సాక్షి, చిత్తూరు: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ లాడ్జీలో బెంగళూరుకు చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల సఫియా ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు మదనపల్లికి చెందిన అబీద్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి రూ. 3 లక్షల వరకు నగదు తీసుకున్నాడు.
అనంతరం యువకుడు ముఖం చాటేయడంతో అనుమానం వచ్చిన యువతి మదనపల్లెకు వచ్చి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అయినప్పటికీ యువకుడు, అతని కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసి బెంగళూరు వెళ్లిపోయింది. మరోసారి మదనపల్లెకు వచ్చిన యువతి.. తనకు న్యాయం జరగడం లేదని భావించి ప్రైవేటు లాడ్జీకి వెళ్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన లాడ్జీ సిబ్బంది యువతిని చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment