Bengaluru woman
-
బాత్రూమ్లో మహిళ అనుమానాస్పద మృతి!
బెంగళూరు: తిరుపతికి చెందిన మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరులో మంగళవారం జరిగింది. నెలమంగల పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీ(25) అనే మహిళ తిరుపతి నుంచి బెంగళూరులోని ఓళపేటెలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం స్నానాల గదిలోకి వెళ్లింది. 25 నిమిషాలైనప్పటికీ బయటికి రాకపోవడంతో భర్త వెళ్లి పరిశీలించగా స్పృహకోల్పోయిన స్థితిలో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ముఖంపై గీతలు కనిపించినట్లు భర్త చెబుతున్నాడు.గ్యాస్ గీసర్తో విషపూరితమైన కార్బన్‌మోనాక్సైడ్ గ్యాస్‌తో ఊపిరాడకపోవడంతో మృతి చెందే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేయగా గీసర్ ఆపివేసి ఉందని భర్త తెలిపారు.చదవండి: క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. భర్తను హతమార్చి భార్య -
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. 62 బిర్యానీలు ఆర్డర్ చేసిన మహిళ
వీకెండ్లు, పండగలు.. ఇలా సందర్భం ఏదైనా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం సాధారణంగా మారిపోయింది. బంధువులు, స్నేహితులతో కలసి పార్టీలు చేసుకుంటున్నప్పుడు కాస్త ఎక్కువగానే ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా 62 బిర్యానీలు ఆర్డర్ చేసింది. శనివారం(సెప్టెంబర్ 2) భారత్-పాకిస్తాన్ (India-Pakistan match) ఆసియా కప్ (Asia Cup 2023) మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా బెంగళూరు వాసి ఒకరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy)లో 62 బిర్యానీలను ఆర్డర్ చేశారు. దీని గురించి స్విగ్గీ సంస్థ ‘ఎక్స్’(ట్విటర్) (Twitter)లో షేర్ చేసింది. "బెంగళూరు నుంచి ఎవరో ఇప్పుడే 62 యూనిట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు? ఎవరు మీరు? ఎక్కడ ఉన్నారు? భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కి వాచ్ పార్టీని నిర్వహిస్తున్నారా? మేమూ రావచ్చా?" అంటూ రాసుకొచ్చింది. స్విగ్గీ పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు పోస్ట్‌పై కామెంట్ చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆ వ్యక్తి ఎవరా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఫుడ్ ఫ్రీ పంపిస్తారా? అంటూ ఓ యూజర్ చమత్కరించారు. కానీ వర్షం కారణంగా పార్టీ అకస్మాత్తుగా ముగిసింది అంటూ మరొకరు నిట్టూర్చారు. కాగా శ్రీలంకలోని క్యాండీలో పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-పాకిస్థాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 266 పరుగులు చేయగా వర్షం కురవడంతో పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. సోమవారం ఇదే వేదికపై భారత్ నేపాల్‌తో తలపడనుంది. someone from bengaluru just ordered 62 units of biryanis?? who are you? where exactly are you? are you hosting a #INDvsPAK match watch-party?? can i come? — Swiggy (@Swiggy) September 2, 2023 -
బెంగుళూరులో దారుణం.. పార్కులో నుంచి యువతిని ఊడ్చుకెళ్లి..
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడిని కలిసేందుకు పార్క్‌కు వెళ్లిన ఓ యువతిని నలుగురు వ్యక్తులు ఈడ్చుకెళ్లి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటిరోజు ఉదయం ఆమెను తమ ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లారు. మార్చి 25న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆదివారం ఓ యువతి తన స్నేహితుడితో కలిసి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోగల నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కులో కూర్చొని మాట్లాడుతోంది. ఇంతలో ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి.. రాత్రి సమయంలో పార్కులో ఏం చేస్తున్నారంటూ బెదిరించాడు. దాంతో భయపడిన ఆమె స్నేహితుడు.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆ బెదిరించిన వ్యక్తి తన ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. నలుగురు కలిసి ఆమెను బలవంతంగా పార్కులోంచి ఈడ్చుకెళ్లి వాళ్ల కారులోకి తోశారు. అనంతరం ఆ వీధుల్లో తిరుగుతూ కదులుతున్న కారులోనే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 26న తెల్లవారుజామున బాధితురాలిని తన ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లారు. అంతేగాక అఘాయిత్యం గురించి ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తామని బెదిరించారు. అమిnrso బాధితురాలి ఆరోగ్యం బాలేక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనకు జరిగిన ఘోరాన్నికుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగుళూరు పోలీస్ అధికారి సీకే బాబా వెల్లడించారు. -
మదనపల్లి ప్రైవేట్ లాడ్జిలో యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, చిత్తూరు: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ లాడ్జీలో బెంగళూరుకు చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల సఫియా ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు మదనపల్లికి చెందిన అబీద్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి రూ. 3 లక్షల వరకు నగదు తీసుకున్నాడు. అనంతరం యువకుడు ముఖం చాటేయడంతో అనుమానం వచ్చిన యువతి మదనపల్లెకు వచ్చి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అయినప్పటికీ యువకుడు, అతని కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసి బెంగళూరు వెళ్లిపోయింది. మరోసారి మదనపల్లెకు వచ్చిన యువతి.. తనకు న్యాయం జరగడం లేదని భావించి ప్రైవేటు లాడ్జీకి వెళ్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన లాడ్జీ సిబ్బంది యువతిని చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
ఇంటింటికీ రిక్వెస్ట్; ఆఫీసుకు పంపండి
ఈ ఏడాదిన్నరలో ఎంతోమంది మహిళలు.. కేవలం ఇంటిని చూసుకోవడం కోసం ఉద్యోగాలు మానేయవలసి వచ్చింది! వాళ్లను మళ్లీ ఉద్యోగాలలోకి రప్పించడం కోసం బెంగళూరు ‘లీన్ఇన్’ కంపెనీలో నెట్వర్క్ లీడర్‌గా పని చేస్తున్న స్ఫూర్తి అనే యువతి ఇంటింటికీ వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఒప్పించి ఆ ఉద్యోగినులను మళ్లీ ఆఫీసులకు రప్పిస్తోంది. ఇల్లు చేదోడుగా ఉంటే స్త్రీ ఆ ఇంటికి ఎంత చేయూతగా ఉంటుందో కొన్ని కుటుంబాలను ఉదాహరణగా చూపిస్తోంది. ఆమె చేస్తున్న ఈ ప్రయత్నంతో.. చీకటి పడగానే ఒకటొకటిగా ఇళ్లలోని లైట్లు వెలిగిన విధంగా తిరిగి ఉద్యోగాలలో చేరుతున్న మహిళల చిరునవ్వుతో కుటుంబాలు కాంతిమంతం అవుతున్నాయి. ఫేస్బుక్ సీవోవో కూడా స్ఫూర్తి చేస్తున్న ప్రయత్నానికి ముగ్ధురాలై ఆమె గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందనగా స్ఫూర్తిదాయకమైన పోస్ట్ పెట్టారు. షెరిల్ శాండ్‌బర్గ్ (51) వాషింగ్టన్లో ఉంటారు. ‘ఫేస్బుక్’ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆమె. ఇక స్ఫూర్తి బెంగళూరులో ఉంటుంది. అక్కడి ‘లీన్ఇన్’ కంపెనీలో స్ఫూర్తి నెట్వర్క్ లీడర్. మహిళలకు మద్దతుగా ఉండి, వారిని వారి లక్ష్యాలకు నడిపించే లాభాపేక్ష లేని సంస్థ లీన్ఇన్. శాండ్బర్గే స్వయంగా ఈ సంస్థను ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించారు. దాదాపు అన్ని దేశాల్లోనూ లీన్ఇన్ ఉంది. అయితే బెంగళూరులోని లీన్ఇన్లో మాత్రమే స్ఫూర్తి వంటి అమ్మాయి ఉంది! ఇలా చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఉద్యోగినులకు ఇంటి పనిలో ఏమాత్రం సహాయం లభించకపోగా, వారు గడప దాటితే గృహ భ్రమణం ఆగిపోయే పరిస్థితి అన్ని దేశాలలో ఉన్నప్పటికీ.. మనదేశంలో మరికాస్త ఎక్కువ అనిపించేలా గత ఏడాదిన్నరగా అనేక మంది మహిళలు కుటుంబం కోసం ఉద్యోగాలు మాని ఇంటికే పరిమితం అవవలసి వచ్చింది. స్ఫూర్తి వారందరినీ తిరిగి ఆఫీసులకు మళ్లించారు! అందుకే ఆమె శాండ్‌బర్గ్ దృష్టిలో పడ్డారు. స్ఫూర్తితో పాటు మహిళా ఉద్యోగులు కొందరు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. స్ఫూర్తి ప్రయత్నాన్ని ప్రశంసించారు. నిజానికి ఇది స్ఫూర్తికి.. కంపెనీ అప్పగించిన బాధ్యత కాదు. ఆమెకై ఆమె చొరవ తీసుకుని ఇల్లిల్లూ తిరిగి సాధించిన ఘనత. అవును ఘనతే. బడి మానిన పిల్లల్ని తిరిగి బళ్లో చేర్పించడం వంటిదే.. ఉద్యోగం మానిన మహిళల్ని తిరిగి ఆఫీస్‌కి రప్పించడం! ఇంట్లో అనుకూలత లేకనే కదా ఆడపిల్లలు చదువు మానినా, గృహిణులు ఉద్యోగం మానినా. స్ఫూర్తి ఏం చేసిందంటే.. చక్కగా చదువుతోంది కదా ఎంత కష్టమైనా గాని పిల్లను బడి మాన్పించకండి అని తల్లిదండ్రులకు టీచర్లు చెప్పే విధంగానే.. ‘‘ఇంటిపనిలో మీరూ ఓ చెయ్యేస్తే ఆమెకు ఉద్యోగం మానే పరిస్థితి రాదు కదా..’’ అని కుటుంబ సభ్యులకు నచ్చ చెబుతోంది. స్ఫూర్తి మాట్లాడ్డం మృదువుగా, ఒప్పించేలా ఉంటుంది. లీన్ఇన్లో పనిచేసేవాళ్లంతా ఇదే విధంగా ఉంటారు. లీన్ఇన్లో ప్రధానంగా వాళ్లు చేస్తుండే పని ఆలోచన–ఆచరణ. మహిళలకు మద్దతుగా ఉండటం కోసం, మహిళల్ని వాళ్ల లక్ష్యాలకు దగ్గరగా చేర్చడం కోసం, మహిళల్ని సాధికార సాయుధులుగా మలచడం కోసం వర్తమాన సామాజిక అనుకూలతలు, ప్రతికూలతలను అనుసరించి ఒక ప్రణాళికను ఆలోచిస్తారు. ఆలోచనను ఆచరణలో పెడతారు. లాక్డౌన్లో ఉద్యోగినులకు ఇటు ఇంటిపనీ, అటు ఆఫీస్ పనీ ఎక్కువైంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగాలు మానేయడం మొదలుపెట్టారు! ఇంటికి ఆర్థికం గా నష్టం. సమాజానికి అభివృద్ధి పరంగా నష్టం. ఈ సంగతిని త్వరగా కనిపెట్టి, త్వరగా చక్కదిద్దడానికి కార్యోన్ముఖం అయింది స్ఫూర్తి. ఈ ఏడాదిన్నరలో బెంగళూరులో ఉద్యోగం మానేసిన వారు వందల్లో ఉన్నారని ఒక సర్వే ద్వారా తెలుసుకున్న స్ఫూర్తి వాళ్లను తిరిగి ఉద్యోగాలకు చేర్చడానికి ఒక నెట్‌వర్క్‌ను సిద్ధం చేసి వాళ్ల ఇళ్లకు పంపించింది. ఉద్యోగం మానిన వారిలో స్ఫూర్తి కో–వర్కర్స్ కూడా ఉన్నారు! వాళ్ల బాధ్యతను తను తీసుకుంది స్ఫూర్తి. వాళ్లంతా ఇప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చేశారు. వెళ్లిన చోట స్ఫూర్తి చెప్పిన మాట ఒకటే. ‘‘చూడండి.. మీరు తనకు ఇంటి పనిలో సహాయం చేస్తుంటే.. ఆఫీస్ పనిని ఆమె సునాయాసంగా చేయగలదు. ఏ ఇల్లయినా ఒక ఉద్యోగాన్ని అనవసరంగా ఎందుకు కోల్పోవాలి?’’ అని ఇంటిల్లిపాదినీ ఒప్పించింది. అలాగే పనిని షేర్ చేసుకునే నమూనా ఇళ్లు ఎంత ఆనందంగా గడుపుతున్నాయో ఉదాహరణలు ఇచ్చింది. ‘‘థ్యాంక్యూ స్ఫూర్తీ.. ఇలాంటి క్లిష్ట సమయంలో మనం ఎలా ఉండాలో చూపించావు’ అనే మాటతో ఇన్‌స్టాగ్రామ్‌లో శాండ్‌బర్గ్ తన అభినందన పోస్ట్‌ను ముగించారు. ఫేస్బుక్ సీవోవో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో స్ఫూర్తి (ఎడమ నుంచి రెండు) -
‘చోర్ సింగర్’.. సిటీలోనూ వాంటెడ్ !!
ఆమె ఓ గాయని, బతుకుదెరువు నిమిత్తం ముంబై నుంచి నగరానికి వలస వచ్చి క్లబ్‌లు, ఈవెంట్లలో పాటలు పాడుతూ జీవనం సాగించేది. క్లబ్బుల్లో క్యాబరేలను ప్రభుత్వం నిషేధించడంతో చోరీలవైపు దృష్టి సారించింది. దేశంలోని పలు నగరాలకు విమానాల్లో రాకపోకలు సాగిస్తూ ప్రముఖ దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో మహిళలకు చెందిన హ్యాండ్ బ్యాగులు, విలువైన వస్తువుల చోరీకి పాల్పడుతున్న ‘చోర్ సింగర్’ను ఇటీవల ముంబై పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆమెకు గతంలో నగరంలో జరిగిన మూడు చోరీ కేసుల్లోనూ సంబంధం ఉన్నట్లు తేలింది. సాక్షి, హైదరాబాద్: విమానాల్లో తిరుగుతూ ప్రముఖ దుకాణాలు, షాపింగ్ మాల్స్‌కు వచ్చే మహిళలను టార్గెట్‌గా చేసుకుని బ్యాగ్ చోరీలకు పాల్పడుతూ గత నెలలో ముంబై పోలీసులకు చిక్కిన సింగర్ మున్‌మూన్ హుస్సేన్ సిటీ పోలీసులు వాంటెడ్‌గా ఉన్నట్లు తేలింది. ఈమెపై గతంలో సైఫాబాద్ అబిడ్స్ ఠాణాల్లో మూడు కేసులు నమోదై ఉన్నాయి. ► పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాకు చెందిన మున్‌మూన్ హుస్సేన్ కొంతకాలం పాటు కోల్‌కతాలో సింగర్‌గా పని చేసింది. ఆపై హైదరాబాద్‌కు మకాం మార్చి బార్ అండ్ రెస్టారెంట్స్‌లో క్యాబరే సింగర్‌గా మారింది. చదవండి: ఔరా.. ముగ్గురేనా? ►మరో పక్క గణేష్ ఉత్సవాలు, వివాహాల్లోనూ పాటలు పాడేది. నగరంలో క్యాబరేను నిషేధించడంతో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. వివాహాలు, గణేష్ ఉత్సవాలు సీజనల్ కావడంతో చోరీల బాట పట్టిన మున్మున్ మహిళల హ్యాండ్ బ్యాగ్స్ చోరీ చేసేది. ► చెన్నైలోని అన్నానగర్‌లో నివసించే హీరో విశాల్ తల్లి జానకీదేవి 2009 జూన్‌లో నగరంలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అదే నెల 15న సాయంత్రం ఆమె పట్టు చీరలు కొనేందుకు బషీర్‌బాగ్‌లోని ధర్మవరం సిల్క్ శారీస్ షోరూమ్‌కు వెళ్లారు. ►తన హ్యాండ్ బ్యాంగ్‌ను పక్కన పెట్టి చీరలు ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. అరగంట తర్వాత ఆమె తన బ్యాగు కోసం చూడగా అది కనిపించలేదు. దీంతో సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగులో రూ.65 వేల నగదు, రూ.30 లక్షల విలువైన వజ్రాల నగలు, సెల్‌ఫోన్ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ►బ్యాగు పోయిన దుకాణం అప్పటికే చాలా పాతది కావడంతో అందులో సీసీ కెమెరాలు లేవు. దీంతో కేసు దర్యాప్తు జటిలంగా మారింది. ఈ నేపథ్యంలోనే బ్యాగులు చోరీ చేసే పాత నేరస్తుల వివరాలు ఆరా తీశారు. చోరీ జరిగింది చీరల దుకాణంలో కావడంతో ఈ తరహా చోరీలు చేసే మహిళలపై దృష్టి సారించారు. ► ఫలితంగా చిక్కడపల్లి సూర్యనగర్‌లో నివసించే మున్మూన్హుస్సేన్ అలియాస్ మున్‌మూన్ బౌరా అలియాస్ రచన పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు 2009 ఆగస్టు 12న అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించింది. ► దీంతో మున్‌మూన్‌ను అరెస్టు చేసి ఆమె ఇచ్చిన సమాచారం మేరకు రూ.30 లక్షల విలువైన వజ్రాల నగలు, సెల్‌ఫోన్, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. రూ.65 వేల నగదు మాత్రం ఖర్చయిపోవడంతో రికవరీ కాలేదు. ► 2010 మే 13న మున్‌మూన్ మరో నేరం చేసింది. కుందన్‌బాగ్‌కు చెందిన ఓ బాధితురాలు ఆదర్శ్‌నగర్‌లోని బాలాజీ గ్రాండ్ బజార్‌కు వచ్చింది. అక్కడకు వెళ్లిన ఈ చోర్ సింగర్ ఆమె బ్యాగ్‌ను తస్కరించింది. అందులో రూ.20 వేల నగదు, తులం బంగారం ఉన్నాయి. ► ఈ కేసులోనూ సైఫాబాద్ పోలీసులు మున్‌మూన్‌ను అరెస్టు చేశారు. దీనికి ముందే అబిడ్స్ ఠాణా పరిధిలోనే ఆమె ఓ నేరం చేసింది. ఇక్కడి పోలీసుల నిఘా పెరగడంతో బెంగళూరుకు మకాం మార్చింది. విమానాల్లోనే తిరుగుతూ పంజా విసరడం మొదలెట్టింది. ► కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ల్లో వరుస చోరీలకు పాల్పడింది. తాజాగా గత నెల 17న ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులకు చిక్కింది. ఈమెపై నగరంలో కొన్ని నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉండటంతో ఇక్కడి పోలీసులకూ వాంటెడ్‌గా మారింది. -
మహిళతో చెప్పు దెబ్బలు తిన్నాడు
బెంగళూరు(కర్ణాటక): చుట్టూ జనం ఉన్నారనే భయం లేకుండా ఓ వ్యక్తి మహిళతో అసభ్యంగా ప్రవర్తించి చివరకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన బుధవారం జాలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం జాలహళ్లి క్రాస్ సిగ్నల్ వద్ద ఓ మహిళ రోడ్డు దాటడానికి ఎదురు చూస్తుండగా అదే సమయంలో అక్కడే ఉన్న టీ.దాసరహళ్లికి చెందిన నారాయణప్ప ఆమెను పదే పదే తాకుతూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో ఓపిక నశించిన మహిళ నారాయణప్పను చేతితో కొట్టింది. దీంతో షాక్‌కు గురైన అతడు ఏదో పొరపాటున చేయి తగిలిందంటూ తిరిగి మహిళను బెదిరించడానికి ప్రయత్నించాడు. ఆమె నారాయణప్పను చెప్పుతో కొట్టడం ప్రారంభించడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ భైరేగౌడ మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న పింక్ హొయ్సళ వాహనం అక్కడికి చేరుకొని మహిళను, నారాయణప్పను స్టేషన్ తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నారాయణప్పను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ భైరేగౌడను డీసీపీ శోభారాణి అభినందించి నగదు బహుమానాన్ని అందించారు. -
ఆదిత్యనాథ్ అభ్యంతరకర ఫొటోలు, మహిళపై కేసు
బెంగళూరు: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభ్యంతరకర ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ప్రభ ఎన్ బైలహొంగల అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ యువమోర్చా ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసు అదనపు కమిషనర్(క్రైమ్) ఎస్. రవి తెలిపారు. మహిళతో ఆదిత్యనాథ్ సన్నిహితంగా ఫొటోలను ప్రభ తన ఫేస్ బుక్ పేజీలో పెట్టారు. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాయచూరులోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఆదిత్యనాథ్ పై అసభ్యకర ఫొటోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మధుగిరి తాలూకా బీజేపీ యువమోర్చా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ విజయాన్ని జీర్ణించుకోలేక ఇటువంటి నీచమైన పనులకు దిగుతున్నారని యువమోర్చా నాయకులు ఆరోపించారు. -
శృంగారం కోసం.. భార్యపైకి బొద్దింకలు
బెంగళూరులో ఐటీ ఇంజనీర్ వికృత చేష్టలు సాక్షి, బెంగళూరు: శృంగారానికి తనను దగ్గరికి రానివ్వడం లేదని భార్యపై పైశాచికంగా ప్రవర్తించాడో ప్రబుద్ధ ఐటీ ఇంజనీర్. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని బన్నేరుఘట్టలో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీరైన అవినాశ్ శర్మ పదేళ్ల క్రితం తన క్లాస్‌మేట్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీర్. అవినాశ్ కొద్దికాలంగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అవినాశ్ ప్రవర్తన నచ్చక ఆమె దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలనుకున్న అవినాశ్ తన భార్యపై బొద్దింకలను వదులుతూ భయపెట్టేవాడు. తనతో శృంగారంలో పాల్గొనకుంటే ఇంతేనని వేధించడం ప్రారంభించాడు. మొదట్లో తమ ఇద్దరు పిల్లల బాగు కోసం భర్త వేధింపులను ఓర్చుకున్న ఆమె రోజురోజుకూ వేధింపులు తీవ్రం కావడం తో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును మహిళా సహాయ వాణికి బదిలీ చేశారు. నిందతుణ్ని పిలిపించి విచారించగా శృంగారం లో తనకు సహకరించకపోవడం తోనే బొద్దింకలు వదులుతూ వేధించినట్లు చెప్పాడు. -
అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ ఆటాడుకుంది
బెంగళూరు: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి బెంగళూరులో ఆకతాయిలు ఎంతో మంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధించగా.. ఒంటరి వెళ్తున్న ఓ యువతి తనను వేధించేందుకు వచ్చిన యువకుడిని ధైర్యంగా ఎదిరించి తగిన బుద్దిచెప్పింది. ఆమె ఆకతాయిని పట్టుకుని పిడిగుద్దులు కురిపించి, నాలుగు తన్నింది. ఈ దెబ్బకు అతగాడు పారిపోయాడు. చైతలీ వాస్నిక్ అనే యువతి తనకు ఎదురైన ఈ అనుభవాన్ని వివరిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ 31న అర్ధరాత్రి విధులు ముగించుకుని చైతలీ ఇంటికి నడుచుకుని వెళ్తోంది. రోడ్డుపై పోలీసులు ఉండటంతో ఆమె భయపడలేదు. కాస్త దూరం వెళ్లాక ఓ యువకుడు ఆమెకు దగ్గరగా వచ్చి, అసభ్యంగా తాకాడు. ఆమె ఒంటరిగా ఉన్నందున భయంతో ఏ మాట్లాడదని ఆకతాయి అనుచితంగా ప్రవర్తించాడు. అయితే చైతలీ వెంటనే అతణ్ని పట్టుకుని పిడుగుద్దులు కురిపించింది. కాలితో ఎడాపెడా తన్నింది. ఈ దెబ్బకు ఆకతాయి హడలిపోయాడు. ఇంతలో అక్కడికి కొంతమంది వచ్చి విడిపించేందుకు ప్రయత్నించారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆకతాయి బుకాయించాడు. ఆమె మరింత కోపంతో అతన్ని చితకబాదింది. పోలీసులు వచ్చేలోగా అతను అక్కడి నుంచి పారిపోయాడు. చైతలీ ధైర్యాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్ చేశారు. -
‘ఓలా డ్రైవర్ నన్ను సిగరెట్ తాగమన్నాడు’
బెంగళూరు: ఓలా క్యాబ్ డ్రైవర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని యువ మహిళా న్యాయవాది ఒకరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇంటికి చేరుకునేందుకు కారు ఎక్కిన తనను ఓలా క్యాబ్ డ్రైవర్ అనవసర ప్రశ్నలతో విసిగించాడని, అంతటితో ఆగకుండా తనతో బలవంతంగా సిగెట్ తాగించేందుకు ప్రయత్నించాడని తెలిపారు. విట్టల్ మాల్యా రోడ్డు నుంచి హెబ్బల్ వెళ్లేందుకు కారు ఎక్కానని చెప్పారు. హెబ్బల్ కు తీసుకెళ్లకుండా కోడిగెహళ్లి వైపు కారు మళ్లించి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయారు. మీరు మద్యం తాగుతారా, మీరు హౌస్ వైఫా, రాత్రి వేళలో ఎందుకు బయట తిరుగుతున్నారని ప్రశ్నించాడని వెల్లడించారు. తన వయసు 25 అని, తనది పెద్ద వయసు కాదని చెప్పాడన్నారు. తన ఫోన్ నంబర్ ఇవ్వాలని బలవంతం చేశాడని పేర్కొన్నారు. కారు దారి మళ్లించడంతో తన తల్లి, స్నేహితులకు క్యాబ్ వివరాలు మెసేస్ లు పంపినట్టు తెలిపారు. చివరి ఎలాగోలా ఇంటికి చేరారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే డ్రైవర్ పై చర్య తీసుకుంటామని ఓలా కంపెనీ హామీయిచ్చింది. -
మగాళ్లను వంచించిన మోసగత్తె అరెస్ట్
బెంగళూరు: ఏడుగురిని వివాహం చేసుకున్న ఓ మహిళ ఉదంతం మంగళవారం బెంగళూరులో వెలుగుచూసింది. కేజీహళ్లికి చెందిన యాస్మిన్ భాను(38) తొమ్మిదేళ్ల క్రితం ఇమ్రాన్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక అతణ్ని బెదిరించి రూ.10 లక్షలతో ఉడాయించింది. శ్రీమంతులను లక్ష్యంగా చేసుకుని.. వీరితో కొద్దినెలల పాటు కాపురం చేశాక బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజి ఉడాయించేది. ఇటీవలే నాలుగో భర్త అఫ్జల్‌కు చేరువై.. అతని సాయంతో మూడో భర్తను డబ్బులివ్వాలని బెదిరించింది. అనుమానంతో అఫ్జల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె అఫ్జల్‌పై రౌడీలతో దాడి చేయించింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు యాస్మిన్‌ను సోమవారం అరెస్టు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను యాస్మిన్ భాను తోసిపుచ్చింది. ఇమ్రాన్ ఒక్కడినే తాను పెళ్లి చేసుకున్నానని చెబుతోంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
'అలాంటప్పుడు కుక్కనే పెళ్లి చేసుకో'
బెంగళూరు: తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కను వద్దన్నాడని ఓ యువతి తన పెళ్లిని రద్దు చేసుకుంది. తన కుక్కకు తానొక్కదాన్నే తోడని, దానికి దూరం చేయాలని చూసే ఏది తనకు వద్దని తెగేసి చెప్పి మూగజీవాలపై తనకు ఉన్న అప్యాయతను చాటుకుంది. ప్రస్తుతం ఈ విషయం ఇంటర్నెట్ లో వైరల్ అయింది. బెంగళూరుకు చెందిన కరిష్మా వాలియా అనే యువతి గుర్గావ్ లోని డిలైట్ ఇండియా సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు ఇటీవల పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి కూడా మంచి అందగాడే. మంచి హోదాలోనే ఉన్నాడు. తల్లి దండ్రుల బలవంతంలో పెళ్లికి తొలుత ఒప్పుకుంది. అలా వారిద్దరి మధ్య పెళ్లికి ముందు వాట్సాప్ సంభాషణలో కుక్కల విషయం చర్చకు వచ్చింది. కరిష్మాకు కుక్కలంటే ఎంత ఇష్టమో అతడికి అంత కష్టం. అబ్బాయి కుటుంబానికి కూడా కుక్కలంటే ఇష్టం ఉండదట. అదే విషయాన్ని ఆమెతో చెప్పాడు. దీంతో ఆమె ఒక్క సెకను కూడా ఆలోచించకుండా తనకు అతడితో సెట్టవదని, పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో అవాక్కయినా అబ్బాయి నువ్వు నిజంగా సీరియస్ గానే చెప్తున్నావా అని ప్రశ్నించాడు. అయినప్పటికీ ఆమె తెగేసి చెప్పడంతో చిర్రెత్తిపోయిన ఆ కుర్రాడు 'ఇలా అంటున్నందుకు క్షమించు.. అలాంటప్పుడు ఆ కుక్కను పెళ్లి చేసుకో' అని మరో మెస్సేజ్ పెట్టాడు. అలా వారిద్దరి మధ్య మొదలవ్వాల్సిన వివాహ బంధం ఆదిలోనే ఆగిపోయింది. -
నడిరోడ్డుపై ప్రేమికుల ‘అతి’
వేలూరు: మద్యం మత్తులో బైకు నడిపి, ఎస్ఐపై దాడికి పాల్పడిందో బెంగళూరు యువతి. అదే సమయంలో తన ప్రియుణ్ని ముద్దాడుతూ వెకిలిచేష్టలు చేసింది. ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో జరిగింది. తుత్తిపట్టుకు చెందిన వివేకానందన్, బెంగళూరుకు చెందిన యువతి అర్చన ప్రేమించుకుంటున్నారు. సోమవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగారు. ప్రియుడిని కూర్చోబెట్టుకుని ఆమె నిర్లక్ష్యంగా బైక్ నడిపింది. దీన్ని ప్రశ్నించిన ఓ వ్యక్తికి దాడికి పాల్పడింది. ఆమెకు సముదాయించేందుకు వేలూరు కోట వద్ద ఎస్ఐ రామ్‌కుమార్ ప్రయత్నించారు. ఆగ్రహించిన యువతి అతనిపై దాడి చేసి, ప్రియుడిని ముద్దుపెట్టుకుంటూ హంగామా సృష్టించింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ లోనూ మహిళా ఎస్ఐపై అర్చన దాడి చేసింది. ఆమె ప్రియుడు ఫర్నీచర్ ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. -
నన్ను రేప్ చేయడానికి కిడ్నాప్ చేశాడు
బెంగళూరు: బెంగళూరులో యువతిని కిడ్నాప్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు అక్షయ్ అని సీనియర్ పోలీస్ అధికారి లోకేష్ కుమార్ చెప్పారు. గత నెల 23న రాత్రి 10 గంటల సమయంలో బెంగళూరు దక్షిణప్రాంతంలో ఇంటిముందు నిల్చుని ఫోన్లో మాట్లాడుతున్న యువతిని (22).. అందరూ చూస్తుండగానే దుండగుడు బలవంతంగా ఎత్తుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలు వెలుగుచూడటంతో బెంగళూరులో కలకలం సృష్టించింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరింది. ఈ ఘటన గురించి బాధితురాలు మాట్లాడుతూ.. నిందితుడు బలవంతంగా తనను నిర్మాణంలో ఉన్న సైట్ దగ్గరకు తీసుకెళ్లాడని, తనను అత్యాచారం చేయడానికి కిడ్నాప్ చేశాడని చెప్పింది. 'రక్షించమని నేను గట్టిగా అరిచాను. అతను నా నోరు మూసేందుకు ప్రయత్నించాడు. నన్ను కాపాడుకునేందుకు అతణ్ని కొరకగా, అతను నన్ను కొట్టాడు. భయంతో నేను అపస్మారకస్థితిలోకి వెళ్లాను. కాసేపటి తర్వాత మెళుకవలోని రాగా, అతను పారిపోయాడు. నా బ్యాగ్, పర్సు, ఫోన్ అక్కడే ఉన్నాయి. వాటిని తీసుకెళ్లలేదు. దీన్నిబట్టి అతను నన్ను రేప్ చేయడానికే కిడ్నాప్ చేశాడనిపిస్తోంది' అని బాధితురాలు చెప్పింది. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత సోమవారం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను కోరింది.