పలమనేరు: పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన దళిత నేత శివకుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంవాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు.
పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు.
పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పలమనేరు మండలంలోని ముసలిమొడుగుకు చెందిన శివకుమార్ భార్య ఉషారాణి గత 8 నెలల నుంచి పలమనేరులోని షామీర్ బిరియాని హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు షామీర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త శివకుమార్ పలుమార్లు భార్యను ప్రశ్నించాడు. ఆమె కొన్నాళ్లు ప్రియుడితో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ తన భార్య కనిపించలేదని వేలూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇకపై తాను భర్తతోనే కాపురం చేస్తానని ఉషారాణి అందరినీ నమ్మించింది. షామీర్ కూడా తాను ఉషారాణి విషయంలో జోక్యం చేసుకోనని చెప్పాడు. స్నేహితులుగా ఉందామని శివకుమార్‌ను నమ్మించి ఈ నెల 13న పలమనేరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు పక్కనున్న వెంచర్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి చాతీపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ కేసును మూడు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహరాజు, ఎస్‌ఐ స్వర్ణతేజను డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment