రేపు ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం ప్రారంభం | YS Jagan Attends Volunteer Vandanam Award Program | Sakshi
Sakshi News home page

రేపు ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం ప్రారంభం

Published Wed, Feb 14 2024 9:25 PM | Last Updated on Wed, Feb 14 2024 9:28 PM

YS Jagan Attends Volunteer Vandanam Award Program - Sakshi

కరోనా కలవరపెట్టినా.. వరదలు వణికించినా.. ఎక్కడా తలొగ్గక.. ఆదివారమైనా, పండగైనా, సెలనైనా తొలి కోడి కూయకముందే, తూర్పు తెలవారకముందే, చిక్కటి చిరునవ్వుతో అవ్వా తాతలను, అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను ఆప్యాయంగా పలకరించి, ఠంఛన్గా పెన్షన్లు అందించడంతో పాటు.. జగనన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడి లంచాలు, వివక్షకు తావులేకుండా ప్రభుత్వ సేవలందిస్తున్న నిస్వార్ధ సేవా సైనికులైన వాలంటీర్లను అభినందిస్తూ, ఇదే స్పూర్తితో నిరంతరం వారు సేవలు కొనసాగించేలా ప్రోత్సహిస్తూ అందిస్తున్న చిరు సత్కారం.

ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న సేవా వజ్ర అవార్డుల ప్రదానం.. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని  గుంటూరు జిల్లా, ఫిరంగిపురంలో గురువారం లాంఛనంగా ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. పేదలకు మంచి చేసే యజ్ఞంలో వాలంటీర్ల సేవలు చిరకాలం కొనసాగేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తూ, ఇప్పటివరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని మరింత పెంచి అందిస్తున్న జగనన్న ప్రభుత్వం.
 

కేటగిరీ             ఇప్పటివరకు మనం అందించింది (రూ.లలో)          పెంచి ఇస్తున్నది (రూ.లలో)
సేవా వజ్ర                    30,000                                                                    45,000
సేవా రత్న                  20,000                                                                    30,000
సేవా మిత్ర                 10,000                                                                     15,000

రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తంగా రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు. దీంతో పాటు, వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్దిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎంపిక చేయబడిన 997 మంది వాలంటీర్లకు ప్రత్యేకంగా నగదు బహుమతులు.. ఒక్కో వాలంటీర్ కు మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో రూ. 15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ. 25 వేల చొప్పున మొత్తం రూ. 1.61 కోట్ల నగదు బహుమతుల ప్రదానం.

శభాష్ వాలంటీర్
పేదల పక్షాన నిలబడి వారి ముఖాల్లో చిరునవ్వులు కలకాలం నిలిచేలా పునరంకితమవుతూ. లంచాలకు, వివక్షకు తావు లేకుండా డెలివరీ మెకానిజంలో భాగమైనందుకు, పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు తోడుగా ఉంటూ, సహాయకారిగా వ్యవహరిస్తున్నందుకు. తమ పరిధిలోని 50/100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు. గ్రామ/వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నందుకు. కోడి కూయకముందే ఇంటి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి మరీ ఠంచన్గా పింఛన్లు ప్రతి నెలా ఒకటో తారీఖునే అందిస్తున్నందుకు.

పెన్షన్లతో పాటు రేషన్ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ళ పట్టాలతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో నిర్దిష్ట కాల పరిమితిలో అందేందుకు సహాయపడుతున్నందుకు. వరదలు, విపత్తులు, ప్రమాదాల సహాయ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరియు 'దిశ' వంటి ముఖ్యమైన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు. జగనన్న సంక్షేమ సంక్షేమ క్యాలెండర్ అనుసరించి, ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో ప్రజల దగ్గరకు వెళ్లి వివరించి అవసరమైతే దగ్గరుండి దరఖాస్తు చేయించే సేవా సైనికులైనందుకు..

సేవా సైన్యానికి సలాం..
కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు.అవినీతికి తావులేకపోవడం, సచ్చీలత, ఇంటింటి సర్వే, హాజరు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నామని తెలియజేయడం, యాప్ వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్ డోర్ డెలివరీ, పెన్షన్ / రైస్ / ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం, ప్రజలకు అన్ని రకాలుగా సహాయం అందించడం తదితర అంశాల్లో పనితీరు ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక.

'సేవా వజ్ర'
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 45,000 నగదు బహుమతి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాలలో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రధానం

'సేవా రత్న'
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 30,000 నగదు బహుమతి. ప్రతి మండలం/మున్సిపాలిటీ పరిధిలో 5 మంది చొప్పున, మున్సిపల్  కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున టాప్ 1 ర్యాంకు సాధించిన వాలంటీర్లకు మొత్తంగా 4,150 మందికి "సేవా రత్న" పురస్కారాల ప్రదానం.

'సేవా మిత్ర'
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ తో పాటు రూ.15,000 నగదు బహుమతి. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన 2,50,439 మంది వాలంటీర్లకు "సేవామిత్ర" పురస్కారాల ప్రదానం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement