sirisilla
-
నాపై కోపంతో కార్మికుల పొట్టకొట్టొద్దు
-
పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. సకాలంలో వరకట్నం డబ్బులు సమకూరలేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనమిది. తంగళ్లపల్లికి చెందిన అత్తారి లక్ష్మి–గిరి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు శైలజ(19) సంతానం. ఏడేళ్ల క్రితమే భర్త గిరి అనారోగ్యంతో మృతి చెందాడు. ఇటీవల కూతురు శైలజకు కొడిమ్యాల మండలం దమ్మాయిపేటకు చెందిన యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. రూ.4 లక్షలు వరకట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడంతో తల్లి పడుతున్న కష్టాలను చూడలేక శైలజ మనోవేదనకు గురైంది. ఈక్రమంలోనే బుధవారం ఉదయం ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. నేను నల్గొండలో రాజీనామా చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలి. నేను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తా. ఇక కారు షెడ్డు మూసుకోవాల్సిందే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానంటూ కేసీఆర్ ప్రకటన చేస్తారా?. నేను సిరిసిల్ల లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. కేటీఆర్‌కు టెక్నికల్ పరిజ్ఞానం లేదు. ఆయనొక పిల్లగాడు. స్థాయి కేటీఆర్‌ది కాదు. కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదు. లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. నాకు క్యారెక్టర్ ఉంది. నా దగ్గర డబ్బులు లేవ’’ అంటూ కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. లోక్ సభ పోటీలో మాకు ప్రత్యర్థి బీజేపీనేని, బీఆర్ఎస్ కాదని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించాం. నల్గొండ, భువనగిరి నుంచి ఎక్కడైనా పోటీ చేయాలని కోరుతున్నాం. నాలుగు లక్షలకు పైగా మెజారిటి వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అరవింద్‌ను ప్రజలు మర్చిపోయారు. 2 వేల కోట్లు నాకు ఉన్నాయని అంటే భయం కలిగింది. రాజకీయాల వల్ల ఆస్తులు పోగుట్టుకున్నాం. నాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్తులు కూడా తగ్గాయి. నా పేరు మీద ఎక్కడైనా ఆస్తులు ఉంటే అరవింద్‌కు ఇస్తా. బీఆర్ఎస్ ఎలాగూ లేదు... బీజేపీకి రెండు, మూడు వస్తాయేమో మాకైతే తెలియదు’’ అని ఉత్తమ్, కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
సిరిసిల్లకు ఇప్పట్లో రైలు కూత లేనట్టే
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లకు ఇప్పట్లో రైలుకూత వినిపించే పరిస్థితి లేదు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరిగింది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్ వరకు రైలు సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మార్చి నాటికి సిరిసిల్ల స్టేషన్ వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీలునుబట్టి రైలు సర్వీసులను సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పొడిగించాలని అనుకుంది. డిమాండ్ సర్వేలో, ప్రయాణికుల సంఖ్య ఉంటుందని తేలితే సిరిసిల్ల నుంచి రైలు సర్విసులు నడిపే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు సిద్దిపేట–సిరిసిల్ల మధ్య కీలక ప్రాంతంలో పనులే జరగటం లేదు. ఫలితంగా రైలు సర్విసు కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ సంగతి..: భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యే కొద్దీ రైల్వే అధికా రులు పనులు చేస్తూ వెళ్లారు. ఇలా సిద్దిపేట వరకు వేగంగా పూర్తి చేసి అనుకున్న సమయంలో రైలు సర్విసులు ప్రారంభించా రు. ఆ తర్వాత సిద్దిపేట –సిరిసిల్ల సెక్షన్ల మధ్య పనులు ప్రారంభించారు. కానీ, మధ్యలో 80 ఎకరాలకు సంబంధించిన భూసేకరణలో ఇబ్బందులొచ్చాయి. ఆ ప్రాంతంలో భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో రైతు ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడివరకు వదిలి ఆపై భాగంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగించారు. తర్వా త సిద్దిపేట సమీపంలోని భూముల వివాదం పరిష్కారమైంది. భూయజమానులకు పరిహారం కింద రూ.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే సమ యంలో ఎన్ని కల కోడ్ రావడంతో ఆ చెల్లింపులు నిలిచిపోయా యి. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభు త్వం ఏర్పడ గానే ఆ డబ్బులు చెల్లింపు కోసం రైల్వే అధికారు లు ఒత్తిడి ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వర కు చెల్లింపు జాడే లేదు. దీంతో పెద్ద కోడూరు, మాచాపూర్, గంగాపూర్, విఠలాపూర్ గ్రామాల పరిధిలో రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. రైతులకు పరిహారం చెల్లిస్తే తప్ప ఆ భూములను రైల్వే స్వాదీనం చేసుకునే వీలు లేదు. సిరిసిల్ల సమీపంలో మాత్రం పనులు కొనసాగుతున్నా యి. అక్కడ పూర్తయినా, సిద్దిపేట సమీపంలో పెండింగ్‌లో ఉంటే రైల్వేలైన్ వేసే వీలుండదు. రాష్ట్రప్రభుత్వం పరిహారం చెల్లిస్తేనే పనులు మొదలవుతాయి. దీంతో పనులు కనీసం 4నెలలు వెనక బడ్డట్టు అయ్యిందని ఓ రైల్వే అధికారి వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే అన్నిరకాల పనుల్లో జాప్యం జరుగుతోందని సమాచారం. పరిహారం చెల్లింపే కాకుండా ప్రాజెక్టు వ్యయంలోనూ మూడో వంతు ఖర్చు రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇప్పుడు ఆ మొత్తానికి సంబంధించి కూడా కొంత పేరుకుపోయిందని తెలుస్తోంది. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య 30 కిలోమీటర్ల మేర పనులకు రూ.480 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఆ మార్గంలో కొంత గుట్టభూమి కూడా ఉండటంతో దాన్ని కట్ చేసి పనులు చేయాల్సి ఉంది. ఇది స్వతహాగానే ఆలస్యమయ్యే పని. భూపరిహారం పంపిణీలో జాప్యం, ఇతర పనులూ నెమ్మదించటం వెరసి.. ఈ 30 కిలోమీటర్ల పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం తప్పేలా కనిపించటం లేదు. -
కండువా కథ చాలానే!
‘కండువా మార్చాడు’.. పార్టీ మారితే సాధారణంగా వినిపించే మాటిది. ఒక లీడర్ పార్టీ మారితే అతని వెంట పదులు, వందల సంఖ్యలో వెళ్తారు. వాళ్లంతా కండువాలు మార్చుకోవాల్సిందే. పైకి కనిపించకపోయినా ఈ ఖర్చు ఎక్కువే అంటున్నారు నేతలు. ఆ పార్టీ..ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికలప్పుడు వీటి అవసరం భారీగానే ఉంటోంది. నియోజకవర్గానికి ఈ ఖర్చు రూ.లక్షల్లోనే ఉంటుంది. సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వరకూ.. కండువాల తయారీకి ప్రసిద్ధి సిరిసిల్ల. ఈ ప్రాంతంలో 25 కుటుంబాలు ఇదే పనిలో ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు మించి హైదరాబాద్‌లో ఎక్కువగా తయారీ అవుతున్నాయని సిరిసిల్ల నేత కార్మికులు చెబుతున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడంతో నేత కార్మికులు హైదరాబాద్‌లో ప్రింటింగ్ చేయాల్సి వస్తోంది. నేతలు కూడా అనేక రకాలను కోరుకుంటున్నారు. కండువాపై పార్టీ నేతలు, లేదా తన కేడర్‌తో పార్టీ మారాలనుకునే వారి ఫొటోలతో కండువాలు ముద్రించాలని కోరుతున్నారు. ఇందుకు కొంత నాణ్యత అవసరమని, దీనికోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని సిరిసిల్లకు చెందిన భూపాల్ తెలిపారు. ఒక్కో కండువా తయారీకి రూ.3 ఖర్చు అవుతోందని, తాము రూ. 3.50కు అమ్ముతున్నామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలోనూ దాదాపు లక్ష కండువాలు అవసరమయ్యే వీలుందని అంచనా వేస్తున్నారు. ఈమేరకు ముందుగా ఏ పార్టీ గుర్తు లేకుండా తయారు చేస్తున్నట్టు నేత కార్మికుడు నీరజ్ తెలిపారు. కండువాకూ కోడ్ కష్టాలు.. కండువాకూ ఎన్నికల కోడ్ ఇబ్బందులు తప్పడం లేదని తయారీదారులు చెబుతున్నారు. ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తరలించే క్రమంలో కండువాలకు బిల్లులు అడుగుతున్నారని చెప్పారు. బిల్లులు లేకుండా తీసుకెళ్లడం కష్టమని రాజకీయ నేతలంటుంటే... ఈ మొత్తం అక్కౌంట్స్‌లో జమ చేస్తే ఎన్నికల సమయంలో ఇతరత్రా కష్టాలు వస్తాయని నేత కార్మికులు అంటున్నారు. ఇక కండువాలకు అవసరమైన సిల్క్, పాలిస్టర్ వ్రస్తాన్ని తీసుకురావడానికి కూడా ఇబ్బందులు వస్తున్నాయని తయారీదారులు తెలిపారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లకుండా, అనేక మార్గాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని హైదరాబాద్‌కు చెందిన కండువాల తయారీదారు సంజయ్‌గుప్తా తెలిపారు. ఆర్డర్లే కాదు... ఇబ్బందులూ ఉన్నాయి తెలంగాణ నుంచే కాదు... ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. దీనికోసం కార్మికులను ఎక్కువ సంఖ్యలో నియమించుకోవాల్సి వస్తోంది. ఇదే తరుణంలో ఎన్నికల సమయం కావడంతో కార్మికులు ఎక్కువ అడుగుతున్నారు. కొన్నిసార్లు వారు దొరికే పరిస్థితీ లేదు. నేతలు బిల్లులు కోరడం కూడా వ్యాపారానికి ఇబ్బందిగానే ఉంది. నగదు బదిలీ కష్టమవుతోంది. అయితే కండువాల వల్ల చాలామందికి ఉపాధి మాత్రం లభిస్తోంది. – ద్యావనపల్లి మురళి (కండువాల వ్యాపారి, సిరిసిల్ల) -
కోహ్లి సెంచరీ కొట్టిండు.. నేను కూడా కొట్టాలె: కేటీఆర్
సిరిసిల్ల: కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చినందుకు.. దేశంలో వడ్లు పండించడంలో తెలంగాణ నంబర్ వన్‌గా తయారైందని మంత్రి కేటీఆర్ అన్నారు. మళ్ళీ కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే బస్మాసుర హస్తమేనని విమర్శించారు. 55 ఎండ్లు పరిపాలించిన కాంగ్రెస్‌కు మళ్ళీ అవకాశం ఇద్దమా..? అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ రోజు విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు.. నేను కూడా సెంచరీ కొట్టడానికి తిరగాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మళ్ళీ అవకాశం ఇస్తే భారత దేశంలోనే సిరిసిల్లను నంబర్ వన్ గా చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని ప్రకటించారు. సిరిసిల్లలో ఏం మార్పు వచ్చిందో చూడాలని ప్రజలను కోరారు. బ్రిడ్జి కింద 24 గంటల నీళ్లు సముద్రంలాగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవ్వాళ మనకు పోటీగా ఒక దిక్కు కాంగ్రెస్ మరో దిక్కు బీజేపీ ఉన్నాయని పేర్కొన్న కేసీఆర్.. సిద్దిపేటకు రైల్ వచ్చింది.. త్వరలో సిరిసిల్లకు రైలు కుతా వినిపిస్తదని చెప్పారు. ఇదీ చదవండి: కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం: రేవంత్ రెడ్డి -
కేసీఆర్ గొంతు నొక్కే కుట్ర
సిరిసిల్ల/ కొడంగల్: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ గొంతు నొక్కేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక నేతలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వాత కొడంగల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు చోట్లా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కులమతాలకు అతీతంగా, అవినీతి రహితంగా అందించాం. ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ గత 55 ఏళ్లలో ఏం చేసింది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి? నిరంతర కరెంట్, సాగునీరు, తాగునీరు, రైతుబీమా, రైతుబంధు, నేతన్నబంధు వంటి పథకాలపై ఆలోచన కూడా చేయని ఆ పార్టీలకు ఎందుకు ఓటెయ్యాలి? అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉంది. ప్రలోభాలకు లొంగిపోతే మోసపోతాం, గోసపడతాం. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజలు లొంగిపోవద్దు. ఢిల్లీకి దాసులైన నేతల మాటలు నమ్మొద్దు. కేసీఆర్ సీఎం కావడం ఖాయం సీఎం కేసీఆర్ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆయన ముచ్చటగా మూడో సారి సీఎం కావడం ఖాయం. బీఆర్ఎస్ ఏనాడూ కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు పెట్టలేదు. మోసం చేసే దొంగలు ఢిల్లీ నుంచి వస్తున్నారు. మూకుమ్మడి దాడులు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్‌ను గెలిపిస్తే అమ్మేసుకుంటారు టీపీసీసీ చీఫ్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి భూముల వ్యాపారం చేసే బ్రోకర్ అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే.. కొడంగల్‌ను ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటారని ఆరోపించారు. అదే బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా ఆయనకు ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పారు. ‘‘ఓటుకు నోటు దొంగ జైలుకు పోవడం ఖాయం. కొడంగల్‌ను ఏనాడూ పట్టించుకోని రేవంత్‌రెడ్డి కావాలా?.. ఎల్లప్పుడూ జనం మధ్య ఉండే నరేందర్‌రెడ్డి కావాలా మీరే నిర్ణయించుకోండి. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని.. కారు గుర్తుకు ఓటేయండి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ దంపతుల ఆస్తి రూ.51.26 కోట్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం నామినేషన్ వేసిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. దాని ప్రకారం.. కేటీఆర్ మొత్తం ఆస్తులు రూ.17.34 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.6.92 కోట్లు, స్థిరాస్తులు రూ.10.41 కోట్లు. అప్పులు రూ.67.20 లక్షల మేర ఉన్నాయి. కేటీఆర్ భార్య శైలిమ పేరిట రూ.26.49 కోట్ల చరాస్తులు, రూ.7.42 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తంగా రూ.33.92 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.11.27 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. కేటీఆర్ దంపతులు ఇద్దరికీ కలిపి ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.51.26 కోట్లు. -
నేడు సిరిసిల్ల, సిద్దిపేటల్లో కేసీఆర్ సభలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుంది. ఇది సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభ కోసం మొదటి బైపాస్‌రోడ్డులో స్థలాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సిరిసిల్లకు చేరుకుని సభలో పాల్గొంటారు. తర్వాత సిద్దిపేటలో జరిగే సభకు వెళతారు. -
దుబాయి నుంచి వచ్చి.. భార్య ప్రియుడిపై.. పక్కా ప్లాన్‌తో రాత్రికి రాత్రే..
కరీంనగర్: భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని తెలుసుకున్న భర్త దుబాయి నుంచి వచ్చి యువకుడిని హత్య చేశాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో సంచలనం సృష్టించింది. గ్రామస్తులు, చందుర్తి సీఐ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాలు. మల్యాలకు చెందిన పడిగెల నరేశ్(27) అదే గ్రామానికి చెందిన వివాహిత(32)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వివాహిత బావ కుమారుడు లక్ష్మణ్ దుబాయ్‌లో ఉంటున్న ఆమె భర్త మల్లేశంకు తెలిపాడు. ఈనెల 3వ తేదీన గల్ఫ్ నుంచి వచ్చిన మల్లేశం ఇంటికిరాకుండా ఎక్కడో తలదాచుకున్నాడు. నరేశ్‌ను చంపేందుకు అదును కోసం ఎదురుచూస్తున్నాడు. బుధవారం రాత్రి నరేశ్ సదరు వివాహిత ఇంట్లోకి వెళ్లడం గమనించిన బావ కొడుకు లక్ష్మణ్ ఆమె భర్త మల్లేశంకు సమాచారం అందించాడు. మల్లేశం మాస్కులు ధరించి బైక్‌పై ఇంటికి చేరుకుని.. భార్యతో ఇంట్లో ఉన్న యువకుడిపై కత్తితో దాడి చేశాడు. మంచం పై నుంచి కింద పడ్డ నరేశ్‌పై పదే..పదే కత్తితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే హత్యకు పాల్పడ్డ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య విషయం తెలుసుకున్న చందుర్తి సీఐ కిరణ్‌కుమార, పలువురు ఎస్సైలు బుధవారం అర్ధరాత్రి ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. మల్లేశం కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. హత్య జరిగేందుకు మరో నలుగురు సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ కిరణ్‌కుమార్ వివరించారు. సాయంత్రం విందు.. అర్ధరాత్రి హత్య.. పడిగెల నరేశ్‌కు అదే గ్రామానికి చెందిన వివాహితతో ఐదేళ్ల క్రితమే వివాహేతర సంబంధం ఏర్పడింది. అదే సమయంలో వివాహిత కుటుంబ సభ్యులకు, యువకుడి మధ్య గొడవలు జరుగడంతో నరేశ్ దుబాయి వెళ్లాడు. అక్కడే ఐదేళ్లపాటు ఉన్నాడు. గత ఆగస్టు 29న ఇంటికొచ్చిన నరేశ్ తిరిగి సదరు వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇది గమనించిన వివాహిత భర్త అన్నలతోపాటు వారి కుమారుడు ఈ విషయాన్ని గల్ఫ్‌లో ఉంటున్న మల్లేశంకు తెలిపారు. ఈనెల 3న దుబాయి నుంచి ఇండియా వచ్చిన మల్లేశం బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం వివాహిత కుటుంబ సభ్యులు బుధవారం యువకుడి ఇంట్లోనే విందు చేసుకున్నారు. తర్వాత యథావిధిగా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. బంధువుల ఇంట్లో తలదాచుకున్న మల్లేశంను అదే సమయంలో స్వగ్రామానికి పిలిపించుకున్నారు. ఇది తెలియని యువకుడు రాత్రి అందరూ పడుకున్న సమయంలో వివాహిత వద్దకు వెళ్లాడు. గమనించిన లక్ష్మణ్ తన చిన్నాన్న మల్లేశంకు ఫోన్ చేయడంతో బైక్‌పై వచ్చి యువకుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. అనుమానితులను విచారిస్తున్న పోలీసులు.. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మల్లేశం పరారీకాగా.. అనుమానం ఉన్న ముగ్గురితోపాటు వివాహితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు సహకరించిన వారి వివరాలను కాల్‌డాటా ఆధారంగా సేకరిస్తున్నట్లు సమాచారం. వారం క్రితమే హత్యకు పథకం రచించినట్లు తెలిసింది. పోలీసుల లుక్ఔట్ నోటీసు.. యువకుని హత్యలో ప్రధాన నిందితునిగా భావిస్తున్న మల్లేశ దుబాయి నుంచి ఈనెల 3న ఇండియాకు వచ్చాడు. హత్య చేసేందుకు ముందుగానే తిరిగి దుబాయి వెళ్లేందుకు సిద్ధమై.. రాత్రి 11 గంటల ప్రాంతంలో హత్యచేసి ఎయిర్‌పోర్టుకు అదే రాత్రి వెళ్లిపోయాడన్న ప్రచారంతో పోలీసులు లుక్ఔట్ నోటీస్ జారీ చేసినట్లు తెలిసింది. -
సిరిసిల్ల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాస.. కుర్చీలతో పరస్పర దాడులు..
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మీటింగ్ కంటే ముందే నాయకులు బాహాబాహీకి దిగారు. ముస్తాబాద్ మండలం నుంచి ఉమేష్ రావు వర్గం కొంతమందిని జాయిన్ చేసుకునేందుకు తీసుకువచ్చింది. తాను మండలాధ్యక్షుడిగా ఉండగా తమకే తెలియకుండా ఎలా జాయిన్ చేసుకుంటారంటూ బాల్ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేకే మహేందర్ రెడ్డి వర్సెస్ చీటి ఉమేశ్ రావు, సంగీతం శ్రీనివాస్ వర్గాల పేరిట రెండు వర్గాలుగా వీడిపోయిన కాంగ్రెస్ నాయకులు.. కుర్చీలతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గందరగోళంగా మారింది. ఇదీ చదవండి: ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ షాక్..?.. అవే కొంప ముంచాయా? -
సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఆధిపత్యం ఎవరిది?
సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు, మంత్రిగా ఉన్న కెటిఆర్ నాలుగోసారి ఘన విజయం సాదించారు. ఆయన భారీగా తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి మహేందర్ రెడ్డిపై 89,009 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కెటిఆర్ ఎన్నికల తర్వాత మంత్రి పదవిని పొందలేదు. అయితే టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడుగా నియమితులవడం విశేషం. ఆ తర్వాత కొద్దికాలానికి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. తండ్రి కెసిఆర్ ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించగా, కెటిఆర్ నాలుగుసార్లు ఇంతవరకు ఎన్నికయ్యారు. వీరిద్దరూ కలిసి పన్నెండుసార్లు గెలిచారన్నమాట. కెటిఆర్‌కు 125213 ఓట్లు పొందగా, మహేందర్ రెడ్డికి కేవలం 36204 ఓట్లు మాత్రమే పొందారు. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన నర్సాగౌడ్‌కు కేవలం మూడువేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. కెటిఆర్ వెలమ సామాజికవర్గానికి చెందినవారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యదిక సార్లు ఇదే సామాజికవర్గం నేతలు గెలుపొందారు. ఏపీ, తెలంగాణలలో ఒక ముఖ్యమంత్రి కుమారుడు అదే క్యాబినెట్లో ఉండడం కెటిఆర్‌తోనే ఆరంభం అయిందని చెప్పాలి. తారక రామారావు అమెరికాలో ఉద్యోగం చేస్తూ, తండ్రి తెలంగాణ ఉద్యమం ఆరంభించాక, కొద్ది సంవత్సరాల క్రితం ఉద్యోగం మానుకుని క్రియాశీల రాజకీయాలోకి వచ్చారు. 2009లో టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్ధి మహేంద్రరెడ్డితో పోటీని ఎదుర్కొని స్వల్ప ఆధిక్యతతో గెలిచిన కెటిఆర్ ఆ తర్వాత తెలంగాణ సాధనలో భాగంగా పదవికి రాజీనామా చేసి బారీ ఆధిక్యతతో గెలుపొందారు. తిరిగి 2014 సాధారణ ఎన్నికలలో 53004 ఓట్ల మెజార్టీతో విజయ డంఖా మోగించారు. 2018లో ఈ మెజార్టీ ఇంకా పెరిగింది. కెటిఆర్‌తో పాటు ఆయన తండ్రి కెసిఆర్ 2014లో మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి శాసనసభకు, మెదక్ నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందగా, కెటిఆర్ సోదరి కవిత నిజామాబాద్ నుంచి లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించడం విశేషం. కాని ఒకప్పుడు హైదరాబాద్‌కు చెందిన సలావుద్దీన్ ఒవైసీ కుటుంబంలోని ముగ్గురికి ఇలాంటి గౌరవం దక్కింది. సలావుద్దీన్ 1999లో లోక్‌సభకు ఎన్నిక కాగా, ఆయన పెద్ద కుమారుడు అసద్, మరో కుమారుడు అక్బర్లు ఇద్దరూ శాసనసభకు ఎన్నియ్యారు, పలు విధాలుగా కెసిఆర్ రికార్డులు సృష్టించిన కెసిఆర్ ఈ రకంగా కూడా రికార్డు సొంతం చేసుకున్నారు. 2018లో మాత్రం కవిత ఓటమి చెందారు. సీనియర్ నేత, ఏబై ఏళ్ళకాలంలో ఆరుసార్లు గెలుపొంది, 1957లోను, అలాగే 2007లోను అంటే ఏభై ఏళ్ళ తరువాత రాష్ట్ర శాసనసభలో ఉన్న ఏకైక నేతగా గుర్తింపు పొందిన చెన్నమనేని రాజేశ్వరరావు సిరిసిల్ల నుంచి నాలుగుసార్లు సిపిఐ పక్షాన, ఒకసారి టిడిపి పక్షాన గెలిచారు. ఈయన చొప్పదండిలో ఒకసారి పిడిఎఫ్ పక్షాన గెలిచారు. రాజేశ్వరరావు కుమారుడు రమేష్ వేములవాడలో పోటీచేసి నాలుగో సారి గెలుపొందారు. రాజేశ్వరరావు సోదరుడు చెన్నమనేని విద్యా సాగరరావు మెట్పల్లి నుంచి మూడుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు కరీంనగర్‌నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి క్యాబినెట్లో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత మహారాష్ట్ర గవర్నర్ అయ్యారు. 1952లో ఇక్కడ గెలిచిన జోగినపల్లి ఆనందరావు 1957లో మెట్పల్లిలో గెలిచారు. 1989లోజనశక్తి నక్సల్గ్రూపు తరుఫున ఎస్.వి.కృష్ణయ్య గెలిచారు.సిరిసిల్ల 1952,57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు పిడిఎఫ్. ఎస్.టి.ఎఫ్ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి మూడుసార్లు, కమ్యూనిస్టు పార్టీ నాలుగుసార్లు, టిడిపి ఒకసారి, టిఆర్ఎస్ నాలుగుసార్లు, మరోసారి ఇండిపెండెంటు గెలిచారు. సిరిసిల్ల నుంచి పదమూడు సార్లు వెలమ సామాజికవర్గ నేతలు గెలుపొందగా, ఒకసారి రెడ్డి,రెండుసార్లు ఎస్.సి, ఒకసారి బ్రాహ్మణ వర్గం నేత ఎన్నికయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఎంబీబీఎస్ ప్రవేశాలు
సిరిసిల్ల: జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ భవనం సిద్ధమైంది. సిరిసిల్ల, వేములవాడ పాత తాలూకా ప్రాంతాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఆవిర్భవించడం.. రాష్ట్రంలోనే భౌగోళికంగా, జనాభా పరంగా చిన్న జిల్లాగా ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం అగ్రస్థానంలో నిలుస్తూ మెడికల్ కాలేజీ ఏర్పాటు అవుతుంది. పట్టణ శివారులోని పెద్దూరు బైపాస్ రోడ్డులో పది ఎకరాల స్థలంలో రూ.40 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం, విద్యార్థుల హాస్టళ్ల భవనాలు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి. ఆగస్ట్ మొదటి వారంలోగా పనులు పూర్తి కానున్నాయి. రెండో వారంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం వైద్య విద్య తరగతులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్ఎంసీ అనుమతులు జిల్లా కేంద్రంలో వైద్య విద్యను బోధించే మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) న్యూఢిల్లీ లెటర్ ఆఫ్ ఇన్టెంట్(ఎల్వోటీ) నం.ఎన్ఎంసీ/యూజీ/2023– 2024/000033/ 021 475 తేదీ: 21.0.4.2023ను జారీ చేసింది. కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. ఈ ఏడాది ఆగస్ట్ మొదటి వారంలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు జరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారికంగా మెడికల్ కాలేజీకి అనుమతి లభించింది. ఎంబీబీఎస్ తరగతులకు శ్రీకారం సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది వంద సీట్లు కేటాయించగా, ఇందులో 15 సీట్లు ఆలిండియా కోటాలో కేటాయిస్తారు. మరో 85 మన రాష్ట్ర అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 40 శాతం బాలురు, 60 శాతం సీట్లు బాలికలకు ఉంటాయి. ఆగస్ట్ మొదటి వారంలో కౌన్సెలింగ్ ఉంటుంది. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో మొత్తం 340 బెడ్స్ సిద్ధం చేశారు. పెద్దూరు వద్ద నిర్మించిన సొంత భవనంలోనే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తారు. హాస్టల్ భవనాలు నిర్మాణంలో ఉండగా, అబ్బాయిలు, అమ్మాయిల కోసం వేర్వేరు ప్రైవేటు భవనాలు సిద్ధం చేశారు. సిరిసిల్లకు వచ్చిన ప్రొఫెసర్లు సిరిసిల్ల మెడికల్ కాలేజీకి ప్రభుత్వం సిబ్బందిని కేటాయించింది. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కేటాయింపులు జరిగాయి. ఇప్పటికే 55 మంది సిబ్బందిని కేటాయించారు. మెడికల్ కాలేజీ ప్రారంభమైతే సుమారు వంద మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మొత్తంగా మెడికల్ కాలేజీలో సుమారు 700 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన బోధన సిబ్బంది, ఇతర డాక్టర్లు జిల్లా ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. సీఎంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిరిసిల్ల మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోనరావుపేట మండలం మల్కపేట వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9లో నిర్మించిన జలాశయం, జిల్లా పోలీస్ ఆఫీస్ భవనాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీ ప్రారంభంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. పట్టణంలోని జిల్లా ఆస్పత్రి పూర్తి స్థాయిలో మాతాశిశు సంరక్షణ, నవజాత శిశువుల కేంద్రంగా మారుతుంది. జనరల్ ఆస్పత్రి మొత్తంగా మెడికల్ కాలేజీకి మార్చడంతో పెద్దూరు శివారులోని మెడికల్ కాలేజీ బోధన ఆస్పత్రిగా ఉంటుంది. అన్ని రకాల వైద్యసేవలు, ఆధునిక పరికరాలతో అందుబాటులోకి వస్తుంది. ఆగస్టులో తరగతులు.. రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఆగస్ట్‌లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. భవన నిర్మాణ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. మొదటి ఏడాది వైద్యపాఠాలు బోధించేందుకు మౌలిక వసతులు సమకూరాయి. – డాక్టర్ ఎస్.చంద్రశేఖర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ న్యూస్‌రీల్ -
ఇది కేవలం ట్రైలరే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పర్యటించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం తంగళ్లపల్లి మండల పరిషత్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సెస్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రైతు కృతజ్ఞత సభలో మాట్లాడారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 8 ఏళ్లలో కేంద్రానికి రూ.3 లక్షల 68 వేల కోట్లు ఇచ్చామని, తిరిగి తెలంగాణకు ఇచ్చింది రూ.లక్షా 68 వేల కోట్లు మాత్రమేనని కేటీఆర్ అన్నారు. మిగతా 2 లక్షల కోట్లు ఏమైపోయాయని ప్రశ్నించారు. లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. సెస్‌లో గెలవని వాళ్లు, రాష్ట్రంలో గెలుస్తారా? అంటూ బీజేపీ నాయకులపై మంత్రి విమర్శలు గుప్పించారు. సెస్ ఎన్నికల్లో మీరు చూసింది ట్రైలర్ మాత్రమేనన్నారు. అసలు సినిమా త్వరలో చూపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. చదవండి: పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు -
తెలంగాణ: 20 మంది బాధితుల్లో నలుగురికి సీరియస్!
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికుల్లో ఇప్పటివరకు 20 మందికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా నిర్ధారణ అవగా అందులో నలుగురు విదేశీయులు మినహా మిగిలిన వారికి లక్షణాలు పెద్దగా లేవని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ వారిని ప్రత్యేక వార్డులకు తరలించి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. సొమాలియా, కెన్యాకు చెందిన నలుగురు కేన్సర్ బా«ధితులు మెరుగైన చికిత్సకై హైదరాబాద్ చేరుకొనే క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా బారినపడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికితోడు ధైర్యం చెప్పేందుకు పక్కన కుటుంబ సభ్యులు ఉండే వీల్లేకపోవడం, భాషా సమస్య కారణంగా వైద్యులు చెబుతున్న విషయాలు వారికి అర్థం కావట్లేదు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతోనూ ఆ విదేశీయులు బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరోవైపు ఒమిక్రాన్ అనుమానిత బాధితుల నమూనాల జీనోమ్ సీక్వెనింగ్ పరీక్షలు సోమవారం గాంధీ ఆస్పత్రిలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు 48 నమూనాలను పరీక్షించారు. వాటి నివేదికలు మరో మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ పరీక్షలను పుణే వైరాలజీ ల్యాబ్ లేదా సీసీఎంబీకి పంపేవారు. 156 మందికి కరోనా సాక్షి, హైదరాబాద్/ముస్తాబాద్ (సిరిసిల్ల): రాష్ట్రంలో సోమవారం 33,140 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 156 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 6,79,720కి చేరింది. తాజాగా 207 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,72,063కి పెరిగింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 4,015కు చేరుకుంది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బులెటిన్ విడుదల చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న రిస్క్ దేశాల నుంచి సోమవారం 658 మంది విమాన ప్రయాణికులు హైదరాబాద్ చేరుకోగా వారికి నిర్వహించిన పరీక్షల్లో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే వారికి ఒమిక్రాన్ వేరియంట్ ఉందో లేదో తెలుసుకొనేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు అధికారులు పంపారు. ఇప్పటివరకు రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న సంఖ్య మొత్తం 8,396 చేరిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, ఈ నెల 16న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామవాసి పిట్ల చంద్రానికి సోమవారం ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్వగ్రామంలో ఉన్న అతన్ని జిల్లా అధికారులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉంచారు. -
2 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్‌ప్రొఫైల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న హెల్త్ ప్రొఫైల్ వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందుకోసం అవసరమైన నిర్ధారణ పరీక్షల పరికరాలను, ఇతర వస్తువులను కొనడానికి తొలి దశలో రూ. 9.15 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. గడువు నాటికి అవసరమైన పరికరాల కొనుగోలుపై అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు పరీక్షల నిర్వహణకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా వైద్య ఆరోగ్యశాఖ రూపొందిస్తున్నది. పల్లెల్లో ప్రతీ ఇంటికీ తిరుగుతూ 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. జ్వరం, రక్తపోటు, షుగర్ తదితర పరీక్షలన్నింటినీ ఇంటి వద్ద, ఈసీజీ వంటి పరీక్షలను ప్రాథమిక కేంద్రాల వద్ద నిర్వహిస్తారు. ప్రతి లబ్ధిదారుడికి ఒక యూనిక్ ఐడీని అందజేస్తారు. ఈ ఐడీ ప్రాతిపదికన ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చుతారు. యూనిక్ ఐడీ అందుబాటులో ఉండడం వల్ల వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని ఎక్కడి నుంచైనా పొందడానికి అవకాశం ఉంటుందని వైద్య వర్గాలు తెలిపాయి. దీనివల్ల ఎవరికైనా, ఏదైనా జబ్బు చేస్తే వారి ఆరోగ్య చరిత్రను ఆన్లైన్లో డాక్టర్లు చూడడానికి వీలుపడుతుంది. -
రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు ఇవ్వాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సిరిసిల్ల: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాల్సిందేనని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు, ఇందుకోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమాలు ప్రారంభిస్తామని చెప్పారు. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర గురువారం 27వ రోజు సిరిసిల్ల జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా గంభీరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉఫ్‌మని ఊదితే కొట్టుకుపోయే ప్రభుత్వమిదని ఎద్దేవా చేశారు. బీజేపీకి భయపడి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసులకు తాము భయపడబోమని, ఇకపై కేసులు పెడితే తానే నేరుగా పోలీస్స్టేషన్లకు వస్తానని అన్నారు. అప్పుడు అక్కడికి ఏకంగా సీఎం రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాక సర్పంచులు ఆత్మహత్య లకు పాల్పడే పరిస్థితి తలెత్తిందని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఏడున్నరేళ్లలో మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు ఏం చేశారని ప్రశ్నించారు. అన్ని విషయాల్లో పైసలు కేంద్రానివి.. ప్రచారం మాత్రం కేసీఆర్ చేసుకుంటారన్నారు. మాట్లాడితే పెట్రోలు చార్జీలు పెంచామంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో రూ.40 వివిధ పన్నుల కింద తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఇదే అదనుగా ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు పెంచాలని చూస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
మానేరు వాగులో 25 గంటల నిరీక్షణ
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరు వాగు వరదలో గొర్రెలకాపరి చిక్కుకుని 25 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చుట్టూ వరద రావడంతో ఎటూ వెళ్లలేక రాత్రంతా గొర్రెలతోపాటు ఉన్నాడు. ఇతని కోసం వెళ్లిన మరో ఐదుగురు కూడా వరదలో చిక్కుకుపోయారు. ఎట్టకేలకు అధికారులు వీరిని బోటుసాయంతో ఒడ్డుకు చేర్చారు. వివరాలు... సిరిసిల్లలోని సాయినగర్‌కు చెందిన మొగిలి చంద్రమౌళి(58) గొర్రెలకాపరి. తనకున్న గొర్రెలు, మేకలను మేపేందుకు సోమవారం ఉదయం మానేరు మధ్యలో ద్వీపంలా ఉండే ప్రాం తానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వాగులో వరద ఉధృతి పెరగడంతో రెండు గొర్రెలు కొట్టుకుపోయాయి. దీంతో తెల్లవార్లు అతను వాగు మధ్యలో ఉండిపోయాడు. ఈ విషయాన్ని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. సిరిసిల్ల పట్టణం సాయినగర్కే చెందిన కె.రాజు(26), కె.అప్పారావు(22), ఎస్.విజయ్ (21), కె.రాజు(22), విజయ్(26) మంగళవారం ఉదయం చంద్రమౌళిని కాపాడేందుకు మానేరువాగు దాటి వెళ్లారు. తిరిగి వస్తుండగా వరద ఎక్కువకావడంతో వారూ వరదలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని, గొర్రెలను ఒడ్డుకు చేర్చారు. మానేరులో కొట్టుకుపోయిన బస్సు సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రం నుంచి లింగన్నపేట వెళ్లే దారిలో మానేరు వాగు వరదలో సోమవారం చిక్కుకున్న ఆర్టీసీ బస్సు మంగళవారం కొట్టుకుపోయింది. ప్రయాణికులం తా సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. కాగా, మానేరు నది వరద పరిస్థితి, గేట్లు ఎత్తే విష యం పశువుల కాపర్లు, జాలర్లకు తెలిసిపోయేలా, వారిని అప్రమత్తం చేసేలా సిరిసిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పశువుల కాపర్లు, జాలర్లతో పాటు వీపీవోలు, వీఆర్ఏ, వీఆర్వోలు ఉంటారు. -
సిరిసిల్ల: స్కూటీ డిక్కీలో నాగుపాము కలకలం
-
రైతుల ఆత్మహత్యలు తగ్గాయి
సిరిసిల్ల: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని.. ఈ విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు శివారులోని అపెరల్ పార్క్‌లో శుక్రవారం మంత్రి, గోకుల్దాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అపెరల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. జౌళి రంగం అభివృద్ధికి తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ అపెరల్ పాలసీ(టీ–టాప్) తెచ్చామని తెలిపారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో 12 వేల మందికి ఉపాధి కల్పించేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. అలాగే సిరిసిల్లలో 60 ఎకరాల్లో నెలకొల్పిన అపెరల్ పార్క్ ద్వారా పదివేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. బీడీలు చేస్తూ రె క్కలు ముక్కలు చేసుకునే మహిళలకు సులభంగా నెలకు రూ.10 వేలనుంచి రూ.12 వేలు సంపాదించుకునేందుకు గార్మెంట్ పరిశ్రమలు దోహదపడతాయని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్రాలు ప్రపంచ విపణిలో పోటీ పడతాయని, నాణ్యమైన, నవ్యమైన వస్త్రాలకు సిరిసిల్ల కేంద్ర బిందువు అవుతుందని పేర్కొన్నారు. మన పత్తి ఎంతో నాణ్యమైంది దేశంలోనే తెలంగాణ పత్తి ఎంతో నాణ్యమైందని, ఈ విషయాన్ని దక్షిణ భారత స్పిన్నింగ్ మిల్లుల సంఘమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేతన్నల సంక్షేమం కోసం నేతన్నల బీమా పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. రైతుల తరహాలో నేతకార్మికులు ఏ కారణాలతో చనిపోయినా.. వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేలా బీమా పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలోనూ నేతన్నకు చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 26 వేల మంది కార్మికులకు రూ.110 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. కాగా, సిరిసిల్లలో రూ.400 కోట్లతో చేపట్టిన వర్కర్ టు ఓనర్ పథకం కొద్ది రోజుల్లో కార్యరూపం దాలుస్తుందన్నారు. మహిళల ఉపాధికి ప్రాధాన్యం: శైలజారామయ్యర్ అపెరల్ పార్క్‌లో మహిళల ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో రూ.20 కోట్లతో రోడ్లు, షెడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఇన్నర్‌వేర్ గార్మెంట్ పరిశ్రమకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని ఈ ఫ్యాక్టరీలో వెయ్యి మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గోకుల్దాస్ కంపెనీ ఎండీ సుమీర్ హిందుజా మాట్లాడుతూ మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, టీఎస్ఐఐసీ ఎండీ ఇ.వెంకట నర్సింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సిరిసిల్లలో ఆపరెల్ పార్కు ఉండాలనేది ఈ ప్రాంత ప్రజల కల : కేటీఆర్
-
చూసి చూసి.. రిబ్బన్ తీసిపడేసిన సీఎం కేసీఆర్
-
నా ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరు: సీఎం కేసీఆర్
-
మా జిల్లా వాసులందరు పరవశించి పోతున్నారు : కేటీఆర్
-
కేటీఆర్ భరోసా: ‘గూడు చెదిరిన గువ్వల’ ‘సాక్షి’ కథనం
సిరిసిల్ల: కరోనా కాటుకు అమ్మానాన్నలను కోల్పోయి అనాథలైన అన్నాచెల్లెళ్ల భవిష్యత్‌కు తాను భరోసా ఇస్తున్నానని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం స్పష్టం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌షేక్ ఖలీమ్ (40), అతడి భార్య నికత్ తబుసమ్ (38) ఐదు రోజుల వ్యవధిలో కరోనాతో మృతి చెందారు. దీంతో ఆ దంపతుల పిల్లలు అమాన్ (15), రుమాన (13) అనాథలయ్యారు. పిల్లలు కూడా కరోనాతో బాధపడుతున్నారు. పిల్లల పరిస్థితిపై ‘గూడు చెదిరిన గువ్వలు’శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో మాట్లాడారు. ఆ పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారి చదువులు, భవిష్యత్‌కు తాను అండగా ఉంటానని మంత్రి వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి ఎల్లయ్య, చైల్డ్‌లైన్ సిబ్బంది విద్యానగర్‌లోని చిన్నారుల ఇంటికి వెళ్లి నెలరోజులకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు. పిల్లలను మెరుగైన వైద్యం కోసం సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు వారి వైద్య చికిత్సలను పర్యవేక్షించారు. చదవండి: కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు -
కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు
సాక్షి, సిరిసిల్ల: ఆటో నడుపుతూ నాన్న.. బీడీలు చుడుతూ అమ్మ.. అరకొర ఆదాయమే అయినా.. ఆనందానికి ఎన్నడూ కొదవలేని కుటుంబం వారిది. సాఫీగా సాగిపోతున్న జీవితంలో కరోనా కల్లోలం రేపింది. ఇద్దరు పిల్లలతో కూడిన ఆ పొదరింట్లో పెను విషాదం నింపింది. ఐదు రోజుల వ్యవధిలోనే దంపతులు ప్రాణాలు కోల్పోగా.. అనాథలైన ఆ ఇద్దరు చిన్నారులు కూడా మహమ్మారితో పోరాడుతుండటంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన షేక్ ఖలీమ్(40) ఆటోడ్రైవర్. అతడి భార్య నికత్ తబుసమ్(38) బీడీ కార్మికురాలు. వారికి ఇద్దరు పిల్లలు పదిహేనేళ్ల అమాన్, పదమూడేళ్ల రుమానా ఉన్నారు. గతంలో మూడేళ్లపాటు బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఖలీమ్.. కాలం కలిసి రాక అప్పులు మరిన్ని మూటగట్టుకుని ఇల్లు చేరాడు. అప్పటికే వీసాకు చేసిన మరో రూ.3 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు తీర్చేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు ఖలీమ్ సిరిసిల్లలో ఆటో నడుపుతూ కష్టపడేవాడు. తబుసమ్ కూడా బీడీలు చుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. అయితే 15 రోజుల క్రితం ఖలీమ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. తొలుత స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించుకున్నాడు. తర్వాత పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో చేరాడు. తెలిసిన వారివద్ద రూ.2 లక్షల వరకు అప్పు చేసి ఆస్పత్రిలో చెల్లించాడు. కానీ ఫలితం దక్కలేదు. ఐదు రోజుల కిందట ఖలీమ్ మృత్యువాత పడ్డాడు. శవాన్ని సిరిసిల్లకు తెచ్చి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. తల్లినీ కనికరించని కరోనా భర్త మరణంతో తబుసమ్ గుండెలవిసేలా రోదించింది. పిల్లలు బెంబేలు పడిపోవడం చూసి చివరకు ధైర్యం తెచ్చుకుంది. కానీ భర్త ఖలీమ్ ద్వారా అప్పటికే సోకిన కరోనా వైరస్‌తో తబుసమ్ ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో ఆమెను కూడా కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సమీప బంధువులు మళ్లీ రూ.2 లక్షల వరకు అప్పు తెచ్చి ఆస్పత్రి ఖర్చులకు చెల్లించారు. కోలుకుంటుందని, పిల్లల బాగోగులు చూసుకుంటుందని భావిస్తుండగా.. కరోనాతో చేసిన పోరాటంలో ఆమె కూడా ఓడిపోయింది. శనివారం రాత్రి తబుసమ్ కన్నుమూసింది. చందాలతో అంత్యక్రియలు ఐదురోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు చనిపోవడంతో చేతిలో డబ్బులేని ఖలీమ్ బంధువులు.. పలువురి నుంచి చందాలు పోగు చేశారు. అలా పోగుచేసిన రూ.27 వేలతో వారి సంప్రదాయం ప్రకారం ఆదివారం ఉదయం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. పాపం పసివాళ్లు ఊహ తెలిసిన పిల్లలు కావడంతో వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. ఐదు రోజుల వ్యవధిలో అమ్మానాన్నలు చనిపోవడం వారు తట్టుకోలేక పోతున్నారు. చిన్న ఇల్లు.. పుట్టెడు అప్పులే ఇప్పుడు వారికి మిగిలింది. వాటితో పాటు అమ్మానాన్నల ద్వారా సోకిన వైరస్. ఇద్దరు పిల్లలూ పాజిటివ్ కావడంతో అదే ఇంట్లో దిక్కులేని పక్షుల్లా ఉంటున్నారు. సరైన వైద్యం లేక.. ఆదుకునే నాథుడు లేక బేల చూపులు చూస్తున్నారు. కనీసం అమ్మమ్మ, తాత కానీ, నానమ్మ, తాత కానీ లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమనెవరైనా ఆదుకుంటారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. చదవండి: విషాదం: ప్రసవానికి వచ్చి కరోనాకు బలి