బెంగళూరు: తిరుపతికి చెందిన మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరులో మంగళవారం జరిగింది. నెలమంగల పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీ(25) అనే మహిళ తిరుపతి నుంచి బెంగళూరులోని ఓళపేటెలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చింది.
మంగళవారం ఉదయం స్నానాల గదిలోకి వెళ్లింది. 25 నిమిషాలైనప్పటికీ బయటికి రాకపోవడంతో భర్త వెళ్లి పరిశీలించగా స్పృహకోల్పోయిన స్థితిలో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ముఖంపై గీతలు కనిపించినట్లు భర్త చెబుతున్నాడు.
గ్యాస్ గీసర్‌తో విషపూరితమైన కార్బన్‌మోనాక్సైడ్ గ్యాస్‌తో ఊపిరాడకపోవడంతో మృతి చెందే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేయగా గీసర్ ఆపివేసి ఉందని భర్త తెలిపారు.
చదవండి: క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. భర్తను హతమార్చి భార్య
Comments
Please login to add a commentAdd a comment