guarantees
-
కాంగ్రెస్ తరఫున నేను హామీ ఇస్తున్నా
-
ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది
-
సీఎం రేవంత్ మహారాష్ట్రలో చెప్పినవన్నీ అబద్ధాలే: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్:హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు సవాల్ విసిరారు.ఆదివారం(నవంబర్ 10) తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.‘మహారాష్ట్రలో కూడా సీఎం రేవంత్ అబద్ధాలాడుతున్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతుకైనా బోనస్ వచ్చిందా. రైతుబంధు ఇవ్వడం లేదని రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ఎందుకు చెప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలి.రేవంత్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. తెలంగాణలో 40 లక్షల మందికి రుణమాఫీ అయిందని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కట్టలేదు.ఉన్న ఇళ్లు కూలగొట్టింది’అని హరీశ్‌రావు విమర్శించారు.ఇదీ చదవండి: ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణలో బతుకులు చీలికలు పీలికలే: కేటీఆర్ -
కాంగ్రెస్ గ్యారంటీలపై వ్యాఖ్యలు.. ఖర్గేపై మండిపడ్డ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ చూసుకొని ఎన్నికల హామీలు ప్రకటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా అని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బడ్జెట్‌ను మించి గ్యారంటీలు ఇవ్వొద్దని.. అలా చేస్తే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తుందన్న ఖర్గే వ్యాఖ్యలకు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా? ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా? తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదు?చదవండి: కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది: మోదీ ఏవీ చూసుకోకుండా.. కేవలం అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో తెలంగాణ రాష్ట్రం ఏడాదిలోనే ఆగమైంది. తెలంగాణ ప్రజలను నమ్మించి, నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. పదేళ్లపాటు ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలి.అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారెంటీలతో.. భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషం. కానీ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మిన పాపానికి ఏడాదికాలంగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేనిది!. గ్యారెంటీల మాటున కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిది’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గౌరనీయులైన ఖర్గే గారు..గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా..?కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా?బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా..?ఆరు గ్యారంటీలతో… https://t.co/XcHhFGnDkN— KTR (@KTRBRS) November 1, 2024 -
ఆచరణసాధ్యమైన హామీలే ఇవ్వాలి
బెంగళూరు/న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విచ్చల విడిగా ప్రకటిస్తున్న గ్యారంటీలతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింటోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. నోటితో నమలగలిగే దాని కంటే ఎక్కువ మింగేయకూడదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చే హామీలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి సరితూగేలా ఉండాలని స్పష్టంచేశారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలే ఇవ్వాలని తేల్చిచెప్పారు. కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం అమలు చేస్తున్న ‘శక్తి’ పథకాన్ని పునఃసమీక్షించాలని భావిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఖర్గే మాట్లాడుతూ... రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హామీలు ఇచ్చే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రణాళిక లేకుండా ముందుకెళ్తే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, రాష్ట్రాలు దివాలా తీసే ప్రమాదం ఉందని, భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్థిక బాధ్యత అనేది ఉండాలన్నారు. భవిష్యత్ తరాలు నష్టపోతాయి ‘‘కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చారు. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మహారాష్ట్రలోనూ ఐదు గ్యారంటీలు ఇచ్చారు. కర్ణాటకలో ఒక గ్యారంటీని రద్దు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు వార్తాపత్రికలు చదవడం లేదనిపిస్తోంది. కానీ, నేను చదువుతున్నా. అందుకే ఈ విషయం చెబుతున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలను అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది గ్యారంటీల పేరిట హామీలు ఇవ్వొద్దని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సలహా ఇస్తున్నా. దానికి బదులు రాష్ట్ర బడ్జెట్‌కు సరిపోయే హామీలే ఇవ్వండి. రాష్ట్రం దివాలా తీసే గ్యారంటీలు వద్దు. ఇష్టానుసారంగా గ్యారంటీలు ఇచ్చేస్తే రేపు రోడ్లు వేయడానికి కూడా డబ్బులు ఉండవు. ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి. ప్రభుత్వం మరో పదేళ్లు ఎన్నో ఇక్కట్లు, ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఖర్గే చేసిన ఘాటైన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. శక్తి పథకాన్ని కేవలం పునఃసమీక్ష చేస్తామని మాత్రమే డి.కె.శివకుమార్ చెప్పారని, రద్దు చేస్తామని అనలేదని వివరించారు. దీనిపై ఖర్గే బదులిస్తూ.. డి.కె.శికుమార్ మాట్లాడింది ఏదైనప్పటికీ బీజేపీ విమర్శలు చేయడానికి ఒక అవకాశం ఇచ్చారని తప్పుపట్టారు. వక్రీకరించారు: డి.కె.శక్తి పథకంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని డి.కె.శివకుమార్ చెప్పారు. పథకాన్ని రద్దు చేస్తా మని తాము ప్రకటించినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బస్సుల్లో ప్రయా ణానికి స్వచ్ఛందంగా చార్జీలు చెల్లించడానికి మహిళల్లో ఒక వర్గం సిద్ధంగా ఉందని మాత్రమే తాను అన్నానని ఉద్ఘాటించారు. చార్జీలు చెల్లించడానికి కొందరు మహిళలు ముందుకొచ్చినప్పటికీ తీసు కోవడానికి కండక్టర్లు భయపడుతున్నారని తాను చెప్పానని వివరించారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని ఉపసంహరించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. శక్తి పథకాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ధ్వజమెత్తారు. భావోద్వేగాలతో ఆడుకుంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే విపక్షాల పని అని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వ గ్యారంటీల మోడల్‌ను చూసి గర్వపడు తున్నామని డి.కె.శివకుమార్ చెప్పారు. -
ప్రశ్నించే స్వరం వినిపించకూడదా?
విజయవాడలో బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిలదీయకూడదా? మీరు చేసే అవినీతిపై ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇదెక్కడి అరాచక పాలన..?’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నించే స్వరమే వినిపించకూడదని ఆరాటపడుతూ తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీనికి ‘సాక్షి’ ఎడిటర్‌పై పెట్టిన కేసే తార్కాణమని చెప్పారు. ‘ఇలాగైతే ప్రజలు మీకు సింగిల్ డిజిట్ కూడా దక్కకుండా చేస్తారు...’ అంటూ చంద్రబాబును హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకో..చంద్రబాబు అధికారంలో ఉన్నంత మాత్రానా ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ప్రజలు తిరగబడతారు. అప్పుడు చంద్రబాబుకు, ఆయన పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు. మా నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదు. బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంతపైకి లేస్తుంది. ఎప్పటికైనా చేసిన తప్పును నిజాయతీగా ఒప్పుకుంటే.. ఆ వ్యక్తిలో పరివర్తన వస్తే కొద్దో గొప్పో సానుకూలత పెరుగుతుంది. అంతేగానీ తప్పు కనిపించకూడదు... దాని గురించి ఎవరూ మాట్లాడకూడదంటే ఎవరూ హర్షించరు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడేందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మద్యం విషయంలో మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మా హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలు లేవు. ప్రభుత్వమే పారదర్శకంగా నిర్వహించింది. డిజిటల్ పేమెంట్లతోపాటు క్యాష్ పేమెంట్లను అందుబాటులో ఉంచాం. ప్రతి దుకాణంలో పీవోఎస్‌లు పెట్టాం. ఇప్పుడు మొత్తం ప్రైవేటు పరం అయ్యాయి. టీడీపీకి చెందిన వాళ్లే నడుపుతున్నారు. స్ట్రైక్ రేటు చూసుకుని స్కాములు చేస్తామంటే ఈసారి దెబ్బ గట్టిగా తగులుతుంది. జమిలి ఎన్నికలు మన చేతుల్లో లేవు. ఏం జరిగినా పార్టీని సన్నద్ధంగా పెట్టడానికి రెడీగా ఉన్నాం. గ్రామ స్థాయిలో పార్టీకి బూత్ కమిటీలు నియమించి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం. వరదల్లోనూ స్కామ్లేనా?చంద్రబాబు స్కామ్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో విజయవాడలో వరదల సమయంలో చూశాం. బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. ఇంత దారుణంగా స్కాముల మీద స్కాములు చేస్తున్నారు. పైగా ఇవే ప్రశ్నలు అడిగినందుకు ‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు పెట్టారు. ఇంత దారుణంగా ప్రభుత్వ పాలన చేస్తుంటే ప్రశ్నించకూడదా? వీళ్లు ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదా? అసలు వీళ్లు పరిపాలన చేయడానికి యోగ్యులేనా? ప్రజలందరూ ఆలోచించాలి. -
ఉచిత హామీలపై ఈసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
గ్యారెంటీలపై నిలదీయండి: యువతకు హరీశ్‌రావు పిలుపు
సాక్షి,హైదరాబాద్:గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు ఆదివారం(అక్టోబర్6) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘గ్యారెంటీలు అమలు చేయలేకపోగా,మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు,రైతు బంధును నిలిపివేశారు,రైతు భరోసా దిక్కులేకుండా పోయింది,బోనస్‌ను బోగస్ చేశారు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు,పది నెలలు గడిచాయి వాటికి అతీ గతి లేదు.నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారు.ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు,స్నేహితులతో అలయ్-బలయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి.మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు,రైతు డిక్లరేషన్,యూత్ డిక్లరేషన్,ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్,మైనారిటీ డిక్లరేషన్,బీసీ డిక్లరేషన్లపై ఎక్కడిక్కడ నిలదీయండి’అని హరీశ్‌రావు యువతకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూఠిఫికేషన్: కేటీఆర్ -
సర్కార్‌పై సమరానికి సై!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారుపై సమరానికి ‘కమల దళం’సై అంటోంది. ఆరు గ్యారంటీలు, రైతులు, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీసేందుకు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు అంశాలపై ఆందోళనలు, నిరసనలు ప్రారంభించగా.. విస్తృతస్థాయిలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పోరాటాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.హైడ్రా, మూసీ అంశాలపై..‘హైడ్రా’ కూల్చివేతలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో క్షేత్రస్థాయిలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్ చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ‘హైడ్రా’ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా 2, 3 రోజుల్లో కార్యాచరణను ఖరారు చేయాలని.. ఇందిరాపార్కు వద్ద ధర్నా, ఇతర రూపాల్లో ఆందోళనలు నిర్వహించడం ద్వారా పేదల పక్షాన బీజేపీ నిలుస్తోందనే భరోసాను కల్పించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల బీజేపీ చేపట్టిన 24 గంటల రైతుదీక్షకు మంచి స్పందన వచ్చిందని.. దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ముఖ్యనేతలు పాల్గొనడంతో వారి మధ్య సమన్వయం పెరిగిందని అంటున్నారు. ఇది కలసివచ్చే అంశమని చెప్తున్నారు. ఇక స్థానిక సంస్థల సమస్యలు, పెండింగ్ బిల్లులపై నిరసనలు, ఆందోళనలను ప్రారంభించినా.. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు, పంచాయతీలు, మండలాల్లో నిధుల లేమి తదితర అంశాలపై భారీగా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.‘కొత్త’ కాంబినేషన్‌తో ముందుకు!బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్, పార్టీ శాసనసభాపక్ష (బీజేఎల్పీ) నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఇతర నాయకులు ఓ టీమ్‌గా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వరుస కార్యక్రమాలు చేపడుతుండటం కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోందని పార్టీ నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ఈ ఇద్దరు నేతలు పార్టీలో కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నారా? అనే చర్చ సాగుతోందని పేర్కొంటున్నారు. ఈ ఇద్దరు చొరవగా> అసెంబ్లీలోని కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశాన్ని నిర్వహించి.. ప్రజాప్రతినిధులు, నేతల మధ్య సమన్వయం, సయోధ్య సాధించడంలో విజయం సాధించారని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన 24 గంటల రైతు హామీల సాధన దీక్ష కూడా విజయవంతం కావడం ‘కొత్త’ కాంబినేషన్‌కు మరింత కలసి వచ్చిందని అంటున్నారు. దీనిని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు.. హైడ్రాతో పేదలకు ఎదురవుతున్న ఇబ్బందులు, గ్రామీణ స్థానిక సంస్థల్లో నిధుల లేమి, సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడంపై నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారని పేర్కొంటున్నారు.దూకుడు పెంచిన నేతలు..జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జిగా బిజీగా ఉన్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇటీవల ‘హైడ్రా’, మూసీ కూల్చివేతలపై తీవ్రంగా స్పందించారు. పేదల జోలికొస్తే కాంగ్రెస్ సర్కార్ పతనాన్ని శాసిస్తామంటూ హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలతో అందరి దృష్టిని ఆకర్షించారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని చెరువుల పరిధిలో పేదలు, మధ్యతరగతి వర్గాల ఇళ్లను కూల్చడంపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ, క్షేత్రస్థాయిలో బాధిత ప్రజలను కలసి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో తమ సొంత డబ్బులతో చేపట్టిన పనులకు ఇంకా బిల్లులు చెల్లించలేదంటూ మాజీ సర్పంచ్‌లు చేస్తున్న ఆందోళనకు ఈటల మద్దతిచ్చారు. వెంటనే బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రాష్ట్ర ఆదాయం పెంచాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయ ఆర్జన శాఖలకు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ప్రజలపై భారం పడకుండానే ఆదాయ పెంపు మార్గాలను అన్వేషించి ఆదాయ ఆర్జన శాఖలు ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి మించి అదనంగా 15 శాతం 25 శాతం వరకు పెంచాలని ఆయా శాఖల అధికారులకు సీఎం సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కేంద్రాన్ని నిధులు అడగలేమని, రాష్ట్ర సొంత ఆదాయ వనరుల ద్వారానే అమలు చేయాల్సి ఉందని ఆయన చేశారు. ఆదాయ ఆర్జన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, మైనింగ్, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అధికార వర్గాల సమాచారం మేరకు సీఎం సమీక్షలో ఆదాయ ఆర్జన శాఖలకు ఆర్థిక శాఖ భారీ ఆదాయ లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిసింది. భూముల విలువ పెంపు ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని భారీగా పెంచాల్సిందిగా ఆర్ధిక శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రస్తుతం వస్తున్న రూ.8000 కోట్ల ఆదాయాన్ని రూ.14 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకుగాను భూముల విలువను పెంచాల్సిందిగా సూచించింది. దీని ద్వారా 10 నుంచి 15 శాతం మేర ఆదాయం పెంచాల్సి ఉందని స్పష్టం చేసింది. అలాగే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ చార్జీల పెంపుపైన కూడా కసరత్తు చేయాలని నిర్ణయించారు. జీఎస్టీ ఎగవేతలను నిరోధించడం, లీకేజీలను అరికట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచాల్సిందిగా సూచించారు. మైనింగ్ కార్యకలాపాల ద్వారా ప్రస్తుతం రూ.4,500 కోట్లు ఆదాయం వస్తోందని, దీన్ని రూ.8000 కోట్లకు పెంచాల్సిందిగా ఆర్థికశాఖ నిర్దేశించింది. నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తే ఆదాయం భారీగా పెరుగుతుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచే మార్గాలను అన్వేíÙంచాల్సిందిగా సూచించింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం ద్వారానే హామీలు అమలు చేయగలమని, ఈ నేపథ్యంలో ఆదాయ ఆర్జన శాఖలు అందుకు అనుగుణంగా చర్యలను తీసుకోవాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త.. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త.. నినాదంతో ముందుకు సాగాలని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిపరిచేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో పారిశ్రామిక అభివృద్ధి దిశగా పయనించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆయన శుక్రవారం పరిశ్రమలశాఖ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి, అమరావతి, వైజాగ్‌తో కలిపి ఐదు అంతర్జాతీయ వాణిజ్య అభివృద్ధి కేంద్రాలను స్థాపించడం ద్వారా ఎంఎస్ఎంఈలలో పోటీతత్వాన్ని మెరుగుపరచాలని సూచించారు. 1.75 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి వంతున 175 మైక్రో పార్కులను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ మంత్రి టి.జి.భరత్, సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
ఇమామ్, మౌజన్లకు వేతనాలేవి బాబూ!
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు అనేక హామీలు గుప్పించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా ఒక్కటీ అమలు చేయలేదు. ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనాన్ని పెంచుతానని హామీ ఇచ్చి, అసలు ఉన్న వేతనాన్ని కూడా నిలిపివేయడం ముస్లిం మైనార్టీలను నివ్వెరపరుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే గౌరవ వేతనాలను రెట్టింపు చేసి క్రమం తప్పకుండా ఇచ్చారని, ఆయన సీఎంగా ఉండి ఉంటే ఇప్పటికే ఆరు నెలల గౌరవ వేతనం కలిపి మొత్తం రూ.45 కోట్లకు పైగా అందించి ఉండేవారని రాష్ట్రంలోని ఇమామ్‌లు, మౌజన్లు చెబుతున్నారు. ఇదే కాదు.. ఆదాయం లేని మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం అందిస్తానని బాబు ఇచ్చిన హామీ కూడా నీటి మాటే అయ్యింది. రాష్ట్రంలోని ఆదాయం లేని 6 వేల మసీదులకు నెలకు రూ.5 వేలు నిర్వహణ సాయం అందించాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్, ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు, విజయవాడ వద్ద హజ్ హౌస్ నిర్మాణం, నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయింపు, రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం, ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించడం వంటి హామీలను ఇచ్చిన చంద్రబాబు ఒక్కటీ అమలు చేయకుండా మోసకారితనాన్ని ప్రదర్శిస్తున్నారని ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. 2014లో ముస్లిం మైనార్టీలను మోసగించిన బాబు రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముస్లిం మైనార్టీలకు అనేక హామీలు గుప్పించి, నిలువునా మోసగించారని ముస్లిం సంఘాలు మండిపడితున్నాయి. రాష్ట్రంలో ముస్లింలకు ప్రత్యేకంగా వడ్డీలేని ఇస్లాం బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తానని నాడు హామీ ఇచ్చి, ఐదేళ్లపాటు దాని ఊసే ఎత్తలేదు. ఈ ఎన్నికల్లోను అదే హామీ ఇచ్చి, మరోసారి బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 2014లో హజ్ యాత్రికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్‌హౌస్‌లు నిరి్మస్తానని, ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం వారికి బడ్జెట్లో నిధులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తానని, వక్ఫ్ ఆస్తుల రికార్డులను పక్కాగా తయారు చేసి, పరిరక్షిస్తామని చెప్పి, ఒక్కటీ అమలు చేయలేదు. నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధికి రూ.5 లక్షలు, వ్యాపారం కోసం రూ.లక్ష వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పి, అరకొరగా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.జగన్ పాలనలోనే ముస్లింలకు భరోసావైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనంగా రూ.300.68 కోట్లు చెల్లించింది. ముస్లిం మైనార్టీలకు వైఎస్ జగన్ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థితిని కల్పించారు. చంద్రబాబు గత పాలనలో ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, అనేక మంది ముస్లింలపై దేశ ద్రోహం కేసులు పెట్టి అన్యాయంగా వేధించారు. ముస్లిం యువతపై నాటి చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన దేశంద్రోహం వంటి అక్రమ కేసులను వైఎస్ జగన్ ప్రభుత్వం ఎత్తివేయడమే కాకుండా నవరత్నాలతోపాటు అనేక రకాల పథకాల ద్వారా అండగా నిలిచింది. ముస్లిం మైనార్టీలకు శాశ్వత జీవనోపాధి చూపించేలా వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను ప్రత్యేకంగా అందించింది. ఐదేళ్ల కాలంలో కేవలం వైఎస్సార్ చేయూత ద్వారా 2,24,334 మంది మైనారిటీలకు రూ.1,613.25 కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా 1,69,412 మందికి రూ.583.01 కోట్లు అందించింది. ప్రతి నెలా ఒకటో తేదీన సాయమందించాలి మసీదుల నిర్వహణకు నెలకు రూ.5వేల ఆర్థిక సాయం అందిస్తానని, ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం పెంచి ఇస్తానని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు గడిచినా హమీ అమలు చేయలేదు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా 1వ తేదీన మసీదుల నిర్వహణకు, ఇమామ్, మౌజన్లకు ఆర్థిక సాయం అందించాలి. –షేక్ నూరుల్లా హజరత్, ఉప్పలమర్రి మసీద్ ఇమామ్, నెల్లూరు జిల్లాఇమామ్లకు గౌరవ వేతనం పెంచి అందించాలి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇమామ్‌ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేలు నుంచి రూ.10 వేలకు, మౌజన్ల వేతనాన్ని రూ. 3 వేల నుంచి రూ.5 వేలకు పెంచి, అందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం రూ.300.68 కోట్లు, కోవిడ్ ప్రత్యేక సాయం రూ.100 కోట్లు కలిపి మొత్తం రూ.400.68 కోట్లు అందించి భరోసా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కనీసం వేతనం కూడా ఇవ్వడంలేదు. ముస్లిం సమాజానికి చంద్రబాబు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలి. – షేక్ దస్తగిరి, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల జేఏసీ -
మనోడే.. విమానంలో తిప్పేద్దాం
సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలిచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఖజానా ఖాళీ అంటున్న కూటమి ప్రభుత్వం.. తమ కార్యకర్తలకు జేబులు నింపడానికి అడ్డగోలుగా ప్రత్యేక జీవోలే ఇస్తోంది. ప్రజల సొమ్ముతో కార్యకర్తలు జల్సా చేసేలా ఒకే రోజు మూడు జీవోల్ని విడుదల చేసింది. మంత్రులతో పాటు వారి ఓఎస్డీలు, పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కూడా విమానాల్లో ప్రయాణించడానికి అనుమతించింది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఒక జీవో జారీ చేశారు. మంత్రి ఓఎస్డీ, పీఎస్, అడిషనల్ పీఎస్, పీఏలు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు మంత్రితో పాటు ప్రయాణించడానికి అనుమతించారు. జీతభత్యాలతో సంబంధం లేకుండా మంత్రి కార్యాలయ సిబ్బంది ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా మంత్రులు బయటి వ్యక్తులను ప్రైవేటు కార్యదర్శులుగా, వ్యక్తిగత సహాయకులుగా నియమించుకోవడానికి అనుమతించడమే కాకుండా, వారి వేతనాలను రెట్టింపు చేస్తూ మరో జీవో జారీ చేశారు. మంత్రి వ్యక్తిగత సహాయకుడి వేతనం రూ.18 వేల నుంచి రూ.36 వేలకు, ప్రైవేటు కార్యదర్శి వేతనం రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రులకు 96 మంది ప్రైవేటు సిబ్బంది ప్రతి మంత్రికి నలుగురు చొప్పున మొత్తం 24 మంత్రులకు 96 మంది ప్రైవేటు సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతిస్తూ సురేష్ కుమార్ మరో జీవో ఇచ్చారు. ప్రతి మంత్రి ఒక ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)తో పాటు స్వర్ణాంధ్ర విజన్ నిర్వహణకు ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ను నియమించుకోవచ్చు. సోషల్ మీడియా నిర్వహణకు ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్‌ను నియమించుకోవచ్చు. ఈ విధంగా కూటమి కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలను సృష్టించి, ప్రభుత్వ సొమ్మును దుబారా చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి అడుగులోనూ మోసం: వైఎస్ జగన్
మళ్లీ మన పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే మనం ఎవరినీ మోసం చేయలేదు. ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు. రెండు నెలల్లోనే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత వచ్చింది. ఈ ఐదేళ్లలో వేధింపులకు గురి చేస్తారు. కష్టాలు కూడా ఉంటాయి. నా పరిస్థితులే దీనికి ఉదాహరణ. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. అటువంటి కష్టాలు నేను చూశాను. కానీ కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుతురు కచ్చితంగా వస్తుంది. రాత్రి తర్వాత పగలు వస్తుంది. ఇది çసృష్టి సహజం. అలాగే ఈ ఐదేళ్లు కూడా ముగుస్తాయి. మనం మళ్లీ అధికారంలోకి వస్తాం. మన ప్రభుత్వంలో మళ్లీ మీరు, నేను ప్రజలకు సేవ చేసే గొప్ప పరిస్థితుల్లో ఉంటాం. ఇది కచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోండి. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబునాయుడి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ మోసమే కన్పిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నెన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిలో ఏవీ అమలు చేయకుండా, ఏవేవో కారణాలు చెబుతూ సాకులు చూపుతున్నారని ఎత్తి చూపారు. అది చంద్రబాబు నైజమని, మోసం చేయడం ఆయనకు ఎప్పుడూ అలవాటేనని గుర్తు చేశారు. మోసాలకు, అబద్ధాలకు చంద్రబాబు, టీడీపీ అలవాటు పడ్డారని.. అదే మనం విలువలు, విశ్వసనీయత మీదే రాజకీయాలు చేస్తున్నామని.. అందుకే మనకు తప్పక మంచి రోజులు వస్తాయని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఉద్భోదించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో తొలుత మాడుగుల, ఆ తర్వాత అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంక్షోభం ఎంతగా ఉన్నప్పటికీ సాకులు చూపలేదన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి, మాట తప్పకుండా అమలు చేశామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పని చేశామన్నారు.‘కోవిడ్ మహమ్మారి రెండేళ్లు రాష్ట్రాన్ని పీడించినా, పథకాలు దాటేయాలని ఆలోచించలేదు. క్యాలెండర్ ప్రకటించి అన్నీ అమలు చేశాం. అలా అన్నీ చేశాం కాబట్టే.. ఇవాళ్టికి కూడా మన పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్త తలెత్తుకుని ధైర్యంగా ప్రతి గ్రామానికీ పోగలుగుతాడు. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది. ఆ ధైర్యం చంద్రబాబులో, ఆయన పార్టీలో కనిపించదు. ఎందుకంటే, ఓట్లు అడిగేటప్పుడు నీకు రూ.15 వేలు, నీకు రూ.18 వేలు సంతోషమా? అంటూ ప్రచారం చేశారు. యువకులు కనిపిస్తే.. నీకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ఇలా ఎవరు కనిపిస్తే వారికి వాగ్దానాలు చేశారు’ అని చెప్పారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత జగన్ బాగానే చూసుకున్నాడు. జగన్ కన్నా చంద్రబాబు వయసులో పెద్దవాడు కదా.. జగన్ పలావు పెట్టాడంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కాస్తో కూస్తో మోసపోయి అటు వైపు వెళ్లారు. కేవలం రెండున్నర నెలల్లోనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంటికే వచ్చే పెన్షన్ విధానం పోయింది. ఇంటికే వచ్చే రేషన్ విధానం పోయింది. మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా పోయింది. శాంతి భద్రతలు నీరుగారిపోయాయి. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు పెంచుతున్నారు. చేసిన మంచి ఎక్కడికీ పోదు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే మనకు శ్రీరామ రక్ష. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారి తీస్తాయి. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు పలావు లేదు. బిర్యానీ లేదు. పస్తులుండాల్సిన పరిస్థితి.జగన్ ఉండి ఉంటే..ఇప్పుడు అదే జగన్ ఉండి ఉంటే.. ఈ పాటికి రైతు భరోసా అందేది. ఆ డబ్బులతో రైతులందరూ చక్కగా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవారు. స్కూళ్లకు వెళ్తున్న పిల్లల తల్లులకు అమ్మ ఒడి అందేది. అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపించేది. వారికి సున్నా వడ్డీ ప్రయోజనం అంది ఉండేది. విద్యాదీవెన కింద ప్రతి పిల్లాడికి మూడు నెలలకోసారి ఆర్థిక సాయం అందేది. వసతి దీవెన వచ్చేది. మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేవి. చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఇప్పటికే జమ అయి ఉండేది. ఇంకా రైతులకు ఉచిత పంటల బీమా అమలై ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రీమియం కట్టడం లేదు. గతంలో ఏప్రిల్, మేలో ప్రీమియం కట్టేవాళ్లం. జూన్‌లో వ్యవసాయ పనులు మొదలయ్యేసరికి ఇన్సూ్యరెన్స్ డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఇచ్చేవాళ్లం. పెట్టుబడులకు రైతులకు సహాయంగా ఉండేది. ఇప్పుడు అదీ పోయింది. అవేవీ ఇవ్వకుండా చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో మోసం కనిపిస్తోంది. జన్మభూమి కమిటీల చుట్టూ, టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ రెండు నెలల్లోనే కనిపిస్తున్నాయి.విద్యా వ్యవస్థ దారుణం ప్రభుత్వ బడుల్లో టోఫెల్ పీరియడ్ తీసేశారు. పిల్లలందరూ గొప్పగా ఇంగ్లిష్ చదువుకుని ఏకంగా ప్రపంచంతో పోటీ పడేలా చదువుకుంటున్న పరిస్థితులను.. కూటమి ప్రభుత్వం రాగానే నిర్వీర్యం చేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి ఉంది. విద్యాకానుక పంపిణీ కూడా అస్తవ్యస్తం. ట్యాబ్‌లు ఇస్తారన్న నమ్మకం లేదు. గోరుముద్ద (మధ్యాహ్న భోజనం) మెనూ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఆరోగ్యశ్రీ కింద ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇప్పటికే రూ.1600 కోట్ల బకాయిలు ఉన్నాయి. మార్చిలో ఎన్నికల కోడ్ రావడంతో.. బిల్లులు ఆపాల్సి వచ్చింది. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిపాలన, ఇంటికే అందే డెలివరీ మెకానిజమ్‌తో పాటు, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏకంగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కక్షలు తీర్చుకునే వారిని ప్రోత్సహించేలా చంద్రబాబు తీరు ఉంది. ఈ మోసాలు చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోంది. -
స్వర్ణముఖిలో దోపిడీకి ‘సూపర్ సిక్స్’
ఎన్నికల ముందు టీడీపీ చెప్పిన సూపర్ సిక్స్ హామీల అమలును అధికారంలోకి వచ్చాక గాలికొదిలేసింది. కానీ, రూ.కోట్లు కూడబెట్టుకునేందుకు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఒక ‘సూపర్ సిక్స్’ను తయారు చేసుకున్నారు. అదేమిటనుకుంటున్నారా... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పులివర్తి నాని కనుసన్నల్లో ఆయన అనుచరులు స్వర్ణముఖి నదిలో చంద్రగిరి మండలంలోని నాగయ్యగారిపల్లి, కొటాల, మిట్టపాళెం, శానంబట్ల, తిరుపతి రూరల్ మండలంలోని పైడిపల్లి, తనపల్లి ప్రాంతాల్లో ఆరు రీచ్‌లు అనధికారికంగా ఏర్పాటుచేశారు.రాత్రింబవళ్లు యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. రాత్రిపూట టిప్పర్లు, పగలు ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతంలోని తిరుచానూరు వద్ద పంట పొలాల్లోనూ దౌర్జన్యంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. నదిలో పెద్ద ఎత్తున తవ్వకాలు చేయడం వల్ల వర్షాకాలంలో తమ గ్రామాలను వరద ముంచెత్తుతుందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తిరుచానూరు–పాడిపేట గ్రామాల మధ్య స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలను శుక్రవారం పాడిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు రావడంతో నాని అనుచరులు ఇసుక ట్రాక్టర్లను తీసుకుని వెళ్లిపోయారు. – సాక్షి టాస్‌్కఫోర్స్ -
వలంటీర్ల వ్యవస్థకు ఉరి!
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర కుటుంబాలకు ఇంటి వద్దే సేవలు అందించిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ప్రతి సంక్షేమ పథకం నుంచి సర్టిఫికెట్ వరకు వివిధ సేవలను ప్రజలకు సత్వరం అందించి మన్ననలు పొందిన ఆ వ్యవస్థపై కక్ష సాధిస్తోంది. ప్రజల మనసు గెలిచిన వలంటీర్ వ్యవస్థ నిర్వీర్యానికి కుటిల పన్నాగం పన్నిన చంద్రబాబు.. తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటూ ఆ ప్రజల నుంచి వారికి సంబంధాలు లేకుండా చేయాలని నిర్ణయించారు.వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన @ncbn.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచాక నట్టేట ముంచేశాడు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వాలంటీర్ గ్రూప్‌లన్నీ డిలీట్ చేయాలని అధికారులకి ఆదివారం ఆదేశాలుచంద్రబాబు తేనె పూసిన కత్తికి… pic.twitter.com/16asihjkF1— YSR Congress Party (@YSRCParty) August 5, 2024 ఇప్పటికే రెండు నెలల నుంచి వారికి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. పింఛన్ల పంపిణీ విధుల నుంచి వారిని తొలగించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ నెరవేర్చలేదు. మేనిఫెస్టోలో పెట్టిన రూ. 10 వేతనం పెంపు ఊసేలేదు. తాజాగా, వారి వాట్సాప్ గ్రూపులన్నింటినీ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం చూస్తే.. ఈ చిన్న వేతన జీవులపై చంద్రబాబు సర్కార్ ఎంత కక్షగట్టిందో అర్థమవుతుంది. అధికారంలోకి రాకముందు నుంచే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ఒక్కో పావు కదుపుతూ వస్తున్న చంద్రబాబు.. తానిచ్చిన ఎన్నికల హామీలనే విస్మరిస్తూ ఇప్పుడు ఆ వ్యవస్థకు మంగళం పాడేందుకు సిద్ధమయ్యారు. ఉగాది పర్వదినం రోజునే చంద్రబాబు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. వలంటీర్ల వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని హామీ కూడా ఇచ్చారు. ఎన్నికల ముందు ఆయన హామీలు ఇచ్చి ఆనక మోసం చేస్తాడు అనడానికి వలంటీర్ల వ్యవస్థపై నిర్ణయాలనే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు వలంటీర్ల విషయంలో సెలవు దినం రోజే నిర్ణయం తీసుకుని భారీ మోసానికి పాల్పడటం చూస్తే.. ఇది ఆయన నైజానికి పరాకాష్టగా భావించవచ్చు.హామీలు నెరవేర్చమనడమే పాపమా? ఎన్నికల్లో ఇచి్చన, మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చమని అడగడమే వలంటీర్ల విషయంలో పాపమైంది. వలంటీర్లను ఎవరినీ తొలగించబోమని, పైగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే వారి వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయితే అధికారం చేపట్టాక వారిని పింఛన్ విధుల నుంచి తొలగించారు. రెండు నెలల నుంచి ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. హామీ ఇచ్చి న మేరకు వేతనాలు పెంచాలని కోరుతున్నారు. దీంతో కక్ష గట్టిన ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది.వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించండి..ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాల సమాచారం క్షణాల్లో ప్రజలందరికీ తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ల వాట్సాప్, టెలిగ్రాం తదితర గ్రూపులన్నింటినీ తక్షణమే తొలగించాలంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ శాఖ డైరెక్టర్ ఫోన్ మెసేజ్ ద్వారా హడావుడిగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు తక్షణం క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఆయా వలంటీర్ల వాట్సాప్ గ్రూపుల తొలగించిన వివరాలను అధికారులు తనకు సోమవారం ఐదు గంటల లోపు తెలియజేయాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేగాక ప్రజలను కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలాగ అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో జిల్లాలోనూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఇన్చార్జిలు హడావుడిగా ఆ సమాచారాన్ని మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు పంపారు. కాగా, ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వలంటీర్ల అందరికీ అప్పట్లో ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులను గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్వా«దీనం చేసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వలంటీర్లు ఎవ్వరికీ ఆ ఫోన్లను, సిమ్‌కార్డులను తిరిగి అందజేయలేదు. -
రామయ్యా.. హామీల మాటేమిటయ్యా.!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ⇒ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచితంగా ఇవ్వబోతున్నాం. మూడు సిలిండర్లు ఎందుకని చంద్రబాబు ఇవ్వబోతున్నారు..? సిలిండర్ల ధర జగన్ పెంచారు. ఇప్పుడు కొనలేకపోతున్నాం. ఇబ్బంది ఉంది కాబట్టి మళ్లీ గ్యాస్ పొయ్యల మీద వంట చేసుకునేందుకు మూడు సిలిండర్లు ఉచితం.⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర సరుకు లు కూడా భారీగా పెరగడంతో కొనలేకపోతున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలను స్థిరీకరిస్తాం.⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోలేదు. అన్ని రకాలుగా ముంచేశారు. రైతుల్ని ఆదుకోవడానికి ఏటా సీజన్ ప్రారంభంలోనే రూ. 20వేల పెట్టుబడి సా యం అందిస్తాం. ⇒ సముద్ర వేట విరామ సమయంలోనే మత్స్యకారులకు రూ. 20వేలు అందజేస్తాం. మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తాం. వారికి అవసరమైన బోట్లు, వలలు, పరికరాలు అందిస్తాం.అధునాతన పద్ధతుల్లో వేటకు సహకరిస్తాం.⇒ ఆర్టీసీ ఛార్జీలు భరించలేని విధంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఫ్రీ చేసి, ఆడప డుచులు ఎక్కడ తిరగాలన్నా పైసా ఖర్చు లేకుండా చేస్తాం. ⇒చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున.. ఇద్దరుంటే రూ.30వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు... నలుగురుంటే రూ.60వేలు.. ఇంకా ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15వేలు చొప్పున మీ అకౌంట్లో వేయడానికి చంద్రబాబు నిర్ణయించారు.ఎన్నికలకు ముందు ప్రస్తుత కేంద్ర మంత్రి, అప్పటి ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలు ఇవి. ఇప్పుడు వారు అనుకున్నట్టే అధికారంలోకి వచ్చారు. బాధ్యతలు స్వీకరించి 50 రోజులు దాటిపోయింది. వీటిలో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశారా? అంటే ఏమీ లేదనే చెప్పాలి. పైగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు మాటలన్నీ మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు.ధరలు తగ్గించారా?వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఽనిత్యావసర ధరలు పెరిగిపోయాయని గగ్గోలు పెట్టారు. పోనీ ఇప్పుడేమైనా తగ్గించారా అంటే అదేమీ లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయని ఆరోపించిన రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నా ఆ ధరల గురించి మాటైనా మాట్లాడడం లేదు. గ్యాస్ ధరల పెంపు కూడా వైఎస్ జగన్‌పైనే వేసి ఊరూరా ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం దాన్ని తగ్గించి చూపలేకపోతున్నారు.కోటలు దాటే మాటలుకేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు మాటలు కోటలు దాటుతున్నాయి గానీ చేతలే దాటడం లేదని జిల్లా వాసులంటున్నారు. మత్స్యకారుల వేట విరామం సమయం దాటిపోయి చాలా రోజులైంది. మధ్యలో వర్షాలు కూడా వచ్చి మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఇస్తామన్న రూ.20 వేలు ఇంతవరకు ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్ సగానికి వచ్చేసింది. ఉడుపులు అయిపోయాయి. కానీ, వారికింతవరకు పెట్టుబడి సాయం అందలేదు. వ్యవసాయ ఖర్చుల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి సాయమే కాదు ప్రభుత్వం విధిగా అందించాల్సిన విత్తనాలు, ఎరువుల విషయంలోనూ అదే నిర్లక్ష్యం కన్పించింది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటిపోయింది. పిల్లల్ని చదివించేందుకు తల్లులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాన్ని నేటికీ ఇవ్వలేదు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ. 15వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. ఇవే కాదు మహిళలకు ప్రతి నెలా రూ. 1500, నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు...అవి ఇచ్చేలోపు నెలకి రూ. 3వేల నిరుద్యోగ భృతి కూడా మర్చిపోయారు. 50 ఏళ్ల పింఛన్ ఇవ్వడం మాట దేవుడెరుగు.. ఉన్నవి తీసేస్తున్నారు.కొత్తవేవీ..?తాను ఎంపీగా ఎన్నికయ్యాకే జిల్లాలో రైల్వే అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకుంటారు. కానీ, దేశ వ్యాప్తంగా ఏం జరిగాయో అవే జరిగాయే తప్ప వ్యక్తిగత ప్రాధాన్యతతో జరిగినవేవి లేవు. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో అనేక రైల్వే స్టేషన్లు ఆధునీకరణ జరిగాయి. అవన్నీ ఎంపీల వ్యక్తిగత ఖాతాలో వేసుకుంటే.. ఇక్కడ అదనంగా చేసిందేంటో చెప్పడానికి లేవు. కేంద్రమంత్రిగా ఉండటంతో జిల్లాకు ప్రత్యేక ప్రాజెక్టులేమైనా వస్తాయేమోనని ప్రజలంతా ఆశించారు. కానీ ఒక్కటంటే ఒక్కటీ జిల్లాకు ప్రత్యేక కేటాయింపు లేదు. -
హామీలిచ్చాం కానీ.. ఖజానా ఖాళీ
సాక్షి, నంద్యాల, పెద్దదోర్నాల, సాక్షి, పుట్టపర్తి/ మడకశిర: సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీలన్నీ ఇచ్చుకుంటూ వెళ్లామని, ఇప్పుడు చూస్తే ఖజానా ఖాళీగా దర్శనమిస్తోందని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అధ్వానంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. వర్షాలు సమృద్ధిగా పడడంతో శ్రీశైలం డ్యామ్ 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే నిండిందన్నారు. మరో రెండు మూడు రోజుల్లో నాగార్జునసాగర్, ఆ తర్వాత పులిచింతల ప్రాజెక్టులు నిండుతాయని చెప్పారు. గురువారం శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంటలో నిర్వహించిన మన నీరు– మన సంపద కార్యక్రమం, శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. సున్నిపెంటలోని యువత న్యూయార్క్‌లో ఉద్యోగం సంపాదించేలా స్కిల్స్ డెవలప్ చేస్తామన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని రాయలసీమకు తరలించి సీమలోని జలాశయాలన్నింటినీ నింపుతామన్నారు. రానున్న ఐదేళ్లలో కరువు అనే మాట వినపడకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత తాను తీసుకుంటానని మల్లన్న సాక్షిగా చెబుతున్నట్లు పేర్కొన్నారు.సీమకు పరిశ్రమలు తెస్తాంరాయలసీమలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఆర్థికంగా స్థితిమంతులైన ప్రతి ఒక్కరూ 25 మందిని వృద్ధిలోకి తెచ్చేందుకు సహకరిస్తే సమాజంలో పేదరికం అనేది లేకుండా పోతుందన్నారు. నాకు సంపద సృష్టించడం తెలుసు.. దాన్ని పేదలకు పంచడమూ తెలుసని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్రీశైలం దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందేలా సహకారం అందిస్తామన్నారు. కేంద్రంతో చర్చించి సిద్ధేశ్వరం వద్ద ఐకానిక్ హైవే బ్రిడ్జితో పాటు బ్యారేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని చంద్రబాబు విమర్శించారు. తమ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.69 వేల కోట్లను కేటాయిస్తే గత ప్రభుత్వం రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. హంద్రీనీవాకు తాము రూ.5,520 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం రూ.515 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. గాలేరు నగరికి తాము రూ.2,050 కోట్లు వ్యయం చేస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.448 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టిందని చెప్పారు.రాళ్లపల్లి, రత్నగిరిలో రిజర్వాయర్లు..శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో రామన్న అనే పింఛన్‌దారుడి ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు రూ.4 వేలు ఫించన్ అందించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రామన్నకు భూమితో పాటు పిల్లలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వితంతువు ఓబుళమ్మకు ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టు రైతు రంగనాథ్ మల్బరీ ప్లాంటేషన్, రేషం షెడ్‌ను పరిశీలించారు. గ్రామంలోని కరియమ్మదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. హంద్రీనీవాలో భాగంగా మడకశిర నియోజకవర్గంలో రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మించి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఆర్.అనంతపురం వద్ద 1,600 ఎకరాలలో ఇండస్ట్రియల్ క్లస్టర్, వక్క రైతుల కోసం మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. మడకశిరలో రూ.60 కోట్లతో రింగు రోడ్డు నిర్మిస్తామని ప్రకటించారు. మడకశిరను రెవెన్యూ డివిజన్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పుట్టపర్తి నుంచి వచ్చే జాతీయ రహదారి 7ని 44వ జాతీయ రహదారికి అనుసంధానం చేసి పెనుకొండ, గుడిబండ, మడకశిర, అమరాపురంను అనుసంధానం చేస్తామని చెప్పారు. సున్నిపెంట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 3.45 గంటలకు సీఎం చంద్రబాబు గుండుమల ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన గుండుమల వచ్చారు. అనంతరం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లారు.ప్రయాణికులకు అవస్థలుసీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి సున్నిపెంట చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో శ్రీశైలం క్షేత్రానికి చేరుకోగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దాదాపు రూ.12 కోట్లతో స్వామి, అమ్మవార్లకు బహూకరించిన బంగారు రథాన్ని పరిశీలించారు. అనంతరం నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుని మ్యాప్‌లను పరిశీలించారు. జలహారతి ఇచ్చి కృష్ణమ్మకు సారె సమర్పించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అక్కడకు 50 కి.మీ. దూరంలో ఉన్న ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో భక్తులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మండల కేంద్రంలో కాకుండా మార్గం మధ్యలో బసులను నిలిపివేయడంతో చిన్న పిల్లలతో కలసి ప్రయాణిస్తున్న వారు ఇబ్బంది పడ్డారు. గేట్లు తెరవడంతో ఆ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు బయల్దేరిన వారికి నిరాశ ఎదురైంది. కొన్ని బస్సులు శ్రీశైలం చేరుకుని మధ్యాహ్నం భోజనం అనంతరం తిరిగి గమ్యస్థానాలకు బయలుదేరాల్సి ఉంది. దోర్నాలలోనే ఇంత అలస్యమైతే తాము తిరిగి ఎప్పుడు వెళ్లాలని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం.. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాను మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీల వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. సామాజిక న్యాయం కోసం ఏబీసీడీ వర్గీకరణ విధానం తెచ్చామన్నారు. తమ ప్రభుత్వం సామాజిక సమతుల్యాన్ని పాటిస్తుందన్నారు. -
ఆర్డినెన్స్ పేరుతో నాటకం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తప్పించుకోవడంతో పాటు రాష్ట్ర అప్పుపై చేసిన దు్రష్ఫచారం బండారం బట్టబయలవుతుందనే భయంతోనే 2024–25 సంవత్సరం పూర్తి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదని ఆ ర్థి క శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసి నాటకాలాడుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి అంటే 2019 మే 30 నాటికి ఖజానాలో రూ.వంద కోట్లే మిగిలాయంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని గుర్తు చేస్తూ.. ప్రజలకు ఇచి్చన హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధితో 2019–20కి సంబంధించి రూ.2,27,975 కోట్లతో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. కొత్త సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి రెండ్రోజుల ముందు అంటే జూన్ 10న కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అదనపు నిధులు రూ.5,655.72 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసిందని.. జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల్లో వాటా, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వచ్చే నిధుల లెక్కను తేల్చి చెబుతూ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎత్తిచూపారు. కోవిడ్ వంటి ప్రత్యేక పరిస్థితులు లేకున్నా, నిధుల విషయంలో అస్పష్టత లేకపోయినప్పటికీ పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ మొదటి సమావేశాలు జూన్ 21.. రెండో సమావేశాలు జూలై 22–27 వరకు నిర్వహించారని, ఆ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా.. ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయాల్సి వచి్చందో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.అబద్ధాలు బయట పడకూడదనే.. » పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేయడానికి ప్రభుత్వానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి నిధులు లేవనే సాకు చూపి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా సమరి్థంచుకోవడం. మరొకటి రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లంటూ ఎన్నికల్లో చెప్పిన అబద్ధాల బండారం బయట పడకుండా చూసుకోవడం. » పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టకపోవడం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తామని ఇచి్చన హామీకి మంగళం పాడినట్టేనా? » దీపం పథకం కింద ఒక్కో ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయనట్లేనా? » మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచి్చన హామీని అటకెక్కించినట్లేనా? » తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయకుండా మోసం చేయడం కాదా? » 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు పెన్షన్ ఇస్తామని ఇచి్చన హామీని అమ లు చేయకుండా తప్పించుకోవడానికేనా? » రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆరి్థక సహాయం అందిస్తామని ఇచి్చన హామీని అమలుచేయకుండా మోసం చేస్తారా? » 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇచి్చన హామీని అమలు చేయకుండా వారికి ద్రోహం చేస్తారా? » రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లుందని ఎన్నికల్లో దు్రష్ఫచారం చేశారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రూ. 9,74,556 కోట్లని తప్పుడు లెక్కలు చెప్పారు. వాస్తవానికి అన్ని రకాల అప్పులు కలిపి రాష్ట్రానికి ఉన్నది రూ.7 లక్షల కోట్లే. -
అసలు అప్పెంత? బాబు బొంకెంత?
ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ఎడాపెడా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక రూ.10 లక్షల కోట్లు అప్పు ఉందంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. కానీ రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు రూ.7.48 లక్షల కోట్లే. గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా? మీతో తప్పులు చెప్పించిన సీఎం చంద్రబాబును మందలించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాస్తా. 2019 మే 30 నాటికి మేం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ఖజానాలో రూ.వంద కోట్లే ఉన్నాయని స్వయంగా చంద్రబాబు గెజిట్ ‘ఈనాడు’ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జూన్ 12 నాటికి ఖజానాలో రూ.7–8 వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. నాడు రూ.వంద కోట్లే ఉన్నా రూ.2.27 లక్షల కోట్లతో 2019–20 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. హామీలన్నీ అమలు చేశాం. ఇప్పుడు రూ.7–8 వేల కోట్ల నిధులున్నా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు భయపడుతున్నారు. పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్న విషయం ప్రజలకు తెలుస్తుందన్నది బాబు భయం. హామీల అమలుకు నిధులు కేటాయించకుండా తప్పించుకునేందుకే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం లేదుఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్ ప్రకటించి మరీ డీబీటీ ద్వారా అర్హులందరికీ కులమతాలు, పారీ్టలు, ప్రాంతాలు చూడకుండా రూ.2.71 లక్షల కోట్లు నేరుగా వివక్ష లేకుండా అందించాం. మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరీ ఇచ్చాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి బటన్ నొక్కి అందచేశాం. మరి మీరిచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి ఎక్కడుంది? – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రకటించిన శ్వేతపత్రం అబద్ధాలమయమని, అదో తప్పుడు పత్రమని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై తాము ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగ్, ఆర్బీఐ, కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదికలను ఉదహరిస్తూ అప్పులపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని సాక్ష్యాధారాలతో నిరూపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అసలు రంగు తెలిసిపోతుందనే భయంతో.. గత 52 రోజులుగా రాష్ట్రం పురోగమిస్తోందో తిరోగమిస్తోందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అణిచివేసే పాలన కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందంటే.. పూర్తి స్థాయి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే ధైర్యం లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను తీసుకొచ్చింది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే మోసపూరిత హామీలకు బడ్జెట్లో కేటాయింపులు చూపించాల్సి వస్తుందని, హామీలు అమలు చేయకుంటే ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిలదీస్తారని చంద్రబాబు భయపడుతున్నారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే వాల్యూమ్ 6, వాల్యూమ్ 5 ప్రకారం రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచి్చన అప్పు ఎంత? లాంటి అంశాలు వెల్లడించాల్సి వస్తుంది. అప్పుడు ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పులపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్నది ప్రజలకు తెలిసిపోతుందన్నది చంద్రబాబు భయం. అందుకే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా చంద్రబాబు దాటవేస్తున్నారు. వంచన.. దగా.. మోసమే చంద్రబాబు విధానంచంద్రబాబు మోడస్ ఆపరండీ ఏమిటంటే.. వంచన, గోబెల్స్ ప్రచారం! ఒక మనిషిని అప్రతిష్ట పాల్జేయాలనుకున్నా... హామీల అమలుపై తప్పించుకోవాలన్నా దాన్ని అమలు చేస్తారు. ముందుగా ఒక కథ సిద్ధం చేసి తాను చెబుతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. దానిపై చర్చలు కూడా పెడతారు. మంత్రుల నుంచి కింది స్థాయి వరకు అందరితో అవే మాటలు మాట్లాడిస్తారు. టీవీ చర్చల్లో అభిప్రాయాలు చెప్పేవారు కూడా చంద్రబాబు మనుషులే. చివరికి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు హామీలను అమలు చేసే పరిస్థితి లేదని తీర్మానం చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు.. వేరు పడినప్పుడు.. మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడూ ఇదే కథ! ఎన్నికల్లో హామీలు ఇచి్చనప్పుడు.. వాటిని ఎగ్గొట్టేటప్పుడు కూడా ఇదే విధానం! ఇప్పుడు మొదటి కథగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది.. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మరి రాష్ట్రం నిజంగా ఆర్ధికంగా ధ్వంసమైందా? లేదా అన్నది ఒక్కసారి గమనిద్దాం. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. వాటిపై అందరూ ఆలోచించాలి. ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే మా హయాంలో ఆర్థిక నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ను ప్రశంసించింది. ఎఫ్ఆర్బీఎం అనుమతించిన దానికంటే తక్కువ అప్పు తీసుకున్నారని అభినందించింది. నేరుగా నగదు బదిలీ లాంటి గొప్ప కార్యక్రమాలు చేయడమే దీనికి కారణం. ‘క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్ ఇంప్రూవ్డ్’ అని సామాజిక ఆర్థిక సర్వే కితాబిచ్చింది. ధర్మం వైపు నిలవండి..చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జూన్ 12వతేదీకి రెండు రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా కింద రూ.5,655 కోట్లు వచ్చాయి. రెండోసారి కూడా కేంద్రం నుంచి పన్నుల వాటా డబ్బులు జమయ్యాయి. ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి కనీసం రూ.7–8 వేల కోట్లు ఖజానాలో ఉన్నాయి. అంత డబ్బు ఉన్నా డ్రామాలాడుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పిన అంశాలను.. వాస్తవపత్రం పేరుతో నేను చెప్పిన వాటిని ఒక్కసారి బేరీజు వేసి పరిశీలించండి. మీరంతా ధర్మం వైపు నిలబడాలని కోరుతున్నా. విపత్తులోనూ ఆచితూచి అప్పులు» కోవిడ్ సమయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గణనీయంగా తగ్గింది. » కేంద్ర పన్నుల వసూళ్లు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2019–20లో –3.38% తగ్గాయి. 2020–21లో ఆ పెరుగుదల 0.85 శాతం మాత్రమే ఉంది. » సాధారణంగా ఏటా కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లలో పెరుగుదల 18 నుంచి 19 శాతం ఉంటుంది. » కోవిడ్‌తో కేంద్ర ప్రభుత్వ పన్నుల వసూళ్లు గణనీయంగా తగ్గడంతో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల్లో వాటా కూడా బాగా తగ్గింది. » కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాని జీఎస్డీపీ నిష్పత్తిలో తీసుకుంటే చంద్రబాబు హయాంలో 3.72 శాతం వస్తే మా హయాంలో కోవిడ్ కారణంగా 2.92 శాతానికి పడిపోయింది. » కోవిడ్ వల్ల మనకు బాగా నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కేంద్రమే కాదు.. ప్రతి రాష్ట్రం కూడా అప్పులు ఎక్కువగా చేసుకునే అవకాశం కల్పించినా చంద్రబాబు హయాంతో పోలిస్తే తక్కువే తీసుకున్నాం. » చంద్రబాబు హయాంలో కాంపౌన్డ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబులిటీస్ 21.63 శాతం అయితే మా హయాంలో 12.90 శాతమే ఉంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో అప్పులు 18.15 శాతం పెరగ్గా 2019–24 మధ్య వైఎస్సార్సీపీ పాలనలో కేవలం 13.80 శాతమే పెరిగాయి. ఎక్కువ అప్పులు చేసిన బాబు గొప్పవాడా? తక్కువ చేసిన మేం ఆర్థిక విధ్వంసకారులమా? ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్లు అప్పు ఉందని దు్రష్ఫచారం చేస్తూనే.. సూపర్ సిక్స్, సూపర్ సెవన్, సూపర్ టెన్ అంటూ చంద్రబాబు హామీలిచ్చారు. హామీలన్నీ అమలు చేయాలని ప్రజలు అడుగుతుండటంతో రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా రూ.14 లక్షల కోట్ల అప్పులు లేవు. బడ్జెట్లో చూపించలేక అధికారులతో రెండుసార్లు సమీక్ష చేశారు. చివరకు గవర్నర్ ప్రసంగంలో రూ.14 లక్షల కోట్లు కాస్తా రూ.10 లక్షల కోట్లకు తగ్గించారు. పోనీ నిజాలు చెప్పించారా? అంటే అదీ లేదు! » చంద్రబాబు గతంలో అధికారంలోకి రాకముందు అంటే 2014 జూన్ 2 నాటికి రూ.1,18,051 కోట్ల అప్పులు ఉంటే ఆయన దిగిపోయే నాటికి రూ.2,71,798 కోట్ల అప్పులున్నాయి. ఆ అప్పులు 2024 జూన్ నాటికి రూ.5.18 లక్షల కోట్లకు చేరాయి. » ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు గతంలో చంద్రబాబు అధికారంలోకి రాక మునుపు అంటే 2014 జూన్ 2 నాటికి రూ.5,744 కోట్లు ఉండగా ఆయన హయాం ముగిసే నాటికి రూ.50 వేల కోట్లకు ఎగబాకాయి. అనంతరం మా హయాం ప్రారంభమయ్యే నాటికి రూ.50 వేల కోట్లతో మొదలైన అప్పులు చివరకు రూ.1.06 లక్షల కోట్లకు చేరాయి. » ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులు.. అంటే విద్యుత్ సంస్థల అప్పులు చూస్తే గతంలో చంద్రబాబు అధికారంలోకి రాక మునుపు 2014 జూన్ 2 నాటికి రూ.26 వేల కోట్లు ఉంటే ఆయన హయాం ముగిసే నాటికి రూ.86,215 కోట్లకు ఎగబాకాయి. మా హయాం చివరికి అవి రూ.1.23 లక్షల కోట్లకు చేరాయి. » మొత్తంగా అప్పులు ఎంత? అని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచి్చన అప్పులు, గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకుండా ఉన్న అప్పులు గతంలో చంద్రబాబు హయాంలో 2014 జూన్ 2 నాటికి రూ.1,23,343 కోట్లు ఉంటే ఆయన వైదొలగే నాటికి రూ.4.08 లక్షల కోట్లకు ఎగబాకాయి. » మేం అధికారం చేపట్టే నాటికి రూ.4.08 లక్షల కోట్లతో మొదలు పెడితే దిగిపోయే నాటికి రూ.7.48 లక్షల కోట్ల అప్పులున్నాయి. » చంద్రబాబు హయాంలో అప్పుల వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 21.63 శాతం ఉంటే మా హయాంలో అది 12.93 శాతమే ఉంది. అంటే 21.63 శాతం అప్పులు చేసిన వాడు గొప్పవాడా? ఆరి్థక విధ్వంసకారుడా? 12.93 శాతమే అప్పులు చేసిన మేం ఆర్థికంగా ధ్వంసం చేసినట్లా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. » రాష్ట్రానికి సంబంధించి 2024 మార్చి వరకు రూ.4.85 లక్షల కోట్లు మాత్రమే అప్పులున్నట్లు రాజ్యసభకు తెలియచేశారు. నేను జూన్ వరకు తీసుకున్నా కాబట్టి పెంచి చూపించా. వాళ్లు ఇచి్చన స్టేట్మెంట్లో రూ.4.85 లక్షల కోట్లు మాత్రమే అని ఉంది. మరి ఎక్కడ నుంచి వచి్చంది ఈ రూ.పది లక్షల కోట్లు అప్పు? లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగానే చిత్రీకరించి చూపించడం ధర్మమేనా? -
అబద్ధపు పత్రాలు
శాసనసభలో ఉన్నది రెండు పక్షాలే. ఒకటి అధికారపక్షం.. రెండు ప్రతిపక్షం. కానీ ప్రజల గొంతుక విన్పించకూడదనే లక్ష్యంతో వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించకుండా కుట్రలు చేస్తున్నారు. ప్రతి పక్షంగా గుర్తిస్తే ప్రజల గొంతుక విన్పించేందుకు అసెంబ్లీలో తగిన సమయం కేటాయించాల్సి వస్తుంది. అదే జరిగితే పాలక పక్షం సాగిస్తున్న ఆటవిక పాలన, విధ్వంసకాండ గురించి గళమెత్తుతాం. ఈ భయంతో మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించకపోతే మిన్నకుండిపోము. మీడియా ద్వారా ప్రజల గొంతుక విన్పిస్తాం. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం చంద్రబాబునాయుడు శ్వేత పత్రాల పేరుతో డ్రామాలాడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాలు వల్లె వస్తూ చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాలన్నీ తప్పుడు పత్రాలేనని స్పష్టం చేశారు. ఆ శ్వేతపత్రాల్లో తప్పులను సాక్ష్యాధారాలతో ఎత్తిచూపుతూ.. వాస్తవ పత్రాల(ఫ్యాక్ట్ షీట్స్)ను తాము విడుదల చేస్తున్నామని చెప్పారు. శ్వేతపత్రాల్లో చంద్రబాబు చెప్పిన అంశాలను.. ఫ్యాక్ట్ షీట్స్‌లో తాము చెబుతున్న వాస్తవాలను పరిశీలించి.. ధర్మం వైపు నిలబడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలన్నీ అబద్ధపు, తప్పుడు పత్రాలేనని సాక్ష్యాధారాలు, గణాంకాలతో నిరూపించారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం అప్పు రూ.14 లక్షల కోట్లని దు్రష్ఫచారం చేసిన చంద్రబాబు.. గవర్నర్ ప్రసంగంలో ఆ అప్పును రూ.పది లక్షల కోట్లుగా చూపించారని ఎత్తిచూపారు. వాస్తవానికి రాష్ట్ర అప్పు రూ.7.48 లక్షల కోట్లేనని కాగ్ (కాం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలను చూపారు. కరోనా వల్ల ఆదాయం తగ్గినా, తక్కువ అప్పులు చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించామని కేంద్ర సామాజిక ఆరి్థక సర్వే ప్రశంసించిందన్నారు. బండారం బయట పడుతుందని నాటకాలు 2019 మే 30 నాటికి తాము అధికారంలోకి వచి్చనప్పుడు రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.వంద కోట్లే ఉన్నాయని టీడీపీ గెజిట్ ఈనాడు కథనాన్ని ప్రచురించిందని వైఎస్ జగన్ చెప్పారు. అయినా సరే 2019–20కి సంబంధించి రూ.2.27 లక్షల కోట్లతో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని గుర్తు చేశారు. కానీ జూన్ 12 నాటికి రాష్ట్ర ఖజానాలో రూ.7–8 వేల కోట్ల నిధులు ఉన్నా, పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి సీఎం చంద్రబాబు భయపడుతున్నారని దెప్పి పొడిచారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించాల్సి వస్తుందని, నిధులు కేటాయించకపోతే.. హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కుతారని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పుపై తాను చెప్పినవన్నీ అబద్ధాలేనన్నది బయట పడుతుందనే భయంతోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా.. ఏడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి చోటుచేసుకున్న దాఖలాలు లేవని ఎత్తిచూపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రశ్నించే స్వరం ఉండకూడదనే లక్ష్యంతో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. 52 రోజులుగా రాష్ట్రంలో సాగుతోన్న నరమేధమే అందుకు నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. హామీలన్నీ వెంటనే నిలబెట్టుకున్నాం వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలన్న ధృఢ నిశ్చయంతో ఆనాడు మేము నవరత్నాలు ప్రకటించాం. అధికారంలోకి వచ్చాక ఇచి్చన హామీలన్నీ అమలు చేశాం. రాష్ట్రంలో ఇప్పటికీ రాజకీయ, ఆరి్థక, సామాజిక స్వాతంత్య్రాన్ని పొందలేక పోతున్న వారి కోసం ఉద్యోగాల స్థాయిని, కాలేజీ సీట్ల స్థాయిని దాటి నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ కాంట్రాక్ట్‌ల్లోనూ వారి వాటాను కూడా నిర్ణయిస్తూ ఏకంగా చట్టాలు చేశాం. గ్రామాలను మార్చేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. మద్యాన్ని తగ్గించి, మాన్పించే విధానాన్ని అమలు చేశాం. పరిశ్రమల్లో ఉద్యోగాలు రాక మన పిల్లలు అవస్థలు పడుతున్నారని, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇస్తామని ఏకంగా చట్టాలు చేశాం. భారతదేశ సామాజిక న్యాయ చరిత్రలోనే కనీవినీ ఎరగని విధంగా బడుగులు, బలహీన వర్గాలు, మహిళలకు పెద్ద పీట వేస్తూ, అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే చరిత్ర గతిని మార్చే చట్టాలు తీసుకువచ్చాం. శాశ్వత ప్రాతిపదికన గతంలో ఎప్పుడూ లేనట్లుగా బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపులు తిప్పే సామాజిక న్యాయం చేసే విధంగా చట్టాలు తీసుకువచ్చాం. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే కీలక చట్టాలు అసెంబ్లీ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం. అది మా ప్రభుత్వం మాత్రమే చేసింది. అదే రకంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు నామినేటెడ్ పనుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మరో చట్టం చేశాం. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా, వారి నైపుణ్యం పెంచేలా ప్రభుత్వమే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెట్టే విధంగా మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేశాం. మద్య నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో బెల్టు షాపులు మూయించడమే కాకుండా, అవి శాశ్వతంగా మూతబడాలని, అవి మళ్లీ తెరిచే అవకాశం ఉండకూడదని, 2019 అక్టోబరు 1 నుంచి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిపేలా నిర్ణయం తీసుకున్నాం. భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరిగేలా ఉచితంగా పంటల బీమా, పంటల పరిహారం అందించేలా చట్టం చేశాం. అది కూడా అధికారంలోకి వచి్చన కేవలం రెండున్నర నెలల్లోనే. హామీలపై నోరుమెదపని చంద్రబాబు ఇప్పుడు.. ఇచి్చన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తావంటే చంద్రబాబు సరైన సమాధానం చెప్పడు. పోలవరం ఎప్పుడు కడతావంటే.. ఎప్పటికి అవుతుందో తెలియదు అంటాడు. పోనీ అమరావతి అయినా ఎప్పుడు కడతావు అంటే.. నువ్వు చెప్పు అని ఎదురు ప్రశ్న వేస్తాడు. ఎన్నికల్లో ట్రూ అప్ కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు.. ఎప్పుడు చేస్తావు అంటే నోరు మెదపడు. ఇసుక ఉచితం అన్నావు.. ఇప్పుడు ఇంతలా అమ్ముతున్నావంటే ఏం.. మీ ఇంటికి తెచ్చి పోస్తానని చెప్పానా? అంటాడు. మెగా డీఎస్సీ అన్నాడు.. నువ్వు రాకముందే 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. నువ్వు ఇచ్చింది 10 వేల పోస్టులే కదా.. ఇది మెగా ఏంటి? అంటే దానికీ సమాధానం ఉండదు. ఆ రిక్రూట్మెంట్ కూడా వాయిదా వేసుకుంటూ వెళ్లారు. వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానని వారిని రోడ్డున పడేశారు. ఇంటింటికీ రేషన్ సప్లైని ఆపేశారు. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అంటూ కత్తిరింపులు ఉంటాయని చెప్పకనే చెబుతున్నారు. ఇవన్నీ అడగకూడదని ఇక ఏం చేస్తున్నారు అంటే.. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తులకు నష్టం చేకూర్చడం, ఒక భయాన్ని క్రియేట్ చేయడం.. ఇదీ ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం తీరు. రివర్స్ టెండరింగ్ కమీషన్లు, దోపిడీకి మారుపేరుగా మారిన పరిస్థితుల్లో ఆ వ్యవస్థను మార్చి ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండాలన్న సంకల్పంతో మొత్తం టెండరింగ్ పద్ధతిలోనే సంస్కరణలు చేపట్టాం. ఆ మేరకు జ్యూడిíÙయల్ ప్రివ్యూ యాక్ట్.. చట్టం తీసుకువచ్చాం. టెండరు పనుల ప్రారంభ ప్రక్రియను పూర్తిగా హైకోర్టు జడ్జి ముందు పెడుతూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయంగా మారుస్తూ దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానానికి శ్రీకారం చుట్టాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే 9 గంటల పాటు కరెంటు సరఫరా చేశాం. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ కరెంటు ఇస్తూ తద్వారా రూ.720 కోట్ల మేర వారికి ప్రయోజనం కలిగించాం. ఇంకా పంటలకు గిట్టుబాటు ధరలు కలి్పంచడం కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. పవర్‌పై అన్నీ కోతలే విద్యుత్ రంగంపై శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విద్యుత్ విషయంలో గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వస్తే దేశంలో ముందు ఏపీనే కనిపిస్తుందని, ఇక్కడ ఆ రంగంలో అన్ని సంస్కరణలు జరిగాయన్నారు. చంద్రబాబు రాక ముందు 2014–15లో పంపిణీ సంస్థల విద్యుత్ నష్టాలు రూ.6,625.88 కోట్లు ఉంటే.. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో.. 2018–19 నాటికి అవి ఏకంగా రూ.28,715 కోట్లకు ఎగబాకాయన్నారు. అంటే 34 శాతం పెరిగాయని చెప్పారు. అదే తమ ప్రభుత్వ హయాంలో రూ.28,715 కోట్లతో మొదలైన విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు కొంతే పెరిగి.. 2023–24 నాటికి రూ.29,110 కోట్లకు చేరాయన్నారు. అంటే ఐదేళ్లలో పెరిగిన విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు కేవలం 0.34 శాతమేనని, ఆ మొత్తం రూ.395 కోట్లేనని చెప్పారు. అదే చంద్రబాబు హయాంలో ఆ నష్టాలు ఏకంగా 34 శాతం పెరిగాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేసేలా ‘సెకీ’తో ఒప్పందం కుదుర్చుకున్నామని, దీనిపైనా దు్రష్పచారం ధర్మమేనా.. అని ప్రశ్నించారు. -
కేంద్ర పద్దుపై కోటి ఆశలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2024–25) కేంద్రం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కారణాలేవైనా గత పదేళ్లుగా తెలంగాణ అవసరాలు, అభ్యర్థనలను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లోనైనా రాష్ట్రానికి వరాలు కురిపిస్తుందని ఆశిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరిస్తామని చెపుతున్న తమకు ఏ మేరకు సాయమందుతుందోననే ఉత్కంఠ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో కనిపి స్తోంది. ముఖ్యంగా కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రీజనల్ రింగు రోడ్డు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐటీఐల ఆధునీకర ణకు ప్రత్యేక ఆర్థిక సాయం, నికర అప్పుపై సీలింగ్, ఆఫ్ బడ్జెట్ (బడ్జెటే తర) రుణాలపై పరిమితులు, మూసీ సుందరీకరణకు నిధులు, సెస్ తగ్గింపు, ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ లాంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈసారి ఎలా ఉంటుందోనన్న చర్చ రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలో అమలు పర్చాల్సిన ఆరు గ్యారంటీలకు తోడు రైతు రుణమాఫీ లాంటి అదనపు భారాల నుంచి ఉపశమనం పొందాలంటే కేంద్రం నుంచి సాయం అవసరమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రుణ సమీకరణకు కేంద్రం చేయూత అవసరమవు తుందని, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పులను తీసుకునేందుకు గాను ఆఫ్ బడ్జెట్ రుణాల విషయంలో వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నాయి. ఆ రెండిటిపై గంపెడాశలు.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రెండు పద్దు లపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టు కుంది. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్లు ఏ మేరకు వస్తాయోనని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తు న్నాయి. వీటిని బట్టే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ఉంటాయని, ఈ రెండు పద్దుల్లో కేటాయింపులు అటూ ఇటు జరిగితే మొత్తం బడ్జెట్ అంచనాలే తారు మారవుతాయని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పన్నుల్లో వాటా కింద రూ.26 వేల కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయి డ్ పద్దు కింద రూ.21 వేల కోట్ల పైచిలుకు నిధులను ప్రతిపాదించింది. ఇవి రెండూ కలిపి మొత్తం బడ్జెట్లో 17 శాతం కావడం గమనార్హం. కాగా కేంద్ర పన్నుల వాటాలో ఈసారి పెరుగుదల కనిపిస్తుందని ఆశిస్తు న్నామని, అలాగే గత కొన్నేళ్లుగా ఆశించిన మేర ఇవ్వని గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను ఈసారైనా అవసరం మేరకు కేటా యించాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.నికర అప్పు సీలింగ్‌పై తేల్చండిజాతీయ రహదారుల నిర్మాణానికి, ఉపాధి హామీకి, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, ఆర్థిక సంఘం సిఫారసుల అమలుకు బడ్జెట్ కేటాయింపు, మహిళా శిశు సంక్షేమ పద్దులను పెంచడం ద్వారా పరోక్షంగానైనా రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. నికర అప్పుపై సీలింగ్‌ను కూడా బడ్జెట్ ప్రతిపాదనల సమయంలోనే వెల్లడించాలని, తద్వారా తాము అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకునే వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై ఎలాంటి జీఎస్టీ విధించకూడదని, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ)ను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి సూచించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డికేంద్రాన్ని కోరారు.ఈసారి బడ్జెట్లో తెలంగాణ ఆశిస్తున్నవివే..ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరు ద్ధరణ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు, ఆఫ్బడ్జెట్ రుణాల విషయంలో కేంద్ర వైఖరిలో మార్పు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీ లకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ల మంజూరు మరో ఐదేళ్లు పొడిగింపు, సర్‌చార్జీల వాటా 10 శాతం మించకుండా పన్నుల ప్రతిపాదన, స్కిల్స్ యూనివర్సిటీకి సహకారం, మూలధన వ్యయం కోసం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో తెలంగాణకు నిధుల పెంపు, సింగరేణి కాలరీస్‌కు కొత్త బ్లాక్‌ల కేటాయింపు, స్మార్ట్ సిటీ మిషన్, సర్వేలు పూర్తయి ఉన్న 30 రైల్వే లైన్లకు నిధులు, గృహజ్యోతి పథకాన్ని ముఫ్త్ బిజిలీ యోజనకు అనుసంధానం, కొత్త నవోదయ పాఠశాలలు, నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు. నష్టాలకు తోడు బకాయిలు..!కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల విషయంలో అనుసరించిన ఆర్థిక వైఖరి కారణంగా తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్లలో చాలా నష్టపో యింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకు పోయాయి. పన్నుల్లో వాటా తగ్గింపు కారణంగా రూ. 33,712 కోట్ల రెవెన్యూ నష్టం జరిగిందని, నీతి ఆయోగ్ మిషన్ భగీరథ సిఫారసుల మేరకు రావాల్సిన రూ.19,205 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.17,828 కోట్లు ఇంకా రాలేదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 2021–26 వరకు 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్ల నుంచి రూ.5,374 కోట్లు ఇంకా అలాగే ఉన్నాయని, వెనుకబడిన జిల్లాలకు నిధుల కింద రూ.2,250 కోట్లు, 14వ ఆర్థిక సంఘం సిఫారసులు రూ.817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక నిధులు రూ.723 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు పొరపాటుగా బదిలీ అయిన సీసీఎస్ పథకాల నిధులు రూ.495 కోట్లు ఇప్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ విజ్ఞప్తులు, సూచనలపై తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే. -
మోసం చేయడమే కాంగ్రెస్ పని: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేట జిల్లా: ఆరు గ్యారంటీలు అని చెప్పుకోవడానికే తప్ప ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో సోమవారం(జులై 23) జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఉచిత బస్సు అని నమ్మించి మోసం చేసి బస్సులు తగ్గించారు.మహిళలు ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకునేలా చేశారు. రైతుల రుణమాఫీ కంటే ఫ్లెక్సీలు, పాలాభిషేకాలకే ఖర్చు ఎక్కువైంది. ఏ ఒక్క మంత్రికి వ్యవసాయం మీద అవగాహన లేదు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పని. 24 గంటల కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. గోదావరికి వరద వచ్చినా కాళేశ్వరం ఎక్కడికీ పోలేదు క్షేమంగా ఉంది. అక్కడ మీరు స్విచ్ ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది’అని జగదీష్‌రెడ్డి అన్నారు. -
ప్రజల దృష్టి మళ్లించడానికే విధ్వంసకాండ
సాక్షి, అమరావతి: అలవిగాని హామీలిచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వ చ్చిన చంద్రబాబు నాయుడు.. వాటిని అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే విధ్వంసాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలను ప్రోత్సహిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేయిస్తూ.. దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీకి చెందిన వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో, ప్రజలను మోసం చేసి సీఎం అయ్యారన్నారు. ‘గత ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికానికీ విద్యా దీవెన అందించాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించిన విద్యా దీవెన ఇంకా ఇవ్వలేదు. ఏప్రిల్, మే, జూన్ కూడా అయిపోయింది. రెండు త్రైమాసికాల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. అదే జగన్ సీఎంగా ఉండి ఉంటే ఏప్రిల్‌లో వసతి దీవెన, రైతు భరోసా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, మత్స్యకార భరోసా డబ్బులు ఇప్పటికే వచ్చి ఉండేవి. ఈ రోజు ప్రతి అక్కచెల్లెమ్మ ఎదురు చూస్తోంది. ‘పిల్లలను బడికి పంపితే జగన్ ఒక్కరికే అమ్మ ఒడి కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాడు. అదే నేను అధికారంలోకి వస్తే ఎంత మంది పిల్లలను బడికి పంపితే అంత మందికి అమ్మ ఒడి ఇస్తాం’ అని చంద్రబాబు చెప్పారు. ఇంట్లో నలుగురు పిల్లలుంటే నలుగురికి రూ.15 చొప్పున రూ.60 వేలు ఇస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో చెప్పినట్టు 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి నెలకు రూ.1,500 ఇవ్వండని ఈ రోజు ప్రతి అక్కచెల్లెమ్మ అడుగుతోంది. ఈ రోజున రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రకారం 2.10 కోట్ల మందికిపైగా అక్కచెల్లెమ్మలు ఉన్నారు. ఇందులో పెన్షన్లు తీసుకుంటున్న వారిని పక్కన పెట్టినా 1.50 కోట్ల మంది మాకు రూ.1,500 ఎప్పుడిస్తావ్ అని నిలదీస్తున్నారు. ప్రతి పిల్లాడు అడుగుతున్నాడు. జగన్ మామ మా అమ్మకు రూ.15 వేలు ఇచ్చేవాడు.. మీరు తల్లికి వందనం ఇస్తాం అన్నారు. ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. 50 లక్షల మంది రైతన్నలు పెట్టుబడి సాయం ఏమైందంటున్నారు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన సున్నా వడ్డీ డబ్బులు ఎందుకు ఇవ్వలేదని అక్కచెల్లెమ్మలు అడుగుతున్నారు. కాలేజీల్లో చదివిన పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మత్స్యకార భరోసా రూ.20 వేల చొప్పున ఎప్పుడిస్తారని మత్స్యకారులు అడుగుతున్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే విధ్వంసం సృష్టిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
హామీల అమలు ఎప్పుడు?
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల హామీల అమలు కోసం వారంతా ఎదురుచూస్తున్నారన్నారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.హామీల అమలుకు కార్యాచరణ ఏదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెలవుతోందని.. పథకాల అమలు ఎప్పుడని నిలదీశారు. ప్రభుత్వ ధోరణి చూస్తుంటే పరిపాలన మీద కంటే కక్ష సాధింపులపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అర్థమవుతోందన్నారు. రెడ్ బుక్ అమలు మీద కంటే హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కళ్యాణి ఇంకా ఏమన్నారంటే.. 2014లోనూ ఇలాగే మాటతప్పారు..కూటమి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. 2016 నుంచి సున్నా వడ్డీ ఆపేశారు. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు ఇస్తామని ఇవ్వలేదు.మహిళల సొంతింటి కల నెరవేరుస్తామని ఆ హామీనీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం మహిళల్లో పెన్షన్‌దారులను తీసేస్తే ఈ పథకానికి అర్హత ఉన్న మహిళలు 1.72 కోట్ల మంది ఉన్నారు. ప్రభుత్వం నిజంగా ఈ పథకాన్ని అమలు చేస్తుందా, లేదా అని అందరికీ అనుమానం కలుగుతోంది. ఆయా పథకాల చెల్లింపులేవి?మా ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్.. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన, పెన్షన్లు అన్నీ ఠంచనుగా ప్రకటించిన తేదీనే ఇచ్చారు. చివరలో చేయూత కోసం రూ.4 వేల కోట్లు సిద్ధం చేసి ఉంచారు. అయితే ఆ డబ్బులను మహిళల ఖాతాల్లో వేయనీయకుండా టీడీపీ అడ్డుకుంది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ పాటికే డబ్బులు జమై ఉండేవి. ఆ నగదును వెంటనే ప్రభుత్వం మహిళల ఖాతాల్లో వేయాలి. మా ప్రభుత్వంలో అమ్మఒడి కింద ఏటా 44.5 లక్షల మంది మహిళలకు ఐదేళ్లలో రూ.25,809 కోట్లు ఇచ్చాం. స్కూలుకు వెళ్లే ప్రతి బిడ్డకూ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దాదాపు రాష్ట్రంలో కోటి మందికి పైగా స్కూలుకు వెళ్తున్న పిల్లలున్నారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే విద్యాదీవెన, వసతి దీవెన నిధులను ఇవ్వకపోవడంతో విద్యార్థులు అప్పులు చేసి స్కూళ్లు, కళాశాలల ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. అన్నదాతలు అప్పులపాలుజగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 చొప్పున 50 లక్షల మందికి పైచిలుకు రైతుల ఖాతాల్లో జమ చేశారు. చంద్రబాబు ఏటా రూ.20 వేలు రైతులకు ఇస్తామని చెప్పారు. ఖరీఫ్ ప్రారంభమైపోయినా ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయం అందని దుస్థితి. దీంతో నూటికి రూ.10, రూ.20 వడ్డీలకు అప్పులు తెచ్చి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అలాగే ప్రతి మహిళకు ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూటమి నేతలు చెప్పారు. రాష్ట్రంలో 2.5 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం చూస్తున్నారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు. ఇవన్నీ నెరవేర్చడానికి నిర్దేశిత తేదీలు ప్రకటించి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. -
కమిషన్లతోనే సర్కార్ కాలయాపన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా ప్రజలకు ఇ చ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఆయా అంశాలపై కమిషన్ల నియామకాలతోనే కాలయాపన చేస్తోందని బీజేపీ మెదక్ ఎంపీ ఎం.రఘునందన్‌రావు మండిపడ్డారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పాలకులు టైంపాస్ చేస్తున్నారు. గుంపు మేస్త్రీ సరిగా ఉంటేనే ఇతర మేస్త్రీలు కూడా పనిచేస్తారన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు, వరి ధాన్యానికి మద్దతు ధర, రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, వడ్డీ లేని రుణం హామీ ఏమైందని ఆయన ప్రశ్నలు సంధించారు. లక్ష్మీనరసింహస్వామి మీద, ఏడుపాయల దుర్గమ్మ మీద రేవంత్ ఒట్లు వేసి రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ, దానిని ఎలా చేస్తారో చెప్పడం లేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశా రు. రైతు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడో అన్ని ఎకరాలకూ రైతు భరోసా ఇవ్వా లని సూచించారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటామని మాజీ సీఎం కేసీఆర్ చెబుతున్నారు కదా అని ఓ విలేకరి స్పందించగా.. అసెంబ్లీ సమావేశాలు ప్రా రంభం అయ్యేనాటికి మరో 15 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కాపాడుకోలేని పరిస్థితి తలెత్తు తుందని వ్యాఖ్యానించారు. మరో 15 నెలలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అనేది కూడా అనుమానమేనని, అలాంటిది మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు ఉంటామంటే ఎట్లా అని బదులిచ్చారు.