
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఇసుక మాఫియాకు మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తున్నారని దళిత, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు గజ్జెల కాంతం ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో నేతలు ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సిరిసిల్ల, నేరెళ్లలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇసుక దందాలు నడుస్తున్నాయని, అడ్డుకొనేందుకు ప్రయత్నించిన దళితులను చిత్రహింసలకు గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment