సర్దాపూర్‌లో సైకోను పట్టుకున్న పోలీసులు
సిరిసిల్లక్రైం/ బోయినపల్లి : ‘జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి లోటు లేదు. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా జిల్లాకు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశాలు నిరాధారమైనవి. ప్రజలు భయాందోళన చెందాల్సిన పనిలేదు. అనవసరమైన పోస్టింగ్ చేసినవారిపై చర్యలకు వెళ్తాం’ సిరిసిల్ల డీఎస్పీ వెంకటరమణ రెండ్రోజుల క్రితం చెప్పిన మాటలివి.
కానీ ప్రజల్లో ధైర్యం నూరిపోసే విధానంలో పోలీసులు వెల్లడించిన ప్రకటన రెండ్రోజులైనా కాకముందే జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజవర్గాల్లోని పలు గ్రామాల్లో వాస్తవంగానే పలువరు వీరంగం సృష్టించారు. సిరిసిల్ల అర్బన్ మండలం సర్ధాపూర్‌లో ఓ సైకో ఓ బాలిక చెయ్యి కొరికి సమీపంలోని బోర్‌గుట్టకు పరిగెత్తాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడ్ని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే బోయినిపల్లితో పాటు కొదురుపాకలో మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానితంగా తిరుగుతున్నారని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది.
సామాజిక మాద్యమాల్లో ప్రచారం
చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగ్ జిల్లాలో తిరుగుతోందని పిల్లలెవరు ఒంటరిగా ఆడుకోవడానికి పంపవద్దని సామాజిక మాద్యమాల్లో ఆదివారం ప్రచారం జోరందుకుంది. దీనితో చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఆందోళనలో గడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ వేసవిలో దొంగలు పడుతారన్న ప్రచారం సర్వసాధారణం. కానీ పిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న వదంతులే భయాందోళనకు గురి చేస్తుందని ఓ తల్లిదండ్రులు అభిప్రాయ పడ్డారు.
మతిస్థిమితం లేని వారని..
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో స్థానికులు గుర్తించిన వారు మతిస్థిమితం లేని వారిగానే కనిపిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. దొరిగిన వారి సంచుల్లో కొబ్బరి కాయాలు, తాయెత్తులు, కొన్ని పాడైన వస్తువులున్నాయని అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి జరుగుతున్న ఘటనలకు సమీప్యత ఉన్న కారణంగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.
అవాస్తవం: సీఐ శ్రీనివాస్
గుర్తుతెలియని వ్యక్తులు పిల్లలను ఎత్తుకెళ్తున్నారని దానిలో భాగంగానే సిరిసిల్ల అర్బన్ మండలం సర్ధాపూర్‌లో ఓ పాప చేతిని కొరికి వ్యక్తి పారిపో యినట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని సిరిసిల్ల పట్టణ సీఐ ఎం.శ్రీనివాస్ ఆది వారం వెల్లడించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పరారవుతున్న వ్యక్తిని పట్టుకుని ఠాణాకు తీసుకువచ్చి అనేక ప్రశ్నలు వేసి సమాధానం రాలేదన్నారు. అతను కేరళవాసీగా గుర్తించిన తాము అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో సంభాషణ చేయించామని తెలిపారు. దీంతో కేరళ రాష్ట్రంలోని మణిపురం నివాసిగా తేలిందన్నారు.
భయపడాల్సిన పని లేదు..
పిల్లలను ఎత్తుకెళ్లే గ్యాం గ్‌లు వచ్చాయన్న దాని లో వాస్తవం లేదు. జరు గుతున్న ప్రచార నేపథ్యంలో ఒక ప్రాంతంలో అనుమానిత వ్యక్తులు కనబడగానే సామాజిక మాద్యమాల ప్రచారం తో అధికంగా అందరూ అందోళన చెందు తున్నారు. జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు, అనుమానిత కదలికలున్నా సమాచారం అందితే సంబంధిత ఠాణాకు తెలిపితే చర్యలకు వెళ్తాం.
– వెంకటరమణ, డీఎస్పీ, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment