పథకాల అమలులో కాంగ్రెస్ చేతులెత్తేసింది: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను ఎన్నోరకాలుగా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచి్చన ప్రతి హామీ అమలు చేయాల్సిందేనని, ఈ దిశగా ఒత్తిడి చేసేందుకు బీజేపీ రాష్ట్ర పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టిందన్నారు. ఆదివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రశి్నస్తున్న తెలంగాణ పోస్టర్, వెబ్‌సైట్‌ను రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అహంకారం, నియంతృత్వం, నిరంకుశత్వంతో కేసీఆర్ ఓడిపోయినా తెలంగాణ ప్రజలు మాత్రం గెలవలేదన్నారు. అనేక తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పథకాల అమలులో చేతులెత్తేసిందని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ.15 వేలు ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక రకాల గ్యారంటీలంటూ మభ్యపెట్టి ప్రజలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment