psycho hulchal
-
బాలిక చెయ్యి కొరికి పారిపోయిన సైకో
సిరిసిల్లక్రైం/ బోయినపల్లి : ‘జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి లోటు లేదు. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా జిల్లాకు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశాలు నిరాధారమైనవి. ప్రజలు భయాందోళన చెందాల్సిన పనిలేదు. అనవసరమైన పోస్టింగ్ చేసినవారిపై చర్యలకు వెళ్తాం’ సిరిసిల్ల డీఎస్పీ వెంకటరమణ రెండ్రోజుల క్రితం చెప్పిన మాటలివి. కానీ ప్రజల్లో ధైర్యం నూరిపోసే విధానంలో పోలీసులు వెల్లడించిన ప్రకటన రెండ్రోజులైనా కాకముందే జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజవర్గాల్లోని పలు గ్రామాల్లో వాస్తవంగానే పలువరు వీరంగం సృష్టించారు. సిరిసిల్ల అర్బన్ మండలం సర్ధాపూర్లో ఓ సైకో ఓ బాలిక చెయ్యి కొరికి సమీపంలోని బోర్గుట్టకు పరిగెత్తాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడ్ని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే బోయినిపల్లితో పాటు కొదురుపాకలో మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానితంగా తిరుగుతున్నారని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. సామాజిక మాద్యమాల్లో ప్రచారం చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగ్ జిల్లాలో తిరుగుతోందని పిల్లలెవరు ఒంటరిగా ఆడుకోవడానికి పంపవద్దని సామాజిక మాద్యమాల్లో ఆదివారం ప్రచారం జోరందుకుంది. దీనితో చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఆందోళనలో గడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ వేసవిలో దొంగలు పడుతారన్న ప్రచారం సర్వసాధారణం. కానీ పిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న వదంతులే భయాందోళనకు గురి చేస్తుందని ఓ తల్లిదండ్రులు అభిప్రాయ పడ్డారు. మతిస్థిమితం లేని వారని.. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో స్థానికులు గుర్తించిన వారు మతిస్థిమితం లేని వారిగానే కనిపిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. దొరిగిన వారి సంచుల్లో కొబ్బరి కాయాలు, తాయెత్తులు, కొన్ని పాడైన వస్తువులున్నాయని అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి జరుగుతున్న ఘటనలకు సమీప్యత ఉన్న కారణంగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. అవాస్తవం: సీఐ శ్రీనివాస్ గుర్తుతెలియని వ్యక్తులు పిల్లలను ఎత్తుకెళ్తున్నారని దానిలో భాగంగానే సిరిసిల్ల అర్బన్ మండలం సర్ధాపూర్లో ఓ పాప చేతిని కొరికి వ్యక్తి పారిపో యినట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని సిరిసిల్ల పట్టణ సీఐ ఎం.శ్రీనివాస్ ఆది వారం వెల్లడించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పరారవుతున్న వ్యక్తిని పట్టుకుని ఠాణాకు తీసుకువచ్చి అనేక ప్రశ్నలు వేసి సమాధానం రాలేదన్నారు. అతను కేరళవాసీగా గుర్తించిన తాము అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో సంభాషణ చేయించామని తెలిపారు. దీంతో కేరళ రాష్ట్రంలోని మణిపురం నివాసిగా తేలిందన్నారు. భయపడాల్సిన పని లేదు.. పిల్లలను ఎత్తుకెళ్లే గ్యాం గ్లు వచ్చాయన్న దాని లో వాస్తవం లేదు. జరు గుతున్న ప్రచార నేపథ్యంలో ఒక ప్రాంతంలో అనుమానిత వ్యక్తులు కనబడగానే సామాజిక మాద్యమాల ప్రచారం తో అధికంగా అందరూ అందోళన చెందు తున్నారు. జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు, అనుమానిత కదలికలున్నా సమాచారం అందితే సంబంధిత ఠాణాకు తెలిపితే చర్యలకు వెళ్తాం. – వెంకటరమణ, డీఎస్పీ, సిరిసిల్ల -
సైకో వీరంగం
నార్పల : మండల కేంద్రంలోని చైతన్యకాలనీలో గురువారం ఓ సైకో వీరాంగం సృష్టించాడు. స్థానిక పాత రామస్వామి వీధికి చెందిన చాకలి అంజి చైతన్యకాలనీలో ఆటోలు, బైక్‌లపై రాళ్లురువ్వుతూ హల్చల్ చేశాడు. ఆటోలకు అద్దాలు పగులగొట్టడంతో పాటు వీధి వెంబడి రాళ్లు విసురుతూ ప్రజల్ని హడలెత్తించాడు. సైకో చేష్టలకు స్థానికులు విసిగెత్తిపోతున్నారు. -
కత్తితో వీరంగం
అనంతపురం సెంట్రల్ : అనంతపురం సాయినగర్‌లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. తనను తాను కత్తితో కోసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ధైర్యం చేసి అతడిని పట్టుకుని కాళ్లు, చేతులు కట్టేసి, కత్తి లాక్కున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి, అతడిని సర్వజనాస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన టూటౌన్ పోలీసులు వివరాలు ఆరా తీశారు. ఉరవకొండ మండలం కొట్టాలపల్లికి చెందిన గొర్తి శ్రీనివాసులుగా గుర్తించారు. మానసిక పరిస్థితి బాగోలేకనే ఈ విధంగా చేశాడని పోలీసులు తెలిపారు. -
ఆకతాయి వీరంగం
- బైక్, గుడిసె, పురుగుమందులు, టెంకాయలకు నిప్పు - సీపీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి గుర్తింపు - మతిస్థిమితం లేకే ఆకతాయి చేష్టలు కణేకల్లు : మండల కేంద్రం కణేకల్లులో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ద్విచక్రవాహనం, గుడిసె, పురుగుమందులు, టెంకాయలకు నిప్పు పెట్టి వీరంగం సృష్టించాడు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. సదరు వ్యక్తి మతిస్థిమితం లేకే ఈ ఆకతాయి చేష్టలు చేసినట్లు తేల్చారు. ఎస్ఐ యువరాజు తెలిపిన మేరకు... బస్టాండ్‌లోని మెయిన్‌రోడ్డులో పాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న సర్మస్వలి సమీపంలోని అప్స్టేర్లో గల ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తన బైక్ (యమహా ఎఫ్జెడ్ఎస్)ను రోడ్డుపై పార్కింగ్ చేసి ఇంట్లో నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ బైక్‌కు ఎవరో నిప్పంటించారు. బైక్‌లో పెట్రోల్ ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఇరుగుపొరుగు చూసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. బైక్ పూర్తిగా కాలిపోయింది. ఇంకా బైక్ కంతులు కట్టాల్సి ఉందని బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఆ తర్వాత బస్టాండ్ ప్రాంతంలో లక్ష్మినరసింహస్వామి ఫర్టిలైజర్ దుకాణంలోని రూ.3లక్షలు విలువ చేసే పురుగుమందుల లోడుతో ఉన్న బొలెరో పికప్ వాహనానికి కూడా ఇదే విధంగా ఎవరో నిప్పుంటించారు. ఆ సమయంలో డ్రైవర్ వాహనంలోనే నిద్రిస్తున్నాడు. మంటల వేడికి తేరుకున్న డ్రైవర్ మూర్తి మంటలు ఆర్పాడు. అనంతరం చర్చి బయట తిప్పమ్మకు చెందిన గుడిసెకు నిప్పంటించారు. ప్రమాదం జరిగిన ఆమె చర్చిలో నిద్రపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీని తర్వాత టెంకాయల వ్యాపారి తిమ్మరాజు దుకాణం కూడా మంటల్లో కాలిపోయింది. దాదాపు 50 టెంకాయలు కాలిపోయాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పారు. నిందితుడిని పట్టించిన సీసీ ఫుటేజీ రాత్రి పూట బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతూ వరుసగా నాలుగు చోట్ల నిప్పు పెట్టి కలకలం రేపిన ఆకతాయి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాడు. ఫుటేజీలను పరిశీలించిన తర్వాత మణి అనే సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతనికి మతిస్థిమితం లేదని, అందుకే వరుసగా నిప్పు పెట్టుకుంటూ హల్ చేశాడని ఎస్ఐ యువరాజు తెలిపారు. -
బాణాలతో సైకో హల్చల్...
-
బాణాలతో సైకో హల్చల్...
తూర్పుగోదావరి: జనాల మీదకు బాణాలను ఎక్కుపెడుతూ పిచ్చిగా ప్రవర్తిస్తున్న ఓ సైకో... తూర్పుగోదావరి జిల్లాలో హల్చల్ చేస్తున్నాడు. సైకో దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో గ్రామస్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ సంఘటన చింతూరు మండలం వేగితోట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ముత్తయ్య(30) గత కొంతకాలంగా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా గ్రామంలో చలిమంట కాసుకుంటున్న దారయ్య, లాలమ్మ అనే ఇద్దరిపై ముత్తయ్య బాణాలు వేశాడు. దీంతో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. -
తిరుపతిలో సైకో వీరంగం