మగాళ్లను వంచించిన మోసగత్తె అరెస్ట్ | bengaluru police detain woman for marrying seven times | Sakshi
Sakshi News home page

మగాళ్లను వంచించిన మోసగత్తె అరెస్ట్

Published Wed, Sep 21 2016 3:08 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

మగాళ్లను వంచించిన మోసగత్తె అరెస్ట్

మగాళ్లను వంచించిన మోసగత్తె అరెస్ట్

బెంగళూరు: ఏడుగురిని వివాహం చేసుకున్న ఓ మహిళ ఉదంతం మంగళవారం బెంగళూరులో వెలుగుచూసింది. కేజీహళ్లికి చెందిన యాస్మిన్‌ భాను(38) తొమ్మిదేళ్ల క్రితం ఇమ్రాన్‌ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక అతణ్ని బెదిరించి రూ.10 లక్షలతో ఉడాయించింది. శ్రీమంతులను లక్ష్యంగా చేసుకుని.. వీరితో కొద్దినెలల పాటు కాపురం చేశాక బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు గుంజి ఉడాయించేది.

ఇటీవలే నాలుగో భర్త అఫ్జల్‌కు చేరువై.. అతని సాయంతో మూడో భర్తను డబ్బులివ్వాలని బెదిరించింది. అనుమానంతో అఫ్జల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె అఫ్జల్‌పై రౌడీలతో దాడి చేయించింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు యాస్మిన్‌ను సోమవారం అరెస్టు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను  యాస్మిన్‌ భాను తోసిపుచ్చింది. ఇమ్రాన్ ఒక్కడినే తాను పెళ్లి చేసుకున్నానని చెబుతోంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement