందే. గతంలో ప్రతీ పనికి కార్యాలయా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. వాలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, చంద్రబాబు పాలనలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. గడప గడపకు వెళ్లి పెన్షన్ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదు’’ అని సీఎం చెప్పారు. వాలంటీర్లు నా సైన్యం.. పేదలకు సేవ చేసే వాలంటీర్లే.. రేపు కాబోయే లీడర్లు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం. నా పాలనకు మీరంతా బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్ల సేవలకు గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నా. ఇవాళ్టి నుంచి వారంపాటు వాలంటీర్లకు వందనం కార్యక్రమం. పేదవాళ్లకు మంచి చేయాలన్న తపన చంద్రబాబుకు లేదు. 875 మంది వాలంటీర్లకు సేవావజ్రా అవార్డులు. 4,150 మంది సేవారత్న అవార్డులతో గౌరవం. 2,50,439 మందికి సేవామిత్ర అవార్డులతో సన్మానం. 2,55,464 మంది వాలంటీర్లకు అభివందనలతో నగదు బహుమతి. లంచాలు, వివక్ష వ్యవస్ధను వాలంటీర్లు బద్దలు కొట్టారు. మీ నిజాయితీని గుర్తిస్తూ నాలుగేళ్లుగా బహుమతులు ఇస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల కష్టాలను చూసి మన మేనిఫెస్టో పుట్టింది. చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్‌లో పుట్టింది. వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు. చంద్రబాబు వేరే రాష్ట్రాల్లోని హామీలను కిచిడీ చేసి మేనిఫెస్టో అంటాడు. బాబు హామీలకు రూ. లక్షా 26 వేల 140 కోట్లు అవుతుంది. ఎలాగో ఇచ్చేది లేదు కాబట్టి.. బాబు ఏదేదో చెప్తాడు. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు’’ అని సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబు కాలుకదపకుండా హైదరాబాద్ ఇంట్లో కూర్చుంటారు. వేరే రాష్ట్రాల్లో గెలిచిన పార్టీల హామీలు సేకరిస్తారు. ఆ హామీలన్నీ కిచిడీలు చేసి కొత్త మేనిఫెస్టో అంటారు. ఆ హామీలు అమలు చేసే పరిస్ధితి కూడా రాష్ట్రానికి ఉండదు. ఎలాగో చేసేది మోసమే కాబట్టి హామీలు ఇచ్చేస్తున్నారు. నా 8 పథకాలకు రూ.52,700 కోట్లు కావాలి. నేను ఇస్తున్న ఈ స్కీమ్‌లను టచ్చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. బాబు 6 హామీలు జత చేస్తే లక్షా 26 వేల కోట్లు కావాలి. నేను చాలా కష్టపడితే ఏడాదికి 70 వేల కోట్లు ఇస్తున్నా. మరి చంద్రబాబు ఏటా లక్షా 26వేల కోట్లు ఇవ్వగలరా. చంద్రబాబు ఇస్తున్న హామీలను నమ్మకండి. ఎన్నికలయ్యాక చంద్రబాబు మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేస్తారు. ఈ నిజాలన్నీ వాలంటీర్లు ఇంటింటికీ చెప్పాలి. ప్రజలు మోసపోకుండా వాలంటీర్లే అవగాహన కల్పించాలి’’ అని సీఎం పిలుపునిచ్చారు. చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సైన్యమ్ సిద్ధం కావాలి. చంద్రబాబు కుట్రలను ప్రజలకు తెలియజేయాలి. అబద్దాల యోధులను మట్టి కరిపించాలి. వాలంటీర్లు నా సైన్యం. మన యువ సైన్యం రాబోయే రెండు నెలలు యుద్దానికి సిద్ధం కావాలి. మన స్టార్ క్యాంపెయినర్లు అవ్వా, తాతలు, రైతులు. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలి. మన చొక్కా చేతులు మడత పెట్టాల్సిన సమయం వచ్చేసింది . చంద్రబాబు వస్తే చంద్రముఖీలు వస్తాయని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్దానికి సిద్ధమే. 58 నెలల పాలనలో వ్యవస్థలో మార్పు వచ్చిందంటే వాలంటీర్లే కారణం. ఒక్క జగన్ ఒక్క వైపు .. మరో వైపు దుష్టచతుష్టయం ఉంది. మంచి చేశాం కాబట్టే ప్రజల్లోకి వెళ్తున్నాం. మన పాలనలో పేదలకు సొంతింటి కల సాకారం చేశాం. వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపు మంట. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే ఐదేళ్ల కింద వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంటికి పిలిపించుకోవడమే’’ అని సీఎం పేర్కొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు డబుల్ గేమ్.. రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్! -
రేపు ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం ప్రారంభం
కరోనా కలవరపెట్టినా.. వరదలు వణికించినా.. ఎక్కడా తలొగ్గక.. ఆదివారమైనా, పండగైనా, సెలనైనా తొలి కోడి కూయకముందే, తూర్పు తెలవారకముందే, చిక్కటి చిరునవ్వుతో అవ్వా తాతలను, అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను ఆప్యాయంగా పలకరించి, ఠంఛన్‌గా పెన్షన్లు అందించడంతో పాటు.. జగనన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడి లంచాలు, వివక్షకు తావులేకుండా ప్రభుత్వ సేవలందిస్తున్న నిస్వార్ధ సేవా సైనికులైన వాలంటీర్లను అభినందిస్తూ, ఇదే స్పూర్తితో నిరంతరం వారు సేవలు కొనసాగించేలా ప్రోత్సహిస్తూ అందిస్తున్న చిరు సత్కారం. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న సేవా వజ్ర అవార్డుల ప్రదానం.. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా, ఫిరంగిపురంలో గురువారం లాంఛనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. పేదలకు మంచి చేసే యజ్ఞంలో వాలంటీర్ల సేవలు చిరకాలం కొనసాగేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తూ, ఇప్పటివరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని మరింత పెంచి అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. కేటగిరీ ఇప్పటివరకు మనం అందించింది (రూ.లలో) పెంచి ఇస్తున్నది (రూ.లలో) సేవా వజ్ర 30,000 45,000 సేవా రత్న 20,000 30,000 సేవా మిత్ర 10,000 15,000 రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తంగా రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు. దీంతో పాటు, వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్దిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎంపిక చేయబడిన 997 మంది వాలంటీర్లకు ప్రత్యేకంగా నగదు బహుమతులు.. ఒక్కో వాలంటీర్ కు మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో రూ. 15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ. 25 వేల చొప్పున మొత్తం రూ. 1.61 కోట్ల నగదు బహుమతుల ప్రదానం. శభాష్ వాలంటీర్ పేదల పక్షాన నిలబడి వారి ముఖాల్లో చిరునవ్వులు కలకాలం నిలిచేలా పునరంకితమవుతూ. లంచాలకు, వివక్షకు తావు లేకుండా డెలివరీ మెకానిజంలో భాగమైనందుకు, పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు తోడుగా ఉంటూ, సహాయకారిగా వ్యవహరిస్తున్నందుకు. తమ పరిధిలోని 50/100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు. గ్రామ/వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నందుకు. కోడి కూయకముందే ఇంటి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి మరీ ఠంచన్‌గా పింఛన్లు ప్రతి నెలా ఒకటో తారీఖునే అందిస్తున్నందుకు. పెన్షన్లతో పాటు రేషన్ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ళ పట్టాలతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో నిర్దిష్ట కాల పరిమితిలో అందేందుకు సహాయపడుతున్నందుకు. వరదలు, విపత్తులు, ప్రమాదాల సహాయ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరియు 'దిశ' వంటి ముఖ్యమైన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు. జగనన్న సంక్షేమ సంక్షేమ క్యాలెండర్ అనుసరించి, ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో ప్రజల దగ్గరకు వెళ్లి వివరించి అవసరమైతే దగ్గరుండి దరఖాస్తు చేయించే సేవా సైనికులైనందుకు.. సేవా సైన్యానికి సలాం.. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు.అవినీతికి తావులేకపోవడం, సచ్చీలత, ఇంటింటి సర్వే, హాజరు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నామని తెలియజేయడం, యాప్ వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్ డోర్ డెలివరీ, పెన్షన్ / రైస్ / ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం, ప్రజలకు అన్ని రకాలుగా సహాయం అందించడం తదితర అంశాల్లో పనితీరు ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక. 'సేవా వజ్ర' సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 45,000 నగదు బహుమతి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాలలో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రధానం 'సేవా రత్న' సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 30,000 నగదు బహుమతి. ప్రతి మండలం/మున్సిపాలిటీ పరిధిలో 5 మంది చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున టాప్ 1 ర్యాంకు సాధించిన వాలంటీర్లకు మొత్తంగా 4,150 మందికి "సేవా రత్న" పురస్కారాల ప్రదానం. 'సేవా మిత్ర' సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ తో పాటు రూ.15,000 నగదు బహుమతి. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన 2,50,439 మంది వాలంటీర్లకు "సేవామిత్ర" పురస్కారాల ప్రదానం. -
వలంటీర్ వ్యవస్థ బాగుంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఇంటి వద్దే ప్రభుత్వ పథకాలు, సేవలను అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ చాలా బాగుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించడం, 2.62 లక్షల మందికి గ్రామస్థాయిలో సేవ చేసే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. దీనిపై తక్షణం అధ్యయనం నిర్వహించి నివేదిక సమరి్పంచాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. సీఎం శివరాజ్‌సింగ్ ఆదేశాల మేరకు ఆయన ఓఎస్డీ లోకేష్ నవరత్నాలు, వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ గురించి ‘సాక్షి’ ప్రతినిధి నుంచి వివరాలను సేకరించారు. మరి కొద్ది నెలల్లో మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం రాత్రి భోపాల్‌లోని తన అధికారిక నివాసంలో మీడియాతో సీఎం శివరాజ్‌సింగ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీలో అమలవుతున్న పలు పథకాల గురించి ఆరా తీశారు. ఆ వివరాలివీ.. ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 500కిపైగా సేవలందించడం, ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరు చొప్పున నియమించడం వినూత్నం, అభినందనీయం. యువతకు స్థానికంగా తోటివారికి సేవలందించే అవకాశం లభిస్తుంది. ► ఎలాంటి పడిగాపులు లేకుండా ఇంటివద్దే రేషన్ సరుకులు అందించడం కూడా బాగుంది. ► ప్రజాస్వామ్యంలో అందరినీ స్వాగతిస్తాం. బీఆర్ఎస్ పార్టీ మరింత జోరుగా మా రాష్ట్రానికి రావచ్చు. అయినా తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి దేశం మొత్తానికి తెలుసు. -
సత్ఫలితాలు ఇస్తున్న వలంటీర్ వ్యవస్థ
-
వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది
-
అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్
సాక్షి, తిరుపతి: మంచి చేస్తున్న వ్యవస్థలను, మంచి చేసే మనుషులనూ సంస్కారం ఉన్న ఎవరూ విమర్శించరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తిరుపతి వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధుల జమ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. "వలంటీర్లు రాష్ట్రంలోని ప్రతి గడపకు సేవలందిస్తున్నారు. ఎండ, వాన, వరదలను లెక్క చేయకుండా పని చేస్తున్నారు. ఉదయాన్నే తలుపు తట్టి మంచి చెడులు అడిగే వాళ్లు. అవినీతి, వివక్ష తెలియని మంచివాళ్లు వలంటీర్లు. వాళ్లంతా మన గ్రామం పిల్లలే.. మన వాళ్లే. అలాంటి వాళ్లపై అన్యాయంగా బురద జల్లుతున్నారు. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వలంటీర్లను అవమానించరు" అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. "వలంటీర్లపై తప్పుడు మాటలకు స్క్రిప్ట్ రామోజీరావుది. నిర్మాత చంద్రబాబైతే.. నటన, మాటలు అన్నీ కూడా దత్తపుత్రుడివే. వలంటీర్లు స్త్రీలను లోబర్చుకుంటారని, ట్రాఫికింగ్ చేస్తున్నారని, మహిళలను ఎక్కడికో పంపిస్తున్నారని నిసిగ్గుగా ఒకరంటున్నారు. వలంటీర్లలో 60 శాతం మహిళలే ఉన్నారు. పైగా సిగ్గులేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఆ రాతలను ప్రచురిస్తున్నాయి." "చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమర్ది క్యారెక్టర్ ఎలాంటిదో అందరినీ తెలుసు. యూట్యూబ్‌లో చూస్తే ఒకరు ‘‘అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ, స్విమ్మింగ్‌పూల్‌లో అమ్మాయిలతో కనిపిస్తాడు’’. మరొకరు ‘‘అమ్మాయి కనిపిస్తే ముద్దులు పెట్టాలి.. కడుపైనా చేయాలి’’ అంటాడు. ఇంకొకరు ‘‘టీవీ షోకి వెళ్లి.. బావా మీరు సినిమాల్లో చేశారు.. నేను నిజంగా చేశాను’’ అంటాడు. ఇంకొకడిదేమో ‘‘బాబుతో పొత్తు.. బీజేపీతో కాపురం. ఇచ్చేది బీఫాం.. టీడీపీకి బీ టీం’’. "వలంటీర్ల క్యారెక్టర్లను దత్తపుత్రుడు తప్పుబట్టి.. వాళ్లను అవమానించారు. మన వలంటీర్లు అమ్మాయిల్ని లోబర్చుకున్నారా?.. అమ్మాయిల్ని లోబర్చుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం పవన్ కల్యాణ్ క్యారెక్టర్. అలాంటి వ్యక్తా వలంటీర్ల గురించి మాట్లాడేది. ఒకరిని వివాహం చేసుకుని.. మరొకరితో అక్రమ సంబంధంపెట్టుకునే వ్యక్తా వలంటీర్ల వ్యక్తిత్వం మాట్లాడేది. అసలు వలంటీర్లను తప్పుబట్టింది.. పదేళ్లుగా చంద్రబాబుకు వలంటీర్‌గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం జగన్. వలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో వాళ్ల నుంచి సేవలు అందుకుంటున్న కోట్ల మందికి తెలుసు" అని అన్నారు. "మేం చేస్తున్న మంచి మరో చర్రిత.. ఇది మీ బిడ్డచరిత్ర. పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించడం మన చరిత్ర. గతంలో ఎన్నడూ లేనవిధంగా సామాజిక న్యాయం అందించాం. అన్ని వర్గాలకు మంచి చేశాం. మేనిఫెస్టోలో 90 శాతం హామీలను నెరవేర్చిన చరిత్ర మనది. రానున్న రోజుల్లో మీ బిడ్డ గురించి.. మీ బిడ్డ ప్రభుత్వం గురించి చెడుగా మాట్లాడతారు. అబద్ధాలను, మోసం చేసేవారిని నమ్మకండి. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందా ? లేదా? అనేది చూడండి.. ఆదరించండి.." అని సీఎం జగన్ ఏపీ ప్రజలను కోరారు. చదవండి: వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్ -
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: వలంటీర్లపై దురద్దేశపూర్వకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్ సీఎస్‌అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులో ఈ నెల 9న వలంటీర్లపై పవన్ నిరాధార ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహిళల అక్రమ రవాణా చేస్తున్నారంటూ పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంబంధింత కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పీపీకి ఆదేశాలు జారీ చేసింది. వలంటీర్లలోని మహిళలను కించపరిచేలా.. అవమానకరమైన, విషపూరిత వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఆత్మీయులకు స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను పవన్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటంపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. చదవండి: ఓరీ దత్తపుత్రా.. అందుకేనా వాలంటీర్లపై అడ్డగోలు వాగింది! అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు ఆప్యాయంగా పలుకరించే వలంటీర్ సోదరులకు దురుద్దేశాలను ఆపాదించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వలంటీర్లుగా దాదాపు 53 శాతం మంది యువతులు సేవలందిస్తుండగా సాటి మహిళలకు వారెందుకు చేటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. చదవండి: అయ్యా జల్సా రాయుడు గారూ.. పవన్‌కు వాలంటీర్ల మరో ఘాటు లేఖ -
వైకల్యం ఉన్నప్పటికీ వాలంటీరుగా ప్రజలకు సేవ చేస్తూ, నిత్యం అందుబాటులో ఉంటూ వారి ఆశీస్సులు పొందుతుంది.
-
ఆదర్శం వాస్తవమైన వేళ...
‘వృత్తి నైపుణ్యానికి వ్యక్తిత్వ వికాసం’ పేరుతో గతంలో అనేక మండలాల్లో అధ్యాపకులకు (ప్రాథమిక, ఉన్నత పాఠశాలల) రిసోర్స్ పర్సన్‌గా వేసవి శిక్షణ ఇచ్చిన అనుభవం ఉండటంతో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఓ మండల అభివృద్ధి అధికారి... అక్కడి విద్యాశాఖాధికారి సలహా మేర అప్పటి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే అవకాశం ఈ వ్యాస రచయితకు కల్పించారు. ఆ శిక్షణా తరగతుల్లో దాదాపు వెయ్యి మంది వాలంటీర్లు పాల్గొన్నారు. అప్పుడా సందర్భంగా వారితో ప్రసంగ సంభాషణల్లో ప్రస్తావించిన అనేక అంశాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవరూపం దాల్చటం, అటు లబ్ధిదారులు, ఇటు వాలంటీర్ల నోటిద్వారా వింటూ, చూస్తూ ఉంటే ఎంతో ఆనందం సంతృప్తి కలుగుతోంది. అప్పటి ఆరంభ దశలోని మహోన్నత ఆశయాలు, ఆదర్శాలు ఈ అనతి కాలంలోనే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఆచరణ రూపం దాల్చాయి. తమ దైనందిన సమస్యల నుండి వాలంటీర్ల సేవ ద్వారా విముక్తులు అయినవారు వాలంటీర్లను ప్రశంసించడం ఎంతైనా ముదావహం. అందునా కోవిడ్–19 లాంటి విపత్కర సమయాలలో ఆ యా వాలంటీర్ల అనుపమాన సేవలు సమాజానికి ఎంత అవసరం ఉందో వీటి పట్ల అవగాహన ఉన్న అందరికీ తెలియ వచ్చింది. అప్పటి వారికి ఉద్బోధించిన వాటిలో ముఖ్యమైనవాటిలో కొన్ని... ఈ నూతన వ్యవస్థ ద్వారా వారు తమకు కేటాయించిన యాభై కుటుంబాలలో అంతర్భాగమై, ఆయా కుటుంబ సభ్యుల వయసు/ వృత్తి/ స్వభావం లాంటి వాటితో నిమిత్తం లేకుండా వారితో ఎంతగా మమేకం అవ్వాలనేదీ; అది వారి వృత్తినీ, వ్యక్తిత్వాన్నీ ఎంతగా పరిపూర్ణం చేసేదీ చెప్పాను. ఈ ఆత్మీయతా భావం వారికి పుట్టుకతో ఏర్పడే బంధుత్వాలకన్నా వయసు రీత్యా ఏర్పడే అతి కొద్దిమంది స్నేహితులు కన్నా మించి లభించిన అరుదైన అపురూప అవకాశముగా భావించాల్సిందిగా ప్రస్ఫుటం చేశాను. వారి పట్ల ప్రేమతో చేసే సేవ అన్నిటికన్నా మహోన్నతమైనదిగా వివరించాను. తమ విద్యుక్త ధర్మం సక్రమంగా నెరవేర్చడానికీ, సేవా నిరతిని దృఢ సంకల్పంతో ప్రదర్శించటానికీ, ప్రకటించడానికీ అవసరమైన శారీరక మానసిక ఆరోగ్యం ఎంతటి అత్యవసరమో, అలాగే బాధ్యత విషయంలో భావప్రకటనా సామర్థ్యం, సంబంధిత అంశాల/పథకాల పట్ల విషయ పరిజ్ఞానం, కాల వినియోగం పట్ల చక్కటి ప్రణాళిక –ఆచరణ, అందరితో ఎల్లప్పుడూ సత్సంబంధాలూ, అలాగే ఏ విధంగా ప్రభుత్వ పథకాలన్నీ నిజమైన అర్హులకు చేర్చాల్సినదీ, అందుకు కావాల్సిన ఓర్పు, సహనం, కారుణ్యం లాంటి మానవీయ లక్షణాలు ఎంత ముఖ్యమో వివరించాను. కుల, మత రాజకీయాలకు అతీతంగా, కోట్లాది మంది తమ గడప దగ్గరే తమకు కావలసినవి తగిన సమయంలో తగిన రీతిలో ఇప్పటిలాగే నిరంతరం పొందాలంటే ఈ వ్యవస్థ ఉండాల్సిందే. అందరూ కోరుకునేది ఇదే. వ్యవస్థలో లోటుపాట్లు ఉంటే తప్పనిసరిగా సరిదిద్దవలసిందే. అలాకాక మొత్తంగా వాలంటీర్లను కాదనటం అంటే వారి సేవల వల్ల కలిగే ప్రయోజనాలను కాదని అనడమే. ఏమాత్రం వివేకం, విజ్ఞత ఉన్న మనుషులు చేయదగిన పని ఇది కాదు. ప్రొ‘‘ బి. లలితానంద ప్రసాద్ వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, ‘ 9247499715 ‘ -
పాలనను ప్రజల ముంగిటకు తెచ్చిన ఏపీ వలంటీర్ల వ్యవస్థ
వలంటీర్లు.. మీకు వందనం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నుంచి సహాయం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, సేవలను ప్రజలకు అందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల గురించి జనం ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సేవలను మధ్యదళారుల అవసరం, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ వలంటీర్లు చక్కగా నిర్వహిస్తున్నారు. లంచాలకు, పైరవీలకు తావు లేకుండా సామాన్య ప్రజానీకానికి ఈ వలంటీర్ల వ్యవస్థ ఎనలేని మేలు చేస్తోంది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై పేద, మధ్యతరగతి ప్రజల్లో సదభిప్రాయం బలపడుతోంది. రాజకీయం కాదు చేసేది ప్రజా సేవ ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున పనిచేసే ఈ వినూత్న వ్యవస్థను నడపడానికి వారి వేతనాల (గౌరవవేతనం) కింద ఏటా రూ.1200 కోట్లు చెల్లిస్తున్నారు. కనీస విద్యార్హతలతో, పారితోషికంతో పనిచేసే వలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే 2019 ఆగస్టు 15న ప్రవేశపెట్టింది. కొత్త వ్యవస్థకు వచ్చే నెల 15న నాలుగేళ్లు నిండుతాయి. ఈ 4 సంవత్సరాల్లో ఈ కొత్త వ్యవస్థ పనితీరును నిస్పక్షపాతంగా సమీక్షిస్తే వలంటీర్లకు మంచి మార్కులే వస్తాయి. అవసరమైన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే గ్రామ, వార్డు వలంటీర్లు ప్రజలకు నిజమైన సేవలందించించే ‘డెలివరీ సిస్టం’లో కీలకపాత్రధారులయ్యారు. ప్రజలకు కూతవేటు దూరంలో ఉండే వలంటీర్లు ప్రజాసేవకులుగానే వ్యవహరిస్తున్నారు కాని, ప్రతిపక్షాలు నిందిస్తున్నట్టు పాలకపక్షం ప్రతినిధులుగా కాదు. ప్రోత్సాహకాలు.. బహుమతులు రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వలంటీర్ల పనితీరును గుర్తించి ఏపీ సర్కారు అర్హులైన వారికి నగదు బహుమతులు అందిస్తోంది. సామాన్య జనానికి వారి సేవలకు గుర్తింపుగా దాదాపు రెండొందల ఏభయి కోట్ల విలువైన నగదు అవార్డులు ఇస్తోంది. 2019 అక్టోబర్ లో ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముందుకు నడిపించే సిపాయిలుగా ఈ వలంటీర్లు పనిచేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వాధికారులు వ్యూహాలు రూపొందిస్తుంటే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నది వలంటీర్లే. ప్రవేశపెట్టిన వెంటనే పట్టాలెక్కిన కొత్త వ్యవస్థ! అధికార వికేంద్రీకరణ, ప్రజల ముంగిటకే పాలన అనే గొప్ప సూత్రాల అమలుకు ప్రవేశపెట్టిన వెంటనే గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ పట్టాలెక్కి ఆశించిన దాని కన్నా ఎక్కువ వేగంతో ముందుకు సాగింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కీలకంగా వ్యవహరించే దాదాపు పదిహేన వేల మందికి పైగా గ్రామ, వార్డు కార్యదర్శులు తోడు కావడంతో వలంటీర్ల వ్యవస్థ మరింత చలనశీలంగా సాగుతోంది. కనీవినీ ఎరగని రీతిలో ఎన్నో రకాల సేవలను ప్రజల గుమ్మం ముందుకే తీసుకొచ్చాయి ఈ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వోద్యోగుల కాళ్లావేళ్లా పడే అవసరం లేకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకోవడం కొత్త వ్యవస్థలు విజయవంతమయ్యాయని చెప్పడానికి గొప్ప నిదర్శనం. ప్రతి వేయి కుటుంబాలకు సేవలందించే సచివాలయ వ్యవస్థకు వలంటీర్ల వ్యవస్థ తోడవడంతో అచిరకాలంలో ఆశించిన ఫలితాలు వచ్చాయి. ఏపీ వలంటీర్ల వ్యవస్థ దేశానికి స్పూర్తి వాటికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. తెలంగాణలో కూడా అధికార వికేంద్రీకరణకు ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టాలనే ఆలోచన వచ్చిందని తెలుస్తోంది. తమిళనాడు సైతం గ్రామ సచివాలయాల ఫక్కీలో గ్రామీణ ప్రాంతాల్లో 600కి పైగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉన్నట్టు 2022లో ప్రకటించింది. వాటిలో పాలనా సౌకర్యాలు, సమావేశ మందిరాలు ఉండేలా చూడాలని తమిళ సర్కారు యోచిస్తోంది. ఎవరెన్ని వివాదాలు లేవనెత్తినా పాతికకు పైగా ఉన్న ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మాత్రం వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారనేది తిరుగులేని వాస్తవం. పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రజల అవసరాలు తీర్చడంలో వలంటీర్లు ముందుంటున్నారు. జనం ఇవే అవసరాల కోసం ప్రభుత్వ ఆఫీసులు చూట్టూ తిరగాల్సిన దుస్థితిని వలంటీర్ల వ్యవస్థ ద్వారా వైఎస్సార్సీపీ సర్కారు తప్పించింది. సామాన్య ప్రజానీకానికి సాధికారత లభించింది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
అయ్యా జల్సా రాయుడు గారూ.. పవన్‌కు వాలంటీర్ల మరో ఘాటు లేఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా నిరసనలు పెల్లుబికాయి. అన్ని జిల్లాల్లో వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, ప్రజలు, పలు సంఘాల ప్రతినిధులు పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. పలుచోట్ల పవన్‌పై పోలీసులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. పవన్ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తలచుకొంటే వారాహి యాత్ర ముందుకు సాగదని హెచ్చరించారు. ఈ క్రమంలో వాలంటీర్లు పవన్‌కు మరో లేఖ రాశారు. లేఖలోలో..‘‘పావలా అంత పరువు కూడా లేని పవన్ కల్యాణ్‌కు ఒక లక్షా 30 వేల మంది మహిళా వాలంటీర్లు నమస్కరించకుండా రేసే రెండో లేఖ ఏమనగా...అయ్యా జల్సా రాయుడు గారూ.. మీరు మమ్మల్ని మానవ అక్రమ రవాణాకు పాల్పడే క్రిమినల్స్ అన్నారు. ఒంటరి ఆడవాళ్ళ సమాచారం సేకరిస్తామని..యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిల వివరాలు సేకరిస్తామని దానిని సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నామని మా ఆత్మాభిమానంపై దాడి చేశారు. మమ్మల్ని కన్నవారి ఆత్మాభిమానంపై దాడి చేశారు. చదవండి: నా పార్టీ వాళ్లే నన్ను నమ్మడం లేదు: పవన్ కళ్యాణ్ మీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మేము ఆందోళన చేస్తే మహిళా వాలంటీర్లు తప్పు చేశారు కాబట్టే.. భయపడి నన్ను తిడుతున్నారు అన్నారు. అయ్యా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ మిమ్మల్ని ప్యాకేజీ స్టార్ అని మీ రాజకీయ ప్రత్యర్దులు అనగానే చెప్పు చూపించి కొడతామన్నారు. మరి మీరు కూడా ప్యాకేజీ పుచ్చుకుని తప్పు చేసినట్టే కదయ్యా. ఆ విషయం బయట పడిందనే భయంతోనే చెప్పు చూపించారా అయ్యా. సినిమాకో క్యారెక్టర్, సినిమాకో హీరోయిన్ను మార్చే మీకు మహిళలంటే చాలా గౌరవం అనుకున్నాము కానీ.. ఇంత చిన్న చూపు అనుకోలేదయ్యా. కానీ ఒక్క విషయం అయ్యా.. హీరోయిన్ పక్కన డ్యాన్సులు వెయ్యడం సులభం. మహిళల్ని గౌరవించాలనే సంస్కారం సినిమా క్యారెక్టర్‌తో రాదయ్యా. ఆ క్యారెక్టర్ మన పుట్టుకలో ఉండాలి. అయ్యా జల్సా రాయుడు గారూ.. మనం వద్దనుకుంటే విడాకులిచ్చేయవచ్చు. అది మన వ్యక్తిగతం కావచ్చు. కానీ గుర్తుపెట్టుకొండయ్యా. విలువలకు విడాకులు ఇవ్వకూడదయ్యా. ఇలా అడుగుతున్నామని ఏమీ అనుకోవద్దు. మీ ఇంట్లో ఓ ఆడపిల్ల ప్రేమ పెళ్ళి చేసుకుందని, మీ ఆత్మ గౌరవం దెబ్బతిందని, తుపాకీ పట్టుకుని వీధిరౌడీలా నడిరోడ్డుపైకొచ్చారు గుర్తుందా.. మరిప్పుడు మీరాజకీయాలకోసం లక్షా 30 వేల మంది మహిళల ఆత్మ గౌరవం దెబ్బ తీశారే ఇప్పుడు మా అమ్మానాన్న ఏం పట్టుకుని మీ ఇంటి దగ్గరకు రావాలో మీరే చెప్పండి. అయ్యా జల్సా రాయుడు గారూ.. అసలు వాలంటీర్లు అంటే ఎవరో తెలుసా మీకు. వాలంటీర్ల గురించి ఏమనుకుంటున్నావ్.. వాలంటీర్లు అంటే బైక్ లకు సైలెన్సర్లు పీకి రయ్ రయ్ మంటూ దూసుకుపోయే రౌడీ బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే సినిమా థియేటర్లలో స్క్రీన్లు చింపి, కుర్చీలు విరగొట్టి నిప్పుపెట్టే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే మిగతా హీరోల ఆడియో ఫంక్షన్లలో పవన్ పవన్ అంటూ రచ్చ చేసే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే పక్క హీరోల సినిమాలు రిలీజైన రోజే ఫ్లాప్ ఫ్లాప్ అంటూ తప్పుడు ప్రచారం చేసే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే మహిళలన్న గౌరవం లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే రేణు దేశాయ్ ను కూడా గౌరవం లేకుండా అవమానించే చిల్లర బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే ఎయిర్ పోర్టుల్లో మంత్రులపై కర్రలతో, రాళ్లతో దాడులు చేసే గూండా బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే బాగున్న రోడ్లు తవ్వేసి.. దాని ముందు సెల్ఫీలు దిగే అల్లాటప్పా బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే నీ పేరు చెప్పి వృద్ధుల దగ్గర సంతకాలు పెట్టించుకుని ఆస్తులు కొట్టేసే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే ప్యాకేజీ కోసం నువ్వు ఎత్తుకోమన్న ప్రతి జెండాను భుజానికెత్తుకునే బానిస బ్యాచ్ అనుకున్నావా? రాసుకోండి జల్సా రాయుడు గారూ.. రాసి పెట్టుకోండి.. వాలంటీర్లు అంటే అవ్వాతాతల గుండె చప్పుడు. సంక్షేమ లబ్దిదారుల చిరునవ్వు.. ఆపన్నుల ఆత్మవిశ్వాసం. బడుగు హలహీన వర్గాల భరోసా. సీఎం జగన్ మాకు బోధించిన కర్తవ్యం ఇదే. ఇది సార్ వాలంటీర్ వ్యవస్ధ అంటే.. ఇది సార్ సేవా సైన్యం అంటే. అయినా క్యారవ్యాన్ ఫుడ్డు, క్యారవాన్ బెడ్డు. మీకెలా తెలుస్తుందిలే’ అంటూ లేఖ ద్వారా పవన్‌ను ఎండగట్టారు. -
ప్రజలకు సేవ చేయడం మాత్రమే మాకు తెలుసు
-
‘పవన్.. ఏం తెలుసు నీకు?’.. మంత్రి రోజా ఆగ్రహం
సాక్షి, గుంటూరు: సీఎం జగన్ పాలన చూసి ఓర్వలేక.. ఓటమి భయంతోనే దత్తపుత్రుడితో చంద్రబాబు నాయుడు విషం చిమ్మిస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. వాలంటీర్లను ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించిన ఆమె.. మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లు ఆడపిల్లలను అక్రమ రవాణా చేస్తున్నారని పవన్ అనడం దుర్మార్గం. అందుకే వాళ్లు ఈ ఉద్యోగం ఎంచుకున్నారా?. పవన్.. నీకు మిస్సింగ్‌కు అక్రమ రవాణాకు తేడా తెలుసా?. అసలు వాలంటీర్లు ఎవరో తెలుసా?. మూడు రోజులుగా అడ్డూఅదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. మహిళలు, వాలంటీర్లు అంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. సిగ్గు చేటు. అసలు వార్డు మెంబర్‌గా గెలవని పవన్‌కు అసలు రిపోర్ట్ ఎవరిచ్చారు?.. నిఘా వర్గాలు ఇచ్చాయా? అని ఎద్దేవా చేశారామె. అసలు పవన్‌చెప్పే అబద్ధాల్లోనే క్లారిటీ లేదని అన్నారామె. చంద్రబాబు కూడా ఇలాగే.. స్వాతంత్య్రం వచ్చాక ఇంత గొప్పగా.. పారదర్శక పాలన అందించిన వ్యవస్థ(వాలంటీర్ వ్యవస్థను ఉద్దేశించి..) ఇంకోటి లేదు. కేంద్రం, ఇతర రాష్ట్రాలు మెచ్చుకున్నాయి. ఆదర్శంగా తీసుకుంటున్నాయి కూడా. అలాంటి వ్యవస్థ గురించి చులకనగా మాట్లాడడం దారుణం. చంద్రబాబు గతంలో వలంటీర్ వ్యవస్థ పై నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు దత్త పుత్రుడు విషం చిమ్ముతున్నాడు. వలంటీర్ వ్యవస్థ నడ్డి విరచడం కాదు కదా.. వెంట్రుక కూడా పీకలేడని పవన్‌పై మండిపడ్డారామె. దమ్ముంటే ఒకటో తేదీన వస్తే.. వాలంటీర్లు ఎలాంటి వాళ్లో తెలుస్తుందని సవాల్ విసిరారు. కోవిడ్ సమయంలో ప్రాణ భయంతో పవన్ కల్యాణ్, చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారని.. ప్రభుత్వంతో కలిసి వాలంటీర్లు నిస్వార్థ్యంగా సేవలందించారని గుర్తు చేశారామె. అలాంటి వాలంటీర్లపై పిచ్చి మాటలు మాట్లాడితే పళ్లు రాలగొడతారని అని హెచ్చరించారు మంత్రి రోజా. తెలంగాణ గురించి మాట్లాడవేం? ఇంతకాలం సీఎం జగన్ అంటేనే పవన్‌కు వణుకు అనుకున్నా. కానీ, వాలంటీర్లను చూసి కూడా వణికిపోతున్నాడని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. మహిళల మిస్సింగ్ కేసుల్లో టాప్ టెన్‌లో ఏపీ లేనే లేదు. ఎవరూ సంతోషంగా ఉండకూడదనే దరిద్రపు గొట్టు ఆలోచనతో పవన్ ఉన్నాడు. అసలు ఆ లిస్ట్‌లో తెలంగాణ 6వ స్థానంలో ఉంది కదా. మరి ఆ రాష్ట్రం గురించి మాట్లాడవేం అని పవన్ కల్యాణ్‌ను నిలదీశారామె. కేసీఆర్‌కు భయపడే మాట్లాడలేకపోతున్నాడని చెప్పారామె. సిగ్గు లేకుండా ఇంటర్వ్యూ.. తన తల్లిని తిట్టినవాళ్లను గెలిపించమని పవన్ ప్రాధేయపడుతున్నారు. మీ అమ్మా.. భార్యను తిట్టింది టీడీపీ వాళ్లు కాదా?. తల్లిని చంద్రబాబు, లోకేష్ తిట్టారని 2018 లో నువ్వు ట్వీట్ చెయ్యలేదా..?. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన తల్లిని తిట్టించారని ఆ సందర్భంలో చెప్పాడు. మరి ఇప్పుడు.. ఏబీఎన్ రాధాకృష్ణకు సిగ్గులేకుండా ఎలా ఇంటర్వ్యూ ఇచ్చావ్?. నీ కార్యకర్తలను సంకరజాతి వాళ్ళు అని బాలకృష్ణ తిడితే.. ఆయనకే ఇంటర్వ్యూ ఇస్తావా..?. మహిళల అక్రమ రవాణా జరిగింది చంద్రబాబు హయాంలోనే. ఆ టైంలో జరిగిన కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై అసలు ఎందుకు పెదవి విప్పలేదని పవన్‌ను సూటిగా ప్రశ్నించారామె. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే జగనన్న ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ని సిగ్గు ఎగ్గూ లేకుండా పవన్ చదువుతున్నాడని అన్నారు. ఏ మాత్రం బుద్ధి ఉన్నా వాలంటీర్ల కాళ్లు పట్టుకుని పవన్ క్షమాపణ కోరాలన్నారు మంత్రి రోజా. ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి 46 ఏళ్ళకే సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు అయిన ఎమ్మెల్యే కాదు కనీసం ఎంపీటీసీ, వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదు. సీఎం జగన్‌ను సింగ్లర్‌గా పిలవడం కాదు.. దమ్ముంటే జగన్ మీద సింగిల్‌గా పోటీ చెయ్యు’’ అని పవన్‌కు సవాల్ విసిరారామె. ఇదీ చదవండి: వాలంటీర్లపై కామెంట్ల ఎఫెక్ట్.. పవన్‌పై సెటైర్లు -
పవన్..సేవలందించే మాపై నిందలా
రాజమహేంద్రవరం సిటీ: కరప: పవన్ కల్యాణ్ ఏలూరు సభలో తమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై జిల్లాలో వలంటీర్లు భగ్గుమన్నారు. ఆయన దిగజారుడు వ్యాఖ్యలను చేశారంటూ వివిధ రీతుల్లో నిరసన తెలిపారు. జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంతోపాటు పలు మండలాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందిస్తున్న వలంటీర్లను నేరస్తులంటూ వ్యాఖ్యానించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని రాజమహేంద్రవరంలో వార్డు వలంటీర్లు హెచ్చరించారు. గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పవన్ కల్యాణ్ చిత్రాన్ని చెప్పులతో కొడుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో వలంటీర్లతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు ఆరిఫ్, మార్తి లక్ష్మి, పీతా రామకృష్ణ, బర్రే కొండబాబు, నక్కా నాగేష్, మార్తి లక్ష్మి, పీతా రామకృష్ణ, అన్నపూర్ణ రాజు, బాలాజీ రెడ్డి, మార్గాని సురేష్ పాల్గొన్నారు. అనపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అనపర్తి: తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వలంటీర్లు డిమాండ్ చేస్తూ, కళావేదిక వద్ద నుంచి అనపర్తి దేవీచౌక్ సెంటర్‌కు చేరుకొని కెనాల్ రోడ్డుపై మానవహారం నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్‌కల్యాణ్ వలంటర్లకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చిర్ల వీర్రాఽఘవరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక తేతలి రామిరెడ్డి, మంగాయమ్మ కళావేదిక ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొవ్వూరులో దిష్టిబొమ్మ దహనం కొవ్వూరు: కొవ్వూరు మెరకవీధి సెంటర్లో సోమవారం వలంటీర్లు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.మానవహారంగా ఏర్పడి పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి హోరెత్తించారు. సేవా దృక్పథంతో పనిచేస్తున్న తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పవన్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పవన్ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. పవన్ దిష్టిబొమ్మకు పెట్రోలు పోసి నిప్పంటించారు. తన వైఖరిని మార్చుకోకుంటే తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వందలాది వలంటీర్లు ఆందోళనలో పాల్గొన్నారు. -
వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, అమరావతి: వాలంటీర్ల పట్ల పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీనిపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని పేర్కొన్న కమిషన్.. తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాలని తెలిపింది. కాగా మహిళలను ఉద్ధేశించి చేసిన పవన్ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈమెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో పవన్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని, ఆయనకు ఏ ఇంటెలిజెన్స్ అధికార చెప్పారో సమాధానం చెప్పాలని అన్నారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్ తప్పించుకోలేరని విమర్శించారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. పవన్ చెప్తున్న 30 వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని దుయ్యబట్టారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ మరోవైపు పవన్ అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. తమకు తక్షణమే పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: పవన్ ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయాడు?: మంత్రి అమర్నాథ్ -
పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
సాక్షి, ఏలూరు: ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఏలూరులో వాలంటీర్లు. పవన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న వాలంటీర్ల సేవలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ వ్యవస్థను నిర్వీర్వం చేయాలని చూస్తున్నారని ఆగ్రహిస్తూ.. తక్షణమే తమకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇసుకతోట హైవేపై వాలంటీర్లు బైఠాయింపు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా నినాదాలు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఏలూరు జిల్లా వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా నూజివీడు పట్టణం చిన్నగాంధీబొమ్మ సెంటర్లో పవన్ కళ్యాణ్ ఫోటోలను చెప్పులతో కొట్టి నిరసన తెలిపిన వాలంటీర్లు. సంఘీభావం తెలిపిన వైసీపీ శ్రేణులు. కాకినాడ జిల్లా పవన్ కళ్యాణ్ వాఖ్యలకు నిరసనగా జగన్నాధపురం మునసిబ్ గారి సెంటర్ లో వాలంటీర్ల నిరసన. పవన్ కళ్యాణ్ చిత్రపటాలు దగ్ధం వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ విజయనగరం జిల్లా మహిళా సంఘాలకు పడవలసిన ఆసరా డబ్బులు ఇంతవరకు పడలేదని వెలుగు ఏపీఎంపై ఆగ్రహం వ్యక్తపరిచిన మంత్రి బొత్స. సభా వేదికపై మహిళా పోలీస్ చేత దిశా యాప్ ను మహిళా పోలీస్ ద్వారా పరీక్షించిన మంత్రి.. జగనన్న ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ఘనంగా చెప్పిన విద్యాశాఖ మంత్రి బొత్స. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సభా వేదికపై నుండి ఖండిస్తూ మైక్ ఉందని మాట్లాడకూడదు అంటూ ఎద్దేవా బొత్స. స్వార్థం కోసం నీతిమాలిన రాజకీయాలు చేసిన వారికి పగ్గాలు అప్పజెప్పాల?లేదా ప్రజా సంక్షేమం కోరి ఎన్నో పదకాలు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పాల మీరే చెప్పండి?అంటూ ప్రజలను ప్రశ్నించిన మంత్రి.. బాపట్ల జిల్లా ►వాలంటీర్ల పై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వైసిపి రాష్ట్ర కార్యదర్శి అమృతపాణి. ►వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారనడం సరైన పద్ధతి కాదు. ►పవన్ కల్యాణ్ ఒల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ►సంక్షేమ ఫలాలు ప్రజల వద్దకు చేరుస్తున్న వాలంటీర్లను అవమానిస్తే సహించం. ►ప్యాకేజీ స్టార్ సినిమా డైలాగులు బయట వాడితే సరైన బుద్ది చెబుతాం. ►వేటపాలెం మండలం పందిళ్ళ పల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టి లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన చీరాల నియోజవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి కరణం వెంకటేష్. ►జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పర్చూరు వైసీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ ఫైర్ ►వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారన్న పవన్ వ్యాఖ్యలపై ఆమంచి సీరియస్.. ►ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ ►చంద్రబాబు ఆడినట్లు ఆడటం మంచిదికాదని సూచన ►వాలంటీర్లకు బేషరతుగా క్షమాపణలు చెప్పి గౌరవం నిలుపుకోవలని హితవు కృష్ణాజిల్లా ►పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై మండిపడుతున్న వాలంటీర్స్ ►తక్షణమే పవన్ తన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలి ►బేషరతుగా వాలంటీర్స్ కు క్షమాపణ చెప్పాలి ►వాలంటీర్స్ అంటే ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారధులు ►వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ దారుణంగా మాట్లాడుతున్నాడు ►వాలంటీర్ల వల్లే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందనడం చాలా దుర్మార్గం ►వాలంటీర్లలో 60% మంది మహిళలమే ఉన్నాం ►పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్లే ఆడవాళ్లా ►మేం పవన్ కళ్యాణ్ కు మహిళల్లా కనిపించడం లేదా? ►వాహనమెక్కి రోడ్ల వెంట తిరుగుతూ నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు ►చేతనైతే గ్రామాల్లోకి వచ్చి మేం చేస్తున్న సేవలను తెలుసుకో పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా ►నిన్న ఏలూరులో పవన్ కళ్యాణ్ వాలంటీర్లు పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన స్త్రీ , శిశు సంక్షేమ రీజనల్ చైర్మన్ వందనపు సాయి బాల పద్మ. ►రాష్ట్రంలో కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు పవన్ కంటికి కనపడలేదా...?? ►చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పై పవన్ కళ్యాణ్ అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి... ►వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిచేది మేమే... ►వాలంటీర్లు అంటే చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీ లు కాదు... ►మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ►జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామం లో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వాలంటీర్లు ►పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం లో వాలంటీర్స్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం. చదవండి: పవన్ ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయాడు?: మంత్రి అమర్నాథ్ -
వాలంటీర్ల భావోద్వేగం.. హేళన చేసిన వాళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు..
సాక్షి, విజయవాడ: వరసగా మూడో ఏడాది.. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రదానం చేశారు. విజయవాడ ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, వాలంటీర్లు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే సీఎం ఆలోచన ఎంత గొప్పదో అర్ధమవుతుంది. మంత్రి బూడి ముత్యాలనాయుడు అందరికీ నమస్కారం, ఈ రోజు మీరంతా వాలంటీర్లుగా ఎంపిక కాబడి, మన ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఎప్పుడు వచ్చింది అంటే సీఎం సచివాలయాలను ఏర్పాటుచేసి, ఉద్యోగులను, వాలంటీర్లను నియమించి మీకు అధికారాలు కల్పించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు. ఈ రోజు అవార్డులు పొందుతున్న వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మీరు ప్రతి ఇంటికి వెళ్ళి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు గురించి చెబుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా ఏ అవ్వాతాతను అడిగినా పెన్షన్ల గురించి చెబుతున్నారు, కానీ ఈ ప్రభుత్వంలో తెలవారకముందే మా తలుపుతట్టి చిరునవ్వుతో పలకరించి పెన్షన్లు ఇస్తున్నారు. ఇలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయంటే వాలంటీర్లే కారణం, సీఎం ఆలోచనా విధానం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. వాలంటీర్లు చాలా చక్కగా పనిచేస్తున్నారు, మరింత బాధ్యతలు తీసుకుని మరింత మంచిపేరు వచ్చేలా ముందుకుసాగాలని కోరుకుంటున్నాను. దేశమంతా కొనియాడుతున్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్ అందరికీ నమస్కారం, వాలంటీర్లకు నా అభివందనాలు, జగనన్న ప్రజలకు మేలు చేసేది ఏదైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకు తీసుకెళతారు. వాలంటీర్ వ్యవస్ధ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా సంక్షేమ ఫలాలు చిట్టచివరి కుటుంబానికి అందించేలా చేసిన ఆలోచన సీఎంగారిది. వాలంటీర్లలోని 76 శాతం మంది యువత, అందులో మహిళలు 53 శాతం ఉన్నారు, జగనన్న పిలుపు మేరకు మీరు గొప్పగా ప్రజాసేవ చేస్తున్నారు. అవినీతి రహితంగా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలనే నినాదంతో వాలంటీర్లు ముందుకెళుతున్నారు. గత పాలకులు జన్మభూమి కమిటీల ద్వారా లబ్ధిదారులను గుర్తించారు. ఆ కమిటీల అరాచకాలకు ప్రజలు విసిగి వేశారారు. ఈ వ్యవస్ధను ఏర్పాటుచేసినప్పుడు వారిని అవహేళన చేశారు, కానీ ఇప్పుడు అందరు గుర్తించారు, కరోనా సమయంలో, వరదల సమయంలో ప్రాణాలు సైతం తెగించి మీరు చేసిన సేవలు, తెగువను దేశమంతా కొనియాడుతున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్ధను ఫాలో అవుతున్నాయి, పట్టణ ప్రాంతాల్లో 67 వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ పురస్కారాలతో మీరు మరింత స్పూర్తితో చక్కగా పనిచేయాలి, జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్ అనే నినాదంలో మనం గొంతుకలుపుదాం, ఆయన్ను మళ్ళీ మళ్ళీ సీఎం చేద్దాం. ఈ వ్యవస్ధలో భాగస్వామినైనందుకు గర్విస్తున్నా.. సార్, నమస్కారం, ఈ వాలంటీర్ వ్యవస్ధలో నేను కూడా ఒక భాగస్వామినైనందుకు గర్విస్తున్నాను. మాకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు సంతోషిస్తున్నాను. నా సర్వీసులో రెండు మూడు సంఘటనలు నా మనసుని కదిలించాయి. రైస్ కార్డు విషయంలో నేను డేటా కలెక్షన్ కోసం ఇంటింటికీ వెళ్లినప్పుడు ఒక లబ్ధిదారుడు చాలా ఆవేదనతో చెప్పాడు. గత ప్రభుత్వంలో అధికారుల చుట్టూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి అలసిపోయానని, అయినా నాకు రేషన్ కార్డు రాలేదన్నాడు, మీరు అయినా మంజూరు చేస్తారా అంటే వెంటనే నేను అతని రేషన్ కార్డు అర్హతను పరిశీలించి కార్డు కోసం అప్లై చేశాను. కేవలం 4 గంటల్లో కార్డు అప్రూవ్ అవడంతో నేను అతని చేతిలో కార్డు పెట్టాను, ఆ సంతోషంతో అతను జగనన్నకు రుణపడి ఉంటామన్నారు, కొంతమంది వాలంటీర్లంటే మూటలు మోసేవారని విమర్శలు చేశారు. కానీ మేం మోసింది మూటలు కాదు, మీరు అప్పగించిన బాధ్యతను మా భుజస్కందాలపై వేసుకుని మోశాం, కరోనా సమయంలో సేవలు చేసి వారిని ఆదుకున్నాం, ఇలాంటి వ్యవస్ధను రూపొందించిన మీకు రుణపడి ఉంటాం. మరొక సంఘటన చూస్తే ఒక వికలాంగ మహిళ తనకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకుని మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో ఉంది. ఆమె ఫోన్ చేసి నేను ఫలానా సమస్యతో హాస్పిటల్లో ఉన్నాను. చదవండి: వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంట: సీఎం జగన్ నువ్వు ఇక్కడికి వచ్చి పెన్షన్ ఇస్తే రవాణా ఖర్చులు కూడా ఇస్తానంది, కానీ నాకు వద్దని తిరస్కరించి నేను ఆసుపత్రికి వెళ్ళి పింఛన్ ఇచ్చాను. ఆమె భావోద్వేగానికి గురై నాకు నమస్కరించింది. కానీ నన్ను పంపింది జగనన్న కాబట్టి అన్నకు నమస్కరించు అన్నాను. చాలా సంతోషమేసింది. వాలంటీర్లు రాత్రిపూట వెళ్ళి తలుపులు కొట్టారని విమర్శలు చేశారు కానీ మేం తలుపులు కొట్టింది తెల్లవారుజామున పింఛన్లు ఇవ్వడానికి, కరోనా సమయంలో మన ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరూ చర్చించుకున్నారు. మమ్మల్ని విమర్శించిన వారే మళ్లీ ఇప్పుడు పొగుడుతున్నారు. నేను కాలర్ ఎత్తుకుని చెబుతున్నాను. నాకు గర్వంగా ఉంది. మాకు ప్రజల ఆశీస్సులు. ఆశీర్వాదాలే మరింత పెద్దవి. మా వాలంటీర్ల అందరి తరపునా మా ధైర్యం, మా నమ్మకం, మా భవిష్యత్ మీరే. ధ్యాంక్యూ జగనన్నా. -ఉప్పాల నరేష్, వాలంటీర్, విజయవాడ అర్భన్ మండలం ఆయన కళ్లలో సంతోషం ఎప్పటికీ మరిచిపోలేను.. జగనన్నా నమస్కారం, నాకు కేటాయించిన క్లస్టర్‌లోని 75 కుటుంబాలలో 62 కుటుంబాలకు నేను సంక్షేమ పథకాలు అందజేశాను. పెన్షన్ కానుక గురించి ఒక పెద్దాయనకు ఈ కేవైసీ చేయించాలని వెళితే ఆయనకు ఇల్లు లేదు.. సమాధుల పక్కన చెట్టు కింద ఉన్నారు.. నాకు బాధ వేసి ఓల్డేజ్ హోంలో చేర్చాను.. తర్వాత పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళి కలసినప్పుడు ఆయన కళ్లలో చూసిన సంతోషం నేను ఎప్పటికీ మరిచిపోలేను. పేదలందరికీ ఇల్లు పథకం కింద నా క్లస్టర్లో ఒక మహిళకు ఇంటి పట్టా వచ్చిందని సంతోషంగా చెప్పి నాకు ఆడపిల్లలు లేరు నువ్వే వచ్చి పాలు పొంగించాలని చెప్పినప్పుడు సంతోషమేసింది. ఈ గౌరవం జగనన్నా మీ వల్లే దక్కింది. మరొక ఆమెకు నేను కొత్త రేషన్ కార్డు, ఫించన్ ఇవన్నీ ఇప్పిస్తే ఆమె నా కన్నబిడ్డ కూడా ఇంత చేయలేదంటే నాకు చాలా సంతోషమేసింది, అవన్నీ కూడా మీకే జగనన్నా, ధ్యాంక్యూ. -హేమ, వాలంటీర్, విజయవాడ తూర్పు నియోజకవర్గం హేళన చేశారు.. కరోనా టైంలో ప్రాణాలు కాపాడింది ఈ వ్యవస్ధే.. జగనన్నా మీరు గొప్ప సంకల్పంతో ఈ వాలంటీర్ వ్యవస్ధను తీసుకొచ్చారు. ఈ వ్యవస్ధలో నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను. నేను ఒక ఇంటికి వెళితే ఆయన నాకు ఏ పథకాలు వద్దు, మీకు జీతాలు ఇస్తారా అని హేళన చేశాడు. కానీ కరోనా టైంలో ఆయనకు కరోనా వస్తే తన పిల్లలే తన దగ్గర లేకపోతే మేం దగ్గరుండి అన్నీ చేశాం. ఆ తర్వాత కోలుకుని రియలైజ్ అయి మాకు రెండు చేతులు జోడించి దండం పెట్టి నాకు ప్రాణభిక్ష పెట్టారన్నాడు. మమ్మల్ని చాలా హేళన చేశారు. కరోనా టైంలో అందరి ప్రాణాలు కాపాడింది ఈ వ్యవస్ధే, ధ్యాంక్యూ సీఎం సార్. -మురళీ, వాలంటీర్, మైలవరం నియోజకవర్గం -
వాలంటీర్లపై మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం వస్తే మొట్టమొదటగా తుపాకీ పేలేది వాలంటీర్లపేనే అని కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి ధర్మాన సోమవారం శ్రీకాకుళంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ధర్మాన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు కోసమే ఈనాడు అసత్య కథనాలు ప్రచురిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల్సింది వాలంటీర్లే. అయితే, వాలంటీర్లు తెలివైన వారు కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించాలి’ అని వారిని కోరారు. -
వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు చెప్పగలరా..?: కన్నబాబు
-
వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు చులకన చేసి మాట్లాడారు: కన్నబాబు
సాక్షి, కాకినాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటర్ వ్యవస్థపై చంద్రబాబు, ఈనాడు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. కాగా, ఎమ్మెల్యే కన్నబాబు శుక్రవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. వాలంటీర్, సచివాలయ వ్యవస్థల వల్లే ప్రజలకు నేరుగా పథకాలు అందుతున్నాయి. జన్మభూమి కమిటీల వంటి దళారీ వ్యవస్థను నిర్మూలించింది ఈ వ్యవస్థలే. వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు చాలా చులకన చేసి మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. -
రామోజీ తప్పుడు రాతలు మానుకో
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): గ్రామ వలంటీర్లపై అసత్య కథనాలను ప్రచురించిన రామోజీరావు... ఇకనైనా తప్పుడు రాతలు మానుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వలంటీర్లు హెచ్చరించారు. తమపై ‘ఈనాడు’లో వచ్చిన తప్పుడు రాతలను నిరసిస్తూ గ్రామ సచివాలయ వలంటీర్లు అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో సోమవారం భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరాధార వార్తలతో తమ మనోభావాలు దెబ్బతీయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గౌరవ పారితోషికంతో గ్రామాల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న తమను కించపరిచేలా రాతలు రాయడం వెనుక ఆంతర్యమేమిటంటూ తీవ్రంగా మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తమ జీవితాలతో చెలగాటం ఆడొద్దంటూ ధ్వజమెత్తారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రామోజీరావు దిష్టిబొమ్మతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారంగా ఏర్పడి ‘వలంటీర్లపై తప్పుడు రాతలు మానుకోవాలి, వలంటీర్ల మనోభావాలను దెబ్బతీస్తే సహించబోం, రామోజీరావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఈనాడు డౌన్ డౌన్, రామోజీరావు డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రామోజీరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు వలంటీర్లు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సేవాభావంతో సేవలందిస్తున్న తమను కించపరచడం తగదన్నారు. వలంటీర్ వ్యవస్థ ఇతర రాష్ట్రాల ప్రశంసలు అందుకోవడం వాస్తవం కాదా... అని ప్రశ్నించారు. ప్రజా మన్ననలు పొందుతున్న తమను కించపరిచేలా ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రచురిస్తే సహించబోమని వలంటీర్లు హెచ్చరించారు. -
పప్పులు ఉడకలేదా?.. ‘ఈనాడు’ తన పరువు తానే తీసుకుందా?
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన వినూత్న పథకాలు ఎంతగా సఫలం అయింది ప్రతిపక్షనేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి, ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చే ఈనాడు వంటి దినపత్రికల కథనాలను బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం గెలిస్తే జగన్ తీసుకు వచ్చిన పథకాలను రద్దు చేస్తారని వలంటీర్లు ప్రచారం చేస్తున్నారని ఈనాడు ఒక కథనంలో ఆందోళన చెందింది. అలాగే చంద్రబాబు కూడా ఇప్పుడు సంక్షేమ రాగం ఆలపిస్తూ, తాను అధికారంలోకి వస్తే ఇంకా అధికంగా సంక్షేమం అమలు చేస్తానని, ఆ మాటకు వస్తే, తాను అమలు చేసిన వివిధ స్కీములను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని, వాటన్నిటిని వడ్డీతో సహా అమలు చేస్తామని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు స్కీములు అంత గొప్పవి అయితే, వాటిని నిజంగానే పేదలకు ఉపయోగపడేలా అమలు చేసి ఉంటే, 2019 ఎన్నికలలో అంత ఘోరంగా టీడీపీని ప్రజలు ఎలా ఓడించారు?. ఇప్పుడు జగన్ స్కీములను అమలు చేస్తామని వీరంతా చెబుతున్నారు. అంతదానికి జగన్ ప్రభుత్వాన్ని వదులుకునే అవసరం ప్రజలకు ఎందుకు వస్తుంది? ఇంతకాలం ఏమని వాదించారు. జగన్ స్కీముల వల్ల రాష్ట్రం నాశనం అవుతోందని, అప్పుల పాలు అవుతోందని జనంలో భయం రేకెత్తించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆ విషయంలో వారి పప్పులు ఉడకకపోవడంతో స్వరం మార్చి కొత్త ప్రచారం మొదలు పెట్టారు. అందులో భాగంగానే జగన్ ప్రభుత్వంపై విషపూరిత కథనాలు, విద్వేషపూరిత స్టోరీలు ఇచ్చే పనిలో ఈనాడు మీడియా పడింది. ఒక పక్క కొత్త పరిశ్రమలు వస్తుంటే, మరిన్ని పరిశ్రమల కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే, వాటిని కనిపించకుండా చేయాలన్న తాపత్రయంలో పరిశ్రమలను వెళ్లగొడుతున్నారంటూ పచ్చి అబద్దాలు రాశారు. ఇలా రోజుకోక అబద్దాన్ని జనంలోకి తీసుకు వెళ్లే యత్నం చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఒక కథనంలో వలంటీర్లు కాదు.. వైకాపా వేగులు అంటూ వలంటీర్లపై విమర్శలు ఎక్కుపెట్టారు. అది చదివితే ఈనాడు మీడియా బాధ, ఆందోళన అంతా తెలిసిపోతుంది. వలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వం జనంలో పాతుకుపోతోందన్న భయం కనబడుతుంది. ఏ వ్యవస్థ అయినా ఎవరు అధికారంలో ఉంటే వారి ఆదేశాలను బట్టి నడచుకుంటుంది. ప్రజలకు వివిధ సేవలను అందిస్తుంటుంది. ఆ క్రమంలో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేదా అది ప్రజలకు ఉపయోగపడకపోతే ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తుంది. ఎక్కడైనా వలంటీర్లు తప్పు చేస్తే వార్తలు ఇవ్వవచ్చు. అందుకోసం ఈనాడు కాని, టీడీపీ మీడియా కాని డేగ కళ్లు వేసుకుని పనిచేస్తున్నదన్న సంగతి బహిరంగ రహస్యమే. దానిని తప్పు పట్టనక్కర్లేదు. రాష్ట్రంలో ఏ చిన్న ఘటనలో వలంటీర్ల పాత్ర ఉందన్న ఫిర్యాదు వచ్చినా, దానిని మొదటి పేజీలో హైలైట్ చేయడానికి యత్నిస్తోంది. నిజానికి వలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో అతి చిన్న స్థాయి వారు. కేవలం స్వచ్చందంగా ప్రభుత్వం తరపున ప్రజలకు వివిధ స్కీములు చేరవేసేవారు. కాని వారిని అత్యంత పవర్ పుల్ వ్యక్తులుగా ఈనాడు మీడియా భావిస్తున్నట్లుగా ఉంది. వారు ప్రజలపై నిఘా ఉంచుతున్నారట. ఏకంగా రాజ్యంగం ప్రసాదించిన భావస్వేచ్చ ప్రకటనకు ఆటంకంగా ఉన్నారట. ఏమైనా అర్ధం ఉందా?. వీరివల్ల ప్రజల భావస్వేచ్చ ఎలా పోతుంది. అదే నిజమైతే ప్రజలలో అలజడి రాదా? ప్రభుత్వానికి నష్టం రాదా?. వచ్చే ఎన్నికలలో దాని ప్రభావం పడదా?. నిజంగానే వలంటీర్లకు ప్రజలు భయపడుతున్నారనుకుందాం. వచ్చే ఎన్నికలలో ప్రజలు వైసీపీకి ఓటు వేస్తారా?. ఆ మాత్రం లాజిక్ లేకుండా వార్తలు ఇవ్వడం ద్వారా మొత్తం వ్యవస్థనే దెబ్బతీసే యత్నం చేశారు. ఆ క్రమంలో ఈనాడు తన పరువు తానే తీసుకుంటోంది. వలంటీర్లు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారట. అసలు వారు రాజకీయాలలోకి రారాదని ఎక్కడైనా నిషేధం ఉందా?. ఎంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర అధికారులు రాజీనామాలు చేసి మరీ రాజకీయాలలోకి వస్తున్నారు కదా? తెలుగుదేశం పార్టీ అలాంటి పలువురికి టిక్కెట్లు ఇచ్చింది కదా? అంటే అంతకుముందు పదవులలో ఉంటూ రాజకీయాలపై ఆసక్తి కనబరిచినట్లా? కాదా? అంతెందుకు గతంలో ఇంటెలెజెన్స్ ఛీప్ గా ఉన్న ఒక అధికారి తెలుగు యువత అధ్యక్షుడిని నియమిస్తారని, స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడుకున్న వీడియోనే ఉంది కదా?. ఆ స్థాయిలో వారు రాజకీయం చేసినప్పుడు, తెలుగుదేశం పార్టీని తమ భుజస్కందాల మీద మోసినప్పుడు ఈనాడు మీడియా కళ్లు మూసుకుందా? లేక ఆహా అంతటి పెద్ద అధికారి టీడీపీకి అండగా నిలబడ్డారని చంకలు గుద్దుకుందా?. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని అంటారు. ఈనాడు పరిస్థితి అలాగే ఉంది. టీడీపీ హయాంలో జరిగిన తప్పులన్నిటీని కప్పి పుచ్చి ఆ పార్టీని రక్షించాలని పాటు పడి, చివరికి దానిని గోతిలో పడేశారు. ఇప్పుడు వైసీపీపై అక్కసుతో ఉన్నవి, లేనివి రాసి మరోసారి టీడీపీని ప్రజల నుంచి దూరం చేస్తున్నారనిపిస్తుంది. వలంటీర్లు ప్రతి నెల మొదటి తేదీన వృద్దులకు పెన్షన్లు ఇస్తున్నారా? లేదా? దానిని రాజకీయ యాక్టివిటిగా ఈనాడు భావిస్తోందా? ఆయా స్కీములకు సంబంధించి ప్రజలకు వివరించి అర్హులైనవారితో దరఖాస్తులు చేయించడం రాజకీయాలలో పాల్గొన్నట్లు అవుతుందా?. ప్రజలను నిరంతరం కలిపి వారి అవసరాలు తెలుసుకుని, సంబంధిత దరఖాస్తులను సచివాలయానికి ఇస్తున్నది నిజం కాదా?. చదవండి: ఎల్లో బ్యాచ్ విష ప్రచారం.. ఘాటుగా స్పందించిన మంత్రి అమర్నాథ్ పోనీ గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సేవా మిత్రలు ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారా? వారితోనే గెలిచిపోతామని అప్పట్లో టీడీపీ నేతలు భావించేవారా?. కాదా? అయినా ఎందుకు టీడీపీ ఓడిపోయింది. అంతేకాదు.. అన్నదాత సుఖీభవ, పసుపు -కుంకుమ వంటి స్కీములను చివరి నిమిషంలో తీసుకు వచ్చినా టీడీపీకి ఎందుకు ఫలితం దక్కలేదు? జబ్బు ఒకటైతే మందు మరొకటి ఇస్తున్నట్లుగా ప్రస్తుతం ఈనాడు మీడియా కాని, తెలుగుదేశం కాని వ్యవహరిస్తూ తమకు అంటిన ఈర్ష్య వ్యాధిని గుర్తించలేకపోతున్నాయి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాస్తవాల ఆధారంగా విమర్శలు చేయడంలో టీడీపీ విఫలం అవుతుంటే, నిజాలు రాయడానికి సిగ్గుపడే పరిస్థితిలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఉండడం దురదృష్టకరం. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు తప్పుడు కథనాలు
-
వాలంటీర్ల వ్యవస్థపై ‘ఈనాడు’ తప్పుడు కథనాలపై నిరసనల వెల్లువ
సాక్షి, అనకాపల్లి/అనంతపురం: వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు తప్పుడు కథనాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో రామోజీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. మేం వేగులం కాదు.. ప్రజా సేవకులమని వాలంటీర్లు తెలిపారు. సేవకుల పట్ల అవాస్తవ కథనాలు ప్రచురించడం సబబు కాదని, బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. చదవండి: ఏది నిజం?: పింఛన్లిచ్చే వారు గూఢచారులట? -
వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు విషం చిమ్ముతోంది: మంత్రి అంబటి
సాక్షి, తాడేపల్లి: అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వ విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్ముతున్నారని.. చంద్రబాబు గెజిట్ అయిన ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనకు వాలంటీర్లు చేదోడువాదోడుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు యథేచ్ఛగా దోచుకున్నాయని మంత్రి అంబటి ప్రస్తావించారు. జన్మభూమి కమిటీల ఆరాచకాలపై ఈనాడులోనే వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో వాలంటీర్లు ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు అతి చేరువగా సేవలందిస్తోందన్నారు. ప్రతినెల ఒకటో తేదీన ఇంటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారని అన్నారు. లంచాలకు అవకాశం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందతున్నాయని చెప్పారు. ‘చంద్రబాబు మోచీతి నీళ్లు తాగే కొన్ని పత్రికలు.. ప్రతి వ్యవస్థపైనా నిత్యం నిప్పులు కక్కుతున్నాయి. చంద్రబాబు హయాంలో 39 లక్షల మందికే పెన్షన్లు. జగన్ హయాంలో 42 లక్షల మందికిపైగా పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. వాలంటీర్లు తప్పు చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. తనకు ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు అంటున్నారు.చంద్రబాబుతో ఇదేం కర్మ అంటూ ప్రజలు తలకొట్టుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి చంద్రబాబే కారణం’ అంటూ మండిపడ్డారు. చదవండి: ఏపీ: మాండూస్ తుపాను బాధితులకు ఆర్థిక సాయం విడుదల -
ఏది నిజం?: పింఛన్లిచ్చే వారు గూఢచారులట?
ఆసుపత్రిలో ఉన్న ఓ అవ్వకు... 1వ తేదీన ఠంచనుగా అక్కడికే వెళ్లి పింఛను అందజేశాడు ఓ వలంటీరు. జోరుగా వర్షం కురిసి రోడ్ల నిండా నీరునిండిపోయింది. తెల్లవారుఝామునే... వర్షానికి తడుస్తూ ఆ నీట్లోనే వచ్చి ఓ తాతకుపింఛను అందించింది మరో వలంటీరు. మరి వీళ్లలో వైసీపీ వాళ్లెవరు? ఆ అవ్వ, తాత వైసీపీ నాయకులా? వాళ్లకు పింఛన్లివ్వటంవైఎస్సార్ సీపీకి సేవ చేయటమా? వాళ్లకు పింఛన్లందించిన వలంటీర్లు వైసీపీ వేగులా? ఇలా ఇవ్వటం గూఢచర్యమా?ఏ కొంచెం కూడా దురి్వనియోగానికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలను ఇలా జనానికి చేరవేస్తుండటం రాజకీయ కార్యకలాపమా? యావత్తు దేశాన్నీ కోవిడ్ మహమ్మారి చుట్టేసి... ఇళ్లలోంచి బయటకు రావటానికే జనం భయపడుతున్నపుడు... ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎవరెవరికి అనారోగ్య లక్షణాలున్నాయో ‘సర్వే’ పేరిట తెలుసుకోవటం వ్యక్తిగత గోప్యతకు భంగమా? ప్రతి ఇంటికీ మాసు్కలు, మందులతో పాటు పచారీ సామాన్లు కూడా అందించిన స్వచ్ఛంద సైన్యంపై ఎందుకింత కడుపుమంట? పథకాల దురి్వనియోగానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా నూరుశాతం అర్హులకు చేరవేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై ఎందుకీ విద్వేషం? వృద్ధులు కానీండి... అనారోగ్యంతో తల్లడిల్లుతున్నవారు కానీండి... ఆఖరికి వికలాంగులు కానీండి. ఎవ్వరైనా పడుతూ లేస్తూనైనా తాము చెప్పిన చోటుకు వస్తేనే పింఛను. అక్కడికొచ్చి గంటలకొద్దీ వేచిచూస్తే... ఆ రోజు అదృష్టం బాగుంటే పింఛను దొరుకుతుంది. లేదంటే మరోరోజు రావాల్సిందే. అది ఎండైనా.. వానైనా. ఇదీ.. ఘనత వహించిన నారా చంద్రబాబు నాయుడి హయాంలో పింఛన్ల తంతు. కానీ ‘ఈనాడు’ దృష్టిలో అదే స్వర్ణయుగం. ఇప్పుడు ఆ పింఛనుదార్లకు గౌరవమిస్తూ... వారి వద్దకే వెళ్లి అందజేస్తున్న వలంటీర్లు మాత్రం వైసీపీ వేగులట!!. అలా ఇవ్వటం రాజకీయ కార్యకలాపమట. అది పార్టీ సేవ అట!!. 52 ఏళ్లు నిండిన ‘ఈనాడు’ బుద్ధి ఎక్కడికిపోయింది? వయసు మీద పడటంతో రామోజీరావుకు, చంద్రబాబుకు ఆలోచనలన్నీ అరికాళ్ల నుంచే పుట్టుకొస్తున్నట్టున్నాయి. ఏళ్లు పెరుగుతున్న కొద్దీ ‘ఈనాడు’ కూడా వీళ్లమాదిరే తయారవుతోందా? అక్షరమక్షరంలోనూ ఇంతటి విషాన్ని నింపుకున్న పత్రికలో ఏ ఒక్క వార్తయినా నిజమని నమ్మగలమా? ఎంత చంద్రబాబుకు అమ్ముడుపోతే మాత్రం మరీ ఇంతకు దిగజారిపోతారా రామోజీ? కేరళలాంటి రాష్ట్రాలు సైతం ఈ స్వచ్ఛంద సైన్యాన్ని చూసి తమ రాష్ట్రంలో కూడా నియమించాలని యోచిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి తరఫున అంతర్జాతీయంగా బాలల విద్య కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్ కూడా రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ అద్భుతమని ప్రశంసించింది. అంతేకాక రాష్ట్రంలో తమ కార్యక్రమాలను నిరుపేదలకు చేర్చడానికి ఈ వ్యవస్థతో కలిసి పనిచేసేలా ఒప్పందం కూడా చేసుకుంది. మరి ఇంత గొప్ప వ్యవస్థలో మీకు ఒక్క మంచి లక్షణం కూడా కనిపించలేదంటే మీ దుర్మార్గపు స్థాయిని అంచనా వేయడానికి ఏ కొలమానం సరిపోతుంది రామోజీరావు గారూ? ఇక హద్దులు లేవన్న రీతిలో నానాటికీ పతనమైపోతున్న మీ పాత్రికేయం ఇంకెన్నాళ్లు? ఇంతలా చంద్రబాబు మోహంలో పడిపోతే ఎలా? అసలు వలంటీర్ల వ్యవస్థ రాష్ట్రంలో ఎందరి జీవితాలను నిలబెడుతోందో తెలుసా? ఎంత అద్భుతంగా పనిచేస్తోందో తెలుసా? అర్హులెవ్వరికైనా అన్యాయం జరిగిందా? ప్రజల బతుకులు బాగు చేయటానికి... జనం జీవితాలు మెరుగుపడటానికి ప్రభుత్వం రకరకాల పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలన్నిటి లక్ష్యం ఒక్కటే. ప్రజల్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లటం. ప్రతి పథకానికీ ప్రభుత్వం కొన్ని అర్హతా ప్రమాణాలు నిర్ణయిస్తే... అర్హుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా వాటిని చేరవేస్తోంది వలంటీర్ల వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తోందో తెలియటానికి రామోజీరావుకు ఒక్కటే ప్రశ్న. తెలుగుదేశం పార్టీ వారన్న కారణంతోనో, వేరే కులానికి చెందిన వారన్న కారణంతోనో అర్హులైన ఏ ఒక్కరికైనా ఒక్క పథకమైనా అందకుండా పోయిందా? అలాంటి వాళ్లను చూపించగలరా? అదే కదా వలంటీర్ల వ్యవస్థకు గీటురాయి!. అదే కదా ప్రభుత్వ పనితీరుకు కొలమానం!. మరి చంద్రబాబు పాలననే తీసుకుందాం. ప్రభుత్వ పథకాలను జనానికి చేరవేయటానికి ఆయన నియమించుకున్నది జన్మభూమి కమిటీలను. అందులో ఉన్నదంతా తెలుగుదేశం పార్టీ వారే. వాళ్లను నియమించింది కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన టీడీపీ ఇన్‌ఛార్జులు. నేరుగా నామినేట్ చేసేసేవాళ్లు. ఇక ఆ కమిటీలన్నీ తెలుగుదేశం వారి కోసమే పనిచేసేవి. అర్హత ప్రమాణాలన్నీ పేరుకే. ఏ పథకానికైనా అసలైన అర్హత తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండటమే. ఆ గ్రామంలో ఉండే వ్యవస్థంతా జన్మభూమి కమిటీల సూచనల మేరకు పనిచేస్తే... జన్మభూమి కమిటీలన్నీ చంద్రబాబు సూచనల మేరకు పనిచేసేవి. మరి ఇప్పుడో..? నియామకాలు చేస్తున్నది అధికారులే కదా? అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను చేర్చటమే ధ్యేయంగా 2,61,413 మంది వలంటీర్లను ప్రభుత్వమే నియమించింది. గౌరవ పారితోíÙకంతో స్వచ్ఛంద సేవ అందించే ఈ వలంటీర్ల నియామకంలో... రాజకీయ జోక్యానికి తావే లేదు. పార్టీలు లేవు... కులమతాల పట్టింపు లేదు. స్త్రీ,పురుష భేదాల్లేవు. నిరీ్ణత విద్యార్హతలున్నవారిని గ్రామాల్లో అయితే ఎంపీడీఓ ఛైర్మన్‌గా, తహసీల్దారు, విస్తరణ అధికారి సభ్యులుగా ఓ కమిటీ నియమిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ చైర్‌పర్సన్‌గా తహసీల్దారు, ప్రాజెక్టు అధికారి లేదా మెప్మా టౌన్ మిషన్ కో–ఆర్డినేటర్ సభ్యులుగా ఉన్న కమిటీ నియమిస్తోంది. ఈ కమిటీల్లో రాజకీయ నాయకుల ప్రమేయమే లేదు. పైపెచ్చు ఎప్పటికప్పుడు వచ్చే ఖాళీలను భర్తీ చేయటానికి స్థానికంగా ఉండే ఎంపీడీఓ లేదా కమిషనర్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించి, రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం వాలంటీర్లను ఎంపిక చేస్తున్నారు. ఏ పార్టీ వారైనా ఉండొచ్చు... ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వలంటీర్లలో తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ, జనసేన అభిమానులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే నియమించే ముందు వారి వయసు, విద్యార్హతలు, సేవాభావమే ప్రామాణికంగా తీసుకున్నారు తప్ప వారి రాజకీయ నేపథ్యాన్ని చూడలేదు. అందుకే ప్రస్తుతం పనిచేస్తున్న 2.61 లక్షల వలంటీర్లలో 74 శాతం మంది 20–30 ఏళ్ల మధ్య ఉన్నవారే. ఇంకా చెప్పాలంటే... 96 శాతం మంది 35 ఏళ్ల లోపువారే. అందుకే అత్యంత వేగంగా తమ బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నారు. పైపెచ్చు ఈ వలంటీర్లలో 55.12 శాతం మంది మహిళలే. గ్రామంలో గౌరవంతో పాటు కాస్త పారితోíÙకం... ఊరికి సేవ చేశామన్న తృప్తి ఉంటాయనే వీరంతా ఈ బాధ్యతల్లోకి వస్తున్నారు. మరి ఈ మహిళలకు సైతం పార్టీలు అంటగట్టి, వీళ్లందరినీ వైసీపీ వేగులుగా ముద్రవేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న ‘ఈనాడు’ను ఏం చేయాలి? దారుణమైన రాతలతో పచ్చి విషాన్ని కక్కుతున్న రామోజీరావును ఏం చేయాలి? ఎన్నెన్ని బాధ్యతలో... ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించటంలో వలంటీర్ల వ్యవస్థ ఎండావానలను లెక్క చేయక... చలికి భయపడక అహరి్నశలూ పనిచేస్తున్నదనేది కాదనలేని వాస్తవం. 2019 జూన్ నుంచి ఈ వ్యవస్థ ప్రతినెలా దాదాపు 62.5 లక్షల మందికి... రూ.1,600 కోట్ల చొప్పున పంపిణీ చేస్తోంది. కొత్త రైస్ కార్డులు మంజూరు చేయటంతో పాటు రైస్ కార్డులున్న వారందరికీ సేవలందిస్తోందీ వ్యవస్థ. ఇంకా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద కొత్త కార్డులు మంజూరు చేయటం... ఆరోగ్య శ్రీని ఉపయోగించుకోవటంపై అవగాహన కలి్పంచటం చేస్తోంది. ఇవే కాదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ కాపు నేస్తం, చేయూత, రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైఎస్సార్ జలకళ, వాహనమిత్ర, నేతన్న నేస్తం, ఆసరా, వైఎస్సార్ బీమా, సంపూర్ణ పోషణ, ఉచిత పంటల బీమా, లా నేస్తం, రైతులకు సున్నా వడ్డీ, ఆరోగ్య ఆసరా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న తోడు, రజకులు.. టైలర్లు... నాయీ బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, జీవ క్రాంతి, అమూల్ పాలవెల్లువ, కంటి వెలుగు, అమ్మ ఒడి... అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఒకసారి అందించే ఆరి్థక సాయం, పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు, ఈబీసీ నేస్తం వంటి పదుల కొద్దీ పథకాల ఫలాలను అర్హులకు చేరుస్తున్నారు. ప్రభుత్వ విభాగాలకూ సహాయంగా... ఇవికాక వివిధ ప్రభుత్వ విభాగాలు సైతం వలంటీర్ల సేవలు ఉపయోగించుకుంటున్నాయి. సొంతిళ్లున్న వారిని ఆస్తిపన్ను చెల్లించమని అభ్యర్థిస్తున్న వలంటీర్లు... స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే, మనం మన పరిశుభ్రత, ఫ్రైడే–డ్రైడే, చెత్త పన్ను వసూలు... ఇలాంటి అంశాలన్నిటా వినియోగదార్లకు అవగాహన కలి్పస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి విభాగానికి, పంచాయతీ రాజ్– గ్రామీణాభివృద్ధి విభాగానికి సహకరిస్తున్నారు. - కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో అర్హత ప్రమాణాలను విచారించడంలో వీఆర్వోలకు సహకరిస్తున్నారు. - వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టే వ్యాక్సినేషన్ డ్రైవ్‌లకు, ఫీవర్ సర్వేలు, ఆరోగ్య సర్వేలకు వలంటీర్లే ఆధారం. - వలంటీర్ల సాయం లేకుంటే ఆర్బీకే సిబ్బంది ఈ–క్రాప్ బుకింగ్‌కు రైతులను గుర్తించడం అంత తేలిక కాదు. - ప్రత్యేక వాహనాల్లో రేషన్ బియ్యాన్ని ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు పూర్తి సహకారం వలంటీర్లదే. - ఇక తుపానులు, భారీ ప్రమాదాలు జరిగినపుడు చాలా మంది వలంటీర్లు స్వచ్ఛందంగా కదనరంగంలోని సైనికుల్లా సేవలందిస్తున్నారు. నిన్నగాక మొన్న వచి్చన కోనసీమ వరదల్లో వలంటీర్ల సాయాన్ని అక్కడి ఏ వ్యక్తినడిగినా చెప్పకమానడు. మరి ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్న వలంటీర్లపై రామోజీరావు వైసీపీ ముద్ర ఎందుకు వేస్తున్నారు? ఏదో ఒకరకంగా వాళ్లను తమ విధులకు దూరం చేద్దామనా? ఈ రాష్ట్రంలో అర్హులకు పథకాలు అందకుండా చేసి... ప్రభుత్వానికి ఆ మకిలిని అంటిద్దామనా? ఇంతకన్నా ఘోరమైన కుట్రేదైనా ఉంటుందా రామోజీ? కోవిడ్ సమయంలో ప్రపంచమే జేజేలు కొట్టింది... 2020 తొలినాళ్లలో ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నపుడు... దేశం యావత్తూ భయాందోళనలు నిండి, ఆసుపత్రులలో బెడ్లు సైతం దొరక్క విలవిలలాడినపుడు అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలకు గాలికొదిలేసి మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడకు వస్తే... ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీలయ్యారంటే... అది ఈ ప్రభుత్వం సృష్టించిన వలంటీర్ల వ్యవస్థ వల్లే సాధ్యమైందని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారికి భయపడి జనం ఇళ్లలోంచి బయటకు రావటానికే భయపడుతున్న సమయంలో.. బయట తిరిగితే ప్రమాదమని తెలిసి కూడా వీరే సైన్యంగా పని చేశారు. ఇళ్లకు రోజువారీ సరుకులతో పాటు మందులు అందించటంతో పాటు 16 కోట్ల మాసు్కల్ని జనానికి అందజేశారు. పేదలకు ప్రత్యేక సాయంగా రూ.వెయ్యి చొప్పున అందించటంతో పాటు వ్యాక్సిన్లు త్వరగా అందేలా చూశారు. క్వారంటైన్ సెంటర్లలో సేవలందించటంతో పాటు రికార్డు స్థాయిలో 46 సార్లు ఫీవర్ సర్వే చేశారు. అన్నిటికన్నా ప్రధానం... కోవిడ్ మృతుల భౌతికకాయాలను దహనం చేయటంలోనూ సాయపడ్డారు. అలాంటి సేవలకు యావత్తు దేశం జైకొట్టగా... రామోజీరావు మాత్రం రాజకీయాలు అంటగడుతూ చెలరేగిపోతుండటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదనే చెప్పాలి. కులమతాలకు అతీతంగా... చంద్రబాబు మదిలోంచి పుట్టిన జన్మభూమి కమిటీలన్నీ కులం కంపు కొట్టేవని వేరే చెప్పక్కర్లేదు. ఏ గ్రామాల్లోనైనా అక్కడ పెత్తనం చెలాయించే వారే కమిటీల్లో ఉండేవారు. కానీ వలంటీర్ల వ్యవస్థలో ఒక కులం, మతం వాళ్లే కొనసాగడం లేదు. వాలంటీర్లుగా ఉన్న వారిలో 14 శాతం మంది మాత్రమే ఓసీలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు 68 శాతం. మరో 18 శాతం మంది ఇతరులున్నారు. అసలు 55 శాతం మంది మహిళలున్నప్పుడు ‘ఈనాడు’ రాసేసినట్లుగా వాళ్లు వేగులుగా పనిచేయటం సాధ్యమా? 68 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండగా వాళ్లంతా ఒక పార్టీకే పనిచేస్తున్నారనడంలో అర్థం ఉందా? ఈ సవాళ్లకు సిద్ధమా రామోజీ? - చేతిలో పత్రిక ఉంది కదా అని అడ్డగోలుగా ఆరోపణలు చేసే రామోజీరావు సూటిగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది... ఈ వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఎప్పుడైనా తనవి కాని కార్యక్రమాలకు వాడిందా?. - ఎందుకంటే ప్రభుత్వ పథకాలను స్థానికులకు అందించటం... వారికి ఆయా పథకాలపై అవగాహన కల్పించటమే వీరి విధి. ఇది తప్ప ఇతర కార్యక్రమాలకు వీరిని ఎన్నడైనా వాడారా? చెప్పండి రామోజీ?. - ఓ సర్వేలో రాజకీయ ఆసక్తిని అడిగారంటూ మీరు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టిన ఏ సర్వేలోనూ ఇప్పటిదాకా పౌరుల రాజకీయ ఆసక్తిని అడిగింది లేదు. - వలంటీర్లు ఎన్నడైనా ఏ రాజకీయ కార్యకలాపాల్లోనైనా పాల్గొన్నారా? అలా పాల్గొంటే వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేశారా? తెలిస్తే చెప్పండి రామోజీ? నిజానికి ఏ వలంటీరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై ‘స్పందన’ కార్యక్రమంలో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయొచ్చు. వారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. - ఇప్పటిదాకా 24,704 ఫిర్యాదులు రాగా వాటిలో 24,643 పరిష్కారమయ్యాయి. ఆరోపణలు రుజువు కావటంతో ఇప్పటికే 20 మంది వలంటీర్లను తొలగించారు కూడా. ఇలాంటి వాస్తవాలు చెప్పటం కూడా అలవాటు చేసుకోండి రామోజీరావు గారూ!!. రామోజీ దుర్మార్గపు రాతలప్రకారం చూస్తే.. వాళ్లంతా ఒకే పార్టీకి పనిచేస్తుండాలి. అలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లపై ప్రత్యర్థి పారీ్టల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చి ఉండాలి కదా? కానీ వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైన రెండున్నర సంవత్సరాల తర్వాత 2021 జనవరిలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం ఆరుగురు వలంటీర్లపై మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి. మరి ఆ జిల్లాలో వేల సంఖ్యలో వలంటీర్లున్నారు కదా? రామోజీ చేసిన మరో దుర్మార్గపు ఆరోపణ ఏంటంటే వలంటీర్ల వల్ల ప్రభుత్వానికి వందల కోట్లు ఖర్చవుతోందని!!. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం 33 సంక్షేమ పథకాల ద్వారా ఈ మూడున్నరేళ్లలో సుమారు రూ.3.60 లక్షల కోట్లు ప్రజలకు ఆరి్థకంగా సాయం చేసింది. పైసా అవినీతికి తావు లేకుండా ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు చేర్చటంలో వలంటీర్ల పాత్ర అత్యద్భుతం. ప్రతి పథకానికీ ఎంపిక చేసే ముందు లబ్థిదారుడి వద్దకు వెళ్లి బయోమెట్రిక్ తీసుకొని, అమలు చేశాక అతనికి అందిందని ధ్రువపరచుకునేందుకు మరో సారి బయోమెట్రిక్ తీసుకుంటారు. ఇలా చేయటం వల్ల అడ్డుకట్ట పడిన అవినీతితో పోలిస్తే వీరికి చెల్లించిన మొత్తం ఎక్కువని అనుకోగలమా? ఈమాత్రం జ్ఞానం కూడా ‘ఈనాడు’కు లేకపోతే ఎలా? -
వ్యవసాయానికి వలంటీర్లు
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ విశిష్ట సేవలందిస్తున్న వలంటీర్లు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలకూ (ఆర్బీకే) అనుబంధంగా పని చేయనున్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీరును ఏర్పాటు చేస్తున్నారు. సీఎం చొరవతో ఇక రైతు భరోసా కేంద్రాల్లో నిరంతర సేవలు అందే అవకాశం ఏర్పడింది. వలంటీర్ల రాకతో ఆర్బీకేలు రైతులకు మరింత చేరువకానున్నాయి. పొదిలి రూరల్(ప్రకాశం జిల్లా): రైతు దేశానికి వెన్నెముక. రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న భావనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల సేవలను అందిస్తూ ఆదుకుంటున్నారు. ప్రభుత్వ సేవలు ప్రతీ ఇంటికీ అందేలా నియమించిన వలంటీర్లు ఇప్పుడు అన్నదాతకు కూడా సేవలందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పంట దిగుబడులు వచ్చాక విక్రయానికి ఇబ్బందులు పడుతున్న రైతుల అవస్థలను గుర్తించి ధాన్యం కొనుగోలులో వలంటీర్ల సేవలను వినియోగించుకోనేలా ప్రణాళికలు తయారు చేసింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీరును ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ పంటల సాగు ఆధారంగా విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజి హార్టీకల్చర్ అసిస్టెంట్, విలేజి సెరీకల్చర్ అసిస్టెంట్ పని చేస్తున్నారు. వీరే ఆర్బీకే ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరంతా ఎక్కువ సమయాన్ని క్షేత్ర స్థాయిలో గడపాల్సి వస్తుంది. ప్రధానంగా పంటల సాగు సమయంలో ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియ కోసం రోజుల తరబడి పంట పొలాల్లో ఉండాల్సి వస్తుంది. దీంతోపాటు వారంలో ఒక రోజు పొలంబడి కార్యక్రమం నిర్వహించాలి. వీటితో పాటు మండల, సబ్‌డివిజన్, జిల్లా స్థాయిలో నిర్వహించే సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాలి. ఇలాంటి సమయాల్లో రైతు భరోసా కేంద్రాలను మూసి వేయాల్సి వస్తుంది. దీంతో రైతులు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాంటి పరిస్థితిలో వ్యయప్రయాసలతో మండల, నియోజకవర్గ కేంద్రాలకు పరుగులు తీయాలి. ఈ సమస్యను గుర్తించి సీఎం జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి రైతులకు ఈ సమస్య కూడా ఉండకూడదని భావించి సమస్య పరిష్కారానికి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీరును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వలంటీర్ల ఎంపిక జిల్లాలో మొత్తం 616 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 597 ఉండగా, అర్బన్ ప్రాంతంలో 19 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి 597 మంది, అర్బన్ ప్రాంతంలో 9 మంది వలంటీర్లను ఆర్బీకేలకు ఎంపిక చేశారు. మిగిలిన 10 మంది వలంటీర్లను ఒంగోలు 9, కనిగిరి 1 నియమించాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో అదికూడా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రతి ఆర్బీకేకు ఇంటరు (బయాలజీ) చదివిన వ్యక్తిని వలంటీర్లుగా ఎంపీడీవో నియమించారు. వలంటీర్లకు ఆర్బీకేల నిర్వహణపై, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై శిక్షణ కూడా ఇచ్చారు. విత్తనాల పంపిణీ, డిజిటల్ కియోస్క్ ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులకు ఆర్డర్ పెట్టడం, పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు ఆర్బీకే ఇన్‌చార్జ్‌ల పర్యవేక్షణలో వలంటీర్లు చేపడతారు. వలంటీర్లు నేరుగా రైతు వద్దనే ధాన్యం సేకరించి వారికి మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకుంటారు. దేశానికే రోల్‌మోడల్‌గా ఆర్బీకేలు గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావడంతో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. విత్తన ఎంపిక నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలు ఊర్లోనే ఆర్బీకేల ద్వారానే అందుతున్నాయి. దీంతో అవి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచాయి. తాజాగా ఆర్బీకేకు ఒక వలంటీరును నియమించడంతో మరో విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రైవేటు డీలర్లు రసాయనిక ఎరువులను అడ్డగోలుగా అధిక ధరలకు విక్రయించే వారు. ఎంఆర్పీపై రూ.50 నుంచి రూ.100 వరకు ఎక్కువగా వసూలు చేసేవారు. ఆర్బీకేలు ఏర్పాటు కావడంతో ప్రైవేటు డీలర్ల అక్రమాలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. తాజాగా వలంటీర్ల నియామకంతో మరింత మెరుగైన సేవలు రైతులకు అందుతాయి. శుభ పరిణామం ప్రతి ఆర్బీకేకు వలంటీర్‌ను నియమించడం శుభపరిణామం. దీంతో సేవలు మరింత చేరువవుతాయి. అప్పటికే ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పొందుతున్నాం. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచడం మంచి నిర్ణయం. వ్యవసాయ అధికారులు రైతుల పొలాలకు వచ్చి పంటలను చూసి సూచనలు, సలహాలు ఇవ్వడంతో రైతులకు మేలు జరుగుతుంది. – బీరం కృష్ణారెడ్డి, గురుగుపాడు, రైతు గొప్ప ఆలోచన రైతుల మేలు కోసం ఆర్బీకేకు ఒక వలంటీరును నియమించడం సీఎం జగన్ మంచి ఆలోచన. విలేజీ అసిస్టెంట్లు ఏదైనా పనుల నిమిత్తం బయటకు పోతే రైతులు ఇబ్బందులు పడుతారేమోనని సమస్యను ముందుగానే గుర్తించి ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను నియమించడం మంచి నిర్ణయం. రైతుల సమస్యలను గుర్తించి వలంటీర్‌ను నియమించినందుకు సీఎం జగన్మోహన్రెడ్డికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – వెంకటేశ్వర్లు, రైతు, మాదాలవారిపాలెం వలంటీర్లకు సమగ్ర శిక్షణ జిల్లాలో మొత్తం 616 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వాటిలో గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఆర్బీకేలకు 606 మంది వలంటీర్ల నియామకం పూర్తయింది. అర్బన్ ప్రాంతంలో ఉన్న ఆర్బీకేలకు ఇంకా 10 మంది వలంటీర్ల నియామకం పూర్తి కాలేదు. వాటిని త్వరగా పూర్తి చేస్తాం. నియామకం పూర్తైన వలంటీర్లకు ఆర్బీకేల నిర్వహణపై సమగ్ర శిక్షణ కూడా ఇస్తారు. ఆర్బీకే ఇన్‌చార్జ్‌లు క్షేత్ర స్థాయిలో వెళ్లిన సమయాల్లో రైతులకు వీరే అన్ని సేవలు అందించాల్సి ఉంటుంది. – ఎస్ శ్రీనివాసరావు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఒంగోలు ఆర్బీకేలో శాఖల వారీగా అందుతున్న సేవల సంఖ్య వ్యవసాయ శాఖ: 28 ఏపీఎంఐపీ: 05 మత్స్యశాఖ: 09 ఉద్యానశాఖ: 06 పశుసంవర్ధక శాఖ: 11 పట్టు పరిశ్రమ శాఖ: 08 -
రైతు సేవలో మరో ముందడుగు
కడప అగ్రికల్చర్: రైతు దేశానికి వెన్నెముక. రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న నానుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజం చేస్తున్నారు. రైతన్నలకు అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల సేవలను అందిస్తూ ఆదుకుంటున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అన్నదాతల ఆధునిక దేవాలయాలుగా పేరుగాంచిన ఆర్బీకే లలో నిరంతరాయంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను నియమించింది. ప్రస్తు తం రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ పంటలసాగు ఆధారంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పనిచేస్తున్నారు. వీరే ఆర్బీకే ఇన్చార్జులుగా వ్యవహరిస్తారు. అయితే వీరంతా ఎక్కువ సమయాన్ని క్షేత్రస్థాయిలో గడపాల్సి వస్తోంది. ప్రధానంగా పంటలసాగు సమయంలో ఈ క్రాపు బుకింగ్ ప్రక్రియ కోసం రోజుల తరబడి పంట పొలాల్లో ఉండాల్సి వస్తోంది. దీంతోపాటు వారంలో ఒక రోజు పొలంబడి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. వీటితోపాటు మండల, సబ్ డివిజన్, జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలకు వీరంతా హాజరు కావాలి. ఇలాంటి సమయాల్లో రైతు భరోసా కేంద్రాలను మూసివేయాల్సి వస్తుంది. దీంతో రైతులు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.అలాంటి పరిస్థితిలో వ్యవ ప్రయాసాలతో మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఈ సమస్యను తెలుసుకున్న ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి రైతులకు ఈ సమస్య కూడా ఉండకూడదని భావించి సమస్య పరిష్కారానికి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చొరవతో ఇక రైతు భరోసా కేంద్రాలలో రైతులకు నిరంతర సేవలు అందే అవకాశం ఏర్పడింది. దేశానికే ఆదర్శంగా ఆర్బీకేలు.. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావడంతో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. విత్తన ఎంపిక, ఎరువులు, పురుగు మందులు, పంట విక్రయాలు వంటి అన్ని రకాల సేవలు ఉన్న ఊర్లోనే అందుతున్నాయి. దీంతోపాటు ప్రైవేటు ఎరువులు, రసాయనిక మందుల డీలర్లు అడ్డుగోలుగా అధిక ధరలకు విక్రయించేవారు. ఎమ్మార్పీపై బస్తాకు రూ.50 నుంచి రూ.100 అధికంగా వసూలు చేసేవారు. ఆర్బీకేలు ఏర్పాటు అయిన తర్వాత వారి ఆగడాలకు మరింత అడ్డుకట్ట పడింది. తాజాగా వలంటీర్ల నియామకంతో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టినట్లయింది. రైతులకు మరింత చేరువలో ఆర్బీకేలు.. జిల్లాలో 432 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 414 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీర్ నియామక ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఇది వరకే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి వీరి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 414 మంది వలంటీర్లకు ఆయా మండల కేంద్రాలలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. డిజటల్ కియోస్క్ ద్వారా ఎరువులు, విత్తనాల, పురుగు మందులు ఆర్డర్ పెట్టడం, పంపిణీ చేయడం వంటి అన్ని కార్యక్రమాలు ఆర్బీకే ఇన్చార్జుల పర్యవేక్షణలో వలంటీర్లు చేపడతారు. చాలా సంతోషం రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు ఏదైనా పనిమీద బయటకు వెళితే ఆర్బీకేలను మూసివేయాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడకతప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి వలంటీర్‌ను నియమించడం సంతోషంగా ఉంది. –ఎస్. శ్రీనివాసులరెడ్డి, గోపులాపురం, రాజుపాలెం మండలం వలంటీర్లకు సమ్రగ శిక్షణ జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక వలంటీర్‌ను నియమించాం. వీరికి ఆర్బీకే నిర్వహణపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాం. ప్రస్తుతం ఈ శిక్షణ ప్రారంభమైంది. ఆర్బీకే ఇన్చార్జులు క్షేత్రస్థాయిలోకి వెళ్లిన సందర్భంలో రైతులకు వీరు అన్ని రకాల సేవలు అందించాల్సి ఉంది. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ భేష్
మదనపల్లె: జాతీయ ఆహార భద్రత చట్టం అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల వ్యవస్థ పనితీరు, రేషన్ డోర్ డెలివరీ, వలంటీర్ల వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర బృందం సభ్యులు ప్రశంసించారు. జాతీయ ఆహారభద్రత చట్టం అమలు, పీడీఎస్ పంపిణీని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు నియమించిన కేంద్ర పరిశీలకుల బృందం మంగళవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించింది. గాలివీడు, కురబలకోట, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండ్యం, మదనపల్లె తదితర ప్రాంతాల్లో రేషన్ షాపులను తనిఖీచేసి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ ఆహారభద్రత చట్టం సలహా సంఘం సభ్యులు జీఎన్ శర్మ, ఎంసీ చింపా మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆహార భద్రత చట్టం అమలు ఏపీలో బాగా జరుగుతోందని కితాబిచ్చారు. పౌరసరఫరాల పంపిణీకి ఎండీయూ వాహనాలు, వలంటీర్ల వ్యవస్థ, రేషన్ డోర్ డెలివరీ సత్ఫలితాన్నిస్తున్నాయని ప్రశంసించారు. 100కి 98శాతం మంది ప్రజలు రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పొందుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. రేషన్ సరుకుల పంపిణీపై లబ్ధిదారులను విచారిస్తే.. సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. -
ఏపీ మోడల్ భేష్
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది రాష్ట్రంలో ప్రభుత్వ తీరు. కానీ ఇంటిని రచ్చ రచ్చ చేయాలనేది ప్రతిపక్షం తీరు. సచివాలయాలను గ్రామాల్లోకి తీసుకెళ్లినా.. వలంటీర్ల సైన్యాన్ని ప్రభుత్వ ప్రతినిధులుగా ఊళ్లలో నిలబెట్టినా.. ఇంగ్లిష్ మీడియాన్ని సర్కారీ స్కూళ్లలో అందుబాటులోకి తెచ్చినా.. ఇవన్నీ విపక్షానికి నచ్చనివే. న్యాయస్థానాలక్కూడా వెళ్లి రచ్చ చేసినవే. కాకుంటే ఈ వ్యతిరేకత ప్రభుత్వ సంకల్పానికన్నా బలమైనదేమీ కాదు. కాబట్టే ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. అంతే కాదు. ఇతర రాష్ట్రాలక్కూడా ఆంధ్రప్రదేశ్ ఒక ‘రోల్ మోడల్’గా మారింది. ఆర్బీకేలు, నాడు–నేడు, రేషన్ డోర్ డెలివరీ, సంచార వైద్యశా లలు... ఇలా అన్నింటా ఏపీ ఒక మోడల్‌గా మారింది. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి చూడటమే కాదు... తమ తమ రాష్ట్రాల్లో అమలుకు కసరత్తు కూడా మొదలెట్టారు.కొన్ని అంశాలనైతే ఏకంగా కేంద్రమే దేశమంతటా అమల్లోకి తేవాలనుకుంటోంది. అదీ.. ఏపీ!! డ్రగ్స్, శ్రీలంక... అంటూ ఏదోలా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్షం కూడా ఒక రోల్ మోడలే!! ఎక్కడా ఇలాంటి పక్షం ఉండకూడదని చెప్పటానికి. సాక్షి, అమరావతి: ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ప్రభుత్వం!. ఏ పథకాన్నయినా ఇంటిదాకా తెచ్చే ప్రభుత్వ వారధులు!!. ఆదేశిస్తే రాష్ట్రంలో ఇంటింటినీ ఒకే రోజులో చుట్టుముట్టేయాలన్న విజన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సేవా సైన్యమిది. కోవిడ్ మహమ్మారి కొత్తగా ప్రవేశించిన రోజుల్లో మనిషిని చూసి మనిషి భయపడే పరిస్థితులు రాజ్యమేలాయి. మృతులు సొంతవారైనా కడచూపులూ దక్కని పరిస్థితి. అలాంటి సమయంలో రాష్ట్రంలో ఇంటింటికీ తిరిగి ట్రేస్–టెస్ట్–ట్రీట్ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది మన వలంటీర్లే. అందుకే ఇతర రాష్ట్రాలూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. కేంద్రం కూడా సచివాలయాల్ని దేశమంతా ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు దీనిపై ఇప్పటికే ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసివెళ్లాయి. సర్వత్రా ఆసక్తి రాష్ట్రంలో అమలవుతోన్న పలు పథకాల పట్ల ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను పలు రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. ఈ విధానాన్ని కర్ణాటకలోనూ అమలు చేసేందుకు ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ ప్రియాంక మేరీ ప్రాన్సిస్ నేతృత్వంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు, మరో పది మంది రాష్ట్ర స్థాయి అధికారుల బృందం 2020 నవంబర్‌లో అనంతపురం జిల్లాలోని పలు గ్రామ సచివాలయాలను సందర్శించింది. మహారాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారుల బృందం నెల రోజుల క్రితం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు గ్రామ సచివాలయాలను సందర్శించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పథకాలు రాష్ట్రాల్లో అమలవుతున్న తీరుపై అధ్యయనం చేసేందుకు తమిళనాడు రాష్ట్ర రిటైర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ రంజన్ నేతృత్వంలో ‘కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం)’ను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక నిపుణుల కమిటీ సైతం రాష్ట్రంలో పర్యటించిన అనంతరం మన సచివాలయ, వలంటీర్ల తరహా వ్యవస్థలు దేశమంతటా అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ డైరెక్టర్, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీ పీఆర్) విభాగాల ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కరోనా సమయంలో ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో.. మన రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ద్వారా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే యునిసెఫ్ సైతం రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో ఒప్పందం చేసుకుంది. యునిసెఫ్ ప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి తమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను పరిశీలించడానికి రాష్ట్రానికి వచ్చిన కర్ణాటక ఐఏఎస్ అధికారుల బృందం (ఫైల్) 17 ఏళ్లుగా కేంద్రం ప్రయత్నం.. కేంద్రంలో పంచాయతీ రాజ్‌కు ప్రత్యేక మంత్రిత్వ శాఖను 2005లో మొదటి సారిగా ఏర్పాటు చేసినప్పటి నుంచి దేశమంతటా గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే వ్యవస్థల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. దేశమంతటా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కనీస స్థాయిలో ఫర్నిచర్, ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కల్పించాలనుకుంటోంది. కంప్యూటర్ నిర్వహణకు కనీసం కాంట్రాక్టు పద్దతిలోనైనా ఉద్యోగుల నియమాకం చేయాలనుకుంది. ప్రతి గ్రామంలో ‘కామన్ సర్వీసు సెంటర్లు’ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘రాజీవ్ గాంధీ పంచాయత్ స్వశక్తీరణ అభియాన్ (ఆర్‌జీపీఎస్‌ఏ), ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చాక ‘రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ)’ పేర్లతో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి నిధులతో ఆయా కార్యక్రమాలను అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండే 2.78 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం గ్రామ పంచాయతీ భవనం లేని చోట్ల వాటి నిర్మాణం, ఉన్న చోట మరమ్మతులకు ఈ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తున్నారు. అయినప్పటికీ గత 17 ఏళ్లుగా అనుకున్న రీతిలో ఫలితాలు సాధించ లేదు. ఆర్జీఎస్ఏ కార్యక్రమాన్ని మరో ఐదేళ్ల పాటు 2026 వరకు కొనసాగించాలని ఈ నెల 13వ తేదీన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2015–17 మధ్య కాలంలో ఆర్జీఎస్ఏ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో గ్రామ స్థాయిలో పరిపాలనను పటిష్టం చేసేందుకు గ్రామ పంచాయతీల్లో పరిమిత కాలానికి దాదాపు 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకునేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం నిధులు మంజూరు చేసినా, పరిమిత కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగించాల్సి వస్తుందనే భయంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం సమ్మతించలేదు. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్లించింది. నాలుగు నెలల్లో వ్యవస్థకు రూపం ► ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండున్నర నెలల్లో గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో ప్రతి 75–100 ఇళ్లకు ఒకరి చొప్పున వలంటీర్లను నియమించారు. ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు. ► 2019 అక్టోబర్ 2 తేదీ నాటికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి, ఒక్కో చోట 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. ► గ్రామ, వార్డు సచివాలయాల కోసం 1.34 లక్షల మంది కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. కేవలం నాలుగు నెలల్లోనే వాటి భర్తీ ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. మొత్తంగా నాలుగు నెలల్లోనే 4 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. సరిపడా కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫోన్, ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించారు. ► అన్ని గ్రామాల్లో ప్రతి రోజు సాయంత్రం 3 – 5 గంటల మధ్య ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు ఊరు దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 545 రకాల ప్రభుత్వ సేవలు 2020 జనవరి 26 నుంచి అన్ని సచివాలయాల్లో అందుబాటులోకి వచ్చాయి. రెండున్నర ఏళ్లలో 3.70 కోట్ల ప్రజా వినతులను ప్రభుత్వం ఈ వ్యవస్థ ద్వారా పరిష్కరించింది. ► అవినీతికి తావులేకుండా బయోమెట్రిక్ ద్వారా గత 34 నెలల్లో రూ.1.34 లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వివిధ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నేరుగా పంచి పెట్టింది. కరోనా వేళ వేలాది మంది ప్రాణాలకు అడ్డుకట్ట ► రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో 23.19 లక్షల మందికి కరోనా సోకితే, ఇందులో 14,730 మంది మరణించారు. పంజాబ్ రాష్ట్రంలో 7.59 లక్షల మందికి కరోనా సోకితే, అందులో 17,743 మరణించారు. 18 లక్షల మందికి కరోనా సోకిన ఢిల్లీ వంటి రాష్ట్రంలో సైతం 26 వేల మందికి పైబడి చనిపోయారు. ► 20 లక్షల మంది చొప్పున కరోనా సోకిన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 26 వేల మంది చొప్పన మరణించారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో సైతం తక్షణమే సమర్థవంతంగా అమలు చేసి చూపించే సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ఉండడం వల్లే ఈ రెండేళ్ల కాలంలో కనీసం పది వేల మంది ప్రాణాలను ప్రభుత్వం కాపాడగలిగిందని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ► 2020 మార్చిలో రాష్ట్రంలో కరోనా మొదలయ్యాక ఈ 24 నెలల కరోనా సమయంలో వలంటీర్ల ద్వారా 44 విడతలుగా ఫీవర్ సర్వే నిర్వహించారు. ఎప్పటికప్పుడు పాజిటివ్ రోగులను ప్రాథమిక దశలోనే గుర్తించి, తక్షణమే వైద్య సహాయం అందేలా చూశారు. తదితర కారణాల వల్ల మన రాష్ట్రంలో మరణాల సంఖ్య బాగా తక్కువకు పరిమితమైంది. కేసుల సంఖ్యలో ఐదవ స్థానం, మరణాల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఏపీ అనుకూలం దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మరింత పెంచేందుకు తొమ్మిది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తోంది. ఈ లక్ష్యాలను సాధించాలంటే క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీలకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారం తప్పనిసరి. ఇలా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మినహా మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ పరిస్థితులలో కేంద్రం అనుకుంటున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆంధ్రప్రదేశ్ చాలా అనుకూలంగా ఉంది. – మహ్మద్ తఖియుద్దీన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్డీ) సీనియర్ కన్సల్టెంట్. అందుబాటులో 540కి పైగా ప్రభుత్వ సేవలు ప్రభుత్వ సేవలు పెరిగినప్పుడే ప్రజల ఆర్థిక పరిస్థితి తప్పనిసరిగా మెరుగు పడుతుంది. ఉదాహరణకు.. ఎవరైనా ఏదైనా పని కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే పూర్తయితే అతనికి తక్కువలో తక్కువ రూ.500 అయినా మిగిలినట్టే. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా అన్ని గ్రామాల్లో ప్రజలకు 540కి పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ పథకాల కోసం లంచాలు ఇచ్చుకునే పరిస్థితి బాగా తగ్గిపోయింది. ఫలితంగా ప్రజల ఆశయాలు పెరుగుతాయి. – ప్రసాదరావు, ఆర్థిక శాస్త్ర రిటైర్డ్ ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
‘సోషల్ ల్యాబ్’ పని మొదలైంది
ప్రభుత్వ వ్యతిరేక ఓటు– అంటూ ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో ఏమాత్రం పొసగని అంశాన్ని పనిమాల చర్చకు తెచ్చారు. మరో రెండున్నర ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉండగా, అప్పుడే వీళ్ళు– ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అంటున్నారు! వైసీపీ ప్రభుత్వం కుదురుకుంటున్న దశలో ‘కరోనా’ వచ్చిపడింది. అయినా కొత్త రాష్ట్రం పునర్నిర్మాణం కోసం అవసరమైన పరిపాలనా సంస్కరణలను అమలు చేస్తున్నారు. మరో పక్క రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచుకోవడానికి ఉన్న మార్గాలను వెతుక్కుంటున్న ప్రాథమిక దశ ఇది. ఇంతలోనే– ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అని అజ్ఞానంతోనో అర్ధ జ్ఞానంతోనో ఎవరైనా అన్నప్పటికీ... అది అభ్యంతరకరమని ‘మీడియా’ విశ్లేషకులకు, పార్టీల అధికార ప్రతినిధులకు అనిపించకపోవడం బాధ్యతా రాహిత్యం అవుతుంది. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అనగానే, ప్రధాన ‘మీడియా’తో పాటుగా సామాజిక మాధ్యమాల్లో దానిపై ‘చర్చ’తో డజన్ల కొద్దీ– ‘యూట్యూబ్’ వీడియోలు వెలువడ్డాయి. వాస్తవాల వైపు జనం చూడకుండా, వారి కళ్ళ మీద ఇలా– ‘గరం మసాలా తెరలు’ కడుతున్న ఈ మొత్తం యంత్రాంగం పట్ల మనకు కనుక అప్రమత్తత లేకపోతే, మున్ముందు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2022 నాటికి– ‘ప్రభుత్వ వ్యతిరేకత’ అనేది ఎంత పేలవమైన వాదన అవుతుందో చూద్దాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండున్నర ఏళ్ల పరిణామాల్లో మూడు ప్రధానమైన అంశాలను ఇందుకోసం ఇక్కడ పరిశీలిద్దాం. ‘కోవిడ్’ విషయంగా ప్రభుత్వ చర్యలు బహిరంగమే కనుక, దాన్ని ఒదిలిపెడితే, మిగతా రెండింటిలో మొదటి పరిపాలనా చర్య– ‘గ్రామ సచివాలయాలు’. వీటిని ఇప్పటికే పలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నమూనాగా పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఇక చివరిది– 13 కొత్త జిల్లాల ఏర్పాటు. ఇందులోకి మళ్ళీ– నేరుగా నగదు బదిలీ జరిగే 33 సంక్షేమ పథకాలూ, ‘రైతు భరోసా కేంద్రాల’ ఏర్పాటూ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణా, 50కి పైగా వెనుకబడిన కులాల అభివృద్ధి కార్పోరేషన్ల ఏర్పాటూ, విద్యా–వైద్య రంగాల్లో సంస్కరణల వంటివీ కలపడం లేదు. గడచిన రెండున్నర ఏళ్లలో ‘కోవిడ్’ కల్లోల కాలం, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఆందోళన పోను... మిగిలిన పని గంటల్లో ఈ ప్రభుత్వం పూర్తి చేసిన పనులివి! అయితే, ఇందులో– ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ ఒడిసి పట్టుకోవడం అనే సాహసం గురించి ఇప్పుడు వీళ్ళు చర్చకు తెస్తున్నారు. ఒక వార్డు స్థాయిలో కొత్తగా ప్రభుత్వ లబ్ధిదారుగా మారిన యువ సమాజంలోని వ్యక్తి– ‘స్టేట్ స్టేక్ హోల్డర్’గా ఆమె లేదా అతడు మున్ముందు అలవర్చుకోవలసిన– ‘సివిక్ సెన్స్’ను మొగ్గలోనే తుంచే ప్రయత్నం ఇది! నిజానికి ఇక్కడ జరగాల్సింది, ప్రతిపక్షాలు ప్రభుత్వ సేవల్లో లోపాలను గుర్తించి వాటిని సరిచేసే దిశలో ఒత్తిడి తేవడం. కానీ, అందుకు భిన్నంగా– సమయం సందర్భం లేకుండా ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అనడం అంటే, ప్రజల్ని– 24x7 ఓటర్లుగా చూడడం తప్పు కాదు అని వీరంతా వత్తాసు పలుకుతున్నట్టుగా ఉంది! (క్లిక్: ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’తో కొత్త వెలుగు!) ఒకప్పుడు ఉమ్మడి ఏపీ రాజకీయాలపై మధ్యతరగతి బుద్ధిజీవులు విలువైన విమర్శలు చేసేవారు. ఇప్పుడు వారు నోరు మెదపటంలేదు. ఆశ్చర్యం– ప్రభుత్వ పాఠశాలల్లో బలహీన వర్గాలకు– ‘ఇంగ్లిష్ మీడియం’ చదువుల ప్రతిపాదన సమయంలో ఇది మరింతగా స్పష్టమయింది. గడచిన ఏడు దశాబ్దాలలో మనం ఎటూ ఏరు దాటి– ‘ఎన్నారై’లు అయ్యాం కనుక, ఇక ఇప్పుడు ప్రభుత్వ సేవలు వినియోగించుకునే వర్గాలు ఎటూ కింది కులాలే అయినప్పుడు ఇప్పుడవి మనం పట్టించుకునే అంశాలు కాదు అనేది వీరి మౌనానికి కారణమైతే; ఇకముందు ఎన్నిక కావలసిన ప్రభుత్వాలు, వాటి విధాన నిర్ణయాలు కూడా వర్ధమాన వర్గాల చేతిలోనే ఉండడం, అందుకు దోహదం చేసే నాయకత్వం చేతిలోనే ప్రభుత్వ పగ్గాలు ఉండడం సరైనది అవుతుంది. (క్లిక్: అందరూ బాగుపడాలి కదా!) ‘వలంటీర్లు’ సచివాలయాల సిబ్బందిగా... అరవై శాతం పైగా బలహీన వర్గాల యువత ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగంలో క్షేత్ర స్థాయిలో భాగమయ్యారు. ప్రభుత్వం నుంచి దిగువకు వచ్చే ‘ప్రయోజనం’ పై స్థాయిలో ఎన్ని దశల్లో ఆపడానికి అవకాశాలు ఉన్నదీ, ఆ అవరోధాన్ని దాటించి చిట్టచివర ఉన్న లబ్ధిదారుకు దాన్ని తాము చేర్చడం ఎంత కష్టమో ఇప్పుడు వారికి తెలుసు. అలా ఒక ఆసక్తికరమైన సాంఘిక ప్రయోగానికి ఇప్పుడు సచివాలయాలు వేదిక అయ్యాయి. ‘ఫంక్షనల్ పాలిటిక్స్’తో పవర్ పాలిటిక్స్’ తలపడినప్పుడు, సేవల బట్వాడాలో జరిగే జాప్యం గురించి మన సామాజిక దొంతర్లలోని చిట్టచివరి జాతుల యువతకు సాకల్యంగా స్పష్టం కావడం అనేది ఎంతమాత్రం చిన్న విషయం కాదు! (క్లిక్: అందరికీ అభివృద్ధి ఫలాలు) - జాన్ సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
వెన్ను చూపని సేవా సైన్యమిది
పేరుకు వాళ్లంతా వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు పార్టీలు, వేర్వేరు మీడియా సంస్థలైనా అంతా ఒక గజదొంగల ముఠా. నీతి లేదు. నియమం లేదు. న్యాయం, ధర్మం అంతకన్నా లేదు. ప్రజలంటే ప్రేమ లేదు. అధికారం మినహా వేరే అజెండా లేనేలేదు. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామో గమనించాలని ప్రజలను సవినయంగా వేడుకుంటున్నా. –సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: సేవాభావంతో పనిచేస్తున్న వలంటీర్ల ద్వారా దేశమంతా మనవైపు చూసేలా ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఎండైనా, వానైనా, చలైనా, సెలవైనా వెన్ను చూపని మహా సైన్యమని వలంటీర్ వ్యవస్థను అభినందించారు. ‘తమకు ఎంత వస్తుంది? ఏం ఉపయోగం? అని అంతా లెక్కలు వేసుకుంటున్న ప్రస్తుత సమాజంలో పేదల కళ్లల్లో సంతోషం, సంతృప్తే ఆశీస్సులుగా భావించి గుండెల నిండా మానవతావాదంతో సేవ చేస్తున్న నా వలంటీర్ చెల్లెమ్మలు, తమ్ముళ్లు.. 2.60 లక్షల మంది మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో గురువారం వలంటీర్ల సత్కార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి మాట్లాడారు. రూపాన్ని మార్చుకుని మోసగించే రాక్షసుడు మారీచుడి మాదిరిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు.. ఏ పార్టీతో కావాలనుకుంటే ఆ పార్టీతో జత కడతారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కానుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇలాగే ఇచ్చుకుంటూ వెళితే తమ బాక్సులు బద్దలవుతాయని గ్రహించి దుష్ప్రచారానికి తెగించారని మండిపడ్డారు. ‘ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తిడతారు.. బురద వేస్తారు... విడిపోతారు.. ఎలాగూ అమలు చేయరు కాబట్టి ఏ వాగ్దానం కావాలంటే అది ఇచ్చేస్తారు. ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తారు. ఆ తర్వాత పండుగకు చుట్టం వచ్చినట్టు రాష్ట్రంలో అప్పుడప్పుడు కనిపిస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మంచిదనుకుంటే విడివిడిగా పోటీ చేస్తారు. లేదనుకుంటే ఏకమైపోతారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి అదే నిజమని నమ్మించే మారీచులతో యుద్ధం చేస్తున్నామన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు. సీఎం ప్రసంగం వివరాలివీ.. వలంటీర్ల పురస్కారాలకు సంబంధించిన చెక్కును విడుదల చేస్తున్న సీఎం వైఎస్ జగన్ 55 శాతం నా చెల్లెమ్మలే.. వలంటీర్లకు అందిస్తున్న చిరు సత్కారం ఈరోజు నుంచి మొదలై రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఇరవై రోజులపాటు జరుగుతుంది. వలంటీర్లు అంటే అర్థం స్వచ్ఛంద సేవకులు. వారు చేస్తున్నది ఉద్యోగం కాదు గొప్పసేవ. అలాంటి ఒక గొప్ప వ్యవస్థ్ధ రాష్ట్రంలో ఏర్పాటైంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మంది పని చేస్తున్నారు. లంచాలు, వివక్షకు తావులేకుండా సోషల్ ఆడిట్ నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ వలంటీర్ల ద్వారా పథకాలను అందజేస్తున్నాం. సూర్యోదయానికి ముందే తలుపుతట్టి ప్రతి నెలా ఒకటో తేదీనే 61 లక్షల మందికి ఇంటి వద్దే పింఛన్లు అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు మన వలంటీర్లు. వలంటీర్లను వరుసగా రెండో ఏడాది సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు, నగదు బహుమతి, బ్యాడ్జి, సర్టిఫికెట్లతో సత్కరిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.33 లక్షల మందికి రూ.239 కోట్ల నగదు పురస్కారాన్ని అందజేస్తు్తన్నాం. రెండేళ్లలో రూ.465 కోట్ల నగదు పురస్కారాన్ని అందించిన ప్రభుత్వం మనది. వలంటీర్ల వ్యవస్థలో 55 శాతం నా చెల్లెమ్మలే ఉన్నారని తెలియజేస్తున్నా. దేశమంతా అభినందిస్తోంది.. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఎవరికి, ఎప్పుడు ఎంత లబ్ధి చేకూరుతుందో ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి తెలియజేస్తున్న కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. లబ్ధిదారులతో దగ్గరుండి దరఖాస్తు చేయిస్తున్న పరిస్థితిని కూడా మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. విప్లవాత్మక మార్పుతో మనం చేస్తున్న సేవలను దేశమంతా అభినందిస్తోంది. మీ సేవలకు రాష్ట్రం గర్విస్తోందని ప్రతి వలంటీర్ చెల్లెమ్మకు, తమ్ముడికి తెలియజేస్తున్నా. పెన్షన్‌గా ఇచ్చిన సొమ్మే రూ.50,508 కోట్లు 2019 జూన్ నుంచి 2022 మార్చి వరకు వలంటీర్ చెల్లెమ్మలు, తమ్ముళ్ల ద్వారా పింఛన్ల కింద పంపిణీ చేసిన సొమ్ము రూ.50,508 కోట్లు. ఇది ఊహలకందని పాలన. రూ.1.34 లక్షల కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారులకు పలు పథకాల కింద అందజేశాం. ఈ ఏడాది మరో రూ.55 వేల కోట్లను డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తాం. 95% హామీలను అమలు చేశాం. గతానికీ, ఇప్పటికీ పాలనలో ఉన్న మార్పు గురించి ఆలోచన చేయమని కోరుతున్నా. 33 పథకాలు పారదర్శకంగా.. వైఎస్సార్ పెన్షన్ కానుక మొదలు బియ్యం కార్డులు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు, అమ్మఒడి, ఆరోగ్య ఆసరా, ఇళ్ల çస్థ్ధలాల పట్టాలు, జగనన్న తోడు, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ కంటివెలుగు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ మత్స్యకార భరోసా, జలకళ, జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్ వాహనమిత్ర, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం.. ఇలా 33 పథకాలు ప్రతి ఇంటికీ వివక్షకు తావులేకుండా అర్హులందరికీ అందజేస్తున్నాం. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అక్కచెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వెళ్లగలుగుతున్నారు. ఇంతకన్నా గొప్ప పాలన, గొప్ప పరిస్థితులను గతంలో మనం ఎప్పుడైనా చూశామా? అని ఒక్కసారి గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేయమని కోరుతున్నా. మంచి జరిగిందంటే జగన్‌ను ఆశీర్వదించండి.. చెడు జరిగిందంటే ద్వేషించండి. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ సామాజిక వర్గాన్ని తీసుకున్నా కనీవినీ ఎరుగని విధంగా మేలు చేయగలిగాం. నవరత్నాల పాలన ఇలాగే కొనసాగితే తమకు డిపాజిట్లు కూడా దక్కవన్న బాధ, ఏడుపు ఈరోజు ఎల్లో పార్టీ, వాటికి అనుబంధంగా ఉన్న పార్టీలు, ఎల్లో మీడియాలో కనిపిస్తోంది. మంచి చేసే వాడిమీదే రాళ్లు పడతాయన్నట్టుగా.. పళ్లు కాసే చెట్టుపైకే రాళ్లు వేస్తారన్నట్టుగా... ఈరోజు వీళ్లంతా కలిసికట్టుగా కుయుక్తులు పన్నుతూ బురద జల్లుతున్నారు. వలంటీర్లకు సెల్యూట్ చేస్తున్న సీఎం జగన్ ‘పేట’కు ఫ్లైఓవర్ వెటర్నరీ పాలిటెక్నిక్, ఆటోనగర్ కూడా.. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి మేరకు నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్ మంజూరు చేస్తున్నట్లు సభలో సీఎం జగన్ ప్రకటించారు. వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ, ఆటోనగర్ కూడా మంజూరు చేస్తున్నట్లు హర్షధ్వానాల మధ్య ప్రకటన చేశారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, కోన రఘుపతి, కలెక్టర్ లోతేటి శివశంకర్, అజయ్‌జైన్ తదితరులు పాల్గొన్నారు. -
AP: వలంటీర్లకు సత్కార వేడుక
సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను గడప గడపకూ చేరవేస్తూ లబ్ధిదారులకు పారదర్శకంగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల నిబద్ధతను గుర్తిస్తూ వరుసగా రెండో ఏడాది సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరగనున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సీఎం వైఎస్ జగన్ గురువారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉదయం 11.05 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు ఇందులో పాల్గొంటారు. వలంటీర్లను సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో సత్కరించడంతో పాటు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,33,333 మంది వలంటీర్లను సచివాలయాలవారీగా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరిస్తారు. విమర్శకులే ప్రశంసించేలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 2019 ఆగస్టు 15వతేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆరంభంలో దీనిపై తీవ్ర విమర్శలు చేసిన వారు సైతం అభినందించేలా ఏడాదిన్నరగా వలంటీర్లు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. సచివాలయాల వ్యవస్థ పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. వలంటీర్ల సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి ఉగాది సందర్భంగా సత్కార కార్యక్రమాలను ప్రారంభించింది. దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. మూడు అంశాల ఆధారంగా.. సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు, పింఛన్ల పంపిణీ, కరోనా థర్డ్ వేవ్‌లో ఫీవర్ సర్వే తీరు అంశాల ఆధారంగా వలంటీర్లకు పాయింట్లు కేటాయించి మూడు విభాగాల్లో అవార్డులు అందించనున్నారు. సేవా వజ్ర అవార్డుకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున, సేవా రత్న అవార్డుకు ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఐదుగురు చొప్పున, నగర కార్పొరేషన్లో పది మంది చొప్పున ఎంపిక చేశారు. కనీసం ఒక ఏడాది పాటు బాధ్యతగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఎలాంటి ఫిర్యాదు లేనివారిని సేవా మిత్ర అవార్డుకు ఎంపిక చేశారు. ఈసారి మరింత మందికి.. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 2,20,993 మంది వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించగా ఈ ఏడాది 2,33,333 మందిని సత్కరించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 875 మంది వలంటీర్లను సేవా వజ్ర అవార్డుతో పాటు రూ.30 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్తో సత్కరించనున్నారు. 4,136 మందికి సేవారత్న అవార్డుతో పాటు రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్ అందజేస్తారు. 2,28,322 మంది సేవా మిత్ర అవార్డుతో పాటు రూ.10 వేల బహుమతి అందుకోనున్నారు. మీడియా కంటే ముందే.. ► ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు, సంక్షేమ పథకాల సమాచారం ఇప్పుడు పత్రికలు, టీవీల కంటే ముందుగా వలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరుతోంది. 33 రకాల సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లే ప్రభుత్వానికి కళ్లు, చెవులు మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ► రాష్ట్రంలో 61.03 లక్షల మంది పింఛనుదారులకు ఇప్పుడు ప్రతి నెలా మొదటి తేదీనే వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. రూ.46,564 కోట్లు వలంటీర్ల ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులకు అందాయి. ► 10.34 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్‌కార్డులు, 3.60 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు వలంటీర్ల ద్వారానే మంజూరయ్యాయి. ► జగనన్న తోడు పథకంలో చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం అందజేసే వడ్డీ లేని రుణాలకు 9.05 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక వలంటీర్ల ద్వారానే సాగింది. ► కరోనా సమయంలో 1.50 కోట్ల కుటుంబాల ఆరోగ్య స్థితిగతులపై వలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించింది. బాధితులను గుర్తించి తక్షణమే వైద్య సేవలను అందించింది. కరోనా వ్యాక్సినేషన్లోనూ వలంటీర్లది కీలక పాత్ర. ► కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో వీఆర్వోలకు సహాయకారిగా పనిచేయడంతోపాటు వలంటీర్లు పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ► ఇంటింటికీ బియ్యం పంపిణీలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వలంటీర్ల విధులు ► ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగంగా తమకు కేటాయించిన 50 కుటుంబాలలో వ్యక్తుల సమాచారాన్ని సేకరించడం, వారికి ఎప్పటికప్పుడు సమగ్ర వివరాలను తెలియచేయడం. ► వ్యక్తిగత, సామాజిక అవసరాలను గుర్తించి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించడం. ► నిర్దేశిత కుటుంబాలు పొందిన పథకాలు, ప్రయోజనాలు, ఆ ప్రాంతం సమాచారాన్ని సమగ్రంగా నిర్వహించడం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం. అర్హులతో దరఖాస్తు చేయించి పథకాల మంజూరులో సహాయకారిగా వ్యవహరించడం. ► రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి పారుదల సంబంధిత సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తేవడం. పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రత, ప్రాథమిక విద్యలో తోడ్పాటు అందించడం. -
గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతం
సాక్షి, అమరావతి/విజయవాడ రూరల్: ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకెళుతున్న మన గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల వైపు పలు రాష్ట్రాలు ఆకర్షితమవుతున్నాయి. ఈ వ్యవస్థలను అధ్యయనం చేసేందుకు, తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మారుమూల గ్రామాల్లో సైతం దాదాపు 500 రకాల ప్రభుత్వ సేవలు సచివాలయాల ద్వా రా అందజేస్తున్న విధానాన్ని తెలుసుకునేందుకు మహారాష్ట్ర అధికారుల బృందం బుధవారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తోంది. కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నేతృత్వంలో అధికారుల బృందం 7నెలల కిందట రాయలసీమలో పర్యటిం చి సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పుణె జిల్లా పరిషత్ అధికారులు సుధీర్ భగవత్ నాయకత్వంలో బుధవారం విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడు గ్రామ సచివాలయం–3ను పరిశీలించారు. అనంతరం అంబాపురంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వానపాముల ద్వారా ఎరువులను తయారుచేసే విధానాన్ని తిలకించారు. చివరిగా గొల్లపూడిలో వెల్నెస్ సెంటర్‌ను పరిశీలించారు. పంచాయతీరాజ్ కమిషనర్‌తో భేటీ.. మహారాష్ట్ర అధికారులు బుధవారం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ఏర్పాటు గురించి కోన శశిధర్ వారికి వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి, వాటి భర్తీ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేశారని వివరించారు. ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకే చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును కూడా నియమించినట్లు తెలిపారు. -
ఆ పెన్షనే వారికి ఆధారం!
జగనన్న ప్రారంభించిన సంక్షేమ పథకాలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ఎంతో మంది పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగు లకు జీవనాధారం అయ్యింది. అయితే ఒకప్పుడు పెన్షన్లు తీసుకోవడం కోసం పెన్షన్ దారులు చాలా దూరం వెళ్లవలసి వచ్చేది. కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంటికే పెన్షన్లు వస్తున్నాయి. బడుగు, బలహీన వర్గాలకు పెన్షన్ అందించ డంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందుంది. ఈ పెన్షన్లలో కేంద్రం ఇచ్చే నగదు వాటా అతి స్వల్పం మాత్రమే. ఏపీ ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం రూ. 200 మాత్రమే. మిగిలిన రూ. 2,300 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం రూ. 200 మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,800 ఇస్తున్నది. ఎన్నికల వాగ్దానం ప్రకారం, ఏ రాష్ట్రాలలో లేని విధంగా చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టేవారు, హెచ్ఐవీ కలిగి ఉన్నవారు అర్హతను బట్టి నెలకు రూ. 2,500 పెన్షన్ తీసుకుంటున్నారు. అలాగే ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులకు నెలకు రూ. 3,000 పెన్షన్‌గా అందజేస్తోంది. గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాల కంటే చాలా వేగంగా అమలు చేయడానికి సహాయపడుతోంది. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం అమలు గురించి తెలుసుకోవడానికి ఏడు పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్‌ల (పీటీజీ) గ్రామాలను సందర్శించి అక్కడున్న పెన్షన్ లబ్ధిదారులతో మాట్లాడడం జరి గింది. పీటీజీలు ఎక్కువగా ఏజెన్సీ ఏరియాల్లో, కొండవాలు ప్రాంతాల్లో, ఊరికి దూరంగా అడవులలో నివసిస్తుంటారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్న జగనన్న ఇంటివద్దకు పెన్షన్ పథకం వారికి వరంగా మారింది. ఎందుకంటే ఇంతకు ముందు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, ఈ పెన్షన్ నగదును తీసుకోవడానికి మేజర్ గ్రామ పంచాయితీ కార్యా లయం లేదా పోస్టాఫీసుకు వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామ వాలంటీర్ ప్రతినెలా ఒకటవ తేదీన క్రమం తప్పకుండా ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇంకా అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటున్నారు. అర్హులైన వారి పేరు వారం రోజుల లోపు సంక్షేమ పథకంలో చేర్చబడుతుంది. ప్రస్తుతం నేను సర్వే చేసిన గ్రామాల్లో అర్హత ఉన్న వారందరికీ పెన్షన్ వస్తోంది. కొంతమంది దివ్యాంగులు సదరం నివేదికల గురించి వేచి చూస్తున్నారు. (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!) వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం లబ్ధిదారుల్లో ఆర్థిక భద్రతను పెంచింది. పెన్షన్ లబ్ధిదారులు ఎవరిపైనా ఆధారపడకుండా వారికి వచ్చే మొత్తాన్ని ఆహారం కోసం, మందుల కోసం, బట్టల కోసం, ఆసుపత్రి ఖర్చుల కోసం వెచ్చిస్తున్నారు. కొందరు వారికొచ్చిన పెన్షన్‌లో కొంత భాగాన్ని వారి పిల్లలకు, మనమళ్లకు ఇస్తున్నారు. కొంతమంది వృద్ధులపై... వారి పిల్లలు పెన్షన్ నగదు కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఇది ఆడవారిపై అధికంగా ఉంది. మారుమూల అటవీ ప్రాంతాల్లో సిగ్నల్స్, నెట్ వర్క్ సమస్యలు ఉండడం ద్వారా కొంతమందికి పెన్షన్ పంపిణిలో జాప్యం అవుతోంది. బయోమెట్రిక్ విధానాన్ని కొత్త సాంకేతికతతో పునర్వ్యవస్థీకరించడం ద్వారా, ఇంటర్నెట్ సదుపాయాన్ని పెంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. మొత్తం మ్మీద, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలతో పీటీజీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. (క్లిక్: మేనేజ్మెంట్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?) - డా. ముట్లూరి అబ్రహం ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ శాఖలో గెస్ట్ ఫ్యాకల్టీ -
AP: ఈ సేవలన్నీ మీకు తెలుసా?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామానికి చెందిన వెంకట రమణ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో టీవీ చూస్తోంది. ఇదే సమయంలో ఆ గ్రామ సచివాలయంలో పని చేసే వెల్ఫేర్ అసిస్టెంట్, మరో ముగ్గురు వలంటీర్లు ఆమె ఇంటి వద్దకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. తలుపు తీయగానే నమస్కారం.. అంటూ తాము వచ్చిన పని చెప్పారు. గ్రామ సచివాలయం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సేవలు గురించి తెలుసా? అని వాకబు చేశారు. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు పొందే విషయంలో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. వెంకట రమణ చెప్పిన సమాధానాన్ని ఆ సచివాలయ ఉద్యోగి తన వెంట తెచ్చుకున్న మొబైల్లోని ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి, అప్పటికప్పుడే ఉన్నతాధికారులకు చేర వేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊళ్లలోనూ సచివాలయాల బృందాలు ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి సమస్యలపై వాకబు చేశాయి. ప్రభుత్వ సేవలను మరింతగా ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు, రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ప్రభుత్వ సేవలు పొందడంలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా.. అని తెలుసుకోవడం కోసం ‘సిటిజన్, బెనిఫిషరీ ఔట్ రీచ్’ (ప్రభుత్వ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా 44.55 లక్షల కుటుంబాలను కలిశాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వారి సొంత గ్రామంలో అందిస్తున్న సేవల గురించి వివరించాయి. సేవలు పొందడంలో ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నాయి. సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 22.28 లక్షల కుటుంబాలను, పట్టణ ప్రాంతాల్లో 18.27 లక్షల కుటుంబాలను సచివాలయ ఉద్యోగుల బృందాలు కలిసి అభిప్రాయాలు సేకరించాయి. శనివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఒక్కో బృందం వంద ఇళ్లకు.. ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి, మరో ముగ్గురు వలంటీర్లను ఒక్కో బృందంగా ఏర్పాటు చేశారు. ఈ బృందం గ్రామం/వార్డులోని కనీసం వంద కుటుంబాలను కలిసి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవల గురించి వివరాలు సేకరిస్తోంది. ఆగస్టు నెలలో కేవలం పట్టణ ప్రాంతాలలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఈ నెల నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి కొనసాగిస్తోంది. ఇక ప్రతి నెలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఉద్యోగుల ఫోన్ నంబర్ల కరపత్రాలు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ కాల్ సెంటర్ ఫోను నంబర్‌తో పాటు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో పని చేసే ఉద్యోగుల ఫోన్ నంబర్ల వివరాలు, ఆ ప్రాంత వలంటీరు ఫోను నంబరు ముద్రించిన కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎలాంటి సమాచారమైన ఆయా నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని బృందం సభ్యులు ప్రజలకు వివరిస్తున్నారు. ‘సిటిజన్, బెనిఫిషరీ ఔట్ రీచ్’లో ప్రధాన వివరాలు ఇలా.. ► గ్రామ/వార్డు సచివాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ► మీ గ్రామ/వార్డు వలంటీర్ మీకు తెలుసా? ► మీ వలంటీర్ ఎన్ని రోజులకొకసారి మీ ఇంటికి వస్తున్నారు? ► మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా? (ఈ ప్రశ్న తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెబుతారు) ►సచివాలయంలో ఏయే సేవలు అందిస్తున్నారో మీకు తెలుసా? ► ‘సచివాలయం’ ద్వారా సేవలు పొందే విషయంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? -
శభాష్...శ్రీవైష్ణవి!
మోపిదేవి (అవనిగడ్డ): ఏపీలో వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తోంది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని పెదప్రోలుకు చెందిన ఇద్దరు వృద్ధురాళ్లు అనారోగ్యంతో కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్రంలో చికిత్స పొందుతున్నారు. ఏపీలో పింఛన్లు అందుకుంటున్న వీరు ఈకేవైసీ నమోదు చేయాల్సి ఉంది. మండవ బేబీ సరోజిని ఎల్బీ నగర్లో, మండవ రమాదేవి అశోక్‌నగర్‌లో ఉంటున్నారు. వారు స్వగ్రామం రాలేని పరిస్థితిలో వలంటీర్ కూనపులి సాయి మాలిక శ్రీ వైష్ణవి హైదరాబాద్ వెళ్లి ఈకేవైసీ నమోదు చేయించారు. తమకు ఈ కేవైసీ నమోదు చేయించిన వలంటీర్‌కు ఇద్దరు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. -
జిల్లాలు దాటి ‘విద్యా దీవెన’ నమోదు
కూచిపూడి(అమృతలూరు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం కూచిపూడి గ్రామ వలంటీర్ దేవరకొండ గోపి తన పరిధిలోని ఉండ్రాకొండ విజయలక్ష్మి కుటుంబం కూలి పనులు నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు వెళ్లారు. ఆమె కుమారుడికి విద్యా దీవెన పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు వలంటీర్ గోపి ఆదివారం నిడదవోలు వెళ్లాడు. ఆమె ఆ సమయంలో పొలంలో నాటు వేసేందుకు వెళ్లగా.. చిరునామా కనుక్కుని మరీ వెళ్లి బయోమెట్రిక్ చేశాడు. పొట్ట కూటి కోసం దూరప్రాంతానికి వెళ్లిన తమ కోసం వలంటీర్ జిల్లాలు దాటి వచ్చి విద్యా దీవెన నమోదు చేయడంపై ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు: ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. సోమవారం ఆయన వెదురుకుప్పంలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చంద్రబాబు అబద్ధాలకు ఎల్లో మీడియా వంతపాడుతోందని ఆయన దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో అభివృద్ధి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. వాలంటీర్ల సేవలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి నారాయణ స్వామి అన్నారు. చదవండి: ఏపీలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి -
గ్రామ వాలంటీర్ వ్యవస్థ: ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానం
పాలన పారదర్శకంగా ఉండాలి... ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు అందరికీ అందాలి.. లోటుపాట్లు ప్రభుత్వానికి తెలియాలి.. సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలిసుండాలి... ఈ రెండింటి మధ్య వారధి కావాలి.. సంధాన కర్తలు కావాలి ఆ ఏర్పాటు ఓ వ్యవస్థలా ఉండాలి.. ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు అది మనుగడ సాగించాలి.. అదే గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ.. దాదాపు రెండేళ్ల కిందట దేశంలోనే మొదటిసారిగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పు. పకడ్బందీగా అమలవుతున్న విధానం. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయ్యారు ఆ వాలంటీర్లు.. వైరస్ సోకిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.. ఐసోలేషన్‌లో ఉన్న వారికి మందులు, కూరగాయలు, నిత్యావసర సరకులు సరఫరా చేస్తున్నారు. వైరస్‌తో పోరాడి చనిపోయిన వ్యక్తులనూ మోసి చివరి మజిలీకి చేర్చుతున్నారు.. కష్టకాలంలో కనిపించిన వాళ్లే ఆప్తులు.. ఆత్మీయులు.. వాళ్లే ఆంధ్రప్రదేశ్ సర్కారు పంపిన వాలంటీర్లు!! గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా జాతిపిత 150వ జయంతి సందర్భంగా అక్టోబరు 2 వ తేదీ 2019న ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాలోని కరప గ్రామంలో గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అలా ఆ వాలంటీర్లు ఆ రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాల్లో సభ్యులుగా ఇమిడిపోయారు. వాళ్ల పనిని కళ్లకు కట్టడానికి కరోనా పరిస్థితిని మించిన ఉదాహరణ ఉండదు. పకడ్బందీగా అమలవుతున్న ఆ వ్యవస్థ గురించి వివరించడానికి ఇంతకు మించిన సందర్భం రాదు.. కుటుంబ సభ్యుడై... ఇది ప్రకాశం జిల్లాలోని వేటపాలెం మండలం, ఆమోదగిరి పట్నంలో జరిగిన కథ. మనసును తడి చేసే వ్యథ. కృష్ణమూర్తికి 75 ఏళ్లు. ఊరిలో ఒంటరిగా ఉంటున్నాడు. పింఛను దారులు అందరికీ ఇచ్చినట్టే క్రమం తప్పకుండా అతనికీ పింఛను ఇచ్చొస్తుంటాడు వాలంటీర్ మోదుగుల దినేష్. ఎప్పటిలా ఆ నెలా కృష్ణమూర్తి ఇంటికి వెళ్లాడు దినేష్ పింఛను ఇచ్చేందుకు. అస్వస్థతతో మంచంలో కదల్లేని స్థితిలోఉన్నాడు కృష్ణమూర్తి. అతణ్ణలా చూసి చలించిపోయాడు దినేష్. ‘ఇంట్లో ఎవరు లేరా ?’ అడిగాడు. ‘పిల్లలు వేరే ఊరిలో ఉన్నారు’ అని బదులిచ్చాడు ఆ వృద్ధుడు. అంతే! క్షణం కూడా ఆలస్యం చేయకుండా 108కి ఫోన్ చేశాడు దినేష్. పీపీఈ కిట్ ధరించి కృష్ణమూర్తి వెంట తను కూడా చీరాల ఏరియా ఆసుపత్రికి వెళ్లాడు అంబులెన్స్‌లో. ఆసుపత్రి రికార్డులో కృష్ణమూర్తి సంరక్షకుడిగా సంతకం చేశాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మరణించాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు దినేష్. అయినవాళ్ళందరూ కృష్ణమూర్తిని కాదనుకున్నా వాలంటీర్‌గా తన ధర్మాన్ని నిర్వర్తించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు ఆ వాలంటీర్. తన ఆటోనే అంబులెన్స్..! కరోనా తీవ్రత ముందు మిగిలిన వ్యాధులు, వ్యాధిగ్రస్తుల కష్టాలు చిన్నవిగా కనపడుతున్నాయి. అలాంటి వారికి అండగా నిలుస్తున్నాడు వాలంటీర్ ఈడా శ్రీనివాస రావు. అతనిది కృష్ణా జిల్లా, కంకిపాడు మండలం, ప్రొద్దుటూరు. ఉపాధి కోసం తానొక ఆటోను తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ ఆటోనే ఆ గ్రామానికంతటికీ అంబులెన్స్ అయింది. విషమస్థితిలో ఉన్న రోగులను, గర్భిణీలను తన ఆటోలోనే ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు. సత్వరమే వారికి వైద్యసేవలు అందేలా తోడ్పడుతున్నాడు. ఇలా తన సేవతో ఈ వాలంటీరు ప్రజా బంధువయ్యాడు. ఒక్క నెలలో 298 మందికి... వైఎస్సార్ జిల్లా 8వ డివిజన్ లోని శంకరాపురం 8/2 సచివాలయంలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అబ్బాస్ తనకొచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు. తన స్నేహితుల సహకారంతో అనాథ శవాలతోపాటు కోవిడ్‌తో చనిపోయిన (రక్తసంబంధీకులు పట్టించుకోని) వారిని గుర్తించి వారివారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపిస్తున్నాడు. కులమతాలకు అతీతంగా పౌరుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. మానవత్వాన్ని చాటుతున్నాడు. ఒక్క నెలలోనే 298 మందికి అంత్యక్రియలు నిర్వహించాడు అబ్బాస్. ఆ నలుగురై.. అనంతపురం జిల్లా.. తలుపుల మండలంలోని ఓబుళరెడ్డిపల్లి.. ఎస్సీ కాలనీకీ చెందిన 58 ఏళ్ల జయరాం చనిపోయాడు...కరోనాతో. చూడ్డానిక్కూడా రాలేదు అయినవాళ్లు. కరోనాకు భయపడి. అతని అంత్యక్రియలకూ ప్రేక్షకులుగానే ఉండిపోయారు. ఆ విషయం ఆ నోటా ఈ నోటా బాబ్జాన్, సాదిక్ బాషా, ఇమ్రాన్‌ల చెవిన పడింది. వాళ్లు గ్రామ వాలంటీర్లు. జయరాం మృత దేహానికి అంత్యక్రియలు చేయాలని నిశ్చయించు కున్నారు. సహచరుడు, ఫీల్డ్ అసిస్టెంట్ బాలకృష్ణతో కలిసి రంగంలోకి దిగారు. ఈ నలుగురే ఆ నలుగురిగా మారి జయారం అంత్యక్రియలు జరిపించారు. అతని చివరి మజిలీని సుగమం చేశారు. బాధ్యతగా.. గుంటూరు జిల్లా, రొంపిచర్ల మండలం, విప్పర్లపల్లి.. ఈ ఊరిలో ఓ దివ్యాంగుడితో పాటు ఒక వృద్ధుడూ మరణించాడు. వారి అంతిమసంస్కారాలకు బంధువులెవరూ ముందుకు రాలేదు. దాంతో గ్రామ పెద్దల సహకారంతో వాలంటీర్ గాదె నర్శింహారెడ్డియే ఆ ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించి తన సంస్కారాన్ని చాటుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేశారంటే లబ్ధిదారులు అందరికీ ప్రభుత్వ పథకాలను పొందే హక్కుంది. అలాంటి సంక్షేమ పథకాల మీద అవగాహన లేక, అవి అందక నష్టపోతున్న ప్రజలు ఎంతోమంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకే ఈ గ్రామ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ. దీని ప్రకారం గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో 100 ఇళ్లకు ఒక వాలంటీరు ఉంటాడు. ప్రభుత్వ సంక్షేమ కారక్రమాలను ఇంటింటికీ చేరుస్తాడు. అదేవిధంగా ఆయా కుటుంబాల్లో వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారులను గుర్తిస్తాడు. ఆయా సంక్షేమ కార్యక్రమాల అమలులో వారు ఎదుర్కొంటున్న సమస్యలనూ గుర్తిస్తాడు. ఈ వాలంటీర్లకు ప్రభుత్వం గుర్తింపు కార్డులనూ జారీచేస్తోంది. వారందించే సేవకు ప్రోత్సాహకం కింద ప్రతినెల అయిదువేల రూపాయలను అందజేస్తోంది ప్రభుత్వం. వాలంటీర్ల విధులు ఇవీ... కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటం. తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం పనిచేయాలి. ఇందుకోసం గ్రామ,వార్డు సచివాలయ అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ప్రభుత్వ పథకాలు, సహాయాన్ని ఇంటివద్దకే వెళ్లి అందించాలి. తమ పరిధిలో సంక్షేమ పథకాలు అందేందుకు అర్హత ఉన్న వారికి అవగాహన కల్పించి వారికి అందేలా పనిచేయాలి. విద్య, ఆరోగ్యపరంగా తమ పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి. మాస్కుల నుంచి సరుకుల వరకు.. కరోనా వల్ల ఇతరులతో కలవాలంటేనే భయపడిపోయే పరిస్థితిలో తమ పరిధిలోని కుటుంబాల ఆరోగ్యాన్ని వాలంటీర్లే పర్యవేక్షిస్తున్నారు. ఆయా ఇళ్లల్లో ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నారా అని ఆరా తీస్తున్నారు. కరోనా బారినపడ్డ వాళ్లను సొంత బంధువులే కన్నెత్తి చూడని స్థితిలో వారికి ప్రభుత్వం ఇచ్చే మెడికల్ కిట్‌ను అందిస్తున్నారు. అవసరమైన సరకులు, కూరగాయలను తెచ్చిస్తున్నారు. ఈ విపత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరూ ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున మాస్కుల నుంచి సరుకుల వరకు అన్నిటినీ సరఫరా చేసి ఆ కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు. ఆయా వార్డుల పరిధిలో 45 ఏళ్లు పై బడిన వారందరికీ కరోనా వ్యాక్సీన్ వేయించడంలో వాలంటీర్ల కృషి మరువలేనిది. మొదటి డోసు తేదీ నుంచి రెండవ డోసు వేసుకునే వరకు వారిని నిరంతరం అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించడంలో వాళ్ల పాత్ర కీలకం. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేరోజు 6 లక్షల వ్యాక్సీన్ డోసులను వేసి రికార్డు సృష్టించింది ఆంధ్రప్రదేశ్. వాలంటీర్ వ్యవస్థ సహకారంలేనిదే ఇది సాధ్యమయ్యేది కాదు. నిరాటంకంగా పింఛన్ల పంపిణీ.. కరోనా మహమ్మారి ప్రపంచాన్నే తలకిందులు చేస్తోంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో పింఛను పంపిణీ కార్యక్రమం ఆగలేదు. ఎలాంటి ఆంటకంలేకుండా యథావిధిగా సాగుతోంది. ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా వేకువజామునే ఇంటి తలుపుతట్టి మరీ లబ్ధిదారులకు పింఛన్‌ను అందిస్తున్నారు వాలంటీర్లు. అదొక్కటే కాదు జనన, మరణ ధ్రువీకరణ పత్రం మొదలు ఇంటి పట్టాల పంపిణీ, కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ వంటి సుమారు 545 సర్వీసులనూ ఆ రాష్ట్రంలోని ప్రతి గడపకు చేరవేస్తున్నారు. 700 కిలోమీటర్లు వెళ్లి.. పుంగమ్మ సొంతూరు మడకశిర. మూడునెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా, ఉసిలంపట్టి గ్రామంలో చికిత్స పొందు తోంది. ఈ కారణంగా అంతకుముందు రెండు నెలల నుంచీ పింఛన్ తీసుకోవడంలేదు ఆమె. ఏప్రిల్ నెలా తీసుకోకపోతే ఆమె పింఛన్ రద్దు అవుతుందని గుర్తించాడు వాలంటీర్ హరిప్రసాద్ . దాంతో ఉసిలంపట్టిలో ఆమె ఉంటున్న చిరునామా కనుక్కొని మరీ మడకశిర నుంచి 700 కిలో మీటర్లు దూరంలో ఉన్న ఉసిలంపట్టికి వెళ్లాడు. మూడు నెలల పింఛన్‌ను పుంగమ్మ చేతిలో పెట్టాడు. సేవచేయడం అదృష్టం.. క్వారంటైన్లో ఉన్న చాలా మంది నిత్యావసర సరుకులు లేక అవస్ధలు పడ్తున్నారు. ప్రతిరోజూ వాళ్లకు నిత్యావసర సరుకులు, కూరగాయలు తీసుకెళ్లి ఇచ్చాను.. దానికి కరోనా బాధితులు చాలా సంతోషించారు. కోలుకున్న తరువాత నాకు కృతజ్ఞతలూ తెలిపారు. వాలంటీర్ ఉద్యోగం చేస్తూ సొంత ఊరి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు. – అనిత, వాలంటీర్, శ్రీపర్రు, ఏలూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. పెళ్లి బట్టలతోనే.. లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడికే కాదు.. తామెలాంటి పరిస్థితిలో ఉన్నా సేవలను ఆపట్లేదు వాలంటీర్లు. రాజశేఖర్ నాయక్ అనే వాలంటీర్ గురించి చదివితే ఆ విషయం తెలస్తుంది. అతనిది అనంతపుర్ జిల్లా అమడగూరు మండలం, గోపాల్‌నాయక్ తండా. అతని పెళ్లి పెళ్లి ముహూర్తం, పింఛన్లను పంపిణీ చేయాల్సిన రోజు ఒకటే. పెళ్లి కోసం పింఛన్లను వాయిదా వేసుకోలేదు. అలాగని పెళ్లి ముహూర్తాన్నీ తప్పించలేదు. సొంత పని, ఉద్యోగం రెండిటినీ బ్యాలెన్స్ చేసుకున్నాడు రాజశేఖర్ నాయక్. తాళి కట్టే కార్యక్రమం ముగిసిన వెంటనే పెళ్లి బట్టల మీదే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను ఇచ్చివచ్చాడా పెళ్లికొడుకు. పని పట్ల తన అంకితభావాన్ని చాటుకున్నాడు. వ్యాధి విస్తరించకుండా నిఘా.. తమకు కేటాయించిన వార్డుల్లో, వీధుల్లో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తూ వారికి పరీక్షలు నిర్వహించే పనిలోనూ వాలంటీర్ల శ్రమను కొనియాడుతున్నారు వైద్యశాఖాధికారులు. కరోనా రోగులను చూసేందుకు సొంత కుటుంబ సభ్యులే భయపడుతున్న సమయంలో తామున్నామంటూ భరోసానిస్తున్నారు. గంట..గంటకూ వారిని పర్యవేక్షిస్తూ వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటూ.. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. వ్యాధి నియంత్రణలో అలుపెరగని పోరు కొనసాగిస్తున్నారు. ఆఖరి క్షణంలో... ఆపద్బాంధవుడై... కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా సేవలందిస్తున్నా మిగిలిన పనులనేం మరిచిపోలేదీ వాలంటీర్లు. తమ పరిధిలో ఎవరికీ ఏ సమస్య వచ్చినా ముందుంటున్నారు. పుట్టపర్తి మండలం, జగరాజుపల్లెలో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. సుమలతకు పదకొండేళ్లు ఉండొచ్చు. అయిదో తరగతి చదువుతోంది. పచ్చకామెర్ల వ్యాధితో హిమోగ్లోబిన్ 2 కంటే తక్కువకు పడిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వైద్యం కోసం స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్లింది కుటుంబం. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించడంతో దిక్కుతోచక మనోవేదనకు గురైంది సుమలత తల్లి. బిడ్డ ప్రాణం మీద ఆశ వదులుకుని ఇంట్లో పెట్టుకుంది. విషయం తెలుసుకున్న వాలంటీర్ ప్రసాద్.. అక్కడి ఎంపీడీఓ సురేష్‌కృష్ణకు సుమలత అనారోగ్యం గురించి చెప్పాడు. తక్షణమే స్పందించిన ఆ అధికారి సుమలతను పుట్టపర్తి సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రిలో చేర్పించాడు. రక్తదానంతో పాటు పలు సేవలనూ అందించాడు. సుమలత ఇప్పుడు కోలుకుంటోంది. ఆసుపత్రుల్లోనే రోగులకు ఇంటి వద్దకే సేవలు కాదు.. లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడికీ తమ సేవలను తీసుకెళ్తున్నారు వాలంటీర్లు. పొట్టి శ్రీరాములు (నెల్లూరు) జిల్లా వెంకటగిరిలో అలాంటి సంఘటనే జరిగింది. ఒక రోజు తిరుపతి ఆసుపత్రి నుంచి క్లస్టర్ ఇంచార్జి వెంకటాచలంకు ఫోన్ వచ్చింది. ‘బాబూ..నేను వీరగంగయ్యను. ప్రాణం బాలేక తిరుపతి ఆసుపత్రిలో చేరా. ఖర్చులకు డబ్బులు చాలడం లేదు. నాక్కాస్త పింఛన్ డబ్బులు తెచ్చిస్తావా?’అంటూ దీనంగా అడిగాడు ఆ వ్యక్తి. వీరగంగయ్య తిరుపతిలోని ఏ ఆసుపత్రిలో చేరాడో తెలుసుకొని వెంటనే తిరుపతికి బయలుదేరాడు వెంకటాచలం. వీరగంగయ్యకు పింఛన్ అందించాడు. తన బాధ్యతను నెరవేర్చాడు. ఆ జాబితాలో.. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ కు చెందిన ప్రభుత్వాలు ఈ వ్యవస్థ మీద అధ్యయనాన్ని మొదలుపెట్టేశాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి వంటి ఉన్నతాధికారులను ఆంధ్రప్రదేశ్ పంపించి అధ్యయనం చేయించాయి. ప్రపంచ దృష్టిలోనూ పడింది వాలంటీర్ల వ్యవస్థ. దీని పనితీరును తెలుసుకునేందుకు ఏకంగా ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ వాలంటీర్స్ (యూఎన్వీ) సంస్థ గతేడాది సెప్టెంబర్‌లో ఇక్కడి ఉన్నతాధికారులతో ఓ వెబినార్‌ను నిర్వహించింది. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు, దాని పనితీరు పట్ల ఆసక్తి చూపారు యూఎన్వీ సిబ్బంది. 19 నెలల్లోనే అద్భుతం పరిపాలనా సంస్కరణల్లో భాగంగా పాలన రాజధాని నుంచి జిల్లాకు.. జిల్లా నుంచి మండల కేంద్రానికి వచ్చింది. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుతో గ్రామానికీ, అక్కడి నుంచి నేరుగా ఇంటికే వచ్చింది. ఆ క్షణం నుంచి ఏ ప్రభుత్వ పథకమైనా.. సర్కారు సేవ ఏదైనా ఇంటికే చేరుతున్న కాలాన్ని ఆస్వాదిస్తున్నాం. ఇందులో 15,006 సచివాలయాలు భాగస్వాములయ్యాయి. 2లక్షల 47వేల 609 మంది వాలంటీర్లు పాలుపంచుకుంటున్నారు. కేవలం 19 నెలల్లోనే సాధించిన ప్రగతిగా దీన్ని నిర్వచించవచ్చు. అందుకే ఈ అద్భుతం దేశాన్నే కాదు ప్రపంచాన్నీ ఆకర్షించింది. అ«ధ్యయనాలు సాగిస్తోంది. ఆమే కాపాడింది.. కరోనాతో మా అబ్బాయి చనిపోయాడు. దాంతో మా కుటుంబాన్ని ఇల్లు వదిలి రావద్దని చెప్పారు. ఎవరమూ బయటకెళ్లకపోతే పనులెట్లా? పనుల సంగతి పక్కన పెట్టినా తిండి, తిప్పలైనా తీరాలి కదా! ఆ టైమ్‌లో ధైర్యం చెప్పి మా కుటుంబానికి కావల్సిన సరుకులు, కూరగాయలన్నీ తెచ్చిపెట్టింది మా వాలంటీర్ నాగ తులసి. ఆమె మా ఇంటికొచ్చే ధైర్యం చేయకపోతే మా గతి ఎట్లుండునో ఈ రోజుకి! ఆమె కాపాడింది మమ్మల్ని. – అన్నపూర్ణమ్మ, వైరస్‌తో మృతి చెందిన మారుతి తల్లి, బత్తలపల్లి, అనంతపురం జిల్లా ఈ టైమ్‌లో నిలబడ్డం.. కరోనా టైమ్‌లో మా వార్డ్ కుటుంబాల వాళ్లకు అండగా నిలబడ్డం నిజంగా మా పనికి న్యాయం చేసినట్టని పిస్తోంది. వార్డుల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా మమ్మల్నే సంప్రదిస్తున్నారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారికి భోజనాలు, పాలప్యాకెట్లు అందిస్తున్నాం. 30 మందికిపైగా కరోనారోగులను ఆసుపత్రిలో చేర్పించా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా రోగులకు సేవ చేస్తున్నా. – ప్రభుదాస్, వాలంటీర్, దేవనగర్, నంద్యాల, కర్నూలు జిల్లా ఎంతోమందికి.. నాది మధ్యతరగతి కుటుంబం. బీఎస్సీబీఈడీ చేసాను. కిందటేడే వాలంటీరుగా చేరాను. మా ఊళ్లో ఎంతోమందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాననే సంతృప్తి ఉంది. ఈ మధ్యే మా ఊళ్లో ఓ కుంటుంబంలోని పెద్దకు కోవిడ్ సోకి చనిపోయాడు. దహనం చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. మా సర్పంచ్ సహకారంతో మేమే అంత్యక్రియలు చేశాం. కష్ట సమయంలో తోటి గ్రామస్తులకు ఇలా అండగా నిలబడగలుగుతున్నాం. – వెంకటరమణ, వాలంటీర్, అట్టలి గ్రామం, పాలకొండ మండలం, శ్రీకాకుళం జిల్లా. కుటుంబంలో భాగమయ్యారు ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను చెరవేసేందుకు, వాటి అవగాహనను కల్పించేందుకే ఏర్పాటయిన వాలంటీర్లు వాళ్ల సేవలతో ఈ రోజు వాళ్ల వాళ్ల పరిధిలోని కుటుంబాల్లో భాగమయ్యారు. ఏ కష్టమొచ్చినా స్పందిస్తున్నారు. ఈ పాండమిక్లోనైతే అన్నీ తామై అండగా ఉంటున్నారు. – మురళీధర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సంతోషాలు నింపింది నోరు లేని... మండల కార్యాలయాల చుట్టూ తిరగలేని పేద ప్రజల ముంగిటకు ప్రభుత్వ పాలనను తెచ్చింది.. వారి జీవితాల్లో సంతోషాలను నింపిందీ వ్యవస్థ. ప్రధానంగా అనంతపురం జిల్లా వంటి వెనకబడిన ప్రాంతాలకు ఇది చాలా కావాల్సిన, ఉపయోగపడే సిస్టమ్ అని చెప్పొచ్చు. – గంధం చంద్రుడు, అనంతపురం జిల్లా కలెక్టరు ఏ సమాచారమైన అరగంటలోనే...! ఏ రాష్ట్రానికి లేనటువంటి సమాచార వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. దీనికి కారణం వాలంటీర్లే. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నా, కొత్త సంక్షేమ కార్యక్రమం అమలు చేసినా వెంటనే సచివాలయాలకు మేం పంపుతున్నాం. సచివాలయాల కార్యదర్శులతో మాకు ఒక వాట్సాప్ గ్రూపు ఉంది. ఇక్కడ ఉన్న సిబ్బంది ఆయా గ్రామాల్లోని వాలంటీర్లకు చేరవేస్తున్నారు. వారు తమ పరిధిలో ఉన్న 50 కుటుంబాలతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమచారాన్ని వారు వాట్సాప్ గ్రూపులో పెడుతున్నారు. ఒకవేళ ఎవరికైనా స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఎస్సెమ్మెస్ చేస్తున్నారు. దీనివల్ల కేవలం అరగంటలోనే రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వ సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజులోనే 6 లక్షల వ్యాక్సిన్లు వేయగలిగామంటే కేవలం ఈ సిస్టమ్ వల్లే. – అజయ్‌జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సెక్రటేరియట్ మరియు వాలంటీర్ల శాఖ – కె.జి. రాఘవేంద్రారెడ్డి ఇన్పుట్స్: సాక్షి ఏపీ నెట్వర్క్ -
శభాష్ వలంటీర్... సేవా సైన్యం..
అది కృష్ణా జిల్లా వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని వరలక్ష్మీపురం, తులసీ నగర్ ప్రాంతం. అక్కడ మొత్తం 123 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందులో మెజారిటీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులవే. అక్కడి వలంటీరు ఇంటింటి సర్వేకి వెళితే వలంటీర్ల సేవలు మాకేమీ వద్దంటూ వారి వివరాలు కూడా ఇవ్వలేదు. అయినా వలంటీర్ తన పని తాను చేసుకుంటూ పోయారు. ముఖ్యంగా కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా వలంటీర్లు అందిస్తున్న సేవలు చూసి ఆ ప్రాంతంలోని తెలుగుదేశం కుటుంబాలు విస్తుపోయాయి. వారిలో మార్పు వచ్చింది. తమ వివరాలు వారే స్వయంగా వలంటీర్‌కు అందజేశారు. ఇప్పుడు తమకు ఏ సమాచారం కావాలన్నా, ప్రభుత్వానికి సంబంధించి ఏ పని ఉన్నా వలంటీర్‌కు ఫోన్ చేస్తున్నారు. వలంటీర్లంటే జన్మభూమి తమ్ముళ్ల మాదిరిగా ఉంటారనుకుని పొరపాటుపడ్డామని ఒకరిద్దరు వ్యాఖ్యానించారు. వ్యవస్థలో వస్తున్న మార్పునకు ఇదో సూచిక.. అది గుంటూరు జిల్లా ఈపూరు మండలం అంగలూరు గ్రామం. ఈ గ్రామంలో నివాసముంటున్న పదర నాగేశ్వరరావు కుటుంబానికి అమ్మ ఒడి డబ్బు రెండుసార్లు అందింది. రైతు భరోసా పథకానికి కూడా అర్హత ఉండడంతో స్థానిక రైతు భరోసా కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా వలంటీర్ సమాచారమిచ్చారు. నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. ఇటీవలి ఎంపీటీసీ – జెడ్పీటీసీ ఎన్నికలలో ఆయన పోటీ చేశారు కూడా. ఎవరు ఏ పార్టీకి చెందినవారు అనే దానితో నిమిత్తం లేకుండా అర్హతే ప్రమాణంగా ప్రభుత్వ పథకాలు అందరికీ చేరుతున్నాయనేందుకు ఇదో ఉదాహరణ.. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ల వ్యవస్థ అద్వితీయమైన సేవలందిస్తోంది. అనతికాలంలోనే దేశం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానసపుత్రిక ఇది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే 2.66 లక్షల మంది వలంటీర్ల నియామకాన్ని చేపట్టి వారికి నిర్దిష్టమైన బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు అనుసంధానంగా వలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారమైనా.. సెలవు రోజైనా.. ఎండైనా, వానైనా లెక్క చేయకుండా వలంటీర్లు పూర్తి సేవా దృక్పథంతో విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. కులమతాలు, రాజకీయాలు, ప్రాంతాలు, పార్టీలు, పైరవీలు, లంచాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరుతున్నాయి. సంతృప్తస్థాయిలో లబ్ధిదారులకు అందుతున్నాయి. గడచిన రెండేళ్లలో 31 రకాల సంక్షేమ పథకాల ద్వారా రూ.1.25 లక్షల కోట్లు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లబ్ధిదారులకు చేరాయి. ఎక్కడా ఎలాంటి విమర్శలకు తావులేదు. లబ్ధిదారుల ఎంపిక మొదలు, ప్రభుత్వ సహాయం వారికి చేరే వరకు అంతా పారదర్శకమే. ప్రభుత్వ సమాచారం.. గంటలోనే అందరికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి వంద ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. ► వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకున్నా, ప్రకటించినా కేవలం గంట వ్యవధిలోనే రాష్ట్రంలోని ప్రజలందరికీ చేరుతోంది. ప్రతి వలంటీరు తమ పరిధిలోని కుటుంబాలన్నింటితో వాట్సాప్, టెలిగ్రామ్‌లతో అనుసంధానమై ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం కేవలం 5 నిమిషాల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు చేరిపోతోంది. గ్రామ, వార్డు సచివాలయాలు ఆ సమాచారాన్ని వెంటనే వలంటీర్లకు చేరవేస్తున్నాయి. ఆ తర్వాత ఆ సమాచారం రాష్ట్రంలోని 1.48 లక్షల కుటుంబాలకు చేరిపోతుంది. స్మార్ట్ ఫోను లేని కుటుంబాలకు వలంటీర్లు నేరుగా వెళ్లి తెలియజేస్తున్నారు. ► కరోనా విపత్తు నేపథ్యంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జ్వరాలతో బాధపడే వ్యక్తులను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, కేవలం మూడు రోజుల వ్యవధిలో జర్వాలతో బాధపడే వారిని గుర్తించడంతో పాటు, వారందరికీ కరోనా టెస్టు చేయించే ప్రక్రియ పూర్తి చేశారు. ► వలంటీర్ల వ్యవస్థ కారణంగా అందరికీ సమాచారాన్ని తెలియజేసి ఒకే రోజు రాష్ట్రంలో 6.28 లక్షల మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలే గానీ, రాష్ట్రంలోని 5 కోట్ల మందికి కేవలం నెల రోజుల వ్యవధిలో ఒక విడత వ్యాక్సినేషన్ పూర్తి చేసే సామర్థ్యం వలంటీర్ల వ్యవస్థకు ఉందని అధికారులు తెలిపారు. గడప వద్దకే ప్రభుత్వ సేవలు.. ఒకప్పుడు ప్రభుత్వంతో ఏ చిన్న పని ఉన్నా మండలాఫీసుల చుట్టూనో, జిల్లా కార్యాలయాల చుట్టూనో తిరగాల్సిన పరిస్థితి. వలంటీర్లు వచ్చిన తర్వాత ఆ తిప్పలు తప్పాయి. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేస్తున్నా.. వలంటీరే ఆ వివరాలు ప్రతి ఇంటికి వచ్చి చెప్పి, ఆ కుటుంబంలో ఎవరన్నా ఆ ప్రభుత్వ పథకానికి అర్హులై ఉంటే వారే దరఖాస్తు కూడా పూర్తి చేసి, మంజూరయ్యాక ఆ వివరాలు చెప్పి వెళ్తున్నారు. ► అర్హత ఉంటే, దరఖాస్తు చేసుకున్న 21 రోజుల కల్లా పింఛను, రేషన్‌కార్డు, ఆరోగ్య శ్రీ కార్డును వలంటీరే దగ్గర ఉండి మంజూరు చేయిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టా మంజూరు చేస్తున్నారు. ► ఒకప్పుడు అవ్వాతాతలు ప్రతి నెలా వారి పింఛన్ డబ్బులు తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చేదో.. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ డబ్బులిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు.. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ పనితీరుపై జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ► కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందాలు వేర్వేరుగా మన రాష్ట్రంలో పర్యటించి వలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి వెళ్లాయి. ► పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా వలంటీర్ల వ్యవస్థ గురించి ఏపీ ప్రభుత్వం నుంచి సమాచారం అడిగి తీసుకున్నాయి. తమ రాష్ట్రాలలోనూ అమలు చేయడానికి అధ్యయనం చేస్తున్నారు. ► వలంటీర్ల వ్యవస్థ ద్వారా కరోనా సమయంలో వేగంగానూ, కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని సేకరించిన తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. ► అంతర్జాతీయంగానూ ఐక్యరాజ్యసమితి అనుబంధంగా పనిచేసే యూఎన్ వలంటీర్ల విభాగం రాష్ట్రంలో అమలు చేస్తున్న వలంటీర్ల వ్యవస్థ పనితీరు నచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. సేవలకు తగిన గుర్తింపు.. వలంటీర్లు అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 12న ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించారు. మూడు కేటగిరీలలో మొత్తం 2,22,990 మంది గ్రామ, వార్డు వలంటీర్లను ప్రభుత్వం సత్కరించింది. మొత్తం రూ.228.74 కోట్ల నగదు బహుమతితో పాటు అవార్డులు అందించింది. ఈ కార్యక్రమం ప్రతి ఏడాదీ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వలంటీర్లు అందిస్తున్న సేవలివీ.. వలంటీర్లు అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 32 రకాల సేవలకు సంబంధించి వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతీ నెల మొదటి రోజే ఇంటింటికీ వెళ్లి సామాజిక పింఛన్లను పంపిణీ చేయడం, సంక్షేమ పథకాల కోసం నవశకం ద్వారా లబ్ధిదారులను గుర్తించడం, కోవిడ్–19 నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే (ఇప్పటికి ఐదుసార్లు పూర్తిచేశారు), మాస్క్‌లు, మందులు, నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం, దిశ చట్టంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, గ్రామ, వార్డు సచివాలయాలకు సహాయ సహకారాలు అందించడం, ప్రధానంగా బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు, పెన్షన్ కానుక, ఇళ్ల స్థలాల పట్టాలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం, జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ బీమా, పారిశుధ్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించడంలాంటి కార్యక్రమాలను గ్రామ, వార్డు వలంటీర్లు నిర్వహిస్తున్నారు. రీస్టార్ట్‌తో తప్పిన కష్టాలు నేను, నా భర్త నాలుగేళ్ల క్రితం బూదవాడలో హర ఎక్స్‌పోర్ట్స్ పేరుతో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ను రూ.1.50 కోట్లతో ప్రారంభించాం. 14 మంది పని చేస్తున్నారు. రాయితీ కోసం గత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా మంజూరు చేయలేదు. కరోన వల్ల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ పథకం మమ్మల్ని గట్టెక్కించింది. 2020లో రూ.22.91 లక్షలు, విద్యుత్ రాయితీ రూ.17 లక్షలు విడుదలైంది. దీంతో కష్టాలు తప్పాయి. – నుసుం సుజాత, బూదవాడ, ఒంగోలు ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ కోవిడ్–19 లాక్‌డౌన్‌తో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)పరిశ్రమలను ఆదుకోవడానికి వైఎస్ జగన్ రూ.1,100 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించారు. జగన్ పుణ్యమా అని.. నేను ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణిని. నా భర్త కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ (ప్రీ ప్రై మరీ) కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద అందిస్తున్న బలవర్థక ఆహారం నా లాంటి పేదోళ్లకు ఉపయోగ పడుతోంది. – తిరుమలశెట్టి శాంతి, చెన్నూరు హరిజనవాడ–3, గూడూరు రూరల్, నెల్లూరు జిల్లా వైఎస్సార్ సంపూర్ణ పోషణ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్థకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను అమలు చేస్తోంది. నిలదొక్కుకుంటున్నాం నేను న్యాయవాది కావాలని, మా కుటుంబానికి అండగా ఉండాలని ‘లా’ చదివి 2018 నుంచి న్యాయవాదిగా కాకినాడ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. జూనియర్ న్యాయవాదిగా ఉండడంతో ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం కింద 2019 డిసెంబర్ నుంచి ప్రతి నెలా రూ.5 వేల స్టైఫండ్ వస్తోంది. సీఎం జగనన్న పాదయాత్రలో మాకు ఇచి్చన హామీని నెరవేర్చినందుకు జూనియర్ న్యాయవాదులందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ స్టైఫండ్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – సాదే విష్ణు ప్రసన్న కుమారి, వాకలపూడి, కాకినాడ రూరల్ మండలం, తూ.గో వైఎస్సార్ లా నేస్తం న్యాయవాద వృత్తిలోకి కొత్తగా వచ్చి, ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ న్యాయవాదులను ఆదుకుంటానని ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 డిసెంబర్ 3న ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మూడేళ్లు, అంతకన్నా తక్కువ ప్రాక్టీస్ ఉన్న యువ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల స్టైఫండ్ చెల్లిస్తారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం యువ న్యాయవాదులకు నెల నెలా ఇలా స్టైఫెండ్ ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి. దాదాపు 1,600 మంది యువ న్యాయవాదులు ఈ పథకం కింద ప్రతి నెలా లబ్ధిపొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.12.24 కోట్లు వెచ్చిందింది. కాగా, న్యాయవాదుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.100 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రూ.25 కోట్లు బార్ కౌన్సిల్‌కు ఇచ్చింది. వైద్యం తర్వాతా సాయం నేను కూలి పనులు చేసుకుంటూ, వితంతు పింఛన్ సాయంతో జీవనం సాగిస్తుండేదానిని. నా భర్త మృతి చెందాడు. ఒక్కగానొక్క కూతురికి వివాహం చేశాను. ఈ నేపథ్యంలో గత ఏడాది జనవరిలో పక్షవాతం వచ్చింది. దీంతో ఏమి చేయాలో తోచలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. మా ఊరికి చెందిన వారు నన్ను విజయవాడ తీసుకెళ్లి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పది రోజుల పాటు ఉచితంగా చికిత్స అందించారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లాక నేను ఇబ్బంది పడకుండా ప్రతి నెలా రూ.5 వేల చొప్పున ఆరు నెలల పాటు మొత్తంగా రూ.30 వేలు సాయం అందించారు. ఇది నా జీవనానికి ఎంతో భరోసా ఇచ్చింది. సీఎం జగన్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటా. – బి.సీతమ్మ, పురిటిగడ్డ, చల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కుటుంబ పెద్ద ఏదైనా జబ్బుకు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందాక కొంత కాలం పాటు పనులు చేసుకోలేడు. దీంతో ఆ కుటుంబ పోషణ కష్టమవుతుంది. ఈ విషయంలో రోగులకు సహాయంగా ఉండేందుకు 2019 డిసెంబర్ 1న ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకం ప్రారంభించింది. చికిత్స అనంతరం రోగి కోలుకునే వరకు వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున, లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు చొప్పున సహాయం చేస్తోంది. అర్చకులకు తోడ్పాటు ఊళ్లో ఆంజనేయ స్వామి ఆలయ అర్చకునిగా పని చేస్తున్నాను. ఈ ప్రభుత్వం అర్చకులకు తగిన గౌరవం ఇస్తూ.. వారి బాగోగుల పట్ల దృష్టి సారించింది. అర్చకుల వంశ పారంపర్యం హక్కును పునరుద్ధరించింది. కనీస గౌరవ వేతనాల్ని పెంచింది. – వైపీ ఆంజనేయులు, బసినేపల్లి, సీకే పల్లి మండలం, అనంతపురం జిల్లా మాకు మంచి రోజులు ఇమామ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో కుటుంబ పోషణ చాలా భారంగా ఉండేది. ప్రస్తుతం ఎంతో హుందాగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మౌజన్లు, ఇమామ్‌లకు గౌరవ వేతనాన్ని పెంచి, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసింది. కరోనా సమయంలోనూ సాయం చేసింది. – హాఫిజ్ షబ్బీర్ అహమ్మద్, ఫిర్దోస్ మస్జిద్, పాతూరు, అనంతపురం పాస్టర్లకు భరోసా ఎంతో మంది పాస్టర్లు పేదరికంలోనూ సేవలందిస్తున్నారు. మా ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేలు వేతనం ఇస్తుండటం చాలా సంతోషం. దీంతో చర్చిలో మరింత సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం మాకూ భరోసా కల్పించింది. – మనుష్యే, రేమా చర్చి పాస్టర్, అనంతపురం అర్చకులు, ఇమామ్‌లు, మౌజన్లు, పాస్టర్లకు ఆర్థిక సహాయం ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ఆలయాలు, మసీదులు, చర్చిలో పనిచేసే సిబ్బందికి గౌరవ వేతనాలను పెంచింది. లాక్డౌన్లో ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33,083 మంది అర్చకులకు, 13,646 మంది ఇమామ్, మౌజన్లకు, 29,841 మంది పాస్టర్లకు మొత్తం రూ.37.71 కోట్లను పంపిణీ చేసింది. వివక్ష చూపకుండా సాయం నా భర్త బొబ్బిలి రమణ పామాయిల్ తోటలో గెలలు కోస్తుండగా కత్తి జారి తలపై పడి మెదడుకు తీవ్ర గాయం కావడంతో 2020 డిసెంబర్ 1న మరణించాడు. దీంతో మా కుటుంబం ఛిన్నాభిన్నమైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న మమ్మల్ని వైఎస్సార్ బీమా పథకం ఎంతో ఆదుకుంది. మా కుటుంబం టీడీపీకి మద్దతుగా ఉంటున్నప్పటికీ ఎటువంటి వివక్ష చూపకుండా రూ.5 లక్షల పరిహారం మంజూరు చేశారు. – బొబ్బిలి సన్యాసమ్మ, రైవాడ, దేవరాపల్లి మండలం, విశాఖ జిల్లా వైఎస్సార్ బీమా కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులనే ఖర్చు పెట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో 1.32 లక్షల (బియ్యం కార్డు ఉన్న) కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం అమలు చేస్తోంది. -
దేశమంతా మనవైపే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాలను ఇప్పుడు దేశం మొత్తం అనుసరించే పరిస్థితి ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. వలంటీర్ల వ్యవస్థ ప్రధానితో సహా దేశంలో అందరి ప్రశంసలు పొందిందని చెప్పారు. సోమవారం పోరంకిలో జరిగిన వలంటీర్ల సత్కారాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాలకు వారి ఎమ్మెల్యే పేరు తెలుసో లేదో కానీ వలంటీరు పేరు, ఫోను నంబరు మాత్రం కచ్చితంగా తెలిసేలా ప్రజలకు దగ్గర అయ్యారని చెప్పారు. సీఎం జగన్ కొత్త వ్యవస్థలను సృష్టించి ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని చేరువ చేశారని ఎమ్మెల్యే కె.పార్థ్ధసారథి పేర్కొన్నారు. ఏ బాధ్యత ఇచ్చినా మీ వెంటే.. నా 50 కుటుంబాల పరిధిలో 89 ఏళ్ల అవ్వ ఉంది. గతంలో ప్రతి నెలా ఇంటి నుంచి ఆటోలో పంచాయతీ ఆఫీసు దాకా వెళ్లి పింఛన్‌కు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. వలంటీర్ల వ్యవస్థ వచ్చాక ప్రతి నెలా 1వ తేదీన సూర్యోదయం కంటే ముందే ఇంటికి వెళ్లి చేతికి పింఛను డబ్బులు అందచేస్తున్నప్పుడు నా మనవడివి అంటూ చూపే ప్రేమ, ఆప్యాయత మరిచిపోలేనిది. అలాంటి ఆనందాన్ని ఇచ్చిన సీఎం గారికి ధన్యవాదాలు. మీరే మరో 40 ఏళ్లు సీఎం. మీరు ఏ బాధ్యత ఇచ్చినా మీతోనే నడుస్తాం. –బి.వరసతీష్, వలంటీరు, యనమలకుదురు కన్నబిడ్డలా చూసుకుంటున్నారు ఉదయం పింఛను డబ్బులు పంపిణీ చేయాల్సి ఉండగా ముందు రోజు రాత్రి 12 గంటలకు నాకు ఓ ఫోను కాల్ వచ్చింది. ఆసుపత్రిలో ఉన్నానని లబ్ధిదారుడు చెప్పడంతో మా అన్నయ్యతో కలిసి అక్కడకు వెళ్లి పింఛను డబ్బులిచ్చినప్పుడు ఆ కుటుంబం చూపిన ఆప్యాయతను మరువలేను. గతంలో రేషన్‌కార్డు కోసం ఐదేళ్ల పాటు తిరిగి వేసారిన ఓ కుటుంబానికి ఇప్పుడు 2 గంటల్లోనే కార్డు అందించడంతో ఎంతో సంతోషించింది. మా ద్వారా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పాలని ఆ కుటుంబం కోరింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తుంటే చాలా కుటుంబాలు కృతజ్ఞతలు చెబుతున్నాయి. నా క్లస్టర్లో ప్రతి కుటుంబం నన్ను కన్నబిడ్డలా ఆదరిస్తోంది. పండుగకు నాకు దుస్తులు కూడా బహూకరించారు. దీనికి కారణమైన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. –కె.సుష్మ, వలంటీరు. -
పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. అయినప్పటికీ: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు.. అవును నిజమే.. తమ బాధ్యతను తాము సక్రమంగా నెరవేరుస్తున్న వారినే చాలా మంది టార్గెట్ చేస్తారు. సేవా భావంతో ముందుకు సాగుతున్నా.. వారిపై నిందలు వేసే ప్రయత్నం చేస్తారు. అయితే, వాటన్నంటిని తట్టుకుని నిలబడినపుడే మనం చేస్తున్న పనులకు మరింత సార్థకత చేకూరుతుంది. ఫలితం ఆశీర్వాదాల రూపంలో ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, అఖండ విజయం సాధించి, అధికారం చేపట్టిన ఆయన రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టడం సంక్షేమ పాలనను కొత్తపుంతలు తొక్కిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. వివిధ పథకాలను ఇంటి గడప వద్దే ప్రజలకు అందించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మహమ్మారి కోవిడ్-19 ప్రబలుతున్న సమయంలోనూ సేవలు అందించారు. ఈ క్రమంలో, వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉగాది సందర్భంగా నేటి నుంచి వారిని సత్కరించి, అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృష్ణాజిల్లాలోని పోరంకిలో సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వలంటీర్ల వ్యవస్థపై విష ప్రచారం చేస్తున్న పచ్చ మీడియా తీరుపై తనదైన శైలిలో స్పందించారు. వారి పాపానికి వారిని వదిలేయండి ‘‘గొప్ప సేవాభావంతో పనిచేస్తున్న వలంటీర్ వ్యవస్థ మీద కూడా కొన్ని సందర్భాలల్లో ఎల్లో మీడియా గానీ, ప్రతిపక్షంలోని కొంత మంది నాయకులు గానీ అవాకులు, చెవాకులు మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా కూడా మీ జీవితాలల్లో మీరు క్రమశిక్షణతో మెలిగినంతకాలం ఎలాంటి విమర్శలకు కూడా వెరవవద్దు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. పండ్లున్న చెట్టు మీదనే రాళ్ల దెబ్బలు పడతాయి. కాబట్టి, వాళ్లు, మిమ్మల్ని ఏదో అంటున్నారని వెనకడుగు వేయవద్దు. వారి పాపానికి వాళ్లను వదిలేయండి. వారి కర్మకు వారిని వదిలేయండి. ధర్మాన్ని మీరు నెరవేర్చండి. ప్రభుత్వం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని నేను సందర్భంగా మరోసారి చెబుతున్నా’’ అంటూ సీఎం జగన్ వలంటీర్లలో స్ఫూర్తి నింపారు. చదవండి: గ్రామ, వార్డు వలంటీర్లకు సెల్యూట్: సీఎం జగన్ ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు -
ఏపీలో వలంటీర్ల విశేష కృషికి ధన్యవాదాలు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వలంటీర్ల వ్యవస్థ చేసిన విశేష కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ వలంటీర్ల వ్యవస్థ కృషిని ప్రస్తావించారు. భవిష్యత్తు ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ఇదే సరైన సమయమని డాక్టర్ బీవీ సత్యవతి చేసిన సూచన బాగుందన్నారు. అంతకుముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. కరోనా సంక్షోభ సమయంలో ఏపీలో గ్రామ వలంటీర్ల వ్యవస్థ చేసిన కృషిని వివరించారు. భవిష్యత్తు వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. దిశ చట్టం కార్యరూపం దాల్చేలా చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం కార్యరూపం దాల్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగ గీత కేంద్రాన్ని కోరారు. జువైనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) అమెండ్మెంట్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఓ దుర్ఘటన నేపథ్యంలో ఓ సోదరుడిగా స్పందించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ బిల్లుకు రూపకల్పన చేశారని చెప్పారు. గర్భిణులకు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా అంగన్వాడీ సెంటర్లలో తరగతులు బోధించేందుకు సైకాలజిస్టులను అందుబాటులోకి తేవాలని సూచించారు. అనంతరం ఈ చర్చకు సమాధానమిచ్చిన స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతీ ఇరానీ మాట్లాడుతూ సైకాలజిస్టుల ద్వారా గర్భిణులు, పిల్లలకు శిక్షణ ఇప్పించాలని వంగ గీత చేసిన సూచనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సరికాదు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయం కాదని వైఎస్సార్ సీపీ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ప్లాంట్‌ను నష్టాల నుంచి తొలగించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. -
పల్లెపల్లెన 'ప్రకాశం'.. సంక్షేమ వికాసం
గతం: జిల్లా పేరులోనే ప్రకాశం. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం చీకట్లే. కరువు విలయతాండవం చేసేది. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ఖాళీ అయిన గ్రామాలెన్నో. పొట్ట చేతపట్టుకుని పట్టణాలకు వలస వెళ్లినవారు ఎందరో. సాగునీరు దశాబ్దాలకు ఒకసారి అందేది. అభివృద్ధి జాడ కనిపించేది కాదు. ప్రాజెక్టుల పనులు సాగవు. ప్రజలకు సంక్షేమ పథకాలు అంతంతమాత్రంగానే అందేవి. వర్తమానం: జిల్లా ప్రకాశిస్తోంది. జలవనరులు కళకళలాడుతున్నాయి. తాగునీరు సమృద్ధిగా ఉంది. గ్రామాల్లో నిరంతరం పనులు లభిస్తున్నాయి. సాగునీరు అందుతోంది. పొలాలు పైర్లతో పచ్చగా కనిపిస్తున్నాయి. ప్రగతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రాజెక్టుల పనులు పరుగులు పెడుతున్నాయి. సంక్షేమ పథకాల ఫలాలు ఇంటివద్దకే వస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తరువాత ప్రకాశం జిల్లాలో గ్రామ స్వరాజ్యం వచ్చింది. జిల్లాలోని 1,038 గ్రామ పంచాయతీల్లో సచివాలయ వ్యవస్థ ఏర్పాటైంది. దీనికితోడు వలంటీర్ వ్యవస్థ ఉండటంతో సంక్షేమ పాలన ఇంటిముందుకే వచ్చింది. పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు గాసే పరిస్థితి నుంచి విముక్తి లభించింది. వలంటీర్లు లబ్ధిదారుల చేతికి ఒకటో తేదీనే డబ్బు అందిస్తున్నారు. జిల్లాలో గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. బాగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. సాగర్ నీళ్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 952 సాగు నీటి చెరువులుండగా 800కు పైగా చెరువులు నిండు కుండల్లా మారాయి. ఆరు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలో పదిలక్షలకు పైగా ఎకరాల్లో పైర్లు పచ్చగా కనిపిస్తున్నాయి. గ్రామీణులు వలసలు మానుకుని పాడి, పంటలతో సంతోషంగా జీవిస్తున్నారు. వరుణుడి కరుణతో గత సంవత్సరం పండినట్లే ఈ ఏడాది కూడా పంటలు బాగా పండుతాయని అంచనా వేస్తున్నారు. యర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో నాడు–నేడు డెమో స్కూల్ ప్రతి గ్రామానికి తాగునీరు ప్రకాశం జిల్లాలోని అనేక గ్రామాల్లో తాగడానికి గుక్కెడు నీళ్లులేక ఊళ్లకు ఊళ్లు ఖాళీచేసి వలసలు వెళ్లిన దుర్భర పరిస్థితిని గుర్తించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీన్లో భాగంగా కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లోని 500 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.833 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయి. రూపుమారిన పాఠశాలలు నాడు–నేడు కింద చేపట్టిన పనులతో జిల్లాలో పాఠశాలలు కొత్తరూపు సంతరించుకున్నాయి. తొలిదశగా 1,387 పాఠశాలల్లో ఈ పనులకు రూ.328.19 కోట్లు కేటాయించారు. ఇప్పటికే అనేక పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. రూ.220 కోట్లు వెచ్చించారు. మార్చి నెలాఖరుకు పనులు పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తరగతి గదుల్ని తీర్చిదిద్దారు. విద్యార్థులు భోజనాలు చేసేందుకు వసతులు సమకూర్చారు. అనేక పాఠశాలలకు ప్రహరీలు నిర్మించారు. ఆవరణలు పచ్చగా కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో వేగంగా అభివృద్ధి జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం వడివడిగా సాగుతోంది. తొలివిడతలో 871 గ్రామ సచివాలయాలకు భవనాలు మంజూరయ్యాయి. వీటికి రూ.333 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 877 రైతుభరోసా కేంద్రాల భవనాల నిర్మాణానికి రూ.194 కోట్లు కేటా యించారు. అదేవిధంగా 744 వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి రూ.121 కోట్లు మంజూరు చేశారు. మొత్తం భవనాల్లో 40 శాతానికిపైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. గ్రామ సచివాలయాల్లో 9,533 మంది సిబ్బంది పనిచేస్తుండగా 19,288 మంది వలంటీర్లు ఒక్కొక్కరు 50 ఇళ్లకు సేవలు అందిస్తున్నారు. బియ్యం, రేషన్ సరుకులు లబ్ధిదారుల ఇంటివద్దే పంపిణీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు.. పథకంలో భాగంగా జిల్లాలో 1.39 లక్షలమందికి ఇంటిస్థల పట్టాలు, ఇల్లు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే అధిక శాతం మందికి పట్టాలు పంపిణీ చేశారు. కోర్టు పరిధిలో ఉన్న వాటికి మాత్రం భరోసా పత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం పథకాలు ప్రయోజనకరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఇంటికే తెచ్చి డబ్బు చేతిలో పెడుతున్నారు. జనగనన్న కాలనీలో నాకు స్థలం వచ్చింది. ఇంటి ముందే బియ్యం, సరుకులు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ఉండటానికి ఇల్లు, తింటానికి తిండి, నేను బతికేందుకు డబ్బులు అన్ని వస్తున్నాయి. – షేక్ షకినాబీ, పంగులూరు 70 మంది పిల్లలు వస్తున్నారు 50 కుటుంబాలున్న మా గ్రామంలో 22 మంది బడి ఈడు పిల్లలున్నారు. మాగ్రామంలోని పాఠశాలలో వసతులు ఉండేవి కావు. పిల్లలందరినీ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలకు పంపించేవాళ్లం. నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలో రూ.30 లక్షలతో వసతులు సమకూర్చారు. ఇప్పుడు మా బడిలో 70 మంది విద్యార్థులున్నారు. పక్కూరు నుంచి కూడా పిల్లలొస్తున్నారు. – ఇరగనబోయిన గోపి, విద్యార్థి తండ్రి, చెర్లోపల్లె, రాచర్ల మండలం -
కర్నూలు పల్లెల్లో పనుల సందడి
సీ బెళగల్ మండలం పోలకల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మన బడి నాడు–నేడు కింద కార్పొరేట్ స్కూలు రూపు సంతరించుకుంది. ఇప్పటివరకు ప్రహరీ లేకపోవడంతో ఆవరణలో పశువులు, పందుల సంచారం కనిపించేది. పైకప్పు పాడవడంతో నాలుగు చినుకులు పడినా తరగతి గదుల్లోకి నీరు వచ్చేది. ప్రభుత్వం ఈ పాఠశాల అభివృద్ధికి రూ.98 లక్షలు కేటాయించింది. ప్రహరీ, తరగతి గదులు నిర్మించారు. బల్లలు, టేబుళ్లు, సమకూర్చారు. ఆటస్థలం, పార్కు, అనేక ఆటవస్తువులు ఏర్పాటు చేయడంతో ఈ పాఠశాల అందరినీ ఆకట్టుకుంటోంది. కోసిగి మండలం దుద్ది గ్రామంలోని బీసీ కాలనీలోకి గతంలో అడుగుపెట్టాలంటేనే భయం వేసేది. కాలనీలో డ్రైనేజీ సౌకర్యం లేక మురుగు నీరంతా రోడ్లపై పారి వీధులన్ని దుర్గంధంగా తయారయ్యేవి. ఆ దారిలో వెళ్లేవాళ్లు ముక్కు మూసుకోవాల్సిందే. మురుగునీరు వీధుల్లో చేరడంతో స్థానికులు తరచు అనారోగ్యాలకు గురయ్యేవారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ప్రతి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించడంతో బీసీ కాలనీలోని రోడ్లు, డ్రైనేజీకి మోక్షం లభించింది. ప్రస్తుతం ఈ కాలనీల్లో రూ.15 లక్షలు వెచ్చించి సీసీ రోడ్లు వేశారు. కర్నూలు (అర్బన్): రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కర్నూలు జిల్లాలోని పల్లెపల్లెలో అభివృద్ధి కుసుమాలు వికసిస్తున్నాయి. దశాబ్దాలుగా ఎవరికీ పట్టని గ్రామసీమలు ప్రగతిపథంలో సాగుతున్నాయి. గ్రామ సచివాలయ, వలంటీరు వ్యవస్థలతో ప్రజల సమస్యలన్నీ వెంటనే తీరుతున్నాయి. గ్రామాల్లో రూ.779.42 కోట్లతో కార్యాలయాల భవనాల నిర్మాణం జరుగుతోంది. దీన్లో రూ.350 కోట్లతో చేపట్టిన 876 గ్రామ సచివాలయ భవన నిర్మాణాల్లో 343 భవనాలు పూర్తయ్యాయి. రూ.184.42 కోట్లతో చేపట్టిన 845 రైతుభరోసా కేంద్ర భవనాల్లో 53 నిర్మాణాలు పూర్తవగా 81 శ్లాబ్ దశకు చేరుకున్నాయి. రూ.110 కోట్లతో 634 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం ప్రారంభించగా 56 పూర్తయ్యాయి. రూ.135 కోట్లతో 823 పాలశీతల కేంద్ర భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రూ.15 కోట్ల వంతున కర్నూలు మినహా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో మొత్తం రూ.195 కోట్లతో సీసీ రోడ్లు వేస్తున్నారు. అన్ని గ్రామాల్లోను పనులు సాగుతుండటంతో అందరికీ పనులు లభిస్తున్నాయి. కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలోని 611 వైఎస్సార్ జగనన్న లేఅవుట్లలో 75,774 ఇళ్లు నిర్మించనున్నారు. రూ.325.14 కోట్లతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు జిల్లాలోని 1,080 ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి విడతగా రూ.325.14 కోట్లతో 9 రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. తాగునీరు, మరుగుదొడ్లు, పెయింటింగ్స్, ఇంగ్లిష్ ల్యాబ్ తదితర 7,827 పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.72.23 కోట్లు వ్యయం కాగా 2,243 పనులు పూర్తయ్యాయి. 261 పాఠశాలల్లో రూ.100 కోట్లతో ప్రహరీల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికి 100 పాఠశాలల ప్రహరీ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పాఠశాలల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పాఠశాల రూపురేఖలు మారిపోయాయి రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు విడుదల చేయడం వల్ల మా ఊళ్లో పాఠశాల అభివృద్ధి సాధ్యమైంది. దశాబ్దాల కిందట నిర్మించిన పాఠశాలలోని పలు గదులు కూలిపోయేందుకు సిద్ధంగా ఉండేవి. ప్రభుత్వం రూ.98 లక్షలు నిధులు విడుదల చేయడంతో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో పాఠశాలను ఆధునికీకరించారు. ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన సాగుతోంది. – గోవిందు, పాఠశాల కమిటీ చైర్మన్, పోలకల్, సీ బెళగల్ మండలం సీసీ రోడ్డు వేయడం సంతోషంగా ఉంది ఆరునెలల కిందటి వరకు బీసీ కాలనీలోని వీధులు పూర్తి అపరిశుభ్రంగా ఉండేవి. మురికినీరంతా వీధుల్లో ప్రవహించడం వల్ల దుర్గంధభరితంగా మారి.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఇతోధికంగా నిధులు విడుదల చేయడం వల్ల మురికికూపాలుగా ఉన్న వీధులన్నీ నేడు సీసీ రోడ్లతో కళకళలాడుతున్నాయి. బీసీ కాలనీలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు వేయడంతో కాలనీ ప్రజలు సంతోíÙస్తున్నారు. – నాగరాజు, దుద్ది గ్రామం, కోసిగి మండలం మార్చి నాటికి పూర్తిచేసేలా చర్యలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలను మార్చి చివరి నాటికి దాదాపు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాం. ఎన్నికల నియమావళి ఉన్న కారణంగా పాలశీతల కేంద్ర భవన నిర్మాణాలను కోడ్ ముగిసిన అనంతరం చేపడతాం. మార్చి నాటికి రూ.300 కోట్లు వ్యయం చేసేందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేస్తున్నాం. – కె.సుబ్రమణ్యం, పంచాయతీరాజ్ ఎస్ఈ -
సీఎం జగన్‌కి క్షమాపణలు చెప్తున్నాం: వలంటీర్లు
సాక్షి, విజయవాడ: జీతాలు పెంచాలంటూ ఆందోళన చేస్తోన్న వలంటీర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ లేఖపై వలంటీర్లు స్పందించారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తుల ప్రలోభాల వలన కొందరు వలంటీర్లు అలా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వలంటీర్లు మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ రోజు మేము వినతిపత్రం ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాము. విజయవాడలో జరిగిన ఘటనలో మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. వలంటీర్లు అందరి తరుపున సీఎం జగన్‌కి క్షమాపణలు చెబుతున్నాము’’ అన్నారు. ‘‘సీఎం జగన్ వలంటీర్లుకు రాసిన లేఖ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. దీని ద్వారా ఆయన మాకు క్లారీటీ ఇచ్చారు. గతంలో ప్రతి రోజు ఆఫీసుకి రావాలి.. లేకపోతే మీ జీతాలు కట్ అవుతాయి అని చెప్పేవారు. అయితే సీఎం రాసిన లేఖ ద్వారా మా విధివిధానాలు తెలుసుకున్నాం. వారానికి రెండు, మూడు రోజులు మాత్రమే సేవ చేయ్యండని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రజలకు సేవ చేయ్యలన్న దృక్పథంతో ఉన్న సీఎంని స్ఫూర్తిగా తీసుకుని సేవ చేస్తున్నాం. మేము ఎప్పటికి సీఎం జగన్‌కి వ్యతిరేకంగా కాదు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి.. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తాం’’ అని వలంటీర్లు స్పష్టం చేశారు. చదవండి: వలంటీర్ అంటేనే స్వచ్ఛంద సేవ -
వలంటీర్ అంటేనే స్వచ్ఛంద సేవ
సాక్షి, అమరావతి: ‘‘కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పథకాలను నేరుగా అందించే సంకల్పంతోనే వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. గత సర్కారు ప్రతి సేవకూ రేటు కట్టి లంచాలు గుంజి, జన్మభూమి కమిటీలు లాంటి వాటితో పౌర సేవలను భ్రష్టు పట్టించడంతో అటువంటి వ్యవస్థను మార్చాలన్న ఆశయంతో వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. లంచాలు, వివక్ష లేని విశ్వసనీయ పరిపాలన కోసం ప్రతి 50 ఇళ్లకు సేవాభావంతో పౌర సేవలను డోర్ డెలివరీ చేసే వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. వలంటీర్ అంటేనే స్వచ్ఛంద సేవ. అందుకే సమాజంలో ప్రజలంతా మిమ్మల్ని ఆత్మీయులుగా చూస్తున్నారు’’ అని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.6 లక్షల మంది వలంటీర్లనుద్దేశించి మంగళవారం రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. లేఖ సారాంశం ఇదీ... నా ఆత్మీయ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు.. గ్రామ వలంటీర్ల జీతాలు పెంచాలని కొద్ది మంది డిమాండ్ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డెక్కారన్న వార్త ఎంతో బాధించింది. గ్రామ, వార్డు వలంటీర్లుగా రాష్ట్రంలో దాదాపు 2.6 లక్షల తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఉదాత్తమైన బాధ్యతలు అప్పగించాం. ప్రతి 50 ఇళ్లకు పౌర సేవలను డోర్ డెలివరీ చేసే వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. సేవాభావం ఉన్న చెల్లెళ్లు, తమ్ముళ్లతో ఈ వ్యవస్థకు రూపకల్పన చేశాం. మనందరీ ప్రభుత్వం అందించే పథకాలన్నీ కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అందాలన్న ఉద్దేశంతో వీరిని ఎంపిక చేశాం. చివరకు నాకు ఓటు వేయని వారికి కూడా, ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసిన వారికి కూడా వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం. నా అంచనాలకు అనుగుణంగా 2.6 లక్షల మంది వలంటీర్లలో 99 శాతం మంది తాము చేస్తున్నది సేవ అని, అది ఉద్యోగం కాదని మనసావాచా కర్మణా నమ్మారు కాబట్టి ఈ వ్యవస్థకు మన సమాజంతోపాటు దేశంలో పలు రాష్ట్రాలు సలాం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ, ప్రతి మనిషి వారికి అందుకే ఆ గౌరవం ఇస్తున్నారు. వీరికి నెలకు రూ.5 వేల చొప్పున అందిస్తోంది జీతం కాదు. అది గౌరవ భృతి. వలంటీర్లు సేవలు అందిస్తున్నప్పుడు ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే గౌరవభృతి ఇస్తున్నాం. ఖర్చు ఎక్కువ అయినా, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ పౌర సేవల డోర్ డెలివరీకి ఇంత ఖర్చు చేయటానికి ముందుకు రాకపోయినా, ప్రజలకు లంచాలు, వివక్ష లేని సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి వలంటీర్‌కు ఏడాదికి రూ.60 వేలు చొప్పున 50 ఇళ్లకు ఒకరిని నియమించి గౌరవ భృతి అందజేస్తున్నాం. అపార్థాలు, అనుమానాలకు తావు లేకుండా.. వలంటీర్ల సేవలు ప్రారంభించిన సమయంలో నేను స్పష్టంగా చెప్పిన విషయాలు కానివ్వండి, మీ అందరి దగ్గర ఉన్న వలంటీర్ల హ్యాండ్ బుక్‌లో కానివ్వండి, ఎటువంటి అపార్థాలు, అనుమానాలకూ తావు లేకుండా వలంటీర్లను, వారికి ఇచ్చే గౌరవ భృతిని డిఫైన్ చేశాం. స్పష్టంగా చెప్పాం. ఆ హ్యాండ్ బుక్‌లో ఏముందో మీరే చూడండి. లేదా ఆ రోజు నేను అన్న మాటల్ని గుర్తు తెచ్చుకోండి. హ్యాండ్ బుక్‌లో నేను రాసిన సందేశంలో ‘‘ప్రతి గ్రామంలో, వార్డులో 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా ధృక్పథం ఉన్న యువతీ యువకులను నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్‌గా నియమిస్తాం. వారు గ్రామ/ వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉంటూ ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, నవరత్నాల ద్వారా అందించే పథకాలు లాంటివి ఇంటివద్దకే డోర్ డెలివరీ చేస్తారు. వీరికి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో అన్ని పథకాలూ ఇంటి వద్దకే అందేలా డోర్ డెలివరీ చేస్తారు’’ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. వలంటీర్ల సేవల ప్రారంభం రోజు కూడా ఇదే విషయాన్ని చెప్పా. పని గంటల నిబంధనలు లేవు.. ‘వలంటీర్’ అనే పదానికి అర్థమే ‘‘స్వచ్ఛందంగా సేవలు అందించడం’’. ఇది ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ. వలంటీర్లుగా సేవలందిస్తున్న వారు ఒక్క విషయాన్ని గమనించండి. గ్రామ, వార్డు సచివాలయంలో మీరు కేవలం వారానికి మూడు రోజులు అది కూడా మీకు వీలున్న సమయంలో మేం అందుబాటులో ఉన్నాం అని సూచిస్తూ అటెండెన్స్ ఇస్తున్నారు. మీరు రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పని చేయాలన్న నిబంధనలు ఏమీ లేవు. పని ఉన్నప్పుడు మాత్రమే సేవాభావంతో ముందుకు వచ్చి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను గడపగడపకు తీసుకువెళ్లేందుకు నెలలో పని ఉన్న కొద్ది రోజులు మీ సేవలు అందిస్తున్నారు. పేదవారి ఆశీస్సులు అందుకుంటూ సంతోషంగా మీరు చేస్తున్న కార్యక్రమం ఇది. మీలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు, ప్రజలతో మీ అనుబంధాన్ని పెంచేందుకు, లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించేందుకు దోహదం చేస్తుంది. వివక్ష, లంచాలు లేని ఒక మంచి వ్యవస్థను తెచ్చేందుకు, మంచి మార్పులు తెచ్చేందుకు మీరంతా సహాయ సహకారాలు అందించాలని గతంలోనే స్పష్టం చేశా. ఒక్కసారి ఆలోచన చేయండి.. సేవాభావంతో, ప్రతిఫలాపేక్ష లేకుండా వలంటీర్ అనే పదానికి అర్థం చెబుతూ మీరు ఇంత గొప్ప సేవలు అందించారు కాబట్టి సామాన్యులంతా మిమ్మల్ని ఆప్తులుగా, ఆత్మీయులుగా చూసుకుంటున్నారు. మీరు వలంటీర్లుగా కాకుండా జీతాలు తీసుకుని ఇదే పని చేస్తుంటే ఏ ఒక్కరైనా మీకు ఇటువంటి గౌరవాన్ని ఇస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. స్వచ్ఛదంగా కాకుండా ఇదే పనిని మీరు జీతం కోసమే చేస్తే ఇటువంటి గౌరవాన్ని పొందగలరా? వలంటీర్ పేరుతో మీరు చేస్తున్నది స్వచ్ఛంద సేవ అవుతుందా? రెచ్చగొట్టే వారికి దూరంగా ఉండండి.. గొప్పగా సేవలందిస్తున్న వలంటీర్లకు సమాజం నమస్కరిస్తోంది. ప్రభుత్వమూ వారిని సత్కరిస్తుంది. అత్యుత్తమ సేవలందించిన వారికి నియోజకవర్గం ప్రాతిపదికగా ఏటా ఒక రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, జేసీ సమక్షంలో శాలువా కప్పి అవార్డుగా మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని దక్కకుండా చేసేందుకు, మీకు వస్తున్న మంచి పేరును తుడిచేసేందుకు, మొత్తంగా వలంటీర్ వ్యవస్థను లేకుండా చేయాలన్న దుర్బుద్ధితో ఎవరు కుట్రలూ కుతంత్రాలు పన్నుతున్నారో మీకు తెలుసు. ఇలా ప్రలోభాలకు గురిచేసే వారికి, రెచ్చగొట్టేవారికి దూరంగా ఉంటూ మీ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మీ శ్రేయోభిలాషిగా, మీ అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా. -
వలంటీర్ వ్యవస్థ పనితీరు బాగుంది
పొదిలి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు బాగున్నాయని అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ షేక్ ఆరిజ్‌అహ్మద్ అన్నారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా పొదిలికి వచ్చిన సందర్భంగా మంగళవారం పట్టణంలోని వలంటీర్లు, సచివాలయానికి సంబంధించిన వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులతో ముఖాముఖి మాట్లాడారు. పంచాయతీ డీఈ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. వలంటీర్ల విధుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయశాఖ, విద్య, వైద్య రంగాలకు సంబంధించి ఎటువంటి సేవలు అందిస్తున్నారని ఆరా తీశారు. వలంటీర్ల అర్హతలు, ఎంపిక విధానం ఎలా జరిగింది, సచివాలయం ఉద్యోగులైన వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసుల విధులు, నిర్వహణ తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులకు వెంటనే లబ్ధి చేకూర్చేలా తాము విధులు నిర్వహిస్తున్నట్లు వలంటీర్లు వివరించారు. ఆరిజ్ అహ్మద్ మాట్లాడుతూ అసోం రాష్ట్రానికి ఈ వ్యవస్థ పనితీరును గురించి సవివరంగా రిపోర్ట్ అందచేయనున్నట్లు తెలిపారు. -
అందరికీ.. అన్నిటికీ తామై..
గత టీడీపీ ప్రభుత్వం పల్స్ సర్వే పేరిట ప్రతి కుటుంబం వ్యక్తిగత వివరాలు సేకరించడానికి రెండేళ్ల సమయం తీసుకుంది. అయితే.. ప్రతి వలంటీర్ తన పరిధిలోని 50 కుటుంబాల సమాచారాన్ని రెండు నెలల్లోనే సేకరించారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థకు ఏడాది కాలం పూర్తయింది. ‘ఆ పనులకు ప్రత్యేకంగా వలంటీర్లు అవసరమా?’ అని విమర్శించిన ప్రతిపక్షాల నోళ్లు మూతపడేలా వలంటీర్ల వ్యవస్థ అద్భుత విజయాన్ని అందుకుంది. అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. వలంటీర్ వ్యవస్థ ఏర్పాటుతో పథకాల అమలులో మునుపెన్నడూ లేనంత వేగం పెరిగింది. దేనికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనేలేదు.. ప్రభుత్వ పథకం తమకు అందాలంటే చేతులు తడపాల్సిన అవసరమూ లేదు.. ఏ నాయకుడి చుట్టూ ప్రదక్షిణలూ అక్కర్లేదు. అవినీతిరహితంగా, కులమతప్రాంతాలకతీతంగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి సంక్షేమ పథకాలను అందించడం దేశంలోనే ఇదే ప్రథమం. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.61 లక్షల మంది వలంటీర్లు ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకే తీసుకెళ్లారు. 4.5 కోట్ల మంది లబ్ధిదారుల ఎంపికలో.. రైతు భరోసా, అమ్మఒడి, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వాహనమిత్ర, జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత ఇలా అనేక పథకాలకు దాదాపు 4.5 కోట్ల మంది లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్లదే కీలకపాత్ర. వివిధ పథకాల ద్వారా రూ.59 వేల కోట్ల ప్రభుత్వ సాయాన్ని అందించారు. అర్హత ఉంటే పది రోజుల్లోనే పింఛన్, రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందిస్తున్నారు. వలంటీర్ల సేవలతో 10.52 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, రెండు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరయ్యాయి. అవ్వాతాతల కన్నీళ్లు తుడిచి.. కదల్లేని స్థితిలో ఉన్న అవ్వాతాతలు ప్రతి నెలా పింఛన్ డబ్బుల కోసం ఊళ్లో పంచాయతీ ఆఫీసు దాకా వెళ్లి అక్కడ గంటల తరబడి వేచి చూసే దుస్థితి వలంటీర్ల వ్యవస్థతో తప్పింది. ప్రతి నెలా 1న తెల్లవారుజాముకల్లా అవ్వాతాతల ఇంటి వద్దనే వలంటీర్లు డబ్బులు అందిస్తున్నారు. కరోనాపై పోరులో వలంటీర్లదే కీలకపాత్ర వలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఐదుసార్లు తెలుసుకున్నారు. కరోనా సోకినవారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించడంలో వలంటీర్ల కృషికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. నిరుపేదలకు ప్రభుత్వం రూ.1,000 సాయం చేసినప్పుడు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేశారు. -
కొత్తగా 1.15 లక్షల మందికి పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 1,15,269 మంది నేడు పింఛన్ డబ్బులు అందుకోనున్నారు. మొత్తమ్మీద 59.03 లక్షల మందికి ప్రభుత్వం బుధవారం పింఛన్ డబ్బులను పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.1,442.21 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2.68 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు బుధవారం ఉదయమే ఎక్కడికక్కడ లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ డబ్బుల పంపిణీ మొదలు పెట్టనున్నారు. జూలై నెల నుంచి కొత్తగా 5,165 మంది దీర్ఘకాలిక రోగులు, 1,10,104 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు పింఛన్ డబ్బులు అందుకోబోతున్నారని సెర్ప్ సీఈవో రాజాబాబు మంగళవారం వెల్లడించారు. ► కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో బయోమెట్రిక్ విధానానికి బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌తో లబ్ధిదారుని ఫొటో తీసుకునే విధానంలోనే ఈసారి కూడా డబ్బుల పంపిణీ కొనసాగనుంది. ► లాక్డౌన్ తదితర కారణాలతో గత మూడు నెలలుగా పింఛను డబ్బులు తీసుకోని వారికి కూడా బకాయిలతో కలిపి పంపిణీ చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు. ► సొంత ఊరికి ఇప్పటికీ దూరంగా ఉన్న 4,010 మంది లబ్ధిదారులు పోర్టబులిటీ(అంటే పంపిణీ సమయానికి లబ్ధిదారుడు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకునే విధానం) ద్వారా డబ్బులు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా... 3,364 మంది తాము వేరే చోట ఉన్నామని, తమ ఊరికి తిరిగొచ్చాక ఇప్పటి పెన్షన్ డబ్బులు తీసుకుంటామని ముందస్తు సమాచారం అందజేశారు. మరోవైపు 26,034 మంది లబ్ధిదారులు తమ పింఛను డబ్బులను తాత్కాలికంగా ఇప్పుడు తాముంటున్న నివాస ప్రాంతానికి బదిలీ చేసి పంపిణీ చేయాలని ఆయా ప్రాంత వలంటీర్ల ద్వారా సమాచారమిచ్చారు. ► కాగా, జూన్ నెలలో రెండు విడతల్లో 2.11 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరవగా.. మొదటి విడతలో మంజూరైన 1.15 లక్షల మందికి జూలై ఒకటిన పింఛన్ డబ్బు పంపిణీ చేస్తున్నామని, మిగతా 96 వేల మందికి ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. జూలై ఒకటిన చేపట్టే పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేసింది. దీంతో రెండో విడతలో మంజూరు చేసిన 96 వేల పింఛన్లకు ఆర్థిక శాఖ నుంచి నిధులు మంజూరు చేసే ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ కారణం వల్ల వారందరికీ ఆగస్టు నుంచి డబ్బుల పంపిణీ మొదలవుతుందని ఆయన తెలిపారు. -
దార్శనిక వ్యవస్థ
సాక్షి, అమరావతి: ‘స్థానిక సుపరిపాలన సాధన దిశగా ఏపీ ప్రభుత్వం వినూత్న పరిపాలన విధానాన్ని రూపొందించింది. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. స్థానిక సుపరిపాలన అందించడానికి 1993లో పార్లమెంటు చేసిన 73, 74 రాజ్యాంగ సవరణల లక్ష్య సాధనకు అవసరమైన వ్యవస్థను దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం 2019లో ఏర్పాటుచేసింది’. ఇదీ ఎవరో అన్న మాట కాదు.. దేశ పరిపాలన వ్యవస్థలో అత్యంత కీలకమైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారుల శిక్షణ సిలబస్‌లో పేర్కొన్న అంశం. ఐఏఎస్‌లుగా ఎంపికైన వారికి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ప్రత్యేక శిక్షణనిస్తారు. దేశంలో సమర్థవంతమైన పరిపాలన అందించడానికి ఉన్న చట్టాలు, వివిధ వ్యవస్థల గురించి వివరిస్తారు. మన రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ గురించి ఐఏఎస్ శిక్షణ సిలబస్‌లో చేర్చడం విశేషం. 2019 బ్యాచ్‌లో శిక్షణపొందిన మొత్తం 185 మంది ట్రైనీ ఐఏఎస్‌లకు మన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ గురించి పూర్తి అవగాహన కల్పించారు. స్థానిక సుపరిపాలన పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికతకు ఇది గుర్తింపుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యవస్థ గురించి యువ ఐఏఎస్‌లకు శిక్షణలో ఏం చెప్పారంటే.. ► భారత రాజ్యాంగం పేర్కొన్న స్థానిక సుపరిపాలన స్ఫూర్తిని ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రతిబింబిస్తోందని ఐఏఎస్‌ల శిక్షణా సిలబస్‌లో పేర్కొన్నారు. ► స్థానిక సంస్థలకు విశేషాధికారాలు కట్టబెడుతూ 73, 74 రాజ్యాంగ సవరణలు అయితే చేశారు కానీ.. అందుకవసరమైన వ్యవస్థను ఏర్పాటుచేయలేకపోయారు. ► కానీ, దేశంలో తొలిసారిగా అటువంటి వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేశారు. అదే గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ. ► పూర్తిస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణకు వ్యవస్థ సరైన ఉదాహరణగా నిలిచింది. ► అంటే.. రాష్ట్రస్థాయిలో సచివాలయం నిర్వహించే విధులన్నింటినీ క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలు చేస్తాయి. ► ఈ వ్యవస్థ ద్వారా ఏపీ ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిజమైన లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయి. ► గ్రామ, వార్డు స్థాయిలోనే వివిధ పత్రాల జారీ, రెవెన్యూ, విద్యుత్, వైద్య–ఆరోగ్య, విద్య సంబంధిత అంశాలను పరిష్కరిస్తున్నారు. ► ఈ వ్యవస్థ విజయవంతమై దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. స్థానిక సుపరిపాలన సాధనలో వినూత్న వ్యవస్థ ఏపీ ప్రభుత్వం చేసిన వినూత్న వ్యవస్థే గ్రామ, వార్డు సచివాలయాలు. రాష్ట్రస్థాయిలోని వ్యవస్థను క్షేత్రస్థాయికి తీసుకురావడమన్నది గొప్ప ఆలోచన. కరోనాను ఏపీ ఈ వ్యవస్థతోనే సమర్థంగా కట్టడి చేయగలుగుతోంది. – కట్టా సింహాచలం, ప్రొబెషనరీ ఐఏఎస్ నిజమైన పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇదే పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే సమర్థవంతమైన పాలన అందించగలం. ఈ వ్యవస్థతో పారదర్శకత, జవాబుదారీతనం సాధించగలుగుతాం. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – చాహత్ బాజ్‌పాయ్, ప్రొబెషనరీ ఐఏఎస్ ఈ వ్యవస్థ గురించి శిక్షణలో ప్రత్యేకంగా చెప్పారు ముస్సోరీలో మాకు ఇచ్చిన శిక్షణలో ఏపీలోని వలంటీర్ల వ్యవస్థ గురించి ప్రత్యేకంగా వివరించారు. మహాత్మాగా«ంధీ ఆకాంక్షించిన గ్రామ స్వరాజ్యం ఇలాంటి వ్యవస్థతోనే సాధ్యపడుతుంది. – సి. విష్ణుచరణ్, ప్రొబెషనరీ ఐఏఎస్ -
కించపరిచినవారే కితాబిస్తున్నారు!
సాక్షి, అమరావతి: ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు అందించడం ఆనందంగా ఉందని, ఇందుకు కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పేర్కొన్నారు. అవ్వా తాతలు నిత్యం సీఎం జగన్‌ను తలుచుకుంటున్నారని, వలంటీర్ల వ్యవస్థను కించపరిచిన వారే ఇప్పుడు సేవలందుకుంటున్నారని చెప్పారు. తమ ఇంటికి వలంటీర్లు వస్తున్నారంటే ముఖ్యమంత్రి జగన్ ఏదో పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు పంపిస్తున్నట్లు జనం భావిస్తున్నారని చెప్పారు. ‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో సోమవారం సీఎం జగన్ ప్రసంగించిన అనంతరం వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, లబ్ధిదారులు మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే... మీరున్నారనే ధైర్యం.. సచివాలయ వ్యవస్థలో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులుంటే 50 శాతం మహిళలకే ఇచ్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మొదట్లో వలంటీర్లను కొందరు చిన్నచూపు చూశారు. ఇవాళ దేశమంతా మావైపు చూస్తోంది. కొన్నిసార్లు మనోవేదనకు గురైనా మా వెనక ముఖ్యమంత్రి ఉన్నారనే ధైర్యంతో ముందుకు వెళ్లాం. –స్మైలి, వెంకటాయపాలెం. సచివాలయం దిశ ధైర్యానిచ్చింది... దిశ చట్టం వచ్చాక 2 కేసుల్లో ఉరిశిక్ష విధించారు. గతంలో మహిళలు పగలు కూడా బయట తిరగలేని పరిస్థితి ఉంది. ‘దిశ’ ఎంతో ధైర్యం ఇచ్చింది. మీ చర్యలతో మద్యపానం తగ్గింది. నేరాలు తగ్గాయి. –శ్రావణి, విజయవాడ, మహిళా పోలీస్ ఎప్పటికీ మరవలేం.. నా భర్త ఆటో డ్రైవరు. నేను టైలరింగ్ పని చేస్తా. మా పెద్దబ్బాయికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. నా చిన్న కొడుక్కి ఇప్పటికే రూ.10 వేలు ఇచ్చారు. నా కూతురు కస్తూరిబా స్కూల్లో చదువుతోంది. మీ మేలు మరణించేదాకా మరువలేం. మీకు కృతజ్ఞతలు. –నారాయణమ్మ, లబ్దిదారు, కర్నూలు రుణపడి ఉంటాం... మీ పుట్టిన రోజు నాడు ధర్మవరం వచ్చి నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు. అందుకు మీకు రుణపడి ఉంటాం. ఒక ఇంట్లో ఉండే చేనేత కార్మికులందరికీ సాయం చేయండి. ఇవాళ లంచం లేకుండా పెన్షన్లు ఇస్తున్నారు. పథకాలు అందుతున్నాయి. – ఫర్జాన, వార్డు వలంటీర్, ధర్మవరం. అనంతపురం ఏది కావాలన్నా అందుతోంది.. ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలో ప్రజలకు గతంలో సరిగా తెలిసేది కాదు. నాదీ అదే పరిస్థితి. సచివాలయాల ద్వారా ఏం కావాలన్నా చేసి పెడుతున్నాం. ఏది కావాలన్నా 72 గంటల్లోనే పరిష్కరిస్తున్నారు. కేవలం పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని దుష్ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదు. అందుకే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. – నాగలక్ష్మి, వలంటీర్, కాకినాడ రూరల్ మండలం. తిమ్మాపురం. ఇంటింటా ఆనందమే.. గతంలో మమ్మల్ని ఎగతాళి చేసిన వారే ఇవాళ పనులు చేసి పెట్టాలని కోరుతున్నారు. మా వెనక ఉన్న ‘రియల్ హీరో’ మీరు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తుంటే ఎంతో సంతోషంగా మీరు, మీ ప్రభుత్వం కలకాలం ఉండాలని కోరుతున్నారు. –హేమంత్‌రెడ్డి, విజయవాడ. వలంటీర్ ఆదుకున్న సున్నా వడ్డీ డబ్బులు మా సంఘానికి సున్నా వడ్డీతో రూ.28 వేలు వచ్చాయి. అది కూడా కరోనా సమయంలో వచ్చాయి. కిరాణ సరుకులు తెచ్చుకున్నాం. జగనన్నకు రాష్ట్ర ప్రజల మీదే ప్రేమ అనుకున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను రప్పించడమే కాకుండా, ఇక్కడ ఉన్న వలస కూలీలను క్షేమంగా పంపించారు. మా పిల్లల సమయంలో కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి. – కుసుమకుమారి, తూర్పు గోదావరి కష్టాలు తీరాయి.. మీరు మాకు రూ.10 వేలు ఇచ్చినందుకు ఎంతో సంతోషం. దీనివల్ల మా కష్టాలు తీరాయి. మాకోసం ఇంకా ఎన్నెన్నో చేస్తున్నారు. అందుకు ఎంతో రుణపడి ఉంటాం. – లీలా కృష్ణ, ఏలూరు–ఆటో డ్రైవర్ల సంఘం నాయకుడు ఆ గౌరవం మీకే దక్కాలి.. కోవిడ్ సమయంలో పోర్టబులిటీ ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నా పింఛను ఇవ్వడం నిజంగా చాలా గొప్ప పని. లబ్ధిదారులు మాకిస్తున్న గౌరవం, అభిమానం అంతా మీకే దక్కాలి. – సరోజ, గుంటూరు కార్పొరేషన్, సంక్షేమ కార్యదర్శి ప్రార్థనలు ఫలించాయి.. మిమ్మల్ని సీఎంగా చూడాలని ఎన్నో ప్రార్థనలు చేశాం. ఇవాళ మీరు చేస్తున్న కార్యక్రమాలు గతంలో ఎవరూ చేయలేదు. ఎక్కడా వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నాకు రూ.3 లక్షల రుణం మంజూరైతే వైఎస్సార్సీపీ మద్దతుదారునని తొలగించారు. – శైలజ, లబ్ధిదారు నెల్లూరు జిల్లా వలంటీర్ల సేవలు బాగున్నాయి.. గ్రామ స్వరాజ్య నిధి ఏర్పాటు చేసి, 20 ఏళ్ల నుంచి గ్రామానికి కావాల్సిన అవసరాలు కేవలం వడ్డీతో తీరుస్తున్నాం. ఇప్పుడు గ్రామాల సమస్యలు పరిష్కారం కాగా, వేరే ఊళ్ల సమస్యలు కూడా తీరుస్తున్నారు. ఇవాళ మీరు గ్రామస్థాయిలో కూడా పరిపాలనలో మార్పు చేస్తూ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. వలంటీర్లను నియమించారు. కోవిడ్ సమయంలో వారు ఎంతో సేవలందించారు. అది కళ్లారా చూశాం. గ్రామస్థాయిలో మార్పులు రావలంటే అధికారంతో పాటు, నిధులు కూడా కావాలి. అవి ఉంటే తప్ప ఆ ఉత్సాహం, బాధ్యత వస్తాయి. అప్పుడే మార్పు కూడా సాధ్యం. – మాంఛో ఫెర్రర్, ఆర్డీటీ. అనంతపురం ఈ సందర్భంగా మరోసారి మాట్లాడిన సీఎం, అనంతపురం జిల్లాలో ఫెర్రర్ కుటుంబం స్థాపించిన ఆర్డీటీ గురించి తెలియని వారెవరూ ఉండరని, ఆ కుటుంబం ఎంతో సేవ చేస్తోందని చెప్పారు. సంక్షేమ పాలన.. ‘సంక్షేమ పాలన ద్వారా ఇప్పటి వరకు అణగారిన వర్గాలుగా ఉన్న వారు కూడా పాలకులవుతారు. వారి చేతుల్లో అధికారం పెట్టడం జరుగుతుంది. ప్రజల్లో చైతన్యం వస్తే గ్రామం బాగు పడుతుంది. గ్రామాలు బాగు పడితేనే మండలాలు, తద్వారా జిల్లాలు, రాష్ట్రం బాగు పడుతుంది.మీకు ఎవరు ఆలోచన ఇస్తున్నారో తెలియదు. చాలా చక్కగా పని చేస్తున్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి, పని చేయక తప్పదు అని అందరూ భావిస్తున్నారు. – మల్లారెడ్డి, అనంతపురం మేనమామలా ఆదుకున్నారు.. నాకు ఇద్దరు బిడ్డలు. ఏ అండా లేదు. మీరు మా పిల్లలకు మేనమామలా నిల్చి ఆదుకున్నారు. అమ్మ ఒడి ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఇన్ని చేస్తూ కూడా మాలాంటి పేదలకు ఇంటి స్థలంతోపాటు ఇంటిని కూడా నిర్మించి ఇస్తానన్నారు. ఇలా గతంలో ఎవరూ చేయలేదు. అన్నా రాఖీ కడతా. – శ్రీలక్ష్మి, లబ్ధిదారు,గుంటూరు -
వాలంటీర్ల సేవలు ఆమోఘం : ఆర్కే రోజా
సాక్షి, చిత్తూరు : కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్ల సేవలు ఆమోఘమని ఎమ్మెల్యే ఆర్కే రోజా కొనియాడారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా నగరి రూరల్ పరిధిలోని వాలంటీర్లకు నిత్యావసరాలను అందజేశారామె. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి వారానికి సరిపడా సరుకులను అందజేశామన్నారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయటం మానుకోవాలన్నారు. -
వాలంటీర్ల వ్యవస్థ అధ్బుతంగా పనిచేస్తోంది
-
కోవిడ్ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు
సాక్షి, అమరావతి : కోవిడ్–19 వ్యాధిని సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వలంటీర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం.గిరిజాశంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ప్రకటనలో ఏముందంటే.. ► వివిధ ఆస్పత్రుల్లో అదనంగా అవసరమయ్యే వైద్య నిపుణులు, పారా మెడికల్ సిబ్బందిని సమకూర్చేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కోవిడ్ వారియర్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ► 13 జిల్లాల్లోని 271 మెడికల్ కళాశాలలు/డెంటల్/యునాని/ఆయుర్వేద/నర్సింగ్ కళాశాలలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్ వలంటీర్లుగా నమోదు చేసుకోవచ్చు. ► ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా మెడికల్ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్ వారియర్స్‌గా పని చేసేందుకు ముందుకు రావాలి. వీరి సేవలను ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో వినియోగించుకుంటాం. ► వలంటీర్లుగా పనిచేసినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్మెంట్లలో ప్రాధాన్యం ఇస్తాం. ► వలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటాం. ఆసక్తి కల్గినవారు health.ap.gov. in/CVPASSAPP/Covid/ Volunteerjobs వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలి. -
ఆయన సలహాలు ట్రంప్‌కి అవసరమేమో!
సాక్షి, చిత్తూరు: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. బుధవారం చిత్తూరులో ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు తనను గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి ఆంధ్ర నుంచి అమెరికా వరకు సలహాలివ్వడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడి సలహాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అవసరమేమో గాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదని రోజా పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో చేయని పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తూ దేశానికే ఆదర్శంగా పరిపాలన కొనసాగిస్తున్నారని రోజా కొనియాడారు. జగన్ ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ అన్ని విధాలా అభినందనీయమని ప్రశంసించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వారిని, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని గుర్తించడంలో వాలంటరీ వ్యవస్థ ఆదర్శనీయంగా పనిచేస్తోందని రోజా కితాబిచ్చారు. రాష్ట్రంలో లో ఏడు వైరస్ ల్యాబ్స్ పెట్టి కరోనా వ్యాధిని కట్టడి చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీ కింద చేరుస్తూ 12 వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా రోజా ధన్యవాదాలు తెలిపారు. (ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా) చదవండి: ‘దేశంలో ఒక్క ఏపీలోనే వాటి తయారీ’ -
పటిష్ట వ్యూహంతో కరోనాపై పోరు
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్–19)ను కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట వ్యూహంతో ముందుకు వెళ్తోంది. వలంటీర్లు – గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను వినియోగించుకుని విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో ముందు వరుసలో నిలిచింది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారిని, వారి సంబంధికులను క్వారంటైన్, ఐసోలేషన్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పని తీరు పట్ల వివిధ రాష్ట్రాలు ప్రశంసిస్తుండటం గమనార్హం. మరోవైపు వైరస్ విస్తరించకుండా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో ప్రత్యేక కోవిడ్–19 ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్ సెంటర్లను అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే సమయంలో నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి గట్టి చర్యలు తీసుకుంది. రైతు బజార్ల సంఖ్యను పెంచడం, ధరలు పెరగకుండా నియంత్రించడం, పెద్ద ఎత్తున పారిశుద్ధ్య పనులు చేపట్టడం, అత్యవసర వ్యవస్థలు నిరంతరం పని చేసేలా చర్యలు తీసుకోవడం తెలిసిందే. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ముందే గుర్తింపు ► ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే మేల్కొంది. మార్చి రెండవ వారంలో తొలి దశలో వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించడానికి ఇంటింటి సర్వే చేసింది. ► ఫిబ్రవరి 10 నుంచి మార్చి 23 వరకు.. విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న 27,876 మందితో పాటు, వారిని తరచుగా కలిసిన వారు, వారి కుటుంబ సభ్యులు (ప్రైమరీ కాంటాక్ట్స్) సుమారు 80,896 మందికి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్‌లో, క్వారంటైన్లో ఉంచింది. ► ఆ తర్వాత ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లను ప్రతి రోజూ వారి ఇళ్లకు పంపి, ఆరోగ్య పరిస్థితులను వాకబు చేసి, అవసరమైన వైద్య సేవలు వారి ఇళ్ల వద్దే ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యుల ద్వారా అందిస్తోంది. కరోనా లక్షణాలు కనిపించిన వారిని తక్షణమే ఆసుపత్రులకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని ప్రత్యేక ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. ► రెండో దశలో మార్చి 31 నుంచి రోజూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు.. పట్టణాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి 2.62 లక్షల మంది వలంటీర్లు, 28 వేల మంది ఏఎన్ఎంలు (15 వేల మంది ఏఎన్ఎంలు, 13 వేల మంది గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ హెల్త్ అసిస్టెంట్లు), 40 వేల మంది ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ► ఇప్పటిదాకా 1.46 కోట్ల కుటుంబాలకు గాను 1.37 కోట్ల కుటుంబాలను సర్వే చేశారు. ఈ సర్వేలో 5,517 మందికి జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లు గుర్తించారు. ఈ 5,517 మందిని వారి ఇళ్ల వద్దే ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు రోజూ పరిశీలించి చికిత్స చేస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పించాలన్న సీఎం సూచన మేరకు మార్చి 11నే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇచ్చిన ఉత్తర్వు ఢిల్లీ ఎఫెక్ట్‌తో పెరిగిన కేసులు.. కట్టుదిట్టంగా కట్టడి చర్యలు ► రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక చర్యలతో రాష్ట్రంలో కరోనా మహమ్మారికి ఇక ముకుతాడు పడుతుందనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా ఢిల్లీ సదస్సుతో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ► ఢిల్లీలో గత నెల 15 నుంచి మూడు రోజులపాటు నిర్వహించిన సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా మన రాష్ట్రం నుంచి సుమారు 1,085 మంది హాజరయ్యారు. ఆ సమావేశంలో ఇండోనేషియా, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన పలువురు హాజరయ్యారు. వారి నుంచి కరోనా వైరస్ ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న వారికి సోకింది. ► ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన.. ఢిల్లీ సమావేశానికి హాజరైన రాష్ట్రానికి చెందిన వారిని గుర్తించింది. వారితోపాటు, వారి సంబంధీకులకు మార్చి 31 నుంచి వరుసగా పరీక్షలు నిర్వహించింది. అందులో 280 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వారందరికీ చికిత్స అందిస్తూ.. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. ► ఒకానొక దశలో గత సోమవారం (మార్చి 30వ తేది) వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 23 మాత్రమే. సోమవారం సాయంత్రం వరకు నమోదైన మొత్తం 303 కేసుల్లో ఢిల్లీకి సంబంధించిన 280 మందిని తీసేస్తే మిగిలే కేసులు కూడా 23 మాత్రమే. ప్రస్తుతం వీరిలో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. అంటే కేవలం 17 పాజిటివ్ కేసులు మాత్రమే ఉండేవి. ఈ లెక్కన ఢిల్లీ సదస్సు వ్యవహారం లేకపోయి ఉండింటే ప్రభుత్వ పటిష్ట చర్యలతో రాష్ట్రంలో కరోనా వైరస్‌కు ఈ పాటికి చెక్ పడి ఉండేదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ► ‘కరోనా కాటుకు మందులేదు. కులం, మతం, ధనిక, పేద అన్న తేడా లేదు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో మనందరి ప్రత్యర్థి కరోనా మహమ్మారే. కుల, మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నిలబడి గెలిచి తీరాల్సిన సమయం ఇది. అందరం ఐక్యంగా భారతీయులుగా పోరాటం చేద్దాం’ అని సీఎం వైఎస్ జగన్ నిత్యం సమీక్షలు చేస్తూ అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. -
లాక్‌డౌన్‌లోనూ వీడని సంకల్పం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వృధ్ధులు, దివ్యాంగులు, వితంతువులు, గుర్తించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి నెల ఒకటోతేదీనే పెన్షన్ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి కరోనా వైరస్ నియంత్రణ నిబంధనలు కూడా తలవంచాయి. పండుటాకుల చేతికే పెన్షన్ సొమ్మును అందించేందుకు లాక్ డౌన్ నిబంధనలు ఆటంకం కాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు విజయవంతం అయ్యాయి. వైఎస్సార్ పెన్షన్ల పంపిణీకి ప్రస్తుతం అమలు అవుతున్న కరోనా నియంత్రణ నిబంధనల వల్ల ఇబ్బంది ఎదురవుతుందనే ఆందోళనలకు ప్రభుత్వ ముందుచూపు చర్యలు చెక్ పెట్టాయి. ఒకవైపు లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ... సామాజికదూరంను పాటిస్తూ... కరోనా వైరస్ కు సంబంధించిన జాగ్రత్తలను పాటిస్తూ... ప్రభుత్వ యంత్రాంగం మొక్కవోని దీక్షతో ఒకటోతేదీన (బుధవారం) 93 శాతంకు పైగా పెన్షన్లను లబ్ధిదారుల చేతికే అందించడం ద్వారా తన చిత్తశుద్దిని చాటుకుంది. ఈ ప్రక్రియలో సచివాలయంలోని సీనియర్ ఐఎఎస్ అధికారుల నుంచి గ్రామస్థాయిలోని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వరకు భాగస్వాములయ్యారు. ఒకవైపు కరోనా నియంత్రణ జాగ్రత్తలను తాము పాటిస్తూ... పెన్షన్లను లబ్ధిదారుల చేతికే అందిస్తూ... కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ముందుకు సాగింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా మొబైల్ యాప్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు కలిగించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. పెన్షన్ డబ్బును లబ్దిదారుల చేతికే అందించే క్రమంలో వారి నుంచి తీసుకునే బయో మెట్రిక్ వల్ల కూడా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదంను నివారించేందుకు చర్యలు తీసుకుంది. అందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను రూపొందించింది. దానిలో లబ్ధిదారుల ఫోటో ఐడెంటిఫికేషన్ ను వాలంటీర్లు నిర్ధారించడం, జియోట్యాగింగ్ తో లబ్ధిదారుల ఫోటోను యాప్ లో అక్కడికక్కడే తీసుకోవడం ద్వారా పెన్షన్ల పంపిణీని సులభతరం చేశారు. ఎక్కడా లబ్దిదారులను నేరుగా తాకకుండా, అందరికీ ఉపయోగించే బయోమెట్రిక్ ను వాడకుండానే ఈ యాప్ తో పెన్షన్ల పంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించినట్లు సెర్ఫ్ సిఇఓ రాజాబాబు తెలిపారు. ఉదయం నుంచే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభమైన వైఎస్సార్ పెన్షన్ కానుకను ఉదయం ఎనిమిదిన్నర గంటలకే 53శాతం పూర్తి చేశారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ దారులకు డబ్బులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కరోనా నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వృద్దులకు, వివిద వ్యాధులతో బాధపడుతున్న వారికి వివరించారు. ఉదయం పదిగంటలకే 77శాతం పెన్షన్లను పంపిణీ చేశారు. మధ్యాహ్నం రెండు గంటల కల్లా 88.27 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. సాయంత్రం అయిదు గంటల వరకు 93శాతం పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు. మొత్తం 58,08,404 మంది పెన్షన్లకు గానూ ( సాయంత్రం 5గంటల వరకు) 52,49,802 మందికి పెన్షన్లను అందచేశారు. ఈనెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం ప్రభుత్వం 1395.75 కోట్ల రూపాయలను కేటాయించింది. దీనిలో 93శాతం వరకు సాయంత్రంలోగానే పంపిణీ చేయడం విశేషం. చదవండి: అధైర్యపడొద్దు .. నేనున్నా ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం -
‘వారందరికీ హేట్సాప్’
సాక్షి, తణుకు: కరోనా వ్యాప్తి నివారణకు వైద్యులు,పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో తాను మాత్రం ఎందుకు ఇంట్లో ఉండాలనే ఉద్దేశ్యంతో పోలీసులు,పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పనిచేశానని ఆయన తెలిపారు. (ఏపీలో 12కు చేరిన కరోనా కేసులు) ఈ కరోనా వల్ల ధనిక దేశాలు కూడా విలవిలలాడుతున్నాయని.. మనకి ఆ పరిస్థితి రాకుండా చూడాలని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని.. ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించారు. వైద్యులు,పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు.. కరోనా నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వలంటీర్ల వ్యవస్థను ఆయన అభినందించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని సులభంగా గుర్తించగలుగుతున్నారని కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. -
కరోనా కట్టడికి ముమ్మర కసరత్తు
సాక్షి, అమరావతి: అత్యంత ప్రమాదకర కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ముమ్మరంగా చర్యలు చేపట్టామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల తెలంగాణ, కేరళ, రాజస్థాన్ మాదిరిగా మన రాష్ట్రం తీవ్రంగా ప్రభావితం కాలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్ ఎంత సులువుగా రావడానికి అవకాశం ఉందో.. అంతే సులువుగా దాన్ని నియంత్రించ వచ్చనే అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. అందరూ సహకరించాలి - మన పక్కన మనిషి లేక పోయినా గాలి వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని వస్తున్న వార్తల వల్ల ఆందోళన పెరుగుతోంది. వాతావరణం అనుకూలంగా ఉంటే ఎనిమిది గంటల వరకు వైరస్ గాలిలో ఉండగలుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అందువల్ల జనం బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. - కొత్త వ్యక్తులను కలవక పోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి. - జాగ్రత్తగా ఉండకపోతే మన కోసం పని చేస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీస్, అత్యవసర సర్వీసుల సిబ్బందిపై కూడా పని ఒత్తిడి పెరుగుతుంది. - ఈ వైరస్ మరింతగా వృద్ధి చెందితే ఎవరి నుంచి అయినా వ్యాపించే ప్రమాదం వుంది. శానిటైజర్లు, మాస్క్ లు కూడా లభించడం లేదు. ఇవి కూడా ప్రజల కోసం రోడ్ల మీదకు వస్తున్న వారికే అందేలా అందరూ సహకరించాలి. హుద్ హుద్ అదో పెద్ద స్కాం - హుద్‌హుద్ సమయంలో చంద్రబాబు ఏం చేశారో తెలుసు. (ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా) అదో పెద్ద స్కాం. ఎలాంటి హంగామా లేకుండానే ముందు నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా నియంత్రణపై దృష్టి పెట్టారు. - పేదలకు సరుకులు, రేషన్‌తో పాటు వెయ్యి రూపాయలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. - చంద్రబాబులా దోమలపై దండయాత్ర అంటూ మేం హంగామా చేయడం లేదు. జగన్‌కు చంద్రబాబులా మెలో డ్రామాలు చేయడం చేత కాదు. - ఈ విపత్కర పరిస్థితిపై ఎవరైనా రాజకీయంగా మాట్లాడితే అది వారి లేకి తనానికి నిదర్శనం. - అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ముందుచూపే మందు - ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి రోజూ కరోనాపై సమీక్షలు జరుపుతున్నారు. ఉదయం, సాయంత్రం నివేదికలు తెప్పించుకుంటున్నారు. - సీఎం ముందు చూపుతో అప్రమత్తమై తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో వైరస్ ప్రభావం తక్కువగా ఉంది. - ఫిబ్రవరి నెలాఖరులో ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి సమాచారం రాక పోయినప్పటికీ వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికీ వెళ్లి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ప్రభుత్వం సేకరించింది. - తద్వారా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంది. ఎలాంటి హంగామా లేకుండా సమర్థవంతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.