Sand Mining
-
సోమిరెడ్డి సొల్లు..ఇసుక దందా ఫుల్లు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నిత్యం నీతి కబుర్లు చెబుతూ జనాన్ని మాయ చేసే సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అసలు రంగు బయటపడింది. సొంత నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతూ ఆయన మనుషులు అడ్డంగా దొరికిపోయారు. ఈ దందాను చూసి గనుల శాఖాధికారులే నివ్వెరపోయారు. అనుమతి లేని పెన్నా నది ఇసుక రీచుల్లో అంత భారీ స్థాయిలో తవ్వకాలు, రవాణా జరుపుతున్నారంటే ఏ స్థాయి అవినీతి జరుగుతుందోనని బెంబేలెత్తిపోయారు. ఈ అక్రమ తవ్వకాల విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా సర్వేç³ల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం విరువూరు, సూరాయపాళెం రీచుల్లో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా ఈ రీచుల్లో ఇసుకను యంత్రాలతో తోడేస్తున్నారు. 16 టైర్ల లారీలు, టిప్పర్లలో యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముతున్నారు. ఈ క్రమంలో సాధారణ తనిఖీల్లో భాగంగా నెల్లూరు జిల్లా గనుల శాఖ ఇన్‌ఛార్జి డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ తన సిబ్బందితో రోడ్డుపై వెళుతున్న కొన్ని లారీలను ఆపి చూసి ఆశ్చర్యపోయారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిపోతున్నట్లు గుర్తించారు. అయితే సోమిరెడ్డివని చెబుతూ చాలా లారీలు ఆగకుండానే వెళ్లిపోయాయి. వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా, వారిని బెదిరించి బలవంతంగా ఆ వాహనాలను తరలించుకుపోయారు. ఈ లారీలు విరువూరు, సూరాయపాళెం రీచుల నుంచి వస్తున్నాయని తెలుసుకుని అధికారులు అక్కడికి బయలుదేరారు. అక్రమార్కులు ఈ విషయం తెలుసుకుని లోడైన వందలాది లారీలను ఇతర మార్గాల్లో మళ్లించారు.పై నుంచి ఒత్తిడి.. చేతులెత్తేసిన అధికారులుతనిఖీలు చేస్తున్న అధికారులకు ఫోన్లలో పైనుంచి ఒత్తిడి పెరగడంతో మిగిలిన అక్రమ ఇసుక లారీలను పట్టుకోకుండా వదిలేసినట్లు తెలిసింది. తాను చెప్పినట్లు వినకపోతే బదిలీ చేయిస్తానని సోమిరెడ్డి హెచ్చరించడంతోనే అధికారులు మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఇంత భారీ అక్రమ రవాణాను అడ్డుకుని ఏమీ పట్టుకోకపోతే తమకు ఇబ్బంది వస్తుందని బతిమిలాడడంతో కేవలం రెండు లారీలు, ఒక టిప్పర్, రెండు హిటాచి ఎక్సవేటర్లను వారికి అప్పగించారు. నిజానికి రెండు లారీలు, ఒక టిప్పర్ కోసం రెండు భారీ హిటాచి ఎస్కవేటర్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ వందలాది లారీల్లో ఇసుక తరలి పోతున్నట్లు తేలింది. నిజానికి పక్కన పొదల్లోనే మరో 4 హిటాచీ ఎస్కవేటర్లను దాచినట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తం ఆరు ఎస్కవేటర్లతో పెన్నా నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి నిత్యం వందల లారీలు, టిప్పర్లలో తరలించి అమ్ముకుంటున్నారు. ఈ విషయం తెలిసినా ఎమ్మెల్యే సోమిరెడ్డి బెదిరింపులతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. దొరికిన యంత్రాలు, టిప్పర్లలోనూ కొన్నింటిని వదిలేసి వెళ్లిపోవడంతో అధికారుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఎమ్మెల్యే ఫోన్.. మాట్లాడండి..ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు వివరిస్తున్న సమయంలో స్థానిక టీడీపీ నేత ఒకరు.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫోన్ చేస్తున్నాడని అధికారికి ఇవ్వబోగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘నేను జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతుంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నారంటూ ఎలా ఇస్తావ్.. ఇకపై ఇల్లీగల్ బిజినెస్ చేస్తే ఒప్పుకోం’ అంటూ టీడీపీ నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. విరువూరు రీచ్ వద్ద భారీగా ఆగి ఉన్న లారీలను ఆపేందుకు పోలీసుల సహాయం కోరినా వారి నుంచి కనీస స్పందన కూడా లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా విరువూరు, సూరాయపాళెంలో రీచ్‌ల్లో 16 టైర్ల లారీ లోడింగ్‌కు టీడీపీ నేతలు రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా వందలాది వాహనాల నుంచి దండుకుంటున్నారు. పెన్నా బ్యారేజ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రైతులు లబోదిబోమంటున్నా పట్టించుకోవడం లేదు. అనుమతి లేని రీచ్‌ల్లో తవ్వకాలు ఆకస్మికంగా ఇసుక రీచ్‌లను తనిఖీ చేయడం కోసం పోతిరెడ్డిపాడు, సంగం, సూరాయపాలెంలో ఉన్న ఇసుక రీచ్‌లు, డంప్ యార్డులను చూసి తిరిగి నెల్లూరు వెళుతుండగా కొన్ని లారీలు. విరువూరు రీచ్ నుంచి వస్తున్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లాం. అక్కడ రీచ్‌పై కోర్టు స్టే ఉంది. అయినా ఇక్కడి నుంచి ఇసుక అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని గమనించాం. రెండు టాటా హిటాచీలు, రెండు లారీలు, ఒక టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చాం. – బాలాజీ నాయక్, ఇన్‌ఛార్జి డిప్యూటీ డైరెక్టర్, గనుల శాఖ, నెల్లూరు సోమిరెడ్డి టార్గెట్ రూ.100 కోట్లు ఇసుక రీచ్‌ల ద్వారా ఎమ్మెల్యే సోమిరెడ్డి టార్కెట్ రూ.100 కోట్లు పైనే అని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. అధికారుల కళ్ల ముందే ఇసుక లారీలు వెళుతున్నా పట్టించుకోవడం లేదు. సోమిరెడ్డి కనుసన్నల్లో దందా జరుగుతుండటం వల్లే ఇలా బరితెగించారు. గనుల అధికారి సూరాయపాళెం, విరువూరు రీచ్‌ల వద్దకు వెళుతున్నారని వందలాది లారీలను అక్కడి నుంచి పంపించేశారు. ఇదీ సోమిరెడ్డి నీతి, నిజాయితీ. ఇసుకను అక్రమంగా తప్వుకోమని సీఎం చంద్రబాబు సోమిరెడ్డికి అనుమతి ఇచ్చినట్టుంది.– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి -
ఓటీటీలో 'ఇసుక మాఫియా' హిట్ సినిమా స్ట్రీమింగ్
మలయాళ నటుడు హకీమ్ షాజహాన్ నటించిన 'కడకన్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇసుక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన రివెంజ్ డ్రామాగా ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. గతేడాది మార్చిలో విడుదలైన ఈ మూవీ సుమారు 10 నెలల తర్వాత ఓటీటీలోకి సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే ఈ చిత్రం మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూసే ఛాన్స్ ఉంది.మలయాళంలో తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన కడకన్ మంచి విజయాన్ని అందుకుంది. అయితే, సడెన్‌గా సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇసుక మాఫియాలో జరిగే సంఘటనలను తెరపై డైరెక్టర్ సాజిల్ మాంపాడ్ అద్భుతంగా తీశాడు. అతనికి మొదటి సినిమా ఇదే అయినప్పటికీ దర్శకుడిగా ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. మంజుమ్మెల్ బాయ్స్, అన్వేషిప్పిమ్ కండేతుమ్ వంటి భారీ హిట్ సినిమాలను తట్టుకుని కడకన్ మంచి కలెక్షన్స్ రాబట్టింది.ఇసుక మాఫియా వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ప్రతీకార ఘటనలను తెరపై దర్శకుడు చూపించాడు. ఇండియాలోనే నాణ్యమైన ఇసుక కేరళలోని మల్లపురం ఏరియాలో దొరుకుతుంది. అక్కడ ఇసుక మాఫియా వల్ల జరిగిన కొన్న నేరాల నుంచి స్ఫూర్తి పొందుతూ.. స్నేహం, ప్రేమ, యాక్షన్ అంశాలను వాటికి జోడించి కడకన్ చిత్రాన్ని తెరకెక్కించారు. -
కూటమి నేతల అండదండలతో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా
-
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ
-
మా జీవధారకు మేమే రక్ష
పలమనేరు: అధికారం అండతో సహజవనరుల దోపిడీకి తెగబడ్డ తెలుగుదేశం నేతలు సాగునీటి చెరువునూ చెరబట్టారు. ఐదువేల ట్రాక్టర్ల ఇసుకను యథేచ్ఛగా తోడేశారు. కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. తమ జీవనాధారమైన చెరువులో 20 నుంచి 30 అడుగుల లోతున తవ్వుతుండటాన్ని తట్టుకోలేని గ్రామస్తులు ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోమన్నారు. ఒక్కొక్కరుగా ప్రశ్నిస్తే అక్రమార్కులు బెదిరిస్తుండటంతో గ్రామస్తులంతా ఏకమయ్యారు. నెలల తరబడి సాగుతున్న ఈ దోపిడీని కలిసికట్టుగా అడ్డుకున్నారు. గ్రామస్తుల ఐక్యత చూసి అక్రమార్కులు జేసీబీలు, ట్రాక్టర్లతో సహా పలాయనం చిత్తగించారు. ఇక చెరువును తామే రక్షించుకుంటామని గ్రామస్తులంతా ప్రతినబూనారు. ఈ ఐక్యత సాధించిన ఫలితం పలు గ్రామాల ప్రజలను ఆలోచింపజేస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని మొరం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నం. 133లో 93.94 ఎకరాల విస్తీర్ణంలో పెద్దచెరువు ఉంది. ఈ చెరువు కింద 91 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు ఆధారంగానే మొరం గ్రామంలో 150 కుటుంబాలు, తొప్పనపల్లిలో 80, రామాపురంలో 40, చిన్నపేట కురప్పల్లిలో 60 కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాయి. ఈ చెరువు వల్లే.. ఆ పరిసరాల్లో ఉన్న దాదాపు 600 వ్యవసాయ బోర్లలో ఎప్పుడూ నీరు సమృద్ధిగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం రాగానే టీడీపీ నేతల కన్ను ఆ చెరువుపై పడింది. కొందరు నేతలు ఇసుక తవ్వుకునేందుకు చెరువును పంచుకున్నారు. మూడు నెలలుగా రోజూ ఐదు జేసీబీలతో ఇసుకను తవ్వి 22 ట్రాక్టర్లలో రేయింబవళ్లు తరలించారు. చెరువుకు సమీపంలోని మామిడితోపులు, ఆయా నేతల పొలాలు, అడవులు, రహస్య ప్రదేశాల్లో ఇసుకను డంప్‌చేసి, రాత్రిళ్లు అక్కడి నుంచి కర్ణాటకకు తరలించి అమ్ముకున్నారు. చెరువులో దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో 20 నుంచి 30 అడుగుల లోతున తవ్వి ఐదువేలకుపైగా ట్రాక్టర్ల ఇసుకను అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు.అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో..చెరువు సర్వనాశనం అవుతోందని ఆవేదన చెందిన గ్రామస్తులు ఈ అక్రమాలను ఆపాలని అధికారులకు విన్నవించుకున్నారు. కానీ అధికార పార్టీ నేతలే ఈ అక్రమాలకు పాల్పడుతుండటతో అధికారులు ఇసుక తవ్వకాలను అడ్డుకోలేదు. తమ చెరువును తామే రక్షించుకోవాలని నిర్ణయించుకున్న గ్రామస్తులంతా ఏకమయ్యారు. అందరూ కలిసి ఆదివారం చెరువు వద్దకు వెళ్లి ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. జేసీబీలను, తరలిస్తున్న ట్రాక్టర్లును అక్కడి నుంచి పంపేశారు. ఇసుకాసురులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఈ అక్రమాలపై తాము స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డికే ఫిర్యాదు చేస్తామంటూ గ్రామస్తులు స్పష్టం చేశారు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడే వీఆర్వోకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న వీఆర్వో రమేష్ ఇసుకాసురులను పంపేశారు. ఇసుక ఉచితమనే పాలసీ ఉంటే అవరసమైనవారు సంబంధిత శాఖల ద్వారా అనుమతి తీసుకోవాలిగానీ, ఇలా వ్యాపారాలు చేయడం తప్పని హెచ్చరించారు. ఇకపై ఎవరైనా అనుమతి లేకుండా చెరువులో కనిపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు పట్టించుకోకపోయినా.. తమ చెరువులోకి ఇసుక తవ్వకాలకు ఎవరైనా వస్తే అనుమతించబోమని గ్రామస్తులు తెగేసి చెప్పారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాలవారు తమ గ్రామాల్లో అక్రమాలను అడ్డుకోవడానికి సిద్ధమవుతున్నారు. -
కొవ్వూరులో టీడీపీ నేతల ఇసుక దందా
-
నర్సీపట్నంలో టెన్షన్.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. దీంతో, అక్రమ కేసులను నిరసిస్తూ నేడు వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీస్ యాక్ట్-30 అంటూ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారు.ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడి నియోజకవర్గంలో అరాచకం చోటుచేసుకుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని ప్రశ్నించడమే నేరంగా మారింది. ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు గాను పోలీసులు.. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై పార్టీ నేతలు నేడు శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీస్ యాక్ట్-30 అమలులో ఉందంటూ వైఎస్సార్సీపీ నేతలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.శాంతియుత ర్యాలీకి వైఎస్సార్సీపీ శ్రేణులు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. బుధవారం ఉదయమే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నివాసానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్బంగా పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇక, మంగళవారం రాత్రి నుంచే వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్‌పై ఉమాశంకర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, పోలీసులు తీరుతో అటు సామన్య ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. -
పెన్నమ్మకు గర్భశోకం
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల మండల పరిధిలోని హనుమనుగుత్తి గ్రామ పంచాయతీ పరిధిలోని బిస్మిల్లాబాద్ గ్రామం సమీపంలో పెన్నానదిలోని ఇసుకను అక్రమదారులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. పైగా గేటు వసూలు చేస్తున్నారు. క్వారీలో నుంచి అవసరమైనప్పుడు ఇసుకను ఉచితంగా తెచ్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. యర్రగుంట్ల మండలం పరిధిలో ఎక్కడా ఇసుక క్వారీ లేదు. దీంతో అక్రమార్కులు ఇసుకను తోడేస్తూ పెన్నామ్మకు గర్భశోకం మిగిలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిస్మిల్లాబాద్ గ్రామంలోని కొందరు టీడీపీ నాయకులు పెన్నానదిలోని ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్‌కు ఒక రేటు పెట్టి గేటును వసూలు చేస్తున్నారు. రోజుకు ఒక్కరు చొప్పును వంతులు వేసుకొని బయట నుంచి ట్రాక్టర్లను రప్పించుకొని అనధికారంగా గేటును పెట్టుకుని వసూళ్లకు తెరలేపారు. రోజుకొకరు చొప్పున ఇసుకను అమ్ముకుంటున్నారు. ప్రొద్దుటూరు, రామేశ్వరం పొట్లదుర్తి గ్రామాల నుంచి ఇసుక కోసం రోజూ ట్రాక్టర్లు వరుసలో నిలబడుతున్నాయి.ఇసుక తరలిపోతుండటం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వీరి అక్రమాలను మొదట్లో గ్రామస్తులు అడ్డుకున్నారు. తర్వాత గ్రామం కోసం డబ్బు వసూలు చేస్తున్నామంటూ వారికి నచ్చజెప్పారు. పెన్నాలో అక్రమంగా ఇసుకను గేటు పెట్టి వసూళ్లు చేసుకుంటున్నారని గ్రామంలోని కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మంత్రి ఇలాకాలో అడ్డగోలుగా ఇసుక దందా
పెనుకొండ: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. నియోజకవర్గం పరిధిలోని పెన్నా నదితో పాటు వాగులు, వంకల్లోని ఇసుకను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నారు. నిత్యం ట్రాక్టర్లలో సమీప పట్టణాలకు, కర్ణాటకలోని ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వీరు ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వేయడం వల్ల బోర్లు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ, జనసేన నాయకులు పలువురు నియోజకవర్గంలోని శెట్టిపల్లి, కొండంపల్లి, గోనిపేట, రొద్దం, పరిగి వద్ద పెన్నా నది నుంచి ఇసుక భారీగా తోడేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను నియోజవర్గ పరిధిలో వారికి రూ.2 వేల నుంచి రూ.2,500కు విక్రయిస్తున్నారు. కర్ణాటక ప్రాంతాలకు లోడుకు రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీరి అక్రమ రవాణాను పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా పోలీస్ సిబ్బంది ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటే డబ్బు బెదిరించి విడిపించుకొని పోతున్నారు. ఇసుక తోలుకోమని మంత్రే చెప్పారని, అడ్డుకుంటే మీ కథ చూస్తామంటూ బెదిరిస్తున్నారు. అయినా ట్రాక్టర్లను పోలీసుస్టేషన్‌కు తరలిస్తే పెద్దఎత్తున కూటమి నాయకులు అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇసుక వ్యవహారంలో తలదూర్చడమే లేదు.బోర్లు ఎండిపోతాయికొందరు నాయకులు రోజూ ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వేసి, తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది వ్యవసాయాన్ని దెబ్బ తీస్తుంది. ఇసుక రీచ్‌ల సమీపంలోని భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇసుక అవసరం ఉన్న వారు తగిన అనుమతి పొంది తోలుకుంటే మంచిదే. కానీ ఇది వ్యాపారంగా మారిపోయింది. శెట్టిపల్లి, కొండంపల్లి, గోనిపేట ప్రాంతాల నుంచి ఇసుక భారీగా తరలివెళుతోంది. వంకలు, వాగులు కూడా త్వరలోనే ఖాళీ కానున్నాయి. – గోపాలరెడ్డి, కొండంపల్లి, పెనుకొండ మండలం -
పచ్చ నేతల కబ్జాలో ఇసుక, మద్యం.. కోట్లలో వ్యాపారం: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఇసుక మొత్తం కూటమి నేతల కబ్జాలోకి వెళ్లిపోయిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. పచ్చ నేతలు ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జాచేసి అక్రమంగా కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రంలో ఇసుక మొత్తం @JaiTDP నేతల కబ్జాలోకి వెళ్ళిపోయింది. ధరను అమాంతం పెంచేసి కోట్లలో దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోంది.రాష్ట్రంలో ఇసుక మొత్తం @JaiTDP నేతల కబ్జాలోకి వెళ్ళిపోయింది. ధరను అమాంతం పెంచేసి కోట్లలో దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోంది.#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule#MosagaduBabu#SadistChandraBabu pic.twitter.com/XzHu2XX3D8— YSR Congress Party (@YSRCParty) October 30, 2024 ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జా చేసిన @JaiTDP నేతలు ఇప్పుడు ఏకంగా సివిల్ వర్క్స్, నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పనులు తమకు అప్పగించి వెళ్లిపోవాలని హుకుం జారీచేస్తున్నారు. రాక్షస పాలనకు ఇది కదా నిదర్శనం.ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జా చేసిన @JaiTDP నేతలు ఇప్పుడు ఏకంగా సివిల్ వర్క్స్, నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పనులు తమకు అప్పగించి వెళ్లిపోవాలని హుకుం జారీచేస్తున్నారు. రాక్షస పాలనకు ఇది కదా నిదర్శనం.#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule… pic.twitter.com/BSpiuSDcsL— YSR Congress Party (@YSRCParty) October 30, 2024 ఊరూరా తయారైన ఇసుకాసురులు.. ఇసుక కావాలంటే @JaiTDP నేతలకి కప్పం కట్టాల్సిందే! అని చెప్పుకొచ్చింది. ఊరూరా తయారైన ఇసుకాసురులు.. ఇసుక కావాలంటే @JaiTDP కి కప్పం కట్టాల్సిందే!#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule#MosagaduBabu#SadistChandraBabu pic.twitter.com/5n2GAFyeP1— YSR Congress Party (@YSRCParty) October 30, 2024 -
ఇసుకపై మాయోపాయం
సాక్షి, అమరావతి: ఇసుక ఉచితం అంటూనే డబ్బు వసూలు చేస్తూ జనాన్ని మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం తాజాగా ప్రైవేటు ఏజెన్సీలకు ఇసుక తవ్వకాలు అప్పగించే విషయంలోనూ నాటకాలకు తెరలేపింది. ప్రైవేటు వ్యక్తులకు ఇసుక తవ్వకాలను అప్పగించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సోమవారం జరిగిన గనుల శాఖ సమీక్షలో సూచించారు. కానీ ఇప్పటికే 80కిపైగా ఇసుక రీచ్‌లను ప్రైవేటు ఏజెన్సీల ముసుగులో తమ పార్టీ మద్దతుదారులకు కట్టబెట్టేశారు. రాష్ట్రంలోని 108 ఇసుక రీచ్‌లను దసరా పండుగ సమయంలో ప్రైవేటు వారికి అప్పగించేందుకు గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలవారీగా ఇసుక కమిటీ ద్వారా షార్ట్ టెండర్లు పిలిచారు. టెండర్లు దాఖలు చేయడానికి కేవలం రెండు రోజులే సమయం ఇచ్చి, తమ పార్టీకి చెందిన వారు, తమకు అనుకూలమైన వారికే ఇసుక కాంట్రాక్టులు అప్పగించేలా జిల్లా కలెక్టర్ల ద్వారా టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. ఆఖరి నిమిషంలో తెలుసుకుని టెండర్లు దాఖలు చేయడానికి వచ్చిన వారిని టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు బెదిరించి వెనక్కు పంపారు. దాదాపు 80 రీచ్‌లను ఎమ్మెల్యేలకు చెప్పిన వారికి అప్పగించేయగా, మిగిలిన రీచ్‌లకు సైతం అనుకూలమైన వారిని ఖరారు చేశారు. అప్పగించిన రీచ్‌ల్లో ఈ నెల 16వ తేదీ నుంచే ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 108 రీచ్‌ల్లో ఈ నెలాఖరు నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉల్లంఘనలు కప్పిపుచ్చేందుకే.. ప్రైవేటు వారికి అప్పగించే టెండర్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పడం ఉల్లంఘనలను కప్పిపుచ్చేందుకేనని స్పష్టమవుతోంది. మరో వైపు ఇసుక వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఎవరూ జోక్యం చేసుకోవద్దని కూడా సూక్తులు చెబుతున్నారు. ఇప్పటికే కాంట్రాక్టులు అయిన వారికి కట్టబెట్టేసి, వాటిల్లో తవ్వకాలు కూడా మొదలు పెట్టి.. బయటకు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. ఇసుక రీచ్‌లను ప్రైవేటు వారికి అప్పగించే విషయం ఇంకా చర్చల దశలో ఉందని సీఎం చెబుతుండటం చూస్తుంటే, గ్రీన్ ట్రిబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేందుకేనని తెలుస్తోంది. వర్షాకాలం సీజన్లో ఇసుక రీచ్‌లలో తవ్వకాలు చేపట్టకూడదు. సాధారణంగా నవంబర్ నెలాఖరు వరకు రీచ్‌లు ప్రారంభించకూడదు. కానీ అక్టోబర్ 7వ తేదీనే పలు జిల్లాల్లో టెండర్లు పిలిచి కాంట్రాక్టులను ఖరారు చేశారు. 16వ తేదీ నుంచి తవ్వకాలు కూడా ప్రారంభించారు. కానీ ఇదంతా గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధం కావడంతో, పైకి మాత్రం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే విషయాన్ని ఇంకా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకపక్క రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు సాగించి అడ్డగోలుగా అమ్ముకుంటూ.. పైకి మాత్రం అదేమీ లేదనేలా సీఎం స్థాయి వ్యక్తి నమ్మబలుకుతుండడం విస్తుగొలుపుతోంది. రీచ్‌లు ఇంకా ప్రారంభం కాలేదని చిత్రీకరించే క్రమంలోనే సీఎం ఇలా మాట్లాడుతున్నారని తేటతెల్లమవుతోంది. -
ఇసుక రీచ్‌లూ కొల్లగొట్టేశారు
సాక్షి, అమరావతి: మద్యం మాఫియాతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇసుక దోపిడీకి రాచమార్గం నిరి్మంచుకుంది. రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నీ తమ వారికే దక్కేలా చేసుకుని వాటిపై గుత్తాధిపత్యం సాధించింది. 108 మాన్యువల్ ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు ఏర్పాట్లుచేసుకుని ఇప్పటికే 80కి పైగా రీచ్‌లకు షార్ట్ టెండర్లు పిలిచారు. జిల్లా ఇసుక కమిటీల ద్వారా వాటిని హస్తగతం చేసుకున్నారు. వాటిలో బుధవారం సుమారు 30 వరకు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభించారు.అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పిన వారికే అన్నిచోట్లా జిల్లా ఇసుక కమిటీలు రీచ్‌లు కట్టబెట్టాయి. ఒక పథకం ప్రకారం దసరా పండుగ ముందు ఎటువంటి హడావుడి లేకుండా ఈ రీచ్‌లకు షార్ట్ టెండర్లు పిలిచారు. దానికిముందే వాటి వివరాలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇవ్వడంతో వారు ఏ రీచ్‌కి ఎవరు టెండర్లు వేయాలి, ఎంతకి వేయాలో నిర్ణయించారు. వారు సిద్ధమైన తర్వాత జిల్లా కలెక్టర్లు వెంటనే టెండర్లు పిలిచి దాఖలు చేయడానికి రెండే రెండ్రోజుల సమయం ఇచ్చారు. ఈ సమాచారం తెలియక చాలామంది టెండర్లు దాఖలు చేయలేకపోయారు. ఆఖరి నిమిషంలో తెలుసుకుని ఎవరైనా టెండర్ వేయడానికి వస్తే వారికి టెండర్ డాక్యుమెంట్ ఇవ్వడానికి నానా ఇబ్బంది పెట్టారు.రోజంతా కూర్చోబెట్టి ఎందుకు టెండర్ దాఖలు చేయాలనుకుంటున్నారు? ఎవరి కోసం వేస్తున్నారు? తవ్వకాలకు కావల్సిన సరంజామా మొత్తం ఉన్నాయా అంటూ తెగ విసిగించారు. వేచి ఉన్న వారికి చివర్లో ఏదో ఒక సాకు చెప్పి పంపించేశారు. అన్నీ తట్టుకుని నిలబడిన కొద్దిమంది టెండర్లు దాఖలు చేసినా వారిని అధికారులే బెదిరింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఇక అధికార పార్టీ వాళ్లను కాదని మీరెలా టెండర్లు వేస్తారు? వేసినా ఉపయోగం ఉండదని చెప్పడంతో కొందరు వెనక్కి తగ్గినట్లు సమాచారం. టెండర్లు వేసిన వారికీ నిబంధనల ప్రకారం ఏ విషయం చెప్పకుండా పంపించేశారు. చివరికి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే ఇసుక కాంట్రాక్టులన్నింటినీ కట్టబెట్టేశారు. వారి ద్వారా ముఖ్యనేతకు ముడుపులు అందేలా పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ నెలాఖరులోపు మిగిలిన రీచ్‌లకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వాటిని సొంతం చేసుకునేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఎమ్మెల్యేలు చెప్పినట్లే చేసిన ఇసుక కమిటీలు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు రీచ్‌లను కట్టబెట్టాయి. అత్యధికంగా 17 రీచ్‌లు ఉన్న తూర్పుగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలు బయట వ్యక్తులను కనీసం టెండర్లు వేయడానికి సైతం అనుమతివ్వలేదు. వారికి టెండర్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి అధికారులు భయపడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. ⇒ కడియపులంక రీచ్‌ను రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన బినామీకి ఇప్పించినట్లు సమాచారం. ⇒ రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో మూడు రీచ్‌లు ఉండగా ఒకదాన్ని అక్కడి ఎమ్మెల్యే బత్తుల బలరామయ్య చేజిక్కించుకున్నట్లు తెలిసింది. మరో మూడు రీచ్‌లను ఆయనతోపాటు బుచ్చయ్యచౌదరి చెప్పిన వారికి కేటాయించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ⇒ నిడదవోలు నియోజకవర్గంలోని ముక్కామల, కాకరపర్రు, మల్లేశ్వరం, తీపర్రు 2, 3, మందలపర్రు, జీడిగుంట రీచ్‌లుండగా వాటిని జనసేన, టీడీపీ నేతలు కలిసి పంచుకుని అందుకనుగుణంగా టెండర్లు దాఖలు చేయించి దక్కించుకున్నారు. ⇒ మంత్రి కందుల దుర్గేష్ రెండు రీచ్‌లను తన వారికి ఇప్పించుకోగా మిగిలిన వాటిని టీడీపీ నేతలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వాటిల్లో టీడీపీ నేతలు చెప్పినట్లే జరిగింది. దీంతో స్థానిక జనసేన నాయకులు టీడీపీ వాళ్లతో వాగ్వాదానికి దిగినా ప్రయోజనం కనిపించలేదని చెబుతున్నారు. ⇒ కొవ్వూరు నియోజకవర్గంలోని కుమారదేవం–1, 2, 3, చిడిపి, వేగేశ్వరపురం ఇసుక రీచ్‌లను స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇతర నేతలతో కలిసి సిండికేట్‌గా ఏర్పడి తమ వారికి ఇప్పించినట్లు సమాచారం. ⇒ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆరు రీచ్‌లకు టెండర్లు పిలవగా ఒకటి ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పిన వారికి దక్కేలా చేశారు. మిగిలినవన్నీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తన మనుషులకు కేటాయించేలా చేసుకున్నారు. ⇒ నందిగామ నియోజకవర్గంలో తొమ్మిది రీచ్‌లకు రెండు మినహా మిగిలినవన్నీ స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించిన వారికి కేటాయించారు. ⇒ అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని శ్రీకాకుళం 3, 5 రీచ్‌లకు టెండర్లు పిలవగా రెండింటినీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఒక రీచ్‌ను తన సొంత బంధువుకి, మరో రీచ్‌ను తన అనుంగు అనుచరుడికి కట్టబెట్టినట్లు సమాచారం. బయట వ్యక్తులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడంతో ఖరారైన రీచ్‌లన్నీ టీడీపీ వారి పరమయ్యాయి. పామర్రులో టీడీపీ నేతలకు ఎమ్మెల్యే వార్నింగ్..ఇక కృష్ణాజిల్లా పామర్రులో ఐదు రీచ్‌లు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా చెప్పిన వారికే ఖరారు చేశారు. టెండర్లు దాఖలు చేయడానికి వెళ్లిన టీడీపీ నేతలను ఎమ్మెల్యే ఫోన్‌చేసి తిట్టిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తోట్లవల్లూరు ఇసుక రీచ్ కోసం మొవ్వ మండల నేత కాకర్ల బెనర్జీ తదితరులు వెళ్లగా ఆ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయనకు ఫోన్‌చేసి వార్నింగ్ ఇచ్చారు. టెండర్ వెయ్యొద్దని, తనకు తెలీకుండా ఎలా టెండర్ దాఖలు చేస్తారని ఎమ్మెల్యే బెనర్జీకి వార్నింగ్ ఇస్తున్న వీడియోను కొందరు టీడీపీ నేతలే రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. తాను ఎంతోకాలం నుంచి పార్టీలో ఉన్నానని, ఎప్పుడూ ఇలాంటివి చూడలేదని బెనర్జీ చెబుతుంటే ఎమ్మెల్యే ఆయన్ను గట్టిగా హెచ్చరించారు. మొత్తం మీద ఇసుక రీచ్‌లకు తన సొంత మనుషులతో టెండర్లు వేయించిన ఎమ్మెల్యే.. సొంత పార్టీ వారితో సహా ఇతరులెవరూ టెండర్లు వేయకూడదని హకుం జారీచేశారు. చివరికి ఆయన చెప్పిన వారికే టెండర్లు ఖరారయ్యాయి. -
ఇసుక కష్టం ఇంతింత కాదయా..!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలను ఇసుక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచీ్చరాగానే అప్పటికే అమల్లో ఉన్న ఇసుక విధానాన్ని అస్తవ్యస్థంగా మార్చేయడంతో సర్వం గందరగోళమైంది. ఒకవైపు ఉచిత ఇసుక అంటూ సీఎం చంద్రబాబు, అధికారులు ప్రచారం చేస్తున్నా.. యార్డుల వద్ద మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. సామాన్యుడికి ఇసుక దొరకడమే గగనమైపోయింది. బుకింగ్‌కు సరైన విధానమంటూ లేకపోవడంతో ఎక్కడ కొనుగోలు చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని చెప్పినా అది ఎక్కడా అమల్లోకి రాలేదు. స్థానికంగా డంప్ యార్డులున్న చోట బుకింగ్ కేంద్రాలు పెట్టినా అక్కడ పెద్దపెద్ద లైన్లు ఉంటున్నాయి. అక్కడ టీడీపీ నేతల హవా కొనసాగుతుండటంతో సాధారణ ప్రజలు బుకింగ్ చేసుకోలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల లారీ యజమానులపైనే ఆధారపడాల్సి వస్తోంది. వారు కూడా టీడీపీ నేతల కసుసన్నల్లోనే పని చేస్తుండటంతో ఇసుక ధర భయపెట్టేలా ఉంటోంది. పది కిలోమీటర్ల దూరానికి 20 టన్నుల ఇసుక లారీకి రూ.30 వేలకుపైగా ఖర్చవుతోంది. ఒకవైపు ఇంతలా జేబులకు చిల్లు పెట్టుకుంటూ నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం ఉచిత ఇసుకంటూ డప్పు కొట్టుకోవడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. 3 రోజులు వేచి ఉండాల్సిందే.. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నివాస ప్రాంతం పక్కనే ఉన్న తాళ్లాయపాలెం, లింగాయపాలెం ఇసుక స్టాక్ యార్డుల వద్ద లోడింగ్ కోసం నిత్యం కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోయి ఉంటున్నాయి. బుకింగ్ చేసుకున్నాక 2, 3 రోజులు క్యూలైన్లలో వేచి ఉంటే గానీ ట్రక్కు, డంప్ యార్డుకు చేరుకోలేకపోతోంది. దీంతో రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డు, ఉద్దండరాయునిపాలెం వద్ద వందల సంఖ్యలో లారీల క్యూ కనిపిస్తోంది. రోజుల కొద్దీ ట్రక్కులు వేచి ఉండడంతో లారీ కిరాయి, డ్రైవర్ జీతం, వెయిటింగ్ చార్జీలన్నీ కలిపి బుక్ చేసుకున్న వారు ఒక్కో లారీకి అదనంగా రూ.5 వేల నుంచి రూ.6 వేలు అదనంగా చెల్లించాల్సివస్తోంది. ఇక గోదావరి నది వద్ద ఉన్న స్టాక్ యార్డుల్లోనూ చార్జీల మోత మోగుతోంది. ఇసుకను బుకింగ్ చేసుకున్నాక తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పందలపర్రు, పెండ్యాల, ఉసులమర్రు ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఒకటి, రెండు రోజుల పాటు లారీలు ఉండాల్సి వస్తోంది. టన్ను ఇసుకను రూ. 270కి ఇస్తున్నా రవాణా చార్జీలు దానికి పది రెట్లు, వెయిటింగ్ చార్జీలు మరో మూడు రెట్లు పెరగడంతో ఇసుకరేటు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. టీడీపీ నేతల హల్చల్ తమ వారికే ముందు ఇవ్వాలని యార్డుల వద్ద టీడీపీ నేతలు హల్చల్ చేస్తున్నారు. దొంగ బుకింగ్‌లను పెద్దఎత్తున చేయించి ఇసుకను తరలిస్తున్నారు. మరికొందరు నేతలు బుకింగ్‌తో సంబంధం లేకుండా వాళ్ల లారీలను దొడ్డి దారిన స్టాక్ యార్డు వద్దకు తీసుకెళ్లి లోడింగ్ చేయించుకుంటున్నారు. దీంతో ఇసుక బుకింగ్ చేసుకోవడమే పెద్ద ప్రహసనంగా మారిపోయింది. బుకింగ్ చేసుకున్న వారిని కూడా టీడీపీ నేతలు బెదిరించి ఇసుకను వేరేవాళ్లకు అమ్మేసుకుంటున్నారు. ఇటీవల పెండ్యాల స్టాక్ యార్డు నుంచి సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యాజమాన్యం 37 లారీల ఇసుకను బల్క్ బుకింగ్ చేసుకోగా కర్మాగారానికి ఒక లారీ మాత్రమే వెళ్లింది. యార్డు నుంచి వెళ్లిన మిగిలిన లారీలను టీడీపీ నేతలు మధ్యలోనే దారి మళ్లించి అమ్మేసుకున్నారు. దీనిపై ప్లాంట్ మేనేజర్ల ఫిర్యాదు చేయడంతో ఆ విషయాన్ని బయటకు రానీయకుండా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారు. తెలంగాణకు తరలిపోతోంది ఎనీ్టఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద ఉన్న అనుమంచిపల్లె ఇసుక స్టాక్ యార్డు నుంచి ప్రతినిత్యం వందల లారీల ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతోంది. దీనిలో టీడీపీ నేతల హస్తం ఉందని తెలుస్తోంది. ట్రాక్టర్లలో తీసుకెళ్లి గరికపాడు చెక్‌పోస్టు సమీపంలో పాలేరు నది ఒడ్డున డంప్ చేస్తున్నారు. అక్కడ రాత్రిపూట లారీల్లోకి లోడ్ చేసి సూర్యాపేట, హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. 30 టన్నుల లారీ లోడ్‌ని సూర్యాపేటలో రూ.35 వేలు, హైదరాబాద్‌లో రూ.70 వేల చొప్పున అమ్ముతున్నారు. -
కాలువ గట్లు గుల్ల!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లాలో కూటమి నేతలు పోలవరం కాలువ గట్లను గుల్ల చేస్తున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు యంత్రాలతో కాలువ గట్లను తవ్వి మట్టి తరలిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ద్వారకా తిరుమల, ఉంగుటూరు మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో కాలువ గట్లను సగానికి పైగా తవ్వేశారు. అవసరమైతే మట్టి తరలించడానికి సొంతంగా రోడ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయినా ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు కాలువ వైపు కన్నెత్తి చూడటం లేదు. అడ్డగోలు తవ్వకాలు ఇలా...ద్వారకా తిరుమల మండలం ఎం.నాగులపల్లి, పంగిడిగూడెం, గుళ్లపాడులో టీడీపీ నాయకులు భారీగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఎం. నాగు లపల్లిలో పోలవరం కుడి కాలువ గట్టును దాదాపు సగం తవ్వేశారు. దీంతో కాలువ పటిష్టతపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో వారం రోజులుగా తవ్వకాలు ఆపారు. గుళ్లపాడులో మాత్రం యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి రోజూ 100 నుంచి 130 వరకు టిప్పర్లు, 50కి పైగా ట్రాక్టర్లలో ఏలూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టిని తరలిస్తున్నారు. ఉంగుటూరు మండలం కంసాలిగుంటలో పోలవరం ఎడమ గట్టును తవ్వి మట్టిని తరలించేందుకు జనసేన నాయకుడు ఏకంగా రోడ్డు నిర్మించాడు.రూ.కోట్లలో ఆదాయంప్రభుత్వం అనుమతి పొందిన చోట మట్టి తవ్వకాల కోసం ఒక క్యూబిక్ మీటర్‌కు మైనింగ్ శాఖకు రూ.120, ఇరిగేషన్ శాఖకు రూ.110 చొప్పున మొత్తం రూ.230 చెల్లించాలి. టిప్పర్‌కు 18 క్యూబిక్ మీటర్ల వరకు మట్టి లోడ్ చేసి విక్రయిస్తున్నారు. ఈ లెక్కన క్యూబిక్ మీటరుకు రూ.230 చొప్పున ఒక లారీకి రూ.4,140 ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ పైసా ఫీజు చెల్లించకుండానే అక్రమంగా పోలవరం కాలువ గట్లు తవ్వి వందలాది టిప్పర్లలో రోజూ మట్టిని తరలించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. -
కడవకుదురు టు తెలంగాణ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నుంచి వేల టన్నుల ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతోంది. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రెవెన్యూ, అటవీభూముల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ట్రక్కులు, టిప్పర్లు, ట్రాక్టర్లలో నింపుతున్నారు. ట్రక్కులన్నీ హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. టిప్పర్లు, ట్రాక్టర్లు ప్రకాశం, పల్నాడు జిల్లాలకు వెళ్తున్నాయి. పర్చూరుకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేత కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేతకు అవసరమైనప్పుడు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చే ఒక కంపెనీ అధినేత సమీప బంధువులు ఈ ఇసుక దందాను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇసుక తవ్వకాల ప్రాంతంలో ప్రైవేటు సైన్యాన్ని పెట్టి కర్రలు, రాడ్లు తదితర మారణాయుధాలతో కాపు కాస్తున్నారు. ఎవరైనా వస్తే దాడులు చేసేందుకు వారు వెనుకాడడంలేదు. పోలీసులకు మామూళ్లు వెళ్తుండటంతో వారు ఇటువైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు వస్తున్నాయి.కడవకుదురు భూముల నుంచి..పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం కడవకుదురు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక (గుట్టలు) భూములు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు భూములతోపాటు రెవెన్యూ, అటవీ శాఖ భూములూ ఉన్నాయి. ఈ భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు గతంలో పట్టాలు ఇచ్చినా వ్యవసాయానికి పనికిరాకపోవడంతో బీళ్లుగానే ఉంచారు. ఇక్కడ నిర్మాణాలకు పనికొచ్చే నాణ్యమైన ఇసుక ఉండడం, వర్షాకాలం నేపథ్యంలో ఇసుకకు డిమాండ్ పెరగడంతో పర్చూరు అధికారపార్టీ నేత కన్ను పడింది. అనుచరులనుపెట్టి ఇసుక గుట్టలను అక్రమంగా తరలించి రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. కడవకుదురు రైల్వే గేటు ప్రాంతంలో గత పది రోజులుగా తవ్వకాలు మొదలు పెట్టారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో పగటిపూట కాకుండా రాత్రి 10 గంటల ప్రాంతంలో జేసీబీలు, ఇటాచ్‌లు పెట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ట్రక్కులు, టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ. 4 నుంచి 8 వేలకు అమ్ముతున్నారు. ట్రక్కు ఇసుక రూ. 80 వేలు..కృష్ణా, గోదావరి నదులకు నీళ్లు రావడంతో మైదాన ప్రాంతాల ఇసుకకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్‌లో ఇసుకకు మరింత డిమాండ్ ఉంది. దీంతో కడవకుదురు నుంచి రోజూ 15 ట్రక్కుల్లో హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్క ట్రక్కు (18 టన్నులు) ఇసుక రూ. 80 వేలకు తగ్గకుండా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. -
స్వర్ణముఖిలో దోపిడీకి ‘సూపర్ సిక్స్’
ఎన్నికల ముందు టీడీపీ చెప్పిన సూపర్ సిక్స్ హామీల అమలును అధికారంలోకి వచ్చాక గాలికొదిలేసింది. కానీ, రూ.కోట్లు కూడబెట్టుకునేందుకు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఒక ‘సూపర్ సిక్స్’ను తయారు చేసుకున్నారు. అదేమిటనుకుంటున్నారా... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పులివర్తి నాని కనుసన్నల్లో ఆయన అనుచరులు స్వర్ణముఖి నదిలో చంద్రగిరి మండలంలోని నాగయ్యగారిపల్లి, కొటాల, మిట్టపాళెం, శానంబట్ల, తిరుపతి రూరల్ మండలంలోని పైడిపల్లి, తనపల్లి ప్రాంతాల్లో ఆరు రీచ్‌లు అనధికారికంగా ఏర్పాటుచేశారు.రాత్రింబవళ్లు యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. రాత్రిపూట టిప్పర్లు, పగలు ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతంలోని తిరుచానూరు వద్ద పంట పొలాల్లోనూ దౌర్జన్యంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. నదిలో పెద్ద ఎత్తున తవ్వకాలు చేయడం వల్ల వర్షాకాలంలో తమ గ్రామాలను వరద ముంచెత్తుతుందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తిరుచానూరు–పాడిపేట గ్రామాల మధ్య స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలను శుక్రవారం పాడిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు రావడంతో నాని అనుచరులు ఇసుక ట్రాక్టర్లను తీసుకుని వెళ్లిపోయారు. – సాక్షి టాస్‌్కఫోర్స్ -
తవ్వుకో తమ్ముడూ!
ఇసుక ఉచితంగా ఇస్తే కార్మికులకు పని దొరుకుతుంది... ఆదాయం వస్తుంది... రాష్ట్ర సంపద పెరుగుతుంది... దానితో అభివృద్ధి చేస్తా... పూర్ టూ రిచ్ నా విజన్... అంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. కానీ, అధికారంలోకి వచ్చాక తమ్ముళ్లను రిచ్‌గా మార్చడంపై ఆయన దృష్టిపెట్టారు. ఇసుకను వారికి వరంగా మార్చారు. ఇసుకపాలసీ తేకుండానే వచ్చిరాగానే స్టాక్ యార్డుల్లో 40 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు బొక్కేశారు. మిగిలిన 40 లక్షల టన్నులను ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు. ఇపుడు ఏకంగా రీచ్‌లపై పడ్డారు. జేసీబీలు పెట్టిమరీ పట్టపగలే అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తూ నచ్చిన ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తమ్ముళ్లు రిచ్ కావడానికిలా బాబుగారు ఇసుక రీచ్‌లను అప్పనంగా అప్పగించేశారు. రాష్ట్రంలోని పలు రీచ్‌లు, స్టాక్‌యార్డులను సాక్షి పరిశీలించింది.వానాకాలం కావడంతో ఇసుక రీచ్‌లు ఇంకా అధికారికంగా తెరవలేదు. అయినా తమ్ముళ్లకు అడ్డేలేదు. అడిగేవాడు లేడు.. దోచుకున్నవారికి దోచుకున్నంత.. పట్టపగలు.. మిట్టమధ్యాహ్నం.. అందరూ చూస్తుండగానే ఇసుక వాహనాలు దూసుకెళ్తున్నాయి.. భారీ యంత్రాలు పెట్టిమరీ ఇసుకను తోడేస్తున్నారు. అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వానాకాలం ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం ముందు చూపుతో ఏర్పాటుచేసిన స్టాక్ యార్డుల్లో ఇసుకనూ కాజేశారు. ఇప్పటికే సగానికి సగం తినేశారు. మిగిలిన సగం ఇష్టమొచ్చిన రేటుకు అమ్మేసుకుంటున్నారు. ఇసుక కావాలంటే తమ్ముళ్ల జేబులు తడవాల్సిందే. మంచిధర పలకాల్సిందే. రీచ్‌ల్లోనూ, స్టాక్ యార్డుల్లోనూ తమ్ముళ్ల దోపిడీ ఎలా ఉందో సాక్షి పరిశీలించింది. – సాక్షి, అమరావతిఉచితం పేరుతో టీడీపీ నేతలు ఇసుకను ఊడ్చేస్తున్నారు. ఇటు స్టాక్ యార్డులను ఖాళీ చేస్తున్నారు. అటు రీచ్‌లను గుల్ల చేస్తున్నారు. స్టాక్ యార్డుల్లో ఒక రకమైన దోపిడీకి పాల్పడుతున్నారు. రీచ్‌లలో మరో రకమైన దందా సాగిస్తున్నారు. స్టాక్ యార్డుల్లో అంతా సవ్యంగా సాగుతున్నట్లు బోర్డులు పెట్టినా... టీడీపీ నాయకులు అధికంగా డబ్బులు వసూలు చేసుకుని టోకెన్లు ఇచ్చినవారికే ఇసుక లోడ్ చేస్తున్నారు. అదేవిధంగా అధికారికంగా మూతపడిన రీచ్‌లలోనూ అడ్డూ అదుపు లేకుండా భారీ యంత్రాలు పెట్టి ఇసుకను తోడేస్తున్నారు. అక్రమంగా తవ్విన ఇసుకను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు తరలిస్తున్నారు. బయట ప్రాంతాలకు ఇసుకను తరలిస్తుండటంతో స్థానికంగా ప్రజల అవసరాలకు సరిపడా దొరకడం లేదు. అధికార పార్టీ నేతలకు అనధికారికంగా అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎక్కడా విక్రయించడం లేదు. మరోవైపు కొందరు టీడీపీ నాయకులు స్టాక్ యార్డుల్లో ఒక టోకెన్ చూపించి 10, 15 లారీల ఇసుక లోడ్ చేయించుకుని తీసుకువెళుతున్నారు. అయినా పట్టించుకునే నాథుడే లేడు. ‘స్టాక్’ స్వాహా చేసి రీచ్‌లపై పడ్డారు..గత ప్రభుత్వం ఈ వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ యార్డుల్లో ముందుగానే 80లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసింది. అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకపై టీడీపీ నేతలు కన్నేశారు. ప్రభుత్వం ఉచిత పాలసీ విధివిధానాలు ఖరారు చేసేలోపే 40లక్షల టన్నులను స్వాహా చేశారు. మిగిలిన 40లక్షల టన్నులను ఉచితంగా పంపిణీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ, ఆచరణలో ఎక్కడా ఉచితంగా ఇసుక ఇస్తున్న దాఖలాలు లేవు. స్టాక్ యార్డులను కేంద్రంగా చేసుకుని టీడీపీ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా రీచ్‌లపై పడి దొరికినంత తవ్వేస్తున్నారు. కొత్త సర్కారు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇసుక పాలసీ రాలేదు. అయినా తమ్ముళ్లకు లెక్కేలేదు. వారిని ఆపేవారే లేరు. ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడమే. అధికారులు కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారు. హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.» రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లను చెరబట్టిన టీడీపీ నేతలు » ఇప్పటికే స్టాక్ యార్డుల్లో అడ్డగోలు దోపిడీ » వర్షాకాలంలో రీచ్‌లు మూతపడినా భారీ యంత్రాలతో తవ్వకాలు » హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు ఇదే తంతుకృష్ణాలో పట్టపగలే తవ్వకాలు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పెసర్లంక అరవింద వారధి సమీపాన కృష్ణా నదిలో పట్టపగలే యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న గాజుల్లంక, పోతార్లంక ఇసుక రీచ్‌లు అధికారికంగా మూతపడ్డాయి. కానీ, నదీ తీర గ్రామాలైన పెసర్లంక, గాజుల్లంక, జువ్వలపాలెం, ఈపూరు, చిలుమూరు గ్రామాలలో టీడీపీ, జనసేన నాయకులు ఇష్టానుసారం ఇసుకను తవ్వి వందలాది ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. ప్రతిరోజూ 200లకు పైగా ట్రాక్టర్లను మూడు, నాలుగు ట్రిప్పులు తిప్పుతూ వేల టన్నుల ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెండు నెలల్లోనే రూ.330 కోట్ల నష్టం ఉచిత ఇసుక విధానమే అయినా... ప్రజలకు ఉచితంగా ఇసుక అందకపోగా అదనపు భారం పడుతోంది. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా రావడంలేదు. గత ప్రభుత్వ హయాంలో ఇసుకపై ఏడాదికి రూ.785 కోట్ల ఆదాయం లభించేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆ ఆదాయం రాదు. పైగా ప్రజలకు లాభం కలగడంలేదు. ఈ రెండు నెలల్లో అస్పష్టమైన ఇసుక విధానం వల్ల ప్రభుత్వం రూ.130 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. మరోవైపు స్టాక్ యార్డుల నుంచి టీడీపీ అక్రమంగా కొల్లగొట్టిన 40 లక్షల టన్నుల ఇసుక విలువ రూ.200 కోట్లకుపైమాటే. ప్రభుత్వానికి అదీ నష్టమే. డబ్బులు కట్టే ఉచిత ఇసుక విధానం, నిల్వ చేసిన ఇసుకను అక్రమంగా టీడీపీ నేతలు అమ్ముకోవడం ద్వారా ప్రభుత్వానికి ఈ రెండు నెలల్లోనే అధికారికంగా రూ.330 కోట్ల నష్టం వచ్చినట్లు లెక్క. ఆ డబ్బంతా ఎవరికి జేబుల్లోకి వెళ్లినట్లు? టీడీపీ నేతల జేబుల్లోకే కదా?.. సంపద ఎవరికి పెరుగుతుందో అందరూ ఆలోచించాలి. వంశధార.. జనసేన ఎమ్మెల్యే బంధువుల వశం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ బంధువులు వంశధార నదిని తమ వశం చేసుకున్నారు. భామిని మండలం నేరడి–బిల్లుమడ గ్రామాల మధ్య వంశధార నది నుంచి వారు పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. వంశధార నదీ తీర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలపై తనిఖీలు చేస్తున్న గనుల శాఖాధికారులు అటువైపు మాత్రం కన్నెత్తి చూడడంలేదు. కాజ్వే దిమ్మెలను ధ్వంసం చేసి ఇసుక తరలింపుఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముత్తుకూరు, ఆనగల్లు, బీఎన్ఆర్ పేట రీచ్‌లలో అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటకకు ఇసుకను తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో సువర్ణముఖి నది నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో లోడ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం నదిపై కాజ్వే మీద ఉన్న దిమ్మెలను సైతం ధ్వంసం చేసి లారీలు వెళ్లేందుకు రోడ్డులా ఏర్పాటు చేసుకున్నారు. దిగువమాసాపల్లె, పాలూరు స్టాక్ యార్డులను టీడీపీ నేతలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అక్కడ ఒక టోకెన్ తీసుకుని పది ట్రక్కుల్లో ఇసుకను లోడ్ చేయించుకుని అక్రమంగా తరలిస్తున్నారు.నెల్లూరు జిల్లాలో అక్రమ తవ్వకాలపై జనం ఆగ్రహంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నానదిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు, రవాణా సాగుతున్నాయి. ఈ క్రమంలో పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో గురువారం రాత్రి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. 50 ట్రాక్టర్లను నిలిపివేసి గొడవ చేయడంతో అందులో ఉన్నవారు వాటిని వదిలేసి పరారయ్యారు. ఇక్కడ ఇసుక తోడితే పర్యావరణానికి ముప్పు ఏర్పడి మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజీ ఉనికికే ప్రమాదమని స్థానికులు ఆందోళనకు దిగి అక్రమార్కులను తరిమేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అండతోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా మర్రిపాడు, పల్లిపాడు, మినగల్లు స్టాక్ యార్డుల నుంచి టీడీపీ నేతలు తమ ఇష్ట్రపకారం ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. 20 టన్నుల ఇసుకకు డబ్బులు చెల్లించి 40 టన్నులు లోడ్ చేయిస్తున్నారు. వారి ఆగడాలతో దూర ప్రాంతాల నుంచి స్టాక్ యార్డులకు ఇసుక కోసం వెళ్లిన లారీలు ఒకటి, రెండు రోజులు పడిగాపులు పడాల్సివస్తోంది. రాజాంలో మామిడి తోటల్లో డంప్ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం తునివాడలో నాగావళి నదిలోని ఇసుకను టీడీపీ నేతలు ఎడ్లబండ్ల ద్వారా తరలించి సమీపంలోని మామిడితోటల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి విజయనగరం, విశాఖపటా్ననికి చెందిన వ్యక్తులకు ఇసుకను విక్రయిస్తున్నారు. ఎడ్లబండ్ల ద్వారా మాత్రమే ఇసుక బయటకు తీసుకువస్తుండడంతో అధికారులు పట్టించుకోవడం లేదని, ఉచితం మాటున ఇక్కడ రోజూ లక్షల రూపాయల ఇసుక వ్యాపారం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులతో చేతులు కలిపి... శ్రీకాకుళం రూరల్ కరజాడ గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. నదిలో తవ్విన ఇసుక సమీపంలోని ప్రాంతాల్లో పెట్టి కుప్పలుగో పోసి అక్కడి అమ్ముతున్నారు. నరసన్నపేట మండలంలో లకలాం, మడపాం, గోపాలపెంటలో రాత్రి సమయంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ టీడీపీ కార్యకర్తలు నేరుగా పోలీసులతోనే చేతులు కలిపి ఇసుక తవ్వకాలు, రవాణాకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. టీడీపీ నేతల స్లిప్‌లు ఉంటేనే..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్లు టీడీపీ నేతల దోపిడీకు అడ్డాగా మారాయి. స్టాక్ పాయింట్ల వద్ద వారు బహిరంగంగా దందాలు చేస్తున్నారు. రావులపాలెం–1, రావులపాలెం–2, మందపల్లి స్టాక్ పాయింట్ల వద్ద ఐదు యూనిట్ల ఇసుక ధర రూ.5,300 ఉండగా, రూ.11,500 చెల్లిస్తే కాని ఇసుక లోడ్ చేయడంలేదు. స్టాక్ పాయింట్ వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటె రూ.5 వేలు అదనంగా అనధికారికంగా చెల్లిస్తేనే ఇసుక ఇస్తున్నారు. రావులపాలెం, మందపల్లి, తాడిపూడి, కపిలేశ్వరపురం ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద టీడీపీ నేతలు రోడ్డు మీదనే లారీలు ఆపి ఇసుక స్లిప్‌లు ఇస్తున్నారు. రావులపాలెం వద్ద అయితే టీడీపీ నేతలు ముందుగానే డబ్బులు తీసుకుని రూ.6,200, స్లిప్‌లు ఇస్తున్నారు. ఈ స్లిప్‌లు పొందిన వారిని మాత్రమే స్టాక్ పాయింట్‌కు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఈ స్టాక్ పాయింట్ వద్ద తనిఖీ చేసినా బయటపడని విధంగా దందా అంతా బయటే నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అనంతలో అంతే లేదుఅనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడంలేదు. నందలపాడు సమీపంలో పెన్నా నది పరీవాహక ప్రాంతం నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుకను తవ్వి బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యం ఇసుక లోడుతో లారీలు వెళుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని సంతేబిదనూర్, చిలమత్తూరు మండలంలో పెన్నా, కుముద్వతి, చిత్రావతి నదీ పరీవాహక ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తవ్వి అమ్ముకుంటున్నారు. -
Political Corridor: ఇక జనంతో పనిలేదు.. ఓన్లీ దోచుకోవడమే..
-
మట్టి దిబ్బలు మటాష్
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు, పవన్.. ఇద్దరూ కలిసి అప్పట్లో నోటికొచ్చిన అబద్ధాల్ని ప్రజలపై రుద్దేశారు. వారసత్వ సంపదకి ముప్పు వాటిల్లుతోందంటూ గగ్గోలు పెట్టేశారు. అంతా నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నా అక్కడేదో ఘోరం జరిగిపోతోందంటూ నానా యాగీ చేసి నిజాలను ‘ఎర్రమట్టి’లో కప్పెట్టేశారు. సీన్ కట్‌చేస్తే.. ఇప్పుడు వారే అధికారం చెలాయిస్తున్నారు. ఇంకేముంది.. నిబంధనల్ని గాలికొదిలేసి మట్టి తవ్వకాలు జరుగుతున్నా.. ఏమో సార్.. మాకు కనబడదు.. అన్నట్లుగా ఉంది ఇప్పుడు వారిద్దరి తీరు. దేశంలోని 29 భౌగోళిక వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందిన విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బల్ని ‘పచ్చ’ మాఫియా మటాష్ చేస్తూ చెప్పేటందుకే నీతులున్నాయనే సామెతను గుర్తుచేస్తున్నారు. ఈ దిబ్బల వెనుకదాగున్న కథాకమామిషు ఏంటంటే..విశాఖ జిల్లా భీమిలి మండలం సర్వే నం 49లో నేరెళ్లవలస గ్రామం ఉంది. సర్వే నం.49/1లో మొత్తం 1,067 ఎకరాలు ఉంది. ఇందులో 550 ఎకరాల్లో ఐఎన్ఎస్ కళింగ విస్తరించి ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్లి తమకు చెందిన స్థలమని కోర్టులో విజయం సాధించిన ఓ బిల్డింగ్ సొసైటీ పేరుతో 287 ఎకరాల భూములున్నాయి. ఈ రెండింటి మధ్యలో మొత్తం 262.92 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎర్రమట్టి దిబ్బలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఇవి కాకుండా.. పక్కనే ఉన్న కొత్తవలస గ్రామ పరిధిలోని సర్వే నం 75, సర్వే నం.86, 87లో సుమారు 80 ఎకరాల్లో 1982లో డీ–పట్టాలు ఇచ్చారు. ఈ ప్రాంతంలోనే లేఅవుట్ల అభివృద్ధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. అయితే.. కొత్తవలసలోని సర్వే నం.86/1ని సబ్‌డివిజన్ చేసి.. 86/3లో ఉన్న దాదాపు 148 అడుగుల మేర బఫర్ జోన్‌గా గుర్తించి.. ఆ ప్రాంతాన్నీ గత ప్రభుత్వం భౌగోళిక వారసత్వ సంపదగా.. విశాఖ పర్యాటక ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ఎర్రమట్టి దిబ్బలకు భవిష్యత్తులోనూ ఎలాంటి ముప్పు రాకుండా చేసింది. భౌగోళిక వారసత్వ సంపదగా ఉన్న 262.92 ఎకరాల్ని సంరక్షిస్తూ ఎర్రమట్టి దిబ్బలకు ప్రత్యేక బఫర్‌జోన్ ఏర్పాటుచేసి భూ సమీకరణ పూర్తిచేసింది. ల్యాండ్ డెవలప్మెంట్ ప్రక్రియ కూడా చేపట్టింది. కానీ, అప్పట్లో పవన్, చంద్రబాబు ఈ అభివృద్ధి పనులపై నానా యాగీచేసి ఎర్రమట్టి దిబ్బల్లో లేఅవుట్లు వేస్తున్నారని తెగ దుష్ప్రచారం చేశారు. తమ ప్రభుత్వం రాగానే ఈ పనులు ఆపేస్తామని చెప్పారు. కానీ, ఇప్పుడు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే బఫర్ జోన్లోకి చొరబడి మరీ మట్టిని అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. కనీస అవగాహన లేకుండా గగ్గోలు..ఇక ఎర్రమట్టి దిబ్బల్ని ఆనుకుని 70–80 ఏళ్లుగా జీడితోటలు సాగు చేసుకుంటూ డీ–పట్టాలున్న రైతుల నుంచి మాత్రమే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూలింగ్ చేపట్టింది. ఇలా అభివృద్ధి చేస్తున్న ప్రాంతం కూడా ఎర్రమట్టి నేలలే. వీటికి ప్రభుత్వం డీ–పట్టాల్ని ఎలా ఇస్తుందన్న కనీస అవగాహన లేకుండా టీడీపీ నేతలు అప్పట్లో హడావిడి చేశారు. అందుకు పవన్‌కళ్యాణ్ తందాన అంటూ గుడ్డిగా రోడ్డెక్కారు. నిజానికి.. నేరెళ్లవలసలో భూ సమీకరణకు 2016లోనే తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఒప్పు అయిన అదే పూలింగ్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తప్పు అంటూ తప్పుడు ఆరోపణలు చేసింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రాగానే తూచ్ అనడం.. పవన్ కూడా సైలెంట్ అవడంపై పర్యావరణవేత్తలు విమర్శలు సంధిస్తున్నారు. పైగా.. అప్పట్లో పవన్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదుచేస్తా.. 48 గంటల అల్టిమేటం జారీ చేస్తున్నానంటూ గతేడాది ఆగస్టులో వ్యాఖ్యలు చేశారు. నిజానికి.. గత ప్రభుత్వం అభివృద్ధి పనులు మొదలుపెట్టిన లేఅవుట్‌కు హెరిటేజ్ సైట్‌కు అసలు ఏమాత్రం సంబంధమేలేదు. ఈ డీ–పట్టా భూముల్లో తోటలున్న ప్రాంతాన్ని మాత్రమే ప్రభుత్వం భూ సమీకరణ చేసిందే తప్ప.. ఎర్రమట్టి దిబ్బల్ని తొలగించడం లేదన్నది నూరు శాతం వాస్తవం. బఫర్ జోన్ దాటి తవ్వకాలు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల భూములు, ఎర్రమట్టి దిబ్బల మధ్య బఫర్ జోన్ ఏర్పాటుచేసి ఎర్రమట్టి దిబ్బల్ని సంరక్షిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం దిబ్బల్ని కూడా దోచుకెళ్లే పర్వానికి తెరతీసింది. గత ప్రభుత్వంలో బఫర్ జోన్ ఇవతలే లే అవుట్ పనులు జరిగితే ప్రస్తుతం బఫర్ జోన్ దాటి మరీ.. కొందరు టీడీపీ, జనసేన నాయకులు కుమ్మక్కై మట్టిని తరలించేస్తున్నారు. అడ్డగోలుగా, అక్రమంగా మట్టి దందా సాగిస్తూ వారసత్వ సంపద ఉనికిని ప్రమాదకరంగా మార్చేస్తున్నారు. రెండ్రోజులుగా యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.మళ్లీ సైలెంట్ మోడ్‌లో పవన్..ఇకపోతే.. టీడీపీ హయాంలో భూసమీకరణ ప్రక్రియ జరిగినప్పుడు పవన్ మౌనం వహించారు. కానీ, వైఎస్సార్సీపీ హయాంలో పనులు జరుగుతున్నప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తూ హడావిడి చేశారు. ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రిగా ఉంటూ కూడా ఎర్రమట్టి దిబ్బల గురించి పట్టించుకోకుండా మరోసారి మౌనముద్రలోకి జారుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎర్రమట్టి దిబ్బల ప్రత్యేకత ఇదీ..విశాఖకు ప్రకృతి ప్రసాదించిన వరం ఈ ఎర్రమట్టి దిబ్బలు. దక్షిణాసియాలో మరోరెండు చోట్ల మాత్రమే ఇవి ఉన్నాయి. వైజాగ్‌లోని ఎర్రమట్టి దిబ్బలు విశాఖ నుంచి భీమిలీ వెళ్లే ప్రధాన రోడ్డులో సముద్రానికి ఆనుకుని ఉన్నాయి. రోడ్డుకు అటు సముద్రం.. ఇటు ఈ దిబ్బలు ఉంటాయి. 20 కిలోమీటర్ల మేర ఇవి విస్తరించి ఉన్నాయి. రోడ్డు దిగి వెళ్తే మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. దిబ్బల మధ్య సందులు, పాయలుగా ఉంటుంది. దాదాపు 18వేల ఏళ్ల కిందట అంటే చివరి గ్లేషియర్ పీరియడ్ (భూతలం మంచుతో కప్పి ఉన్న కాలం)లో ఏర్పడినవే ఈ ఎర్రమట్టి దిబ్బలని చెబుతారు. అయితే, వీటిని ఎర్రమట్టి దిబ్బలని అంటున్నా నిజానికివి ఇసుక దిబ్బలు. సముద్రం పైనుంచి వీచిన గాలితో తీరం వద్ద మేటలు వేసిన ఇసుక దిబ్బలే ఇవి. ఈ ఇసుక మట్టి రంగులో ఉండడంవల్ల వీటిని మట్టి దిబ్బలు అని పిలుస్తారు.ఉపరితలంపై కనిపిస్తున్న దిబ్బల కింది భాగం (బేస్మెంట్) వయస్సు 18వేల నుంచి 20వేల ఏళ్లు ఉంటుంది. అదే మధ్య భాగం 6వేలు.. పైభాగం 3వేల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు పరిశోధనల్లో తేలింది. ఇది నిర్దిష్ట భౌగోళిక విలువలతో కూడిన భూవైవిధ్య మూలకాలతో ఏర్పడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని జియో హెరిటేజ్ సైట్‌గా పిలుస్తారు. ప్రకృతి అందించిన సహజ వారసత్వం కాబట్టి భవిష్యత్తు తరాల ప్రయోజనం కోసం ఇవి రక్షణకు అర్హమైనవి.మంత్రిగారూ విధ్వంసాన్ని ఆపండి..ఎర్రమట్టి దిబ్బల్లో దోపిడీపై జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ఇక్కడ జరుగుతున్న దోపిడీ పర్వాన్ని ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎర్రమట్టి దిబ్బలు కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదని.. దేశంలో ఉన్న 29 భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్యభాగమని ఆయన పేర్కొన్నారు. అలాంటి అరుదైన సంపదపై రెండ్రోజులుగా యథేచ్ఛగా దాడి జరుగుతోందని.. దీనిపై అధికారులు, సీఎం చంద్రబాబు, మంత్రి పవన్‌కళ్యాణ్ స్పందించాలని బొలిశెట్టి తన పోస్టులో డిమాండ్ చేశారు. – ‘ఎక్స్’ వేదికపై జనసేన నేత ‘బొలిశెట్టి’ పోస్టుఅబ్బే.. అది ఇది కాదు..ఎర్రమట్టి దిబ్బల్ని దోచేస్తుంటే అధికారులు మాత్రం మరో రకంగా స్పందిస్తున్నారు. అక్రమంగా తరలించడంలేదని.. అసలు ఆ పనులు వేరు ఈ పనులు వేరంటూ భీమిలి తహశీల్దార్ టి.గోవింద్ కొత్త భాష్యం చెప్పారు. ఎర్రమట్టి దిబ్బల్ని ఆనుకుని ఉన్న హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన 287 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. సుప్రీంకోర్టుకు వెళ్లిన సొసైటీ ఈ స్థలాన్ని దక్కించుకుని.. అందులో పనులు చేస్తోందని.. ఆ భాగంలో ఎర్రమట్టి దిబ్బలు ఉంటే ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. విమర్శలు వస్తున్న నేపథ్యంలో పనుల్ని తక్షణమే నిలుపుదల చేశామని.. బుధవారం సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటూ తహసీల్దార్ చెప్పారు. -
ఇసుక దందా గుట్టురట్టు
నరసన్నపేట: అధికారంలోకి వచ్చిన మరుక్షణమే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నాయకులు మొదలుపెట్టిన ఇసుక దందా గుట్టు బట్టబయలైంది. అర్ధరాత్రి వేళ వంశధార నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తుండగా సెబ్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. మడపాం, కొత్తపేటకు చెందిన టీడీపీ నాయకులు బుచ్చిపేట వద్ద వంశధార నదిలో అక్రమంగా ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేశారు. గత ఐదు రోజులుగా ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. లోడింగ్ పేరుతో ఒక్కో లారీకి రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసి దోచుకుంటున్నారు. ముందుగా ఇసుక లారీలను పగలంతా సమీపంలోని టోల్గేట్ వద్ద ఉంచుతున్నారు. చీకటి పడగానే లారీలకు ప్రత్యేక రశీదులిచ్చి నదిలోకి పంపిస్తున్నారు. అడుగడునా టీడీపీ కార్యకర్తల ద్వారా నిఘా పెడుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు ఆ మార్గంలోకి వచ్చినా వెంటనే ఆ సమాచారం నదిలో ఉన్న వారికి వెళ్లిపోతోంది. వారు వెంటనే అప్రమత్తమై లారీలను సమీపంలోని జీడి తోటల్లోకి తరలిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో సెబ్ అధికారులు బుధవారం రాత్రి బుచ్చిపేటకు వచ్చి మాటు వేశారు. నదిలో 20కి పైగా లారీల్లో ఇసుక లోడింగ్ చేస్తుండగా.. సెబ్ అధికారులు దాడి చేశారు. మొత్తం 14 లారీలు దొరకగా.. మిగిలిన లారీలు సమీప జీడి తోటల్లోకి వెళ్లి తప్పించుకున్నాయి. ఈ దోపిడీపై సీఐ సతీశ్ కుమార్, ఎస్ఐ కావ్య కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన లారీలను నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. కాగా, ఇసుక దందాపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట నిద్ర లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల స్వార్థం వల్ల ఊరంతా ఇబ్బంది పడుతోందని స్థానికులు చెప్పారు. ఇసుక దందాలను అడ్డుకోవాలని కోరారు. -
కాసుల వేటలో ‘ఖాకీ’
ఆయనొక పోలీస్ అధికారి. విధి నిర్వహణ కంటే.. కాసుల వేటకే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తాను పని చేసిన ప్రతి స్టేషన్‌ను అవినీతికి అడ్డాగా మార్చేస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల అండదండలతో పబ్బం గడుపుకునే ఆయన ఎన్నికల వేళ స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో అక్రమాలతో చెలరేగిపోయారు. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేకుండా భారీగానే వెనుకేశారు. నిత్యం ఆయన దృష్టి అంతా ఇసుక, గ్రావెల్ రవాణా వాహనాలపైనే ఉంటుంది. రెండు రోజుల క్రితం ఇసుక అక్రమ రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను నిలబెట్టి బహిరంగంగానే బేరం పెట్టిన వైనంపై ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.కోవూరు : ఆ పోలీస్ స్టేషన్‌కు ఆయనే బాస్. ఆయన పనిచేసే స్టేషన్లో కేసుల కంటే.. కాసుల లావాదేవీలే ఎక్కువగా ఉంటాయనే ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్ కేసుల్లోనే కాక.. సివిల్ కేసుల వివాదాల్లో తలదూర్చి మధ్యస్తాలు చేసి ఇరుపక్షాల నుంచి బాగానే గుంజుతున్నట్లు సమాచారం. ఆయన స్టేషన్ పరిధి.. కనుచూపు దాటి ఇసుక, గ్రావెల్ వాహనం దాటిపోదంటే అతిశయోక్తి లేదు. ఆ వాహనాలు ఆ స్టేషన్ దాటి పోవాలంటే.. నెలవారీ మామూళ్లు ఇవ్వాల్సిందే.. లేదంటే స్టేషన్ బయట తుప్పు పట్టి పోవాల్సిందే. విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. బాధ్యతారాహిత్యం.. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే తొమ్మిది చార్జ్ మెమోలు అందుకున్నారంటే ఆయనెంతటి నిజాయితీ అధికారినో అర్థం చేసుకోవచ్చు. నిలబెట్టి వసూలు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ఉండే కొడవలూరు పోలీస్‌స్టేషన్.. గత కొంత కాలంగా అవినీతికి అడ్డాగా మారింది. ఆ స్టేషన్ అధికారి వద్ద చాటుమాటు బేరాలు ఉండవ్.. అంతా బహిరంగంగానే ఉంటాయని ఆ స్టేషన్లో పనిచేసే సిబ్బందే చెబుతుంటారు. అనుమతులు, బిల్లులతో గ్రావెల్, ఇసుక తరలించుకోవాలన్నా.. ఆయనకు నెలవారీ మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. ఇసుక, గ్రావెల్ తరలించే లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు కోసం స్టేషన్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని దందాలు కొనసాగిస్తున్నారు. వసూలు చేసిన నగుదులో సిబ్బందికి సైతం ఒక్క రూపాయి ఇవ్వకుండా మొండిచేయి చూపడంతో వారు బయట పడలేక లోలోన మదనపడుతున్నారు. రెండు టిప్పర్లు.. రూ.1.10 లక్షలు ఎన్నికల వేళ ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతులు నిలిపివేసింది. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా కొంత పెరిగింది. ఇదే అదనుగా సదరు పోలీస్ అధికారి నిత్యం రేయింబవళ్లు జాతీయ రహదారిపై కాపు కాసి కేసుల పేరుతో కాసుల వేట సాగించారు. తాజాగా ఆదివారం విడవలూరు మండలం ముదివర్తి ఇసుక రీచ్ నుంచి రెండు టిప్పర్లు సామర్థ్యానికి మించి ఇసుక లోడ్‌తో ఒంగోలు వైపు బయలుదేరాయి. ఆ రెండు టిప్పర్లను హైవేలో సదరు అధికారి నిలబెట్టారు. సరైన పత్రాలు చూపలేదంటూ వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి వరకు ఇసుక యజమానులను అక్కడ ఉంచారు. అందరూ ముందు లారీ ఓనర్లతో బేరం సాగించారు. రెండు టిప్పర్లకు కలిపి రూ.1.10 లక్షల ముట్ట చెప్పేలా ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఎన్నికల వేళ ‘పచ్చ’పాతం సదరు పోలీస్ అధికారి గతంలో బుచ్చిరెడ్డిపాళెంలో పని చేసినప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పలు సందర్భాల్లో పోలీస్ ఉన్నతాధికారుల నుంచి చార్జ్ మెమోలు అందుకున్నారు. గతంలో వైఎస్సార్సీపీలో ఉండి.. ప్రస్తుతం టీడీపీలోకి వెళ్లిన నెల్లూరుకు చెందిన తన సామాజిక వర్గానికి సంబంధించిన ఓ నేత అండతో బుచ్చిరెడ్డిపాళెం నుంచి కొడవలూరు పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఎన్నికల వేళ సదరు నేతతో మిలాఖత్ అయి అడుగడుగునా ‘పచ్చ’పాతం చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందు కోసం టీడీపీ అభ్యర్థి నుంచి కోవూరు నియోజకవర్గంలో పనిచేసే పోలీస్ అధికారులకు భారీగానే ముడుపులు అందించినట్లు జిల్లా పోలీస్‌శాఖలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. స్టేషన్ స్థాయి అధికారికి రూ.3 లక్షలు, సర్కిల్ అధికారికి రూ.5 లక్షల వంతున టీడీపీ నేతల ద్వారా ముడుపులు అందించి ఎన్నికల్లో ఆ పారీ్టకి అనుకూలంగా పని చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లో మత్స్యకార గ్రామాల్లో అసాంఘిక దురాచారం అయిన ‘దురాయి’ ని టీడీపీ వేయించినా.. ఎటువంటి చర్యలు చేపట్టలేదనే ఆరోపణలకు ముడుపుల వ్యవహారమే అని అర్థమవుతోంది. తాను కూడా పనిలో పనిగా దాదాపు రూ.50 లక్షలు వెనుకేసినట్లు పోలీస్ వర్గాల విశ్వసనీయ సమాచారం. -
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్‌తో తొక్కించి ఏఎస్ఐ హత్య
ఇసుక మాఫియా రోజురుజుకీ రెచ్చిపోతుంది. వారి రాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకోవడం, ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయడం అలవాటుగా మారింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు మరో పోలీస్ అధికారి బలయ్యారు. అక్రమ మైనింగ్‌ను తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీస్ అధికారిని ట్రాక్టర్‌తో తొక్కి చంపేశారు.ఈ హేమమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్లో చోటుచేసుకుంది. షాడోల్ అసిస్టెంట్ ఎస్సై మహేంద్ర బగ్రీ, ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రసాద్ కానోజి, సంజరు దూబేలతో కలిసి శనివారం ఘటనా ప్రాంతానికి అక్రమ మైనింగ్ తనిఖీకి వెళ్లారు. ఈ సమయంలో వేగంగా వస్తున్న ఓ ఇసుక అక్రమ తరలింపు చేస్తున్న ట్రాక్టర్‌ను ఆపేందుకు యత్నించగా.. డ్రైవర్ దానిని ఆయనపై నుంచి పోనిచ్చాడు. ఆయనను తొక్కుకుంటూ వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన మహేంద్ర బగ్రీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.ఇద్దరు కానిస్టేబుళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇసుక అక్రమ తరలింపులో ట్రాక్టర్ ఓనర్, ఆయన కుమారుడికి పాత్ర ఉన్నట్లు తేలింది. దాంతో ట్రాక్టర్ ఓనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ట్రాక్టర్ ఓనర్ కోసం గాలిస్తున్నారు.ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్సై మహేంద్ర బాగ్రీని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అవినీతి అనకొండ
ఆధ్యాత్మిక తరంగాలతో పులకించే పొన్నూరును అవినీతి ‘ధూళి’ కమ్మేసింది. వరుసగా ఐదుసార్లు ప్రజా ప్రతినిధిగా గెలిపించిన అక్కడి ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. ఇసుక, గ్రావెల్, మెటల్ దేనినీ వదల్లేదు. ‘సంగం డెయిరీ’ని సొంత ఆస్తిలా మార్చుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనా దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఎమ్మెల్యే రోశయ్యపై శ్వేతపత్రం అంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఇదీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి చిట్టా. సాక్షి ప్రతినిధి, గుంటూరు: నరేంద్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్వారీలు, రీచ్‌ల్లో అక్రమాలకు పాల్పడి కోట్లు దండుకున్నారు. తూళ్లూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో మెటల్ సరఫరాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి కాసులు కాజేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, పెనుమాక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల్లో ఈయన సోదరులే కీలకం. ఇసుక రీచ్‌లపైనే ఆయన సుమారు రూ.500కోట్లు సంపాదించారంటే ఆయన అవినీతి ఏ స్థాయిదో అర్థమవుతుంది. కొలనుకొండలో అటవీశాఖ భూమిలో ఒక వ్యక్తి మైనింగ్ కోసం అనుమతులు తీసుకుంటే అయన్ను బెదిరించి లాభాల్లో 40 శాతం వాటాను దక్కించుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు క్వారీ మొత్తాన్ని కొట్టేశారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకుంటున్న లీజుదారుడిని బెదిరించి దాన్ని కూడా దక్కించుకున్నారు. గుంటూరు నుంచి తెనాలి మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ వర్క్ పనులకు గ్రావెల్ తరలించే కాంట్రాక్టు దక్కించుకొని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. వడ్లమూడి, చేబ్రోలు, శేకూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సోదరుడు, అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్ చేశారు. చేబ్రోలు మండల పరిధిలోని సుద్దపల్లిలో 25 ఎకరాల పెద్ద చెరువును క్వారీగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుంటే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. సంగం ఆస్తులు స్వాహా.. పాడి రైతుల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల స్వాహా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా డెయిరీ ప్రాంగణంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలో 1977లో స్థాపించిన గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (సంగం డెయిరీ) మొదట్లో 1964 సహకార చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వ ఆదీనంలో కొనసాగింది. తరువాత ఎన్టీఆర్ హయాంలో 1995లో మ్యాక్స్ చట్టంలోకి వచ్చిన తరువాత కొంతమేర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. ఈ చట్ట ప్రకారం గుత్తాధిపత్యం పాలకవర్గం అజమాయిషీలో ఉండేది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కంపెనీ యాక్ట్‌లోకి మార్చారు. అప్పటి నుంచి నరేంద్ర తన చేతుల్లోకి తీసుకుని ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి పది ఎకరాల డెయిరీ స్థలాన్ని ట్రస్టుకు బదలాయించారు. విలువైన భూములూ హాంఫట్..: అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో రూ. కోట్లు విలువైన పోరంబోకు భూములను అడ్డగోలుగా ఆక్రమించేశారు. పెదకాకాని మండలం నంబూరు వాగు పోరంబోకు భూములను తమ బంధువు పేరుతో ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి రెండు, మూడు చేతులు మార్చినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు. పొన్నూరు దేవదాయ శాఖ భూముల్ని ఆక్రమించి తన తండ్రి పేరుతో కాలనీలు ఏర్పాటు చేశారు. కేవలం తమ సామాజికవర్గం ఉండే ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల అభవృద్ధిని పట్టించుకోలేదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రోశయ్య నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతుంటే ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. కల్యాణ మండపం నిర్వహణతో కాసుల వేట..: పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పాడి రైతులు తమ సంఘం నిధులతో రోడ్డుపక్కన 30 సెంట్ల స్థలం కొన్నారు. ఈ స్థలంలో ధూళిపాళ్ల తన తండ్రి పేరుతో నలుగురు ఎంపీలు ఇచ్చిన నిధులు రూ. 23 కోట్లతో 2003లో కల్యాణ మండపాన్ని నిర్మించారు. ఇలా నిర్మించిన ఏ నిర్మాణాలైన పంచాయతీ, మున్సిపాలిటీ ఆదీనంలోనే ఉండాలి. అయితే ఈ కల్యాణ మండపానికి నరేంద్ర తల్లి భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. -
Fact Check: సిగ్గు ‘ఈడీ’సి రాతలా?
గురివింద చెబుతున్నట్లు గత చంద్రబాబు పాలనలో ఇసుకను ఉచితంగా ఇచ్చి ఉంటే.. చింతమనేని ప్రభాకర్ మహిళా తహశీల్దార్‌ను ఎందుకు జుట్టు పట్టుకుని ఈడ్చినట్లు? అర్ధ రాత్రిళ్లు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వెనుక ప్రొక్లయినర్లతో ఎందుకు ఇసుక తవ్వకాలు సాగించినట్లు? వీటిని బట్టి బాబు అండ్ గ్యాంగ్ అందినకాడికి దోచుకున్నారని ఈ రాజగురివిందకు తెలీదా? ఈ లెక్కన ఈ ప్రభుత్వంలో ఇసుక విక్రయం వల్ల ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. ఐదేళ్లలో సుమారు రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తోంది. మరోవైపు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం మోపుతోంది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ద్వారా నిఘా పెట్టింది. ఏకంగా 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఇదంతా కళ్లెదుటే అందరికీ కనిపిస్తున్నా.. రామోజీకి, పచ్చ మీడియాకు మాత్రం కనిపించదు. తమ చంద్రబాబును అధికారంలోకి తేవడానికి ఎంతకైనా దిగజారుతామని, అవసరమైతే బట్టలిప్పుకుని దుష్ప్రచారం చేస్తామని అనునిత్యం చాటుకోవడం వీరికి పరిపాటిగా మారింది. ఎవరు నవ్విపోతే మాకేంటని నిస్సిగ్గుగా రోజూ రోత రాతలు రాయడం రామోజీకే చెల్లింది. సాక్షి, అమరావతి: మోకాలికి బోడిగుండుకి ముడి పెట్టడం ఎంత తిక్క తనమో ఏపీలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను తమిళనాడుతో పోల్చి అక్కసు వెళ్లగక్కడం అంతకంటే ఎక్కువ పిచ్చితనం. ఈ పిచ్చి రాతలనే నమ్ముకున్న రామోజీ అదే పనిగా ఇసుకపై తనకున్న పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎక్కడో తమిళనాడులో జరిగిన ఇసుక తవ్వకాలపై ఈడీ దృష్టి సారిస్తే, ఇక్కడ కూడా అలాగే జరగాలని కోరుకోవడం సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న కక్ష కాకపోతే మరేమిటి?. ఇసుక తవ్వకాలు సక్రమంగా జరుగుతున్నా అక్కసుతో నిత్యం తాను బురద జల్లడమే కాకుండా ఏకంగా ఈడీ జోక్యం చేసుకోవాలని బరి తెగించి అడ్డగోలు రాతలు రాయడం గురువింద రామోజీకి చెల్లింది. నిజానికి ఈడీ దర్యాప్తు జరపాల్సింది డిపాజిటర్లను నిట్టనిలువునా ముంచిన రామోజీ సొంత సంస్థ మార్గదర్శిపైనే. మార్గదర్శికి అక్రమంగా డిపాజిట్లు సేకరించారని సాక్షాత్తూ కోర్టులే స్పష్టం చేశాయి. వేల కోట్లు దోచేసి నంగనాచి రాతలు, దొంగ ఏడుపులు, నక్క తెలివి తేటలతో తప్పించుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ భూకుంభకోణాలపై ఈడీగానీ, సీబీఐగానీ విచారణ చేస్తే ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా నిజాలు బహిర్గతమవుతాయి. తన వెనుక ఉన్న ఈ అక్రమాలను దాచిపెట్టుకుని ప్రభుత్వంపై అదేపనిగా బురద చల్లడం రామోజీకి రోజువారీ ప్రక్రియగా మారిపోయింది. విష ప్రచారం ద్వారా చంద్రబాబుకు మేలు చేయాలనే ఆరాటం తప్ప నిజంగా ఇసుక తవ్వకాల వల్ల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందో తెలిపే ఒక్క లైను ఈనాడు రాయలేకపోతోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, ఇక్కడి ఇసుక విధానం, తమిళనాడులో ఇసుక విధానం, తవ్వకాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా రెండు రాష్ట్రాలను పోలుస్తూ ఈనాడు ప్రచురించిన కథనంలో అక్కసు మాత్రమే కనిపిస్తోంది. బాబు హయాంలో జేబుల్లోకి రూ.వేల కోట్లు వాస్తవానికి గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం పేరుతో కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రాకుండా ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్ళింది. ఆ దోపిడీని నివారించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత పారదర్శకంగా నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం రూ.765 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ సొమ్మును తిరిగి ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ డబ్బంతా చంద్రబాబు హయాంలో ఏమైంది? సహజ వనరుల ద్వారా వచ్చే రెవెన్యూ ప్రజా సంక్షేమానికి వినియోగించడానికి బదులు, ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లేలా చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఇసుక కొనుగోలు చేయడానికి ప్రజలు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్పించింది చంద్రబాబు. ఆ అరాచక విధానాన్ని రూపు మాపి ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా నూతన ఇసుక పాలసీని వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో ఎక్కడా ఇసుక కొరత లేకుండా, అందుబాటు ధరలోనే, కావాల్సినంత ఇసుకను పొందే వీలు కల్పించారు. టెండర్ల ద్వారా ఇసుక తవ్వకాలను ఏజెన్సీలకు అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. ఐదేళ్లలో రూ.3825 కోట్ల ఆదాయం వస్తోంది. టన్ను ఇసుకను రూ.475కి విక్రయిస్తోంది. అక్రమ ఇసుక దందాపై ఉక్కుపాదం రాష్ట్రంలో అక్రమ ఇసుక దందాపైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్షను విధించేలా చట్టాల్లో మార్పులు తీసుకువచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి దాదాపు 18 వేల కేసులను ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఈ తీర్పుకు సంబంధించి వచ్చిన ఆరోపణలు కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. అంటే ఉచిత ఇసుక విధానం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, ఇటు పర్యావరణానికి విఘాతం ఏర్పడింది. టీడీపీ హయాంలో ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోయిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఆదాయం ఏమైంది ? ఈ ప్రభుత్వంలో ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న రూ.3,825 కోట్ల ఆదాయం గతంలో ఏమైంది? ఇంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతోందని తెలిసినా ఎందుకు టెండర్లు పిలువలేదు? పారదర్శక విధానాలను ఎందుకు ఎంచుకోలేదు? అప్పుడు రామోజీరావు ఈ అక్రమాలపై ఈడీ విచారణ జరిపించాలని ఎందుకు కోరలేదు.? ప్రస్తుతం పర్యావరణ అనుమతులు ఉన్న రీచ్ ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. అలాగే సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్లలో డీసిల్టింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా అక్రమ తవ్వకాలు జరగడానికి అవకాశమే లేదు. దీనిపై పర్యవేక్షణకు నిఘా కోసం ఎస్ఈబిని ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ కూడా గనులశాఖలో పనిచేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్‌లు నిర్వహిస్తున్నారు. -
Fact Check: రామోజీ.. ఇసుకపై బురద రాతలు మానవా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై రామోజీరావు వక్రరాతలు మానడంలేదు. నిత్యం తన ఈనాడు పత్రికలో ఇసుకపై బురద వార్తలు రాస్తూనే ఉన్నారు. తన గలీజుతనాన్ని బయటపెట్టుకుంటూనే ఉన్నారు. ఇసుక తవ్వకాల్లో లేని అక్రమాలను ఉన్నట్లు చూపించేందుకు రామోజీరావు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) తనకు చెప్పినట్లే కథనాలు అల్లేస్తున్నారు. వాటిని చూసి ప్రజలు నమ్మేస్తారని అపోహ పడుతున్నారు. చంద్రబాబు హయాంలో గతంలో ఎప్పుడూ లేనంత పెద్దఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రజలకు సులభంగా ఇసుక అందుతున్నా కూడా ప్రభుత్వంపై దు్రష్పచారానికి ఒడిగడుతున్నారు. నిజానికి ఇసుక తవ్వకాల్లో ఎన్జీటీ నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 110 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు ఉన్నా.. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలతో వాటిల్లో తవ్వకాలను నిలిపివేసింది. తర్వాత ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా తిరిగి అన్ని అనుమతుల కోసం గనుల శాఖ దరఖాస్తు చేసింది. అందులో భాగంగా ఇప్పటివరకు 61 ఓపెన్ రీచ్‌లకు అనుమతులు లభించాయి. మిగిలిన వాటికి మరో వారం రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఉన్న డీసిల్టింగ్ పాయింట్లలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయినా ‘ఉల్లంఘనలు నిజం’ అంటూ పతాక శీర్షికతో పచ్చి అబద్ధాలను ఈనాడు అచ్చేసింది. ఎన్జీటీకి 3 నెలలకోసారి నివేదిక ఇచ్చేలా చర్యలు ఇసుక విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. ఎన్జీటీ నుంచి వచ్చిన సూచనలు, మార్గదర్శకాలతో దీన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు గనుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇసుక తవ్వకాలపై సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం ఇంత బాధ్యతతో వ్యవహరిస్తోంది. న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం తనిఖీలు న్యాయస్థానాల ఆదేశాలతో జిల్లాల కలెక్టర్లతో కూడిన బృందాలు రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లను ఇటీవల పరిశీలించాయి. ఆయా రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయా? లేదా అనే అంశాలను రికార్డు చేశాయి. ఈ నివేదికలను న్యాయస్థానాలకు సమర్పించారు. ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా గనుల శాఖ తీసుకున్న చర్యల కారణంగా అనుమతి లేని రీచ్‌ల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. ఇదే అంశాన్ని కలెక్టర్లు కూడా తమ నివేదికలో స్పష్టం చేశారు. ఈనాడు మాత్రం కలెక్టర్లు వచ్చి వెళ్లిన తరువాత ఇసుక తవ్వకాలు మళ్లీ జరుగుతున్నాయంటూ అడ్డగోలుగా అబద్ధాలు ప్రచురించింది. అదికూడా భారీ యంత్రాలను రీచ్‌లకు తరలించి వెంటనే తవ్వకాలు ప్రారంభించారంటూ నిస్సిగ్గుగా రాసింది. ఒకవైపు ఇసుక రీచ్‌ల్లో అధికారిక తనిఖీలు జరుగుతూ ఉంటే, మరోవైపు ఎవరైనా భారీ యంత్రాలను రీచ్‌లకు తరలిస్తారా? అసలు తవ్వకాలే జరగడం లేదని అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేసి నివేదిక ఇస్తే, రోజుకు రెండు వేల టన్నుల ఇసుక తవ్వుతున్నారంటూ, కంప్యూటరైజ్డ్ వే బిల్లులు లేకుండానే ఆ ఇసుకను రవాణా చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసింది. పాత ఫోటోలతో ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నం చేసింది. జరగని రవాణాకు జీపీఎస్ ట్రాకింగ్ లేదంటూ, రీచ్‌ల్లో సీసీ కెమేరాలు లేవని, అడుగడుగునా ఉల్లంఘనలే జరుగుతున్నాయని గగ్గోలు పెట్టడం రామోజీ వక్రబుద్ధికి నిదర్శనం. ఆ పత్రికకు నిబద్ధత ఎక్కడిది? గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వర్షాల వల్ల ఇసుక తవ్వకాలు రీచ్‌ల్లో జరగలేదు. వేసవికాలంలో ముందుజాగ్రత్తగా సిద్ధం చేసిన ఇసుక డిపోల నుంచే ప్రజలకు విక్రయాలు జరిగాయి. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ ఈనాడు పత్రిక దానిని అక్రమ ఇసుక తవ్వకాలు కిందనే నిర్ధారించడం ఆ పత్రికకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. బాధ్యతారహితంగా ఈనాడు ప్రచురించే ఇటువంటి కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, మైనింగ్ శాఖ -
ఇసుకపై మళ్లీ అదే అక్కసు
సాక్షి, అమరావతి: అసలే కోతి.. కల్లు తాగింది.. ఆపై నిప్పు తొక్కితే ఎలా ఉంటుంది..? ఈనాడు రామోజీరావు పరిస్థితి ఇప్పుడు అచ్చు అలాగే ఉంది. సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక విషం చిమ్మందే తెల్లారని రాజగురువు పాడిందే పాడరా పాచిపళ్ల దాసరా.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక తవ్వకాలపై ఇప్పటికే టన్నుల కొద్దీ అబద్ధాలను తన విషపుత్రిక ఈనాడులో అచ్చేసిన ఆయన ఇప్పుడు మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించి వికృత రాతలతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. జిల్లా కలెక్టర్లు చేసిన తనిఖీలను అడ్డగోలుగా వక్రీకరించి తన వక్రబుద్ధిని మళ్లీ బయటపెట్టుకున్నారు. ప్రభుత్వంపైనా, సీఎం వైఎస్ జగన్‌పైనా గుడ్డి వ్యతిరేకతతో ప్రతి విషయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుని పారదర్శకంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచురించారు. బాబు పాలనలో తవ్వకాల బరితెగింపు.. నిజానికి.. చంద్రబాబు హయాంలోనే ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగింది. సహజ వనరుల ద్వారా వచ్చే రెవెన్యూని ప్రజాసంక్షేమానికి వినియోగించడానికి బదులు, ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. ప్రజలు ఇసుక కొనుగోలు చేయడానికి బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి అరాచకాలను నిర్మూలించేందుకు సీఎం జగన్ కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక విక్రయాలను ఒక క్రమపద్ధతిలో నిర్వహించేలా చేస్తున్నారు. ఎక్కడా ఇసుక కొరత లేకుండా, అందుబాటు ధరలోనే, కావాల్సినంత ఇసుకను పొందే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు నిర్వహించారు. అందులో సక్సెస్ఫుల్ బిడ్డర్లుగా ఎంపికైన ఏజెన్సీలు ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించాయి. పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్లలో డీసిల్టింగ్ జరుగుతోంది. దీనిపై పర్యవేక్షణ, నిఘా కోసం ఎస్ఈబీని ఏర్పాటుచేశారు. అలాగే, జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనుల శాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ కూడా గనుల శాఖలో పనిచేస్తోంది. అంతేకాక.. రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. బాబు హయాంలో దోపిడీకి ఈనాడు వత్తాసు.. అసలు చంద్రబాబు పాలనలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగినా రామోజీరావు, ఈనాడు పత్రిక కళ్లుమూసుకున్నాయి. మహిళా సంఘాలకు ఇసుక తవ్వకాలను అప్పగించి, ఇసుక మాఫియా ధాటికి వారు పనిచేయలేని పరిస్థితిని కల్పించిన ఘనత చంద్రబాబుది. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం పేరుతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంది. టీడీపీ నేతల జేబులు నింపేందుకే ఉచిత ఇసుక విధానం ఉపయోగపడింది. చంద్రబాబు హయాంలో ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు రూ.3,825 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఈ సొమ్మంతా ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. మరోవైపు.. ప్రజలు అధిక ధరల్లో బ్లాక్ మార్కెట్లో ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. అప్పట్లో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వోపైనే నాటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడిచేసిన ఘటన ఇసుక మాఫియా ఆగడాలకు అద్దంపట్టింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇసుక లారీలు పెద్దఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. లెక్కాపత్రం లేకుండా విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిగాయి. పలు రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా.. ఇక మన రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్, పర్యవేక్షణకు పారదర్శకంగా అనుసరిస్తున్న విధానాలను పలు రాష్ట్రాలకు చెందిన మైనింగ్ అధికారులు కూడా పరిశీలించి, తమ రాష్ట్రాల్లో మోడల్‌గా అమలుచేసేందుకు విధానాలు రూపొందించుకుంటున్నారు. ఇవన్నీ ఈనాడుకు కనిపించడంలేదు. ఒకవేళ కనపడినా కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తూ.. అక్రమాలకు ప్రోత్సహిస్తున్నారని, దాడులకు సంబంధించిన సమాచారం ముందే లీక్ చేస్తున్నారంటూ అసత్యపు రాతలు రాస్తోంది. పొంతనలేని రాతలతో తప్పుడు ఆరోపణలు.. మరోవైపు.. రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్కడక్కడా వచ్చిన ఆరోపణలపై పలు జిల్లాల్లో కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కూడిన బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీలు జరుగుతున్నాయని రాసిన ఈనాడు.. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు రీచ్‌ల వైపు రాలేదని, మరికొన్నిచోట్ల గనులు, కాలుష్య నియంత్రణ, భూగర్భ జలశాఖ, ఎస్ఈబీ అధికారులతో కమిటీలు వేసి వారితో తనిఖీలు చేయించారంటూ పొంతనలేని రాతలు రాసింది. అలాగే, తనిఖీలు కొనసాగుతుంటే.. అప్పుడే ఎన్జీటీకి నివేదికలు ఇచ్చారంటూ అడ్డగోలు వాదనకు తెరతీసింది. వాస్తవంగా ఏం జరుగుతుందో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, కేవలం అధికారులపై బురదజల్లే ఉద్దేశంతోనే పరస్పరం పొంతనలేని కథనాలతో తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఏటా రూ.785 కోట్ల ఆదాయం.. ఇప్పుడు ప్రతిఏటా ప్రభుత్వానికి రూ.785 కోట్లు ఆదాయం వస్తోంది. టన్ను ఇసుక ఓపెన్ రీచ్‌లలో రూ.475కి విక్రయిస్తున్నారు. అలాగే, రీచ్‌లు, డిపోల వద్ద రవాణా చార్జీలతో కలిపి ఇసుక ధరలను కూడా ప్రతివారం పత్రికల ద్వారా ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంతకన్నా ఎక్కువకు ఎవరు విక్రయించినా, లేదా ఇసుక కొనుగోళ్లు, రవాణాలో ఎటువంటి సమస్యలున్నా టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి ఈనాడు పత్రిక తమ ఊహలను వార్తలుగా రాస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ఇసుక తవ్వకాలపై పదేపదే అక్కసు వార్తలు వండి వారుస్తోంది. ఎన్జీటీ సంతృప్తి.. ఈనాడు మొద్దు నిద్ర.. ఇప్పుడు సీఎంగా వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత.. పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక తవ్వకాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జరిగిన ఇసుక తవ్వకాల కారణంగా ఎన్జీటి ఏకంగా రూ.100 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తంచేస్తూ, గత ప్రభుత్వం తప్పిదాలవల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దుచేసింది. ఈ విషయం తెలిసినా ఈనాడు తెలియనట్లు మొద్దునిద్ర నటిస్తోంది. -
Fact Check: ఇసుకపై అదే అక్కసు
సాక్షి, అమరావతి: ఒక నిజాన్ని అబద్ధం చేసేందుకు పదేపదే దాన్ని అబద్ధమని ప్రచారం చేయాలన్న గోబెల్స్ సిద్ధాంతాన్నే రాజగురువు రామోజీరావు నమ్ముకున్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై పదేపదే ప్రయోగిస్తున్నారు. ఇసుక తవ్వకాల్లో లేని అక్రమాలను ఉన్నట్లు చూపించేందుకు నిత్యం దానిపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్రమ తవ్వకాలు జరిగిపోతున్నాయంటూ దాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి లింకు పెట్టి, ప్రజలను నమ్మించేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ‘ఇసుకలో కొత్త తోడు దొంగలు’ పేరుతో కొత్త తప్పుడు ప్రచారాన్ని ఈనాడు అందుకుంది. బోడి గుండుకు మోకాలికి లింకు పెట్టినట్లు ఇసుక తవ్వకాలకు, సీఎం సోదరుడికి లింకు పెట్టి మరీ అబద్ధాలు అచ్చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారంటూ ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో అర్థం లేని రాతలు రాసింది. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న ఎంఎస్టీసీ ద్వారా గనుల శాఖ టెండర్లు నిర్వహించింది. అందులో ప్రతిమ ఇన్ఫ్రా లిమిటెడ్ ప్యాకేజీ –1, ప్యాకేజీ–3 లోని 18 జిల్లాలకు, జీసీకేసీ ప్రాజెక్ట్స్–వర్కర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్యాకేజీ–2 లోని 8 జిల్లాల్లో ఇసుక ఆపరేషన్స్‌కు విజయవంతమైన బిడ్డర్లుగా ఎంపికయ్యాయి. నిబంధనల ప్రకారం ఆ రెండు సంస్థలు పర్యావరణ అనుమతులు ఉన్న రీచ్‌లలో ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించాయి. సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్లలో డీసిల్టింగ్ జరుగుతోంది. వాస్తవాలు ఇలా ఉంటే సీఎంవో పేరుని వాడుకుని తవ్వకాలు జరుపుతున్నారని, అంతా సీఎం సోదరుడి ఆధ్వర్యంలోనే జరుగుతోందని అభూత కల్పనల్ని ఈనాడు ప్రచారం చేస్తోంది. ఒకవైపు టెండర్ల ద్వారా ఎంపికైన సంస్థలు ఇసుక ఆపరేషన్లు చేపడితే బయట వ్యక్తులు ఇసుక తవ్వకాలు చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలకు దిగింది. సీఎం సోదరుడికి, మరో వ్యక్తికి ఇసుక ఆపరేషన్లతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఉన్నట్లు చిత్రీకరించేందుకు శత విధాలుగా అబద్ధాలు వల్లెవేస్తోంది. కావాలని ఇసుక ఆపరేషన్లను రాజకీయం చేయాలని దురుద్దేశంతో ఈ కథనం రాసినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో చంద్రబాబు ఇంటి వెనకాలే అక్రమ తవ్వకాలు చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా కరాళ నృత్యం చేసినా రామోజీ పట్టించుకోలేదు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. పెద్దఎత్తున ఇసుకను లారీల్లో తరలించారు. ఇక్కడే.. చంద్రబాబు ఇంటి పక్కనే జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఆనాడు ఇసుక అక్రమాలను అడ్డుకున్న అధికారులపైనా టీడీపీ నేతలు దాడులు చేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన సంగతి రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఫోటోలు, వీడియోలతో సహా ఆధారాలు దొరికినా చంద్రబాబు దానికి కారకులైన వారిని శిక్షించలేదు. పంచాయతీ చేసి, ఒక మహిళా అధికారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఇసుక విధానం అంటూ లేకుండా చేశారు. మొదట డ్వాక్రా మహిళలకు అని చెప్పి వారి పేరుతో ఇసుకను దోచేశారు. తర్వాత ఉచితం అంటూ దోపిడీకి గేట్లు ఎత్తేశారు. ఒక్క ఇసుక విధానంపైనే 19 జీవోలు తీసుకువచ్చారు. ప్రజల్లో అయోమయం సృష్టించి, చక్కగా దోపిడీకి పాల్పడ్డాడు. ఆనాడు కళ్లుండీ కబోదిలా వ్యవహరించిన రామోజీరావు ఇప్పుడు లేని అక్రమాలను ఉన్నట్లు చూపించేందుకు తన పాత్రికేయాన్ని ఉపయోగిస్తున్నారు. చంద్రబాబు హయాంలో అక్రమాలు జరుగుతుంటే కళ్లు మూసుకున్నారు. ఉచిత ఇసుక ముసుగులో వేల కోట్లు కొల్లగొట్టినా సక్రమమే అయింది. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై దాడిని మరిచిపోయారు. బాబు ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలను ఎన్జీటీ నిర్థారించిన విషయాన్నీ మరచిపోయారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ అంతా పారదర్శకంగా, పకడ్బందీగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటే, సహించలేక విషం చిమ్ముతున్నారు. మాఫియాకు సీఎం జగన్ చెక్ వాస్తవానికి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఇసుక మాఫియాకు చెక్ పెట్టారు. నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చారు. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.780 కోట్లు ఆదాయం వస్తోంది. అంటే అయిదేళ్ళలో రూ.4 వేల కోట్ల ఆదాయం. చంద్రబాబు పాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? చంద్రబాబు హయాంలో ఏ నియోజకవర్గంలోనైనా ఇసుక ఉచితంగా ప్రజలకు అందిందా? ఉచిత ఇసుక పేరుతో ఎక్కువ రేటుకు వినియోగదారులు కొనుక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు. అవాస్తవాలు పదేపదే రాస్తే నిజాలైపోవు.. గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఉచిత ఇసుక విధానం పేరుతో గతంలో జరిగిన దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సీఎం వైఎస్ జగన్ అత్యంత పారదర్శక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక ఆపరేషన్స్‌కు ఏజెన్సీలను ఖరారు చేశాం. ఆపరేషన్స్ కూడా ప్రారంభించాం. ఈనాడు పత్రిక ఓర్వలేనితనంతో అభూతకల్పనలను, అవాస్తవాలను పోగు చేసి పదేపదే ఇసుకపై అవాస్తవాలతో కూడిన కథనాలను ప్రచురిస్తోంది. ఇసుక అక్రమాలు జరగకుండా నిఘా కోసం ఎస్ఈబీని ఏర్పాటు చేశాం. జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులు కూడా ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ కూడా గనుల శాఖలో పనిచేస్తోంది. రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్‌లు నిర్వహిస్తున్నాం. ఈ విభాగాల పనితీరును కూడా ఈనాడు ఆక్షేపించడం దారుణం. అక్రమాలకు ప్రోత్సహిస్తున్నారని, దాడులకు సంబంధించిన సమాచారం ముందే లీక్ చేస్తున్నారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలు రాస్తున్నారు. -
ఇసుక బకాసురుడు బాబు 'తవ్వుకో.. తినుకో'!
సాక్షి, అమరావతి: ఇసుక నుంచి తైలం పిండటంలో నిజమెంత ఉందో తెలియదుగానీ ఇసుక నుంచి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టవచ్చని చంద్రబాబు నిరూపించారు. అది కూడా ఇసుక ఉచితం అని బురిడీ కొట్టించి దోపిడీకి పాల్పడటం ఆయనకే సాధ్యమైంది. తాను అక్రమంగా నివాసం ఉంటున్న కరకట్ట ఇంటి వెనుకే వేల కొద్దీ లారీల్లో ఇసుక తరలిపోతున్నా గుడ్లప్పగించి చూశారు. టీడీపీ హయాంలో ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో పచ్చ ముఠా సాగించిన దోపిడీని సీఐడీ పూర్తి ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. కేంద్ర చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు చేసిన లూటీ ఆధారాలతో బహిర్గతమైంది. 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా చంద్రబాబు ముఠా ఏకంగా రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడిందన్నది నిగ్గు తేలింది. అంతులేని ధన దాహం 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు కన్ను ఇసుక రీచ్‌లపై పడింది. అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడినా ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ఇసుక విధానాన్ని పునఃసమీక్షించాలని కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. కొత్త ఇసుక విధానాన్ని నిర్ణయిస్తూ 2016 జనవరి 15న రెండు జీవోలు (జీవో నంబర్లు 19, 20) జారీ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఇసుక దాహం తీరలేదు. బరితెగించి ఇసుక దోపిడీకి పాల్పడేందుకు మరో విధానాన్ని తీసుకురావాలని భావించారు. ‘ఇసుకను ప్రభుత్వం అమ్మదు.. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు.. ఎవరికి వారు ఇసుక రీచ్‌లకు వెళ్లి ఇసుక తవ్వుకోవచ్చు.. అమ్ముకోవచ్చు.. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు విధించదు’ అని చెబుతూ 2016 మార్చి 4న ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చి దొరికిన చోట దొరికినట్లు దోచుకున్నారు. ఇసుక రీచ్‌లు అన్నింటినీ చంద్రబాబు తన చేతిలోకి, మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకొచ్చారు. మూడు మార్గాలు బేఖాతర్.. భారీ ఇసుక దోపిడీ కోసం చంద్రబాబు అన్ని నిబంధనలను ఉల్లంఘించారు. ఒక ‘మెమో’తో ఇసుక దోపిడీకి పన్నాగం పన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడే ఇసుక తవ్వకాల కోసం విధానాలు రూపొందించాలి. అందుకు నిర్దేశించిన మూడు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఒకటి ఎంపిక చేసుకోవాలి. ఇసుక తవ్వకాల కోసం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రూపొందించిన బిజినెస్ రూల్స్ (మార్గదర్శకాలు) అనుసరించాలి. అంతకంటే మెరుగైన విధానం రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే ఆమేరకు ఆరి్థక శాఖ ఆమోదం పొందాలి. ఓ విధానాన్ని రూపొందించి అందుకు కేబినెట్ ఆమోదం పొందాలి. చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన ‘ఉచిత ఇసుక విధానం’ కోసం ఈ మూడింటిలో ఏ ఒక్కటీ పాటించలేదు. మెమో 3066తో కనికట్టు ‘ఉచిత ఇసుక విధానం’ విధానాన్ని తెస్తూ టీడీపీ ప్రభుత్వం 2016 మార్చి 4న ప్రత్యేకంగా ‘మెమో 3066’ జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నీ చంద్రబాబు, ఆయన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హస్తగతం చేసుకున్నారు. సహజ వనరులు, రాష్ట్ర ఖజానాకు కీలకమైన ఆరి్థక వనరుకు సంబంధించి కేబినెట్ ఆమోదం లేకుండానే అడ్డగోలుగా కేవలం ఒక మెమోను సాకుగా చూపి రంగంలోకి దిగారు. ఈ మెమో ద్వారా 2016 నుంచి 2019 వరకు అడ్డూ అదుపు లేకుండా ఇసుకను కొల్లగొట్టారు. రేట్లపై, తవ్వకాలపై నియంత్రణ లేదు. జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లలో ఎవరెవరు తవ్వుకోవాలో చంద్రబాబు స్వయంగా తన బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఒక్కసారిగా భారీ యంత్రాలను ఇసుక తవ్వకాల కోసం తెచ్చారు. ఇతరులు ఎవరూ ఆ ఇసుక రీచ్‌ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా కట్టడి చేశారు. చంద్రబాబు ముఠా రోజూ వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుకను తవ్వేసి అమ్ముకుంది. రాష్ట్రంలో నదుల్లో అందుబాటులో ఉన్న ఇసుక ఎంత..? రోజుకు ఎంత తవ్వుతున్నారు? ఎంతకు అమ్ముతున్నారు? ఎన్ని వేల లారీల ఇసుక రోజూ రాష్ట్రం దాటుతోంది? అనేదానికి అంతూపొంతూ లేకుండా పోయింది. ఆ ఆదాయం ఏమైంది? గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వకాల ద్వారా ఖజానాకు నాలుగు రకాల ఆదాయం రావాలి. సీనరేజీ, కన్సిడరేషన్ చార్జీలు, డి్రస్టిక్ట్ మైన్స్ ఫండ్, మెరిట్ ఫీజు చెల్లించాలి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటిస్తూ కొత్త ఇసుక విధానాన్ని తెచ్చింది. దూరాన్ని బట్టి ఏ రీచ్ నుంచి ఎంత చార్జీ అనే అంశాన్ని నిర్ణయించి పారదర్శకంగా ప్రకటిస్తోంది. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.766 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ప్రకారం టీడీపీ హయాంలో 2016 నుంచి 2019 వరకు కనీసం రూ.వెయ్యి కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావాల్సి ఉంటుందని గనుల శాఖ అంచనా వేసింది. చంద్రబాబు ‘ఉచిత ఇసుక’ అనే మోసపూరిత విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల గండిపడింది. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా తవ్విన ఇసుక ఎంతనే అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 2016 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఠా రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఇసుకను తవ్వి అమ్మేసుకుందన్నది విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఐడీ తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అడ్డుకున్న మహిళా అధికారి వనజాక్షిపై దాడి.. ఇసుక దోపిడీ కుట్రకు చంద్రబాబు సూత్రధారి కాగా అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు మరికొందరు ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అంతటా యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. అక్రమ ఇసుక తవ్వకాలను ప్రశ్నించినందుకు తహసీల్దార్ వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుత్తు పట్టుకుని మరీ దాడికి పాల్పడ్డారు. తహసీల్దార్‌పై దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్‌ను నాటి సీఎం చంద్రబాబు సమర్ధించడం విస్మయ పరిచింది. తమ ఇసుక దోపిడీకి అడ్డు వస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని సందేశం ఇచ్చేందుకే చంద్రబాబు అలా వ్యవహరించారు. -
అయిదుగురు కలెక్టర్లకు ఈడీ నోటీసులపై హైకోర్టు స్టే
చెన్నై: తమిళనాడులోని అయిదు జిల్లాల కలెక్టర్లకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. తమ అధికార పరిధిలోని ఇసుక అక్రమ తవ్వకాల కేసులో అయిదు జిల్లాల కలెక్టర్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన నోటీసులపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. మూడు వారాలపాటు అయిదుగురు కలెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, విచారణకు పిలవవద్దని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఈడీ తన విచారణను కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ద్వారా రూ. 4,500 కోట్లు చేతులు మారినట్లు ఈడీ నిర్ధారించింది. హవాలా లావాదేవీలు, షెల్ కంపెనీలతో సహా పలు రహస్య మార్గాల ద్వారా అక్రమ నిధులు దారి మళ్లించినట్లు పేర్కొంది. ఈ కేసులో భాగంగా తమ అధికార పరిధిలో ఇసుక మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి అరియలూరు, వేలూరు, తంజావూరు, కరూర్, తిరుచిరాపల్లి జిల్లాల కలెక్టర్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు జారీ చేసింది. చదవండి: Uttarakhand: రెస్క్యూ బృందాలకు 3 మీటర్ల దూరంలో కార్మికులు ఆయా జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన వివరాలతో వివిధ తేదీల్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కలెక్టర్ల తరపున రాష్ట్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శి కె. నంతకుమార్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ సమన్లను రద్దు చేయాలని తన పిటిషన్లో కోరారు. దీనిపై తొలుత సోమవారం విచారించిన ధర్మాసనం.. ఈడీ సమన్లపై నేడు మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 21కి బెంచ్ వాయిదా వేసింది. కాగా ఈడీ నేరుగా జిల్లా కలెక్టర్లకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విషయంలో సహయం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఈడీ అభ్యర్థించగలదని పేర్కొంది. ఈడీకి అపరిమిత అధికారం పార్లమెంట్ ఇవ్వలేదని చెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి నేరాలను దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేదని తెలిపింది. ఇదిఫెడరలిజానికి విరుద్దని పేర్కొంది. అయితే ఇసుక అక్రమ రవాణా కేసులో ప్రైవేట్ వ్యక్తులతో ప్రభుత్వ అధికారులను విచారణకు పిలిచినట్లు దర్యాప్తు సంస్థ చేబుతోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) విచారణకు సంబంధించి ఎవరికైనా సమన్లు ఇచ్చే అధికారం తమకు ఉందని పేర్కొంది. -
Fact Check: రేవులపై ఈనాడు గావుకేకలు
సాక్షి, అమరావతి : గతంలో టెండర్లు దక్కించుకున్న సంస్థ గడువు పూర్తయింది.. కొత్త టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా పూర్తయింది.. ఈలోపు ఇసుక కొరత రాకూడదన్న ఉద్దేశ్యంతో పాత సంస్థతో తవ్వకాలు జరిపిస్తున్నారు.. ఈ పద్ధతి ప్రతీ కాంట్రాక్టు విధానంలో ఉన్నదే.. అయినా, ఇదంతా ఈనాడు రామోజీరావుకు తెలియంది ఏమీకాదు.. కానీ, ఆయన ఎందుకు దీనిపై పదేపదే టన్నులకొద్దీ విషం కక్కుతున్నారు? ఇందుకు జవాబు ఒక్కటే.. సీఎం జగన్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించడమే ఆయన లక్ష్యం. ఈ క్రమంలో ఆయన జరగని తప్పుని జరిగిందని నమ్మించేందుకు పదేపదే విషం చిమ్ముతూ తన వికృత రూపాన్ని మళ్లీమళ్లీ ఆవిష్కరించుకుంటున్నారు. ఇసుక తవ్వకాల్లో ఎలాంటి లోపాల్లేవని, అంతా పారదర్శకంగా ఉందని తెలిసినా బురదజల్లడం ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ఆయన నానాగడ్డి కరుస్తున్నారు. ‘రేవుల్లో దొంగలు పడ్డారు’ అంటూ పచ్చి అబద్ధాల కథనాన్ని ఈనాడు మరోసారి వండి వార్చింది. చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక విధానం పేరుతో జరిగిన అడ్డగోలు దోపిడీ.. దాడులకు అడ్డుకట్ట వేస్తూ సీఎం వైఎస్ జగన్ అత్యంత పారదర్శక ఇసుక విధానాన్ని అమలుచేస్తుండడం రామోజీకి అస్సలు నిద్రపట్టనీయడంలేదు. అందుకే నిత్యం దానిపై చిలువలు పలువలుగా వక్రీకరించి తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఇసుక కొరత రాకూడదనే.. కొత్త ఏజెన్సీలు ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించే వరకు నిర్మాణ రంగానికి ఇసుక కొరత ఉండకూడదనే ఉద్దేశంతోనే గనుల శాఖ పాత ఏజెన్సీతో ఇసుక ఆపరేషన్స్ చేయిస్తోంది. ఏ కాంట్రాక్టులో అయినా ఇలాంటి నిబంధనలు సర్వసాధారణంగా ఉంటాయి. దీనికి సీఎంఓతో సంబంధం ఏమిటి? ఇసుక ఆపరేషన్స్ అనేది గనుల శాఖకు సంబంధించిన వ్యవహారం. రీచ్‌లకు లీజు అనుమతుల మంజూరు గనుల శాఖ ద్వారా జరుగుతుందే తప్ప సీఎంఓ నుంచి కాదు. ఈనాడుకు ఈ విషయం తెలిసినా కనీస అవగాహన లేనట్లు నటిస్తూ అబద్ధాల బురద జల్లుతోంది. మరోవైపు.. ఇసుక అక్రమాలపై నిఘా కోసం ఈ ప్రభుత్వం ఎస్ఈబీని ఏర్పాటుచేసింది. జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనుల శాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. గనుల శాఖలో ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ కూడా పనిచేస్తోంది. అంతేకాక.. రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్‌లతో అక్రమాలు నిరోధిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా దానిని నిజంగా చిత్రీకరించడానికి ఈనాడు తెగ తాపత్రయపడుతోంది. ఈ ప్రభుత్వ చర్యలతో ఎన్జీటీ సంతృప్తి.. కానీ, ఎలాంటి విమర్శలకు అవకాశంలేకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, మినీరత్నగా గుర్తింపు పొందిన ఎంఎస్టీసీ ద్వారా ఈ ప్రభుత్వం ఇసుక టెండర్లు నిర్వహించింది. పారదర్శక విధానం, సులభతరంగా ఇసుక లభ్యత, అందుబాటు ధరల్లో వినియోగదారులకు చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అదే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ జరిగేలా చర్యలు తీసుకుంది. దీంతో.. ఇసుక పాలసీ ద్వారా ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తంచేస్తూ, గత ప్రభుత్వ తప్పిదాలవల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దుచేసింది. ఈ విషయం ’ఈనాడు’కు తెలియనిదేం కాదు. వాస్తవాలిలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని ఈనాడు అబద్ధాలను పోగేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ఇష్టానుసారం రాసిపారేసింది. గతంలోని అక్రమాలు ఈనాడుకు కనిపించలేదా? టీడీపీ హయాంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్దఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకున్న రోజుల్లో ఈనాడుకు ఆ అక్రమాలు కనిపించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చి, ప్రజలకు అందుబాటు ధరలో, కొరతలేకుండా ఇసుకను అందిస్తుంటే ఈనాడు తట్టుకోలేకపోతోంది. నిజానికి.. టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి బరితెగించిన చంద్రబాబు ఉచిత విధానం ముసుగులో నిర్లజ్జగా అన్ని విధి విధానాలను ఉల్లంఘించారు. ♦ కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను తుంగలో తొక్కడంతోపాటు కేబినెట్‌ను చీకట్లో ఉంచి మరీ దోపిడీకి తెగబడ్డారు. ♦ కానీ, ఇప్పుడు పారదర్శకంగా ఇసుక తవ్వ కాలను నిర్వ హిస్తుండటంతో రాష్ట్ర ప్రభు త్వానికి ఏటా రూ.760 కోట్లకు పైగా ఆదాయం సమ కూరుతోంది. ♦ అంటే గత చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాలనలో ఖజానాకు రూ.3,825 కోట్ల మేర చంద్రబాబు గండి కొట్టినట్లు స్పష్టమవుతోంది. ♦ ప్రభుత్వానికి రావాల్సిన ఈ ఆదాయం అంతా చంద్రబాబు బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చేరిపోయింది. ఎంఎస్టీసీ ద్వారా టెండర్ల ప్రక్రియ కనిపించడం లేదా? రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు నిర్వహిస్తున్న విషయం పచ్చవిషం నింపుకున్న రామోజీ కళ్లకు కనిపించడంలేదు. గతంలో నిర్వహించిన టెండర్లలో జయప్రకాష్ వెంచర్స్ ఎంపిక కాగా.. దానికి ఇచ్చిన గడువు పూర్తవ్వడంతో మరోసారి ఎంఎస్టీసీ ద్వారా గనుల శాఖ టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. ఇందులో రెండు ఏజెన్సీలు ఎంపికయ్యాయి. ఇదే విషయాన్ని ఈనాడు కూడా రాసింది. వాటితో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇవి కూడా తుది దశలో ఉన్నాయి. అగ్రిమెంట్లపై సంతకాలు కాగానే ఆ సంస్థలు ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పటివరకు పాత ఏజెన్సీ ద్వారానే అనుమతి ఉన్న అన్ని రీచ్‌ల్లో ఇసుక ఆపరేషన్స్ జరగడం సహజం. ఇదే విషయాన్ని గనుల శాఖ గతంలోనూ స్పష్టంచేసింది. అయినా.. ‘పచ్చ’ కామెర్లు సోకిన ఈనాడుకు అదేమీ అర్థంకావడంలేదు. అప్పట్లో విచ్చలవిడిగా దాడులు.. అంతేకాక.. ఉచితం ముసుగులో టీడీపీ నేతలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతూ దోపిడీ పర్వం సాగించారు. వినియోగదారులు బ్లాక్ మార్కెట్ నుంచి అధిక ధరలకు ఇసుకను కొనుగో లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దఎత్తున ఇసుక లారీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయేవి. వీటిని అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిపై నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విచక్షణారహితంగా దాడులకు బరితెగించారు. అసలు ఉచితంగా ఇసుక ఇస్తే ఈ దాడులకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? అలాగే, స్వయంగా నాటి సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం పక్కనే ఇష్టారాజ్యంగా ఎడాపెడా ఇసుక లూటీ జరుగుతున్నా కళ్లు మూసుకుని కూర్చోవ డాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్రంగా తప్పుబడుతూ రూ.100 కోట్ల జరిమానా సైతం విధించింది. రాష్ట్ర సంపదను దోచేస్తున్నారని ఆక్షేపించినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతోనే.. ఇసుక ఆపరేషన్స్ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. పలు దశల్లో పర్యవేక్షణ జరుగుతున్నా ఈనాడు పత్రిక అదే పనిగా వ్యతిరేక కథనాలు ప్రచురించడం విడ్డూరంగా ఉంది. కళ్ల ముందు కనిపిస్తున్న దానిని చూడకుండా, ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో, నిత్యం ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేయాలనే లక్ష్యంతోనే ఇసుకపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. ఇలా ఇష్ట మొచ్చినట్లు వార్తలు ప్రచురిస్తున్న ఈనాడుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
చంద్రబాబుపై మరో కేసు నమోదు
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఏపీఎమ్డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యాదుతో సీఐడీ అధికారులు.. చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి చంద్రబాబు రూ. 100 కోట్ల జరిమానా విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్,. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెగబడ్డ దాష్టీకానికి అప్పట్లో యావత్తు రాష్ట్రం విస్తుబోయింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లటం ఎవ్వరూ మరిచిపోలేరు. కాకపోతే ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరే అన్నిటికన్నా హైలైట్. ఇదేదో గట్టుకింద తగవు మాదిరి... వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసే సిగ్గుమాలిన ప్రయత్నం చేశారు. అంతేకాని చింతమనేనిపై కేసు పెట్టడానికి మాత్రం చంద్రబాబుకు మనసొప్పలేదు. తవ్వు కోవడం.. దండకోవడం..! చంద్రబాబు హయాంలో ఇసుక దిన్నె(రీచ్)లను గ్రామైక్య సంఘాలకు అప్పగించి, తద్వారా అక్రమ రవాణికు అడ్డుకట్ట వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం బెడిసికొట్టింది. అనంతపురం జిల్లాలో మూడు చోట్ల పెన్నా, చిత్రావతి నదుల్లో ఇసుక తవ్వి అమ్ముకోవడానికి ప్రభుత్వం గ్రామైక్య సంఘాలకు అనుమతి ఇవ్వగా, ఇసుక తవ్వకాల్లో కనీస ప్రమాణాలు పాటించకుండా నదుల్లో ఇష్టానుసారం ఇసుక తవ్వేశారు.. చదవండి: తవ్వుకో.. దండుకో..! చంద్రబాబు సాక్షిగానే రెచ్చిపోయారు.. చంద్రబాబు హయాంలో గుంటూరు జిల్లాలో ప్రకృతి సహజ సంపద అయిన ఇసుకను అక్రమంగా దోచేస్తూ అప్పటి అధికార పార్టీ నేతలు జేబులు నింపుకున్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, ధనార్జనే ధ్యేయంగా వీరు డ్రెడ్జర్లు, పొక్లెయినర్లతో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమ దందాలో జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి, మరో ఐదుగురు సీనియర్ టీడీపీ నేతలు వారి బంధువులు, అనుచరులు ఇసుక మాఫియా నడుపుతుండటంతో అధికారులు సైతం వీరి జోలికి వెళ్లలేదు. కూలీలను తొలగించి ప్రొక్లయినర్ల ద్వారా ట్రాక్టర్లు, లారీల్లో లోడు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు దండుకున్నారు. ఇది చదవండి: పట్టపగలే దోపిడీ చెలరేగిపోయిన ఇసుకమాఫియా చంద్రబాబు హయాంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన 50 మీటర్ల దూరంలోనే అడ్డగోలుగా కృష్ణానదిలో ఇసుకను తవ్వేశారు. ఎన్జీటీ ఉత్తర్వులు బేఖాతరు చేసి మరీ ఇసుకను తవ్వేశారు. దాంతో బ్యారేజీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దల దన్నుతోనే ఇసుక మాఫియా అలా చెలరేగిపోవడం అప్పట్లో విస్మయానికి గురిచేసింది. ఇది చదండి: ప్రకాశం బ్యారేజీకి ముప్పు! చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు -
‘ఎమ్మార్వో వనజాక్షిని కొట్టింది టీడీపీ నాయకులు కాదా?’
సాక్షి, అనకాపల్లి: టీడీపీ నేతలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ హయాంలో ఇసుక ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో చెప్పగలరా? అని ప్రశ్నించారు. అసలు ఇసుకాసురులు టీడీపీ నాయకులే అని విమర్శలు చేశారు. కాగా, మంత్రి అమర్నాథ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వైస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా ఇసుక సరఫరా చేయడంతో రూ.4వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అసలు ఇసుకాసురులు టీడీపీ నాయకులే. టీడీపీ హయాంలో ఇసుక ఎంత దోపిడీకి గురైందో ప్రజలకు తెలుసు. ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకుని కొట్టింది టీడీపీ నాయకులు కాదా?. ఇసుక అక్రమాలకు టీడీపీ పాల్పడింది కాబట్టే 2019లో వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: ఆ మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు చంద్రబాబూ: మంత్రి మేరుగు -
ఇసుకలో బురద తవ్వకాలు!
సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ.. రాష్ట్రంలో ఇసుక దొరకట్లేదు, పనుల్లేక కార్మికులు అల్లాడుతున్నారంటూ కన్నీళ్లు కార్చిన ఆషాఢభూతి లాంటి ఓ పెత్తందారుడు ఇప్పుడిక రీచ్‌ల నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోందంటూ కొత్త రాగం అందుకున్నాడు! వర్షాకాలం బురదతో పోటీపడి మరీ వరుస కథనాలను అచ్చేసి మురిసిపోతున్నాడు!! డిమాండ్‌కు అనుగుణంగానే.. రాష్ట్రంలో ఇసుక కొరత తలెత్తి నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకుపోవాలి! పెద్ద ఎత్తున జరుగుతున్న పేదల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోవాలి. అభివృద్ధి పనులను అడ్డుకుని ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించాలి!! ఇదీ ఈనాడు ప్రణాళిక! అందులో భాగమే ఇసుక రీచ్‌లపై అబద్ధాలను పోగేసి నిత్యం తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. ఏటా రాష్ట్రంలో 2 కోట్ల టన్నుల ఇసుక వినియోగం నమోదవుతోంది. అందుకు అనుగుణంగానే తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడా ఇసుక కొరత లేదు. వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగానే డిపోల్లో నిల్వలను అందుబాటులో ఉంచుతున్నారు. పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం జీవో 71 జారీ చేయడమే కాకుండా పక్కాగా అమలు చేస్తోంది. పక్కా పారదర్శక విధానాలు ఇప్పుడు పారదర్శక ఇసుక విధానంతో ఏటా రూ.760 కోట్ల ఆదాయం లభిస్తోంది. టన్ను ఇసుకను రూ.475కి విక్రయిస్తుండగా రూ.375 ప్రభుత్వానికి రాయల్టీగా వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ రేటుకు అమ్మేందుకు వీలులేదు. ఇసుక రీచ్‌లు, డిపోల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే రవాణా ఖర్చులు వసూలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎంత చెల్లించాలో ప్రభుత్వమే ఈనాడు సహా అన్ని ప్రధాన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తోంది. వినియోగదారుడు సొంతంగా సమకూర్చుకున్న వాహనం ద్వారా కూడా నిర్ణీత రుసుము చెల్లించి ఇసుకను తరలించుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రం మొత్తం జేపీ సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా జేపీ సంస్థ సమర్పించే వివరాలను గనులశాఖ అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విజిలెన్స్ స్వా్కడ్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)తో తనిఖీలు చేస్తున్నారు. అక్రమ ఇసుక మైనింగ్, రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించేలా చట్టం చేశారు. నాడు ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలను ఎన్జీటీ తీవ్రంగా తప్పుబట్టింది. పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. అదే ఎన్జీటీ ఇప్పుడు ఇసుక పాలసీకి సంబంధించి తీసుకున్న చర్యలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ సర్కారు తప్పిదాలకు విధించిన రూ.వంద కోట్ల జరిమానాను కూడా రద్దు చేసింది. ఈ విషయం ’ఈనాడు’ పత్రికకు, రామోజీరావుకు తెలియదా? లేక నటిస్తున్నారా? నాడు చంద్రబాబు సర్కారు సహజ వనరులను దోచేసింది. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అడ్డొచ్చిన అధికారులను జుత్తు పట్టుకుని ఈడ్చుకెళ్లింది. ప్రభుత్వానికి రావాల్సిన రూ.4 వేల కోట్ల ఇసుక ఆదాయాన్ని మింగేసింది. -
ఇసుకపై మసక రాతలు!
సాక్షి, అమరావతి: ఇసుక తవ్వకాలపై యథావిధిగా ‘ఈనాడు’ కట్టుకథలతో స్క్రీన్ ప్లేను రక్తి కట్టించింది. నిబంధనల ప్రకారం స్టాక్ యార్డు నుంచి రవాణా జరుగుతుంటే రీచ్‌ల నుంచి తరలిస్తున్నట్లు అందంగా అబద్ధాలను అల్లేసింది. గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక పేరిట ప్రభుత్వానికి రావాల్సిన రూ.4 వేల కోట్లకు గండికొట్టేసినా చిద్విలాసంగా గడిపేశారు రామోజీరావు. ఈ ప్రభుత్వ హయాంలో అదే ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్ల ఆదాయం వస్తోంది. జనానికి మునుపటికన్నా ఎక్కువ అందుబాటులో ఉండి... అప్పటికన్నా తక్కువ ధరకే దొరుకుతోంది. అయినా సరే... తాము గతంలో ‘డీపీటీ’ పేరిట దోచుకో – పంచుకో– తినుకో అనే తరహాలో లాగించేసిన సొమ్ముకు గండిపడిందనే ఆక్రోశంతో నిత్యం కథనాలు రాస్తూనే ఉన్నారు. అన్నీ సక్రమంగానే సాగుతున్నా... తన రాజకోట నుంచి రోజుకో రాయి విసురుతూనే ఉన్నారు. ‘కోర్టుల్ని ధిక్కరించి మరీ తవ్వకాలు’ అంటూ బుధవారం అచ్చేసిన కథనం కూడా అలాంటిదే. ఖాళీ రీచ్‌లలో తవ్వకాలా? చిత్తూరు జిల్లా అరణియార్, స్వర్ణముఖి, నినా నదుల్లో 18 ఇసుక రీచ్‌లలో తవ్వకాలు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. దీనిపై జేపీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఎన్జీటీ ఆదేశాలనే సమర్ధించింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూ గనుల శాఖ ఆ 18 రీచ్‌లలో ఇసుక తవ్వకాలను నిలిపివేయడంతోపాటు అనుమతులను రద్దు చేసింది. పర్యావరణ శాఖ ద్వారా తాజాగా పూర్తిస్థాయి అనుమతులు పొందాలని, ఆ తరవాతే తవ్వకాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే 15 రీచ్‌లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ ‘ఈనాడు’ ఓ పచ్చి అబద్ధాన్ని అచ్చేసింది. తవ్వకాలే లేని చోట యంత్రాలా? వర్షాకాలంలో భవన నిర్మాణ రంగం అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఓపెన్ రీచ్‌లకు సమీపంలో ప్రభుత్వం స్టాక్ యార్డ్‌లను నిర్వహిస్తోంది. స్టాక్ యార్డులలో ఇసుక నిల్వ చేస్తారు తప్ప... అదేమీ రీచ్ కాదు కనక అక్కడ తవ్వకాలు జరపరు. అలాంటి నిల్వ చేసిన ఇసుక కూడా అక్రమంగా తవ్వేపోసిందేనంటూ ‘ఈనాడు’ నిస్సిగ్గుగా అబద్ధాలాడుతోంది. రీచ్‌లలో తవ్వకాలే జరగని చోట భారీ యంత్రాలు ఎలా వస్తాయి? వాటి ద్వారా టిప్పర్లు, ట్రాక్టర్లలో ఎలా లోడ్ చేస్తారు? అసలు జరగని ఇసుక రవాణాకు స్లిప్‌లు ఎలా ఇస్తారు? ప్రతి రూపాయి ప్రజల కోసమే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీకి ఆలవాలంగా మారిన చంద్రబాబు హయాం నాటి ఇసుక విధానాన్ని రద్దు చేశారు. జాతీయ సంస్థల ద్వారా టెండర్లు పిలిచి ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పారదర్శకంగా విక్రయాలు చేపట్టారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిని తిరిగి ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి ఇసుక విషయంలో చూడాల్సిన ప్రధాన అంశాలు రెండే. ఒకటి ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయా? లేదా? కాంట్రాక్టరు ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తున్నారా? లేదా? అనేది. రెండోది ప్రజలకు అందుబాటులో ఉందా.. లేదా అనేది. అది కూడా నిర్దేశించిన ధరకు విక్రయించాలి. దీనికోసమే ప్రతి ఆదివారం ‘ఈనాడు’తో సహా ప్రధాన పత్రికల జిల్లా ఎడిషన్లలో ప్రభుత్వం ప్రకటనలిస్తోంది. అందులో ధరను నిర్దేశించటంతో పాటు... ఎవరికైనా ఆ ధరకు అందుబాటులోకి రాకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా నెంబరుతో సహా పేర్కొంటున్నారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) నెంబర్లు కూడా అందులో పొందు పరుస్తున్నారు. వాస్తవానికి ఇంతటి పారదర్శకమైన వ్యవస్థ చంద్రబాబు హయాంలో ఎన్నడూ లేదు. కానీ ‘ఈనాడు’ ఒక్క అక్షరం కూడా రాసింది లేదు. తెలుగుదేశం నేతలు బరితెగించి మరీ.. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాకుండా దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) పద్ధతిలో చెలరేగిపోయినా... అడ్డువచ్చిన ఎమ్మార్వో వనజాక్షిని నాటి టీడీపీ ఎమ్మెల్యే అత్యంత పాశవికంగా ఈడ్చుకుంటూ మరీ కొట్టినా... చంద్రబాబు ఇంటి వెనకాల రాత్రీపగలూ తేడాలేకుండా లారీలకు లారీలు తరలించేసినా... రామోజీరావుది చిద్విలాసంతో కూడిన మౌనవ్రతమే తప్ప అక్షర యజ్ఞం ఊసే లేదు అప్పట్లో!!. చట్టపరమైన చర్యలు తప్పవు.. స్టాక్ పాయింట్లలో నిబంధనల ప్రకారం విక్రయాలు చేపడితే అక్రమ ఇసుక రవాణాగా చిత్రీకరించడం దారుణం. తవ్వకాలు రద్దు చేసిన రీచ్‌లలో అక్రమ ఇసుక దందా ఎలా సాధ్యపడుతుంది? గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సహజ వనరుల దోపిడీ జరిగింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇసుక మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఏ పేదవాడికి ఉచితంగా ఇసుక దక్కలేదు. ఇప్పుడు నిబంధనల ప్రకారం ప్రభుత్వమే ఏజెన్సీ ద్వారా విక్రయిస్తోంది. వచ్చిన ఆదాయాన్ని తిరిగి ప్రజల కోసమే ఖర్చు చేస్తోంది. ‘ఈనాడు’ పదేపదే అబద్ధాలను ప్రచురించడం ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. ఇకపై ఇలాంటి అసత్య కథనాలు ప్రచురిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ అదే నిజమైతే ఫిర్యాదు ఏది? ఈనాడు బృందాలు చిత్తూరు జిల్లాలోని ఇసుక రీచ్‌లను పరిశీలించి ఫొటోలు తీసినట్లు కథనంలో రాసుకొచ్చారు. అక్రమాలు జరగడం నిజమే అయితే ప్రత్యక్ష సాక్షిగా ‘ఈనాడు’ బృందం కనీసం టోల్ ఫ్రీ నంబరుకు ఎందుకు కాల్ చెయ్యలేదు. పోనీ స్థానిక పోలీసులు, రెవెన్యూ, గనులశాఖ అధికారుల్లో ఏ ఒక్కరికైనా ఫిర్యాదు ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఆ రీచ్‌లలో ఎక్కడా తవ్వకాలు జరగడం లేదు. అదీ ‘ఈనాడు’ చెప్పని అసలు నిజం!! -
ఇసుక తవ్వకాలపై నిషేధం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఎటువంటి నిషేధం లేదని గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలోని అరణీయార్ నదీ పరీవాహక ప్రాంతాల్లో బి–2 (సెమీ మెకనైజ్డ్) కేటగిరీలో 18 ఓపెన్ ఇసుక రీచ్‌లకు ఇచ్చిన అనుమతులను మాత్రమే కోర్టు ఉత్తర్వుల మేరకు రద్దు చేశామని తెలిపారు. మళ్ళీ అన్ని పర్యావరణ అనుమతులను ఆ సంస్థ తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఆ 18 రీచ్‌ల్లో తవ్వకాలు జరపవచ్చని తెలిపారు. పర్యావరణానికి విఘాతం కలిగించారంటూ ఈ రీచ్‌లపై ఎన్జీటీ విధించిన జరిమానాపైనా సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో బి1, బి2 కేటగిరీల్లో ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులను కూడా పర్యావరణ శాఖ పునఃసమీక్షించాలని కోర్టు సూచించిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఇసుక విధానాన్ని అమలు చేస్తోందని, పర్యావరణానికి విఘాతం కలగకుండా అన్ని అనుమతులు ఉన్న రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో ఇసుక కొరత ఏర్పడకుండా, భవన నిర్మాణ రంగానికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని చోట్లా ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈ వాస్తవాలను విస్మరించి, ప్రభుత్వంపై తప్పుడు వార్తలను ప్రచురించడమే పనిగా పెట్టుకున్న ఈనాడు దినపత్రిక ఇష్టారాజ్యంగా వక్రీకరణలతో అర్థంలేని రాతలు రాయడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే దందా అంటూ ఇసుక ఆపరేషన్స్‌పై మళ్ళీ, మళ్ళీ తప్పుడు ఆరోపణలతో వార్తా కథనాన్ని వండి వార్చారని మండిపడ్డారు. పర్యావరణ శాఖ నుంచి అన్ని అనుమతులు లభించిన రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నామని వెంకటరెడ్డి వివరించారు. -
సిలికా పై సిల్లీ రాతలు పరువు పోగొట్టుకున్న ఈనాడు..!
-
పరవళ్లతో పునరుజ్జీవం
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా ఇసుక మేటలతో ఎడారిని తలపించిన వేదవతి నది ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. గతేడాది ఆగస్టు 3 నుంచి ఈ ఏడాది జనవరి 9 వరకూ అంటే.. 159 రోజులపాటు కర్ణాటకలోని వాణివిలాస రిజర్వాయర్.. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)ల గేట్లను ఎత్తేశారంటే.. వేదవతి ప్రవాహ ఉధృతి ఏ స్థాయిలో సాగిందో అంచనా వేసుకోవచ్చు. వాణివిలాస రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 30.422 టీఎంసీలైతే.. ఆ రిజర్వాయర్‌లోకి 78.32 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఆయకట్టుకు నీళ్లందిస్తూ.. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు 32.179 టీఎంసీలు విడుదల చేశారు. వాణివిలాస రిజర్వాయర్‌కు 109 కి.మీల దిగువన.. కర్ణాటక సరిహద్దుకు 1.5 కి.మీల దూరంలో అనంతపురం జిల్లాలో గుమ్మఘట్ట మండలంలో రెండు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)లోకి 2022 ఆగస్టు 3 నుంచి జనవరి 9 వరకూ 65.63 టీఎంసీల ప్రవాహం వస్తే.. ఆయకట్టుకు నీళ్లందిస్తూ, ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేస్తూ 62 టీఎంసీలను దిగువకు వదిలేశారు. ఆ జలాలు తుంగభద్ర మీదుగా శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరాయి. అంటే.. బీటీపీ సామర్థ్యం కంటే 63 టీఎంసీలు ఎక్కువ వచ్చినట్లు స్పష్టమవుతోంది. 89 ఏళ్ల తర్వాత నిండిన ‘వాణివిలాస’ ► ఇక వేదవతిపై కర్ణాటకలో 1907లో నిర్మించిన వాణివిలాస రిజర్వాయర్ 1933, సెప్టెంబరు 2న నిండింది. ఆ తర్వాత గతేడాది ఆగస్టు 3న అంటే 89 ఏళ్ల తర్వాత నిండింది. దాంతో 50 వేల ఎకరాలకు ఖరీఫ్‌లో నీళ్లందించారు. ► ఇక అనంతపురం జిల్లాలో బీటీపీ ప్రాజెక్టు దశాబ్దం తర్వాత నిండింది. గతేడాది ఆగస్టు 8న 55,574 క్యూసెక్కుల ప్రవాహం డ్యామ్‌లోకి వచ్చింది. డ్యామ్ చరిత్రలో అంటే 1961 నుంచి ఇప్పటివరకూ గరిష్ట వరద ఇదే. ► వర్షాకాలం ముగియడంతో వరద ప్రవాహం నవంబర్లోనే తగ్గింది. ఆ తర్వాత నదిలో సహజసిద్ధ ప్రవాహం ప్రారంభమై.. ఇప్పటికీ కొనసాగుతోంది. దీన్నిబట్టి చూస్తే.. వేదవతి పునరుజ్జీవం పోసుకున్నట్లేనని పర్యావరణవేత్తలు విశ్లేషిస్తున్నారు. సబ్‌సర్ఫేస్ డ్యామ్‌లు, ఇసుక తవ్వకాల నియంత్రణతో.. ► కృష్ణా నదికి కోయినా, మలప్రభ, ఘటప్రభ, బీమా, తుంగభద్ర, మూసీ, పాలేరు, మున్నేరులతోపాటు వేదవతి కూడా ప్రధాన ఉప నది. కర్ణాటకలో చిక్‌మగళూరు జిల్లాలోని పశ్చిమ కనుమల్లో చంద్రవంక పర్వత శ్రేణుల్లో వేద, అవతి నదులు పురుడుపోసుకుని.. పుర వద్ద రెండు నదులు కలిసి వేదవతిగా మారి కర్ణాటకలో తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి.. రాష్ట్రంలో అనంతపురం, కర్నూల్ జిల్లాల మీదుగా 391 కి.మీలు ప్రవహించి.. బళ్లారి జిల్లా సిరిగుప్ప వద్ద తుంగభద్రలో కలుస్తుంది. ► కృష్ణా నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 2,58,948 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించగా.. అందులో వేదవతి బేసిన్ విస్తీర్ణం 23,590 చ.కి.మీలు (9.1 శాతం). ► వేదవతి జన్మించే చంద్రవంక పర్వతాల్లోనూ.. ప్రవహించే హగరి లోయలోనూ వర్షాభావ పరిస్థితులవల్ల ప్రవాహం లేక ఇసుక మేటలతో జీవం కోల్పోయింది. దాంతో ఎగువ నుంచి వేదవతి ద్వారా కృష్ణా నదిలోకి పెద్దగా వరద ప్రవాహం చేరడంలేదు. ► గత నాలుగేళ్లుగా వేదవతి బేసిన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. నదికి జీవం పోయాలనే లక్ష్యంతో వేదవతిపై అటు కర్ణాటక.. ఇటు రాష్ట్రంలో సబ్ సర్ఫేస్ డ్యామ్‌లు నిర్మించారు. ఇసుక తవ్వకాలను నియంత్రించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం నదిలోకి వచ్చే వరదను నదీ గర్భంలోకి ఇంకింపచేయడంలో సబ్ సర్ఫేస్ డ్యామ్‌లు దోహదం చేశాయి. ఇసుక తవ్వకాలను నియంత్రించడంవల్ల నీటి ప్రవాహంతో వేదవతి జీవం పోసుకుంది. -
చేసేదే దొంగ పని.. అందులోనూ వైరం.. కాల్పులు జరపటంతో.. !
పాట్నా: ఇసుక అక్రమ రవాణాలో రెండు ముఠాల మధ్య తలెత్తిన వివాదం కాల్పుల వరకు వెళ్లింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపటంతో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బిహార్‌లోని బిహ్తా నగరంలో గురువారం జరిగింది. సన్ రివర్ నుంచి అక్రమంగా ఇసుక తరలించటంలో రెండు గ్రూపులు నిమగ్నమయ్యాయి. ఈ విషయంపైనే మాటా మాటా పెరిగి దాడులు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తూటాలు తగిలి నలుగురు అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 13న బిహార్‌లోని బెగుసరాయ్‌లో జాతీయ రహదారులు 28, 31పై బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనల్లో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. కొద్ది రోజుల్లోనే ఇలా రెండు ముఠాలు కాల్పులు జరపటం గమనార్హం. ఇదీ చదవండి: డ్రగ్స్ ముఠాలపై సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’.. 175 మంది అరెస్ట్ -
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి/ కాకినాడ: కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్‌లు పొందినట్లు చెప్పుకుంటూ.. జిల్లాల వారీగా అక్రమ విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వివిధ జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ్చరిస్తూ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్) టెండర్ల ద్వారా అనుమతి పొందిందినట్లు చెప్పారు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. ‘జేపీవీఎల్ వారు అనుమతించిన వ్యక్తులకు మాత్రమే రాష్ట్రంలో ఇసుక విక్రయాలను నిర్వహించేందుకు అనుమతి ఉంది. ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా ఇతర పేర్లతో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. అక్రమార్కులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా వివధ పేర్లతో కాకినాడ జిల్లా పరిధిలో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తాం.’ అని గట్టి హెచ్చరికలు జారి చేశారు. అక్రమ రవాణా అడ్డుకట్టకు ఎస్ఈబీ ఏర్పాటు.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను నెలకొల్పడం జరిగిందన్నారు ఎస్పీ. ఎస్.ఇ.బి అధికారులు జిల్లాలో నిత్యం వాహన తనిఖీలు చెక్ పోస్టుల వద్ద నిర్వహిస్తూ ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు, అక్రమ రవాణా నిర్మూలన కొరకు SEB అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ 14500 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా అక్రమ రవాణా సమాచారాన్ని నిర్భయంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియచేయవచ్చునని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఖండించిన జేపీవీఎల్.. కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్‌లు పొందారని, జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలను జేపీవీఎల్ పత్రికా ప్రకటన ద్వారా ఖండించింది. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎంటిసి ద్వారా నిర్వహింపచేసిన టెండర్లలో జయప్రకాశ్ పవర్ వెంచర్స లిమిటెడ్ (జేపీవీఎల్) ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఆపరేషన్స్ నిర్వహణను దక్కించుకుంది. టెండర్లలో మిగిలిన సంస్థలతో పోటీ పడుతూ జేపీవీఎల్ సాంకేతికంగానూ, ఆర్థికంగానూ తన సామర్థ్యంను చాటుకుని ఈ టెండర్లలో కాంట్రాక్ట్ పొందింది. టెండర్ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని నిబంధనలను జేపీవీఎల్ సంస్థ పాటిస్తోంది. జేపీవీఎల్ సంస్థ విద్యుత్, కోల్ మైనింగ్ రంగాల్లో వ్యాపార అనుభవం కలిగిన సంస్థ. జేపీవీఎల్ సంస్థకు ఎటువంటి రాజకీయ పార్టీలతోనూ ఎలాంటి సంబంధాలు లేవు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా జేపీవీఎల్ సంస్థపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలను, తప్పుడు వార్తలను జేపీవీఎల్ సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది.’ అని పత్రిక ప్రకటన విడుదల చేశారు జేపీవీఎల్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ గౌర్. ఇదీ చదవండి: పారదర్శకంగా ఇసుక విధానం -
ఇసుక కాదది.. ఎల్లో బురద
అయ్యా... రామోజీరావూ!! కాస్త సలహా చెప్పకూడదూ.. రాష్ట్రంలో ఇసుక ఎలా విక్రయించాలో? ఎవరిద్వారా విక్రయించాలో? ఎంతకు విక్రయించాలో? ఎందుకంటే మీ సలహా సూచనల ప్రకారం.. మీ అదుపాజ్ఞల్లో నడిచే చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. కాబట్టి మీ వాటాలు మీకు రావు. ఆ కడుపుమంటతో రగిలిపోతూ మీరు రాసే కథనాలకు విశ్వసనీయత కాదు కదా... వాటిలో వీసమెత్తు విజ్ఞత కూడా ఉండటం లేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచి జేపీ సంస్థకు అప్పగిస్తే... ఇక్కడి సంస్థలు లేవా అంటూ వాపోయింది మీరే. ఆ సంస్థ చెన్నైకి చెందిన మరో సంస్థకు సబ్ కాంట్రాక్టుకిస్తే... రీచ్‌లన్నీ తమిళనాడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, లేబర్ కూడా కనీసం తెలుగువారు లేరని ఆక్రందనలు చేసిందీ మీరే. ఇప్పుడేమో ఏమీ లేకున్నా... చెన్నై సంస్థ తప్పుకుంటోందని, అంతా స్థానిక నేతల చేతుల్లోకి వెళ్లిపోతోందని గుండెలు బాదుకుని రోదిస్తున్నదీ మీరే!!. అసలేంటి మీ బాధ? ప్రభుత్వ వ్యతిరేకత అనే ఏకసూత్ర ఎజెండాతో రోజూ కాలాల కొద్దీ వార్తలు వండి వారుస్తున్న మీకు... మనస్సాక్షి ఉండదా? పోనీ మీ పాఠకులకైనా అది ఉంటుందని మీరనుకోరా? బాబుకు అధికారం లేకపోతే.. ఆయన, మీరు ఇలా పోటీపడి మరీ దిగజారిపోవాలా!? అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నివాసం సమీపంలో కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు (ఫైల్) ఈ రాష్ట్రంలో ఏ మంచిపని జరిగినా ‘ఈనాడు’కు నచ్చదు. ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’ పేరిట నిరుపేదల కళ్యాణానికి ప్రభుత్వం బాసటగా నిలవటమనేది రామోజీ ఒంటిపై తేళ్లూజెర్రులూ పాకించినట్లుంది. అందుకే ఆ వార్తకు ప్రాధాన్యమివ్వకుండా పాఠకుల్ని పక్కదోవ పట్టించడానికి ‘ఇక నేతలదే ఇసుక’ అనే బురద కథనాన్ని పతాక శీర్షికల్లో వార్చేశారు. అసలు చంద్రబాబునాయుడి హయాంలో జరిగిన ఇసుక దోపిడీని వర్ణించడం సాధ్యమా? ఉచితమనే పేరుతో టీడీపీ లీడర్లంతా దందా చేస్తూ... జనానికి భారీ రేట్లకు విక్రయిస్తూ సాగించిన అరాచకాలపై ‘ఈనాడు’ ఏనాడైనా ఒక్క అక్షరం ముక్క రాసిందా? అడ్డు వచ్చిన మహిళా అధికారిని టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఈడ్చేసినా... చంద్రబాబు ఇంటి పెరట్లో రాత్రీపగలూ లారీలకొద్దీ ఇసుకను కుమ్మేసినా అదంతా బాబు ఘనతేనని చెబుతూ తరించిపోయారు రామోజీరావు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడంతో పాటు... ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు... అంటే ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్లు ఆదాయం వచ్చేలా చేశారు. ఆ టెండర్లను కూడా జాతీయ స్థాయిలో... కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. నిజంగా ఇసుక విక్రయం తాను రాసినంత లాభసాటిగా ఉంటుందని భావిస్తే ఆనాడే రామోజీరావు నేరుగా రూ.120 కోట్లు డిపాజిట్ కట్టి టెండర్లలో పాల్గొని ఉండొచ్చు. అలా చేయకుండా విమర్శలు చేయటాన్ని ఏమనుకోవాలి? ఫైల్ ఫొటోలు మీకసలు కల్లోనైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? ఇప్పుడు ఇసుకపై ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. పైపెచ్చు ప్రజలకు ఏ ధరకు విక్రయించాలో ప్రభుత్వమే నిర్దేశిస్తోంది. ఇందుకోసం ‘ఈనాడు’తో సహా పత్రికల్లో ప్రతి ఆదివారం ప్రకటనలిస్తోంది. దీన్లోనే ధరను నిర్దేశించటంతో పాటు... ఆ ధరకు విక్రయించకపోతే ఫిర్యాదు చేయాల్సిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) నెంబర్లూ ఇస్తోంది. ఫిర్యాదులొచ్చిన చోట ఎస్ఈబీ దాడులు చేయటమే కాక కేసులూ నమోదు చేస్తోంది. ఇవి చాలవా రామోజీ... ఇసుక విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో చెప్పటానికి? అసలు చంద్రబాబు హయాంలో వీటిలో ఏ ఒక్కటైనా ఉందా? ప్రభుత్వ ఖజానాకు పైసా కూడా రాలేదు. అలాగని ప్రజలకూ ఫ్రీగా అందలేదు. ఇప్పటికన్నా ఎక్కువ ధరలకే విక్రయించారు. ఇక నేతల దందాపై ఫిర్యాదు చేసే అవకాశం లేదు. చేసినా పట్టించుకునే దిక్కూ లేదు. నేతలు చెలరేగిపోయి దౌర్జన్యాలకు పాల్పడినా... వాటన్నిటినీ హీరోగారి చర్యల్లానే చూస్తూ తాదాత్మ్యం చెందారు రామోజీరావు. ఇప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... వాటికి లేని రంధ్రాలు వెదుకుతూ మరీ దిగజారుడు కథనాలు అచ్చేయటమే ఘోరాతిఘోరం. సబ్ కాంట్రాక్టులకివ్వటం తప్పా? ప్రభుత్వమైనా, ప్రయివేటు సంస్థలైనా కాంట్రాక్టు ఇచ్చేటపుడు కొన్ని అర్హతలను నిర్దేశించి, కాంట్రాక్టు సంస్థకు కొన్ని నిబంధనలు విధిస్తారు. ఆ అర్హతలకు లోబడి కాంట్రాక్టును సాధించిన సంస్థ... సదరు నిబంధనలను పాటిస్తోందో లేదో పర్యవేక్షించటమే ప్రభుత్వ విధి. ఆ నిబంధనలకు లోబడి సదరు కాంట్రాక్టు సంస్థ ఎవరికైనా సబ్ కాంట్రాక్టుకి స్తే వద్దనే హక్కు ఎవరికీ ఉండదు. ఇవన్నీ రామోజీకి తెలియనివి కావు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను చంద్రబాబు నాయుడు టీడీపీ నేత శ్రీనివాస్‌కు అప్పగిస్తే... ఆయన సదరు పనులను సీఎం రమేష్ కంపెనీకి సబ్ కాంట్రాక్టుకిచ్చాడు. ఇక పోలవరం పనుల్లో ఏకంగా రూ.3వేల కోట్లకుపైగా పనుల్ని రామోజీ వియ్యంకుల కంపెనీ నవయుగకు కేవలం నామినేషన్‌పై ఇచ్చేశాడు చంద్రబాబు. ఇవన్నీ ‘ఈనాడు’కు సమయోచిత నిర్ణయాలుగా కనిపించటమే దౌర్భాగ్యం. నిరంతర పర్యవేక్షణ... అవసరమైన నిల్వలు జేపీ సంస్థ నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లు, ఇసుక డిపోలను గనుల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు ఇసుక నిల్వలు, ఏ మేరకు అనుమతులకు దరఖాస్తు చేశారనే దానిని గనుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకోవడం సాధారణం. దీనికి విరుద్ధంగా.. ఇప్పటివరకు గనుల శాఖ రీచ్‌లు, ఇసుక డిపోలను పరిశీలించనే లేదంటూ ‘ఈనాడు’ అచ్చేసిన కథనం లక్ష్యం ప్రభుత్వంపై విషం చిమ్మటమేననటానికి నిదర్శనం... ఆ శాఖ వివరణ కూడా తీసుకోకపోవటమే. మరో విశేషమేంటంటే చంద్రబాబు హయాంలో వర్షాకాలం 4 నెలల పాటు ఇసుక లభించక రాష్ట్రంలో భవన నిర్మాణ పనులు నిలిచిపోయేవి. కారి్మకులు ఉపాధి లేక ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనికి ప్రణాళికాబద్ధంగా అడ్డుకట్ట వేసింది. వర్షాకాలంలోనూ ఇసుక లభ్యమయ్యేందుకు దాదాపు 50 లక్షల టన్నులకుపైగా ఇసుకను డిపోల్లో నిల్వ చేయించారు. దీంతో ఎక్కడా నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడలేదు. ఇవన్నీ ‘ఈనాడు’ చెప్పదు. ఇసుక ఆపరేషన్స్‌పై పటిష్టమైన నిఘా రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై పటిష్టమైన నిఘా వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జేపీ వెంచర్స్ ఇసుక విక్రయాలకు క్యూఆర్ కోడ్‌తో ఉన్న రశీదులను జారీ చేస్తోంది. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంది. ఎస్ఇబి, గనుల శాఖ, రెవెన్యూ, స్థానిక పోలీస్ అధికారులకు అక్రమ తవ్వకాలు, రవాణాపై చర్యలు తీసుకునే అధికారమిచ్చింది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా కేసుల్లో రెండు లక్షల జరిమానాతో పాటు రెండేళ్ళ పాటు జైలు శిక్ష కూడా విధించేలా చట్టంలో మార్పులు చేశారు. ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇలాంటి వాస్తవాలతో పనిలేదు కాబట్టి రామోజీ తన మార్కు పాత్రికేయానికి పదునుపెడుతున్నారు. ఆ వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? ఇప్పుడు ఇసుకను కాంట్రాక్టుకు ఇవ్వటం ద్వారా ప్రభుత్వానికి ఐదేళ్లలో వచ్చే రూ.4వేల కోట్లు అప్పుడు ఐదేళ్లలో ఎవరి జేబుల్లోకి పోయాయన్నది జవాబులేని ప్రశ్నేమీ కాదు. చంద్రబాబు, ఆయన మీడియా మిత్రులైన ట్రిపుల్ ఆర్ (రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 రవీంద్రనాథ్ నాయుడు) చేతుల్లోకేనన్నది ఎవరికీ తెలియనిదీ కాదు. ఈ చతుష్టయం బరి తెగించేసి దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అంటూ చెలరేగి పోయిందని, అవన్నీ ఇప్పుడు సాగటం లేదు కనకే ఇసుకపై నిత్యం ఏదో ఒకటి రాస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. అందులో భాగమే... ఆదివారంనాటి కథనం. ఎక్కడో చెన్నైలోని హోటల్లో సమావేశం జరిగిందని, అందులో ఒక నిర్ణయం తీసేసుకున్నారని... అందులో పాల్గొన్నట్టుగా, బల్లకింద ఉండి గమనించినట్లుగా రామోజీ రాసి పారేయడాన్ని ఏమనుకోవాలి? కళ్యాణమస్తు అనే మంచి పథకానికి ప్రచారం కల్పించకుండా ఉండేందుకే ఇలా చేశారనుకోవాలి. అయినా సబ్ కాంట్రాక్టు ఎవరికివ్వాలనే దానిపై జేపీ సంస్థ అత్యంత రహస్యంగా, స్టార్ హోటల్లో చర్చలు జరపాల్సినంత అవసరం వుందా? ‘ఈనాడు’ రాసినట్లు నిజంగా వైసీపీ నాయకులే ఇసుక తవ్వకాలు, తరలింపులు చేస్తుంటే ప్రభుత్వం ఎస్ఈబీని ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అక్రమంగా తరలించిన వారిపై కేసులెందుకు పెడుతుంది? ఇదంతా రామోజీరావు బుర్రకు తట్టదా? తట్టకేం... కావాలని నాలుగు రాళ్లు్ల విసిరితే సరి అనుకునే పాత్రికేయం మరి. ఇవీ... ఇసుక వెనక నిజాలు ► పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించిన టెండర్లలో.. రెండేళ్లపాటు రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ నిర్వహించే కాంట్రాక్టును జేపీ పవర్ వెంచర్స్ సంస్థ దక్కించుకుంది. దీనికోసం ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు చెల్లిస్తోంది. ► సబ్ కాంట్రాక్టుకు ఇవ్వాలా.. వద్దా? ఎవరికివ్వాలి? వంటివన్నీ పూర్తిగా కాంట్రాక్టు సంస్థ ఇష్టం. సబ్ కాంట్రాక్టరు ఎవరైనా బాధ్యత మాత్రం జేపీదే. ► ఇందులో భాగంగానే జేపీ సంస్థ టర్న్ కీని ఎంచుకుంది. దీంతో ప్రభుత్వానికెలాంటి సంబంధం ఉండదు. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం చెప్పినా... రామోజీ బురద రాతలు మానలేదు. ► ఇప్పుడు టర్న్ కీ సంస్థ తప్పుకుందంటూ... అదికూడా ప్రభుత్వ పెద్దలతో పొసగకనే అంటూ అడ్డగోలు రాతలకు దిగజారారు. అసలు సబ్ కాంట్రాక్టరు విషయంలోనే జోక్యం చేసుకోని ప్రభుత్వం, ఆ సబ్ కాంట్రాక్టరు పనుల్లో ఎందుకు జోక్యం చేసుకుంటుంది? -
ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ?
రామోజీరావుకు మండుతోంది. రావాల్సిన వాటాలు రావటం లేదన్న మంట!!. ఐదేళ్ల పాటు రాత్రీపగలూ తేడాలేకుండా యథేచ్ఛగా కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల ఇసుక సొమ్ము.. మూడేళ్లుగా దారి తప్పి నేరుగా ప్రభుత్వ ఖాతాలోకే పోతోందన్న మంట!!. ఇకపై తన ’బాబు’ గెలిచే అవకాశం లేదన్న మంట!!. తమ విషప్రచారాన్ని జనం మునుపట్లా నమ్మటం లేదన్న మంట!!. అందుకే శివాలెత్తిపోతున్నారు. చదవండి: వంశ‘ధార’ ఎత్తిపోతలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ప్రతి రోజూ పతాక శీర్షికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడి... వీలైనంత విషం చిమ్ముతున్నారు. శనివారం వండి వార్చిన ‘చెన్నై సంస్థ గుప్పిట్లోనే ఇసుక’ కథనం కూడా అలాంటిదే!!. ఆరు నెలల కిందట రాసిన ఇదే కథనాన్ని.. మళ్లీ ఓసారి బూజు దులిపి అచ్చు వేసేశారు. నిజాలకు పూర్తిగా పాతర వేసేసి... అడుగడుగునా జనంలో అనుమానాలు రేకెత్తేలా విషం గక్కిన ఈ కథనంలో... నిజానిజాలేంటో చెప్పే ప్రయత్నమే ఇది.. అబద్ధాలను అందంగా పేర్చడంలో ‘ఈనాడు’ది అందెవేసిన చేయి. ఎందుకంటే టెండర్ల ప్రక్రియ గురించి కానీ... సబ్ కాంట్రాక్టర్ల గురించి కానీ... ఆ కాంట్రాక్టర్లు పెట్టుకునే సిబ్బంది గురించి కానీ రామోజీకి తెలియనిదేమీ కాదు. కాకపోతే జనం తను ఏది చెబితే అది నమ్ముతారన్న భ్రమలో ఈ తరహా రాతలు రాస్తుంటారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ ఇసుక ఉచితమే అని రామోజీ పదేపదే రాస్తారు తప్ప... ఆ ఉచితం ప్రజలకు కాదని, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు నేతలకే అని చెప్పరు. దొంగల ముఠాగా ఏర్పడ్డ దుష్ట చతుష్టయం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు ఐదేళ్లు రాత్రీపగలూ యథేచ్ఛగా నదులూ, వాగులూ ఊడ్చేశారని చెప్పనే చెప్పరు. ఈ ఇసుక దోపిడీ ఏ స్థాయిలో సాగిందంటే... ఆఖరికి చినబాబు, పెదబాబు కనుసన్నల్లో కరకట్ట ఇంటివెనక తిరిగిన లారీల దెబ్బకు జాతీయ హరిత ట్రిబ్యునల్ కన్నెర్ర చేసింది. నాటి ప్రభుత్వంపై ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇదీ... రామోజీరావు చెప్పని అసలు కథ. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం సమీపంలో కృష్ణానదిలో ఏకంగా రిగ్ ఏర్పాటు చేసి మరీ నదిగర్భాన్ని తవ్వేశారు.. చంద్రబాబు హయాంలో యథేచ్చగా ఇసుక దోపిడీ జరిగిందనేందుకు ఇవే నిదర్శనాలు.. అడ్డుకున్న ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని... అంతేకాదు!. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెగబడ్డ దాష్టీకానికి అప్పట్లో యావత్తు రాష్ట్రం విస్తుబోయింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లటం ఎవ్వరూ మరిచిపోలేరు. కాకపోతే ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరే అన్నిటికన్నా హైలైట్. ఇదేదో గట్టుకింద తగవు మాదిరి... వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసే సిగ్గుమాలిన ప్రయత్నం చేశారు. చింతమనేనిపై కేసు పెట్టడానికి కూడా మనసొప్పలేదు నారా వారికి. ఒక మహిళా అధికారికి అంతటి అన్యాయం చేసిన చంద్రబాబుకు వ్యతిరేకంగా పెన్నెత్తి ఒక్క అక్షరమైనా రాయలేకపోయింది ‘ఈనాడు’. పైపెచ్చు చంద్రబాబు నాయుడి హయాంలో ఇసుక ఉచితం... అంటూ ఇప్పటికీ వండి వారుస్తుంటుంది. అదీ... రామోజీ మార్కు రాజకీయమంటే!!. టెండర్లలో మీరెందుకు పాల్గొనలేదు రామోజీ? నిజానికి బాబు హయాంలో ఐదేళ్లూ జరిగిన లూటీని చూశాకే ఈ విషయంలో పారదర్శకమైన విధానం తేవాలని భావించారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. ఉచితం అనే పేరుతో జనానికి విక్రయించిన రేటుకన్నా కాస్త తక్కువ ధరకే దొరికేలా... నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) చేతే విక్రయాలు జరిపించారు. దాదాపు ఏడాదిన్నరకు పైగా ఇలానే జరగ్గా... ఆ పద్ధతీ ‘ఈనాడు’కు నచ్చలేదు. కొన్నాళ్లు ఇసుక దొరకటం లేదంటూ... కొన్నాళ్లు లెక్కలు సరిగా లేవంటూ చేతికొచ్చిన రాతలు రాస్తూనే వచ్చింది. వీలైనంత విషం చిమ్ముతూనే వచ్చారు రామోజీ!!. వీటన్నిటికీ ఫుల్స్టాప్ పెట్టడానికి టెండర్లు పిలిచి ప్రైవేటు వారికే అప్పగించాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా రావాలని కేబినెట్ సబ్‌కమిటీ సిఫారసు చేయటంతో ఆ దిశగా కొత్త విధానం తెచ్చింది ప్రభుత్వం. టెండర్లలో ఎలాంటి అవకతవకలూ లేకుండా అత్యంత పారదర్శకంగా ఉండేందుకు ఈ ప్రక్రియ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించింది ప్రభుత్వం. టెండర్లు పిలవటం నుంచి వారి అర్హతలను చూసి... అత్యధికంగా చెల్లిస్తామన్న బిడ్డర్‌ను ఎంపిక చేసే వరకూ అంతా ఎంఎస్‌టీసీయే చూసుకుంది. రాష్ట్రానికి వెలుపలున్న పలు సంస్థలు పాల్గొన్న ఆ టెండర్ల ప్రక్రియలోనే ఉత్తరాదికి చెందిన జేపీ వెంచర్స్ విజేతగా నిలిచింది. నిబంధనలు మీరితే కోల్పోయే షరతుతో రూ. 120 కోట్ల ముందస్తు డిపాజిట్‌ను కూడా చెల్లించింది. ఇవన్నీ వదిలి... ఎక్కడో హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో, మధ్యప్రదేశ్‌లోని నిగ్రీలో రిజిస్టర్డ్ చిరునామాలుండి, ఢిల్లీలో కార్పొరేట్ ఆఫీసున్న జేపీ సంస్థ కాంట్రాక్టును దక్కించుకుందనేది ‘ఈనాడు’ కథనం సారాంశం. ఏం? జాతీయ స్థాయి బిడ్లు పిలిచినప్పుడు జాతీయస్థాయి సంస్థలు రావా? మీరెందుకు టెండర్లు వేయలేదు రామోజీ? మీ అర్హతను బట్టి మీకే వచ్చేదేమో? బాబుతో కలిసి ఫ్రీగా లూటీ చేయటం అలవాటైంది కనక టెండర్లు వేయటానికి మనసొçప్పలేదా? జాతీయ స్థాయిలో టెండర్లు పిలవబట్టే కదా సదరు కాంట్రాక్టు సంస్థ ద్వారా ఇప్పుడు రాష్ట్రానికి పారదర్శకంగా ఏటా రూ.750 కోట్ల రాబడి వస్తోంది. ఐదేళ్లు లెక్కవేస్తే దాదాపు రూ.4 వేల కోట్లు. మరి బాబు హయాంలో ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి పోయింది రామోజీరావు గారూ? మీ ముఠానే లూటీ చేసిందన్న ఆరోపణలకు మీ దగ్గర సమాధానముందా? ఇక చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల ఇసుక దందా గురించి తెలియనిదెవరికి? సబ్ కాంట్రాక్టులు ఇవ్వకూడదా? దాన్ని అడ్డుకోగలరా? ఏ కాంట్రాక్టుకయినా ‘కాంట్రాక్టు ధర్మం’ తప్పనిసరి. అంటే!! అప్పగించిన పనిని పూర్తి చేయటం. ఆర్థికాంశాలకు నిబద్ధతతో కట్టుబడి ఉండటం. ఇసుక విషయంలోనూ ఇంతే. వాళ్లు ఎంత ఇసుకను తవ్వి జనానికి అందుబాటులో ఉంచాలనేది ప్రభుత్వం నిర్దేశిస్తుంది. గరిష్ట విక్రయ ధరను కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. ప్రభుత్వానికి ఎంత రాయల్టీ చెల్లించాలన్నది కూడా కాంట్రాక్టు ధర్మంలోనే ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆ కాంట్రాక్టరు పనిచేస్తే చాలు. కానీ వీటికోసం తను ఎవరైనా సబ్ కాంట్రాక్టరును ఉపయోగించుకున్నారా, లేక కూలీలను పెట్టుకున్నారా... లేక ఎవరికైనా లీజుకిచ్చారా... ఇవన్నీ ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇదే పద్ధతి. చంద్రబాబు కానీ... మరో బాబు కానీ ఎవరు అధికారంలో ఉన్నా ఇదే పద్ధతి. దీన్ని కూడా ‘ఈనాడు’ తప్పు పట్టడమే చిత్రాతిచిత్రం. జేపీ సంస్థ వేరెవరిదో చెన్నై సంస్థకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చేసిందని, అన్నిచోట్లా వారే చక్రం తిప్పుతున్నారని రామోజీరావు శివాలెత్తిపోయారు. పైపెచ్చు సదరు సంస్థ తమిళం మాట్లాడే వాళ్లను, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల యాస మాట్లాడేవాళ్లను విధుల్లో ఉపయోగిస్తోందన్నది మరో ఆరోపణ. ఏం? తెలుగుదేశానికి చెందిన కాంట్రాక్టర్లు దేశంలో వివిధ ప్రాంతాల్లో పనులు దక్కించుకుని చేయలేదా? వేరొకరి దగ్గర సబ్ కాంట్రాక్టులు చేయలేదా? ఆ పనుల్లో తమ వారినే పెట్టుకోలేదా? ఇవన్నీ నియంత్రించగలిగే అంశాలేనా రామోజీ? ఎందుకీ విషపురాతలు? మీ ఫిలిం సిటీలోని అడ్వెంచర్స్, విజువల్ గ్రాఫిక్స్ వంటి రకరకాల విభాగాల్లో ఉన్నదంతా ఉత్తరాది వారే కదా? వారికి అందులో నైపుణ్యం ఉన్నదనే కదా తెచ్చుకున్నారు? చేసేదొకటి... చెప్పేదొకటి అయితే ఎలా? ధరలో పారదర్శకత కనిపించలేదా? చంద్రబాబు హయాంలో ఉచితం అని చెప్పినా... వాస్తవ ధర ఇప్పటికన్నా టన్నుకు రూ.50 నుంచి 100 వరకూ ఎక్కువే. అందుకనే కాంట్రాక్టరైన జేపీ వెంచర్స్‌కు ధరకు సంబంధించి ఖచ్చితమైన నిబంధన విధించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిప్రకారం ప్రతి వారం పత్రికల టాబ్లాయిడ్లలో స్థానికంగా ఇసుక ఎంత ధరకు లభిస్తోందన్నది స్పష్టంగా ప్రకటన ఇవ్వాలి. దాన్లోని ధరకన్నా ఎక్కువకు విక్రయించకూడదు. ఒకవేళ అలా విక్రయిస్తే ప్రజలు ‘‘14500’’ నెంబరుకు ఫోన్ చేయొచ్చు. ఇసుక, మద్యం అక్రమాల్ని ఏరిపారెయ్యడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) టోల్ ఫ్రీ నంబర్. ఇలా అక్రమాలకు పాల్పడ్డవారికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా వంటి చట్టాలనూ తెచ్చింది. మరి అక్రమాలకు తావెక్కడుంది రామోజీ.. మీ రాతల్లో తప్ప!!. ప్రతిరోజూ.. ఓ గోబెల్స్ ఘట్టం ఏమీ జరగకున్నా ఏదో జరిగిపోతోందన్న ప్రచారాన్ని సమర్థంగా అందరిలోకీ పంపి... అదే నిజమని వారంతా నమ్మేలా భ్రమింపజేసేవాడట గోబెల్స్. అలాంటి గోబెల్స్ ప్రచారంలో... దుష్ట చతుష్టయంగా ముద్ర పడ్డ దొంగముఠా దిట్ట. ప్రతిరోజూ ఓ అంశాన్నెత్తుకుని పతాక శీర్షికల్లో వేయటం ద్వారా గోబెల్స్ తొలిఘట్టాన్ని ఆరంభించే బృహత్తర బాధ్యత రామోజీది. దాన్ని మళ్లీ టీడీపీ నాయకులు ప్రస్తావిస్తే.. దాన్ని మిగిలిన దుష్ట చతుష్టయం ఇంకాస్త జనంలోకి తీసుకెళుతుంది. రాష్ట్రంలో ఇసుక లభ్యత లేదని, సబ్ కాంట్రాక్టర్లు ధరలు పెంచేస్తున్నారని వస్తున్న ప్రచారమంతా ఇలాంటిదే. అవసరం ఉండి ఇసుక తీసుకునే వారికి నిజమేంటో తెలుసు. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి మరీ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. శుక్రవారం నాడు మత్స్యకారుల ఖాతాల్లో వేసిన రూ.109 కోట్ల మత్స్యకార భరోసా కూడా ఇలాంటి కార్యక్రమమే. జగన్ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరానికే రూ.109 కోట్లను మత్స్యకారుల ఖాతాల్లో వేయగా... చంద్రబాబు ఐదేళ్లలో వారికి ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు. జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఏకంగా రూ.418 కోట్లు వారి ఖాతాల్లో వేసింది. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో పెరుగుతున్న ముఖ్యమంత్రి గ్రాఫ్‌ను... ఎలాగో ఒకలా తగ్గించాలన్నది ఈ దుష్ట చతుష్టయం పన్నాగం. అందుకే గోబెల్స్ ప్రచారం. అందులో తొలి మెట్టే... ‘ఈనాడు’ కథనాలు. ఆన్లైన్పైనా అబద్ధాలేనా? 950 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే చోట ఆన్లైన్ చెల్లింపులకు ఆస్కారం లేకపోవటం ఏమిటన్నది రామోజీరావు ఆక్రోశం. అందుకే ఆయన ప్రధాని మోదీని కూడా ప్రస్తావనలోకి తెచ్చేశారు. డిజిటల్ చెల్లింపులను మోదీ ప్రోత్సహిస్తుంటే రాష్ట్రం పట్టించుకోవటం లేదని రాసి పారేశారు. కానీ... ఆన్లైన్లో స్లాట్ బుకింగ్‌లు, చెల్లింపులు వంటివి ఉన్నా అందరికీ అవగాహన లేక చేయటం లేదని కూడా రామోజీయే రాశారు. ఎందుకీ రెండు నాల్కల రాతలు? ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు అక్కడే చెల్లించే అవకాశం ఉండటంతో పాటు... ఆన్లైన్ బ్యాంకు ఖాతా నంబర్లను ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్లు, డిపోల వద్ద సైతం జేపీ సంస్థ అందుబాటులో ఉంచింది. నగదు కూడా చెల్లించే అవకాశం ఉంది తప్ప నగదు మాత్రమే చెల్లించాలన్న నిబంధన ‘ఈనాడు’ కల్పితం. అన్నిచోట్లా వే బ్రిడ్జ్ లు ఉండటమే కాక ఓవర్లోడింగ్కూ అవకాశం లేదు. ఇవన్నీ అబద్ధాల వంటకానికి కాస్త మసాలా జోడించే ప్రయత్నాలు. ఇదే రామోజీ మార్కు పాత్రికేయం. ఇసుక తవ్వకాల్లో అవకతవకల్లేవు రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాల్లో ఎక్కడా ఉల్లంఘనలు, అవకతవకలు జరగడంలేదని గనుల శాఖ ఇన్చార్జి డైరెక్టర్ డబ్ల్యూబీ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈనాడు పత్రికలో ఇసుక తవ్వకాలు, విక్రయాలపై అవాస్తవాలు ప్రచురించారని తెలిపారు. విజయవాడలోని ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఉన్న లోపాలను సవరించి ఇసుక విధానం పారదర్శకంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలన్నీ సవ్యంగా జరుగుతున్నాయని, మైనింగ్ శాఖతోపాటు ఎస్ఈబీ, పోలీసు, రెవెన్యూ శాఖలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులున్నట్లు ఫిర్యాదు వస్తే వెంటనే స్పందిస్తున్నామన్నారు. ఇసుకపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతీవారం పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నామని, ఏమైనా ఇబ్బందులుంటే ఎస్ఈబీకి ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఫోన్ నంబర్లు కూడా అందులో ప్రచురిస్తున్నామని ఆయన తెలిపారు. ఇసుక అమ్మకాలకు సంబంధించిన చెల్లింపులను ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లోనూ స్వీకరిస్తున్నట్లు చంద్రశేఖర్ చెప్పారు. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి జేపీ సంస్థ ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చి ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. జేపీ సబ్ కాంట్రాక్టుకు ఇచ్చుకోవచ్చు ఇక ఇసుక కాంట్రాక్టును జేపీ సంస్థ జాతీయ స్థాయి ఓపెన్ బిడ్డింగ్‌లో దక్కించుకుందని, టెండర్ల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ నిర్వహించిందని తెలిపారు. టెండరు దక్కించుకున్న సంస్థ సబ్ కాంట్రాక్టు ఇచ్చుకునే వెసులుబాటు ఉందన్నారు. కానీ, తమకు జేపీ సంస్థ మాత్రమే జవాబుదారీ అని, ఏదైనా తాము ఆ సంస్థనే అడుగుతామని తెలిపారు. టర్న్‌కీ సంస్థను సబ్ కాంట్రాక్టుగా జేపీ సంస్థ పెట్టుకుందని దాంతో తమకు నేరుగా సంబంధంలేదన్నారు. జేపీ సంస్థ నుంచి రూ.120 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా కట్టించుకున్నామని, నిబంధనల ప్రకారం పనిచేయకపోతే ఆ డబ్బును ప్రభుత్వం జమ చేసుకుంటుందన్నారు. అక్రమాల అడ్డుకట్టకు ఎస్ఈబీ ఏర్పాటు ఇక ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నిలువరించేందుకు ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసిందని, టోల్ ఫ్రీ నంబర్ 14500ని కూడా ప్రజలకు అవగాహన అయ్యేలా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా వంటి చట్టాలను తీసుకువచ్చిందన్నారు. ఇసుక ఆపరేషన్స్‌లో ఉల్లంఘనలు జరుగుతున్నాయనడంలో వాస్తవం లేదన్నారు. ఇసుక తవ్వకాలను గనుల శాఖాధికారులు తనిఖీలు చేస్తున్నారని, ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే వెళ్లి పరిష్కరిస్తున్నారని తెలిపారు. అన్ని ఇసుక డిపోల్లో వేబ్రిడ్జిలు ఉన్నాయని, రీచ్‌లు కూడా తమకు దగ్గరగా ఉన్న వేబ్రిడ్జిలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపారు. జేపీ సంస్థ ఇప్పటివరకు 1.70 కోట్ల టన్నుల ఇసుకను తవ్విందని, అందులో కోటి టన్నులను విక్రయించిందని తెలిపారు. మిగిలిన 70 లక్షల టన్నుల ఇసుకను నిల్వచేసి విక్రయిస్తోందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి జేపీ సంస్థ రూ.668 కోట్లు చెల్లించిందని తెలిపారు. -
టీడీపీ హయంలో ఇసుక తవ్వకాల్లో వందల కోట్ల అవినీతి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: ఏపీలో ఇసుక తవ్వకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పెద్దిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇసుక తవ్వకాలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇంటి పక్కనే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. టీడీపీ సర్కార్ హయంలో ఇసుక తవ్వకాల్లో వందల కోట్ల అవినీతి జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయంలో పారదర్శక విధానంలో ఇసుక అమ్మాకాలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు. -
ముంచుకొస్తున్న ఇసుక కొరత
గాలి, నీరు తర్వాత మనిషి అత్యధికంగా ఉపయోగించే, అత్యధికంగా దుర్వినియోగం చేసే ప్రకృతి వనరు ఇసుక! భూమిపై మానవుడు అత్యధికంగా తవ్వితీసుకునేది కూడా ఇసుకే! అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న మనిషి అక్రమ తవ్వకాల ప్రభావంతో ఇసుక కొరత పొంచి ఉందంటోంది ఐరాస నివేదిక. ఎడారుల్లో ఇసుక తుఫానులు ముంచెత్తుకొస్తాయి. అవి వచ్చినప్పుడు ప్రజా జీవనం అతలాకుతలం అవుతుంది. అయితే ప్రపంచమంతటినీ ఇబ్బంది పెట్టే తుఫాను ఇసుక కొరత రూపంలో రాబోతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇసుక కొరత పెరిగిపోతోందని, తక్షణమే దీనిపై స్పందించకుంటే సమస్యలు తప్పవని, అందుకే తస్మాత్ జాగ్రత్త అని ప్రపంచ దేశాలకు సూచించింది. ఇసుక సంక్షోభం తలెత్తకుండా ఉండాలంటే బీచ్‌ల తవ్వకంపై నిషేధం సహా పలు చర్యలు తీసుకోవాలని కోరింది. పలు దేశాల్లో ఇసుక వాడకంపై ప్రభుత్వ ఆజమాయిషీ లేదని, ఈ పద్ధతి సరికాదని తెలిపింది. ప్రపంచంలో అతిగా తవ్వితీసే ఉత్పత్తుల్లో ఇసుక ప్రథమస్థానంలో నిలుస్తోంది. చాలా దేశాల్లో ఇసుక అక్రమ మైనింగ్ సాధారణంగా మారింది. భౌగోళిక ప్రక్రియల కారణంగా ఇçసుక ఏర్పడుతుంది. ఇందుకు వందల సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఇలా ఉత్పత్తయ్యే ఇసుక కన్నా మనిషి తవ్వేస్తున్న ఇసుక పరిమాణం ఎక్కువని ఐరాస అనుబంధ సంస్థ యూఎన్ఈపీ విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఇసుకపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకుంటే భవిష్యత్ తరాల అవసరాలకు తగిన లభ్యత ఉండదని హెచ్చరించింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందిస్తే సంక్షోభం రాకముందే అరికట్టవచ్చని యూఎన్ఈపీ ఎకానమీ డివిజన్ డైరెక్టర్ షెహీలా అగర్వాల్ ఖాన్ చెప్పారు. మనిషికి 17 కిలోలు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గ్లాసు, కాంక్రీట్, నిర్మాణ పదార్ధాల వాడకం మూడురెట్లు పెరిగింది. దీనివల్ల వీటి ముడిపదార్ధమైన ఇసుక వాడకం ఏడాదికి 5వేల కోట్ల టన్లుకు చేరింది. అంటే సరాసరిన ప్రతి మనిషి రోజుకు 17 కిలోల ఇసుక వాడుతున్నట్లవుతోంది. విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో నదులు, సముద్రతీరాలు ధ్వంసమవడమే కాకుండా చిన్నద్వీపాలు కనుమరుగవుతున్నాయని ఐరాస నివేదిక తెలిపింది. పర్యావరణ పరిరక్షణలో ఇసుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. వరదల నుంచి రక్షణగా నిలుస్తుంది. భూముల క్రమక్షయాన్ని తగ్గిస్తుంది. ఇసుక అక్రమ వాడకం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసి జీవవైవిధ్యతను కనుమరుగు చేస్తుంది. ఇప్పటికే భూమిపై కొన్ని చోట్ల ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఉదాహరణకు దక్షిణాసియాలో పొడవైన మీకాంగ్ నదిలో ఇసుక అక్రమమైనింగ్ కారణంగా డెల్టా ప్రాంతమంతా మునిగిపోయింది. పలు సారవంతమైన భూములు ఉప్పునీటి కయ్యలుగా మారాయి. శ్రీలంకలోని నదిలో ఇసుక తవ్వకాలు నీటి ప్రవాహ దిశనే మార్చివేశాయి. దీంతో నదిలోనించి సముద్రంలోకి వెళ్లకుండా సముద్రపు నీరు నదిలోకి రావడం మొదలైంది. ప్రపంచమంతా ఈ పరిస్థితులు రాకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదిక చర్చించింది. బీచ్‌ల్లో ఇసుక తవ్వకాలను నిషేధించాలని సూచించింది. ఇలా ఏర్పడుతుంది.. శిలల క్రమక్షయంతో ఇసుక ఏర్పడుతుంది. ఇందుకు వందల, వేల సంవత్సరాల సమయం పడుతుంది. క్వార్ట్›్జశిలలు శిధిలమయ్యేందుకు మరింత ఎక్కువ సమయం పడుతుంది. నదులు, ప్రవాహాల్లో నీటివేగం రాళ్లను కదిలిస్తుంది. దీనివల్ల అవి ప్రవాహం వెంట దొర్లుకుంటూ రాపిడి, క్రమక్షయం చెందుతూ వస్తాయి. వీటివల్ల ఇసుక మేటలు ఏర్పడతాయి. సముద్ర తీరాల్లో అలల ప్రభావం వల్ల ఇసుక ఉత్పత్తి అవుతుంది. బీచ్‌లో ఇసుక రంగు ఎర్రగా ఉండేందుకు ఐరన్ ఆక్సైడ్ కారణమని నిపుణులు తెలిపారు. సాధారణ ఇసుక రేణువు వ్యాసం 0.3 నుండి 2 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. ఎడారి ఇసుక సమృద్ధిగా ఉన్నప్పటికీ, అది కాంక్రీటు తయారీకి సరిపోదు. అందుకే నదులు, బీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుపుతారు. -
ఇసుక మైనింగ్‌పై టీడీపీ అసత్య ఆరోపణలు: గోపాలకృష్ణ ద్వివేది
సాక్షి, అవరావతి: ఇసుక మైనింగ్‌పై టీడీపీ అసత్య ఆరోపణలను గనులశాఖ ఖండించింది. నిబంధనల ప్రకారమే ఇసుక మైనింగ్‌కు అనుమతులు ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. '' జేపీ పవర్ వెంచర్స్‌కు మాత్రమే ఓపెన్ రీచ్‌ల్లో ఇసుక మైనింగ్‌కు అనుమతి ఇచ్చాం. టీడీపీ నాయకులు ఫోర్జరీ డాక్యుమెంట్లను విడుదల చేశారు. మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇచ్చిందన్నది అవాస్తవం. సుధాకర ఇన్ఫ్రాకు ఇసుక డ్రెడ్జింగ్ అనుమతి ఇవ్వాలంటూ సీఎంవో నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. సుధాకర ఇన్ఫ్రా పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. అని తెలిపారు. చదవండి: విశాఖకు చంద్రబాబు అనుకూలమా?.. కాదా?: మంత్రి అవంతి -
ఇసుక, మైనింగ్‌పై సమీక్ష నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: ఇసుక, మినరల్ కన్సెషన్ అప్లికేషన్లు, మైనింగ్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం రోజున సమీక్ష నిర్వహించారు. ఇకపై జిల్లాల వారీగా ఔట్సోర్సింగ్ ద్వారా సీనరేజీ కలెక్షన్లు ఉంటాయని మంత్రి తెలిపారు. వాల్యూమెట్రిక్ బదులు వెయిట్ బేసిస్‌లో సీనరేజీ వసూళ్లకు ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లను ఇవ్వాలని అధికారులకు సూచించారు. మైనర్ మినరల్స్ లీజులను ఈ-ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో మైనింగ్ లీజుల పెంపుదలకు ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. చదవండి: సర్పంచులు, వార్డు సభ్యులందరికీ తక్షణమే వ్యాక్సిన్ ఇవ్వాలి -
పేట్రేగిన ఇసుక మాఫియా.. అడ్డంగా దోచేస్తున్నారు!
రాష్ట్రవ్యాప్తంగా చిన్న వాగులు, వంకలు మొదలు నదుల్లోని పెద్ద రీచ్‌ల వరకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. చిన్న ఇల్లు కట్టుకునే వారికి ఒక లారీ ఇసుక దొరకడమే కష్టమైతే.. మరోవైపు అక్రమార్కులు రాత్రీపగలూ తేడా లేకుండా వేలకొద్దీ లారీల్లో, ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. పేరుకు ఏదో ప్రభుత్వ పథకానికో, మరేదో స్కీమ్కో అని అనుమతులు తీసుకోవడం..లారీలు, ట్రాక్టర్లలో పరిమితికి మించి ఇసుక నింపి తరలించడం.. తీసుకెళ్లి బహిరంగ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముకోవడం పరిపాటి అయిపోయింది. యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాపై ‘సాక్షి’ ప్రత్యేకంగా పరిశీలన చేపట్టింది. అడ్డగోలుగా ఇసుక ఎలా తరలిపోతోంది, ఎక్కడెక్కడ, ఎలా అక్రమాలు జరుగుతున్నాయి, ఇసుక పాలసీలో లోపాలను ఎలా వాడుకుంటున్నారన్నది నిశితంగా పరిశీలించింది. అందులో గుర్తించిన అంశాలతో పరిశోధనాత్మక కథనం.. కల్వల మల్లికార్జున్ రెడ్డి, సాక్షి నెట్వర్క్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి సమీపంలోని బిక్కేరు వాగు నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్లు ఇవి. బిక్కేరు వాగు కేంద్రంగా నాగారం, అర్వపల్లి, తిరుమలగిరి మండలాల్లో ప్రభుత్వ పథకాల పేరిట అనుమతులు తీసుకుని ఇసుకను ప్రైవేటు మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు ఇసుకను రూ.3500 నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా రాత్రివేళ కూడా ఇష్టమొచ్చినట్టు ఇసుక తవ్వేస్తున్నారు. ఇసుక తరలించే కొన్ని ట్రాక్టర్లు, ట్రాలీలకు నంబర్లు కూడా లేకపోవడం గమనార్హం. ఈయన ఓ రైతు... అక్కడా, ఇక్కడా డబ్బులు కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటున్నాడు. పునాది, పిల్లర్లు వేశాడు. శ్లాబ్ పని మొదలైంది. కానీ సమయానికి ఇసుక దొరక్క నిర్మాణం లేటవుతోంది. ఆన్లైన్లో బుక్ చేసుకుందామనుకుంటే.. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దొరకడం లేదు. తప్పనిసరిగా అడ్డగోలు రేటు పెట్టి బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి. ప్రభుత్వం నిర్ణయించిన రేటు లెక్కన అయితే.. ఒక లారీ ఇసుక (18 టన్నులు) సుమారు రూ. పది వేల వరకు ఉంటుంది. కానీ బ్లాక్‌లో ఏకంగా రూ.40 వేల దాకా చెల్లించి తీసుకోవాల్సి వస్తోంది. అది కూడా సమయానికి దొరకడం లేదు. ఇటు ఖర్చు పెరిగిపోయి, అటు నిర్మాణం ఆలస్యమై.. ఆయన ఉసూరుమంటున్నాడు. జరగాల్సిందేంటి.. ప్రస్తుతం రాష్ట్రంలో 37 రీచ్‌ల నుంచి రోజూ సగటున 50వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను టీఎస్ఎండీసీ విక్రయిస్తోంది. వెలికి తీసిన ఇసుకను సమీపంలోని స్టాక్ పాయింట్లకు తరలించి ఆన్లైన్ బుకింగ్ ద్వారా అమ్ముతోంది. ఈ విధానంలో ట్రాక్టర్‌కు 3.5 టన్నులు, 10 టైర్ల లారీకి (12 క్యూబిక్ మీటర్లు, 18 టన్నులు), 12 టైర్ల లారీకి (16 క్యూ.మీ, 26 టన్నులు), 14 టైర్ల లారీకి (20 క్యూ.మీ, 32 టన్నులు), 16 టైర్ల లారీకి (22 క్యూ.మీ, 35 టన్నులు) ఇసుక పరిమితి ఉంటుంది. ఒక్కో టన్నుకు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. జరుగుతున్నది ఇదీ... స్లాట్ బుకింగ్‌తోనే మొదలు... ఆన్లైన్లో కొద్దిరోజుల పాటుతవ్వే ఇసుకకు సంబంధించిన స్లాట్ బుకింగ్ కేవలం ఐదు, పది నిమిషాల వ్యవధిలోనే ముగుస్తోంది. స్లాట్ బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై సాధారణ వినియోగదారుడికి అవగాహన లేకపోవడం దళారులకు వరంగా మారింది. దళారులు, మరికొందరితో కలిసి వినియోగదారుల మాదిరిగా ఇసుకను బుక్ చేస్తున్నారు. దానిని బహిరంగ మార్కెట్‌కు తరలించి అమ్ముకుం టున్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బందికి వాటాలు ముట్ట జెప్తున్నారు. ఇక మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు కూడా స్లాట్ బుకింగ్ వరంగా మారింది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌తోపాటు డబ్బులను కూడా వారే చెల్లించి.. డిమాండును బట్టి ఒక్కో డీడీకి రూ.3వేల నుంచి రూ.7వేల వరకు అదనంగా వసూలు చేసుకుంటున్నారు. తవ్వేది ఎక్కువ..చూపేది తక్కువ రీచ్‌లలో అనుమతుల మేరకు తవ్వకాలు, ఆన్లైన్లో బుక్ చేసిన పరిమాణాన్ని మాత్రమే లారీలు, ట్రాక్టర్లలో నింపడం, వరుస క్రమాన్ని పాటించడం టీఎస్ఎండీసీ పర్యవేక్షణలో జరగాలి. రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద పర్యవేక్షణ కోసం టీఎస్ఎండీసీ ప్రాజెక్టు అధికారులను (పీఓ) నియమించింది. రీచ్‌లలో ట్రాక్టర్లు, లారీలు తదితర వాహనాలను బట్టి ఇసుక తరలింపు పరిమితి ఉంటుంది. కానీ ఇష్టమొచ్చినట్టుగా టన్నుల కొద్దీ అదనంగా ఇసుక నింపి తరలిస్తున్నారు. ఇలా రోజూ వేలాది లారీల్లో అదనంగా ఇసుక తరలుతుండటంతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇక.. స్టాక్ పాయింట్ల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సినప్పుడు సీరియల్ నంబర్ త్వరగా వచ్చేందుకు ఒక్కో లారీకి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒకే పర్మిషన్తో, ఒకే నంబర్.. పదుల ట్రిప్పుల్లో ఇసుక కేవలం ఒకే పర్మిషన్తో, ఒకే నంబర్ఉన్న వేర్వేరు లారీలతో పదుల సంఖ్యలో ఇసుక తరలించి సొమ్ము చేసుకుం టున్నారు. ఇందుకు కొందరు సిబ్బంది సహకరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఇప్పటికే పలుమార్లు లారీలు పట్టుబడ్డాయి కూడా. ‘వే బ్రిడ్జి’లలో బరువు మారుస్తూ.. అదనంగా నింపుకున్న ఇసుకతో బయలుదేరే లారీలకు దొంగ వేబిల్లులు తీసుకుంటున్నారు. పరిమితి మేరకే లోడ్ ఉన్నట్టుగా చూపుతున్నారు. కొందరు వేబిల్లుల నిర్వాహకులు సహకరిస్తూ తప్పుడు తూకాలు నమోదు చేస్తున్నారు. టీఎస్ఎండీసీ ద్వారా రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద వేబ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి. కానీ 13 చోట్ల మాత్రమే పనిచేస్తున్నాయి. గిరిజన సహకార సొసైటీల ముసుగులో.. 1998 నాటి పంచాయతీరాజ్ చట్టం నిబంధనల ప్రకారం.. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే మైనింగ్ లీజు ఇవ్వాలని నిబంధనలు చెప్తున్నాయి. నదీ సంరక్షణ నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాల్లో యంత్రాలను వినియోగించకూడదు. అయితే కొన్ని ఇన్ఫ్రా కంపెనీలు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టుల రూపంలో గిరిజనులకు కేటాయించిన ఇసుక క్వారీలను చేజిక్కించుకుంటున్నారు. ములుగు జిల్లాలోని పలు గిరిజన సొసైటీల్లో జరుగుతున్న ఈ తరహా అక్రమాలపై గతంలో టీఎస్ఎండీసీకి ఫిర్యాదులు కూడా అందాయి. మణుగూరు ప్రాంతంలోని నాలుగు గిరిజన సొసైటీల లైసెన్సులు కూడా ఇతరుల చేతుల్లోనే ఉన్నాయి. ఇక.. రీచ్‌లలో ఎంత విస్తీర్ణంలో ఎంత పరిమాణంలో ఇసుక వెలికి తీశారనే లెక్కల్లోనూ తేడాలు ఉన్నట్టు తెలిసింది. మారీచులు! ఇసుక విధానంలో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ‘ఇసుక మాఫియా’ చెలరేగుతోంది. ప్రభుత్వ ఖజానాకు కాసులు కురిపించాల్సిన ఇసుక తవ్వకాలు అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. డబ్బుల కక్కుర్తితో ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్టు ఉంటుండటంతో అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. ఓవైపు ప్రభుత్వ పథకాల పేరిట వాగులు, వంకల నుంచి ఇసుక తవ్వేస్తుంటే.. కృష్ణా, గోదావరి, ఇతర నదులు కేంద్రంగా సాగుతున్న ఆన్లైన్ ఇసుక విక్రయాల్లోనూ భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. రీచ్‌లలో తవ్వకాలు మొదలుకుని స్టాక్ పాయింట్లకు తరలింపు, విక్రయాలు, తూకం వంటివాటిలో లొసుగులు ఇసుక వ్యాపారులకు వరంగా మారాయి. ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణ లోపం ఓవైపు, కొందరు అధికారులు, సిబ్బంది అక్రమాల్లో భాగస్వాములు కావడం మరోవైపు అక్రమార్కులకు కలిసి వస్తోంది. అంతేకాదు ఈ ఇసుక దందా అంతా కొందరు రాజకీయ నాయకుల పర్యవేక్షణలోనే కొనసాగుతోందని.. దాంతో చాలాచోట్ల అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉందని అంటున్నారు. ‘రీచ్’లలో అక్రమార్కులతో కలిసి.. ఇసుక విక్రయాల్లో పారదర్శకత పాటించడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘శాండ్ మైనింగ్ పాలసీ–2014’ను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర అవతరణకు ముందు ఇసుక రీచ్‌లను లాటరీ పద్దతిలో కేటాయించగా.. కొత్త పాలసీ కింద టెండర్ విధానంలో అప్పగిస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) జిల్లాస్థాయి కమిటీల ద్వారా రీచ్‌లను గుర్తించి.. కాంట్రాక్టరుకు తవ్వకాల బాధ్యత ఇస్తోంది. కాంట్రాక్టర్లు ఇసుకను తోడి సమీపంలోని స్టాక్ యార్డుకు తరలిస్తారు. ఈ ఇసుకను ఆన్లైన్లో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఎండీసీ ద్వారా ‘శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఎస్ఎస్ఎంఎంఎస్)’ను ప్రవేశ పెట్టింది. ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకున్న వారికి టన్నుకు రూ.600 చొప్పున డీడీల రూపంలో తీసుకుని ఇసుకను విక్రయిస్తుంది. కానీ అక్రమార్కులు, దళారులు ఈ విధానంలోని లోపాలను ఆధారంగా చేసుకుని వినియోగదారుల ముసుగులో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ‘లోకల్’గా అభివృద్ధి పనుల పేరిట.. సాధారణంగా ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు స్థానికంగా ఉన్న వాగులు, వంకల నుంచి ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు ఇస్తారు. కొందరు అక్రమార్కులు, అధికారులు కుమ్మక్కై.. ప్రభుత్వ అభివృద్ధి పథకాల పేరిట ఇసుక తవ్వుతూ అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో నిర్మాణంలోని డబుల్ బెడ్రూం ఇళ్లు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటివాటి ముసుగులో ఇసుక తవ్వుతూ.. బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. స్థానికంగా జరిగే అభివృద్ధి పనులకు అవసరమయ్యే ఇసుక కోసం పంచాయతీరాజ్ లేదా సంబంధిత ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం అధికారులు రిక్విజిషన్ ఇస్తారు. ఆ రిక్విజిషన్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ ఇసుకను కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఇసుకను తవ్వి, తరలించే కాంట్రాక్టర్.. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.330 చొప్పున జిల్లా కలెక్టర్ పేరిట డీడీ, రూ.120 చొప్పున స్థానిక తహసీల్దార్ పేరిట చలానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ట్రాక్టర్లో మూడు నుంచి మూడున్నర టన్నుల మేర ఇసుక రవాణా చేయడానికి వీలుంటుంది. కానీ ఈ తవ్వకాలు, పరిమాణం, రవాణాపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో పర్యవేక్షణ బాధ్యతను వీఆర్ఏలకు అప్పగించినా.. వారిలో చాలా మంది దళారులతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒకేసారి అనుమతి తీసుకున్న ‘వే బిల్లుల’పై రోజుల తరబడి ఇసుక తవ్వుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇలా తరలిస్తున్న ఇసుకను ఒక్కో ట్రాక్టరుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. చాలా చోట్ల ప్రజాప్రతినిధులే ఈ దందాలో భాగస్వాములుగా ఉండటంతో.. రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఇసుక దందా జోరుగా సాగుతున్న ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలదే ప్రధాన పాత్రగా ఉంటోంది. అక్రమాల్లో మచ్చుకు కొన్ని! ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలం టేకుల చెరువు పంచాయతీ పరిధిలోని దోమలవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఈ నెల 27న అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఫారెస్టు అధికారులపై అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారు దాడి చేయడంతో స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ► ములుగు జిల్లా మల్యాల సమీపంలో జంపన్నవాగులో ఇసుక మేటలు వేయడంతో వాటిని తొలగించేందుకు ఇద్దరు వ్యక్తులు రైతుల పేరిట అనుమతులు తెచ్చుకున్నారు. ఆ ఇసుక మేటలను తొలగించడానికి ముందు కొండాయి గ్రామం చుట్టూ కరకట్ట నిర్మించాలని అధికారులు షరతు విధించారు. కానీ కరకట్ట నిర్మించకుండానే ఇసుకను తోడేశారు. దీంతో గతేడాది జంపన్నవాగు వరద కొండాయి, మల్యాల గ్రామాలను చుట్టుముట్టింది. అసలు ఇక్కడ క్వారీ నిర్వాహకులు, టీఎస్ఎండీసీ సిబ్బంది నకిలీ వే బిల్లులు సృష్టించి దందా నడిపించారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు హైదరాబాద్‌లో 12 మందిని అరెస్టు చేశారు. బాధ్యులైన టీఎస్‌ఎండీసి సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ► నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. అన్నారం నుంచి నిర్మల్‌లోని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఇçసుకను తీసుకెళ్లాల్సిన ఆ లారీ భైంసా వైపు వెళ్తూ పట్టుబడింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధుల పాత్ర ఉన్నట్టు ఆరోపణలున్నాయి. అక్రమ రవాణాపై పర్యవేక్షణఏదీ? గోదావరి, ఉప నదుల నుంచి నిత్యం వేలాది లారీల్లో ఇసుక రవాణా జరుగుతున్నా వాటిపై సంబంధిత శాఖల పర్యవేక్షణ సరిగా లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్ఎండీసీ, మైనింగ్, పోలీసు, రెవెన్యూ, ఆర్టీఏ విభాగాల పర్యవేక్షణ లోపంతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా, నకిలీ నంబరు ప్లేట్లు ఉన్న వాహనాలతో ఇసుక రవాణా జరుగుతున్నా.. ఆర్టీఏ అధికారులు పెద్దగా కేసులు నమోదు చేసిన దాఖలా లేదు. అప్పుడప్పుడు పోలీసు యంత్రాంగం మాత్రమే ఓవర్ లోడింగ్, అనుమతులు లేకపోవడం, నకిలీ నంబరు ప్లేట్లు వంటి ఘటనల్లో కేసులు నమోదు చేసింది. భూపాలపల్లి, మహదేవపూర్, కాటారం పోలీసు స్టేషన్లలో గత ఏడాది ఈ తరహా కేసులు నమోదయ్యాయి. నేతల బినామీలే కాంట్రాక్టర్లు ఇసుక రీచ్‌ల కాంట్రాక్టుల్లో చాలా వరకు కొందరు నేతల బినామీల చేతుల్లోనే ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ నేతల కనుసన్నల్లోనే ఇసుక దందా సాగుతోందని అంటున్నారు. టీఎస్ఎండీసీ వ్యవహారాల్లో చక్రం తిప్పే ఓ ముఖ్య నేతతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఇటీవల జంట హత్యల వివాదంలో చిక్కుకున్న ఓ అధికార పార్టీ నేత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తన మిత్రుడిని ముందు పెట్టి కాంట్రాక్టులు చేస్తున్న ఓ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ములుగు జిల్లాలో ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఇలా అన్నిచోట్లా వివిధ పార్టీల నేతలు రీచ్‌ల వద్ద చక్రం తిప్పుతున్నారని చెప్తున్నారు. ఇతరులెవరైనా రీచ్‌లు దక్కించుకున్నా వారిని నయానో భయానో లొంగదీసుకుని తమ చెప్పుచేతుల్లో తవ్వకాలు, రవాణా జరిగేలా చూసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జంపన్నవాగు (దయ్యాలవాగు) నుంచి రోజూ వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలివెళ్తోంది. ప్రభుత్వ పనుల కోసం అని చెప్తూ ప్రైవేటు నిర్మాణాలకు ఇసుకను తరలిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి అనుమతులు పొందే ఇసుక ట్రాక్టర్ల యజమానులు.. బహిరంగ మార్కెట్లో ట్రాక్టర్‌కు రూ.1,800 నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇసుకను ట్రాక్టర్లో లోడ్ చేసే కూలీలకు రూ.250 మాత్రం చెల్లించి, మిగతా సొమ్ము తాము మిగిలించుకుంటున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి వాగుల్లో ఎక్కడా మీటరు లోతు వరకు మాత్రమే ఇసుక తవ్వాలన్న నిబంధన ఉంది. కానీ ఇక్కడ రెండు మీటర్ల లోతు వరకు తవ్వుతుండటంతో జంపన్నవాగు ఎండిపోతోంది. కేటగిరీలుగా ఇసుక రీచ్‌లు రాష్ట్రంలోని వాగులు వంకలు, ఉప నదులు, నదులను ఐదు కేటగిరీలుగా మైనింగ్ విభాగం విభజించింది. ఇందులో ఒకటి, రెండు కేటగిరీలకు చెందిన స్థానిక వాగులు, చిన్న వంకల నుంచి స్థానిక అవసరాల కోసం ఇసుకను కేటాయిస్తారు. తవ్వకాలు, విక్రయం వంటి బాధ్యతలను తహసీల్దార్లు పర్యవేక్షిస్తారు. మూడు, నాలుగు, ఐదో కేటగిరీలో తుంగభద్ర ఎడమ గట్టు, కృష్ణా, గోదావరి నదీ తీరాలు, వాటి ఉపనదులు ఉన్నాయి. వీటి నుంచి ఇసుక వెలికితీసి విక్రయించే బాధ్యతను టీఎస్ఎండీసీ నిర్వహిస్తుంది. వీటితోపాటు ఇసుక మేట వేసిన వ్యవసాయ పట్టా భూముల్లో తవ్వకాలకు అనుమతులు, విక్రయాలను టీఎస్ఎండీసీ పర్యవేక్షిస్తుంది. -
భవిష్యత్‌లో ఇసుక దొరకదా!?
ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణరంగం ప్రస్తుతం తీవ్ర ఇసుక కొరతను ఎదుర్కొంటోంది. భవిష్యత్‌లో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇసుక నిల్వల్లో పనికొచ్చేది మాత్రం కొంతే ఉంటుందని, ఆ ఇసుక నిల్వలు వేగంగా అడుగంటి పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువగా వినియోగించే సహజ వనరుల్లో నీరు తర్వాత స్థానం ఇసుకదే. షాపింగ్ మాల్స్, ఆఫీస్‌లు, అపార్ట్మెంట్లు.. ఇలా ఒకటేమిటి ఏది నిర్మించాలన్నా ఇసుక ప్రధాన ముడిసరుకు. అంతేకాదు స్మార్ట్ ఫోన్ల స్క్రీన్ల నుంచి కిటీకీల గ్లాస్‌ల తయారీ వరకూ.. కంప్యూటర్లలో చిప్స్ నుంచి ఇంట్లో వినియోగించే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులోనూ ఇసుక మరో అవతారం సిలికా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సరాసరి 50 బిలియన్ టన్నుల ఇసుక వినియోగం ఉంటుందని లెక్కతేల్చారు. పట్టణీకరణతోనే ముప్పు.. మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పట్టణీకరణ జరుగుతుండటమే ఇసుక కొరతకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి ఏటా లక్షలాది మంది పట్టణాల బాట పడుతున్నారు. 1950 నుంచి ఇప్పటి వరకూ చూస్తే ప్రపంచ వ్యాప్తంగా పట్టణాల్లో నాలుగురెట్ల జనాభా పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న 4.2 బిలియన్ల జనాభాకు వచ్చే మూడు దశాబ్దాల్లో మరో 2.5 బిలియన్ల జనాభా తోడవుతుందని ఐరాస అంచనా వేసింది. వీళ్లందరికి మౌలిక సదుపాయాలు కల్పించే నిర్మాణాల్లో భారీ ఎత్తున ఇసుక వినియోగించాల్సి ఉంటుంది. భారతదేశంలో అయితే 2000 సంవత్సరం నుంచి ఏటా ఇసుక వినియోగం మూడు రెట్లు పెరుగుతూ వస్తోంది. 20వ శతాబ్దం మొత్తంలో అమెరికా వినియోగించినంత ఇసుక ఈ ఒక్క దశాబ్దంలోనే చైనా వాడేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఆకాశ హార్మ్యాలను నిర్మించే దుబాయ్ ఇప్పటికే ఆస్ట్రేలియా నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటోంది. తీరంలో పర్యావరణానికి ముప్పు.. సముద్రంలో ఇసుక తవ్వకంతో కెన్యా, పర్షియన్ గల్ఫ్, ఫ్లోరిడా తీరంలోని అత్యంత విలువైన కోరల్ రీఫ్స్‌కు ముప్పు ముంచుకొచ్చింది. ఇసుక తవ్వకంతో ఏర్పడ్డ బురద వల్ల సముద్రంలో సహజ వాతావరణంలో బతికే జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. అలాగే నదుల్లో ఇసుక మైనింగ్‌తో నీటి జీవులు ఊపిరాడక చనిపోతున్నాయి. క్వాలిటీ సిలికా మైనింగ్ కోసం ఏటా వేలాది ఎకరాల అడవులను నరికేస్తున్నారు. ఇసుక మైనింగ్ వల్ల వియత్నాంలోని మెకాంగ్ డెల్టా మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. కంబోడియా, లావోస్‌లో ఇసుకను విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల నదుల గట్లు దెబ్బతిని పొలాలు, ఇళ్లు ఆ నదుల్లో కలసిపోతున్నాయి. అయెయార్వాడీ నదిలో ఇసుక తవ్వకం వల్ల తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని మయన్మార్ రైతులు వాపోతున్నారు. శాండ్ మైనింగ్‌తో 2000వ సంవత్సరంలో తైవాన్‌లో ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఆ తర్వాత ఏడాది కూడా ఇలాంటి తవ్వకాలతో పోర్చుగల్‌లో బ్రిడ్జి కూలడం వల్ల బస్సులో వెళ్తున్న 70 మంది మృత్యువాత పడ్డారు. కృత్రిమ ఇసుక దీవులు ఉన్న స్థలం చాలకపోవడంతో సింగపూర్ గడిచిన 40 ఏళ్లలో 130 చదరపు మైళ్ల మేర సముద్రాన్ని ఇసుకతో నింపి ఇళ్లు నిర్మించింది. దీని కోసం ఇతర దేశాల నుంచి భారీగా ఇసుకను దిగుమతి చేసుకుంది. ఇలాగే దుబాయ్‌తో పాటు ఇతర దేశాలు కూడా సముద్రంలో నయా నగరాలను ఇసుకతో నిర్మిస్తున్నాయి. ఓ డచ్ పరిశోధన బృందం లెక్కల ప్రకారం 1985 నుంచి ఇప్పటి వరకూ వివిధ దేశాలు ఇసుక వినియోగించి తీరంలో 13,563 చదరపు కిలోమీటర్ల మేర కృతిమ భూమిని సృష్టించాయి. ప్రత్యామ్నాయమే దారి.. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక వినియోగాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. కాంక్రీట్‌లో ఇతర ముడిసరుకులను వినియోగించడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఫ్లైయాష్, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బూడిద, ఆయిల్ పామ్ పొట్టు, ఊక తదితరాలను ఇసుకకు ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు. రీసైకిల్ కాంక్రీట్‌ను మరింత సమర్థంగా ఉపయోగించడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే నదుల్లో మైనింగ్‌కు స్వస్తిపలికారు. ఇతర దేశాలు దీనిని అనుసరించడం కష్టమైనా.. నదులకు జరిగే నష్టాన్ని నివారించడానికి నిర్మాణ రంగం ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇటీవల తన నివేదికలో పేర్కొంది. – ఏపీ సెంట్రల్ డెస్క్ -
నిబంధనలు పాటిస్తూ ఇసుక డ్రెడ్జింగ్
సాక్షి, అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నదులు, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్ చేసుకోవచ్చని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇసుక డ్రెడ్జింగ్ /తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అనుమతి తప్పనిసరి నిబంధనను మినహాయిస్తూ గత సర్కారు 2016లో జారీ చేసిన మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ సవరణ (ఇసుక పాలసీ) ఉత్తర్వులను కొందరు ఎన్జీటీలో సవాల్ చేయడం తెలిసిందే. దీనివల్ల పర్యావరణం దెబ్బ తింటుందని, ఇష్టారాజ్యంగా నదులు, రిజర్వాయర్లు, కాలువల్లో ఇసుక తోడేయడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోయి కరువు ఏర్పడిందని పేర్కొన్నారు. అడ్డగోలుగా ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటుందన్నారు. ఈ మినహాయింపులు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని, తక్షణమే దీనిపై స్టే విధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తిరుమలశెట్టి శ్రీనివాస్, దేవినేని రాజశేఖర్ ఎన్జీటీలో సవాల్ చేశారు. ప్రకాశం బ్యారేజిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారంటూ అనుమోల్ గాంధీ కూడా ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ పిటిషన్ విషయంలో ఎన్జీటీ 2018లో నాటి ప్రభుత్వానికి కొన్ని అంశాలపై ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని, దీన్ని ఇసుక అక్రమ తవ్వకందారుల నుంచి వసూలు చేయాలని అప్పట్లో ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్ జరుగుతున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన ఉమ్మడి తనిఖీ నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. గణాంకాలతో ఎన్జీటీకి ప్రభుత్వం నివేదిక.. పూడిక వల్ల రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని, కాలువలు, నదుల్లో పూడిక (ఇసుక)ను నిర్దిష్ట పరిమాణంలో తొలగించకుంటే వర్షాల సమయంలో వరదల ముప్పు ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలతో శాస్త్రీయ నివేదిక సమర్పించింది. నిబంధనలకు లోబడి ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం ఉండదని వివరించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఎన్జీటీ కొన్ని నిబంధనలు పాటిస్తూ ఇసుక డ్రెడ్జింగ్ చేసుకునేందుకు అనుమతించింది. అనుమతించిన దానికంటే అధిక పరిమాణంలో ఇసుక తవ్వినా, నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో ఇసుక డ్రెడ్జింగ్‌కు అవరోధం తొలగిందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్జీటీ తీర్పులో కీలక అంశాలివీ.. – ఇసుక డీసిల్టింగ్/ డ్రెడ్జింగ్/ మైనింగ్ నిర్వహించే ప్రాంతాల్లో శాస్త్రీయ పర్యవేక్షణ నిమిత్తం సీసీటీవీలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడి చేయడం సులభమవుతుంది. – శాస్త్రీయ సర్వే నిర్వహించి నిర్ణీత పరిమాణంలో మాత్రమే ఇసుక డ్రెడ్జింగ్ నిర్వహించాలి. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. (ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా నిరోధానికి కఠిన నిబంధనలతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బాగున్నాయి. ఇవి పక్కాగా అమలు చేస్తే చాలు) – డ్రెడ్జింగ్/ డీసిల్టింగ్‌కు అనుమతుల కోసం ప్రతి జిల్లాలో శాశ్వతంగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలి. -
ఇసుక వివాదం: తండ్రీ, కొడుకుల హత్య..
భోపాల్ : ఇసుక గొడవ కారణంగా పక్కింటి వారు దాడి చేయడంతో తండ్రీ, కొడుకులు మృతిచెందిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే.. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న టికంగఢ్ గ్రామంలో దేశ్రాజ్(57) కుటుంబం నివాసముంటోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పొరుగున ఉన్న మోహన్‌లోధి, తన కుమారుడు బృందావన్ లోధితో కలిసి తమ ఇంటి ముందు ఇసుకను కడుగుతుండగా ఇందుకు దేశ్రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇసుక కడిగిన నీళ్లన్నీ తమ ఇంట్లోకి వస్తుందని వాదించాడు. దీంతో కోపానికి గురైన మోహన్‌లోధి దేశ్రాజ్పై గొడవకు దిగారు. ఇద్దరి మధ్య నెలకొన్న వాగ్వాదం పెద్దది కావడంతో మోహన్ లోధి, బృందావన్ లోధి తమ కుటుంబ సభ్యులతో కలిసి దేశ్రాజ్పై కర్రలతో దాడికి తెగబడ్డారు. (పోలీసుల దాష్టీకానికి మరో వ్యక్తి బలి ) ఈ క్రమంలో తండ్రిని కాపాడేందుకు వెళ్లిన దేశ్రాజ్ కుమారులు గులాబ్, జహార్‌తోపాటు ఆయన భార్యపైనా దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘర్షణలో గులాబ్ అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దేశ్రాజ్ కూడా మృతి చెందాడు. కాగా దేశ్రాజ్ భార్య సోనాభాయి, మరో కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తండ్రీ, కొడుకుల హత్య కేసుకు సంబంధించి మొత్తం 17 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బ్రజేష్ కుమార్ తెలిపారు. నిందితులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, ఘటన అనంతరం పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (బెంగళూరు: కూతురిపై తండ్రి అఘాయిత్యం) అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి! -
ఇసుక మాఫియాపై హైకోర్టు జోక్యం
సాక్షి, పెద్దపల్లి: మంథని నియోజకవర్గ పరిధిలోని ఇసుక క్వారీల మాఫియాపై హైకోర్టు జోక్యం చేసుకుంది. మంథని మండలంలోని వెంకటాపూర్ ఇసుక క్వారీ నిర్వహణపై గత నెల 16న పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ జారీ చేసిన ప్రొసీడింగ్‌పై సోమవారం నోటీసులు జారీ చేసింది. కాగా వెంకటాపూర్ గ్రామంలోని మానేరు ఇసుక క్వారీపై న్యాయవాది గట్టు వెంకట నాగమణి కోర్టుకు లేఖ రాశారు. భూగర్భ జలాలు అడుగంటుతుండగా, రైతులతో బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్న వ్యవహారాన్ని, నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక రవాణా జరపడాన్ని లేఖలో ఎండగట్టింది. (ఆ వారసులకు రూ.20 వేల కోట్లు) రూ.50 కోట్ల విలువైన ఇసుకను రూ.5 కోట్లకు అప్పగించడంపై వెంకటాపూర్ గ్రామానికి జరుగుతున్న కోట్లాది రూపాయల నష్టాన్ని ఆమె లేఖలో పేర్కొంది. ఈ లేఖను పిల్‌గా స్వీకరించిన న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకొని జిల్లా వరకు 9 మంది అధికారులను,శాఖలను ప్రతి వాదులుగా చేర్చింది. గత నాలుగు ఏండ్లుగా జరుగుతున్న ఇసుక రవాణాపై పూర్తి వివరాలు తెలపాని నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గంలో కొనసాగుతున్న ఇతర 14 ఇసుక క్వారీల మైనింగ్ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. (ఇసుక ఇబ్బందులకు.. రెండ్రోజుల్లో చెక్) -
ఇసుక, మద్యం అక్రమార్కులపై రౌడీషీట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమాల కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించే దిశగా డీజీపీ సవాంగ్ ఆదేశాల మేరకు ఎస్ఈబీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ► ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు చేపడతాం. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపుదాడులు నిర్వహిస్తాం. ► అక్రమాలకు పాల్పడే పాత నేరస్థులపై పీడీ యాక్టు ప్రయోగిస్తాం. ఎస్ఈబీ హెచ్చరికలను పెడచెవిన పెట్టి నిబంధనలు ఉల్లంఘించే అక్రమార్కులపై రౌడీషీట్స్ తెరిచే యోచనలో ఉన్నాం. ► పట్టుబడిన అక్రమార్కుల ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటాం. వారిని వెంటనే రిమాండ్‌కు పంపించేలా న్యాయ వ్యవస్థనూ సంప్రదిస్తున్నాం. మద్యం, ఇసుక అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం చేస్తాం. ► రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉండే ఇసుక, సిలికాన్, గ్రావెల్ నిల్వలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ► ఇసుక అక్రమంగా తరలింపు, మద్యం అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీపై నిఘా పెంచాం. రాత్రివేళల్లోను గస్తీని ముమ్మరం చేశాం. మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ► ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రత్యేకంగా ఉపయోగించుకుంటున్నాం. ► అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు, మార్గాలను ఇప్పటికే గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను వినియోగిస్తాం. ► ప్రత్యేకంగా ఇన్ఫార్మర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్ఈబీ అధికారులు ఎంత పటిష్టంగా పనిచేస్తున్నప్పటికీ ప్రజల సహకారం కూడా కీలకమే. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరిస్తే ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో ఎస్ఈబీ సాధిస్తుంది. ► గడిచిన 15 రోజుల్లో ఇసుక అక్రమాలకు పాల్పడిన 955 మందిపై 485 కేసులు నమోదు చేసాం. 730 వాహనాలు సీజ్ చేశాం. 29,629.075 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నాం. -
అక్రమార్కుల భరతం పడతోన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో
-
ఇసుక మాఫీయా.. సామాజిక కార్యకర్త దారుణ హత్య
పట్నా : బిహార్‌లో దారుణ హత్య కలకలం రేపింది. రెండు రోజలు క్రితం కనపడకుండా పోయిన ఆర్టీఐ కార్యకర్త శవమై కనిపించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పట్నాకు చెందిన సామాజిక కార్యకర్త పంకజ్ కుమార్ గురువారం నుంచి కనిపించకుండాపోయాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని కోసం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలోనే శనివారం అర్థరాత్రి సోన్ నది తీరాన తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా ఉన్న శవాన్ని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని పంకజ్‌గా నిర్థారించారు. అయితే గత కొంత కాలంగా అతను ఇసుక మాఫియాపై ఉద్యమం చేస్తున్నాడని, దానికి సంబంధించిన వారే పంకజ్‌ను దారుణంగా హత్య చేసి ఉంటారని కుటుంబ సభభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇసుక మాఫీయాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలూ చేపట్టినట్టు తెలిపారు. కాగా అతని శరీరంపై పెద్ద ఎత్తున గాయాలు ఉండటంతో పోస్ట్‌మార్ట్ నిర్వహించి వివరాలను సేకరించారు. అనంతరం కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసు అధికారి అశోక్ మిశ్రా తెలిపారు. -
ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రీచ్‌లు, చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘాతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టపడింది. సీసీ కెమెరాల నిఘాతో పాటు టాస్క్ఫోర్సు దాడులు ముమ్మరం చేయడంతో అక్రమార్కుల వెన్నుల్లో వణుకు పుడుతోంది. మరోవైపు ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకునేలా పారదర్శక విధానంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బుక్ చేసుకున్న వారికి వెంటనే సమీపంలోని స్టాక్ యార్డులు, డిపోల నుంచి ఇసుక వెంటనే సరఫరా చేయడంతో అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు సరసమైన ధరలకు ఇసుక అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబరు 1 వరకూ ఈ విధానంలో రాష్ట్రంలో మొత్తం 23,81,716 టన్నుల ఇసుకను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సరఫరా చేసింది. ఇందులో బల్క్ వినియోగదారులు 3,88,955 టన్నులు, సాధారణ వినియోగదారులు 19,92,761 టన్నుల ఇసుకను కొనుగోలు చేశారు. గత 20 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార తదితర నదులకు వరద రావడంతో నవంబరు రెండో వారం ముగిసే వరకూ రీచ్‌లన్నీ నీటిలోనే మునిగిఉన్నాయి. దీంతో ఇసుక తవ్వకాలు, రవాణాకు అవరోధం ఏర్పడడంతో కొంత మేర ఇసుక కొరత ఏర్పడింది. గత నెల రెండోవారం తర్వాత వరద తగ్గడం, నవంబరు 14 నుంచి ఇసుక వారోత్సవాలను నిర్వహించి చర్యలు తీసుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత నెల 16 నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత మాటే లేదు. అన్ని డిపోలు, స్టాక్ పాయింట్లలో ఇసుక నిండుగా ఉంది. ప.గోదావరి జిల్లాలో అత్యధిక వినియోగం: పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా సాధారణ వినియోగదారులు 4,54,354 టన్నుల ఇసుకను కొనుగోలు చేయగా.. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 14,766 టన్నుల ఇసుక మాత్రమే బుక్ చేసుకున్నారు. ఒకేరోజు 5 జిల్లాల్లో టాస్క్ఫోర్సు దాడులు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపుతూ.. అక్రమార్కులకు రూ. 2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా జీఓ జారీ చేసింది. జీపీఎస్ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక సరఫరాకు అనుమతిస్తున్నారు. విజయవాడలోని కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు టాస్క్ఫోర్సు సిబ్బంది దాడుల్ని ముమ్మరం చేసింది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అనంతపురం, విజయనగరం, గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో విస్తృతంగా దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న వారిపై 9, అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై 2 కేసులు నమోదు చేయడంతోపాటు 9 వాహనాలను సీజ్ చేశారు. -
'అందుకే నా భర్తను హత్య చేశారు'
సాక్షి, కర్నూలు : రాష్ట్రంలో టీడీపీ నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హెచ్చరించారు. మంగళవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. చెరుకులపాడులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్నందుకే వైఎస్సార్సీపీ నాయకుడు, తన భర్త నారాయణరెడ్డిని, ఆయన అనుచరుడు సాంబశివుడిని పట్టపగలు శ్యాంబాబు హత్య చేయించిన విషయం నారాలోకేష్ తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమార్కులను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ నేతలే దాడి చేసిన విషయం లోకేష్ మరవడం సిగ్గుచేటని విమర్శించారు. పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామ మాజీ సర్పంచ్ ట్రాక్టర్ ఇసుక కోసం రూ.1,550 ప్రభుత్వానికి చలానా కట్టి దాంతో డూప్లికేట్ సృష్టించి రోజుకు 70 ట్రాక్టర్ల ఇసుకను తరలించి నెలకు రూ.21 లక్షలు చొప్పున దండుకున్న విషయం లోకేష్ తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల నదులు నిండి ఇసుక సమస్య తలెత్తిందన్నారు. వర్షాలు తగ్గగానే ఇసుక కొరత ఉండదన్నారు. సమావేశంలో కేడీసీసీ బ్యాంకు జిల్లా మాజీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, మండల కన్వీనర్లు బజారప్ప, జిట్టా నాగేశ్, వైఎస్ఆర్సీపీ నేతలు రామచంద్ర, రహిమాన్, పల్లె ప్రతాప్‌రెడ్డి, సింగిల్ విండో ప్రసిడెంట్ అట్లా గోపాల్ రెడ్డి, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు బద్రయ్య, నేత్రజిల్లా కోఆర్డినేటర్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇసుక సమస్యకు కాల్ సెంటర్ : కలెక్టర్
సాక్షి, విజయవాడ : ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే విధానం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆదివారం వ్యాఖ్యానించారు. దీనికి పరిష్కారంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని 0866 2474801, 803, 804 నంర్లకు ఫోన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఏపీఎండీసీ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక విక్రయిస్తుండగా ప్రస్తుతం 18200 టన్నుల ఇసుక నిల్వ ఉందని కలెక్టర్ వెల్లడించారు. మొత్తంగా ఐదు రీచ్‌లు ఇప్పుడు నిర్వహణలో ఉన్నాయని, 38 మంది పట్టా ల్యాండ్ ఓనర్లు తవ్వకాలకు తమ సుముఖత వ్యక్తం చేశారని తెలపారు. మరోవైపు శనివారం జిల్లాలోని అన్ని రెవెన్యూ కేంద్రాలలో రైతు భరోసా కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఇదిలా ఉండగా, సోమవారం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదినం సందర్భంగా ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో మైనార్టీల సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఉర్దూలో పాండిత్యం ఉన్న నలుగురికి జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తామని తెలిపారు. అబుల్ కలాం ఆజాద్ పేరున జాతీయ పురస్కారం, అబ్దుల్ కలాం పేరుతో విద్యా పురస్కారం అందజేస్తామని వివరించారు. మంత్రులు, ఉన్నతాధాకారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో 300 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం ప్రకటించారు. -
పచ్చ గద్దలు: కృత్రిమ కొరతంటూ వికృత ఆరోపణలు!
-
టిడిపి పాలనలో ఇసుకతో రాజకీయం చేశారు
-
దసరా హు‘సార్’
సాక్షి, కరీంనగర్ : ‘రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఒకరు ఇటీవల అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్టుకున్నాడు. స్టేషన్‌కు తరలించి ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అయితే ఆ ఇసుక రవాణా చేస్తున్న ఓ అధికార పార్టీ నాయకుడు, ట్రాక్టర్ల సంఘం నాయకుడొకరు ‘పై స్థాయి’ నుంచి ఒత్తిడి తెచ్చారు. వెంటనే సదరు సీఐకి ఫోన్ వచ్చింది. ట్రాక్టర్లను వదిలేయమని. ‘ కేసు నమోదయింది. ఫైన్ కట్టాలి సార్’ అని చెప్పినా అవతలి ‘సార్’ వినకపోవడంతో... సదరు సీఐ జేబు నుంచి ‘ఫైన్ ’ కట్టి ట్రాక్టర్లను పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పోలీసుల అండతో యథేచ్ఛగా సాగుతోందనడానికి పై ఉదాహరణ ఒక్కటి చాలు. సిరిసిల్లలో మానేరు నది జలాలు పారే మండలాల్లో ఇసుక దందా మూడు ట్రాక్టర్లు, ఆరు ట్రిప్పుల చందాన నడుస్తోంది. ఈ నేపథ్యంలో సిరిసిల్లకు సమీపంలో మానేరు వాగు ప్రవహించే మండలంలోని ఓ ఎస్సై ఇసుక రవాణా సాగించే ట్రాక్టర్లు, టిప్పర్ల యజమానుల నుంచి దసరా మామూళ్లు వసూలు చేసే కార్యక్రమానికి తెరలేపారు. ఇసుక అక్రమ రవాణా చేసే ప్రతి ట్రాక్టర్, టిప్పర్ యజమాని డబ్బులు చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేశారు. ‘ ఇదేంటంటే ‘మీరు అక్రమ దందా చేసుకోవాలంటే ‘సార్’కు గిఫ్ట్ ఇవ్వాల్సిందే’ అని ఆర్డర్ ఇచ్చేశాడు. మరో మూడు రోజుల్లో దసరా పండుగ ఉన్న క్రమంలో ఇప్పటికే అనుకున్న లక్ష్యం మేరకు వసూళ్లు పూర్తయినట్లు సమాచారం. ట్రాక్టర్ రూ.8 వేలు.. టిప్పర్‌కు రూ.40 వేలు మానేరు వాగులో ఇసుక నాణ్యత బాగుంటుందని సిరిసిల్ల నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి అం దరూ ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల మానేరు వాగులోని ఇసుకను తీయడానికి వీలులేకుండా మిడ్‌మానేరు నీరు చేరడంతో ఇసుక దొరకడమే కష్టంగా మారింది. దీనిని ఆసరగా చేసుకుని అక్రమ ఇసుక రవాణాదారులను అడ్డుకోవలసిన అధికారులు ఆమ్యామ్యాలకు తెరతీశారు. దీనిలో భాగంగా దసరా బొనాంజ ఆఫర్‌గా ట్రాక్టర్‌కు రూ.8వేలు, టిప్పర్లకు వాటి టైర్ల సంఖ్యను బట్టి కనిష్టంగా రూ.20 వేల నుంచి గరిష్టంగా రూ. 40 వేల వరకు వసూళ్లకు తెరలేపారు. మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాలో 125 ట్రాక్టర్లు, 10 టిప్పర్లు భాగం పంచుకుంటాయి. ఎస్సై ఇచ్చిన టార్గెట్లను దాదాపు 100 ట్రాక్టర్ల యజమానులు ఆమోదించి, ఇప్పటికే రూ. 8వేల చొప్పున చెల్లింపులు జరిపినట్లు సమాచారం. టిప్పర్ల యజమానుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం సాగుతోందని తెలిసింది. మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు. మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో ట్రాక్టర్లను, టిప్పర్లను పట్టుకుంటే రాజకీయ ఒత్తిళ్లతో దొంగలు దొరల్లా బయటపడుతున్నారని పలువురు పోలీస్ అధికారులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు అధికమైనట్లు పోలీసుల్లోనే చర్చ జరుగుతోంది. దీనితో ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చేది మైనింగ్, రెవెన్యూ అధికారులు. నిబంధనల ప్రకారం ఎన్ని టన్నుల ఇసుక తరలిపోతుందనే పర్యవేక్షణ చేయాల్సింది ఆర్టీఏ అధికారులు. కేసులు నమోదు చేయడం వరకే తమ విధి కాగా... కొందరి వల్ల తాము బద్నాం అవుతున్నట్లు పలువురు పోలీసు అధికారులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. పట్టుకున్న వాళ్లే పైకం చెల్లించారటా..? ఇసుక అక్రమంగా తరలించే వాహనాలను పట్టుకున్న అధికారులే పెనాల్టీలు చెల్లించే దుస్థితి జిల్లాలో కొనసాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.క్షేత్రస్థాయిలో వాహనాలు పట్టుబడగానే రాజకీయ నాయకులు పోలీస్‌ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి కేసులు చేయకుండా ఒత్తిడి తీసుకువస్తున్నారని వాపోతున్నారు. ఇలా జిల్లాలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ జేబు నుంచి జరిమానాలు చెల్లించి ‘సార్’ చెప్పారనే కారణంతో వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు సీఐ స్థాయి అధికారులు జిల్లాలో పనిచేయలేమని బదిలీపై వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
ఇక స్టాక్‌యార్డుల్లో నిండుగా ఇసుక
సాక్షి, అమరావతి: వర్షాలు తగ్గడంతో రీచ్‌లలో నీరు ఇంకిపోగానే స్టాక్ యార్డుల నిండుగా ఇసుక నింపి, కోరిన వారికి కోరినంత సరఫరా చేసేందుకు ఏపీఎండీసీ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇసుక పాలసీ అమల్లోకి తెచ్చిన సమయంలోనే ఎగువ ప్రాంతాల్లో, వర్షాలు కురవడం, నదుల్లో వరదనీరు పోటెత్తడం వల్ల ఇసుక సరఫరాలో సమస్య ఏర్పడింది. కొత్త రీచ్‌లకు పర్యావరణ అనుమతులు తీసుకోవడం, స్థలాలు సమకూర్చి స్టాక్ యార్డులను సిద్ధం చేయడం లాంటి పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం–ఏపీఎండీసీ పూర్తి చేశాయి. కొత్త విధానం అమల్లోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తికాక ముందే స్వల్ప కాలంలోనే 1.25 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు సరఫరా చేయడం గమనార్హం. కొత్త ఇసుక విధానం సెప్టెంబరు 5న అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి గత నెలాఖరు వరకూ ఇసుక కావాలంటూ 10,358 మంది ఏపీఎండీసీకి ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న రోజు లేదా మరుసటి రోజు ఉదయమే ఇసుక సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో ఓపెన్ రీచ్‌లు ►మొత్తం గుర్తించినవి: 138 ►పర్యావరణ అనుమతులు ఉన్నవి: 115 ►పర్యావరణ అనుమతులు ►పెండింగ్‌లో ఉన్నవి: 23 ►నీట మునిగి ఉన్నవి: 80 ►ఇసుక తవ్వకాలు సాగుతున్నవి: 25 ►డిసిల్టేషన్ కేంద్రాలుమొత్తం: 32 ►ప్రస్తుతం పనిచేస్తున్నవి: 9 రైతుల పట్టా భూములు ►గుర్తించిన రీచ్‌లు: 82 ►తవ్వకాలు జరుగుతున్నవి: 5 -
అక్కడంతా అడ్డగోలే..!
సాక్షి, శ్రీకాకుళం: ఇచ్ఛాపురం మండలం బిర్లంగి... ఇదొక చిన్న పంచాయతీ... ఇక్కడ భూముల ఆక్రమణలే కా దు పంచాయతీ నిధుల దుర్వినియోగం కూడా వెలుగు చూ సింది. 2,425 జనాభా గల పంచాయతీలో రూ. 14,62,840 అవినీతి చోటు చేసుకుంది. గత ఐదేళ్ల కాలంలో అధికారం వెలగబెట్టిన టీడీపీ నేత ఘనకార్యమిది. అధికారంలో ఉన్నంతవరకు అధికారులు పట్టించుకోలేదు. అధికారం నుంచి దిగిపోయాక షోకాజ్ నోటీసులతో హడావుడి చేస్తున్నారు. చేతు లు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు రెవెన్యూ రికవరీ యాక్ట్ అని సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. తానేమీ తక్కువ కాదని అక్రమాలకు పాల్పడిన వ్యక్తి తనకు సంబంధం లేదం టూ కోర్టును ఆశ్రయించారు. దానిపై ఇప్పుడు కౌంటర్ వేసే పనిలో పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మధ్య ఇచ్ఛాపురం నియోజకవర్గం జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. ఆ నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి అండదండలో, ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందనే ధీమాయో తెలీదు గానీ అక్రమాలకు కేరాఫ్‌గా మారిపోయింది. పది రోజుల క్రితం కవిటి మండలంలో మత్స్యకార గ్రామమైన ఇద్దివానిపాలెంలో 75 రేషన్ కార్డులకు కొన్నేళ్లుగా సరుకులు పంపిణీ కాలేదనే వ్యవహారం వెలుగు చూసింది. రేషన్ డిపో డీలర్ ఆ కార్డులను తమ వద్ద ఉంచుకుని రేషన్ సరుకులను పక్కదారి పట్టించి పెద్ద ఎత్తున లబ్ధి పొందారని గ్రామస్తులంతా నిలదీశారు. ఇక ఒంటరి మహిళల ముసుగులో పెద్ద ఎత్తున పింఛన్ల అక్రమాలకు పాల్పడిన వ్యవహారం బట్టబయలైంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అనర్హులగా తేలిన పింఛన్లను అధికారులు తాజాగా రద్దు చేశారు. భర్తలున్నప్పటికీ ఒంటరి మహిళ పేరుతో పింఛన్లు తీసుకుంటున్నట్టుగా తేలింది. ఇక ఇసుక అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉక్కుపాదం మోపుతున్నా ఇక్కడ మాత్రం ఇసుక దందా ఆగడం లేదు. నిత్యం ఇసుక అక్రమంగా తరలిస్తూ లారీలు, ట్రాక్టర్లు పట్టుబడుతున్నాయి. దీనికంతటికీ గత ఐదేళ్లు చక్రం తిప్పిన కీలక నేత అండదండలే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఇచ్ఛాపురం మండలం బిర్లంగిలో సుమారు 4.80 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆ గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు ఆక్రమించినట్టుగా వెలుగు చూసింది. ఇప్పటికే దానిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి. అధికారులు సైతం సూచన ప్రాయం గా అది పోరంబోకు భూమేనని, ఆక్రమణకు పాల్పడ్డారని నిర్ధారించారు. ఈ ఆక్రమణ భూమికి ఆనుకుని ఉన్న బాహుదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేపటి దొడ్డిదారిన పెద్ద ఎత్తున ఆర్జిస్తున్న వ్యవహారం బయటపడింది. పంచాయతీ నిధుల దుర్వినియోగం టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం బిర్లంగి గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలపై ఎవరూ దృష్టి సారించలేదు. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును సైతం సీరియస్‌గా తీసుకోలేదు. చివరికి ఆ ఫిర్యాది కోర్టుకెళ్లడంతో విచారణ చేపట్టారు. దీంట్లో కూడా చాలా వరకు జాప్యం జరిగింది. చివరికి తప్పని పరిస్థితుల్లో విచారణ జరిపి వాస్తవాల నిగ్గు తేల్చారు. గ్రామంలో ప్ర భుత్వ భూముల ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న దుపాన సూర్యనారాయణ తండ్రి నీలాద్రి గ్రామ సర్పంచ్‌గా ఉన్న కాలంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగినట్టు అధికారుల విచారణలో తేలింది. సాధారణ నిధుల నుంచి రూ. లక్షా 56వేలు, ఎస్ఎఫ్సీ నిధుల నుంచి రూ. 42వేలు, 13వ ఆర్థిక సం ఘం నిధుల నుంచి రూ. 8,34,021, 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ. 4,30,819 అక్రమంగా ఖర్చు పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 14,62,840 నిధుల దుర్వినియోగానికి సంబంధించి అప్పటి సర్పంచ్‌గా ఉన్న నీలాద్రికి షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. దానిపై సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో రెవెన్యూ రికవరీ యాక్ట్( ఆర్ఆర్ యాక్ట్) కింద రికవరీ చేయాల్సిందిగా జూలై 7వ తేదీన పంచాయతీ అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రికవరీ అధికారిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారిని నియమించారు. అయితే, దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సర్పంచ్ నీలాద్రి కోర్టును ఆశ్రయించారు. దానిపై కౌంటర్ వేసే పనిలో అధికారులు ఉన్నారు. ఆర్ఆర్యాక్ట కింద చర్యలకు ఆదేశం బిర్లంగి పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. కానీ రికార్డులు మాత్రం ఇంకా నాకు ఇవ్వలేదు. ఏ రికార్డులూ లేకుండా రికవరీ చేయడం కుదరదు. ఆర్ఆర్ యాక్ట్ కింద వసూలు చేయాలంటే టీమ్‌ను ఏర్పాటు చేయాలి. ఒక్కడినే వెళ్లి వసూలు చేయడం సాధ్యం కాదు. అయినా అభియోగాలు ఉన్న వ్యక్తికి సంబంధించిన ఆస్తులు తెలపాలని సబ్ రిజిస్టార్, తహసీల్దార్‌కు లేఖలు రాశాను. తహసీల్దార్ నుంచి వివరాలు రావాల్సి ఉంది. నిందితుడు కోర్టుకు వెళ్లినందున వ్యవహారం ముందుకు వెళ్లలేదు. – బి.వెంకటరమణ, ఎంపీడీఓ, ఇచ్ఛాపురం -
ఇసుక విధానంపై సీఎం జగన్ సమీక్ష
-
టీడీపీ నేతల ఇసుక రగడ
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. తాము అధికారంలో ఉండగా గోదావరితోపాటు వాగులు, వంకలు కూడా వదిలిపెట్టకుండా ఇసుకను దోచేసిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు ఇసుక రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇసుక అందరికీ తక్కువ ధరకు అందాలన్న ఉద్దేశంతో కొత్త ఇసుక పాలసీని రూపొందించి వచ్చే నెల ఐదు నుంచి అమలు చేయడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో తెలుగుదేశం నాయకులు ఇసుక కొరత ఉందంటూ ధర్నాలకు దిగారు. గత ఐదేళ్లలో ఎవరైతే దోచుకున్నారో వారే ఇప్పుడు ఇసుక ధర్నాలకు దిగడం విమర్శలకు దారితీస్తోంది. ఐదు నుంచి వచ్చే పాలసీ తమ వల్లే వచ్చిందని చెప్పుకుంనేందుకు ఈ ఇసుక రాజకీయానికి తెరలేపారు. ఇసుక కొల్లగొట్టిన తెలుగుతమ్ముళ్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగుతమ్ముళ్లు మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ సంపదను కొల్లగొట్టారు. అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోయారు. అధికారులను, ఉద్యోగులను ఏమాత్రం లెక్కచేయలేదు. ఇసుక అక్రమాలను అడ్డుకున్న ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. తమ్మిలేరును పూర్తిగా చింతమనేని కొల్లగొట్టారు. మరోవైపు గోదావరి తీరంలో ఇసుక మాఫియా పేట్రేగిపోయింది. ప్రకృతి వనరులైన ఇసుక, మట్టిని అక్రమంగా తవ్వుతూ కోట్లాది రూపాయలను లూటీ చేసింది. గోదావరి తీరంలో ఉన్న పోలవరం, కొవ్వూరు, నిడదవోలు, ఆచంట ప్రజాప్రతినిధులు రూ.కోట్లకు పడగలెత్తారు. ఆది నుంచీ అంతం వరకూ దోపిడీనే గత ప్రభుత్వం ఆది నుంచి అంతం వరకూ ఇసుక దోపిడీ సాగిస్తూనే వచ్చింది. ర్యాంపుల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించినప్పుడు మాఫియాకు చెందిన వ్యక్తులు పెద్దఎత్తున అక్రమంగా ఇసుక తరలించి జేబులు నింపుకున్నారు. అధికారిక ర్యాంపులకు కూతవేటు దూరంలోనే అనధికార ర్యాంపు ఏర్పాటు చేసి యథేచ్ఛగా తవ్వకాలు సాగించారు. పగలూరాత్రి తేడా లేకుండా పెద్దఎత్తున ఇసుక అక్రమంగా తరలించారు. తర్వాత ఉచిత ఇసుక పాలసీని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులే ర్యాంపులను నడిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను ఉచితంగా ఇవ్వాలి. ఇసుకను యంత్రాల ద్వారా తవ్వి వాహనంలో లోడింగ్ చేసినందుకు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా వేలాది రూపాయలు వసూలు చేశారు. అధిక వసూళ్లు, అడ్డగోలు తవ్వకాలు సాగుతున్నా అధికార పార్టీ నాయకుల బెదిరింపుల వల్ల అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. పర్యావరణ అనుమతులు లేకుండానే చాలా ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు ప్రాంతం వద్ద గోదావరి నదిలో ఇసుక తవ్వకూడదని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) హెచ్చరికలు జారీ చేసినా అక్కడే తవ్వేశారు. ఉచిత ఇసుక విధానంలో స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుకను వాడుకోవాల్సి ఉండగా, ఇతర రాష్ట్రాలకు కూడా తరలించేశారు. ఇసుక మాఫియాకు కొత్త ప్రభుత్వం అడ్డుకట్ట ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు పారదర్శక విధానాలతో ముందుకు వచ్చింది. ప్రతి రీచ్‌లోనూ యూనిట్ ధరను నిర్ణయించి అమ్మకాలు చేస్తోంది. వచ్చేనెల ఐదు నుంచి పూర్తిస్థాయి ఇసుక పాలసీని అమలులోకి తీసుకురానుంది. ఈనెలలో గోదావరి వరదల వల్ల ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. దీన్ని సాకుగా చూపించి తెలుగుదేశం నాయకులు ఇసుక కొరత ఉందంటూ ఆందోళనకు దిగారు. గతంలో ఎవరైతే ఇసుక మాఫియాకు అండదండగా నిలిచారో వారే శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ధర్నాలకు దిగారు. ఏలూరు, నరసాపురం, పాలకొల్లు, తణుకు, భీమవరం తదితర ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించారు. ఈ ధర్నాల్లో పాల్గొని అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నించిన చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పాలకొల్లు ఎమ్మె ల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహనరావు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెన్‌గంగను తోడేస్తున్నారు..
సాక్షి, తాంసి(ఆదిలాబాద్) : ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అనే చందంగా తయారైంది. ఇసుకను అక్రమంగా తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఆ వైపుగా చూడకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూ కుబేరులుగా అవతారమెత్తుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ పెన్‌గంగాను తోడేయం మానడం లేదు. రోజుకు 50 ట్రాక్టర్ ట్రిప్పులను తరలిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిత్యం రవాణా... భీంపూర్ మండలంలోని తాంసి(కె) వద్ద పెన్‌గంగా నదిలో నుంచి నిత్యం పదుల సంఖ్యల్లో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నా సంబంధిత అధి కారులు పట్టించుకోకపోవడంతో ఇష్టానుసారంగా ట్రాక్టర్ల ద్వారా పెన్‌గంగా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. తాంసి (కె) సమీపంలో పె న్‌గంగా నది నుంచి నిత్యం పిప్పల్‌కోటి గ్రా మం మీదుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాలోని వివిధ గ్రామాలకు ట్రాక్టర్లలో పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్నారు. యథేచ్ఛగా వ్యాపారం... ఇసుక రవాణాను అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరించడంతో అక్రమ వ్యాపారులు జోరుగా ఇసుక తరలిస్తూ నిల్వ చేసుకుంటున్నారు. పెన్‌గంగా నదితీరం నుంచి గంగాపై భాగంలో ఇసుకను రవాణా చేసే వ్యాపారులు ఇసుక డంప్పులను ఏర్పాటు చేసి ఇసుకను నిల్వ చేసుకుంటున్నారు. పెన్‌గంగా నది నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు ఇసుక కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వర్షాకాలం పెన్‌గంగా నదిలోకి వరదనీరు చేరితే ఇసుక తీసే అవకాశం ఉండది. ప్రస్తుతం గంగలో నుంచి కూలీల ద్వారా ఇసుకను తీసుకువచ్చి గంగనది తీరంలో మైదాన ప్రాంతంలో డంప్పులను ఏర్పాటు చేస్తున్నారు. ఇసుక రవాణా ఇలా.... భీంపూర్ మండలంలోని అంతర్గాం, వడూర్, తాంసి(కె) గ్రామాల పరిహక ప్రాంతాల నుంచి పెన్‌గంగా నది ప్రవహిస్తుంది. వడూర్, అంతర్గాం గ్రామాల సమీపంలో ప్రస్తుతం వరదనీరు గంగలోకి రావడంతో ఇసుక తీసే వీలులేక ప్రస్తుతం తాంసి(కె) నుంచి పిప్పల్‌కోటి మీదుగా కప్పర్ల, బండల్‌నాగాపూర్, పొచ్చేర, లేకపోతే సావర్గాం, జంధాపూర్ గ్రామాల మీదుగా జిల్లా కేంద్రానికి ఇసుకను తరలిస్తున్నారు. తాంసి(కె) వద్ద గంగాలోని ఇసుక బాగుండడంతో భారీ రేటు కూడా పలుకడంతో ట్రాక్టర్ల యాజమానులు, వ్యాపారులు పెన్‌గంగ నది నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రోజుకు ట్రాక్టర్ ద్వారా ఒక్కొ ట్రాక్టర్ ద్వారా రెండు ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ట్రింపు ఇసుకను రూ.3వేలకు విక్రయిస్తున్నారు. ఇలా నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాసులు కురిపిస్తున్న ఇసుక దందా... ఇసుకకు ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. గ్రామాలలోని ప్రతి ఒక్కరూ ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి ఇసుక దందాను ఎంచుకుంటున్నారు. ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ఇసుకను తోడుకుని అమ్ముకోవడంతో వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తుంది. గ్రామాలలో స్థానికంగా ఉన్న చిన్నచిన్న అవసరాల మేరకు ఇసుకను వాడుకునేందుకు ఇచ్చిన అవకాశాన్ని దర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్లకు, ఇతర అవసరాలకు ఇసుకను రవాణా చేస్తూ కాసులు సంపాదించుకుంటున్నారు. కొరవడిన అధికారుల పర్యవేక్షణ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కోరవడడంతో ఇసుకు పెన్‌గంగా నది నుంచి యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇసుక తరలిస్తూ ట్రాక్టర్లు పట్టుబడితే నామమాత్రంగా జరిమానా విధిస్తూ చూసిచూడనట్లు వ్యవహరించడంతో ఇసుక వ్యాపారులు తమ పంథాను మార్చుకోకుండా ఇసుకను తరలిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం మండలంలోని తాంసి(కె) గ్రామం సమీ పంలో పెన్‌గంగా నది నుంచి వ్యాపారులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చింది. ఇప్పటికే ఇసుక తరలి స్తున్న ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా వి ధించడం జరిగింది. పెన్‌గంగ నుంచి ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా రవాణా చే స్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తాం. – మల్లేష్, భీంపూర్ తహసీల్దార్ -
సెప్టెంబర్ 5 నుంచి.. ఇసుక కొత్త పాలసీ
సాక్షి, అమరావతి: ప్రజలకు ప్రస్తుతం లభిస్తున్న దానికంటే తక్కువ ధరకే ఇసుకను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభించేలా, సర్కారుకు ఆదాయం వచ్చేలా కొత్త విధానం ఉండాలని మార్గనిర్దేశం చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని సూచించారు. ప్రజలపై భారం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ రాబడి పెంపు, పారదర్శకత, అక్రమ రవాణాకు అడ్డుకట్ట లక్ష్యాలుగా ఇసుక కొత్త విధానం రూపొందించాలని చెప్పారు. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా కలెక్టర్ల నేతృత్వంలో ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ప్రజలకు తక్కువ ధరకే ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక మాఫియాకు వరంగా మారిన గత ప్రభుత్వ ఇసుక విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో కొత్త విధానం ఎలా ఉండాలనే అంశంపై మంత్రులు, ఉన్నతాధికారులతో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. తెలంగాణాతోపాటు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఇసుక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మన పాలసీ ఉండాలని సీఎం నొక్కి చెప్పారు. పర్యావరణానికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరుగకుండా చూడాలని సూచించారు. ప్రతి వాహనానికీ జీపీఎస్ ‘ఇసుకను తరలించే ప్రతి వాహనానికి తప్పనిసరిగా జీపీఎస్ పరికరాలు అమర్చాలి. దీనివల్ల వాహనం ఎక్కడి నుంచి ఎక్కడకు ఇసుకను తరలించిందో స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కడా అక్రమాలకు అవకాశం ఉండదు. ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రజలకు ఎంత ధరతో ఇసుక అందుతుందో కచ్చితంగా అంతకంటే తక్కువ రేటుకే అందించాలి. ప్రభుత్వం సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఏర్పాట్లకు రెండు నెలల సమయం ఎన్ని రోజుల్లో ఇసుక కొత్తవిధానం అమల్లోకి తేగలరని సీఎం అడిగిన ప్రశ్నకు క్వారీల వద్ద సీసీ కెమెరాలు, స్టాక్ యార్డులు, వేయింగ్ బ్రిడ్జిలు, వాహనాల గుర్తింపు, రిజిస్ట్రేషన్, జీపీఎస్.. తదితరాల ఏర్పాటుకు రెండు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. అందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి సెప్టెంబరు 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని, ఆ లోగా అన్నీ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇసుక కావాల్సిన వారు ఇంటి నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వీలుగా ఒక యాప్, వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. డిమాండ్‌కు తగిన విధంగా ఇసుకను అందుబాటులో ఉంచి బుక్ చేసుకున్న వారికి సకాలంలో అందించేలా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకోవాలని నొక్కి చెప్పారు. ఇసుక సరఫరాకు కొత్త పాలసీ అమల్లోకి తెచ్చే వరకూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా ఇసుకను అందించే బాధ్యత జిల్లా కలెక్టర్లు యథాతథంగా చూసుకోవాలని ఆదేశించారు. ఇసుక డిమాండు – ఉత్పత్తి మధ్య అంతరం తగ్గించేందుకు రోబో శాండ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. సిలికా అక్రమ తవ్వకాలకు చెక్ నెల్లూరు జిల్లాలో సిలికా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్న అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు రాగానే సీఎం సీరియస్‌గా స్పందించారు. ఇసుకను అక్రమంగా తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులంతా సమావేశమై అక్రమ తవ్వకాల నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని, అక్రమ తవ్వకాల మాట ఇక తనకు వినిపించరాదని ఆదేశించారు. గత అయిదేళ్లలో కోట్ల రూపాయల విలువైన ఇసుక కుంభకోణం సాగిందని సీఎం గుర్తు చేశారు. ఇసుక కొనుగోలు ప్రజలకు భారంగా మారగా, మాఫియా కాసుల మూటలు కొల్లగొట్టిందని, సర్కారుకు మాత్రం ఆదాయం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి వ్యవహరాలను ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుందన్నారు. ఈ అక్రమాలకు చెక్ పెట్టి ప్రజలకు, ప్రభుత్వానికి ఉభయతారకంగా మార్చడం కోసమే కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం, భూగర్భ గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనరేష్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీఎండీసీకే సరఫరా బాధ్యతలు ఇసుక కొత్త విధానం మేరకు సరఫరా బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగిద్దామని అధికారులు చేసిన సూచనకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ప్రకారం ఏపీఎండీసీనే ప్రజలకు ఇసుకను విక్రయించనుంది. కొత్త విధానం అంతిమంగా ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా, పర్యావరణానికి నష్టం కలుగని రీతిలో, పూర్తి పారదర్శకంగా ఉండాలని సీఎం సూచించారు. ఇసుక కొత్త విధానం ఇలా అమలు కానుంది. ► జిల్లాల్లో ఇసుక రేవులను గనుల శాఖ గుర్తిస్తుంది. వీటికి సమీపంలో ఏపీఎండీసీ నిల్వ కేంద్రాలు (స్టాక్ పాయింట్లు) ఏర్పాటు చేసుకుంటుంది. ► క్వారీల నుంచి ఇసుకను తవ్వించి వాహనాల్లో స్టాక్ పాయింట్లకు ఏపీఎండీసీనే చేరవేస్తుంది. ► క్వారీ వద్దకు రాగానే ఖాళీ వాహనం బరువును వేయింగ్ మిషన్ ద్వారా లెక్కిస్తారు. దాంట్లో ఇసుక నింపిన తర్వాత మళ్లీ బరువు చూస్తారు. దీంతో వాహనంలో ఎన్ని టన్నుల ఇసుక ఉందో తేలిపోతుంది. వాహనంలో ఎంత ఇసుక ఉందో డ్రైవరుకు చీటీ ఇచ్చి పంపుతారు. స్టాక్ యార్డులోని సిబ్బంది ఆ చీటీ తీసుకుని మళ్లీ తూకం వేసి అంతే పరిమాణంలో ఇసుక ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అన్ లోడ్ చేయిస్తారు. ► వినియోగదారులకు ఇసుక పంపేప్పుడు కూడా వాహనాలను తూకం వేసి కచ్చితంగా వారు కోరిన పరిమాణంలో పంపించే ఏర్పాటు చేస్తారు. దీనివల్ల క్వారీలో ఎన్ని టన్నుల ఇసుక తవ్వారు? స్టాక్ యార్డులకు ఎంత చేరింది? ఎంత విక్రయించారు? అనే లెక్క కచ్చితంగా ఉంటుంది. ఎక్కడా ఇసుక పక్కదారి పట్టడానికి అవకాశం ఉండదు. ► ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్ యార్డులు ఏర్పాటు చేస్తారు. ► ఇసుక కావాల్సిన వారు వెబ్ పోర్టల్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకుని డబ్బు చెల్లిస్తే ఏపీఎండీసీనే ఇంటికి వాహనాల ద్వారా ఇసుకను చేరవేస్తుంది. ఏపీఎండీసీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని జీపీఎస్ పరికరాలు అమర్చుకున్న వాహనాలను సంస్థ స్టాక్ యార్డుల వద్దకు అనుమతిస్తారు. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి ముందుగా పద్ధతిలో ఇసుకను పంపిస్తారు. ఇసుక వ్యాపార వస్తువు కాకూడదు : మంత్రి పెద్దిరెడ్డి సహజ సిద్ధమైన ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చరాదనేది ప్రభుత్వ లక్ష్యమని భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక ద్వారా ఆదాయం మాఫియాకు వెళ్లరాదని, ప్రజలకు సరసమైన ధరలకు అందించడం ద్వారా ఆదాయం ప్రభుత్వానికే రావాలన్నారు. గురువారం సాయంత్రం ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం ఇసుక సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
ఇసుకాసురులు
సాక్షి, ఎచ్చెర్ల(శ్రీకాకుళం) : ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కోనసాగుతోంది. ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా, వాహనాలు స్వాధీనం చేసుకున్నా, ఇసుక నిల్వలు సీజ్ చేసినా, రీచ్‌ల చుట్టూ కందకాలు తవ్వించినా తదితర చర్యలు తీసుకున్నా అక్రమ రవాణా మాత్రం సాగుతోంది. ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడుపేట, పొన్నాడ, బొంతలకోడూరు, ముద్డాడపేట, పాతపొన్నాడ ప్రాంతాల్లో నాగావళి నదిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. తమ్మినాయుడుపేట, పొన్నాడ పంచాయతీ ముద్దాడపేట, పాతపొన్నాడ తదిలర రీచ్‌లపై 24 గంటలు పర్యవేక్షణ సైతం ఉంది. అయినా ఇసుక రావాణా అగడం లేదు. ట్రాక్టర్లు ద్వారా ఇసుక తరలించి జాతీయ రహదారికి అనుకొని, చిలకపాలెం, అల్లినగరం, ఎస్.ఎస్.ఆర్.పురం, కుశాలపురం, నవభారత్ జంక్షన్, కింతలిమిల్లు వంటి ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా నిల్వచేస్తున్నారు. అనంతరం రాత్రిళ్లు లారీల్లో తగరపువలస, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారు. అనుకూల పరిస్థితులు చూసుకొని అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిఘా బృందాలు కొన్నిసార్లు దాడులు చేస్తున్నారు. విజిలెన్స్, రెవెన్యూ, పోలీస్, మైన్స్ తదితర ప్రభుత్వ శాఖలు ఇసుక నిల్వలు, వాహనాలు సీజ్, అక్రమ రవాణా, జాతీయ రహదారిపై నిఘా వంటివి కొనసాగు తున్నాయి. అయినా అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా సాగిస్తుండడం గమనార్హం. కొన్నిసార్లు నిఘా బృందాలు సైతం మొక్కుబడిగా వ్యవహరిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. లావేరు మండలం బుడుమూరు ఊటగెడ్డ నుంచి సైతం ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఇది ఆలా ఉండగా రణస్థలం మండలంలోని కొచ్చర్ల, దోణుపేట, కొవ్వాడ, ఎచ్చెర్ల మండలం కుప్పిలి, బుడగుట్లపాలెం తదితర ప్రాంతాల్లో సముద్రపు ఇసుకతో కలిపి కల్తీ చేసి విక్రయిస్తున్నారు. ఆయా ఇసుకను విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమార్కులపై కఠిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ ఉంటేనే నియంత్రణ సాధ్యమని పలువురు చెబుతున్నారు. తీర ప్రాంతాల్లో సముద్రపు ఇసుక పోగులు వేసి, నది ఇసుక కల్తీ చేయడం సైతం చోటు చేసుకుంటుంది. ఇలా ఇసుక పోగులు కొన్ని ప్రాంతాల్లో నిల్వ చేసి అక్రమంగా రాత్రిళ్లు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ నిర్మూలనపై ప్రభుత్వం ప్రస్తుతం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. దీంతో ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశాలున్నాయని పలువురు చెబుతున్నారు. ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఇసుక అక్రమ రవాణాపై నిఘా కొనసాగుతోంది. రీచ్‌లను నిరంతరం పరిశీలిస్తున్నాం. చిలకపాలెంలో తనిఖీ కేంద్రం సైతం ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగుతోంది. జాతీయ రహదారిపై పట్టుబడ్డ ఇసుక వాహనాలను సీజ్ చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలు చేస్తాం. ఇసుక అక్రమ రవాణే పూర్తి నియంత్రణే లక్ష్యం. –ఎంవీ రమణ, ఆర్డీవో, శ్రీకాకుళం -
నిర్మాణాలకు నిరంతరాయంగా ఇసుక
సాక్షి, అమరావతి: ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అదే సమయంలో సామాన్య ప్రజల ఇళ్ల నిర్మాణాలు, ముఖ్యమైన ఇతర పనులకు ఇసుక కొరత లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడంతోపాటు సామాన్యులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వానికి రాబడి వచ్చే విధంగా కొత్త ఇసుక పాలసీ తీసుకురావాలని సర్కారు తాజాగా నిర్ణయించిన విషయం విదితమే. 15 రోజుల్లో కొత్త పాలసీ తెస్తామని, ఇది వచ్చేవరకూ ఇసుక తవ్వకాలు, రవాణాను నిలిపివేస్తామని భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. కొత్త పాలసీ వచ్చేవరకూ ఇసుక తవ్వకాలు, రవాణాను నిలిపివేస్తే మాఫియా దీన్ని సాకుగా చూపించి, ఇసుక కొరత సృష్టించి, ధరలు పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఇదే జరిగితే ఇళ్లు నిర్మించుకునే సామాన్యులతోపాటు ఇతర నిర్మాణ పను లకు ఇసుక అత్యవసరమైన వారికి ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం పున:సమీక్షించుకుని, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించింది. కొరత రానివ్వొద్దు రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా కట్టుదిట్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళికకు ప్రభుత్వం బుధవారమే శ్రీకారం చుట్టింది. ముఖ్యమైన నిర్మాణాలకు, సాధారణ ప్రజల ఇళ్ల నిర్మాణం, ఇతర ముఖ్యమైన అవసరాలకు ఇసుక కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో నిర్మాణ పనులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించింది. పర్యావరణ అనుమతి ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి ప్రాధాన్యాన్ని బట్టి పనులకు, నిరుపేదల ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతించాలని గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనరేష్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాలకు మెమో జారీ చేశారు. నోడల్ అధికారులుగా జిల్లా కలెక్టర్లు కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకూ ఎవరికీ ఇసుక కొరత రానివ్వరాదు. బ్లాక్ మార్కెటింగ్ చేసి ధరలు పెంచేందుకు ఆస్కారం ఇవ్వరాదు. ఇందుకోసం కంటింజెంట్ ప్లాన్ అమలుకు కలెక్టర్లు నోడ ల్ అధికారులుగా వ్యవహరించాలని మెమోలో స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడినా, రవాణా చేసినా నిల్వ ఉంచుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని, సరఫరాలో మధ్యవర్తులు, మాఫియా పాత్ర ఉన్నట్లు తేలితే కఠినంగా వ్యవహరించాలని, ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటి తరలిపోకుండా చూడాలని, పట్టా భూముల్లో తవ్వకాలకు అనుమతి తీసుకున్న వారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తేల్చిచెప్పారు. ఇసుక కావాలంటే. ఇకపై ఇసుక అవసరమైన వారు తొలుత తహసీల్దార్లకు అర్జీ పెట్టుకోవాలి. కలెక్టర్ అనుమతితో ఇసుక తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇసుక దొరకదని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భూగర్భ గనుల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇసుక కావాల్సిన వారు ఆ విషయాన్ని వివరిస్తూ అర్జీలు పెట్టుకుని అనుమతులు తీసుకుని ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపారు. -
నేటి నుంచి ఇసుక రవాణా బంద్..!
సాక్షి, అమరావతి : ఇకపై రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు ఉండవని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్చగా ఇసుక దోపిడీ సాగిందని విమర్శించారు. చంద్రబాబు నిర్ణయాలతో ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయిందని, టీడీపీ నేతలు ఇసుకను దోచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మండిపడ్డారు. అందుకే టీడీపీ అధోగతి పాలైందని అన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఇసుక రవాణా నిలిపేయాలని ఆదేశించాం. కొత్త ఇసుక విధానం వచ్చేంత వరకు ఇసుక రవాణా చేయడానికి వీల్లేదు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇసుక రవాణా గురించి కొత్త పాలసీ తీసుకురావాలని ఆదేశాలు జారీచేశారు. జూలై 1 లోపు నూతన ఇసుక పాలసీ తీసుకోస్తాం. ఇసుక స్మగ్లింగ్‌కి ఈరోజు నుంచి పుల్‌స్టాప్ పెట్టాలని ఆదేశాలు జారీచేశాం. స్మగ్లింగ్ ఆపకపోతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. గతంలో ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోని టీడీపీ నేతలు కొట్టారు. సాండ్ స్మగ్లింగ్ జరిగితే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. అక్రమంగా లక్షల లారీల ఇసుక దోచేశారు. ఇసుక ర్యాంపు 202 నుంచి 116 కు తగ్గిపోయాయి.’ అన్నారు. -
వాటికి కూడా ఫిల్టర్ ఇసుకేనా..?!
నాగర్‌కర్నూల్ క్రైం : నదులు, వాగులు, వంకల్లో ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకను అక్రమంగా రవాణ చేసి రూ.కోట్లలో అక్రమ సంపాదనను వెనకేసుకుంటున్న ఇసుకాసురులు.. జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఫిల్టర్ ఇసుక దందాకు తెరలేపారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకతో నిర్మాణాలు చేపడితే చాలాకాలం పాటు మన్నిక ఉంటాయి. కానీ, జిల్లాలో కొందరు ఇసుక వ్యాపారులు చెరువులు, పంట పొలాల్లో లభించే మట్టి తీసుకువచ్చి ఆ మట్టితో ఫిల్టర్ ఇసుకను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ ఫిల్టర్ ఇసుకను ప్రభుత్వ నిర్మాణాలకు, సీసీరోడ్లతోపాటు భవన నిర్మాణాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఫిల్టర్ ఇసుకను వాడటం వల్ల చాలాకాలంపాటు పటిష్టంగా ఉండాల్సిన నిర్మాణాలు, సీసీరోడ్లు, భవనాలు కొద్దిరోజుల్లో దెబ్బతినే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు జిల్లా పరిధిలో దుందుబీ వాగుతోపాటు కృష్ణానది వందల కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుండటంతో నాణ్యమైన ఇసుకకు ఏమాత్రం కొదవలేదు. నదులు, వాగులు, వంకల్లో లభించే ఇసుకను ప్రభుత్వ అనుమతుల పేరిట అక్రమంగా తరలించి రూ.కోట్లు దండుకుంటున్న ఇసుకాసురులపై పోలీసు అధికారులు నిఘా పెట్టడం వల్ల ఇసుక అక్రమంగా తరలింపుపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో జిల్లా పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై కూడా నిఘా పెట్టడంతో ఇసుకాసురులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుని నాణ్యతలేని ఫిల్టర్ ఇసుకను తయారుచేసి దర్జాగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్ నియోజకవర్గంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఫిల్టర్ ఇసుక తయారీ ఎంతోకాలంగా జోరుగా నడుస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రజలు ఫిల్టర్ ఇసుక తయారీదారులపై అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం ఫిల్టర్ ఇసుక తయారీ చేసే ప్రాంతాల దరిదాపుల వైపు వెళ్లి చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఫిల్టర్ ఇసుక తయారీ కొందరు రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తుండటంతో అధికారులు అటువైపు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చెరువు మట్టి ద్వారా.. జిల్లాలోని పలు చెరువుల్లో, సారవంతమైన నేలల నుంచి మట్టిని తీసుకువెళ్లి కృత్రిమ పద్ధతి ద్వారా ఇసుకను తయారు చేస్తున్నారు. ఈ కృత్రిమ ఇసుకతో నిర్మించిన కట్టడాలు చాలాకాలం మన్నికగా ఉండవని తెలిసినా ధనార్జనే ధ్యేయంగా ఇసుకాసురులు కృత్రిమ ఇసుక తయారీకి తెరలేపారు. చెరువుల నుంచి, సారవంతమైన నేలల నుంచి మట్టిని తీసుకెళ్లడం ద్వారా అటు చెరువుల్లో నీరు ఇంకిపోవడమే గాక సారవంతమైన నేలలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ ఇసుక తయారీతో సహజ వనరులు నాశనమవ్వడమే గాక పర్యావరణానికి పెనుప్రమాదమని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. అధిక శాతం వాటికే వినియోగం వాగులు, నదుల్లో లభించే ఇసుక కన్నా కృత్రిమంగా తయారు చేసే ఫిల్టర్ ఇసుక ధర తక్కువగా ఉండటంతో కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఫిల్టర్ ఇసుకను సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలకే ఉపయోగిస్తున్నా ఇ సుక నాణ్యతపట్ల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లాలో కృత్రి మ ఇసుకను తయారు చేసే వారి పట్ల చర్యలు తీసుకొని కృత్రిమ ఇసుకను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కఠిన చర్యలు తప్పవు ప్రకృతి సిద్ధంగా వాగులు, నదుల్లో ఇసుకను కాకుండా కృత్రిమంగా ఇసుకను తయారు చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఫిల్టర్ ఇసుక తయారీని అరికట్టాల్సిన బాధ్యత ఎక్కువగా రెవెన్యూ అధికారులపైనే ఉంటుంది. జిల్లాలో తయారవుతున్న కృత్రిమ ఇసుకను అరికట్టడం కోసం రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ఫిల్టర్ ఇసుకను అరికడతాం. -శ్రీనివాస్, మైనింగ్ ఏడీ, నాగర్‌కర్నూలు -
ఇసుక అక్రమార్కులను తప్పక శిక్షిస్తాం
-
ఇసుక మాఫీయాపై కఠిన చర్యలు తప్పవు
సాక్షి, కృష్ణా: విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. నది గర్భంలో ఇసుక తవ్వకాలు జరిగాయని అధికారులు నిర్థారించారు. ఇది జాతీయ హరిత ట్రిబ్యునల్ నింబంధనల ఉల్లంగనేనని, ఇసుక తవ్వకాలను తాము ఎవరికీ ఏలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. నదిలో అక్రమంగా దీవులను సృష్టించిన వారిపై చర్యలు తప్పవన్నారు. అక్రమణదారులపై తప్పకుంటా కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న వారి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఒక డోజర్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపింది. -
ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎస్ సమీక్షలపై అధికార పక్షం విమర్శలు సంధిస్తున్న సమయంలో ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లారు?.ఎవరిని కలవబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఎన్టీటి (జాతీయ హరిత ట్రిబ్యునల్) విచారణ కోసమే సీఎస్ ఢిల్లీ వెళ్లినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ పర్యటనపై అటు అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. కృష్ణా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై రేపు (శుక్రవారం మధ్యాహ్నం) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో జరిగే విచారణకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరు కానున్నారు. దేశ వ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్రాలు విఫలమవడంపై ఎన్జీటీలో విచారణ జరుగుతోంది. ప్రధానంగా పురపాలక సంఘాలు, అటవీ శాఖలు విఫలమవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పర్యావరణాన్ని కాపాడటం, అటవీ చట్టాల ఉల్లంఘనపై ఎన్జీటీ రాష్ట్రాల వారీగా సమీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్జీటీలో జరిగే విచారణకు సీఎస్‌తో పాటు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము ఢిల్లీ వెళ్లారు. మరోవైపు కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి 100కోట్ల రుపాయలు నెల రోజుల్లోగా డిపాజిట్ చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏప్రిల్ 4న ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. దీనిపై గడువు దాటితే 12.5శాతం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ బృందం వాదనలు వినిపించనుంది. మరోవైపు హస్తిన పర్యటనలో ప్రధాన కార్యదర్శి ఎవరెవరిని కలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎన్జీటీ విచారణకు పరిమితమవుతారా, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఇతర ఢిల్లీ పెద్దలను కలుస్తారనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది. ఇప్పటికే సీఎస్ టార్గెట్‌గా టీడీపీ వర్గాలు విమర్శలు గుప్పిస్తుండటంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు వివరిస్తారని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. -
ఉచితం మాటున ఊడ్చేశారు..!
ఇదో ఘరానా దోపిడీ.. ఈ దోపిడీకి అనుమతి ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే.ఇంకేముంది టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వాగు కనిపిస్తే చాలు డేగల్లా వాలిపోయారు. రోజుకు వందల ట్రక్కుల చొప్పున ఐదేళ్లలో లక్షలాది ట్రక్కులను ఇసుకను అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇసుక ఉచితం అంటూ ప్రభుత్వ ప్రకటన టీడీపీ నేతలకు వరంగా మారి వారి దోపిడీకి రాజబాట పరిచినట్లయింది. సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): నియోజకవర్గంలోని మర్రిపూడి, సింగరాయకొండ, జరుగుమల్లి, కొండపి, పొన్నలూరు మండలాలల్లో ఉన్న అట్లేరు, పాలేరు, మన్నేరు, ముసివాగుల్లో పచ్చనేతలు పాగా వేశారు. అక్రమంగా లారీలు, ట్రాక్టర్లలో దూర ప్రాంతాలకు ఇసుక తరలించి కోట్ల రూపాయలు దండుకున్నారు. నేతలు అధికారులతో కుమ్మకై తమకు ఇష్టానుసారంగా సీసీరోడ్లు, ఇటుకబట్టీలు, బ్రిడ్జిలు, వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణాలకు ఇసుకను తరలించారు. కొండపి మండలంలో. కొండపి మండలంలోని అట్లేరు పరిదిలో ముక్కోరుపాలెం, తాటాకులపాలెం, వెంకుపాలెం, కొండపి, అనకర్లపూడి, పెరిదేపి, ముప్పవరం, చినవెంకన్నపాలెం గ్రామాల్లో జోరుగా ఇసుక అక్రమంగా తరలించారు. సిమెంట్బ్రిగ్స్లకు సైతం వందల ట్రిప్పులు ఉపయోగిస్తున్నారు. ఎన్నికల వేడి రోజురోజుకు ఉత్కంఠం రేపుతున్న తరుణంలో అక్రమార్కుల పనులు సులవు అయింది. పచ్చనేతల కనుసందానంలో ఇసుక దందా యథేచ్ఛగా నడుస్తుంది. సింగరాయకొండ మండలంలో.. పాతసింగరాయకొండ, శానంపూడి గ్రామాల పరివాహక ప్రాంతంలో మన్నేరు వ్యాపించి ఉంది. అక్రమార్కులు ఈ ప్రదేశంలో ఇసుక క్వారీలు ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం రెండు వేల ట్రిప్పుల ఇసుకను ట్రాక్టర్లు, లారీలకు నింపి తరలిస్తున్నారు. రూర్బన్ పథకం కింద వందకోట్లు మంజూరుకావడంతో సీసీరోడ్లు వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణానికి ఈ ఇసుకునే తరలిస్తున్నారు. మన్నేరులో ఇసుక అడుగంటి మట్టి బయటపడింది. దీంతో భూగర్భజలాలు అండుగంటాయి. పొన్నలూరు మండలం... మండలంలోని ముప్పాళ్ల, కొత్తపాలెం, ఉప్పలదిన్నే, రావులకొల్లు, బాలిరెడ్డిపాలెం, కల్లూరివారిపాలెం, కొత్తపాలెం గ్రామాల పరివాహాక ప్రాంతాలు కలుపుకుంటూ పాలేరు ఉంది. ఈ పాలేరు నుంచి ఇసుక అక్రమంగా నిత్యం తరలిస్తూ ఇష్టానుసారంగా క్వారీల్లో పెద్దపెద్ద గుంటలు ఏర్పాటుచేసుకుని ట్రాక్టర్ల సాయంతో రాత్రిళ్లు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇసుకకు మంచి గిరాకీ ఉంది. ట్రక్కు ఇసుక రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పలుకుతోంది. మన్నిక ఉన్న ఈ ఇసుకపై పచ్చనేతల కన్ను పడింది. ఈ దందా మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగింది. మర్రిపూడి మండలం మండలంలోని చిలంకూరు ముసివాగును ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. రోజుకు 20 నుంచి 50 ట్రిప్పులు ఇసుకను రేయింబవళ్లు చీమకుర్తి మండలం చీమలమర్రి, భూసరపల్లి, రావిపాడు, పులికొండ, గ్రామాలతో పాటు పొదిలి, చీమకుర్తి, దర్శి తదితర మండలాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో భూగర్భజలాలు అడుగంటి ముసివాగు పరివాహాక ప్రాంతంలో సాగుచేసిన వరి దాదాపు 250 ఎకరాలల్లో వాడు, ఎండుముఖం పట్టింది. అన్నీ తెలిసినా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరించడం మండలంలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ముసివాగులో ఏర్పాటు చేసి రక్షతమంచినీటి పధకం సంబందించిన పైపులైన్లు సైతం ద్వంసం చేశారు. ఎక్కడపడితే అక్కడ విచక్షణా రహితంగా పెద్దపెద్ద గోతులు తీసి తమ అవసరాలకు అణగుణంగా మలుసుకుంటున్నారు. పచ్చనేతల అండతో ఈ దందా నడుస్తోంది. జరుగుమల్లిమండలం.. జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా తరలుతోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు జిల్లా అధికారులు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారెవ్వరూ పట్టించుకోకపోవడంతో పార్టీలకు అతీతంగా మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. దీంతో పాలేరులో ఇసుక తవ్వకాలు ఆపారు. అడుగంటిన భూగర్భజలాలు ముసినది పరివాహాక ప్రాంతంలో వరి పంట దాదాపు 250 ఎకరాల్లో సాగుచేశారు. అయితే యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటి ఏటి వెంట ఉన్న బోర్లు సైతం వట్టిపోయాయి. పట్టించుకొని అధికారులు.. ఇసుక అక్రమార్కుల ఆగడాలుఐదేళ్లుగా కొనసాగుతున్నా రెవెన్యూ, పోలీసు శాఖాధికారుల్వెవరూ పట్టించుకోలేదు. రోజుకు 20 నుంచి 50 ట్రక్కుల ఇసుక దర్శి, మర్రిపూడి, చీమకుర్తి తదితర మండలాలకు అక్రమంగా తరలుతున్నా అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మర్రిపూడి పంచాయతీ పరిదిలోని గంగపాలెం చెరువులో, అంకేపల్లి పంచాయతీ పరిధిలోని గంజిపాలెం వాగులో ఇసుక అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది. అయినా ఇప్పటి వరకు ఒక ట్రాక్టర్‌ను సైతం స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. అట్లేరులో ఇసుక ఖాళీ మండలంలోని అట్లేరు పరిధిలోని గ్రామాల్లో అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఈ తంతు నడుస్తోంది. అట్లేరు ఇసుక ఖాళీ అయింది. మట్టిబయటపడింది. దీంతో భూగర్బజలాలు అడుగంటాయి. తాగునీరు తీవ్రరూపం దాల్చింది. అక్రమార్కులకు అడ్డుకట్టవేయాలి. - నర్శింహారావు, అనకర్లపూడి -
పచ్చదండు..గోదారి దోపిడి
సాక్షి, కాకినాడ : ఇసుక అక్రమార్కుల దాహానికి గోదావరి, తాండవ నదుల గర్భాలు గుల్ల అయిపోయాయి. ఉచితం ముసుగులో టీడీపీ నేతలు చెలరేగిపోయారు. నదులు, వాగుల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరిపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇసుక స్వాహా జరిగింది. వరదలతో వేసిన మేటలను తొలగించేందుకని జిరాయితీ భూముల పేరుతో అనుమతులు తీసుకుని ఇసుకను దోచేశారు. మాన్సాస్ ట్రస్టు భూముల అనుమతుల ముసుగులో ఎక్కడికక్కడ ఇసుకను తోడేశారు. ఈ క్రమంలో కాలువలను, సమాధులను సైతం తవ్వేశారు. ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు కల్పతరువుగా తయారైంది. రేవుల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అడ్డూఅదుపూ లేకుండా అనధికార ర్యాంపులు అధికార పార్టీ నేతల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. జిల్లాలో 38 రేవులతో పాటు అనధికార ర్యాంపులు ఏర్పాటు చేసుకుని స్వాహాకు పాల్పడ్డారు. ఎక్కడ ఇసుక కనబడితే అక్కడే తవ్వేశారు. రూ.3 వేల కోట్లకు పైగా దోపిడీ చేశారు. అధికారం అండతో అనుమతులు తెప్పించుకుని యథేచ్ఛగా దోపిడీ చేశారు. ర్యాంపుల నిర్వహణ ముసుగులో అధికార పార్టీ నేతలు రూ.కోట్లకు పడగలెత్తారు. గోదావరి పాయలు న్న ప్రతిచోటా దర్జాగా తవ్వేశారు. ఇష్టారీతిన బాటలు వేసి అమ్ముకున్నారు. మాన్సాస్ భూములని కొన్నిచోట్ల, జిరాయితీ భూములని మరి కొన్ని చోట్ల చూపించి, అనుమతులు తెప్పించుకుని రాత్రి పగలనే తేడా లేకుండా పొక్లైన్లతో తవ్వించి, లారీలు, కంటైనర్ల ద్వారా తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తున్నారు. ఇసుక లారీలు, ఇతర వాహనాలు వెళ్లే గ్రామాల్లో రోడ్లు ఛిద్రమైపోతున్నాయి. ఆ వాహనాల జోరు ప్రమాదాలకు కారణమై ప్రాణాలను బలిగొన్న ఘటనలూ ఉన్నాయి. ఇళ్లు కట్టుకుందామనుకునే సామాన్యులకు ఇసుక అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. సామాన్యులు కొనలేని విధంగా అనధికారికంగా ఇసుక ధరలను పెంచేశారు. ఇసుక దోపిడీలో కీలక పాత్రధారి పెందుర్తి సీతానగరం మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో సాం్థనిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ప్రధానపాత్ర పోషించారన్నది అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల అనంతరం మొదట సింగవరం ర్యాంపు నుంచి అత్యధికంగా ఇసుకను లారీలపై తరలించేవారు. అందులో రూ.110 కోట్లు పైగా సంపాదించారనే ఆరోపణలున్నాయి. కాటవరం పంపింగ్ స్కీమ్ వద్ద గోదావరి వరదతో ఇసుక మేటలు వేయడంతో స్కీమ్ పనిచేసేలా తవ్వకాలు అని చెప్పి అనుమతులు తీసుకుని, దానిని ఎమ్మెల్యే తన బినామీలకు అప్పగిండం ద్వారా సుమారు రూ.80 కోట్లు వరకు జేబులో వేసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాటవరం ర్యాంపు నుంచి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే మునికూడలి, రఘుదేవపురం ర్యాంపుల నుంచి ఇప్పటికీ ఇసుకను తరలిస్తునే ఉన్నారు. వీటి ద్వారా ఎమ్మెల్యేకి కోట్లాది రూపాయలు ముడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. హోం మంత్రి అనుచరుడి దందా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం రేవు, గంగవరం మండలం కోటిపల్లి గ్రామాల మధ్య ఉన్న గౌతమీ నదీ పరీవాహకాన్ని ఆనుకుని ఉన్న మాన్సాస్ ట్రస్టు భూముల్లో కూడా ఇసుక మేటలను తొలగిస్తామని అనుమతులు తీసుకుని హోంమంత్రి అనుచరుడు ఏకంగా రోజుకి రూ. 50 లక్షల ఇసుకను దోచుకున్నాడు. వశిష్ట గోదావరిని గుల్ల చేసేసి ఇసుకను తోడేశారు. వ్యవసాయ భూముల మేటల తొలగింపునకని, ప్రైవేటు కంపెనీల నిర్మాణాలకని నదీ గర్భాన్ని కబ్జా చేసేశారు. రోజుకి రూ.15 లక్షల నుంచి రూ. 20లక్షల వరకు దోచేసి, నెలనెలా కోట్లు గడించారు. దాట్ల సోదరుడి కనుసన్నల్లో .. ముమ్మిడివరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే బుచ్చిబాబు సోదరుడు పృథ్వీ ఆశీస్సులతో గౌతమి, వృద్ధ గౌతమీ నదిపాయలను గుల్ల చేసేస్తున్నారు. రోజుకు వేలాది ట్రాక్టర్ల ఇసుకను తరలించేశారు. నాలుగున్నరేళ్లుగా రూ.50 కోట్లకు పైగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. అలాగే పిల్లంక, పల్లవారిపాలెం, అన్నంపల్లి, ఎదుర్లుంక, కేశనకుర్రు పశువుల్లంక ఇసుక ర్యాంపుల్లో అన«ధికార రవాణా కొనసాగింది. నియోజక వర్గానికి ఆనుకుని ఉన్న పాండిచ్చేరి పరిధిలోని యానాం అక్రమార్కులకు అడ్డాగా నిలిచింది. యానాంలో అధికారులకు ఇసుక రవాణాపై ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో ఇసుక మాఫియా రాజ్యమేలింది.ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో పది అనధికార రీచ్లద్వారా కోట్లాది రూపాయల ఇసుకను అక్రమంగా తరలించుకు పోయారు. బోడసకుర్రు రేవులో తెలుగుతమ్ముళ్ల అక్రమ తవ్వకాలు మూడేళ్ల క్రితం మూసివేసిన ఇసుక ర్యాంపును అధికారికంగా ఒకసారి, అనధికారికంగా రెండవసారి తెరిపించి టీడీపీ నేతలు అడ్డగోలుగా దోపిడీ చేశారు. అధికారిక అనుమతి లేకున్నా అధికారపార్టీ మద్దతుదారుడు, ఎమ్మెల్యే ఆనందరావుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఆధ్వర్యంలో ఇసుక దందా జరిగింది. వాకలగరువు, దొడ్డవరం గ్రామాల మధ్య ఉన్న ఇసుక మేటలను పడవల ద్వారా తరలించి అమ్ముకున్నారు. బోడసకుర్రు బ్రిడ్జి సమీపంలో ఇసుక తవ్వకాలు జరపరాదన్న నిబంధనను సైతం ఉల్లంఘించారు. పొక్లెయిన్ల సహాయంతో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల బ్రిడ్జికి పెను ముప్పు ఏర్పడింది. ఓడలరేవు తీరాన్ని ఇష్టానుసారం తవ్వేశారు. కొమరిగిరపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆరు ఎకరాల భూమిని సాగుకు యోగ్యంగా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరడం, అందుకు మైనింగ్ కార్పోరేషన్ అనుమతి ఇవ్వడంతో అవినీతి దందాకు తెరదీశారు. దీనిని అడ్డుగా పెట్టుకుని అందుకు వందరెట్లు ఇసుక తవ్వకాలు చేశారు. యూనిట్ ఇసుకకు బాట చార్జీలు రూ. 100 లోడింగ్ చేసే కూలీల చార్జీలు రూ. 200 ఉచిత ఇసుక విధాన నిబంధనలివి. ఈ మొత్తాన్ని చెల్లించి ఇసుక తీసుకెళ్లొచ్చు ఉచితం కాక ముందు ట్రాక్టర్ ఇసుక ధర- రూ. 1000 నుంచి రూ.1200 ఉచితం అని ప్రకటించాక - రూ.2000 నుంచి రూ.2500 ఉచితానికి ముందు లారీ ఇసుక ధర - రూ. 3 వేలు ఉచితం అన్నాక - రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఇదీ చంద్రబాబు ‘ఉచిత ఇసుక’ విధానంతో దాపురించిన వైపరీత్యం నడిగాడిలో లోకేష్ ర్యాంపు! ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులో వశిష్టా గోదావరి నదిలో రేయింబవళ్లు యథేచ్ఛగా డ్రెడ్జర్లతో ఇసుకను తోడేశారు. మంత్రి లోకేష్ ర్యాంపుగా చెప్పుకొనే ఎల్.గన్నవరం శివారు నడిగాడి నుంచి పశ్చిమ జిల్లా ఆచంట మండలం పుచ్చల్లంక వరకూ సుమారు కిలో మీటరు పొడవునా 20 నుంచి 25 అడుగుల లోతున అక్రమ తవ్వకాలు సాగించారు. ఒడ్డుకు బోట్లు ద్వారా ఇసుకను తెచ్చి అక్కడి నుంచి ట్రాక్టర్లు, లారీల ద్వారా స్టాక్ పాయింట్ల వద్దకు తరలించి అమ్ముకున్నారు. ఇక్కడ ఇసుక సొమ్ము అంతా మంత్రి లోకేష్ జేబులోకి వెళ్లిందని టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. అయినవిల్లి, కె.గంగవరం మండల పరిధిలోని కోటిపల్లి బాగ, పురుగులంకలో మాన్సాస్ ట్రస్టు భూముల్లో ఇసుక, మట్టి దోచుకున్నారు. ఇక్కడ తవ్వకాల వలన పంట భూములు కోతకు గురై నదీగర్భంలో కలిసిపోయాయి. కోతకు నిరోధానికి నిర్మించిన గ్రోయిన్లు కూడా పాడైపోతున్నాయి. కాకినాడలో లారీ ఇసుక రూ.15 వేలు బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరంలో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితమని ఆర్భాటంగా ప్రకటించినా టీడీపీ నాయకులుఇతర ప్రాంతాల నుంచి తెచ్చి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. రాత్రివేళల్లో వివిధ ప్రాంతాల్లోని ర్యాంపుల నుంచి ఇసుక లారీలపై ఇక్కడ అన్లోడింగ్ చేస్తున్నారు. పగలు ఇసుక కావల్సిన వారికి అధిక రేట్లుకు విక్రయిస్తున్నారు. ముందుకు చెప్పిన వారికి ఒక రేటు, అర్జంటుగా ఇసుక కావాలంటే ఒక రేటు వసూలు చేస్తున్నారు. ఒక లారీ ఇసుక కావాలంటే రూ. 15 వేలు వసూలు చేస్తున్నారు. గతంలో ఈ ఇసుక రూ. 5 నుంచి 6 వేలు లోపు ఉండేది. ఇసుకలోనూ కల్తీ పిఠాపురం: టీడీపీ నేతలు నియోజకవర్గంలో ఏలేరు, ఇతర పంట కాలువల్లో దొరికే ఇసుకను యథేచ్ఛగా అక్రమ రవాణా చేసి రూ.కోట్లు స్వాహా చేశారు. ఉచిత ఇసుక పేరిట లారీల కొద్దీ ఇసుకను అక్రమంగా రవాణా చేశారు. దొరికిన చోటల్లా వందల యూనిట్ల ఇసుకను తవ్వి భారీ మొత్తంలో నిల్వ చేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్ద వందలాది యూనిట్ల ఇసుకను నిల్వ చేశారు. లారీ ఓనర్లు, వ్యాపారులు కుమ్మక్కై ఇసుక కృతిమ కొరత సృష్టించి రెట్టింపు రేటుకు విక్రయించారు. మూడు యూనిట్ల లారీ ఇసుకను రూ.11 వేల నుంచి రూ.12 వేలకు విక్రయించారు. గోదావరి ఇసుకతో పాటు గొర్రిఖండి, ఏలేరు ఇతర పంట కాలువల్లో దొరికే ఇసుకను తీర ప్రాంతంలో లభించే బొండు మట్టిని కలిపి గోదావరి ఇసుకగా అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుకను కూడా కల్తీ చేసిన వారిపై అధికారులు కనీస చర్యలు తీసుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కోతకు గురైన పంటభూములు తుని: పంట పొలాలకు నీరు అందించే తాండవ నదిని ఇసుక కోసం తెలుగు తమ్ముళ్లు కబళించారు. ఉచిత ఇసుక జీవో అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. ఐదేళ్ల క్రితం ట్రాక్టర్ ఇసుక రూ.800 ఉంటే ప్రస్తుతం రూ.2500కు చేరింది. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడి అండదండలు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడి ఆశీస్సులు ఇసుక మాఫియాకు దండిగా ఉన్నాయి. కోటనందూరు నుంచి తుని వరకు ఎక్కడ పడితే అక్కడ అనధికారిక ర్యాంపులను తెరిచారు. రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇసుక తవ్వకాలతో పంటభూములు కోతకు గురయ్యాయి. ఒక అంచనా ప్రకారం ఇసుక రూపంలో ఐదేళ్లలో రూ.20 కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఇదే సొమ్మును ఎన్నికల్లో ఓట్లు కొనడానికి ఉపయోగిస్తున్నారు. అయితే తాండవ నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న రైతులు తమకు జరిగిన నష్టానికి ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెబుతామని బహిరంగంగానే అంటున్నారు. తాండవలో యనమల సోదరుడి దందా మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడి ఆశీస్సులతో తాండవ నదిని గుల్ల చేసేశారు. ఐదేళ్లలో రూ.వంద కోట్లకు పైగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. విశాఖ జిల్లా నాతవరం మండలం నుంచి పెంటకోట వరకు తాండవ నది 45 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిపారు. కోటనందూరు, బొద్దవరం, తుని మండలం కొలిమేరు, డి.పోలవరం ప్రాంతాల్లో అనధికారికంగా ర్యాంపులు నిర్వహించారు. నదీ పరీవాహక ప్రాంతంలోని పంట భూముల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదని కోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోలేదు. పూర్తిగా తవ్వేసి, ఇసుకను తీసేస్తుండటంతో భూగర్బ జలాలు తరిగి పక్కనున్న పంట భూముల బోర్లు సైతం పనిచేయడం లేదు. తుని మండలం డి.పోలవరంలో తాండవ నదిలో జరుగుతున్న తవ్వకాల వలన రైతులు భూములు కోల్పోతున్నారని తెలుసుకుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వెళితే పోలీసులతో కేసులు కూడా పెట్టించారు. గోరంట్ల, ఆదిరెడ్డి పోటాపోటీ ర్యాంపులు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గపరిధిలో ధవళేశ్వరంలో గాయత్రి ఇసుక ర్యాంపు 1, 2, కేతావారిలంక ఇసుక ర్యాంపులలో లారీకి రూ.200 కప్పం కట్టాల్సిందే. ఈ లెక్కన రోజుకు రూ.లక్షన్నర చొప్పున ఎమ్మెల్యేకు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రధాన అనుచరుడు, నగరపాలకసంస్థలో ముఖ్యనేత వసూలు చేసేవాడు. అంతేకాక కుమారి« థియేటర్ ర్యాంపు గురించి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల, నగర ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ సరిహద్దు తమదంటే తమదని వాదులాడుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాతేరుర్యాంపు ఎస్సీ సొసైటీ తరఫున ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా పేరుకు వారిదే అయినా గోరంట్ల అనుచరుడైన కార్పొరేటర్ ర్యాంపును నిర్వహించారు. కడియం మండలంలోని కడియపులంక–వేమగిరి ర్యాంపులో ఉచిత ఇసుక అమలు కావడానికి ముందు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేది. అప్పుడు దాదాపు రూ.2.61 కోట్ల ఇసుక పక్కదారి పట్టినట్లుగా విజిలెన్స్ దాడుల్లో తేలింది. రూరల్ ఎమ్మెల్యే గోరంటకు పోటీగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కూడా ఇసుక దందా మొదలు పెట్టారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గం ధవళేశ్వరం వద్ద తన అనుచరులతో ప్రత్యేకంగా ఇసుక ర్యాంపునే సిద్ధం చేసుకున్నారు. నిత్యం కోట్లాది రూపాయల ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. రోజుకు 300 ట్రక్కుల తవ్వకం రాజోలు: రాజోలు నియోజకవర్గంలో టీడీపీ వారు ‘దొరికినంత తవ్వుకో..అయినకాడికి దోచుకో’ అన్న రీతిలో అక్రమ సంపాదనకు తెరతీశారు. గోదావరి ఇసుక రీచ్‌లను స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పార్టీ కార్యకర్తలకు అప్పగించారు. రాజోలు మండలం సోంపల్లి, మలికిపురం మండలం రామరాజులంక, సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. పేరుకు ఉచితం అయినా రవాణా చార్జీల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక్కో రీచ్ నుంచి రోజుకు దాదాపు 100 ట్రక్కుల ఇసుక తరలిపోతోంది. ప్రభుత్వం చేపట్టిన పనులకు, హౌసింగ్ స్కీంలకు మాత్రమే ఇసుక తరలించాల్సి ఉండగా ఆ ముసుగులో ప్రైవేటు పనులకు కేటాయిస్తున్నారు. వారధికి చేరువలోనే.. అల్లవరం (అమలాపురం): అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు యథేచ్ఛగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. మూడేళ్ల క్రితం మూసివేసిన ఇసుక ర్యాంపును ఎలాంటి అనుమతులు లేకుండానే తెరిచి వందలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. అల్లవరం మండలం బోడసకుర్రు బ్రిడ్జిని ఆనుకుని అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో ఇసుక ర్యాంపు నిర్వహించారు. బ్రిడ్జి సమీపంలో ఇసుక తవ్వకాలు జరపరాదన్న నిబంధనను ఉల్లంఘించారు. పొక్లెయిన్లతో ఇసుక తవ్వడం వల్ల బ్రిడ్జికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిసినా తెలుగు తమ్ముళ్లు ఖాతరు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అక్రమ తవ్వకాలు జోరుగా సాగాయి. -
బోడె ప్రసాద్@కబ్జాల..కాలకేయ!
సాక్షి,అమరావతి : అధికారం అండతో అందినకాడికి దండుకున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగింది. ఇసుక రేవుల నుంచి చెరువుల్లో మట్టిదాకా ప్రతి చోట అవినీతే. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అతని అనుచరులు సాగించిన అక్రమాలు, అరాచకాలు, భూకబ్జాలు,దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. అభివృద్ధి పనులను తూతూ మంత్రంగా చేపట్టి రూ.కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టినా అడిగే నాథుడే లేదు. ప్రతి పనికి పర్సంటేజి విధించి కమీషన్ల దందాకు తెరలేపారు.. బోడె, అతని అనుచరులు కలిసి నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్లు దోచుకున్నారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దొంగ పరీక్ష రాయించిన మేధావి.. ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే విదేశీ పర్యటనకు వెళ్లి డిగ్రీ అర్హత కోసం దూరవిద్యలో పరీక్షకు తాను హాజరు కాకుండా మరో యువకుడితో రాయించిన ఘనత బోడె ప్రసాద్‌ది. వాస్తవానికి ఎమ్మెల్యే పదో తరగతి పాసై పాలిటెక్నిక్ డిస్కంటిన్యూ అయ్యారు. బీటెక్ బిల్డప్‌ను జనాల్లో ఇచ్చారు. అయితే తన విద్యార్హతను పెంచుకునే విషయంలో పరీక్ష రాసే సత్తా లేక దూరవిద్యలో డిగ్రీ చేయాలని సన్నిహిత వర్గాల ద్వారా కసరత్తు చేశారు. ఇందులో భాగంగా అతను విదేశాల్లో ఉన్నా పోరంకిలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో దొంగ పరీక్ష రాయించేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కళాశాలకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చిన యువకుడు పరారయ్యాడు. అయితే పరీక్షకు హాల్ టిక్కెట్ జారీ, పరీక్షకు హాజరైనట్లు సంతకం కూడా ఉంది. అయితే ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించినా జరిగిన వాస్తవాలను చూసిన ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఉచిత ఇసుక..కాసుల వేట.. అనేక ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టింది. తొలుత చోడవరంలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. కూలీలతోనే లోడింగ్ చేయించాలనే నిబంధన ఉన్నా, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ నదీగర్భంలో పొక్లెయిన్లతో ఇసుక తోడి ప్రైవేటు ర్యాంపుల గుండా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు లారీలు, ట్రాక్టర్లలో ఇసుక రవాణా సాగించారు. వేరే వ్యక్తులు క్వారీలోకి వెళ్లి ఉచిత ఇసుకను తీసుకునే అవకాశం లేకుండా అధికార పార్టీ గుత్తాధిపత్యంగా ఇసుక క్వారీలను తమ ఆధీనంలో ఉంచుకుంది. నిత్యం వెయ్యి నుంచి 1600 వరకూ ట్రాక్టర్లలో ఇసుక రవాణా సాగించినట్లు అంచనా. తద్వారా ఎమ్మెల్యే బోడె వర్గం రూ.కోట్లు అక్రమార్జన చేసినట్లు సమాచారం. ‘వసూల్ రాజా’ స్వయంగా ఆయనే ఒక బిల్డర్ అయి ఉండి, బిల్డర్లకు ఉన్న బాధలు మరిచి ఎమ్మెల్యేగా తనకు ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలోని బిల్డర్ల నుంచి రూ.3 కోట్లు అక్రమంగా వసూలు చేశారు. గ్రూప్ హౌస్‌ల నిర్మాణాలు లక్ష్యంగా వసూలు దందా నడిపారు. ఒక్కో ఫ్లాట్‌కి రూ.40 వేలు నుంచి రూ.60 వేలు వసూలు చేశారు. ఓ బిల్డర్ వద్ద ఏకంగా ముక్కుపిండి మరీ రూ.80 లక్షలు వసూలు చేశారు. అభివృద్ధి తన లక్ష్యమని ప్రజల్ని నమ్మిస్తూ వసూలు చేసిన డబ్బుతో గ్రామంలో అభివృద్ధి చేపడతామని ఈ దందా నడిపారు. కృష్ణానదిలో ఇసుక, బుసక తెచ్చి రహదారులు నిర్మించి ఎంతో గొప్పగా తానే అభివృద్ధి చేశానని మభ్యపెట్టారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు సీఆర్డీఏ, పంచాయతీలు, ఇతర శాఖల నిధులు నుంచి రోడ్లు, డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులు జరగాల్సి ఉండగా నిధులు సమీకరించటంలో వైఫల్యం చెందారు. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బిల్డర్ల నుంచి వసూలు చేశానని, తాను సచ్చీలుడనని అభివృద్ధికే తాను డబ్బు వసూలు చేశానని సభలు, సమావేశాలు, బహిరంగ సభల్లో గొప్పగా చెప్పుకోవటం, ప్రజల్ని నమ్మించే యత్నం చేయటం ఈయనకే చెల్లింది. ఇసుక రవాణాలో కమీషన్ల దందా టీడీపీ నేతలు ఇసుకను ప్రధాన ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఇసుకను తవ్వేసి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఉచిత ఇసుక విధానం అర్థమే మార్చేశారు. అడ్డగోలుగా ఇసుక తవ్వేసి కోట్లు గడించారు. దీనిలో కీలక సూత్రధారి అధికార పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఆయన అండ చూసుకుని అతని ముఖ్య అనుచరులు. ఇది బహిరంగ రహస్యమే. అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెనమలూరు మండలం పెద పులిపాక కేంద్రంగా ఉన్న క్వారీలో అమ్మకాలు చేపట్టారు. నిత్యం 400 నుంచి 600 ట్రాక్టర్లు, లారీల్లో ఇక్కడి నుంచి రవాణా సాగించేవి. క్వారీలో లోడింగ్ పనులను మాత్రం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన బినామీల పేరుతో పొక్లెయిన్లను ఏర్పాటు చేయించారనే విమర్శ ఉంది. నిత్యం ఈ క్వారీలో వాహనాల క్యూ ఉండగానే దొడ్డిదారిన 50కు పైగా ట్రాక్టర్లు, లారీలు ఇసుక లోడింగ్ చేయించటం, అధిక ధరకు అమ్ముకునేవారు. తెలంగాణ, గోదావరి జిల్లాలకు సైతం ఇక్కడి నుంచి ఇసుకను రవాణా సాగించారు. లారీ ఇసుక రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకూ అప్పట్లో ధర పలికింది. సుమారు ఏడాదిన్నర పాటు యథేచ్ఛగా ఇసుక అక్రమ లోడింగ్, రవాణా ఇక్కడి నుంచి సాగింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఇసుక అక్రమ వ్యాపారంపై కోర్టుకు వెళ్లారు. దీంతో ఇసుక రవాణా ఆగింది. అక్రమాలకు అండ.. యనమలకుదురు, పెద పులిపాక గ్రామ పంచాయతీల్లో జరిగిన భారీ కుంభకోణాలకు సంబంధించి చర్యలు తీసుకోకుండా బోడె అడ్డుగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. యనమలకుదురులో అక్రమ భవన నిర్మాణ ప్లాన్లు, పారిశుద్ధ్య పనులకు అక్రమంగా సామగ్రి కొనుగోళ్లు ఇలా ఈ పంచాయతీలో రూ.కోటికి పైగా అక్రమాలు జరిగాయి. పెదపులిపాకలో రూ.70 లక్షలు నిధులు దుర్వినియోగం జరిగినా ఇప్పటి వరకూ ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకుండా అటకెక్కించేశారు. యనమలకుదురు గ్రామంలో సుమారు 700 దొంగ ప్లాన్ జారీకి రూ.2 కోట్లు చేతులు మారాయి. దీనిపై విజిలెన్స్ విచారణ జరిగినా వాస్తవాలు మాత్రం వెలుగులోకి రాలేదు. -
పసుపు రాజ్యం..ఇసుక భోజ్యం
సాక్షి కడప : కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. ఇసుక, సుద్ద, మట్టి అక్రమ రవాణాకు అడ్డం కాదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికారం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నారో... లేక ఎలాగోలాగా అడ్డంగానైనా సంపాదించాలని తెగబడ్డారో తెలియదుగానీ ఏకంగా నదులను లూటీ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణమన్నట్లు అన్నిచోట్ల అక్రమాలే పరమావధిగా టీడీపీ నేతలు తెగబడుతున్నారు. జిల్లాలోని ఇసుక ర్యాంపులను సాకుగా చూపి ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా తోడేస్తున్నారు. అనుక్షణం తవ్వకాలతో ఇసుకను సమీప ప్రాంతాలకేగాక గతంలో సరిహద్దు రాష్ట్రాలకు కూడా రవాణా చేశారు. చిత్రావతి, పెన్నా, చెయ్యేరు, బాహుదా, పాపాగ్ని, కుందూ తదితర నదులలో ఉన్న ఇసుకను అంతా తరలించడంతో ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. పైగా ఇసుక కొరత కూడా ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇసుకను తోడేస్తున్న తమ్ముళ్లు తెలుగు తమ్ముళ్లు పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను లోడ్ చేసి పంపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుని ఎంతపడితే అంత అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జమ్మలమడుగుతోపాటు కొండాపురం మండలాల్లోని పలు ప్రాంతాల నుంచి ఏకంగా టిప్పర్ల ద్వారా ఇసుకను బెంగళూరుతోపాటు ఇతర రాష్ట్రాలకు పంపుతూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. అక్కడే కాకుండా అన్నిచోట్ల నదుల్లో ఇసుకను తోడేస్తూ....లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. నది నుంచి ట్రాక్టర్ ఇసుకను బయటికి తెచ్చి సమీప ప్రాంతాలకు రూ. 3 వేలు–5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇసుక పుణ్యమా అని తమ్ముళ్లు లక్షలకు లక్షలు వెనకేసుకున్నారని ఆ పార్టీలోనే చర్చించుకుంటున్నారు. ఎండుతున్న బోర్లు...తాగునీటికి గండం జిల్లాలో ఇసుక పేరుతో తమ్ముళ్లు దోపిడీ చేస్తుండడంతో నదుల్లో ఇసుక లేక భూగర్భ జలాల సమస్య తలెత్తుతోంది. ఏకంగా పెనగలూరు మండలంలోని కోనంతరాజపురం గ్రామ సమీపంలో చెయ్యేరు నదిలో ఇసుక అంతా లూటీ కావడంతో...అక్కడ సీపీడబ్లు్య స్కీముకు సంబంధించి 45 గ్రామాలకు తాగునీరు అందించే పథకం నిలువునా ఎండిపోయింది. అంతేకాదు...తిప్పిరెడ్డిపల్లె, చెరువుకిందపల్లె, జంగంపల్లె, కొండాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో కూడా ఇసుక తవ్వకంతో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. చివరకు రైతులకు సాగుకు అందించే బోర్లు సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. నదులకు తప్పని గర్భశోకం జిల్లాలోని నదీమ తల్లులు గర్భశోకంతో తల్లడిల్లుతున్నాయి. నదుల్లో ఉన్న ఇసుకను లూటీ చేయడంతో.. పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి. పాపాగ్ని, పెన్నా, చిత్రావతి, చెయ్యేరు, బాహుదా, కుందూ నదుల్లో నీటి చెమ్మ లేక కన్నీరు పెడుతున్నాయి. నందిమండలం, చెన్నూరు, తిప్పిరెడ్డిపల్లె, రాజుపాలెం, వేంపల్లె, ఏటూరు, కోమంతరాజపురం, ప్రొద్దుటూరు,దేవగుడిపల్లెలు, దొమ్మర నంద్యాల, లావనూరు, పార్నపల్లె, చెరువుకిందపల్లె, జంగంపల్లె, సుండుపల్లె, సిద్దవటం మండలంలోని పలు పల్లెల్లో ఇసుక నిరంతరాయంగా సరిహద్దులు దాటుతూ వచ్చింది. చెయ్యేరును చెరబట్టారు రాజంపేట: చెయ్యేరులో ఇసుకాసురుల దందా కొనసాగుతోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన చోట కాకుండా మిగిలిన చోట్ల నుంచి ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. చెయ్యేరు యేటి పొడవునా రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాలు ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో విస్తరించి ఉన్న చెయ్యేటిలో ఇసుకను ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఇసుక తోడేసిన ప్రభావం బోర్లపై పడుతుందని, భూగర్భజలాలు అడుగంటిపోతాయని రైఉతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రవాణా వ్యవహారం చెయ్యేటి మూడు మండలాల్లో ప్రస్తుత టీడీపీ నాయకుల కనుసన్నల్లో జరుగుతోంది. పోట్లదుర్తి బ్రదర్స్.. అక్రమాలకు అడ్రస్ ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి, బిస్మిల్లాబాదు, కేజీవీ పల్లె గ్రామాల సమీపంలో ఉన్న పెన్నానదిలోని ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో తొలుత పోట్లదుర్తిలో ఇసుక క్వారీకి అనుమతి తీసుకొని ఇసుకను పోట్లదుర్తి బ్రదర్స్‌గా పేరు పొందిన సీఎం రమేష్, సీఎం సురేష్‌లు తోడేశారు. తర్వాత బిస్మిల్లాబాదు గ్రామ సమీపంలో ఇసుక క్వారీకి అనుమతి తీసుకుని ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు ఆర్జించారు. ప్రస్తుతం కేజీవీ పల్లె గ్రామం నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఈ గ్రామంలో గతంలో రెండు ట్రాక్టర్లు ఉండగా ప్రస్తుతం అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో 30 దాకా ట్రాక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఇసుక ఇష్టారాజ్యంగా తరలిస్తున్నా మైనింగ్, రెవెన్యూ , పోలీసు శాఖ వారు పట్టించుకోకపోవడంతో వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లను తరలిస్తున్నారు. టీడీపీ పాలనలో ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.2000 వసూలు చేస్తున్నారు. ఇసుక నుంచి తైలం తీశారు కడప కార్పొరేషన్: కడపలో గండివాటర్ వర్క్స్, ఓబులంపల్లె ప్రాంతాల నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలించారు. వ్యవసాయానికి ప్రభుత్వం ఇచ్చిన రైతు రథం ట్రాక్టర్లనే టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు వినియోగించడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణా వల్ల రోడ్లన్నీ పూర్తిగా పాడైపోయాయి. అయా మార్గాలలో ఉండే పంట పొలాలు, మామిడి వనాలు ఎర్రటి మట్టితో నిండిపోయాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో తాగు నీటిని సరఫరా చేసే బోర్లు, రైతుల బోర్లు ఇసుకాసురుల ధాటికి పూర్తిగా ఎండిపోయాయి. ఇసుక అక్రమ రవాణాతో తాగునీటి ఎద్దడి ఇసుకను ఇష్టం వచ్చినట్లు నదుల నుంచి తోడేయడం వల్ల కడపలోని గండి, లింగంపల్లి వాటర్ వర్క్స్‌ల వద్ద ఈ వేసవిలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. గండి వద్ద కడపకు నీటిని సరఫరా చేసే బోరు బావుల వద్ద ఇసుక శాతం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో బోరుబావులు ఒక పక్కకు ఒరిగిపోతున్నాయి. కడపకు తాగునీటి ఎద్దడి తలెత్తడంతో అలగూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ప్రతిరోజూ 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు కుందూనది ద్వారా పెన్నాలోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే నదుల్లో ఇసుక మాఫియా తవ్విన లోతైన గోతుల వల్ల ఆ నీరు 20 రోజులవుతున్నా ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్దకు కూడా చేరని పరిస్థితి ఏర్పడింది. స్పందించని అధికార యంత్రాంగం ఐదేళ్లుగా ప్రతిరోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మిన్నకుండి చూసింది తప్పితే అక్రమార్కులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అదును దొరికినప్పుడల్లా రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇసుకను తరలించారు. ఇక్కడి నుంచి తరలిస్తున్న ఇసుక జిల్లా సరిహద్దులు దాటి పోతోంది. ట్రాక్టర్ ఇసుక రూ.3వేలు చొప్పున ప్రతిరోజూ 200 ట్రిప్పులు తోలినా రూ.6లక్షలు సంపాదించవచ్చు. ఈ లెక్కన 20రోజులు తోలితే చాలు కోటి రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ఇసుక తవ్వకాల వల్ల నదులు గుల్ల కావడంతోపాటు ఈ ప్రాంతా ల్లో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. ఇసుక దోపిడీ కమలాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థికి స్వయానా సోదరులు వల్లూరు మండలంలోని జంగంపల్లె సమీపంలో పాపాగ్ని నది నుంచి ఇసుకను తరలిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుక ఇక్కడి నుంచి తరలుతోంది. పాపాగ్ని నది నుంచి పెండ్లిమర్రి మండలం నందిమండలం సమీపంలో , కమలాపురం మండలంలోని సముద్రంపల్లె వద్ద నుంచి, వీరపునాయునిపల్లె మండలంలోని అనిమెల సమీపం నుంచి, వల్లూరు మండలంలోని చెరువుకిందిపల్లె సమీపం నుంచి అక్రమంగా ఇసుక తరలుతోంది. ఇసుక మేటలు తరిగిపోయి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో వ్యవసాయ , తాగు నీటి బోర్లు ఎండిపోతున్నాయి. వల్లూరు మంత్రి ఇలాఖా నుంచే ఇసుక సరఫరా ప్రొద్దుటూరు :మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గం నుంచే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇసుక సరఫరా అవుతోంది. ప్రొద్దుటూరు ప్రాంతంలో ఇసుక క్వారీలకు అనుమతి ఇవ్వకపోగా జమ్మలమడుగు మండలంలోని సుగుమంచిపల్లె, సున్నపురాళ్లపల్లె, దేవగుడి గ్రామాల్లోని ఇసుక క్వారీల నుంచి ఇసుక సరఫరా చేస్తున్నారు. ప్రొద్దుటూరు ప్రాంతంలో ఇసుక క్వారీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నా మంత్రి ఒత్తిడి కారణంగా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్వయంగా కలెక్టర్ హరికిరణ్‌తో, జెడ్పీ సమావేశాల్లో చర్చించారు. చివరగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఇసుక క్వారీ మాత్రం మంజూరు కాలేదు. రోజూ ఉదయాన్నే కొన్ని వందల ట్రాక్టర్ల ఇసుక జమ్మలమడుగు పరిధిలోని ఇసుక క్వారీల నుంచి ప్రొద్దుటూరుకు ఇసుక సరఫరా అవుతోంది. పెద్దశెట్టిపల్లె, శంకరాపురం ప్రాంతాల నుంచి లారీలతో అధికార పార్టీ నేతలు ఇసుకను తరలిస్తుండగా గతంలో అధికారులు పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రొద్దుటూరు ట్రాక్టర్ల యజమానులను జమ్మలమడుగు ఇసుక క్వారీకి రాకుండా అడ్డుకట్ట వేశారు. తాము మాత్రమే ఇసుకను సరఫరా చేస్తామని బయటి ట్రాక్టర్లు రావద్దని జమ్మలమడుగు నేతలు నిబంధనలు విధించారు. ఇసుకకు డిమాండ్ పెరిగింది స్థానికంగా ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. ట్రాక్టర్ ఇసుక రూ.2వేలు అమ్ముతున్నారు. ప్రొద్దుటూరులో ఇసుక దొరికినప్పుడు రూ.1000 లోపే వచ్చేది. – యనమల రామసుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు. పెన్నాను తవ్వేసుకున్నారు జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు మండలంలోని పొన్నతోట, అంబవరం, దేవగుడి, సుగుమంచిపల్లి, సున్నపురాళ్లపల్లి, మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల, కొండాపురం మండలంలోని ఏటూరు ప్రాంతంలో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. ఇదే అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మారింది. దేవగుడి పరిసర గ్రామాల్లోనే అధికంగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అంబవరం ఇసుక రీచ్‌లను అధికారులు సూచించిన క్యూబిక్ మీటర్ కంటే ఎక్కువగా తవ్వుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మోరగుడి గ్రామ సమీపంలో ఇసుక రీచ్ లేకపోయినా స్థానిక అధికార పార్టీ నాయకులు గేట్ పేరుతో ట్రాక్టర్‌కు రెండు వందల రూపాయలు వసూలు చేస్తూ ఆదాయం గడిస్తున్నారు. కొండాపురం మండలంలో టీడీపీ నాయకులు మరింతగా రెచ్చిపోయి పొక్లెయిన్లు పెట్టి టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో పెన్నానది ఇసుకను ఇతర జిల్లాలతోపాటు తెలంగాణ, కర్నాటక ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటూ లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. మాఫియాకు మైనింగ్ అధికారుల వత్తాసు.. పెన్నానది బ్రిడ్జి కింద ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టడం వల్ల బ్రిడ్జి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మైనింగ్ అధికారులు నియోజవర్గంలో ఉన్నా ఎక్కడా దాడులు చేసిన దాఖలాలు లేవు. – పాలూరు నరసింహులు, జమ్మలమడుగు భవిష్యత్తు ప్రమాదమే.. పెన్నానదిలో ఇసుకను పూర్తిగా తరలించుకెళుతున్నారు. ఇలాగే అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయి తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. –శివకుమార్, యువజన సంఘం నాయకుడు. -
ఓటేస్తే.. తోడేశారు!
సాక్షి, శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం పరిధిలో ఇసుక వ్యాపారం తారస్థాయికి చేరుకుంది. టీడీపీ నాయకుల కనుసైగల్లోనే ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా బట్టేరు, కరజాడ, బైరి, పొన్నాం పరిసర ప్రాంతాల్లో గల టీడీపీ నాయకులతో పాటు జన్మభూమి కమిటీ సభ్యులంతా కలిసి ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఇప్పటికే నదీ పరి వాహక ప్రాంతాల్లో ఇసుక పూర్తిగా తవ్వేసి వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుక వ్యాపారం చేసేందుకు గాను ఒ క్కో లారీ నుంచి రూ. 15వేల నుంచి రూ.20వేలు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. కొద్ది రోజుల కిందట విశాఖ అవసరాల కోసం పొన్నాం పరిసర ప్రాంతాల్లో మైన్స్ అధికారులు అధికారికంగా ఇసుక ర్యాంప్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనికిగాను బ్లూఫ్రాగ్ సంస్థతో జియోటాగింగ్ చేసి లారీలకు అనుసంధానం చేస్తూ ఇసుకను తరలిస్తున్నారు. అయితే ఈ ఇసుక అనుమతుల వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన బడానేతల ప్రమేయం ఉండడంతో నిబంధనలకు విరుద్ధంగా రాత్రింబవళ్లు ఇసుకను ఇష్టానుసారంగా తోడేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేద న్న ఆరోపణలు కుడా వెల్లువెత్తుతున్నాయి. దాడులు.. బైరి, కరజాడ పరిసర ప్రాంతంలో అక్రమంగా ఇసుకను డంపింగ్ చేస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం రాత్రి 11 ఇసుక లారీలను శ్రీకాకుళం శాండ్ మొబైల్ టీమ్ పట్టుకుంది. ఇందులో కేవలం ఎనిమిది లారీలను మాత్రమే రూరల్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించి మిగతా మూడు లారీల వద్ద భారీ మోతాదుల్లో కమీషన్లు తీసుకుంటూ వదిలేసినట్లు బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇసుక దోపిడీని అరికట్టాలి మండలంలో ఇసుక దోపిడీని అరికట్టాలి. జన్మభూమి కమిటీ సభ్యులు ఉచిత ఇసుక పేరిట దోపిడీకి పాల్పడుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయాలి. ఎక్కువగా బట్టేరు, కరజాడ, బైరి, పొన్నాం ప్రాంతంలోనే ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. – మూకళ్ల జయానంద్, శ్రీకాకుళం కోర్టుకు వెళ్తా.. ప్రభుత్వం తరఫున భూగర్భ పైపుల పనుల పనుల కోసం ఇసుక కావాలంటూ మూడు నెలల కిం దట అప్పట్లో పనిచేసిన కలెక్టర్‌కు శ్రీకాకుళం రూరల్ మండలానికి చెందిన బోర లక్ష్మీనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. అయితే బ్లూఫ్రాగ్ సంస్థ ఉచితంగా ఇసుక ఇచ్చేందుకు నిరాకరించింది. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ చేసినందుకు గాను అక్రమంగా ఇసుకను అమ్ముతున్నందుకు గాను ఆయన కోర్డును ఆశ్రయించనున్నారు. -
ధూళిపాళ్ల సోదరుడిపై మత్య్సకారుల ఆగ్రహం
-
పెన్నమ్మకు గర్భశోకం
ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఒకటిరెండు కాదు నిత్యం వందలసంఖ్యల ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతోంది. ఇసుక మాఫియాఆగడాలకు పెన్నమ్మ గర్భశోకంతోఅల్లాడుతోంది. ఒంటినిండాగాయాలతో తల్లడిల్లిపోతోంది.ఇంత జరుగుతున్నా అధికారులుఅటువైపు కన్నెత్తి చూడకపోవడంఆందోళన కలిగిస్తోంది. కడప కార్పొరేషన్: కడప నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఓబులంపల్లి సమీపంలో, అదీ గండివాటర్ వర్క్స్ వద్ద ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఇసుక మాఫియా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో ఇసుకను అడ్డదారిలో సరిహద్దులు దాటిస్తోంది. ఇసుక తవ్వకాలతో తాగునీటి పథకాలకు ముప్పు తప్పదని పర్యావరణ వేత్తలు మొత్తుకుంటున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. న్యాయస్థానాలు ఇది పర్యావరణానికి చేటు, భూగర్భ జలాలు అడుగంటి పోతాయని హెచ్చరిస్తున్నా ఇసుకాసురుల ఆట కట్టించడంలో అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. కడప నగరానికి ప్రధాన తాగునీటి వనరు అయిన గండి వాటర్ వర్క్స్‌కు మూడున్నర కిలోమీటర్ల వరకూ ఇసుక తవ్వకాలు జరపకూడదని కోర్టు స్టే ఇచ్చింది. న్యాయస్థానం ఉత్తర్వులను కూడా కాదని చెన్నూరు తహసీల్దార్ టీడీపీ నాయకులు ఎవరు సిఫారసు చేస్తే వారికి అనుమతులు ఇచ్చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ తహసీల్దార్ అనుమతి ఇచ్చిన మేరకే ఇసుక తవ్వుతున్నారా... అంటే అదీ లేదు. ఓబులంపల్లెలోని శివుని గుడికి పోయే మార్గం ద్వారా నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుక తరలిపోతోంది. ఇసుక అక్రమ రవాణా వల్ల రోడ్డంతా పాడైపోయింది, ఈ మార్గంలో ఉండే పంట పొలాలు, మామిడి వనాలు ఎర్రటి మట్టితో నిండిపోయాయి. ఈ ప్రాంతంలో ఓబులంపల్లె దాని చుట్టు పక్కల ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే బోర్లు పదిదాకా ఉన్నాయి. వీటితోపాటు రైతుల బోర్లు కూడా పెన్నాలో ఉన్నాయి. ఇసుక రవాణా వల్ల అవన్నీ ఎండిపోయే పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు గండి వద్ద కడపకు నీటిని సరఫరా చేసే బోరు బావుల వద్ద ఇసుక పూర్తిగా లేకుండా పోయింది. దీంతో బోరుబావులు ఒక పక్కకు ఒరిగిపోతున్నాయి. స్పందించని అధికార యంత్రాంగం ప్రతిరోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మిన్నకుండి చూస్తోంది. తప్పితే అక్రమార్కులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నెలరోజులుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా యాభై మంది కూలీలతో ఇసుక లోడ్ చేయిస్తున్నారు. ఇక్కడి నుంచి తరలిస్తున్న ఇసుక జిల్లా సరిహద్దులు దాటి పోతోంది. వివిధ కారణాలతో పోలీసులు దీనిపై దృష్టి సారించకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇసుక తవ్వకాల వల్ల పెన్నానది గుల్లవడంతోపాటు ఈ ప్రాంతాల్లో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో మూడున్నర కిలోమీటర్ల పరిధిలో ఇసుక తవ్వరాదని ఆదేశాలిచ్చింది. వీటన్నింటినీ పట్టించుకోకుండా తహసీల్దార్ మొండిగా ముందుకెళ్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. -
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వీఆర్వో
-
అఖిలేశ్ మెడకు మైనింగ్ కేసు!
న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ సీబీఐ విచారణ ఎదుర్కొనే చాన్సుంది. ఈ మేరకు నమోదైన కేసు వివరాల్ని సీబీఐ వెల్లడించింది. ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, ఎస్పీ ఎమ్మెల్సీ రమేశ్ కుమార్ మిశ్రా, బీఎస్పీ నాయకుడు సంజయ్ దీక్షిత్ సహా మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి శనివారం సీబీఐ అధికారులు.. యూపీ, ఢిల్లీలో నిందితులకు చెందిన 14 చోట్ల సోదాలు నిర్వహించారు. 2012–16 మధ్య కాలంలో హమీర్పూర్ జిల్లాలో ఇసుక, కంకర లాంటి ఖనిజాల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయన్నది తాజా కేసులో ప్రధాన ఆరోపణ. 2012–17 మధ్య కాలంలో నాటి సీఎం అఖిలేశ్ 2012–13లో గనుల శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అందుకే ఆయన పాత్రపై సీబీఐ దృష్టిసారించే వీలుంది. అక్రమంగా కాంట్రాక్టులిచ్చారు.. 2012–14 మధ్య కాలంలో హమీర్పూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన చంద్రకళ ఈ–టెండర్ నిబంధనల్ని ఉల్లంఘించి కాంట్రాక్టులు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది. ఆమె అక్రమంగా కొత్త అనుమతులిచ్చారని, పాత వాటిని పునరుద్ధరించారని పేర్కొంది. అక్రమ మైనింగ్‌కు అనుమతిచ్చిన చంద్రకళ, ఇతర అధికారులు.. గుత్తేదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన చంద్రకళ 2008లో ఐఏఎస్‌కు ఎంపికై, యూపీ కేడర్ అధికారిగా నియమితులయ్యారు. -
కలెక్టర్ల భేటీలో కాగ్నా వివాదానికి తెర!
బషీరాబాద్: కాగ్నా నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాద్గిరా– పోతంగల్ దగ్గర కాగ్నా నదిలో కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఇసుక తవ్వకాలు గురువారం వివాదాస్పదమైన సంగతి విదితమే. సరిహద్దుల విషయంలో బషీరాబాద్ చించొళ్లీ రెవెన్యూ, పోలీసుల మధ్య వాగ్వాదాలతో సమస్య మరింత జఠిలమవ్వడంతో, చివరకు వికారాబాద్, గుల్బర్గా జిల్లాల కలెకర్లు ఉమర్ జలీల్, జి. వెంకటేశ్ కుమార్ రంగంలోకి దిగారు. శుక్రవారం వివాదాస్పద కాగ్నా నదిలో ఇరువురు జిల్లా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఇరురాష్ట్రాల సరిహద్దు నక్షలు, భూ రికార్డులను పరిశీలించారు. అయితే రెండు రాష్ట్రాల నక్షల ప్రకారం తమకంటే తమకే ఎక్కువ వాటాలు వస్తాయని ఏడీఎస్ఎల్ఆర్ అధికారులు తెలిపారు. వీటితో సమస్య పరిష్కారం కాదని భావించిన ఇద్దరు కలెక్టర్లు రాజీ మార్గంగా ఉమ్మడి సర్వే చేయించి నదిలో సమాన భూ భాగం పంచుకోవడానికి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. నదికి ఇరువైపులా ఉన్న రైతుల పట్టాభూముల బౌండరీలను గుర్తించి, మిగిలిన నదీ భాగంలో రెండు సమాన భాగాలుగా పంచుకోవాలని నిర్ణయించారు. వెంటనే కలెక్టర్లు, నదిలో కర్ణాటక అధికారులు పాతిన హద్దురాళ్లు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉండాలన్నారు. రెండు రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు ఎక్కడ ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకుంటామని సంయుక్తంగా ప్రకటించారు. నదీ భూ భాగంలో ఇరు ప్రభుత్వాలకు సమాన వాటా తీసుకోవడానికి అంగీకరించామని, ఇక సరిహద్దు సమస్య ఏమీ ఉండదన్నారు. నీళ్లపల్లి దగ్గర అటవీ భూమికి చెందిన సరిహద్దు సమస్యను కూడా త్వరలో తేలుస్తామని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 10 నుంచి 30 మీటర్లు చొచ్చుకొచ్చిన కన్నడిగులు... కాగ్నాలో రెండు జిల్లాల సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్లు నరహరిరావు, జిదగేధర్ ఆధ్వర్యంలో డీజీపీఎస్ శాటిలైట్ సర్వేచేశారు. నదికి ఇరువైపుల ఉన్న కాద్గిరా – పోతంగల్ గ్రామాల రైతుల పట్టా భూముల హద్దులను గుర్తించారు. మిగిలిన నదీ భాగంలో సర్వే చేయగా కర్ణాటక అధికారులు కిలోమీటరు పొడవులో 10 నుంచి 30 మీటర్ల మేర తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు బహిర్గతమైంది. దీంట్లో కొంత మేర తెలంగాణ నదీభాగంలో కన్నడిగులు ఇసుక తవ్వకాలు చేసినట్లు గుర్తించారు. నదికి ఇరువైపులా ఉన్న హద్దులతో రెండు రాష్ట్రాలకు సమాన భాగాలను గుర్తించి హద్దురాళ్లు పాతారు. కార్యక్రమంలో సేడం రెవెన్యూ అసిస్టెంట్ కమిషనర్ బి.సుశీల, గుల్బర్గా ట్రైనీ కలెక్టర్ సుధర్ స్నేహల్‌లొకండే, తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, మైన్స్ అధికారులు రేణుకాదేవి, రవికుమార్, జియాలజిస్ట్ రామారావు, చించొళ్లీ, బషీరాబాద్ తహసీల్దార్లు పండిత్ బీరాధర్, ఉమామహేశ్వరి, డీఎస్పీలు రామచంద్రుడు, బస్వరాజు రెవెన్యూ, మైన్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇసుక తవ్వకాలపై మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇసుక తవ్వకాలకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 2016లో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు తోడుగా నదీపరీవాహక ప్రాంతాల్లో తవ్వకాలకు సంబంధించి మహారాష్ట్ర కేసులో తాము ఇచ్చిన ఆదేశాలే అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ రాఘవేంద్ర రాథోర్ బెంచ్ పేర్కొంది. ‘నదీ పరీవాహక ప్రాంతాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలకు సంబంధించి ముందస్తు అనుమతి తప్పనిసరి. మైనింగ్ విలువను బట్టి 25 శాతం వ్యయాన్ని ఆ ప్రాంతంలో జీవావరణాన్ని పెంచడానికి వసూలు చేసేలా నిబంధనలు ఉండాలి. అక్రమ తవ్వకాలు జరిపితే దాని వ్యయం సహా పర్యావరణానికి ఎంతమేర నష్టం కలిగిందో అంచనా వేసి నష్టపరిహారాన్ని వసూలు చేయాలి. ఇప్పటివరకు ఇచ్చిన మైనింగ్ అనుమతులకు హద్దులు ధ్రువీకరించి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. తవ్వకాలకు సంబంధించి ఏటా ఒక థర్డ్ పార్టీ ద్వారా ఆడిట్ చేయించి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి’అని ఎన్జీటీ తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. మైనింగ్లను నిరంతరం పర్యవేక్షించేందుకు శాశ్వతవ్యవస్థను రూపొందించుకోవాలని సూచించింది. పూడికతీతపేరుతో తెలుగు రాష్ట్రాల్లో అక్ర మ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ గతంలోనే ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఏర్పాటైన కమిటీ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించిందని చెప్పారు. ఇసుక తవ్వకాలపై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ కేసు విచారణను ట్రిబ్యునల్ ముగించింది. -
ఇసుక అక్రమ రవాణాపై దాడులు
ప్రొద్దుటూరు క్రైం : ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. స్వయంగా డీఎస్పీ దాడులు నిర్వహించారు. డీఎస్పీ ఎప్పుడు బయటికి వెళ్లినా గన్‌మెన్ ఉంటారు. ప్రభుత్వం కేటాయించిన వాహనంలోనే ఆయన ఎక్కడికైనా వెళ్తారు. అయితే ప్రొద్దుటూరు డీఎస్పీ మాత్రం మంకీ క్యాప్ ధరించి, బైక్‌పై వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. శనివారం వేకువజామున పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో డీఎస్పీ శ్రీనివాసరావు దాడులు నిర్వహించారు. మంకీ క్యాప్ ధరించి బైక్‌లో పెన్నా నదికి వెళ్లే రహదారి వద్దకు వెళ్లారు. పెన్నా నదిలో కొన్ని ట్రాక్టర్లకు ఇసుకను నింపుకుంటూ ఉండగా పోలీసుల రాకను గమనించడానికి కొందరు ఫైలెట్లు బైపాస్ రోడ్డులో నిల్చున్నారు. డీఎస్పీ నేరుగా వారి వద్దకు వెళ్లి బైక్ ఆపారు. అయితే మంకీ క్యాప్ పెట్టుకొని ఉండడంతో వారు డీఎస్పీని గుర్తు పట్టలేదు. అక్కడే 15 నిమిషాల పాటు నిల్చొని ఉండి డీఎస్పీ వారి సంభాషణలు విన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఏమైనా ఉందేమోనని ఆరా తీశారు. తర్వాత మంకీ క్యాప్‌ను తొలగించి అక్కడున్న ఫైలెట్లను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీని చూసి ట్రాక్టర్ల డ్రైవర్లు పరారయ్యారు. అయితే ఒక ఇసుక ట్రాక్టర్ డ్రైవర్‌ను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. కఠిన చర్యలు పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. రోజూ ఇసుక రవాణా చేస్తున్న వారిని గుర్తించి బైండోవర్ చేయాలని వన్‌టౌన్ సీఐ రామలింగరాజును ఆదేశించారు. డీఎస్పీ స్వయంగా దాడులకు పూనుకోవడంతో ఇసుకాసురుల్లో వణుకు పుడుతోంది. ఇసుక రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిని వన్‌టౌన్‌కు పిలిపించి డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇకపై ఇలా జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. -
ఇసుక దందా
ఎన్నికల సమయం అక్రమార్కులకు కలిసి వస్తోంది. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఎలక్షన్ విధుల్లో తలమునకలై ఉండగా.. ఈ పరిస్థితులను ఇసుకాసురులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వర్షాకాలంలో కాస్త తగ్గిన ఇసుక అక్రమ రవాణా ప్రస్తుతం మళ్లీ పెరిగింది. ఇదే అదనుగా నకిలీ నంబర్ ప్లేట్లతో ఇసుకను కొల్లగొడుతున్నారు. నెలరోజుల వ్యవధిలో జీరో బిల్లింగ్ ద్వారా 10, నకిలీ నంబర్ ప్లేట్లతో ఇసుక తరలిస్తున్న 22 లారీలు పట్టుబడడం ఇందుకు నిదర్శనం. సాక్షి, కాటారం : మహదేవపూర్, కాటారం మండలంలోని క్వారీల ద్వారా పలువురు లారీల యజమానులు, వ్యాపారులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గతంలో అడపాదడపాగా కొనసాగినమీ దం దా ప్రస్తుతం పెరిగిపోయింది. రోజుకు 5 నుంచి 10 లారీల వరకు వేబిల్లులు లేకుండా, నకిలీ నం బర్ల ప్లేట్లతో ఇసుకను తరలిస్తున్నాయి. ఈ జీరో దందాకు పలు ఇసుక క్వారీల నిర్వాహకులతోపాటు టీఎస్ఎండీసీకి చెందిన పలువురు సిబ్బంది, స్థానికులు సహకరిస్తున్నట్లు సమాచారం. కేవలం లారీల ద్వారానే కాకుండా గోదావరి, మానేరు నదుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చి ఒక చోట డంప్ చేసి వే బిల్లులు లేకుండా లారీల ద్వారా పట్టణాలకు తరలిస్తున్నారు. జీరో దందా ఇలా.. కాటారం మండలంలో 4 ఇసుక రీచ్‌లు, మహదేవపూర్ మండలంలో 23 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ తదితర నగరాలకు ఇసుక రవాణా అవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న ఇసుక రీచ్‌లలో సుమారు 18కి పైగా వాటిలో జీరో దందా కొనసాగుతున్న ట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు రోజు వారీ ఇసుక వివరాలకు అనుగుణంగా టీఎస్ఎండీసీ సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి. యజ మానులు తీసిన డీడీని సదరు క్వారీల వద్ద ఉండే టీఎస్ఎండీసీ సిబ్బంది, క్వారీ నిర్వాహకులు చెక్ చేసి ఇసుక లోడింగ్‌కు అనుమతించాలి. అయితే పలు క్వారీల వద్ద ఇలాంటి నిబంధనలు కానరావడం లేదు. టీఎస్ఎండీసీ సిబ్బంది కమీషన్లకు కక్కుర్తిపడి వే బిల్లులు లేకుండానే ఇసుక రవా ణాకు అనుమతిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. దాడులతో రూటు మార్చిన అక్రమార్కులు.. ఇటీవల కాలంలో పోలీసుల దాడులు ఎక్కువ కావడంతో అక్రమ రవాణాదారులు మరో దందాకు తెరలేపారు. నకిలీ నంబర్ ప్లేట్లను సృష్టించి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నా రు. ఇసుక నిల్వలకు సబంబంధించి టీఎస్ఎండీసీ అధికారులు రోజు వారీగా వివరాలను ఆన్లైన్ చేయడానికి కొంత సమయం కేటాయిస్తారు. సమయం తక్కువగా ఉండడంతో ఆన్లైన్ బుకింగ్ కష్టతరంగా మారిపోయింది. దీంతో కొందరు ఆన్లైన్లో ఏదో ఒక లారీ నంబర్‌పై ఇసుక బుకింగ్ చేసి మరో లారీకి అమ్ముకుంటున్నారు. ఆన్లైన్లో బుక్‌చేసిన నంబర్‌తో డీడీ తీసి లారీ అదే నంబర్ ప్లేట్ వేసి ఇసుక తరలిస్తున్నారు. ఇలా రోజుకు అనేక లారీలు ఈ ప్రాంతం నుంచి పట్టణాలకు తరలివెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సిబ్బంది కనుసన్నల్లోనే అ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా అక్రమ రవాణా పొరుగు జిల్లాలో తవ్వకం.. మన జిల్లా మీదుగా తరలింపు అదనపు లోడు.. వేబిల్లులు లేకుండా.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పోలీసుల తనిఖీల్లో బయటపడిన వైనం పట్టించుకోని సంబంధిత అధికారులు మంగపేట పోలీసులు పట్టుకున్న ఇసుక లారీలు భద్రాద్రి జిల్లాలో తవ్వకాలు చేపట్టిన ఇసుకను మన జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్నారు. మంగపేట మండలానికి పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వీరాపురం, సాంబాయిగూడెం గోదావరి ఇసుక క్వారీల నుంచి లారీల్లో అధిక లోడుతో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న విషయం పోలీసుల తనిఖీల్లో బయటపడింది. రాత్రి సమయాల్లో నిత్యం వందల లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా సంబంధిత మినరల్స్ అండ్ మైనింగ్ అధికారులు పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తొంది. రాత్రి.. పగలు.. మంగపేట మండలం మీదుగా రాత్రి.. పగలు తేడా లేకుండా ఇసుక లారీల రద్దీ తీవ్రంగా పెరిగింది. సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారే వరకు రవాణా జరుగుతోంది. రాత్రి సమయంలో రవాణా అయ్యే ఇసుక లారీలకు వే బిల్లులు ఉండడంలేదు. పగటి వేళల్లో అదనపు లోడుతో తరలిస్తున్నారు. విషయం బయటకకు రాకుండా ఉండేందుకు పలు వేబ్రిడ్జీల నిర్వాహకులను మచ్చిక చేసుకుని అదనంగా ఉన్న లోడును తగ్గించి రిసిప్టు తీసుకుంటున్నట్లు సమాచారం. చెక్‌పోస్ట్‌ల్లో అధికారులు తనిఖీలు చేసిన సందర్భంలో రిసిప్టులు చూపించి తప్పించుకుంటున్నారు. అదనపు లోడు ఇసుకను అనువైన ప్రాంతాల్లో డంపు చేసి అమ్ముకుంటున్నట్లు తెలిసింది. లీజు పేరుతో అక్రమ దందా.. పేరుకు ఇతర జిల్లాకు చెందిన క్వారీలని చెబుతున్నప్పటికీ మంగపేట మండలం పరిధి కిందకు వచ్చే ప్రాంతంలోని ఇసుకను కొల్లగొడుతున్నారని కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి జిల్లా పినపాక మండలం దుగినేపల్లి పంచాయతీ పరిధిలోని వీరాపురం గిరిజన సొసైటీకి చెందిన ఇసుక క్వారీతోపాటు, మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరిధిలోని సాంబా యిగూడెం ఇసుక క్వారీలను హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నట్లు సమాచారం. వారు రాజకీయ నాయకుల అండతో అక్రమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్వారీల నుంచి అదనపు లోడుతో తరలిస్తున్న వ్యవహారం బయటకు తెలియకుండా ఉండడటానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. క్వారీల వైపు ఎవరుకూడా రాకుండా కొందరిని నిరంతరం కాపాల పెట్టి వారికి నెలనెలా రూ.20 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు ఇసుక క్వారీ ప్రాంతంలోని గోదావరిలో స్నానానికి వెళ్లి సెల్ఫీలు దిగుతుండగా వారి నుంచి సెల్ఫోన్లు లాక్కుని ఇటువైపు రావద్దని హెచ్చరించినట్లు సమాచారం. కిరాయి మూకల చర్యలతో క్వారీలకు సమీపంలో ఉన్న దుగినేపల్లి, టీకొత్తగూడెం, అకినేపల్లిమల్లారం గ్రామాల ప్రజలు అటువైపు వెళ్లడానికి జంకుతున్నారు. 10 లారీలపై కేసు నమోదు ఇసుక అక్రమ రవాణా వ్యవహారం గతనెల 3వ తేదీ రాత్రి తనిఖీల్లో బయట పడింది. స్థానిక ఎస్సై వెంకటేశ్వర్రావు మంగపేట వద్ద ఏటూరునాగారం–బూర్గంపాడ్ ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ సమయంలో ఇసుకను తరలిస్తున్న లారీలకు సరైన వే బిల్లులు లేకపోవడాన్ని గమనించారు. అనుమానం వచ్చిన పోలీసులు కమలాపురం వేబ్రిడ్జ్కు తరలించి కాంటా వేయిస్తే ఒక్కొ లారీకి 3 నుంచి 5 టన్నుల వరకు అదనపు ఇసుక తరలిస్తున్న విషయం బయటపడింది. దీంతో 10 లారీలపై కేసులు నమోదు చేశారు. -
ఏకకాలంలో 100 చోట్ల ఐటీ దాడులు
సాక్షి, విశాఖపట్నం : ఇసుక మాఫియాపై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు. బీచ్‌ల్లోని ఇసుకను విదేశాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని నాలుగు ఇసుక మైనింగ్ కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ కంపెనీలకు చెందిన 100 చోట్ల గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు చేశారు. తమిళనాడుకు చెందిన వైకుందరాజన్ (న్యూస్ 7 తమిళ్ అధిపతి) వీవీ మినరల్ కంపెనీ, సుకుమార్, చంద్రేశన్, మణికందన్‌కు చెందిన కంపెనీలపై దాడులు చేసినట్టుగా సమాచారం. సముద్ర ఖనిజమైన ఇసుకను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న ఇంటలిజన్స్ వర్గాల సమాచారంతో ఈ దాడులు చేశామని అధికారులు వెల్లడించారు. దువ్వాడలో.. విశాఖలోని ‘ట్రాన్స్ వరల్డ్ గార్నెట్ ఇండియా’ అనే ఎక్స్‌పోర్టు కంపెనీపై కూడా గురువారం తెల్లవారుజామున ఐటీ అధికారులు దాడులు చేశారు. విశాఖ సెజ్‌లో సోదాలు చేసేందుకు ఐటీ అధికారులు దువ్వాడకు ఉదయం 4.30కి చేరుకున్నారు. అయితే, సెజ్‌కు ఆవల ఉన్న ‘ట్రాన్స్ వరల్డ్ గార్నెట్ ఇండియా’ కంపెనీకి అక్రమాలకు పాల్పడుతోందని సమాచారం అందింది. ఈ కంపెనీ శ్రీకాకుళం నుంచి వేల టన్నుల ఇసుక దిగుమతి చేసుకుని కంటెయినర్లలో అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తుందని ఫిర్యాదు అందడంతో కంపెనీపై దాడులు నిర్వహించామిన ఐటీ అధికారులు తెలిపారు. -
చేబ్రోలు ప్రమాదానికి మట్టి మాఫియానే కారణం
-
నోటి మాట... దోపిడీ బాట
ఆ మధ్య సఖినేటిపల్లి బాడిరేవులో అనధికారికంగా ఇసుక ర్యాంపును ప్రారంభించారు. యూనిట్ ఇసుకను రూ.1500 నుంచి 2వేల వరకు విక్రయించారు. రోజుకు 200 నుంచి 300 ట్రాక్టర్లు ద్వారా ఇసుకను తరలించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు నిలదీస్తే కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో ర్యాంపు నడుపుతున్నట్టు రెవెన్యూ అధికారులు సెలవిచ్చారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఇసుక అక్రమాలకు అధికా రులే తెరలేపుతున్నారా? అడ్డగోలు సంపాదనకు అధికారులే రాచబాట వేస్తున్నారా? ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ ప్రకారం అధికారులు నడుచుకుంటున్నారా? తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారా? మౌఖికం పేరుతో ఇసుకను అడ్డగోలుగా తరలించేస్తున్నారా? జిల్లాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. జిల్లాలో అనేక చోట్ల అనధికారికంగా గోదావరిని గుల్ల చేసేస్తున్నా రు. కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ మౌఖిక ఆదేశాలని చెప్పి ఇసుకను మింగేస్తున్నారన్న విమర్శలున్నాయి. సఖినేటిపల్లి బాడుగ, బోడసకుర్రు, వెదుళ్లపల్లి...ఇలా ఎక్కడ చూసినా అధికార పార్టీ నాయకుల అండదండలతో అక్రమాలు జరిగిపోతున్నాయి. నేతలు సూ త్రధారులుగా, అధికారులు పాత్రధారులై ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. అభివృద్ధి పనులకు, గృహ అవసరాలకోసమని ఇసుకను తోడేస్తున్నారు. నిజంగా అవసరమైతే పర్యావరణ ఇబ్బందుల్లేని చోట అధికారిక ఉత్తర్వులతో ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేయాలి. కానీ, అవసరాల ముసుగులో అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చడం కోసం మౌఖిక ఆదేశాల పేరుతో ఇష్టారీతిన ర్యాంపులు నడుపుతున్నారు. ఎక్కడా లేని విధంగా జిల్లాలో ఇప్పుడు మౌఖిక ఆదేశాల ట్రెండ్ నడుస్తోంది. అనుమతుల్లేకుండా అడ్డగోలు తవ్వకాలు జరపడం చూశాం... ఒకచోట అనుమతులు తీసుకుని మరోచోట తవ్వకాలు జరపడం విన్నాం... నిర్దేశిత విస్తీర్ణంతో అనుమతి తీసుకుని అంతకుమించిన విస్తీర్ణంలో తవ్వకాలు జరిపిన దాఖలాలున్నాయి. కానీ, మౌఖిక ఆదేశాలని ఎటువంటి ఉత్తర్వుల్లేకుండా అధికారులే అక్రమ తవ్వకాలకు తెరలేపడం విచిత్రంగా ఉంది. ఉచితమని చెప్పి అధికారుల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇష్టమొచ్చిన రేటుకు ఇసుక విక్రయించి జేబులను నింపుకుంటున్నారు. ఇటీవల అల్లవరం మండలం బోడసకుర్రు వద్ద వైనతేయ నదిపై ఉన్న వంతెన పక్కనే ఇసుక దందాకు పాల్పడ్డారు. మూడేళ్ల క్రితం మూసివేసిన ఇసుక ర్యాంపును ఈ దందాపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించి మూడు రోజుల కిందట ఈ అనధికార ర్యాంప్ మూసవేశారు. సీసీ రోడ్లు, గృహ నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరిట కలెక్టర్ అనుమతి ఇచ్చారంటూ ఈ ఇసుక తవ్వకాలకు తెరదీశారు. కలెక్టర్ ఉత్తర్వులు, ఆదేశాలు అని చెప్పి ఆర్డీవో ద్వారా అల్లవరం ఎమ్మార్వో ఈ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనిపై కలెక్టర్ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారని ‘సాక్షి’ తహసీల్దార్‌ను వివరణ కోరినప్పుడు లిఖిత పూర్వకంగా ఇవ్వలేదని.., మౌఖికంగా ఆదేశించారని చెప్పుకొచ్చారు. దీంతో ఇసుక అక్రమ దందాకు అధికార టీపీపీ నేతల హస్తం ఉందన్న వాస్తవం వెలుగు చూసింది. ఇక, సఖినేటిపల్లి బాడవ వద్ద అనధికారికంగా జరిగిన తవ్వకాలపై వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనకు దిగితే కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో ర్యాంపునకు అనుమతి ఇచ్చామని సమర్థించుకున్నారు. లిఖితపూర్వకంగా రాసివ్వండని రెవెన్యూ అధికారులను అడిగితే ససేమిరా అన్నారు. తాజాగా వెదుళ్లపల్లి ఇసుక ర్యాంపు విషయంలో కూడా దాదాపు అదే సమాధానం వచ్చింది. అనుమతుల్లేవని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా తహసీల్దార్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ సబ్ కలెక్టర్ ఆదేశాలతో ర్యాంపును నిర్వహించామని చెప్పుకొచ్చారు. మొత్తానికి విజిలెన్స్ అధికారుల ఆదేశాలతో ర్యాంపును మూసివేయగా, విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తానికి జిల్లాలో మౌఖిక ఆదేశాల ముసుగులో ఇసుకను ఏకంగా తోడేస్తున్నారని రుజువైంది. -
ట్రైమెక్స్ మైనింగ్ కేసుపై సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఇసుక తవ్వకాల పేరుతో మోనోజైట్ ను వెలికి తీశారని. దాని లీజును రద్దు చేయాలని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఏ ఖనిజాలు వెలికితీశారో తెలుసుకోవడానికి రెండు అధ్యయనాలు జరగాల్సి ఉందని కేంద్ర అణు ఇంధన పరిశోధన సంస్థ కోర్టుకు నివేదించింది. మైనింగ్ లైసెన్స్ రద్దుపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని రెండు వారాల్లో నివేదిక వస్తుందని ఏపీ తరపు న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. కాగా,హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని దీన్ని కూడా అక్కడికే బదిలీ చేయాలని ట్రైమెక్స్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీం కోర్టును కోరారు. ఇసుక తవ్వకాల పేరుతో11 వేల టన్నుల మోనోజైట్ ఖనిజాన్ని అక్రమంగా వెలికితీశారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు . ఈ మైనింగ్ ద్వారా వచ్చిన సొమ్మును రికవర్ చేయాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. అక్రమాలకు పాల్పడిన ట్రైమెక్స్ మైనింగ్ లైసెన్స్ రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. కేంద్ర అణు పరిశోధన సంస్థ నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి విచారణ చేపడతామని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కేసు విచారణను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసింది. -
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మరో అరాచకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వివాదాస్పద అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాగిస్తున్న దౌర్జన్యాలకు ఇదో పరాకాష్ట. చింతమనేని ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం సూర్యారావుపేట గ్రామంలో రెండు రోజుల క్రితం అనుమతుల్లేకుండా జరుగుతున్న మట్టి తవ్వకాల పనులను వైఎస్సార్సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ అబ్బయ్య చౌదరి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, గ్రామస్తులు అడ్డుకుని నిలిపివేశారు. అక్రమ తవ్వకాలపై ఏలూరు ఆర్డీఓ చక్రధర్, మైనింగ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో నేరుగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని రంగంలోకి దిగారు. తన అక్రమ మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసుల ఒప్పుకోకపోవడంతో తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్ డ్రైవర్ శ్రీరామ్జాన్కుమార్ని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి, తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. దీంతో వైస్సార్సీపీ నేతలు కొఠారు అబ్బయ్యచౌదరి, కొఠారు రామచంద్రరావు, మేడికొండ వెంకట సాంబశివకృష్ణారావు, బాలిన రాము, మేకా లక్ష్మణరావు, నెరుసు ధర్మరాజులపై సెక్షన్ 341, 323, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది? దెందులూరు నియోజకవర్గంలోని సూర్యారావుపేట పక్క నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ వెళ్తోంది. అక్కడికి దగ్గరలో కంకరగుట్ట ఉంది. ఇది చుట్టుపక్కల నాలుగు గ్రామాలకు మధ్యలో ఉంది. ఇక్కడ చెరువు తవ్వితే భూగర్భ జలాలు పెరుగుతాయని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానికులను ఒప్పించారు. పట్టిసీమ కుడికాలువ నుంచిగానీ, లేకపోతే చింతలపూడి కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా పైపులు వేసి చెరువును నింపుతామని పేర్కొన్నారు. కనీసం వంద ఎకరాల చెరువు ఉంటేగానీ కాలువ నుంచి అధికారికంగా లిఫ్ట్ ద్వారా నీటిని తరలించడం కుదరదని కలెక్టర్ తేల్చిచెప్పారు. అనంతరం ఎమ్మెల్యే చింతమనేని గ్రామస్తులపై ఒత్తిడి తెచ్చి, చెరువు తవ్వడానికి ఒప్పించారు. దీనికోసం 60 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ భూమిని గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానికులకు డీ–ఫారం పట్టాలుగా ఇచ్చారు. ఎమ్మెల్యే చింతమనేని ఎకరాకు రూ.6 లక్షల చొప్పున ధర నిర్ణయించి, రైతులకు రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే ఇస్తానన్నారు. చెరువు పేరుతో ఏడాది కాలంగా 60 ఎకరాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక్కో టిప్పర్‌కు రూ.2,500, ట్రాక్టర్ లోడుకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. నిత్యం 120 టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారు. 60 ఎకరాల్లో మట్టి అమ్మకాల ద్వారా రూ.50 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. రైతులకు నామమాత్రపు ధర చెల్లించి బలవంతంగా వారి భూములను స్వాధీనం చేసుకున్నారు. ఈ చెరువు తవ్వకానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేవు. ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలపై అధికార బలంతో కేసులు బనాయించిడం గమనార్హం. కేసులకు భయపడం ‘‘మాపై పెట్టిన తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే చింతమనేని సాగిస్తున్న అక్రమాలను అడ్డుకుని తీరుతాం. అతడి దుర్మార్గాలను బయటపెడతాం. ఇక్కడ అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తాం’’ – అబ్బయ్యచౌదరి, దెందులూరు కన్వీనర్, వైఎస్సార్సీపీ -
మట్టి దందా
డి.హీరేహాళ్(రాయదుర్గం): రాయదుర్గం నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు యథేచ్ఛగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. అసైన్డ్,చుక్కల భూములు, వంకపోరంబోకు భూములను ఎంచుకుని ఇష్టానుసారంగా తవ్వి మట్టిని మెక్కేస్తున్నారు. ఈ అక్రమార్కులకు మంత్రి కాలవ శ్రీనివాసులు అండగా నిలుస్తుండటంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పది మందితో గ్యాంగ్ డి.హీరేహాళ్ మండలంలోని ఓబుళాపురం ఐరన్ ఓర్‌కు దేశంలోనే పేరుగాంచింది. గత సర్పంచ్ ఎన్నికల్లో సీపీఐ తరఫున పోటీ చేసిన వెంకటేశులు విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన కూడా ఆ పార్టీలో చేరాడు. గ్రామ ప్రథమ పౌరుడిగా, పెద్దమనిషిగా ఆదర్శంగా ఉండాల్సిన ఆయనే ఆదాయం కోసం అక్రమ మార్గం ఎంచుకున్నాడు. చిదానందస్వామి, బసవరాజు, రాజ, రామి, తిప్పేస్వామి, మాజీ సర్పంచ్ తిమ్మప్ప తదితర పది మంది సభ్యులతో గ్యాంగ్ (ముఠా)ను ఏర్పాటు చేసుకుని మట్టి దందాకు తెరలేపాడు. రోజుకు 50–80 ట్రిప్పుల మట్టి తరలింపు ఓబుళాపురం పంచాయతీ పరిధిలోని బీఐఓపీ ఫ్యాక్టరీ పక్కన, కొత్త సుగ్గులమ్మ దేవాలయ సమీపాన సర్వే నంబర్ 124ఏ లో ఉన్న నాలుగెకరాల వంకపోరంబోకు భూమిని ఎంచుకున్నాడు. నిరంతరం తన గ్యాంగ్‌తో నలువైపులా నిఘా పెట్టించాడు. రాత్రి 9 నుంచి తెల్లవారుఝామున 4.30 గంటల వరకు హిటాచీతో ఇష్టారాజ్యంగా మట్టితవ్వకాలు చేయిస్తున్నాడు. రోజుకు 50 నుంచి 80 ట్రిప్పుల వరకు మట్టిని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇదే ప్రదేశంలో గతంలో నీరు – చెట్టు కార్యక్రమం ద్వారా మట్టి తవ్వకం పనులు చేసినట్లు చూపి వెంకటేశులు రూ.20 లక్షలు నొక్కేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజు ఆదాయం లక్ష పైమాటే కర్ణాటకకు చెందిన వ్యాపారులతో టిప్పర్ మట్టిని రూ.1,500 ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నాడు. రోజుకు 50 నుంచి 80 టిప్పర్ల మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. అలా రోజుకు రూ.75 వేల నుంచి లక్షకు పైబడి అక్రమార్జన చేస్తున్నాడు.ఈ తతంగం గత సంవత్సర కాలంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఎవరితోనైనా చెప్పుకోండి.. మట్టి దందా విషయం ఎవరైనా మాట్లాడితే ‘రెవెన్యూ గానీ, పోలీస్ అధికారులు గానీ ఎవరూ ఏమీ చేసుకోలేరు’ అంటూ మాజీ సర్పంచ్ వెంకటేశులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు. అంతే కాదు ‘మంత్రి అండగా ఉన్నాడు. ఎవరితోనైనా చెప్పుకోండి’ అంటూ రెచ్చిపోతున్నాడు. ఈ మట్టి దందాలో టీడీపీ నాయకులతో పాటు మంత్రికి కూడా వాటాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి వేళ అక్కడకు వెళితే అంతే.. మట్టి తవ్వకాలు జరిపే ప్రదేశానికి ఎవరైనా వెళితే టిప్పర్లతో ఢీకొట్టించి మట్టుపెట్టే యత్నాలు కూడా గతంలో జరిగాయని బాధితులు వాపోతున్నారు. టిప్పర్ లైట్లు బంద్ చేసి వెనుక నుంచి వచ్చి గుద్ది చంపేందుకు కూడా వెనుకాడబోరని చెబుతున్నారు. అలా కొంతమంది తప్పించుకు వచ్చినట్లు తెలిపారు. మట్టిమాఫియా రెచ్చిపోవడానికి మంత్రి కాలవ శ్రీనివాసులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతటివారైనా ఉపేక్షించం ఓబుళాపురం పంచాయతీ పరిధిలోని బీఐఓపీ ఫ్యాక్టరీ వద్ద వంక పొరంబోకు భూమిలో మట్టిని తవ్వి కర్ణాటకకు తరలిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. మా సిబ్బందితో నిఘా పెట్టించాం. తాజామాజీ సర్పంచ్ వెంకటేశులు మట్టి దందాకు పాల్పడినట్లు తెలిసింది. అక్రమాలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. – ఖతిజిన్‌కుఫ్రా, తహసీల్దార్, డి.హీరేహాళ్ -
అవి అఘాతాలే..!
తాడేపల్లిరూరల్: కృష్ణానదిలో టీడీపీ నేతలు ఇసుక తవ్వకాల పేరుతో అఘాతాలను ఏర్పాటు చేశారని గుండిమెడ ఇసుక రీచ్‌లో విద్యార్థులు మృతి చెందిన సంఘటనతో ఆ అవినీతి గుంతలు బయటపడ్డాయి. విద్యార్థులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వివిధ శాఖల అధికారులతో పాటు ఎంపీ గల్లా జయదేవ్ సంఘటనా స్థలానికి వచ్చారు. అక్కడ ఆ గుంతల్లో వెదుకుతున్న వారు సాక్షాత్తు అక్కడకు వచ్చిన ఎంపీతో ఇవి గుంతలు కాదు, మీ పార్టీ నేతల అవినీతి అఘాతాలని వెల్లడించారు. మీడియా ప్రతినిధులు సైతం ప్రశ్నించడంతో ముందు మృతదేహాలను బయటకు తీసిన తర్వాత ఇసుక తవ్వకాలపై విచారణ జరుపుదామంటూ ఎంపీ స్పష్టం చేశారు. చిన్నారులు మృతి చెంది మూడు రోజులు గడుస్తుంది. నేటికీ దానిపై విచారణ చేపట్టిన దాఖలాలు ఏమీ కనిపి ంచ లేదు. విద్యార్థులు చనిపోయారని తెలియడంతో ఊళ్లకు ఊళ్లూ కదిలి సంఘటనా స్థలానికి వచ్చాయి. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం అక్కడకు వచ్చాయి. స్థానికులు 40 మంది మొదట గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ విద్యార్థుల ఆచూకీ లభ్యంకాలేదు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరో 40 మంది వచ్చి గాలించినా ఫలితం లేకపోవడంతో పెద్ద పెద్ద బోట్లు తీసుకువచ్చి నీటి అడుగు భాగాన పెద్ద పెద్ద బాదులతో నీటిని చిలికారు. అప్పుడు కానీ రెండు మృతదేహాలు బయట పడలేదు. అలా గ్రామస్తులు వచ్చిన సహాయక బృందాలు పెద్దపెద్ద కర్రలను నీటిలోపలకు పోనిచ్చి బాదులు నెడుతుంటే అక్కడ ఎంత లోతు ఉంది, టీడీపీ నేతలు ఎంత అవినీతికి పాల్పడ్డారో స్పష్టమైంది. అధికారులుసైతం ముక్కుమీద వేలేసుకున్నారు. తప్పు చేశామన్న బాధ.. ఇరిగేషన్ శాఖ విజయవాడ డీఈ చౌదరి సంఘటనా స్థలానికి వచ్చి దూరంగా నిలబడి తప్పు చేశామన్న బాధతో కుమిలిపోయారన్న విషయాన్ని అందరూ గమనించారు. ఇంత జరిగినా ఇప్పటివరకు ప్రభుత్వం దానిమీద విచారణ చేపట్టలేదు. వాస్తవానికి కృష్ణానది తీరంలో గుండిమెడ ఇసుక రీచ్‌లో ఇసుక తవ్వకాలకు 3 మీటర్లు అనుమతిచ్చినట్లు సమాచారం. కానీ అధికార పార్టీ నేతలు 12 మీటర్లు ఇసుక తవ్వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చిన్నారులు ప్రాణాలు తీసిన అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేయకుండా, టీడీపీ నేతలు చనిపోయిన విద్యార్థుల కుటుంబాల చుట్టూ తిరుగుతూ ఏదో తూతూమంత్రంగా వారికి ఆర్థిక సహాయం చేస్తూ సమస్యను పక్కదారిపట్టిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. అలాంటి గోతులు ఎప్పుడూ చూడలేదు చిన్నారులు చనిపోయిన వద్ద గుంతలను మా జీవితంలో కృష్ణానదిలో ఎప్పుడూ చూడలేదు. దారుణంగా తవ్వేసి ఆ గుంతలను అలాగే వదిలేశారు. 20 అడుగుల బాదును లోపలకు పంపిస్తే అడుగుభాగం తగల్లేదు. అడుగుభాగంలో ఉన్న మృతదేహాలు పైకి ఏం వస్తాయి? 30 అడుగుల లోపలకు వెళ్లి వెదకడమనేది ఎవరి వల్లా కాని పని. –పోకల వేమయ్య -
దోచేస్తుండ్రు !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సులువుగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన అక్రమార్కులు సహజవనరులను దోపిడీ చేసేస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ప్రవహిస్తున్న దుందుభీ నదిలోని ఇసుకపై అక్రమార్కుల కన్ను పడింది. అత్యంత పొడువుగా విస్తరించి ఉన్న దుందుభి నదిలో భారీగా ఇసుక మేటలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణం రంగం ఊపందుకున్న క్రమంలో ఇసుకకు భారీ డిమాండ్ ఉండడంతో అధికారుల సహకారంతో అనుమతుల పేరిట దోచే స్తున్నారు. మిషన్ భగీరథ, సీసీ రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. అలా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల మీదుగా దాదాపు 150 కి.మీ మేర ప్రవహించే దుందుభీలో ఇసుకను స్వాహా చేస్తున్నారు. అక్రమార్కులకు అధికారుల అండదండలు తోడవడంతో దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. పది మండలాలో ప్రవాహం కృష్ణా నదికి ఉపనది అయిన దుందుభీ నది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు జీవాధారం. దాదాపు 150 కి.మీ పైగా ప్రవహిస్తూ పది మండలాలకు సాగు, తాగునీరు అందిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్‌తో మొదలుకొని రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్, తిమ్మాజిపేట, తాడూర్, కల్వకుర్తి, తెలకపల్లి, వంగూరు, ఉప్పునుంతల మండలాల మీదుగా ప్రవహించి నల్లగొండ జిల్లాలోని డిండిలో కలుస్తుంది. దుందుభీ నది ఒక్కసారి ప్రవహించిందంటే దాదాపు నాలుగేళ్ల వరకు కరువు ఉండదనేది ఇక్కడి రైతుల నమ్మకం. అయితే ఆ నమ్మకం కాస్తా సడలిపోతుంది. నదిలో మేట వేసిన ఇసుకను కొన్ని చోట్ల తోడేస్తుండడంతో భూగర్భజలాలు గతంలో మాదిరిగా ఇంకడం లేదు. ఫలితంగా నది ప్రవహించినా అంతగా ఉపయోగం లేకుండా పోతుంది. గతేడాది దాదాపు 15రోజుల పాటు దుందుభీ ప్రవహించినా... జడ్చర్ల మండల పరిధిలోని కోడుగల్, లింగంపేట, ఆల్వాన్‌పల్లి తదితర గ్రామాల్లో గత వేసవిలో బోర్లు ఎండిపోయాయి. ఇసుక లూటీ దుందుభీ పరివాహక ప్రాంతాల్లో గత పదిహేను రోజుల నుంచి అక్రమార్కులు ఇసుక లూటీ చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లోని బాలానగర్ మండలంతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాలోని వంగూరు, ఉప్పునుంతల మండలాల నుంచి భారీగా ఇసుకను తరలిస్తున్నారు. స్థానిక అవసరాలు, ప్రభుత్వ పనులైన మిషన్ భగీరథ, సీసీ రోడ్లు పేరిట ట్రాక్టర్లతో ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉప్పునుంతల, వంగూరు మండలాల సరిహద్దులో ఉన్న తిర్మలాపూర్-చింతపల్లి బ్రిడ్జి దిగువన గతంలో ఒడ్డుకు తరిమిన ఇసుకను గోతులు పెట్టి ట్రాక్టర్లకు నింపుతున్నారు. ప్రతీరోజు ఇక్కడ ఒకే చోట నుంచి దాదాపుగా 30 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇసుకను తవ్వుతున్న ప్రాంతం చింతపల్లి శివారు వంగూరు మండల పరిధిలోకి వస్తుంది. ఇసుకను అక్కడ నింపుకుని ఉప్పునుంతల మండల పరిధిలోని శాండ్ క్వారీ రోడ్డు వెంట తాడూరు మీదుగా అచ్చంపేట తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే విధంగా ఉప్పునుంతల మండలంలోని పెద్దాపూర్ సమీపంలో కూడా ఆ గ్రామానికి చెందిన కొంతమంది రాత్రి వేళ దుందుభీ నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవలే స్థానిక ఎస్సైని జిల్లా కేంద్రానికి అటాచ్ చేయడంతో ఇసుక వ్యాపారులు ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. దుందుభీ నది ఉప్పునుంతల, వంగూరు మండలాల సరిహద్దులో ఉండడంతో ఇక్కడి పోలీసులు దాడులు చేసినప్పుడు అటు, అక్కడి పోలీసులు దాడులు చేసినప్పుడు ఇటు వస్తూ తప్పించుకుంటున్నారు. నిబంధనలకు తూట్లు ప్రభుత్వ అనుమతుల పేరిట కొందరు అక్రమార్కులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మిషన్ భగీరథ, రోడ్డుబ్రిడ్జి పనులు, సీసీ రోడ్లు తదితర పేర్లతో అనుమతులు పొంది ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. అలాగే ఉదయం 8గంటలకు ఇసుక తవ్వకాలు ప్రారంభించాల్సి ఉండగా 6గంటలకు ముందే తవ్వకాలు ప్రారంభిస్తున్నారు. అలాగే సాయంత్రం 5గంటలకు ముగించాల్సి ఉన్నా రాత్రి పొద్దుపోయే దాకా ఫ్లడ్‌లైట్లు బిగించి మరీ ఇసుక తరలింపు సాగిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో అనుమతులు పొందిన వాహనాలకు జీపీఎస్ విధానం లేకపోవడంతో అక్రమార్కుల పంట పండుతోంది. ఒక లారీ ఇసుకను పక్కదారి పట్టిస్తే దాదాపు రూ.30వేల వరకు మిగులుబాటు ఉంటుంది. దీంతో నిత్యం పదుల సంఖ్యలో వాహనాలను దారి మళ్లించి సొమ్ముచేసుకుంటున్నారు. -
కేరళ బాధితుల్ని రాష్ట్రం ఆదుకోవాలి
భువనేశ్వర్/పూరీ : వరద ఉప్పెనతో చితికి పోయిన కేరళ ప్రజానీకాన్ని రాష్ట్ర ప్రజలు వెన్ను తట్టి ఆదుకోవాలి. విపత్తు తాండవం చవి చూసిన రాష్ట్ర ప్రజల పూర్వ అనుభవాల దృష్ట్యా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హృదయం మానవతా దృక్పథంతో స్పందించాలని యువ సైకత శిల్పి మానస కుమార్ సాహు సైకత కళాత్మకంగా పిలుపునిచ్చారు. కేరళలో వరద తాండవం విషాద దృశ్యం ప్రతిబింబించే రీతిలో ఆయన ఆవిష్కరించిన సైకత శిల్పం పూరీ గోల్డెన్ బీచ్ తీరంలో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. -
మట్టికి జై..
సాక్షి,సిటీబ్యూరో: వినాయక చవితి అంటే మహానగరానికి అతిపెద్ద వేడుక. గ్రేటర్లో అత్యంత వైభవంగా జరిగే నవరాత్రి ఉత్సవాలను ఈసారి పర్యావరణ హితంగా జరపుకోవాలంటోంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అందుకు తగ్గట్టే వచ్చేనెల రెండో వారంలో జరగనున్న చవితి ఉత్సవాలకు ‘మట్టి గణపతుల’ పంపిణీ చేసేందుకు పీసీబీ సమాయత్తమవుతోంది. మహానగరంలో కాలుష్య ఆనవాళ్లు లేకుండా చూసేందుకు ఈ సారి సుమారు 2 లక్షల మట్టి ప్రతిమల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో ఇళ్లలో పూజించుకునే చిన్న ప్రతిమలు 1.75 లక్షలు ఉన్నాయి. మిగతావి వివిధ పరిమాణాల్లో తయారు చేస్తున్నారు. ఈ బాధ్యతలను రెండు సంస్థలకు అప్పజెప్పినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. అయితే చిన్న ప్రతిమలను నగరంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఔట్లెట్లు ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. సింహభాగం పీఓపీ విగ్రహాలే.. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏటా గ్రేటర్ వ్యాప్తంగా సుమారు లక్షకు పైగా భారీ విగ్రహాలను ప్రతిష్టిస్తుంటారు. ఇందులో మట్టి విగ్రహాల సంఖ్య 25 వేలకు మించడం లేదు. మిగతావన్నీ వివిధ పరిమాణాల్లో ఉండే ‘ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్’ విగ్రహాలే. వీటిని నగరంలోని వివిధ చెరువులతో పాటు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. అయితే వీటివల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పీఓపీ’తో పర్యావరణ హననం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి హానికారక రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను నగరంలోని పలు జలాశయాల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఆ సమయంలో వాటిలోని ప్రమాదకర మూలకాలు జలాశయాల్లో చేరుతున్నాయి. ముఖ్యంగా రంగుల్లో ఉండే లెడ్ సల్ఫేట్, చైనాక్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్, ఆల్కహాల్ వంటివి కలుస్తున్నాయి. వాటితోపాటు కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జింక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా వంటి హానికారక మూలకాలు సైతం నీటిలో కలుస్తున్నాయి. ఆ విగ్రహాలతో అనర్థాలు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. ⇔ జలాశయాల్లో పట్టిన చేపలను నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని తిన్న వాకి శరీరంలోకి హానికర మూలకాలు చేరుతున్నాయి. చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. ⇔ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జలాల్లో అరుదుగా పెరిగే వృక్ష జాతులు నాశనమవుతాయి. ⇔ ఆర్సినిక్, లెడ్, మెర్క్యురీ మూలకాలు భారతీయ ప్రమాణాల సంస్థ, వైద్య పరిశోధనా సంస్థలు సూచించిన పరిమితులను మించి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ⇔ వీటితోపాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనం, సిలికాన్ వంటి మూలకాలు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. ⇔ జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికర మూలకాలు అవక్షేపంగా ఏర్పడతాయి. ప్రత్యామ్నాయం తప్పనిసరి ⇔ జల, వాతావరణ కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇందుకు మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే ప్రతిష్టించి, నిమజ్జనం చేయాలి. వీటి పరిమాణం సైతం చిన్నవిగానే ఉండాలి. ⇔ ఆయా జలాశయాల్లో నిమజ్జనం చేసే విగ్రహాల సంఖ్యను ఏటేటా తగ్గించాలి. ఎక్కడి విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేసేందుకు కృషి చేయాలి. ⇔ నగరంలో మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు. ⇔ విగ్రహాలతో పాటు జలాశయాల్లోకి పూవులు, కొబ్బరి కాయలు, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథిన్ కవర్లను పడవేయరాదు. నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను తొలగించాలి. ⇔ పర్యావరణంలో త్వరగా కలిసిపోయే పదార్థాలనే విగ్రహాల తయారీలో వాడాలి. ⇔ పీఓపీ(ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్)తో చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితిలో నిమజ్జనం చేయరాదు. ఇలాంటి విగ్రహాలను వచ్చే ఏడాది వినియోగించేలా ప్రోత్సహించాలి. -
‘అయినవాళ్ల’ కేసుల మాఫీకి ఒత్తిళ్లు..
కర్నూలు : ‘వాళ్లు నా అనుచరులు. నన్ను నమ్ముకుని పార్టీలో ఉన్నారు. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే డబ్బు కావాలి. అందుకోసం మట్కా నిర్వహించుకుంటున్నారు. వాళ్లింటి వైపు వెళ్లొద్దు.’ – ఇదీ కర్నూలులోని పోలీసులకు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జారీ చేసిన ఆదేశం. ♦ అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో వారు నిఘా ఏర్పాటు చేశారు. అయితే.. జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ముఖ్య నాయకుని సోదరుడు ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి.. ‘వాళ్లు మావాళ్లే. వారి జోలికి వెళ్లొద్దు’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ♦ పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని ఓ వ్యాపారి రెండు లారీల్లో వేరే రాష్ట్రానికి తరలిస్తుండగా నగర శివారులోని తుంగభద్ర చెక్‌పోస్టు వద్ద గస్తీ పోలీసులు పట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు సదరు బియ్యం వ్యాపారి దగ్గరరూ.4 లక్షలు దండుకుని.. పోలీసు, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేసి లారీలను విడిపించాడు. కేసు కూడా మాఫీ చేయించాడు. ♦ నందవరం మండలం పెద్దకొత్తిలి గ్రామ సర్పంచ్ ఇరుపాక్షిరెడ్డి వైఎస్సార్సీపీలో ఉంటూ ప్రజల్లో మంచి పట్టు సాధించారు. స్థానిక ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి చేసి ఇరుపాక్షిరెడ్డికి సంబంధించిన ట్రాక్టర్లు, పొక్లెయిన్లు సీజ్ చేయించి అక్రమంగా కేసు పెట్టించారు. దాన్ని మాఫీ చేసేందుకు టీడీపీలోకి బలవంతంగా చేర్పించుకున్నారు. ♦ రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీకి పర్యావరణ అనుమతి కోసం రెండు నెలల క్రితం కలెక్టర్, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ భాస్కర్‌రెడ్డితో పాటు మరికొంతమందిపై అక్రమ కేసులు బనాయించారు. ఖాకీలపై అధికార పార్టీ నేతల పెత్తనం ఎక్కువయ్యిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. శాంతిభద్రతల పరిరక్షణ, పేదలకు భరోసా కల్పించడంలో పోలీసు శాఖ పాత్ర చాలా కీలకం. రాగద్వేషాలకు, కుల మతాలకు అతీతంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల విధి. ఆ దిశగా పనిచేస్తున్న కొంతమంది అధికారులపై అధికార పార్టీ నేతల పెత్తనం రోజురోజుకూ మితిమీరుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. అక్రమార్కులకు వంత పాడుతున్నారు. బాధితులకు న్యాయం జరగకూడదంటూ అడ్డగోలు వాదనకు దిగుతున్నారు. అనుంగులు, అయినవాళ్ల లబ్ధి కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆరు నూరైనా తాము చెప్పినట్లే వినాలంటూ పోలీసులకు హుకుం జారీ చేస్తున్నారు. కాదంటే బదిలీపై వెళ్లాల్సి వస్తుందంటూ బాహాటంగానే బెదిరిస్తున్నారు. ♦ ఇదెక్కడి చోద్యం! వివాదాలు, ఘర్షణలు తలెత్తుతున్నప్పుడు బాధితులు స్టేషన్‌కు చేరడం, పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఇక్కడే నేతలు జోక్యం చేసుకుంటున్నారు. అన్యాయంగా వ్యవహరించిన తమ వారివైపే మొగ్గు చూపాలని నిబంధన విధిస్తున్నారు. వైరివర్గం తప్పు లేకున్నా వారిపై అక్రమ కేసులు బనాయించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. కర్నూలు నగరంలోని డీవీఆర్ హోటల్ వద్ద రెండు నెలల క్రితం ఎమ్మెల్యే అనుచరులు ఉమాకాంత్ అనే యువకుడిపై దాడి చేసి గాయపరిచారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పోలీసులపై ఒత్తిడి చేసి.. బాధితుడిపైనే సంబంధం లేని వ్యక్తితో ఎస్సీ కేసు నమోదు చేయించారు. అలాగే పార్టీ మారిన ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి కర్నూలు నగరానికి చెందిన ఇంద్రసేనారెడ్డి అనే యువకుడు ‘ఎవరి పుణ్యాన గెలిచి పార్టీ మారావు’ అని ఫేస్బుక్లో పోస్టు చేసినందుకు ఆగ్రహించిన సదరు ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి పెంచి ఆ యువకునిపై కేసు నమోదు చేయించి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. ఆలూరు మండలం హత్తి బెళగల్లో ఇటీవల క్వారీలో భారీ పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. క్వారీని బంద్ చేయించాలని ఐదు నెలల క్రితమే గ్రామస్తులు ధర్నా చేశారు. అయితే.. అధికార పార్టీకి చెందిన క్వారీ యజమాని శ్రీనివాస చౌదరి పోలీసులపై ఒత్తిడి చేసి.. ఆందోళనకు దిగిన మల్లికార్జునతో పాటు మరో ఐదుగురిపై కేసు పెట్టించారు. అప్పటి ఎస్ఐ ధనుంజయతో వారిని తీవ్రంగా కొట్టించి జైలుకు కూడా పంపిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. అసాంఘిక శక్తులకు నేతల అండ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి కూడా అధికార పార్టీ నేతలు అండదండలు అందిస్తున్నారు. నిందితులను స్టేషన్‌కు తీసుకొచ్చినప్పటి నుంచే ఫోన్ల పరంపర ఆరంభమవుతోంది. బెట్టింగ్, మట్కా, ఇసుక మాఫియా వంటి వాటిల్లో కూడా అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. పలు కేసుల్లోని నిందితులు ‘రాజకీయ’ ఆశ్రయం పొందడం, నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం పరిపాటైంది. ఆలూరుకు చెందిన ఐదుగురు యువకులు ఆదోని పట్టణంలోని బంగారు షాపులో పెద్ద మొత్తంలో చోరీకి పాల్పడ్డారు. వారు ఆ నియోజకవర్గ నాయకుడిని ఆశ్రయించడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. బంగారు షాపు యజమానితో రాజీ కుదిర్చి పెట్టిన కేసు మాఫీ చేయించిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో మూడు మాసాల క్రితం రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి పెంచి సంఘటనకు ఎలాంటి సంబంధం లేని మాజీ కార్పొరేటర్ అమృతరాజుపై హత్యాయత్నం కేసు పెట్టించారు. కాదంటే బదిలీ బహుమానం తమ మాట వినని పోలీసులపై బదిలీ వేటు తప్పదంటూ నేతలు బాహాటంగానే ప్రకటిస్తుండటం గమనార్హం. ఏ శాఖలో అయినా బదిలీలు అనివార్యమే. అయితే.. పోలీసు శాఖలో ఇది కాస్తా ఎక్కువగా ఉంటోంది. దీన్నే అదునుగా ఎంచుకుని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఏటా బదిలీల సీజన్లో నేతల ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అత్యున్నత స్థాయి అధికారుల దృష్టికి తమ జాబితాలు తీసుకెళ్లి పంతం నెగ్గించుకోవడం జిల్లాలో ఆనవాయితీగా మారింది. తన మాటకు విలువ ఇవ్వలేదన్న అక్కసుతో బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి.. డీఎస్పీ పి.ఎన్.బాబును పట్టుబట్టి బదిలీ చేయించి పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్యే స్వగ్రామం యనగండ్లతో పాటు బనగానపల్లెలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశానికి అనుమతించడంపై ప్రభుత్వ పెద్దల వద్ద పంచాయితీ పెట్టించి డీఎస్పీపై బదిలీ వేటు వేయించడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. ఇదే తరహాలో కర్నూలు డీఎస్పీ ఖాదర్ బాషాను కూడా స్థానిక ప్రజాప్రతినిధి పట్టుబట్టి మరీ బదిలీ చేయించారన్న ఆరోపణలున్నాయి. కేవలం తొమ్మిది మాసాలకే ఆయనపై బదిలీ వేటు పడటం ఇందుకు బలం చేకూర్చుతోంది. మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్‌బాషాను ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేయించినట్లు విమర్శలున్నాయి. ఏడాది క్రితం డి.వి.రమణమూర్తి స్థానంలో ఐపీఎస్ అధికారి విశ్రాంతి పాటిల్ కర్నూలు డీఎస్పీగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టకముందే డైరెక్ట్ ఐపీఎస్ అధికారి తమకు వద్దని అడ్డుకున్నారు. మొత్తంగా పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు జిల్లాలో తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించి కిందిస్థాయి యంత్రాంగానికి భరోసా కల్పించాల్సిన ఉన్నతాధికారులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బదిలీల సందర్భంగా ఫలాన సర్కిల్ లేదా స్టేషన్‌కు పోస్టింగ్ కావాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్చార్జ్ నుంచి లేఖ తెచ్చుకోవాలని ఉన్నతాధికారులే స్వయంగా ఎస్ఐ, సీఐలకు సూచిస్తుండటం గమనార్హం. -
అర్ధరాత్రి ముగ్గురు మహిళలు..
ఈ ముగ్గురు మహిళలు ఎవరు? పొన్నాం– బట్టేరు స్పెషలాఫీసరుగా వ్యవహరిస్తున్న ఈవోపీఆర్డీ కె.నిశ్చల (మధ్యలో), ఆమెకు ఇరువైపుల ఒకరు అంగన్వాడీ కార్యకర్త అరవల పద్మజ, మరొకరు ఆశా కార్యకర్త బమ్మిడి సుజాత! సమయం: ఆదివారం అర్ధరాత్రి!ఎక్కడ: శ్రీకాకుళం రూరల్ మండలంలోని పొన్నాం–బట్టేరు ఇసుక ర్యాంపు వద్ద! ఏం పని: ఆర్డీవో, తహసీల్దారు ఆధ్వర్యంలో బృందం పట్టుకున్న ఇసుక అక్రమ రవాణా లారీలకు కాపలా! సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శభాష్! అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిరోడ్డుపై నిర్భయంగా వెళ్లినపుడే నిజమైన స్వతంత్య్రం వచ్చినట్లన్న మహాత్ముడి మాటెలా ఉన్నా.. మన జిల్లాలో మాత్రం దాన్ని రుజువు చేశారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ పట్టుబడిన లారీలకు ముగ్గురు మహిళలను కాపలా పెట్టిన ఘనత మాత్రం మన అధికారులకే దక్కుతుంది! పశ్చిమగోదావరి జిల్లాలో పట్టపగలే ఇసుక అక్ర మ తవ్వకాలను అడ్డుకోవడానికెళ్లిన తహసీల్దారు వనజాక్షికి టీడీపీ నేతల చేతుల్లో జరిగిన అవమానాన్ని మరచిపోయినట్లున్నారు! కోట్ల రూపాయలు రుచిమరిగిన మాఫియా ఇసుక దోపిడీ కోసం ఎంతకైనా తెగిస్తున్న ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న పాలనపై వెల్లువెత్తుతున్న విమర్శలనూ విస్మరించినట్లున్నారు! ఫలితం... ఆ ముగ్గురిలో ఒకరైన పొన్నాం–బట్టేరు స్పెషలాఫీసరు ఈవోపీఆర్డీ కె.నిశ్చల అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు! కొంతమంది గ్రామస్థుల తోడుగా తెల్లవారుజాము వరకూ బిక్కుబిక్కుమంటూనే వారు ముగ్గురూ గడిపినా... ఈ ఘటన ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసే విషయంలో జిల్లా యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరికి అద్దం పట్టింది! కనీసం పురుషోత్తపురం ఘటన తర్వాత కూడా తూతూమంత్రంగానే చర్యలు తప్ప కఠిన శిక్షలు లేకపోవడం వెనుక అధికార పార్టీ నాయకుల అదృశ్య హస్తం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు! అంతా ఇష్టారాజ్యం.. జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్ర తనయ నదుల్లో ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడట్లేదు. నిత్యం ఇసుక అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు... ఆరు లారీలుగా మాదిరిగా యథేచ్ఛగా సాగుతోంది. విశాఖ నగరంలో నిర్మాణాల అవసరాల ముసుగులో చేస్తున్న దోపిడీ అంతా ఇంతా కాదు! ప్రతి రోజూ చీకటి పడిన తర్వాత వందల లారీలు ఇసుకతో విశాఖ వైపు పరుగు తీస్తున్నాయి. అయి తే అసలు వాటిలో అక్రమమేది? సక్రమమేది? అనేది అధికారులకూ తెలియదు. అలాగే అక్రమ రవాణాను, నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలను ఎవ్వరు నిరోధించాలనేదీ అంతుచిక్కని ప్రశ్నే అవుతోంది. వాస్తవానికి ఇందుకోసమే ప్రత్యేక బృందాలు ఉన్నాయి. వాటిలో మైన్స్ శాఖతో పాటు విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులు సభ్యులు! బృందాల ఏర్పాటు బాగానే ఉన్నా వారి మధ్య సమన్వయలోపమే అసలు సమస్య. ఈ విషయం ఇటీవల సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం ర్యాంపు దగ్గరే రుజువైంది. వంశధార వరదను సైతం లెక్కచేయకుండా 25 లారీలు, నాలుగు జేసీబీలతో ఇసుక తవ్వకాలకు దిగిన మాఫియా అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. కాగితం ముక్కే సుదర్శన చక్రం.. ఇసుక అక్రమ రవాణాలో ఓ చిన్న కాగితం ముక్కే సుదర్శన చక్రంలా పనిచేస్తోంది. అన్ని ర్యాంపుల్లో మాదిరిగానే పొన్నాం–బట్టేరు ర్యాంపు నిర్వాహకులు కూడా లారీల యజమానులకు చిన్న కాగితం ముక్క ఇస్తున్నారు. దానిపై ఎన్ఎన్ఈ అనే ముద్రతో పాటు లారీ నంబరు తప్ప మరే వివరాలు ఉండవు. జియోట్యాగింగ్ ఊసే లేదు. ఆ కాగితం ముక్కను చూపిస్తే ఇసుక లారీని చెక్‌పోస్టుల్లో కానీ, పోలీసు, రెవెన్యూ, మైన్స్ అధికారులెవ్వరూ ఆపరు! ఎందుకంటే ప్రభుత్వం అనుమతించిన నిర్మాణాలకు తీసుకెళ్తున్నట్లు ఆ ముక్కే సాక్ష్యం మరి! కనీసం ఆ లారీ ఎక్కడకు వెళ్తుందని కానీ, ఎంతకు ఇసుక విక్రయిస్తున్నారని కానీ విచారణే ఉండదు. విశాఖనగరం, అనకాపల్లి, విజయనగరం తదితర ప్రాంతాల్లో లారీలోడు ఇసుక రూ.25 వేల చొప్పున అమ్ముకుంటూ మాఫియా సొమ్ము చేసుకుంటుందనేది బహిరంగ రహస్యమే! ఇంతకీ ఈ స్లిప్‌లు ఇస్తున్నవారెవ్వరంటే టీడీపీ నాయకులు, వారి అనుచరులని అందరూ చెబుతున్న విషయమే. పొన్నాం–బట్టేరులో కూడా అదే తరహా టీడీపీ నాయకుడు అంధవరపు కొండబాబు కుమారుడు అంధవరపు జగన్ అనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులను వదిలేసి.. పురుషోత్తపురం ర్యాంపులో అక్రమ తవ్వకాలకు పాల్పడిన జేసీబీల యజమానులు, నిర్వాహకులను వదిలేసి లారీల డ్రైవర్లను, క్లీనర్లపై కేసు నమోదు చేసిన వ్యవహారం తెలిసిందే. అదే తరహాలో వంశధార నదీ ప్రాంతమైన పొన్నాం– బట్టేరు వద్ద కూడా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఎనిమిది లారీలను ఆదివారం రాత్రి అధికారుల బృందం పట్టుకుంది. అలాగే ఇసుక కోసం వచ్చిన మరో ఏడు లారీలను కూడా సీజ్ చేశారు. ఎప్పటిలాగే నిర్వాహకులు తప్పించుకున్నారు. లారీల డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. కాపలాదారులుగా మహిళాఅధికారి.. బట్టేరు ఇసుక ర్యాంపు వద్ద ఇసుక లారీలకు కాపలాగా ఆ క్లస్టర్‌కు ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న ఈవోపీఆర్డీ కె.నిశ్చలకు బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు తేడా వస్తే సస్పెండ్ చేస్తామంటూ ఉన్నతాధికారులు హెచ్చరించడంతో ఆదివారం రాత్రంతా ఆమె ర్యాంపు వద్దే ఉండిపోయారు. దీంతో అనారోగ్యానికి గురై సోమవారం శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కాపాలా బాధ్యత మాకేంటి? గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో పంచాయతీరాజ్, రెవెన్యూ, వైద్యం తదితర శాఖల అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికి ఇసుక మాఫియా తలనొప్పిగా మారింది. క్లస్టర్ పంచాయతీల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగితే వారినే బాధ్యులుగా చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 559 మంది ప్రత్యేకాధికారుల్లో సుమారు వంది మంది పరిధిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారాలు నడుస్తున్నాయి. అయితే ఇసుక అక్రమ నివారణపై విజిలెన్స్ బృందంలో సభ్యుడిగా పంచాయతీ కార్యదర్శికి కొంతవరకు మాత్రమే సంబంధం ఉంటుందని, దీనిపై ప్రత్యేక అధికారులకు ఏం సంబంధమంటూ వారు ప్రశ్నిస్తున్నారు. నిశ్చల వ్యవహారంతో ఈ స్పెషలాఫీసర్లు అందరూ ‘ఇసుక కాపలా’ విధులపై విముఖతను వ్యక్తం చేస్తున్నారు. పొన్నాం–బట్టేరు విషయంలో అధికారుల ధోరణిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలిసింది. -
అటు కలప.. ఇటు ఇసుక
ఇందల్వాయి : మండలంలో వాగులు, ఆడవులు పు ష్కలంగా ఉన్నా రెవెన్యూ, ఫారెస్టు అధికారుల పర్యవేక్షణ, సమన్వయ లోపం వల్ల క్రమేపీ అవి చీకటి దందా చేస్తున్న అక్రమార్కుల చేతుల్లో పడి వాటి సహజ స్వరూపాన్ని కోల్పోతున్నాయి. ఇసు క, కలప అక్రమ రవాణదారులపై నామమాత్రపు దాడులు చేస్తున్నా అధికారులు వారికి చట్టరీత్యా సరైన శిక్షలు వేయించడంలో విఫలమవుతుడటం తో వారు మళ్లి పాత దందానే కొనసాగిస్తున్నారు. అధిక దనార్జనే లక్ష్యంగా అడవుల్ని నరుకుతు, వా గుల్ని తవ్వుతూ ఇసుక, కలపను అక్రమంగా రవా ణ చేస్తూ ప్రకృతి స్వరూపాన్నే మార్చుతూ రైతు లకు, సామాన్య ప్రజలకు పరోక్షంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మా ణాలు, సీసీ రోడ్లు అని అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు తీసుకొని నల్లవెల్లి, గౌరారం, మల్లా పూర్, లోలం, లింగాపూర్, సిర్నాపల్లి వాగుల్లోంచి అనధికారంగా రాత్రి వేళల్లో ఇష్టరాజ్యంగా ఇసుక ను తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని, అడవుల్లోని విలువైన కలప కూడా కింది స్థాయి అటవీ శాఖ అధికారుల కనుసన్నల్లోనే రాత్రి వేళల్లో అక్రమరవాణ జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాగుల్లోకి, ఆడవుల్లోకి ట్రాక్టర్లు వెళ్లకుండా అధికారులు నామ మాత్రపు కందకాలు తవ్వుతున్నా వాటిని పూడ్చేసి మరీ అక్రమార్కులు తమ దందాను కొనసాగిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అక్రమార్కుల ధనదాహానికి అడవులు తరిగిపోయి వన్యప్రాణలు జనావాసాల్లోకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఈ దుండగుల వికృత చేష్టలకు సరిపడా వర్షాలు పడట్లేదని, వాగుల్లో ఇసుక లేకపోవడంవల్ల భూగర్భ జలాలు పెరగడంలేదని, అడవుల్లో ఆశ్రయం లేక వన్యప్రాణులు గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రకృతిని నాశనం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న చీకటి దందాకోరులపై రెవెన్యు,ఫారెస్టు, పోలీసు అధికారులు సమన్వయంతో మూకుమ్మడి దాడు లు చేసి వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, విలువైన ప్రకృతి సంపదలకు రక్షణ కల్పించి ప్రకృతి సమతుల్యతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
యథేచ్ఛగాఫిల్టర్ ఇసుక
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రం. గూడూరు పంచాయతీలోని మఖ్తగూడలో ఓ వ్యక్తి తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేశాడు. రాత్రి వేళల్లో పాటు కాల్వలు, ఇతర పొలాల నుంచి మట్టిని జేసీబీలతో తవ్వి టిప్పర్ల ద్వారా ఫిల్టర్ వద్దకు తరలిస్తున్నాడు. అనంతరం మట్టిని ఫిల్టర్ వద్ద ఇసుకగా మార్చి నిల్వ చేసి ట్రాక్టర్‌కు రూ.4వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నాడు. కొత్తూరు రంగారెడ్డి : ఇసుక వ్యాపారుల తవ్వకాల వల్ల పాటు కాల్వలు, చెరువులు ఉనికి కోల్పోతున్నాయి. మఖ్తగూడ శివారులోని నందులకత్వా వాగులో కొన్నేళ్ళ క్రితం చేపట్టిన మట్టి తవ్వకాల వల్ల వాగు చాలా చోట్ల ధ్వంసమైంది. తవ్వకాల కారణంగా వర్షాకాలంలో పాటు కాల్వలు దారి తప్పి ప్రవహిస్తున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు. కొన్ని చోట్ల పాటు కాల్వలు ధ్వంసం కావడంతో వరద నీరు పంట భూములు, రోడ్లపై ప్రవహిస్తోందని చెప్పారు. చెరువులు, కుంటల్లోకి పార డం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిల్టర్ ఇసుక తయారీ ఇలా.. ఫిల్టర్ ఇసుక తయారీకి వ్యాపారులు ముందుగానే వ్యవసాయ పొలాల్లో పెద్ద ట్యాంకు నిర్మాణం చేపట్టి దానిపైన ఒక సన్నటి ఇనుప జాలీ అమరుస్తారు. అక్కడికి పాటు కాల్వలు, చెరువులు, వ్యవసాయ భూముల నుంచి తరలించిన మట్టిని కడగడానికి రెండు వైపులా నీరు(ప్రెషర్) వేగంగా వచ్చే విధంగా బోరు పైపులను ఏర్పాటు చేస్తారు. మట్టిని ట్యాంకు పైన పోసి సన్నటి జాలిపై నీటితో కడుగుతారు. ఈ క్రమంలో మట్టి నీటితో పాటు బయటకు పోయి చిన్న చిన్న ఇసుక రేణువులు ట్యాంకులో ఉంటాయి. ఇలా రెండు మూడు ట్రాక్టర్ల మట్టితో ఒక ట్రాక్టర్ ఇసుకను తయారు చేస్తున్నారు. ఇసుక ఫిల్టర్ల నిర్వహణ నేరం అనుమతి లేకుండా ప్రభుత్వ భూములు, పాటుకాల్వలు, చెరువుల నుంచి మట్టిని తవ్వి ఇసుక ఫిల్టర్ల వద్దకు తరలించడం నేరం. మట్టిని తవ్వే జేసీబీలు, ట్రాక్టర్లను సీజ్ చేస్తాం. వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. అక్రమంగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిస్తే ప్రజలు మాకు సమాచారం ఇవ్వాలి. – శకుంతల, తహసీల్దార్, కొత్తూరు -
నకిలీ నంబర్ ప్లేట్స్
ఇసుకను అదనంగా దోచుకు పోవడానికి లారీ ఓనర్లు కొత్త దందాకు తెరలేపారు. క్వారీల్లో సీరియల్ త్వరగా రావాలనే ఉద్దేశంతో నకిలీ నంబర్ ప్లేట్లను వినియోగిస్తున్నారు. మహదేవపూర్ పోలీసులు నంబర్ ప్లేట్లు మార్చిన మూడు లారీలను పట్టుకోవడంతో విషయం బయటపడింది. ఈ వ్యవహారం ఎప్పటినుంచో జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్‌వాటర్ నిల్వ ఉండటానికి సు మారు 55 కిలోమీటర్ల మేర ఇసుకను తోడేం దుకు రెండేళ్ల క్రితం ఇసుక క్వారీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కాటారం, మహదేవపూర్ మండలాల్లో 22 క్వారీలకు అనుమతివ్వగా ప్రస్తుతం సుమారు 14కు పైగా క్వారీల్లో ఇసుకను తోడి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వారం రోజులకు ఓ లారీకి సీరియల్.. క్వారీల నుంచి లారీల్లో ఇసుకను తీసుకెళ్లడానికి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. తరువాత సంబంధిత క్వారీ పేరు, ఏరోజు ఇసుక లోడ్ అవుతుందో స్లాట్‌లో వివరాలతో కూడిన పత్రం ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఒక నంబర్ లారీకి రెండో స్లాట్ బుక్ కావడా ని సుమారు వారం రోజులు పడుతోంది. దీంతో కొంత మంది త్వరగా సీరియల్ రావడం కోసం ఏకంగా నకిలీ నంబర్ ప్లేట్లను తయారు చేయించి లారీలకు తగిలిస్తున్నారు. లారీలకు సంబం«ధించిన అసలు పత్రాలకు, చెసీ వివరాలు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో పోలీసులు తనిఖీలు చేస్తున్న సందర్భంగా కొందరు దొరుకుతున్నారు. మరికొందరు పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నట్లు సమాచారం. ఈ దందా కొంత కాలంగా నడుస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా తనిఖీలు, సోదాలు పకడ్బందీగా చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ కాగితాలు, ఇన్సూరెన్స్ తదితర అంశాలను çపక్కాగా పరిశీలిస్తుండడంతో లారీల నంబర్ ప్లేట్ల బాగోతం మంగళవారం సాయంత్రం బయటపడింది. మూడు లారీలపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. క్వారీల వద్ద కొరవడిన నిఘా.. ఇసుక క్వారీల్లోకి లారీల ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసిన పత్రం తీసుకు వెళ్తారు. క్వారీలో ఉన్న టీఎస్ఎండీసీ సిబ్బంది ఆ స్లాట్‌ను ఆన్లైన్లో పరిశీలించాల్సి ఉంటుంది. లారీ, చెసీ నంబర్లు సరిపోలితేనే లోనికి పంపించాలి. కొంత మంది టీఎస్ఎండీసీ సిబ్బంది వీటిని పట్టించుకోవడం లేదనే ఆరోణలున్నాయి. మరి కొందరు డబ్బులకు ఆశపడి తేడా కనిపించినా వదిలేస్తున్నారని తెలిసింది. ఇదే అదునుగా లారీ యజమానులు నంబర్ ప్లేట్లు మార్పుచేసి దందా సాగిస్తున్నట్లు సమాచారం. టీఎస్ఎండీసీ అధికారుల అజమాయిషీ కొరవడడంతో యథేచ్ఛగా అక్రమ నంబర్ ప్లేట్ల వ్యవహారం కొనసాగుతోంది. ఆర్టీఏ తనిఖీలు శూన్యం.. కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌కు నిత్యం వందల సంఖ్యలో ఇతర నంబర్ ప్లేట్లతో లారీలు తిరుగుతుంటే ఆర్టీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లారీలకు ఆర్జీఏ జారీ చేసిన నంబర్లు కాకుండా నంబర్ ప్లేట్లపై సొంతంగా రాసుకువస్తున్నట్లు తెలిసింది. ఈవిషయమైన మహదేవపూర్ టీస్‌ఎండీసీ ప్రాజెక్టు అధికారి జగన్మోహన్ను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం.. మహదేవపూర్ మండలంలో క్వారీల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్ట పరమైన కేసులు నమోదు చేస్తాం. ఓవర్‌లోడు, నకిలీ నంబర్ ప్లేట్ల దందాలకు పాల్పడితే లారీలు సీజ్ చేస్తాం. ఇప్పటికే ఓవర్‌లోడు లారీలను పట్టుకొని మైనింగ్ అధికారులకు అప్పచెప్పాం. నంబర్ ప్లేట్లు మార్చి న మూడు లారీలను పట్టుకున్నాం. ఇసుక క్వారీ ల్లో అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తాం. – రంజీత్‌కుమార్, సీఐ, మహదేవపూర్ సర్కిల్ -
యథేచ్ఛగా ఇసుక రవాణా
రాయగడ : జిల్లాలోని కల్యాణసింగుపురం పట్టణ పరిధిలోని లెల్లిగుమ్మ రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు వస్తున్న వార్తలు ప్రసుతం జిల్లాలో సంచలనం రేపుతున్నాయి. కోట్లాది రూపాయాలు విలువ చేసే ఇసుకను అనేక బస్తాలలో నింపి, గూడ్స్ రైలులో తరలిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది రైల్వే అధికారుల అండతోనే దుండగులు ఇసుకమాఫియాకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో పాటు రాజకీయ నేతల అండదండలు కూడా తోడవ్వడంతో అక్రమదారుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. కల్యాణసింగుపురం పరధిలోని నాగావళి నది, ఇతర చిన్న నదుల నుంచి పొక్లెయిన్ల సహాయంతో పెద్ద ఎత్తున ఇసుకను అక్రమదారులు తరలించడం విశేషం. స్థానిక తహసీల్దార్ అనుమతి లేకుండా ఇసుక తరలించడం చట్ట రీత్యా నేరమని తెలిసినా అక్రమదారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే విషయమై జిల్లా అధికారులకు, స్థానిక తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు సార్లు కల్యాణసింగుపురం తహసీల్దార్ అక్రమార్కులపై దాడులు చేసి, వేల సంఖ్యలో ఇసుక బస్తాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో దోపిడీదారులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. నాగావళి నది నుంచి భారీ స్థాయిలో ఇసుకను తరలించడంతో నాగావళి నది వరదలకు గురవుతోందని నదీ పరిసర ప్రాంత ప్రజలు వాపోతున్నారు. దీంతో కల్యాణసింగుపురం పట్టణంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులు ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
వినూత్నంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ముస్తాబాద్(సిరిసిల్ల) : రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలను కేటీఆర్ యువసేన సోమవారం వినూత్నంగా నిర్వహించింది. ముస్తాబాద్ మండలం ఆవునూర్లోని మానేరు వాగులో కేటీఆర్ సైకత శిల్పాన్ని రూపొందించి అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్ యువసేన అధ్యక్షుడు మెంగని మనోహర్ ఆధ్వర్యంలో యువకులు మూడు గంటలు శ్రమించి ఇసుకలో శిల్పాన్ని తయారు చేశారు. అనంతరం అక్కడే కేక్ కట్‌చేసి మిఠాయిలు పంచారు.విశ్వనాథ్, అక్షయ్, చందు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
వారి ధనదాహం.. వీరికి గర్భశోకం!
నందిగామ : ఇసుక దందా ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఇసుక మాఫియా ధన దాహం అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది. ఇష్టారాజ్యంగా సాగించిన తవ్వకాల వల్ల మున్నేరు, ఉప నదుల్లో లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి. నీరు వచ్చిన సమయంలో లోతును అంచనా వేయలేక వాటిలో చిక్కుకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటూరు–జిడుగు మధ్య ఐదుగురు విద్యార్థులు కృష్ణా నదిలో పడి మృతిచెందిన ఘటన మరువక ముందే... నందిగామ మండల పరిధిలోని దాములూరు కూడలి వద్ద వైరా, కట్టెలేరు సంగమ ప్రాంతంలో ముగ్గురు నీట మునిగి చనిపోయారు. నందిగామ మున్నేటిలో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇసుక ఉచిత పంపిణీ పేరిట ప్రభుత్వం అధికారిక క్వారీల నుంచి మాత్రమే ఇసుక తవ్వుకోవాలంటూ నిబంధన విధించినప్పటికీ, ఇసుక మాఫియాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇసుక మాఫియా ఎక్కడబడితే అక్కడ.. ఎలా బడితే అలా... తవ్వకాలు సాగించినా, వేడుక చూసిందే తప్ప ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా కేవలం ఇసుక తవ్వకాల కారణంగానే పలువురు మృత్యువాత పడటం గమనార్హం. ప్రజల ప్రాణాలు పోతున్నా...పట్టించుకోరా....? ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా ప్రజల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నా, ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. అధికారులు కూడా అడపా దడపా దాడులు నిర్వహించి మిన్నకుండిపోతున్నారు తప్ప అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. సమాచారం అందినప్పుడో. ఎవరైనా ఫిర్యాదు చేసిన సందర్భంలోనో స్పందించి అరకొర వాహనాలను స్వాధీనం చేసుకొని జరిమానాలు విధించి సరి పెట్టుకుంటున్నారు. సదరు మాఫియాకు అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో కొన్ని సందర్భాల్లో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఓ పక్క ఉచితమంటూనే మరో పక్క ఇసుక అక్రమ రవాణాకు ప్రభుత్వం ఊతమిస్తుండటంతో ఉచిత ఇసుక పథకం నిష్ప్రయోజనమవుతుండటమే కాకుండా ఇలా ప్రజల ప్రాణాలు బలైపోవడానికి కారణమవుతోంది. నాలుగేళ్లలో తొమ్మిది మంది బలి : చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగేళ్ల కాలంలో ఇసుక మాఫియా కాసుల కక్కుర్తికి నందిగామ నియోజకవర్గంలో మొత్తం తొమ్మిది నిండు ప్రాణాలు బలయ్యాయి. 2016, ఆగస్టు 16న పుష్కర స్నానం కోసం చందర్లపాడు మండల పరిధిలోని ఏటూరు–గుంటూరు జిల్లా జిడుగు మధ్య కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు మునిగి చనిపోయారు. అదే ఏడాది సెప్టెంబర్ 18న వైరా, కట్టెలేరు సంగమ ప్రాంతంలో నందిగామ మండల పరిధిలోని దాములూరు కూడలి వద్ద ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యు ఒడికి చేరుకున్నారు. వాటి నుంచి తేరు కోక ముందే తాజాగా నందిగామ పట్టణ శివారుల్లోని మున్నేటిలో పడి పట్టణానికి చెందిన షక్ నూర్ అహ్మద్ ఖాన్ అనే బాలుడు కన్ను మూశాడు. ఈ మూడు సంఘటనలు ఇసుక మాఫియా కాసుల కక్కుర్తి కారణంగానే జరిగాయన్నది నిర్వివాదాంశం. 2016లో జరిగిన రెండు ఘటనలు ఇసుక అక్రమ తవ్వకాల వల్లే జరిగాయంటూ వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించగా, సదరు నాయకులపై కేసులు సైతం నమోదయ్యాయి. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేయలేకపోతోందని, ఇంకా ఎంత మంది ప్రాణాలను బలిగొంటే ఇసుక మాఫియా ధన దాహం తీరుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ నందిగామ : మునేటిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణానికి చెందిన నూర్ అహ్మద్‌ఖాన్ అనే బాలుడు మున్నేటిలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడిన ఘటన పాఠకులకు విదితమే. ఈ నేపధ్యంలో సోమవారం మృతదేహం లభ్యమవ్వడంతో అధికారులు పంచనామా నిమిత్తం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని సందర్శించిన ఆయన బాలుడికి నివాళి అర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసి రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. డాక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, కేవలం అక్రమ ఇసుక రవాణా కారణంగానే అనేక మంది నిండు ప్రాణాలు నీటిపాలవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అనేక మంది మృత్యువాత పడ్డారన్నారు. అధికార పార్టీ ధనదాహానికి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మునేటిలో మృతి చెందిన నూర్ అహ్మద్‌ఖాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు కత్తురోజు శ్రీనివాసాచారి, మహమ్మద్ మస్తాన్, షేక్ ఖాలిఖ్, బొల్లినేని శ్రీనివాసరావు, ఆవుల విజయ్, ముఖర్జి, ఖాసీంఖాన్ ఉన్నారు. -
లారీ.. సారీ
శ్రీకాకుళం, సరుబుజ్జిలి: పాతికలారీలు.. సుమారు రూ.13 కోట్ల విలువ.. వారం రోజుల నిరీక్షణ.. ఆఖరకు మిగిలింది మాత్రం నిరాశ. పురుషోత్తపురం ఇసుక ర్యాంపులోని వంశధార వరదల్లో చిక్కుకున్న 25 లారీలు బయటపడే మార్గాలు దుర్లభమైపోతున్నాయి. లారీలు వరదలో చిక్కుకుని సుమారు వారం రోజులు గడుస్తున్నాయి. నదిలో ప్రవాహం తగ్గుముఖం పట్టిన సమయంలో ఆదరాబాదరాగా పొక్లెయిన్లను తొలగించారు. ఈ పొక్లెయిన్ల యజమానులు కొందరు టీడీపీ నాయకులకు దగ్గరి వారు కావడంతో ముందుగా ఆ వాహనాలను బయటకు తీయించారు. కానీ లారీల విషయంలో మాత్రం అధికారులు పట్టనట్టే వ్యవహరిస్తున్నారని ఆ వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదికి మళ్లీ వరదలు వారం రోజులు గడవక ముందే వంశధార నదిలోకి మళ్లీ వరద వచ్చింది. నదిలో నీరు తగ్గితే వాహనాలు బయటకు తీయవచ్చని ఆశపడిన లారీల యజమానులకు ఈ వరద పీడకలగా మారుతోంది. ఒక్కో లారీని రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేశామని, అంతా ఫైనాన్స్ మీదే తెచ్చామని లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.13 కోట్ల విలువైన వాహనాలు నదిలోనే ఉండిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని వారంటున్నారు. ఒడిశా ప్రాంతంలో విస్తారంగా వానలు కురవడంతో వంశధారలో ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో లారీలను బయటకు తీసే ప్రక్రి య మరింత ఆలస్యం కావచ్చు. ఇప్పటికే వారం రోజులుగా లారీలు నీటిలోనే ఉండిపోవడం వల్ల భాగాలు పాడవుతాయని, వరదల వల్ల లారీలు కూడా మిగిలే పరిస్థితులు కనిపించడం లేదని యజమానులు వాపోతున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కుటుంబాలతో కలసి వచ్చి సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తామని ప్రకటించారు. నీరు గారుతున్న దర్యాప్తు సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎవరిపైనా చర్యలు లేకపోవడంతో కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీ సు వారి చేతిలో ఫైలు ఉందని చెబుతున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. విచారణ కోసం ఏ ఒక్క అధికారిని కూడా జిల్లా అధికారులు నియమించలేదు. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్న మాఫియా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇసుక మాఫియా మళ్లీ పేట్రేగిపోతోంది! వారం పది రోజుల వ్యవధిలోనే ధరలు రెట్టింపు కావడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. హైదరాబాద్‌లో వారం కింద రూ.40 వేలు పలికిన 25 టన్నుల ఇసుక లారీ ధర ఏకంగా రూ.87 వేలకు చేరింది. మొన్నటిదాకా టన్ను రూ.1,600–1,700 పలికిన నాణ్యమైన సన్న ఇసుక ధర రూ.3,400–3,500కు ఎగబాకింది. సిమెంట్ ఇటుకలు, శ్లాబుల నిర్మాణానికి వినియోగించే దొడ్డు ఇసుక టన్నుకు రూ.1,300–1,400 నుంచి రూ.2,500–2,600కు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలతో తవ్వకాలు, రవాణా నిలిచిపోయి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఇసుక కొరత ఏర్పడింది. ఇందుకు లారీల సమ్మె మరింత ఆజ్యం పోసింది. ఇదే అదనుగా మాఫియా, దళారులు రెచ్చిపోతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, సాగునీటి, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ముందస్తుగా బుక్ చేసుకున్న ఇసుకను కాంట్రాక్టర్లు బ్లాక్‌లో విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. 2014 డిసెంబర్లో ప్రకటించిన కొత్త ఇసుక విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు, ఉపనదుల ఇసుకతోపాటు జలాశయాల్లోని ఇసుక పూడికల తవ్వకాల బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కు బదలాయించింది. ఏటా జూలై–అక్టోబర్ మధ్య వర్షాలతో ఇసుక తవ్వకాలు, రవాణాకు ఆటంకం కలగడం, మాఫియా రంగంలోకి దిగి ధరలు పెంచేయడం గత నాలుగేళ్లుగా కొనసాగుతోంది. కొత్త విధానంలో ప్రభుత్వం.. క్వారీల్లో ఇసుక వ్యాపారులకు విక్రయించే ఇసుక ధరలను మాత్రమే నిర్ణయించింది. ప్రజలకు విక్రయించాల్సిన రిటైల్ ధరలను నిర్ణయించకపోవడంతో ఇసుక వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వర్షాలతో నిలిచిన తవ్వకాలు రాష్ట్రంలోని పాత ఏడు జిల్లాల పరిధిలోని గోదావరి తీరంలో 56 చోట్లలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గతేడాది టీఎస్ఎండీసీకి అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం 30 చోట్ల మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇందులో 25 భారీ, మరో ఐదు చిన్న రీచ్‌లున్నాయి. ఈ రీచ్‌ల నుంచి తవ్విన ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేసి ఆన్లైన్ బుకింగ్ ద్వారా టీఎస్ఎండీసీ విక్రయిస్తోంది. సాధారణంగా టీఎస్ఎండీసీ ప్రతి రోజూ 40 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను బుకింగ్ కోసం అందుబాటులో ఉంచేది అందులో 30 వేల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక అమ్ముడయ్యేది. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గత 10 రోజులుగా ఇసుక తవ్వకాలు, రవాణాకు ఆటంకం ఏర్పడింది. రీచ్‌లు, స్టాక్ యార్డులకు వెళ్లే దారులు దెబ్బతినడంతో వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా రోజువారీగా ఆన్లైన్ బుకింగ్ ద్వారా రోజుకు 9 వేల నుంచి 12 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే టీఎస్ఎండీసీ విక్రయిస్తోంది. ఫలితంగా ఇసుక కొరత తీవ్రమైంది. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ కోసం వ్యాపారులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇసుక అవసరం ఉన్నవారు టీఎస్ఎండీసీ పేరిట మీ సేవా, ఆన్లైన్ కేంద్రాలకు డబ్బులు చెల్లించి రశీదు పొందితే వారి బుకింగ్ ఆర్డర్ మేరకు స్టాక్ పాయింట్ల వద్ద లారీల్లో ఇసుక నింపుతున్నారు. క్యూబిక్ మీటర్‌కు రూ.550 (టన్నుకు రూ.357.5) చొప్పున ప్రభుత్వం ఇసుకను రీచ్‌ల వద్ద విక్రయిస్తోంది. అయితే రవాణా కోసం అవసరమైన లారీలు ఇసుక వ్యాపారుల వద్దే ఉండడంతో దళారుల ప్రమేయం లేకుండా సామాన్య ప్రజలు ఇసుకను పొందలేకపోతున్నారు. ఇసుక వ్యాపారులే ఆన్లైన్లో బుక్ చేసుకొని అవసరమైన వారికి హైదరాబాద్‌లో టన్నుకు రూ.1600–1700లు, జిల్లాల్లో రూ.1200కు చొప్పున విక్రయించేవారు. హైదరాబాద్‌లో 25 టన్నుల ఇసుక లారీ రూ.40 వేలలోపు ధర పలికేది. ప్రస్తుతం కొరత ఉండడంతో టన్ను ఇసుక ధరను అడ్డగోలుగా రూ.3,400–3,500కు పెంచేశారు. లారీ ఇసుక ధర రూ.40 వేల నుంచి రూ.87 వేలకు పెంచడంతో సామాన్యులతోపాటు బిల్డర్లు గగ్గోలు పెడుతున్నారు. సర్కారీ కాంట్రాక్టర్ల బ్లాక్ దందా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానేరు నది పరిధిలోని నాలుగు రీచ్‌లలోని ఇసుకను డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, మరో ఆరు రీచ్‌లలోని ఇసుకను పూర్తిగా సాగునీటి, ఇతర ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక మొత్తాన్ని నిర్ధారిస్తూ సంబంధిత ప్రాజెక్టుల నిర్వహణ అధికారులు జారీ చేసిన అంచనా నివేదిక ఆధారంగా టీఎస్ఎండీసీ నుంచి కాంట్రాక్టర్లు నేరుగా ఇసుక కొనుగోలు చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్లు.. ఇంజనీరింగ్ శాఖల అధికారులను ప్రలోభపెట్టి ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక కన్నా ఐదారు రెట్లు ఎక్కువగా అంచనాలను తెచ్చుకుంటున్నారు. వాటి ఆధారంగా టీఎస్ఎండీసీ నుంచి ఒకేసారి బల్క్‌గా ఇసుక కొనుగోలు కోసం ఆర్డర్లు పొందుతున్నారు. ఆ ఆర్డర్ల ఆధారంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు టీఎస్ఎండీసీకి డీడీలు చెల్లించి నేరుగా మానేరు రీచ్‌ల నుంచి ఇసుకను తరలించుకుపోతున్నారు. ఇసుక కొరత నెలకొన్న సమయంలో కూడా ప్రభుత్వ పనులకు ఆటంటం కలగకూడదన్న ఉద్దేశంతో టీఎస్ఎండీసీ కాంట్రాక్టర్లు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఇసుక విక్రయిస్తోంది. కాంట్రాక్టర్లు అవసరానికి మించి బుక్ చేసుకున్న ఇసుకకు సంబంధించిన ఆర్డర్లను ఇసుక వ్యాపారులకు బ్లాకులో విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్లైన్లో 25 టన్నుల లారీ ఇసుక కోసం వ్యాపారులు టీఎస్ఎండీసీకి రూ.8,889 డీడీని చెల్లిస్తే కొనుగోలు ఆర్డర్ జారీ అవుతోంది. ప్రస్తుతం టీఎస్ఎండీసీ ద్వారా ఆన్లైన్లో ఇసుక విక్రయాలు తగ్గిపోవడంతో సర్కారీ కాంట్రాక్టర్లు 25 టన్నుల ఇసుక ఆర్డర్‌ను ఇసుక వ్యాపారులు, లారీల యజమానులకు బ్లాక్‌లో రూ.20 వేలకు అమ్ముకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా ఇసుక ధరలు రెట్టింపు అయ్యాయి. సర్కారీ పనుల కోసం కేటాయించిన ఇసుకను దారి మళ్లించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న లారీలు నిత్యం పట్టుబడుతున్నా.. కేవలం వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధిక ధరకు కొనుగోలు చేయకండి: టీఎస్ఎండీసీ గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు, రహదారులు దెబ్బతినడంతో ఇసుక సరఫరాలో కొంత ఇబ్బంది కలుగుతోందని టీఎస్ఎండీసీ వైస్ చైర్మన్, ఎండీ జి.మల్సూర్ తెలిపారు. వినియోగదారులకు సరిపడ ఇసుకను రోజువారీగా సరఫరా చేయలేకపోతున్నామన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇసుక దళారులు మార్కెట్లో అధిక ధరకు ఇసుక విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అధిక ధరకు ఇసుక కొనుగోలు చేయొద్దని, కొన్ని రోజులు వేచి ఉంటే ధరలు సాధారణ స్థితికి వస్తాయని సూచించారు. వర్షాకాలంలో వినియోగదారులకు సరఫరా చేసేందుకు స్టాక్ యార్డుల్లో 50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక 25 ప్రాంతాల్లో అందుబాటులో ఉందని, ఇసుక కొరత లేదని చెప్పారు. ప్రభుత్వ పనులకు కేటాయించిన ఇసుకను దారి మళ్లించి బ్లాక్‌లో విక్రయిస్తున్న లారీలను పట్టుకుని బ్లాక్‌లిస్టులో పెడుతున్నామని వివరించారు. -
ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్!
శ్రీకాకుళం బుజ్జిలి: పురుషోత్తపురం ఇసుక ర్యాంపు వ్యవహారం నీరు గార్చేందుకు తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక వ్యాపారంతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్న వ్యక్తులు ప్రస్తుతం ఎక్కడెక్కడో దాక్కుక్కున్నారు. ఏపాపం ఎరుగని లారీ డ్రైవర్లు, క్లీనర్లపై అక్రమ కేసులు బనాయించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారనే విమర్శలున్నాయి. వంశధారకు వరద వచ్చి.. ఇసుక కోసం వెళ్లి అందులో లారీలు చిక్కుకున్న సంఘటన జరిగి 6 రోజులు గడుస్తున్న కేసు విషయంలో ఎటువంటి పురోగతి కనిపించడంలేదు. ఇసుక వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినా అసలైన దొంగలను విడిపెట్టి, అమాయకుల వైపుదృష్టిసారించడంతో ప్రజల నుంచి పలు విమర్శలువ్యక్త మవుతున్నాయి. ఒడిశాలో దాక్కున్న నిర్వాహకుడు! పురుషోత్తపురం ఇసుక ర్యాంపులో ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టిన కీలకపాత్రధారి తమ్మినేని సంతోష్‌కుమార్ (సంతు)సంఘటన జరిగిన కొద్ది గంటల్లో ఒడిశాకు పరారైపోయినట్టు సమాచారం. అధికార పక్షానికి చెందిన ప్రధాననేతకు ఇసుకనుంచి రోజువారీ వసూళ్లను చేరవేసే ప్రధాన వ్యక్తి ఇతనే కావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇసుక ర్యాంపులోపనిచేసినందుకు 45 ట్రాక్టర్లకు కూడా సుమారు రూ. 20 లక్షల వరకు నగదు చెల్లించాలి. అలాగే పగలంతాపని చేసిన సుమారు 600 మందికూలీలకు వేతనం కూడా బకాయి ఉన్నట్లు తెలిసింది. పోలీస్‌స్టేషన్ ఆవరణలో పొక్లయిన్.. జలుమూరు మండలం అ«ంధవరం వద్ద వద్దపట్టుబడిన పొక్లయిన్‌ను సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉంచారు. వాహనంపై ఎటువంటి నంబర్ లేకపోవడంతో వాహన యజమానుల వివరాలు బయటకు రాలేదు. నదిలో 25 లారీలు.. వంశధార ఇసుక ర్యాంపులో 23 లారీలు వరదలో చిక్కకున్నట్లు భావించారు. అయితే శుక్రవారం సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది నదిలో ఈతకొట్టుకొని వెళ్లి లారీలను పరిశీలించారు. వరద నీటిలో 25 లారీలు ఉన్నాయి. వాటినంబర్లు కూడా గుర్తించారు. కాగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వంశధార మరోసారి వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో లారీల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. -
ఇసుక మాఫియా హత్యలు!
సాక్షి, అమరావతి: ఇసుక మాఫియా ధనదాహం అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది. అక్రమంగా ఇసుకను తరలిస్తూ వేగంగా వెళ్లే వాహనాల కింద నిండు జీవితాలు నలిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీడీపీ నాయకులే ఇసుక దందాలో కీలక సూత్రధారులుగా ఉండటంతో బాధిత కుటుంబాలు నిస్సహాయంగా మిగిలిపోతున్నాయి. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ విప్ చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడికి తెగబడటం తెలిసిందే. ఇదే తరహాలో పలుచోట్ల అధికారులు, ప్రజలపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇసుక దందాపై నిలదీసిన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు. విచ్చలవిడిగా తవ్వకాలు: ఇసుక మాఫియా ధనదాహం వందల ప్రాణాలను కబళిస్తున్నా సర్కారులో చలనం లేదు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలతోపాటు ఏరులు, కాలువల్లో యథేచ్చగా సాగుతున్న తవ్వకాలు, అక్రమ రవాణా జనం ప్రాణాలపైకి వస్తోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 11 మందికిపైగా మృతి చెందగా చిత్తూరు జిల్లాలో ఇసుక దిబ్బలు పడి ఏడుగురు, ఇసుక లారీ ఢీకొని 16 మంది మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో 13 మందికిగాపైగా ఇసుక మాఫియాకు బలయ్యారు. ఇసుక దిబ్బల్లో ఏడుగురు సజీవ సమాధి: చిత్తూరు జిల్లాలో భిన్నమైన పరిస్థితిలో ఇసుక మరణాలు సంభవించాయి. ఇసుక దిబ్బల కింద పడి నాలుగేళ్లలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి, గంగవరం, పలమనేరు, పెద్దపంజాణిల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. నాణ్యమైన ఇసుక కోసం సొరంగం మాదిరిగా భూగర్భంలో తవ్వుతుండగా ఒక్కసారిగా దిబ్బలు విరిగి కూలీల మీద పడటంతో చనిపోతున్నారు. పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి, పుంగనూరు నియోజకవర్గం చెదళ్లలో ఇలాంటి ఘటనలు జరిగాయి. తవ్వకాలు ఆపమంటే.. లారీ తొక్కేసింది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గత ఏడాది ఏప్రిల్ 21న జరిగిన ఘటన కలకలం సృష్టించింది. స్వర్ణముఖిలో ఇసుక అక్రమ రవాణా ఆపాలంటూ మునగపాళ్యం రైతులు ఏర్పేడు తహశీల్దార్ ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. తహశీల్దార్ లేకపోవడంతో తిరుపతి అర్బన్ ఎస్పీని కలిసేందుకు ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో ఓ లారీ హఠాత్తుగా రైతులపైకి దూసుకురావటంతో 16 మంది మరణించారు. 21 మంది తీవ్రంగా గాయపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గాల్లో కలిసిన ప్రాణాలెన్నో... - శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయతీ పరిధి సింహద్వారం సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై ఈ ఏడాది ఏప్రిల్ 28న తమ్మినాయుడుపేట రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో బోనం కాంతమ్మ అనే మహిళ మరణించింది. - శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం మకరాంపురం కూడలి వద్ద ఈ ఏడాది జూన్ 14న ఇసుక ట్రాక్టర్ ఢీకొనటంతో ఒడిశా గజపతి జిల్లా లింగుపురం గ్రామానికి చెందిన లోళ్ల మధుసూదనరావు మృతి చెందాడు. ప్రమాదంలో ఆయన సోదరుడు రామారావు తీవ్ర గాయాల పాలయ్యాడు. - శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిధిలోని బెల్లుపడ వద్ద గతేడాది మార్చి 25న ఇసుక ట్రాక్టర్ కింద పడి ఆసి హైమ (38) మృతి చెందారు. - శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఇసుక తరలిస్తున్న వాహనం ఢీకొని మల్లయ్యపేటకు చెందిన బొబ్బిలి చంద్రశేఖర్ (13) అక్కడికక్కడే మృతి చెందగా గొల్లవీధికి చెందిన పిల్లల రాజేంద్ర తీవ్ర గాయాల పాలయ్యాడు. - పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గుటాల ఇసుక ర్యాంపు వద్ద ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఇసుక లారీ ఢీకొట్టడంతో పాతపట్టిసీమ గ్రామానికి చెందిన కాకి గోపాలకృష్ణ (42) దుర్మరణం పాలయ్యాడు. - వైఎస్సార్ జిల్లాలో ఇసుక ట్రాక్టర్ల కింద పడి ముగ్గురు మరణించారు. 2017 మార్చి 5న గోపిరెడ్డి రమేష్‌రెడ్డి (23), 2017 జూన్ 30న సి.మురళీకుమార్ (33), 2018 ఫిబ్రవరి 6న కనిమెల జయమ్మ అక్రమ ఇసుక తరలిస్తున్న వాహనాలకు బలయ్యారు. - కర్నూలు జిల్లాలో గత రెండేళ్లలో నలుగురు చనిపోయారు. 2017 జూలై 27న రెండేళ్ల చిన్నారి నాని, మద్దిలేటి (30) ఇసుక వాహనాలు ఢీకొనటంతో చనిపోయారు. ఈ ఏడాది జూన్ 27న మధు(22), మనోహర్(20)లు దుర్మరణం పాలయ్యారు. ‘తూర్పు’న అత్యధిక ప్రమాదాలు.. - తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక ప్రమాదాలు అత్య«ధికంగా జరిగాయి. వేగంగా వచ్చిన వాహనాలు ఢీకొనడంతో గత నాలుగేళ్లలో జిల్లావ్యాప్తంగా 12 మందికిపైగా మరణించారు. - 2018 మే 26న తునిలోని ఇసుకలపేటలో విద్యార్థిని చలికే ఎస్తేరురాణి(10) ఇసుక ట్రాక్టరు ఢీకొనటంతో మృతి చెందింది. - 2018 జనవరి 9న కోరుమిల్లి ఇసుక ర్యాంపులో పనిచేసే సలాది సత్తిబాబు లారీ తగలటంతో మరణించాడు. - 2017 నవంబరు 18న తాతపూడి శివారు గోపాలరావుపేట వద్ద గోదావరి గట్టుపై ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టడంతో కేదారిలంక గ్రామానికి చెందిన గంధం ఈశ్వరరావు (32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వీరా జయబాబు (26)ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. - 2017 నవంబర్ 11 సీతానగరం వద్ద వంగలపూడి ర్యాంపు నుంచి వచ్చే ఇసుక లారీ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి పేపకాయల మోహన్ శివసాయి మృతి చెందాడు. - 2017 ఆగస్టు 20న సీతానగరానికి చెందిన ఈలి భాస్కరరావు (65) రాత్రి వేళ అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌కు బలయ్యాడు. - 2017 జూన్ 7న కపిలేశ్వరపురం మండలం చినకోరుమిల్లికి చెందిన గంగుమళ్ల సూర్యచంద్రరావు (51) రాత్రి వేళ లంక పొలం నుంచి సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా ఇసుక వాహనం ఢీకొని మత్యువాత పడ్డాడు. - 2017 మార్చి 1న రఘుదేవపురంలో ఇసుక లారీ ఢీకొనడంతో పన్నెండేళ్ల నందిపాటి నవీన్‌కుమార్‌కు కుడి కాలు తొలగించారు. - గతేడాది ఇసుక వాహనం ఢీకొన్న ఘటనలో కడియం నర్సరీలో పనిచేసేందుకు వెళుతున్న కపిలేశ్వరపురం సత్యనారాయణపురానికి చెందిన 14 మందికి కూలీలకు గాయాలయ్యాయి. - 2016 జూన్ 15న కాటవరం ర్యాంపు నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొనడంతో మునికూడలి పంచాయతీ రాజంపేటకు చెందిన మామిడి దుర్గ (32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. - 2015 మే 25న అచ్యుతాపురం వద్ద ఇసుక లారీ ఢీకొట్టడంతో వల్లూరుకు చెందిన పాలచర్ల సత్యనారాయణ చనిపోయాడు. - 2014 మార్చి 20న కపిలేశ్వరపురంలో ఇసుక ట్రాక్టరు ఢీకొనడంతో టేకికి చెందిన మేడిశెట్టి చంద్రావతి దుర్మరణం పాలైంది. -
ఇసుక లారీ బీభత్సం ఒకరు మృతి
-
ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా
కాటారం : ఇసుక లారీల కారణంగా వందలాది మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా ప్రభ్వుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. మండలంలోని నస్తూర్‌పల్లి సమీపంలో ఇసుక టిప్పర్ ఢీకొని యువ రైతు బాల్నె జనార్దన్ మృతి చెందగా శ్రీధర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం, టీఆర్ఎస్ అక్రమాజర్జన కోసం ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఇసుక లారీల కారణంగా రోజుకు ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని, చాలా మంది వికాలాంగులుగా నరకం అనుభవిస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కోట్ల బడ్జెట్ వస్తుందని చూస్తుందే తప్పితే ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారని మాత్రం ఆలోచించడం లేదన్నారు. ప్రభుత్వానికి ఇసుక మాఫీయా అవసరం తప్పితే ప్రజల ప్రాణాలు అవసరం లేదని విమర్శించారు. నిబంధనలకు విరుద్దంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అక్రమ దందాలను అడ్డుకునేందుకు యత్నించిన పోలీస్ అధికారులను సైతం అక్రమార్కులు ప్రభుత్వంతో కుమ్మకై బదిలీ చేయించారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక మాఫీయా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, క్వారీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏ చట్టం ప్రకారం అటవీశాఖ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుడు జనార్దన్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి న్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, ఎంపీటీసీలు సమ్మయ్య, భాస్కర్, నాయకులు ప్రకాశ్‌రెడ్డి, సందీప్, బాపురెడ్డి, ప్రభాకర్, నరేశ్, వెంకటస్వామి, రమేశ్‌రెడ్డి, విక్రమ్, రామిళ్ల కిరణ్, మాజీ ఎంపీపీ బాపు, వామనరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో తెలుగు తమ్ముళ్ల ఇసుక దోపిడీ
-
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్) : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. ఇసుక విధానంపై కలెక్టర్ శనివారం తన చాంబర్ నుంచి తహసీల్దార్లు, ఈవోఆర్డీలు తదితరులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో సమీక్షించారు. జిల్లాలోని 16 రీచ్‌ల నుంచి ఇసుక అక్రమంగా తరలించకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే ఇందులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టాలని సూచించారు. ఇసుక విధానం అమలుకు జిల్లా స్థాయిలో తాను చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ కన్వీనర్‌గా ఉంటారని, డ్వామా పీడీ, పంచాయతీ రాజ్ ఎస్ఈ, డీపీవో, జెడ్పీ సీఈవోలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దారు ఆధ్వర్యంలో కమిటీ ఉంటుందన్నారు. ప్రతి ఇసుక రీచ్‌కు డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఈవోఆర్డీలను ఇన్‌చార్జ్‌లుగా నియమించాలన్నారు. ఏ రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలినా ఆ ఇన్‌చార్జ్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రీచ్‌లకు ఉపాధి హామీ నిధులతో రోడ్లు వేస్తామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక తరలించుకోవాలంటే విధిగా ప్రొసీడింగ్స్‌తో పాటు వాహనాలనంబ ర్లు, ఎన్ని ట్రిప్పుల ఇసుక అవసరం తదితర వివరాలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తీసుకోవాలంటే పక్కాగృ హం మంజూరు పత్రం ఉండాలన్నారు. ప్రయివేటు ఇళ్ల నిర్మాణాలకైతే పంచాయతీ సెక్రటరీల ధ్రువీకరణ అవసరమన్నారు. సమావేశంలో జా యింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జెడ్పీ సీఈవో విశ్వేశ్వరనాయుడు, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, డీపీవో ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించండి డయల్ యువర్ కలెక్టర్, మీ కోసంలో వచ్చిన ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 26 మంది తమ సమస్యలను ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కమిషనర్‌కు అభినందన నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డిని కలెక్టర్ సత్యనారాయణ అభినందించారు. నగరంలో అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడం, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినందుకు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు లభించడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీ–2 సుబ్బారెడ్డి, డీఆర్వో శశీదేవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిజాయితీ సేవకు ‘బదిలీ’ బహుమానం!
సాక్షి, భూపాలపల్లి : పని చేసిన 11 నెలల్లోనే ఆయన తన మార్క్ చూపించారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీల ఆట కట్టించారు. పల్లెల్లో విచ్ఛలవిడిగా వెలసిన బెల్ట్‌షాపుల బెల్ట్ తీశారు. కొందరు పెద్దమనుషులు చేసే సెటిల్మెంట్లను కట్టడి చేశారు. అక్కమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న కాటారం సీఐ శంకర్‌రెడ్డి అనతికాలంలోనే బదిలీని బహుమతిగా అందుకున్నారు. దీని వెనక ఇసుకాసురుల లాబీయింగో.. అధిక పార్టీ నేతల ఒత్తిడో బలంగా పని చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒత్తిళ్లతోనే బదిలీ ? జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటు అనంతరం సీఐ శంకర్‌రెడ్డి ఇక్కడ స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తించారు. ఆయన పనితీరును గమనించిన పోలీసు ఉన్నతాధికారులు కీలకమైన కాటారం సర్కిల్‌కు బదిలీ చేశారు. ఇక్కడ సాఫీగా పని చేస్తున్న క్రమంలోనే హఠాత్తుగా జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కి తిరిగి బదిలీ చేశారు. అయితే సీఐ బదిలీ వెనుక ఇసుకాసురుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిక లోడ్‌తో వెళ్లే ఇసుక లారీలను అరికట్టడం, అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించడం మూలంగానే కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పోలీసు ఉన్నతాధికారులపై రాష్ట్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఐ బదిలీని రద్దు చేయాలని, ఇక్కడే కొనసాగించాలంటూ పలు ప్రజాసంఘాల నాయకులు స్వయంగా కాటారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడం, టీఆర్ఎస్ నాయకులు టపాసులు పేల్చడంతో అనుమానాలు బలపడుతున్నాయి. వందలాది కేసులు.. అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా కాటారం డివిజన్లో జరిగే అనేక అక్రమ కార్యకలాపాలను సదరు సీఐ నిరోధించారనే పేరుంది. గుట్కా, డ్రంక్ అండ్ డ్రైవింగ్, బెల్ట్‌షాపులు, క్యాట్ ఫిష్ రవాణాను ఆశించిన స్థాయిలో నివారించినట్లు స్థానికులు తెలుపుతున్నారు. క్యాట్‌ఫిష్‌లను తరలిస్తున్న 7 వాహనాలు, అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న 10 వాహనాలు, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న 20 లారీలు, 150 ఓవర్‌లోడ్ ఇసుక లారీలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. 25 మంది గుడుంబా తయారీ, విక్రయదారులు, 40 మంది బెల్టుషాపు నిర్వాహకులపై కేసులు పెట్టారు. 20 మంది గుట్కా విక్రయదారుల పట్టివేతతోపాటు ఏకంగా 20 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. గురువారం సైతం అధిక లోడ్‌తో వెళ్తున్న 36 ఇసుక లారీలను పట్టుకొని కేసు నమోదు చేనినట్లు తెలిసింది. విధి నిర్వహణతో కచ్చితంగా ఉండే పోలీసు అధికారిని హఠాత్తుగా బదిలీ చేయడంపై పోలీసుశాఖలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు భరోసా.. కాటారం ఠాణాకు వచ్చిన పంచాయతీలన్ని పోలీస్‌స్టేషన్ వెనుక భాగంలోని మామిడి చెట్టు కింద కొందరు పెద్ద మనుషులు సెటిల్మెంట్లు చేస్తారనే ఆరోపణలు ఉండేవి. కాగా శంకర్‌రెడ్డి విధుల్లో చేరిన అనంతరం ఈ పంచాయతీలకు చెక్ పెట్టడంతో సామన్య ప్రజలు సైతం పెద్ద మనుషులను ఆశ్రయించకుండా నేరుగా స్టేషన్‌కు వచ్చేదని స్థానికులు తెలుపుతున్నారు. -
ఆగని ఇసుక దందా
రేణిగుంట మండలంలో ఇసుక మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా స్వర్ణముఖీ నదిలోని అనధికారిక రీచ్‌ల నుంచి ఇసుకను నిరాటంకంగా తరలిస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు పలుమార్లు దాడులు జరిపి కేసులు బనాయించినా మార్పు కనిపించడం లేదు. పంట పొలాల్లోనే ఇసుకను తోడేస్తున్నారు. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం నెలకొంది. సాక్షి, రేణిగుంట : మండలంలోని స్వర్ణముఖీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఏర్పేడు దుర్ఘటన నేపథ్యంలో కొంతకాలం పాటు మెరుపుదాడులతో అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. అనంతం పర్యవేక్షణ లోపించడంతో మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రేణిగుంట మండలం కొట్రమంగళం, గాజులమండ్యం, వెంకటరెడ్డి కండ్రిగ, జీపాళెం, కొత్తపాళెం, జీవాగ్రం తదితర గ్రామాల నుంచి నిత్యం వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నాయి. నకిలీ పర్మిట్లతో.. నకిలీ పర్మిట్లతో కొట్రమంగళం ప్రాంతం నుంచి నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుకను తిరుపతికి తరలించి సొమ్ముచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారులు అడపాదడప దాడులు నిర్వహిస్తున్నా వీరు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. అధికారికంగా ఇసుక రీచ్‌లు నడుస్తున్నా చాలా వరకు సరైన పర్మిట్లు లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా అరికట్టే బాధ్యత వీరిది.. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు అధికారిక రీచ్‌ల నుంచి ఇసుక తరలింపు పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీ ఉంది. వీరిలో తహసీల్దార్‌తోపాటు, పోలీసు అధికారులు, ఎంపీడీఓ, గ్రామ రెవెన్యూ అధికారి, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు సభ్యులుగా ఉంటారు. అయితే క్షేత్రస్థాయిలో కేవలం రెవెన్యూ, పోలీసు అధికారులనే బాధ్యులను చేస్తున్న పరిస్థితి. తరలింపు నిబంధనలివీ.. అధికారికంగా ప్రభుత్వం అనుమతించిన ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ప్రజా అవసరాల నిమిత్తం తరలించడానికి ట్రాక్టర్ యజమానులు కొన్ని నిబంధనలు పాటించాలి. అధికారిక రీచ్‌లలో అదనపు రేట్లు ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వం మండలంలో నాలుగు చోట్ల అధికారిక రీచ్‌లను ఏర్పాటు చేసింది. అయితే ఇసుకాసురులు ప్రభుత్వం విధించిన నియమాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన పర్మిట్లు లేకపోగా అధిక ధరలకు అమ్ముకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. అయితే అన్నీ తెలిసినా అధికారులు ఎందుకు మిన్నకుంటున్నారో అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను నివారించండి మండలంలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ పూర్వస్థితికి చేరింది. కొందరు నకిలీ పర్మిట్లు సృష్టించి ఇసుకను అనధికారికంగా తరలిస్తున్నారు. ఇసుకను ఉచితం చేసినా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు ట్రాక్టర్ల యజమానులు విక్రయించడం లేదు. రెవెన్యూ, పోలీసు అధికారులు నిఘా పెట్టాలి. – ప్రభాకర్, రేణిగుంట చర్యలు తీసుకుంటాం ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఎవరైనా నా దృష్టికి తీసుకొస్తే పోలీసు అధికారుల సహకారంతో తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలు మార్లు దాడులు చేసి కేసులు పెట్టాం. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినా చర్యలు తప్పవు. – నరసింహులునాయుడు, తహసీల్దార్, రేణిగుంట -
దర్జాగా ఇసుక దందా
ఖానాపూర్ : జిల్లాలోని ఖానాపూర్, పెంబి మండలాల్లోని వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వాగులతోపాటు అటవీ ప్రాంతంలోని ఒర్రెల నుంచి కూడా ఇసుకను తరలించి సమీప గ్రామాల్లో పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా జిల్లా కేంద్రంతోపాటు ఇతర మండలాలకు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా పట్టపగలే జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రధాన రోడ్ల గుండా దినమంతా ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకున్న అధకారి లేడు. అంతేకాకుండా ఖానాపూర్, పెంబి మండలాల్లోని ఆయా వీడీసీల ఆధ్వర్యంలో ఇసుక తరలింపునకు అనధికారికంగా టెండర్లు నిర్వహిస్తున్నా.. ఆయా శాఖల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అనధికార టెండర్లు నిర్వహిస్తున్నా.. ఖానాపూర్, పెంబి మండలాల మధ్య గల రాజూరా శివారులోని పల్కేరు వాగుతోపాటు పెంబి మండలంలోని ఇటిక్యాల, పస్పుల పంచాయతీల పరిధిలోని కడెం వాగు, ఖానాపూర్ మండలంలోని సోమర్పేట్, బీర్నంది గ్రామాల సమీపంలోని బల్లివాగు, మండల కేంద్రం, బాదన్‌కూర్తి సమీపంలోని గోదావరి తీరం నుంచి ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. ఖానాపూర్ మండలంలోని రాజూరా, పెంబి మండలంలోని మందపల్లి గ్రామాల్లో వీడీసీలు అనధికార టెండర్లు నిర్వహించినట్లు సమాచారం. శివారు ప్రాంతాల్లో డంపులు.. అక్రమంగా తరలించిన ఇసుకను నేరుగా విక్రయించడంతోపాటు రాత్రివేళ వాగుల నుంచి తరలించిన ఇసుకను ఆయా గ్రామాల శివార్లలో.. వ్యవసాయ పొలాలు, పంటచేల వద్ద నిల్వ చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ప్రధాన రహదారుల వెంట కుప్పలుగా పోస్తున్నారు. ఇక్కడి నిల్వల నుంచి ట్రాక్టర్ల ద్వారా మళ్లీ జిల్లాలోని ఇతర మండలాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఎస్పీ గుర్తించినా ఆగని దందా.. ఖానాపూర్ మండలం పాతఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెవాడలో 15రోజుల క్రితం ఎస్సీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో సుమారు రూ.3లక్షల విలువ చేసే అక్రమ ఇసుక డంపులు గుర్తించారు. అయినప్పటికీ డంపులను స్వాధీనం చేసుకోవడం, శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. గతంలోనూ పలు గ్రామాల్లో అక్రమంగా ఇసుకను డంపు చేసినవారికి నోటీసులిచ్చిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ‘మామూలు’గా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. పడిపోతున్న భూగర్భ జలాలు.. జిల్లాలోని పలు వాగులు, అటవీ ప్రాంతాల్లోని ఒర్రెల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుకను తోడుతుండడంతో భూగర్భజల మట్టం తగ్గుతోంది. ఇంత పెద్ద ఎత్తున ఇసుక దందా సాగుతున్నా ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు చర్యలు చేపట్టి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆయా మండలాల రైతులు, ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం అనుమతి లేకుండా ఇసుకను ట్రాక్టర్లలో తరలించినా.. గ్రామాల్లో డంపు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ, మైనింగ్ అ ధికారులకు జరిమానా నిమిత్తం పంపిస్తాం. అంతేకాకుండా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇటీవల ఎల్లాపూర్‌లో ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో సుమారు రూ.3లక్షల ఇసుక డంపులను గు ర్తించి రెవెన్యూ అధికారులకు అప్పగించాం. – ప్రసాద్, ఎస్సై, ఖానాపూర్ -
నాలుగేళ్ల నయవంచన : ఇసుక రీచ్‌లలో... ‘శాండ్’కేట్లు!
బాబు మాటలు : ‘‘ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తాం. ఈ వ్యవహారంలో నాయకుల ప్రమేయం ఉండటానికి వీల్లేదు. ఏటా 600–700కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని ఉచితంగా ఇస్తున్నాం. అక్రమాల్లో ఎవరి పాత్ర ఉన్నా వారిపై వేటు పడుతుంది. ఎక్కడి వారు అక్కడే ఉచితంగా ఇసుక తీసుకోవచ్చు. ఎవరైనా అడ్డుకుంటే తిరగబడాలి’’.. అని ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రకటించిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలివి. వాస్తవం : ఆచరణను మాత్రం మాటలను తుంగలో తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ రీచ్ చూసినా ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక దోపిడీ ఎక్కువగా జరుగుతోంది. సామాన్యులు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే పరిస్థితి ఎక్కడాలేదు. అడ్డగోలుగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. సాక్షి, అమరావతి : నాలుగేళ్ల టీడీపీ సర్కారు పాలనలో జరిగిన ఇసుక దందా విలువ అక్షరాలా రూ.8,600 కోట్లు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఏ విధంగా చెలరేగిపోతోందో ఇది చూస్తే తెలిసిపోతుంది. ఇసుక రేవు (రీచ్)లను కొందరు అధికార టీడీపీ నేతలు సొంత జాగీర్లలా మార్చుకుని అడ్డగోలుగా తోడేస్తున్నారు. ఇటు ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం మొదలు అటు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం వరకూ అంతటా ఇదే పరిస్థితి. రెండేళ్లుగా ‘ఉచిత ఇసుక’ కాగితాలకే పరిమితమైంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని శాండ్ కమిటీలు నిర్ణయించిన ధరలు ఎక్కడా అమలుకావడంలేదు. ఇసుక మాఫియా చెప్పిందే ధర. ఇక రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డూ అదుపులేదు. వారు చెప్పిందే శాసనం. తనిఖీలతో హుటాహుటిన క్రేన్ల తరలింపు ఇదిలా ఉంటే.. కృష్ణా నదిలో యంత్రాలతో జరుపుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలంటూ ఓ స్వచ్ఛంధ సంస్థ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో వేసిన కేసు నేపథ్యంలో నిజనిర్ధారణ నివేదిక సమర్పణ కోసం ట్రైబ్యునల్ నియమించిన కమిటీ ప్రతినిధులు గుంటూరు జిల్లాలో పర్యటించారు. దీంతో ఇసుక మాఫియా గ్యాంగులు నదుల్లోని భారీ క్రేన్లను అక్కడ లేకుండా చేశారు. కమిటీ ప్రతినిధులు అటు పోగానే మళ్లీ ఎక్కడ క్రేన్లు అక్కడ అమర్చి యథాతథంగా దందా సాగిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 459 ఇసుక రేవులు ఉండగా ప్రజలు సొంత అవసరాలకు ఎక్కడ నుంచైనా ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చు. కానీ, ఇది ఎక్కడా అమలుకావడంలేదు. ఇసుక నింపుకోవాలంటే కప్పం కట్టాల్సిందే. ‘రీచ్‌లోకి దారి మేమే నిర్మించాం. అందువల్ల ట్రాక్టరు వెళ్లాలంటే డబ్బు ఇవ్వాల్సిందే..’ అంటూ మాఫియా గ్యాంగులు వసూళ్లు సాగిస్తున్నాయి. చీకట్లో విచ్చలవిడిగా తవ్వకాలు అలాగే, నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు రేవుల్లోకి లారీలను తీసుకెళ్లరాదు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం లాంటి ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే అనుమతులున్నాయి. వీటికి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) పరికరాలు అమర్చామని అధికారులు చెబుతున్నారు. అయితే, జీపీఎస్ పరికరాలను పనిచేయకుండా చేసి రాత్రి వేళల్లో తోడేసి ప్రైవేట్‌గా అధిక రేట్లకు అమ్ముతున్నారు. కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల నుంచి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు కూడా తరలించడం ద్వారా వేల కోట్లు దండుకుంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి అనుచరులు ఏకంగా ఇసుక రీచ్‌కు అనధికారికంగా రహదారి వేయించి తన సొంత ఆస్తిలా నడుపుతున్నారంటే దోపిడీ ఎంత బహిరంగంగా సాగుతుందో అర్థమవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇలాగే నదిలో రెండు కిలోమీటర్ల పొడవునా అనుమతి లేకుండా రోడ్డు వేసేశారు. ఇదంతా అధికార పార్టీ పెద్దల వ్యవహారం కావడంతో అధికారులు కిక్కురుమనడంలేదు. రెండేళ్లలో రూ.5,000 కోట్లు దోపిడీ జిల్లా కమిటీలు నిర్ణయించిన ధరలతో పోల్చితే దాదాపు అన్ని జిల్లాల్లో 50 నుంచి 100 శాతం అధిక ధరలకు ఇసుకను అమ్ముతున్నారు. ఇది చాలదన్నట్లు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు అక్రమంగా తరలించి పెద్ద లారీ ఇసుకను రూ.50వేల నుంచి 60 వేల వరకూ విక్రయిస్తున్నారు. తద్వారా టీడీపీ ఇసుక మాఫియా గత రెండేళ్ల కాలంలో (2016 జూన్ నుంచి 2018 మే వరకూ) రూ.5,000 కోట్లకు పైగా దండుకుందని అనధికారిక అంచనా. అలాగే, డ్వాక్రా సంఘాలు ఇసుక రీచ్‌లను నిర్వహించిన కాలంలో (2014 నవంబరు నుంచి 2016 మార్చి వరకూ) టీడీపీ నేతలు రూ.3,600 వేల కోట్లకు పైగా దోచుకున్నారని అంచనా. ఆ కాలంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణావల్ల సర్కారు ఖజానాకు రూ.2,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వయంగా ప్రకటించడం గమనార్హం. పొంచివున్న పెను ముప్పు నిబంధనలకు విరుద్ధంగా నదుల్లో ఎక్కువ లోతు వరకు ఇసుక తవ్వకాలు సాగుతుండటం ప్రమాదకరమని పర్యావరణవేత్తలతోపాటు భూగర్భ జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని రీచ్‌లలో 2.82 కోట్ల క్యూబిక్ మీటర్ల (సుమారు 4.22 కోట్ల మెట్రిక్ టన్నుల) ఇసుకను ఏటా తవ్వుకోవచ్చని ప్రభుత్వం 2015లో అంచనా వేసింది. కానీ, 7 కోట్ల టన్నులకు పైగా తవ్వుతున్నారు. మీటరు లోతు మించి ఇసుక తవ్వరాదన్న నిబంధనను బేఖాతరు చేస్తూ 2 నుంచి 4 మీటర్ల లోతు వరకూ తవ్వేస్తున్నారు. దీనివల్ల పలువురు మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో.. గుంటూరు జిల్లాలో నిబంధనలను ‘కృష్ణ’లో కలిపేసి నది మధ్యలో భారీ క్రేన్లు ఏర్పాటుచేసి డ్రెడ్జింగ్ ద్వారా బాగా లోతు వరకూ ఇసుక తోడేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి కూతవేటు దూరంలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి కనిపించడంలేదు. ఉత్తరాంధ్రకు నేనే మంత్రినని చెప్పుకునే ఒక నేత ఒడిశాకు ఇసుక అక్రమ తరలింపులు జరిపిస్తూ వందల కోట్లు దండుకుంటున్నారు. గోదావరి జిల్లాలో ఒక మంత్రి అతిముఖ్యమైన రేవును సొంత నదిలా మార్చుకుని అనుచరులకు అప్పగించి వాటాలు మింగుతున్నారు. కర్నూలు జిల్లాలో మరో మంత్రి అనుచరులు ఏకంగా తుంగభద్రలో ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు నిర్మించారనే విషయం ఉన్నత న్యాయస్థానం వరకూ వెళ్లింది. కాగా, తవ్విన ఇసుకను 30 శాతానికిపైగా ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలిస్తూ చెక్ పోస్టులను చెకింగ్ లేని పోస్టుల్లా మార్చేశారు. ఇలా గత రెండేళ్లలో టీడీపీ నేతలు ఇసుక మాఫియా ద్వారా దోచుకున్న సొమ్ము రూ.5,000 కోట్ల పైమాటేనని అనధికారిక అంచనా. అంతకుముందు.. డ్వాక్రా సంఘాల ముసుగులో రూ.3,600 కోట్లకు పైగా దోచుకున్నారు. మొత్తం మీద తెలుగుదేశం నాలుగేళ్ల పాలనలో టీడీపీ నేతలు ఇసుక ద్వారా దండుకున్న మొత్తం రూ. 8,600 కోట్ల పైమాటే. -
బాలుడిని మింగిన నీటిగుంట
చేపల జీవనాధారంగా సాగే ఆ కుటుం బంలో అమావాస్య శోకం నింపింది. మరో రెండు రోజుల్లో కుమారున్ని బడికి పంపించాలని అనుకున్న ఆ తల్లి ఆశలు కృష్ణానది సాక్షిగా ఆవిరయ్యా యి.. సాగర్ వెనుక జలాల గుండా అక్రమంగా ఇసుకను తరలించడంతో ఆ ప్రాంతాల్లో బారి గుంతలు చిన్నారుల పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. వ్యవసాయం కోసం తీసిన గుంతను పూడ్చకుండా వదిలేశారు... ఈ క్రమంలోనే తల్లి వెంట ఆటలాడుకుంటూ వెళ్లి న ఓ బాలుడు నీటికుంటలో పడి విగతజీవిగా మారాడు.. ఈ విషాదకర ఘట న నేరెడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామపంచాయతీ వైజాక్‌కాలనీ కృష్ణా వెనుక జలాల్లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చందంపేట(దేవరకొండ) : వైజాక్కాలనీకి చెందిన ఎరుపల్లి జగ్గా, గాయత్రీ దంపతులు కృష్ణా వెనుక జలాల్లో చేపల వేట సాగి స్తూజీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. రెండో కుమారుడు ఎరుపల్లి తేజ(11) 3వ తరగతి వరకు చదివాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. రోజు మాదిరిగానే తండ్రి జగ్గా మంగళవారం రాత్రి కృష్ణా వెనుక జలాల్లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రతిరోజూ పట్టుకొచ్చిన చేపలను వలలో నుంచి తీసేందుకు గాయత్రీ భర్తకు సాయపడేది. బుధవారం ఉదయం 7గంటల సమయంలో తల్లి వెంట వెళ్లిన తేజ ఆడుకుంటూ ఉన్నాడు. వేటలో పట్టిన చేపలను వలలో నుంచి తీసే పనిలో తల్లిదండ్రులు నిమగ్నమై ఉన్నారు. అక్కడే సమీపంలో ఇటీవల ఇసుక తరలింపు, పంట పొలాలకు నీటిని అందించేందుకు గుంతలు తవ్వారు. అయితే గుంతలను పూడ్చకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరాయి. తేజ ఆ సమీప ప్రాంతాల్లో ఆడుకుంటూ నీటితో నిండిన గుంతలో పడిపోయాడు. తన వెంట వచ్చిన కుమారుడు తేజ ఇంటికి వెళ్లాడని భావించిన తల్లి. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కా నీ తేజ ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెదికారు. ఎంతకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో కృష్ణా వెనుక జలాలకు వెళ్లగా విగతజీవిగా పడి ఉన్న కుమారున్ని చూసి ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అమావాస్య దాటక స్కూల్‌కు పంపిద్దామనుకున్న కుమారుడు ఇలా విగతజీవిగా మారడంతో ఆ తల్లి రోదన వర్ణణాతీతం. కుమారుడి మృతదేహాన్ని ఒళ్లోపెట్టుకుని ఏడుస్తున్న ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు నేరెడుగొమ్ము ఎస్ఐ బాలస్వామి తెలిపారు. ముందే హెచ్చరించిన ‘సాక్షి’ కృష్ణా వెనుక జలాల గుండా ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో పాటు పంట పొలాలకు నీటిని అందించేందుకు అక్రమంగా గుంతలు తవ్వుతున్న వైనంపై 2017మే 19న ‘‘యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా’’ అనే శీర్షికన సాక్షి కథనాన్ని ప్రచురించింది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఈ ప్రాంతం గుండా కాంట్రాక్టర్లు మట్టిని సేకరించడంతో పాటు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. వేసవిలో పంట పొలాలకు నీటిని అందించేందుకు కొందరు రైతులు పెద్ద పెద్ద గుంతలు తవ్వడం, తీరా వర్షాలు కురిసే నాటికి వాటిలో నీరు చేరుతోంది. కృష్ణా వెనుక జలాల్లో తీసిన గుంతలు పిల్లల పాలిట మృత్యు ఊబిలవుతున్నాయి. గతంలో నిర్వహించిన కృష్ణా పుష్కరాల సమయంలో హైదరాబాద్‌కు చెందిన రియలేస్టేట్ వ్యాపారి గుత్తినేని లక్ష్మణ్, సుధారాణిలు పుష్కర స్నానం కోసం కుమారుడు హార్థిక్(10) ఇలాగే వదిలేసిన నీటిగుంతలో పడి మృతిచెం దా డు. గుంతలు తీసి వదిలేసిన వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించి మున్ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
తీవ్రమైన దుమ్ము.. విమానాలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: దుమ్ము, ఇసుక తుపాన్లతో దేశ రాజధాని, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. వాతావరణంలో దట్టమైన దుమ్ము పొరలు అలుముకోవడంతో ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా, వెలుతురు లేని కారణంగా ఛండీగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలను నిలిపివేశారు. అటు కాలుష్యంతో నిండిన గాలిని పీల్చుకొని ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రాజస్థాన్‌లో మొదలైన ఇసుక తుపాన్లతో ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న దేశ రాజధాని దుమ్ము కొట్టుకు పోతోంది. మితిమీరిన కాలుష్యంతో ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని వాతావరణంలో ప్రమాదకర రీతిలో పీఎం (నలుసు పదార్థం) స్థాయులు ఉన్నాయనీ, ఇటువంటి గాలిని పీల్చితే శ్వాసకోస వ్యాధుల బారిన పడే అవకాశం ఉందనీ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు హెచ్చరించింది. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దనీ ప్రజలకు సూచించింది. ఎండలు మండిపోతుండడంతో మరో వారంపాటు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దుమ్ము, ధూళితో ఉక్కిరి బిక్కిరవుతున్న రాజధాని ప్రజలు 33 నుంచి 42 డిగ్రీల ఎండవేడితో చెమటలు కక్కుతున్నారు. కాగా, అక్కడ సాధారణం కన్నా 5 శాతం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
34ఏళ్లకు బయటపడ్డ లారీ
సాక్షి, కరీంనగర్‌రూరల్ : మూడు దశాబ్దాల క్రితం.. భారీ వరదల కారణంగా ఇరుకుల్ల వాగులో గల్లంతైన లారీ ఆనవాళ్లు కనిపించాయి. ఇసుక తవ్వకాలతో లారీ విడిభాగాలు బయటపడ్డాయి. గల్లంతైన లారీ కనిపించడంతో చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు. 1984లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. వారంపాటు కురిసిన భారీవర్షాలకు కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల వాగు పొంగిపొర్లింది. పాత వంతెనపైనుంచి వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే కరీంనగర్‌కు చెందిన లారీలో డ్రైవర్ సలీం, కటికె శంకర్ (పశువుల వ్యాపారి) వంతెన దాటేందుకు ప్రయత్నిస్తుండగా లారీ వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో లారీతోపాటు డ్రైవర్, పశువుల వ్యాపారి ఇద్దరూ గల్లంతరయ్యారు. అనంతరం రాజీవ్ రహదారి నిర్మాణంలో భాగంగా ఇరుకుల్ల వాగుపై కొత్త వంతెన నిర్మించారు. దీంతో పాతవంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నేళ్లుగా ఇరుకుల్ల వాగునుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లద్వారా ఇసుక తరలిపోతోంది. పాత వంతెన సమీపంలో మూడురోజుల క్రితం ఇసుక తవ్వుతుండగా.. అప్పుడు గల్లంతయిన లారీ విడి భాగాలు బయటపడ్డాయి. లారీ క్యాబిన్ ఇనుప రేకులు కన్పిస్తున్నాయి. దాదాపు 34ఏళ్ల క్రితం వాగులో గల్లంతైన లారీ విడిభాగాలు ప్రస్తుతం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. లారీ కనిపిస్తోందనే సమాచారంతో దుర్శేడ్, ఇరుకుల్ల, మొగ్ధుంపూర్ గ్రామస్తులు వచ్చి ఆసక్తిగా పరిశీలిస్తూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. -
‘ఇసుక మాఫియాకు కేటీఆర్ అండ’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఇసుక మాఫియాకు మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తున్నారని దళిత, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు గజ్జెల కాంతం ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో నేతలు ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సిరిసిల్ల, నేరెళ్లలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇసుక దందాలు నడుస్తున్నాయని, అడ్డుకొనేందుకు ప్రయత్నించిన దళితులను చిత్రహింసలకు గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. -
ఇసుక వేట.. అవినీతి మేట
ఇసుకాసురులు.. అక్రమ సంపాదన కోసం మత్స్యకారులు పోరాడి సాధించుకున్న జీవన భృతినీ వదలడం లేదు. ఇసుక తవ్వకానికి యంత్రమే వద్దన్న చోటికి ఏకంగా డ్రెడ్జర్లు తెచ్చి దోచుకుంటున్నారు. కార్మికులకు రావాల్సిన కూలిని సైతం అడ్డంగా బొక్కేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అధికారం అండతో అడ్డగోలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రేపల్లె సమీపంలోని పెనుమూడి రేవులో అడ్డూఅదుపూ లేకుండా అక్రమాలకు తెగబడు తున్నారు. ఇవన్నీ తెలిసినా అధికారుల నోళ్లకు మామూళ్ల తాళాలు వేసుకుని మౌనం వహిస్తున్నారు. రేపల్లె: ఇసుక రుచి మరిగిన పాలకపక్ష నేతలు సహజ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. పెనుమూడి రేవులో మత్స్యకారులు చేసుకున్న విన్నపాన్ని కలెక్టర్ పరిశీలించి వారి భృతికి అవకాశం కల్పిస్తూ ఇసుకను తరలించుకునేందుకు గత ఏడాది అనుమతి ఇచ్చారు. యంత్రాల సహాయం తీసుకోకుండా ఇసుకను నదిలో తోడుకోవచ్చని చెప్పారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు స్థానిక నేతలు అంగీకరించకపోవటంతో దాదాపుగా 10 నెలలుగా తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో కార్మికులు పోరాటాలు చేయాల్సి వచ్చింది. అనంతరం ఇసుకను తరలించుకునేందుకు స్థానిక రెవెన్యూ అధికారులు ఈ ఏడాది జనవరి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పనులు ప్రారంభమయ్యాయి. మళ్లీ స్థానిక పాలకపక్ష నేతలు రంగంలోకి దిగారు. తమ మాట వినకపోతే రేవును ఆపేస్తామని కార్మికులను బెదిరించి డ్రెడ్జర్ల సాయంతో ఇసుకను తవ్వేస్తున్నారు. రేవు సమీపంలో పెద్ద పెద్ద అగాధాలు పెడుతున్నారు. కొన్ని నెలలుగా రేయింబవళ్లు అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. కూలీల వద్దా దండుకుంటున్న నేతలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్‌కు రూ.400 వసూలు చేయాలి.పడవల నిర్వాహకదారులు ఇసుకను నది మధ్యలో నుంచి యంత్రాల సహాయం లేకుండా తీసుకొచ్చి ట్రాక్టర్‌కు లోడు చేస్తే యూనిట్ ఇసుక రూ.400 తీసుకోవాలి. పాలకపక్ష నేతలు మాత్రం ట్రాక్టర్ నుంచి సుమారు రూ.500 వరకు వసూలు చేస్తూ కార్మికులకు మాత్రం రూ.400 ఇస్తున్నారు. కొంత కాలంగా రోజుకు సుమారు 250 నుంచి 300 ట్రాక్టర్ల వరకు ఇసుక తరలిస్తున్నారు. కార్మికుల కష్టాన్ని రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రతి రోజూ దోచుకుంటున్నారు. అనుమతులు లేకున్నా డ్రెడ్జర్లు నదిలో నుంచి ఇసుకను బయటికి తీసుకురావాలంటే యంత్రాలు ఉపయోగించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. కానీ నది గర్భంలో నుంచి ఇసుకను తవ్వేందుకు అధికార పార్టీ నేతలు ఏకంగా డ్రెడ్జర్లను ఉపయోగిస్తున్నారు. దీనికిగాను యూనిట్ ఇసుక రూ.600 చొప్పున వసూలు చేస్తున్నారు. రోజుకు సుమారు 1500 నుంచి 2 వేల యూనిట్ల వరకు ఇసుకను తరలిస్తున్నారు. ఇలా రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు దండుకుంటున్నారు. నెలకు రూ.3.50 కోట్ల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. పట్టించుకోని అధికార గణం ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులకు తెలిసినా నోరు మెదపడం లేదు. ఆరు నెలలుగా ఈ దందా కొనసాగుతున్నప్పటికీ ఒక్కసారి కూడా దాడులు చేసింది లేదు. అధికారులకూ అక్రమ సంపాదనలో కొంత వాటాలు వెళుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు అధికార పార్టీ నేతలకు బెదిరింపులకు తలొగ్గి పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం పెనుమూడి రేవులో ఇసుకను తరలించుకునేందుకు పడవ నిర్వాహకులకు మాత్రమే అనుమతి ఉంది. ఇసుకను ఒడ్డుకు చేర్చడానికి ఎటువంటి యంత్రాలు ఉపయోగించకూడదు. డ్రెడ్జర్ల సహాయంతో ఇసుకను తోడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ట్రాక్టర్‌కు రూ.400 మాత్రమే వసూలు చేయాలి. అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. ఎస్వీ రమణకుమారి, తహసీల్దార్, రేపల్లె -
ముంచుకొస్తున్న ముప్పు!
-
మట్టి లూటీ!
కంకిపాడు: పేరుకేమో ఆధునికీకరణ పనులు. జరిగేదేమో కాసుల వేట. బుడమేరు ఆధునికీకరణ పనులను అడ్డం పెట్టుకుని పెద్దలు మట్టిని కొల్లగొడుతున్నారు. అక్రమంగా మట్టిని బయటకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. అనుమతులు లేకుండా మట్టి తరలిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ పనులపై పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బుడమేరు ఆధునికీకరణ పనుల్లో భాగంగా కంకిపాడు నుంచి కొల్లేరు వరకూ దిగువున పనులు పూర్తయ్యాయి. విజయవాడ సమీపంలోని నిడమానూరు నుంచి మండలంలోని మంతెన గ్రామం వరకూ ఉన్న బెల్టు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఈ పనులకు అనుమతి వచ్చింది. రూ 8 కోట్లు నిధులు కేటాయించారు. గుడివాడకు చెందిన ఓ కాంట్రాక్టర్ ఈ పనులను చేపట్టారు. మండలంలోని వేల్పూరు, ఉప్పులూరు, మంతెన గ్రామాల్లో బుడమేరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఉప్పులూరు వద్ద బుడమేరు బ్రిడ్జికి కూత వేటు దూరంలో బుడమేరుకు రెండు వైపులా ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 23 అడుగుల నుంచి 60 అడుగుల వరకూ బుడమేరును విస్తరించనున్నట్లు డ్రైనేజీ విభాగం అధికారులు చెబుతున్నారు. అడ్డగోలుగా మట్టి దోపిడీ ఆధునికీకరణ పనుల మాటున ఇక్కడ మట్టి దోపిడీ జరుగుతుంది. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లు, హెవీ లోడు లారీల్లో మట్టిని బయట ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ట్రాక్టరుకు రూ.300, లారీకి రూ. 600 నుంచి రూ.1200 వరకూ సీనరేజీ కూడా వసూలు చేస్తున్నట్లు సమాచారం. నాలుగు పొక్లెయిన్లతో మట్టిని లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. పగలూ, రాత్రి కూడా ఈ ప్రక్రియ యధావిధిగా సాగిపోతుంది. ఇక్కడి నుంచి సమీపంలోని గన్నవరం మండలంలోని గ్రామాలతో పాటు, ఉప్పులూరు, మంతెన, తెన్నేరు, మారేడుమాక, కంకిపాడు, ఈడుపుగల్లు, విజయవాడ పరిసర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. దీనికిగానూ దగ్గరలో ఉన్న గ్రామానికి ట్రాక్టరు మట్టి రూ వెయ్యి, దూరాన్ని బట్టి రూ.1500 నుంచి రూ.2 వేలు వరకూ వసూలు చేస్తున్నారు. లారీల్లో మట్టి అయితే ఆ ధర లెక్కేలేదు. దూరాన్ని బట్టి, అవసరాన్ని మట్టి లారీల యజమానులు వసూలు చేసుకుంటున్నారు. అధికారుల తీరుపై విమర్శలు ఆధునికీకరణ పనులు విషయంలో డ్రైనేజీ విభాగం అధికారుల పర్యవేక్షణ లేదనే విమర్శ వినిపిస్తుంది. పర్యవేక్షణ ఉండి ఉంటే మట్టి అడ్డగోలుగా బయటకు పోయేది కాదని స్థానిక రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారంటే వారి ప్రమేయం పైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరి సహకారంతోనే మట్టి దోపిడీ సాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టించుకోని రెవెన్యూ అధికారులు గ్రామం నుంచి వందల సంఖ్యలో మట్టి లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం కనీసం ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. పల్లంగా ఉన్న పొలాల్లో మెరక చేసేందుకు మట్టిని భారీగా తరలిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని రియల్ వెంచర్లకు సైతం మట్టి రవాణా అయినట్లు తెలిసింది. పొలం మెరకకు అనుమతులు పొంది మెరక చేసుకోవాలనే నిబంధన ఉంది. కానీ నిబంధనలు ఉల్లంఘించి మెరక చేస్తున్నా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. -
పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గోపాల్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉన్న యాలాలలో ఇసుక మాఫియా సమాచారాన్ని గోపాల్ అనే వ్యక్తి పోలీసులకు చేరవేశారు. దీంతో ఇసుక దందా చేస్తున్న కాంట్రాక్టర్లు గోపాల్‌ను బెదిరించి హత్యాప్రయత్నం కూడా చేశారు. ఇసుక దందా చేసే వారికి స్థానిక ఎస్ఐ ప్రభాకర్ రెడ్డే సమాచారం అందించాడని గోపాల్ ఆరోపిస్తున్నాడు. దీంతో అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ గోపాల్‌ను సముదాయించి ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమింప చేశారు. వెంటనే ఇసుక మాఫియాకు సహకరిస్తోన్న పోలీసులపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. -
ఇసుక లారీల ఆగడాలపై విలేకరి ఆత్మహత్యాయత్నం
తాడేపల్లి రూరల్/మంగళగిరి రూరల్: రాజధాని అమరావతిలో ఇసుక లారీల కారణంగా పలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని శుక్రవారం ఓ విలేకరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఇసుక లారీల ఆగడాలను పోలీసులు పట్టించుకోవటం లేదంటూ ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న నాయుడు నాగరాజు శరీరంపై పెట్రోలు పోసుకున్నాడు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పాత్రికేయుడిగా తాను ప్రాణాలు అర్పిస్తే అయినా ఇసుక లారీలను నిషేధిస్తారా? అని ప్రశ్నించాడు. ఇసుక లారీలను కృష్ణాయపాలెం, పెనుమాక, ఉండవల్లి మీదుగా పంపాలని మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన నాగరాజు డిమాండ్ చేశాడు. సమీపంలో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై నాగరాజును కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. లారీలను నిషేధించడాన్ని ప్రజాప్రతినిధులే నిర్ణయించాలని త్వరలో వారితో చర్చలు నిర్వహిస్తామని సీఐ మధుసూదనరావు చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి... మంగళగిరి నియోజకవర్గంలో ఇసుక లారీల జోరుపై నిత్యం ఏదో ఒకచోట ఆందోళన జరుగుతూనే ఉంది. ఏదైనా ప్రమాదం జరగగానే పోలీసులు రెండు రోజులు నియంత్రించడం త ర్వాత లారీలు యథావిధిగా తిరగడం మామూలై పోయింది. ఇసుక లారీలతో ఇబ్బందులకు గురవుతున్న యర్రబాలెం ప్రజలు ఎన్నోసార్లు ధర్నాలు చేసినా పట్టించుకున్న అధికారులు లేరు. విలేకరి నాగరాజు అధికారులను కలిసి గ్రామస్తుల గోడు వినిపించినా ఫలితం దక్కలేదు. గ్రామస్తులు ధర్నా చేయటంతో చివరకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినా ఇసుక లారీల దూకుడుకు మాత్రం బ్రేకులు పడలేదు. గ్రామస్తులు శుక్రవారం మరోసారి ధర్నాకు దిగి లారీలను అడ్డుకున్నారు. బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేస్తే... వాస్తవానికి యర్రబాలెం నుంచి బైపాస్ రోడ్డు ఏర్పాటుచేశారు. సీఆర్డీఏ అధికారులు స్పందించి ఇసుక లారీలు వెళ్లే రహదారికి మరమ్మతులు చేసి బీటీ రోడ్డు నిర్మిస్తే దుమ్ము, ధూళి నివారించే అవకాశం ఉంది. యర్రబాలెం ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. యర్రబాలెం చెరువు నుంచి సినిమాహాల్ మీదుగా ట్రాఫిక్‌ను పంపించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇసుక మాఫియాకు చెక్
రాయగడ : అక్రమంగా తరలిస్తున్న ఇసుక, మెటల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కల్యాణ సిగుపూర్ తహసీల్దార్ మేరీ నాయక్ తెలిపారు. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రైల్వే ద్వారా గత కొన్ని నెలల నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఆంధ్రాకు అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆదివారం స్థానిక రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. రాయగడ–కొరాపుట్ రైల్వేలైన్ మధ్య ఉన్న బాలుమస్కా రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా సుమారు 3 వ్యాగన్ల ఇసుక, ఒక వ్యాగన్ మెటల్ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న కల్యాణసింగుపురం తహసీల్దార్ దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సమారు రూ. కోటి ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపినట్లు అధికారులు తెలిపారు. కొల్నార రెవెన్యూ పరిధిలోని దుందిరిఘాటీ, కల్యాణసింగుపురం ప్రాంతంలో ఉన్న నాగావళి నది ఒడ్డు నుంచి ఇసుక బల్లుమాస్క రైల్వేస్టేషన్‌కు ప్లాస్టిక్ సంచుల్లో అక్రమంగా తరలిస్తున్నారు. బల్లుమాస్క నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ఇసుక బస్తాలతో పాటు మెటల్‌ను కూడా తరలిస్తున్నారు. అధికారుల అండతోనే అక్రమ రవాణా నదీ పరీవాహక ప్రాంతం నుంచి ఇంత భారీ స్థాయిలో ఇసు క, మెటల్ అక్రమంగా రవాణా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదంతా అధికారులు, ప్రభుత్వ నేతలతో కలిసి చేస్తున్న వ్యవహారమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇసుక క్వారీకి రెవెన్యూ విభాగం అనుమతులు మంజూరు చేసిన అనంతరం రవాణాకు అనుమతులు వస్తాయని అప్పుడే రైల్వే అధికారులు తరలించేందుకు సుముఖత వ్యక్తం చేస్తారని అలాంటప్పుడు ఎవరు తప్పు చేసినట్లు అని స్థానికులు నిలదీస్తున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి రైల్వే అధికారుల వరకు ఈ ఇసుక మాఫి యాతో సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక, మెటల్ బల్లుమాస్క రైల్వే అధికారుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు సుమారు రూ.2.50లక్షల జరిమానా విధించి విడిచిపెట్టారన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్‌కు అధికారులు స్పందించకపోవడం దారుణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
తప్పుడు పని.. చేయక తప్పడం లేదు
ఆమదాలవలస: ‘ఇసుక అక్రమ రవాణా తప్పుడు పని.. అయినా చేయక తప్పడం లేదు’ అని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని తన నియోజకవర్గం ఆమదాలవలసలో సుమారు 400 మంది ట్రాక్టర్ యజమానులు, వారి కుటుంబాలు కాళ్ల వేళ్ల పడుతుంటే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుచెప్పలేదన్నారు. శుక్రవారం ఆమదాలవసలోని అశోక పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో కూన రవికుమార్ మాట్లాడారు. ట్రాక్టర్ యజమానుల కుటుంబాలు ఇసుక రవాణాతోనే బతుకుతున్నాయని.. అందుకే ర్యాంపుల్లోకి ఏ అధికారి వెళ్లి దాడులు నిర్వహించొద్దని హెచ్చరించినట్టు ఆయన అంగీకరించారు. అభివృద్ధిని చూడలేక కొన్ని పత్రికలు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు తనపై బురద జల్లుతున్నారని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక..మస్కా!
పీలేరు నియోజకవర్గంలోని పింఛానది ఇసుకాసురులకు కనక వర్షం కురిపిస్తోంది. కాసులకు కక్కుర్తిపడినఅధికారులకు తోడు అధికార పార్టీనేతల అండదండలతో ఇసుకమాఫియా రెచ్చిపోతోంది. రాత్రీపగలు తేడాలేకుండా యథేచ్ఛగా ఇసుకతోడేస్తున్నారు. భూగర్భజలాలుఅడుగంటుతున్నాయి మొర్రో..! అంటున్నా పట్టించుకునే దిక్కులేకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు, పీలేరు: ఇసుకాసురుల ధాటికి పింఛా నది బావురు మంటోంది. డ్యాం నుంచి ఇప్పటికే నాలుగు కి.మీ మేర ఇసుక తోడేశారు. రోజుకు 300 ట్రాక్టర్లపైనే ఇసుక తరలుతున్నా పట్టించుకునే దిక్కులేదు. స్థా నిక అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేకపోతోందని పలువురు రైతులు వాపోతున్నారు. ఈ ప్రాంతాలకే తరలింపు.. పింఛా నది నుంచి కలకడ, కేవీపల్లె, ఎర్రావారిపాళెం, రొంపిచెర్ల, చిన్నగొట్టిగల్లు, పీలేరు, పులిచెర్ల తో పాటు వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లె, రాయచోటి, సంబేపల్లె మండలాలకు అధికంగా ఇసుక తరలుతోంది. రాత్రింబవళ్లూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిపోతోంది. మోడువారిన బంగరు భూములు పింఛా నదికి ఇరువైపులా సుమారు రెండు వందలకుపైగా బోర్లు, బావులు ఉన్నాయి. ఐదు వేల ఎకరాలకుపైగా భూములు ఉన్నాయి. ఇవన్నీ మూడు పంటలు పండే భూములే. కానీ పింఛా నదిలో ఇసుక తోడేయడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోర్లు, బావులు బావురమంటున్నాయి. చేసేదిలేక రైతులు పొలాలను బీళ్లుగా వదిలేస్తున్నారు. జిల్లేళ్లమంద పంచాయతీ బసవన్నగారిపల్లె, కరణాలవారిపల్లె, పాతకురవపల్లె, కొత్తకురవపల్లె, పేయలవారిపల్లె, పెండ్లి పెంట, రెడ్డివారిపల్లె, వడ్డిపల్లె, దేవాండ్లపల్లె తదితర గ్రామాల్లో పొలాలు బీళ్లుగా మారాయి. వారు ఫోన్ చేస్తే చాలు ఇసుక తరలింపునకు పర్మిట్లు కావాలంటే ఒక్కో ట్రాక్టర్‌కు వారానికి రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు సమర్పించుకోవాలి. సొమ్ము ఇవ్వకపోతే పర్మిట్లు వచ్చే దాఖలాలు లేవు. ఎవరైనా పొరపాటున సొంత పనుల కోసం ఓ ట్రాక్టర్ ఇసుక తరలిస్తే ఇక వారిపని అంతే. వెంటాడిమరీ రెవెన్యూ అధికారులు ముçప్పుతిప్పలకు గురిచేస్తారు. అదే అధికార పార్టీ నాయకులకు అయితే ఎలాంటి నిబంధనలూ వర్తించవు. వారు ఫోన్ చేస్తే చాలు పర్మిట్లు క్షణాల్లో చేతికందుతాయి. అధికార పార్టీ నాయకులు తమ ట్రాక్టర్లతో తెల్లవారుజాము నుంచే ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు రెవెన్యూ అధికారులు బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్నారు. లోడు ఇసుక రూ.2వేలు.. స్థానికంగా ఇసుక తక్కువ రేటు పలుకుతోంది. రూ.1,500మించి పోవడం లేదు. అదే ట్రాక్టర్ ఇసుకను ఇతర ప్రాంతాల్లో రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు. అందుకే పింఛా నది నుంచి యల్లమంద మీదుగా పీలేరు, రొంపిచెర్ల, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాళెంకు తరలిస్తున్నారు. -
తవ్వుకో.. అమ్ముకో..
సాక్షి, అమరావతి: నాలుగేళ్లుగా టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తోన్న ఇసుక, మట్టి దోపిడీని ప్రభుత్వం అధికారికం చేసింది. జలాశయాలు, చెరువుల్లో పూడిక తీసిన మట్టి, ఇసుకతో వ్యాపారం చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తవ్విన ఇసుక, మట్టికి సీనరేజీ ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. రాష్ట్రంలో నీరు–చెట్టు పథకం కింద చెరువులు, జలాశయాల్లో పూడిక తీసే పనులకు నాలుగేళ్ల క్రితమే సర్కార్ శ్రీకారం చుట్టింది. నిబంధనల ప్రకారం పూడిక తీసిన మట్టి, ఇసుకను రైతులు సొంత ఖర్చుతో తమ పొలాలకు తీసుకెళ్లవచ్చు కానీ అమ్ముకోకూడదు. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు నిబంధనలను వక్రీకరించి వ్యాపారం చేస్తున్నారు. 2015–16లో 18.20, 2016–17లో 29.07, 2017–18లో 24.04, 2018–19లో ఇప్పటివరకూ 3.85 వెరసి.. 75.16 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడికను తీసినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇందులో 45 కోట్ల క్యూబిక్ మీటర్లకుపైగా మట్టి, ఇసుకను క్యూబిక్ మీటర్ రూ.550 చొప్పున విక్రయించి రూ.24,750 కోట్లకుపైగా సొమ్ము చేసుకున్నారు. చెరువులు, జలాశయాల్లో పూడిక తీసిన మట్టి, ఇసుకతో వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ఏడాది మాత్రమే గడువుండటంతో.. టీడీపీ సర్కార్‌కి ఏడాది మాత్రమే గడువుండటంతో మట్టి, ఇసుక ద్వారా రూ.వేల కోట్లు కొల్లగొట్టడానికి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నేతృత్వంలోని మాఫియా స్కెచ్ వేసింది. సొంత ఖర్చులతో పూడికను తీసి మట్టి, ఇసుకను వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటామని చిన్న నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌కు ప్రతిపాదనలు పంపారు. వాటిపై ఆమోదముద్ర వేయాలంటూ కీలక మంత్రి జలవనరుల శాఖ మంత్రిపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. అధికారులు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. నీరు–చెట్టు పథకంపై గత సోమవారం నిర్వహించిన సమీక్షలో సొంత ఖర్చుతోపూడిక తీస్తామని ముందుకొచ్చిన వారికి ఎందుకు అడ్డుతగులుతున్నారంటూ సీఎం చంద్రబాబు మండినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో చేసేది లేక జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెరువు లేదా జలాశయంలో పూడిక తీసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. చెరువులు, జలాశయాలకు నష్టం వాటిల్లకుండా క్యూబిక్ మీటర్‌కు రూ.1 చొప్పున పూచీకత్తుగా వసూలు చేయాలని, పూడికతీత పూర్తయిన తర్వాత ఎలాంటి నష్టం వాటిల్లకపోతే ఆ మొత్తాన్ని కూడా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. పనులు చేయకపోయినా.. నీరు–చెట్టు కింద రాష్ట్రంలో పనులన్నీ నామినేషన్ పద్ధతిలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు అప్పగించారు. పనులు చేసినా చేయకున్నా చేసినట్లుగానే రికార్డులు రాసి రూ.12,819.82 కోట్లను ఇప్పటివరకూ బిల్లుల రూపంలో చెల్లించారు. ఈ పథకం కింద ఇప్పటివరకూ 75.16 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించడం ద్వారా 65.192 టీఎంసీల నిల్వ సామర్థ్యం పెరిగిందని సర్కార్ లెక్కలు చెబుతోంది. కానీ.. ఈ లెక్కలను అధికారవర్గాలే కొట్టిపారేస్తుండటం గమనార్హం. –ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్నది.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం సమీపంలోని బ్రహ్మలింగం చెరువు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి నీరు–చెట్టు పథకం కింద ఈ చెరువును అడ్డగోలుగా తవ్వేశారు. పూడిక తీసిన మట్టిని క్యూబిక్ మీటర్ రూ.550 చొప్పున విక్రయిస్తూ.. రోజూ కనీసం రూ.ఐదు లక్షల వరకూ వెనకేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధి దోపిడీ దెబ్బకు చెరువు గొయ్యిగా మారి తూములకు నీళ్లు అందడం లేదు. –ఇక్కడ కనిపిస్తున్నది.. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని కోదండరాముని చెరువు. ఇష్టారాజ్యంగా పూడిక తీసిన మట్టిని టీడీపీ కీలక ప్రజాప్రతినిధి క్యూబిక్ మీటర్ రూ.550 నుంచి రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. తూముల మట్టం కంటే మూడు నాలుగు మీటర్ల లోతుకు మట్టిని తవ్వేశారు. దీంతో తూములకు సక్రమంగా నీళ్లందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో ఈ రెండు చెరువుల్లోనే కాదు.. వేలాది చెరువుల్లో ఇదే పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఈ ఆగడాలకు దన్నుగా నిలిచేలా సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి. -
ఇసుక టిప్పర్ల పోటీ.. కుటుంబం బలి
రాజధాని ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇసుక టిప్పర్ల మధ్య పోటీతో.. ఒక దానిని ఇంకొకటి ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో భర్త, భార్య, 18 నెలల పసిపాప అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ల ఆగడాలకు ఆ కుటుంబం బలి కావడం స్థానికులను కలచివేసింది. మరోవైపు ఇదే రాజధాని పరిధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు.. చిత్తూరు జిల్లాలో మహేంద్ర బొలెరో మాక్స్ వాహనం, ఈచర్ లారీ ఢీకొన్న ఘటనలో తిరుమల దైవదర్శనానికి వెళుతున్న ఓ కుటుంబంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మరణించారు. తాడేపల్లిరూరల్/రేణిగుంట(చిత్తూరు): రాజధాని ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇసుక టిప్పర్ల మధ్య పోటీతో.. ఒక దానిని ఇంకొకటి ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో భర్త, భార్య, 18 నెలల పసిపాప అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ల ఆగడాలకు తమ పెళ్లి రోజునే ఆ కుటుంబం బలి కావడం స్థానికులను కలచివేసింది. మరోవైపు ఇదే రాజధాని పరిధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు.. చిత్తూరు జిల్లాలో మహేంద్ర బొలెరో మాక్స్ వాహనం, ఈచర్ లారీ ఢీకొన్న ఘటనలో తిరుమల దైవదర్శనానికి వెళుతున్న ఓ కుటుంబంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మరణించారు. నులకపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు పెళ్లి రోజే చివరిరోజు.. రాజధాని పరిధిలోని రోడ్లు రక్తమోడాయి. 18 గంటల వ్యవధి.. 25 కిలోమీటర్ల దూరంలో జరిగిన మూడు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేట తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక ఇసుక టిప్పర్‌ను మరో ఇసుక లారీ ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా ద్విచక్రవాహనంపై వస్తున్న కుటుంబాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొమ్మతోటి శ్రీకాంత్ (27), భార్య సరిత (24), అక్షర (ఏడాదిన్నర) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాంత్, సరితల పెళ్లిరోజు సోమవారం కావడంతో బంధువుల ఇంటికి వెళ్లి, అక్కడ నుంచి మంగళగిరిలో కొత్త దుస్తులు తెచ్చుకోవడానికి కుమార్తెతో బయల్దేరారు. మార్గమధ్యలో అనుకోకుండా ఇసుక టిప్పర్ రూపంలో మృత్యువు వెంటాడి వారిని బలిగొన్నది. ఈ ప్రమాదంలో కొమ్మతోటి శ్రీకాంత్‌కు తలకు బలమైన గాయమై, మెదడు బయటకు వచ్చింది. భార్య సరితకు ముక్కులు, చెవుల్లోనుంచి తీవ్ర రక్తస్రావమై మృతి చెందారు. పాప అక్షర మాత్రం 108 వచ్చేంత వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. రోడ్డుపక్కన వెళ్లేవారు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఎటువంటి ఫలితం దక్కలేదు. అలాగే రాజధాని ప్రాంతమైన కురగల్లులో శనివారం రాత్రి పెట్రోలు కొట్టించుకుందామని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చావలి గోపిరాజు(26)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుళ్లూరు మండలం మందడం వద్ద శనివారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బత్తులూరి వెంకటేశ్వరరావు(50) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. శ్రీవారి దర్శనానికి వెళ్తూ.. చిత్తూరు జిల్లా రేణిగుంట–కోడూరు మార్గంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులందరినీ కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఏడాదిన్నర పాప ఉంది. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప తెలిపిన వివరాల మేరకు... రేణిగుంట–కోడూరు మార్గంలో ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న మహేంద్ర బొలెరో మాక్స్ వాహనం, ఈచర్ లారీ ఢీకొన్నాయి. బొలెరో మాక్స్ వాహనంలో తిరుమల దర్శనార్థం వస్తున్న కర్నూలు జిల్లా గడివేముల మండలం కొరటమద్ది గ్రామానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కొరటమద్దికి చెందిన నాగరాజశెట్టి(55), అతని భార్య రమాదేవి(50), తల్లి నారాయణమ్మ(72), కుమారులు సురేంద్ర(22), మధుజయకుమార్(18), కుమార్తె రేణుక(24), అల్లుడు ప్రవీణ్‌కుమార్(35) వారి పిల్లలు దేవాన్ష్(ఏడాదిన్నర), తనీష్(7).. ఇలా తొమ్మిది మంది బృందంతో కలసి తిరుమల దర్శనార్థం శనివారం రాత్రి 10 గంటలు దాటాక బయలుదేరారు. ఆదివారం ఉదయం రేణిగుంట మండలం మామండూరు సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించబోయి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నాగరాజుశెట్టి, అతని భార్య రమాదేవి, తల్లి నారాయణమ్మ, అల్లుడు ప్రవీణ్‌కుమార్, అతని కుమార్తె ఏడాదిన్నర చిన్నారి దేవాన్ష్ అక్కడికక్కడే మృత్యుపాలయ్యారు. గాయపడిన రేణుక, తనీష్, సురేంద్ర, మధుజయకుమార్, వాహన డ్రైవర్ కరీముల్లా తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. చిన్నారి తనీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. -
కలెక్టర్ గారూ..అవినీతి పాలనకు చెక్‌పెట్టండి
విజయనగరం మున్సిపాలిటీ : నాలుగేళ్ల టీడీపీ పాలనలో జిల్లాలో పెచ్చుమీరుతున్న అవినీతి, అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్త కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పత్రి కాముఖంగా విన్నవించారు. స్థానిక సత్యకార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హరి జవహార్లాల్కు స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. పాలనలో అపార అనుభవం ఉన్న కలెక్టర్ జవహార్ రాబోయే ఎన్నికల కాలంలో సమర్ధవంతమైన పాలన సాగించాలని ఆకాంక్షించారు. జిల్లాలో అధికార పార్టీ నాయకుల భూ, ఇసుక మాఫియా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గత కలెక్టర్ వివేక్‌యాదవ్ చేపట్టిన ఓడీఎఫ్ కార్యక్రమం అధికార పార్టీ నాయకులకు వరంగా మారిందన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో టీడీపీ నాయకులు తిష్టవేసి సామాన్యులకు అన్యాయం చేస్తున్నారన్నారు. చీపురుపుల్లి ఆర్ఈసీఎస్లో జరిగిన నిధులు గల్లంతులపై 51 సెక్షన్ ప్రకారం సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులతో జిల్లాలో మొక్కజొన్న , బొప్పాయి, జీడిమామిడి పంటలకు తీవ్ర నష్టం కలిగిందని, బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాకు పనికొచ్చే ఒక్క శాశ్వత కార్యక్రమమైనా చేపట్టారా అంటూ నిలదీశారు. జిల్లాకు రావాల్సి న ప్రభుత్వ వైద్య కళాశాలను తిరస్కరించారని, గిరిజన యూనివర్సీటీ ఏర్పాటుకు నిధులు కేటాయించడంలో వైఫల్యం చెందారన్నారు. సమావేశంలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు, కె.వి.సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘అడ్డుకుంటే పెట్రోలుతో తగలబెడతాం’
చిత్తూరు, కలికిరి: ‘ఇసుక ట్రాక్టర్లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే పెట్రోలు పోసి తగలబెడతాం’ అని ట్రాక్టరు యజమానులు బెదిరించారంటూ మహల్ కూరాకులపల్లె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని మహల్ వద్ద బాహుదానది నుంచి కలకడ మండలం ఎర్రకోటపల్లి, గంగాపురం, గుర్రంకోండ మండలంలోని పలు గ్రామాలు, స్థానిక మహల్, కేవిపల్లి మండలంలోని తిమ్మాపురం తదితర గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులు ఇసుక తరలిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇసుక రవాణాను మహల్ కూరాకుల పల్లెవాసులు అడ్డుకున్నారు. ట్రాక్టర్ల యజమానులు కోపోద్రిక్తులై అడ్డుకున్న వారిపై పెట్రోలు పోసి తగలెట్టి ఇసుకను తరలిస్తాం తప్ప వదిలేదని దౌర్జన్యానికి దిగడంతో గ్రామస్తులు ఆదోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో మంగళవారం సైతం ట్రాక్టర్లను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ట్రాక్టర్ల వివరాలను నమోదు చేసుకుని వదిలేశారు. దీంతో బుధవారం కూడా ట్రాక్టర్లు బాహుదానది నుంచి ఇసుకను తరలిస్తుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. ఈ విషయమై కలికిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాలుగు ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్ వద్దకు తరలించారు. ఇసుక తరలింపుతో భూగర్భజలాలు అడుగంటి పొయి తాగునీరు, సాగునీటి సమస్య తలెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తామే ట్రాక్టర్లను అడ్డుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. -
ఇసుక మాఫియాపై చర్యలేవీ !
మహారాష్ట్రలోని శాఖాపూర్ ఇసుక క్వారీ నిర్వాహకులు మంజీర నదిలోని మన భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తోడేస్తున్నారు. ఇటీవల అడ్డుకునేందుకు వెళ్లిన బోధన్ సబ్‌కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలోని రెవెన్యూ అధికారుల బృందంపైనే ఇసుక మాఫియా దాడికి పాల్పడింది. జిల్లా పోలీసు యంత్రాంగం మాత్రం కేసుల నమోదుకే పరిమితమైంది. ఇసుక మాఫియాకు తెలంగాణ కు చెందిన బడా నేతల అండదండలుండటంతోనే కేసు పురోగతి లేదనే విమర్శలు వస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బరితెగించిన మహారాష్ట్ర ఇసుక మాఫియా సాక్షాత్తు ఓ ఐఏఎస్ అధికారిపైనే రాళ్లదాడికి పాల్పడింది. ఏకంగా రాష్ట్ర సరిహద్దులు దాటి మన జిల్లా భూ భాగంలోకి చొచ్చుకువచ్చి యథేచ్ఛగా ఇసుక తోడేస్తోంది. ఇసుక మాఫియా ఇంత బరితెగిస్తుంటే ఉక్కుపాదం మోపాల్సిన జిల్లా పోలీసుశాఖ మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక ఉన్న ఆంతర్యమేంటనే విమర్శలు వస్తున్నాయి. కేవలం కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్న జిల్లా పోలీసుశాఖ ఇప్పటి వరకు క్వారీ కాంట్రాక్టర్ జోలికి మాత్రం వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. మహారాష్ట్రలోని శాఖాపూర్ ఇసుక క్వారీ నిర్వా హకులు కోటగిరి మండలం సుంకిని వద్ద మన భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తోడేస్తున్నా రు. జాతర తరహాలో లారీల్లో ఇసుక దోపిడీ జరుగుతున్నట్లు సమాచారం తెలుసుకున్న యువ ఐఏఎస్ అధికారి, బోధన్ సబ్‌కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో పకడ్బందీగా రెవెన్యూ అధికారుల బృందం నదిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. జిల్లా భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తవ్వుతున్న జేసీబీలు, టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలోనే ఇసుక మాఫియా ఏకంగా యువ ఐఏఎస్ అధికారిపై సామూహికదాడికి పాల్పడింది. ఈ ఘటన జరిగి పక్షం రోజులు గడుస్తున్నప్పటికీ ఈ కేసులో పోలీసుశాఖ పనితీరు కనీస పురోగతి కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఘటన జరిగిన శాఖాపూర్ ఇసుక క్వారీ నిర్వాహకులు, తెలంగాణకు చెందిన బడా నేతల పలుకుబడి కలిసి పోలీసుశాఖ చేతులు కట్టేసిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మహారాష్ట్ర మంత్రి అండదండలతో.. ఇసుక నుంచి రూ.కోట్లు దండుకోవడానికి అలవాటు పడిన రాష్ట్రానికి చెందిన ఇసుక మాఫియా మంజీర నదిలో తెలంగాణ భూభాగం ఇసుక నిల్వలపై కన్నేసింది. తన దోపిడీని యథేచ్ఛగా కొనసాగించేందుకు మహారాష్ట్రలో ఓ మంత్రితో చేతులు కలిపింది. నదిలో అటు వైపు అసలు ఇసుకే లేదు. అక్కడి ఇసుక నిల్వలు ఎప్పుడో తోడేశారు. మిగిలింది తెలంగాణ భూభాగంలోనే. లేని చోట ఇసుక నిల్వలు ఉన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి., టెండర్లు నిర్వహించేలా నాందేడ్ జిల్లా అధికార యంత్రాంగంపై మహారాష్ట్ర మంత్రితో ఒత్తిడి చేయించారు. ఈ మేరకు క్వారీని దక్కించుకుని తెలంగాణ భూభాగంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీకి తెరలేపారు. పైగా మహారాష్ట్ర క్వారీల పేరుతో జిల్లా భూభాగంలో తవ్విన ఇసుకను హైదాబాద్కే తీసుకువచ్చి విక్రయించడం గమనార్హం. తెలంగాణ చోటామోటా నాయకులకు సైతం.. తెలంగాణ భూభాగంలోని ఇసుక నిల్వలను దోపిడీ చేస్తున్న ఇసుక మాఫియా కేవలం మహారాష్ట్ర వైపు ఉన్న గ్రామస్తులకే కాకుండా, తెలంగాణ వైపు ఉన్న గ్రామాల్లోని కొందరు స్థానిక నేతలకు కూడా డబ్బులు వెదజల్లుతున్నారు. ఆయా క్వారీలకు తెలంగాణ వైపు ఉన్న మన గ్రామాల్లో కీలకంగా వ్యవహరించే చోటామోటా నాయకులకు పెద్ద మొత్తంలో సమర్పించుకుని తమ దందాకు అండగా నిలిచేలా పావులు కదుపుతున్నారు. ఇలా తెలంగాణ ఇసుకనే, తెలంగాణలోనే విక్రయించి పెద్ద మొత్తంలో దండుకోవడం గమనార్హం. 19 తర్వాత అరెస్టు చేస్తాం.. ప్రస్తుతం రెవెన్యూ యంత్రాంగం రైతుబంధు చెక్కుల పంపిణీలో తలమునకలై ఉంది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే రెవెన్యూ అధికారులతో కలిసి శాఖాపూర్ వెళ్లి దాడులకు పాల్పడిన వారిని గుర్తిస్తాం. వారిని అరెస్టు చేసి విచారించిన తర్వాతే క్వారీ నిర్వాహకులను అరెస్టు చేసేందుకు వీలు కలుగుతుంది.– రాజ్‌భరత్‌రెడ్డి, కోటగిరి ఎస్ఐ -
ఘరానా దందా
గజ్వేల్ : కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల మీదుగా నిత్యం వందల లారీల్లో ఇసుక తరలిపోతోంది. నిబంధనలకు పాతరేస్తూ.. ఓవర్‌లోడ్, వే బిల్లులతో ప్రమేయం లేకుండా దందా సాగుతోంది. అధికారులను మాముళ్ల మత్తులో ముంచుతూ.. అక్రమార్కులు రాజీవ్ రహదారిపై చెక్‌పోస్టులను దాటిస్తూ హైదరాబాద్‌కు ఇసుక చేరవేస్తున్నారు. తాజాగా ఈ ‘దందా’ కొత్తరూపు దాల్చింది. డబుల్ బెడ్రూమ్ పథకం అనుమతుల పేరిట హైదరాబాద్‌కే కాకుండా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట లాంటి ప్రధాన పట్టణాలకు కూడా ఇసుక తరలిస్తున్నారు. ఇసుక దందా అక్రమార్కులకు కాసులను కురిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి ఎంతోమంది ఈ వ్యాపారంలో హల్చల్ చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ఇసుకను జిల్లాలు దాటిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని మోయతుమ్మెద వాగు, కరీంనగర్ మండలం ఆరెపల్లిలోని మానేరువాగు, జిల్లాలోని ఆరెపల్లిలో గల క్వారీల నుంచి నిత్యం ఇసుక అక్రమంగా తరలిపోతోంది. నిజానికి 10 టైర్ల లారీలో 17 టన్నులు, 12 టైర్ల లారీలో 21 టన్నుల ఇసుక నింపాల్సి ఉంటుంది. కానీ, 10 నుంచి 15 టన్నులకు పైగా అదనంగా ఇసుక నింపి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రహదారులు దెబ్బతింటాయని తెలిసి కూడా.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. క్వారీల్లో టన్నును రూ.600 చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లో నాలుగు రెట్ల చొప్పున ధర పెంచి అమ్ముకుంటున్నారు. నిజానికి ప్రతి లారీలోనూ నిబంధనల ప్రకారం మాత్రమే ఇసుక నింపి.. వే బిల్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడా ఇసుక వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. ఇసుకను తరలించే క్రమంలో కరీంనగర్ జిల్లా నుంచి హైదరాబాద్ వరకు సుమారు 170 కిలోమీటర్ల పొడవునా పదికి పైగా చెక్‌పోస్టులున్నా... వీటిని సునాయసంగా దాటేస్తున్నారు. ఎప్పుడైనా అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తే ముందుగా సమాచారం అందుకొని.. రాజీవ్ రహదారిపై వందల సంఖ్యలో నిలిపి లారీలు నిలిపివేస్తూ.. తర్వాత వెళ్తున్నారు. అధికారుల అండదండలు ఇసుక వ్యాపారం ఇష్టానుసారంగా సాగడం వెనుక అధికారుల అండదండలు ఉన్నట్టు సమాచారం. రెవెన్యూ, మైనింగ్, ఆర్టీఏ, పోలీసు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు ఇచ్చే సంస్కృతి ఇక్కడ కొనసాగుతోంది. రాజీవ్ రహదారిపై ఉన్న పోలీస్స్టేషన్లు, చెక్‌పోస్టులను ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తున్నట్టు తెలిసింది. కేంద్రాల వారీగా మాముళ్లు ముట్టజెబుతూ తమ వ్యాపారానికి ఇబ్బంది కలుగకుండా అక్రమార్కులు జాగ్రత్తలు చూసుకుంటున్నారు. ఓవర్‌లోడ్ వాహనాలకు రూ.1000–రూ.1,500, వే బిల్లు లేకపోతే రూ.1000–రూ.2000తో పాటు పోలీస్స్టేషన్లకు కూడా మాముళ్లు ఇస్తున్నట్టు సమాచారం. ‘డబుల్ బెడ్రూమ్’ పథకం ముసుగులో.. తాజాగా ఇసుక వ్యాపారం కొత్త తరహాలో సాగుతోంది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇసుక అనుమతులు ఇస్తుండగా.. దీనిని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు దందా కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం గజ్వేల్‌లోని హౌసింగ్ బోర్డు సమీపంలో పటాన్చెరు ప్రాంతంలో ‘డబుల్ బెడ్రూమ్’ పథకం కోసం అనుమతి ఉన్న టిప్పర్ ఇసుక డంప్ చేస్తూ కనిపించింది. రోజు ఇదే రకంగా పెద్ద సంఖ్యలో టిప్పర్లు, లారీలు ఇక్కడికి వస్తున్నాయి. ఒక్కో టిప్పర్‌కు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, లారీకి రూ.30 వేల నుంచి రూ.35 వేలు పలుకుతోంది. సాధారణంగా ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తరలించే ఇసుక.. సాధారణ ఇసుకలో సగం ధరకే లభిస్తుంది. ఈ లెక్కన ఇసుక వ్యాపారులు భారీ ఎత్తున దండుకుంటున్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం 1 క్యూబిక్ మీటర్(1.9 టన్నులు) ఇసుకను రూ.72 ఆన్లైన్లో డీడీ చెల్లించి కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొడిముంజ స్టాక్ పాయింట్ల నుంచి తీసుకొస్తూ.. దీనిని నాలుగు రెట్ల ధరకు అమ్ముకుంటున్నారు. గజ్వేల్కే కాదు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటతో పాట ఇతర ప్రధాన పట్టణాలకు ఇదే రకంగా ఇసుక వస్తోంది. -
నిజాయితీకి నిండు ప్రాణం బలి
బెదిరింపులకు బెదరలేదు.. ప్రలోభాలకు లొంగలేదు... పోలీసు శాఖలో నిగూఢమై ఉన్న నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచాడు.అక్రమార్కులను ఒంటి చేత్తో పట్టుకుని చట్టానికి పట్టించే ప్రయత్నంలో కరుడుగట్టిన ఇసుక మాఫియా చేతుల్లో దారుణంగా హతమయ్యాడు. అతని మరణంతో ఐదు నెలల గర్భిణిగా ఉన్న భార్య, నాలుగేళ్ల కుమారుడు అనాథలయ్యారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీస్ హెడ్‌కానిస్టేబుల్‌ను ఇసుక మాఫియా కిరాతకంగా హతమార్చింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరునెల్వేలి జిల్లా నాంగునేరి తాలూకా చింతామణికి చెందిన జగదీశ్ దురై (34) విజయనారాయణం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విజయనారాయణం సమీపంలో రేయింబవళ్లు ఇసుక అక్రమరవాణా సాగుతోంది. నంబిచెరువు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు జగదీశ్‌కు సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మోటార్‌సైకిల్‌పై వెళ్లి తనిఖీలు నిర్వహించాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఇసుక లోడ్‌చేసిన ట్రాక్టర్‌తో సహా పరారయ్యేందుకు ప్రయత్నించారు. జగదీశ్ వారిని వెంబడించాడు. పరప్పాడి–తామరైకుళం అటవీ ప్రాంతంలో వెనుకవైపు టైరు పంచరై ట్రాక్టర్ బోల్తాపడి నిలిచిపోయింది. ట్రాక్టర్ నుంచి దిగిన 8 మంది వ్యక్తులు తమను వెంటాడుతున్న జగదీశ్‌పై గడ్డపార, ఇనుపరాడ్డు, దుడ్డుకర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు. గిలగిలాకొట్టుకుంటూ జగదీశ్ అక్కడే ప్రాణాలువిడిచాడు. అతరువాత నిందితులు ట్రాక్టర్‌ను సంఘటన స్థలంలోనే విడిచి పారిపోయారు. గస్తీకి వెళ్లిన జగదీశ్ తిరిగి రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులు హత్య గురైనట్లు గుర్తించారు. పంచరైన ట్రాక్టర్‌కోసం నలుగురు వ్యక్తులు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికోసం గాలింపు చేపట్టారు. రెండు నెలలుగా బెదిరింపులు ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన జగదీశ్‌కు ‘మా జోలికి రావద్దు’ అంటూ రెండునెలలుగా బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక తమకు అనుకూలమైన పోలీసుల ద్వారా జగదీశ్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఎవరికీ లొంగకుండా నిజాయితీగా విధులు నిర్వర్తించడంతో చంపేస్తామని కూడా హెచ్చరించి చివరకు అన్నంత పనిచేసి పొట్టనపెట్టుకున్నారు. తల్లడిల్లిన సతీమణి జగదీశ్ హత్యకు గురైనట్లు సోమవారం ఉదయం భార్య, బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఐదునెలల గర్భిణిగా ఉన్న భార్య మారియారోస్ మార్గరెట్ (30) తన కుమారుడు జోయల్ (4)ను వెంటపెట్టుకుని హత్య జరిగిన ప్రదేశానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నిజాయితీగా పనిచేస్తున్న తన భర్తను పాపిష్టి మూకలు ప్రాణం తీసాయని మృతదేహంపైపడి గుండెలవిసేలా రోదించారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని ఉన్నతాధికారులకు భర్త తెలియజేసినా పట్టించుకోనందునే ఆయన ప్రాణాలు పోయాయని ఆమె నిందించారు. తిరునెల్వేలి జిల్లా ఎస్పీ అరుణ్‌శక్తికుమార్, నంగునేరి ఏఎస్పీ సురేష్‌కన్నన్ తదితరులు ఆమెను ఓదార్చారు. -
ప్రకృతి కన్నెర్ర
లక్నో/జైపూర్: ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లపై ప్రకృతి విరుచుకు పడింది. ఈ రెండు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇసుక తుపాన్‌తో పాటు ఈదురు గాలులు, భారీ వర్షాలు విధ్వంసం స్టృష్టించాయి. వీటి ధాటికి దాదాపు 110 మంది మృత్యువాత పడ్డారు. రెండు రాష్ట్రాల్లోనూ భారీస్థాయిలో ఆస్తినష్టం వాటిల్లింది. గంటకు 100 కి.మీకు పైగా వేగంతో బలమైన గాలులు వీయ డంతో నష్ట తీవ్రత భారీగా ఉంది. రెండు రాష్రా ్టల్లోనూ పలు చోట్ల ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్థంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఓవర్‌హెడ్ తీగలు తెగిపడటంతో రైలు సేవలకు అంతరాయం కలిగింది. గ్రామీణ ప్రాంతా ల్లో చేతికొచ్చిన పంట నేలపాలయ్యింది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. హరియాణాలో ఏర్పడిన ఆవర్తన ద్రోణే ఈ విపత్తుకు కారణమని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) ప్రకటించింది. ఇసుక తుపాన్ ఘటనలో జరిగిన ప్రాణ నష్టంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు సత్వరం ఉపశమనం కలిగేలా సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. యూపీలోనే 70 మంది మృతి.. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 70 మందికి పైగా మృతిచెందగా, 83 మంది గాయపడ్డారు. రాజస్తాన్‌లో 36 మంది మరణించారు. యూపీలోని ఆగ్రాలో 43 మంది చనిపోగా, 51 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆగ్రా, బిజనూర్, రాయ్‌బరేలి, సహరాన్పూర్, ఫిలిబిత్, ఫిరోజాబాద్, చిత్రకూట్, ముజఫర్‌నగర్, ఉన్నావ్ జిల్లాల్లోనూ ఇసుక తుపాన్ ప్రభావం అధికంగా ఉంది. రాజస్తాన్‌లోని భరత్పూర్ జిల్లాలో ఈ తుపాన్ ధాటికి అత్యధికంగా 19 మంది మృత్యువాతపడ్డారు. ధోల్పూర్ జిల్లాలో గరిష్టంగా ఇసుక తుపాన్ బీభత్సం సుమారు 45 నిమిషాల పాటు కొనసాగింది. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, 60 శాతం గాయపడిన వారికి రూ. 2 లక్షలు, 40–50 శాతం గాయాలైన వారికి రూ.60 వేలు పరిహారంగా చెల్లిస్తామని రాజస్తాన్ విపత్తుల నిర్వహణ కార్యదర్శి హేమంత్ కుమార్ తెలిపారు. ఇసుక తుపాన్ విపత్తుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే సింధియా కూడా విచారం వ్యక్తం చేశారు. పొంచి ఉన్న మరో ముప్పు: ఆవర్తన ద్రోణి కారణంగా యూపీ, రాజస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలకు రాబోయే 48 గంటల్లో మరో ఇసుక తుపాను రానుందని ఐఎండీ హెచ్చరించింది. రాజస్తాన్‌లో గాలుల వేగం మరింత పెరిగేందుకు అవకాశము న్నట్లు తెలుస్తోందని, ఫలితంగా కారౌలీ, ధోల్పూర్లో ఇసుక తుపాన్ రావొచ్చని ఐఎండీ శాస్త్రవేత్త హిమాన్షు శర్మ తెలిపారు. దేశంలోని పలు ప్రాంతా ల్లో ఉరుములు, పిడుగులతో వర్షం బీభత్సం సృష్టించే ముప్పుందని ఐఎండీ కొద్ది రోజుల క్రితమే హెచ్చరికలు జారీచేసినా ఆ జాబితాలో యూపీ, రాజస్తాన్ లేకపోవడం గమనార్హం.. -
అక్రమ ఇసుక రవాణ...వైఎస్పార్సీపీ ధర్నా
సాక్షి, తాళ్లపుడి: నిబంధనలకు విరుద్దంగా ఇసుక రవాణ చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నాయకురాలు తానేటి వనిత ఆధ్యర్యంలో తాడిపుడి ఇసుక ర్యాంపు వద్ద ధర్నా నిర్వహించారు. ఎగుమతులకు సిద్ధంగా ఉన్న లారీలను పార్టీశ్రేణులు అడ్డుకోవడంతో ఇసుక ర్యాంపు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ..మంత్రి జవహర్ అండతోనే ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ కన్నుసైగల్లోనే ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని విమర్శించారు. అక్రమంగా ఇసుక తరలించే ముఠాపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. -
‘మహా’ ఇసుక కాంట్రాక్టర్ల దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/కోటగిరి: మహారాష్ట్ర ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు దౌర్జన్యానికి తెగబడ్డారు. మంజీరా నదిలో మహారాష్ట్ర క్వారీ పేరుతో తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తోడేస్తుండగా అడ్డుకున్న బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలోని తహసీల్దార్ల బృందంపై దాడికి పాల్పడ్డారు. సుమారు 50 మంది రాళ్లతో దాడి చేశారు. జప్తు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు నది ఒడ్డు వరకు తెచ్చిన 4 జేసీబీలు, డోజర్లను తిరిగి లాక్కెళ్లిపోయారు. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యా యి. అధికారుల ఫిర్యాదు మేరకు కోటగిరి పోలీసులు మహారాష్ట్ర క్వారీ కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పరిధిలో జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మంజీరా నదిలో మహారాష్ట్ర వైపు ఉన్న శాఖా పూర్ క్వారీలో ఇసుక తవ్వుకునేందుకు అనుమతి తీసుకున్నారు. ఈ క్వారీ కాంట్రాక్టర్ నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి.. రాష్ట్ర భూభాగంలోకి వచ్చి ఇసుక తవ్వుతున్నాడు. పేరుకు మహారాష్ట్ర క్వారీ అయినా.. తోడేస్తున్నది మాత్రం తెలంగాణ భూభాగంలోనే. రాత్రయితే పదుల సంఖ్యలో భారీ యంత్రాలు జిల్లా భూభాగంలో తవ్వడం నిత్యకృత్యమైంది. ఈ క్రమం లో బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వం లోని కోటగిరి, వర్ని, రెంజల్ మండలాల తహసీల్దా ర్లు, డీటీలు, వీఆర్ఓలు సుమారు 30 మందితో కూడిన బృందం మంగళవారం తెల్లవారుజామున నదిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్వారీల నిర్వాహకులు జిల్లా భూభాగంలో ఇసుక తవ్వుతుండగా, నాలుగు జేసీబీలు, డోజర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు.. నది ఒడ్డు వరకు తెచ్చారు. వెంటనే మహారాష్ట్ర క్వారీ నిర్వాహకులు 50 మంది వరకు వచ్చి అధికారుల బృందంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో రెవెన్యూ సిబ్బంది సాయినాథ్ తలకు గాయాలయ్యాయి. ఈ మేరకు రెవెన్యూ అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర క్వారీ కాంట్రాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దెగ్లూర్‌కు వెళ్లి క్వారీ కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకుంటామని కోటగిరి ఎస్ఐ రాజ్‌భరత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఈసారి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కేవలం రెవెన్యూ అధికారులే ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఏటా కొనసాగుతున్న తంతు మహారాష్ట్ర క్వారీల అనుమతుల పేరుతో జిల్లా భూభాగంలోని ఇసుక వనరులను దోచేయడం ఏటా పరిపాటిగా మారింది. జిల్లా అధికారులు అప్పుడప్పుడూ దాడులు చేయడం, కేసు నమోదు చేయడంతో సరిపెడుతున్నారు. గతేడాది మహారాష్ట్ర కాంట్రాక్టర్లు తెలంగాణ భూభాగం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడి చేసి, యంత్రాలను సీజ్ చేశారు. తాజాగా మహారాష్ట్ర క్వారీల నిర్వాహకులు జిల్లా అధికారులపైనే దాడికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. -
చెప్పేదొకటి.. చేసేదొకటి
ఇసుక అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కి తమ పనులను కానిచ్చుకుంటున్నారు. సొంత భూముల్లో ఇసుక మేటలను తొలగించుకుంటామని అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకొని అక్రమంగా ఇసుక తరలింపునకు పాల్పడుతున్నారు. దీన్ని కోరుమిల్లి లంక రైతులు అడ్డుకున్నారు. కోరుమిల్లి (కపిలేశ్వరపురం): ఇసుక భారీ ఎత్తున కోరుమిల్లి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. తమ భూముల్లో ఇసుక మేటలు వేశాయని, భూములను సాగుకు అనుకూలంగా చేసుకొనేందుకు ఇసుకను తొలగించుకుంటామంటూ జిల్లా ఉన్నత స్థాయి అధికారుల నుంచి కొందరు అనుమతి పొందారు. ఆ అనుమతులను అడ్డం పెట్టుకుని వందలాది వాహనాల్లో ఇసుకను అక్రమంగా జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ కోరుమిల్లి లంక రైతులు ఆదివారం ఆందోళన బాట పట్టారు. ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని ఆ తవ్వకాలను అడ్డుకున్నారు. ఆ సందర్భంగా రైతులు విలేకరులతో మాట్లాడుతూ కోరుమిల్లి గోదావరి నదిని ఆనుకుని తమకు భూములున్నాయన్నారు. తమ భూముల సమీపంలోని సుమారు 16 ఎకరాల భూములకు సంబంధించిన కొందరు రైతులు అనుమతులు సంపాదించి అక్రమ ఇసుక తవ్వకాలను ప్రారంభించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మనిషి ఎత్తు లోతున తవ్వుతున్నారని వారు ఆరోపించారు. పగలు కూలీలతో, రాత్రి వేళ యంత్రాలతో తవ్వేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల తహసీల్దారు బి.సాయి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినప్పటికీ అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలు ఇదే రీతిలో కొనసాగితే సమీపంలోని తమ లంక భూములు గోదావరి నది కోతకు గురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములను రక్షించుకునేందుకు ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని రైతులు స్పష్టం చేశారు. రైతులు అడ్డుకోవడంతో ఇసుక తరలింంచేందుకు వచ్చిన సుమారు 70 వాహనాలు వెనుతిరిగాయి. తవ్వకాలు నిలుపుదల చేయకపోతే ఉన్నతా« ధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు తెలిపారు. కోరుమిల్లికి చెందిన సుంకర సూ ర్యనారాయణ, వింటి విష్ణుమూర్తి, కాకులపాటి సత్యనారా యణ, తాడాల ఆదినారాయణ, వింటి దుర్గారావు, వింటి ఏసు, జొన్నకంటి సత్యనారాయణ, బక్కి సూర్యనారాయణ, రామారావు, నాగేశ్వరరావు, సత్తిబాబు పాల్గొన్నారు. -
రంగనాయకసాగర్‌లో ఇసుకాసురులు!
చిన్నకోడూరు (సిద్దిపేట): శుక్రవారం ఉదయం.. మానేరువాగు నుంచి ఇసుక నింపుకొని ఓ లారీ బయలుదేరింది.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయకసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి ఆ ఇసుకను తరలించాలి. కానీ అది రిజర్వాయర్ వద్దకు కాకుండా సిద్దిపేట పట్టణంలోని ఓ బహుళ అంతస్తుల నిర్మాణాలకు చేరింది.. ఇలా ఒక్క లారీ కాదు.. వందలాది లారీల ఇసుక దారి మళ్లుతోంది. ఇసుక తరలింపునకు అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుపై ఉంటాయి.. వాస్తవానికి ఆ ఇసుక తరలివెళ్లేది హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని భారీ భవనాల నిర్మాణాల కోసం. ప్రాజెక్టు కాంట్రాక్టర్లు, లారీల యజమానులు కుమ్మక్కై ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. లారీ ఇసుకను రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నారు. ఇదంతా రెవెన్యూ, నీటిపారుదల, పోలీసు, మైనింగ్ అధికారుల దృష్టికి వచ్చినా ‘మామూలు’గానే పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. చెక్‌పోస్టు దాటితే అంతే.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులో రంగనాయకసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనుల కోసం సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ శివార్లలోని చింతల్‌ఠాణా, కొడుముంజ గ్రామాల వద్ద మానేరు వాగు నుంచి ఇసుకను రవాణా చేస్తున్నారు. రోజుకు 150 టిప్పర్ల మేర ఇసుక రంగనాయకసాగర్ ప్రాజెక్టు పేరిట అక్కడి నుంచి బయలుదేరుతుంది. కానీ అందులో 50 ట్రిప్పుల వరకు ప్రైవేటు పనులకు తరలిపోతోంది. సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లోని జిల్లెల్ల వద్ద చెక్‌పోస్టు ఉంటుంది. ఆ చెక్‌పోస్టు దాటగానే ఇసుక దారి మళ్లుతోంది. ఇలా ఇసుక దారి మళ్లించి అమ్ముకొంటూ కాంట్రాక్టర్లు, ప్రాజెక్టు అధికారులు రోజూ లక్షల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నారు. ప్రమాదాలకు హేతువుగా..! సిరిసిల్ల, సిద్దిపేట మార్గంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణా పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ఇసుక తరలిస్తున్న వాహనాల అతివేగంతో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా రెండు జిల్లాల పోలీసు, రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనత ఇసుక అక్రమ రవాణాకు ఆజ్యం పోస్తోంది. అక్రమ రవాణా అరికట్టాలి ‘‘రంగనాయకసాగర్ ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు, ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కై అవకతవకలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి..’’ – జంగిటి శ్రీనివాస్, చిన్నకోడూరు భయం మధ్య బతుకుతున్నం ‘‘ఇసుక టిప్పర్లు నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్‌తో, వేగంగా దూసుకెళుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు మీదకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి..’’ – అంకార్ మధు, అల్లీపూర్ అక్రమాలపై చర్యలు చేపడతాం.. ‘‘రంగనాయకసాగర్ ప్రాజెక్టు పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తే సహించేది లేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. చర్యలు తీసుకుంటాం. ఇసుక పక్కదారి పడుతున్నట్టు తెలిస్తే మాకు సమాచారం అందించాలని సూచించాం..’’ – రాజిరెడ్డి, చిన్నకోడూరు తహసీల్దార్ -
‘గుడిలో లింగాన్నీ మింగిన ఘనుడు చంద్రబాబు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో పాలన ఎలా ఉందంటే.. గుడిని, గుడిలో లింగాన్ని మింగేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కిందంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రజలకే కాదు ఆలయాలకు, దేవుళ్లకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ జగన్ విమర్శించారు. 143వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం గన్నవరంలో బ్రహ్మలింగయ్య చెరువును వైఎస్ జగన్ పరిశీలించారు. నీరు-చెట్టు పథకం కింద ఇసుక, మట్టిని టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ వైఎస్ జగన్‌కు స్థానికులు వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. నీరు-చెట్టు పథకం కింద టీడీపీ నేతలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. కింది స్థాయి నుంచి ఏపీ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు వరకు కమీషన్లు వెళ్తున్నాయంటూ విమర్శలు చేశారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా టీడీపీ నేతలు దుర్మార్గంగా మట్టిని తరలిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతల అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. మట్టి తవ్వేందుకు దేవాలయం అడ్డు వస్తుందని అందులో ఉన్న విగ్రహాలను రాత్రికి రాత్రే తరలించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతి చెరువు పరిస్థితి ఇలానే ఉందంటూ ఆందోళన వైఎస్ జగన్ వ్యక్తం చేశారు. 'మట్టితో వ్యాపారం ఎలా చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన ఏపీలో అదేపని చేసి చూపిస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌కి 35 కిలోమీటర్ల దూరంలో ఇసుక వ్యాపారం జరుగుతుంటే.. ఇక రాష్ట్రం ఎలా బాగుపడుతుంది. చివరికి దేవుళ్లను కూడా గుళ్లలో ఉండనీయం లేదు. రాష్ట్రాన్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు మార్చేశారు. నేను వస్తున్నానని తెలిసి ఈ రోజు తాత్కాలికంగా పనిని ఆపేశారు. రోజు వందల లారీలతో ఇసుక, మట్టిని అక్రమంగా తరలించేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రజలకే కాదు దేవుళ్లకు సైతం రక్షణ లేకుండా పోయిందంటూ' నాలుగేళ్ల చంద్రబాబు పాలనను వైఎస్ జగన్ ఎండగట్టారు. -
ఖనిజ సంపదను ఆంధ్రకు తరలిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావు ఇసుక మాఫియాలో మునిగి తేలుతున్నారని, జూపల్లి అండతో పాలమూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోందని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. జూపల్లి ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినా సీఎం పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం తీరు చూస్తుంటే ‘నేను ప్రగతిభవన్‌లో కూర్చుని రాష్ట్రాన్ని దోచుకుంటాను, మీరు జిల్లాలను దోచుకోండని’మంత్రులకు చెప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఖనిజ సంపదను ఆంధ్రకు తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాపై చర్చించేందుకు జూపల్లి సిద్ధమా అని సవాల్ చేశారు. -
ఇసుక మాఫియాదే రాజ్యం
సాక్షి, హైదరాబాద్: కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో రూ.30 కోట్ల విలువైన ఇసుక అక్రమ రవాణాకు గురైందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్టులో 7 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిపి, నది వరకు రోడ్డు వేశారని, దీని ద్వారానే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై మైనింగ్ మంత్రి కేటీఆర్‌కు కళ్ళు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. సినీ పరిణామాలపై టాస్క్‌ఫోర్స్: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: సినిమా పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం జోక్యం చేసుకుని టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమలో జరుగుతున్నది ఆరోగ్యకరమైన పరిణా మం కాదని, మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. డ్రగ్స్ కేసు ఎంత వరకు వచ్చిందో ప్రభుత్వానికి కూడా తెలియదని పేర్కొన్నారు. మంత్రి తలసాని కాంగ్రెస్ పార్టీని తిట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. -
ఆగని మట్టి అక్రమ రవాణా!
మట్టి అక్రమ తరలింపునకు బ్రేక్ పడటం లేదు. పత్రికల్లో కథనాలు వచ్చిన రెండు రోజుల పాటు అధికారులు హడావుడి చేయడం.. ఆనక మిన్నకుండి పోతుండటంతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి, పగలు అన్న భేదం లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్ల కొద్దీ మట్టిని యథేచ్ఛగా తరలి స్తోంది. నిత్యం వాహనాల సంచారంతో సమీప గ్రామాల రహదారులు గుల్ల అవుతున్నాయి. ప్రజలు కూడా దుమ్ము, ధూళిని తట్టుకోలేకపోతున్నారు. రాత్రిళ్లు పెద్ద పెద్ద శబ్దాలకు కంటి నిండా కునుకు సైతం తీయలేని దుస్థితి ఏర్పడిందని వారు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, మచిలీపట్నం : బందరు మండల పరిధిలోని బుద్దాలపాలెం, పెడన నియోజకవర్గం కాకర్లమూడి పరిసర ప్రాంతాల్లో మట్టి అక్రమ తవ్వకాలు నిత్యకృత్యంగా మారింది. ఇటీవల మట్టి అక్రమ రవాణాపై ‘తవ్వుకో.. దోచుకో’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు మట్టి తరలించే ప్రదేశానికి ఓ వీఆర్వోను పంపి నిఘా ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రెండు రోజుల అనంతరం తిరిగి యథారాజా.. తథాప్రజ అన్న ప్రక్రియ మొదలైంది. ప్రతి రోజూ వందకుపైగా ట్రాక్టర్, టిప్పర్, లారీల్లో మట్టి తరలింపు సాగుతోంది. అధికారులు మట్టి అక్రమ రవాణా జోలికెత్తే.. టీడీపీ ప్రజా ప్రతినిధులతో వారిపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. కొన్నేళ్లుగా ఇదే తంతు సాగుతున్నా శాశ్వత చర్యల దిశగా అడుగులు పడకపోవడం దారుణం. మట్టిని తవ్వేస్తుండటంతో భూముల్లో ఎక్కడ చూసినా గోతులే దర్శనమిస్తున్నాయి. రోజూ ఇదే తంతు.. బుద్దాలపాలెం, కాకర్లమూడి చుట్టుపక్క గ్రామాల నుంచి పొలాల నుంచి ప్రతి రోజూ దాదాపుగా 100 ట్రాక్టర్లు, 50 టిప్పర్లు, లారీలతో మట్టి తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టి రూ.600 నుంచి రూ.1000 పలుకుతోంది. ఒక్కో టిప్పర్ రూ.3,500 నుంచి రూ.4,000 దూరాన్ని బట్టి ధర వసూలు చేస్తున్నా రు. ఇలా ప్రతి రోజూ సుమారు రోజుకు రూ.3 లక్షలకుపైగా, నెలకు రూ.90 లక్షల వరకు అక్రమార్కులు తమ జేబు ల్లో వేసుకుంటున్నట్లు సమాచారం. -
3300 కి.మీ. పాదయాత్ర చేసిన డిగ్గీ రాజా
భోపాల్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేపట్టిన ‘నర్మదా యాత్ర’ సోమవారంతో ముగిసింది. దేశంలో పురాతన నదిగా పేరొందిన నర్మదా నది తీరంలో ఇసుక మాఫియా చేస్తున్న దురాగతాల వల్ల నది కలుషితమవుతుందంటూ డిగ్గీ రాజా ఆరు నెలల క్రితం నర్మదా యాత్ర చేపట్టారు. గతేడాది సెప్టెంబర్ 30న ప్రారంభమైన ఈ పాదయాత్ర 3300 కిలోమీటర్ల మేర సాగింది. బర్మన్ ఘాట్‌కి చేరుకున్న దిగ్విజయ్, ఆయన భార్య అమృత కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఆయన భార్య అమృత, మాజీ ఎంపీలు రామేశ్వర్ నీఖ్రా, నారాయణ్ సింగ్, ఆయన అనుచరగణం కూడా పాల్గొన్నారు. కాగా ఆద్యంతం మతపరమైన, సాంస్కృతిక యాత్రగా సాగిన ఈ పాదయాత్ర మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవినీతి చిట్టాను బయటపెట్టేందుకు సాక్ష్యాలు సేకరించడానికి దోహదపడిందని, ఆ వివరాలు త్వరలోనే బహిర్గతం అవుతాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. -
ఇసుక పిండి ధైర్యం ఇచ్చింది
నూరు దుర్మార్గాలు పళ్లు నూరినా కలత చెందని మహాధీర ఆమె. ఇసుక మాఫియాను బ్యాండ్ వాయించి... వారి మోసాన్ని లోకానికి చాటి చెప్పింది. ఇంకా ఇలాంటి మహా మహిళామతల్లులు ఉన్నారు కాబట్టే... భూమి మీద ఇసుక ఉంది. ఇసుక కింద తడి ఉంది. రైతు నాలుగు గింజలు పండించగలుగుతున్నాడు. ‘‘మాది కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలోని వేలేరు గ్రామం. మా నాన్న దోనవల్లి భాస్కర్‌రావు సాధారణ రైతు. ముగ్గురమ్మాయిల్లో నేనే పెద్దదాన్ని. తమ్ముడు అందరికంటే చిన్నవాడు. అప్పట్లో అమ్మాయిలు ఎక్కువ చదువుకుంటే పెళ్లి పెద్ద సమస్య అయ్యేది. నాకు పద్దెనిమిదేళ్లకి పెళ్లి కావడానికి ఇవన్నీ కారణాలే. అయితే నా అదృష్టం ఏమిటంటే... నా చదువు గురించి మా వారు శ్రద్ధ చూపించడం. పెళ్లయిన కొత్తలో ఓ సారి... నాకు చదువుకోవాలని ఉంటే నాన్న పెళ్లి చేసుకోమన్నాడని చెప్పాను. ఆ తర్వాత ఆ మాటే మరిచిపోయాను. ఓ రోజు ఓ పేపర్ కటింగ్ తెచ్చి ఇచ్చారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో డిగ్రీ చదవడానికి ఇచ్చిన నోటిఫికేషన్ అది. బి.ఎ. నుంచి ఎల్ఎల్బి బి.ఎ, ఎం.ఎ, ఎల్ఎల్బి చేశాను. ఎల్ఎల్బి పూర్తయ్యే నాటికి గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. తొలి పోస్టింగ్ ఉంగుటూరుకి డిప్యూటీ తాసీల్దారుగా. ముసునూరు మండలానికి ఎంఆర్వోగా బాధ్యతలు తీసుకునే వరకు నేను బయట ఎవరికీ తెలియదు, ముసునూరు బాధ్యతలు నన్ను రెండు రాష్ట్రాలకు తెలియచేశాయి. డ్యూటీ కచ్చితంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలియచేశాయి, ఎలాంటి కష్టాలు ఎదురైనా వృత్తి నిబద్ధతను వదలకూడదనే దృఢ సంకల్పాన్ని పెంచాయి. ఇసుక తోడేస్తే ఏమవుతుంది? నేను ముసునూరులో బాధ్యతలు తీసుకునే నాటికే మండలంలో 16 గ్రామాలుంటే అందులో పదకొండు గ్రామాలు డార్క్లిస్ట్లో ఉన్నాయి. డార్క్ లిస్ట్ అంటే... గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా తగ్గిపోయినప్పుడు ఇక అక్కడ బోర్ వేయడానికి అనుమతించరు. అలా బోరు వేయకూడని స్థితిలో ఉన్నాయి ఆ గ్రామాలు. వాటర్ లెవెల్ ఏడు వందల అడుగుల నుంచి తొమ్మిది వందలకు వెళ్లింది. డార్క్ లిస్ట్ గ్రామాల్లో బోర్ వేయడానికి మా డిపార్ట్మెంట్ అనుమతివ్వదు. మా సర్టిఫికెట్ లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కనెక్షన్ ఇవ్వదు. ఇసుక తవ్వే కొద్దీ నీటి లెవెల్ ఇంకా కిందకు వెళ్లిపోతుంటుంది. మిగిలిన గ్రామాల్లోనైనా వాటర్ లెవెల్ ఉన్న స్థితిలో మెయిన్‌టెయిన్ అవ్వాలంటే ఇసుక నిల్వలు తగ్గకూడదు. కండిషన్ అలా ఉండడంతో కలెక్టర్ ఇసుక తవ్వకాలను ఆపేయాలని ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఆదేశాలను పాటించడం నా విధి. పైగా నేను రైతు బిడ్డను. మా నాన్న ఉదయం ఐదింటికి పొలానికి వెళ్తే, రాత్రి ఎనిమిదింటికి ఇల్లు చేరేవాడు. రైతు కష్టం నాకు తెలుసు. అందుకే కమర్షియల్ అవసరాలకంటే రైతు కనీస అవసరాల కోసం పని చేయడమే నా ధర్మం అని నమ్ముతాను. దాంతో ఎక్కడ ఇసుక అక్రమ తవ్వకం, రవాణా జరుగుతున్నా వెళ్లి అడ్డుకునేదాన్ని. నేను పర్టిక్యులర్‌గా ఉన్నానని తెలిసి రాత్రిళ్లు తరలించసాగారు. విఆర్వోలు, నేను వెళ్లి లారీలు, ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశాం. చంపేస్తామని బెదిరింపు ఉత్తరాలు వచ్చాయి. వాటికి నేను భయపడలేదు. దాదాపు ఇరవై ట్రాక్టర్లను సీజ్ చేయించి, ప్రభుత్వానికి రెండున్నర లక్షల రూపాయల చలానా కట్టించాను. అది ఎమ్మెల్యేకి, వారి మనుషులకు నచ్చలేదు. నా మీద దాడికి పాల్పడ్డారు. ఆ సంఘటన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు నాయకుల నుంచి ఎదురయ్యే కష్టాలు చాలా మందికి తెలిశాయి. ఇప్పటికీ వనజాక్షి అనగానే ఇసుక తవ్వకాన్ని అడ్డుకున్న అధికారిగానే నన్ను గుర్తుపడతారు. మంచి కుటుంబం! విధుల్లో కచ్చితంగా ఉండాలని చాలా మందికి ఉంటుంది. కానీ కొందరికి ఇంటి పరిస్థితులు సహకరించవు. నా విషయంలో మా నాన్న, మా వారు, మా అబ్బాయి, చెల్లెళ్లు, తమ్ముడు, బంధువులు ఎవరూ వెనక్కు లాగలేదు సరికదా నా పోరాటాన్ని గర్వంగా ఫీలయ్యారు. మా అబ్బాయి ఐఐటి ఖరగ్‌పూర్‌లో చదువుతున్నాడప్పుడు. తనైతే ‘అమ్మా నీ డ్యూటీ నువ్వు కచ్చితంగా చేశావు, అన్ని పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. భయపడాల్సింది, వెనక్కి ఆలోచించుకోవాల్సిందేమీ లేదు’ అన్నాడు. శర్మగారి కమిటీ ముందు ‘ఆ రోజు ఏం జరిగిందో చెప్పాల్సినప్పుడు... నాకు నేను చెప్పుకున్న మాట ఒక్కటే. నా తరవాత తరానికి నేను ఓ మంచి సందేశాన్నివ్వాలంటే ఇదే కరెక్ట్ టైమ్. ఇప్పుడు నేను స్థిరంగా, హుందాగా వ్యవహరిస్తేనే నన్ను రోల్‌మోడల్‌గా తీసుకుంటారెవరైనా’ అనుకున్నాను. అలాగే అనేక ప్రతికూల పరిస్థితులను గంభీరంగా ఎదుర్కొన్నాను. ఉద్యోగంలో ప్రతి క్షణం నేను ఏది సరైన పని అనుకుంటే దానిని నేను అనుకున్నట్లే చేస్తూ వచ్చాను. ఇకపై కూడా అలాగే చేస్తాను. ‘ఉద్యోగంలో స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉండాలి. సర్వీస్ మోటోతో పని చేయాలి. మరొకరితో బేరీజు వేసుకోవడం ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా మన ఉన్నతికి దోహదం చేయాలి తప్ప ఇతరుల మీద ఈర్ష్య, అసూయలను పెంచేదిగా ఉండకూడదు’ ఈ సూత్రాన్ని నేను పాటిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలా ఉండాలనే కోరుకుంటాను’’. అమ్మాయిలంటే ఇష్టం! నాకు అమ్మాయిలంటే స్వతహాగానే చాలా ఇష్టం. మేఘనకు తల్లి లేదు. తండ్రి కూడా చివరి దశలో ఉన్నాడు. అందుకే ఆ అమ్మాయిని దత్తత తీసుకున్నాను. మగపిల్లాడికి చదువుకు పోషణకు ఆర్థిక సహాయం చేస్తే సరిపోతుంది. కానీ అమ్మాయి విషయంలో ‘ఈ అమ్మాయికి రక్షణగా ఫలానా వాళ్లు ఉన్నారు’ అనుకుంటేనే ఆ అమ్మాయికి భద్రత. రక్షణ ఉందని తెలియకపోతే ఆడపిల్లల మీద పలువురి చూపులు పడుతుంటాయి. అందుకే సమాజంలో ఒక హోదా ఉండే వాళ్లు ఇలాంటి హోమ్స్‌లో ఉండే ఆడ పిల్లలను దత్తత తీసుకోవాలి. ఇదీ నా లైఫ్‌స్టయిల్! నా పోస్టింగ్ నూజివీడుకు మారడంతో మా వారు విజయనగరంలో ఉద్యోగం మానేసి నూజివీడులో జాబ్‌లో చేరారు. ఆయనకు వ్యవసాయం హాబీ. ఆయనను చూస్తూ నాక్కూడా ఇష్టం పెరిగింది. కూరగాయలు మా ఇంట్లోనే పండించుకుంటున్నాం. వనరులను వృథా చేయకుండా పొదుపుగా వాడడం నా హాబీ. కరెంట్, నీరు దేనిని వృథా చేయను. సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలని ఆలోచన. బాల్కనీలో పక్షులకు గింజలు వేసి నీళ్లు పెడతాను. రెండు పెట్ డాగ్స్‌ను పెంచుతున్నాను. మరో ఆరు స్ట్రీట్ డాగ్స్‌కి ఆహారం పెడతాను. కుక్కలను తరిమేయడానికి బదులు వాటికి వ్యాక్సినేషన్ చేయించి కాలనీలో తిరగనిస్తే చిన్న చిన్న దొంగతనాల వంటి కొన్ని నేరాలు తగ్గిపోతాయి. రిటైర్మెంట్ తర్వాత ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉంది. నిరాదరణకు గురైన పిల్లలకు, వృద్ధులకు ఆసరాగా ఏదైనా చేయాలి. ఇప్పుడు సమాజంలో ప్రధాన సమస్య వార్ధక్యంలో ఉన్న అమ్మానాన్నలను పిల్లలు నిర్లక్ష్యం చేయడమే. అలాంటి వారికి నీడనివ్వాలని నా ఆకాంక్ష. – వనజాక్షి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (తాసీల్దార్), సబ్ కలెక్టర్ ఆఫీస్, నూజివీడు - వాకా మంజులారెడ్డి -
అక్రమ రవాణా.. ఆపై అతివేగం
కొత్తపల్లి(కరీంనగర్) : అసలే అక్రమంగా తరలిస్తున్న ఇసుక.. ఆపై అతివేగం.. అనుభవంలేని, లైసెన్స్ లేకుండా.. ఇష్టారాజ్యమైన డ్రైవింగ్‌తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మితిమీరిన వేగం ప్రజలకు ప్రాణసంకటంగా మారుతోంది. వేగంగా దూసుకొస్తున్న వాహనాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో..? అన్న అభద్రతాభావంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ మల్కాపూర్‌లో ఓ ఇంట్లోకి దూసుకురాగా.. అదే శివారులోని బైపాస్ సమీపంలో గల మూలమలుపు వద్ద శనివారం అతివేగంతో అదుపుతప్పిన ఓ ఇసుక ట్రాక్టర్ బోల్తాపడింది. ఎలాంటి నష్టమూ వాటిల్లనప్పటికీ.. రోడ్డంతా ఇసుక నిండుకోవడంతో పాటు ఇతర వాహనాల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ఆదరాబాదరగా ఆ ఇసుక ట్రాక్టర్‌ను అక్కడి నుంచి తరలించడంతో కేసునుంచి బయటపడినట్లయ్యింది. మల్కాపూర్ బైపాస్‌పై గతేడాది ఆటోను ట్యాంకర్ ఢీకొట్టిన సంఘటనలో ఎనిమిది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సమీపంలోనే ఇసుక ట్రాక్టర్ బోల్తా పడటంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్, ఆసిఫ్‌నగర్, ఎలగందుల, కమాన్‌పూర్, బద్ధిపల్లి, నాగులమల్యాల, గంగాధర మండలం ఒడ్యారం గ్రామాల్లోని ఖనిజ సంపదను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు నిత్యం వేలాది చిన్న, పెద్ద వాహనాలు వెళ్తుంటాయి. ఆ వాహనాలన్నీ కమాన్‌పూర్, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్, రేకుర్తి గ్రామాల మీదుగా అతివేగంతో ప్రయాణిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు రోడ్డు దాటాలంటేనే వణుకుతున్నారు. మానేరు వాగు నుంచి ఇసుక, ఆసిఫ్‌నగర్, నాగులమల్యాల, ఒడ్యారం, కమాన్‌పూర్, బద్ధిపల్లి గ్రామాల నుంచి గ్రానైట్, మొరం రవాణా చేసే వాహనాలు, ఆటోలు తదితర ఇతర వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుండటంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ వాహనాల వేగానికి ప్రజలు దూరంగా పరుగెత్తాల్సి వస్తుందే తప్ప డ్రైవర్లు మాత్రం వేగాన్ని నియంత్రించడం లేదు. అడ్డు అదుపులేకుండా వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలపై రవాణా శాఖ కొరడా ఝులిపించాల్సి అవసరం ఉన్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అడపాదడపా తనిఖీలు చేస్తూ వదిలేస్తుండటంతో భయం లేకుండా పోతోంది. లైసెన్స్‌లు లేకుండా వాహనాలను నడుపుతున్నా చర్యలు లేకపోవడంతో దర్జాగా డ్రైవింగ్ చేస్తున్నారు. గ్రానైట్ లారీల్లోంచి బండలు పడిపోయినా, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు బోల్తా పడ్డ ఎలాంటి చర్యలు లేకపోవడంతో అతి వేగానికి కళ్లెం పడటం లేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ల వేగానికి కళ్లెమేది ? మండలంలోని ఖాజీపూర్ మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారుల కళ్లెదుటే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా నిలువరించలేకపోతున్నారు. అధికారులెక్కడ చూస్తారోనన్న భయంతో అక్రమ రవాణాదారులు ట్రాక్టర్ల స్పీడును పెంచుతూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అతివేగం ప్రమాదమని తెలిసినా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. లైసెన్స్‌లు లేని డ్రైవర్లు, లేబర్లే డ్రైవర్లుగా అవతారమెత్తుతూ ట్రాక్టర్లను తోలుతుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెల 22న మల్కాపూర్ మాజీ సర్పంచ్ ఇంట్లోకి ఇసుక ట్రాక్టర్ దూసుకెళ్లిన విషయం మరువకముందే.. అదేగ్రామంలో బైపాస్ సమీపంలోని మూలమలుపు వద్ద ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో రోడ్డంతా ఇసుక నిండుకోవడమే కాకుండా ఇతరుల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఇసుక ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేగాన్ని అదుపు చేయాలి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, గ్రానైట్, మొరం లారీల వేగాన్ని అదుపు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇసుక ట్రాక్టర్లు, లారీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ వాహనాల వేగానికి రోడ్డు దాటాలంటేనే భయం వేస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులకు మరీ కష్టంగా ఉంది. మితిమీరిన వేగం వల్ల ఇసుక ట్రాక్టర్లు బోల్తా పడుతున్నాయి. అతి వేగానికి కళ్లెం వేయాలి. – కాసారపు శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ మల్కాపూర్ -
అందమైన కానుక
హీరో అల్లు అర్జున్ బర్త్‌డే ఇవాళ. ‘గంగోత్రి’ టు ‘డీజే’.. బన్నీ ప్రయాణం పదిహేనేళ్లు. ఈ 15 ఏళ్లల్లో హీరోగా ఇప్పటివరకు 18 సినిమాలు చేశారు. ఇక బన్నీ బర్త్‌డే విషయాని కొస్తే.. విశాఖపట్నం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అక్కడి ఆర్కే బీచ్‌లో 5 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత మానస్ శేషు ఆధర్వంలో ఈ సైకత శిల్పం రూపొందింది. ‘‘అల్లు అర్జున్ అభిమానుల కోరిక మేరకు తయారు చేసిన అందమైన కానుక ఇది’’ అన్నారు మానస్. ఈ సంగతి ఇలా ఉంచితే.. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా డైలాగ్ ఇంపాక్ట్‌ను ఈ రోజు విడుదల చేయనున్నారు. ఈ చిత్రం మే 4న రిలీజ్ కానుంది. -
హీరో కోసం ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్
తమకు కావాల్సిన వారి పుట్టినరోజుకు గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అదే తమ అభిమాన హీరో జన్మదిన వేడుకలను ఏడాది పొడవునా గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తారు. మరికొంతమంది అభిమానులు కాస్త విభిన్నంగా ఆలోచిస్తారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు. ఈ ఆదివారం(ఏప్రిల్ 8న) బన్నీ పుట్టినరోజును పురస్కరించుకొని స్పెషల్ బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు. దీనిలో భాగంగా వైజాగ్ బీచ్‌లో బన్నీ భారీ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఆయన అభిమానులు ఉన్నారు. దీనికోసం ప్రముఖ సైకత శిల్పులను సంప్రదించారని, అనుకున్నట్టు జరిగితే వైజాగ్ బీచ్‌లో ఆదివారం బన్నీ సైకత శిల్పాన్ని చూడొచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. మే 4న ప్రేక్షకుల ముందు రాబొతుంది. -
ఆగడం లేదు
సూళ్లూరుపేట: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఉచితంగా ఇసుక తీసుకోవచ్చనే ప్రకటనతో అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. ఇదే సరిహద్దు పోలీసు స్టేషన్లకు వరంగా మారింది. ఆంధ్రా–తమిళనాడు సరిహద్దుల్లోని తడ, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లా పరిధిలోని వరదయ్యపాళెం మండలాల్లో పలు ప్రాంతాలను డంపింగ్ కేంద్రాలను ఎంపిక చేసుకుని రాత్రి వేళల్లో తమిళనాడుకు ఇసుక తరలిస్తున్నారు. పగలంతా ట్రాక్టర్ల ద్వారా మిక్సర్ ప్లాంట్ల పేరుతో ఇసుకను తీసుకెళుతున్నారు. రాత్రి వేళల్లో జేసీబీలతో లారీల్లో లోడింగ్ చేసి తమిళనాడుకు సరఫరా చేస్తున్నారు. కఠినతరం చేయడంతో.. తమిళనాడులో ఎక్కడా ఇసుక తవ్వకూడదనే నిబంధనలను కఠినతరంగా అమలు చేస్తున్నారు. దీంతో ఆంధ్రా నుంచి వెళ్లే ఇసుక మీదే ఆధారపడి అక్కడ భవన నిర్మాణాలు చేస్తున్నారు. నాయుడుపేట, శ్రీకాళహస్తి, పెళ్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాల నుంచి శ్రీసిటీ, రామాపురం, బత్తులవల్లం పేరుతో పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. నెల్లూరు–చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో డంపింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసుకుని అక్కడినుంచి లారీల్లో ఇసుకను చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు తదితర ప్రాంతాలకు బాహాటంగా రవాణా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ యజమానికి ఒక్కో టీడీపీ నాయకుడు అండదండలు ఉండటంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 15 ట్రాక్టర్లు జిల్లాలోని కాళంగి, స్వర్ణముఖి, నెల్లూరు పెన్నా నది నుంచి అధికలోడుతో ఇసుకను చిత్తూరు జిల్లా బత్తులవల్ల వద్ద ఉన్న మిక్సర్ప్లాంట్కు తోలుతున్నారు. అక్కడ డంప్ చేసి రాత్రివేళల్లో తమిళనాడుకు తరలిస్తున్నారనే సమాచారంతో వరదయ్యపాళెం పోలీసులకు మంగళవారం ఆకస్మికంగా దాడులు చేసి సుమారు 15 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 10 ట్రాక్టర్ల వరకు నెల్లూరు జిల్లాకు చెందినవే కావడం విశేషం. పట్టుబడిన ట్రాక్టర్ల డ్రైవర్లను అదుపులోకి తీసుకుని యజమానులను పిలిపించుకుని విచారిస్తున్నారు. ఆంధ్రా ఇసుకకు డిమాండ్ జిల్లాలోని పెన్నా, స్వర్ణముఖి, కాళంగి నది ఇసుక మంచి డిమాండ్ ఉంది. పెన్నా, స్వర్ణముఖి ఇసుక టన్ను రూ.450 నుంచి రూ.500కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో ట్రాక్టర్‌కు 6 నుంచి 8 టన్నుల వరకు లోడ్ చేసుకుని వెళుతున్నారు. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి లాంటి నగరాల్లో ఒక్క లారీ ఇసుక రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. వరదయ్యపాళెం మండలాల సరి«హద్దులోని సంతవేలూరు రోడ్డు సమీపంలో మంగళంపాడు చెరువుకు దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతం, బత్తులవల్లం, శ్రీసిటీ తదితర ప్రాంతాల్లో డంపింగ్ కేంద్రాల నుంచి లారీలకు ఇసుక సరఫరా చేస్తున్నారు. -
ఆ జర్నలిస్ట్ హత్యకు ఎవరు బాధ్యులు?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం జర్నలిస్ట్ సందీప్ శర్మ (35) హత్య లేదా యాక్సిడెంట్ మృతిపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తన ప్రాణాలతోపాటు తన స్టింగ్ ఆపరేషన్‌లో తనకు సహకరించిన సహచరుడు వికాస్ పురోహిత్ ప్రాణాలకు ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించాలంటూ సందీప్ శర్మ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారులతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు లేఖలు రాసినా వారు స్పందించలేదు. తగిన రక్షణ కల్పించలేదు. ఫలితంగా భిండ్‌లో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సందీప్ శర్మను ట్రక్కు రూపంలో వచ్చిన మత్యువు కబళించుకుపోయింది. ‘సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ ఇంద్ర వీర్ సింగ్ భడౌరియా బలమైన మనిషి, ఆయనకు స్థానిక నేరస్థులతో సంబంధాలు ఉన్నాయి. ఆయన నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించవచ్చు. లేదా హత్య చేసి యాక్సిడెంట్‌గా చూపించవచ్చు. నాకు స్టింగ్ ఆపరేషన్‌లో సహకరించిన వికాస్ పురోహిత్‌కు తగిన రక్షణ కల్పించండి’ అంటూ సందీప్ శర్మ సీనియర్ పోలీసు అధికారులకు లేఖలు రాశారు. అందులో ఓ లేఖను భిండ్ పోలీస్ సూపరిండెండెంట్ కార్యాలయం నవంబర్ 3వ తేదీన అందుకుంది. దానిపై తేదీ ముద్ర కూడా ఉంది. ఆ లేఖలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు లేఖా ప్రతులు పంపుతున్నట్టు పేర్కొని ఉంది. ఆ తర్వాత నవంబర్ 16వ తేదీన ఆయనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ స్థానిక జర్నలిస్టులు ఎస్పీకి విడిగా లేఖలు రాశారు. సందీప్‌పై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వాటిని జాగ్రత్తగా పరిశీలించాలని కూడా వారు వాటిలో కోరారు. నేషనల్ ఛంబల్ సాంక్చరీ నుంచి అక్రమంగా ఇసుక రవాణాను అనుమతించేందుకు ఇంద్రవీర్ సింగ్ తన నివాసంలో ఇసుక మాఫియా నుంచి 12.500 రూపాయలు తీసుకుంటుండగా సందీప్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా రికార్డు చేశారు. ఆ వీడియో గతేడాది ‘న్యూస్ వరల్డ్’ ఛానల్లో అక్టోబర్ నెలలో ప్రసారం కావడంతో ఉన్నతాధికారులు ఆ అధికారిని అక్కడి నుంచి బదిలీ చేశారు. వీడియో ప్రసారానికి ముందే, ప్రసారాన్ని అడ్డుకునేందుకు ఓ కవర్లో కొంత డబ్బు పెట్టి పోలీసు అధికారి ఇంద్రవీర్ సింగ్, సందీప్‌కు పంపించారని, దాన్ని ఆయన తిరస్కరించారని, ఈ రోజున ఇంత ఘోరం జరిగిపోయిందని పురోహిత్ మంగళవారం భిండ్ ప్రెస్‌క్లబ్ వద్ద వ్యాఖ్యానించారు. సందీప్ హత్యను స్థానిక పోలీసులు నిర్లక్ష్యం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంగానే నమోదు చేశారు. ఈ కేసులో ట్రక్కును నడిపిన రణవీర్ యాదవ్ అనే లారీ క్లీనర్‌ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎడమ వైపు తన లారీని మలుపు తిప్పగానే ఎదురుగా ఓ మహిళా అడ్డుగా వచ్చిందని, ఆ మహిళను తప్పించబోయి ట్రక్కును మరింత ఎడమకు తిప్పగా ఎడమ నుంచే వస్తున్న సందీప్ బైక్‌కు తగిలి ఉంటుందని రణవీర్ యాదవ్ వివరించారు. సందీప్ బైక్‌ను ఢీకొట్టిన విషయాన్ని కూడా తాను గుర్తించలేనని చెప్పారు. క్లీనర్‌గా ఉన్న వ్యక్తి ట్రక్కును ఎందుకు నడపాల్సి వచ్చిందంటే నడపడంలో తనకు అనుభవం ఉంది కనుక నడిపానని తెలిపారు. టీవీలు ప్రసారం చేసిన యాక్సిడెంట్ ఫుటేజ్ కూడా అనుమానాస్పదంగానే ఉంది. సందీప్ ఎలా మరణించారన్న విషయాన్ని పక్కన పెడితే ఆయన, తోటి జర్నలిస్టులు ఉన్నతాధికారులకు అన్ని లేఖలు రాసినా వారు ఎందుకు స్పందించలేదన్నది సమాధానం లేని ప్రశ్న. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు కచ్చితంగా సమాధానం కావాలంటూ సందీప్ నివాళి ర్యాలీలో తోటి జర్నలిస్టులు డిమాండ్ చేశారు.