mysterious
-
అసమానతల అంతు చూస్తారా?
విశ్వంలో ఇప్పటికీ ఎన్నో రహస్యాలు. శతాబ్దాల కాలంలో భిన్న దేశాల విభిన్న రంగాల దిగ్గజ శాస్త్రవేత్తలు ఇప్పటికి ఎన్నో సిద్ధాంతాలను రూపొందించారు. న్యూటన్ సిద్ధాంతాలు, ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు ఇలా భౌతిక, రసాయన శా్రస్తాలు, గతిశక్తి, స్థితిశక్తి ఇలా ఎన్నో రకాల అంశాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు నేటి ఆధునిక ప్రపంచ అవసరాలను తీరుస్తున్నాయి. అయితే ఇప్పటికీ భౌతిక, రసాయన, ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలకు కొరుకుడుపడని టర్బులెన్స్ దృగ్విషయం అన్ని రంగాలకు పెద్ద సమస్యగా మారింది. ద్రవ ప్రవాహాల్లో హఠాత్తుగా సంభవించే అసాధారణ హెచ్చుతగ్గులు, సముద్రజలాల కదలికల్లో అనూహ్య మార్పులు, రసాయనాల్లో ఊహించని ప్రతిచర్యలు, రక్తప్రవాహాల్లో హెచ్చుతగ్గులు వంటివి ఎందుకు సంభవిస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. టర్బులెన్స్ సమస్య చాలా రంగాలకు పెద్ద గుదిబండగా తయారైంది. గాల్లో ఎగిరే విమానాలు ఒక్కసారిగా టర్బులెన్స్‌కు గురై హఠాత్తుగా కిందకు పడిపోవడమో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడమో జరుగుతున్నాయి. వెదర్ శాటిలైట్లతో ఖచ్చితత్వంతో వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వాలను వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నా ఇప్పటికీ కొన్ని చోట్ల ఊహంచని తుపాన్లు అప్పటికప్పుడు ఏర్పడి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి. సువిశాల విశ్వంలో నక్షత్రాల్లోని అయనీకరణ చెందిన అత్యంత వేడి వాయువుల్లో హఠాత్తుగా ఎందుకు మార్పులు జరుగుతున్నాయో ఖగోళ శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. మానవ కణంలో అణువుల మధ్య బంధంలోనూ హఠాత్తుగా మార్పులను చూస్తున్నాం. చివరకు కృత్రిమ గుండె పనితీరును రక్తప్రవాహంలోని టర్బులెన్స్ ప్రభావితం చేస్తూ అత్యంత సమర్థవంతమైన ఆర్టిఫీషియల్ హార్ట్ ఆవిష్కరణ అవసరమని గుర్తుచేస్తోంది. ఇలాంటి దృగ్విషయాలకు ఏకైక కారణమైన టర్బులెన్స్పై మరింత అవగాహనే లక్ష్యంగా శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఈ టర్బులెన్స్పై స్పష్టమైన అవగాహన ఉంటే సైన్స్, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో మరింత మెరుగైన డిజైన్‌తో విమానాలు, కార్లు, ప్రొపెలర్లు, కృత్రిమ గుండెలు తయారుచేయడానికి, అత్యంత ఖచ్చితత్వంతో వర్షాలు, వాతావరణం, పర్యావరణ సంబంధ హెచ్చరికలు చేయడానికి వీలు చిక్కుతుంది. వేగంగా చర్యలు జరిపి.. ప్రపంచంలో ఎక్కడ ఏ ద్రవాల్లో ఈ టర్బులెన్స్ తలెత్తుతుందో తెల్సుకోవాలంటే ఆ ద్రవాల పనితీరు, కదలికలపై నిరంతర నిఘా అవసరం. వాటి చర్యను వేగవంతం చేస్తేనే టర్బులెన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందో గుర్తించగలం. అందుకోసం ద్రవాల్లో రెండు సార్లు టర్బులెన్స్ సంభవిస్తే ఈ రెండు టర్బులెన్స్ మధ్య కాలంలో జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం సంప్రదాయక పద్ధతిలో మాత్రమే డేటాను రికార్డ్చేసేవాళ్లు. ఇకపై తొలిసారిగా అత్యంత అధునాతన క్వాంటమ్ కంప్యూటర్స్ విధానంలో అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లలో ఈ డేటాను నమోదుచేసి విశ్లేషించనున్నారు. దీంతో సెకన్ కంటే కొన్ని కోట్ల రెట్లు తక్కువ కాలంలోనూ జరిగే మార్పులను నమోదు చేసి విశ్లేషించడం సాధ్యమవుతుంది. సంబంధిత పరిశోధన వివరాలు జనవరి 29వ తేదీన ప్రఖ్యాత సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్, ఫిజికల్ రివ్యూ రీసెర్చ్ జర్నల్లలో ప్రచురితమయ్యాయి. ‘‘సంప్రదాయక విధానాల్లో ప్రయోగాలు చేస్తే ఎప్పుడూ ఒక్కటే ఫలితం వస్తోంది. ఈసారి సంభావ్యత సిద్ధాంతాన్ని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్‌ను వాడి మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు ప్రయతి్నస్తున్నాం. రెండు విభిన్న రసాయన మిశ్రమాలను సిములేట్ చేసి వాటిల్లో సంభవించే టర్బులెన్స్‌లను నమోదుచేయదలిచాం. సాధారణ కంప్యూటర్స్‌లో 0, 1 అనే బిట్స్ మాత్రమే వాడతారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో క్వాంటమ్ బిట్(క్వాబిట్స్) వాడతాం. దీంతో ఒకేసారి ఒకేసమయంలో వేర్వేరు చోట్ల జరిగే మార్పులను క్వాబిట్స్ నమోదుచేస్తాయి’’అని ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రవేత్త నిక్ గోరియనోవ్ చెప్పారు. కొత్త విధానంతో కంప్యూటేషన్ అత్యంత వేగవంతంగా జరుగుతుంది. ఇది మా పరిశోధనకు ఎంతో దోహదపడుతుంది’’అని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడు జేమ్స్ బీటెల్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం
ప్రతిరోజూ అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టేవారు ఒకరోజు ఒక రహస్య గుహను గమనించారు. వారు ఈ గుహ గురించి అందరికీ చెప్పగానే, అది స్థానికంగా సంచలంగా మారింది. ఆ కట్లెలు కొట్టేవారు ఆ గుహలోని వెళ్లి చూడగా, వారికి అక్కడ కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. బీహార్‌లోని జముయి జిల్లాలోని బర్హత్ బ్లాక్ ప్రాంతంలో ఈ రహస్య గుహ వెలుగు చూసింది. పంచకుల అడవిలో ఉన్న కొండలలో ఒక రహస్య గుహ ఉందని ఆ ప్రాంతానికి చెందిన కట్టెలు కొట్టేవారు చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యపోతూ, ఆ గుహను చూసేందుకు తరలివస్తున్నారు. గుహ లోపల ఒక శివలింగం ఉందని, ధ్యాన స్థితిలో కూర్చున్న ఒక ఋషికి సంబంధించిన ఒక పురాతన విగ్రహం కూడా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఆ గుహలోకి ప్రవేశించే మార్గం చాలా ఇరుకుగా ఉంది. అయినప్పటికీ కొందరు టార్చిలైట్లు చేతబట్టి, గుహలోనికి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు.గ్రామానికి చెందిన హీరా మాంఝీ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని కొంతమంది కలప సేకరించడానికి అడవిలోకి వెళ్లినప్పుడు ఈ గుహను గమనించారని తెలిపారు. ఆ కట్టెలు కొట్టేవారిలోని ఒక వ్యక్తి సాహసం చేసి, గుహలోకి వెళ్లాడని, అక్కడ అతనికి ఒక శివలింగం, ఒక ఋషి విగ్రహం కనిపించాయని తెలిపారు. ఈ గుహ జిల్లాలోని ప్రసిద్ధ కుకుర్జాప్ ఆనకట్టకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గుహ పైన పెద్ద బండ రాళ్ళు ఉన్నాయి. ఈ గుహగురించి తెలిసిన అనంతరం స్థానికులు గుహ వెలుపల కూర్చుని భజనలు, పూజలు చేస్తున్నారు. భక్తులు దర్శించుకునేందుకు వీలుగా గుహలోనికి మార్గం ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
బంగ్లా హెర్క్యులస్ రేపిస్టుల పాలిటి యముడు
బంగ్లాదేశ్ ఆశూలియా జిల్లా 2019 జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనతో ఉలిక్కిపడింది. ఆశూలియాలోని ఒక దుస్తుల కర్మాగారంలో పనిచేసే పద్దెనిమిదేళ్ల యువతిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడి, ఆమెను దారుణంగా హత్య చేశారు. ఇరుగు పొరుగులు ఇంట్లో ఆమె మృతదేహం పడి ఉండటం గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనపై అశూలియా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పోలీసులపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. మృతురాలితో పాటు అదే దుస్తుల కర్మాగారంలో పనిచేసే రిపొన్, అతడి ఇద్దరు సహచరులను పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్లో విచారణ జరిపారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో విడిచిపెట్టారు.ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పైగా మరో మలుపు తీసుకుంది. జనవరి 17న అనుమానితుల్లో కీలక వ్యక్తి అయిన రిపొన్ దారుణంగా హత్యకు గురయ్యాడు. అశూలియాకు చేరువలోని ఒక పొలంలో అతడి మృతదేహం పడి ఉండటాన్ని గమనించి, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహం మెడకు తగిలించిన నోట్‌ను చూసి, దానిని బయటకు తీసి పరిశీలించారు. ఆ నోట్లో ఇలా ఉంది: ‘నా పేరు రిపొన్. నేను (బాధితురాలి పేరు)పై అత్యాచారం చేశాను. నేను రేపిస్టును. నా నేరానికి ఇదే తగిన శిక్ష. నాతో కలసి ఈ నేరానికి ఒడిగట్టిన నా సహచరులకు కూడా ఇదే గతి పడుతుంది. జాగ్రత్త!’– హెర్క్యులస్ అని బెంగాలీలో రాసి ఉంది. పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.పట్టుమని పదిరోజులైనా కాలేదు. మరో సంఘటన కలకలం రేపింది. జనవరి 26న అశూలియా జిల్లా బోల్తలా గ్రామంలోని వరి చేనులో ఒక మృతదేహం పడి ఉండటం చూసి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ పంచాయతీ చైర్మన్‌కు కూడా సంగతి చెప్పారు. అందరూ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి మెడలో నోట్ వేలాడదీసి ఉంది. ఇది కూడా హెర్క్యులస్ పేరుతోనే ఉంది. ఈ సంఘటనలో మృతుడి పేరు సాజల్, న్యాయశాస్త్ర విద్యార్థి. ఇతడు కూడా జనవరి 7న జరిగిన అత్యాచార సంఘటనలో పట్టుబడిన అనుమానితుల్లో ఒకడు. ఒకే హత్యాచారం కేసులో అనుమానితులైన ఇద్దరు వరుసగా హత్యకు గురికావడం, పైగా వారి మృతదేహాలపై ‘హెర్క్యులస్’ పేరుతో హెచ్చరిక నోట్ దొరకడం బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్తంగా కలకలంగా మారింది. పోలీసులకు ఈ హత్యలు సవాలుగా మారాయి. పోలీసులు చేయలేని పనిని ఒక అజ్ఞాతవ్యక్తి చేయడం పట్ల జనాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవడం తగదని కొందరు మర్యాదస్తులు అభిప్రాయపడితే, న్యాయం చేయడంలో పోలీసులు చేతగాని వాళ్లయినప్పుడు, అజ్ఞాత వ్యక్తి ఎవరో ఇలాంటి న్యాయం చేయడమే సరైన పని అని వ్యాఖ్యానించసాగారు. మరోవైపు పోలీసుల అసమర్థతను దుమ్మెత్తిపోస్తూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అజ్ఞాత ‘హెర్క్యులస్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తుండగా, ఫిబ్రవరి 1న మరో సంఘటన జరిగింది. ఈసారి అశూలియా పొరుగు జిల్లా అయిన రాజాపూర్‌లోని జలాకఠి శివార్లలోని పొలాల్లో మరో మృతదేహం పడి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు, మృతదేహం మెడలో ‘హెర్క్యులస్’ పేరుతో ఉన్న హెచ్చరిక నోట్ దొరికింది. ఈ సంఘటనలో మృతుడి పేరు రకీబ్ ముల్లా. ‘ఈ హెర్క్యులస్. ఎవడోగాని, పోలీసుల కంటే వీడే నయంగా ఉన్నాడు. రేపిస్టులందరినీ ఏరి పారేస్తున్నాడు’ అని అక్కడ మూగిన జనాలు పోలీసుల ముందే అనుకోవడం మొదలుపెట్టారు. తమ సమక్షంలోనే జనాలు అలా మాట్లాడటంతో పోలీసులకు తలకొట్టేసినట్లయింది. వరుస సంఘటనలు జరిగినా, జిల్లా పోలీసులు ఎలాంటి ఆధారాలూ సేకరించలేకపోవడంతో చివరకు బంగ్లాదేశ్ జాతీయ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా హెర్క్యులస్ కోసం గాలింపు ప్రారంభించాయి. ఊహాచిత్రాలతో ఊరూరా పోస్టర్లు వేయించాయి. అయినా, ఎలాంటి ఫలితమూ దక్కలేదు. ఇప్పటికి ఆరేళ్లు గడచిపోయినా, బంగ్లా పోలీసులకు హెర్క్యులస్ ఆచూకీ దొరకలేదు. ఇదే విషయమై, హెర్క్యులస్ కేసుపై మొట్టమొదట దర్యాప్తు జరిపిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, అశూలియా పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ జహీదుల్ ఇస్లామ్‌ను ప్రశ్నిస్తే, ‘మేం కేసును మొదటి నుంచి దర్యాప్తు చేశాం. సంఘటనలు జరిగిన ప్రతిచోటా అణువణువూ గాలించాం. మృతుల మెడల్లో హెచ్చరిక సందేశాలు తప్ప మాకు ఎక్కడా ఎలాంటి ఆధారాలూ దొరకలేదు’ అని చెప్పారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ షోహెల్ రాణా కూడా దాదాపు ఇలాగే చెప్పారు. ‘అప్పటి వరుస హత్యల వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు తేలలేదు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. అయినా, హత్యలకు కారకులు ఎవరో కనుక్కోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు. పోలీసులు ఇలాంటి పసలేని ప్రకటనలు చేస్తుంటే, బంగ్లా జనాల్లో చాలామంది హెర్క్యులస్ను హీరోగా పరిగణిస్తుండటం విశేషం. -
ప్రియుడితో కొన్నాళ్లు సహజీవనం.. భర్తను నమ్మించి..
పలమనేరు: పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన దళిత నేత శివకుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంవాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పలమనేరు మండలంలోని ముసలిమొడుగుకు చెందిన శివకుమార్ భార్య ఉషారాణి గత 8 నెలల నుంచి పలమనేరులోని షామీర్ బిరియాని హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు షామీర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త శివకుమార్ పలుమార్లు భార్యను ప్రశ్నించాడు. ఆమె కొన్నాళ్లు ప్రియుడితో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ తన భార్య కనిపించలేదని వేలూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకపై తాను భర్తతోనే కాపురం చేస్తానని ఉషారాణి అందరినీ నమ్మించింది. షామీర్ కూడా తాను ఉషారాణి విషయంలో జోక్యం చేసుకోనని చెప్పాడు. స్నేహితులుగా ఉందామని శివకుమార్‌ను నమ్మించి ఈ నెల 13న పలమనేరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు పక్కనున్న వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి చాతీపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ కేసును మూడు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజను డీఎస్పీ అభినందించారు. -
అంతుచిక్కని మరణాలపై దర్యాప్తు.. మెట్ల బావి మూసివేత
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని ఒక మారుమూల గ్రామంలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది స్వల్ప వ్యవధిలో మృత్యువాత పడటం సంచలనంగా మారింది. ఈ మరణాలకు గల కారణాలు ఇంతవరకూ వెల్లడికాలేదు. దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అధికారులు మెట్ల బావి సమీప ప్రాంతాన్ని సీల్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బావిలోని నీటిలో పురుగుమందుల ఆనవాళ్లు కనిపించాయి. ఈ నేపధ్యంలో మెట్ల బావి దగ్గర 24 గంటలూ భద్రతా సిబ్బందిని మోహరించారు.రాజౌరి జిల్లాలోని బాధల్ గ్రామంలోని మెట్ల బావికి కంచె ఏర్పాటు చేయాలని, ముగ్గురు భద్రతా సిబ్బందిని 24 గంటలూ అక్కడ మోహరించాలని అదనపు డిప్యూటీ కమిషనర్ దిల్ మీర్ ఆదేశించారు. ఆయన ఒక ఉత్తర్వులో.. ‘బాధల్ గ్రామంలోని బావి నుండి సేకరించిన నీటి నమూనాలలో పురుగుమందుల ఉనికిని నిర్ధారించారు. దీంతో ఆ మెట్ల బావిని మూసివేయాలని నిర్ణయించాం. ఈ మెట్ల బావిలోని నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వినియోగించకూడదు’ అని పేర్కొన్నారు.బాధల్ గ్రామంలో మరణాలకు గల కారణాన్ని తెలుసుకునేందుకు అంతర్-మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కాగా జమ్మూలోని ఎస్ఎంజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ అస్లాం కుమార్తె యాస్మిన్ కౌసర్ కూడా అంతుచిక్కని వ్యాధితో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 7-12 తేదీల మధ్య గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది మృతిచెందారు.ఇటీవల జేకే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖతో పాటు ఇతర విభాగాలు ఈ మరణాలపై దర్యాప్తు చేస్తున్నాయని, అయితే ఈ మరణాలకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదన్నారు. బాధితులు తొలుత జ్వరం, తలనొప్పి, వికారం, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చారని, చికిత్స పొందుతూ కొద్ది రోజులకే మృతిచెందారని మనోజ్ సిన్హా వివరించారు.ఇది కూడా చదవండి: Kumbh Mela: ప్రముఖుల రాక.. మరిన్ని మార్గదర్శకాలు జారీ -
ఆ చల్లని సముద్రగర్భంలో... ఆక్సిజన్ పుడుతోంది!!
భూమిపై జీవజాలం,(Biome)మనుగడకు (oxygen)ఆక్సిజన్ ప్రాణావసరం. అది తయారవాలంటే వెలుతురు, సూర్యకాంతి తప్పనిసరి. సూర్యకిరణాలతో కిరణజన్య సంయోగ క్రియ ఫలితంగా మొక్కల్లో ఆక్సిజన్ తయారవుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం. అలాంటిది, సముద్రగర్భంలో కొన్ని కిలోమీటర్ల లోతులో కటిక చీకటితో కూడిన ప్రదేశాల్లోనూ తొలిసారిగా ఆక్సిజన్ జాడను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించడం సంచలనంగా మారింది! అక్కడ కాంతితో పని లేకుండానే ఆక్సిజన్ తయారవుతుందని తొలిసారిగా గుర్తించారు. అది కూడా కఠిన శిలల నుంచి ఉద్భవిస్తుండటం శాస్త్రవేత్తలనే అబ్బురపరుస్తోంది. ఇదెలా సాధ్యమవుతోందో తెలుసుకునేందుకు మరింత లోతైన అధ్యయనానికి వాళ్లు నడుం బిగించారు. అనంత విశ్వంలో కాంతిమయ పదార్థం కంటే చీకటిమయమైన డార్క్మ్యాటరే ఎక్కువన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో డార్క్మ్యాటర్లో కూడా ఆక్సిజన్ ఉనికి ఉందని, జీవం మనుగడ సాగిస్తోందని ఎంతోకాలంగా సాగుతున్న వాదనలకు కొత్త బలం చేకూరింది. ఎక్కడ కనిపెట్టారు? బంగాళాదుంపల పరిమాణంలోని ముద్దల్లాంటి శిలల నుంచి స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్ తయారవడాన్ని పరిశోధనలో గుర్తించారు. పసిఫిక్ మహాసముద్రంలో క్లారియన్–క్లిప్పర్టన్ జోన్ (సీసీజెడ్)లో 13,100 అడుగుల లోతులో సముద్రగర్భంలో వీటిని గుర్తించారు. ఈ శిలలు ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ ద్వారా సముద్ర జలాన్ని ఆక్సిజన్, హైడ్రోజన్‌గా విడగొడుతున్నాయి. కిరణజన్యసంయోగ క్రియ ద్వారా మాత్రమే ఆక్సిజన్ తయారవుతుందన్న సిద్ధాంతాన్ని ఇది పటాపంచలు చేసిందని స్కాటిష్ అసోసియేషన్ ప్రొఫెసర్ ఆండ్రూ స్వీట్మ్యాన్ చెప్పారు. ఇదెలా సాధ్యమవుతోందన్నది తేల్చేందుకు మూడేళ్ల సుదీర్ఘ ప్రాజెక్టుకు తెర తీస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఏకంగా 36,089 అడుగుల లోతు దాకా తవ్వే రిగ్గులతో రంగంలోకి దిగుతున్నారు! ‘‘ఈ ‘చీకటి ఆక్సిజన్’ కోసం జరిపే అధ్యయనంలో సమాధానాలు దొరికే కొద్దీ కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీజెడ్ మాదిరే సముద్రగర్భంలో ఇతర చోట్లా ఇలా ఆక్సిజన్ తయారవుతోందేమో కనిపెడతాం’’ అని స్వీట్మ్యాన్ చెప్పారు. భూగర్భంలోనూ ఆక్సిజన్...? సముద్ర గర్భంలోని శిలల్లోనే గాక భూమి లోలోపలి పొరల్లోనూ ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్నట్టు అమెరికాలో మసాచుసెట్స్‌లోని వుడ్స్ హోల్ మెరైన్ బయోలాజికల్ లేబోరేటరీ సూక్ష్మజీవుల శాస్త్రవేత్త ఎమీల్ రఫ్ ప్రకటించడం విశేషం. కెనడా ప్రియరీ భూముల్లోని అత్యంత లోతుల్లోనూ ఆక్సిజన్ ఉందని చెప్పారాయన. కాల్గరీ వర్సిటీకి చెందిన పలువురు ప్రొఫెసర్లు కూడా దీన్ని ధ్రువీకరించారు. ఈ ఆక్సిజన్ 40 వేల ఏళ్ల క్రితమే భూమి పొరల్లోకి చేరి ఉండాలని ఒక నివేదికలో పేర్కొన్నారు. సూక్షజీవులు కూడా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించారు. ‘‘కెనడా భూగర్భ శాంపిళ్లను ల్యాబ్‌లోని ఆక్సిజన్ పాడుచేసింది. అయినా కొత్తగా ఆక్సిజన్ పుట్టుకొచి్చంది. ఎక్కడి నుంచా అని చూస్తే ఆ నీటిలోని సూక్ష్మజీవులు కొత్తగా ఆక్సిజన్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించాం. అవి తన మనుగడ కావాల్సిన శక్తిని సమకూర్చుకోవడానికి ఒక నైట్రోజన్, రెండు ఆక్సిజన్ అణువులను రసాయనిక చర్యల ద్వారా అణుస్థాయి ఆక్సిజన్‌గా మారుస్తున్నాయి. భూగర్భ జలాల్లో ఆక్సిజన్‌పై ఆధారపడి బతికే సూక్ష్మజీవులకు అది ఈ పద్ధతిలోనే అందుతోందని రుజువైంది. మనం అసాధ్యమని అనుకున్నది సుసాధ్యమేనని ప్రకృతి నిరూపిస్తోంది’’ అని రఫ్ అన్నారు.మూడు కి.మీ. లోతులో ‘చీకటి ఆక్సిజన్’ జాడ కనిపెట్టేందుకు రఫ్ బృందం దక్షిణాఫ్రికాలో బంగారం, యురేనియం గనుల్లోకి వెళ్లింది. ఏకంగా 3 కి.మీ. లోతులో 120 కోట్ల ఏళ్ల నాటి శిలల్లో ఆక్సిజన్‌ను కనుగొన్నారు. రేడియోధారి్మక గుణమున్న యురేనియం అక్కడి నీటితో చర్య జరపడం వల్ల ఆక్సిజన్ తయారై ఉంటుందన్న అంచనాకొచ్చారు. నాసా ఆసక్తి కాంతితో నిమిత్తం లేకుండానే ఆక్సిజన్ ఉత్పత్తి సాధ్యమంటున్న తాజా పరిశోధనపై నాసా ఆసక్తి చూపుతోంది. చంద్రుని ఆవలివైపు కాంతి ప్రసారమే ఉండదు. అలాంటి చోట్ల ఈ ‘శిలాజ ఆక్సిజన్’ ద్వారా వ్యోమగాముల అవసరాలు తీర్చవచ్చని నాసా ఆశ పడుతోంది. మంచుతో కూడుకున్న శని, బృహస్పతి ఉపగ్రహాలు ఎన్సిలాడస్, యూరోపాలపై ఏ మేరకు పీడనం పెంచితే ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చా అని ఇప్పటినుంచే లెక్కలు వేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాత్రూమ్లో మహిళ అనుమానాస్పద మృతి!
బెంగళూరు: తిరుపతికి చెందిన మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరులో మంగళవారం జరిగింది. నెలమంగల పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీ(25) అనే మహిళ తిరుపతి నుంచి బెంగళూరులోని ఓళపేటెలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం స్నానాల గదిలోకి వెళ్లింది. 25 నిమిషాలైనప్పటికీ బయటికి రాకపోవడంతో భర్త వెళ్లి పరిశీలించగా స్పృహకోల్పోయిన స్థితిలో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ముఖంపై గీతలు కనిపించినట్లు భర్త చెబుతున్నాడు.గ్యాస్ గీసర్తో విషపూరితమైన కార్బన్‌మోనాక్సైడ్ గ్యాస్‌తో ఊపిరాడకపోవడంతో మృతి చెందే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేయగా గీసర్ ఆపివేసి ఉందని భర్త తెలిపారు.చదవండి: క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. భర్తను హతమార్చి భార్య -
Gates of Hell: నరకద్వారం...!
మధ్య ఆసియా దేశం తుర్కెమెనిస్తాన్లోని కారకూమ్ ఎడారి మధ్యలో ఉన్న అగ్ని జ్వాలల గొయ్యి ఇది. ‘దర్వాజా’గా పిలిచే ఈ ప్రాంతం వద్ద 50 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ జమానాలో సహజవాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేపట్టారు. ఫలితం లేక వదిలేశారు. తర్వాత అక్కడ ఇలా భారీ గొయ్యి ఏర్పడింది. మీథేన్ వాయువు విడుదలతో 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతులో వలయాకారంలో ఇలా నిరంతరాయంగా మంటలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇది ప్రపంచ పర్యాటకులకు ఆకర్షిస్తోంది. ‘గేట్స్ ఆఫ్ హెల్’గా పిలిచే ఈ మండుతున్న గొయ్యికి అతి సమీపంలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు. -
వూడూ ఫెస్టివల్! ఈ వేడుకకు దెయ్యాలొచ్చి నృత్యాలు చేస్తాయట!
ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఆచారాల్లోని ఎన్నో వింతలు, విచిత్రాల గురించి విన్నాం, చూశాం. అయితే, ‘హైతియన్ వూడూ’ అనే ప్రాచీనమతానికి చెందిన ఆఫ్రికన్ భక్తులు నిర్వహించే ‘వూడూ ఫెస్టివల్’ ప్రపంచానికే మిస్టరీ. సాధారణంగా సంప్రదాయ వేడుకల్లో.. మనిషిని దేవుడు ఆవహించడం, మనుషులు పూనకాలొచ్చి ఊగడం లాంటివి చూస్తుంటాం. అలాంటి జాతరల్లో.. కొందరు భక్తులు బృందాలుగా విడిపోయి రకరకాల వేషధారణలతో.. డప్పు దరువుల మధ్య గజ్జె కట్టి తాండవమాడటం తెలిసిందే. అయితే ఈ వూడూ వేడుకకు దయ్యాలొస్తాయి. స్వయంగా నాట్యమాడతాయి. ఎంతటివారినైనా నిర్ఘాంతపరుస్తాయి. ‘ఈ బొమ్మ లోపల ఉన్నది మా పూర్వీకుల ఆత్మే’ అని చెబుతుంటారు వూడూ మతస్థులు. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఈ పండుగకు వెళ్లిన వాళ్లంతా.. అక్కడ నోరెళ్లబెట్టి రావాల్సిందే. ఏమిటా కథ? పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్, టోగో, ఘనా వంటి దేశాల్లో కొన్ని నగరాలు.. జనవరి నెలొస్తే ప్రపంచ పర్యాటకులతో కిటకిటలాడు తుంటాయి. జనవరి 7 నుంచి సుమారు 14 రోజుల పాటు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. రకరకాల వేషధారణలతో భక్తులు.. నిప్పుల గుండాల చుట్టూ తిరుగుతూ.. నృత్యాలు చేస్తూ ఆకట్టుకుంటారు. ఈ మొత్తం వేడుకలో గుర్రం పందాలతో పాటు.. ‘వూడూ ఘోస్ట్ డాన్స్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పండుగ ప్రతి ఇంట్లో తమ పూర్వీకుల ఆత్మలకు గౌరవార్థంగా ప్రార్థన చేయడంతో మొదలవుతుంది. తర్వాత చిన్నచిన్న మనిషి ప్రతిమలను పెట్టి.. అందులోకి చనిపోయినవారి ఆత్మలను ఆహ్వానిస్తారట. అనంతరం పూజ చేసి.. మేకను బలిచ్చి, మద్యంతో పాటే.. నైవేద్యంగా పెట్టి.. ఆత్మలకు శాంతి కలిగిస్తారట. గడ్డి, ఎండిన ఆకులు, నల్ల కుండలు, పుర్రెలు, కర్రల సాయంతో ఎత్తైన పెద్ద బొమ్మలను తయారు చేసి.. వాటిని రాత్రి అయ్యేసరికి ప్రదర్శన కోసం తీసుకొస్తుంటారు చాలామంది. అయితే అలా తీసుకెళ్లే ముందు.. ఆ బొమ్మలకు పూర్వీకుల ఆత్మశక్తిని ఆపాదిస్తారట. ప్రత్యేకమైన పూజలు చేసి.. ఆ వూడూ బొమ్మల్లో కనిపించని అదృశ్యశక్తిని నింపుతారట. వాటిని జాతరకు తీసుకుని వెళ్లి ప్రదర్శన ఇస్తున్నప్పుడు.. అవి చూపరులను హడలగొట్టేలా నృత్యాలు చేస్తాయి. అయితే అవేం హాని కలిగించవు. అలా అని వాటిని తాకడానికి ప్రయత్నించకూడదని స్థానికులు హెచ్చరిస్తుంటారు. కొన్ని వూడూ బొమ్మల్లో మనుషులుండి దాన్ని నడిపిస్తారు. అందులోంచే నృత్యం చేస్తుంటారు. కానీ ఇంకొన్ని వూడూ బొమ్మలు మాత్రం.. మనిషి సాయం లేకుండానే ఏదో కనిపించని శక్తి నడిపిస్తున్నట్లుగా కదులుతాయి. ‘ఈ బొమ్మలో మనిషి లేడు.. కేవలం ఇదంతా ఆత్మ కోలాహలమే’ అనే విషయాన్ని తెలియపరచడానికి.. ఆ బొమ్మను మధ్యమధ్యలో ఎత్తి.. చూపిస్తుంటారు ఆ వంశస్థులు. ‘వూడూ మతస్తులు ఆత్మలతో మాట్లాడతారు. చేతబడులు చేస్తారు’ అనే ప్రచారం.. అక్కడ నివసించే ఇతర స్థానికులకు ఓ సూచన. విదేశీయులను అదుపులో ఉంచే ఒక హెచ్చరిక. ఏదిఏమైనా ఈ వూడూ ఫెస్టివల్లో.. ప్రాణంలేని కొన్ని బొమ్మలు మనిషి సాయం లేకుండా ఎలా కదులుతున్నాయి? ఎలా నాట్యం చేస్తున్నాయి? అనేది నేటికీ మిస్టరీనే! ప్రతి ఏటా బెనిన్లోని కోటోనౌ, ఔయిడా, అబోమీ, గాన్వీ, నాటిటింగౌ, పోర్టో నోవో, అల్లదా నగరాల్లో.. టోగోలోని లోమ్, టోగోవిల్ నగరాల్లో.. ఘనాలోని అక్రా, కేప్ కోస్ట్, కుమాసి నగరాల్లో ఈ సంబరాలు జరుగుతుంటాయి. సుమారు ఐదువందల ఏళ్ల క్రితం నుంచే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు వూడూ మతస్థులు. ఈ మతం 1996లో అధికారికంగా గుర్తింపు పొందింది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని 13 మిలియన్ల జనాభాలో 12% మంది వూడూను అభ్యసిస్తున్నారట. ఈ ఆధ్యాత్మిక మూలాలతో ఆచారాలతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ జాతరను, పండగను ఆయా దేశాలు ప్రెస్టీజియస్‌గా నిర్వహిస్తుంటాయి. ---సంహిత నిమ్మన (చదవండి: తవ్వకాల్లో రెండువేల ఏళ్ల నాటి చెయ్యి..దానిపై మిస్టీరియస్..!) -
విస్తరిస్తున్న మిస్టీరియస్ న్యుమోనియా: ఏంటీ వైట్ లంగ్ సిండ్రోమ్?
ప్రపంచవ్యాప్తంగా అంతుచిక్కని బ్యాక్టీరియల్ న్యుమోనియా వ్యాప్తి ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇటీవల చైనాలో ఆందోళన రేపిన చిన్నపిల్లలో న్యుమోనియా కేసులు తరహాలోనే ముఖ్యంగా అమెరికా మసాచుసెట్స్ ఒహియోలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతునట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది. వైట్ లంగ్ సిండ్రోమ్‌గా పిలుస్తున్న శ్వాసకోశ వ్యాధి ప్రధానంగా పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. మూడునుంచి ఎనిదేళ్ల వయస్సున్న పిల్లల్లోఈ న్యుమోనియా వ్యాపిస్తోంది. దీనికి కచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రానప్పటికీ ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సాధారణ బాక్టీరియా మైకోప్లాస్మానే కారణం కావచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి? వైట్ లంగ్ సిండ్రోమ్ అనేది ప్రభావితమైన పిల్లలలో ఛాతీ ఎక్స్-కిరణాలపై విలక్షణమైన తెల్లటిపొరలా ఏర్పడుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, పల్మనరీ అల్వియోలార్ మైక్రోలిథియాసిస్, సిలికా సంబంధిత పరిస్థితులులాంటి పలు శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి.శ్వాస ఆడకపోవడం, దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం , అలసట లాంటివి ప్రధాన లక్షణాలు. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) అనేది ఊపిరితిత్తుల్లో నీరు చేరినపుడు సంభవించే తీవ్ర పరిస్థితి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. న్యుమోనియా, సెప్సిస్ , ట్రామా వంటి అనేక కారణాల వల్ల ARDS సంభవించవచ్చు. ఊపిరితిత్తుల అల్వియోలార్ మైక్రోలిథియాసిస్ (PAM) అనేది ఊపిరితిత్తులలోని గాలి సంచులలో కాల్షియం పేరుకుపోవడం సంభవించే అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి. దీనివల్ల ఊపిరి ఆడకపోవడం, దగ్గు, ఛాతీ నొప్పి వస్తుంది. సిలికోసిస్ అనేది సిలికా ధూళిని పీల్చడం వల్ల వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి. సిలికా దుమ్ము ఇసుక, రాయి, ఇతర ఇతర పదార్థాలలో కనిపిస్తుంది. సిలికోసిస్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు మరియు ఛాతీ నొప్పికి కారణమవుతుంది. మూల కారణం వైట్ లంగ్ సిండ్రోమ్ మూలకారణాలు ఏంటి అనేది ఇంకా పరిశోధనలోఉంది. అయితే ఇది బాక్టీరియా, వైరల్ , పర్యావరణ కారకాల కలయిక వల్ల వస్తోందనేది అంచనా. ఇన్ఫ్లుఎంజా లేదా COVID-19 వంటి వైరస్లు ఊపిరితిత్తుల గాలి సంచులను దెబ్బతీయడం ద్వారా తెల్ల ఊపిరితిత్తుల సిండ్రోమ్‌ను కలిగిస్తాయి. మైకోప్లాస్మా న్యుమోనియా వంటి బాక్టీరియా, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగించడం ద్వారా వైట్ లంగ్ సిండ్రోమ్‌కు కారణం కావచ్చు. సిలికా ధూళి, ఇతర కాలుష్య కారకాలను పీల్చడం వంటి పర్యావరణ కారకాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ద్వారా వైట్ లంగ్ సిండ్రోమ్ వ్యాధి వస్తోంది. దీంతో మరో కోవిడ్-19 మహమ్మారి విస్తరిస్తోందా అనే ఆందోళన నెలకొంది. దీనికి చికిత్స వ్యాధి తీవ్రత, రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, మెకానికల్ వెంటిలేషన్, కార్టికో స్టెరాయిడ్స్ ద్వారా చికిత్సగా భావిస్తున్నారు. చైనాలో శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో చైనా పొరుగు దేశాలైన తైవాన్, నేపాల్ , అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వైట్ లంగ్ సిండ్రోమ్' వ్యాప్తి అమెరికాకు ముందు నెదర్లాండ్స్ , డెన్మార్క్ కూడా న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు మైకోప్లాస్మా కారణంగా భావిస్తున్నారు.ప్రతి లక్షమంది పిల్లలలో 80 మంది న్యుమోనియా సోకింది. నాలుగు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కేసులు కూడా పెరుగుతున్నాయి. న్యుమోనియా కేసులు 'అంటువ్యాధి' స్థాయికి చేరుకున్నాయని డానిష్ ఆరోగ్య ముఖ్యులు కూడా ప్రకటించారు. గత ఐదు వారాల్లో ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందని డెన్మార్క్ స్టాటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ (SSI) వెల్లడించింది. -
ఈ కోటలోకి వెళ్లిన వాళ్లెవరూ ఇప్పటివరకు తిరిగి రాలేదు
అదో రహస్య కోట. సూర్యస్తమయం తర్వాత ఆ కోటలోకి వెళ్లడం నిషేధం. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసినా వెళ్లినా తిరిగి వచ్చిన సందర్భాలు లేవు. ఇప్పటివరకు అలా వెళ్లిన వాళ్లెవరూ తిరిగి రాలేదు. మిస్టీరియస్ కోటగా పేరుగాంచిన ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? ఏంటీ హిస్టరీ అన్నది తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని వారసత్వ కోటలలో ఒకటి ఈ గర్కుందర్ ఫోర్ట్. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ అంతుచిక్కని రహస్యమైన కోట చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఇదో మిస్టీరియస్ కోటగా పేరుగాంచింది. మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోటను 11వ శతాబ్దంలో నిర్మించినట్టుగా సమాచారం. చందేలా, బుందేలా, ఖంగర్ వంటి రాజవంశస్థులు ఈ ప్రాంతంలో పాలన సాగించారు. తర్వాత ఈ కోటను తుగ్లక్‌లు సొంతం చేసుకొని బుందేలాలకు అప్పగించారు. ఈ కోటను ఎప్పుడు, ఎవరు నిర్మించారు అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ కోటలో చాలా నిధి ఉందన్న ప్రచారం కూడా ఉంది. దీంతో కోట లోపల ఏం ఉందో తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులు ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అదేంటంటే.. సూర్యాస్తమయం తర్వాత కోటలోకి ఎవరూ ప్రవేశించకూడదని. కొంతమంది క్యూరియాసిటీతో కోట లోపల రాత్రి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ కోట గురించి తెలుసుకోవాలని వెళ్లిన సుమారు 50-60మంది ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ సంఘటన తర్వాత కోటలోకి వెళ్లే అన్ని తలుపులు మూసివేశారు. ఈ కోట వెనక ఆసక్తికరమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక తాంత్రికుడు యువరాణి సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడై మంత్రించిన నూనెతో వశం చేసుకోవాలని ప్రయత్నించాడు. అది పసిగట్టిన యువరాణి ఆ నూనెల ఓ రాయిపై పడేలా చేసింది. దీంతో ఆ రాయి తాంత్రికుణ్ణి హతమార్చింది. ఆ తాంత్రికుడు చనిపోతూ శపించడం వల్ల ఊరంతా నాశనమైందని చెబుతారు. మొత్తం ఐదు అంతస్తుల్లో ఉండే గర్కుందర్ కోటలో మూడు అంతస్తులు పైన, రెండు అంతస్తులు నేలకింద నిర్మించడం విశేషం. రాత్రిపూట ఇక్కడికి ఎవరైనా ప్రవేశిస్తే మరుసటి రోజుకు కనిపించకుండా పోతారని అంటారు. దీంతో ఇదో మిస్టీరియస్ కోటగా నిలిచింది. -
యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా?
వరుణ గ్రహం... ఇంగ్లీషులో యురేనస్ అంటారు. ఈ గ్రహం పేరు మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఈ గ్రహాన్ని గ్యాస్ జెయింట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మట్టి, రాయికి బదులుగా గ్యాస్ అధికంగా ఉంటుంది. ఈ గ్రహం పరిమాణంలో చాలా పెద్దది. ఇటువంటి విచిత్ర వాతావరణం కలిగిన గ్రహంలో మనిషి కనీసం ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమి జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. సౌర వ్యవస్థలో టెలిస్కోప్ సాయంతో కనుగొన్న మొదటి గ్రహం యురేనస్. ఇది సౌర వ్యవస్థలోని ఎనిమిది గ్రహాలలో సూర్యుని నుండి దూరం పరంగా చూస్తే ఏడవ సుదూర గ్రహం. యురేనస్ తన అక్షం మీద ఒక పరిభ్రమణాన్ని దాదాపు 17 గంటల్లో పూర్తి చేస్తుంది. అంటే యురేనస్‌పై ఒక రోజుకు 17 గంటలు మాత్రమే ఉంటుందని అర్థం. అంటే ఇక్కడ ఒక సంవత్సరం భూమిపై 84 సంవత్సరాలకు సమానం. యురేనస్‌పై రాత్రి 42 సంవత్సరాలు, పగలు 42 సంవత్సరాలు అని తెలిస్తే ఎవరైరా ఆశ్చర్యపోవాల్సిందే. యురేనస్‌పై రెండు ధృవాలలో ఒకటి సూర్యునికి అభిముఖంగా ఉండడం, మరొకటి 42 ఏళ్లు చీకటిలో ఉండడమే ఇందుకు కారణం. యురేనస్.. సూర్యుని నుండి సుమారు మూడు బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహం చాలా చల్లగా ఉండటానికి కారణం కూడా ఇదే. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత -197 డిగ్రీల సెల్సియస్. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం, యురేనస్‌పై కనిష్ట ఉష్ణోగ్రత -224 డిగ్రీల సెల్సియస్. ఇక భూమికి ఒకే చంద్రుడు ఉండగా, యురేనస్‌కు మొత్తం 27 సహజ ఉపగ్రహాలు అంటే చంద్రులు ఉన్నారు. అయితే ఈ చంద్రులు చాలా చిన్నవిగా, అసమతుల్యంగా ఉంటాయి. వాటి బరువు చాలా తక్కువ. యురేనస్ దాని అక్షం మీద 98 డిగ్రీలు వంగి ఉంటుంది. అందుకే ఇక్కడి వాతావరణం అసాధారణంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ తుఫాను లాంటి వాతావరణం ఉంటుంది. గాలులు చాలా వేగంగా వీస్తాయి. ఇవి గరిష్టంగా గంటకు 900 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటాయి. యురేనస్ గ్రహంపై మేఘాల అనేక పొరలతో కూడి ఉంటాయి. పైభాగంలో మీథేన్ వాయువు ఉంటుంది. యురేనస్ గ్రహంపై మీథేన్ వాయువు, ఉష్ణోగ్రత, గాలి సమృద్ధిగా ఉండటం వల్ల ఇక్కడ వజ్రాల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యకిరణాలు ఈ గ్రహాన్ని చేరుకోవడానికి రెండు గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. యురేనస్ భూమి కంటే దాదాపు 20 రెట్లు పెద్దది. మరి ఈ గ్రహం గురించి ఇన్ని వివరాలు తెలుసుకున్నాక.. మనిషి ఈ గ్రహంపై ఐదు నిముషాలైనా ఉండగలడా? ఉంటే ఏమవుతుందనేది ఇప్పటికే మీకు సమగ్రంగా అర్థమై ఉండాలి. ఇది కూడా చదవండి: బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం -
వారి ‘నిప్పు కోడి పాదాల’ రహస్యం ఏమిటి? ఈ తెగ ఎక్కడుంది?
ఈ ప్రపంచం మన ఊహకందేటంతటి చిన్నదేమీ కాదు. ఇక్కడ వివిధ రకాల ప్రజలు నివసిస్తున్నారు. వీరిమధ్య మనకు తెలియని వింతలు ఎన్నో దాగివున్నాయి. ప్రపంచంలోని భిన్న సంస్కృతిని ఒకేచోట కూర్చుంటే అర్థం చేసుకోలేమని చాలామంది చెబుతుంటారు. ప్రపంచంలోని ఒక వింత తెగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తెగకు ఉన్నది ఒక ప్రత్యేకతనో లేదా లోపమో.. ఏదో ఒకటి అనుకోవచ్చు. ఆ తెగ మొత్తం ఈ వింత సమస్యను ఎదుర్కొంటోంది. వారి రూపురేఖలు మనుషులను పోలి ఉంటాయి. కానీ వారి పాదాలను చూడగానే ఎవరికైనా దిమ్మతిరిగిపోతుంది. వీరి పాదాల తీరు మన పాదాల మాదిరిగా 5 వేళ్లతో ఉండదు. వారికి కేవలం 2 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఇది ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం డొమా తెగగా పేరొందిన ఈ తెగ ప్రజలను వడోమా లేదా బంట్వానా తెగ అని కూడా పిలుస్తారు. వారి కాళ్లు ఆస్ట్రిచ్( నిప్పు కోడి లేదా ఉష్ట్రపక్షి) కాళ్ల మాదిరిగా ఉంటాయి. అందుకే వారిని ఆస్ట్రిచ్ ప్రజలు అని కూడా పిలుస్తారు. ఈ తెగ జింబాబ్వేలోని కన్యెంబా ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ కమ్యూనిటీ అరుదైన జన్యుపరమైన రుగ్మతను ఎదుర్కొంటోంది. వీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యను ఎక్ట్రోడాక్టిలీ అని అంటారు. ఈ పరిస్థితి కారణంగా వారి పాదాలకు 5 వేళ్లకు బదులుగా 2 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఈ తెగకు చెందిన జనాభాలో ప్రతి నాల్గవ వ్యక్తి ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఈ తెగకు చెందిన వారు ఇతర వర్గాలలోని వారిని వివాహం చేసుకోలేని పరిస్థితి ఉంది. వారు ఇతర వర్గాలలోనివారిని వివాహం చేసుకోవడంపై చట్టరీత్యా నిషేధం అమలులో ఉంది. ఈ తరహా వ్యక్తులు సరిగా నడవలేరు. బూట్లు ధరించలేరు. కేవలం చెట్లు ఎక్కే విషయంలో మాత్రం చురుకుగా ఉంటారు. ఇది కూడా చదవండి: ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది? -
ఎండిన బావిలో వేడినీటి కుతకుతలు?.. స్నానాల కోసం క్యూ కడుతున్న జనం!
బీహార్‌లోని భాగల్పూర్లోని ఒక బావి చర్చనీయాంశంగా మారింది. ఈ బావిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ బావి గత 20 ఏళ్లుగా పూర్తిగా ఎండిపోయివుంది. అయితే ఉన్నట్టుండి ఈ బావిలో నుంచి నీరు ఉబికివస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయమేమంటే బావిలోని నీరు కుతకుతా ఉడుకుతున్నట్లు కనిపిస్తోంది. దీనిని చూసిన జనం హడలెత్తిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ బావి గురించి రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. భాగల్పూర్ జిల్లాలోని గోరాడీప్ పరిధిలోని హర్చండీ గ్రామంలోని బదరీ బహరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడున్న ఒక ఎండిన బావిలో ఉన్నట్టుండి నీరు ప్రత్యక్షమై, అది వేడికి ఉడుకున్నట్లు కనిపిస్తోంది. అయితే పరిశీలించి చూస్తే ఆ నీరు చల్లగానే ఉండటం విశేషం. గ్రామానికి చెందిన ఒక యువకుడు మెట్ల ద్వారా బావిలోనికి వెళ్లి చూడగా, నీరు ఒక మట్టం వరకేవచ్చి ఆగిపోయివుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బావి 70 ఏళ్ల క్రితం నిర్మితమయ్యింది. గత కొన్నేళ్లుగా ఈ బావి పూర్తిగా ఎండిపోయింది. గ్రామానికి చెందిన ప్రొఫెసర్ ఈ నీటిని డీటీఎస్ పరీక్షలకు పంపారు. ఈ నీరు తాగేందుకు ఏమాత్రం యోగ్యం కాదని తెలిపారు. అయితే ఈ బావి వద్దకు చేరుకుంటున్న గ్రామస్తులు దానిలోని నీటితో స్నానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నీటితో స్నానం చేసిన గ్రామానికి చెందిన సునైనాదేవి అనే మహిళ తనకున్న చర్మ సంబంధిత రోగాలు మాయమయ్యాయని తెలిపింది. ఆమె చెబుతున్న మాటల్లో నిజమెంతో తెలియనప్పటికీ, గ్రామానికి చెందిన పలువురు ఈ బావిలోని నీటితో స్నానం చేస్తున్నారు. ఈ నీటి గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇది కూడా చదవండి: ఫిరోజ్ ఘంఢీ.. ఫిరోజ్ గాంధీగా ఎలా మారారు? ఇందిరతో పెళ్లిపై కమలా నెహ్రూ ఏమన్నారు? -
వీకెండ్ ట్రిప్‌కి వెళ్లి తిరిగిరాలేదు..ఆరోజు అడవిలో ఏం జరిగింది?
ఆకస్మిక అదృశ్యాలను, అసహజ మరణాలను తిరగదోడేటప్పుడు.. ప్రతి కోణం ఉత్కంఠగానే ఉంటుంది. కానీ కొన్నింటికి ముగింపే ఉండదు. ఎంత వెతికినా దొరకదు. ఎందుకంటే అవి కల్పితాలు కావు, నిజ జీవిత కథలు. పైశాచికత్వం ముందు ఓడిపోయిన బతుకులు. అలాంటి మరో మిస్టరీనే ఇది.. 48 ఏళ్ల క్రితం.. పిక్నిక్కి వెళ్లిన కూతురు, అల్లుడు, పిల్లలు.. తన ఇంటి దగ్గర ఆగి, డిన్నర్ చేసి వెళ్తారని ఆశపడింది ఆ తల్లి. ఎందుకంటే అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రం, కాపర్లోని తనింటికి.. 2 కిలో మీటర్లలోపే ఉన్న సిస్కియో పర్వతాల్లో క్యాంప్గ్రౌండ్కే వాళ్లు వెళ్లింది. రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి, ఎదురు చూడసాగింది. ఎంతకూ రాకపోయేసరికి మనసెందుకో కీడు శంకించింది. దగ్గరే కావడంతో ధైర్యం చేసి క్యాంప్‌గ్రౌండ్‌కి నడిచేసింది. అక్కడ క్రీక్ రోడ్ సమీపంలోని క్యాంప్‌గ్రౌండ్‌కి వెళ్లి, తనవాళ్ల టెంట్‌ని గుర్తుపట్టింది. తీరా లోపలికి వెళ్తే అందులో ఎవ్వరూ లేరు. చిన్న టేబుల్ మీద సగం ఖాళీ చేసిన పాలడబ్బా, వెహికిల్ తాళం చెవి, అల్లుడు రిచర్డ్ కౌడెన్(28) పర్స్ కనిపించాయి. రిచర్డ్.. కూతురు బెలిండా(22), మనవడు డేవిడ్(5), ఐదు నెలల మనవరాలు మెలిసా సహా ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ల వెంటవెళ్లిన పెంపుడు కుక్కలు కూడా కనిపించలేదు. దాంతో ఆ పెద్దావిడకు టెన్షన్ పెరిగిపోయింది. పైగా ఆ టెంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా కనిపించాయి. పర్స్‌లో 21 డాలర్లు సురక్షితంగా ఉన్నాయి. వెంటనే కూతురు, అల్లుడు వచ్చిన వాహనం కోసం వెతకడం మొదలుపెట్టింది బెలిండా తల్లి. క్రీక్ రోడ్‌పై పార్క్ చేసి ఉన్న ట్రక్కులో బాతింగ్ సూట్లు తప్ప అన్ని బట్టలూ ఉన్నాయి. బహుశా వాగుల్లో స్నానానికి వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ ఆలోచనే ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీస్ స్టేషన్‌కి పరుగుతీసింది. పాలడబ్బా సాక్ష్యం సంఘటన స్థలానికి అధికారులు వచ్చారు. అక్కడ ఎలాంటి హింసాత్మక వాతావరణం కనిపించకపోవడంతో ఆ రాత్రి విచారణను అశ్రద్ధ చేశారు. మరునాడు వాళ్ల పెంపుడు కుక్కలైన బాసెట్ హౌండ్, డ్రూపీలు ‘కాపర్ జనరల్ స్టోర్’ ముందు తచ్చాడుతూ కనిపించాయి. సెప్టెంబర్ 1న ఉదయం 9 గంటలకు రిచర్డ్, కొడుకు డేవిడ్ కలసి వచ్చి.. తమ స్టోర్‌లో పాల ప్యాకెట్ కొనుక్కుని వెళ్లారని ఆ స్టోర్ యజమాని చెప్పాడు. దానికి టెంట్లో టేబుల్ మీదున్న సగం పాలడబ్బానే సాక్ష్యం. చరిత్రలోనే.. కౌడెన్ కుటుంబం వైట్ సిటీలో ఉండేవారు. 1974 ఆగస్టు 30న వీకెండ్ ట్రిప్ అంటూ ఓరెగన్ లోని అత్తగారి ఇంటి నుంచే క్యాంప్‌గ్రౌండ్‌కి వెళ్లారు. సెప్టెంబర్ 1 సాయంత్రానికల్లా అత్తగారి ఇంటికి చేరుకుని, అటు నుంచి తిరిగి వైట్ సిటీకి వెళ్లాలనేది వారి ప్లాన్. కానీ అలా జరగలేదు. వాళ్లు వెళ్లిన చోటికి పర్యాటకులు వస్తూపోతూ ఉంటారు. రిచర్డ్ ఫ్యామిలీ మిస్ అవడంతో ఆ ప్రాంతం నిఘా నీడలోకి చేరింది. జాతీయ మీడియా దీనిపై కవరేజ్ ఇవ్వడంతో కౌడెన్ కుటుంబం పట్ల సానుభూతి మొదలైంది. హైకర్స్ వల్ల.. స్థానిక వాలంటీర్లు, ఎక్స్‌ప్లోరర్ స్కౌట్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, ఒరెగన్ నేషనల్ గార్డ్స్ విచారణాధికారులకు గట్టి సహకారమే అందించారు. ఫారెస్ట్ సర్వీస్ క్యాంప్ సైట్ చుట్టూ అణువణువూ గాలించారు అధికారులు. హెలికాప్టర్ల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేదు. 1975 ఏప్రిల్ 12న ఒరెగన్ లోని ఫారెస్ట్ గ్రోవ్ నుంచి ఇద్దరు హైకర్స్ కొండపైన ఓ చెట్టుకు కట్టేసిన వ్యక్తి శవాన్ని చూశారు. అది బాగా కుళ్లిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని గుహలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల శవాలను గుర్తించారు. ఆ మృతదేహాలు కౌడెన్ కుటుంబానివేనని పరీక్షల్లో తేలింది. నిజానికి ఆ ప్రదేశం వారి క్యాంప్‌సైట్ నుంచి దాదాపు 11 కిమీ దూరంలో ఉంది. శవపరీక్షల్లో బెలిండా, డేవిడ్‌లను తుపాకీతో కాల్చి, మెలిసాను బండకు బాది చంపారని తేలింది. చెట్టుకు కట్టిన తర్వాతే రిచర్డ్ చనిపోయాడని, బెలిండాతో పాటు ఇద్దరు పిల్లల్నీ వేరే చోట చంపి, గుహలో పడేశారని వైద్యులు భావించారు. షాకింగ్ విషయం సెప్టెంబర్ 1న క్యాంప్‌గ్రౌండ్‌లో ఉన్న పర్యాటకుల్ని విచారించినప్పుడు ‘ఓ లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు మగవారు, ఒక మహిళ పికప్ ట్రక్‌లోంచి దిగడం చూశాం. వారు మమ్మల్ని భయాందోళనకు గురిచేశారు. అక్కడి నుంచి మేమెప్పుడు కదులుతామా అన్నట్లు ప్రవర్తించారు. అందుకే జనావాసం ఉండే చోటికి వెళ్లిపోయాం’ అంటూ చెప్పారు. అప్పుడే ఓ స్థానికుడు మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ‘సెప్టెంబరులో కౌడెన్ కుటుంబం కోసం శోధించినప్పుడు ఆ గుహ మొత్తం నేను వెతికాను. అప్పుడు అక్కడ ఏ మృతదేహాలు లేవు’ అంటూ. ఈ క్రమంలోనే రూష్కు చెందిన డ్వైన్ లీ లిటిల్(25) అనే ఖైదీని నిందితుడిగా భావించారు. అతడు పదహారేళ్ల వయస్సులో ఓ యువకుడిపై అత్యాచారం, హత్య చేసిన నేరంపై శిక్షను అనుభవిస్తూ, కౌడెన్స్ కుటుంబం అదృశ్యానికి 3 నెలల ముందే పెరోల్ మీద విడుదలయ్యాడు. మిస్ అయిన రోజు అతడు కాపర్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పైగా 1975 జనవరిలో లిటిల్ దగ్గర తుపాకీ ఉందని తేల్చుకున్న పోలీసులు పెరోల్ రద్దు చేశారు. మళ్లీ 1977 ఏప్రిల్‌లో బయటికి వచ్చిన లిటిల్.. ఓ గర్భవతిపై లైంగికదాడి చేసి, తీవ్రంగా కొట్టాడు. కొంచెంలో ఆ తల్లి, బిడ్డా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ కేసులో కోర్టు లిటిల్‌కి 3 జీవిత ఖైదులను విధించింది. ఇప్పటికీ మిస్టరీనే.. విచారణలో లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ చెప్పినట్లుగా పార్క్ సమీపంలో ట్రక్‌లో వచ్చిన ఇద్దరు మగవారు, ఒక మహిళ ఎవరో కాదని.. లిటిల్, అతని తల్లిదండ్రులేనని పోలీసులు బలంగా నమ్మారు. కానీ సాక్ష్యాలే లేవు. 1974 సెప్టెంబర్ 2 సోమవారం నాడు లిటిల్ కుటుంబం క్యాంప్ గ్రౌండ్ సమీపంలోనే ఉన్నారని, గెస్ట్ బుక్‌లో సంతకం కూడా చేశాడని ఓ మైనర్ సాక్ష్యమిచ్చాడు. అయితే లిటిల్ కుటుంబం ఆ ఆరోపణలను అంగీకరించలేదు. మరోవైపు లిటిల్‌తో సెల్ పంచుకున్న ఓ ఖైదీ.. కౌడెన్ కుటుంబాన్ని చంపింది తనేనని లిటిల్ తన ముందు ఒప్పుకున్నట్లుగా చెప్పాడు. కానీ నేరం రుజువు కాకపోవడంతో కౌడెన్ కుటుంబాన్ని హతమార్చింది ఎవరో? నేటికీ మిస్టరీనే. ∙సంహిత నిమ్మన -
అయ్యయ్యో..దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది
Ain Dubai (Dubai Eye) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాలు, రికార్డ్-బ్రేకింగ్ ల్యాండ్‌మార్క్ నిర్మాణాలకు పుట్టినిల్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ముఖ్యంగా గ్లామ్-హబ్ దుబాయ్పర్యాటకులను ఆకర్షించే అతిపెద్ద ఫెర్రిస్ వీల్ ఐన్ దుబాయ్ (దుబాయ్ఐ) అర్థాంతరంగా నిలిచిపోయింది. దుబాయ్‌లో రెండేళ్ల కిందట (అక్టోబర్ 21, 2021) అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జెయింట్ వీల్ హఠాత్తుగా ఆగిపోవడం చర్చకు దారితీసింది. (బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!) దుబాయ్ అంటే ఆకాశహర్మ్యాలు, షాపింగ్ మాల్స్ షాపింగ్, లగ్జరీ హోటల్స్ తోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గుర్తొస్తాయి. వీటన్నింటికి మించి అట్టహాసంగా ప్రారంభమై పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫెర్రిస్ వీల్. ఈ అతిపెద్ద జెయింట్ వీల్ మొరాయిస్తోంది. ప్రస్తుతం ఎల్ఈడీ ఫిక్చర్లు మాత్రమే పనిచేస్తున్నాయట. ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్ స్వయంగా ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఐన్ దుబాయ్ తెరుచుకోదని వెల్లడించింది. గత కొద్ది నెలలుగా జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి శరవేగంగా పనిచేస్తున్నామని ప్రకటించింది. దుబాయ్ ఐని ఎపుడు తిరిగి ప్రారంభించేదీ అధికారికంగా వెల్లడించలేదు. (లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!) దుబాయ్ పర్యాటక శాఖ ప్రకారం పుట్టినల్లు దుబాయ్ ఐ 250 మీటర్ల (825 అడుగులు) uత్తులో ఉంది. . ప్రపంచంలోనే అతిపెద్దది. లండన్ ఐ కంటే దాదాపు రెండు రెట్లు ఎత్తు. అంతర్జాతీయ కంపెనీల కన్సార్టియం నిర్మించిన దుబాయ్ఐ, బ్లూవాటర్స్లో ఉంది. ఈఫిల్ టవర్ కంటేఎక్కువ ఉక్కుతో తయారు చేయబడినజెయింట్ వీల్, నామమాత్రంగానే మిగిలిపోవడం పర్యాటక ప్రియులను నిరాశపరుస్తోంది. -
మిస్టీరియస్ డ్రామా
అభిలాష్, రమ్య,ప్రాచీ ఠాకూర్, శివకోన, ప్రభాకర్, నేహా దేశ్΄పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’. కుటుంబ కథా ‘వి’ చిత్రం అనేది ట్యాగ్‌లైన్ . శివ కోన దర్శకత్వంలో అనిల్ మోదుగ, శివకోన నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు 4న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రయూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అభిలాష్ మాట్లాడుతూ– ‘‘రాజుగారి కోడిపులావ్’ రోటీన్ సినిమా కాదు.. కొత్తగా మిస్టీరియస్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు శివ. నటీనటులు కునాల్, నేహాదేశ్ పాండే, రమ్య,ప్రాచీ ఠాకూర్ మాట్లాడారు. -
ప్రపంచంలో నీటి అడుగున ఉన్న టాప్ 10 నగరాలు
-
భూగర్భం నుంచి ఏవో వింత శబ్దాలు.. ఏమై ఉండొచ్చు?
కొట్టాయం: భూగర్భం నుంచి ఏవో వింత శబ్దాలు.. ఏమై ఉండొచ్చు? వారం రోజుల వ్యవధిలోనే కేరళలో పలు గ్రామాల్లో భూగర్భం నుంచి గంభీరమైన వింత శబ్దాలు రావడం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కొట్టాయం జిల్లాలోని చెనప్పాడి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున భూమిలో నుంచి ఏవో వింత శబ్దాలు వచ్చాయి. ఆ గంభీరమైన శబ్దాలను విని గ్రామ ప్రజలు భయాందోళలకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలోని ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఏవో గంభీరమైన శబ్దాలు భూగర్భం నుంచి వినిపించాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శబ్ధాలు గట్టిగా ఉన్నాయని స్థానికులు అన్నారు. బయట వాతావరణంలో ఎలాంటి మార్పులేవీ కనిపింలేదని చెప్పారు. రెండు సార్లు భీకరంగా శబ్దాలు వచ్చాయని పేర్కొన్నారు. ఆ గ్రామాన్ని పరిశీలిస్తామని కేరళ మైనింగ్, జియాలజీ శాఖ అధికారులు చెప్పారు. గత వారం ఆ జిల్లాలో వినిపించిన శబ్దాలను ఇప్పటికే పరిశీలించామని చెప్పారు. అయినప్పటికీ మళ్లీ ఓ సారి అధికారులను పంపిస్తామని వెల్లడించారు. సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ శాస్త్రీయ అధ్యయనం మాత్రమే ఈ శబ్దాలకు గల కారణాన్ని శాస్త్రీయంగా తెలపగలదని చెప్పారు. చదవండి:'ముస్లీం లీగ్ లౌకిక పార్టీ' రాహుల్ వ్యాఖ్యలపై.. బీజేపీ ఫైర్.. -
భారతదేశంలోని టాప్ 11 మిస్టీరియస్ టెంపుల్స్
-
ఇదో వింత.. ఢీకొంటున్న కృష్ణబిలాల జంటలు!
కృష్ణబిలం. అనంత శక్తికి ఆలవాలం. దాని ఆకర్షణ పరిధిలోకి వెళ్లిన ఏ వస్తువూ తప్పించుకోవడమంటూ ఉండదు. దానిలో కలిసి శాశ్వతంగా కనుమరుగైపోవాల్సిందే. అలాంటి రెండు అతి భారీ కృష్ణబిలాల జంటలు త్వరలో పరస్పరం ఢీకొననున్నాయట! వీటిలో ఒకటి భూమికి 76 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్133 అనే మరుగుజ్జు తారామండల సమూహంలో ఉండగా, మరొకటి 32 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్1758ఎస్ అనే మరో మరుగుజ్జు గెలాక్సీలో ఉంది. నాసా తాలూకు చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ ఈ కృష్ణబిలాలను గుర్తించింది. అంతరిక్షంలో ఇలా భారీ కృష్ణబిలాలు ఢీకొట్టడానికి సంబంధించి మనకు నిదర్శనం లభించడం ఇదే తొలిసారి కానుంది. దీనిద్వారా తొలినాటి విశ్వంలో కృష్ణబిలాల వృద్ధి, మరుగుజ్జు గెలాక్సీల ఎదుగుదల తదితరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని నాసా భావిస్తోంది. ఆ రెండు మరుగుజ్జు గెలాక్సీల పరిమాణం 3 కోట్ల సూర్యుల సమష్టి ద్రవ్యరాశికి సమానం. అంటే మన పాలపుంత కంటే 20 రెట్లు తక్కువ! ఇలాంటి మరుగుజ్జు గెలాక్సీలు పరస్పరం కలిసిపోయి మనమిప్పుడు చూస్తున్న భారీ గెలాక్సీలుగా రూపొంది ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న తొలినాటి కృష్ణబిలం తొలినాటి విశ్వానికి చెందినదిగా భావిస్తున్న ఓ భారీ కృష్ణబిలాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇది ఊహాతీత వేగంతో విస్తరిస్తోందట. బహుశా అప్పట్లో అత్యంత భారీ కృష్ణబిలం ఇదే కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని లోతుగా పరిశోధిస్తే విశ్వావిర్భావపు తొలి నాళ్లలో భారీ నక్షత్ర మండలాలతో పాటు అతి భారీ కృష్ణ బిలాల ఆవిర్భావంపై మరిన్ని కీలక వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు. ఈ కృష్ణ బిలం సీఓఎస్–87259గా పిలుస్తున్న ఓ గెలాక్సీ తాలూకు కేంద్ర స్థానంలో నెలకొని ఉంది. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే (ఏఎల్ఎంఏ) రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఈ కృష్ణబిలం జాడ కనిపెట్టారు. ఇది మన పాలపుంత కంటే ఏకంగా వెయ్యి రెట్లు ఎక్కువ వేగంతో నక్షత్రాలకు జన్మనిస్తోందట! సూర్యుని వంటి వంద కోట్ల నక్షత్ర ద్రవ్యరాశులకు ఇది ఆలవాలమట. దీని తాలూకు ప్రకాశం వల్ల సీఓఎస్–87259 గెలాక్సీ అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనువిందు చేస్తోందట! ఈ అధ్యయన ఫలితాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాలూకు జర్నల్ మంత్లీ నోటీసెస్‌లో ప్రచురించారు. -
గాడ్జిల్లా గుడ్డేం కాదు!
వైరల్: జపాన్ తీరానికి కొట్టుకొచ్చిన వస్తువు ఒకదాని గురించి.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసే ఉంటుంది. బాగా మట్టికొట్టుకుపోయి.. లేత పసుపురంగులో బంతి ఆకారంలో ఉన్న ఆ వస్తువు ఏంటన్నదానిపై చర్చలు జరిగాయి. స్పై బెలూన్ అని, ఒక అడుగు ముందుకు వేసి కొందరైతే గాడ్జిల్లా గుడ్డు అంటూ చర్చించుకున్నారు కూడా. ఇదిలా ఉంటే.. హమామత్సు ప్రాంతం ఈ పరిణామంతో భయాందోళనకు గురైంది. అయితే.. ఎక్స్‌రే పరీక్ష ద్వారా ఇదేం పేలుడు పదార్థం కాదని అధికారులు నిర్ధారించారు. అంతేకాదు అది స్క్రాప్ మెటల్ అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. బహుశా సముద్రతీరంలో ఉపయోగించే వస్తువు అయ్యి ఉంటుందని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు అధికారులు. -
మిస్టరీలుగా పుతిన్ వ్యతిరేకుల ఆత్మహత్యలు
మిస్టరీలుగా పుతిన్ వ్యతిరేకుల ఆత్మహత్యలు -
48 ఏళ్లుగా.. అంతుచిక్కని ‘దెయ్యపు’ బొమ్మ!!
ఒక బొమ్మ.. దానిని ఇష్టపడే వ్యక్తులు. కానీ, అన్యాయంగా చనిపోయిన ఓ వ్యక్తి ఆత్మ అందులో దూరి.. అందరికీ వణుకు పుట్టిస్తూ ఉంటుంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా.. అన్ని భాషల్లో ఈ స్టోరీ లైన్‌తో బొమ్మల్ని బేస్ చేసుకుని బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అయితే నిజజీవితంలోనూ అమ్మో బొమ్మ తరహా కథలు ప్రచారంలో ఉండడం మీరెప్పుడైనా విన్నారా? రాబర్ట్.. హాంటెడ్ డాల్. అలా ఇలా కాదు.. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన బొమ్మ అదట. 1994 నుంచి యూఎస్ స్టేట్ ఫ్లోరిడా కీ వెస్ట్‌లోని ఫోర్ట్ ఈస్ట్ మార్టెల్లో మ్యూజియంలో అది ఉంటోంది. ఒక చిన్నారికి నావికుడి గెటప్ వేసినట్లు ఉండే ఆ బొమ్మ.. చేతిలో మరో బొమ్మను పట్టుకున్నట్లు ఉంటుంది. అయితే ఈ బొమ్మ వల్లే ఎన్నో అనర్థాలు జరిగాయనే ప్రచారం.. ఇదొక దెయ్యం బొమ్మనే ముద్రను వేశాయి. 1904 సంవత్సరంలో కీ వెస్ట్‌కి చెందిన రాబర్ట్ ఎయుజెనె ఒట్టో అనే చిన్నారికి బర్త్‌డే గిఫ్ట్‌గా.. అతని తాత జర్మనీ నుంచి తీసుకొచ్చి మరీ ఈ బొమ్మను కానుకగా తీసుకొచ్చాడు. రాబర్ట్ ఆ బొమ్మను ఎంతగా ప్రేమించాడంటే.. దానికి కూడా తన పేరే పెట్టుకున్నాడు. పెద్దయ్యాక కూడా దాన్ని అతను వదల్లేదట. చివరికి ప్రాణం పోయే సమయంలోనూ ఆయన హత్తుకుని పడుకున్నాడని ఆ బొమ్మ హిస్టరీ నోట్లో పేర్కొని ఉంటుంది. అయితే.. 118 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ బొమ్మ ఆ తర్వాత వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. కానీ.. రాబర్ట్ బొమ్మ వేరే వాళ్ల పర్యవేక్షణలో ఉన్నప్పుడు.. ఏదో ఒక అపశ్రుతి జరిగేదన్న వాదన ఒకటి ఉంది. ప్రమాదాలు జరగడం, గాయాలు, ఎముకలు విరిగిపోవడాలు, విడాకులు.. ఇలా ఏదో ఒక చెడు జరిగేదన్న నమ్మకం ముద్రపడిపోయింది. 1974లో రాబర్ట్ ఒట్టో కన్నుమూశాడు. రెండేళ్ల తర్వాత అతని భార్య సైతం చనిపోయింది. ఆ తర్వాత కీవెస్ట్ ఈయేటన్ స్ట్రీట్‌లోని వాళ్ల ఇంట్లో ఆ బొమ్మ అలాగే ఉండిపోయింది. మైర్టెల్ రూటర్ అనే వ్యక్తి 20 ఏళ్ల పాటు ఆ ఇంటిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆపై మరొకరికి దానిని అమ్మేయగా.. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ గెస్ట్ హౌజ్‌గా మార్చేశారు. అయితే.. ఇన్నేళ్లలో ఆ ఇంట్లో ఉన్న బొమ్మ.. జనాలకు చుక్కలు చూపించిందట. ఇన్నేళ్లలో ఆ ఇంట్లో ఉన్న బొమ్మ.. జనాలకు చుక్కలు చూపించిందట. రాబర్ట్ మరణం తర్వాతే ఈ అనుభవాలు ఎదురయ్యాయని చాలా మంది అంటున్నారు. అదీ దానిని సరిగ్గా పట్టించుకోని తరుణంలోనేనట. దీంతో దానికి అతీత శక్తులు ఉన్నాయని, దాని వల్ల ఏదో ఒక అనర్థం జరిగేదన్న నమ్మకం బలంగా స్థిరపడింది స్థానికుల్లో. దీంతో 1994లో ఆ బొమ్మను భద్రంగా ఉంచేందుకు కీ వెస్ట్‌లో ఉన్న మ్యూజియానికి అప్పజెప్పారు. అప్పటి నుంచి అదొక టూరిస్ట్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. అయితే అక్టోబర్‌లో మాత్రం దీనికి ఓల్డ్ పోస్టాఫీస్‌కు తరలిస్తుంటారు ఎందుకనో!. రకరకాల కథలు.. రాబర్ట్ బొమ్మ గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. దానిలో ఏదో శక్తి దాగి ఉందని, అప్పుడప్పుడు ముఖకవళికలు మారుస్తుందని, ఒక్కోసారి విచిత్రమైన శబ్దాలు చేస్తుందని కొందరు చెప్తుంటారు. అంతేకాదు.. గతంలో అది మాయమై .. మరొచోట ప్రత్యక్షమైన సందర్భాలు కూడా ఉన్నాయట. ఏదేమైనా ఆ బొమ్మకు మంచి స్థానం కల్పించకపోతే కోపం వచ్చి ఏదో ఒక చెడు చేస్తుందనే నమ్మకం బలంగా ముద్రపడడంతో.. ఇప్పటికీ దానిని భద్రంగా చూసుకుంటున్నారు. ఈ బొమ్మ కథను ఆసరాగా చేసుకునే రాబర్ట్ సిరీస్‌లో నాలుగు సినిమాలొచ్చాయి కూడా. అలా ఓ సాధారణ బొమ్మ.. దెయ్యపు బొమ్మగా మ్యూజియంలో సకల మర్యాదలు అందుకుంటోంది. -
భూగర్భంలో వింత శబ్దాలు... భయాందోళనలో గ్రామం
ముంబై: మహారాష్ట్రాలోని లాతూర్ జిల్లాలో ఓ గ్రామంలోని భూగర్భంలో వింతవింత శబ్ధాలు గ్రామం అంతటా వస్తున్నాయి. దీంతో ఆ గ్రామంలోని నివాసితులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. హసోరి గ్రామంలో ఈ భూగర్భ శబ్ధాలు వస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఈ వింత శబ్ధాలకు గల కారణాల గురించి అధ్యయనం చేయమంటూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం నుంచి నిపుణలను అభ్యర్థించినట్లు చెప్పారు. హసోరి గ్రామం కిల్లారి నుంచి 28 కి.మీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో 1993లో ఘోరమైన భూకంపం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో దాదాపు 9700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఎటువంటి భూకంపాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఆ గ్రామంలో ఈ వింత శబ్దాలు సెప్టెంబర్ 6నుంచి భగర్భం నుంచి బిగ్గరగా వినిపిస్తున్నాయని, గ్రామస్తులంతా భయాందోళనలకు గురవుతున్నారని అధికారులు చెప్పారు. లాతూర్ జిల్లా కలెక్టర్ పృథ్వీరాజ్ఈ గ్రామాన్ని సందర్శించి ప్రజలకు భయందోళనలకు గురవ్వద్దని విజ్ఞప్తి చేశారు. అంతేగాదు మహారాష్ట్రాలోని నాందేడ్‌లోని స్వామి రామానంద్ తీర్థ మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల బృందం ఆ గ్రామాన్ని సందర్శించనుందని అధికారులు తెలిపారు. (చదవండి: సెల్ఫీ ఆనందంలో సెల్‌నే విసిరి ఆ తర్వాత...) -
శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన 'విచిత్ర జీవి': వీడియో వైరల్
సముద్రం ఎన్నో రకాల జీవుల సముదాయం. సమద్రం చీకటి లోతుల్లో నమ్మశక్యంకానీ జీవులను ఎన్నింటినో పరిచయం చేసింది. అలానే ఇప్పుడూ మరో మిస్టీరియస్ జీవిని మనకు పరిచయం చేస్తోందా అన్నట్లు ఉంది ఆ జీవి. ఆ జీవిన చూసి సముద్ర శాస్తవేత్తలు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ జీవి చూసేందుకు జీవిలా కాకుండా నీటి కుంటలా ఉంటుంది. ఈ జీవి అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. నేషనల్ ఓషియానిక్ అండ అట్మాస్సియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) ఓషన్ ఎక్స్‌ప్లోరర్ సిబ్బంది అట్లాంటిక్‌లో చేసిన యాత్రలో ఇది కనిపించింది. ఇది మృదువైన పగడపు స్పాంజ్ లేదా ట్యూనికేట్ కావచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది డెనిమ్ బ్లూ కలర్లో ఉంటుంది. కానీ ఇది ఇంకా ఒక అంతు చిక్కని జీవిగా మిస్టరీగానే ఉంది. ఆ విచిత్ర జీవికి సంబంధించిన వీడియోని ఎన్ఓఏఏ ఓషన్ ఎక్స్‌ప్లోరర్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ జీవిన 'బ్లూ గూ'[ జీవిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. Have you heard about the latest #Okeanos mystery? Seen multiple times during off St. Croix, this "blue #goo" animal stumped scientists, who thought it might be soft coral, sponge, or tunicate (but def not a rock!). More from Voyage to the Ridge 2022: https://t.co/feZj9IgCG3 pic.twitter.com/OM5hMaOr2m — NOAA Ocean Exploration (@oceanexplorer) September 7, 2022 (చదవండి: జిన్‌పింగ్ పుతిన్, మోదీని కలుస్తారా? నిరాకరించిన చైనా !) -
చియోంగ్ సిస్టర్స్ మిస్సింగ్.. ఇప్పటికీ మిస్టరీ గానే..!
కొన్నిసార్లు కథ ఏదో.. కట్టుకథ ఏదో తేల్చలేం! ఎవరిది నేరమో.. ఎవరిది న్యాయపోరాటమో.. గుర్తించలేం! ఏవి కన్నీళ్లో.. ఏవి కపటనాటకాలో ఊహించలేం. ఎవరు బాధితులో.. ఎవరు నిందితులో.. కనిపెట్టలేం! చియోంగ్ సిస్టర్స్ మిస్టరీ అలాంటిదే. అది 1997 జూలై 16. మారిజోయ్ చియోంగ్(21), జాక్వెలిన్ చియోంగ్(23) ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఫిలిప్పీనో–చైనీస్. సాయంత్రం ఆఫీస్ కాగానే.. ఇంటికి కలసి వెళ్లేందుకు.. ఫిలిప్పీన్స్‌లోని సెబు సిటీలో ఉన్న అయాలా మాల్ బయట కలుసుకున్నారు. కానీ రాత్రి పది దాటినా వాళ్లు ఇంటికి రాకపోయేసరికి.. మిస్టర్ డియోనిసియో, మిసెస్ థెల్మా చియోంగ్ దంపతులు పోలీస్‌స్టేషన్‌కి పరుగుతీశారు. అక్కడ ఆ వయసు పిల్లలు.. వారానికి ఒకసారి ఇంటికి రావడమే గొప్ప. దాంతో పోలీసులు కేసైతే నమోదు చేసుకున్నారు కానీ, పెద్దగా శ్రద్ధ చూపించలేదు. సరిగ్గా రెండు రోజులకు కార్కార్ సిటీకి చెందిన రూడీ లసాగా అనే స్థానికుడి నుంచి.. సెబు సిటీ సమీప లోయలో ఓ స్త్రీ మృతదేహం కనిపిస్తోందని పోలీస్‌స్టేషన్‌కి మరో కేసు వచ్చింది. కుళ్లిన దేహంపైన ఉన్న బట్టలను చూసి.. అవి మా అమ్మాయి మారిజోయ్వే అంటూ నెత్తినోరు బాదుకున్నారు చియోంగ్ దంపతులు. పోస్ట్‌మార్టమ్ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, బలవంతంగా లోయలోకి తోయడం వల్లే చనిపోయిందని తేలింది. మరి జాక్వెలిన్ ఏమైంది? ఫ్రాన్సిస్కో జువాన్ లారానాగా(పాకో), జోస్మాన్ అజ్నార్, రోవెన్ అడ్లావాన్, అల్బర్టో అలెన్ కానో, ఏరియల్ డెనిస్ రష్యాలతో పాటు జేమ్స్ ఆండ్రూ ఉయ్, జేమ్స్ ఆంథోనీ ఉయ్, (ఇద్దరూ సోదరులు, ఒకరు మైనర్) అనే ఏడుగురు యువకుల్ని అనుమానితులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పాకో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పది నెలల తర్వాత 1998 మే 8న నిందితుల్లో ఒకరైన డెనిస్ రష్యా నోరు విప్పాడు. ‘పాకో ప్రోత్సాహంతో ఆ రోజు అక్కాచెల్లెళ్లిద్దరినీ బలవంతంగా కారులోకి లాగారు. వెంటనే మేము ఏడుగురం వాళ్లని ఓ ఇంటికి తీసుకెళ్లి, వారిని రేప్ చేశాం నాతో సహా. తర్వాత వాళ్లంతా... ఆ అమ్మాయిలకు కళ్లగంతలు కట్టి.. సెబుకొండ లోయ దగ్గరకు తీసుకెళ్లి.. మారిజోయ్ని బలవంతంగా లోయలోకి తోసేశారు. జాక్వెలిన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. కారుతో వెంబడించి పట్టుకుని, ఆమెను రోవెన్ కొట్టాడు. తర్వాత అయాలా సెంటర్ దగ్గర నన్ను దించి, వెళ్లిపోయారు. ఆమెను ఏంచేశారో నాకు తెలియదు. ఈ మొత్తం కేసులో అమ్మాయిల కిడ్నాప్, హత్యలతో నాకు ఏ సంబంధం లేదు’ అంటూ సాక్ష్యం చెప్పాడు. అయితే పాకో, జోస్మాన్లు అసలు ఈ డెనిస్ ఎవరో తమకు జైలుకు వచ్చేవరకూ తెలియదని వాదించారు. థెల్మా.. డెనిస్‌ను కలసి.. సాక్ష్యం చెప్పినందుకు అతడికి బహుమతులు కూడా ఇచ్చింది. అది చాలామందికి గిట్టలేదు. డెనిస్ ఇచ్చిన వాగ్మూలంతో కేసు కీలక మలుపు తిరిగే సమయంలో.. ఈ కేసు విచారణ చేసిన న్యాయమూర్తి మార్టిన్ ఓకాంపో ఓ హోటల్లో 1999 అక్టోబర్ 9న.. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఓకాంపోది కచ్చితంగా హత్యేనన్నది చాలామంది నమ్మకం. ఎందుకంటే డెనిస్ రష్యాను క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్న సమయంలో ఓకాంపో.. డెనిస్ తరపున ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. పైగా పాకో జూలై 16న సెబులో లేనేలేడని, మనీలాలోని పాఠశాలలో ఉన్నాడని 40 మంది సాక్ష్యం చెప్పారు. అయితే వారంతా పాకో సన్నిహితులేనన్న కారణంతో ఆ సాక్ష్యాలు చెల్లవని ఓకాంపో తీర్పునిచ్చాడు. మొత్తానికి 2004లో పాకో బృందాన్ని నేరస్థులుగా నిర్ధారిస్తూ.. మైనర్, డెనిస్ రష్యాకు మినహా మిగిలిన వారికి మరణశిక్ష విధించింది ఫిలిప్పీన్స్ సుప్రీంకోర్టు. దాంతో ఈ తీర్పుపై స్పెయిన్ ప్రభుత్వం కలగజేసుకుంది. దానికి కారణం పాకో... ఫిలిప్పినో–స్పానిష్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన వ్యక్తి కావడమే. ఈ క్రమంలోనే మరో అంశం తెరమీదకు వచ్చింది. మిస్టర్ డియోనిసియో.. మాదకద్రవ్యాల వ్యాపారవేత్త పీటర్ లిమ్స్ దగ్గర కొన్నాళ్లు పని చేశాడని, చియోంగ్ సిస్టర్స్ మిస్ అవ్వడానికి ముందు.. మిస్టర్ చియాంగ్ లిమ్స్కి వ్యతిరేకంగా డ్రగ్స్ కేసులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడ్డాడని, మిస్సింగ్ తర్వాత సాక్ష్యమివ్వడానికి నిరాకరించా డని తేలింది. దాంతో మానవహక్కుల సంఘం పాకో వెనుకే నిలబడింది. స్పెయిన్ ప్రభుత్వ ప్రభావంతో 2006లో వారి మరణశిక్ష రద్దు అయింది. పైగా 2011లో ‘గివప్ టుమారో’ అంటూ పదిహేనేళ్ల పాటు నిర్దోషి అయిన పాకో శిక్ష అనుభవిస్తున్నాడని.. ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది అతడి కుటుంబం. దాంతో సగానికి సగం మంది పాకో తప్పు చేసి ఉండడని నమ్మడం మొదలుపెట్టారు. నిజంగానే చియోంగ్ కుటుంబం ఏదో దాస్తోందనే అనుమానాలు బలపడ్డాయి. సరిగ్గా అప్పుడే కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అవేంటంటే.. మారిజోయ్, జాక్వెలిన్ పోలికల్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు.. తమ భర్తలతో, పిల్లలతో కలసి దిగిన ఫొటోలు. ఆ ఫొటోల్లో.. థెల్మా, డియోనిసియోలు కూడా ఉన్నారు. వాటిని చూసి.. ఈ కథ తెలిసిన వాళ్లు నోరెళ్లబెట్టారు. ‘చియోంగ్ సిస్టర్స్ బతికే ఉన్నారా? పెళ్లిళ్లు కూడా చేసుకున్నారా? వేరీజ్ జస్టీస్?’ అంటూ నిందితుల వర్గం విస్తృత ప్రచారం చేసింది. అయితే అదంతా మార్ఫింగ్ మాయాజాల మని కొట్టి పారేసేవారూ లేకపోలేదు. చివరికి ద్వంద్వ పౌరసత్వాన్ని ఉపయోగించుకుని పాకో.. స్పెయిన్ జైలుకు బదిలీ అయ్యాడు. మిగిలిన వారు ఫిలిప్పీన్స్‌లోనే శిక్ష అనుభవిస్తున్నారు. శిక్ష పూర్తి అయ్యేసరికి పాకోకి 61 ఏళ్లు వస్తాయి. అయితే పాకో.. స్పెయిన్‌లో శిక్షను అనుభవిస్తూనే.. కొన్ని ఆంక్షల మధ్య.. పార్ట్‌టైమ్‌గా ఓ హోటల్లో షెఫ్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు అతడ్ని నమ్మేవాళ్లు, అతడ్ని స్ఫూర్తిగా తీసుకునేవాళ్లు ఫిలిప్పీన్స్‌లో చాలామందే ఉన్నారు. ఈ కథలో చియోంగ్ స్టిస్టర్ తల్లి థెల్మా ఎంత ఏడ్చిందో.. పాకో తల్లి మార్గరీటా కూడా అంతే ఏడ్చింది. అంతే పోరాటం చేసింది. ఏది ఏమైనా ఈ కథలో పాకో దోషో, నిర్దోషో తేలనే లేదు. చియోంగ్ సిస్టర్స్ బతికే ఉన్నారా? అనే ప్రశ్నలకి ఆ ఫొటోలు తప్ప మరో సాక్ష్యం లేదు. నిజంగానే పాకో బృందం నేరం చేసి ఉంటే.. జాక్వెలిన్ ఏమైంది? చియోంగ్ సిస్టర్స్ బతికే ఉంటే.. ఆ రోజు దొరికిన మృత దేహం ఎవరిది? ఇలా వేటికీ సమాధానాలు లేవు. ∙సంహిత నిమ్మన -
వింత జీవి సంచారం.. టెన్షన్లో స్థానికులు!
ప్రపంచంలో మానవ కంటికి కనిపించని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భూమి మీద చోటుచేసుకునే వింతలను చూసి నిజమేనా అని షాక్ అవుతుంటాము. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. టెక్సాస్‌లోని అమారిలో పట్టణంలో ఓ వింత జీవి ఫొటో అక్కడున్న వారిని కలవారపాటుకు గురిచేస్తోంది. టెక్సాస్‌లోని ఒక ‘జూ’లో మే 21వ తేదీన అర్ధరాత్రి 1:25 సమయంలో రెండుకాళ్లపై ఓ జీవి నిలబడి ఉంది. ఈ క్రమంలో జూలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో ఇది రికార్డు అయ్యింది. అయితే, ఆ జీవి జూ అవతల ఫెన్సింగ్ దగ్గర ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. ఇక, ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో ఫొటోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అది నిజంగా వింత జీవేనా? లేక ఎవరైనా మనుషులే అలాంటి గెటప్‌లో వచ్చారా? అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ, దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు జూ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు. What is it? Strange image caught on camera at Texas zoo. DETAILS >>> https://t.co/W3Xxgycw5Y pic.twitter.com/o9gGAk61kY — WFTV Channel 9 (@WFTV) June 9, 2022 ఇది కూడా చదవండి: సర్పంతో మహిళ సహజీవనం.. ఆమె సమాధానం విని ఊరంతా సైలెంట్! -
ఏం కష్టం వచ్చిందో పాపం...ఒకే కుటుంబంలోని ఐదుగురు ఏడవ అంతస్తు నుంచి దూకి...
A Family Of 5 Mysteriously Jumped: ఇంతవరకు చాలా మంది ఏవేవో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోవడం గురించి విన్నాం. ఆర్థిక సమస్యల వల్లనో లేక భయంకరమైన సమస్యలకు తాళలేక చనిపోయిన ఘటనలు చూశాం. ఇక్కడ ఒక కుటుంబంలోని సభ్యులు ఏ కారణం లేకుండా అది కూడా ఉన్నత కుటుంబ నేపథ్యం ఉండి ఒకేసారి ఐదుగురు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈఘటన స్విట్జర్లాండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...స్విట్జర్లాండ్‌లోని మాంట్రిక్స్‌లో ఫ్రెంచ్ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఏడవ అంతస్తు బాల్కనీ నుంచి దూకేశారు. అయితే వారు తమ కొడుకుని పాఠశాలకు పంపిచంకుండా ఇంటి వద్ద చదివించడానికి గల కారణాలు విచారంచేందుకు పాఠశాల అధికారులు ఇంటికి వచ్చారు. అయితే వారు ఎంత తలుపు కొట్టిన ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో వాళ్లు వెళ్లిపోయారు. అయితే కాసేపటికి ఒక ఇంటిలోని సభ్యులు బాల్కని నుంచి దూకేశారంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి రాగానే కుటుంబ సభ్యులలోని నలుగురు చనిపోయారు ఆ బాలుడు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబం మొత్తం ఫ్రెంచ్ పౌరులని, వారు స్విట్జర్లాండ్‌లో చాలా ఏళ్లుగా నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ కుటుంబం చాలా రిజర్వ్డ్ ఉంటుందని పెద్దగా ఎవరితో కలవరని స్థానికులు చెబుతున్నారని అన్నారు. అయితే బాలుడిని పాఠశాలకు పంపిచంకుండా హోం స్కూల్లో చదవించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు రావడంతోనే ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మెదటు పెట్టారు. (చదవండి: రక్త ప్రవాహంలో మైక్రోప్లాస్టిక్ కణాలు...నిత్యం వాడే ప్లాస్టిక్కే) -
సాగర కన్యలు ఉన్నది నిజమే! ఔను అంటున్న జపాన్ శాస్త్రవేత్తలు
మనం సినిమాల్లో సాగర కన్యలు(మత్స్య కన్య) చూశాం. కానీ నిజంగా అవి ఉన్నాయా? అనేది మాత్రం అందరి మదిలో మెదిలే ప్రశ్నే. డిస్కవరీ ఛానెల్స్‌లో వాటి గురించి చెబుతుంటారు కానీ రియల్‌గా మాత్రం వాటిని ఎవరు చూసి ఉండే అవకాశం లేదు. అయితే జపాన్ శాస్త్రవేత్తలు మాత్రం సాగర కన్యలు ఉన్నాయంటున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలతో సహా వివరిస్తున్నారు. వివరాల్లోకెళ్తే...మానవ ముఖం, తోకతో ఉన్న 300 ఏళ్ల నాటి మత్సకన్య మమ్మీని చూసి శాస్తవేత్తలు ఆశ్చర్యపోయారు. మత్స్య కన్య ఆకారంలో ఉన్న ఈ మమ్మీని జపాన్ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. 1736 మరియు 1741 మధ్యకాలంలో జపనీస్ ద్వీపం అయిన షికోకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 12 అంగుళాల మర్మమైన జీవి పట్టుబడిందని చెబుతున్నారు. ఈ మత్స్య కన్య మమ్మీ పసిఫిక్ మహాసముద్రంలో చేపలు పట్టే వలలో చిక్కుకుందని పేర్కొంటూ ఒక లేఖ దొరికిందని కూడా అన్నారు. ఆ తర్వాత ఎండిన మత్స్య కన్యను ఒక కుటుంబం పర్యవేక్షించిందని తదనంతరం అసకుచి నగరంలోని ఒక దేవాలయంలో ఉందని చెప్పారు. ఈ మమ్మీకి దంతాలు, ముఖం రెండు చేతులు, తల, నుదురుపై వెంట్రుకలు ఉన్నాయన్నారు. ఎగువ భాగం మానవ రూపంలోనూ, దిగువ భాగం చేప లక్షణాలను కలిగి ఉందని తెలిపారు. శరీరం దిగువ భాగంలో పొలుసులు, తోక-వంటి టేపర్డ్ ఎండ్ ఉంటుందని చెప్పారు. కురాషికి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు వీటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయనుంది. జపనీస్ మత్స్యకన్యలకు అమరత్వపు పురాణం(యావో-బికుని) ఉందని, మత్స్యకన్య మాంసం తింటే ఎప్పటికీ చనిపోరు అని ఒకాయమా ఫోక్లోర్ సొసైటీకి చెందిన హిరోషి కినోషిత చెబుతున్నారు. ఈ పురాణం కుడా ఆ మత్య్స కన్య దొరికిన ఆలయంలోనే ఉందని చెప్పారు. ఆ పురాణాన్ని నమ్మే కొందరు మత్య్స కన్య పొలుసులను చెవిలో పెట్టుకుంటారని అన్నారు. ఆ మత్స్య కన్యలు అంటు వ్యాధులను దూరం చేస్తాయని జపాన్ వాసుల ప్రగాఢ నమ్మకం అని కూడా చెప్పారు. (చదవండి: చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం!...రష్యా బలగాలు ముట్టడించకుండా చేసేందుకు యత్నం!) -
ఆకాశంలో వింత.. అంతు చిక్కని రహస్యం!
Mysterious flying object hangs above Pak city: విశాల విశ్వంలో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చేసిన అంతరిక్షి పరిశోధనల్లో చాలా వరకు అంతు చిక్కని రహస్యలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాలను చేధించే ప్రయత్నంలో తలామునకలవుతునే ఉన్నారు. కానీ ఇప్పటికి అంతుబట్టిన చిదంబర రహస్యంలా గగనంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. అచ్చం అలానే ఒక వింతైన అద్భుతం ఆకాశంలో కనిపించింది. ఈ ఘటన ఇస్లామాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఇస్లామాబాద్‌కి చెందిన ఒక గ్రహాంతర జౌత్సాహికుడు అర్స్లాన్ వార్రైచ్ ఆకాశలో ఎగురుతున్న రాయిని చూశాడు. అతను తన డ్రోన్లను ల్యాండ్ చేయబోతున్నప్నుడు ఆకాశంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. చూసేందుకు నల్లటి గుండ్రపు రాయిలా ఉందని కెమెరాలో జూమ్ చేసి చూస్తే ఒక ఉబ్బెత్తిన త్రిభుజాకారంలో ఉందని చెప్పాడు. అంతేకాదు ఆకాశంలో ఈ వింత రెండు గంటలకు పైనే కనువిందు చేసిందని అన్నాడు. ఈ మేరకు అతను ఆ వింతైన వస్తువు ఆకాశంలో వేలాడిదీసినట్టుగా ఉన్న దానిని రకరకాల యాంగిల్స్‌లో వీడియో రికార్డు చేశాడు. అంతేకాదు వార్రైచ్ ఆ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: సైకిల్ రైడర్ల పై ఘోరంగా దాడి చేసిన ఎద్దు!) -
భయానకం: మత్స్యకారుడిని వెంటాడిన వింత జీవి.. వీడియో వైరల్
ఈ ప్రపంచలో వింతలు, విశేషాలకు కొదవే లేదు. నింగి, నేల, నీరు.. ఇలా ప్రతి చోట ఎప్పుడో ఒకసారి ఊహకందని వింత సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. వీటిలో కొన్నింటిని చేధించినప్పటికీ మరికొన్ని మిస్టరీలానే మిగిలిపోతుంటాయి. ఇప్పటికే భూమ్మీద కొన్ని లక్షల రకాల జీవులను గుర్తించినా.. నిత్యం కొత్త రకమైన జీవులు బయటపడుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే బ్రెజిల్లో చోటుచేసుకుంది. ఓ వింత జీవికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దక్షిణ బ్రెజిల్‌లోను కోస్ట్‌లో ఓ వ్యక్తి రాత్రి పూట చేపల వేటకు వెళ్లాడు. స్టీమర్‌తో వేట సాగిస్తుండగా.. సముద్రం నుంచి ఒక్క సారిగా ఓ వింత ఆకారంతో కూడిన జీవి బయటకు వచ్చింది. ఆ జీవి మత్స్యకారుడి బోటును వెంటాడింది. స్టీమర్ వేగంతో పోటీ పడి మరీ నీళ్ల మీద ఎగురుతూ వ్యక్తిని వెంబడించింది. అది నీళ్లలో నుంచి పైగి లేచినప్పుడు దాని కళ్లు మెరుస్తూ కనిపించాయి. దీన్ని ఆ వ్యక్తి తన కెమెరాలో బంధించగా.. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన అకౌంట్లో షేర్ చేశారు. చదవండి: జస్ట్ మిస్.. లేదంటే తలకాయ్ నిమ్మకాయలా నలిగేది.. వీడియో వైరల్! Criatura misteriosa perseguiu um barco ontem no Rio Grande do Sul. Segue o fio para descobrir que monstro é esse nessa #BioThreadBr pic.twitter.com/chOfZ5d0VK — Pedrohenriquetunes (@PedroHTunes) January 27, 2022 ఆ వింత జీవి కళ్లు మెరుస్తూ ఉండటం.. వేగంగా ఆ వ్యక్తిని వెంబడించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీన్ని చూస్తుంటే భయం కలుగుతోంది. అయితే ఇంతకీ అది ఏ జీవీ అనేది మాత్రం కనుగొనలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చదవండి: బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. -
మునుపెన్నడూ చూడని వింత.. ఏలియన్ల పనికాదట! మరి..
ఖగోళంలో మునుపెన్నడూ చూడని వింత ఒకటి పరిశోధకుల కంట పడింది. స్పేస్‌లో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంతలో దీనిని రీసెర్చర్లు గుర్తించారు. ప్రతి 18.18 నిమిషాలకు ఓ రేడియో తరంగాన్ని అది భూమికి పంపిస్తోందని అంటున్నారు స్పేస్ సైంటిస్టులు. విశేషం ఏంటంటే.. డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఓ స్టూడెంట్ మొదట దానిని గుర్తించినట్లు తెలుస్తోంది. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ అర్రేలో టెలిస్కోప్ సాయంతో ఆ వింతను గుర్తించగా.. ‘అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్’గా దానికి పేరు పెట్టారు. ఆ వింత వస్తువేంటన్నది తేల్చే పనిలో ఉన్నారు నటాషా హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త. భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ వింత.. కాంతిమంతంగా ఉందని, దాని అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని గుర్తించారు. ఎప్పటి నుంచో అది పాలపుంతలో ఉండి ఉండవచ్చునని, అయితే, ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మొదట ఆ సిగ్నళ్లు ఏలియన్స్ పనేనని అనుకున్నారట నటాషా. కానీ, అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు రకరకాల తరంగదైర్ఘ్యాలతో ఉన్నాయని నటాషా చెప్పారు. కాబట్టి అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని ఒక అంచనాకి వచ్చారు. బహుశా న్యూట్రాన్ స్టార్‌గా భావిస్తున్న ఆ వింత వస్తువును.. భారీ నక్షత్రం బద్ధలు కావడం వల్ల ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే నక్షత్రాల పుట్టుకపై జరుగుతున్న అధ్యయనానికి ఈ పరిశోధన ఎంతో సాయం చేసినట్లు అవుతుంది. చదవండి: ఏడేళ్ల కిందట గతి తప్పిన ఎలన్ మస్క్ రాకెట్.. ఇప్పుడు చంద్రుడి మీదకు రయ్! -
ఆ గ్రామాల్లో వింత శబ్ధాలు.. వణికిపోతున్న ప్రజలు.. ఎందుకిలా..?
పలమనేరు: పల్లెల్లో ఎన్నడూ లేనివిధంగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి వచ్చిన కాసేపటికి భూమి అదిరినట్లు అవుతోంది. దీంతో ఎప్పుడేమి జరుగుతుందోననే భయంతో గ్రామీణ ప్రజలు సమీపాల్లోని అడవుల వద్ద ఉన్న వెడల్పాటి బండలపై గడుపుతున్నారు. పలమనేరు, బైరెడ్డిపల్లి మండలాల సరిహద్దుల్లో కౌండిన్య అడవికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతంలోనే ఎందుకు శబ్దాలు వస్తున్నాయనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. చదవండి: నమ్మకం మాటున మోసం.. శ్రీశైలం వెళ్తున్నామంటూ.. తొలుత కరిడిమొడుగులో.. నాలుగు రోజుల క్రితం పలమనేరు మండలం కరిడిమొడుగు, సంబార్‌పూర్, నలగాంపల్లి ప్రాంతాల్లో వింతశబ్దాలు వినపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆపై తల తిరిగినట్లైందని, ఇళ్లలోని వస్తువులు కిందపడినట్లు అధికారులకు తెలిపారు. ఈ ప్రాంతానికి సమీపంలోని బైరెడ్డిపల్లి మండలంలో నెల్లిపట్ల పంచాయతీ కౌండిన్య అడవికి ఆనుకుని ఉంటుంది. రెండురోజుల క్రితం ఓటేరుపాళెం, నల్లగుట్లపల్లి, తిమ్మయ్యగారిపల్లి, ఎస్సీకాలనీ గ్రామాల్లోనూ వింత శబ్దాలు వచ్చాయి. గంటకోసారి, అరగంటకోసారి శబ్దాలు రావడంతో ఇంటి గోడలకు బీటలు పడడం, కళ్లు తిరిగినట్లు కావడంతో ఆ గ్రామాల ప్రజలు సమీపాల్లోని బండలపైకి వెళ్లారు. మండలంలోని పలుశాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి వెళ్లాక కూడా శబ్దాలు వస్తుండడంతో విధి లేక గ్రామీణులు గురువారం రాత్రి సైతం బండలపైనే జాగారం చేశారు. చదవండి: వైరల్: ఆవులపై పోలీసులకు ఫిర్యాదు.. ఇదేందిరా నాయనా.. ఈ ప్రాంతంలోనే ఎందుకిలా.. కౌండిన్య అడవికి సమీపంలోని ఏడు గ్రామాల్లోనే ఇలా శబ్దాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఏడాది క్రితం 700 నుంచి 1200 అడుగుల దాకా వ్యవసాయబోర్లు డ్రిల్ చేస్తే గానీ గంగ జాడ కనిపించేంది కాదు. ఇటీవల ఈ ప్రాంతంలోనే వర్షాలు ఎక్కువ కురిశాయి. దీంతో భూగర్భజలాలు భారీగా పెరిగాయి. దీంతో గతంలో భూమిలోపల ఖాళీగా ఉన్న పొరల మధ్య నీరు చేరడంతో అక్కడ ఏర్పడే ప్రకంపకనలతో భూమిలో నుంచి వచ్చే శబ్దాలు పైకి భయంకరంగా వినిపిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. సంబంధిత శాఖలైన భూగర్భజలాలు, భూకంపాలను పరిశీలిందే సిస్మోగ్రాఫర్లు ఈ ప్రాంతానికి వచ్చి స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈవిషయమై పలమనేరు తహసీల్దార్ కుప్పుస్వామిని వివరణ కోరగా ఆ గ్రామాల్లో శబ్దాలు వస్తున్న మాట వాస్తవమేనన్నారు. అయితే భూమిలోపలి పొరల్లో నుంచి ఈ శబ్దాలు వస్తున్నాయని, సంబంధిత నిపుణులు పరిశీలించాక గానీ దీనిపై ఓ స్పష్టత రాదన్నారు. -
భారీ శబ్దం కలకలం : ‘భూకంపం సంభవించిందా ఏంటి’
బెంగళూరు: కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు సమీప ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భారీ శబ్దం వినిపించి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ శబ్దం ముఖ్యంగా బిదాది ప్రాంతం నుంచి వెలువడినట్లు.. బాంబు పేలినప్పుడు ఎంత భారీ శబ్దం వినిపిస్తోందో.. అలాంటి సౌండే వినిపించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ బారీ శబ్దం వల్ల జనాలు తీవ్ర ఆందోళనకు, గందరగోళానికి గురయ్యారు. భూకంపం వచ్చిందా.. లేక ఎక్కడైనా భారీ పేలుడు సంభవించిందా అంటూ నెటిజనులు సోషల్ మీడియాలో ప్రశ్నల మోత మోగించారు. ఇక ఈ వింత శబ్దంపై కర్ణాటక పోలీసులు స్పందించారు. బెంగళూరు, దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి పేలుడు సంభవించలేదని తెలిపారు. అలానే రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రం భారీ శబ్దం వినిపించిందని పేర్కొంటున్న ప్రాంతాల్లో ఎలాంటి భూకంపం చోటు చేసుకోలేదని.. అలానే భూమి పొరల్లో కూడా ఎక్కడా.. ఎలాంటి మార్పులు జరగలేదని తెలిపారు. (చదవండి: కర్ణాటక: ఆ ప్రాంతం మరో గోవా కానుంది..) ‘‘అంతేకాక భారీ శబ్దం వినిపించింది అంటున్న సమయంలో ఏదైనా భూకంప సంకేతాలు వెలువడ్డాయా లేదా అని తెలుసుకోవడం కోసం భూకంప పరిశీలనల కేంద్రం డేటాను విశ్లేషించడం జరగింది. సీస్మోగ్రాఫ్‌లు స్థానికంగా ఎలాంటి ప్రకంపనలు, భూకంపం సంకేతాలను చూపించలేదు’’ అని అధికారులు తెలిపారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మరీ ఈ శబ్దం ఎక్కడ నుంచి వెలువడింది.. దానికి కారణం ఏంటనే దాని గురించి శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. (చదవండి: భారీ భూకంపం.. శవాల దిబ్బగా హైతీ) ఇక 2021, జూలై 2న బెంగళూరులో ఇదే తరహా శబ్దం వినిపించింది. బెంగళూరులో జూలై 2న కూడా ఇదే విధమైన ధ్వని వినిపించింది, ఇది ధ్వని వేగం కంటే వేగంగా వెళ్లినప్పుడు జెట్ విమానం నుంచి వెలువడే సోనిక్ బూమ్ అని భావించారు. బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాలను పరీక్షించే సమయంలో ఈ శబ్దం వెలువడినట్లు భావించారు. అయితే భారత వైమానిక దళం సోనిక్ బూమ్ వాదనను ఖండించింది. మరోసారి ఇదే తరహా శబ్దం వినిపించడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: పడిలేచిన పట్టణం.. ఇక్కడికి వెళ్తే యూరప్ చూసినట్లే! -
బండరాయి నుంచి ఉబికి వస్తున్న నీరు
-
ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు రహస్య సొరంగం
Secret Tunnel In Delhi: ఢిల్లీ శాసనసభ వద్ద రహస్యం సొరంగాన్ని గుర్తించారు. ఈ సొరంగం శాసనసభ నుండి ఎర్రకోటను కలుపుతుందని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ వెల్లడించారు. స్వాతంత్య్ర సమర యోధులను తరలించేందుకు అప్పట్లో బ్రిటీస్ పాలకులు దీన్ని వినియోగించేవారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ ప్రదేశం చాలా గొప్ప చరిత్రను కలిగి ఉన్న దీన్ని పర్యాటకులు ,సందర్శకుల కోసం దీనిని పునరుద్ధరించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. 1993లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో ఎర్రకోట వరకు వెళ్లే సొరంగం ఉందని వార్తలు వినిపించాయి. దాని చరిత్రను వెతకడానికి ప్రయత్నించాను. కానీ దానిపై ఎటువంటి స్పష్టత లభించలేదని గోయల్ తెలిపారు. అయితే ఆ సొరంగ ద్వారం ఇప్పుడు బయటపడిందని, మెట్రో ప్రాజెక్టులు, మురుగు నీటి వ్యవస్థల కారణంగా ఈ సొరంగ మార్గాన్ని మరింత తవ్వే ఉద్దేశం లేదని అన్నారు. 1912లో కోల్‌కతా నుండి దేశ రాజధానిని ఢిల్లీకి మార్చిన తర్వాత, అక్కడ అసెంబ్లీని 1926లో కోర్టుగా మార్చారని, స్వాతంత్య సమర యోధులను కోర్టుకు తీసుకువచ్చేందుకు బ్రిటీషర్లు ఈ సొరంగాన్నే వినియోగించేవారని చెప్పారు. ఉరిశిక్షలకు ఉపయోగించే గది ఉందని తెలుసు కానీ దాన్నేప్పుడూ తెరవలేదన్నారు. 75 వసంతాల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా వారికి నివాళిగా ఆ గదిని స్వాతంత్య్ర సమరయోధుల మందిరంగా మార్చాలని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఢిల్లీ శాసన సభకు చరిత్ర ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది స్వతంత్య్ర దినోత్సవ వేడుకల నాటికి ఈ గదిని పర్యాటకుల కోసం తెరచి ఉంచాలని భావిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే సంబంధిత పనులను ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు. A tunnel-like structure discovered at the Delhi Legislative Assembly. "It connects to the Red Fort. There is no clarity over its history, but it was used by Britishers to avoid reprisal while moving freedom fighters," said Delhi Assembly Speaker Ram Niwas Goel (2.09) pic.twitter.com/OESlRYik69 — ANI (@ANI) September 2, 2021 -
కిమ్ తల వెనుక మిస్టీరియస్ స్పాట్!
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(37) ఆరోగ్యంపై మళ్లీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన తల వెనుక భాగంలో బ్యాండేజీ, తర్వాత పెద్ద మచ్చ కనిపించడమే ఇందుకు కారణం. అది మిస్టీరియస్ స్పాట్ అంటూ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. జూలై 24 నుంచి 27 దాకా జరిగిన కొరియన్ పీపుల్స్ ఆర్మీ కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తల వెనుక భాగంలో బ్యాండేజీ ఉన్న దృశ్యాలు టీవీలో ప్రసారమయ్యాయి. తర్వాత ఈ బ్యాండేజీ లేదు. దానికింద ఉన్న మచ్చ కనిపించింది. కిమ్‌కు ఏం జరిగినా, ఆయన ఏం చేసినా, ఎవరితో మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో బాగా లావుగా కనిపించిన కిమ్ జోంగ్ ఉన్న జూన్‌లో చాలా సన్నబడ్డారు. ఈ వార్త ఉ.కొరియా శత్రుదేశాల్లో చర్చనీయాంశమైంది. భారీ కాయంతో కంటికి నిండుగా కనిపించే తమ అధినేత బక్క పలుచగా మారడాన్ని చాలామంది ఉత్తర.కొరియన్లు తట్టుకోలేకపోయారట. కొందరైతే కన్నీరు పెట్టుకున్నారట! కిమ్ ఆరోగ్యం విషయంలో ప్రస్తుతం అసాధారణ సంకేతాలేవీ లేవని, ఆయన బాగానే ఉన్నారని ఉత్తర కొరియాకు శత్రు దేశమైన దక్షిణ కొరియా నేషనల్ ఇంటలిజెన్స్ సర్వీసు చెబుతోంది. కిమ్ జోంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్‌కు తల వెనుక భాగంలో టెన్నిస్ బంతి సైజ్‌లో కణితి ఉండేది. -
ఇంత వరకు వర్షం కురవని వింత గ్రామం.. ఎక్కడో తెలుసా!
పుడమి అంటే అద్భుతాలకు పుట్టిల్లు. ఈ ప్రపంచంలో మనకి తెలియని ఎన్నో వింతలు.. మరెన్నో విచిత్రాలు దాగున్నాయి. భూమిపై ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా వర్షం కురుస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. కానీ, ఓ గ్రామంలో మాత్రం ఇప్పటి వరకు వర్షం కురవలేదంటే నమ్మగలరా? ఇదేంటి వింత అనుకుంటున్నారా ! అలాంటి ఓ వింత ప్రదేశాం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే.. ప్రపంచంలో అత్యధిక వర్షాలు మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామంలో కురుస్తుందని తెలిసిన విషయమే కానీ అసలు వర్షం కురవని గ్రామం కూడా ఉందట. ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంటుంది. కాగా ఈ గ్రామం భూమికి 3200 మీటర్ల ఎత్తులో ఉన్న ఓ కొండపై ఉంది. దీని ప్రకారం మేఘాల కంటే ఎత్తులో ఆ గ్రామం ఉన్నదన్న మాట. మేఘాల కంటే ఎత్తులో ఉండటం వలన ఈ ప్రాంతంలో వర్షాలు కురవడం లేదు. అక్కడ వాతావరణ విషయానికొస్తే ఉదయం పూట ఎండ, రాత్రి సమయం చలిగా ఉంటుంది. అక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా ఆ వాతావరణం అలవాటే. కాగా ఆ వింత ప్రాంతాన్ని చూసేందుకు టూరిస్టులు తాకిడి బాగానే ఉంటుందట. -
వింత పదార్థం.. దీని గురించి తెలిస్తే మాకు చెప్పండి..
సాధారణంగా మనం ఎప్పుడూ చూడని కొత్తవి, వింతవి ఎదురుగా కనిపిస్తే ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోతాం. ఒకవేళ అవి భయంకరంగా, వికారంగా ఉంటే మాత్రం భయపడతాం. ఈ విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా సముద్రాల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సముద్ర అడుగు భాగంలో ఇప్పటి వరకూ గుర్తించని, ఏముందో కనిపెట్టని జీవులూ ఉంటాయి. అచ్చం అలాంటి ఓ వింత పదార్థాన్ని నార్త్ కరోలినా తీరంలో నేషనల్ పార్క్ అధికారులు కనుగొన్నారు. ఇది చూడటానికి గజిబిజీగా, చాలా పెద్దగా ఉంది. కేప్ లుకౌట్ నేషనల్ సీషోర్ ఫేస్బుక్లో షేర్ చేసిన దీనికి కాళ్లు, చేతులు, తల వంటి భాగాలు కూడా లేవు. ‘అంతుచిక్కని పదార్థం’ అని క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫోటోలో ఉన్న జీవి కొన్ని నెలల క్రితమే సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో పంచుకోవడంతో దీన్నిచూసిన వారంతా ఏంటని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. దీని ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారుతున్నాయి. దీనిని గుర్తించడంలో అధికారులు ప్రజల సలహా కోరుతున్నారు. ఇదొక ప్రమాదకరమైన జీవి అనుకొని స్థానికులందరూ భయపడుతున్నారు. కాగా ఇది చేపలాగా ఉంటే స్క్విడ్ గుడ్డు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది అనేక ఆకారాలను కలిగి ఉంది. చిన్న చిన్న తెలుపు రంగు బాల్స్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘బీచ్ మిస్టరీ - ఈ రహస్యమైన జంతువేంటో ఏమిటో మీకు తెలుసా? ఇది కొన్ని నెలల క్రితం బీచ్‌లో కనుగొన్నాం.. ఇప్పటివరకు దీనిని గుర్తించలేకపోయాం. అయితే ఇది స్క్విడ్‌కు చెందిన గుడ్డుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా తెలియదు. ఎవరైనా గుర్తించడంలో మాకు సాయం చేయగలరా అని పేర్కొన్నారు.’ కాగా ఈ పోస్టుపై స్పందించిన చాలామంది అవి స్క్విడ్ గుడ్లు అని చెప్పి, వాటిని తిరిగి సముద్రంలో వదిలి పెట్టమని అధికారులను కోరారు. -
భారత్‌లో మిస్టరీ రాయి.. ఏలియన్స్ పనేనా?
అహ్మదాబాద్: 2020లో భూమి మీద చాలా వింతలు జరిగాయి. గతంలో ఎప్పుడూ చూడని ఓ కొత్త మహమ్మారి (కరోనా వైరస్) ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రజలను అడుగు బయటపెట్టనీయకుండా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నెలల నుంచి మిస్టరీ మోనోలిత్ (ఏకశిల రాయి) ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నిర్మాణాలను చూస్తూంటే.. గ్రహాంతర వాసులే ఈ పని చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో కనిపించి ఆశ్చర్యపరిచిన మోనోలిత్ రాయి ఇప్పుడు మన దేశంలో ప్రత్యక్షమైంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరంలోని ఒక పబ్లిక్ పార్క్ వద్ద 'మిస్టీరియస్ మోనోలిత్' ని చూసినట్లు ప్రజలు చెప్పారు. ఇది 6 అడుగుల పొడవుతో ఏకశిలా లోహంతో తయారైనట్లుగా ఉన్నది. భారతదేశంలో ఇటువంటి ఏకశిలా చూసిన మొదటి ప్రాంతం ఇదే. ఈ లోహపు నిర్మాణం భూమిపై నిర్మించినట్లుగా కనిపిస్తోంది. దీని నిర్మాణం కోసం భూమిని తవ్విన ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. బేస్ మట్టం కూడా ఎక్కడా లేదు. అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అనేది మిస్టరీగా మారింది. పార్కులో ఈ మోనోలిత్ ఏకశిలను ఎవరు నిర్మించారో తానెప్పుడూ చూడలేదని పార్కులో పనిచేసేవారు అంటున్నారు. ఏకశిల పైభాగంలో ఏవో సంఖ్యలు కనిపిస్తున్నాయి. వాటి అర్థం ఏంటో తమకు తెలియదని అంటున్నారు పార్కు నిర్వాహకులు. ‘సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో అది అక్కడ లేదు. మరుసటి రోజు ఉదయం తిరిగి పనికి తిరిగి వచ్చినప్పుడు ఈ విచిత్ర నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయాను" అని తోటమాలి తెలిపారు. పార్కుకు సంబంధించిన అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఈ మోనోలిత్ ఏకశిల ఫొటోలను షేర్ చేశారు. ఈ మిస్టరీ నిర్మాణం త్రిభుజాకారంగా కనిపిస్తోంది. ఉపరితలంపై కొన్ని సంఖ్యలు, చిహ్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు ఈ ఏకశిలా పార్కులోకి ఎలా వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఈ మోనోలిత్ ముందుగా అమెరికాలోని ఉటా ఎడారిలో గుర్తించబడింది. ఆ తర్వాత రొమేనియా, ఫ్రాన్స్, పోలాండ్, యూకే, కొలంబియా దేశాల్లో కూడా ఇలాంటి అంతుచిక్కని ఏకశిల నిర్మాణాలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. -
భారీ విస్పోటనం.. అంతుచిక్కని సిగ్నల్స్!
ఒట్టావా: ఖగోళశాస్త్ర అధ్యయనంలో అంతు చిక్కని మరో మిస్టరీ. భారీ విస్పోటనం తాలుకూ సంకేతాలను కెనడాకు చెందిన ఓ రేడియో టెలిస్కోప్ గుర్తించింది. దీంతో గ్రహాంతరవాసుల ఉనికి అంశం మళ్లీ తెరపైకి రాగా, ఆ రహస్యాన్ని చేధించే పనిలో సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఫాస్ట్ రేడియో బరస్ట్(ఎఫ్ఆర్బీ).. విశ్వంలో సంభవించే అత్యంత శక్తివంతమైన పేలుళ్లకు ఫాస్ట్ రేడియో బరస్ట్‌గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. 2007లో తొలిసారిగా శాస్త్రవేత్తలు ఎఫ్ఆర్బీని గుర్తించారు. గత పదేళ్లలో 30కిపైగా ఎఫ్ఆర్బీలు నమోదు అయ్యాయి. తాజాగా జూలై 25న ఎఫ్ఆర్బీకి సంబంధించిన సిగ్నల్స్‌ను కెనడియన్ హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోప్(CHIME) గుర్తించించింది. 2 మిల్లీసెకండ్స్ నిడివి, 700 మెగా హెడ్జ్(ఆలోపే) ఫ్రీక్వెన్సీతో సిగ్నల్స్‌ను టెలిస్కోప్ రికార్డు చేసింది. ఈ ఎఫ్ఆర్బీకి స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ.. న్యూట్రన్ నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ పేలుళ్లు, ఏలియన్స్.. వీటిలో ఏదో ఒకటి ఆ విస్పోటనానికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఇది సంభవించినప్పటికీ అత్యంత శక్తివంతమైంది కావటంతోనే ఇంత దూరం ప్రయాణించగలిగిందని అంటున్నారు. మరుగుజ్జు పాలపుంత.. ఏలియన్స్ జాడకు సంబంధించి అధ్యయనానికి ఈ ఎఫ్ఆర్బీ కీలకంగా మారే అవకాశం ఉందన్నది వారి వాదన. -
మార్స్‌పై ‘మిస్టీరియస్’ రాళ్లకు కారణమేంటో తెలుసా.?
వాషింగ్టన్: మార్స్ మీద ఉన్న విచిత్ర రాళ్ల ఆచూకీ తెలిసిందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మార్స్‌పై ఉన్న మెడ్యుసే ఫాసే రాళ్లు అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం వల్ల ఏర్పడినట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు చిన్నచిన్న రేణువుల్లాంటి బూడిద, రాళ్లు, వివిధ రకాల వాయువులు విడుదలవుతాయి. వీటి నుంచే ఈ రాళ్లు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీటిని 1960ల్లోనే నాసా మారినర్ స్పేస్‌క్రాఫ్ట్ గుర్తించినప్పటికీ అవి ఎలా ఏర్పడ్డాయో తెలియలేదు. తాజాగా ఇవి అగ్నిపర్వతాలు పేలడంతో ఏర్పడ్డాయని తేల్చారు. మార్స్ మధ్యరేఖ వద్ద వీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని జియోఫిజికల్ రీసెర్చ్ జర్నల్‌లో శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా ఇవి 3 బిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడి ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వీటి విస్తీర్ణం అమెరికా విస్తీర్ణంలో 20 శాతం ఉంటుందని, భూమిమీద ఏర్పడిన భారీ అగ్నిపర్వత విస్ఫోటనాల కంటే కూడా వంద రెట్లు పెద్దవని , సోలార్ వ్యవస్థలోనే ఇవి భారీ నిల్వలని జాన్స్ హప్కిన్స్ యూనివర్సిటీశాస్త్రవేత్త లుజాండ్రా ఓజా తెలిపారు. -
చీకట్లో మాయం..శవమై ప్రత్యక్షం
యువతి అనుమానాస్పద మృతి అరటి చెట్టుకు ఉరి హత్యే అంటున్న తండ్రి రాజోలు : పి.గన్నవరం మండలం ముంగండకు చెందిన దిగుమర్తి దివ్య (17) మండలంలోని ములికిపల్లిలో అరటి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందింది. అరవ నారాయణస్వామి కొబ్బరితోటలోని అరటి చెట్టుకు వేలాడుతున్న దివ్య మృతదేహాన్ని ఇన్‌ఛార్జి ఎస్సై వెంకటేశ్వరరావు పరిశీలించి అనుమానస్పద మృతిగా కేసుగా నమోదు చేసినట్టు వెల్లడించారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం ఈ నెల 16న దివ్య ములికిపల్లిలోని అమ్మమ్మ నూకాలమ్మను చూసేందుకు తల్లిదండ్రులు సత్యనారాయణ, మంగ, చెల్లి జ్యోతి కుమారితో కలసి వచ్చింది. అయితే 17వ తేదీ రాత్రి తండ్రి సత్యనారాయణ సెల్‌ఫోన్ తీసుకుని బయటకు వెళ్తానని చెప్పి చెల్లెలు జ్యోతికుమారితో వెళ్లింది. అదే సమయంలో కరెంటు పోవడంతో అక్క కనపించకపోవడంతో జ్యోతికుమారి కంగారుగా వచ్చి తండ్రికి చెప్పింది. స్థానికులతో కలిసి తండ్రి ఎంత వెదికినా ఆమె కనిపించలేదు. దీంతో అంబాజీపేటకు చెందిన పెయింటింగ్ వర్క్స్ చేసుకునే చెవిటి, మూగ అయిన ప్రసాద్‌పై తండ్రికి అనుమానం వచ్చింది. దివ్యను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ప్రసాద్ పెద్దలతో వచ్చి ఆమె కుటుంబ సభ్యులను అడిగాడు. దివ్యను ఉన్నత చదువులు చదివిస్తామని, అప్పుడే పెళ్లి చేయమని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రసాద్‌పై ఆమె తండ్రి పి.గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు మృతదేహాం వద్ద లభించిన దివ్య చెప్పులు, దుస్తులను పరీక్షించి కొన్ని ఆధారాలు సేకరించారు. తండ్రి సెల్‌ఫోన్‌తో ఫోన్లు మెసెజ్‌లు ఏమైనా చేసిందాని పోలీసులు పరిశీలిస్తున్నారు. ముమ్మాటికీ హత్యే : తండ్రి సత్యనారాయణ కూతురు దివ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి సత్యనారాయణ రోదిస్తున్నాడు. ఇంటర్ ఫస్టు ఇయర్లో ఆమె మంచి మార్కులు వచ్చాయని విలపించాడు. అరటి చెట్టుకు ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారని ఆరోపించారు. దివ్య కాళ్లు భూమి మీదకు ఉన్నాయని, దివ్యను హత్య చేసి అరటి చెట్టుకు వేలాడదీశారని కుటుంబీకులు ఆరోపించారు. దివ్యను హత్య చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. -
రమ్య ఆత్మహత్యపై వీడని మిస్టరీ
లావేరు: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మూడు రోజుల కిందట వాటర్ ట్యాంకులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన రమ్య మృతిపై మిస్టరీ మూడు రోజులైనా వీడలేదు. రమ్యకు ఇంటి వద్దగానీ...కస్తూర్బాలోగానీ ఎటువంటి సమస్యలు లేవని ఇటు తల్లిదండ్రులు, అటు విద్యాలయం ప్రత్యేకాధికారి చెబుతున్నారు. ఏ కారణాలు లేకుండా రమ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రమ్య బాగా చదువుతుందని అందరూ చెబుతున్నారు. బాగా చదివే విద్యార్థినికి ఒకేసారి ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఈ వయసులో ఎందుకు కలిగిందన్నది అందరినీ తోలిచేస్తున్న ప్రశ్న. అయితే దసరా సెలవులకు ఇంటికెళ్లి వచ్చిన రమ్యలో కొంత మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసులు కూడా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ కేసు వారికి ఒక సవాల్‌గా మారింది. పోస్టుమార్టం ఆధారంగా.. రమ్య ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు అంతుపట్టక పోవడంతో పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసును దర్యాప్తు చేసి కారణాలను కనుగొనడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. రమ్యకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? లేకా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని, దాని ఆధారంగా కారణాలను తెలుసుకోవచ్చునని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 26న రమ్య పోస్టుమార్టం రిపోర్టు వస్తుందని అప్పుడు వరకూ వేచి చూసి అప్పుడు ఆత్మహత్య కారణాలుపై దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. -
ఐసీయూలో డాక్టర్ అనుమానాస్పద మృతి
కరాచీ: తాను పనిచేస్తున్న ఆసుపత్రిలోని ఇంటెన్సీవ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో ఓ యువ డాక్టర్ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో చోటుచేసుకుంది. శుక్రవారం సర్జికల్ ఐసీయూలోకి వెళ్లిన డాక్టర్ అనిల్ కుమార్(32) ఎంతకీ బయటకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది తలుపులు పగులగొట్టి చూశారు. చైర్లో కూర్చుని కనిపించిన డాక్టర్‌ను దగ్గరకు వెళ్లి పరిశీలించగా.. అతడు అప్పటికే మృతిచెంది ఉన్నాడు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ నయీముద్దీన్ మాట్లాడుతూ.. డాక్టర్ మృతిపై అనుమానాలున్నాయన్నారు. డాక్టర్ మృతిచెందిన ప్రదేశంలో ఓ సిరంజిని గుర్తించామని, డాక్టర్ చేతికి బ్యాండేజీ సైతం ఉందని తెలిపారు. ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చి చంపారా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సిరంజిని కెమికల్ లేబొరేటరీకి పంపించి పరీక్షిస్తున్నారు. గత వారం ఓ హిందూ వ్యాపారిని నిరసనకారులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. -
యువతి అనుమానాస్పద మృతి
మాదాపూర్: 16వ అంతస్తు పై నుంచి పడి ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన వెన్నెల(19) మాదాపూర్ ఖానామెట్‌లోని మినాక్షీ స్కైలాంచ్ ఫోలరీస్ బీ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 1606లో అదే ప్రాంతానికి చెందిన యాజమాని మోహన్ కృష్ణరాజు ఇంట్లో గత నెల రోజులుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు తెల్లవారు జామున 16వ అంతస్తు నుంచి వెన్నెల కిందికి దూకింది. పోలీసుల విచారణలో తాను పడుకున్న బెడ్ పై మూత్ర విసర్జన చేసిందని, అది యాజమానికి ఎక్కడ తెలిసిపోతుందోనని భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
అంతుచిక్కని అనారోగ్యం
-
యువతి మృతి:యువకులను చితక బాదిన గ్రామస్తులు
-
తెలుగు విద్యార్ధి అనుమానాస్పద మృతి
-
అనుమానాస్పదస్థితిలో మహిళా కానిస్టేబుల్ మృతి
♦ భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు ♦ మృతురాలు మెదక్ జిల్లా సంగారెడ్డి పెద్దేముల్ : ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటశీను కథనం మేరకు.. మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన పొట్టుపల్లి మంజుల (34), అదే గ్రామానికి చెందిన మహేష్‌లు ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ సమయంలో ప్రేమించుకుని 2015 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. పటాన్చెరువు ఎక్సైజ్ పొలీస్ స్టేషన్లో ఇద్దరూ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం ఉదయం సంగారెడ్డి నుంచి రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రాంతంలోని భూ కైలాస్ ఆలయానికి వెళుతున్నట్లు చెప్పి బైక్‌పై బయలు దేరారు. ఏమైందో తెలియదు కానీ.. తెల్లవారుఝామున 4 నుంచి 5గంటల మధ్య పెద్దేముల్ మండల గాజీపూర్ గ్రామ సమీపంలో తాండూరు - సంగారెడ్డి రహదారిపై మంజుల, మహేష్‌లు పడి ఉన్నారు. ఉదయం గాజీపూర్ గ్రామానికి చెందిన పలువురు వాకింగ్ వెళుతుండగా విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా.. మంజుల అప్పటికే మృతిచెందగా.. స్పృహ కోల్పోయి ఉన్న మహేష్‌ను ఆస్పత్రికి తరలించారు. కాగా.. మంజుల శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోయినా.. ముక్క నుంచి రక్తం వచ్చినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా.. అమ్మాయి తండ్రి నర్సిములు మాత్రం తమ కుమార్తెను అల్లుడు మహేష్‌తో పాటు ఆయన తండ్రి ప్రభాకర్, తల్లి అంజమ్మ, తమ్ముడు ప్రదీప్, బావ మల్లేశంలు కలసి హత్య చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అనుమానాస్పదస్థితిలో మహిళా కానిస్టేబుల్ మృతి
పెద్దేముల్/పటాన్చెరు: ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం జరిగింది. ఎస్సై వెంకటశీను కథనం మేరకు.. మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన పొట్టుపల్లి మంజుల(34), అదే గ్రామానికి చెందిన మహేశ్.. ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ సమయంలో 2015, అక్టోబరులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పటాన్చెరువు ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరూ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం సంగారెడ్డి నుంచి రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రాంతంలోని భూ కైలాస్ ఆలయానికి వెళుతున్నట్లు చెప్పి బైక్‌పై బయలు దేరారు. ఏమైందో తెలియదు కానీ.. తెల్లవారుఝామున గాజీపూర్ గ్రామ సమీపంలో తాండూరు - సంగారెడ్డి రహదారిపై మంజుల, మహేష్ పడి ఉన్నారు. గాజీపూర్‌వాసులు గమనించి పోలీసులకు చెప్పారు. వారు వచ్చి పరిశీలించగా.. మంజుల అప్పటికే మృతిచెందగా.. స్పృహ కోల్పోయి ఉన్న మహేష్‌ను ఆస్పత్రికి తరలించారు. మంజుల శరీరంపై గాయాలు లేకపోయినా.. ముక్క నుంచి రక్తం వచ్చినట్లు గుర్తించారు. కాగా, అమ్మాయి తండ్రి నర్సిములు మాత్రం తమ కుమార్తెను అల్లుడు మహేష్‌తో పాటు ఆయన తండ్రి ప్రభాకర్, తల్లి అంజమ్మ, తమ్ముడు ప్రదీప్, బావ మల్లేశం కలసి హత్య చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
మహిళ అనుమానాస్పద మృతి
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మల్లారం అటవీ ప్రాంతంలో ఓ మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. శనివారం ఉదయం కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన గోపి అనే వ్యక్తి మహిళ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పక్కనే ఉన్న టిఫిన్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వడదెబ్బ కారణంగా మృతి చెందిందా? లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అంతు చిక్కని భూగర్భ అద్భుతాలు
మానవులు తలచుకుంటే సాధించలేనిదే లేదంటారు. అయితే భూగర్భంలో మనకు తెలియని రహస్యాలెన్నో నిక్షిప్తమై ఉన్నా వాటిని కనుగొనేందుకు పురాతత్వవేత్తలు, శాస్త్రనిపుణులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా కనిపెట్టలేకపోతున్నారు. ఎన్నో ప్రయోగాలు చేసినా ఇంకా తెలియని రహస్యాలెన్నో భూగర్భంలోనే మిగిలిపోతున్నాయి. మనకు తెలియని అద్భుత ప్రపంచాన్ని కనిపెట్టేందుకు పురాతత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు అహర్నిశలూ కృషి చేస్తున్నారు. భూగర్భ ప్రపంచాన్ని సందర్శించేందుకు, ప్రజలకు ప్రాచీన చరరిత్రను పరిచయం చేసేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ప్రాచీన పురాణాలు, ఇతిహాసాలు, రహస్య స్థావరాలు, ఆలయాలు, కట్టడాలు, సమాధులు వంటి ఎన్నో అద్భుతాలను కనుగొన్న శాస్త్రవేత్తలు, పురాతత్వవేత్తలు ప్రాచీన చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. భూగర్భ ప్రపంచంలో అనేక పొరంగాలు, గుహలు, నగరాలు కూడ ఉన్నాయని, వాటి వెనుక ఎంతో చరిత్ర దాగి ఉందని, అయితే వాటిని ఎటువంటి ప్రయోజనాలకోసం, ఏ సందర్భంలో నిర్మించారో పూర్తిగా తెలుసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. మనకు లభించిన ఆధారాలను బట్టి కొంత చరిత్ర తెలిసినా, ఇంకా భూగర్భంలో గుర్తించలేని ప్రపంచం ఎంతో ఉందని అంటున్నారు. అయితే చరిత్ర చెప్తున్న 11 అత్యంత రహస్య భూగర్భ ప్రాంతాల్లోని విశేషాలను, వివరాలను శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు ఇప్పటివరకూ ఇంకా గుర్తించలేకపోయారని, అసలు అవి ఉన్నాయా లేవా అన్న అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయని ఓ ప్రైవేట్ వెబ్ సైట్ వివరించింది. తమకు తెలిసిన ఆధారాలను బట్టి ఆయా భూగర్భ అద్భుతాలకు సంబంధించిన చిత్రాలను వెలువరించింది. ముఖ్యంగా ఈజిప్టు లోని 'లాబ్రినాథ్' భూగర్భ అద్భుతాల్లో ఒకటి. పిరమిడ్లకు ప్రఖ్యాతి చెందిన ఈజిప్టులో లాబ్రినాథ్ గోడలపై చెక్కిన పురాతన లిపి కూడ ఎంతో ప్రాముఖ్యతను పొందింది. అయితే ఆ లిపి ఏమిటి అన్నది మాత్రం నేటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. కానీ లాబ్రినాథ్ పై పరిశోధనలు చేపట్టేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక అమెరికాలోని కాలిఫోర్నియాలో 'డెత్ వ్యాలీ'గా పిలిచే ప్రాంతం 5 వేల ఏళ్ళనాటి అండర్ గ్రౌండ్ పట్టణం. అక్కడ మమ్మీలు, కళాఖండాలు ఉన్నట్లుగా గుర్తించినా... శాస్త్రవేత్తలు వాటిని అక్కడ ఎవరు ఎందుకు ఉంచారో చెప్పలేకపోయారు. అలాగే 'ది గ్రాండ్ కెన్యాన్' లో పురాతన నాగరికతకు చెందిన ప్రజలు నివసిస్తారని పరిశోధనల్లో తేలినా... అది నిజమా కాదా అన్న విషయం తేల్చలేకపోయారు. మరో అద్భుత భూగర్భ నగరం టర్కీలోని డేరిన్ కియు. ఈ అత్యంత ఆధునిక నగరాన్నిఎవరు ఎప్పుడు నిర్మించారో ఇప్పటికీ శాస్త్రవేత్తలు చెప్పలేకపోగా... మిస్సోరి భూగర్భంలోని పట్టణంలోమనుషుల భారీ అస్తికలను కనుగొన్న నిపుణులు... అవి రాక్షసులవి అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక జపాన్ లోని మౌంట్ త్సురుగి డీపెన్స్ ప్రాంతాన్ని కనిపెట్టి, అది అత్యంత ప్రాచీన నగరమని గుర్తించి, అక్కడే మూడేళ్ళపాటు ప్రయోగాలు చేసినా దానికి సంబంధించిన మరే వివరాలను తెలుసుకోలేకపోయారు. రహస్య భూగర్భ స్థావరం 'తకలమకన్ డెజర్ట్' ఎడారి పరిస్థితీ అదే. అక్కడి ఎడారిలో వెళ్ళినవారికి తిరిగి వచ్చేందుకు దారి కనిపించదని, ఇసుకతో నిర్మించిన ఎన్నో దేవాలయాలు అక్కడ ఉన్నాయని నిపుణులు కనుగొన్నారు. అయితే వాటిని ఇసుకతో ఎలా నిర్మించారో మాత్రం ఇంకా తెలుసుకోలేకపోయారు. రష్యాలోని హైపర్ బోరియా సరస్సును అక్కడివారు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారని తెలుసుకున్నా... దీన్ని ఎవరు నిర్మించారన్న వివరాలు చెప్పలేకపోతున్నారు. అయితే సియాక్స్ ఇండియన్స్ వైట్ హార్స్ భూగర్భ ప్రాంతంలోని, ఓ భూగర్భ గుహ కథనం మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఓ గిరిజన వ్యక్తికి చెందినదిగా వినిపిస్తుంది. ఇటలీలోని భూగర్భ పిరమిడ్ తో పాటు.... త్రీ ఐడ్ లామా వంటి అద్భుతాలెన్నో మనకు తెలియని రహస్యాలుగానే మిగిలిపోయాయి. -
బీఎస్పీ ఎంపీ భార్య, కుమారుడి అరెస్ట్
ఘజియాబాద్: వరకట్న వేధింపుల కేసులో ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు నరేంద్ర కశ్యప్ సతీమణితో పాటు ఆయన పెద్దకుమారుడు కుమారుడు సంజయ్ కశ్యప్‌ను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర కశ్యప్ కోడలు హిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఘజియాబాద్‌లో నిన్న ఉదయం ఇంట్లో బాత్రూమ్లో హిమాని శవమై కనిపించింది. ఆమె తలకు బుల్లెట్ గాయాలున్నాయి. హిమాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్ల క్రితం సంజయ్‌తో హిమానికి వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. మరోవైపు ఆస్పత్రిలో చేరిన ఎంపీ నరేంద్ర కశ్యప్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. హిమాని మృతి చెందిన సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ జరుగుతున్నామని ఎస్పీ సల్మాన్ తాజ్ తెలిపారు. ఇక హిమాని తండ్రి కూడా బీఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. -
పుణేలో అంతుబట్టని బ్రెస్ట్ డిసీజ్
ముంబై: మహారాష్ట్రలో అంతుబట్టని రొమ్ము వ్యాధి ప్రబలడం ఆందోళకు గురి చేస్తోంది. పుణె ప్రాంతంలో 20 -30 సంవత్సరాల మధ్య వయసున్న యువతుల్లో మిస్టరీ రొమ్ము వైరస్ విస్తరిస్తుండటం వైద్యవర్గాల్లో ఆలోచన పెంచుతోంది. అచ్చం బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను పోలి వున్న ఈ వ్యాధి పుణె యువతుల్లో కనిపిస్తోంది. దీనిపై సీనియర్ డాక్టర్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఇలాంటి కేసులు 50 శాతం పెరిగాయంటున్నారు. ఇంతకుముందు ఇలాంటి లక్షణాలను పాలిచ్చే తల్లుల్లో, టీబీ రోగుల్లో, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో, అదీ 40-50 ఏళ్ల మహిళల్లో మాత్రమే చూసేవారమని, ఇపుడు యువతుల్లో ఇలాంటి కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, సరైన సమయంలో గుర్తించి, దీర్ఘకాలం చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుందని సూచిస్తున్నారు. భోసారికి చెందిన ప్రజక్త జాదవ్(28) (పేరు మార్చాం) గత అక్టోబర్‌లో ఎడమ రొమ్ములో బాధాకరమైన గడ్డను గమనించారు. కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడినా గడ్డ పెరగి, రొమ్మునుంచి డిశ్చార్చ్ కూడా మొదలైంది. దీంతో ఆందోళన చెందిన ఆమె లేడీ డాక్టర్‌ను, తర్వాత ఆంకాలజిస్టును కలిశారు. తీవ్రమైన అంటువ్యాధి అని తేల్చిన డాక్టర్లు ఆపరేషన్ చేసి చీమును తొలగించారు. తాను చాలా శుభ్రంగా ఉంటాననీ, తనకు ఎందుకు ఈ వ్యాధి సోకిందో అర్థం కావడం లేదని ఆమె వాపోయారు. పింప్రి కి చెందిన ఆశా శామ్యూల్ (25)ది (పేరు మార్పు) కూడా దాదాపు ఇలాంటి కేసే. ఆమె ఎడమ నిపుల్ బుడగ రూపంలోకి మారి గట్టిపడి గడ్డలాగా ఏర్పడింది. దీంతో ఆమె కేన్సర్ అని భయపడి డాక్టర్లను సంప్రదించారు. గత నాలుగు నెలలుగా చికిత్స తీసుకుంటున్న ఆమె ప్రస్తుతం కోలుకుంటోంది. ఇలాంటి కేసులు గతంలో నమోదయ్యాయి గానీ ఇంత పెద్దసంఖ్యలో లేవని బ్రెస్ట్ క్యాన్సర్ సీనియర్ వైద్యులు డా. సీబీ కోపికర్ అన్నారు. ప్రతి నెల ఆరు కొత్త కేసులు వస్తుండగా.. 15 - 30 మంది తిరిగి ఈ ఇన్ఫెక్షన్కు గురవుతున్నారని తెలిపారు. చూడ్డానికి రొమ్ము టీబీని పోలి ఉన్నా.. కచ్చితమైన కారణం మాత్రం ఇంకా తెలియరాలేదన్నారు. అయితే ఏడెనిమిది నెలలపాటు మందులు వాడాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు వీటిని గుర్తించకుండా, తప్పుడు వ్యాధినిర్ధారణతో, రొమ్ము శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారని కోపికర్ పేర్కొన్నారు. పెరుగుతున్న కేసులుసంఖ్య ఆందోళన కలిగిస్తోందని జహంగీర్ ఆసుపత్రి కి చెందిన మెడికల్ ఆంకాలజిస్ట్, మహారాష్ట్ర ఆంకాలజీ సొసైటీ వ్యవస్థాపకుడు డా. షోనా నాగ్ చెప్పారు. కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు బలమైన పరిశోధన జరుగుతోందన్నారు. వ్యాధి కారణాలను నిర్ధారిస్తే చికిత్స సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే వ్యాధి లక్షణాలను బట్టి క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టాటా మెమోరియల్ ఆసుపత్రి వైద్యులు కూడా ఈ ఇన్ఫక్షన్ పై ఆశ్యర్యం వ్యక్తంచేశారు. దీనిపై రాష్ట్రంలోని ఇతర వైద్యనిపుణులు, ఆంకాలజిస్టులతో చర్చిస్తున్నామని జన్యుశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ రాజీవ్ సారిన్ తెలిపారు. హార్మోన్ పెరుగుదలలో అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల రొమ్ములో గడ్డలు ఏర్పడి ఇన్ఫెక్షన్ కి దారితీస్తుందన్నారు. అయితే ఈ వ్యాధి నిర్ధారణకు విస్తృతమైన అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. -
ఇస్రో గగనతలంపై అనుమానాస్పద విహారం
చెన్నై: తమిళనాడు తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఉపరితలంపై అనుమానాస్పదంగా ఏదో ఎగురుతోందన్న వార్తలు కలకలం సృష్టించాయి. దీనిపై స్థానిక గొర్రెల కాపరులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆందోళన నెలకొంది. ఇస్రోకు సమీపంలోని నిషిద్ధ ప్రదేశం ఏడో వాచ్ టవర్ దగ్గర ఆకాశంలో అనుమానాస్పదంగా ఎగురుతున్న విమానాన్ని చూశామని తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇక్కడ గగనతలంలో ఏదో నిగూఢంగా ఎగురుతున్న విషయాన్ని గమనించి ఆందోళన చెందామన్నారు. సమీపంలోని అటవీ ప్రాంతాల గుండా పయనిస్తూ ఇస్రో వైపు రావడాన్ని తాము స్పష్టంగా చూశామని చెప్పారు. అయితే ఇస్రో అధికారులు మాత్రం ఈ వార్తలను ధ్రువీకరించలేదు. అలాంటి సంకేతాలేవీ శాస్త్రీయంగా తమకు అందలేదంటున్నారు. సుమారు 55 కి.మీ దూరంనుంచే గగనతలంలో సంచరించేవాటిని కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం తమ సంస్థ కలిగి ఉందన్నారు. అయితే అటవీ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు దీనిపై సిరియస్‌గా దృష్టి పెట్టారు. గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏడో వాచ్ టవర్ దగ్గర నిఘా పెట్టారు. సమాచారంలో వాస్తవికతను నిర్ధారించేందుకు గొర్రెల కాపరులను ప్రశ్నిస్తున్నారు. వారు చూసిన వస్తువు ఏమై ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
కోళ్ల వ్యాపారి అనుమానాస్పద మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పట్టణంలోని సిద్దారం రోడ్డులో నివాసం ఉండే ఎస్.వెంకటేశ్వరరావు (35) కోళ్ల వ్యాపారం చేస్తుంటాడు. గురువారం సాయంత్రం అతడు ఇంట్లోనే చనిపోయాడు. అయితే, అతడు ఉరి వేసుకుని చనిపోయాడని భార్య చెబుతుండగా, అత్తింటి వారే కొట్టి చంపారని మృతుని సంబంధీకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డీఎస్పీ కవిత ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
రంగారెడ్డి: ఒక వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మండలంలోని దండుమైలారం గ్రామానికి చెందిన బైండ్ల నర్సింహ(35) భార్య, బిడ్డలతో ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కాగా, గురువారం సాయంత్రం నర్సింహ తన ఇంటి ముందు కుప్పకూలి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే చనిపోయాడు. మృత దేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: ఏడేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన నగరంలోని సింగరేణి కాలనీలో సంచలనం సృష్టించింది. కాలనీలో నివసించే గాయిత్రి(7).. ఆదివారం విగతజీవిగా కనిపించింది. అయితే వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కారణంతో తల్లే చిన్నారిని చంపేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి తల్లిని అదుపులోకి తసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మిస్టరీ డెత్
-
విద్యార్ధిని హత్య చేసిన స్నేహితులు
-
యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నంలోని అవేరా ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న స్వప్న(21) అనే యువతి అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మృతి చెందింది. అయితే ఆమెకు ఆరునెలల క్రితమే వివాహమైనట్లుగా సమాచారం. ఆమె భర్త దుబాయిలోని షిప్‌యార్డులో పనిచేస్తున్నాడు. కాగా స్వప్నను అత్తింటివారే కట్నం కోసం వేధించి చంపేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్వప్న మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కాగా తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబీకులు అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కొత్తగూడెం : అనుమానాస్పదంగా వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని గంగాబస్తీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గంగాబస్తీకి చెందిన పేరం బుచ్చిబాబు (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను అనారోగ్యంతో ఈ రోజు మధ్యాహ్నం మృతిచెందాడు. విషయం తెలిసిన బంధువులు మృతదేహాన్ని చూడటానికి వచ్చారు. ఈ సమయంలో అతని మెడ వెనుక భాగంలో తాడు గుర్తులు కనిపించడంతో భార్యే చంపి ఉంటుందని అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆవేశమే మృత్యువై...
నాగోలు: కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు చిన్న విషయాలకు గొడవ పడ్డారు. ఈ ఘర్షణ తరువాత భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.... తన అక్కను బావే హత్య చేశాడని భావించిన బావమరిది కత్తితో అతని గొంతు కోసి కడతేర్చాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో వారి ముగ్గురు ఆడపిల్లలు అనాథలయ్యూరు. ఈ సంఘటన బుధవారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓల్డ్ మలక్‌పేట సరోజినీ నగర్‌కు చెందిన బాబామియా(40)కు అదే ప్రాంతానికి చెందిన సలీమాబేగం (37)తో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. బాబామియా మలక్‌పేట రేస్ కోర్టులో పని చేస్తున్నాడు. మద్యానికి బానిసై చీటికి మాటికి భార్యతో గొడవ పడేవాడు. సలీమాబేగం తల్లి ఫాతిమాబేగం కుటుంబం మలక్‌పేట నుంచి నాగోలు జైపురి కాలనీ బ్లైండ్ కాలనీలోకి మకాం మార్చారు. బాబామియా తరచూ భార్యను ఇబ్బందులకు గురిచేయడంతో వారిని బ్లైండ్ కాలనీలోకి తీసుకొచ్చి అద్దె ఇంట్లో ఉంచారు. అయినా అతను వేధింపులు మానుకోలేదు. ఈ విషయంలో మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో మలక్‌పేట సరోజినీనగర్‌లో నివాసముండే బాబామియా తన తల్లి జైరాబిబేగంకు ఫోన్ చేసి ‘మీ కోడలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది... వెంటనే ఇక్కడికి రావాలని పిలిచాడు. ఇది విన్న బాబామియా పెద్ద కుమార్తె షబా సమీపంలో ఉంటున్న అమ్మమ్మ ఫాతిమాబేగం, మేనమామ మున్నాలకు విషయం తెలిపారు. ముందుగా ఫాతిమా వంట గదిలోకి వెళ్లి చూసేసరికి కూతురు సలీమా బేగం కొక్కానికి వేలాడుతూ కనిపించింది. కిందికి దించేసరికే ఆమె మృతి చెందింది. వెంటనే వెనుక నుంచి వచ్చిన బావమరిది మున్నా ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో బాబామియా మెడపైన పొడిచి, పొట్ట భాగంలో కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాబామియా అక్కడికక్కడే మృతి చెందాడు. బయటకు వచ్చిన మున్నా తన బావను చంపానని... పోలీసులకు తెలపాలని స్థానికులకు చెప్పాడు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఏసీపీ సీతారాం, సీఐ శ్రీనివాస్‌రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన కూతురిని అల్లుడే హత్య చేశాడని తల్లి ఫాతిమాబేగం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తన కొడుకును హత్య చేశారంటూ మృతుడు బాబామియా తల్లి జైరాబీబేగం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సలీమాబేగం మృతి అనుమానాస్పదంగా ఉందని, పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. మున్నా పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఒకే చోట ఖననం... పోస్టుమార్టం అనంతరం భార్యాభర్తల మృతదేహాలను ఒకే వాహనంలో మలక్‌పేటలోని సొంత ఇంటికి తరలించారు. అనంతరం స్థానిక శ్మశాన వాటికలో ఒకే చోట ఖననం చేసినట్టు సమాచారం. అనాథలైన పిల్లలు తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో ముగ్గురు కుమార్తెలు షబా, పర్వీన్, షబానా ఒంటరి వారయ్యారు. ఇటు అమ్మమ్మ వద్దకు వెళ్లాలో... అటు నానమ్మ వద్దకు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.