చంద్రబాబు సర్కార్ మరో మోసం
వలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించాలని ఆదేశాలు
సెలవు రోజే కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పటికే వేతన బకాయిలు ఇవ్వకుండా వేధింపులు
హామీలు నెరవేర్చాలని కోరినందుకు కక్షసాధింపు.. ప్రజల మనసు గెలిచిన వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర కుటుంబాలకు ఇంటి వద్దే సేవలు అందించిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ప్రతి సంక్షేమ పథకం నుంచి సర్టిఫికెట్ వరకు వివిధ సేవలను ప్రజలకు సత్వరం అందించి మన్ననలు పొందిన ఆ వ్యవస్థపై కక్ష సాధిస్తోంది. ప్రజల మనసు గెలిచిన వలంటీర్ వ్యవస్థ నిర్వీర్యానికి కుటిల పన్నాగం పన్నిన చంద్రబాబు.. తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటూ ఆ ప్రజల నుంచి వారికి సంబంధాలు లేకుండా చేయాలని నిర్ణయించారు.
వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన @ncbn.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచాక నట్టేట ముంచేశాడు.
వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వాలంటీర్ గ్రూప్‌లన్నీ డిలీట్ చేయాలని అధికారులకి ఆదివారం ఆదేశాలు
చంద్రబాబు తేనె పూసిన కత్తికి… pic.twitter.com/16asihjkF1— YSR Congress Party (@YSRCParty) August 5, 2024
ఇప్పటికే రెండు నెలల నుంచి వారికి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. పింఛన్ల పంపిణీ విధుల నుంచి వారిని తొలగించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ నెరవేర్చలేదు. మేనిఫెస్టోలో పెట్టిన రూ. 10 వేతనం పెంపు ఊసేలేదు. తాజాగా, వారి వాట్సాప్ గ్రూపులన్నింటినీ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం చూస్తే.. ఈ చిన్న వేతన జీవులపై చంద్రబాబు సర్కార్ ఎంత కక్షగట్టిందో అర్థమవుతుంది.
అధికారంలోకి రాకముందు నుంచే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ఒక్కో పావు కదుపుతూ వస్తున్న చంద్రబాబు.. తానిచ్చిన ఎన్నికల హామీలనే విస్మరిస్తూ ఇప్పుడు ఆ వ్యవస్థకు మంగళం పాడేందుకు సిద్ధమయ్యారు. ఉగాది పర్వదినం రోజునే చంద్రబాబు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. వలంటీర్ల వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని హామీ కూడా ఇచ్చారు.
ఎన్నికల ముందు ఆయన హామీలు ఇచ్చి ఆనక మోసం చేస్తాడు అనడానికి వలంటీర్ల వ్యవస్థపై నిర్ణయాలనే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు వలంటీర్ల విషయంలో సెలవు దినం రోజే నిర్ణయం తీసుకుని భారీ మోసానికి పాల్పడటం చూస్తే.. ఇది ఆయన నైజానికి పరాకాష్టగా భావించవచ్చు.
హామీలు నెరవేర్చమనడమే పాపమా?
ఎన్నికల్లో ఇచి్చన, మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చమని అడగడమే వలంటీర్ల విషయంలో పాపమైంది. వలంటీర్లను ఎవరినీ తొలగించబోమని, పైగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే వారి వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు.
అయితే అధికారం చేపట్టాక వారిని పింఛన్ విధుల నుంచి తొలగించారు. రెండు నెలల నుంచి ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. హామీ ఇచ్చి న మేరకు వేతనాలు పెంచాలని కోరుతున్నారు. దీంతో కక్ష గట్టిన ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించండి..
ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాల సమాచారం క్షణాల్లో ప్రజలందరికీ తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ల వాట్సాప్, టెలిగ్రాం తదితర గ్రూపులన్నింటినీ తక్షణమే తొలగించాలంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ శాఖ డైరెక్టర్ ఫోన్ మెసేజ్ ద్వారా హడావుడిగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు తక్షణం క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
ఆయా వలంటీర్ల వాట్సాప్ గ్రూపుల తొలగించిన వివరాలను అధికారులు తనకు సోమవారం ఐదు గంటల లోపు తెలియజేయాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేగాక ప్రజలను కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలాగ అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో జిల్లాలోనూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఇన్‌చార్జిలు హడావుడిగా ఆ సమాచారాన్ని మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు పంపారు.
కాగా, ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వలంటీర్ల అందరికీ అప్పట్లో ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులను గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్వా«దీనం చేసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వలంటీర్లు ఎవ్వరికీ ఆ ఫోన్లను, సిమ్‌కార్డులను తిరిగి అందజేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment