gajjala kantham
-
దళిత బంధు ఘనత సీఎందే: గజ్జెల కాంతం
ఖైరతాబాద్(హైదరాబాద్): సీఎం కేసీఆర్ దళితబంధు తీసుకువచ్చినందుకు దళిత, గిరిజన సంఘాలు రుణపడి ఉంటాయని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. ఆదివారం లక్డీకాపూల్‌లో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, దళిత కులాల సంఘాల అత్యవసర రాష్ట్ర స్థాయి సమావేశంలో గజ్జెల కాంతం మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని, ప్రతిపక్షాలు దళితబంధు పథకాన్ని చూసి ఓర్వలేక ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ దళితులకు ఏం చేసిందో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు చెప్పాలని పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రతిజ్ఞలు చేయించడంతో పాటు బీజేపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. దళితబంధులాగే గిరిజన, బీసీబంధు అమలు చేసేలా ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. -
ఉత్తమ్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంచలన ఆరోపణలు
సాక్షి, కరీంనగర్ : కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాత్రం తెలంగాణలో పార్టీని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా నైతిక బాధ్యత తీసుకుంటానని చెప్పిన ఆయన పార్టీ అధ్యక్ష పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకుందనీ, కానీ ఇప్పుడు 19 సీట్లకే పరిమితమైందని అన్నారు. బీసీలు పీసీసీ ప్రెసిడెంట్‌గా పనికిరారని చెప్పి నాడు పొన్నాలను రాజీనామా చేయించారు. మరిప్పుడు అదే సూత్రం ఉత్తమ్‌కు కూడా వర్తిస్తుంది కదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ 2 సీట్లే గెలుచుకుందని గుర్తు చేశారు. (‘అందుకే కాంగ్రెస్‌లో 20 మంది డమ్మీ అభ్యర్థులు’) ‘రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజలు నమ్మారు. కానీ, నిన్ను నమ్మడం లేదు. అందుకే ఈ ఘోర పరాజయం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు నీ నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో నీకు బుద్ధి చెప్పారు. నువ్ హౌజింగ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలను బయటపెట్టకుండా ఉండడానికి టీఆర్ఎస్ పార్టీతో లాలూచీ పడ్డావ్. కేసీఆర్ చెప్పినట్టు విన్నావ్. కుంభకోణాలు బయటపెట్టొద్దని సరెండర్ అయ్యావ్. గతంలో చెప్పినట్టుగా అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందుగా కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. మైహోమ్ రామేశ్వరరావుతో ఉత్తమ్ ఒప్పందం చేసుకోవడం వల్లనే కాంగ్రెస్ సీట్లను ఆలస్యంగా ప్రకటించింది’ అని ఉత్తమ్‌కుమార్‌పై కాంతం ఆరోపణలు గుప్పించారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు ‘కోదండరామ్ కేసీఆర్ సూచించిన మనిషి. ఉద్యకారుడు, మేధావి. ఆయన మేధావితనం వాడుకోవాలి. కానీ, కోదండరామ్ టీజేఎస్ పార్టీని ఎందుకు కూటమిలో కలిపావ్’ అని కాంతం ఉత్తమ్‌కుమార్‌పై విమర్శలు గుప్పించారు. కూటమి ఏర్పాటు విషయంలో ఉత్తమ్ జాతీయ నాయకులను తప్పుదోవ పట్టించారని కాంతం విమర్శించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉద్యకారుడు కానందునే ప్రజలు ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారని అన్నారు. ‘పార్టీ అంత ఘోరంగా ఓడిపోతే వెంటనే రాజీనామా చేయాల్సిందిపోయి సిగ్గు లేకుండా మీటింగ్ ఎలా పెడుతావ్. ఉద్యమకారులను, దళిత నాయకులను కించపరిచావ్. టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలి’ అని కాంతం డిమాండ్ చేశారు. -
‘కాంగ్రెస్ ఓటమికి.. కోవర్టులు పనిచేస్తున్నారు’
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ముగ్గురు బడా నేతలు కోవర్టులుగా పనిచేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. మంచి వారిగా నటిస్తూ.. పార్టీలోని అంతర్గత విషయాల్ని టీఆర్ఎస్కు చేరవేస్తున్నారని మండిపడ్డారు. అందుకే, 20 మంది డమ్మీలను కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించిందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమై.. ఎక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టాలో ఈ కోవర్టులు ఒప్పందం చేసుకున్నారని ఆయన మీడియాకు బుధవారం వెల్లడించారు. తమ వ్యాపార లావాదేవీల కోసం పార్టీ భవితవ్యాన్ని తాకట్టు పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే, కరీంనగర్లోనూ మరో ఇద్దరు కాంగ్రెస్ కోవర్టులున్నారని కాంతం అన్నారు. కేటీఆర్ చెప్పిన వారికే టికెట్లు వచ్చేలా చేశారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన వారికి టికెట్లు రాకుండా.. ఈ కోవర్టులంతా కలిసి హైకమాండ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లో మాత్రం ఉద్యమ నాయకులకు టికెట్లు కేటాయించారని అన్నారు. ‘రేపు (గురువారం) విద్యార్థి నాయకులం, ఉద్యమకారులం భేటీ అవుతాం. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌లో జరిగిన అవకతవకలను బయటపెడతాం’ అని ఆయన హెచ్చరించారు. వాస్తవాలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడేది లేదని స్పష్టం చేశారు. -
‘సోనియా వల్లే మీ కుటుంబానికి పదవులు’
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. ఉద్యోగాలు కల్పించకుండా, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల రీడిజైన్ అనేది కేవలం మామా అల్లుళ్ల డ్రామా అని.. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల ద్వారానే ప్రస్తుతం తెలంగాణలో నీళ్లు పారుతున్నాయన్నారు. సోనియా గాంధీ దయ వల్లే నీ తండ్రి, చెల్లి, బావమరిది, తమ్ముడు పదవులు అనుభవిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని, ఆమె గురించి మాట్లాడేపుడు జాగ్రత్తగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావును కాంతం హెచ్చరించారు. అప్పటి డిప్యూటీ సీఎం దామెదర రాజనర్సింహ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను సోనియా గాంధీకి వివరించి తెలంగాణ తెచ్చారని కాంతం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యమకారులను తగిన విధంగా గౌరవించుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
‘ఇసుక మాఫియాకు కేటీఆర్ అండ’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఇసుక మాఫియాకు మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తున్నారని దళిత, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు గజ్జెల కాంతం ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో నేతలు ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సిరిసిల్ల, నేరెళ్లలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇసుక దందాలు నడుస్తున్నాయని, అడ్డుకొనేందుకు ప్రయత్నించిన దళితులను చిత్రహింసలకు గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. -
'యువతను మభ్యపెట్టడానికే పవన్ యాత్ర'
సాక్షి, కరీంనగర్: ప్రజలను మోసం చేయడానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం విమర్శించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు దమ్ముంటే పవన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో జైలుకు వెళితే పట్టించుకోని పవన్ కల్యాణ్.. ఇపుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ యువతను మభ్యపెట్టడానికి పవన్ యాత్ర చేస్తున్నాడన్నారు. ఈ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదని తెలిపారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ గజ్జెల కాంతం
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ గజ్జెల కాంతం
సాక్షి, కరీంనరగ్ : కరీంనగర్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పట్టుబడ్డారు. శనివారం ఉదయం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనంలో అక్కడకు వచ్చిన గజ్జెల కాంతంను పోలీసులు బ్రీత్ అనలైజర్‌లో తనిఖీ చేసేందుకు యత్నించారు. అయితే అందుకు సహకరించని ఆయన ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గజ్జెల కాంతంకు మద్దతుగా కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ అక్కడకు చేరుకుని.. పోలీసులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు గజ్జెల కాంతంను అదుపులోకి తీసుకుని కాసేపటికి వదిలి పెట్టారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన గజ్జెల కాంతం