ఎన్నికల ముందు టీడీపీ చెప్పిన సూపర్ సిక్స్ హామీల అమలును అధికారంలోకి వచ్చాక గాలికొదిలేసింది. కానీ, రూ.కోట్లు కూడబెట్టుకునేందుకు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఒక ‘సూపర్ సిక్స్’ను తయారు చేసుకున్నారు. అదేమిటనుకుంటున్నారా... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పులివర్తి నాని కనుసన్నల్లో ఆయన అనుచరులు స్వర్ణముఖి నదిలో చంద్రగిరి మండలంలోని నాగయ్యగారిపల్లి, కొటాల, మిట్టపాళెం, శానంబట్ల, తిరుపతి రూరల్ మండలంలోని పైడిపల్లి, తనపల్లి ప్రాంతాల్లో ఆరు రీచ్‌లు అనధికారికంగా ఏర్పాటుచేశారు.
రాత్రింబవళ్లు యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. రాత్రిపూట టిప్పర్లు, పగలు ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతంలోని తిరుచానూరు వద్ద పంట పొలాల్లోనూ దౌర్జన్యంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. నదిలో పెద్ద ఎత్తున తవ్వకాలు చేయడం వల్ల వర్షాకాలంలో తమ గ్రామాలను వరద ముంచెత్తుతుందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో తిరుచానూరు–పాడిపేట గ్రామాల మధ్య స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలను శుక్రవారం పాడిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు రావడంతో నాని అనుచరులు ఇసుక ట్రాక్టర్లను తీసుకుని వెళ్లిపోయారు. – సాక్షి టాస్‌్కఫోర్స్
Comments
Please login to add a commentAdd a comment