అనంతపురం సెంట్రల్ : అనంతపురం సాయినగర్‌లోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి వద్ద ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. తనను తాను కత్తితో కోసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ధైర్యం చేసి అతడిని పట్టుకుని కాళ్లు, చేతులు కట్టేసి, కత్తి లాక్కున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి, అతడిని సర్వజనాస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన టూటౌన్ పోలీసులు వివరాలు ఆరా తీశారు. ఉరవకొండ మండలం కొట్టాలపల్లికి చెందిన గొర్తి శ్రీనివాసులుగా గుర్తించారు. మానసిక పరిస్థితి బాగోలేకనే ఈ విధంగా చేశాడని పోలీసులు తెలిపారు.