
సైకతశిల్పం వద్ద బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తున్న కేటీఆర్ సేన
ముస్తాబాద్(సిరిసిల్ల) : రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలను కేటీఆర్ యువసేన సోమవారం వినూత్నంగా నిర్వహించింది. ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లోని మానేరు వాగులో కేటీఆర్ సైకత శిల్పాన్ని రూపొందించి అభిమానాన్ని చాటుకున్నారు.
కేటీఆర్ యువసేన అధ్యక్షుడు మెంగని మనోహర్ ఆధ్వర్యంలో యువకులు మూడు గంటలు శ్రమించి ఇసుకలో శిల్పాన్ని తయారు చేశారు. అనంతరం అక్కడే కేక్ కట్‌చేసి మిఠాయిలు పంచారు.విశ్వనాథ్, అక్షయ్, చందు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment